Christmas celebration
-
గోత్ థీమ్‌తో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్న శ్రుతీ హాసన్
స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసన్ క్రిస్మస్(Christmas) సీజన్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటానికి సిద్ధమైంది. ఈ సెలబ్రేషన్స్ ద్వారా కొత్త సంవత్సరాదిని సరికొత్త ఉత్సుకతలో ప్రారంభించటానికి ఆమె అడుగులు వేస్తున్నారు. క్రిస్మస్ పండుగను శ్రుతీ హాసన్ తనదైన శైలిలో జరుపుకోవటానికి సెలబ్రేషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా గోత్ థీమ్‌తో క్రిస్మస్ను సెలబ్రేట్ చేయటానికి తన స్టైల్‌ను జోడించింది.శ్రుతీ హాసన్(Shruti Haasan), తనదైన స్టైల్లో యూనిక్‌గా నిర్వహిస్తోన్న క్రిస్మస్ పండుగ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రత్యేకమైన శైలిలో హాలీడే సీజన్‌కు స్వాగతం పలుకుతూ ఆమె అభిమానులు సహా అందిరలోనూ ఆనందాన్ని నింపింది.ఇక సినిమాల విషయానికి వస్తే 2023 శ్రుతీ హాసన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ ఏడాదిగా చెప్పొచ్చు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, సలార్ పార్ట్ 1 చిత్రాలు విడుదలై ఘన విజయాలను సాధించాయి.కానీ ఈ ఏడాది మాత్రం ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే అభిమానులు మాత్రం 2025లో సరికొత్త చిత్రాల్లో ఆమెను చూడొచ్చు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా మూవీ కూలీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సలార్ 2 చిత్రం కూడా వచ్చే ఏడాదిలో సందడి చేయనుందని సమాచారం.ఇవి కాకుండా మరిన్న క్రేజీ చిత్రాల్లో శ్రుతీ హాసన్ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె తన అద్భుతమైన నటనతో అభిమానులు సహా ప్రేక్షకులను మెప్పించనున్నారు. -
కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఆర్ట్ ఫుల్.. ఫెస్టివల్..
క్రిస్మస్ అంటే దయా, కరుణల జన్మదినం. ఇచ్చి పుచ్చుకోవడంలోని ఆనందం. అంతేనా.. క్రిస్మస్ అంటే కళాత్మకత కూడా అని నిరూపిస్తున్నారు సిటిజనులు. క్రీస్తు జన్మదినానికి కొన్ని రోజుల ముందుగానే నగరంలో మొదలయ్యే వేడుకలు ఆద్యంతం కళాత్మకతకు అద్దం పడతాయి. పండుగ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఇటు వైవిధ్యానికీ అటు సృజనాత్మకతకు పెద్దపీట వేస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ చెట్టు, ఇతర అలంకరణలకు సంబంధించిన సందడి నెల రోజుల ముందునుంచే మొదలవుతుంది.. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు.. క్రిస్మస్ ముందు రాత్రి సమయంలో వచి్చ, అనుకోని విధంగా మంచి పిల్లలకు మాత్రమే బహుమతులు పంచే శాంటాక్లాజ్ పాత్రకు నేపథ్యం చర్చిఫాదర్ సెయింట్ నికోలస్ అని చరిత్ర చెబుతోంది. క్రిస్మస్ వేడుకల కోసం శాంటాక్లాజ్లను తయారు చేయడంలో నగరంలో వివిధ రకాల కొత్త పద్ధతులు, గెటప్స్ పుట్టుకొస్తూన్నాయి. ఎరుపు రంగు దుస్తుల్లో పొడవైన తెల్లని గెడ్డం, క్యాప్... ఈ మూడూ ప్రధానంగా తీసుకుని, మిగిలిన గెటప్స్కూ సృజనాత్మకతను జోడిస్తూ వెరైటీ ‘శాంటా’లను సృష్టిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నారు. పండుగ బీట్.. డిజైనర్ ‘ట్రీ’ట్.. దాదాపు 15వ శతాబ్దపు ప్రాంతంలో క్రిస్మస్ రోజున కుటుంబ సభ్యులు తామే చెట్లు తయారు చేసి దాని చుట్టూ పరస్పరం ఇచ్చి పుచ్చుకునే బహుమతులను ఉంచేవారట. చిన్నా పెద్దా దాని చుట్టూ ఆడిపాడేవారట. వీటిని యులె ట్రీ అని కూడా పిలిచేవారట. అలా ఇది ఒక సంప్రదాయంగా స్థిరపడింది. సాధారణంగా ఈ చెట్టును పీవీసీతో లేదా ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. నగరంలో క్రిస్మస్ ట్రీ రూపకల్పనకు ఆకాశమే హద్దు అన్నట్టు డిజైనర్ ట్రీలు వచ్చేస్తున్నాయ్ ‘రెండు వారాల కిందటే కాలనీలో క్రిస్మస్ ట్రీని తయారు చేశాం. రోజుకో అలంకరణ జత చేస్తున్నాం. పండుగ రోజున దీన్ని అనూహ్యమైన రీతిలో అలంకరించి అందరినీ థ్రిల్ చేయనున్నాం’ అని కూకట్పల్లి నివాసి జెఫ్రీ చెప్పారు. ఎత్తు విషయంలోనూ ఇంతింతై అన్నట్టుగా.. క్రిస్మస్ ట్రీలు 3 నుంచి 30 అడుగుల వరకూ చేరుకున్నాయి. ‘సగటున మేం రోజుకు 20 క్రిస్మస్ చెట్లు అమ్ముతున్నాం. రూ.1000 నుంచి రూ.3000 వరకూ ధర ఉండేవి బాగా అమ్ముడవుతున్నాయి’ అని సికింద్రాబాద్‌లోని ఓ షాపు యజమాని చెప్పారు.స్టార్.. సూపర్.. అవతారపురుషుని రాకకు చిహ్నంగా ముందుగా ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉద్భవించింది. అందుకే ఈ వేడుకల్లో స్టార్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రమార్గం అంటే దేవుని మార్గం. దేవుని వైపు దారి చూపించేదిగా దీన్ని భావిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నగరంలో రకరకాల లైట్ల వెలుతురులో మెరిసిపోయే స్టార్స్ క్రిస్మస్ సందడిని రెట్టింపు చేస్తున్నాయి.ప్రేమ సందేశమే ప్రధానం.. ఈ పండుగ వేడుకల్లో ప్రధానమైన శాంతాక్లజ్, ట్రీ, క్రిబ్.. వంటివన్నీ పండుగ విశిష్టతకు, సేవాభావపు ఔన్నత్యానికి అద్దం పట్టేవే. వీటిని నగరంలో ఎవరికి నచ్చినట్టు వారు అందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచిదే అయినా ఆయా విశేషాలు అందించే ప్రేమ సందేశాలను కూడా తెలుసుకోవడం, తెలియజెప్పడం అవసరం అంటున్నారు సికింద్రాబాద్‌లోని అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ ఉడుముల బాలÔౌరి.విశేషాల క్రిబ్.. వెరైటీలకు కేరాఫ్ ఏసు జని్మంచిన స్థలానికి సంబంధించిన విశేషాలను తెలియపరిచే క్రిబ్.. 1223లో తొలిసారి సెయింట్‌ఫ్రాన్సిస్ అనే వ్యక్తి రూపకల్పన చేశాడంటారు. దీనినే నేటివిటీ సీన్ లేదా మ్యాంగర్ సీన్ వంటి పేర్లతోనూ పిలుస్తారు. పశువులపాకలో ఏసు పుట్టాడనేదానికి సూచికగా దీనిని అందంగా ఏర్పాటు చేస్తుంటారు. పలు జంతువులతో పాటు పేదలు, రాజులు ఇలా అందరూ ఉండే చోట కొలువుదీరేలా దీన్ని నెలకొల్పే విధానం ఆకట్టుకుంటుంది. గడ్డిని తెచ్చి పాకను వేసి చిన్నారి క్రీస్తును కొలువుతీర్చి.. ఇలా చక్కగా డిజైన్ చేసే క్రిబ్ నగర క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. క్రిస్మస్ రోజుల్లో దాదాపు ఒకటి రెండు రోజుల పాటు సమూహాలుగా ఈ క్రిబ్ తయారీలో పాల్గొనడం కూడా చాలా మందికి నచ్చే విషయం. -
Christmas Celebrations: హిమాచల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సిమ్లా: క్రిస్మస్ వేడుకల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితికి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మనాలి-రోహ్తంగ్ హైవేపై అటల్ టన్నెల్ వైపు వెళ్లే మార్గాలు కార్లతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో పోలీసులు డ్రోన్‌తో నిఘా పెట్టారు. సరిపడా పార్కింగ్ సౌకర్యాలు లేకపోవటం, వాహనాల రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా మంది పర్యాటకులు పార్కింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో ప్రయాణం.. ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తి లాహౌల్‌లో రోడ్డు మార్గం కాకుండా నది గుండా కారులో ప్రయాణించాడు. ఇలాంటి ప్రమాదకర ప్రయాణం చేయరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Video of tourist driving car in Chandra river in #Lahaul, Himachal goes viral, please do not expose yourself by doing such useless act. pic.twitter.com/kgLsbvnp3s — Nikhil Choudhary (@NikhilCh_) December 25, 2023 సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదీ చదవండి: యేసుక్రీస్తు బోధనలు దేశాభివృద్ధికి మార్గనిర్దేశం: ప్రధాని మోదీ -
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: యేసుక్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి యేసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. "యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ఆయన అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తుంచుకోవడానికి ఇది ఒక సందర్భం. దయ, సేవ ఆదర్శాలతో ఆయన జీవించారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన కృషి చేశారు. ఈ ఆదర్శాలు మన దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయి." అని ప్రధాని మోదీ అన్నారు. ప్రసంగంలో భాగంగా పోప్‌ను కలిసిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: Christmas: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు -
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్, కుటుంబ సభ్యులు
-
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు మెదక్ చర్చ్ సిద్ధం
-
సెక్యులర్ ప్రభుత్వంతోనే మత సామరస్యం
సాక్షి, హైదరాబాద్: సెక్యులర్ ప్రభుత్వాల పాలనలోనే మత సామరస్యం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కేంద్రంలో తిరిగి సెక్యులర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ జి.ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలసి రేవంత్ పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పాలనలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు. ‘‘డిసెంబర్లో తెలంగాణలో మిరాకిల్ జరుగుతుందని నేను ముందుగానే చెప్పాను. మొన్న హిమాచల్, నిన్న కర్ణాటక, నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును అన్ని వర్గాల ప్రజలు కోరుకోవాలి.. అని పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటా.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చివరి లబ్ధిదారు వరకు అందించే దిశగా పాలన సాగిస్తామని రేవంత్ చెప్పారు. తామంతా పాలకుల మాదిరి కాకుండా సేవకుల్లా పనిచేస్తామని.. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఆ దిశగానే గడీలను బద్దలుకొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించామని.. వారంలో రెండ్రోజులు ప్రజావాణి వింటున్నామని చెప్పారు. మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రజల్లోకి వచ్చిన తాను ఇప్పటివరకు ప్రజలతోనే ఉన్నానని, ఇకపైనా నిత్యం ప్రజల్లోనే ఉంటానని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మైనార్టీలు ఎన్నో ప్రార్థనలు చేశారని, ఇప్పుడు దేశంలోనూ కొత్త ప్రభుత్వం కోసం అదే తరహాలో ప్రార్థనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని సీఎం రేవంత్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ, బిషప్‌లు పాల్గొన్నారు. -
ఈ క్రిస్మస్కి సింపుల్ అండ్ స్పెషల్ గిఫ్ట్స్ ఏవో తెలుసా..!?
'మరికొద్దిరోజుల్లో జరుపుకోనున్న క్రిస్మస్కు దాదాపు ప్రపంచమంతా ఆతృతగా రెడీ అయి΄ోతోంది. షాపింగ్ మాల్స్ నుంచి క్రిస్టియన్ లోగిళ్లు, చర్చ్‌లు.. క్రిస్మస్ స్టార్లు, ట్రీల అలంకరణతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. వీటితో΄ాటు తప్పనిసరిగా సందడి చేసేవి శాంతాక్లాజ్ ఇచ్చే బహుమతులు. శాంతాక్లాజ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కోసం పిల్లలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పిల్లలేగాక, కొన్ని కంపెనీలు సైతం ఉద్యోగులకు, కొంతమంది బంధువులకు, స్నేహితులకు, సహోద్యోగులకు సర్ప్రైజ్గిప్ట్స్ను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి క్రిస్మస్కు తక్కువ బడ్జెట్లో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా నిలిచే బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..' మొక్కలు పర్యావరణం పచ్చగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే పర్యావరణ స్నేహితం అయిన పచ్చని మొక్కలను క్రిస్మస్కు బహుమతిగా ఇవ్వొచ్చు. ఇప్పుడున్న ఇరుకు ఇళ్లకు ఇండోర్ ΄్లాంట్స్ అయితే మరింత మంచి గిఫ్ట్ అవుతాయి. గిఫ్ట్‌కార్డ్స్, స్పా వోచర్స్ మార్కెట్లో రకరకాల ఫ్యాషన్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏవైనా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. స్పా వోచర్స్ కూడా మంచి గిఫ్ట్సే. మ్యాచింగ్ పీజేఎస్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నప్పేలా మ్యాచింగ్ క్రిస్మస్ పైజమాలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి ప్రత్యేకంగానూ, ఫన్నీగా ఉండి పండుగ సందడిని మరింత పెంచుతాయి. బుక్స్.. మార్కెట్లో ΄ాపులర్గానూ, బాగా సేల్ అవుతున్న నవలలు, క్లాసిక్ సాహిత్యం, ప్రేరణ కలిగించే పుస్తకాలు, ఆర్ట్, ఫొటోగ్రఫీ, ట్రావెల్‌కు సంబంధించిన కాఫీ టేబుల్ బుక్స్కూడా మంచి బహుమతులు. ఈ గిఫ్ట్ ఎక్కువకాలం నిలిచి ఉంటుంది. పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ఇమిటేషన్ జ్యూవెలరీ, ట్రెండీ అండ్ స్టైలిష్ ఫ్యాషన్ యాక్సరీస్ (వాచ్‌లు, సన్‌గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్), ఫొటో ఆల్బమ్స్, ఫ్రేమ్స్ కూడా క్రిస్మస్ గిఫ్ట్‌గా పనికొస్తాయి. ఇవి పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. సెల్ఫ్‌కేర్ చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎక్కువమంది వింటర్లో చర్మాన్ని కోమలంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కాబట్టి వింటర్ స్కిన్ కేర్ ఉత్పత్తుల సెట్స్‌ను బహుమతిగా ఇవ్వొచ్చు. ఇవేగాక..సెంటెడ్ క్యాండిల్స్, ఫేస్‌మాస్క్‌లు, స్లీపింగ్ మాస్కులు, బాతింగ్ కిట్స్ మంచి గిఫ్ట్స్. పెర్ఫ్యూమ్స్.. పెర్ఫ్యూమ్స్ క్లాసిక్గానూ, అందుబాటు ధరలో దొరికే గిఫ్ట్ ఐటమ్స్. పెర్ఫ్యూమ్ వాడిన ప్రతిసారి .. ఆ సువాసన భరిత పరిమళాలు మీ గిఫ్ట్‌తో΄ాటు మిమ్మల్ని, మీ అభిమానాన్ని గుర్తుచేస్తాయి. మ్యూజిక్ బాక్స్ చార్మింగ్ లిటిల్ మ్యూజిక్ బాక్స్ కూడా ప్రత్యేకంగానూ ఫన్నీగా ఉంటుంది. ఇది కూడా క్రిస్మస్కు మంచి గిఫ్ట్. దీనినుంచి వచ్చే సంగీతం మనసుని ఆహ్లాద పరుస్తుంది. అందమైన మగ్స్ ఉద్యోగులకు లేదా కొలీగ్స్‌కు అందంగా ఉండే మగ్స్ మంచి గిఫ్ట్ ఐడియా. ఈ మగ్స్లో స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడం లేదా, ఇష్టమైన కాఫీ తాగడం లేదా తరచూ వాడే ఐటమ్స్, అందమైన వస్తువులను పెట్టుకుంటారు. ఇవి తక్కువ ధరలో మంచి మంచి డిజైన్స్‌లో కూడా దొరుకుతాయి. ఎయిర్ ప్యూరిఫైర్.. ఎంతవేగంగా అభివృద్ధి చెందుతున్నామో అంతేస్పీడుగా గాలి కలుషితమై΄ోతున్న ఈ రోజుల్లో.. ఎయిర్ ప్యూరిఫయర్స్, ఫిల్టర్స్ అవసరంగా మారి΄ోతున్నాయి. అందుకే మినీ ప్యూరిఫయర్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. వీటిద్వారా మీ సన్నిహితులకు మంచి ఆక్సిజెన్‌ను అందించిన వారవుతారు. డెకరేషన్ ఐటమ్స్ అలంకరించేకొద్దీ ఇంటి అందం పెరగడంతో΄ాటు.. కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాఫీ, టీసెట్స్, కుకింగ్ గాడ్జెట్స్, కిచెన్ టూల్స్, సెంటెడ్ క్యాండిల్స్ ఆర్ట్ వర్క్ హోం డెకరేటివ్ ఐటమ్స్ కూడా మంచి గిఫ్ట్స్. చిన్న పరిమాణం నుంచి పెద్దసైజులో ఎంతో ఆకర్షణీయమైన, ఉపయోగకరమైనవి అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. క్రాఫ్ట్స్ మేకింగ్ కిట్స్ జ్యూవెలరీ తయారీ, క్యాండిల్ తయారీ, సబ్బుల తయారీ కిట్స్, వెరైటీ దియా మేకింగ్ కిట్స్, ΄్లాంట్ టెర్రారియం, గార్డెనింగ్ సెట్స్ కూడా మంచి బహుమతులే. వీటిలో ఏది బహుమతిగా ఇచ్చినా మీరు మీ ఆత్మీయుల సంతోషాన్ని చూరగొంటారు. ఇవి కూడా చదవండి: ప్రపంచ చీరల దినోత్సవం! 'చీర' అందమే అందం! -
సెమీ క్రిస్మస్ వేడుకలకు భారీ ఏర్పాట్లు
-
క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికోలో దారుణం జరిగింది. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రాంలోని సాల్వటియెర్రా నగరంలో జరిగింది. నగరంలో కిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో హాజరైన వ్యక్తులపై ఆరుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. కాల్పులు జరిపిన వ్యక్తులను వేడుకకు ఆహ్వానించలేదని, అయినప్పటికీ పార్టీకి వచ్చిన వారిని ప్రశ్నించడంతో కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
న్యూజెర్సీలోని సాయి దత్తపీఠంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పరిసరాల్లోని ప్రజలు ఈ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. -
Viral Video: అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి మృతి
అమెరికన్లు క్రిస్మస్ పండుగ సంబరాల్లో మునిగిన వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ పరేడ్‌పైకి ఓ వ్యక్తి వేగంగా కారుతో దూసుకెళ్లడంతో ఐదుగురు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో 40 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అమెరికాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. క్రిస్మస్ పండగకి ముందు పరేడ్‌ను నిర్వహించడం ఆనవాయితీ. అమెరికాలోని విస్కన్‌సిస్ రాష్ట్రంలో మిల్వాకీ శివారులోని వాకీషా టౌన్లో భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ పరేడ్‌ని నిర్వహిస్తున్నారు. వందల మంది వరుసలో పాటలు పాడుకుంటూ నెమ్మదిగా రోడ్డుపై ర్యాలీగా వెళ్తున్నారు. వేల మంది రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఆ పరేడ్ తిలకిస్తున్నారు. ఇంతలో హటాత్తుగా ఎరుపురంగులో ఉన్న ఒక ఎస్యూవీ కారు పరేడ్‌పైకి దూసుకెళ్లింది. వరుసలో నడుస్తున్న వారిని ఢీ కొట్టి ముందుకు వెళ్లింది. దీంతో ఘటనా స్థలిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ⚠️ Warning Graphic Images⚠️ I can’t imagine living in America and not able to have parades anymore cause of lunatics. 😞#Waukesha #Wisconsin pic.twitter.com/lYCUFM8j34 — 💎𝓒𝓪𝓻𝓪𝓶𝓮𝓵 𝓢𝔀𝓮𝓮𝓽𝓷𝓮𝓼𝓼❄️ (@Caramel_Angel7) November 22, 2021 ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదానికి కారణమైన ఎస్యూవీ డ్రైవరును పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక ఉగ్రకోణం ఏమైనా ఉందా అనే దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
అనంతపురంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్
-
సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
-
సఖ్యతకు తరుణం
తెగిపోయిన అనుబంధాల్ని ఈ ‘క్రిస్మస్’ రోజు పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువులతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలంటే తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్!! దేవుడు తన అద్వితీయ కుమారుడైన, తనకు మానవ రూపమైన యేసుక్రీస్తు సారథ్యంలో నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించ తలపెట్టిన ‘దైవిక రాజ్యం’ ఆవిష్కరణకు అలనాటి యూదా దేశం (నేటి ఇజ్రాయేలు దేశంలోని దక్షిణ భూభాగం) లోని బేత్లెహేము వేదికగా రంగమంతా సిద్ధమయ్యింది. అంతటి మహత్తరమైన పరిణామానికి రెండువేల ఏళ్ల క్రితం, యూదయ అనే ఒక ఎడారి ప్రాంతాన్ని, తరుచు క్షామాలకు లోనయ్యే అక్కడి బెత్లేహేము అనే పేద గ్రామాన్ని, యేసుక్రీస్తుకు ఇహలోకపు తల్లిదండ్రులుగా యూదా వంశీయుడైన యోసేపు, లెవీ వంశీయురాలైన మరియ అనే నిరుపేదలను, యేసు ఆవిర్భావ సువార్త ప్రచారకులుగా బేత్లెహేముకే చెందిన కొందరు నిరుపేద గొర్రెల కాపరులను, దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా ఏర్పర్చుకున్నాడు. పెను విషాదమేమిటంటే, పుడమినేలేందుకు వచ్చిన పరలోకపు రాజైన యేసుకు ఎక్కడ చూసినా పేదరికం, దారిద్య్రమే తాండవించే యూదయ దేశపు బెత్లేహేములో, అక్కడి సత్రంలోనైనా కనీసం కాసింత చోటు దొరకలేదు. అందువల్ల అక్కడి పశువుల కొట్టంలోనే ప్రభువు జన్మించాడు, పశువులు దాణా తాగేందుకు వాడే ఒక పశువుల తొట్టి ఆయనకు మెత్తటి పూలపాన్పుగా పనికొచ్చింది. మునుపటి రాజ్యానికి భిన్నంగా.. నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరాశ్రయులే ప్రధాన పౌరులుగా ఏర్పాటుచేయ తలపెట్టిన దైవిక రాజ్యాన్ని.. ఇలా పేదరికంలోనే దేవుడు నిర్మించ తలపెట్టాడు. దైవిక రాజ్యస్థాపన కోసం యేసుక్రీస్తు ప్రధాన సైన్యాధికారిగా, పేదలు, బలహీనులే ఆయనకు విధేయులైన సైన్యంగా గత రెండువేల ఏళ్లుగా సాగుతున్న సమరంలో రక్తపుటేరులు కాదు.. ప్రేమ, క్షమాపణ అనే జీవనదులు పొంగి పారుతున్నాయి. చరిత్రలో దుర్నీతి, దౌర్జన్యం, దుష్టన్యాయమే ఇతివృత్తంగా సాగి నిరుపేదల దోపిడీ కి పెద్దపీట వేసిన సామ్రాజ్యాలకు ప్రత్యామ్నాయంగా ప్రభువు తన దైవిక రాజ్య స్థాపన కోసం ‘్రౖకైస్తవాన్ని’ తన సాత్విక ఆయుధంగా ఎంచుకున్నాడు. క్రీస్తు సారథ్యంలోని ‘క్రైస్తవం’ దేవుని రాజ్యానికి ప్రతీక. అందువల్ల అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి, ఆడంబరాలకు, ధనాపేక్షకు అతీతంగా క్రీస్తును పోలి జీవించే వారే క్రైస్తవం లో పౌరులు. మరి దీనికంతటికీ భిన్నంగా బోధిస్తూ, జీవిస్తూ ఉన్నవాళ్లు ఎవరు? యేసుప్రభువు పరిభాషలో చెప్పాలంటే, వాళ్లు గోధుమల మధ్య ‘శత్రువు’ కుట్రతో పెరుగుతున్న ‘గురుగులు’ (మత్తయి 13:27)!! శత్రువులు రెండు రకాలు. ఎదురుగా నిలబడి మనతో యుద్ధం చేసే శత్రువు ఒకరైతే, దొంగచాటు దెబ్బలతో మనిషిని పడగొట్టే శత్రువు మరొకరు. చెట్లతో కిక్కిరిసి ఉన్న కీకారణ్యంలో నడిచే బాటసారులను, వేటగాళ్లను కింద గడ్డిలో దాక్కొని అకస్మాత్తుగా మడిమె మీద కాటేసి చంపే విషసర్పం లాంటి వాడు ‘సైతాను’ అని పిలిచే ఈ శత్రువు. గోధుమల మధ్య గురుగులు విత్తే అలవాటున్న శత్రువు.. కుటుంబాల్లో, చర్చిల్లో, చివరికి క్రైస్తవ సమాజంలో, మానవ సంబంధాల్ని కలుషితం చేసి చిచ్చు పెట్టడంలో దిట్ట. అందుకే ఈ ‘క్రిస్మస్’ లో తెగిపోయిన అనుబంధాల్ని పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువు లతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలాంటి తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
-
పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్
సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే ఇంటి నుంచి నేరుగా సీఎస్ఐ చర్చికి చేరుకుని కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ బెన్హర్బాబు క్రిస్మస్ విశిష్టతతోపాటు బైబిల్లోని దైవ సందేశాన్ని వివరించారు. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్‌తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్సార్ సోదరి విమలమ్మ, వైఎస్ జగన్ మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, చిన్నాన్న, పెదనాన్నలు వివేకానందరెడ్డి, సుధీకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.పురుషోత్తంరెడ్డి, వైఎస్ జగన్ సోదరులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం చర్చిలో అందరూ పెద్దఎత్తున కరతాళ ధ్వనులు చేస్తుండగా ఎస్.పురుషోత్తంరెడ్డి, ప్రకాష్‌రెడ్డితో వైఎస్ జగన్ క్రిస్మస్ కేక్ కట్ చేయించారు. -
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
పులివెందుల: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులు పులివెందుల సీఎస్ఐ చర్చ్‌లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రైస్తవులకు ట్విట్టర్ ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. Wishing you, your family and friends a Merry Christmas. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2016 -
అవనికి అందం క్రిస్మస్ ట్రీ
క్రిస్మస్ వేడుకలో చెట్టు అలంకరణ ముచ్చటగా ఉంటుంది. క్రిస్మస్ చెట్టు, రకరకాల బొమ్మలతో, పూలతో, మెరుపుల అలంకరణతో ఆకర్షణీయంగా ఉంటుంది. నిజానికి ఇప్పుడు క్రైస్తవ దేశాలన్నీ క్రిస్మస్ చెట్టు అలంకరణను వేడుకలో భాగం చేసినప్పటికీ, మొదట్లో దీనికి అంత ఆమోదం లభించలేదు. పాత నిబంధనలోనే క్రిస్మస్ చెట్టు ప్రస్తావన ఉంటుందని చెబుతారు. కానీ 19వ శతాబ్దానికి గానీ ఈ చెట్టు ప్రపంచమంతా విస్తరించలేదు. ఒక పచ్చని చెట్టును నరికి తెచ్చి ఇంటిలో అలంకరించుకోవడం ఇష్టం లేక, ఇది దేవతారాధన సంప్రదాయం కలిగిన మత చిహ్నం కావడం (పాగన్ రెలిజియన్) వల్ల మొదటి దశలో క్రిస్మస్ చెట్టు పెట్టే సంప్రదాయానికి వ్యతిరేకత ఉండేది. ఇప్పటికీ కొన్ని క్రైస్తవ రాజ్యాలలో మాత్రమే క్రిస్మస్ చెట్టును అలంకరించే అలవాటు కనిపిస్తుంది. ప్రాచీన రోమన్లు క్రిస్మస్ చెట్టు ఏర్పాటు చేసి, దానిని 12 కొవ్వొత్తులతో అలంకరించే సంప్రదాయాన్ని పాటించేవారు. ఆ అంకె వారి ఇష్టదైవం. సూర్యునికి ప్రతీక. ఇంకా చెట్టు నిండా పలు రకాల దేవతా మూర్తులను అలంకరించేవారు. అందులో ‘బాచుస్ దేవత’ కచ్చితంగా ఉండేది. అంటే భూమిని సారవంతం చేసే దేవత. ఇంతకీ అసలు ఈ చెట్టు మొదట ఎక్కడ ఏర్పాటైంది? వేయేళ్ళ క్రితం జర్మనీలోనే ఈ సంప్రదాయం మొదలైందని చెబుతుంటారు. సెయింట్ బోనిఫేస్ అనే ప్రచారకుడు దీనిని ఆరంభించాడు. జర్మనీకి క్రైస్తవాన్ని పరిచయం చేసిందీ ఆయనే. అయితే ఆ తర్వాత ఈ సంప్రదాయం కొంతకాలం మరుగునపడ్డా, తిరిగి జర్మనీలోనే మళ్లీ ఆదరణ పొందింది. ఆధునిక చరిత్ర ప్రకారం 16 శతాబ్దం నుంచి జర్మనీలో ఈ సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ దీనిని పారా డెయిస్ బామ్ (ప్యారడైజ్ ట్రీ) అని పిలుచుకునేవారు. డిసెంబర్ 24న ఒక ఓక్ చెట్టు శాఖను తెచ్చి అలంకరిస్తారు. అదే క్రిస్మస్ చెట్టు. మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి ఇంగ్లండ్‌లో కూడా ఈ సంప్రదాయానికి అంతగా ప్రాచుర్యం లేదు. ప్రిన్స్ అల్బర్ట్, ఆయన భార్య విక్టోరియా మహారాణిల కాలంలో, అంటే 1840లోనే అక్కడ క్రిస్మస్ చెట్టు ప్రత్యక్షమైంది. ఇందుకు కారణం– అల్బర్ట్ జర్మన్ జాతీయుడు. ఆ యుద్ధకాలంలో తమ ట్రెంచ్‌లలో జర్మన్ సైనికులు క్రిస్మస్ చెట్లు అలంకరిస్తే, అవేమిటో ఇంగ్లిష్ సైనికులకు అర్థం కాలేదు. ఆఖరికి అమెరికాలో కూడా 1850 వరకు ఈ చెట్టుకు అంత ప్రాధాన్యం లేదు. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ పియర్స్ (1804–1869) మొదటిసారి శ్వేత సౌధంలో క్రిస్మస్ చెట్టును అనుమతించాడు. తర్వాత మెల్లగా ఈ సంప్రదాయం ప్రపంచమంతా పాకింది. -
నేటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన
-
విల్లామేరి సంభరాల ఝరి
-
పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
24న ఇడుపులపాయలో కుటుంబసభ్యులు, బంధువులతో ప్రత్యేక ప్రార్థనలు ► 25న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న వైఎస్ జగన్ ► మండల ఉపాధ్యక్షుడి కుటుంబసభ్యులకు పరామర్శ ► కడప, ప్రొద్దుటూరులలో పలు కార్యక్రమాలకు హాజరు ► 26న పీబీసీ నీటి విషయమై ధర్నా పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పులివెందుల చేరుకున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. వైఎస్ జగన్ పర్యటన వివరాలను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 24వ తేదీన ఉదయం 9గంటలకు పులివెందులలోని వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పదో వార్షికోత్సవ వేడుకలలో పాల్గొంటారు. 9.30కు పులివెందులలోని వీజే ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు రామట్లపల్లె భాస్కర్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా 10 గంటలకు ఇడుపులపాయకు చేరుకొని అక్కడ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కాసేపు మాట్లాడతారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. అక్కడ నుంచి 2 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని అక్కడ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కడపకు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 25వ తేదీ ఉదయం 8.30కు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు వేంపల్లె మండలం అలవలపాడు గ్రామానికి చేరుకుని ఇటీవల ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన మండల ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. 5.30కు కడపలో కార్పొరేటర్ మక్బుల్ నివాసానికి చేరుకొని ఆయన కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి పులివెందులకు చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం 9.30కు పీబీసీ నీటి విషయమై పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో పాల్గొంటారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. -
రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన
-
యూరప్‌లో మొదలైన క్రిస్మస్ వేడుకలు
-
పిల్లలతో భల్లాలదేవ..
-
క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి
సెమీక్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి బోనకల్: క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ శాంతినిలయంలో శనివారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మైపన్పాల్ బిషప్తో కలసి ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి, క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో మూడుసార్లు లేవనెత్తానన్నారు. కేంద్రం సున్నితంగా ఈ అంశాన్ని పక్కనపెట్టిందని, అయినప్పటికీ చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఏసుక్రీస్తు లోకరక్షకుడని, దేశం సుభిక్షంగా ఉండేందుకుగాను ప్రభువు దీవెనలు అందిస్తున్నారన్నారు. -
క్రిస్మస్ ట్రీ: జగానికి జర్మనీ కానుక
క్రిస్మస్ వేడుకలో చెట్టు అలంకరణ ఎంతో ముచ్చటగా ఉంటుంది. రకరకాల పరిమాణాలలో ఉండే క్రిస్మస్ చెట్టు, రకరకాల బొమ్మలతో, పూలతో, మెరుపుల అలంకరణతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక వేడుకలో కనిపించే కళాత్మక దృష్టికి ఈ చెట్టు నిదర్శనంగా ఉంటుంది. నిజానికి ఇప్పుడు క్రైస్తవ దేశాలన్నీ క్రిస్మస్ చెట్టు అలంకరణను వేడుకలో భాగం చేసినప్పటికీ, మొదట్లో దీనికి అంత ఆమోదం లభించలేదు. నిజానికి పాత నిబంధనలోనే క్రిస్మస్ చెట్టు ప్రస్తావన ఉంటుందని చెబుతారు. కానీ రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొని 19వ శతాబ్దానికి గానీ ఈ చెట్టు ప్రపంచమంతా విస్తరించలేదు. ఒక పచ్చని చెట్టును నరికి తెచ్చి ఇంటిలో అలంకరించుకోవడం ఇష్టం లేక, ఇది దేవతారాధన సంప్రదాయం కలిగిన మత చిహ్నం కావడం (పాగన్ రెలిజియన్) వల్ల మొదటి దశలో క్రిస్మస్ చెట్టు పెట్టే సంప్రదాయానికి వ్యతిరేకత ఉండేది. ఇప్పటికీ కొన్ని క్రైస్తవ రాజ్యాలలో మాత్రమే క్రిస్మస్ చెట్టును అలంకరించే అలవాటు కనిపిస్తుంది. చెట్టును కొట్టడం, కొంతవరకు పాగన్ మతాల లక్షణాలు కనిపించడ మే ఇందుకు కారణం. ప్రాచీన రోమన్లు క్రిస్మస్ చెట్టు ఏర్పాటు చేసి, దానిని 12 కొవ్వొత్తులతో అలం కరించే సంప్రదాయాన్ని పాటించేవారు. ఆ అంకె వారి ఇష్టదైవం. సూర్యునికి ప్రతీక. ఇంకా చెట్టు నిండా పలు రకాల దేవతా మూర్తులను అలంకరించేవారు. అందులో ‘బాచుస్ దేవత’ కచ్చితంగా ఉండేది. అంటే భూమిని సారవంతం చేసే దేవత. ఇంతకీ అసలు ఈ చెట్టు మొదట ఎక్కడ ఏర్పాటైంది? వేయి సంవత్సరాల క్రితం జర్మనీలోనే ఈ సంప్రదాయం మొదలైందని చెబుతుంటారు. సెయింట్ బోనిఫేస్ అనే ప్రచారకుడు దీనిని ఆరంభించాడు. జర్మనీకి క్రైస్తవాన్ని పరిచయం చేసింది కూడా ఆయనే. అయితే ఆ తర్వాత ఈ సంప్రదాయం కొంతకాలం మరుగున పడినప్పటికీ తిరిగి జర్మనీలోనే మళ్లీ ఆదరణ పొందింది. ఆధునిక చరిత్ర ప్రకారం 16 శతాబ్దం నుంచి జర్మనీలో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ దీనిని పారా డెయిస్ బామ్ (ప్యారడైజ్ ట్రీ) అని పిలుచుకునేవారు. డిసెంబర్ 24న ఒక ఓక్ చెట్టు శాఖను తెచ్చి అలంకరిస్తారు. అదే క్రిస్మస్ చెట్టు. మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి ఇంగ్లండ్‌లో కూడా ఈ సంప్రదాయానికి అంతగా ప్రాచుర్యం లేదు. ప్రిన్స్ అల్బర్ట్, ఆయన భార్య విక్టోరియా మహారాణిల కాలంలో, అంటే 1840లో మాత్రమే అక్కడ క్రిస్మస్ చెట్టు ప్రత్యక్షమైంది. ఇందుకు కారణం- అల్బర్ట్ జర్మన్ జాతీయుడు. ఆ యుద్ధకాలంలో తమ ట్రెంచ్‌లలో జర్మన్ సైనికులు క్రిస్మస్ చెట్లు అలంకరిస్తే, అవేమిటో ఇంగ్లిష్ సైనికులకు అర్థం కాలేదు. ఆఖరికి అమెరికాలో కూడా 1850 వరకు ఈ చెట్టుకు అంత ప్రాధాన్యత కలగలేదు. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ పియర్స్ (1804-1869) మొదటిసారి శ్వేత సౌధంలో క్రిస్మస్ చెట్టును అనుమతిం చాడు. తర్వాత మెల్లగా ఈ సంప్రదాయం ప్రపంచమంతా పాకింది. -
టికెట్ దొరికి ఉంటే.... మృత్యువు తప్పేది
సాక్షి, బెంగళూరు:సెలవుల్లో క్రిస్మస్ వేడుకను తమ వారితో కలిసి గడిపేందుకు నగరానికి వచ్చారు. క్రిస్మస్ వేడుకలు పూర్తై అనంతరం ఆదివారం రాత్రే చెన్నైకి బయలుదేరి వెళ్లాలనుకున్నారు. కానీ విధి రాత వేరేలా ఉంది. ఆ కుటుంబానికి ఆదివారం సాయంత్రం ట్రైన్‌కి టికెట్లు లభించలేదు. దీంతో వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఎలాగో ప్రయాణం వాయిదా పడింది కదా అని బంధువులతో కలిసి సరదాగా బయటికి వచ్చారు. అయితే వారికేం తెలుసు మృత్యువు ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి వెనకాలే వస్తోందని, బంధువులతో కలిసి సరదాగా ఫన్‌జోన్‌కు వెళ్లాలనుకుంటుండగానే బాంబు రూపంలో ఆమెను మృత్యువు కబళిం చింది. అలా మృత్యువుకు బలైన మహిళే భవాని. ఆదివారం సాయంత్రం రైలుకే కనుక వారికి టికెట్లు లభించి ఉంటే ఈ దురదృష్టకర ఘటన జరిగి ఉండేది కాదని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాలు...చెన్నై నగరానికి చెందిన భవాని(38) క్రిస్మస్సెలవుల కారణంగా నగరంలోని దొడ్డమావళ్లిలోని తన బంధువుల ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు చెన్నైలో పాతటైర్ల వ్యాపారాన్ని నిర్వహించే భర్త బాలన్(37), పిల్లలు భరత్(13), లక్ష్మీదేవి(11)సైతం నగరానికి వచ్చారు. క్రిస్మస్ వేడుకల అనంతరం తిరిగి ఆదివారం సాయంత్రం చెన్నైకి వెళ్లాలని భావించినా, టికెట్లు లభించక పోవడంతో ప్రయాణాన్ని సోమవారానికి వాయిదా వేసుకున్నారు. దీంతో తన బంధువులతో కలిసి చర్చ్స్ట్రీట్కు చేరుకొని ఎంపైర్ హోటల్ వద్ద తమ కారును నిలిపి ఇదే ప్రాంతంలోని ఓ ప్లేజోన్‌కు వెళుతుండగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో బాంబుకు సమీపంలో నడుస్తున్న భవాని తలలోకి లోహపు పదార్థాలు బలంగా వెళ్లి గుచ్చుకున్నాయి. దీంతో ఆమె మెదడులో తీవ్ర రక్తస్రావమై భవానీ మృతి చెందారు. భవానీ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా భవానీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించింది. -
మెదక్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు