క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు.. 16 మంది మృతి | 12 Killed In Shooting At Pre Christmas Party In Mexico | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు.. 16 మంది మృతి

Dec 18 2023 9:16 PM | Updated on Dec 18 2023 9:19 PM

12 Killed In Shooting At Pre Christmas Party In Mexico - Sakshi

మెక్సికోలో దారుణం జరిగింది. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రాంలోని సాల్వటియెర్రా నగరంలో జరిగింది. 

నగరంలో కిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో హాజరైన వ్యక్తులపై ఆరుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. కాల్పులు జరిపిన వ్యక్తులను వేడుకకు ఆహ్వానించలేదని, అయినప్పటికీ పార్టీకి వచ్చిన వారిని ప్రశ్నించడంతో కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు కాల్పులు జరిపారు.  

ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement