వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి నుంచి జిల్లాలో పర్యటిస్తారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి 24వ తేదీన ఉదయం 9గంటలకు పులివెందులలోని వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పదో వార్షికోత్సవ వేడుకలలో పాల్గొంటారు. 9.30కు పులివెందులలోని వీజే ఫంక్షన్ హాల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రామట్లపల్లె భాస్కర్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా 10 గంటలకు ఇడుపులపాయకు చేరుకొని అక్కడ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కాసేపు మాట్లాడతారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. అక్కడ నుంచి 2 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని అక్కడ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.