programme
-
‘2023 ఓజీ40’ : గ్రహశకలాన్ని గుర్తించిన బాలుడు
నాసా వారి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్(ఐఏడీపీ)లో ఇద్దరు క్లాస్మెట్లతో కలిసి పాల్గొన్న 14 సంవత్సరాల దక్ష్ మాలిక్ అంగారక గ్రహం, బృహస్పతిల మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మధ్య గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దీని కోసం ఆస్ట్రోనామికా అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నాడు.హార్డిన్ సిమన్స్ యూనివర్శిటికి చెందిన డాక్టర్ పాట్రిక్ మిల్లర్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. తాత్కాలికంగా ఈ గ్రహశకలానికి ‘2023 ఓజీ40’ అని నామకరణం చేశారు. త్వరలో మాలిక్ పెట్టబోయే పేరే ఈ గ్రహశకలానికి శాశ్వతంగా ఉండిపోతుంది. గ్రహశకలానికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడానికి నాసాకు నెలల సమయం పడుతుంది. ఆ తరువాత దానికి పేరు పెడతారు.ఇదీ చదవండి: Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మాలిక్ ‘శివనాడర్ స్కూల్’లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి మాలిక్‌కు అంతరిక్షం అంటే ఇష్టం. గ్రహాలు, సౌరకుటుంబం గురించి నేషనల్ జియోగ్రాఫిక్‌లో వచ్చిన డాక్యుమెంటరీలన్నీ చూసేవాడు. ఐఏడీపీలో ప్రతి సంవత్సరం ఆరువేలమందికి పైగాపాల్గొంటారు. వారిలో కొందరు కొత్త గ్రహశకలాలని కనుక్కోవడంలో విజయం సాధించారు. ‘ఐఏడీపీ’ వెబ్సైట్ ప్రకారం గ్రహశకలాన్ని కనుగొన్న ఆరవ భారతీయ విద్యార్థి దక్ష్ మాలిక్. ‘ఈ అన్వేషణ నాకు సరదాగా అనిపించింది. గ్రహశకలం కోసం వెదుకుతున్నప్పుడు నాసాలో పనిచేస్తున్నట్లు అనిపించింది. నా కల నిజమైంది’ అంటున్నాడు ఆనందంగా దక్ష్ మాలిక్.చదవండి : కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్ -
‘జ్ఞాపకాలు..అనుభవాలు ఎంతో మధురం’
సోలాపూర్: ‘సాధారణంగా పిల్లలు ఆడుకుంటే పెద్దలు చూసి సంతోషిస్తారు. కానీ ఈరోజు మేం ఆటపాటలతో గడుపుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరచడం మాకెంతో ఆనందాన్నిచ్చింది’ అని పలువురు సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం ఆధ్వర్యంలో‘బాల్యం అనుభూతులు నెమరు వేసుకోవడం‘అనే పేరుతో సీనియర్ మహిళలు, బాలల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. తమకు పెళ్లిళ్లై 35 నుంచి 40 సంవత్సరాలు పూర్తయ్యాయని, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు , మనవళ్లు, మనవరాళ్ళు ఇలా అందరినీ మరిచి ఈ వయసులో మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కల్పించినందుకు పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. శ్రీ మార్కండేయ సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీ శంకర్ కొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సఖీ సంఘం అధ్యక్షురాలు మేఘ ఇట్టం ముందుగా ప్రాస్తావికోఉపన్యాసం చేస్తూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని గురించి వివరించారు. పద్మ కమల్ ప్రతిష్టాన్ వ్యవస్థాపకుడు గోపీకృష్ణ వడ్డేపల్లి తన చిన్ననాటి జ్ఞాపకాలను అందరితో పంచుకోగా, దయానంద్ కొండ బత్తిని,స్నేహల్ శిందే , ఛత్రపతి అఖేన్, తదితరులు తాము చిన్ననాడు ఆడిన ఆటల గురించి, తమ అనుభవాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్ పోటీ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళలు, పురుషుల బృందాలకు పద్మావతి సంఘ, రేణుక చింత, మంజుల ఆడం, కళ చెన్నపట్నం, వనిత సురా, పద్మ మేడిపల్లి తదితరులు బహుమతులను అందజేశారు. -
యానిమేషన్ రంగంలో దూసుకుపోతున్న భారత్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రతిసారిలాగే ఈ కార్యక్రమంలోనూ తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలోని 115వ ఎపిసోడ్ నేడు ప్రసారమయ్యింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ‘భారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నదని చెబుతూ, నేటి మన్ కీ బాత్‌లో ధైర్యం, దూరదృష్టి కలిగిన ఇద్దరు గొప్ప హీరోల గురించి చర్చిస్తాను. సర్దార్ పటేల్ 150వ జయంతి అక్టోబర్ 31న జరగనుంది. బిర్సా ముండా 150వ జయంతి నవంబర్ 15న జరగనుంది. ఈ ఇద్దరు మహానుభావుల ముందున్న సవాళ్లు భిన్నమైనవి. అయినా వారి దృష్టి ఒక్కటే.. అదే దేశ సమైక్యత అని ప్రధాని పేర్కొన్నారు.నా జీవితంలో మరచిపోలేని క్షణాలు ఏవి అని మీరు నన్ను అడిగితే, చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే వీటిలో ఒకటి చాలా ప్రత్యేకమైనది. అది గత ఏడాది నవంబర్ 15న బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా నేను ఆయన జన్మస్థలమైన జార్ఖండ్‌లోని ఉలిహతు గ్రామానికి వెళ్లాను. ఈ ప్రయాణం నాపై చాలా ప్రభావం చూపిందని మోదీ అన్నారు.ఛోటా భీమ్లాగా మన ఇతర యానిమేషన్ సిరీస్ కృష్ణ, మోటు-పత్లు, బాల్ హనుమాన్లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేటెడ్ పాత్రలు, చలనచిత్రాలు వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్నాయి. యానిమేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా భారతదేశం ముందుకు సాగుతోంది. భారతీయ క్రీడలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్నాయి. భారత్‌లో సృజనాత్మక శక్తి ఉప్పొంగుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియా’ అనేవి యానిమేషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.10 సంవత్సరాల క్రితం, భారతదేశంలో సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని ఎవరైనా చెప్పినప్పుడు, చాలా మంది దానిని నమ్మలేదు. పైగా ఎగతాళి చేసేవారు. కానీ నేడు దేశం సాధించిన విజయాన్ని చూసి.. వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఒకప్పుడు రక్షణ పరికరాలను అత్యధికంగా కొనుగోలు చేసిన భారతదేశం నేడు 85 దేశాలకు వాటిని ఎగుమతి చేస్తోంది. అంతరిక్ష సాంకేతికతలో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరకు చేరిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ -
వన్ స్టేట్.. వన్ కార్డు
సాక్షి,హైదరాబాద్: ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ నగరంలోని 24 నియోజకవర్గాల్లోని ఒక్కో కాలనీలోనూ సర్వే జరుగుతోంది. ఇంతకీ ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డు కోసం జరుపుతున్న సర్వేలో ఏమేం సేకరిస్తారు? దీని వల్ల ప్రయోజనమేమిటి? తదితర అంశాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం వ్యక్తిగత గుర్తింపుగా ఎక్కడైనా ఆధార్‌ను అంగీకరిస్తున్నారు. కానీ ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ఎలాంటి కార్డులు లేవు. ఈ ఫ్యామిలీ కార్డుల ద్వారా కుటుంబాన్ని గుర్తించవచ్చు. అంటే రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ‘వన్ స్టేట్– వన్ కార్డ్’గా ఈ కార్డు ఉపకరిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి కార్డులున్నాయి. రాజస్థాన్‌లో జన్ ఆధార్ స్కీమ్ కింద 10 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీలు, 11 అంకెలతో కూడిన వ్యక్తిగత ఐడీలు ఇచ్చారు. హరియాణాలో పరివార్ పెహచాన్ పాత్ర (పీపీపీ) కింద 8 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీ కార్డులిచ్చారు. కర్ణాటకలో 12 అంకెలతో కూడిన ‘కుటుంబ’ ఐడీలను జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 12 అంకెలతో కూడిన డిజిట్ ఫ్యామిలీ కార్డును వినియోగిస్తున్నారు. అక్కడ రేషన్కార్డుగా దాన్నే వినియోగిస్తున్నారు. వ్యక్తిగత ఐడీలు.. తెలంగాణలో కుటుంబాన్ని ఒక యూనిట్‌గా గుర్తించేందుకు ఫ్యామిలీకార్డు ఉపకరిస్తుంది. కుటుంబంలోని అందరికీ ఒకే ఐడీ నంబర్ ఉండటంతో పాటు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా వేర్వేరు ఐడీలిస్తారు. కుటుంబాల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా దేశంలోని అందరికీ ఆధార్ కార్డులిచ్చినట్లే రాష్ట్రంలోని అందరికీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తారు. కుటుంబంలోని మహిళల్లో పెద్ద వారిని కుటుంబ పెద్ద(హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ)గా గుర్తిస్తారు. వ్యక్తిగత ఐడీలు జారీ అయ్యాక మారవు. శాశ్వతంగా అవే ఉంటాయి. కుటుంబంలోని కుమారుల పెళ్లిళ్లు జరిగి కోడళ్లు వస్తే కుటుంబంలో కొత్త సభ్యులుగా చేర్చేందుకు, మరణించిన వారిని తొలగించేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం చిన్న కుటుంబాలుగా విడిపోతే కొత్త కుటుంబంగా అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుటుంబం మొత్తం కలిసి ఉన్న ఫొటో తీసుకుంటారు. నగరంలో 8వ తేదీ వరకు సర్వే జరిపి, 9న స్రూ్కటినీ చేసి 10వ తేదీన ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఒకే చోట అన్ని వివరాలు.. ప్రస్తుతం ఒక కుటుంబంలోని వారు వివిధ పథకాల కింద వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నప్పటికీ ఆ వివరాలు ఒకే చోట లేవు. ఈ డిజిటల్ కార్డులు వచ్చాక అన్ని వివరాలు ఒక్క మౌజ్ క్లిక్‌తో తెలియనున్నాయి. ప్రభుత్వానికి చెందిన 30 శాఖల సమాచారం సంబంధిత శాఖల ఉంది తప్ప ఒకదానికొకటి అనుసంధానంగా లేవు. కొత్త కార్డుల వల్ల ప్రజలకెదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయని, ఈ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ పనుల ప్రారం¿ోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సీఎం రిలీఫ్‌ఫండ్‌తో సహ ఒక కుటుంబం ఏ పథకాలు వినియోగించుకుంటుందో తెలుస్తుందన్నారు. అంతేకాదు.. హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా గతంలో చేయించుకున్న ఆరోగ్యపరీక్షల వంటి వివరాలు కూడా ఉండటం వల్ల మరోసారి ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. -
వచ్చాడు గెలిచాడు!
తుమ్ ముజేనా యూ బచానా పావోవే’... రఫీ పాడిన ఈ పాటను ఏడేళ్ల అవిర్భవ్ వేదిక మీద పాడుతుంటే అందరికీ కన్నీరు వచ్చింది. ఇంత బాగా పాడిన ఈ బుడతడిని సోనిలో సూపర్‌స్టార్ సింగర్ సీజన్ 3 (మార్చి 2024 నుంచి ఆగస్టు 2024 వరకు) చూసిన వారెవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అందుకే మొత్తం 11 మంది ఫైనలిస్ట్‌లలో తమ ఓటింగ్ ద్వారా అవిర్భవ్నే విజేతగా నిలిపారు.పది లక్షల రూపాయల బహుమతి వచ్చేలా చూశారు. జడ్జిల చాయిస్‌గా అధర్వ బక్షి అనే మరో చిన్నోడు విజేతగా నిలిచినా ఈ సీజన్లో సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం అవిర్భవే. చిన్నగా కోమలమైన ఆకారంతో ఉన్నప్పటికీ అవిర్భవ్ రేంజ్ చాలా గొప్పది. కేరళకు చెందిన అవిర్భవ్ తన సోదరి అనిర్విన్య దగ్గర రెండేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకున్నాడు.తెలుగు షోస్‌లో కూడా పాల్గొన్నాడు. కాని ఇపుడు సూపర్‌స్టార్ సింగర్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతమయ్యాడు. అర్జిత్ సింగ్ ఇతడి ఫేవరెట్ సింగర్. పెద్దయ్యాక గాయకుణ్ణి అయ్యి సల్మాన్, షారుక్‌ఖాన్‌లకు పాడతానని అంటున్నాడు అవిర్భవ్.ఇవి చదవండి: ఆమె గొంతుక.. మన గుండెల్లో..! -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
‘అహ్లాన్ మోదీ’లో మార్పులు.. కారణమిదే!
యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఫిబ్రవరి 13) పాల్గొనబోయే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా కుదించారు. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో పలు మార్పులు చేశారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోయే బహిరంగ కార్యక్రమం గురించి అధికారి సజీవ్ పురుషోత్తమన్ మాట్లాడుతూ ప్రతికూల వాతావరణం కారణంగా 35 వేల మంది హాజరయ్యేందుకు మాత్రమే ఏర్పాట్లు చేయగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 60 వేల మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరి కోసం 500లకు పైగా బస్సులను నడుపుతున్నామన్నారు. వెయ్యిమంది వాలంటీర్లు తమ సేవలను అందిస్తారని తెలిపారు. యూఏఈలో ప్రధాని ఈ నెల 13, 14 తేదీలలో పర్యటించనున్నారు. -
నేడు ప్రధాని మోదీ ఒడిశా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు(శనివారం) ఒడిశాలో పర్యటించనున్నారు. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా వేదిక చుట్టూ డ్రోన్ కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం ఝార్సుగూడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్పూర్ వెళతారు. జగదీష్పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బీడీపీఎల్)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి ఊర్జా గంగ కింద రూ.2,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానిస్తుంది. అదేవిధంగా ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లోని నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 2,660 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడనుంది. అలాగే దాదాపు రూ. 28,980 కోట్ల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
నేడు అయోధ్యలో ఏ సమయానికి ఏం జరగనుంది?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మరికొద్ది సేపట్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రత కల్పించారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోలను అయోధ్య అంతటా మోహరించారు. డ్రోన్లతో అయోధ్య అంతటా నిఘా కొనసాగుతోంది. నేడు అయోధ్యకు మొత్తం 7,140 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో పాటు జరిగే కార్యక్రమాల వివరాలివే.. దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం. అయోధ్యలో ప్రముఖంగా వెలుగొందుతున్న వంద ప్రదేశాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు. యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ప్రదర్శనలు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలకు చెందిన 200 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు. రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చడం. కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం. #WATCH | Ayodhya, Uttar Pradesh: Morning visuals from Ram Janmabhoomi premises ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/qIRiYVgnei — ANI (@ANI) January 22, 2024 నూతన రామాలయంలో నేటి మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. అంటే 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ నేపధ్యంలో ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు. -
నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి?
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడు రోజులుగా జరుగుతున్న రామ్‌లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు ఐదో రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. 2020, ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు. అయోధ్యలో ఈరోజు(శనివారం) జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగినది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈరోజు రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ధి చేసి, వాస్తు శాంతి, ‘అన్నాధివాసం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠనాలు జరగనున్నాయి. పంచదారలో, పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు. ఇది కూడా చదవండి: 400 కేజీల తాళానికి 30 కిలోల చెవి! ఆరో రోజున అంటే ఆదివారంనాడు రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ ఉత్సవం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. -
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: యేసుక్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి యేసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. "యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ఆయన అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తుంచుకోవడానికి ఇది ఒక సందర్భం. దయ, సేవ ఆదర్శాలతో ఆయన జీవించారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన కృషి చేశారు. ఈ ఆదర్శాలు మన దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయి." అని ప్రధాని మోదీ అన్నారు. ప్రసంగంలో భాగంగా పోప్‌ను కలిసిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: Christmas: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు -
ఏపీ ఇంట.. ఈ–వంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్‌పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది. కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్‌స్టవ్‌లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఈ–కుక్కర్‌తో ఆరోగ్యం.. ‘ఎన్‌ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్‌లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు. ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా.. ‘ఈఈఎఫ్‌పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీపై అందించనున్నారు. రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఏపీ ముందుకు రావడం అభినందనీయం వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్‌లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్ఎల్ -
వాహనాలు ఢీకొనకుండా ఆటోమేటిక్ బ్రేకులు
అమరావతి: రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కార్లు, ఇతర వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా చేసేందుకు సరికొత్త టెక్నాలజీని వాడేందుకు నిర్ణయించింది. ‘వెహికల్ టు ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్) అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీని ముందుగా కార్లలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ భద్రతా ప్యానల్ కేంద్రానికి నివేదించింది. భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రాంలో స్థానం దేశం మొత్తమ్మీద 2021లో 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిల్లో దాదాపు 1,53,972 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రహదారి భద్రత కోసం వీ2ఎక్స్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. ‘న్యూ కార్ ఎసెస్మెంట్ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్)లో చేర్చింది. అంటే ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్లకు భద్రతా రేటింగ్స్ నిర్ణయించేటప్పుడు ఈ టెక్నాలజీని ప్రమాణికంగా తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ రహదారి భద్రతా ప్యానల్ 58 పేజీల నివేదికను సమర్పించింది. ఈ టెక్నాలజీని దేశంలో తయారు చేసే కార్లలో ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర రవాణా, టెలీ కమ్యూనికేషన్ల శాఖల ఉన్న తాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. వీ2ఎక్స్ ఎలా పని చేస్తుందంటే... కార్ల తయారీలో అంతర్భాగంగా ఈ టెక్నాలజీని అమలు చేస్తారు. ఇది వైఫై ఆధారంగా ఇది పనిచేస్తుంది. తగినంత దూరం నుంచే రహదారిపై ఎదురుగా, పక్కన, వెనుక ఉన్న వాహనాలను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రోడ్లపై రద్దీ, రోడ్డు పక్కన పాదచారుల విషయంలోనూ ఈ టెక్నాలజీ నిత్యం గమనిస్తూ వాహనదారులను హెచ్చరిస్తుంది. టోల్ గేట్లు, రోడ్డు మలుపులు, యూటర్న్లు, ప్రమాద హెచ్చరిక బోర్డుల గురించి ముందుగానే సమాచారమిస్తుంది. వాహనాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తే ఆటోమేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేసి ఆ వాహనాలు నిలిచిపోతాయి. ప్రస్తుతం కార్లు, ఎస్‌యూవీలలో ఉన్న భద్రతా ఫీచర్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు భావిస్తున్నారు. -
నారా లోకేష్‌కి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అంశాన్ని జనాల్లో నానుతూ ఉండేలా చేయాలని టీడీపీ ఎంత ప్రయత్నిస్తున్నా.. అన్ని ఫెయిల్ అవుతున్నాయి. టీడీపీకి ప్రజలు మరోసారి షాక్ ఇచ్చారు. లోకేష్ పిలుపును జనాలు పట్టించుకోకపోవడంతో ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చంద్రబాబుకు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం చేపట్టింది. రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల వరకు తాళ్లు, గుడ్డ, రిబ్బన్లతో సంకెళ్ల వేసుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి నామమాత్రం కూడా స్పందన లేదు. ఇళ్లల్లో నుంచి బయటికి రాని ప్రజలు.. బాల్కనీలో కూడా కనిపించలేదు. బాబు అరెస్టుపై లోకేష్ మాటలను విశాఖ నగర వాసులు లెక్కచేయలేదు. అవినీతి పరులకు సంఘీభావం ఏమిటంటూ జనాలు నవ్వుకుంటుకున్నారు. ఇప్పటికే అట్టర్ ప్లాప్ మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి న్యాయానికి సంకెళ్లు సంఘీభావ కార్యక్రమాలు. స్వయంగా అచ్చెంన్నాయుడు పాల్గొన్న కార్యక్రమంలో కనీసం 50 మంది టీడీపీ కార్యకర్తలు కూడా కనిపించలేదు. చదవండి: పురందేశ్వరి ‘సిండికేట్’ రాజకీయం -
Live: వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్ సన్మానం
-
జగనన్నకు చెబుదాం కార్యక్రమం..నేడు ప్రారంభించనున్న సీఎం జగన్
-
నాడు - నేడు పథకానికి లారస్ ల్యాబ్స్ భారీ విరాళం
-
చికాగో నాట్స్ విభాగం థ్యాంక్స్ గివింగ్ బ్యాక్‌కు చక్కటి స్పందన
చికాగో: భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు వెళ్తున్నఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. చికాగో నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు మేముసైతం సమాజహితం కోసం అని స్పందించారు. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్ ద్వారా వందలాది బట్టలు, బూట్లను సేకరించారు. ఇలా సేకరించిన వాటిని చికాగో శివారులోని అరోరాలో ఉన్న హెస్డ్ హౌస్ హోమ్ లెస్ షెల్టర్‌కు అందించారు. చికాగో నాట్స్ నాయకులు శ్రీహరీశ్ జమ్ము, నరేంద్ర కడియాల, వీర తక్కెళ్లపాటి లు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం ఈ కార్యక్రమానికి చికాగో నాయకులకు దిశా నిర్థేశం చేశారు. వీరితో పాటు నాట్స్ ఈసీ సభ్యులు మదన్ పాములపాటి వైస్ ప్రెసిడెంట్(సర్వీసెస్) , కృష్ణ నిమ్మలగడ్డ, లక్ష్మి బొజ్జ, బిందు వీధులముడి, రోజా శీలంశెట్టి, భారతీ పుట్టా తమ వంతు సహకారం అందించారు. నాట్స్ చికాగో చాప్టర్ వాలంటీర్లు సుమతి నెప్పలి, బిందు బాలినేని, ప్రతిభ, ప్రత్యూష, నవీన్ జరుగుల, వేణు కృష్ణార్దుల, శ్రీనివాస్ పిడికిటి, మహేష్ కాకరాల, పండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, గోపాల్ రెడ్డి, రాజేష్ వీధులమూడి, సతీష్, వినోద్ బాలగురు, యజ్ఞేశ్, అరుల్ బాబు, శ్రేయాన్, అక్షిత, రుషిత, ఆరుష్ , ఆదిన్, వర్షిత్, కృష్ణఫణి, సంకీత్, నిరుక్త, నిత్య, సహస్ర, హన్సిక, అన్షిక, వేద, అనీష్ తదితరులు గివింగ్ బ్యాక్ కార్యక్రమంలో చురుకుగా వ్యవహారించారు. ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా అవార్డులు అందించారు. హ్యూస్టన్‌లో నాట్స్ టెన్నీస్ టోర్నమెంట్ హ్యూస్టన్: తెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా బాల,బాలికలలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ టెన్నీస్ టోర్నమెంట్లో ఆడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ హ్యూస్టన్ సహ సమన్వయకర్త చంద్ర తెర్లీ నాట్స్ క్రీడా సమన్వయకర్త ఆదిత్య దామెర నేతృత్వంలో ఈ టోర్నెమెంట్ జరిగింది. నాట్స్ హ్యూస్టన్ సమన్వయకర్త విజయ్ దొంతరాజు, నాట్స్ నాయకులు సునీల్ పాలేరు, సుమిత్ అరిగెపూడి, శ్రీనివాస్ కాకుమాను, వీరు కంకటాల, వంశీ తాతినేని తదితరులు ఈ టోర్నెమెంట్ విజయానికి కృషి చేశారు. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని తెలుగువారందరికీ నాట్స్ ఎప్పుడూ వెన్నంటి ఉండి తమ సహాయ సహకారాలను అందిస్తుందని నాట్స్ బోర్డు సభ్యులు సునీల్ పాలేరు అన్నారు. చక్కటి సమన్వయంతో, క్రీడా స్ఫూర్తితో, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ పోటీలు నిర్వహించిన నాట్స్ హ్యూస్టన్ విభాగానికి నాట్స్ కేంద్ర కమిటీ సభ్యులు, కోశాధికారి హేమంత్ కొల్ల అభినందనలు తెలిపారు. క్రీడా నైపుణ్యత ఆధారంగా బాలబాలికలకు రెండు విభాగాలుగా జరిగిన ఈ పోటీలకు ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు నాట్స్ ట్రోఫీలను అందజేసి సత్కరించింది. తెలుగు వారిలో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడంపై నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని అభినందించారు. -
Family Doctor: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్ భరోసా
‘ఆకలికి అన్నము వేదనకు ఔషధం’ అనే నానుడి మనకందరికీ తెలిసినదే! శారీరక ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఆనారోగ్య శరీరాలకు ఔషధం అనేది కూడా అంతే ముఖ్యం. కానీ ఔష ధాన్ని నిర్ణయించాల్సింది మటుకు వైద్యులే అనేది జగమెరిగిన సత్యం! రోగిని పరీ క్షించటం, వ్యాధిని నిర్ణయించి తగిన సమయంలో సరియైన మోతాదులలో మందులు వాడటం అనేది వైద్యుల బాధ్యతే. అయితే ‘విత్తం ఉంటేనే వైద్యం’ అనే రీతిలో ప్రస్తుత పరిస్థితులు ఉండ టంతో సమాజంలోని పేద, మధ్యతరగతి వారు వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. పూర్వం గ్రామాల్లో స్థిర నివాసం ఉండే వైద్యులు ఉండేవారు. వారికి ఆ ఊళ్లో ఉన్న అన్ని కుటుంబాల ఆరోగ్య స్థితుల పట్ల ఒక అవగాహన ఉండేది. అందువల్ల ఆయా కుటుంబాలకు వైద్య చికిత్స అందించడం తేలికయ్యేది. వారందరినీ ఫ్యామిలీ డాక్టర్లుగా వ్యవహరించడం కద్దు. అయితే ప్రస్తుతం వైద్యుల సంఖ్య పెరుగుతున్నా ఈ ఆధునిక కాలంలో పల్లెల్లోనే కాదు, పట్టణాల్లోనూ ప్రజలందరికీ డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదు. ఇందుకు వైద్యం ఖరీదైనదిగా మారటం ఒక కారణమైతే, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎక్కువ మంది డాక్టర్లు పెద్ద ఆసుపత్రుల్లో తమ సేవలను అందించడం ఇంకో కారణం. దీంతో ఆయా గ్రామాల్లో కానీ, లేదా పట్టణాల్లోని వార్డుల్లో కానీ జీవించే వారికి ఫ్యామిలీ డాక్టర్ అనదగిన వైద్యుని సేవలు పొందే అవకాశం లేకుండా పోయింది. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కొద్దో గొప్పో లభిస్తూనే ఉంటాయి. అలాగే వైద్య సౌకర్యాలు ఫరవాలేదు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. అలాగే రోగం, రొప్పు వస్తే అర్హత గల డాక్టర్ వైద్య సేవలు మృగ్యం. నాసిరకం మందులు, నాటు మందులు మాత్రమే వారికి లభిస్తాయి. మూఢనమ్మకాలతో కూడిన వైద్యం వారిని కాటేస్తున్నది. నాణ్యమైన వైద్యం కావాలంటే... అప్పుల పాలు కావటమో, ఆస్తులు తాకట్టు పెట్టటమో, నగ నట్రా లేదా ఆస్తులు అమ్ముకోవటమో చేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా స్త్రీలలో ప్రసవ వేదన సమస్యలు, సాధారణ స్త్రీ ఆరోగ్య సమస్యలు; దీర్ఘకాలిక వ్యాధులున్నవారి సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే సహజమైన ఆరోగ్య సమస్యలు, పిల్లల్లో కలిగే రుగ్మతలు, పౌష్టికాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు వంటి వాటికి చికిత్స పొందే తాహతు పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ చాలా తక్కువ మందికే ఉంది. అందుకే ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయింది. మాటలతో మానసిక భరోసా, అవసరమైన వరకే మందులతో వైద్యం చేసే పరిస్థితి ప్యామిలీ డాక్టర్ విధానంలో ఉంటుంది. నిజంగా ఇది ‘కారుచీకటిలో కాంతి పుంజం’ వంటిదని చెప్పవచ్చు. ‘ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థ ఆవిష్కరణ మన రాష్ట్రానికే కాదు దేశానికే, ఆదర్శం, హర్షణీయం. ఇదేదో ప్రభుత్వ ఆకర్షణీయ పథకం అనుకుంటే పొరపాటే! ప్రభుత్వం ప్రజలందరి ఆరోగ్య స్థితిగతుల గురించిన సమాచారాన్ని సేకరించి... తగిన విధంగా వైద్య సేవలను అందచేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఈ విధానం ఎంతో ఉపక రిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వాలంటరీ వ్యవస్థ, నూతన విద్యా విధానాల వైపు దేశం యావత్తూ ఆసక్తికరంగా చూస్తోంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వ తీసుకువస్తున్న ‘ఫ్యామిలీ డాక్టర్స్’ విధానం మరింతగా దేశ ప్రజలను ఆకర్షించి మంచి ఫలితాలు పొందడానికి మార్గదర్శకమవుతుంది. ఇంగ్లాండ్‌లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. వైద్యునికి రోగికి మధ్య సత్సంబంధాలు మెరుగుపరచటమే కాక.... సకాలంలో సరియైన రీతిలో ప్రజలకు పెద్దగా ఆర్థిక భారం లేని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడానికి ఈ విధానం దోహదం చేస్తుంది. అందుకే ఈ విధానా నికి ఆహ్వానం పలుకుదాం! ఆరోగ్యకర మైన సమాజాన్ని నిర్మిద్దాం! (క్లిక్ చేయండి: మన మందులు మంచివేనా?) - అమరనాథ్ జగర్లపూడి కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
నెక్ట్స్ ఎడ్యుకేషన్ నుంచి ‘నెక్ట్స్ 360’
హైదరాబాద్: విద్యా సంబంధిత సాస్ కంపెనీ నెక్ట్స్ ఎడ్యుకేషన్.. ‘నెక్ట్స్ 360’ను ఆవిష్కరించింది. ఇది సమగ్ర విద్యా కార్యక్రమమని, విద్యార్థుల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ఆడియో విజువల్స్, యాక్టివిటీలు, పాఠ్య ప్రణాళికలు, కరిక్యులమ్ ఉంటుందని పేర్కొంది. అలాగే, నెక్ట్స్ 360 విద్యా సంస్థలకు అడ్మినిస్ట్రేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులతో సంప్రదింపులు, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, హాజరు నమోదు, రిపోర్ట్ కార్డ్ జారీ, అడ్మిషన్లు, ఫీజుల నిర్వహణ తదితర సేవలను దీని ద్వారా నిర్వహించుకోవచ్చు. రెండు వేలకు పైగా పాఠశాలలు, పది లక్షల మంది విద్యార్థులు, 50వేల మంది టీచర్లను చేరుకోవాలని అనుకుంటున్నట్టు నెక్ట్స్ ఎడ్యుకేషన్ తెలిపింది. -
లంకలో ఉపశమన కార్యక్రమాలకు శ్రీకారం!... : విక్రమసింఘే
Sri Lanka Acting President To Implement Urgent Food: గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ అబేవర్ధనే ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆందోళకారుల ఆగ్రహావేశాలు చల్లరే దిశగా ప్రజలకు సత్వరమే సాయం అందించడం పై రణిల్ దృష్టి సారించారు. మొదటగా ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తక్షణ అత్యవసర సహాయ కార్యక్రమాలను అమలు చేయాలని రణిల్ నిర్ణయించారు. ఈ సహాయ కార్యక్రమాల ద్వారా ముందుగా ఇంధనం, గ్యాస్, కనీస ఆహర పదార్థాలను అందిచాలని సూచించారు. ఈ మేరకు రణిల్ జులై16న పార్లమెంట్ సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక ఆగస్టులో సమర్పించే రిలీప్ బడ్జెట్లో అదనంగా వచ్చే డబ్బును కూడా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. తొలుత ఆహార భద్రత కార్యక్రం అమలును వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా ఇంధనం, ఎరువులు సక్రమంగా అందించడం పై దృష్టి సారించారు. మరోవైపు వ్యాపారవేత్తలను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలను నిర్వహించేలా వాతావరణాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ చర్చల ద్వారా తీసుకున్న ప్రణాళిక శాంతియుత నిరసకారుల కారుల కారణంగా తీసుకున్న గొప్ప ప్రణాళికగా పేరుగాంచుతుందన్నారు. అవినీతిపై పోరాటానికి తీసుకుంటున్న చర్యలను కార్యకర్తలకు తెలియజేస్తామని రణిల్ అన్నారు. ఐతే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేసినందున, రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు వచ్చే వారం సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ఇదిలావుండగా మాజీ ప్రధాని మహింద రాజపక్సే, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేలను కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదంటూ.. శ్రీలంక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: శ్రీలంకలో ఇంధన పాస్‌లకు శ్రీకారం.. రేషన్‌పై పెట్రోల్ పంపిణీ!) -
Asani Cyclone Effect: మత్స్యకార భరోసా 13వ తేదీకి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసని తుఫాన్ వల్ల సంభవిస్తున్న ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని మే 13కు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’ -
దేశానికే దిశ నిర్ధేశం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మహిళలకు రక్షణ కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ‘దిశ’ నిర్దేశం చేశారని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నా రు. ఏపీ తరహాలో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ది శ యాప్ అమలుచేసే దిశగా అడుగు వేస్తున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలోని సన్‌రైజ్ హోటల్లో దిశ యాప్ రిజిస్ట్రేషన్స్ మెగా డ్రైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ జీఆర్ రాధిక అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా దిశ యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యతను లఘు చిత్రం ద్వారా చూపించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దిశ యాప్ ద్వారా యువతులు నిర్భయంగా ఉండవచ్చని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ యాప్‌పై విద్యార్థినులు ఇంటి చుట్టుపక్కల వా రికి అవగాహన కల్పించాలని సూ చించారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి మహిళాలోకం జేజేలు పలుకుతోందన్నారు. ఈ యాప్ ద్వారా రానున్న రో జుల్లో నేరాల సంఖ్య తగ్గతుందన్నారు. కఠిన శిక్షలు అమలు చేసే దిశగా ఏపీలో అడుగులు పడుతున్నాయని తెలిపారు. దిశ ఓ రక్షణ కవచం మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మహిళల భద్రతపై ఎస్పీ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చు ట్టడం చాలా గొప్ప విషయమన్నారు. దిశ యాప్ అనేది ఒక రక్షణ కవచమని తెలిపారు. దిశ యాప్ ద్వారా ఢిల్లీలో ఆపదలో ఉన్న ఓ మహిళను సురక్షి తంగా కాపాడారని గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ యాప్, దిశ వాహనాలు, పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మీ వెంటే ఉంటుంది.. జాయింట్ కలెక్టర్ విజయసునీత మాట్లాడుతూ అక్క, అన్న అనుక్షణం మీతో ఉండలేకపోవచ్చని, దిశ యాప్ ప్రతి క్షణం మీ వెంటనే ఉంటుందని తెలిపారు. యాప్ ఉంటే పోలీసు రక్షణ ఉన్నట్టేనన్నారు. పాట అదుర్స్.. ప్రత్యేక ఆహ్వానితుడు, గాయకుడు, ఇండియన్ ఐడ ల్ విజేత రేవంత్ దిశ యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి పాడిన పాట అందరికీ ఆకట్టుకుంది. తన సొంత ఊరిలో ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. మ నపై మనం నమ్మకం పెట్టుకోవాలన్నారు. అనంతరం దిశ యాప్ రిజిస్ట్రేషన్ మెగా డ్రైవ్ చేపట్టి పెద్దఎత్తున దిశ యాప్‌లు రిజిస్ట్రేషన్ చేయించారు. యాప్ అందరికీ కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ దిశ యాప్ ను ఆడ, మగ అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. దిశ యాప్ ఎస్ఓఎస్ బటన్ నొక్కి షేక్ చేస్తే పోలీసు వారికి సమాచారం చేరి తక్షణమే ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి నైనా జైస్వాల్, ఎస్పీ, జెడ్పీ చైర్పర్సన్, జేసీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ∙ఈ సందర్భంగా నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి నిర్వహించి షార్ట్‌ఫిల్మ్‌ల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు శ్రీకాకుళం వాసి జర్నలిస్ట్ డోల అప్పన, డాక్టర్ మాదిన ప్రసాదరావు టీమ్‌కు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు కాశీబుగ్గ వాసి బోనెల గోపాలరావులకు మంత్రి చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.శ్రీనివాసరావు, టీపీ విఠలేశ్వరరావు, పి.సోమశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ కేపీ గోపాల్, డీఎస్పీ ఎం.మహేంద్ర, శివరామి రెడ్డి, జి.శ్రీనివాసరావు, ప్రసాద రావు, సీఐ ఈశ్వర్ ప్రసాద్ అంబేడ్కర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దిశ గొప్ప వరం సమాజంలో స్త్రీ శక్తిని పెంపొందించడానికి దిశ గొప్ప వరం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు అమలు చేసి ప్రతి ఒక్క నిరుపేదకు విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి మానవతావాదిగా నిరూపించుకున్నారు. దిశ అనేది మహిళల రక్షణకు కేంద్ర బిందువులాంటి ఆయుధం. – నైనా జైస్వాల్, క్రీడాకారిణి నాన్నలా రక్షణ దిశ యాప్ ఓ అన్నలా, నాన్నలా, అమ్మలా మహిళకు భద్రత ఇస్తుంది. ఈ యాప్ ఉంటే తల్లిదండ్రులు నిర్భయంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్ మొదటి ప్రాధాన్యత జిల్లాలో ప్రతి మహిళ భద్రతకు పోలీసు శాఖ మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పో లీసుల సాయం పొందాలి. స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోదు. దిశ యాప్ ఉంటేనే స్మార్ట్. యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ వివరాలను గోప్యంగా ఉంటాయి. పురుషు లు కూడా యాప్‌ను వినియోగించాలి. – జీఆర్ రాధిక, ఎస్పీ -
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభం
-
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జనబాట కార్యక్రమం
-
‘చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే మా ప్రభుత్వం నిర్మిస్తోంది’
-
‘చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే మా ప్రభుత్వం నిర్మిస్తోంది’
అమరావతి: దేవాలయశాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల భూములు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టు, ట్రిబ్యునల్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులను నియమిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి కూడా నాడు-నేడు విధానం రూపొందించామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. అదే విధంగా ప్రతి దేవాలయంలోను గోశాలలను ఏర్పాటుచేస్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే.. మా ప్రభుత్వం నిర్మిస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే 9 కొత్త దేవాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీం ద్వారా ప్రముఖ దేవాలయాల అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రేపు జరగాల్సిన ‘జగనన్న తోడు’ బుధవారానికి వాయిదా
సాక్షి, విజయవాడ: రేపు(మంగళవారం) జరగాల్సిన ‘జగనన్న తోడు’ కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పండగ సెలవు కావడంతో ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు లబ్ధిదారుల వడ్డీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని అజయ్‌జైన్ తెలిపారు. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! -
singapore: తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్(టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో జూన్ 27 న ఇక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (హెచ్ఎస్ఏ) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన టీసీఎస్ఎస్ రక్త దాన శిబిరం-2021 విజయవంతం అయ్యింది. వరుసగా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రక్తదాన శిబిరాన్ని టీసీఎస్ఎస్ నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరం లో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ.. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఎల్లప్పుడూ ఇలాంటి లాభాపేక్ష లేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ ని కొనియాడడం తో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా గోనె నరేందర్ రెడ్డి, శివ ప్రసాద్ ఆవుల మరియు ప్రవీణ్ మామిడాల వ్యవహరించారు. ఈ రక్తదాన సేవ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్, ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్లా మరియు ఇతర సభ్యులు, శశిధర్ రెడ్డి, ధన్యవాదాలు తెలియచేశారు. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని తెలిపారు. చదవండి: అమెరికాలోనే ఉండనివ్వండి.. భారతీయ యువత అభ్యర్ధన -
Immunity పెరగడానికి యోగ, ప్రాణాయామం
-
6 నెలల పాలనలో అతిపెద్ద విజయం
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం అత్యంత విజయవంతంగా అమలవుతోంది. జూన్ 24, 2019న కలెక్టర్లు, ఎస్పీలతో తొలి కాన్ఫరెన్స్ సందర్బంగా స్పందన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రకటించారు. వివిధ సమస్యలపై పౌరుల నుంచి వినతుల స్వీకరణ, నిర్ణీత కాలంలో పరిష్కారమే లక్ష్యంగా స్పందన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరంతర సమీక్షలతో స్పందనపై అధికార యంత్రాంగంలో సీరియస్‌నెస్ తీసుకువచ్చి, ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం దిశగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నడిపించారు. తక్షణ స్పందన కోసం కలెక్టర్లకు నిధులు కేటాయించడంతో పాటు ఆకస్మిక తనిఖీలకూ ఆదేశాలు సీఎం ఆదేశాలిచ్చారు. రోజుల తరబడి తమ తమ సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగిన ప్రజలకు అధికారుల నుంచి జవాబుదారీతనం.. సమస్యకు రశీదు, పరిష్కారం పొందిన తర్వాత మళ్లీ ప్రజలకు తెలియజేసేలా విధాన రూపకల్పన చేశారు. తిరస్కరించిన వాటికీ సహేతుక కారణాలతో వివరణ ఇవ్వడం, పెండింగులో ఉంటే.. దాని పరిష్కారానికి నిర్ణీత సమయం చెప్పేలా చేశారు. ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై ఆరు నెలల కాలంలో స్పందనలో లక్షల కొద్దీ వినతులు వచ్చాయి. (చదవండి: 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా..) 78.2 శాతం పరిష్కారం ►స్పందన ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 13 జిల్లాల్లో వచ్చిన వినతులు 8,15,461 ► పరిష్కారానికి నోచుకున్న వినతులు 78.2 శాతం, పెండింగులో 7.3 శాతం, తిరస్కరించినవి 14.4 శాతం ► రేషన్ కార్డులు, ఇళ్లపట్టాలు, పట్టణాల్లో ఇళ్లు, పెన్షన్లు, భూమి సంబంధిత హక్కులు, ఇళ్ల మంజూరు, ఆక్రమణలు.. సంబంధిత అంశాలే ఎక్కువ ►తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా వినతులు ►కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఆ తర్వాత సంఖ్యలో వినతులు జిల్లాల వారీగా... ♦ తూర్పుగోదావరిలో 1,09,876 వినతులు, 80శాతం పరిష్కారం ♦ కర్నూలులో 99,577, 82.4శాతం పరిష్కారం ♦ కృష్ణాజిల్లాలో 97,355 , 78.9శాతం పరిష్కారం ♦ గుంటూరు జిల్లాలో 82,031, 71.2 శాతం పరిష్కారం ♦ అనంతపురం జిల్లాలో 70,310, 84.2 శాతం పరిష్కారం ♦ ప.గో. జిల్లాలో 68,125 వినతులు, 79.1శాతం పరిష్కారం ♦ విశాఖపట్నం జిల్లాలో 61,613 వినతులు, 75.7శాతం పరిష్కారం ♦ కడప జిల్లాలో 52,318 వినతులు, 74.7 శాతం పరిష్కారం ♦ చిత్తూరు జిల్లాలో 48,008 వినతులు, 73.7 శాతం పరిష్కారం ♦ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 36,998 వినతులు, 76.1శాతం పరిష్కారం ♦ శ్రీకాకుళం జిల్లాలో 33,228 వినతులు, 78.9 శాతం ♦ ప్రకాశం జిల్లాలో 31,829 వినతులు, 70.8శాతం పరిష్కారం ♦ విజయనగరం జిల్లాలో 24,193 వినతులు, 86.6 శాతం పరిష్కారం ♦ వినతుల్లో నాణ్యత పెంచడానికి వైఎస్ జగన్ చర్యలు ♦ అధికారులకు పెద్ద ఎత్తున వర్క్‌షాపులు నిర్వహణ ♦ జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు శిక్షణ తరగతులు పోలీసు శాఖలో స్పందన.. > ప్రతి మంగళవారం జిల్లా ఎస్పీలు, పోలీసు అధికారులతో సీఎం జగన్ సమీక్ష > వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ > ఫిర్యాదులతో వస్తున్నవారిని మానవతా దృక్పథంతో చూడాలంటూ ఆదేశాలు > పోలీసు స్టేషన్లు, కార్యాలయాల ముందు హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు > సివిల్ తగాదాలు తక్షణ పరిష్కారానికి రెవిన్యూ అధికారులతో ప్రత్యేక సమన్వయం ఏర్పాటు చేసిన సీఎం > నవంబర్ 25వరకూ, ఇప్పటివరకూ వచ్చిన పిటిషన్లు 44,452 వినతులు. 98శాతం ఫిర్యాదుల పరిష్కారం > స్పందన వెబ్‌పోర్టల్ ద్వారా 8,894 వినతులు. 94 శాతం పరిష్కారం నేరుగా వచ్చిన పిటిషన్లలో వర్గీకరణ = సివిల్ తగాదాలు 11,525 = బాడీలైన్ అఫెన్సెస్ 7,188 = మహిళలపై నేరాలకు 6,773 = ఇతర ఫిర్యాదులు 5,490 = వైట్‌కాలర్ అఫెన్స్‌లు 4,733 = కుటుంబ తగాదాలు 3,786 = ఆస్తి సంబంధమైన తగాదాలు 2,462 = న్యూసెన్స్ 1010 = రోడ్డు ప్రమాదాలు 966 = సైబర్ క్రైం 274 = ఎస్సీ,ఎస్టీలపై నేరాలు 245 స్పందన ఇంపాక్ట్ # స్పందన కార్యక్రమం వల్ల నేరుగా వచ్చిన 44,452 స్పందన వినతుల్లో 13003 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ల నమోదు # వారం రోజుల్లోనే 95శాతం ఫిర్యాదుల పరిష్కారం # ముఖ్యమంత్రి, డీజీపీల స్వయం పర్యవేక్షణ వల్ల పోలీసుయంత్రాంగంలో పెరిగిన పారదర్శకత, జవాబుదారీతనం # నిర్ణీత కాలంలోగా వినతులను పరిష్కరించని పోలీసులపై చర్యలు # మహిళల నుంచి 52శాతం ఫిర్యాదులు. సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయని మహిళల విశ్వాసం # సమస్యలు ఎదుర్కొంటున్నవారికి సులభంగా అందుబాటులో అధికారులు # సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థల ఏర్పాటు, సంవత్సరాలు తరబడి పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారం -
ఇండియా జాయ్‌తో డిజిటల్ ఎంటర్టైన్మెంట్కు ఊతం
సాక్షి, హైదరాబాద్: యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, డిజిటల్ వినోదం రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రానికి ‘ఇండియా జాయ్–2019’వేడుక మరింత ఊతమిస్తుందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. డిజిటల్ మీడియా, వినోదం రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు సంస్థలు పాల్గొనే ఈ వేడుక నిర్వహణకు సంబంధించి ఇండియా జాయ్ ప్రతినిధులు సోమవారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వెయ్యికిపైగా అంతర్జాతీయ బృందాలు హాజరవుతున్నాయని తెలిపారు. డిజిటల్ వినోదానికి సంబంధించిన 9 అంశాలపై సదస్సులు జరుగుతా యన్నారు. భారత మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీలకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో గేమింగ్, వినోదం తదితర రంగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇమేజ్ టవర్స్’కు ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టర్నర్ ఇంటర్నేషనల్, వయాకామ్ 18, సోనీ పిక్చర్స్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్, షెమారూ వంటి ప్రముఖ సంస్థలు ఈ వేడుకలో పాల్గొంటాయి. కేటీఆర్‌ను కలసిన వారిలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇండియా జాయ్ ప్రతినిధి రాజీవ్ చిలక తదితరులు ఉన్నారు. -
‘ఏకలవ్య’కు ప్రత్యేక సొసైటీ!
సాక్షి, హైదరాబాద్: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు (ఈఎంఆర్ఎస్) సరికొత్త కళ సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో కొనసాగిన ఈ స్కూళ్లు ఇకపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రత్యేక సొసైటీ ద్వారా కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రత్యేక సొసైటీ కింద నడపాలని నిర్ణయించిన కేంద్ర గిరిజన శాఖ తాజాగా సొసైటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ఏకలవ్య స్కూళ్లు ఉన్నాయి. వీటికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తున్నా గురుకుల సొసైటీ వీటి నిర్వహణ చూసుకుంటోంది. ప్రత్యేక సొసైటీ పరిధిలో కొనసాగనున్నందున నిధుల విడుదల సమస్యల పరిష్కారం తదితర అంశాలన్నీ నేరుగా జరగనున్నాయి. శాశ్వత నిర్మాణాలు దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలకు శాశ్వత భవనాలు ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త నిర్మాణాలు కూడా చేయనుంది. ప్రస్తుతం చాలా వరకు శాశ్వత భవనాలున్నా మౌలిక వసతుల లేమి తీవ్రంగా ఉంది. దీన్ని పరిష్కరించి అత్యున్నత విద్యాలయాలుగా తీర్చి దిద్దాలని కేంద్రం భావిస్తోంది. -
శుభోదయం తాడిపత్రి కార్యక్రమం నిర్వహించిన హర్షవర్దన్ రెడ్డి
-
ఆనంద వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా
-
ట్రంప్ మరో షాక్ : ఐటీ కంపెనీలకు పెనుభారమే
వాషింగ్టన్ : అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై మరింత ఆర్థిక భారం పడనుంది. అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేందుకు ట్రంప్ పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది. అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్ ప్రొగ్రామ్‌కు నిధులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా తెలిపారు.ఈ మేరకు 2020 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ లో ప్రతిపాదనలు చేర్చారు. అయితే ఏఏ కేటగిరీల వ్యక్తులకు ఈ పెంపు వర్తిస్తుంది అనేది స్పష్టం చేయలేదు. తాజా నిర్ణయంతో భారతీయ ఐటీ కంపెనీలపై భారం పడనుంది. తమ ఉద్యోగులను అమెరికా పంపాలనుకునే భారత ఐటీ సంస్థలు హెచ్-1బీ దరఖాస్తు రుసుంను భరించాల్సి ఉంటుంది. ఇది ఆయా సంస్థలకు అదనపు భారంగా పరిణమించనుంది. కాగా, ఈ పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమెరికా యువతకు సాంకేతిపరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కోసం వినియోగించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వలసలపై ఉక్కుపాదం మోపుతుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి ఐటీ ఉద్యోగులకు సంబంధించిన హెచ్-1బీ వీసాపై ఇప్పటికే పలు కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. తాజాగా హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంచాలని నిర్ణయించడం భారతీయ ఐటీ ఉద్యోగులకు కూడా షాకింగ్ న్యూసే -
స్వచ్ఛత పనుల జోరు
సాక్షి, పెంట్లవెల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఊరురా.. మరుగుదొడ్ల నిర్మాణం జోరందుకుంది. గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం కోసం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడంతో వీటి నిర్మాణాలను వేగవంతంగా నిర్మించేందుకు అధికారుల సైతం ఉత్సాహం చూపుతున్నారు. 3600 మరుగుదొడ్లు మంజూరు మండలంలోని జటప్రోల్, పెంట్లవెల్లి, కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్ గ్రామాలలో ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడిన మహిళలు స్వచ్ఛభారత్ నేపథ్యంలో ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 10గ్రామ పంచాయతీలకు 3,600 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 1500పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆసక్తి చూపుతున్న ప్రజలు ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఊరూరా తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. కొన్నిచోట్ల వాటిని కఠినం చేస్తూ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పడంతో స్వచ్ఛతపై అవగాహన పెంచుకున్నారు. గతంలో ఎవరో ఒకరు మాత్రమే నిర్మించుకునే వారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకుంటున్నారని అధికారులు అంటున్నారు. చెక్కుల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి, రెండో విడుతల చెక్కులను అందజేసేందుకు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, మహిళ సంఘం అధ్యక్షురాలుతో చెక్కుపై సంతాకం పెట్టించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం అందించే రూ.12వేల ప్రోత్సాహకం సమయానికి అందుతుంది. మండలంలో 1500లకు పైగానే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకా 2,100 నిర్మాణ దశలో ఉన్నాయి. స్వచ్ఛత పాటిస్తాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు ఇచ్చే పథకం ఎంతో బాగుంది. ప్రభుత్వ నిధులకు తోడు మరికొంత వ్యయం చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. స్వచ్ఛత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. – శివయ్య, మంచాలకట్ట -
రూ.399 లకే విమాన టికెట్
సాక్షి,న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ప్రమోషనల్ ఆఫర్‌గా అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. రూ.399 లకే విమాన టికెట్లు అందిస్తోంది. నవంబరు 18 దాకా ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా మే 6, 2019 నుంచి ఫిబ్రవరి 4, 2020 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. వన్‌వేలో దేశీయంగా రూ.399, అంతర్జాతీయ మార్గాల్లో 1999 రూపాయలకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. హైదరాబాద్, విశాఖపట్నం తోపాటు, బాగ్దోగ్రా, బెంగళూరు, భువనేశ్వర్, గోవా, గువహటి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోలకతా, న్యూఢిల్లీ, పుణ్, రాంచీ, శ్రీనగర్ నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఏసియా వెబ్సైట్, లేదా యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం లభ్యం. అయితే బిగ్ లాయల్టీ ప్రోగ్రాంలోని ‘బిగ్ మెంబర్స్’ కు మాత్రమే ఈ ఆఫర్‌ను దక్కించుకునే అదృష్టాన్ని కల్పించింది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఇండోర్-హైదరాబాద్, రాంచి- కోలకతా మార్గాల్లో రూ .399గా టికెట్ లభ్యమవుతోంది. వివిధ మార్గాల్లో టికెట్ల ప్రారంభ ధరలు ఈ విధంగా ఉండనున్నాయి. బెంగళూరు-హైదరాబాద్ : రూ. 500 బెంగళూరు-విశాఖపట్నం : రూ. 999 కోలకతా-రాంచీ : రూ. 967 బెంగళూరు-భువనేశ్వర్ : రూ .1,399 బెంగళూరు-కొచ్చి : రూ. 500 బెంగళూరు-చెన్నై: రూ. 500 ఇక అంతర్జాతీయ మార్గాల విషయానికి వస్తే.. భువనేశ్వర్- కౌలాలంపూర్ మధ్య రూ .1999 ప్రారంభ ధరగా ఉంది. కాగా ప్రపంచవ్యాప్తంగా తమ బిగ్ సభ్యులు 20 మిలియన్ల మార్క్‌ను చేరుకున్నారని, ఆగస్టు 29న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎయిర్ ఏసియా వెల్లడించింది. టాటాసన్స్ , మలేసియా ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ సంస్థ అయిన ఎయిర్ ఏసియా 25 దేశాల్లో 165 ప్రదేశాలకు సర్వీసులను నిర్వహిస్తోంది. -
ఇదీ సీపీఎం రామాయణం
సాక్షి, న్యూఢిల్లీ : పౌరాణిక రామాయణ గ్రంధాన్ని ఆరెస్సెస్ లాంటి శక్తులు రాజకీయాల కోసం ఉపయోగించుకోకుండా అందుబాటులో ఉన్న వివిధ రామాయణాల పట్ల రాష్ట్ర ప్రజలకు చైతన్యం కల్పించడం కోసం సీపీఎం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్న ‘కేరళ సంస్కత సంస్థ’ జూలై 15వ తేదీ ఆదివారం నుంచి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు వివిధ రామాయణాలపై చర్చా గోష్ఠిలు, సదస్సులు నిర్వహించనుంది. వాల్మీకి, కబీర్, తులసిదాస్తోపాటు పలువురు రాసిన రామాయణాలతోపాటు ప్రాంతాల వారిగానున్న రామాయణాలన్నింటిని ఈ కార్యక్రమాల్లో విశ్లేషిస్తారు. జాతీయ, ప్రాంతీయ రామాయణాలను కలుపుకొని మలయాళంలో ప్రస్తుతం 29 రామాయణాలు అందుబాటులో ఉన్నాయి. అందులో కేరళ ప్రాంతానికి చెందిన ఆద్యమ రామాయణం కూడా ఉంది. మలయాళం క్యాలెండర్ ప్రకారం జూలై 15వ తేదీన రామాయణం మాసం ప్రారంభమైంది. అదే రోజున రామాయణ కార్యక్రమాన్ని సీపీఎం ప్రారంభించడం పట్ల విమర్శలు వెల్లువెత్తగా, అది యాధశ్చికంగా జరిగిందని, అయినా రామాయణంపైనే తాము అవగాహనా కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు ఆ రోజున ప్రారంభిస్తే మాత్రం తప్పేమిటని పార్టీ సీనియర్ నాయకులు అచ్యుతానందన్ లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ లాంటి శక్తులు రామాయణాన్ని సంకుచిత స్వభావంతో చూపించడమే కాకుండా అదే స్వభావాన్ని ప్రజలకు రుద్దేందుకు ప్రయత్నిస్తోందని పార్టీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న భారతీయ సంస్కతి రామాయణం లాంటి ఇతిహాసాల్లో ప్రతిబింబిస్తుందా, లేదా? ఇన్ని రామాయణాలు ఏ కారణంగా పుట్టుకొచ్చాయో ప్రజల ముందుకు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని తాము అన్నారు. ఈ కార్యక్రమంలో తాము కూడా పాల్గొంటున్నప్పటికీ ‘కేరళ సంస్కత సంస్థ’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని వారు చెప్పారు. సంస్కత సంస్థ ఓ లౌకిక సంస్థ అందులో లౌకికవాదులు, మేథావులు, పండితులు, టీచర్లు, విద్యార్థులు ఉన్నారని వారు తెలిపారు. సంస్థ రాష్ట్ర కన్వీనర్ టీ. తిలక్‌రాజ్ పదవీ విరమణ చేసిన సంస్కత టీచరు. ఆయన సీపీఎం టీచర్స్ విభాగానికి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కూడా. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జాతీయ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర సీపీఎం కమిటీ సభ్యుడు డాక్టర్ వి. శివదాసన్ కూడా ఈ సంస్కత సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇది వరకు మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలు విజయవంతం అవడం, వాటికి లక్షలాది మంది ప్రజలు రావడంతో ఇప్పుడు రామాయణంపై కూడా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డాక్టర్ శివదాసన్ వివరించారు. రామాయణ, మహాభారతంల పేరిట ప్రజల్లో విద్వేషాలు తీసుకరావడం ద్వారా రాష్ట్రంలో బలపడేందుకు హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తుంటే తాము అవే రామాయణ, భారతాలు చెబుతున్న బహుళత్వంలో భిన్నత్వాన్ని చెబుతున్న హిందూ ఇజం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీఎం నాయకులు వివరించారు. హిందూత్వ శక్తులను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో సీపీఎం కార్యకర్తలు ‘ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యోగా స్టడీ సెంటర్ పేరిట యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
50 లక్షలు చల్లరు..
-
‘తొడగొట్టే సంస్కృతి అవసరం లేదు’
విజయవాడ : రాజకీయాలలో తొడగొట్టే సంస్కృతి అవసరం లేదని, ఎటువంటి అంశాన్ని అయినా సున్నితంగా చెబితే సరిపోతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం సిద్ధార్థ అకాడమీలో మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ రచించిన "తలుచుకుందాం... ప్రేమతో" అనే పుస్తక ఆవిష్కరణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నేటి రాజకీయ వ్యవస్థలో సత్యానికి(నిజానికి) స్థానం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ సత్యం-అహింసలే ఆయుధంగా సామాజిక మార్పు తెచ్చారని, యలమంచిలి శివాజీ మాదిరిగా తెలుగులో రాజకీయ నేతలు సమాజానికి స్పూర్తి దాయకమైన రచనలు చేయాలని సూచించారు. ఎక్కువగా ఇంగ్లీషులోనే ఈ తరహా రచనలు వస్తున్నాయన్నారు. యలమంచిలి శివాజీ తన పుస్తకం ద్వారా ప్రముఖులతో తన అనుబంధాలను చక్కగా వ్యక్తీకరించారని అన్నారు. తనను ప్రభావితం చేసిన ప్రముఖుల వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. నేటితరం రాజకీయ నాయకుల్లో రచనా వ్యాసాంగం పట్ల ఆసక్తి లేకుండా పోతోందన్న బాధ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెస్కో విజయ్ కుమార్, చంద్రశేఖర్, ప్రమీలా రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సమరానికి సర్వసన్నద్ధం కావాలి
రావులపాలెం (కొత్తపేట) : ఎన్నికల సమరానికి ఎంతో సమయం లేదని, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు సర్వసన్నద్ధంగా ఉండాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెం సీఆర్సీ ఆడిటోరియంలో సోమవారం జరిగిన నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో 252 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, ప్రతి 100 మందికి ఒక బూత్ సభ్యుడు ఉండేలా కన్వీనర్లు నియామకాలు చేపట్టాలని సూచించారు. ఇందుకు ఉత్సాహవంతులు, పార్టీ కోసం పని చేసేవారిని తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను నాయకులకు వివరించి, పరిష్కరించడం ద్వారా పార్టీని ప్రజలకు దగ్గర చేసేందుకు వారథులుగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల సూక్ష్మస్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి చేర్పులు, తొలగింపులపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని, అతడితో పోరాడుతున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాజధానిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లు వద్దని సుప్రీంకోర్టు చెప్పినా, చంద్రబాబు అదే పద్ధతిలో రాజధాని నిర్మాణం చేస్తూ, 53 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. తమ అనుకూల ఎల్లో మీడియాలో పదేపదే రాజధాని ఊహాచిత్రాలను చూపిస్తూ ప్రజలను మ«భ్యపెడుతున్నారని, వాస్తవంగా అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలతో పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. టీడీపీని ప్రజలు ఓడించడానికి జన్మ«భూమి కమిటీలనే ఒక్క కారణం చాలని చెప్పారు. రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో కొనుగోలు చేసినా, స్పీకర్ ఇంతవరకూ వారిపై అనర్హత వేటు వేయకపోవడం, వారిలో నలుగురితో మంత్రులుగా సాక్షాత్తూ గవర్నరే ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ధర్మాన దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కులమత రాజకీయాలకు అతీతంగా అందరికీ పథకాలను అందించారని, కానీ చంద్రబాబు తమకు ఓటు వేస్తేనే లబ్ధి చేకూరుస్తామనే నీచమైన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గడచిన 70 ఏళ్లలో ఇంత అన్యాయమైన పాలన ఏనాడూ చూడలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉన్నా, కమీషన్లపై కక్కుర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందని ఆరోపించారు. ఈ మోసాలన్నింటినీ ప్రజలకు వివరిస్తూ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీ సభ్యులపై ఉందని ధర్మాన అన్నారు. మరో ముఖ్య అతిథి, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం గతంలో లేని పోల్ మేనేజ్మెంట్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ అనే రెండు కొత్త స్కీములు అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు, రెండేసి ఓట్లు ఎలా వేయాలో పోల్ మేనేజ్మెంట్ ద్వారా శిక్షణ ఇస్తే.. చేసిన దూబరా ఖర్చులను కప్పిపుచ్చడానికి ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. రాజకీయాన్ని వ్యాపారం, నేరమయంగా మార్చేశారన్నారు. మాజీ మంత్రి, అమలాపురం కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పీఏసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణుగోపాలకృçష్ణ, పితాని బాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సంయుక్త కార్యదర్శి గొల్ల పల్లి డేవిడ్‌రాజు, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యురాలు మద్దూరి సుబ్బలక్ష్మి, మునికుమారి తదితరులు పాల్గొన్నారు. బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను, సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రొఫెసర్లు రవికుమార్, నారాయణరెడ్డిలు పోలింగ్ బూత్ కమిటీల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, పంచాయతీరాజ్ చట్టం, సమాచార హక్కు చట్టం, సామాజిక మాధ్యమాలు, వర్తమాన రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసం, పార్టీ ఆవిర్భావం, ఆదర్శవాదం తదితర అంశాలపై అవగాహన కలిగించారు. అనంతరం ధర్మాన, బోస్ తదితర నాయకులను జగ్గిరెడ్డి ఘనంగా సత్కరించారు. -
దళితులను దగా చేసేందుకే ‘దళిత తేజం’
కడప కార్పొరేషన్: దళితులను దగా చేసి మళ్లీ ఓట్లు దండుకోవడానికే తెలుగుదేశం పార్టీ దళిత తేజం కార్యక్రమం నిర్వహిస్తోందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ వినోద్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు త్యాగరాజు, యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు దండుకోవడానికి పెద్దమాదిగనవుతా అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని వారిని అవమాన పరిచారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని, ట్రిపుల్ ఐటీల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళిత వాడల్లో ఉచిత విద్యుత్ ఇస్తుంటే, ఈ ప్రభుత్వం వచ్చాక దళితుల ఇళ్లకు కరెంటు కట్ చేసి, వారిపై కేసులు నమోదు చేయిస్తోందని మండిపడ్డారు. ఇన్ని విధాలుగా దళితులను దగా చేస్తున్న తెలుగుదేశం పార్టీకి దళిత తేజం కార్యక్రమం నిర్వహించే అర్హత ఉందా అని సూటిగా ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే టీడీపీ నాయకులకు దళితుతు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. -
ఇసుక తిన్నెలపై సంగీత లహరి
సాక్షి, విశాఖపట్నం: సాగరతీరంలోని ఇసుక తిన్నెలపై ఈ నెల 11, 12 తేదీల్లో సౌండ్స్ ఆన్ సాండ్ పేరిట సంగీత లహరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. విశాఖ పర్యాటక ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఆరు మెగా ఈవెంట్లను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులోభాగంగా మొదటి కార్యక్రమం సౌండ్స్ ఆన్ సాండ్ అని చెప్పారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి కళాకారులు పాల్గొంటారన్నారు. 11 ఉదయం 7 గంటలకు బైజు ధర్మజాన్, విజయ్ హెగ్డే, సాయంత్రం 4.30 గంటలకు సంగీతంపై అభిలాష ఉన్న వారికి వర్క్‌షాప్, 5 గంటలకు ఎకో అండ్ కైరోజ్ కార్యక్రమం, రాత్రి 7 నుంచి పాప్‌సింగర్ ఉషా ఊతప్ సంగీత విభావరి, 8.30కి ప్రముఖ కళాకారులు లెస్లీ లెవీస్ల సంగీత కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 12 ఉదయం 7 గంటలకు నడి వయసు వారు ఇష్టపడే డబ్లీ కార్యక్రమం, సాయంత్రం 4.30 గంటలకు సంగీత వర్క్‌షాప్, 5.30కి స్థానిక కళాకారులతో క్వాయర్ కళాబృందం సాంస్కృతిక ప్రదర్శన, రాత్రి 7 గంటలకు ఇండియన్ ఐడల్ రేవంత్ గీతాలాపన, 8.30నుంచి టాలీవుడ్ నేపథ్య గాయకులు మహ్మద్ ఇర్ఫాన్, ఆసీస్ కౌర్‌లతో సంగీత కార్యక్రమాలుంటాయని వివరించారు. ఫేస్బుక్లో లాగిన్ అయి ఎక్కడ నుంచైనా కార్యక్రమాన్ని వీక్షించవచ్చన్నారు. 14 నుంచి 18 వరకు పలు కార్యక్రమాలు ఈ నెల 14 నుంచి 16 వరకు అరకులో బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 10, 11 తేదీల్లో నగరంలో కలెక్టర్ల సదస్సు జరుగుతుందని, దీనికి దేశంలోని వంద జిల్లాల నుంచి 62 మంది కలెక్టర్లు, 40 మంది ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారన్నారు. అలాగే 15 నుంచి 17 వరకు అగ్రిహ్యాకథాన్, 17, 18 తేదీల్లో జాతీయ స్థాయి టూర్ ఆపరేటర్ల సమావేశం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఈడీ శ్రీరాములునాయుడు, డీటీవో పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
వేషాలు రక్తి కట్టినా భుక్తికి కటకట
రాజానగరం: ఒకప్పుడు పల్లెపట్టులకు పుష్కలంగా వినోదాన్ని పంచిన సామాజికవర్గం.. ఇప్పుడు జీవితాన్ని ఎలా నెట్టుకు రావాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. తమ కళా చాతుర్యంతో గ్రామీణులను ఆనందభరితులను చేసిన వారికి.. ఇప్పుడు కంచంలోకి అన్నం తెచ్చుకోవడమెలాగో తెలియడం లేదు. ముఖానికి పులుముకున్న రంగులతో, ఊరి వీధుల్లో నడయాడే హరివిల్లుల్లా కనిపించిన వారి బతుకు.. ఇప్పుడు వన్నెలు వెలిసిపోయిన చిత్రంలా వెలవెలబోతోంది. ‘ఉదర పోషణార్థం బహూకృత వేషం’ అన్నది నానుడి. ఇప్పుడు ఏ వేషం వేసినా కడుపు నింపుకోవడానికి కటకటలాడే దుస్థితి పగటి వేషగాళ్లది. రాష్ట్రంలో బుడగ జంగాలకు వృత్తిపరంగా ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించక కుటుంబ పోషణ కోసం నానా అవస్థలు పడుతున్నారు. బుడబుక్కలోళ్లుగా పిలువబడే వీరు బుర్రకథలు, తంబురా కథలు చెపుతూ, దసరా, సంక్రాంతి, దీపావళి వంటి పండుగ సమయాల్లో పగటి వేషాలు వేస్తూ జీవనోపాధిని పొందుతుంటారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్థనారీశ్వరుడు, భీముడు, ఆంజనేయుడు, శక్తి వంటి వేషాలు వేస్తుంటారు. మిగిలిన సమయాల్లో ఆలయాల్లో భజనలకు వెళ్తుంటారు. ఇప్పుడూ ఆ వేషాలు వేసి రక్తి కట్టిస్తున్నా.. భుక్తిని సంపాదించుకోవడమే కష్టతరమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అరచేతిలోని స్మార్ట్ఫోనే వినోదాల సునామీకి వేదికగా మారింది. వీధి నాటకాలు కనుమరుగైపోయే పరిణామమే కాదు.. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే రోజులే గత కాలపు ముచ్చటయ్యే పరిస్థితి పొంచి ఉన్న రోజులివి. ఇక పగటి వేషాల దుర్గతి చెప్పేదేముంది! అయితే తాత ముత్తాతల నుంచి వస్తున్న వృత్తిని వదులుకోలేక, కాలం తెచ్చిపెట్టే మార్పులకు తగ్గట్టు మారలేక నలిగిపోతూనే.. కాలం నెట్టుకొస్తున్నామంటున్నారు బుడగజంగాల పెద్దలు. అయితే ఈ కళ తమతోనే ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయని, తరువాత తరాలు ఈ వృత్తిని కొనసాగించడానికి ఇష్టపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో పగటి వేషాలు వేస్తూ సంచరిస్తున్న వీరు పలకరించిన ‘సాక్షి’తో తమ మనోగతాన్ని, మనోవేదనను పంచుకున్నారు. తమది ప్రాచీన కళ అని, పూర్వం రాజులు పోషించేవారని, ఆ తరువాత తమ తండ్రుల వరకు జమీందార్లు, భూస్వాములు, పెద్దలు సహకరించారన్నారు. ప్రస్తుత కాలంలో ఈ కళలను పోషించేవారు లేరన్నారు. నేటి తరం వారికి తమ ప్రత్యేకత గురించి తెలియడం లేదని, చెప్పినా అర్థం చేసుకునే తీరుబడి వారికి ఉండటం లేదని నిట్టూర్చారు. యువతరం విముఖత తమ పిల్లలు చదువుకుంటూ తమలా పగటి వేషాలు వేసేందుకు ఇష్టం చూపడం లేదన్నారు. ఇంటర్, 10వ తరగతి చదువుతున్న తన ఇద్దరు పిల్లలు అప్పుడప్పుడూ వారి విద్యాసంస్థల్లో కార్యక్రమాలు జరిగితే ప్రదర్శనలు ఇస్తుంటారని, బయటకు వచ్చి వేషాలు వేయడానికి ఆసక్తి చూపడం లేదని ఓ కళాకారుడు చెప్పారు. వారిలో కూడా కళాభిమానం ఉన్నా స్టేజ్ ప్రోగ్రామ్‌ల వరకే ఆసక్తిని చూపిస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం అంతంత మాత్రమే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాజధాని హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రోగ్రామ్‌లు చేయడానికి అవకాశం ఉండేది. విభజన తరువాత మన రాష్ట్రంలో ఆ విధమైన ప్రోత్సాహం లేదు. తెలంగాణాలో మనల్ని అడుగుపెట్టనివ్వడం లేదు. అక్కడ రవీంద్రభారతిలో తరచు ప్రోగ్రామ్‌లు జరిగేవి. ఇప్పుడు తెలంగాణా వారే చేస్తుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం చేయడానికి మాత్రం ఏడాదిలో ఒకటి రెండు అవకాశాలు ప్రభుత్వపరంగా లభిస్తున్నాయి. సమాచారశాఖ, పర్యాటకశాఖ, డీఆర్‌డీఏల నుంచి ఈ విధమైన కార్యక్రమాలు ఎక్కువగా...ఏజెన్సీ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా, జ్వరాలు, మూఢనమ్మకాల వంటి వాటి పైన, కాలుష్యాలు, కరెంటు కోతలు, స్వచ్ఛభారత్ మొదలైన కార్యక్రమాల పైన ఉంటాయి. అంతేతప్ప కళాకారుల అభ్యున్నతికి, కళల ఆదరణకు ప్రభుత్వపరంగా ఎటువంటి ప్రోత్సాహం ఉండటం లేదు. –మిరియాల ప్రసాద్, శాటిలైట్ సిటీ, రాజమహేంద్రవరం రాష్ట్ర విభజనతో నష్టపోతున్నాం.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పర్యాటక శాఖ ద్వారా మన రాష్ట్రంలోనే కాక కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సాలకు తీసుకువెళ్లడం, అక్కడి వారిని ఇక్కడకు తీసుకురావడం జరుగుతుండేది. అలాగే అండమాన్ కూడా తీసుకువెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ విధంగా శ్రద్ధ తీసుకునే పాలకులు లేరు. మేము యక్షగానం ప్రదర్శన కూడా ఇస్తుంటాం. టీవీలలో బుర్రకథ, హరికథ, పగటి వేషాలు, జానపద గీతాలు చేస్తుంటాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రవీంద్రభారతిలో ఏడాదికి ఐదారు ప్రదర్శనలకు అవకాశం ఉండేది. విడిపోయిన తరువాత హైదరాబాద్ అంతా తెలంగాణా వారికే పరిమితం అయిపోయింది. –మిరియాల గంగాధర్, శాటిలైట్‌సిటీ, రాజమహేంద్రవరం -
జూన్ 30 అర్థరాత్రి జీఎస్టీ లాంచ్
న్యూఢిల్లీ: ఒక దేశం ఒక పన్ను విధానంలో భాగంగా జూలై 1నుంచి జీఎస్టీ అమలుకు కేంద్రం కసరత్తును పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును జూన్ 30 అర్థరాత్రి లాంచ్ చేయనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు. పార్లమెంట్ సెంట్రల హాల్ లో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రపతి సమక్షంలో నిర్వహించనున్న ఈ ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్ కేంద్ర మంత్రులు, సహా జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని జైట్లీ చెప్పారు. అలాగే మాజీ ప్రధానులు మన్మోహన్, దేవెగౌడ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థకమంత్రులను ఆహ్వానించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా జీఎస్టీపై రెండు షార్ట్ ఫిలింలను ప్రసారం చేస్తామని జైట్లీ ప్రకటించారు. -
ప్రభుత్వ కార్యక్రమంలో మహిళలతో డ్యాన్స్‌లు
-
పీటీపీకి రూ.22 కోట్ల నిధులు
పెంటపాడు: మేలుజాతి పశువుల అభివృద్ధి పథకానికి (పీటీపీ) ప్రభుత్వం రూ.22 కోట్ల నిధులు అందించనున్నట్టు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పాకలపాటి గాంధీ తెలిపారు. పెంటపాడులో గోపాలమిత్ర సూపర్వైజర్ల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్ల ప్రోగ్రాంలో భాగంగా పలు జిల్లాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. దీనిలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని ఎక్కువ పాలనిచ్చే ముర్రాజాతి ఆవులు, గిత్తల యజమానులను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలోనే ఇతర జాతులను అభివృద్ధి చేయడమే పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. జిల్లాలో 15 జాతుల స్వదేశీ పశువులతో కామధేను పథకం, రూ.10 కోట్ల నిధులతో సంచార వైద్యశాలల అభివృద్ధి పనులను వచ్చేనెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గోపాలమిత్రల సంఘ అధ్యక్షుడు వి.సుబ్బారాయుడు, సాయిబాబు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
సబ్సిడీ సొమ్ము మళ్లింపుపై విచారణ
ఏలూరు సిటీ : సబ్సిడీ సొమ్ము మళ్లింపుపై విచారణ జరిపి 48 గంటల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్‌ను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. –ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏడాది క్రితం తనకు రూ.లక్ష రుణం మంజూరు కాగా ఈ మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాలో కాకుండా మునిసిపల్ ఉద్యోగి ఖాతాలో జమచేశారని నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన సాలి జ్యోతి అనే మహిళ ఫిర్యాదు చేశారు. తనకు మంజూరైన సొమ్ములను ఇమ్మని అడిగితే మునిసిపల్ ఉద్యోగి ఖర్చయిపోయిందని చెబుతున్నారని, న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సబ్సిడీ సొమ్ము ఎవరు మళ్లించారో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఏజేసీ షరీఫ్‌కు ఆదేశించారు. – దేవ సహకార సొసైటీలో సొమ్ము డిపాజిట్ చేస్తే తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని పెనుగొండ మండలం ములపర్రు గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. –తణుకు 25వ వార్డుకు చెందిన ఉంగరాల ముత్యాలరావు మాట్లాడుతూ కాపు రుణం సబ్సిడీ సొమ్ము ఏడాది నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు విడుదల చేయడం లేదని చెప్పగా ఎల్డీఎం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. –ఏలూరు వన్‌టౌన్‌లోని ఎస్బీఐ బ్యాంకులో తనకు జీరో బ్యాలెన్స్ ఖాతా ఉండగా హోల్డ్‌లో పెట్టారని ఏలూరు నుంచి మణిప్రియాంక ఫిర్యాదు చేశారు. –తాను స్మార్ట్ పల్స్ సర్వే చేసినందుకు రావాల్సిన వేతన బకాయిలు ఇవ్వలేదని తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన గెడ్డం రాంబాబు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. 2 గంటల్లోగా సొమ్ము చెల్లించాలని కొవ్వూరు ఆర్డీవోను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, మైనార్టీ కార్పొరేషన్ అధికారి సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వ్యాపారాలు చేసేందుకు రుణాలు జిల్లాలో పేదలు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు అందిస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన సమీక్షించారు. 137 వృత్తుల్లో శిక్షణనిచ్చి సబ్సిడీ రుణాలను అందిస్తామని, దీంతో వ్యాపారం చేసుకుని ఎదగాలని సూచించారు. 2016–17లో 2 వేల మంది బీసీలకు రూ.20 కోట్ల సబ్సిడీ సొమ్ము అందించాలని లక్ష్యంగా నిర్ణయిస్తే 2017–18 ఆర్ధిక సంవత్సరంలో రూ.22 కోట్లు సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వ్యాపారం పెట్టకుండా సబ్సిడీ రుణాలు పొందే లబ్దిదారులపై చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. రూ.350 కోట్లతో క్రీడా ప్రణాళిక జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ. 350 కోట్ల క్రీడా ప్రణాళికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లాలో మంజూరైన క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి తగు ప్రతిపాదనలను రాష్ట్ర క్రీడా సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. జలక్రీడలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్రకాలువ ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు. రూ.8 కోట్ల వ్యయంతో నాలుగు క్రీడా వికాస కేంద్రాలు ప్రభుత్వం మంజూరు చేసిందని, నరసాపురం మండలం మొగల్తూరు, ఉంగుటూరు మండలం భీమడోలు, తణుకు, తాడేపల్లిగూడెంలో ఇండోర్ స్టేడియాలు నిర్మించనున్నట్టు చెప్పారు. ఆధార్ అనుసంధానం చేయాలి ఏలూరు సిటీ: జిల్లా జనాభా 39 లక్షల మంది ఉంటే 47,50,472 బ్యాంకు ఖాతాలున్నాయని ఈ ఖాతాలన్నీ ఆధార్‌తో అనుసంధానం చేస్తే నగదురహిత లావాదేవీలు సులభతరం అవుతాయని కలెక్టర్ భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లో నగదురహిత లావాదేవీల అమలుతీరుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకూ 24 లక్షల 324 ఖాతాలకు మాత్రమే ఆధార్ అనుసంధానమయ్యిందన్నారు. రెండు రోజుల్లో 400 ఆర్టీసీ బస్సుల్లో నగదురహిత టికెట్ ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 496 మద్యం దుకాణాలకు గాను 200 చోట్ల నగదురహిత లావాదేవీలు అమలు చేస్తున్నారన్నారు. 108 రైతుబజార్ దుకాణాల్లో కూడా నగదురహిత లావాదేవీల అమలు చేయాలన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకూ YSR
-
విశాఖ జిల్లాలో జోరుగా గడపగడపకూ YSR
-
ఎస్సీ యువత కోసం ‘యువస్ఫూర్తి’
ఏలూరు (మెట్రో) : ఎస్సీ యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం ‘యువస్ఫూర్తి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఆర్కేఆర్ విజయకుమార్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘యువస్ఫూర్తి’ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగుల కోసం ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని 15 వందల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. వీరందరూ గ్రామాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే సేవల గురించి అవగాహన కల్పించాలని విజయకుమార్ కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. -
తోలు బొమ్మలాట.. వారేవా..!
గుంటూరు ఎడ్యుకేషన్: కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో బుధవారం తోలు బొమ్మలాట ప్రదర్శన ఇచ్చారు. జిల్లాలోని కట్టుబడివారి పాలేనికి చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు కుమార్ బృందం ఇచ్చిన ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి పి. రామచంద్ర రాజు మాట్లాడుతూ భారతదేశంలో కనుమరుగైపోతున్న ప్రాచీన కళల్లో ఒకటైన తోలు బొమ్మలాటను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కళాకారులు తమ నైపుణ్యంతో రాజులు, పురాణ పురుషులను బొమ్మలుగా చేసి కర్రల ఆధారంతో వాటిలో కదలికలు తెచ్చి కళ్లకు ఆకట్టుకునే విధంగా ప్రదర్శించడం కళాకారుల్లో నైపుణ్యానికి అద్ధం పడుతుందన్నారు. ఈసందర్భంగా తోలుబొమ్మలాట కళాకారులు రామాయణ గాధను ప్రదర్శించారు. అనంతరం కళాకారులను సత్కరించి, పారితోషికాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిన ఎన్వీఎస్ శాంతారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ విద్యా వైజ్ఞానిక రాష్ట్ర మహాసభలు
-
రేపు మంత్రి పర్యటన
కాగజ్‌నగర్ : రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం కాగజ్‌నగర్‌లో పర్యటిస్తారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం తెలిపారు. మధ్యాహ్నం కాగజ్‌నగర్ చేరుకొని పలు చోట్ల హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతారని పేర్కొన్నారు. మంత్రి పర్యటనను జయప్రదం చేయడానికి సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
ప.గో.జిల్లాలో గడప గడపకువైఎస్సార్సీపీ
-
ప్రధానిని ఫాలోఅవుతున్న ముఖ్యమంత్రి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టయిల్‌ను ఫాలో అవుతున్నారు. ప్రధాని నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తరహాలో ఆయన కూడా ఆకాశవాణి ద్వారా రైతులను కలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వ అధికారిక ప్రసారమాధ్యమం ఆకాశవాణిని ఎంచుకున్నారు. 20 నిమిషాలు పాటు ప్రత్యక్షంగా రేడియో ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గత రెండు నెలలుగా ధరల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతులను పలకరించారు. తన రేడియో సందేశం ద్వారా రైతు సోదరులలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. త పంట నష్టపోతున్న రైతుల కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే హెల్ప్‌లైన్‌ను వాడుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. పంటల రకాలు, పంట విధానాలు తదితర విషయాలపై వ్యవసాయ శాఖ అధికారుల సహాయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దీంతోపాటు ఈ కార్యక్రమం ద్వారా రైతులకు చెల్లించాల్సిన బాకీలను జూన్ చివరికల్లా చెల్లిస్తామని హామీ వచ్చారు. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పంపిణీ పథకం 'అన్నభాగ్య' కు రేడియో ద్వారా విస్తృతప్రచారాన్ని కల్పిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేడియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిత్వ వర్గాలు ధృవీకరించాయి. అవసరం ఏర్పడినపుడల్లా రేడియో కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను కలవనున్నారని వెల్లడించాయి. -
చెర వీడేనా ?
యథేచ్ఛగా చెరువుల ఆక్రమణ నీరు - చెట్టు కార్యక్రమంలోనైనా ప్రభుత్వ పరమయ్యేనా ? అక్రమార్కులకు వరమైన రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తత ఆక్రమణ ల్లో 71.51 ఎకరాల చెరువుల భూములు వాటి విలువ రూ.7 కోట్లపైనే.. ‘చెట్లు పెంచుదాం..చెరువుల్ని సంరక్షిద్దాం..నీటి వృథాని నిలువరిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం నీరు-చెట్టు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో పూడికతీత కార్యక్రమాలను వేగవంతం చేయాలని సాక్షాత్తు సీఎం అధికారులను ఆదేశించారు. కానీ అందుకు అనుగుణంగా అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. వందలాది ఎకరాల చెరువుల భూములు అధికార పార్టీ నేతల కబంద హస్తాల్లో చిక్కుకుపోయినా నోరు మెదపడం లేదు. కొండలు, వాగులు, చెరువు కట్టలూ వదలకుండా కబ్జా చేసేస్తున్నా చోద్యం చూస్తున్నారు. తాళ్లూరు : చెరువుల్లో పూడిక తీసి వాటికి పూర్వవైభ వం తేవడం సంగతి అటుంచి..ఉన్న చెరువుల్నీ ఆక్రమిస్తున్నారు అధికార పార్టీ నేతలు. సోమవరప్పాడు రెవెన్యూ పరిధిలోని సుబ్బన్న చెరువు సర్వే నంబర్ 324,325,326లో 61.24 ఎకరాలు ఉన్నాయి. అందులో 2001లో ఏక్‌సాల్ పట్టాలు ఇచ్చారంటూ కొందరు 12 ఎకరాలు ఆక్రమించి సుబాబుల్ సాగు చేశారు. 2007లో రెవెన్యూ యంత్రాంగం సాగును అడ్డుకోగా ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. స్టే తొలగింపజేసి చెరువును ఆక్రమణ చెర నుంచి విడిపించడంలో రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపలేదు. నాటి నుంచి సుబాబుల్ పెంపకం సాగుతూనే ఉంది. వారిబాటలోనే మరో 18 ఎకరాలను అదే గ్రామానికి చెందిన వారు ఆక్రమించారు. ఇదేమిటి అని అడిగిన నాథుడే లేడు. దీంతో సోమవరప్పాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 336లో 5.25 ఎకరాలు, స.న.337లో 5.90 ఎకరాలు, స.న.339లో 6.72 ఎకరాలు, స.న.322/1లో 23.72 ఎకరాలను తూర్పుగంగవరం గ్రామానికి చెందిన పలువురు అధికార పార్టీ నేతలు 2014 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆక్రమించారు. కొండలు, వాగులు, చెరువుల కట్టలను సైతం భారీ యంత్రాలతో చదును చేసేశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. తాజాగా వెలుగువారిపాలెం పంచాయతీ పరిధిలోని ఓసీ శ్మశానం యలమందవాగు ప్రాంతంలోని వాగు పోరంబోకు, శ్మశాన స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఈ సమస్యపై గ్రామస్తులు తహశీల్దార్‌ను కలిస్తే గ్రామాల్లోని వాగులు, వంకలు తమ పరిధిలోకి రావని..పంచాయతీ వాటిని సంరక్షించాలని చెప్తుండగా...పంచాయతీ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదని అటుండటంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది. మొత్తం రూ.7 కోట్లకుపైగా విలువైన చెరువుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. కనీసం నీరు-చెట్టు పథకం అమలులో భాగంగానైనా గ్రామాల్లో చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించి వాటికి పూర్వవైభవం తేవాలని ప్రజలు కోరుతున్నారు. భూ కబ్జా చట్టం అమలు ఎక్కడ.. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై, ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టేందుకు 1982లో భూకబ్జా చట్టాన్ని తెచ్చారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అందుకు తిలోదకాలిచ్చారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు రుజువైతే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోవటంతో ధన, రాజకీయ బలవంతులు దౌర్జన్యంతో చట్టాలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కళ్లు తెరచి కబ్జా అయిన వాగులు, వంకలను గుర్తించి రూ కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, లేకుంటే గ్రామాల్లో శ్మశానాలు సైతం మాయమయ్యే రోజులు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటా పి.సరోజిని, తహశీల్దార్ నూతనంగా బాధ్యతలు చేపట్టాను. కొత్తగా ఏవైనా ఆక్రమణలు ఉంటే చెప్పండి. గతంలో జరిగిన ఆక్రమణలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాను. -
మొక్కుబడిగా...
పార్వతీపురం : ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మొక్కుబడిగా సాగింది. వారం రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఉపాధ్యాయులు, అధికారులు ర్యాలీలకే పరిమితం చేశారు. ముఖ్యంగా పార్వతీపురం సబ్‌ప్లాన్‌లోని మండలాల్లో కొన్ని గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ బడి బయట చాలామంది పిల్లలు ఉన్నారన్నది సత్యం. ఎనిమిది మండలాల్లో సుమారు 700 వరకు డ్రాపౌట్స్ ఉన్నట్టు సమాచారం. వీరిలో కనీసం 50 శాతం మందిని కూడా అధికారులు పాఠశాలల్లో చేర్చలేకపోయూరు. గత ఏడాది 673 మంది వరకు బడిబయట పిల్లలను గుర్తించి ఆ మేరకు పాఠశాలల్లో చేర్పించకపోవడంతో వారంతా పశువులు కాపర్లుగా, బాల కార్మికులుగా మిగి లారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. పార్వతీపురం మండలంలో 56 పాఠ శాలలుండగా, 35 మంది బడిబయట ఉన్న పిల్లలున్నారు. వీరిలో 25 మంది జాయిన్ అయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో 188 పాఠశాలలుండగా దాదాపు 137మంది వరకు బడిబయట ఉన్న పిల్లలున్నారు. వీరిలో 83మందిని చేర్పించారు. గరుగుబిల్లి మండలంలో 35మంది పిల్లలు డ్రాపౌట్స్ ఉండగా, 9 మంది మాత్రమే చేరారు. అలాగే బలిజిపేట మండలంలోని 38 మంది డ్రాపౌట్స్ ఉండగా 9 మంది మాత్రమే పాఠశాలల్లో చేరారు. ఇలా కనీసం 50 శాతం కూడా బడిబయట ఉన్న పిల్లల్ని బడిలోకి చేర్చకుండా మొక్కు బడిగా ర్యాలీలు, సహపంక్తి భోజనాలతో ‘బడి పిలుస్తోంది’ని మ మ అనిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆ 48 గంటలు..
'బాబాయ్.... డాడీ... మమ్మీ...చెల్లి ఎక్కడ.... ఇంకా నాన్న లేవలేదా... ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారు. నాకు మమ్మీ....డాడీ...చెల్లిని చూపించండి...' అంటూ శ్రీనివాస్ కుమారుడు అజయ్ రామ్ అనటంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. బాలుడి ఆవేదన చూసి దుఃఖం ఆపుకోలేకపోయారు. ప్రమాదంలో గాయపడి మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ రామ్ ను తండ్రికి దహన సంస్కారాలు చేసేందుకు రొంపికుంట తీసుకు వచ్చారు. శ్రీనివాస్ తండ్రి రాజేశం మనవడు అజయ్ రామ్ చేత తలకొరివి పెట్టించాడు. సాక్షి, మంచిర్యాల/మందమర్రి: అది మందమర్రి-శ్రీరాంపూర్ రహదారి. మందమర్రి దాటిన తర్వాత మధ్యలో పాలవాగు బ్రిడ్జి. దానికి 15 అడుగుల కింద రెండు మృతదేహాలు.. వాటిపక్కనే రెండు జీవచ్ఛవాలు. అలా ఒకటికాదు, రెండుకాదు.. 48గంటలు. బ్రిడ్జి పైనుంచే నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ బ్రిడ్జి కిందనున్న శవాలను.. జీవచ్ఛవాలను ఎవరూ గమనించలేదు. రక్తగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లి.. మెలకు వ వచ్చినప్పుడల్లా క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. తమవారికి ప్రమాదం జరిగిందని తెలిసినా బంధువులు, పోలీసులు రెండు రోజులకు గానీ సంఘటన స్థలాన్ని గుర్తించలేదు. చివరకు వారివద్ద ఉన్న సెల్‌ఫోనే వారి ఆచూకీని చూపెట్టింది. కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ కుందారపు శ్రీనివాస్, భార్య శ్రీలత, కుమారుడు అజయ్‌రామ్, కుమార్తె దీక్షిత గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా మందమర్రి బంధువుల ఇంట్లో జరిగిన దశదినకర్మకు వెళ్లారు. తోడళ్లుళ్లు, అక్కా చెల్లెళ్లు, అమ్మమ్మ, పిన్నిలతో శ్రీనివాస్ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లిని సెకండ్‌జోన్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 7గంటలకు ద్విచక్ర వాహనంపై రొపింకుంటకు బయల్దేరారు. అప్పటికే రాత్రయింది! ‘గింత చీకటైంది. పొద్దున్నె వెళ్లండి బిడ్డా..’ అని బెల్లంపల్లిలోనే ఉండే శ్రీలత తల్లి లక్ష్మి అన్నది. మనమరాలు దీక్షిత అమ్మమ్మ చేయి పట్టుకుని వదల్లేదు. ‘వచ్చింది కర్మకు కాబట్టి ఉండద్దనే ఉద్దేశంతో వెళ్లింది నాబిడ్డా. చీకట్లో జాగ్రత్తగా పొమ్మని చెప్పాను. అయినా పండుగ దగ్గర్లోనే ఉంది. రాత్రి 8.30 వరకు చేరుకుంటుం. ఎప్పుడు పోతలేమానె. చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తా’ అని చెప్పి శ్రీలత, శ్రీనివాస్ పిల్లలు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు’ అని రోదించుకుంటూ చెప్పింది లక్ష్మి. ఇంతలోనే ఘోరం.. శ్రీనివాస్ కుటుంబసభ్యులు మందమర్రి దాటి పాలవాగు వద్దకు చేరుకోగానే కల్వర్టు వద్ద పాము అడ్డుగా వచ్చింది. శ్రీనివాస్ బైక్ నడుపుతుండగా ముందు దీక్షిత కూర్చుంది. డాడీ పాము అనగానే శ్రీనివాస్ భయంతో కంగారుపడ్డాడు. ఇంతలోనే బైక్ కల్వర్టుకు ఢీకొని లోయలో పడింది. కిందనున్న పదునైన బండలపై పడడంతో శ్రీనివాస్, దీక్షిత తలలకు తీవ్ర తీవ్రగాయాలయ్యాయి. పడడంతోనే శ్రీనివాస్ చనిపోగా, దీక్షితకు బలమైన దెబ్బలు తాకడంతో మంచినీళ్లు.. మంచినీళ్లు అని అరిచింది. రెండు గంటల తర్వాత మృతిచెందింది. అభిరామ్ పడడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతని కాలు విరిగింది. వెనుక కూర్చున్న శ్రీలతకు నడుంపై దెబ్బలు తాకాయి. కదల్లేని పరిస్థితి. చుట్టూ చీకటి ఉండడంతో ఎవరూ కనిపించలేదు. ఆమె అరుపులు ఎవరూ వినలేదు. ఆమె కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రాత్రి 11 గంటల వరకు అజయ్‌రామ్‌కు మెలుకువ వచ్చింది. వినిపించని ఆర్తనాదాలు.. చుట్టూ కటిక చీకటి.. చెట్లు.. చిమ్మట పురుగుల గోల.. ముళ్ల కంపలు.. రాళ్లు రప్పలపై రక్తపు మడుగులో తండ్రి, చెల్లెలు మృతదేహాలు.. మరోవైపు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి. భయానకం కొలిపే దృశ్యాలు. ఎటూ చూసినా కటిక చీకటి. పామును చూసిన భయంతో ఎటునుంచి వస్తుందోనని బాలుడి భయం.. కాపాడండని కేకలు వేశాడు. ఇంతలోనే మళ్లీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గురువారం రాత్రి గడిచింది. శుక్రవారం వేల వాహనాలు ఆ కల్వర్టు పై నుంచి వెళ్లాయి. ఎవరూ గమనించలేదు. ఆ రోజు కూడా గడిచింది. ఇలా 48 గంటలు తల్లీ, కొడుకు జీవచ్ఛవాల్లా ఉన్నారు. శనివారం ఉదయం సృ్పహకోల్పోయిన శ్రీలతకు మెలుకువ వచ్చింది. కదులుదామంటే కదలలేని స్థితి. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసి చూసే సరికి వందల కొద్ది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కుటుంబసభ్యులకు తెలియజేయాలని తాపత్రయ పడింది. కమాన్పూర్లోని తన బంధువులకు ఫోన్ చేసి తమకు ప్రమాదం జరిగిందని.. గోదావరిఖనిలోని రాజేశ్ టాకీస్ దగ్గర అని.. సృ్పహ కోల్పోయింది. వెతికి వెతికి వేసారి.. కమాన్‌పూర్, మందమర్రిలోని కుటుంబసభ్యులు ఉదయం నుంచి రహదారి వెంట వెతికారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, కుటుంబసభ్యులు వెతికినా ప్రయోజనం లేదు. ఇరువురు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ రింగవుతుంది కాని ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఈ రింగ్ కల్వర్టు పైనుంచి పోయే వారికి వినిపించని పరిస్థితి. అంతలోనే మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మేలుకొవ వచ్చిన అభిరామ్ ఫోన్ శ బ్దం విని మాట్లాడాడు. ‘పిన్ని దాహం అవుతుంది.. ఆకలవుతుంది..’ అంటూ ఏడ్చారు. అదే సమయంలో పోలీసులు సిగ్నల్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే బాధిత కుటుంబసభ్యులతో కలిసి మందమర్రి-శ్రీరాంపూర్ మధ్యలో ఉన్న కల్వర్టుల వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు కల్వర్టు కింద శనివారం రాత్రి 10 గంటలకు వారిని గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న అభిరామ్‌ను, శ్రీలతను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. -
హింస లేని సమాజం కోసం పాటుపడండి
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : హింస లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. మానవ హక్కులే మహిళల హక్కులని నినదించారు. ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఐద్వా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.దిల్షాద్, మహిళల హక్కుమాట్లాడుతూ దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరగడం వల్ల మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను వ్యాపార వస్తువుగా చిత్రీకరించే ధోరణి పెరిగిందన్నారు. సైబర్‌నేరాలు కూడా పెరిగిపోయాయని తెలిపారు. ‘నిర్భయ’ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు ఎన్ని తెచ్చినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే నిర్వీర్యం కాకతప్పదన్నారు. మహిళల రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నేతలు అరుణ, బి.లక్ష్మిదేవి, రామాంజినమ్మ, అనంతమ్మ, సరళ, క్రాంతి, భాగ్య, ఫరియాద్, సులోచన, విజయతోపాటు మహిళలు పాల్గొన్నారు. -
ఓటర్ల నమోదు కార్యక్రమం
విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్: కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ఓటికుండ వ్యవహారంలా మారింది. ఒక వైపు భారీ ఎత్తున ప్రచారం చేస్తూ మరో వైపు హక్కు ఉన్నవారికి ఓటులేకుండా చేస్తున్నారు. ప్రజాస్వామ్యమనే పునాది నిర్మాణానికి మూలస్తంభం ఓటు. అంతటి ప్రాధాన్యం ఉన్న విషయంలో ఓటరుగా చేరడానికి యువత ఆసక్తి కనబరచడం లేదు. దానికి తోడు ఓ వైపు ఓటు వజ్రాయుధం అని ప్రసంగాలు చేస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఓటర్ల నమోదు కన్పించడం లేదు. దీనిపై పాలకులు సైతం పెద్దగా శ్రద్ధ కనుబరచడం లేదు. దీంతో ప్రతి ఏడాదీ ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రంగానే ఉంటున్నాయి. యువత భాగస్వామ్యం పెరిగితే తమ ఉనికికే ప్రమాదమని భావిస్తున్న కొంతమంది నేతలు పూర్తిస్థాయిలో ఓటరు నమోదుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గణాంకాలు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓటరుగా చేరడానికి వేలాది మందికి అవకాశం ఉన్నప్పటికీ ముందుకు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీని వల్లే 50 ఏళ్లు వయసున్న కొంతమందికి ఓటు లేకుండా పోయింది. బొండపల్లి మండలంలో ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. ఇక్కడ బీఎల్ఓలుగా ఉన్న వారిలో అధికంగా అధికార పార్టీనాయకులు,వారి కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉండే వారే కావడంతో తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన దంపతులతో పాటు ఎక్కడా ఓటు లేకుండా ప్రస్తుతం అదే గ్రామంలో స్థిరనివాసం ఉంటున్నప్పటికీ వారికి ఓటరుగా చేరే అవకాశం లభించడం లేదు. అవకతవకలకు పాల్పడుతున్న వారిపై ఎటువంటిచర్యలు తీసుకోవడం లేదు. ఇదీ పరిస్థితి జిల్లా జనాభా 23.42 లక్షలు. అందులో 16.19 లక్షల మంది ఓటర్లు. వారిలో మహిళా జనాభాతో పాటు మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అయితే 18 ఏళ్లు దాటిన యువఓటర్ల నమోదు అంతంతమాత్రంగానే ఉంది. జనాభా ప్రకారం 68.34 శాతం మంది ఓటర్లు ఉండాలి. జిల్లాలో ఆ సంఖ్య పెరగాల్సి ఉంది. అలాగే జనాభా ప్రకారం 18 ఏళ్లు దాటిన యువకులు 53 వేల మంది ఉండగా కేవలం ఇప్పటివరకూ 22వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. ఈ పరిస్థితి చూస్తే యువత ఓటరుగా నమోదులో ఎంత ఆసక్తి చూపిస్తున్నారో స్పష్టమవుతోంది. ప్రభుత్వ అధికారుల సన్నాహాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రచారానికే పరిమితమవుతున్న ప్రత్యేక క్యాంపులు... శతశాతం ఫొటోతో కూడిన ఓటరు జాబితా సిద్ధం చేయడమే లక్ష్యమని అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలకు పొంతన లేకుం డా పోతోంది. డిసెంబర్ 10 వరకూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి గాను ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఓటు చేర్పు,మా ర్పులు,తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలి. దీనికోసం బీఎల్ఓలు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అందుబాటులో ఉండి క్లెయిములు స్వీకరించాలి. అయితే ఇది ప్రచారం వరకూ బాగానే జరుగుతున్నా అనేక కేంద్రాల్లో బీఎల్ఓలు పత్తా ఉండడం లేదు. ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న కంటోన్మెంట్ ఆర్సీఎం పాఠశాల ఆవరణలో బీఎల్ఓ లేరు. ఇక్కడ ఓటరుగా నమోదయ్యేందుకు వచ్చిన వారు అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. దీంతో అక్కడ ఫోన్ నంబరు కోసం వెతికారు. అది కూడా కన్పించక పోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరి కొంతమంది ‘ న్యూస్‌లైన్’ రిపోర్టర్లకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. అధికారులకు సమాచారం అందించడంతో ఎట్టకేలకు ఆర్ఐని కేంద్రంలో అందుబాటులోకి తెచ్చారు. పట్టణం నడిబొడ్డున ఉన్న పాఠశాలల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదేమో. ఈమె పేరు బి. రాజమ్మ. బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామం. వయస్సు 45 సంవత్సరాలు పైనే. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈమె ఓటు వేసింది. విచిత్రమేమిటంటే ఓటరు జాబితాలో ఇప్పుడు ఈమె పేరు లేదు. ఈ మధ్యకాలంలోనే విషయం తెలిసింది. ఓటు హక్కు కోసం మళ్లీ ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఈమె అయోమయంలో ఉంది. ఈమె పేరు పి. రామలక్ష్మి. బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామం. ఈమెకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. రేషన్ కార్డు కూడా ఉంది. ఓటు హక్కు కోసం రెండు దఫాలు దరఖాస్తు చేసుకుంది. అయినా ఓటరు జాబితాలో పేరు లేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఏదీ మార్పు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అమలు చేస్తున్న మార్పు కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మాతా, శిశుమరణాలను నివారించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా తీసుకుంటున్న పలు రకాల కార్యక్రమాల వలన మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషణ స్థాయిలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ మాతృమరణాల రేటు లక్షకు 134, శిశుమరణాల రేటు 46గానే ఉంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా అనుబంధ పోషకాహారం, ఆరోగ్య, పోషక విద్యా కార్యక్రమాలు 35 ఏళ్లుగా చేపడుతున్నప్పటికీ ఇంకా 19.4 శాతం పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. మరో 37 శాతం మంది మూడేళ్లలోపు వయసు పిల్లలు ఉండవలసిన బరువు కంటే తక్కువగా ఉండటంతో పాటు 56 శాతం మంది గర్భిణీలు రక్తహీనతకు గురవుతున్నారు. మాతృ, శిశుమరణాలు ఎక్కువగా ఉండటానికి పోషకాహర లోపమే ప్రధాన కారణం. ఇందుకోసం మార్పు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మార్పు’లో భాగంగా ప్రధానంగా 20 లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి నెల అధికారులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాలుగు మార్లు సమావేశాలను నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ప్రతినెల తొలి మంగళవారం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో, రెండో మంగళవారం క్లస్టర్ పరిధిలో, మూడవ మంగళవారం జిల్లా స్థాయిలో, 4వ మంగళవారం గ్రామ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 14 క్టస్లర్లు ఉండగా వీటిలో జరిగే సమావేశాలకు క్లస్టర్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, ఆయా పీహెచ్‌సీల డాక్లర్లు, మెడికల్ సూపరింటెండెంట్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓ, సెర్ప్ ఏపీఎం, మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఏరియా కోఆర్డినేటర్లు హాజరు కావాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి డీఎంహెచ్ఓ కన్వీనర్‌గా, ఐసీడీఎస్ పీడీ కో కన్వీనర్‌గా, మెంబర్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లాలోని ఆయా క్లస్టర్లకు సంబంధించిన కన్వర్జెన్సీ ఆఫీసర్లు, ఆర్ఓఎంపీఓ, జెడ్పీ సీఈఓ, ఎస్ఈ పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తదితరులు పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సమావేశాలకు సగం మంది అధికారులు కూడా హాజరు కావడం లేదని సమాచారం. సీడీపీఓలు అసలు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ కార్యక్రమం ఆచరణలో సక్రమంగా అమలు కావడం లేదు. ఈమె పేరు సరస్వతి. నెలలు నిండిన ఈమెకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి పోషకాహారం అందలేదు. పోషకాహారం ఎక్కడికెళ్లి తెచ్చుకోవాలో తెలీదని అమాయకంగా చెబుతోంది. ఈమె పేరు బత్తల నాగేశ్వరి. ఈమెకు ప్రస్తుతం మూడో సంతానం. బాలింతగా ఉన్న ఈమెకు ఎలాంటి పోషకాహారం అందడం లేదు. -
రచ్చబండలో ఎమ్మెల్యేని అడ్డుకున్న సమైక్యవాదులు
-
పోలీసుల నీడన రచ్చబండ
సాక్షి, గుంటూరు :‘రచ్చబండ’ కార్యక్రమం మూడో రోజు బుధవారం జిల్లాలో గట్టి పోలీస్ బందోబస్తు నడుమ జరిగింది. స్థానిక సమస్యలపై ప్రజలు అధికారు లను నిలదీస్తూ ఆందోళనలు చేయడంతో పోలీసులను మోహరింప జేశారు. తెనాలి నియోజకవర్గంలో రెండుచోట్ల, మున్నంగి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమానికి హాజరవగా, పొన్నూరులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, వినుకొండ నియోజకవర్గం నూజెండ్లలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యాన రచ్చబండ నిర్వహించారు. ఆయా చోట్ల ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశం వుందనే ముందస్తు సమాచారం మేరకు పోలీసులను భారీగా మోహరింపజేశారు. నేతలు, అధికారుల వద్దకు ప్రజలు రావడానికి కూడా వీల్లేని విధంగా పోలీసులు గట్టిబందోబస్తు పెట్టారు. అయినప్పటికీ, నేతలు ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలు స్థానిక సమస్యలపై నినాదాలు చేయడంతో అధికారులు బేజారెత్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు, వెళాంగిణి నగర్ ప్రాంతాల్లో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాజరైన రచ్చబండ కార్యక్రమాల్ని కూడా మమ అనిపించారు. రైతుల్ని పట్టించుకోని అధికారమెందుకు గృహ నిర్మాణం, రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర అంశాల ప్రాధాన్యతపైనే సాగిన రచ్చబండ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంటనష్టం జరిగినా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని పలు చోట్ల రైతులు ఎండగట్టారు. నూజెండ్ల మండలంలో 25 గ్రామాలకు కలిపి ఒకేచోట రచ్చబండ నిర్వహించడంతో ఆయా గ్రామాల నుంచి భారీస్థాయిలో జనం హాజరైనా ప్రజా సమస్యల ప్రస్థావనే రాలేదు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని తాయిలాల ‘వల’ విసురుతుందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న గృహనిర్మాణ బిల్లులపై ప్రజలు సంబంధిత శాఖ డీఈని నిలదీశారు. వివిధ పథకాల కింద దరఖాస్తులు పెట్టుకొనేందుకు ప్రజలు పోటీపడటంతో దళారులు ముందుగానే తీయించి తెచ్చుకున్న దరఖాస్తుల జిరాక్స్ కాపీలను ఒక్కొక్కటీ రూ.5, రూ.10కు అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. ఇక్కడే సీపీఐ నేతలు రచ్చబండకు వ్యతిరేకంగా నినాదా లిచ్చారు. ప్రతీ గ్రామానికి రచ్చబండ నిర్వహించడం మంచిదని ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రజలు ఖండించాలని ఆపార్టీ నేతలు బహిరంగంగా పిలుపునిచ్చారు.అధికారులపై మండిపాటు.. రచ్చబండకు సంబంధించి ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, లబ్ధిదారులకు సరైన సమాచారం అందజేయలేదని అధికారులపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆయా ప్రాంతాల్లో మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారుల పేర్లు పింఛన్ల జాబితాలో కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తూతూ మంత్రంగా సాగిన రచ్చబండ కార్యక్రమం
-
సమర్థంగా రచ్చబండ కార్యక్రమం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడానికి ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని అధికారులను ఇన్చార్జి కలెక్టర్ పి.ఎ.శోభ ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేకాధికారులు, తహశీల్దారులు, ఎంపీడీఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడత రచ్చబండ కార్యక్రమం ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా 19,307 మందికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. 55,335 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నామని, 29,047 మందికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 38 పనులకు శంకుస్థాపన జరుగుతాయని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 78 పనులకు గానూ రూ 17.60 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. 20 నుంచి 39 శాతం లోపు వికలాంగత్వం ఉన్న వారికి పింఛన్ కింద రూ. 200 అందజేయడానికి సదరమ్ కార్యక్రమం చేపట్టనున్నామని, అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. బంగారుతల్లి పథకం కింద మే 1 తర్వాత పుట్టిన అర్హత గల ఆడ పిల్ల పేరు నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుపాను నష్టం అంచనాలను సమగ్రంగా పొందుపర్చాలని సూచించారు. ఎస్.కోట, విజయనగరం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల అనుమతితో షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. సమావేశంలో ఏజేసీ యు.సి.జి. నాగేశ్వరరావు, పీఓ రజిత్కుమార్సైనీ, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, సీపీఓ బి.మోహనరావు పాల్గొన్నారు. రచ్చబండ షెడ్యూల్ ఖరారు నేడు జిల్లాలో ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న రచ్చబండ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం సాయంత్రానికి ఖరారవుతుందని ఇన్చార్జి కలెక్టర్ పి.ఎ.శోభ తెలిపారు. గురువారం జేసీ చాంబర్లో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల నుంచి విజ్ఞప్తులు కూడా స్వీకరిస్తామన్నారు. -
‘రచ్చబండ’ను విజయవంతం చేయాలి'
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 26 వరకు అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో నిర్వహించే మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. రచ్చబండ, ఉపాధి హామీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ విధాన గౌతమిహాలులో ఆమె ఎండీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అక్టోబర్ 24వ తేదీ వరకు అర్హులుగా గుర్తించిన లబ్ధిదారులకు ముందుగానే స్లిప్‌లు ఇచ్చి వారిని రచ్చబండ కార్యక్రమానికి తీసుకురావాలన్నారు. రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహనిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ఉంటుందన్నారు. అలాగే ఇందిరమ్మ కలలు కార్యక్రమం కింద మంజూరు చేసిన వివిధ పనులకు శంకుస్థాపనలుంటాయన్నారు. అలాగే ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బకాయిలు చెల్లిస్తారన్నారు. బంగారుతల్లి సర్టిఫికెట్లు, ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ మంజూరు చర్యలు చేపడతామన్నారు. మండలస్థాయిలో ఎండీవో నేతృత్వంలో తహశీల్దార్, డ్వామా, డీఆర్డీఏ ఏపీవోలు, విద్యుత్, హౌసింగ్ శాఖల ఏఈలు, ఇన్చార్జి మంత్రిచే నియమితులైన సర్పంచ్, ఒక మహిళా సభ్యురాలు, మరో సభ్యునితోపాటు ఇతర మండలస్థాయి అధికారులతో మండల టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో ఇన్చార్జి మంత్రి నామినేట్ చేసిన ముగ్గురు సభ్యులతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని ఇతర అధికారులు పాల్గొంటారన్నారు. వెంటనే సంబంధిత శాసనసభ్యులను సంప్రదించి మండలాలవారీ రచ్చబండ కార్యక్రమం తేదీలను ఖరారు చేసి పంపాలని ఎండీవోలను ఆదేశించారు. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్లు, స్త్రీశక్తి భవనాల నిర్మాణం, ఉపాధిహామీ పథకం, ఉద్యానవన పంటలు, మైక్రో ఇరిగేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో సీపీవో మహిపాల్, హౌసింగ్‌పీడీ సెల్వరాజ్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, డ్వామా ఇన్చార్జి పీడీ మల్లిబాబు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేడర్ తక్కువ.. లీడర్లే ఎక్కువ
సాక్షిప్రతినిధి, నల్లగొండ: గుంపుల గొడవలు.. నేతల ఆధిపత్య పోరుతో ఇప్పటికే దుకాణం మూసేసే ముప్పును ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ తన ఉనికి కాపాడుకునేందుకు నానాయాతన పడుతోంది. అధ్యక్షుడు, కోశాధికారి పదవులు మినహాయిస్తే, ప్రతి పదవికీ ముగ్గురు ఆపైనా నేతలకు అవకాశం కల్పించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాలుగు రోజుల కిందట ప్రకటించిన కార్యకవర్గంలో ఆయా పదవులకు ఎంపిక చేసిన వారి సంఖ్యను చూస్తే ఔరా! అని అనిపించక మానదు. సంప్రదాయానికి విరుద్ధంగా ప్రధాన కార్యదర్శి పోస్టు కు ముగ్గురిని నియమించినప్పుడే పార్టీ నాయకుల్లో విమర్శలు పెల్లుబికాయి. ఏ నాయకుడికి ఆ నాయకుడు తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఇలా ఇష్టానుసారం పదవుల భర్తీకి పేర్లు ఇచ్చారన్నది పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై మనసు మార్చుకుని యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నిర్ణయంతో జిల్లాలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో టీడీపీ చిక్కుకుంది. నాలుగేళ్లుగా కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమించుకోలేని దుస్థితి నుంచి బయటపడి ఇటీవల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లా అధ్యక్షుడిని నియమించాక జిల్లా కార్యవర్గాన్ని భర్తీ చేయడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయాన్ని తీసుకున్న నాయకత్వం చివర కు ఎవరూ ఊహించనంత మందికి చోటు కల్పిం చింది. జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఇంత మందిని భర్తీ చేయడంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని మొత్తం మండలాల సంఖ్య 59. అయితే, టీడీపీ జిల్లా కార్యదర్శులుగా 74మందికి అవకాశం కల్పిం చింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, జిల్లా కార్యవర్గానికి ఏపాటి విలువ ఉందో, టీడీపీ జిల్లా పదవి ఏపాటి స్థాయిదో అర్థం చేసుకోవడానికి. అదే మాదిరిగా, 20మంది ఉపాధ్యక్షులు, 35మంది కార్యనిర్వాహక కార్యదర్శులను నియమించింది. ఇక, ఏ పార్టీలోనైనా అధికార ప్రతినిధి అంటే పార్టీ విధానాలను, ఆయా అం శాలపై స్పందనను తెలియజేసేందుకు ఇద్దరు ముగ్గురిని నియమించడం సర్వసాధారణ విష యం. కానీ, టీడీపీ నాయకత్వం ఏకంగా 10 మందికి అధికార ప్రతినిధులుగా పదవులు కట్టబెట్టింది. ఏ పార్టీలోనైనా ప్రచార కార్యదర్శి పదవి సాధారణంగా ఒకటే ఉంటుంది. కానీ, జిల్లా ప్రచార కార్యదర్శులుగా ఐదుగురికి అవకాశం కల్పించారు. చివరకు పార్టీ కార్యాలయ కార్యదర్శి పదవినీ ఇద్దరికి పంచారు. జిల్లా కార్యవర్గంలో పదవుల పంపకం పూర్తిగా ఆ పార్టీ ఆత్మరక్షణ ధోరణిని చూపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మెరికలై.. మెరుపులై..
ఎవరిని కదిపినా సమైక్యాంధ్ర భవిష్యత్‌పై ఆందోళన. నలుగురు గుమికూడితే విభజన చిచ్చుపైనే చర్చ. పాఠశాలలకు వెళ్లే పిల్లలైనా.. కళాశాలల విద్యార్థులైనా లక్ష్యం ‘సమైక్య’మే. ఇక ఉద్యోగులు.. కార్మికులు.. ప్రజా సంఘాలు.. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ కార్యాచరణలో తలమునకలవుతున్నారు. నిరసనలు భిన్నమైనా.. ఆందోళన దారులు వేరైనా.. అందరి నినాదం ఒక్కటే. ఊరూవాడా ఏకమై.. పోరుబావుటా ఎగురవేసి.. కదంకదిపి.. గళం కలిపి సమైక్య దండు కదులుతోంది. దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమవాణి వినిపిస్తోంది. సాక్షి, కర్నూలు: క్రిష్ణాష్టమి పర్వదినమైన బుధవారం రోజునా సమైక్యాంధ్ర ఉద్య మం ఉవ్వెత్తున ఎగిసింది. జిల్లా అంతటా ఉద్యమకారులు విభిన్న రీతుల్లో ఆందోళనలు నిర్వహించారు. నగరంలో సమైక్యవాదులు నిరసనలతో హోరెత్తించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కర్నూలు ప్రభుత్వ ప్రసూతి వైద్యులు నడిరోడ్డుపైనే రోగులను పరీక్షించారు. కార్యక్రమంలో వైద్యులు విజయశంకర్, రంగనాథ్, శ్రీహరి, మనోహర్, జయరాం, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ టౌన్ మోడల్ కాలేజీకి చెందిన 500 మంది విద్యార్థులు ప్రధానమంత్రికి రాష్ట్రాన్ని విభజించొద్దంటూ పోస్టుకార్డులు పంపారు. ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుటనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జికి కట్టిన సమైక్య ఉట్టిని శ్రీకృష్ణుడి వేషాధారుడితో కొట్టించారు. కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర పరిరక్షణ వేదిక చేపట్టిన సామూహిక దీక్షలకు రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ సంఘీభావం ప్రకటించింది. హౌసింగ్‌బోర్డు మహిళా వర్క్ ఇన్స్పెక్టర్లు కర్నూలు-అనంతపురం ప్రధాన రహదారిపై సమైక్యాంధ్ర ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు కొత్తబస్టాండ్ నుంచి బంగారుపేట, ఆర్ఎస్ రోడ్డు, వైఎస్ఆర్ సర్కిల్, పాత కంట్రోల్ రూమ్, పాత బస్టాండు చేరుకుని... తిరిగి రాజ్‌విహార్, కలెక్టరేట్ మీదుగా కొత్తబస్టాండ్‌కు చేరుకుంది. ఆదోనిలో పొదుపు మహిళలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి భీమాస్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. జేఏసీ ఆధ్వర్యంలో భీమాస్ సర్కిల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. న్యాయవాదులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలో వార్డెన్లు రిలే నిరాహరదీక్ష నిర్వహించారు. రజకులు రోడ్డుపై బట్టలు ఉతికి నిరసన తెలిపారు. రుద్రవరంలో జర్నలిస్ట్‌ల ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు కొనసాగింది. పత్తికొండలో జేఏసీ ఉద్యోగులు చేపట్టిన దీక్షలకు మద్దతుగా హౌసింగు ఉద్యోగలు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు సంఘీభావ దీక్షలు చేపట్టారు. జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు కూడా స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి 10 మంది దీక్షలో పాల్గొన్నారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. దేవనకొండలో నాయీబ్రహ్మణులు భారీ ర్యాలీ చేసి రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటంతో వినూత్న నిరసన తెలిపారు. సోనియా ఫొటోకు పిశాచి పేరు పెట్టి పొరకలు, వేప ఆకుతో కొట్టుకుంటూ దెయ్యం విడిపించినట్లుగా నటించి ఆకట్టుకున్నారు. -
మూడో విడత 'మనగుడి'ని ప్రారంభించిన టీటీడీ ఈవో
మూడో విడత మనగుడి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఎంజీ గోపాల్ బుధవారం తిరమలలో ప్రారంభించారు. ఈ రోజు శ్రావణ మాసంలోని శ్రవణా నక్షత్రంలో వివిధ ప్రాంతాల్లోని సుమారు 20వేల ఆలయాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని ఆలయాలకు శ్రీవారి సారె మనగుడిలో పాల్గొనే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేందుకు టీటీడీ సారెను ఇప్పటికే సిద్ధం చేసింది. 250 గ్రాముల పసుపు, 250 గ్రాముల కుంకుమ, 100 గ్రాముల అక్షింతలు , కిలో కలకండ, 1000 కంకణాలతో కూడిన అట్టపెట్టలతో కూడిన సారెను ఆలయాలకు తరలించింది. అంతకుముందు టీటీడీ ఉన్నతాధికారులు, అర్చకులు ఈ సారెను గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక దాతల సహకారంతో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు రక్షాబంధన్ కావటంతో అవసరమైన కంకణాలను కూడా ముందే వివిధ ప్రాంతాల్లోని ఆలయాలకు చేరవేశారు. నేడు శ్రావణ పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి తిరుమలలో పున్నమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవ నిర్వహించటం ఆనవాయితీ. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ వాహన సేవను వైభవంగా నిర్వహించనున్నారు. నవతరానికి ఆలయాలు, సంస్కృతి మూలాలు, సంప్రదాయాల విశిష్టత తెలపటంతోపాటు ఆదరణకు నోచుకోని ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ‘మనగుడి’ కార్యక్రమానికి గతంలో శ్రీకారం చుట్టింది. జాతికి ఆధారంగా నిలిచే గుడి సంస్కృతిని భావితరాలకు అందించే లక్ష్యంగా ‘మనగుడి’ని టీటీడీ ప్రారంభించింది. 2012 ఆగస్టు 2వ తేదీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో 13,212 ఆలయా ల్లో ఈ మనగుడి మహోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించారు. 2012 నవంబరు 28వ తేదీ కార్తీక మాసంలో మొత్తం 17,536 ఆలయాల్లో రెండో విడత నిర్వహించిన సంగతి తెలిసిందే.