
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని టబాస్కోలో శనివారం తెల్లవారుజామున బస్సు ట్రక్కును ఢీకొనడంతో 41 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు 48 మంది ప్రయాణికులతో దక్షిణ మెక్సికోలోని కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బస్సు ట్రక్కును ఢీకొనడంతో తీవ్రమైన మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మెటల్ ఫ్రేమ్ మాత్రమే మిగిలిపోయింది. 41 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టమవుతోంది. 18 మందిని మాత్రమే గుర్తించగలిగామని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment