ఢిల్లీ: యేసుక్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి యేసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడారు.
"యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ఆయన అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తుంచుకోవడానికి ఇది ఒక సందర్భం. దయ, సేవ ఆదర్శాలతో ఆయన జీవించారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన కృషి చేశారు. ఈ ఆదర్శాలు మన దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయి." అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రసంగంలో భాగంగా పోప్‌ను కలిసిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: Christmas: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు
Comments
Please login to add a commentAdd a comment