‘అహ్లాన్‌ మోదీ’లో మార్పులు.. కారణమిదే! | PM Narendra Modi UAE Visit Ahlan Modi Event | Sakshi
Sakshi News home page

Ahlan Modi: ‘అహ్లాన్‌ మోదీ’లో మార్పులు.. కారణమిదే!

Published Tue, Feb 13 2024 9:14 AM | Last Updated on Tue, Feb 13 2024 9:14 AM

PM Narendra Modi UAE Visit Ahlan Modi Event - Sakshi

యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఫిబ్రవరి 13) పాల్గొనబోయే ‘అహ్లాన్‌ మోదీ’ కార్యక్రమాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా కుదించారు. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ‘అహ్లాన్‌ మోదీ’ కార్యక్రమంలో పలు మార్పులు చేశారు.

అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోయే బహిరంగ కార్యక్రమం గురించి అధికారి సజీవ్ పురుషోత్తమన్ మాట్లాడుతూ ప్రతికూల వాతావరణం కారణంగా  35 వేల మంది హాజరయ్యేందుకు మాత్రమే ఏర్పాట్లు చేయగలుగుతున్నామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 60 వేల మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరి కోసం 500లకు పైగా బస్సులను నడుపుతున్నామన్నారు. వెయ్యిమంది వాలంటీర్లు తమ సేవలను అందిస్తారని తెలిపారు. యూఏఈలో ప్రధాని ఈ నెల 13, 14 తేదీలలో పర్యటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement