
దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళా పోలీసులు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకొంటున్నారు. ‘ఖాకీ రీల్స్’ కొత్త ట్రెండ్‌గా మారింది. ఉత్తేజపరిచే వ్యక్తిత్వ వికాస ప్రసంగాల నుంచి వర్కవుట్‌ల వరకు ఆకట్టుకునే ‘రీల్స్’ చేస్తున్నారు....
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ కాంచన్ పాండేకు ఇన్‌స్టాగ్రామ్‌లో 99,900 మంది ఫాలోవర్‌లు ఉన్నారు. డ్యాన్స్ చేయడం, పోలీస్ యూనిఫామ్‌లో స్టైల్‌గా నడవడం, జుట్టును చలాకీగా తిప్పడంలాంటి ‘రీల్స్’ చేస్తుంటుంది. ‘హిందీ సినిమా తారలకు ఏమాత్రం తీసిపోదు’ అంటూ పాండే అందాన్ని ΄÷గుడుతుంటారు అభిమానులు. ‘ప్రతి రోజూ పరుగెత్తండి. కానీ ప్రతిరోజూ ఒక రౌండ్ పెంచండి’లాంటి సలహాలు ఆమె నోటి నుంచి వినిపిస్తాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సిమ్రాన్ రఘువంశీ ఒకప్పుడు మోడల్ కావాలని కలలు కన్నది. కాని ఆమె కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో ‘మోడల్’ కలకు తెర వేసి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరింది. ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారింది. ‘ఖాళీ సమయాల్లో రీల్స్ చేస్తుంటాను’ అంటున్న సిమ్రాన్‌ను–
‘పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేయవద్దని సీనియర్ అధికారులు చెప్పారా?’ అని అడిగితే...
‘యూనిఫాంలో అభ్యంతరకరమైన రీల్స్ చేసినప్పుడు, అసభ్యకరమైన పాటకు యూనిఫామ్‌తో డ్యాన్స్ చేయడంలాంటివి చేసినప్పుడే సమస్య. అలా చేయనంత కాలం ఎలాంటి సమస్య ఉండదు’ అంటుంది సిమ్రాన్.
సిక్కింకు చెందిన ఆలివా సవాడెన్ ‘లేడీబైకర్కాప్’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రాష్ట్రంలోని పచ్చని చెట్ల పక్క నుంచి, పరిశుభ్రమైన రోడ్ల వెంట రైడింగ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తుంటుంది. పోలీస్ యూనిఫామ్, సివిడ్ డ్రెస్‌లలో ఆమె పోస్ట్‌లు కనిపిస్తుంటాయి.
‘ఫిట్ సురేఖ’ అనే హ్యాండిల్ ద్వారా పోలీసు అధికారి సురేఖ పవర్ లిఫ్టింగ్ నుంచి రన్నింగ్ వరకు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ‘మీరు గెలవాలంటే మొండిగా ఉండాలి. ఓడిపోవడానికి భయం చాలు’ అని తన పోస్ట్‌లో రాసింది.
అస్సాంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున జిమ్మీ రోంగ్మేయ్ ఎంటీవీ రియాలిటీ షోలో పాల్గొంది, వర్కవుట్ వీడియోలు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
దిల్లీలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అన్షు ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతో పేరు తెచ్చుకుంది. ఆమె పోస్ట్ చేసే వీడియోలలో ఆకట్టుకునే డైలాగులు ఎన్నో ఉన్నాయి.
తన సన్ గ్లాసెస్‌పై ‘ఐ డోండ్ కేర్’ అని రాసి ఉంటుంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ సారిక రావత్....‘అమ్మాయిలు ఏ గులాబీపై ఆధారపడరు. వారే ఈ విశ్వపు తోటలు’ అంటుంది. సబ్–ఇన్‌స్పెక్టర్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం గైడెన్స్ వీడియో ను రూపొందించమని ఫాలోవవర్స్ నుంచి వచ్చిన విన్నపాన్ని ఆమె అంగీకరించింది.