Christmas Market
-
జర్మనీలో కారు బీభత్సం.. ప్రమాదంలో 68మందికి గాయాలు
బెర్లిన్ : జర్మనీలో ఓ డాక్టర్ బీభత్సం సృష్టించారు. మాగ్డేబర్గ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్లోకి తన బీఎండబ్ల్యూ కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 68 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి కారణమైన డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జర్మన్ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ (ముఖ్యమంత్రి)ప్యూర్ హాసెలాఫ్ తెలిపారు. సౌదీ అరేబియాకు చెందిన 50ఏళ్ల డాక్టర్ 2006నుంచి జర్మనీలో నివాసం ఉంటున్నారు. డాక్టర్‌గా సేవలందిస్తున్నట్లు చెప్పారు.ప్రమాదంపై స్థానిక ప్రభుత్వ ప్రతినిధి మథియాస్ షుప్పె మాట్లాడుతూ నిందితుడు ఉద్దేశపూర్వకంగా తన కారుతో మార్కెట్లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో నిందితుడు తన కారుతో ఎటునుంచి వచ్చాడో తెలియదు. మార్కెట్లోకి అత్యంత వేగంతో వచ్చాడు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే కావాలనే చేసినట్లు అనిపిస్తుంది.ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2016లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. దీంతో తాజా ప్రమాదంపై సంఘ విద్రోహ చర్య అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.🚨 2 Dead, 60 Injured in German Christmas Market Attack 🚨A car plowed into a bustling Christmas market in Magdeburg, Germany, killing two people, including a toddler, and injuring over 60 others in what authorities are calling a deliberate act, potentially linked to terrorism.… pic.twitter.com/8o6zVv62Vu— CanAm Network (@Canam_Network) December 21, 2024 2016లో ఇదే తరహా దాడిఎనిమిదేళ్ల క్రితం జర్మన్ రాజధాని బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి జరిగింది. డిసెంబర్ 19, 2016న రద్దీగా క్రిస్మస్ మార్కెట్లో తన కారుతో ఓ ఇస్లామిక్ తీవ్రవాది ట్రక్కుతో దూసుకొచ్చాడు. ఈ దుర్ఘటనలో 13మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెండు రోజుల తర్వాత నిందితుణ్ని జర్మనీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. Police arresting the Attacker 50-year-old Saudi doctor in Magdeburg, Germany#Terroristattack #Germany #Magdeburg #Weihnachtsmarkt #MagdeburgAttack #MagdeburgerWeihnachtsmarkt #festundflauschig pic.twitter.com/JO1nuTLal5— Chembiyan (@ChembiyanM) December 20, 2024 -
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్‌లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్‌ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్‌లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్‌కు యార్క్‌షైర్ కౌంటీలో ఒక పబ్‌తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘‘ చిన్న వ్యాన్‌లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్‌నట్ స్క్వాష్ పై, కేక్‌లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్‌లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్‌లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్‌సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్‌ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
జర్మనీలో ట్రక్కు బీభత్సం
• బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్లోకి దూసుకుపోయిన ట్రక్కు • 12 మంది మృతి, 50 మందికి గాయాలు బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ షాపింగ్ సందడితో రద్దీగా ఉన్న మార్కెట్లోకి ట్రక్ దూసుకుపోవడంతో 12 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. బెర్లిన్‌లోని కైజర్ విల్హెల్మ్ మొమోరియల్ చర్చ్ ముందు మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మార్కెట్లో దాదాపు 80 మీటర్ల దూరం జనాల్ని చిదిమేస్తూ, షాపుల్ని కూల్చుకుంటూ ట్రక్కు దూసుకుపోయింది. ఈ సమయంలో డ్రైవర్ క్యాబిన్లో ఇద్దరు యువకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ట్రక్కు ఆగగానే డ్రైవర్ దూకి పారిపోయాడని, క్యాబిన్లో ఒక పోలిష్ జాతీయుడి మృతదేహం లభించిందని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో పాక్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు కారకుడైన వ్యక్తి పేరు నవీద్ (23) అని, అతను ఏడాది క్రితం జర్మనీలో శరణార్థిగా పేరు నమోదు చేసుకున్నట్లు అధికారులను ఉటంకిస్తూ స్థానిక బిల్డ్ పత్రిక వెల్లడించింది. ఘటనకు కారణమైన పోలీష్ రవాణా సంస్థకు చెందిన ట్రక్కును నిందితుడు దొంగిలించి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సంఘటన జరగడానికి నాలుగు గంటల ముందునుంచి ట్రక్కు ఆచూకీ తెలియలేదని సంబంధిత కంపెనీ వెల్లడించింది. చివరిసారిగా డ్రైవర్‌తో మాట్లాడినప్పుడు తాము బెర్లిన్‌లో ఉన్నామని, సోమవారం ఉదయం సరుకు అన్లోడ్ చేస్తామని చెప్పినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్నవారు తమ డ్రైవర్‌ను ఏదో చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి జర్మన్ పోలీస్ అధికార ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ పాక్ నుంచి శరణార్థిగా వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతనే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించలేదన్నారు. -
ఆ బీభత్సానికి పాల్పడింది పాకిస్థానీనే!
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ట్రక్కుతో బీభత్సం సృష్టించి 12మందిని పొట్టనబెట్టుకున్న దుర్మార్గుడు పాకిస్థానీ జాతీయుడని తేలింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సెంట్రల్ బెర్లిన్‌లోని ఓ మార్కెట్లో క్రిస్మస్ పండుగ షాపింగ్‌లో మునిగితేలిన ప్రజలు లక్ష్యంగా అతను ట్రక్కుతో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా జనంపైకి ట్రక్కును తోలుతూ.. మారణహోమానికి దిగాడు. ఈ ఘటనలో 12 మంది చెందగా, 50 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్రిస్మస్ పండుగ వేళ బెర్లిన్‌లో విషాదం నింపిన ఈ ఘటనకు పాల్పడింది పాకిస్థాన్ నుంచి వలసవచ్చిన 23 ఏళ్ల వ్యక్తి అని జర్మనీ భద్రతాధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో అతను బెర్లిన్ వచ్చాడని, స్థానికంగా ఉన్న శరణార్థుల హోటల్లో నివసిస్తున్న అతను గతంలో చిన్నచిన్న నేరాలకు పాల్పడ్డాడని, పోలీసులకు అతను తెలుసని చెప్పారు. -
క్రిస్మస్ మార్కెట్లో ట్రక్కు బీభత్సం