మగ్దెబర్గ్ : క్రిస్మస్ పండుగ వేళ జర్మనీలో మగ్దెబర్గ్ నగరంలో క్రిస్మస్ మార్కెట్‌పై అగంతకుడు జనంపైకి కారును నడిపాడు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఈ దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తుండగా.. ప్రముఖ దిగ్గజ మీడియా సంస్థలు విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి.
జర్మనీ క్రిస్మస్ మార్కెట్‌లో నిందితుడు తాలెబ్ తన కారుతో జనం పైకి కారును నడిపాడు. మూడు నిమిషాల్లో జరిగిన దారుణంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, పలు ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం ‘జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్‌లో ఒక కారు జనాలపై దూసుకెళ్లింది ’ అని మాత్రమే హైలెట్ చేశాయి. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, అతడి వివరాలు వెల్లడించినా మీడియా సంస్థలు నామ మాత్రంగా కథనాలు ఎందుకు ప్రచురించ దేశాదినేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
You don’t hate the lying legacy media enough https://t.co/gMtjbp2EMG
— Elon Musk (@elonmusk) December 20, 2024
అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం క్రిస్మస్ మార్కెట్‌లో జనంపై కారు దూసుకెళ్లింది. మరి ఆ కారును ఎవరు డ్రైవ్ చేశారు’అని ప్రశ్నించారు. ఎలాన్ మస్క్ సైతం మీడియా తీరును తప్పుబట్టారు. పలువురు నెటిజన్లు సైతం మీడియా కథనాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. జనంపై కారు దూసుకెళ్లింది. అందులో డ్రైవర్ పేరు, అతడి వివరాలు తెలిసినా ఎందుకు హైలెట్ చేయలేదు’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.
Who was driving the car? https://t.co/A6Bq8WuswL
— JD Vance (@JDVance) December 20, 2024
Comments
Please login to add a commentAdd a comment