ఎస్సీ యువత కోసం ‘యువస్ఫూర్తి’
Published Tue, Aug 9 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
ఏలూరు (మెట్రో) : ఎస్సీ యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం ‘యువస్ఫూర్తి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘యువస్ఫూర్తి’ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగుల కోసం ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని 15 వందల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. వీరందరూ గ్రామాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే సేవల గురించి అవగాహన కల్పించాలని విజయకుమార్ కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.
Advertisement
Advertisement