ఆ బీభత్సానికి పాల్పడింది పాకిస్థానీనే!
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ట్రక్కుతో బీభత్సం సృష్టించి 12మందిని పొట్టనబెట్టుకున్న దుర్మార్గుడు పాకిస్థానీ జాతీయుడని తేలింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సెంట్రల్ బెర్లిన్‌లోని ఓ మార్కెట్‌లో క్రిస్మస్ పండుగ షాపింగ్‌లో మునిగితేలిన ప్రజలు లక్ష్యంగా అతను ట్రక్కుతో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా జనంపైకి ట్రక్కును తోలుతూ.. మారణహోమానికి దిగాడు. ఈ ఘటనలో 12 మంది చెందగా, 50 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
క్రిస్మస్ పండుగ వేళ బెర్లిన్‌లో విషాదం నింపిన ఈ ఘటనకు పాల్పడింది పాకిస్థాన్ నుంచి వలసవచ్చిన 23 ఏళ్ల వ్యక్తి అని జర్మనీ భద్రతాధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో అతను బెర్లిన్ వచ్చాడని, స్థానికంగా ఉన్న శరణార్థుల హోటల్‌లో నివసిస్తున్న అతను గతంలో చిన్నచిన్న నేరాలకు పాల్పడ్డాడని, పోలీసులకు అతను తెలుసని చెప్పారు.