జర్మనీలో కారు బీభత్సం.. ప్రమాదంలో 68మందికి గాయాలు | 2 Dead, 60 Injured In German Christmas Market Car Incident | Sakshi
Sakshi News home page

జర్మనీలో కారు బీభత్సం.. ప్రమాదంలో 68మందికి గాయాలు

Published Sat, Dec 21 2024 7:49 AM | Last Updated on Sat, Dec 21 2024 10:01 AM

2 Dead, 60 Injured In German Christmas Market Car Incident

బెర్లిన్‌ : జర్మనీలో ఓ డాక్టర్‌ బీభత్సం సృష్టించారు. మాగ్డేబర్గ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ మార్కెట్‌లోకి తన బీఎండబ్ల్యూ కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 68 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదానికి కారణమైన డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జర్మన్‌  సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర మినిస్టర్‌ ప్రెసిడెంట్‌ (ముఖ్యమంత్రి)ప్యూర్ హాసెలాఫ్ తెలిపారు. సౌదీ అరేబియాకు చెందిన 50ఏళ్ల డాక్టర్‌ 2006నుంచి జర్మనీలో నివాసం ఉంటున్నారు. డాక్టర్‌గా సేవలందిస్తున్నట్లు చెప్పారు.

ప్రమాదంపై స్థానిక ప్రభుత్వ ప్రతినిధి మథియాస్ షుప్పె మాట్లాడుతూ నిందితుడు ఉద్దేశపూర్వకంగా తన కారుతో మార్కెట్‌లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో నిందితుడు తన కారుతో ఎటునుంచి వచ్చాడో తెలియదు. మార్కెట్‌లోకి అత్యంత వేగంతో వచ్చాడు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే కావాలనే చేసినట్లు అనిపిస్తుంది.

ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2016లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. దీంతో తాజా ప్రమాదంపై సంఘ విద్రోహ చర్య అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

 
2016లో ఇదే తరహా దాడి
ఎనిమిదేళ్ల క్రితం జర్మన్‌ రాజధాని బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి జరిగింది. డిసెంబర్ 19, 2016న రద్దీగా క్రిస్మస్‌ మార్కెట్‌లో తన కారుతో ఓ ఇస్లామిక్ తీవ్రవాది ట్రక్కుతో దూసుకొచ్చాడు. ఈ దుర్ఘటనలో 13మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెండు రోజుల తర్వాత నిందితుణ్ని జర్మనీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement