mexico
-
Christmas 2024 ముల్లంగి సంబరం
ప్రపంచంలోనే ఇదొక అరుదైన సంబరం. మెక్సికోలోని వాహాకా నగరంలో జరిగే వేడుక ఇది. ఈ సంబరం జరిగే రోజున వాహాకా నగర వీథుల్లో ఎటు చూసినా ముల్లంగి దుంపలే కనిపిస్తాయి. స్థానిక కళాకారులు ముల్లంగి దుంపలను శిల్పాలుగా తీర్చిదిద్ది ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సంబరం ఏటా డిసెంబర్ 23న జరుగుతుంది. ఇది ప్రధానంగా రాత్రివేళ జరిగే వేడుకే అయినా, ఉదయం నుంచి వాహాకా నగర వీథుల్లో సందడి కనిపిస్తుంది. స్పానిష్ వలసదారులు అడుగుపెట్టే వరకు మెక్సికన్ ప్రజలకు, ఇతర లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు ముల్లంగి తెలీదు. స్పానిష్ వర్తకులు చైనా నుంచి ముల్లంగిని తీసుకువచ్చి, దక్షిణ అమెరికాలోని తమ వలస రాజ్యాల్లో సాగు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ముల్లంగి లాటిన్ అమెరికన్ ప్రజల అభిమాన కూరగాయల్లో ఒకటిగా మారింది. ముల్లంగి సంబరం ఆచారం మొదలవడానికి ముందు వాక్సాకా నగరంలోని క్రిస్మస్ బజారులో కలపతో శిల్పాలు మలచే పోటీలు జరిగేవి. కొందరు ఔత్సాహిక రైతులు 1897 డిసెంబర్ 23న ముల్లంగి దుంపలతో చిత్రవిచిత్రమైన శిల్పాలను మలచి, ప్రదర్శనకు పెట్టారు. దాదాపు వందమంది రైతులు ఆనాటి ప్రదర్శనలో ముల్లంగి శిల్పాలను ప్రదర్శించారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు వీటిని ఎగబడి కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న ‘నోషే డి రబానోస్’ (నైట్ ఆఫ్ రాడిషెస్) సంబరం జరుపుకోవడం ప్రారంభించారు. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది! )మొదట్లో ఈ వ్యవహారం కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికే మొదలైనా, తర్వాత ఇది వాహాకా నగరంలో ఒక పెద్ద సాంస్కృతిక వేడుకలా మారింది. ఈ ముల్లంగి సంబరంలో ముల్లంగి శిల్పాల పోటీలు జరుగుతాయి. విజేతలకు వాహాకా నగర పాలక సంస్థ బహుమతులు అందించి, ఘనంగా సత్కరిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే శిల్పులు క్రీస్తు జననం, శిలువ, చర్చి వంటి ఆకృతులతో పాటు పక్షులు, జంతువులు, మనుషుల బొమ్మలను కూడా ముల్లంగి దుంపలపై మలచి, తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ వేడుకకు విదేశీ పర్యాటకులు వస్తుండటం వల్ల మెక్సికోకు పర్యాటక ఆదాయం కూడా బాగా లభిస్తోంది. -
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు
ఒట్టావా: కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం వేస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కెనడా సైతం దీటుగా స్పందించడంపై దృష్టి సారించింది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. దక్షిణ, ఉత్తర సరిహద్దుల గుండా మాదకద్రవ్యాలు, వలసదారుల అక్రమచొరబాట్లను నిలువరించకపోతే అటు మెక్సికో, అటు కెనడా దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంవేళ ఓటర్లకు వాగ్దానాలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్యం బలోపేతంపై ఉపప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టినా ఫ్రీలాండ్, అంతర్గత వ్యవహారాలు, ఇతర శాఖల మంత్రులు, అమెరికాలో కెనడా రాయబారి కిస్టెన్ హిల్మ్యాన్లతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ అధిక పన్నులు మోపడంపై చర్చించారు. ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. అయితే కెనడాను మెక్సికోను ఒకే గాటిన కట్టడం అన్యాయమని మంత్రులు జస్టిన్ వద్ద ప్రస్తావించారు. కెనడా నుంచి వలసలను తగ్గించడానికి, వనరులను అందించడానికి, ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయడానికి సిద్దమేనని ఈ సందర్భంగా ట్రూడో అన్నారు. మాదక ద్రవ్యాలు తమ దేశం సమస్య కాదని, సుంకాలు రెండు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడా మంత్రులు అభిప్రాయపడ్డారు. అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా ఉత్పత్తులు కెనడా నుంచే వస్తున్నాయి. ప్రతిరోజూ దాదాపు రూ.22,000 కోట్ల విలువైన వస్తుసేవలు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ముడిచమురు అవసరాల్లో 60 శాతం కెనడానే తీరుస్తోంది. 85 శాతం అమెరికా విద్యుత్ ఉపకరణాలు కెనడా నుంచే వస్తున్నాయి. 34 అత్యంత విలువైన ఖనిజధాతువులు, లోహాలు కెనడా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రతీకార సుంకాల పరిశీలన.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించే అవకాశాలను కెనడా పరిశీలిస్తోందని సీనియర్ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కెనడా సిద్ధమవుతోందని, ప్రతీకారంగా ఏ వస్తువులపై సుంకాలు విధించాలనే విషయంపై చర్చిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అధిక సుంకాలు విధించినప్పుడు, ఇతర దేశాలు ప్రతీకార సుంకాలతో ప్రతిస్పందించాయి. గతంలోనూ 2018లో కెనడా నుంచి దిగుమతి అయిన స్టీల్, అల్యూమినియంపై అమెరికా అదనపు పన్నలు విధించింది. దీనికి ప్రతికా కెనడా సైతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై వేలకోట్ల పన్నులను ముక్కుపిండి వసూలుచేసింది. మెక్సికోతో ట్రంప్ చర్చలు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో అద్భుతమైన చర్చ జరిగిందని ట్రంప్ బుధవారం చెప్పారు. ‘‘వలసదారులు అమెరికా దక్షిణ సరిహద్దు గుండా లోపలికి అక్రమంగా చొరబడకుండా ఇకపై మెక్సికో సమర్థవంతంగా అడ్డుకోనుంది. ఈ చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఈ చర్యలు అమెరికా చేపడుతున్న అక్రమ ఆక్రమణ నిరోధక కార్యక్రమాలకు ఎంతగానో దోహదపడుతుంది. క్లాడియా షీన్‌బామ్‌కు ధన్యవాదాలు’’అని ట్రంప్ పోస్ట్‌చేశారు. ‘‘అమెరికాలోకి భారీగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన ఉమ్మడి చర్యలపై క్లాడియాతో చర్చించా’’అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ భేటీ తర్వాత అమెరికా అధిక పన్నుల భారం నుంచి మెక్సికోకు ఉపశమనం లభిస్తుందో లేదో తెలియరాలేదు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తీసుకునే నిర్ణయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. -
పన్నుకు పన్ను ట్రంప్ ప్రతిపాదనలపై మెక్సికో!
