
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహెల్గామ్ (Pehalgam) ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది ఈ నేపథ్యంలో 2023లో నేపాల్ ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశానికి చెందిన ప్రేమికుడు సచిన్ మీనాను యువకుడ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సీమా హైదర్ మరోసారి చర్చల్లో నిలిచింది. సీమా హైదర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. సీమా హైదర్ కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్తారా ఎక్స్‌లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆమెకు మద్దతుగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించడం మరింత సంచలనంగా మారింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సీమా హైదర్ (Seema Haider)ను పాకిస్తాన్‌కు పంపొద్దు అంటూ రాఖీ సావంత్ (Rakhi Sawant) భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడిలో సీమకు ఏమీ సంబంధంలేదనీ, ఆమె నిర్దోషి అని వ్యాఖ్యానించింది. ఆమె'హిందూస్తాన్ కీ బహు హై' సచిన్‌కీ బీవీ, అంతేకాదు యూపీకి బహు అంటూ ఇలా వాపోయింది. ‘‘ఇప్పటికే నలుగురు పిల్లలను కన్న సీమాకు సచిన్‌తో ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమెకు వారు భారతి మీనా అని పేరు పెట్టుకున్నారు. సీమా ఒక తల్లి, సచిన్ భార్య, అతని బిడ్డకు తల్లి అని రాఖీ చెప్పింది. సీమా భారతదేశానికి కోడలు కాబట్టి ఆమెకు అన్యాయం జరగ కూడదని,ఆమెను గౌరవించాలి అంటూ వాదించింది. సార్క్ వీసా మినహాయింపు సర్వీస్ కింద ఇచ్చిన వీసాలను రద్దు చేయాలని భారతదేశం నిర్ణయం, పాకిస్తానీ ప్రజలు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాఖీ ఆమెకు సపోర్ట్‌గా ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు పలు రకాలు వ్యాఖ్యానించారు.
చదవండి: సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా?
మరోవైపు తాజా నివేదికల ప్రకారం, సీమాకు భారతదేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ భావిన్నారు, ఎందుకంటే, అతని వాదనల ప్రకారం, సీమ పాకిస్తాన్ పౌరురాలు కాదు.,గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను వివాహం చేసుకుంది , ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది, అలాగే ఆమె పౌరసత్వం భారతీయ భర్తతో ముడిపడి ఉంది కాబట్టి, కేంద్రం ఆదేశాలు ఆమెకు వర్తించే అవకాశాలు లేవని ఆయన వాదిస్తున్నారు.ప్రస్తుతం, సీమా హైదర్ పౌరసత్వం మరియు అక్రమ వలస కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.
కాగా 2023లో నలుగురు బిడ్డల తల్లి అయిన 32 ఏళ్ల సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసించే 24 ఏళ్ల సచిన్ మీనాను వివాహం చేసుకుంది. తన మొదటి భర్త గులాం హైదర్ వేధింపుల కారణంగానే పాకిస్తాన్‌ను విడిచిపెట్టానని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