
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మంగళగిరి(గుంటురు): వివాహిత కారును వెంబడించి దాడి చేసిన ఘటనలో ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మంగళగిరిలోని కాండ్రు వారి వీధికి చెందిన స్వాతి అనే వివాహిత కారులో ఇంటికి వెళ్తుండగా బాప్టిస్ట్‌పేటకు చెందిన రాజేష్, చక్రి, రాబర్ట్‌లతో పాటు మరికొందరు వెంబడించగా కారు డ్రైవర్ కారు ఆపి ఎందుకు తమ కారును ద్విచక్ర వాహనాలతో వెంబడిస్తున్నారని ప్రశ్నించడంతో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారని స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: చైనా దిగ్గజ కంపెనీలో చీకటి యవ్వారాలు.. కామ పిశాచాలపై ‘నో’ యాక్షన్
Comments
Please login to add a commentAdd a comment