మెక్సికో: మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం పన్ను విధిస్తామన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికకు ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే మెక్సికో కూడా సుంకాలతో బదులిస్తుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దుల వెంబడి మాదకద్రవ్యాలు, వలసదారుల ప్రవాహాన్ని ఆపకపోతే మెక్సికో వస్తువులపై 25% దిగుమతి సుంకాలు తప్పవని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను క్లాడియా తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరికా నుంచి అక్రమంగా ప్రవాహంలా వచ్చిపడుతున్న ఆయుధాలతో మెక్సికో బాధపడుతోందన్నారు. ఇక మాదకద్రవ్యాలు అమెరికా సొంత సమస్యేనన్నారు. వలస సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. సమస్యలపై చర్చలకు సిద్ధమన్నారు. వలసదారుల కారవాన్లు ఇకపై సరిహద్దుకు చేరవని స్పష్టం చేశారు. ఆయుధాలపై పెట్టే ఖర్చును వలస సమస్యను పరిష్కారానికి వెచ్చిస్తే మంచిదని అమెరికాకు హితవు పలికారు. యుద్ధానికి ఖర్చు చేసే మొత్తంలో కొంత శాంతి, అభివృద్ధిపై కేటాయిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చన్నారు. అమెరికా, మెక్సికో పలు అంశాల్లో పరస్పరం ఆధారపడతాయి. భారీ పన్నులు ఇరు దేశాల్లో ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి కారణమవుతాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, శాంతి సాధనకు చర్చలే మార్గం’’అన్నారు. అవి త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అందం అర్థం మారుతోంది..!
‘మిస్ యూనివర్స్’ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్–2024’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పోటీ నేపథ్యంలో కేవలం విజేత గురించి మాత్రమే కాదు ఈ పోటీలోపాల్గొన్న ఎంతోమంది గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందానికి సంబం«ధించిన సంప్రదాయ కొలమానాలను సవాలు చేసి వేదిక మీద నిలిచిన వారి మొదలు గృహహింస, లైంగిక హింస బాధితులుగా చీకట్లో మగ్గి ఆ చీకటి నుంచి బయటికి వచ్చి ప్రపంచ వేదికపై వెలిగిపోయిన వారు ఉన్నారు.నలభైలలో...40 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలోపాల్గొన్న మహిళగా బియాట్రిస్ నజోయా తన ప్రత్యేకతను చాటుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన ‘మిస్ యూనివర్స్ మాల్టా’ నజోయా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. నజోయా ముగ్గురు పిల్లలకు తల్లి. సింగిల్ మదర్.‘శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. హీనమైన పరిస్థితులను చూశాను. మనకు తప్ప మన సంతోషానికి తెర వేసే శక్తి ఎవరికీ లేదని నిరూపించాలనుకున్నాను. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాను. మనం బయటికి ఎలా కనిపించినా లోపల అందంగా ఉంటాం. ఆ అందాన్ని చూడగలగాలి’ అంటుంది నజోయా. ‘నిజానికి ఆమె ఎప్పటికీ విజేత. కంటికి కనిపించని కిరీటం ఆమె తలపై కనిపిస్తుంది’ అంటారు నజోయా అభిమానులు. ఎత్తు ఎంతైనా... అంతెత్తున!ష్యానే మెకింతోష్ అందాల పోటీలో పోటీపడిన వారిలో ఎత్తు తక్కువగా ఉన్న కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్’ ఫైనల్లో మెకింతోష్ ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతల హృదయాలను గెలుచుకుంది. ‘నేను చిన్నగా కనిపించవచ్చు... కానీ ఆత్మవిశ్వాసంతో అంతెత్తున కనిపిస్తాను’ ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ 2024’ అందాల కిరీటాన్ని గెల్చుకున్న విజేతగా అందరి దృష్టిని ఆకర్షించింది ష్యానే మెకింతోష్. 34 ఏళ్ల తరువాత ‘మిస్ యూనివర్స్’ పోటీలో జిబ్రాల్టర్కుప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. హిజాబ్‌తో...‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి హిజాబీ (ముస్లిం సంప్రదాయ వస్త్రం హిజాబ్‌తో) మహిళగా ఖదీజా ఒమర్ చరిత్ర సృష్టించింది. 23 సంవత్సరాల ఖదీజా సోమాలియ నుంచి ‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి మహిళ.కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించింది. యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఖదీజా కమ్యూనిటీ బిల్డింగ్, బ్రాండ్ డెవలప్మెంట్లోప్రావీణ్యం సాధించింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తోంది. స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడంలో నేర్పరి. ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి హిజాబీగా చరిత్ర సృష్టించింది. బార్బీ బొమ్మకు అందాల కిరీటం!‘ఈసారి విశ్వసుందరి కిరీటాన్ని బార్బీ బొమ్మ గెలుచుకుంది’ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘బార్బీ బొమ్మకు అందాల కిరీటం ఏమిటీ?!’ అనే ఆశ్చర్యంలో ఉండగానే అసలు విషయం తెలిసిపోయింది. ‘మిస్ యూనివర్స్–2024’ అందాల కిరీటాన్ని గెలుచుకున్న 21 సంవత్సరాల విక్టోరియా కెజార్ ముద్దు పేరు... బార్బీ డాల్. కెజార్ అచ్చం ‘బార్బీ’లా ఉంటుందని ఆలా పిలుస్తారు. బ్యూటీ స్పాట్...ఈసారి విశ్వసుందరి పోటీ విజేత కంటే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది ఈజిప్ట్‌కు చెందిన లోగినా సలాహ్. చర్మంపై తెల్లటి మచ్చలు (బొల్లి) వల్ల ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. సలాహ్ మిస్ యూనివర్స్ పోటీలోకి అడుగుపెట్టడం అనేది ఊహకు కూడా అందని విషయం. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను బ్రేక్ చేసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చే చారిత్రక సందర్భం కూడా. బ్లాగర్, ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, మేకప్–ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సలాహ్‌కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.‘స్కిన్పాజిటివిటీ’ని ప్రచార అంశంగా తన ప్రయాణాన్నిప్రారంభించి ఎంతోమంది యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సలాహ్. సలాహ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్ మాత్రమే కాదు సానుకూల మార్పు, ఆత్మవిశ్వాసం... మొదలైన అంశాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి గొప్ప వక్తగా పేరు తెచ్చుకుంది. న్యూయార్క్‌లోని బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ నుంచి లైసెన్స్ పొందిన సలాహ్ తన సోషల్ మీడియా ΄్లాట్ఫామ్లలో క్రియేటివ్ లుక్స్‌పై ట్యుటోరియల్స్‌ను నిర్వహించేది. 2023లో దుబాయ్ ఫ్యాషన్ వీక్లోపాల్గొనడం ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.‘బియాండ్ ది సర్ఫేస్ మూమెంట్’ వేదిక ద్వారా బాలికలు, యువతులలో సామాజిక స్పృహ కలిగిస్తోంది. దుబాయ్‌లో నివసిస్తున్న 34 సంవత్సరాల సలాహ్ ఒక బిడ్డకు తల్లి. సింగిల్ మదర్.‘మిస్ యూనివర్స్ 2024’లో లోగినా సలాహ్ టాప్ 30లో చోటు సాధించింది. బంగారు పక్షి‘మిస్ యూనివర్స్’ కిరీటం మిస్ అయిపోయినా ‘గోల్డెన్ బర్డ్’ కాస్ట్యూమ్‌తో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది రియా సింఘా. ‘మిస్ యూనివర్స్’కు మన దేశం నుంచిప్రాతినిధ్యం వహించిన రియా సింఘా ధరించిన ‘ది గోల్టెన్ బర్డ్’ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాదిప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెల్చుకున్న సింఘా సింబాలిక్ దుస్తుల్లో రన్‌వేపై నడుస్తూ ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేసింది. శ్రేయస్సు, సంపదకు బంగారు పక్షి చిహ్నం. ఈ డ్రెస్‌ను వియత్నాం డిజైనర్ గుయెన్ ఎన్లోక్ డిజైన్ చేశారు. -
వలసలకు ఇక బ్రేకే!
