following
-
ప్రధాని మోదీకి జైకొడుతున్న చైనా నెటిజన్లు.. అమెరికా మ్యాగజైన్ వెల్లడి
బీజింగ్: భారత్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ప్రధాని మోదీకి మాత్రం చైనాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు! ముఖ్యంగా నెటిజన్లయితే మోదీ పట్ల ఫిదా అవుతున్నారు. ‘మోదీ లావోగ్జియన్’ (మోదీ చిరంజీవి) అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ఒక విదేశీ నేత పట్ల చైనీయులు ఇంతటి గౌరవాదరాలు చూపడం అరుదు. ‘మోదీ అద్భుతమైన నాయకుడు. విభిన్నంగా ఆలోచిస్తారు. భారత్‌ను చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు’ అంటూ చైనా సోషల్ సైట్ సినావెబోలో నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారని అమెరికా మ్యాగజైన్ ది డిప్లొమేట్ పేర్కొంది. సినా వెబోకు 58 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లున్నారు. -
రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్..
వ్యాపార దక్షత, దాతృత్వ సేవలతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 85 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన తిరిగి ఫాలో అవుతున్న ప్రొఫైల్ మాత్రం ఒకే ఒక్కటి. అయితే అది వ్యక్తులకు సంబంధించినది కాదు. టాటా గ్రూపు తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే టాటా ట్రస్ట్‌ను ఆయన ఫాలో అవుతున్నారు. ఇదీ చదవండి: రితేష్ అగర్వాల్ భార్య గురించి తెలుసా..? ఆమె కూడా వ్యాపారవేత్తేనా? 85 ఏళ్ల వయసులోనూ రతన్ టాటా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడప్పుడూ పోస్టులు పెడుతుంటారు. ప్రత్యేక సందర్భాలను, జ్ఞాపకాలను ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అవి చాలా ప్రత్యేకంగా ఫాలోవర్లను ఆకట్టుకుంటాయి. ఆయన పెట్టే పోస్టులు తక్కువే అయినా ఆయన్ను 85 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ టాటా చివరిసారిగా జనవరి 15న పోస్ట్ చేశారు. టాటా ఇండికా కారును ఆవిష్కరించి 25 ఏళ్లయిన సందర్భంగా ఆ కారు పక్కన నిలబడి ఉన్న ఫొటోను రతన్ టాటా షేర్ చేశారు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) టాటా గ్రూపును అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దిన రతన్ టాటా ప్రస్తుతం టాటా సన్స్ సంస్థకు గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. టాటా ట్రస్ట్ కార్యకలాపాలు రతన్ టాటా ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. ఈ ట్రస్టును 1919లో ప్రారంభించారు. గ్రామీణ జీవనోపాధి, విద్య, ఆరోగ్యం, కళలు, చేతివృత్తులు, సంస్కృతిని పెంపొందించే రంగాలలో సంస్థలకు ఈ ట్రస్ట్ ద్వారా చేయూత అందిస్టుంటారు. -
ఆసీస్ స్పిన్నర్‌ను 24 గంటలు ఫాలో అయిన జడేజా
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సూపర్ అనిపించుకుంటున్నాడు. రీఎంట్రీ తర్వాత ఏ క్రికెటర్ అయినా నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకుంటాడు. కానీ జడేజా అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాడు. రీఎంట్రీకి ముందు వచ్చిన గ్యాప్‌ను కసిలా తీసుకున్న జడేజా అద్భుత రీతిలో రాణిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు. ఇప్పుడు అతన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు ఒక సవాల్ అని చెప్పొచ్చు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అన్నీ తానై జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన జడ్డూ ఢిల్లీ టెస్టులోనూ అదే జోరును చూపించాడు. అయితే ఈసారి బ్యాటింగ్‌లో పెద్దగా మెరవకపోయినప్పటికి భారత్‌లో తాను ఎంత ప్రమాదకర స్పిన్నర్ అనేది ఆసీస్‌కు మరోసారి రుచి చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ బ్యాటర్ల బలహీనతను పసిగట్టిన జడ్డూ ఏడు వికెట్లతో వారి నడ్డి విరిచాడు. ఓవరాల్‌గా ఒక టెస్టులో పది వికెట్లు తన ఖాతాలో వేసుకొని వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. మైదానంలో ఎంత చలాకీగా కనిపిస్తాడో బయట కూడా అంతే చురుకుగా ఉంటాడు. తానే ఏం చేసినా జడ్డూ దానిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాకు ఐదు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే జడ్డూ మాత్రం ఎవరిని ఫాలో అవ్వడం లేదు. కానీ తాజాగా మాత్రం జడేజా.. తనకు మంచి మిత్రుడైన ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియోన్‌ను 24 గంటల పాటు ఫాలో అవ్వడం ఆసక్తి కలిగించింది. మరి లియోన్‌ను ఎందుకు ఫాలో అయ్యాడో తెలియదు కానీ.. తాను ఫాలో అయిన విషయాన్ని మాత్రం ఇన్‌స్టాలో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన స్ర్కీన్‌షాట్ పెట్టి.. ''మై ఫ్రెండ్ లియోన్‌ను 24 గంటలు ఫాలో అయ్యా'' అంటూ.. క్యాప్షన్ జత చేశాడు. జడ్డూ పోస్ట్ టీమిండియా అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. గ్రౌండ్‌లోనే అనుకున్నాం.. సోషల్ మీడియాలో కూడా ఆసీస్ క్రికెటర్లను నీడలా వెంటాడుతున్నావు ఎందుకు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి ఒకటి నుంచి జరగనుంది. చివరి రెండు టెస్టులకు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. రంజీ ట్రోఫీలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న జైదేవ్ ఉనాద్కట్‌ను మిగతా రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఇక వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌ను జట్టులో ఉంచినప్పటికి అతని వైస్ కెప్టెన్సీని మాత్రం తొలగించింది. దీనిని బట్టి రానున్న రోజ్లులో రాహుల్‌పై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెండో టెస్టులో విజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు మరింత చేరువైంది. మూడో టెస్టులోనూ టీమిండియా విజయం సాధిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో ఆసీస్ క్లీన్‌స్వీప్ అయితే మాత్రం వారికి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం పోయినట్లే. అలా జరగకుండా ఉండాలంటే ఆసీస్ చివరి రెండు టెస్టులను కనీసం డ్రా అయినా చేసుకోవడానికి ప్రయత్నించాలి. Ravindra Jadeja is only following Nathan Lyon for 24 hours. pic.twitter.com/tAbAyI8LjZ — Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2023 చదవండి: ఉన్నపళంగా స్వదేశానికి ఆసీస్ కెప్టెన్.. పిచ్‌పై నీలాపనిందలు.. ఆడడం చేతగాకనే -
ఆ సమయంలో అమ్మాయిని ఫాలో కావడం అసాధ్యం.. కోర్టు కీలక తీర్పు
ముంబై: మహిళపై వేధింపుల కేసులో ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గతవారం కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆ సమయంలో ఒకరిని మరొకరు ఫాలో కావడం అసాధ్యమని వ్యాఖ్యానించింది. ఏం జరిగిందంటే..? ముంబై చిరా బజార్లో నివసించే ఓ మహిళ.. ఓ వ్యక్తి తనను రోజు ఫాలో అవుతున్నాడని ఆరోపించింది. ఉదయం రైల్వే స్టేషన్‌కు వెళ్లే సమయంలో అతడు తనను బైక్‌పై అనుసరిస్తున్నాడని, తనవైపే చూస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కేసు పెట్టింది. నిందితుడు కూడా అదే ప్రాంతంలో ఓ గ్యారేజీ నడుపుతున్నాడు. ఆమె వెళ్లేదారిలోనే ఆ షాపు కూడా ఉంది. అయితే మహిళ చేసిన ఆరోపణలపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆపీసులకు వెళ్లేవారితో రోడ్లు కిక్కిరిపోతాయని పేర్కొంది. అలాంటి సమయంలో ఒకరిని మరొకరు ఫాలో చేయడం అసలు సాధ్యం కాదని చెప్పింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసు 2017 ఆగస్టు 3న నమోదైంది. చదవండి: ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
లైగర్ ప్లాప్ తో రౌడీలో మార్పు మొదలైందా..?
-
నాగ చైతన్యను అన్‌ఫాలో చేసిన సమంత.. కానీ చై మాత్రం
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరుపొందిన సమంత-నాగ చైతన్యల విడాకుల వ్యవహారంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఈ జంట విడిపోయి దాదాపు ఐదు నెలలు కావొస్తున్నా వీరి డివోర్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇక విడాకుల అనంతరం సినిమాల పరంగా ఇద్దరూ ఫుల్ బిజీ అయ్యారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో నాగ చైతన్య దూసుకుపోతుంటే సమంత కూడా బాలీవుడ్ సహా హాలీవుడ్ ప్రాజెక్టులతో అదరగొడుతుంది. ఇదిలా ఉండగా విడాకుల అనంతరం కుంగిపోయిన సమంత.. చైతూతో గడిపిన జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. ఇప్పటికే తన ఇన్స్టాగ్రామ్ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్ చేసిన సామ్ రీసెంట్గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది. మరోవైపు చై మాత్రం సమంతను ఇంకా ఫాలో అవుతున్నాడు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం సమంతతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేయలేదు. కాగా 2017, అక్టోబర్6న హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న చై-సామ్ గతేడాది అక్టోబర్2న విడిపోయిన సంగతి తెలిసిందే. -
కారులో వెళ్తున్న వివాహితను వెంబండించి.. ఆతర్వాత
సాక్షి, మంగళగిరి(గుంటురు): వివాహిత కారును వెంబడించి దాడి చేసిన ఘటనలో ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మంగళగిరిలోని కాండ్రు వారి వీధికి చెందిన స్వాతి అనే వివాహిత కారులో ఇంటికి వెళ్తుండగా బాప్టిస్ట్‌పేటకు చెందిన రాజేష్, చక్రి, రాబర్ట్‌లతో పాటు మరికొందరు వెంబడించగా కారు డ్రైవర్ కారు ఆపి ఎందుకు తమ కారును ద్విచక్ర వాహనాలతో వెంబడిస్తున్నారని ప్రశ్నించడంతో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారని స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: చైనా దిగ్గజ కంపెనీలో చీకటి యవ్వారాలు.. కామ పిశాచాలపై ‘నో’ యాక్షన్ -
శివరాత్రికి ఫాలోయింగ్
తిలక్ శేఖర్, ఖ్యాతి శర్మ జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఫాలోయింగ్’. విస్లా స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సాపిరెడ్డి నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గౌరీదేవి సాపిరెడ్డి క్లాప్ ఇవ్వగా, రాధికా చిలకలపూడి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రవీణ్ సాపిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌తో ఇండస్ట్రీకి పరిచయం కావాలని వేచిచూశాను. మా బాబాయ్ ఛోటా కె.నాయుడుగారు కథ విని చాలా బాగుందని ప్రోత్సహించారు’’ అన్నారు. ‘‘నేను కన్నడలో 12 చిత్రాల్లో హీరోగా నటించాను. తెలుగులో ‘త్రిపుర’ లో నెగెటివ్ రోల్ చేశాను. ఆ తర్వాత నేను చేస్తున్న చిత్రం ‘ఫాలోయింగ్’’ అన్నారు తిలక్ శేఖర్. ‘‘2021 మార్చి 11న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు రాధాకృష్ణ. ఖ్యాతి శర్మ, కెమెరామెన్ నిమ్మ గోపి, మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ మాణిక్, ప్రమోద్ మాట్లాడారు. -
నరేంద్రజాలం
నాది 56 అంగుళాల ఛాతీ. నాకున్న దమ్ముతో దేశాన్ని నిలబెడతా అంటూ ప్రచారం చేసుకోవడమా?.. చాయ్‌వాలా కూడా ప్రధాని కాగల దేశం మనదేనంటూ విదేశీ వేదికలపై కూడా భారత్ ఔన్నత్యాన్ని చాటి చెప్పడమా?.. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ వంశ పారంపర్య పాలనపై నిప్పులు చెరగడమా?.. ప్రజాస్వామిక స్వేచ్ఛ గురించి పదేపదే తన ప్రసంగాల్లో చెప్పడమా?.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక యూత్ ఐకాన్‌గా ఎలా ఉన్నారు? గత ఐదేళ్లలో ప్రధానిగా ఎన్నో రంగాల్లో విఫలమైనా ఆయన ఇమేజ్ చెక్కు చెదరకుండా ఎలా ఉంది?.. ఒక డొనాల్డ్ ట్రంప్, ఒక కైలీ జెన్నర్లా యూత్‌లో మోదీకి ఫాలోయింగ్ ఎలా పెరిగిపోతోంది? మోదీ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు, మరెన్నో వైఫల్యాలు. కానీ ఆ వైఫల్యాలను ప్రజలు మరచిపోయేలా ఆయన ఒక మాయాజాలాన్నే సృష్టించారు. ఉద్యోగాల్లేవు. నిరుద్యోగం రేటు తారాజువ్వలా దూసుకుపోతూ రికార్డు సృష్టించింది. ఉగ్రవాదాన్ని అరికడతానని, బ్లాక్ మనీని బయటకు తీస్తానని పెద్ద నోట్లు రద్దు చేశారు. జనం పడరాని పాట్లు పడ్డారు. గ్రామీణ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకల పీచమణచారు. కానీ బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుందన్నట్టుగా కశ్మీర్లో మిలిటెన్సీ పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రమూకలు పంజా విసిరాయి.. కశ్మీర్ లోయలో బీభత్సం సృష్టించారు. కానీ మోదీ మాత్రం ఎప్పుడూ అదరలేదు. బెదరలేదు. పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఆయన స్వరంలో ధ్వనించే ఆగ్రహావేశాలు, భారత్ ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడినప్పడు మోదీ మాటల్లో తొణకిసలాడే ఆత్మవిశ్వాసం, సోషల్ మీడియాలో తన గురించి తాను చేసుకునే ప్రచారం ఇవన్నీ ఆయన వైఫల్యాలను పక్కనే పెట్టేలా చేశాయనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో యువతరం గుజరాత్ అభివృద్ధి నమూనాయే ఆదర్శంగా నమో మంత్రాన్ని జపించారు. ఈసారి కూడా ఆయనకున్న చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆయన సృష్టించిన మాయాజాలంలో పడి యువత కొట్టుకుపోతోంది. వాస్తవ ప్రపంచంలో ఆయన ఏం చేశారన్నది కాదు, సోషల్ మీడియాలో ఓ వర్చువల్ రియాల్టీని మోదీ సృష్టించి యువతరం తన చుట్టూ తిరిగేలా చేసుకున్నారు. దటీజ్ మోదీ!. ట్రంప్, కైలీ, మోదీ.. అందరిదీ ఒకే బాట యువభారతం మోదీ వెంట ఉన్నదంటే ఇదేదో ఎన్నికలో, రాజకీయాలో అని భావించనక్కర్లేదు. వీటన్నింటికి మించి ఆయన యువతరంతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అరచేతిలో స్వర్గం చూపిస్తారని అంటారే, అచ్చంగా అలాగే భారత్ బంగారు భవిష్యత్ గురించి తాను కంటున్న కలలు ఈస్ట్‌మన్ కలర్లో అందరికీ చూపించడమే ఆయన నేర్పరితనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్ని విమర్శలున్నాయో, ఆయనను సెభాష్ అని మెచ్చుకునే వారూ అంతేమంది ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రంప్ ట్వీట్లు ఎంత వివాదాస్పదం అవుతాయో, అంతే వైరల్ అవుతాయి కూడా. అమెరికా మీడియా పర్సనాలిటీ, మోడల్ కైలీ జెన్నర్ వయసు 20 ఏళ్లయినప్పటికీ ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె ఏం చేస్తే అదే ఫ్యాషన్. యువతరం గుడ్డిగా అదే ఫాలో అవుతుంది. జనంలో ఉన్న ఆ క్రేజ్‌నే పెట్టుబడిగా పెట్టి ఆమె మొదలు పెట్టిన కైలీ కాస్మోటిక్స్‌తో ఏడాదికి రూ.6 వేల కోట్లకు పైగా సంపాదిస్తున్నారంటే ఎవరైనా అవాక్కవాల్సిందే. మోదీది కూడా వారి బాటే. ఆకర్షించే ట్వీట్లు.. యూ ట్యూబ్‌లో పంచ్‌లు.. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్రచారంతోనే అధికారంలోకి వచ్చారని ఒక అంచనా. అప్పటికీ ఇప్పటికీ దాని విస్తృతి బాగా పెరిగిపోయింది. రిలయన్స్ జియో వంటి సంస్థలు వచ్చాక ఇంటర్నెట్ డేటా ప్లాన్స్ బాగా చౌకగా వస్తున్నాయి. దీంతో నిరుపేదలు కూడా భారత్‌లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దీంతో ఫేస్బుక్, వాట్సాప్ యాప్‌లకి ఆదరణ పెరిగింది. కానీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో వచ్చే సమాచారానికి విశ్వసనీయతపై ఎన్ని సందేహాలున్నా జనం వాటినే నమ్ముతూ ఆ లోకంలోనే బతికేస్తున్నారు. నరేంద్ర మోదీ కూడా దానిని తనకు కావల్సినట్టు వినియోగించుకోవడంలో ఆరితేరిపోయారు. నెటిజన్లను ఆకర్షించేలా ట్వీట్లు పెట్టడం, తన ఉపన్యాసాల్లో పంచ్ డైలాగ్‌లను యూ ట్యూబ్‌లో పెట్టడం, తన డ్రెస్సింగ్ ఫ్యాషనబుల్‌గా ఉండటం.. ఇలా ఏది చూసినా యువతరాన్ని ఆకర్షించేలా జాగ్రత్తలే తీసుకున్నారు. ఇందిరమ్మదీ ఇదే స్టైల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చీటికిమాటికి ఇందిరాగాంధీని, కాంగ్రెస్ వంశానుగత రాజకీయాలను దూషిస్తూ ఉంటారు కానీ ఇద్దరిదీ ఒకటే స్వభావం. అంతా నేనే అన్నట్టుగా అందరినీ తన చుట్టూ తిప్పుకోవడం వారికి తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినప్పటికీ ఇందిరాగాంధీ తనకున్న అధికార దర్పంతో అందరినీ తన కనుసన్నల్లోనే ఉంచుకున్నారు. ఇందిర కంటే మోదీ రెండాకులు ఎక్కువే చదివారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఈ తరహా రాజకీయ నాయకుల్ని ప్రజాస్వామిక నియంతలని పిలుస్తారు. అయితే అలాంటి వ్యక్తిత్వాన్నే నేటి తరం ఇష్టపడుతోంది. మోదీ చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలు, స్వయంకృషితో పైకి ఎదిగిన తీరు, తన వ్యక్తిత్వాన్ని తానే ప్రచారం చేసుకునే నైజం.. ఇవన్నీ యువతరాన్ని ఆకర్షించే అంశాలేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇందిరాగాంధీకి మోదీ కొడుకుగా పుట్టాల్సిన వారని గతంలోనే ఆయనపై కామెంట్లు కూడా వినిపించాయి. డిజిటల్ సైకో పాలిటిక్స్‌లో మాస్టర్ సెంటిమెంట్‌ను రగిలించడం మోదీకి తెలిసినంతగా మరో రాజకీయ నాయకుడికి తెలీదేమో. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్‌తో యువతలో దేశభక్తిని రగిలించి డిజిటల్ మీడియాలో బాగా ప్రచారం చేయడం ద్వారా దానినే ఎన్నికల అస్త్రంగా మార్చేశారు మోదీ. సర్జికల్ స్ట్రయిక్స్‌పై బాలీవుడ్ స్టైల్లో ఒక మ్యూజిక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రాజకీయ శాస్త్రాన్ని, చరిత్రని, సోషియాలజీని ఔపోసన పట్టి సెఫాలజీపై పట్టు సాధించడమే కాదు.. ఈ డిజిటల్ యుగంలో మానవ సమాజాన్ని, వారి సాంస్కృతిక భావజాలాన్ని, మనస్తత్వాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆంత్రోపాలజీని ఎలా వినియోగించుకోవాలో తెలిసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మోదీ పేరే మొదట చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రజాస్వామిక నియంతలుగా భావిస్తున్న వారి కంటే తన గురించి తాను ప్రచారం చేసుకోవడంలో, స్వీయ గౌరవాన్ని పెంచుకోవడంలో మోదీ ఒక అడుగు ముందే ఉంటారని రచయిత, రాజకీయ విశ్లేషకుడు పంకజ్ మిశ్రా అభిప్రాయంగా ఉంది. -
మార్జాలానికి మహా ఫాలోయింగ్
ఎక్కడైనా సెలబ్రిటీలు, సినిమా నటులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మరి ఓ పిల్లికి 33 వేల మంది ఫాలోయర్లు ఉన్నారంటే నమ్మగలమా..! అయినా నమ్మక తప్పదు మరి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసిన దీని చిత్రాలను చూసి ఇటువంటి వారి సంఖ్య రాకెట్లా పైకిపోతోందట. ఈ పిల్లి పేరు శాడ్లీ మటిల్డా. దీనికి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం పెద్ద సైజులో ఉన్న అద్దాల వంటి కళ్లేనట. పుట్టిన సరి గ్గా ఏడాది తర్వాత దీని కుడికన్ను ఒక్కసారిగా పెద్దదిగా మారిపోయింది. దీంతో శాడ్లీని దాని యజమానులు వైద్యుడి వద్దకు తీసుకుపోయి పరీక్షలు చేయిం చగా ఫెలైన్ లుకేమియా వ్యాధితో బాధపడుతోందనే విషయం బయటపడింది. వైద్యుల సలహామేరకు మందులు వాడుతుండగానే రెండో కన్నుకూడా పెద్దదిగా మారిపోయింది. క్రమంగా దానికి చూపు మందగించిపోయింది. ఆ తర్వాత వైద్యుడి సలహా మేరకు ఐ డ్రాప్స్ వాడటంతో పరిస్థితి మెరుగుపడిందట. -
చాన్సొస్తే తెలుగులోనూ..