అగ్రరాజ్యాధిపతిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి ఆయన ఎలాంటి విధానాలు అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు తీసుకొనే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రపంచమంతటా ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. ట్రంప్ రెండో దఫా పాలనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది కాలంగా ట్రంప్ చేసిన ప్రసంగాలు, వచ్చిన ప్రకటనలను బట్టి కొన్ని కీలకమైన అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందో కొంతవరకు అంచనా వేయొచ్చు. అదేమిటో చూద్దాం.. వలసలపై కఠిన వైఖరే అమెరికాలోకి వలసల పట్ల ట్రంప్ మొదటి నుంచీ వ్యతిరేకమే. 2016లో ఆయన ‘గోడ కట్టండి’అని పిలుపునిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించారు. అమెరికా అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు తరిమేయడానికి నేషనల్ గార్డు, పోలీసు దళాలను బలోపేతంపై దృష్టి పెట్టారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి ఇకపై ట్రంప్ రూపంలో కష్టాలు తప్పకపోవచ్చు. అమెరికా గడ్డపై జన్మిస్తే అమెరికా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి వలసలకు ట్రంప్ వ్యతిరేకమే. మొత్తంమీద ఇకపైన చట్టబద్ధంగా కూడా ఎక్కువ మందిని అమెరికాలోకి అనుమతించకపోవచ్చు. విదేశీయులు అమెరికా కలను వాయిదా వేసుకోవాల్సి రావొచ్చు. గర్భస్రావాలపై మహిళలకు హక్కులు తొలి దఫాలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళల పునరుత్పత్తి హక్కులను ట్రంప్ వ్యతిరేంచారు. గర్భాన్ని తొలగించుకొనేందుకు మహిళలకు ఉన్న హక్కును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు తమ వల్లే సాధ్యమైందని ట్రంప్ చెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పునరుత్పత్తి హక్కుల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ వారికి మద్దతు పలికారు. అయితే, ఈసారి ట్రంప్ మహిళల గర్భస్రావ హక్కుల విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు. అంటే మహిళలకు స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్జెండర్లకు రక్షణ లింగమారి్పడి చేయించుకున్నవారిపై ట్రంప్‌కు సానుభూతి ఉంది. లెస్పియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి పట్ల సమాజం దృక్పథం మారాలని ఎన్నోసార్లు చెప్పారు. ట్రంప్ పాలనలపై వృద్ధులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి సామాజిక భద్రత, వైద్య సంరక్షణ కల్పిస్తామంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. -
స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. స్థానిక అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు.మెక్సికో నగరానికి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోని అక్లోజ్టోక్లో ఈ పేలుడు సంభవించినట్లు త్లాక్స్‌కాలా స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కార్మికుల నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం కరిగిన ఉక్కు.. నీటి పరిధిలోకి రావడంతో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. బాధిత కుటుంబాలను త్లాక్స్కలా గవర్నర్ లోరెనా క్యూల్లార్ పరామర్శించారు. ఈ ఉదంతం దర్యాప్తు పూర్తయ్యేంతవరకూ ప్లాంట్‌ను మూసివేయనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది? -
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ జకాటెకాస్లోని హైవేపై ఒక బస్సు ప్రమాదానికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్నఈ బస్సు మక్కా వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొంది. వెంటనే బస్సు, ట్రాక్టర్ రెండూ కాలువలో పడిపోయాయి.జకాటెకాస్ గవర్నర్ డేవిడ్ మాన్రియల్ తొలుత ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారని తెలిపారు. అయితే రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం తరువాత ఒక ప్రకటనలో మృతుల సంఖ్యను సవరించింది. ఈ ఘటనలో 19 మంది మరణించారని, ఆరుగురు గాయపడ్డారని స్పష్టం చేసింది.స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రమాదం దరిమిలా కాలువలో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు యూఎస్-మెక్సికో సరిహద్దులోని చివావా రాష్ట్రంలోని క్యూడాడ్ జువార్జ్ అనే నగరానికి వెళుతోంది. ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
ప్రపంచ విప్లవ జ్వాల
ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత చే గువేరా! ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా! ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 1954లో గౌటెమాలలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలి పోయింది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని విప్లవ దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956–1959)లో చే గువేరా ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌గా అంకిత భావంతో సేవలందించాడు. పోరాటం విజయవంతమైన తరువాత, కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభు త్వాధికారాన్ని చేపట్టాడు. ఆ ప్రభుత్వంలో చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు! పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, పలుకుబడిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు! బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు! ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యానికి చిక్కాడు! 1967 అక్టోబర్ 9న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో ఆ సైన్యం ఆయన్ని చంపివేసింది. అలా ఓ ప్రపంచ విప్లవ జ్వాల ఆరిపోయింది!– ఎమ్డీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్(నేడు చే గువేరా వర్ధంతి) -
దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది
లాగోస్: దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెత్సీనా మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎన్నికైంది. నవంబరులో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయతకు సంబంధించి ఆన్లైన్లో తీవ్రదాడి జరగడంతో అడెత్సీనా కిందటి నెల మిస్ సౌతాఫ్రికా పోటీ నుంచి వైదొలిగింది. నైజిరియాలో పోటీపడాల్సిందిగా వచి్చన ఆహ్వానాన్ని మన్నించింది. నైజీరియా తండ్రి, మొజాంబిక్ మూలాలున్న దక్షిణాఫ్రికా తల్లికి జని్మంచిందనే కారణంతో మిస్ సౌతాఫ్రికా పోటీల్లో పాల్గొనడానికి అడెత్సీనాకు అర్హత లేదనే వాదన మొదలైంది. ఆమె జాతీయతను దక్షిణాఫ్రికన్లు పశి్నంచారు. దాంతో అంతర్జాతీయ వేదికపై తండ్రి పుట్టినగడ్డకు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా నైజీరియా అడెత్సీనాకు తమ ఆహ్వానాన్ని అభివరి్ణంచింది. చివరకు అదే నిజమైంది. ‘నా కల నిజమైంది. ఇదో అందాల కిరీటం కాదు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపు’ అని అడెత్సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. -
డౌన్ సిండ్రోమ్‌తో లాయర్‌గా చరిత్ర సృష్టించింది! ఎవరీమె..?
అన్ని సక్రమంగా ఉన్నా.. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక తిప్పలు పడుతుంటారు. అందుకు ఏవేవో సాకులు కూడా చెబుతుంటారు. కానొ కొందరూ భయానక సవాళ్లును దాటుకుంటూ అసాధ్యం అనే దాన్ని కూడా సాధించి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిదే అనా విక్టోరియా. మెక్సికోలోని జకాటెకాస్‌కు చెందిన అనా విక్టోరియా ఎస్పినో డి శాంటియోగా డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ పట్టా పొందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల అనా జూలై 2024లో యూనివర్సిడాడ్ అటోనోమా డి జకాటెకస్ నుంచి పట్టభద్రురాలైంది. ఆమె విద్యాభ్యాసంలో అనేక సవాళ్ల ఎదుర్కొన్నప్పటికీ..ఒక ప్రొఫెసర్ సాయంతో తన కలను సాకారం చేస్తుకుంది. ఆయన మార్గనిర్దేశంలో డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ విద్యలో డిగ్రీని సాధించిన అరుదైన వ్యక్తిగా నిలిచింది. జనవరి 30, 1999న జన్మించిన అనా ఓచోవా, ఎస్పినో జపాటాల కుమార్తె. ఆమె తన విద్యను ఆన్లైన్లోనే పూర్తి చేసింది. తరువాత న్యాయశాస్త్రం అభ్యసించేందుకు యూనివర్సిడాడ్ ఆటోనోమా డి జకాటెకాస్లో చేరింది. అయితే అక్కడ నిర్థిష్ట అవసరాలున్న తనలాంటి వ్యక్తులకు పాఠాలు భోధించే విధానం లేక చాలా ఇబ్బందులు పడింది. అయినప్పటికీ ఆమె దృఢ సంకల్పమే సాయం చేసే మంచి ప్రొఫెసర్ చెంతకు చేరేలా చేసింది. ఆయన అండదండలతో న్యాయపరమైన అధ్యయనంలో ఎదురయ్యే సవాళ్లన్నింటిని అధిగమించగలిగింది. అనా న్యాయవాదిగా అవ్వడానికి ముందు తనలాంటి వికలాంగుల హక్కుల కోసం వాదించే శాసనఫోరమ్లలో పనిచేసేది. ఇది తనకు న్యాయరంగ పట్ల అవగాహనను ఇవ్వడమే గాక భవిష్యత్తు అవకాశాలకు మార్గం సుగమం చేసింది. అలాగే అనా లాయర్‌గా వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని, సమానత్వం కోసం వాదించాలని చూస్తోంది. ఇంతటి స్థితిలో కూడా అంకితభావంతో అనితరసాధ్యమైన తన కలను సాకారం చేసుకుని అందిరిచేత ప్రశంసలందుకోవడమే గాక విదేశాల నుంచి ఉద్యోగా ఆఫర్లు కూడా వచ్చాయి. ఇక అనాకి పెయింటింగ్ కళలో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. 2014 నుంచి అనే పెయింటింగ్ ఎగ్జిబిషన్లను నిర్వహించింది. తన పెయింటింగ్‌లను 'డెస్టే మి సీ'లో పేరుతో ప్రదర్శించింది.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
ఈ టూ డెడ్లీ మమ్మీల మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా! ఇదొక..?
ఇది మమ్మీల మ్యూజియం. మెక్సికోలోని గ్వానాజ్వాటో పట్టణంలో ఉంది. పలు దేశాల్లో 1870 నుంచి 1958 కాలంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ మమ్మీలను సేకరించి, జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరచారు. ప్రపంచంలోని భీతిగొలిపే మ్యూజియంలలో ఒకటిగా ఈ మమ్మీల మ్యూజియం పేరుమోసింది. ‘ఎల మ్యూజో డి లాస్ మోమియాస్’ పేరుతో ఈ మమ్మీల మ్యూజియంను 1969లో ఇక్కడ నెలకొల్పారు.ఈ మ్యూజియం సేకరణలో మొత్తం 111 మమ్మీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మరీ శిథిలంగా మారడంతో, ప్రస్తుతం వాటిలోని 59 మమ్మీలను మాత్రమే సందర్శకులకు ప్రదర్శిస్తున్నారు. గ్వానాజాటో మునిసిపాలిటీకి, మెక్సికో జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థకు మధ్య మమ్మీల నిర్వహణపై వివాదం నడుస్తుండటంతో ఇవి కొంత నిర్లక్ష్యానికి లోనయ్యాయి. స్థానిక సంస్థ నిర్లక్ష్యం వల్లనే మమ్మీలపై ఫంగస్ పెరిగి, అవి పాడైపోతున్నాయనేది జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థ ఆరోపణ. -
Mexico: కూలిన పిరమిడ్.. వినాశానికి సంకేతమా?
మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతన తెగకు చెందిన ఒక పిరమిడ్ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెనువిపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు ఉండటాన్ని ఈ ఫొటోలలో చూడవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పురాతన పురేపెచా తెగ వారు తమ దేవతకు మానవ బలులు అర్పించడానికి యకాటా పిరమిడ్‌ను ఉపయోగించేవారని తెలుస్తోంది. యకాటా పిరమిడ్లు మిచోకాన్ రాష్ట్రంలోని ఇహుట్జోలో ఉన్నాయి.ఇప్పడు వచ్చిన తుఫాను పెను విధ్వంసాన్ని సూచిస్తుందని స్థానికుడు తరియాక్విరి అల్వారెజ్ మీడియా ముందు పేర్కొన్నారు. ఇది మా పూర్వీకులకు సంబంధించిన చేదువార్త. ఇది విపత్కర సంఘటనను సూచిస్తోందని ఆయన అన్నారు. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురేపెచా తెగలు అజ్టెక్లను ఓడించి 400 సంవత్సరాలు పాలించాయి.మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (ఐఎన్ఏహెచ్) ఒక ప్రకటనలో.. ఇహుట్జోలో ఒక పిరమిడ్ కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇది జరిగింది. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పిరమిడ్ బయటి గోడ, లోపలి భాగం దెబ్బతిన్నట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి మరమ్మతు చేయడంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది. -
USA: ఇరవై ఏళ్ల తర్వాత చిక్కిన మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్
న్యూయార్క్: అమెరికా మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్, 20 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు ఒకరిని ఫేస్బుక్ పట్టిచ్చింది. 2004లో ఎల్డియాబ్లో రియానో అనే క్రిమినల్ ఒహియోలోని బార్లో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోయాడు. అప్పటి నుంచి రియానో పోలీసుల మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.తాజాగా ఫేస్బుక్ చూస్తున్న అమెరికా పోలీసులకు మెక్సికోలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి రియానో పోలికలకు దగ్గరగా ఉండటాన్ని గమనించారు. ఇంకేముంది వెళ్లి చూస్తే ఆ పోలీసు అధికారి రియానో అని తేలింది. దీంతో వెంటనే అతడిని అరెస్టు చేసి అమెరికాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడిని సిన్సినాటిలోని బట్లర్ కౌంటీ జైలులో ఉంచారు. -
మెక్సికో డ్రగ్ లార్డ్ అరెస్ట్
వాషింగ్టన్: మెక్సికోలో మాదకద్రవ్యాల వ్యాపారంతో వేలకోట్ల రూపాయల నేరసామ్రాజ్యాన్ని విస్తరించిన డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడా గార్షియా ఎట్టకేలకు అమెరికా పోలీసులకు చిక్కాడు. 76 ఏళ్ల జంబాడా వాస్తవానికి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అతనికి తెలీకుండా చాకచక్యంగా ప్రైవేట్ విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేశారు. గురువారం టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో సిటీ శివారులోని చిన్న ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన అదే విమానంలో ఉన్న డ్రగ్ లార్డ్ ఎల్‌చాపో కుమారుడు జోక్విన్ ‘ఎల్ చాపో’ గుజ్మాన్(38)నూ పోలీసులు అరెస్ట్‌చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. దశాబ్దాలుగా జంబాడా అరెస్ట్‌కోసం అమెరికా ప్రయతి్నస్తోంది. అతని జాడ చెప్తే రూ.125 కోట్ల నజరానా ఇస్తామని గతంలో ప్రకటించింది. ‘అమెరికాలోకి వందల కోట్ల డాలర్ల విలువైన ఫెంటానిల్, మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మాదకద్రవ్యాల మత్తులో ముంచేసిన నేరానికి వీరికి కఠిన శిక్ష పడనుంది’ అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ అన్నారు. రియల్ఎస్టేట్ వ్యాపార నిమిత్తం వెళ్తున్నామని అబద్దం చెప్పి జంబాడాను జోక్విన్ గుజ్మానే విమానం ఎక్కించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అత్యంత హింసాత్మక, శక్తివంత ‘ సినోలా కార్టెల్’ మాదకద్రవ్యాల అక్రమ తయారీ, ఎగుమతికి ప్రపంచ కేంద్రస్థానంగా నిలిచే మెక్సికోలో అత్యంత హింసాత్మక, శక్తివంతమైన డ్రగ్స్ ముఠాల్లో సినోలా కార్టెల్ కూడా ఒకటి. దీనిని ఎల్ చాపో గుజ్మాన్, జంబాడా, మరొకరు సంయుక్తంగా స్థాపించి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా అమ్మడం మొదలెట్టారు. వందల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన జాక్విన్ అర్చివాల్డో గుజ్మాన్ లోయెరా (ఎల్‌చాపో)ను 2019లో మెక్సికో ప్రభుత్వం అరెస్ట్‌చేసి అమెరికాకు అప్పగించడంతో అక్కడే జీవితకాలకారాగార శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో ఎల్ చాపో కుమారులు రంగంలోకి దిగి అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. అమెరికా సహా విదేశాలకు సరకు అక్రమ రవాణా మొత్తం జంబాడా కనుసన్నల్లో జరుగుతోంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులు చిక్కితే వారి తల నరకడం, చర్మం ఒలిచేయడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం వంటి హేయమైన నేరాలకు పాల్పడటం అక్కడి ముఠాలకు మామూలు విషయం. -
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ‘ఎల్ మయో’ అరెస్ట్
ఆస్టిన్: అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మెక్సికో డ్రగ్ లార్డ్ ఇజ్మాయెల్ ‘ఎల్ మయో’ జాంబాదా(76) ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. టెక్సాస్ ఎల్‌పాసోలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా న్యాయ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఎల్ మయోతో పాటు మరో డ్రగ్ కింగ్‌పిన్ అయిన ఎల్ చాపో కొడుకు లిటిల్ చాపోస్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రైవేట్ విమానంలో దిగిన వెంటనే ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ మయోతో పాటు వాకిన్ ‘‘ఎల్ చాపో’’ గుజ్మన్ కొడుకు, సినాలోవా కార్టెల్ డ్రగ్స్ మాఫియాకే చెందిన మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎల్ చాపోతో కలిసి మెక్సికో కులియాకాన్ సిటీలో డ్రగ్స్ సామ్రాజ్యం సినాలోవా కార్టెల్ స్థాపించాడు జాంబాదా. ఇది తర్వాతి కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద నేరసామ్రాజ్యంగా మారింది. అత్యంత ప్రమాదకరమైన ‘ఫెంటానిల్’ డ్రగ్స్ తయారీ, ఇతర దేశాలకు అక్రమ రవాణా, మరణాలకు కారణమయ్యాడనే తీవ్ర ఆరోపణలు జాంబాదాపై ఉన్నాయి.మరోవైపు.. అమెరికాలో 18-45 మధ్య వయస్కులు వందల సంఖ్యలో ‘ఫెంటానిల్’ బారినపడి మరణించారు. అమెరికా లక్ష్యంగా జాంబాదా డ్రగ్స్ రాకెట్ నడిపించాడని, తమ దేశ పౌరుల మరణాలకు కారణమయ్యాడని ఆ దేశ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నేరాభియోగాలు చేశారు. ఇప్పటికే ఎల్ చాపో(67) కొలరాడో జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని నలుగురు వారసులు లిటిల్ చాపోస్(నలుగురికీ ఒకే పేరు) ఆ డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారు. ఎల్ మయో, ఎల్ చాపో కొడుకు అరెస్ట్ కావడంతో అల్లర్లు జరగవచ్చని అమెరికా అప్రమత్తం చేయడంతో.. కులియాకాన్ అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. -
మెక్సికోలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
మెక్సికోలోని ఓ మద్యం ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జాలిస్కోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా పేలుడు సంభవించి, తరువాత ఫ్యాక్టరీ అంతటా మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర పౌర రక్షణ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రమాద వివరాలను తెలియజేసింది. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులంతా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని ఏజెన్సీ తెలిపింది. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో నిపుణులు ఉన్నారని రాష్ట్ర పౌర రక్షణ శాఖ డైరెక్టర్ విక్టర్ హ్యూగో రోల్డాన్ తెలిపారు. -
జైలులో క్రికెట్.. ఐసీసీ అవార్డు
క్రికెట్ వ్యాప్తికి చొరవ చూపడంతో పాటు గతేడాది (2023) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ "డెవలెప్మెంట్ అవార్డులతో" సత్కరించింది. ఈ అవార్డులను వివిధ విభాగాల్లో మెక్సికో, ఒమన్, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్, స్కాట్లాండ్ దేశాలు గెలుచుకున్నాయి. ఈ అవార్డుల కోసం మొత్తం 21 జట్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఐసీసీ ప్యానెల్ పైన పేర్కొన్న జట్లను ఎంపిక చేసింది.వంద శాతం మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించినందుకు గాను ఒమన్..పురుషుల క్రికెట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించినందుకు గాను నెదర్లాండ్స్..మహిళల క్రికెట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను యూఏఈ..డిజిటల్ మీడియాలో అభిమానులను ఎంగేజ్ చేయడంలో సఫలీకృతమైనందుకు గాను నేపాల్..క్రికెట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను స్కాట్లాండ్..జైలులో ఖైదీల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించినందుకు గాను మెక్సికో దేశాలు ఐసీసీ డెవలప్మెంట్ అవార్డులకు ఎంపికయ్యాయి. -
మెక్సికో నగరాల్లో మొసళ్ల సంచారం
మెక్సికో సిటీ: మెక్సికో దేశంలోని తీర ప్రాంత నగరాల్లో ఇటీవల మొసళ్ల సంచారం ఒక్కసారిగా పెరిగింది. సముద్ర తీరాల వెంబడి తక్కువ లోతు నీళ్లలో ఉండే మొసళ్లు ఇటీవలి వరుస తుపాన్లు, వరదలతో జనారణ్యంలోకి వచి్చపడుతున్నాయి. టాంపికో, సియుడాడ్ మడెరో, అల్టమిరా నగరాల్లో తిరుగుతూ ప్రజలను భయకంపితుల్ని చేసిన కనీసం 200 మొసళ్లను పట్టుకుని, వాటి ఆవాసాలకు తీసుకెళ్లి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. నీటి కొరత ఏర్పడినా, వరదలు వచి్చనా అవి ఇలా జనం మధ్యకు వచ్చేస్తుంటాయని, ఇదో సమస్యగా మారిందని అధికారులు అంటున్నారు. మెక్సికోలో మొసళ్లు రక్షిత జీవులు. అందుకే ప్రజలు చంపడానికి బదులుగా బంధించి అధికారులకు సమాచారమిస్తుంటారు. -
కీకారణ్యంలో.. మాయన్ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే?
దట్టమైన కీకారణ్యంలో పురాతన నగరం బయటపడింది. మెక్సికోలోని బాలంకు అభయారణ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రపాలజీ అండ్ హిస్టరీ శాస్త్రవేత్తలు అన్వేషణ జరుపుతుండగా, ఈ పురాతన మాయన్ నాగరికతకు చెందిన నగర శిథిలాలు బయటపడ్డాయి.ఇక్కడ ‘ఓకోమ్టున్’ అనే పురాతన శిలా స్థూపాలు, భారీ రాతి భవంతులు కనిపించాయి. చుట్టూ దట్టంగా భారీ వృక్షాలతో కూడిన అడవి ఉండటంతో ఈ నగరం ఇన్నాళ్లూ ఎవరికీ కనిపించలేదు. ఇది క్రీస్తుశకం 250–800 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ నగరం 123 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 50 అడుగుల ఎత్తున పిరమిడ్ నిర్మాణాలు, నివాస భవనాలు, బహిరంగ వేదికలు వంటివి ఉన్నాయి. ఈ వేదికలను మతపరమైన వేడుకల కోసం నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇవి చదవండి: వానల్లో వార్మ్‌గా, బ్రైట్‌గా.. ఉండాలంటే ఇలా చేయండి.. -
బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో తొలిమరణం.. డబ్ల్యూహెచ్ఓ యూటర్న్
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అంతలోనే యూటర్న్ తీసుకుంది. మరణించిన సదరు వ్యక్తిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, త్వరలో స్పష్టత ఇస్తామని వెల్లడించింది.ఇటీవల హెచ్5ఎన్2 బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి మరణించారని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.అయితే, మెక్సికో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 59 ఏళ్ల వ్యక్తికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య, టైప్ 2 డయాబెటిస్, దీర్ఘకాలిక రక్తపోటు సమస్య ఉందని అధికారిక ప్రకటన చేసింది.బాధితుడిలో ఇతర అనారోగ్య సమస్యలు ఏప్రిల్ 17న జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం, సాధారణ అస్వస్థత వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడానికి మూడు వారాల ముందు అనారోగ్యానికి గురయ్యాడు. అత్యవసర చికిత్స కోసం బాధితుడిని ఏప్రిల్ 24న మెక్సికోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రోజు మరణించాడు.బర్డ్ ఫ్లూ మరణం కాదుఈ తరుణంలో శుక్రవారం జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ మాట్లాడుతూ..ఈ మరణం పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల మరణించారని, హెచ్5ఎన్2కి సంబంధించిన మరణం కాదని చెప్పారు. బర్డ్‌ఫ్లూ గుర్తించాం.. అంతేవైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్ల కోసం పరీక్షలు చేయగా.. బాధితుడిలో హెచ్5 ఎన్2 వేరియంట్ గుర్తించామని లిండ్‌మీర్ చెప్పారు. అతనితో పరిచయం ఉన్న 17 మందికి టెస్ట్‌లు చేయగా నెగిటివ్‌గా తేలిందిత్వరలోనే స్పష్టత ఇస్తాంపరిశోధనలు కొనసాగుతున్నాయి. సెరోలజీ కొనసాగుతోంది. అంటే ముందుగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూడటానికి రక్త పరీక్ష అని లిండ్‌మీర్ చెప్పారు. అతనిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారించిన వెంటనే.. మరణంపై స్పష్టత ఇస్తామని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి లిండ్‌మీర్ పేర్కొన్నారు. -
మెక్సికో పీఠంపై మహిళ!
అపారమైన వనరులున్నా ఏనాడూ కంటి నిండా కునుకు లేని మెక్సికో ప్రజానీకం అధ్యక్ష ఎన్నికల్లో వరసగా రెండోసారి సైతం వామపక్ష మొరెనా పార్టీకి పట్టంగట్టారు. ఆరుపదుల వయసుగల యూదు మహిళ క్లాడియా షీన్బామ్ను అధ్యక్ష పీఠానికి ఎన్నుకున్నారు. రెండు శతాబ్దాల రిపబ్లిక్ చరిత్రలో మహిళ దేశాధినేత కావటం ఇదే ప్రథమం. జనాభాలో యూదులు అత్యల్ప సంఖ్యాకులు కావటం గమనించదగ్గది. వచ్చే అక్టోబర్‌లో ఆమె పదవీబాధ్యతలు చేపడతారు. ఆకలి,నిరుద్యోగం, డ్రగ్స్ విజృంభణ, వ్యక్తుల అదృశ్యం... ఒకటి కాదు, మెక్సికోను సవాలక్ష సమస్యలు పీడిస్తున్నాయి. అంతటా నిరాశా నిస్పృహలు అలుముకున్న తరుణంలో అంతవరకూవున్న రెండు పార్టీల వ్యవస్థను బద్దలుకొడుతూ మొరెనా పార్టీ రంగంలోకొచ్చింది. 2018లో ఆరేళ్లకాలానికి అధ్యక్షుడైన ఆండ్రస్ మ్యాన్యువల్ లొపెజ్ అబ్రడార్ (ఆమ్లో) ఆశించిన స్థాయిలో పాలించకపోయినా శాంతిభద్రతలను కాస్త అదుపు చేయగలిగారు. అదే సమయంలో సంక్షేమపథకాలు అందించటం, మౌలిక సదుపాయాలు పెంచటం మొరెనా పార్టీని రెండోసారి అందలం ఎక్కించింది. అలాగని అంతా సవ్యంగా ఉందని కాదు. ఏడాదికి సగటున 30,000 హత్యలు జరగటం, అందులో 90 శాతం మిస్టరీగా మిగిలిపోవటం మెక్సికో ప్రత్యేకత. ఈ హత్యల్లో డ్రగ్స్ మాఫియాల వాటాతోపాటు, వాటిని అదుపు చేసే సాకుతో పారా మిలిటరీ దళాలు సాగించే నరమేధమూ ఉంటుంది. మారుమూల పల్లెల్లో ఏదో ఒకచోట హఠాత్తుగా ఖననం చేసిన శవాల గుట్టలు లేదా మాదకద్రవ్యాల డంప్‌లు బయటపడతాయి. అమెరికాకు చాటుగా వలసదారుల తరలింపు మరో పెద్ద వ్యాపారం. మూడునెలలక్రితం అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండ ప్రాంత ఆవాసాలపై మాదకద్రవ్య ముఠాలు డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించి వందలాది పౌరులను హతమార్చటంతోపాటు ఇళ్లను దహనం చేశారు. గ్రామస్థులు తమ సమాచారం పారా మిలిటరీ దళాలకు చేరేస్తున్నారన్నది వారి అనుమానం. ఈ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా దాదాపు డజనుమంది అభ్యర్థుల్ని మాదకద్రవ్యాల ముఠా కాల్చిచంపింది. ఇన్ని సమస్యలతో సతమతమయ్యే దేశానికి అధ్యక్షురాలు కావటం నిజానికి కత్తి మీద సామే. చిత్రమేమంటే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆమె శాంతిభద్రతల అదుపు కోసం ఏం చేస్తానన్నది చెప్పలేదు. కానీ మెక్సికో నగర మేయర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు అక్కరకొస్తుందన్న ఆశ జనానికి ఉంది. నగరాన్ని సీసీ కెమెరాలతో నింపడం, నేరాలు తరచూ జరిగే ప్రాంతాల్లో నిరంతరం పోలీసు బలగాలను మోహరించటం వంటివి హత్యలను గణనీయంగా తగ్గించాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య వాస్తవాలను ప్రతిబింబించటం లేదన్నది విపక్షాల ఆరోపణ. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన 1968 నాటి విద్యార్థి ఉద్యమంతో సహా అనేక సామాజికోద్యమాల్లో పాల్గొన్న యూదు కుటుంబంలో జన్మించటం వల్ల అటు రాజకీయాలపైనా, ఇటు పర్యావరణంపైనా ఆమెకు ఆది నుంచీ ఆసక్తి. అందుకే ఆ రంగంలో ఆమె పీహెచ్డీ చేయటంతోపాటు క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో తన అధ్యయనాన్ని కొనసాగించి నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 2007లో నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్న శాస్త్రవేత్తల బృందంలో క్లాడియా ఒకరు. 2018లో తెరపైకొచ్చిన మొరెనా పార్టీ ఆమెను సహజంగానే ఆకర్షించింది. వెంటనే మెక్సికో మేయర్ పదవి కూడా వరించింది. ఆ పదవికి మహిళ ఎన్నిక కావటం కూడా అదే ప్రథమం. 31 రాష్ట్రాలూ, 13 కోట్ల జనాభాగల దేశంలో నేరాలను అరికట్టడం మెక్సికో నగరాన్ని దారికి తెచ్చినంత సులభం కాదు. చాలా రాష్ట్రాల్లో మాదకద్రవ్య ముఠాలు వాహన సముదాయాల్లో ఏకే–47 తుపాకులతో సంచరించటం, పోలీసులు సమాచారం అందుకుని వచ్చేలోపే హత్యాకాండ ముగించి నిష్క్రమించటం తరచు కనబడే దృశ్యాలు. తల్లిదండ్రుల ఆలనా పాలనాలేని పిల్లల్ని, యువతను చేరదీస్తామని వారిలో అమాయకంగా కనబడేవారికి ప్రాధాన్యమిచ్చి ఏళ్లతరబడి ఆయుధ శిక్షణ ఇచ్చి మాదకద్రవ్యాల పంపిణీకీ హత్యలకూ వినియోగిస్తామని మాదకద్రవ్య ముఠా నాయకుడొకరు చెప్పాడు. ఆ కోణంలో దృష్టి సారించి పాఠశాల విద్య నుంచే స్కాలర్షిప్లిచ్చే పథకాన్ని ఆమ్లో అమలుచేశారు. కానీ పెద్దగా ఫలించలేదు. ఇవన్నీ అంతర్గత సమస్యలు. పొరుగునున్న అమెరికాతో అనేక పేచీలున్నాయి. ఆ దేశంలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారన్న కథనాలు మెక్సికోకు ఇబ్బందిగానే ఉన్నాయి. ఆ దేశంనుంచి వలసలను అరికట్టడానికీ, మాదకద్రవ్యాలను కట్టడి చేయటానికీ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని గతంలో ట్రంప్ ప్రకటించి పని మొదలెట్టినా బైడెన్ వచ్చాక ఆగిపోయింది. మరోపక్క లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికాతో వాణిజ్యం నెరపే దేశాల్లో మెక్సికోయే నంబర్ వన్. అందువల్ల ఆ దేశాన్ని అంత సులభంగా అమెరికా వదులుకోలేదు. పైగా మెక్సికో పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే కార్ల విడిభాగాల వల్లే అమెరికాలోని డెట్రాయిట్లో కార్ల పరిశ్రమలు సజావుగా సాగుతున్నాయి. మెక్సికో పవన విద్యుత్‌తోనే అమెరికా తయారీరంగ పరిశ్రమలు లక్షలమంది అమెరికన్లకు ఉపాధినిస్తున్నాయి. హృద్రోగులకు వాడే పేస్మేకర్లు మొదలుకొని పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాల వరకూ చాలా భాగం మెక్సికో నుంచి రావాల్సిందే. అందుకే ఇరుదేశాల వాణిజ్యమూ నిరుడు 80 వేల కోట్ల డాలర్ల వరకూ సాగింది. కనుక నేరస్థముఠాలను అరికట్టి శాంతిభద్రతలు తీసుకురాగలిగితే మెక్సికో సుసంపన్న దేశాల్లో ఒకటై నిలుస్తుంది. క్లాడియా ఆ పని చేయగలరా అన్నదే పెద్ద ప్రశ్న. -
రైలుతో సెల్ఫీకి యత్నం.. చూస్తుండగానే ప్రాణం పోయింది
ఫొటోలు దిగడం సరదాకే అయినా.. ఒక్కోసారి ఆ సరదానే ఏమరపాటులో ప్రాణాలు పోయేందుకు కారణం అవుతోంది. స్మార్ట్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజుతో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లెందరినో చూస్తున్నాం. అలాంటి ఘటనలు చూశాక కూడా.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఆపడం లేదు చాలామంది. తాజాగా.. మెక్సికోలో ఓ యువతి అంతా చూస్తుండగానే.. సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి బయల్దేరి ఎంప్రెస్ అనే రైలు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తున్నారు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. పైగా అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తుంటారు. సోమవారం రైలు వెళ్తున్న టైంలో హిడాల్గో వద్ద ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024 -
మెక్సికోలో కొత్త చరిత్ర
మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమే కానున్నారు! షేన్‌బామ్‌కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్ అల్వారిజ్ మైనేజ్‌కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది. షేన్‌బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్‌బామ్ విజయంలో లోపెజ్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి. షేన్‌బామ్‌కు సవాళ్లెన్నో... షేన్‌బామ్ అక్టోబర్ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్‌బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.లా డాక్టోరా... షేన్‌బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్‌బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్‌గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్‌బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్‌బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. -
చలో మెక్సికో
మెక్సికోలో యాక్షన్ చేయనున్నారట ఎన్టీఆర్. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది.ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ మెక్సిక్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతుందని, దాదాపు పదిహేను దేశాల్లో చిత్రీకరణ జరిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
Mexico 2024 elections: మెక్సికో పీఠంపై తొలిసారి మహిళ!
మెక్సికో. లాటిన్ అమెరికాలో రెండో అతి పెద్ద దేశం. పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మహిళలపై హింస, హత్య, యాసిడ్ దాడులు నిత్యకృత్యం. మెక్సికోలో ఇదే అతి పెద్ద సమస్య కూడా. అలాంటి దేశంలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు! ఆదివారం జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు 128 మంది సెనేటర్, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు 20 వేల స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పాలక, ప్రధాన సంకీర్ణాలు రెండింటి నుంచీ మహిళలే బరిలో ఉండటం విశేషం. పాలక ‘మోరెనా’ సంకీర్ణం తరఫున పోటీ చేస్తున్న క్లాడియా షేన్‌బామ్ గెలుపు ఖాయమేనని పరిశీలకులు చెబుతున్నారు. నేషనల్ యాక్షన్ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్పై ఆమె కనీసం 20 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అన్ని సర్వేల్లోనూ తేలింది. మహిళలపై మితిమీరిన హింసకు పెట్టింది పేరైన ఆ దేశంలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కూడా నానాటికీ బాగా పెరుగుతుండటం విశేషం. దిగువ సభ (కాంగ్రెస్)లో అన్ని పారీ్టలూ మహిళలకు కనీసం 50 శాతం టికెట్లివ్వడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేశారు. ఫలితంగా కాంగ్రెస్‌లో సగం మంది సభ్యులు మహిళలే ఉన్నారు. మెM్సకో జనాభా 13 కోట్లు కాగా దాదాపు 10 కోట్ల మంది ఓటర్లున్నారు. ఆదివారం పోలింగ్ ముగిశాక రాత్రికల్లా ఫలితాలు వెలవడే అవకాశముంది.సోచిల్ గాల్వెజ్61 ఏళ్ల గాల్వెజ్ సెనేట్ సభ్యురాలు. పారిశ్రామికవేత్త. ఎన్ఏపీ, పీఆర్ఐ, పీఏఎన్, ఆర్పీడీ సహా పలు పారీ్టలతో కూడిన విపక్ష కూటమి తరఫున బరిలో ఉన్నారు. లోపెజ్ ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం వంటివాటిని తాను కూడా కొనసాగిస్తానని చెబుతూ పలు వర్గాలను ఆకట్టుకున్నారు. దాంతోపాటు మధ్య, దిగువ తరగతి ప్రజల కోసం సార్వత్రిక సామాజిక రక్షణ వ్యవస్థ తెస్తానంటున్నారు. పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచి నేరాలపై ఉక్కుపాదం మోపుతానని చెబుతున్నారు.క్లాడియా షేన్‌బామ్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. 2007లో నోబెల్ గ్రహీత. మెక్సికో సిటీ మాజీ మేయర్. గెలిస్తే తొలి అధ్యక్షురాలిగానే గాక యూదు మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించే అవకాశముంది. అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్కున్న విశేషమైన జనాదరణ ఉన్నా రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగ ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యరి్థగా షేన్‌బామ్ బరిలో దిగారు. కనీస వేతనాలను రెట్టింపు చేయడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల పెంపు, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి వంటివి నేరుగా నగదు రూపంలో చెల్లించడం, సీనియర్ సిటిజన్లకు సార్వత్రిక పెన్షన్ సదుపాయం వంటివాటితో లోపెజ్ తన ఆరేళ్ల పదవీకాలంలో అందరి మన్ననలు పొందారు. ఇదంతా 61 ఏళ్ల షేన్‌బామ్‌కు బాగా కలిసి రానుంది. డ్రగ్ మాఫియా, వ్యవస్థీకృత నేరాలు మెక్సికో ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనవి. వీటి కట్టడికి లోపెజ్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. తాను వాటిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె చెబుతున్నారు. లోపెజ్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆయన ప్రభావానికి అతీతంగా పాలిస్తానంటున్నారు.జార్జే అల్వారిజ్ మైనేజ్ రాజకీయాలకు కొత్త ముఖం. స్మాల్ సిటిజన్ మూవ్మెంట్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. డ్రగ్స్‌ను నిర్మూలించడం అసాధ్యమని, వాటిని బాగా కట్టడి చేస్తానని చెబుతున్నారు. 38 ఏళ్ల మైనేజ్ ప్రతిపాదించిన పలు ఆర్థిక సంస్కరణలపై ప్రజల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఈసారి గెలవకపోయినా మున్ముందు మెక్సికో రాజకీయాల్లో ఆయన ప్రబల శక్తిగా ఎదగడం ఖాయమంటున్నారు.