చూడటానికి కాస్త బొద్దుగా ఉన్న.. ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. షాట్‌గన్ నుంచి పేలిన ఈ తూటా.. వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ అన్న క్రెడిట్ కొట్టేసింది. పంజాబీ లుక్స్‌లో అదరగొట్టే బీహారీ అమ్మాయి సోనాక్షి సిన్హా డెరైక్ట్ తెలుగు మూవీ చేయాలని ఉందంటోంది. హీరో అర్జున్ కపూర్‌తో కలసి నటించిన తేవర్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సోనాక్షితో సిటీప్లస్ మాటామంతీ.. ..:: శిరీష చల్లపల్లి నా పేరెంట్స్ యాక్టర్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నాన్న శతృఘ్న్ సిన్హా, అమ్మ పూనమ్. అన్నయ్యలిద్దరూ కవలలు. ఇంట్లో చిన్నదాన్ని కావడంతో గారాబంగా పెంచారు. అలాగని అల్లరి పిల్లను కాదు. నేను పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఇంట్రెస్ట్ ఉండేది. ముంబైలోని ఎస్ఎన్డీటీ విమెన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. ‘మేరే దిల్ లేకే దేఖో’ సినిమా ద్వారా ఫ్యాషన్ డిజైనర్‌గా పరిచయం అయ్యాను. బబ్లీ సిన్హా అనేవారు.. నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మొదటి సినిమా సల్మాన్‌ఖాన్ పక్కనే నటించే అవకాశం రావడంతో ‘దబాంగ్’కు ఓకే చెప్పాను. సినిమాల్లోకి రాకముందు చాలా బొద్దుగా ఉండేదాన్ని. అయితే ఆ క్యారెక్టర్ కోసం 30 కిలోలు తగ్గాను. మెడిటేషన్, డైట్, యోగా ఇలా ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలు ప్రయత్నించాను. అప్పుడున్నట్టు ఇప్పుడుంటే నన్ను బబ్లీ సిన్హా అనేవారు (నవ్వుతూ). సినిమాల్లోకి వచ్చాకే అసలు లైఫ్ స్టార్ట్ చేశాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మొదట్లో నాకు డ్యాన్స్ అసలే రాదని బాలీవుడ్ కోడై కూసింది. అందుకే నన్ను నేను మార్చుకున్నాను. పట్టుదలగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి నేనేంటో ప్రూవ్ చేసుకున్నాను. హీరోయిన్గా నా జర్నీ హాయిగా ఉంది. మా పేరెంట్స్ కూడా హ్యాపీ. మా నాన్నే నాకు గ్రేట్ ఫ్యాన్. రాజమౌళి డెరైక్షన్ ఇష్టం.. ఇప్పటి వరకు 3 తెలుగు రీమేక్ చిత్రాల్లో నటించాను. తాజాగా ‘ఒక్కడు’ సినిమాను హిందీ రీమేక్ ‘తేవర్’లో నటించాను. తెలుగు రీమేక్స్‌లో నటించానని కాబోలు.. తెలుగు ప్రజలు కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తారు. అందుకు థ్యాంక్స్. డెరైక్ట్ తెలుగు మూవీలో కూడా నటించాలని ఉంది. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్ చేయాలని ఉంది. రాజమౌళి డెరైక్షన్ అంటే ఇష్టం. వావ్ హైదరాబాద్.. షూటింగ్స్ కోసం హైదరాబాద్‌కు ఎన్నోసార్లు వచ్చాను. ప్రతిసారి ఇక్కడి వారు నన్ను సొంతింటి మనిషిలా పలకరించడం సంతోషంగా ఉంది. ఈ ప్లేస్లోనే ఏదో మేజిక్కో, మాగ్నెటో ఉన్నట్టుంది. ఆ పవర్ మనుషులనే కాదు, మనసులనూ ఆకర్షిస్తున్నట్టుంది. ఇక్కడ చార్మినార్, దాని దగ్గర దొరికే లస్సీ, గరం సమోసా టేస్ట్ చేస్తే ఎవరైనా వావ్ హైదరాబాద్ అనాల్సిందే. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ మై సూపర్ బెస్ట్ ప్లేస్. -
వైఎస్ఆర్సీపీ బాటలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు