unemployed youth
-
డేటా ఇంజనీర్లకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా ఇంజనీరింగ్ రంగం(Data engineering sector)లో రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ(government training) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమం వివరాలతో ఐటీ, పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నేటి డిజిటల్ యుగంలో డేటా ఇంజనీరింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. డేటాను విశ్లేషించేందుకు, నిర్వహించేందుకు నైపుణ్యమున్న మానవ వనరుల కోసం పరిశ్రమలు అన్వేషిస్తున్నాయి. ఈ రంగంలోని ఉపాధి అవకాశాలను తెలంగాణ యువత అందిపుచ్చుకునేలా వారిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), శ్రీసత్యసాయి సేవాసంస్థ సంయుక్తాధ్వర్యంలో డేటా ఇంజనీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పేరిట ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నాం. ప్రోగ్రామింగ్ అండ్ డేటా అనాలసిస్, డేటా ఇంజనీరింగ్ టూల్స్, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా విజువలైజేషన్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై పట్టభద్రులకు 90 రోజులు శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులో 25 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవమున్న అధ్యాపకుల పర్యవేక్షణలో 120 గంటలు క్లాస్‌రూం కోచింగ్, 360 గంటల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది.ప్రత్యేకంగా కెరీర్ కౌన్సెలింగ్ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. 2021–2024 మధ్య బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని టాస్క్ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షకు మార్చి ఒకటోలోగా దరఖాస్తు చేసుకోవాలి’ అని ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇతర వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం https:// task. telangana. gov. in/ ను సందర్శించాలని పేర్కొన్నారు. -
నిరుద్యోగులకు సర్కార్ షాక్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ నిరుద్యోగ యువతకు షాక్ ఇచ్చింది. వారి పొట్టకొట్టే చర్యలు చేపట్టి.. రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించడానికి గేట్లు తెరిచింది. సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన, లేదంటే ఉద్యోగాల కల్పించే వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫేస్టోలోస్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోపోగా తమకు కావాల్సిన రిటైర్డ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో తమకు ఇక సర్కారు కొలువులు ఎండమావే అని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లడమే.. ఖాళీ అయిన పోస్టులను కొత్త వారితో భర్తీ చేయకుండా తిరిగి రిటైర్ ఉద్యోగులతోనే భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తేనే నిరుద్యోగ యువతకు అవకాశాలు ఉంటాయని, రిటైర్ వారితో వాటిని భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువతను నిండా ముంచడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకపక్క రిటైర్డ్ వారికే మళ్లీ అవకాశం ఇస్తూ.. కొత్త పోస్టులు మంజూరు చేయకపోవడంతో సర్కారు కొలువులు నిరుద్యోగ యువతకు అందని ద్రాక్షగానే మిగిలిపోనున్నాయి. ఒక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి.. ఆ నియామక ప్రక్రియను తాత్సారం చేస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది డీఎస్సీ ఉండే అవకాశం కనిపించకపోవడంతో నిరుద్యోగులు ఉస్సూరుమంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోనూ గత ప్రభుత్వం ఇచి్చన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. రెండు స్క్రీనింగ్ కమిటీలు డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్, ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులతో స్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ కంటే దిగువ కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో తిరిగి తీసుకునేందుకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శి (హెచ్ఆర్), సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మరో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులతో ఖాళీల భర్తీ ప్రతిపాదనల పూర్తి వివరాలు సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు.. స్క్రీనింగ్ కమిటీలకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్క్రీనింగ్ కమిటీల ఆమోదం తరువాత సీఎం ఆమోదం తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను రెగ్యులర్ పోస్టుల్లోనే తీసుకోవాలని, మంజూరు కాని పోస్టుల్లోకి తీసుకోకూడదని తెలిపారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు, అలవెన్స్‌లను 2018లో ఆరి్థక శాఖ జారీ చేసిన 48 జీవో మేరకు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు మాత్రమే వర్తిస్తాయని, అఖిల భారత సర్విసు, కేంద్ర సర్విసు ఉద్యోగులకు వర్తించవని పేర్కొన్నారు. -
నిరుద్యోగంలో రికార్డ్ బ్రేక్: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా తూర్పార బట్టారు. మంగళవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో సరకుల లోడింగ్ కేంద్రం వద్ద చిరు ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత క్యూ వరసల్లో నిల్చుని తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రియాంక గుర్తుచేశారు. ‘‘ కొద్దిరోజుల క్రితం ముంబైలో మోదీ మాట్లాడు తూ మేం కోట్లాది మందికి ఉపాధి కల్పించి రికార్డ్‌లు బ్రేక్ చేశామని ఢంకా బజాయించారు. కానీ అదే ముంబైలో చిన్నపాటి ఉద్యోగాల కోసం వేలాదిగా యువత ఆశతో ఎగబడటం మనందరం చూశాం. ఇదే ఏడాది గుజరాత్లో 25 ఉద్యోగాల కోసం ఏకంగా లక్షలాది మంది నిరుద్యోగులు తండోపతండాలుగా తరలిరావడమూ మనందరికీ తెల్సిందే. ఇవన్నీ చూస్తుంటే రికార్డ్‌లు బ్రేక్ అయినట్లు తెలుస్తూనే ఉంది. కానీ ఆ రికార్డ్‌లు నమోదైంది ఉద్యోగాల్లో కాదు నిరుద్యోగంలో. దేశాన్ని తీవ్ర నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ఇప్పటికైనా మోదీ ఉత్తమాటలు చెప్పడం మానేసి ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టాలి’’ అని ప్రియాంక నిలదీశారు. -
కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు తెచ్చుకుంది.. మీరు కాదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతను, విద్యార్థులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి అత్యంత దివాలాకోరుతనంతో నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్‌ను అవమానించేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్‌నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్‌రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, నిర్వాహకులను అవమానించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన యువత ఈరోజు ప్రశ్నిస్తున్నదని అన్నారు. 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని పాలకులు, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం అని అన్నారు. ఈ అంశంలో రేవంత్‌రెడ్డి ఇగోకి, భేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని, కండకావరంతో మాట్లాడడం ఆపాలని హితవు పలికారు. గతంలో నిరుద్యోగుల్ని రెచ్చగొట్టింది మీరు కాదా?రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి, రాహుల్గాంధీలేనని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఏ పరీక్ష రాశారని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి నిరుద్యోగులతో కలిసి దీక్ష చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అశోశ్నగర్ లోని విద్యార్థులను రేవంత్‌రెడ్డి సన్నాసులు అంటున్నారని, అసలు సన్నాసులు రేవంత్‌రెడ్డా, రాహుల్‌గాంధీయా అనే విషయం చెప్పాలన్నారు. 2023 అక్టోబర్, నవంబర్‌లో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టారని, అనేక అవాకులు చవాకులు పేలారని ధ్వజమెత్తారు. రాజకీయ నిరుద్యోగం నుంచి బయట పడటానికి రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి యువతను వాడుకున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే వందల నోటిఫికేషన్లు, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామని నమ్మబలికారని అన్నారు. ఇప్పుడు ఒకాయన ముఖ్యమంత్రి అయ్యారని, ఇంకొకరు జాతీయస్థాయిలో నాయకుడు అయ్యారు తప్ప తెలంగాణ నిరుద్యోగులకు దక్కింది శూన్యం అని విమర్శించారు. నిరుద్యోగులతో కలిసి కొట్లాడతాం..ప్రస్తుతం అశోక్‌నగర్‌లో, యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకుపోతుండడం వాస్తవం కాదా చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. మిమ్మల్ని వదిలిపెట్టకుండా నిలదీస్తామని, విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతామని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నారని, ఆయన ముఖ్యమంత్రిని అని గుర్తుంచుకొంటే మంచిదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్‌పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించి, వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. -
రూ.3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత ఎదురు చూస్తోంది. జాబ్ క్యాలెండర్‌పై గంపెడాశలు పెట్టుకుంది. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు ‘నిరుద్యోగ భృతి’ ఇవ్వాలని కోరుతోంది. అధికారంలోకి వచ్చి నెల దాటినా, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌లోని 1.60 కోట్ల కుటుంబాల్లోని యువత డిమాండ్ చేస్తోంది. 2014లో చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచారు. అప్పట్లో చంద్రబాబు విసిరిన మాయ వలలో చిక్కుకుని ఐదేళ్లూ నిరుద్యోగ యువత విలవిల్లాడిపోయారు. మరోసారి అలాంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా నిరుద్యోగ భృతిపై నోరు మెదపక పోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. మళ్లీ బూటకపు హామీలతోనే ఇప్పుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చారు. కానీ, ఆయన రాజకీయ జీవితంలో చెప్పింది చెప్పినట్లు ఏనాడు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, హామీలను అమలు చేయడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ సంఖ్యలో యువత ప్రభుత్వ కొలువులు వస్తాయని.. లేదంటే నిరుద్యోగ భృతి అందుతుందనే ఆశతో ఎదురు చూస్తోంది. చాలామంది చిన్నా చితకా పనులు వదిలేసి.. స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల బాట పడుతున్నారు. కుటుంబానికి ఆర్ధిక భారంగా మారినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే భృతితో ఎలాగోలా నెట్టుకు రావచ్చనే ఉద్దేశంతో పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. సూపర్ సిక్స్ టాప్‌లో భృతి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్‌లో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినప్పటికీ ఆ ఊసే ఎత్తట్లేదు. మెగా డీఎస్సీ పేరుతో నామమాత్రంగా ప్రకటించిన 16 వేల పోస్టుల భర్తీ కాస్తా నత్త నడకను తలపిస్తోంది. డిగ్రీ అర్హతతో ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్స్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ కొలువుల కోసం పోటీపడే వారు లక్షల్లో ఉన్నారు. వీరితో పాటు ప్రభుత్వ కొలువు సాధించేందుకు ఇంకా వయస్సు ఉండి.. ఆర్ధిక తోడ్పాటు లేక పోటీ పరీక్షలను పక్కన పెట్టి ఊళ్లలో వ్యవసాయం, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న వారందరినీ కలుపుకుంటే దాదాపు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి కనిపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడి ఆగిపోయిన వారందరూ కూటమి ప్రభుత్వ నిరుద్యోగ భృతి హామీతో తిరిగి పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్‌కు రూ.లక్షల్లో ఫీజులు ప్రభుత్వ కొలువుల కోసం యువత శిక్షణ తీసుకునేందుకు రూ.లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబానికి ఆర్ధిక భారం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో అప్పులు చేస్తున్నారు. పేరొందిన సంస్థల్లో గ్రూప్ 1 శిక్షణ, స్టడీ మెటీరియల్ కోసమే రూ.లక్షలు, సాధారణ శిక్షణ కేంద్రాల్లో రూ.50 వేల వరకు ఖర్చువుతోంది. గ్రూప్–2కు అయితే రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. డీఎస్సీ, కానిస్టేబుల్, ఇతర పోస్టులకు శిక్షణ తీసుకోవాలన్నా రూ.వేలల్లోనే ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటికి తోడు భోజనం, హాస్టల్ ఖర్చుల నిమిత్తం తక్కువలో తక్కువ నెలకు రూ.6 వేలకుపైగా ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు నోటిఫికేషన్ల విడుదలతో పాటు, ప్రభుత్వం ఇస్తామన్న భృతి కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. గతంలో చేసినట్టే చేస్తారా? రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేపట్టే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రధాన హామీగా పదే పదే ప్రచారం చేసుకుంది. అయితే అధికారంలోకి రావడం.. పాలనను ప్రారంభించడంతో పాటు.. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు శాఖల వారీగా సమీక్షలు మొదలెట్టారు. కానీ, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నిరుద్యోగ భృతి అమలుపై కనీసం విధి విధానాలు, మార్గదర్శకాల జారీపై కసరత్తు కూడా ప్రారంభించ లేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014–19లో నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఐదేళ్లు పబ్బం గడుపుకుని మొండి చెయ్యి చూపించారు. అప్పట్లో కూడా ఇంటికో ఉద్యోగం అని ఊదరగొట్టి నిరుద్యోగులను నట్టేట ముంచారు. నిరుద్యోగ భృతికి 2017–18లో రూ.500 కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ, రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఎన్నికలకు ముందు యువ నేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారు అనర్హులని తేల్చడంతో పాటు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని మెలిక పెట్టారు. కొన్ని చోట్ల కారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి, 120 సీసీ ద్విచక్ర వాహనం ఉన్న వారిని సైతం పక్కన పడేశారు. ఇలా వడపోత అనంతరం తొలుత 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా.. ఆ తర్వాత ఆ సంఖ్యను పది లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ.. 1.62 లక్షల మందికే ఇస్తామని.. దీనికి ఈ–కేవైసీ లింక్ పెట్టి కేవలం వేల సంఖ్యలో మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి మమ అనిపించారు. గతంలో ఇలా నిరుద్యోగ భృతి హామీని నీరుగార్చి.. ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ అనుభవం దృష్ట్యా ఈ సారైనా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలతో పాటు ఉద్యోగం వచ్చే వరకు భృతి ఇవ్వాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వయో పరిమితిని గుర్తించాలి.. రాష్ట్రంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి 42 ఏళ్లు, రిజర్వడ్ కేటగిరి అభ్యర్థులకు మరో 5 ఏళ్లు అదనంగా ఉంటుంది. ఈ క్రమంలో 40 ఏళ్లు దాటినప్పటికీ ప్రభుత్వ కొలువు సాధించాలనే సంకల్పంతో చాలా మంది ఇప్పటికే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ, విజయం కూడా సాధిస్తున్నారు. ఏపీపీఎస్సీ వయో పరిమితి ఇలా ఉంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 22–35 ఏళ్ల వయసు్కలు మాత్రమే భృతికి అర్హులని ప్రకటించడంతో చాలా మంది నష్టపోయారు. ఇంటర్ చదువుకున్న వారు కూడా ఏదో ఒక పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతారు. డిప్లొమా చేసిన వారి వయసు కూడా 19 ఏళ్ల లోపుగానే ఉంటుంది. వీళ్లందరిని కూడా గతంలో గుర్తించక పోవడం నిరుద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టినట్టు మరే నాయకుడూ చేసి ఉండరు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, మరోసారి అధికారంలోకి వచ్చిన ఈయన పాలనలో ఉద్యోగాల భర్తీ అనేది కనిపించదు. 2009 ఎన్నికల్లో లక్షల్లో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అని హామీలు గుప్పిస్తే ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో 600కు పైగా ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతిని చేర్చి అధికారంలోకి వచ్చారు. కానీ, ఐదేళ్లు అధికారం అనుభవించి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి యువ నేస్తం అంటూ మభ్యపెట్టారు. తాజాగా 2024లోనూ నిరుద్యోగ పల్లవి అందుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్ కో అసలు ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వాలి జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. గతంలో మాదిరి కాకుండా తక్షణమే భృతిని ప్రకటించాలి. ఒక్క నెల నోటిఫికేషన్ ఆలస్యమైనా లక్షలాది మంది నిరుద్యోగులు వయో పరిమితి దాటి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. యువగళంలో లోకేశ్.. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. టీడీపీ 2014–19లో నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుని నిరుద్యోగులతో ఆడుకుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే నిరుద్యోగుల ఉద్యమ సత్తాను చూడాల్సి వస్తుంది. – వై.రామచంద్ర, నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు తక్షణం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే గతంలో మాదిరి నిరుద్యోగులను మోసం చేయకుండా జనరల్ అభ్యర్థులతో సహా అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఉద్యోగాలు కల్పించే వరకు ఆర్ధిక సాయంగా భృతి ఇస్తే నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. ఈసారి అమలు చేయబోయే నిరుద్యోగ భృతి కనీసం 40 ఏళ్లు దాటి పోటీ పరీక్షలు రాసేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిందే. – సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు. నిరుద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ధీమా లేకుండా చేస్తున్నారు. అసలు నిరుద్యోగ భృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్ తీసుకుంటారా? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలపై నేరుగా పడుతుంది. – మేడూరి నవీన్ దాస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్, విశాఖపట్నం జాబ్ క్యాలెండర్ ఎప్పుడు? ఏపీలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. జాబ్ క్యాలెండ్ కంటే ముందు పాత నోటిఫికేషన్లను పూర్తి చేయాలి. ఈలోగా నిరుద్యోగులు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి నెలా రూ.3 వేల భృతి వెంటనే అమలు చేయాలి. దీని స్పష్టమైన తేదీలను ప్రకటించాలి. – కొనిగపాగ అనిల్ బాబు, విజయవాడవీటి సంగతేంటి బాబూ?వైఎస్సార్ రైతు భరోసాఈ పథకం కింద ఏటా రూ.13,500 చొప్పున గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో సగటున ఏటా 51,13,249 మంది రైతులకు రూ.6,857.63 కోట్లు.. ఐదేళ్లలో రూ.34,288.17 కోట్లు ఇచ్చింది. కూటమి హామీ మేరకు ఏటా రూ.20 వేల చొప్పున ఎప్పుడు ఇస్తారు?వైఎస్సార్ మత్స్యకార భరోసా గత ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసాను రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచి, ఏటా సగటున 1,07,602 మందికి రూ.107.60 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.538.01 కోట్లు ఇచ్చింది. మీరు ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.20 వేల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారు?వైఎస్సార్ సున్నా వడ్డీఈ పథకం కింద గత ప్రభుత్వంలో ఏటా సగటున 96,70,720 మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,242.26 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 4,969.05 కోట్లు ఇచ్చింది. ఈ పథకం సొమ్మును మీరు ఎప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు?జగనన్న విద్యా, వసతి దీవెనఈ పథకం కింద (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో సగటున 27 లక్షల మంది విద్యార్థులకు రూ.18,663.44 కోట్లు అందజేసింది. విద్యార్థులకు మీరు ఈ సాయాన్ని ఎప్పుడు అందిస్తారు?అమ్మ ఒడి పథకంఈ పథకం కింద రూ.15 వేలు చొప్పున సగటున 42.62 లక్షల మంది తల్లులకు నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.26,067.28 కోట్లు ఇచ్చింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ కింద కోటికి పైగా పిల్లలకు మీరు ఎప్పుడు ఈ సాయం అందిస్తారు? -
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): నిరుద్యోగులు, నిరుద్యోగ సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిరుద్యోగ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏడు రోజులుగా గాం«దీఆస్పత్రిలో ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్న నిరుద్యో గ జేఏసీనేత మోతీలాల్‌నాయక్‌ను ఆదివారం హరీశ్‌రావు పరామర్శించి మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మోతీలాల్‌నాయక్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని, నిరుద్యోగ యువతతో చర్చలు జరిపి, ఇచి్చన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారుఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో మోతీలాల్‌నాయక్ దీక్షను విరమించాలని, కలిసి ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల హక్కుల పట్ల ప్రొఫెసర్ కోదండరాం పూర్తి బాధ్యత తీసుకొని, హామీలు అమ లు చేసేవిధంగా కృషి చేయాలని కోరారు. ఏడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులపై కపటప్రేమ చూపించి అవసరం తీరిన తర్వాత వారి గుండెల మీద తన్నిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు నిరుద్యోగుల ఓట్ల కోసం కోదండరాం, రియాజ్, బల్మూరి వెంకట్, మురళి, రేవంత్‌రెడ్డి తదితరులు కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టారని, బస్సుయాత్రలు చేశా రని, రాహుల్‌గాంధీని అశోక్‌నగర్ తీసుకొచ్చి ప్రమాణం చేయించారని గుర్తు చేశారు. వారికి ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యో గులకు రాలేదన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాసయాదవ్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.ఇవీ నిరుద్యోగ డిమాండ్లు..⇒ గ్రూప్–1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1: 50 నుంచి 1:100కు పెంచాలి. ⇒ గ్రూప్–2కు రెండువేలు, గ్రూప్–3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామనే హామీ నిలబెట్టుకోవాలి. రెండు పరీక్షల మధ్య 2 నెలల సమయం ఉండాలి ⇒ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనే హామీ నిలబెట్టుకోవాలి. ⇒ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ⇒ మొదటి కేబిబినెట్ మీటింగ్‌లోనే మెగా డీఎస్సీ ప్రకటన హామీ నిలబెట్టుకోవాలి. 11 వేలతో కాకుండా 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి ⇒ గురుకుల టీచర్ల పోస్టులను బ్యాగ్లాగ్లో పెట్టకుండా, హైకోర్టు తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలి ⇒ జీఓ నంబరు 46 రద్దు చేయాలి. ఆ జీఓ ద్వారా ఏర్పడిన సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలి. ⇒ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏడు నెలల బకాయితో సహా ప్రతినెల క్రమం తప్పకుండా నిరుద్యోగభృతి చెల్లించాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్
సాక్షి, అమరావతి: సాగులో సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా కూలీల వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) అందిస్తున్న కిసాన్ డ్రోన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 60 మంది నిరుద్యోగ యువత, పొదుపు సంఘాలకు శిక్షణ ఇచ్చి డ్రోన్లను అందజేసింది. రానున్న వ్యవసాయ సీజన్లో మరో 65 కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.తొలి దశలో రాష్ట్రంలో 160 డ్రోన్స్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. డిమాండ్‌ను బట్టి మరింత మందికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది 60 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. ఈ ఏడాది మరో 65 మందికి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం ఎంపిక చేసిన నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై.. 18–50 సంవత్సరాల మధ్య వయసు వారు శిక్షణకు అర్హులు.మహిళలకు 15 రోజుల శిక్షణఆసక్తి, అర్హత ఉన్న వారికి 15 రోజులపాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది. అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 70 మంది గ్రామీణ యువతతోపాటు 12 మంది పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి కాగానే డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తున్నారు.రూ.15 లక్షల విలువైన డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనంలైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తున్నారు. యూనిట్ వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే చాలు. ఎలక్ట్రిక్ వెహికల్‌పై రెండు రోజులపాటు క్షేత్రస్థాయి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 20 వేల ఎకరాల్లో పిచికారీ లేదా ఐదేళ్ల తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనం అభ్యర్థుల పేరిట బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకు ఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.జూన్‌లో అర్హుల గుర్తింపు2024–25 సీజన్లో మరో 65 మందికి కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి అర్హులైన వారిని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వారికి దశల వారీగా శిక్షణ ఇచ్చిన తర్వాత ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.స్వయం ఉపాధి పొందుతున్నాంనేను బీ ఎస్సీ కంప్యూటర్స్ చేశా. ఇఫ్కో ద్వారా మద్రాస్ ఐఐటీలో డ్రోన్ పైలట్‌గా శిక్షణ పొందా. ఇఫ్కోతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించగా.. ఆ సంస్థ నాకు రూ.15 లక్షల విలువైన కిసాన్ డ్రోన్, ఎలక్ట్రికల్ వాహనం ఇచ్చింది. రైతు పొలాల్లో అద్దె ప్రాతిపదికన పురుగు మందులు, నానో ఎరువులు పిచికారీ చేసినందుకు ఎకరాకు రూ.300 తీసుకుంటున్నా. – కయ్యూరు మహేష్, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లాఖర్చు తగ్గుతోందిఇఫ్కో ద్వారా శిక్షణ పొంది కిసాన్ డ్రోన్ తీసుకున్నాం. గతంలో ఎకరాకు పిచికారి చేయాలంటే రూ.500 నుంచి రూ.600 వరకు కూలీలకు చెల్లించాల్సి వచ్చేది. కూలీలు దొరక్క చాలా ఇవ్వండి పడేవాళ్లం. కిసాన్ డ్రోన్‌తో 25 ఎకరాల వరకు పిచికారి చెయగలుగుతున్నాం. ఇప్పుడు కేవలం 4–5 నిముషాల్లో ఎకరా విస్తీర్ణంలో పిచికారీ పూర్తవుతోంది. వృథా కూడా ఏమీ ఉండటం లేదు. ఎకరాకు రూ.300 వరకు ఆదా అవుతోంది. – కొక్కిరాల వెంకట సుబ్బారావు, దుగ్గిరాల, బాపట్ల జిల్లారైతు ఖర్చులు తగ్గించడమే లక్ష్యంనిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. గతేడాది 60 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది మరో 65 మందికి కిసాన్ డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ వాహనాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. దీన్ని సాధిస్తే తమ జీవితానికి, భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనుకుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అహోరాత్రులు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి 1.34 లక్షల సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. లంచాలకు, సిఫారసులకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా నియామకాలు చేసి అభ్యర్థుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రశ్నాపత్రం రూపకల్పన బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా వివిధ విభాగాల్లో 6,296 పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు మొత్తం 78 నోటిఫికేషన్లను ఇచ్చింది. అంతేకాకుండా ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా 1,446 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో ఉద్యోగార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కొలువును దక్కించుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. నిరుద్యోగుల మేలుకు ఎన్నో చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల ముంగిటకే తీసుకెళ్లి.. వారి సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే పరిష్కరించేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో పనిచేయడానికి ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఒక్క వైద్యశాఖలోనే దాదాపు 55 వేల పోస్టులను భర్తీ చేశారు. ఇందులో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఎన్నికల ముందు ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి వదిలేశారు. వాటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఈ పరీక్షలను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నిర్వహించి, పోస్టులను భర్తీ చేసింది. ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ.. నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయడానికి వీలుగా ఏపీపీఎస్సీతో సమన్వయం చేసుకుంటోంది. నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఎలాంటి వివాదాలకు తావులేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత నాలుగేళ్లల్లో మొత్తం 78 నోటిఫికేషన్లను ఒక్క కోర్టు వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 పోస్టులను భర్తీ చేయడం విశేషం. ఇంత పక్కాగా ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరిగింది లేదు. నాడు అలా.. నేడు ఇలా.. గత టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ అంతా అగమ్యగోచరంగా ఉండేది. అంతేకాకుండా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు తలెత్తేవి. ఇలా పలు కారణాలతో నియామక పరీక్షలు నిలిచిపోవడమో లేక రద్దు కావడమో జరిగేది. అలాంటిది గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 ఉద్యోగాలను ఎలాంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా భర్తీ చేసింది. అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయ వివాదాల్లో చిక్కుకున్నవాటిని సైతం పరిష్కరించింది. ఆ పోస్టులను భర్తీ చేసి అభ్యర్థులకు న్యాయం చేసింది. ఇలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టింది. -
బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే నిరుద్యోగులది అడవి బాటే
సాక్షి, వరంగల్/జనగామ/ సాక్షి, కామారెడ్డి: తెలంగాణ సాధన పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్కు మరోసారి పట్టం గడితే రాష్ట్రంలోని నిరుద్యోగులు అడవి బాట పట్టడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగాల కోసం పరీక్షల యుద్ధం చేస్తున్న నిరుద్యోగ యువత దిక్కుతోచక అటవీబాట పట్టే పరిస్థితి వస్తే, నక్సలైట్ ఉద్యమం పునరావృతమైతే.. ఈ ప్రభుత్వంలో ఒక్కరూ మిగిలే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. 1,200 మంది యువత ఆత్మ బలిదానాలకు చలించి కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, కానీ కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని ఆరోపించారు. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని ముందు వరుసలో ఉండి పోరుసల్పిన నిరుద్యోగులు..తెలంగాణ వచ్చినా ఉద్యోగ నియమాకాలు లేక వయోపరిమితి మించిపోయి, చివరకు పెళ్లిళ్లు కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ పరీక్షల రద్దు, పేపర్‌లీక్‌ల వంటి దుష్పరిణామాలతో ఆత్మస్థైర్యం కోల్పోతున్న నిరుద్యోగులు ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించకపోతే నిజాం పాలనను కేసీఆర్ పునరావృతం చేస్తారని ఆరోపించారు. గజ్వేల్ భూములు కొల్లగొట్టి ఇప్పుడు కామారెడ్డికి వస్తున్నారని, దేశమంతా కామారెడ్డి ప్రజల తీర్పు కోసం ఎదురుచూస్తోందని అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో జరిగిన విజయభేరి సభల్లో, కామారెడ్డి జిల్లాలో పలు కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. మీ కరెంట్ ఊడగొడతాం..ఫ్యూజులే ఉండవు ‘త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దొర కాళ్ల కింద నలిగిపోతోంది, నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పిండు. కానీ కాళేశ్వరం పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, సుందిళ్లకు దిక్కులేదు. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టిండు. నిజంగా ప్రమాదంతోనే ప్రాజెక్టు కూలితే ప్రజలకు ఎందుకు చూపించవు? కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటుండు. మూడోసారి మాకు అవకాశం ఇవ్వండి.. మా మనడిని మంత్రి చేసేది ఉందని అంటుండు.. బిడ్డా కాంగ్రెస్ రాగానే నీతో పాటు కేటీఆర్, హరీశ్, సంతోష్, దయాకర్‌రావు, కవితారావుల కరెంట్ ఊడగొడతాం...మీకు ఫ్యూజ్‌లే ఉండవు.మీ మోటార్లు కాలుతాయ్.. మీ ట్రాన్స్ఫార్మర్లు పేలుతాయ్..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. పులిని షికారు చేసేందుకు వచ్చిన వేటగాన్ని.. ‘పేదలు నివాసం ఉండేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వని కేసీఆర్.. గజ్వేల్‌లో 600 గదులతో గడీని నిర్మించుకుండు. జన్వాడలో 100 ఎకరాలలో కోట్లు ఖర్చు పెట్టి ఒక గడీని కట్టుకుండు. ప్రజల రక్తాన్ని తాగుతున్న పులిని షికారు జేసేందుకు వచ్చిన వేటగాన్ని నేను. గజ్వేల్ భూములను కొల్లగొట్టిన కాలకేయ ముఠా ఇప్పుడు కామారెడ్డి మీద కన్నేసింది. ఇక్కడి ప్రజలకు చెందిన విలువైన భూములను కొల్లగొట్టేందుకు వస్తున్నరు. వాళ్ల బారి నుంచి కాపాడేందుకు ఇక్కడికి వచ్చిన. మీరు అండగా నిలవండి. మీ భూములకు రక్షకుడిగా నేనుంటా. కామారెడ్డి ప్రాంత ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా ఏనాడూ పట్టించుకోని కేసీఆర్‌కు ఎలక్షన్లు రావడంతో తల్లి ఊరు గుర్తుకువచ్చింది. గజ్వేల్‌లో ఓడిపోతా అనుకుంటే సిద్దిపేటకో, సిరిసిల్లకో పోకుండా కామారెడ్డికి రావడంలోనే మతలబు ఉంది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి రైతుల భూములపై కన్నేస్తే, కనుగుడ్లను పీకి గోలీలాడుతాం..’ అని హెచ్చరించారు. కేసీఆర్ పండించిన వడ్లకు రూ.4,250? ‘రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను క్వింటాల్ రూ.2 వేలకు కొనే దిక్కులేదు. అదే సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో పండించిన వడ్లను క్వింటాల్‌కు రూ.4,250 చొప్పున ఓ సీడ్స్ కంపెనీ తీసుకుంది. దీనిపై రాజరాజేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా.?’ అని రేవంత్ సవాల్ చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలంటే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా సభల్లో ఏఐసీసీ అబ్జర్వర్ అరవింద్ కుమార్ బాల్వి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌అలీ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, శోభారాణి, ఎరబ్రెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య యువతకు డిమాండ్
-
యువతకు ఉపాధి... అమరులకు ఆదరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మహిళలు, అమరవీరుల కుటుంబాలు, గల్ఫ్ కార్మికులను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించింది. మొత్తం ఐదు అంశాలతో కూడిన 17 హామీలను ప్రకటించింది. సోమవారం సరూర్‌నగర్‌లో జరిగిన సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ డిక్లరేషన్ వివరాలను వెల్లడించారు. ఆ అంశాలివీ.. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు ► తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులకు ఉద్యమ అమరవీరులుగా గుర్తింపు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు కుటుంబానికి నెలకు రూ.25 వేల పింఛన్. ► ఉద్యమంలో పాల్గొన్నవారిపై నమోదైన కేసుల ఎత్తివేత. జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు. పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ► కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ► తొలి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. ► ఏటా జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ కేలండర్ ప్రకటన. ఉద్యోగ పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్ 17న నియామక పత్రాల అందజేత. ► నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా రూ.4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు. ► ప్రత్యేక చట్టం ద్వారా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో నియామకాలు. నిరుద్యోగ నిర్మూలన ► తెలంగాణను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ‘సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్’ ఏర్పాటు. ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజీ ఏర్పాటు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ. ► ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్లు. ► విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమిషన్ల తరహాలో యూత్ కమిషన్ ఏర్పాటు. ఆ కమిషన్ ద్వారా రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం. ► ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ. గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతోపాటు కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు. ఫీజు రీయింబర్స్మెంట్ ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు. రూ.4 వేల కోట్ల బకాయిల చెల్లింపు. ► పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన వర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతోపాటు.. ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్‌లలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు. ► బాసరలో ట్రిపుల్ఐటీ తరహాలో మరో నాలుగు ట్రిపుల్ ఐటీల ఏర్పాటు. ► అమెరికాలోని ఐఎంజీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం. ► పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్‌లలో రెండు ప్రత్యేక విద్యాలయాలు. 6వ తరగతి నుంచి పట్టభద్రులయ్యేంత వరకు నాణ్యమైన విద్య. యువ మహిళా సాధికారత ► మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు ► 18 ఏళ్లు పైబడిన చదువుకునే యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు. -
స్కిల్ హబ్స్ ద్వారా నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
-
తోలు పరిశ్రమల జాడేదీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితులకు ఉపాధి, స్థానికంగానే తోలు ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపికచేసి మినీ లెదర్ పార్కులు స్థాపించాలని ప్రణాళికలు చేశారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్) నిరుద్యోగ యువతకు చెప్పుల తయారీలో శిక్షణ సైతం ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. 2003 నుంచే లెదర్ పార్కుల ఏర్పాటుకు బీజం పడినా నేటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ దళితులు ఎదురుచూస్తున్నారు. లెదర్ ఉత్పత్తులకు అవకాశం మేక, గొర్రె, గేదెల వంటి పశువుల తోళ్లతో స్థానికంగానే ప్రముఖ బ్రాండ్లకు చర్మంతో చెప్పులు, ఇతర ఉత్పత్తులు తయారుచేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం నుంచే లిడ్‌క్యాప్, రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్‌ఎల్‌ఐపీసీ (తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్) «ఆధ్వర్యంలో పనులు సాగాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో లెదర్ క్లస్టర్, మరో ఆరుచోట్ల 25 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు. ‘మలుపు’స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులకు శిక్షణనిచ్చింది. చెన్నైకి చెందిన లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకొని ప్రముఖ బ్రాండ్ల చెప్పులు, బూట్లు ఇతర ఉత్పత్తులు ఈ పార్కుల్లో తయారు చేయాలని భావించారు. ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకొనేలా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరిగాయి. మౌలిక సదుపాయాలు, షెడ్డుల నిర్మాణాలు, శిక్షణ, యంత్రాలు వచ్చాయి. కొన్నిచోట్ల తయారీ మొదలైంది. ఆ తర్వాత నిధుల లేమితో ఆశయం నీరుగారింది. నిధులు విడుదలవక.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మరోమారు పార్కుల స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ కింద రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వీటిని అభివృద్ధి చేయాలనుకున్నారు. 2016లో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కుకు రూ.270 కోట్లతో 2 వేల మందికి ఉపాధి కల్పించాలనే అంచనాతో రూ.105 కోట్ల కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఇప్పటికీ నిధులు విడుదలవలేదు. ఇటీవల ఆర్మూర్ పార్కులో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదలవక ఉత్పత్తి మొదలు కాలేదు. కబ్జాలకు గురవుతున్న భూములు పార్కుల కోసం కేటాయించిన భూములు ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురవుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్కడ ఇన్చార్జి అధికారే ఆ భూమిలోని మట్టిని అమ్ముకున్నారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో భూములను ఓ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలం చుట్టూ కబ్జాల నిరోధానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్థలాలను పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలకు కేటాయిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. నాయకులకు చిత్తశుద్ధి లేదు ఏళ్లుగా ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా లెదర్ పార్కులు ఏర్పాటుచేసి నిరుపేదలకు పని కల్పించాలి. – కొలుగూరి విజయ్‌కుమార్, చర్మకార హక్కుల పరిరక్షణ కమిటీ, జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సర్వే
సాక్షి, అమరావతి: నిరుద్యోగ యువతకు ఆసక్తిగల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సర్వే నిర్వహిస్తోంది. వలంటీర్లు ఇంటింటి సర్వేచేసి నిరుద్యోగ యువత పేర్లను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అభ్యర్థికి ఆసక్తిగల కోర్సు, ఏ ప్రాంతంలోని స్కిల్ హబ్‌లో శిక్షణ పొందాలనుకుంటున్నారో కూడా నమోదు చేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉండటంతోపాటు అవసరమైనచోట వారి సేవలను వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 27,655 మంది పేర్లను స్కిల్ హబ్స్ అప్లికేషన్లో నమోదు చేశారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13,056 మంది అభ్యర్థుల పేర్లు స్కిల్ హబ్స్ అప్లికేషన్లో నమోదయ్యాయి. ఈ సర్వేకి సంబంధించి విస్త్రత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. స్కిల్ డెవలప్మెంట్ సర్వే పురోగతిని ప్రతి గురువారం కలెక్టర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్‌శర్మ సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సర్వే పూర్తిచేయించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. -
‘రామగుండం’లో కొలువుల స్కాం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో జరిగిన నియామకాల వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఫ్యాక్టరీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ. కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ ఆరోపణలు రావడంతో రామగుండంలో రాజకీయం వేడెక్కుతోంది. ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ నుంచి ఉద్యోగులు తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ పలువురు నిరుద్యోగులు నిరసనలకు దిగడం.. పలు కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వారికి అండగా నిలవడంతో ఈ ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. అసలేం జరిగింది? ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారం గతేడాది పునఃప్రారంభమైంది. కర్మాగారంలో పనిచేసేందుకు వందలాది మంది సిబ్బందిని నియమించారు. ఒక ప్రముఖ కంపెనీ ఏడాది కోసం మ్యాన్‌పవర్‌ను సరఫరా చేసే కాంట్రాక్టు పొందింది. వారి నుంచి మరో కంపెనీ సబ్‌కాంట్రాక్ట్ సంపాదించింది. ఈ సంస్థ ఫ్యాక్టరీ ప్రారంభమైన సమయంలో 798 మందిని లోడింగ్, అన్లోడింగ్ కోసమని నియమించుకుంది. వారికి 798 గేట్పాసులు కూడా ఇచ్చింది. ఏడాది తరువాత సదరు సంస్థ కాంట్రాక్టు పూర్తవడంతో మరో కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. కొత్తగా వచ్చిన సంస్థ అవసరానికి మించి కార్మికులు ఉన్నారని వందలాది మందిని తప్పించింది. దీంతో కొలువులు కోల్పోయిన వారంతా ఆందోళన ప్రారంభించారు. ఈ ఉద్యోగాల కోసం కొందరు నాయకులు తమ వద్ద రూ. లక్షలు వసూలు చేశారని తీరా ఇప్పుడు రోడ్డున పడేస్తే ఎలా? అంటూ నిరసనలకు దిగుతున్నారు. నిరుద్యోగులు ఏమంటున్నారు? అధికార పార్టీ నేతలుగా చెప్పుకున్న కొందరు దళారులు ఈ నియామకాల్లో చక్రం తిప్పారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్మాగారంలో టెక్నికల్ ఉద్యోగాలు ఇస్తామని, అవి శాశ్వత కొలువులని, కుటుంబాలకు క్వార్టర్, కుటుంబ సభ్యులకు ఉచిత విద్య, వైద్యం సదుపాయాలు, నెలనెలా రూ. 25 వేల వేతనం ఉంటాయని నమ్మబలికారని వాపోతున్నారు. ఉద్యోగం చేసినంత కాలం స్కిల్డ్ లేబర్ కింద రోజుకు రూ. 610 చెల్లించారని, తీరా ఏడాది తర్వాత సిబ్బంది అధికంగా ఉన్నారని చెప్పి 498 మందిని తప్పించారని వాపోతున్నారు. ఇప్పుడు కేవలం 300 మందే మిగిలారని, వారికి అన్‌స్కిల్డ్ లేబర్ కింద రోజుకు రూ.440 మాత్రమే చెల్లిస్తున్నారని వివరించారు. 498 మందిలో దాదాపు 400 మంది కార్మికులు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలకు రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల చొప్పున ముట్టజెప్పారని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్ ఆరోపిస్తున్నారు. రోడ్డున పడ్డ ఉద్యోగులంతా ఆర్ఎఫ్సీఎల్ బాధితుల సంఘంగా ఏర్పడ్డారు. క్రమంగా నిరసనలను ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే గవర్నర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేపై విమర్శలతో! మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్య నారాయణ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై విమర్శలు చేయడం వివాదం కొత్తమలుపు తిరిగింది. ఆయ నకు ఈ వ్యవహారంతో సంబంధముందని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు దేల్చేందుకు ఎమ్మెల్యే 18 మందితో కూడిన నిజనిర్ధారణ కమిటీని వేశారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేసినా, అసత్యాలు ప్రచారం చేసినా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. మరోవైపు బాధితులు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు లిచ్చి మోసపోయా మంటున్న వారిలో సుమారు 240 మంది వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. -
Agnipath Protests: పేద యువతను నిందించగలమా?
అగ్నిపథ్ పథకంపై రాజకీయ దుమారం ఇక చాలంటూ... ‘ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన పథకాలకు రాజకీయరంగు పులమటం దేశ దౌర్భాగ్యం. ఇప్పుడు బాధాకరంగా తోచినా దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నాయనీ, దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకో వాల’నీ ప్రధాని మోదీ వివరించారు. ఈ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని సైనికాధికార్లు స్పష్టం చేశారు. సైన్యం దేశ రక్షణ లక్ష్యంతో పని చేస్తుందనీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాదనీ సూటిగా చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయంగా ప్రశ్నించటం సహజమే అని మరోసారి నిరూపించాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించిన వాటినే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించటం అవకాశవాదం. నిజానికీ పథకం 1989 నుంచి పెండింగులో ఉన్నదని అధికారికంగా చెప్పారు. బీజేపీ కూడా ఇలాగే వ్యవహరించింది కదా. దేశభక్తి పేరిట రాజకీయం తగదు. కపట రాజకీయాలకు దేశభక్తి ముసుగు పరిపాటి అయింది. అధికార పార్టీల ఈ అవకాశవాదాన్ని స్వతంత్ర మేధావులు ఎత్తిచూపాలి; ప్రజలు తిరస్కరించాలి. రైళ్ళు, బస్సుల వంటి ప్రజల ఆస్తుల ధ్వంసం; ప్రయాణికుల పార్సెళ్ల దహనం... రేపు సైన్యంలో చేరాలనుకుంటున్న యువతరం చేయాల్సిన పనులేనా ఇవని వారిని మాత్రమే నిందిస్తే లాభం లేదు. కలుషిత రాజకీయాల పర్యవసానమే ఇది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? సెల్ టవర్సుని ధ్వంసం చేసే నక్సల్స్‌కీ, వివిధ పార్టీలు ప్రోత్సహిస్తున్న అరాచకత్వానికీ తేడా ఏముంది? కొన్ని అగ్రవర్ణ మూకలు గుజరాత్లో తమకు రిజర్వేషన్లు కావాలని చేసిన హింసాకాండ సందర్భంగా అన్ని పార్టీలు పాటించిన మౌనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరిట విధ్వంసం తాజా ఉదాహరణ! ఆందోళనంటే ఇలా, అలా చేయకపోతే ప్రభుత్వాలు స్పందించవు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. గోరక్షణ పేరుతో మానవ హత్యలను ప్రోత్సహిస్తున్న వాతావరణంలో... కేవలం ఆ నిరుద్యోగ పేద యువకులు భవిష్యత్ పట్ల ఉన్న భయంతో పాల్పడిన హింసను నిందించగలమా? కఠినంగా శిక్షించాలని, వారికి ఆర్మీలో ఉద్యోగాలివ్వడం అసాధ్యమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరో ఏదో తప్పు చేశారని చెప్పి, మర్నాడే బుల్డోజర్లతో వారి ఇళ్లను యూపీలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూల్చి వేసింది. తెలంగాణను నిందిస్తూ, ఇక్కడా బుల్డోజర్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. వారిని ఖండించకుండా కేంద్ర నాయకుల పరోక్ష మద్దతు! యధా రాజా తథా ప్రజా! మన దేశరక్షణను మన అవసరాలకూ వనరులకూ తగిన రీతిలో నిర్వహించుకోవాలి. అమెరికాలో ఇజ్రాయెల్‌లోనూ ఇలాగే చేస్తున్నారంటూ... ప్రభుత్వమూ, జాతీయవాద అధికార పార్టీ అగ్నిపథ్‌ను సమర్థించటం విడ్డూరం. టెక్నాలజీ అవసరమే కానీ మానవ వనరులే ప్రధానంగా ఉన్న మన దేశానికి ఆయా విధానాల్ని తగిన రీతిలో అన్వయించుకోవడం అవసరమనేది గుర్తించాలి. దేశరక్షణ కేవలం భారీ డిఫెన్స్ బడ్జెట్‌తో పటిష్టం కాజాలదు. బడ్జెట్, టెక్నాలజీ... రెండిటా నంబర్‌వన్ అయిన అమెరికా సైన్యం వియత్నాం, ఆఫ్గానిస్తాన్‌లో అధర్మ యుద్ధాల్లో ఘోర పరాజయం పొందింది. విదేశీ వ్యవహారాల్లో శాంతి లక్ష్యం, సరైన దౌత్యం లేకపోతే ఎవరికైనా అంతే. ఈ అన్ని సంగతులనూ దృష్టిలో పెట్టుకుని అన్ని పక్షాలూ అగ్నిపథ్ ఉచితానుచితాలను ఆలోచించాలి. (క్లిక్: కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు మాటేంటి?) - డాక్టర్ ఎం. బాపూజీ సీఎస్ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త -
Agnipath Scheme: స్వార్థపర శక్తులతో జాగ్రత్త!
ఒక్క క్షణం సహనం, కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది – స్వామి వివేకా నంద దేశంలో రోజు రోజుకూ మారుతున్న పరిణామాల కారణంగా అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు స్వార్థపరులు ఆడుతున్న క్రీడలో పలువురు అనవసరంగా పావులుగా మారుతున్నారు. అగ్నిపథ్ పథకంపై నిరసనల్లో పాల్గొని కేసుల పాలైన నిరుద్యోగ యువత ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణ. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణకు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే వాస్తవాలూ, పూర్తి వివరాలూ తెలుసు కోకుండానే స్వార్థ రాజకీయ నాయకులూ, కోచింగ్ సెంటర్ల యజమానులూ కుట్రపూరితంగా అమాయక నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి హింసకు పాల్పడేలా చేస్తున్నారు. వీరి మాటలు విన్న యువత రెచ్చి పోయి కేసుల్లో ఇరుక్కుంటూ తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఈ అగ్నిపథ్ కింద... 18 నుంచి 23 ఏళ్ల యువకులు నాలుగేళ్లపాటు నెలకు 30 నుంచి 40 వేల జీతంతో దేశ సేవ చేసిన తర్వాత... వారికి రూ. 11.71 లక్షల సేవా నిధి అందు తుంది. సైన్యంలో పొందిన క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం యువతకు లభిస్తుంది. కానీ ఈ వాస్తవాల గురించి తెలుసుకుని పూర్తి అవగాహన పెంపొందించుకునే అవకాశాన్ని స్వార్థపర శక్తులు యువతకు ఇవ్వకుండా వారిని భయాందోళనకు గురిచేశారు. వారి మాటలను నమ్మి విధ్వంసానికి పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు మాటేంటి? అగ్నిపథ్నే కాదు అంతకుముందూ స్వార్థ రాజకీయ శక్తులు మోదీ తలపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించాయి. రైతులకు మేలుచేసే నూతన వ్యవసాయ చట్టాలు తెస్తే రైతులను రెచ్చగొట్టి వాటిని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. నోట్ల రద్దును పదేపదే విమర్శించేవారు మోదీ నిర్ణయం తర్వాత తీవ్రవాద చర్యలు ఎందుకు తగ్గుముఖం పట్టాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. మోదీ ప్రభుత్వం డిజిటల్ మనీ విధానాన్ని ప్రవేశపెట్టిన కొత్తలో మార్కెట్‌కు వెళ్ళి కిలో ఆలుగడ్డలు కొనడానికి డిజిటల్ మనీ కావాలా అని ఎద్దేవా చేసిన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం లాంటి వారికీ గంగిరెద్దుల వారు కూడా ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా భిక్షం స్వీకరించటం చెంపపెట్టులాంటిది కాదా? గతంలో కూడా ఇలాంటి విమర్శలకు భయపడి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు నిలిపివేసి ఉంటే పలు దేశాలలాగా మన దేశం కూడా ఆర్థికమాంద్య పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చేది. మోదీ ప్రభుత్వ 8 ఏళ్ల పరిపాలన చూసి కూడా... ఇంకా స్వార్థపరుల మాటలు వింటూ సహాయ నిరాకరణ, ఆందోళనలు చేస్తే మన చేతితో మన కంటిని మనమే పొడుచుకున్న వారమవుతాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసిన మనం ఎవరి పరిపాలన బాగుంది, ఎవరికి మద్దతుగా నిలబడాలి అని తులనాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. - శ్యామ్ సుందర్ వరయోగి బీజేపీ నాయకుడు -
సర్కారీ కొలువుల జాతర
కొత్తగా పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్టు వెలువడిన కథనం చిరకాలంగా కొలువుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతలో ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం పర్యవసానంగా వచ్చే ఏడాదిన్నరకాలంలో 77 మంత్రిత్వశాఖల పరిధిలోని వివిధ విభా గాల నుంచి వరస నోటిఫికేషన్లు హోరెత్తుతాయి. కొత్తగా ఉద్యోగాలిస్తే జీతాల కోసం అదనంగా ప్రతి నెలా రూ. 4,500 కోట్లు వ్యయమవుతుందని ఒక అంచనా. అంటే ఏటా ప్రభుత్వానికి రూ. 54,000 కోట్ల అదనపు ఖర్చుంటుంది. ఈ ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ వగైరాలకయ్యే వ్యయం అదనం. వీరందరికీ మున్ముందు పదోన్నతులు ఇవ్వాల్సివచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలు సరేసరి. అసలు ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయి రిక్రూట్మెంట్ ఆచరణలో సాధ్యమేనా అన్న సందేహం కూడా వస్తుంది. ఒక క్రమపద్ధతిలో అవసరానికనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే సమస్యలుండవు. ఆ విభాగాలు ఎలాంటి అంతరాయమూ లేకుండా సేవలందించడం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఒకేసారి జాతర మాదిరిగా ఉద్యోగాల భర్తీ చేపడితే నిరుద్యోగులకూ ఇబ్బందే. ఏ ఉద్యోగం వస్తుందో, ఏది రాదో తెలియక అన్ని పరీక్షలకూ హాజరుకావాల్సి వస్తుంది. తాము అధికారంలో కొచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఆ విషయంలో అడపా దడపా విమర్శలు వస్తున్నా కేంద్రంలోని పెద్దలు పట్టించుకోలేదు. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలేనా అని కొందరు సచివులు ఎదురు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగ పెనుభూతం యువతరాన్ని ఎంతగా పీడిస్తున్నదో తెలియడానికి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, గురుగ్రామ్ తదితరచోట్ల వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలే నిదర్శనం. రైల్వే ఆస్తులను, బస్సులను ధ్వంసం చేయడం, రహదారుల దిగ్బంధం వంటి ఘటనలు చూస్తుంటే యువత ఎంతగా నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయారో అర్ధమవు తుంది. 1994 గణాంకాల ప్రకారం కేంద్రంలో 41.76 లక్షల ఉద్యోగాలుండేవి. 2014 నాటికి వాటి సంఖ్య 39.9 లక్షలు. 2021 లెక్కల ప్రకారం కేంద్ర సిబ్బంది 34.5 లక్షల మంది. వీరుగాక చిన్నా చితకా ఉద్యోగాలతో సహా కేంద్రంలో 24.30 లక్షలమంది కాంట్రాక్టు నియామకాల కింద పనిచేస్తు న్నారు. కేంద్ర సిబ్బందిలో 92 శాతం మంది కేవలం ఐదు మంత్రిత్వ శాఖల్లో ఉంటారని చెబుతారు. ఇందులో 40 శాతం వాటాతో రైల్వేలు అగ్రభాగాన ఉంటే... హోంశాఖలో 30 శాతం, రక్షణ (పౌరవిభాగం)లో 12 శాతం సిబ్బంది ఉంటారు. నిజానికి బయట దొరికే ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాల శాతం చాలా తక్కువ. మన జీడీపీ ఘనంగా కనబడటానికి తోడ్పడుతున్న సేవారంగంలో ఉద్యోగాలకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతాయి. పైగా అక్కడా సాంకేతికత పెరిగి గతంతో పోలిస్తే ఉద్యోగావకాశాలు క్షీణిస్తున్నాయి. ఏటా కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి వచ్చేవారు కోటీ 20 లక్షలమంది అని ఒక అంచనా. వీరిలో ఎందరికి ఉద్యోగాలు దొరుకుతాయి? వీరికన్నా చాలా ఏళ్లముందునుంచీ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారి మాటేమిటి? పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడే ధోరణి కనబడదు. అక్కడ రెండు రంగాల్లో లభించే వేతనాలకూ పెద్దగా వ్యత్యాసం ఉండదు. కానీ మన దేశంలో వేరు. ప్రభుత్వ సిబ్బందికి నిర్ణీత వ్యవధిలో వేతన సవరణ సంఘాల సిఫార్సులు వస్తాయి. కాస్త వెనకో ముందో వాటిని అమలు చేస్తారు. ఇవిగాక ప్రైవేటు రంగంతో పోలిస్తే ఇతరత్రా సదుపాయాలు, క్రమం తప్పకుండా వచ్చే పదోన్నతులు అదనం. ప్రైవేటు రంగ సిబ్బంది యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలి. కార్మికసంఘాలు బలహీనపడ్డాయి గనుక ఉద్యోగులకు దినదినగండంగా ఉంటున్నది. లేబర్ కోర్టులు వగైరాలవల్ల పెద్దగా ఒరిగేది ఉండదు. ప్రైవేటు రంగంలో కూడా మెరుగైన పరిస్థితు లుండేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు లేకపోగా... రేపో మాపో అమల్లోకి రానున్న లేబర్ కోడ్ వల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నమవు తాయని బీజేపీ అనుకూల కార్మికసంఘంతో సహా అన్ని సంఘాలూ ఆరోపిస్తున్నాయి. ఈ కారణాల వల్లే ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడేవారు నానాటికీ పెరుగుతున్నారు. నిరుద్యోగంపై కేవలం కేంద్రాన్ని మాత్రమే తప్పుబట్టడం కుదరదు. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదానితో నిమిత్తం లేకుండా 90వ దశకం మధ్యనుంచీ అన్ని రాష్ట్రాల్లోనూ సర్కారీ కొలువులు తగ్గిపోయాయి. తాను అధికారంలోకొస్తే యువతకు ఉద్యోగాలిస్తాననీ, లేనట్టయితే నిరుద్యోగ భృతి ఇస్తాననీ 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు తాను పాలించిన ఐదేళ్లూ ఉద్యోగాలూ ఇవ్వలేకపోయారు, నిరుద్యోగ భృతిని కూడా అందించలేకపోయారు. చివరకు 2019లో అధికారం లోకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం భారీయెత్తున యువతకు ఉద్యోగాలిచ్చింది. కేంద్ర స్థాయిలో క్రమం తప్పకుండా నియామకాలు చేపట్టే ప్రధాన సంస్థల్లో యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ప్రధానమైనవి. వీటిద్వారా గత ఐదేళ్లలో నాలుగున్నర లక్షలమందిని తీసుకున్నట్టు కేంద్రం చెబుతున్నది. ఇవిగాక ప్రస్తుతం వివిధ విభాగాల్లో పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడివున్నాయి. కొలువుల భర్తీపై కేంద్రం తాజా ప్రకటనను విపక్షాలు తప్పుబడుతున్నాయి. రానున్న ఎన్నికల కోసమే ఈ ఆర్భాటమంటున్నాయి. కావొచ్చు... ఉద్దేశాలు ఏమైనప్పటికీ యువతకు ఉద్యోగ కల్పన నిర్ణయాన్ని హర్షించాల్సిందే. -
పోలీసు జాబ్స్ వయోపరిమితి పెరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ముందుగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయనే ప్రచారంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఈ కొలువులకే సన్నద్ధమవుతోంది. అత్యధిక పోస్టులు ఉండటంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కావడంతో వీటికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వయోపరిమితి విషయంలో నెలకొన్న అస్పష్టతతో చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. అధిక సంఖ్యలో నియామకాలు చేపట్టే కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు ఉండగా, ఎస్సై పోస్టులకు 25, డీఎస్పీకి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు 26 ఏళ్లు ఉంది. దీంతో గరిష్ట వయోపరిమితి పెంపుపై నిరుద్యోగ యువత గంపెడాశలు పెట్టుకుంది. వయోపరిమితి పెంచితేనే.. పోలీసు శాఖలో వివిధ కేటగిరీల్లో 16,587 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా గ్రూప్–1లో డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, రీజినల్ ట్రా న్స్పోర్ట్ ఆఫీసర్ విభాగాల్లో 120 ఉద్యోగాలున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఇతర ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ యూనిఫాం కొలువులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రిజర్వేషన్ అభ్యర్థులకు కాస్త సడలింపు ఉన్నప్పటికీ జనరల్ కేటగిరీలో సడలింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ జనరల్ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి పెంచితే రిజర్వ్డ్ అభ్యర్థులకు మరింత ఉపశమనం కలుగుతుందనే ఆశ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కనిపిస్తోంది. వయోపరిమితిపై ప్రభుత్వం ముం దుగానే నిర్ణయం ప్రకటించాలని, నోటిఫికేషన్ విడుదలయ్యాక సడలింపు జఠిలమవుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. పొరుగున 35 ఏళ్లు గ్రూప్–1 కేటగిరీలో యూనిఫాం ఉద్యోగాలు డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఆర్టీఓ ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీలో డీఎస్పీకి గరిష్ట వయోపరిమితి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు 26 ఏళ్లు ఉంది. అయితే, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడా వయోపరిమితి పెంచాలని, లేనిపక్షంలో చాలామంది ఆశలు గల్లంతవుతాయని నిరుద్యోగులు అంటున్నారు. -
పరాయి దేశాల్లో పడరాని పాట్లు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 24 మంది, కేదారిపురం గ్రామానికి చెందిన 13 మంది, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మరో ఏడుగురు నిరుద్యోగులు గత ఏడాది డిసెంబర్లో ఓ ప్రకటన చూసి ‘అరౌండ్ ద వరల్డ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో గాజువాక గ్రాన్ ఆపిల్ హోటల్లో దుబాయ్ డ్రాగన్ కంపెనీ, అబుదాబీ శాంసంగ్ కంపెనీల్లో వెల్డర్, ఫిట్టర్, స్టోర్‌మెన్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీసా, పాస్‌పోర్ట్, విమానం టికెట్ల కోసం రూ.45వేలు నుంచి రూ.55వేలు వరకు వసూలుచేశారు. ఈ ఏడాది జనవరి 24న ముంబై చేరుకోవాలని, అక్కడ నుంచి 28న విమానంలో విదేశాలకు వెళ్లాలంటూ చెప్పిన ట్రావెల్ ఏజెంట్లు ఆ తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి ఉడాయించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: .. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శ్రీకాకుళం జిల్లాలో ఈ తరహా మోసాలు సర్వసాధారణం. ఇక్కడి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో వందలాది మంది యువత తరచూ ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. వివిధ శిక్షణా సంస్థలకు లక్షల్లో ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక చెప్పిన ఉద్యోగం చూపించకపోవడం, టూరిస్ట్ వీసాలంటూ వెనక్కి పంపడం.. నకిలీ ఆర్డర్లతో ఉద్యోగాలే ఇవ్వకపోవడంతో యువకులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. మోసం జరుగుతోందిలా.. సిక్కోలు (శ్రీకాకుళం) జిల్లాకు చివర్లో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి నిరుద్యోగ యువకులకు పలు సంస్థలు విదేశీ ఉద్యోగాల ఎరచూపి దోపిడీకి పాల్పడుతున్నాయి. గ్రామాల్లో ఉద్యోగ ప్రకటనను అతికించి కొంతమంది, మధ్యవర్తుల ద్వారా కార్మికులను మాయమాటలతో నమ్మించి మరికొందరూ మోసాలకు పాల్పడుతుంటే.. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో.. ఆకర్షణీయమైన జీతాలు అందిస్తామంటూ నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ లక్షలాది రూపాయలు లాగేస్తున్నారు. ఏసీ గదుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఫోన్‌చేసి కళ్లెదుటే సినిమా చూపిస్తారు. తీరా డబ్బులు చేతికి అందాక చుక్కలు చూపిస్తున్నారు. మోసపోతున్నదిక్కడే.. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కంచిలి ప్రాంతాలతోపాటు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుర్లారోడ్, బరంపుర్, ఛత్రపూర్ వంటి ప్రాంతాల్లో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటుచేసి, నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి, విదేశాల్లో ప్ల్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రిగ్గర్, టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్రికేటర్ తదితర పోస్టులను బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షలు వసూలుచేస్తున్నారు. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్, అబుదాబి, ఒమెన్, ఇరాక్, సౌదీ అరేబియా, సూడాన్, రష్యా, పోలండ్ తదితర ప్రాంతాలు ఇక్కడి నిరుద్యోగుల యువత కష్టాలకు కేంద్రంగా మారాయి. నా భర్త ఏమయ్యాడో.. నా పేరు పుచ్చ అనుసూయమ్మ. మాది వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీ కొల్లిపాడు గ్రామం. నా భర్త కుర్మారావు 2019లో సౌదీకి ఉపాధి కోసం వెళ్లాడు. అల్ మసాలిక్ కంపెనీలో చేరాడు. రెండు నెలలుగా అచూకీలేదు. నా భర్తకు ఏమైందో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీడంలేదు. ఎస్పీ, జిల్లా కలెక్టర్లను ఆశ్రయించాం. చివరికి నా భర్త పనిచేస్తున్న కంపెనీని మెయిల్ ద్వారా సమాచారం కోరాం. ఎలాంటి సమాచారంలేదు. మన వారిని చూసి కన్నీళ్లొచ్చాయి.. విదేశాల్లో మనవారు పడుతున్న కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయి. టూరిస్ట్ వీసాలతో మోసపోయి సుమారు 60 మంది దుబాయ్‌లో అనేక కష్టాలుపడ్డారు. కడుపు నింపుకోవడం కోసం ప్రతీ శుక్రవారం మసీదుల వద్ద ఉచితంగా అందించే రొట్టెలు, పండ్లు కోసం క్యూ కట్టేవారు. రాత్రి సమయంలో ఇసుక తిన్నెలపై పడుకునేవారు. పోలీసుల కంటపడకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయా.. – హెచ్చర్ల కుమారస్వామి, బాధితుడు, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం. ఉద్యోగాలివ్వకుండా మోసం.. సింగపూర్‌లోని రొమేనియాలో ఉద్యోగాలిప్పిస్తామని కంచిలి మండల పరిధి కత్తివరం రోడ్డులోగల శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని బసవ వెంకటేష్ మోసం చేశాడు. మా వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశాడు. డబ్బులు కట్టినప్పటికీ ఉద్యోగాలకు పంపించలేదు. రెండేళ్లుగా మేం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పటికీ ఇవ్వడంలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. మోసగాడు తప్పించుకు తిరుగుతున్నాడు. – దుంగ తారకేశ, ఇన్నీసుపేట, ఈరోతు తారకేశ్వరరావు, సన్యాసిపుట్టుగ, సంగారు సురేష్, కపాసుకుద్ది మోసాలు అనేకం.. మచ్చుకు కొన్ని.. ► ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఓ ఏజెంట్ 150 మంది నుంచి దాదాపు రూ.2కోట్లు వసూలు చేసి రష్యా స్టాంపుతో నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడు. వాస్తవానికి వీసా అనేది పాస్‌పోర్టుపై అతికించి ఇవ్వాలి. కానీ, ఈ ఏజెంట్ 150 మందిని పట్టుకుని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా అక్కడ భారత ఎంబసీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలుగా తేల్చి వెనక్కి పంపించేశారు. ► కంచిలి మండల పరిధిలోని కత్తివరం రోడ్డులో శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సుమారు 150 మంది నిరుద్యోగ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసంచేసి, ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి 70 వేలు చొప్పున వసూలు చేసి, దుకాణం మూసేశారు. బాధితుల్లో ఇన్నీసుపేట, సన్యాసిపుట్టుగ, కపాసుకుద్ది, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన వారున్నారు. ► అలాగే, ఇదే మండలంలోని డోలగోవిందపురం గ్రామానికి చెందిన మట్ట దున్నయ్య అనే వ్యక్తి డోలగోవిందపురం, గంగాధరపురం, ఒడిశాకు చెందిన నరేంద్రపురం తదితర గ్రామాలకు చెందిన ఆరుగురి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేసి, మరో ఏజెంటు ద్వారా వీరికి శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు, ఓటీ, భోజనం, వసతి సౌకర్యం కల్పించే ఉద్యోగం ఇస్తానని చెప్పి నమ్మబలికి, తీరా యువకులను శ్రీలంక పంపించి, అక్కడ కేవలం రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో ఆయా యువకుల కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. ఒక ఉద్యోగం అని చెప్పి.. వేరే ఉద్యోగం ఇచ్చి.. శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు ఓటీతో కలిపి రూ.25వేలు వరకు వచ్చే ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశారు. తీరా వారం రోజుల క్రితం శ్రీలంకకు వెళ్లి అక్కడి గమేజ్ ట్రేడింగ్ కంపెనీలో నెలకు రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలిచ్చి మోసంచేశారు. ఏజెంట్ చెప్పిన ప్రకారం ఏదిలేదు. మాకు జరిగిన మోసంపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. మేం కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలి. – శ్రీలంక నుంచి బాధితులు పురుషోత్తం, బినోద్ నాయక్, శివ -
తెలంగాణ వచ్చినా.. ఆత్మహత్యలా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యోగాల్లేక యువతీయవకులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ.. నిరుద్యోగ భృతి కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన ‘కోటి సంతకాల’సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆదివారం పార్టీ కార్యాల యంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీకి నివాళులు అర్పించిన అనంతరం తొలి సంతకం చేసి ఈ కార్యక్రమానికి సంజయ్ శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీ లేవీ సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014లో అసెంబ్లీలో కేసీఆర్.. 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ‘ఏడున్నరేళ్ల నుంచి ఒక్క గ్రూప్–1 ఉద్యోగం లేదు.. మూడేళ్ల నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు’అని పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను సీఎం చేసిన హత్యలుగానే బీజేపీ భావిస్తోందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘నిన్నొకాయన లక్షన్నర ఉద్యోగాలిచ్చామంటూ పచ్చి అబద్ధాలు చెబుతుండు.. దమ్ముంటే ఆ జాబితాను విడుదల చేయాలి’అని సంజయ్ సవాల్ విసి రారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి..
శామీర్‌పేట్(హైదరాబాద్)/ధన్వాడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్న కుమారుడు నరసింహ (23) బీఎస్సీ (బయో టెక్నాలజీ) పూర్తి చేశాడు. కొద్దికాలంగా శామీర్‌పేటలోని ఓ రూంలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యో గం చేస్తున్నాడు. అయితే నరసింహ స్వగ్రామానికి వెళ్లిన ప్రతిసారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు సాధిస్తావు అంటూ అడుగుతుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. గత కొంతకాలంగా తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోయానంటూ బాధపడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యో గం చేసిన వాల్లే మనుషులా..ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి గత నెల 27న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో తోటి మిత్రులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సోమవారం ఉదయం లాల్‌గడి మలక్‌పేట గ్రామంలోని మల్క చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రో‘సాఫ్ట్’ స్కిల్స్
సాక్షి, అమరావతి: డిగ్రీ విద్యార్ధుల సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగావకాశాలు మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రపంచంలో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్రంలో 1.62 లక్షల మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఈమేరకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకోగా గడువు తేదీని వచ్చే ఏడాది డిసెంబర్ చివరి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఒప్పందం ప్రకారం గడువు ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుతో ముగుస్తున్నప్పటికీ కరోనాతో విద్యాసంస్థలు దీర్ఘకాలం మూతపడటం, విద్యార్థులు నెలల తరబడి కాలేజీలకు దూరం కావడంతో ఒప్పందం గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 కాలేజీల పరిధిలో చదువుతున్న విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు మైక్రోసాఫ్ట్ వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.79 కోట్లను వెచ్చిస్తోంది. ఆన్లైన్ ద్వారా అత్యంత నాణ్యమైన కొత్త కరిక్యులమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. బ్రాండ్ వాల్యూ ఉన్న మైక్రోసాఫ్ట్ అందించే ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల గుర్తింపు ఉన్నందున విద్యార్ధులకు ఎంతో మేలు జరగనుంది. శిక్షణ ప్రాజెక్టు అమలు కోసం పర్యవేక్షణ, మూల్యాంకన కమిటీని ప్రభుత్వం నియమించింది. 40 కోర్సులలో శిక్షణ మైక్రోసాఫ్ట్ సంస్థ అధునాతన సాఫ్ట్వేర్ అంశాలపై విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేక డొమైన్ ద్వారా 40 సర్టిఫికేషన్ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.7,500 (100 యూఎస్ డాలర్లు) విలువ గల ‘అజూర్‌పాస్’ను ప్రతి విద్యార్థికి సమకూర్చనుంది. దీని ద్వారా 1.62 లక్షల మంది విద్యార్థులు క్లౌడ్ టెక్నాలజీ ద్వారా శిక్షణాంశాలను సులభంగా పొందగలుగుతారు. సర్టిఫికేషన్ కోర్సులతో పాటు అదనంగా ‘లింకిడ్ ఇన్ లెర్నింగ్’ ద్వారా బిజినెస్, క్రియేటివిటీ, టెక్నికల్ విభాగాలకు సంబంధించిన 8,600 కోర్సులు విద్యార్ధులు నేర్చుకునేందుకు అందుబాటులోకి వస్తాయి. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్‌ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా లాంటి 25 ఫ్రీ అజూర్ సర్వీసులు అందుతాయి. శిక్షణ కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ లెర్న్ (ఎంఎస్ లెర్న్) ముఖ్యమైన ప్లాట్‌ఫాంగా ఉంటుంది. సెల్ఫ్‌పేస్‌డ్, డిజిటల్ లెర్నింగ్ వనరుల ద్వారా విద్యార్ధులు నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతారు. పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. ప్రాజెక్టు పర్యవేక్షణకు ఉన్నత కమిటీ 1.62 లక్షల మంది విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సుల ప్రాజెక్టు అమలు, పురోగతి పరిశీలనకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి ఛైర్మన్‌గా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి సభ్యుడిగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా మరో నలుగురితో కమిటీ ఏర్పాటైంది. మైక్రోసాఫ్ట్‌తో ఉన్నత విద్యామండలి ఒప్పందం గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండగా కరోనా వల్ల ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగినందున 2022 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. శిక్షణలో భాగంగా మైక్రోసాఫ్ట్ గుర్తించిన సంస్థల ద్వారా మాక్ టెస్టులు, పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపడతారు. విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ అందించే సర్టిఫికెట్లను డిజి లాకర్లో భద్రపరుస్తారు. ఎంతో ప్రయోజనకరం విద్యార్ధులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాల శిక్షణపై మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ ప్రతిపాదనలు అందించిన అనంతరం ప్రభుత్వం సంబంధిత నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనలతో రాష్ట్ర విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివిధ యూనివర్సిటీలు, కాలేజీల ద్వారా స్టేక్హోల్డర్ల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకుంది. మైక్రోసాఫ్ట్ శిక్షణతో పలు రకాలుగా మేలు జరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో నిర్వహించిన సమావేశానికి మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓమ్‌జివాన్ గుప్తా తదితరులు హాజరై ప్రతిపాదనలను వివరించారు. అకడమిక్ ప్రోగ్రామ్స్‌లో మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, సర్టిఫికేషన్ కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వీసీలు పేర్కొన్నారు. -
నిరుద్యోగులకు అండగా నిలిస్తే అరెస్టులా?
చందుర్తి (వేములవాడ): నిరుద్యోగ యువతకు అండగా నిలిస్తే ప్రభుత్వం అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. చందుర్తిలో శనివారం గాంధీ విగ్రహ ఆవిష్కరణకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్, పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌లతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ చేపట్టిన జంగ్ సైరన్ కార్యక్రమానికి జీవన్‌రెడ్డి వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌చేశారు. దీంతో కార్యకర్తలు పోలీసుల వైఖరికి నిరసనగా వాహనానికి అడ్డుగా బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు కార్యకర్తలను అడ్డు తొలగించి జీవన్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్‌ను చందుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఠాణాలో విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని హామీఇచ్చారు. జెడ్పీటీసీ కుమార్, నాయకులు రాం రెడ్డి, ముకుందరెడ్డి, లింగారెడ్డి, రామస్వామి, ఫీర్ మహ్మద్ పాషా, 100 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పోస్టులు భర్తీ చేయకుంటే మిలియన్ మార్చ్
సిరిసిల్ల: దీపావళి పండుగలోగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుంటే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని, నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో శనివారం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామన్న కేసీఆర్, ఏడేళ్లలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి తరువాత నిర్వహించే మిలియన్‌మార్చ్ ఉద్యమంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని, ఇదే చివరి ఉద్యమం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున బాకీ ఉందన్నారు. కేసీఆర్ కేవలం ఒక్క రైతుబంధు ఇస్తూ.. అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేశారన్నారు. ఇక గల్ఫ్ బాధితులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం నిధులు ఇస్తే.. వాడుకుంటూనే ఏం ఇవ్వడం లేదని కేసీఆర్ చెబుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాగా, గ్రామాల్లో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎన్నో సమస్యలు తెలుస్తున్నాయని కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలా అన్నారు. బండి సంజయ్ వెంట ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన అంకిరెడ్డిపల్లెలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. అన్నీ ఆయన కుటుంబానికే... తెలంగాణ వస్తే నీళ్లు.. నిధులు.. నియామకాలు వస్తాయని అందరూ భావించారని, కానీ ఏడేళ్లలో అన్నీ సీఎం కేసీఆర్ కుటుంబానికే వచ్చాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. అంకిరెడ్డిపల్లె బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ఉపాధి కల్పించకుండా కేసీఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను గద్దె దించి బీజేపీని గెలిపించాలని కోరారు. -
భలే ఫిష్.. ఆల్ ఫ్రెష్
పెదగంట్యాడ (గాజువాక): వినియోగదారులకు నాణ్యమైన చేపలను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఫిష్ ఆంధ్ర మినీ అవుట్లెట్ల ఏర్పాటుకు రాష్ట్ర మత్స్యశాఖ శ్రీకారం చుట్టింది. నాణ్యమైన చెరువు చేపలు, సముద్రంలో పెరిగే మత్స్య రాశులను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులోని మార్వెల్ స్కూల్ ఎదుట వినాయక చవితి రోజున దీనిని ప్రారంభించారు. మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ బాలాజీ, కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ కె.కన్నబాబు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు లక్ష్మణరావుమతదితరులు అవుట్ లెట్‌ను ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అందుబాటులోకి తేనున్నారు. అందుబాటులో ఉండే చేపలివే.. సముద్రంలో పెరిగే వంజరం, చందువా, రొయ్యలు, పీతలు, పండుగొప్ప.. చెరువుల్లో పెరిగే శీలావతు, బొచ్చె, రూప్‌చంద్, మోసు, కొర్రమీను, రాగండి, కట్ల తదితర చేపలు. ప్రభుత్వమే ఈ అవుట్ లెట్లకు చేపలను సరఫరా చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా మినీ ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లను తీసుకువచ్చింది. మన చేప–మన ఆరోగ్యం కింద ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో లబ్ధిదారుడు కేవలం రూ.30 వేలు డిపాజిట్ చేస్తే మిగిలిన సొమ్మును బ్యాంకులు అందజేస్తాయి. దీంతో అవుట్లెట్ పెట్టుకుని సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. -
యువతకు ప్రభుత్వ బాసట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతీ, యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత యువతకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో దీన్‌దయాల్ అంత్యోదయ యోజన–జాతీయ పట్టణ జీవనోపాదుల పథకం(డీఏవై–ఎన్యూ ఎల్ఎం) మార్గదర్శకాల మేరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 35 మునిసి పాలిటీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి మెప్మా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 14 రంగాలలో 28 కోర్సులు పట్టణ ప్రాంతాల్లో ఏడో తరగతి నుంచి డిగ్రీ సమాన విద్యార్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతీ, యువకులు శిక్షణకు అర్హులు. విద్యార్హత, అభ్యర్థుల అభిరుచులకు అనుగుణంగా 14 రంగాల్లో 28 కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. రెండు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం అభ్యర్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ శిక్షణ కేంద్రాలతో యువతకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎన్ఎస్డీసీ) ద్వారా ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 69 ఉత్తమ శిక్షణ కేంద్రాలను ఎంపిక చేశారు. -
కేసీఆర్.. మొద్దు నిద్ర వీడాలి: షర్మిల
వనపర్తి/గోపాల్పేట: స్వరాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించిన నిరుద్యోగ యువత ఆశలను సీఎం కేసీఆర్ ఆవిరి చేసి, మోసం చేశారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నోటిఫికేషన్లు లేక.. ఉద్యోగం రాక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించా రు. నిరుద్యోగ ఆత్మహత్యల విషయంలో మొద్దు ని ద్రలో ఉన్న కేసీఆర్‌ను నిద్రలేపేందుకంటూ.. తాడిపర్తిలో షర్మిల ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు, ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే వరకు ప్రతి మంగళవారం ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. గత ఎన్నికల ప్రచార సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 50 వేల ఉద్యోగాలంటూ హామీలిచ్చారని, అవి ఎందుకు భర్తీ చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దీక్ష చేశారు. మృతుడు కొండల్ మిత్రుడు రఘు నిమ్మరసం ఇచ్చి షర్మిలతో దీక్ష విరమింపజేశారు. అనంతరం గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళ్లు అర్పించారు. -
ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడుంబిగించింది. ఉద్యోగం లేక నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలిపారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె పార్టీ అడహక్ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్ ఖాన్, కృష్ణమోహన్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్ 15 నుంచి 72 గంటల పాటు షర్మిల దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన కానరాలేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలో వరాలు కురిపించే సంస్కృతిని మాని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్ కేలండర్ రూపొందించాలని డిమాండ్ చేశారు. -
ఇంటింటికీ రేషన్ తరహాలోనే..
సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ కార్యక్రమం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన విధానంలోనే.. వివిధ కార్పొరేషన్ల సంక్షేమ పథకాల అమలుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరుద్యోగ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ)ను తిరిగి క్రియాశీలకం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సందర్భంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం పంపిణీ కార్యక్రమం అమలు బాధ్యతను సైతం ఏపీఐడీసీకే అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ జీవో జారీ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా 1960లో ఏపీఐడీసీ ఏర్పాటైంది. ఆ తర్వా త సంస్థ నామమాత్రంగా తయారైంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిరుద్యోగులకు వాహనాలను సమకూర్చి ఇంటింటికీ బియ్యం పంపిణీ కార్యక్రమం బాధ్యతలను వారికి అప్పగించిన విషయం తెలిసింది. ఈ తరహాలోనే ఇతర ప్రభుత్వ పథకాల అమలులో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపట్టే బాధ్యతను ఏపీఐడీసీకే ప్రభుత్వం అప్పగించింది. సంబంధిత శాఖలు, ఏపీఐడీసీ కలిపి ఎప్పటికప్పుడు వేర్వేరుగా విధివిధానాలు ఖరారు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో కొత్తగా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులోనూ నిరుద్యోగ యువతకు తగిన తోడ్పాటు అందించే బాధ్యతను ప్రభుత్వం ఏపీఐడీసీకి అప్పగించింది. -
నైపుణ్యాభివృద్ధిరస్తు.. ఉపాధి మస్తు
సాక్షి, అమరావతి: ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా ‘మీకు ఏ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలో చెప్పండి. మేమే శిక్షణ ఇచ్చి నైపుణ్యంతో కూడిన మానవ వనరుల్ని సమకూరుస్తాం’ అంటూ సీఎం వైఎస్ జగన్ వివిధ కంపెనీలకు ఆహ్వానం పలికారు. స్థానిక యువతకు పారిశ్రామిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి.. వారిని మెరికల్లా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఆలోచన మంచి సత్ఫలితాలిస్తోంది. 7 నెలల కాలంలోనే 4,413 మందికి వివిధ బహుళజాతి సంస్థల్లో ఉపాధి పొందడమే దీనికి నిదర్శనం. ఇందుకోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) సంయుక్తంగా నిరుద్యోగులను గుర్తించి నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి. పారిశ్రామిక సమగ్ర సర్వే ద్వారా.. పారిశ్రామిక సమగ్ర సర్వే ద్వారా వివిధ సంస్థలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని పరిశ్రమల శాఖ గుర్తించగా.. దానికి అనుగుణంగా ఏపీ ఎస్ఎస్డీసీ కోర్సులను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్స్ ట్రైనింగ్ పోగ్రాం (ఐసీఎస్‌టీపీ)ను ఏపీ ఎస్ఎస్డీసీ నిర్వహిస్తోంది. బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో వారికి కావాల్సిన కోర్సులకు అనుగుణంగా ఐసీఎస్‌టీపీ నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఐసీఎస్‌టీపీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటి వరకు 276 కంపెనీలు ముందుకు రాగా.. అందులో ఇప్పటికే 156 కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను శిక్షణ తరగతుల ద్వారా యువతకు అందించి ఉపాధి కల్పించినట్టు ఏపీ ఎస్ఎస్డీసీ అధికారులు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వివరించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ విధంగా మొత్తం 4,413 మందికి శిక్షణ ఇవ్వగా.. కోర్సు పూర్తి చేసిన వెంటనే వారందరికీ ఆయా సంస్థలు నేరుగా ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. వివిధ సంస్థలకు ఇలా.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాంగ్నిజెట్, కియా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, రాంకీ ఫార్మా, నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి అవసరమైన కోర్సుల్లో ఏపీఎస్ఎస్డీసీ యువతకు శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు, ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్వేర్ ట్రైనీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ ఎనలిస్ట్, ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇలా కోర్సులు పూర్తి చేసి ఉపాధి పొందిన వారికి ప్రారంభ వార్షిక వేతనం కనిష్టంగా రూ.2 లక్షల వరకు ఉంటోందని ఏపీ ఎస్ఎస్డీసీ అధికారులు పేర్కొన్నారు. -
కొబ్బరి దింపు.. ఉండదిక జంకు
సాక్షి, అమరావతి: కొబ్బరి చెట్టు నుంచి కాయల్ని కోసి నేలకు దించే (కొబ్బరి దింపు) విషయంలో రైతులు పడే వెతలు అన్నీఇన్నీ కావు. కొబ్బరి దింపు కార్మికులకు ఆదాయం తక్కువగా ఉండటం.. దింపు సమయంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చే వారు ఉండటం లేదు. దీనివల్ల రైతులకు కొబ్బరి దింపు తలకు మించిన భారంగా మారింది. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రం పరిష్కారం చూపుతోంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపుతోంది. ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ కొబ్బరి చెట్టుపైకి సునాయాసంగా ఎక్కగలిగే పరికరాన్ని కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీబీడీ) రూపొందించింది. ఈ పరికరం ఆధారంగా కొబ్బరి చెట్లు ఎక్కడం, కాయల్ని కోసి దించడంపై అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ ఇస్తోంది. 18–45 ఏళ్ల మధ్య వయసు కలిగి 7వ తరగతి వరకు చదివిన యువతీ, యువకులను కొబ్బరి వృక్ష మిత్రలుగా తీర్చిదిద్దుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ చెట్లు ఎక్కడం, కాయలు దెబ్బతినకుండా నేలకు దించడం, కొబ్బరి తోటల్లో తెగుళ్ల నివారణ, ఎరువులు, పురుగుల మందుల ఉత్తమ యాజమాన్య పద్ధతులపై తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి చొప్పున 6 రోజుల పాటు ఇస్తున్న శిక్షణ కోసం ఉద్యాన వర్సిటీ రూ.1,06,500 ఖర్చు చేస్తోంది. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్తో పాటు రూ.2,500 విలువ గల చెట్టు ఎక్కే పరికరాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 26 బ్యాచ్‌లుగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పట్టణానికి చెందిన 520 మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. తాజాగా అంబాజీపేట పరిశోధనా కేంద్రం సహకారంతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, విశాఖ జిల్లా అచ్యుతాపురం, చిత్తూరు జిల్లా కలికిరి, కృష్ణా జిల్లా గరికిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా (కేవీకే) శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. దింపు కార్మికులకూ పెరుగుతున్న ఆదాయం సాధారణంగా సంప్రదాయ కొబ్బరి దింపు కార్మికులు రోజుకు 30నుంచి 40 చెట్ల కాయల్ని దించగలరు. అదే శిక్షణ పొందిన వృక్ష మిత్రలైతే 70నుంచి 80 చెట్ల కాయలను దించగలుగుతున్నారు. సంప్రదాయ దింపు కార్మికులు రోజుకు రూ.300 సంపాదిస్తుండగా.. వృక్షమిత్రలు రోజుకు రూ.500 కంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. శిక్షణ పొందాలనుకుంటే.. ఆసక్తి గల నిరుద్యోగులు ఎంతమంది ముందుకొచ్చినా శిక్షణ ఇచ్చేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉంది. శిక్షణ పొందగోరే అభ్యర్థులు అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రం ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్ 08856–243847 లేదా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు (సెల్: 83095 38808)ను సంప్రదించవచ్చు. అభ్యర్థులకు సమీపంలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. స్థానికంగా ఉపాధి పొందగోరే యువత మాత్రమే కాకుండా కొబ్బరి తోటలు పెంచే రైతులు సైతం శిక్షణ పొందవచ్చు. నేనే దింపు తీసుకుంటున్నా నాకు మూడెకరాల కొబ్బరితోట ఉంది. దింపు సమస్యతో చాలా ఇబ్బందిపడే వాడిని. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ పొందా. ఇప్పుడు కార్మికులపై ఆధారపడకుండా నా తోటలో నేనే స్వయంగా కాయలు దింపుకోగలుగుతున్నా. దీనివల్ల నెలకు రూ.2 వేలకు పైగా మిగులుతోంది. – మట్టపర్తి వెంకట సుబ్బారావు, శిక్షణ పొందిన రైతు రోజుకు రూ.500 సంపాదిస్తున్నా నేను కూలీ పనులు చేసుకునే వాడిని. రోజూ రూ.300కు మించి ఆదాయం వచ్చేది కాదు. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ తీసుకున్నాను. ఉచితంగా ఇచ్చిన పరికరం సాయంతో సులభంగా కొబ్బరిచెట్లు ఎక్కి కాయల్ని దింపు తీస్తున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా. – నెల్లి నవీన్, కొబ్బరి వృక్షమిత్ర, గంగలకుర్రు, తూర్పు గోదావరి సమయం.. పెట్టుబడి కలిసొస్తుంది. నాకు పదెకరా>ల కొబ్బరి తోట ఉంది. దశాబ్దాలుగా దింపు సమస్య ఎదుర్కొన్నా. శిక్షణ పొందిన కొబ్బరి వృక్షమిత్రలు రావడంతో దింపు కోసం ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు సమయం, పెట్టుబడి కూడా కలిసి వస్తోంది. – చేకూరి సూర్యనారాయణ, డైరెక్టర్, కృషివల కోకోనట్ ప్రొడ్యూసర్స్ సొసైటీ దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం విశ్వవిద్యాలయం ద్వారా అంబాజీపేట పరిశోధనా కేంద్రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. శిక్షణ సందర్భంగా సాగులో యాజమాన్య మెళకువలపైనా తర్ఫీదు ఇస్తున్నాం. కొబ్బరి వృక్ష మిత్రల రాకతో కొబ్బరి దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. – డాక్టర్ టి.జానకిరామ్, వైస్ చాన్సలర్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ -
Cage Culture: కేజ్ కల్చర్‌తో యువతకు ఉపాధి
సాక్షి, అమరావతి: కేజ్ కల్చర్ (పంజరంలో చేపలసాగు)ను మరింత ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) అభివృద్ధి చేసిన ఈ వినూత్న సాగు కేజ్ కల్చర్‌ను 2007లో రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ సాగుకు గజం భూమి కూడా అవసరం లేదు. ప్రత్యేకంగా నీరు పెట్టక్కర్లేదు. తరచూ నీరు మార్చాల్సిన పనిలేదు. విద్యుత్ అవసరం అసలే లేదు. కూలీల భారం పెద్దగా లేనేలేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఆర్జించే ఈ సాగు సముద్రం, నదుల్లోనే కాదు.. అన్ని రకాల రిజర్వాయర్లలో ప్రోత్సహించే అవకాశం ఉన్నా గత ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదు. దీంతో మన రాష్ట్రంలోకంటే పొరుగు రాష్ట్రాల్లో ఈ సాగుకు మంచి ఆదరణ లభించింది. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన ఈ కల్చర్ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేజ్ తయారీ వినూత్నం.. 6 మీటర్ల వృత్తంతో 4 మీటర్ల లోతున ప్రత్యేకంగా తయారు చేసిన పంజరంలో సాగుచేస్తారు. ఇది తేలడానికి పంజరం కింద డ్రమ్‌లు, లోపల చేపలు పెంచేందుకు ఓ వల, బయట రక్షణ వలయంగా మరో వల ఏర్పాటు చేస్తారు. కనీసం 5 మీటర్ల లోతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వీటిని వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. విశాఖ సముద్ర తీరంలో 30, సూర్యలంకబీచ్‌లో 10 మెరైన్ కేజ్‌లు, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో 110 బ్యాక్‌వాటర్ కేజ్‌లు ఉన్నాయి. అత్యధికంగా 70కు పైగా కృష్ణాజిల్లా నాగాయలంకలో ఉండడంతో కేజ్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఆ ప్రాంతం నిలిచింది. ఈ సాగుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మత్స్య సంవృద్ధి యోజన (పీఎంఎంఎస్వై) ద్వారా 60ః40 నిష్పత్తిలో ఈ సాగుకు చేయూతనిస్తున్నాయి. ఖర్చులు పోను మెరైన్ కేజ్ ద్వారా ఏటా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, బ్యాక్‌వాటర్ కల్చర్ ద్వారా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. కేజ్ కల్చర్ విస్తరణకు ఏపీ అనువైన ప్రాంతం ఏపీలో కేజ్ కల్చర్ విస్తరణకు అవకాశాలున్నాయి. సుదూరమైన సముద్రతీర ప్రాంతంతోపాటు పొడవైన కృష్ణా, గోదావరి బ్యాక్‌వాటర్ ప్రాంతం ఉంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున రిజర్వాయర్లున్నాయి. ప్రత్యేకంగా కేజ్ కల్చర్ పాలసీని తీసుకొస్తే అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సీఎంఎఫ్‌ఐఆర్ సిద్దంగా ఉంది. – డాక్టర్ సుభాదీప్‌ఘోష్, సీఎంఎఫ్ఆర్ఐ విశాఖ రీజనల్ సెంటర్ హెడ్ త్వరలో కొత్త పాలసీ బ్యాక్‌వాటర్‌తో పాటు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ విస్తరణకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. త్వరలో కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ 12 కేజ్‌లు ఏర్పాటు చేశా.. కేజ్ కల్చర్ ఎంతో లాభదాయకం. నేను 2 కేజ్‌లతో ఈ సాగు ఆరంభించా. ప్రస్తుతం 12 కేజ్‌లకు విస్తరించగలిగా. ఒక్కో కేజ్‌కు రూ.50 వేలు పెట్టుబడిపెడితే రూ.లక్ష ఆదాయం వస్తోంది. చెరువులు అవసరం లేకుండా చేపలు పెంచే ఈ విధానం నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగం. – తలశిల రఘుశేఖర్, కేజ్ కల్చర్ రైతు, నాగాయలంక ముందుకొచ్చే వారికి శిక్షణ కేజ్ కల్చర్‌ను మరింత మెరుగుపర్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కల్చర్‌కు ముందుకొచ్చే వారికి పంజరం తయారీలో శిక్షణనిస్తున్నాం. సీడ్, ఫీడ్ అందిస్తున్నాం. సాగులో మెళకువలపై అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ శేఖర్ మేఘరాజన్, సీనియర్ శాస్త్రవేత్త, సీఎంఎఫ్ఆర్ఐ -
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 26 వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం నుంచి రాతపరీక్షలు ఆరంభం అయ్యాయి. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోపే గతేడాది దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో ఏడాది కూడా పూర్తికాక ముందే మరోసారి భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అందులోనూ కరోనాతో ఆర్థికంగా మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలతో పటిష్ట ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత ముఖాల్లో ఇప్పుడు వెలుగులు కాంతులీనుతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక వరుసగా వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుండటమే ఇందుకు కారణం. భర్తీ ప్రక్రియలోనూ వేగమే.. ► గతేడాది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన 35 రోజులకే రాతపరీక్షలు నిర్వహించడంతోపాటు 11 రోజులకే ఫలితాలను కూడా ప్రకటించింది. అంతేకాకుండా మరో పది రోజుల్లోనే ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసింది. ► రెండు విడతల్లో భర్తీ చేసిన/చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా సృష్టించి, మం జూరు చేసినవే కావడం గమనార్హం. ► అధికారిక లెక్కల ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు ఐదు లక్షలు కాగా ఇందులో నాలుగో వంతుకు సమానమైన ప్రభుత్వ ఉద్యోగాలను వైఎస్ జగన్ ప్రభుత్వమే సృష్టించడం విశేషం. పూర్తి పారదర్శకంగా.. ► ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించడంతోపాటు వాటిని అత్యంత వేగంగా, ఎ లాంటి వివాదాలకు, దళారులకు ఆస్కా రం లేకుండా పారదర్శకంగా భర్తీ చేస్తోంది. ► దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రభుత్వం ఇంటర్వ్యూలు లేకుండా చేసింది. ► కేవలం రాతపరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ, రిజర్వేషన్లను పాటిస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ► గతేడాది 1.34 లక్షల ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పు డు 16,208 పోస్టులకు మొత్తం 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. నేటి నుంచి 26 వరకు రాతపరీక్షలు ► రాష్ట్రంలో ఆదివారం నుంచి ఈ నెల 26 వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షలు జరుగుతాయి. ► 19 కేటగిరీల్లో రోజుకు రెండు పరీక్షల చొప్పున నిర్వహిస్తారు. ► మొత్తం 2,221 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ► కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ఒకరికొకరి మధ్య ఆరడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ► బెంచ్‌కు ఒకరి చొప్పున ప్రతి పరీక్ష గదిలో 16 మంది అభ్యర్థులను మాత్రమే ఉంచుతారు. ► రాతపరీక్షకు ముందు, పరీక్ష అనంతరం అన్ని పరీక్ష కేంద్రాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయిస్తున్నా మని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ► ప్రతి పరీక్ష గది ముందు శానిటైజర్ స్టాండ్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి ప్రత్యేక ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశామని చెప్పారు. ► రోజూ ఉదయం జరిగే పరీక్ష పది గంటలకు, సాయంత్రం పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ► నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యం అయినా రాతపరీక్షకు అనుమతించబోమని చెప్పారు. -
వదంతులు నమ్మొద్దు
సాక్షి, అమరావతి: ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు, నియామకాల ప్రక్రియ సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు–భూగర్భ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి నిరుద్యోగ యువత మోసపోవద్దని ఆయన హితవు పలికారు. సచివాలయంలోని తన చాంబర్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులను అరెస్టు చేయించినట్టు ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కాగా, సెప్టెంబరు 1 నుండి 8 వరకూ జరిగే ఈ రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లుచేసినట్టు మంత్రి వివరించారు. మొత్తం 5,314 పరీక్ష కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాల నిఘా, సాయుధులైన భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను భద్రపరుస్తున్నట్లు వివరించారు. పరీక్ష నిర్వహణకు 1,22,554 మంది సిబ్బందిని ఇప్పటికే నియమించామన్నారు. 12.85 లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ మొత్తం 15.50 లక్షల మంది పరీక్షలు రాస్తుండగా.. మంగళవారం ఉదయానికి 12.85 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. పరీక్షలకు హాజరయ్యే వారు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా వ్యక్తిగత గుర్తింపు పత్రం (ఆధార్, ఓటర్ గుర్తింపు, పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఏదో ఒకటి ఒరిజినల్) తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ 13 జిల్లాల్లో సుమారు 10,082 సర్వీసులు నడుపుతోందన్నారు. అంధత్వం, శారీరక చలనం లేని వ్యక్తులకు పరీక్షలో 50 నిమిషాలపాటు అదనపు సమయం కేటాయిస్తామన్నారు. అభ్యర్థులను సులభంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి ఆర్టీవో అధికారులు ఆటో యూనియన్లతో మాట్లాడుతున్నారన్నారు. అలాగే, ఎస్ఎంఎస్ల ద్వారా పరీక్షా కేంద్రాల లొకేషన్‌ను కూడా అభ్యర్థులకు తెలియపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు మూడ్రోజుల్లోఇసుక ధరలు ఇదిలా ఉంటే.. ఇసుక కొత్త ధరలను రెండు మూడ్రోజుల్లో వెల్లడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. కొత్త పాలసీలో రీచ్‌ల నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ విధానంలో ఎవరైనా సిండికేట్ అయి రీచ్‌ల నిర్వహణ టెండర్లలో పాల్గొని ఉంటే.. అలాంటి వాటిని రద్దుచేస్తామని మంత్రి స్పష్టంచేశారు. ఉద్యోగం ఇప్పిస్తానన్న వ్యక్తి అరెస్టు చిత్తూరు అర్బన్ : గ్రామ సచివాలయం ఉద్యోగం ఇప్పిస్తానంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. రాష్ట్ర మంత్రి తనకు తెలుసని చెబుతూ ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల ఇవ్వాలని ఫోన్లో చెప్పడం.. మరో వ్యక్తి దీన్ని వాట్సప్‌లో షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న పోరుమావిళ్ల రమేష్‌బాబు (52) అనే వ్యక్తి తన సన్నిహితుడైన అహ్మద్ అనే వ్యక్తితో.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి బంధువులు తెలుసునని, పోస్టుకు రూ.5లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని ఫోన్లో మాట్లాడాడు. ఈ సంభాషణను అహ్మద్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో విషయం మంత్రి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో దర్యాప్తు చేసిన సీఐ భాస్కర్‌రెడ్డి రమేష్‌రెడ్డిని అరెస్టుచేశారు. అభ్యర్థులు ఇలాంటి వాటిని నమ్మొద్దని.. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు. -
పెండింగ్‌లో 10 లక్షలు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉద్యోగానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఉపాధి కల్పనకు తలపెట్టిన స్వయం ఉపాధి పథకాలు నీరసించాయి. నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటం... పథకాల వార్షిక కార్యా చరణను ఆమోదించడంలో తాత్సారం చేయడంతో నిరుద్యోగుల ఆశలు గల్లంతవుతున్నాయి. దరఖాస్తులు సమర్పించిన వారు ఆమేరకు యూనిట్ల ఏర్పాటుకు ఏళ్లుగా ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల పరిధిలో దాదాపు 10.29లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించి అర్హతను నిర్ధారించాల్సిన బాధ్యత ఆర్థిక సహకార సంస్థలపై ఉంది.ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పరిశీలన మొదలుపెట్టి అర్హులను గుర్తించి రాయితీ పంపిణీ చేయాలి. ఇది పూర్తిగా గాడితప్పింది. కార్పొరేషన్లు సమర్పించిన వార్షిక ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదించకపోవడంతో పరిశీలన సైతం ప్రారంభం కాలేదు. రెండుసార్లు వెయ్యికోట్లు... ఎంబీసీ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వెయ్యి కోట్ల వంతున రెండుసార్లు కేటాయించింది. తొలి ఏడాది ఎంబీసీ కులాలపై స్పష్టత లేకపోవడంతో గందరగోళంలో పడ్డా... ఆ తర్వాతి ఏడాది వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీ పథకాల పంపిణీపై గందరగోళం వీడలేదు. నిధులు కేటాయించినప్పటికీ... లబ్ధిదారుల ఎంపికపై యంత్రాంగం శ్రద్ధ తీసుకోలేదు. దీంతో కేటాయించిన నిధులు ఏటా మురిగిపోతున్నాయి. -
ఉద్యోగాంధ్ర
రాష్ట్ర చరిత్రలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు.. రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా ఒకేసారి లక్షలాది ఉద్యోగ నియామకాలకు నాంది పలికారు.. ఈ పరిణామంతో ప్రజల లోగిళ్లకు ప్రభుత్వ పథకాలు చేరడానికి మార్గం సుగమం అవుతోంది.. ప్రభుత్వ వ్యవస్థ కూతవేటు దూరానికి తరలివస్తోంది.. సర్కారు విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో సువర్ణయుగం ప్రారంభమైంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థను మరింత దగ్గర చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే చేర్చే కార్యక్రమాలకు ఈ ఉద్యోగ నియామకాల ద్వారా శ్రీకారం చుడుతున్నారు. అదీ ఒకేసారి ఇన్ని లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు అందుతుండడం ఒక అపూర్వఘట్టం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు. ఈ ఉద్యోగ నియామకాలతో పరిపాలనా వ్యవస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. స్థానిక పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం మరింత సన్నిహితం కావడమే కాకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా వారి ఇళ్ల వద్దకే చేరనుండడం విశేషం. ఈ ఉద్యోగాల్లో 1,33,494 శాశ్వత ఉద్యోగాలు కావడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ సేవలందించేందుకు ఈ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వీలుగా ఈ ఉద్యోగ నియామకాలను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టింది. శాశ్వత ఉద్యోగాలతో పాటు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తున్నారు. తద్వారా 2,67,506 మంది నిరుద్యోగ యువతకు స్థానికంగానే స్వచ్ఛంద సేవకునిగా ఉద్యోగ అవకాశం లభించనుంది. శాశ్వత ఉద్యోగాల్లో నియామకమయ్యే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతన, భత్యాలు అందనుండగా వలంటీర్లకు ప్రతినెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. ప్రజలకు ఇక త్వరితగతిన సేవలు దాదాపు దశాబ్దం కాలంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు లేక ఉపాధి అవకాశాలూ కానరాక రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. వీరిని ఆదుకొంటామని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగ నియామకాలు చేపడతామని ఎన్నికలకు ముందు నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకు వస్తామని, వాటి ద్వారా శాశ్వత ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే అందించేలా వలంటీర్లను నియమిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే వాటికి కార్యరూపం ఇవ్వడం విశేషం. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరగలేదని, ఈ ప్రభుత్వం తమ జీవితాలకు వెలుగులు ప్రసాదించిందని నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. మరోపక్క క్షేత్ర స్థాయిలో కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగ నియామకాలు లేక ప్రభుత్వ కార్యక్రమాల అమలు కుంటు పడుతోంది. ప్రస్తుతం ఈ ఉద్యోగ నియామకాలతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఊపందుకోవడంతో పాటు పాలనా వ్యవహారాలు పరుగులు తీయడానికి, ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడానికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో 99,144, పట్టణాల్లో 34,350 ఉద్యోగాలు ప్రభుత్వం ఒకేసారి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తుండడంతో యువతలో ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ ఉద్యోగాల సాధన ద్వారా తమ జీవితాల్లో కొత్త వెలుగులు సంతరించుకుంటాయని భావిస్తున్నారు. ‘గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశాం. గత ప్రభుత్వ హయాంలో ఆశించిన నోటిఫికేషన్లు లేవు. వచ్చినా ఆ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా లక్షల్లో ఉద్యోగాలు అందుబాటులోకి రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని విజయవాడలో శిక్షణ పొందుతున్న పలువురు నిరుద్యోగులు అభిప్రాయపడ్డారు. మొత్తం 1,33,494 శాశ్వత ఉద్యోగాల్లో 34,350 పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల ద్వారా అందుతుండగా.. మిగతా 99,144 పోస్టులు గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి కాకుండా పట్టణాల్లో 74,185, గ్రామాల్లో 1,93,321 వలంటీర్ల పోస్టులు యువతకు వరంగా మారుతున్నాయి. పంచాయతీ వ్యవస్థ పరిపుష్టం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ సచివాలయాల ఉద్యోగాల వల్ల పంచాయతీ వ్యవస్థ మరింత పరిపుష్టం కానుంది. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలకు కేంద్రం 1994లోనే అనేక అధికారాలు కల్పించినా.. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ అధికారాలను వాటికి దక్కకుండా తన గుప్పెట్లోనే పెట్టుకుంది. ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీలకు అధికారాలు బదలాయించారు. అయితే తదనంతర ముఖ్యమంత్రులు వాటి ద్వారా ప్రజలకు సేవలందించేందుకు వీలుగా సిబ్బందిని నియమించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఉద్యోగ నియామకాలకు యుద్ధ ప్రాతిపదికన శ్రీకారం చుట్టారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చడంతో పాటు వైఎస్ జగన్ మానస పుత్రికలైన నవరత్నాల పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో ఈ నూతన ఉద్యోగ వ్యవస్థ కీలక భూమిక పోషించనుంది. అదే సమయంలో పంచాయతీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినకుండా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శే కన్వీనర్‌గా వ్యవహరించేలా, వీరందరినీ పర్యవేక్షిస్తూ సెలవులు ఇచ్చే అధికారం సర్పంచులకే ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు ఈ సచివాలయ పరిధిలోకి వస్తారు. కూతవేటు దూరంలో ప్రభుత్వ యంత్రాంగం గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల్లో లక్షలాది ఉద్యోగుల నియామకం, అంతకు రెట్టింపు సంఖ్యలో వలంటీర్ల ఏర్పాటుతో రాష్ట్రంలోని ప్రజానీకానికి ప్రభుత్వ యంత్రాంగ సేవలు కూతవేటులో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానంతో భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే వలంటీర్ల ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. శాశ్వత ఉద్యోగాలకు కావలసిన అర్హతలను, ఇతర నైపుణ్యాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పట్టభద్రులు, ఇంజనీర్లు, పాలిటెక్నిక్ డిప్లొమో పూర్తి చేసిన వారు, డిగ్రీలో సోషల్ వర్క్, నర్సింగ్‌లో ఫార్మా డీ చేసిన అభ్యర్థులు వీటికి అర్హులు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాల కల్పనలో మొన్నటి దాకా బిహారే నయం బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల ముందు ఊరూ వాడా ఊదర గొట్టిన చంద్రబాబు.. సీఎం పదవి చేపట్టిన తర్వాత కొత్తగా జాబులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశారు. బాబు ఐదేళ్ల పదవీ కాలంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఖాళీగా ఉన్న నాలుగవ తరగతి పోస్టులను ఏకంగా రద్దు చేశారు. దీంతో గత ఐదేళ్లలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఉద్యోగాల కల్పనలో బిహార్ రాష్ట్రం కన్నా ఆంధ్రప్రదేశ్ అధ్వాన్నంగా తయారైందని 2017–18 లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 13.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 శాతం నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల కన్నా మహిళా నిరుద్యోగుల సంఖ్య భారీగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 27 శాతం మహిళల్లో నిరుద్యోగం ఉండగా. పురుషుల్లో 20.4 శాతం నిరుద్యోగులున్నారని సర్వే గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పట్టభద్రుల్లో అత్యధికంగా 23.6 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని, డిప్లమా/ సర్టిఫికెట్ హోల్డర్లలో 17.6 శాతం నిరుద్యోగులుగా ఉన్నారని సర్వే పేర్కొంది. సెకండరీ, ఉన్నత విద్యలో బిహార్ కన్నా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే నిరుద్యోగులున్నారని, దేశ సగటు కన్నా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని స్పష్టం చేసింది. దీంతో పాటు జాతీయ కుటుంబ సర్వే – 4 ప్రకారం చూసినా రాష్ట్రంలో ఉద్యోగాలు లేని వారి సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్రంలో 2005–06లో 15 – 49 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఉద్యోగాలు లేని పురుషులు 0.8 శాతం ఉండగా 2015–16 లో ఇది 3.9 శాతానికి పెరిగినట్లు జాతీయ కుటుంబ సర్వే స్పష్టం చేసింది. ఇదే వయస్సు గల వారిలో ఉద్యోగాలు చేస్తున్న పురుషులు 2005–06లో 87.5 శాతం ఉండగా 2015–16 నాటికి 79.6 శాతానికి తగ్గిపోయినట్లు ఆ సర్వే స్పష్టం చేసింది. ఇదే వయస్సు గల వారిలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు 2005–06లో 50 శాతం ఉండగా, 2015–16 నాటికి 33 శాతానికి పడిపోయిందని సర్వే వెల్లడించింది. ఇదో సువర్ణావకాశం మన ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 1.33 లక్షల మందికి ఉపాధి దొరకడం మంచి పరిణామం. దీంతో పాటు ఈ ఉద్యోగులు తమ గ్రామ ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తా్తరు. దీనివల్ల సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందుతుంది. తమ ప్రాంత ప్రజలకే సేవలందిస్తున్నామనే భావన వల్ల అవినీతికి అవకాశం ఉండదు. ఇదే సమయంలో ఇప్పటికే పంచాయతీలలో సేవలు అందిస్తున్న వారికి ఉద్యోగ భరోసా కల్పిస్తే గ్రామ పరిపాలనలో అసంతృప్తికి అవకాశం ఉండదు. మొత్తం మీద గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. రాషŠట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగులకు ఇదో సువర్ణావకాశం. – టీఎంబీ బుచ్చిరాజు, చైర్మన్. ఆర్ విక్టర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శరవేగంగా తీసుకుంటున్న చర్యలు నిరుద్యోగుల్లో ఆనందం కలిగిస్తున్నాయి. 4 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం రాష్ట్ర చర్రితలో సువర్ణాక్షరాల్లో లిఖించదగ్గ రికార్డు. ఇది నిరుద్యోగులకు ఉపాధి కల్పన పట్ల జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు జగన్ సర్కారు బాటలు వేస్తోందని చెప్పవచ్చు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే చేర్చడం విప్లవాత్మక చర్య. – వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు. -
ముమ్మరంగా సింగరేణి సేవా కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆపరేషన్స్, ప్లానింగ్ విభాగం డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే పథకాలను చేపట్టాలని సూచించారు. పాత తరహాకు భిన్నంగా సరికొత్త ఆలోచనలతో కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ ఫండ్ (సీఎస్ఆర్) కింద కార్యక్రమాల అమలుకు సూచనలు, ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఏటా దాదాపు రూ.40 కోట్ల సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేస్తున్నామని, కొత్త గనులు ప్రారంభిస్తే నిధులు మరింత పెరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితికి సంబంధించిన ‘వెబ్ అప్లికేషన్’ను ప్రారంభించారు. సింగ రేణి సేవా సమితికి సంబంధించిన అన్ని ప్రాంతాల సమాచారం, వివిధ శిక్షణలు, శిక్షణ పొం దుతున్న వారి వివరాలు వంటి అంశాలు దీని ద్వారా ఆన్లైన్లోనే పొందుపర్చుకొనే అవకాశం కల్పిస్తున్నారు. 450 మందికి శిక్షణ.. సింగరేణి వ్యాప్తంగా ప్రాథమిక పరీక్షల ద్వారా ఎంపికైన 450 మంది నిరుద్యోగ యువతకు రెసిడెన్షియల్ తరహాలో ఆర్మీ రిక్రూట్మెంట్కి శిక్షణ ఇవ్వను న్నామని పీఆర్ విభాగం జనరల్ మేనేజర్ ఆంటోని రాజా, పీఆర్ఓ బి.మహేశ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణా సంస్థల్లో సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశ శిక్షణలు అందించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కమ్యూనికేషన్ ఆఫీసర్ గణాశంకర్ పూజారి తదితరులు పాల్గొన్నారు. -
యువనేస్తం.. అస్తవ్యస్తం
ఏఎన్‌యూ(గుంటూరు): నిరుద్యోగులకు చేయూత పేరుతో ప్రవేశపెట్టిన యువనేస్తం పథకం అస్తవ్యస్తంగా తయారయ్యింది. యువనేస్తం కింద ఆర్థిక సహాయం చేసే సంగతి దేవుడెరుగు.. కనీసం దరఖాస్తు ప్రక్రియ కూడా సక్రమంగా అమలు చేయటం లేదంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే దీన్ని ప్రవేశపెట్టారని విమర్శిస్తున్నారు. పలు రకాల నిబంధనలు విధిస్తూ నెలల తరబడి దరఖాస్తు కేంద్రాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వర్సిటీ కళాశాలల్లో చదివారని.. యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హులైన వారు గత ఏడాది సెప్టెంబర్‌లోనే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదు. తమను ఎందుకు ఎంపిక చేయలేదని యువనేస్తం టోల్‌ఫ్రీ నంబర్, సంబంధిత అధికారులను సంప్రదించగా మీరు తెలంగాణ ప్రాంతంలోని వర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాల్లో డిగ్రీ చదివారని కొందరికి, దూరవిద్యాకేంద్రం ద్వారా డిగ్రీ చదివారని మరికొందరికి సమాధానాలొచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్ వరకు ఏపీ ప్రాంతంలో చదివి డిగ్రీ మాత్రమే తెలంగాణ ప్రాంతంలో చదివిన విద్యార్థులు కూడా యువనేస్తం పథకానికి ఎంపిక కాలేకపోయారు. పరిశీలన పేరుతో.. తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో, దూరవిద్యలో డిగ్రీలు చదివిన వారి దరఖాస్తులు ఆమోదించకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని బాధిత నిరుద్యోగులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా.. డిగ్రీ సర్టిఫికెట్లు వెరిఫై చేసేందుకు సంబంధిత యూనివర్సిటీలు డేటా పంపలేదని, జన్యూనిటీ వెరిఫై చేయించుకుని రావాలని సలహా ఇచ్చినట్లు బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని యూనివర్సిటీలు, ఏపీలోని యువనేస్తం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యమే.. తెలంగాణ ప్రాంతంలో చదివిన వారికి, పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు దారులకు సర్టిఫికెట్ల పరిశీలన, అప్‌లోడ్‌కు హాజరుకావాలని రెండు రోజుల కిందట రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేరుతో మెస్సేజ్‌లు వచ్చాయి. దీనికి సంబంధిత షెడ్యూల్, సర్టిఫికెట్ల పరిశీలన జరిగే కేంద్రాల జాబితా ఉన్న వెబ్‌సైట్‌ను నిరుద్యోగులకు పంపించారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం వందల మంది మంగళవారం ఏఎన్‌యూ ఆన్లైన్ సెంటర్లో ఉన్న యువనేస్తం కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించారు. అప్‌లోడ్‌కు సంబంధించి ఎవరు సమాచారమిచ్చారో తమకు తెలియదని రిజిస్ట్రార్ కార్యాలయం అధికారుల చెప్పగా వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు అవాక్కయ్యారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది కూడా తమ వద్ద సమాచారమేమీ లేదని తేల్చి చెప్పారు. దీంతో కొందరు విద్యార్థులు యువనేస్తం పథకానికి సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించగా షెడ్యూల్ ఎవరిచ్చారో తమకు కూడా తెలియదని సమాధానం వచ్చింది. ఉన్నత విద్యామండలి పేరుతో మెస్సేజ్ వచ్చిందని చెప్పగా వారినే సంప్రదించండని చెప్పడం గమనార్హం. చివరికి విద్యార్థులు ఆందోళనకు దిగాలని భావిస్తున తరుణంలో ఏఎన్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించారు. దరఖాస్తు ప్రక్రియలోనే స్పష్టత లేకపోతే ఇక లబ్ధిదారుల ఎంపికలో సంబంధిత అధికారులు ఏం శ్రద్ధ తీసుకుంటారని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఆపేయడమేంటి? తెలంగాణ ప్రాంతంలోని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ చదివిన వారి సర్టిఫికెట్ల పరిశీలన చేయని కారణంగా ఈ పథకానికి ఎంపిక చేయలేదని అధికారులు చెప్పారు. కానీ, జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో బీటెక్ చదివిన మా స్నేహితుడిని ఎంపిక చేశారు. కొందరి దరఖాస్తులు ఎందుకు తిరస్కరిస్తున్నారో సరైన కారణం చెప్పే వారే లేరు. మేం మాత్రం ఐదు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.–టి.కిషోర్, తిరువూరు స్పష్టత లేని సమాచారంతో ఇబ్బందులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని మూడు రోజుల కిందట రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేరుతో నా మొబైల్‌కు మెస్సేజ్ వచ్చింది. దగ్గర్లోని సెంటర్‌కు ఎక్కడికైనా వెళ్లి పరిశీలన చేయించుకోవచ్చని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో నేను ఏఎన్‌యూకి వచ్చాను. సెంటర్‌కు తాళాం వేసి ఉంది. ఎవర్ని అడిగినా మాకు తెలియదని చెబుతున్నారు. ఇప్పటికి ఐదు నెలలుగా తిరుగుతూ ఉన్నాం. –కె.రాజశేఖర్‌రెడ్డి, నందిగామ ఉన్నత విద్యామండలికి కూడా తెలియదట.. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని రెండు రోజుల కిందట నాకు ఉన్నత విద్యామండలి పేరుతో మెస్సేజ్ వచ్చింది. ఏఎన్‌యూకి వస్తే ఈ విషయంపై మాకు సమాచారం లేదన్నారు. దీంతో మా స్నేహితులతో కలిసి తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వెళ్లాం. అక్కడ ఉన్న ఉద్యోగి దీనిపై మాకు సమాచారం లేదని టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదించాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే ఎవరు మెస్సేజ్ చేశారో వాళ్లనే అడగాలని చెప్పారు. – ఈ.అశోక్ రెడ్డి, నందిగామ -
భృతిని కట్ చేసేందుకు మరో ఎత్తుగడ
సాక్షి, అమరావతి బ్యూరో : తాము అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం.. లేకుంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి.. అంటూ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత భృతి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఇచ్చే రూ.వెయ్యికి పలు నిబంధనలు పెట్టడంతో అర్హులైన నిరుద్యోగులు భృతికి దూరమవుతున్నారు. యువనేస్తం పథకం లబ్ధిదారులు ఇప్పటివరకు మీ–సేవా కేంద్రం, రేషన్ డీలర్ల వద్ద బయోమెట్రిక్ నమోదు చేసుకుంటే భృతి జమయ్యేది. కానీ.. ఈ నెల నుంచి నిరుద్యోగ యువత సాధికార సర్వేలో ఏ మండలంలో నమోదు చేసుకున్నారో అక్కడే బయోమెట్రిక్ వేయాలనే కొత్త నిబంధనను ప్రభుత్వం తెచ్చింది. దీంతో పోటీ పరీక్షల కోసం ఇతర ప్రాంతాల్లో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే భృతి రానుపోను చార్జీలకే సరిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కోత విధించేందుకే.. భృతి తీసుకునే వారిలో 60 నుంచి 70 శాతం మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటూ, ఉద్యోగాన్వేషణలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొత్త నిబంధనతో వీరంతా తీవ్రంగా నష్టపోనున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కోచింగ్ తీసుకునే అభ్యర్థులు సొంత ఊరికొచ్చి వెళ్లేందుకు రూ.వెయ్యి కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాల్సిన అంశాలను ప్రభుత్వం ఇదివరకే స్పష్టంగా ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్ డేటా, ప్రజా సాధికార సర్వే, రేషన్‌కార్డు డేటా బేస్ అంశాలను స్పష్టంగా పేర్కొంది. వీటితో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అప్రెంటిస్ డేటా, ఈపీఎఫ్, ఈఎస్ఐ, జనాభా లెక్కల వివరాలు, అర్హతలను పొందుపర్చాల్సి ఉంది. ప్రభుత్వం పొందుపర్చిన అంశాలు లబ్ధిదారులను వడపోసేలా ఉన్నాయని నిరుద్యోగులంటున్నారు. ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న వారికి, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి భృతి ఇచ్చేది లేదని నిబంధనల్లో పేర్కొంది. 12 లక్షల మందికని ప్రకటించి.. రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి అర్హులైన వారు సుమారు 12 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ.. భృతిని ఇప్పటివరకు నాలుగు లక్షల మందికే ఇస్తోంది. దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించిన వారికి.. పథకానికి మీరు అనర్హులని వస్తుండటంతో వారు నిర్ఘాంతపోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11,73,670 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 4,31,888 మందే పథకానికి అర్హులుగా పేర్కొంది. ఆధార్‌కు, బ్యాంకు ఖాతాకు ఫోన్ నంబర్ అనుసంధానం కాకపోవడంతో అధికశాతం మంది ఇబ్బందిపడుతున్నారు. అన్ని అర్హతలుండీ తమకు భృతి అందకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 24,758 మంది అభ్యర్థులు తమకు భృతి రావడం లేదని గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే 4,30,000 మంది పథకానికి అర్హత సాధించారని చెబుతున్న ప్రభుత్వం.. జనవరి నెలలో 3,59,720 మందికే ఖాతాల్లో జమచేసింది. వివిధ కారణాలు చూపుతూ సుమారు 70 వేల మందికి ఎగవేసింది. ఇక మిగిలేదేంటి? గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన నేను హైదరాబాద్‌లో గ్రూప్స్‌నకు ప్రిపేరవుతున్నా. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధన కారణంగా నెల నెలా మా ప్రాంతానికి వెళ్లాలి. రానుపోను చార్జీలకే ఆ భృతి సరిపోతుంది. ఇక నాకు మిగిలేదేంటి? – ఎం.వెంకటకృష్ణ, నగరం మండలం, గుంటూరు జిల్లా కోత విధించేందుకే కొత్త నిబంధన నిరుద్యోగ భృతిలో కోత విధించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తెస్తోంది. రూ.2 వేలు భృతి అని చెప్పి.. వెయ్యితో సరిపెట్టారు. అదీ సరిగా ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దూర ప్రాంతాల నుంచి రావాలంటే కోచింగ్‌కు ఆటంకం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో వెనుకపడతాం. – ఎం.శ్రీనివాసరావు, రేపల్లె, గుంటూరు జిల్లా -
ఇవేం రిజర్‘వేషాలు’
ప్రస్తుతం ఏపీపీఎస్సీ అనుసరిస్తున్న విధానం ప్రకారం రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థి ఒకరు గ్రూప్–1 రిక్రూట్మెంట్లో ఫస్ట్ ర్యాంకు సాధించారనుకుందాం. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించటానికి రిజర్వేషన్ వాడుకున్నాడనే నెపంతో ఇతనికి బీసీ కేటగిరీలో పోస్ట్ ఉంటేనే ఇస్తారు. లేదంటే ఇవ్వరు. టోటల్‌గా ఫస్ట్ ర్యాంక్ సాధించినప్పటికీ ఫలితం శూన్యం. సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుపై నిరుద్యోగులు, ఆయా ఉద్యోగ సంఘాలు ఆందోళనలు వ్యక్తపరుస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. రిజర్వేషన్లపై కమిషన్‌కు ఎలాంటి అధికారం లేకపోయినా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రిజర్వుడు అభ్యర్థులకు న్యాయబద్ధంగా, రాజ్యాంగ పరంగా దక్కాల్సిన అవకాశాలను కాలరాస్తోందని కొద్ది రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకొని మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థి కేవలం తన రిజర్వుడ్ కోటాకు మాత్రమే పరిమితం కావాలని ఏపీపీఎస్సీ ఇటీవల కొత్త నిబంధన తేవడం తెలిసిందే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర ముఖ్యుల దృష్టికి తీసుకెళితే వారు చూసీ చూడనట్లు మౌనం వహించడంతో నిరుద్యోగుల ఆందోళ మరింత తీవ్రరూపం దాలుస్తోంది. స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకున్న వారు ఆతరువాత వారి కేటగిరీకే పరిమితం అవుతారని ప్రభుత్వం జారీ చేసిన జీఓ5లో ఎక్కడా లేదు. స్క్రీనింగ్ టెస్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు నిర్ణీత నిష్పత్తి సంఖ్య కన్నా తక్కువగా ఉంటే వారికి కటాఫ్ మార్కులు తగ్గించి ఎంపిక చేయడం ద్వారా ఆయా పోస్టులు భర్తీ చేయాలని మాత్రమే సూచించింది. అయితే వారు రిజర్వుడ్ పోస్టులకే అర్హులని ఏపీపీఎస్సీ చెప్పడం సరికాదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు కూడా ఇచ్చిందని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీపీఎస్సీకి లేఖ కూడా రాశారు. నోటిఫికేషన్లో పెట్టిన నిబంధన తొలగించి స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్‌కు ఎంపికైన రిజర్వుడ్ అభ్యర్థులందరినీ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ లేఖను ఏపీపీఎస్సీ పెద్దగా పట్టించుకోకపోగా, దీనిపై న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్లాలని తాజాగా భావిస్తుండడం మరింత వివాదంగా మారుతోంది. నిర్ణయాధికారం లేకున్నా అత్యుత్సాహం రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల అంశం చట్ట సభలు, ప్రభుత్వ పరిధిలోనిది. అధికరణ 320 ప్రకారం ఈ అంశాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరిధి బయట ఉంచారని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల విషయంలో చట్ట సభలు, ప్రభుత్వ విధానాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అమలు పరచడం తప్ప, నిర్ణయాలు మార్చేందుకు ఎటువంటి అధికారం రాజ్యాంగం కల్పించ లేదు. ప్రభుత్వ సర్వీస్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలో స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే వివిధ దశలు ఉన్నప్పటికీ అంతిమంగా వచ్చిన ర్యాంకులను బట్టి సర్వీసులను కేటాయించి రిజర్వేషన్లను అనుసరిస్తూ ఎంపిక చేయాల్సి ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. కానీ పరీక్షల ప్రక్రియ మధ్యలో ఉన్న వివిధ దశలను వాడుకుని రిజర్వేషన్లను వ్యతిరేక వైఖరితో (నెగటివ్ అప్రోచ్)తో అమలు చేయకూడదని చెబుతున్నారు. అయినా ఏపీపీఎస్సీ అత్యుత్సాం ప్రదిర్శిస్తోందని విమర్శిస్తున్నారు. యూపీఎస్సీ విధానమంటూ తప్పుదోవ యూపీఎస్సీ విధానమంటూ ఏపీపీఎస్సీ తప్పుదోవ పట్టిస్తోందని అభ్యర్ధులు వాపోతున్నారు. 2006 వరకు యూపీఎస్సీ రిజర్వేషన్లను సానుకూల వైఖరితో (పాజిటివ్ అప్రోచ్) అమలు చేసింది. 2007లో మద్రాస్ హైకోర్టు నిర్ణయం తర్వాతి నుంచి యూపీఎస్సీ వ్యతిరేక వైఖరి (నెగటివ్ అప్రోచ్)ని అనుసరించడంతో అభ్యర్థులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. యూపీఎస్సీకి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు వర్తించవు. ఆయా ప్రభుత్వాలు అయినా ఉత్తర్వులు ఇవ్వాలి లేదా కోర్టు నుంచి అయినా ఉత్తర్వులుండాలి. అవేవీ లేకపోగా ఇక్కడ కొత్త విధానం సరికాదని ఇక్కడి హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. సాధారణ పరిపాలనా శాఖ వద్దని చెప్పింది. అయినా ఏపీపీఎస్సీ తనంతట తానే ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి లక్షలాది మంది రిజర్వుడ్ అభ్యర్థులకు అన్యాయం చేస్తోంది. యూపీఎస్సీ రాష్ట్రాల కమిషన్లకు అధిపతి కానేకాదు. అయినా యూపీఎస్సీ విధానం అంటూ ఏపీపీఎస్సీ మెలిక పెడుతోంది. ప్రిలిమ్స్ అనేది కేవలం మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్ పరీక్షలో, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తున్నామని చెబుతున్న ఏపీపీఎస్సీ, ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ ఉపయోగించుకున్నాడని మెరిట్ అభ్యర్థికి పోస్టు ఇవ్వబోమని చెబుతుండడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ల విడుదల ఎప్పుడన్నది తేలడం లేదు. ఈ నాలుగున్నరేళ్లలో 2016లో ఒకే ఒక్కసారి 4,275 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులోనూ 2 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. తక్కినవన్నీ ఖాళీగానే మిగిలిపోయాయి. మళ్లీ ఇప్పటివరకు నోటిఫికేషన్ల ఊసెత్తలేదు. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఎట్టకేలకు సెప్టెంబర్ 19న 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించింది. ఇందులో కొన్ని పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా, మరొకొన్ని పోలీస్ రిక్రూట్మెంట్, విద్యాశాఖ, సంక్షేమ గురుకులాల విభాగాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయాలి. కానీ ఉత్తర్వులు వెలువడి నెలన్నర దాటుతున్నా రోస్టర్ వారీగా సమాచారం ఖరారు చేయించి నోటిఫికేషన్లు విడుదల చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేయిస్తోంది. కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సహా అనే శాఖలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ ఆయా శాఖల నుంచి తగిన సమాచారం లేకపోవడంతో నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. ఇప్పటికే ఏపీపీఎస్సీ ఆయా శాఖలకు లేఖలు రాసి, సమావేశాలు నిర్వహించినా కొన్ని శాఖలు మాత్రమే స్పందించాయి. మరోవైపు విద్యాశాఖకు సంబంధించి గతనెల 26న డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడగా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవలే కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. తేలని గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 పోస్టుల జాబితా ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా జారీ చేసిన జీవో 153లో గ్రూప్1 పోస్టులు 182, గ్రూప్–2 337, గ్రూప్ 3 పోస్టులు 1670 ఉన్నాయి. అన్ని శాఖల నుంచి సమాచారం వస్తేనే ఈ పోస్టుల నోటిఫికేషన్ల విడుదలకు అవకాశం ఉంటుంది. రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. గ్రూప్–3లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ శాఖకు సంబంధించి జూనియర్ అసిస్టెంటు పోస్టులు ఉన్నాయి. అయితే జిల్లాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్ల సమాచారం ఇంకా ఏపీపీఎస్సీకి అందలేదు. ఇక గ్రూప్ 2లోని 337 పోస్టులకు సంబంధించి అసెంబ్లీ సచివాలయం, జీఏడీ, ఆర్థిక, న్యాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల నుంచి సమాచారం రావాల్సి ఉంది. గ్రూప్ 1లో గతంలో కేవలం 78 పోస్టులు మాత్రమే ప్రకటించగా ఈసారి వాటి సంఖ్య 182కు పెంచారు. ఇందులో రెవెన్యూ, హోమ్, ఫైనాన్స్, రహదారులు, భవనాల శాఖల నుంచి పోస్టుల సమాచారం ఇంకా పూర్తిగా అందాల్సి ఉందని కమిషన్ వర్గాలు వివరించాయి. సమాచారం రాకపోవడంతో ఈ మూడు గ్రూప్ నోటిఫికేషన్ల విడుదల జాప్యమవుతోందని పేర్కొంటున్నాయి. లెక్చరర్లు, అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తదితర పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి సమాచారం అందింనందున వారం పదిరోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీలుంటందని చెబుతున్నాయి. నోటిపికేషన్ల విడుదలలో జాప్యంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
కార్లకు ఫుల్..బైక్‌లకు డల్
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి పథకాలకు నిరుద్యోగ యువత నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2018–19 వార్షిక సంవత్సరంలో మోటార్ ఎంపవర్మెంట్ కింద 4 వేల యూనిట్లు పంపిణీ చేయాలని యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం క్యాబ్‌లతోపాటు ఈ కామర్స్ కంపెనీలకు సంబంధించిన సర్వీసులకు బాగా డిమాండ్ ఉంది. దీంతో క్యాబ్ కేటగిరీలో 2 వేల కార్లు, బైక్ కేటగిరీలో 2 వేల ద్విచక్ర వాహనాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. క్యాబ్ కేటగిరీకి ఎంపికైన లబ్ధిదారుకు గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ ఇస్తారు. బైక్ కేటగిరీలో యూనిట్ విలువపై 80 శాతం వరకు రాయితీ ఇస్తారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఆగస్టు తొలివారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 20తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. భారీ ఎత్తున రాయితీ ఆశిస్తున్న నిరుద్యోగ యువత క్యాబ్ కేటగిరీ వైపే మొగ్గు చూపగా.. బైక్ కేటగిరీ వైపు కనీసం ఆసక్తి చూపలేదు. క్యాబ్ కేటగిరీలో 6,360 మంది దరఖాస్తు చేసుకోగా.. బైక్ కేటగిరీలో 982 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. క్యాబ్ కేటగిరీ పథకాన్ని గతంలోనూ అమలు చేయడంతో క్షేత్రస్థాయిలో కొంత అవగాహన ఉంది. దీంతో ఈ కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు బైక్ కేటగిరీని కొత్తగా తెచ్చారు. అయితే దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గి ఉండొచ్చని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
‘నై’పుణ్యాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధిలో ఎస్సీ కార్పొరేషన్ వెనుకబడింది. నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రాయితీ రుణకల్పనతో పాటు విద్యార్హతలకు తగిన నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోటాలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ యువత కోసం భారీమొత్తంలో నిధులు కేటాయిస్తోంది. ఈక్రమంలో గత ఐదేళ్లలో పెద్ద మొత్తంలో నిధులిచ్చినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 2,463 మందికి మాత్రమే వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకున్న వారి సంఖ్య మూడోవంతు కూడా లేకపోవడం గమనార్హం. వ్యయం ఎక్కువ... లబ్ధి తక్కువ... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు రంగంలో అవకాశాలున్న కేటగిరీలను ఎంపిక చేసుకుని గతంలో శిక్షణలు ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పించేవారు. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఉపాధి కల్పించడం కత్తిమీద సాములా మారింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణతో పాటు కచ్చితంగా ఉపాధి క ల్పించాల్సి ఉంది. దీంతో లక్ష్యసాధన ఆశాజనకంగా లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఐదేళ్ల కాలంలో రూ.7.06 కోట్లు ఖర్చు చేసి ఏకంగా 6,992 మందికి శిక్షణతో కూడిన ఉపాధిని కల్పించారు. రాష్ట్రఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రూ.10.40 కోట్లు ఖర్చు చేసి కేవలం 2,463 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఉద్యోగాలు దక్కించుకున్న వారి సంఖ్య తక్కువే. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబాటు నమోదవుతుండటంతో ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ కార్యక్రమాల్లో వేగం పెంచుతోంది. ఇటీవల సేవల రంగంలో ఆరోగ్య సహాయకులు, ఎయిర్‌హోస్టెస్ కేటగిరీలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఉపాధి అవకాశాలు అతి తక్కువ మందికే దక్కాయి. మరికొన్ని కేటగిరీల్లో శిక్షణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తోంది. -
జాడలేని కొత్త నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయని, వీటి ద్వారా 34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ప్రతిసారి సీఎం చంద్రబాబు.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు అంటూ ప్రకటన చేస్తున్నారు. లక్షల ఉద్యోగాల మాట ఎలా ఉన్నా వేలల్లో కూడా ఉద్యోగాల కల్పన జరగలేదని, నాలుగేళ్లుగా ఇవే మాయ మాటలు చెబుతూ తమను మోసం చేస్తున్నారని నిరుద్యోగులు మండిప డుతున్నారు. ఒకపక్క ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి చెప్పక్కర్లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ ఊసే మర్చిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ పోస్టులు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు. అయితే చంద్రబాబు సర్కార్ ఈ నాలుగున్నర ఏళ్లలో తూతూ మంత్రంగా కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం నాలుగువేల పైచిలుకు పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతిచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల ముందు మళ్లీ చంద్రబాబు వచ్చే నాలుగేళ్లలో 34 లక్షల ఉద్యోగాలు అంటూ ప్రకటన చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎవరిని మోసం చేయడానికి ఈ మోసపూరిత ప్రకటనలు అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిగో అదిగో అంటూ షెడ్యూళ్ల ప్రకటనతో ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం లక్షలాది మంది అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జూలై 6న ప్రకటించారు. ఇప్పటివరకూ అతీగతీ లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ ఏడాదిన్నరగా చెబుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదు. నోటిఫికేషన్లు ఇచ్చినా.. నియామకాలు సున్నా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఏటా క్యాలెండర్ విడుదల చేసి భర్తీ చేస్తామని, ప్రతి ఏటా డీఎస్సీని ప్రకటించి టీచర్ నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో ఒకే ఒక్కసారి డీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 5,000 ఎస్ఐ, కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 4,275 పోస్టుల భర్తీకి తూతూమంత్రంగా 32 నోటిఫికేషన్లు ఇచ్చినా ఆ నియామకాలు ఇప్పటికీ పూర్తికాలేదు. రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో మంజూరు పోస్టులు 6.97 లక్షలు కాగా, 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో పదవీ విరమణ చేసిన వారి సంఖ్యను కలిపితే ఖాళీల సంఖ్య 2 లక్షలకు చేరుతుంది. వాస్తవాలు ఇలా ఉండగా ముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగులను మభ్యపెడుతూ లక్షల్లో ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. మించిపోతున్న వయోపరిమితి ఏళ్ల తరబడి ప్రభుత్వ పోస్టుల నోటిఫికేషన్లు రాకపోవడంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వయోపరిమితి మించిపోతోందని లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు చాలాకాలం ప్రభుత్వ నోటిఫికేషన్లు వెలువడలేదు. విభజన అనంతరం ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 23న ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఏడాది గడువుతో జీఓ 295ను విడుదల చేసింది. ఆ తరువాత మరో రెండుసార్లు గడువు పెంచారు. ఈ గడువు కూడా వచ్చేనెల 30వ తేదీతో ముగియనుంది. పోస్టుల భర్తీకి ఇప్పట్లో నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగుల ఆశలు అడియాశలవుతున్నాయి. నోటిఫికేషన్లు వెలువడతాయని ఎదురుచూస్తూ నగరాల్లో హాస్టళ్లలో, అద్దె ఇళ్లల్లో ఉంటూ రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని వారు వాపోతున్నారు. ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం దారుణమని మండిపడుతున్నారు. -
సారీ బ్రదర్..!
శ్రీకాకుళం : ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రయత్నించినా రాకపోవడం, ప్రమాదంలో కాలికి తీవ్ర గాయమై దివ్యాంగుడిగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘సారీ బ్రదర్...’ అంటూ సోదరుడికి సందేశం పంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంపురం గ్రామానికి చెందిన గెడ్డం సుధీర్ బీటెక్ పూర్తి చేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే పోటీపరీక్షలకు శిక్షణ పొందుతున్నాడు. సోదరుడు సంతోష్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడి సాయంతో సుధీర్ అక్కడే ఉండేవాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధీర్ కాలికి బలమైన గాయమైంది. దివ్యాంగుడిగా మారడంతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపం చెంది హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరిగా తన సోదరుడు సంతోష్‌కు ‘సారీ బ్రదర్..’ అంటూ తన ఆవేదన తెలియజేస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఫోన్‌కు సందేశం పంపాడని గ్రామస్తులు తెలిపారు. సుధీర్ తండ్రి తులసీదాస వలసకూలీ. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. తల్లి భూదేవి గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతిచెందాడనే వార్త తెలుసుకున్న తల్లి కుమిలిపోతోంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరితరం కావటం లేదు. సుధీర్ మృతదేహానికి హైదరాబాద్‌లో పోస్టుమార్టం పూర్తిచేసి, ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. మరోవైపు తండ్రి తులసీదాస్ కూడా హుటాహుటిన ఆదివారం ఇక్కడికి వస్తున్నారు. సుధీర్ మృతదేహం ఆదివారానికి గ్రామానికి చేరుతుందన్నారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. -
యువత భవిష్యత్తును కాలరాస్తున్న బాబు
రాష్ట్రంలో నిరుద్యోగం బారిన పడిన లక్షలాది యువతకు అవకాశాలను కల్పించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు వారిని మత్తులో ముంచి, వ్యసనాల ఊబిలోకి నెట్టడానికి కావలసిన అన్ని ప్రయత్నాల్లోనూ ముందు ఉంటున్నారు. ప్రతి ఊరులో గ్రంథాలయం, స్కూలు, వైద్యాలయం నిర్మించాల్సిన బాధ్యత నెరవేర్చడానికి బదులుగా మద్యశాలలు నిర్మించేవాడు సరైన పాలకుడేనా? మహిళల మీద అత్యాచారాలు పెరగడానికి, యువకుల్లో నేరాలు పెరగడానికి తాగుడు ప్రధాన కారణం అని తెలిసి కూడా బాబు కనీసం బెల్టుషాపులను ఎందుకు ఎత్తివేయడం లేదు? నైతిక వర్తన విధ్వంసానికి పనిగట్టుకుని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తాగుడు, జూదం, యధేచ్ఛగా పాలక వర్గం కనుసన్నల్లో, స్వయంగా తెలుగుదేశం ఎంఎల్ఏ, ఎంఎల్సీలు నడపడం వల్ల కాదా? వ్యవసాయ రంగంలోకి విద్యావంతులను ఆకర్షించి నూతన విధానాలకు తెరలేపవలసిన చంద్రబాబు, వ్యవసాయం దండగని బోధిస్తున్నాడు. చంద్రబాబుకు యువతపై నిర్లక్ష్యం మరింత పెరుగుతోంది. ఆయన ఓట్ల వెంపర్లాటలోపడి యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. ఆం«ధ్రప్రదేశ్‌లో యువశక్తి అపారంగా వుంది. విస్తృతంగా మానవ వనరులున్న ఆంధ రాష్ట్రంలో యువశక్తిని ఉపాధి రంగంలోకి తీసుకురాగలిగితే సంపద వెల్లివిరుస్తుంది. యువకులు సంపద సృష్టికర్తలు శారీరక శక్తి, మానసిక శక్తి కలిసి వారు ఆధునిక పారిశ్రామిక, సాంకేతిక జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యువతీ,యువకుల్లో ఈనాడు వినూత్న ప్రతిభ, నైపుణ్యశక్తి ప్రజ్వలిస్తున్నాయి. చంద్రబాబు నిర్దిష్టమైన శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక వ్యవస్ధల నిర్మాణానికి పూనుకోలేక, యువశక్తిని నిర్వీర్యం చేసే అభూత కల్పనలు వల్లిస్తున్నారు. ఉన్న వనరులను కుదువబెట్టడం, వనరులను అమ్ముకోవడం, రాజకీయధనంగా మార్చుకోవడంలో వున్న నైపుణ్యం, ఉత్పత్తి శక్తులకు నిర్మాణాన్ని పొందించే కర్తృత్వం బాబు దగ్గర లేదు. ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న వస్తువులకు, పరిశమలకు ముడిసరుకు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్, జపాన్, చైనా వలె ఎందుకు సొంత పరిశ్రమలను పారంభించడం లేదనేది పెద్ద పశ్న! భారీ కార్లపరిశ్రమలు, కార్ల విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలు, విడిభాగాలను నిల్వచేసే గౌడౌన్ల నిర్మాణం వంటివాటికి లక్షల సంఖ్యలో యువశక్తిని వాడుకోవచ్చు. ఇలాంటి పరిశ్రమల స్థాపన ద్వారా కార్మికులను, గుమాస్తాలను, అకౌంటెంట్లను, మేనేజర్లను పెద్ద సంఖ్యలో ఉద్యోగులుగా వినియోగించవచ్చు. ఈ పారిశ్రామిక నిర్మాణాలకు బదులుగా మందుషాపులు, పబ్‌లు, క్లబ్‌లు, వినోదశాలలు నిర్మించి చంద్రబాబు బుద్ధిపూర్వకంగా యువకులను నాశనం చేస్తున్నారు. ఈనాడు రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులున్నారు. ఎందరో డిగ్రీలు, బీటెక్‌లు, ఎంటెక్‌లు, ఎంబీఏలు చేసి ఖాళీగా ఉంటున్నారు. కానీ కొడుకు అభివృద్ధి్ద మీద ఉన్న శ్రద్ధ బాబుకు ఈ యువత మీద లేదు. తండ్రికి తగ్గట్టే కుమారుడు లోకేశ్ సైతం అవినీతిలో, అబద్ధాల్లో తండ్రిని మించిన వాడిగా పేరుపొందుతున్నాడు. చివరకు మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పెట్టే గుడ్ల విషయంలోనూ అవినీతే. అంగన్ వాడీ కేంద్రాల్లో నీళ్ల పాలు సరఫరా. అనేక స్కూళ్లలో విద్యార్థులకు తగినన్ని క్లాసురూములు లేవు. విద్యార్థినులెందరో బాల్య వివాహాలకు గురై విద్యాగంధం కోల్పోయి డ్రాపౌట్స్ అవుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి కుంటుపడుతుందని, రాష్ట్రం అభాగ్యం కావడానికి స్రీవిద్య తక్కువ కావడమే కారణమని చంద్రబాబుకు తెలియదా? ప్రాథమిక వైద్యశాలల్లో ఒక పడక మీద ముగ్గురు బాలింతలు పడుకొంటున్న దృశ్యాలు బాబు కొడుకు చూడటం లేదా? మీరు పాలించే రాష్ట్రంలో యువకులు పనిలేక బెంగళూరు, మద్రాసు, ఢిల్లీ వంటి నగరాల్లో చాలీచాలని ఉపాధి కోసం పరిగెత్తుతోంటే అంకెల గారడీ చేస్తున్నారా? ఇక పోతే రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్లాలంటే గ్రంథాలయాలు, డిజిటల్ లైబ్రరీలు అవసరం. కానీ ఉన్న కాసిని గ్రంథాలయాల్లోనూ మంచినీళ్ల వసతి లేదు. కొత్త పుస్తకాల కొనుగోలు లేదు. దళిత బడుగు వర్గాల పిల్లలు పూర్తిగా గ్రంథాలయాలపైనే ఆధారపడి ఉంటారు. ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందో ఆలోచించాలి. గ్రంథాలయోద్యమం ద్వారానే స్వాతంత్య్రం వచ్చిందని, భాషా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కూడా గ్రంథాలయోద్యమం వల్లనేనని చంద్రబాబు గ్రహించడం లేదు. ప్రతి ఊరులో గ్రంథాలయం, స్కూలు, వైద్యాలయం నిర్మించాల్సిన బాధ్యత నెరవేర్చడానికి బదులుగా మద్యశాలలు నిర్మించేవాడూ పాలకుడేనా? యువతను వ్యక్తిత్వ నిర్మాణంలో తీర్చిదిద్దాల్సిన పాలకుడు యువతను వ్యసనాల ఊబిలోకి నెడుతున్నారు. మహిళల మీద అత్యాచారాలు పెరగడానికి, యువకుల్లో నేరాలు పెరగడానికి తాగుడు ప్రధాన కారణం అని తెలిసి కూడా బాబు కనీసం బెల్టుషాపులను ఎందుకు ఎత్తివేయడం లేదు? మరోవైపున కంప్యూటర్, కమ్యూనికేషన్లు, ఇతర సర్వీసు రంగాలకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు, ఈ సర్వీసు రంగాలకు కీలకమైన ఉత్పత్తి రంగాలు, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు వంటివాటిని పూర్తిగా మర్చిపోయాడు. వ్యవసాయ రంగంలోకి విద్యావంతులను ఆకర్షించి నూతన విధానాలకు తెరలేపవలసిన చంద్రబాబు, వ్యవసాయం దండగని బోధిస్తున్నాడు. లోకేశ్ అయితే వ్యవసాయ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడు. పెట్టుబడిదారులు వస్తూత్పత్తి కేంద్రాలతోబాటు తమ మార్కెట్ల కోసం బాబు వంటి ముఖ్యమంత్రులను కొనేస్తున్నారు. ఎన్నికలకు ధనాన్ని అందిస్తున్నారు. అందుకే లిక్కర్ ఉత్పత్తిదారులు, లిక్కర్ పంపిణీదారులు బాబు వెనుక ఉండి నడిపిస్తున్నారు. ఎన్నికల్లో కల్తీమద్యం అమ్మకాలతో కొత్తరకం యువకులను తాగుబోతులుగా మార్చి ఎన్నికల్లో వాడుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు. మోదీ, చంద్రబాబు ఇరువురూ కార్పొరేట్ బానిసలుగానే ఉన్నారు. వారి మధ్య అంతర్గత ఐక్యతకు అదే ప్రాతిపదిక. ఈ రెండు శక్తులు పెంచుతున్న ప్రైవేట్ సెక్టారులో దళిత బహుజనులకు ప్రతిభ పేరుతో ఉద్యోగాలు రాకుండా చేయడమే వీరి ప్రయత్నం. తద్వారా దళిత బహుజనుల యువత ఉపాధిలేక నిర్వీర్యత, నిర్వేదాలకు గురి కావాలని, మనం పుట్టిన రాష్ట్రంలో మనం బ్రతికే పరిస్థితి లేదనే నిర్వేదనకు అలవాటు పడతారనేదే వీరి ఆలోచన అని స్పష్టం అవుతుంది. నిజానికి 7,8 తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం వల్ల విద్యార్థినులు డ్రాపౌట్ శాతం తగ్గించవచ్చు. ఆరోగ్య సేవలకు నర్సరీ ట్రైనింగ్ సెంటర్సు ఎక్కువ పెట్టడం ద్వారా యువతను మరింతగా ఉపయుక్తం చేయవచ్చు. ఎందుకు చంద్రబాబు యువతను ఉపాధిరంగం వైపు నడిపించడం లేదు? ముఖ్యంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి 18 వేల బ్యాక్లాగ్ పోస్టులున్నాయి. ఎందుకు పూరించడం లేదు! ఎందుకు ఉన్నత విద్యలో దళితులపై వివక్ష చూపిస్తున్నారు? పి.హెచ్.డి చేసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్పులు ఇవ్వడం లేదు. తద్వారా పరిశోధనా రంగం కుంటినడక నడుస్తో్తంది. అంతేకాదు. బి.ఎ.,ఎం.ఎ., ఫిలాసఫీ, ఆర్థ్ధిక శాస్త్రం, చరిత్రలను నిర్వీర్యం చేస్తున్నారు. అధ్యాపకుల పోస్టులు పూరించడం లేదు. ఎందుకు చంద్రబాబుకు ఉన్నత విద్యంటే వ్యతిరేకత? ఈ విషయాలను అర్థ్ధం చేసుకొని యువత పోరాటాలకు సన్నద్ధం కావాలి. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు అడుగు వేయాలి. రాజకీయ అవగాహన, రాజకీయ చైతన్యం, సిద్ధాంత బలం, ప్రత్యామ్నాయ ఆలోచన ఈనాటి యువతకు అవసరం. యువత తిరగబడిన అన్ని సందర్భాల్లో సమాజ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మానవ వనరులు శ్రమ, శక్తి, బహుముఖంగా వున్న ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి యువత నడుంకట్టాలి. కత్తి పధ్మారావు(వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక అధ్యక్షుడు, నవ్యాంధ్రపారీ) -
ట్రైకార్ ద్వారా డ్రైవర్ ఎంపవర్మెంట్
సాక్షి, హైదరాబాద్: గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం డ్రైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని ట్రైకార్ (తెలంగాణ ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్) అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా డ్రైవింగ్‌లో నిష్ణాతులైన ఎస్టీ యువతకు రాయితీ పద్ధతిలో వాహనాలు ఇచ్చేం దుకు ఉపక్రమించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో 500 మందికి దీని ద్వారా ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. బుధవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ పథకాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తు తం ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లోని ఎస్టీలకే వర్తింపజేస్తున్నప్పటికీ.. త్వరలో గ్రామీణ ప్రాం తాల్లోని యువతకు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఇచ్చే వాహనాల ద్వారా క్యాబ్, ట్రాన్స్పోర్ట్ రంగంతో అనుసంధానమై ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగిరం చేయాలని, వచ్చే నెలాఖరులోగా లబ్ధిదారులందరికీ పూర్తిస్థాయిలో వాహనాలు పంపిణీ చేసేలా చర్య లు తీసుకోవాలని ట్రైకార్ యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు తదితరులు పాల్గొన్నారు. -
ఇదో ‘గ్రూప్’ దందా!
సాక్షి, అమరావతి: ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు నచ్చిన, అనుకూలురైన అభ్యర్థులను నియమించుకునేందుకు టీడీపీ సర్కారు సిద్ధమైంది! డిప్యూటీ తహశీల్దార్, మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–3 , సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ తదితర గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో విలీనం చేసి ఇంటర్వ్యూ మార్కులను కూడా పెంచడం ద్వారా దీన్ని ‘మేనేజ్’ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా సర్కారీ కొలువుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ రూ.లక్షలు పోసి శిక్షణ పొందుతున్న అభ్యర్థుల ఆశలు గల్లంతు కానున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల శిక్షణ విధానం పూర్తిగా భిన్నంగా ఉండటంతోపాటు ఇంటర్వ్యూ మార్కుల్లో తేడా వల్ల అభ్యర్థుల జాతకాలే మారిపోనున్నాయి. గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లోకి మళ్లించేందుకు ప్రభుత్వం తాజాగా చేస్తున్న ప్రయత్నాలపై నిరుద్యోగ యువత తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే గ్రూప్ 1 నియామకాల్లో అర్హులైన అభ్యర్ధులకు దక్కాల్సిన పోస్టులను ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు కేటాయించడం ద్వారా ఇతరులకు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తమ ప్రణాళిక అమలయ్యేలా సర్కారు పెద్దలు పావులు కదుపుతున్నారు. ఆబ్జెక్టివ్‌కు బదులుగా వ్యాసరూప ప్రశ్నలు గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్ధులు శిక్షణ కోసం గత కొన్నేళ్లుగా రూ.లక్షలు వెచ్చించి సన్నద్ధమవుతున్నారు. ఇక గ్రూప్–1 పరీక్షలు రాసేది 5 వేల మందికి లోపే ఉన్నారు. గ్రూప్–2 పరీక్షలకు ఇప్పటివరకు ఆబ్జెక్టివ్ తరహాలో సిద్ధం అవుతున్న అభ్యర్థులకు సర్కారు తాజా ఆలోచనలు కలవరం కలిగిస్తున్నాయి. గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో విలీనం చేస్తే ఆబ్జెక్టివ్‌కు బదులుగా డిస్క్రిప్టివ్ (వ్యాస రూప) పరీక్షలను రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ మార్కులు 50కి బదులుగా 75కి పెరుగుతాయి. దీనివల్ల ఇన్నాళ్లూ తాము పొందిన శిక్షణ అంతా వృథాగా మారటంతోపాటు అక్రమాలకు ఎక్కువ ఆస్కారముంటుందని ఆందోళన చెందుతున్నారు. సత్యనారాయణ కమిటీ సిఫార్సులు తుంగలోకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సత్యనారాయణ కమిటీ గ్రూప్–1 కేడర్ పోస్టులకు మినహా తక్కిన గ్రూపుల్లోని పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగించి కేవలం రాతపరీక్షల ద్వారానే ఎంపికలు చేయాలని 2011లో సిఫార్సు చేసింది. కమిటీ నివేదికను ఆమోదించిన అప్పటి ప్రభుత్వం గ్రూప్–2 పోస్టులకు ఇంటర్వ్యూలను తొలగించింది. కానీ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 622, 623 జీవోలను తెచ్చి గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై నిరుద్యోగులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు మళ్లీ టీడీపీ సర్కారు గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో విలీనం చేయాలని భావిస్తుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మినహా ఇతర కేడర్లలోని పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకూ ఇదే విధానం వర్తింప చేయాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా యోచిస్తోంది. గ్రూప్–2లోనే ఎక్కువ పోస్టులు 2016 గ్రూప్–2లో 982 పోస్టులు (ఇందులో 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు) ప్రకటించగా గ్రూప్–1లో 78 పోస్టులు మాత్రమే ఉన్నాయి. గ్రూప్–2లో ఆబ్జెక్టివ్ పరీక్షలతోపాటు వాటిలోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 50 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. గ్రూప్–1లో డిస్క్రిప్టివ్ పరీక్షలతోపాటు ఇంటర్వ్యూలు 75 మార్కులకు ఉంటాయి. డిస్క్రిప్టివ్ మూల్యాంకనంపై ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. ఇంటర్వ్యూల తరువాత తలరాతలు తారుమారు ఇంటర్వ్యూల్లో కూడా అర్హులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఇటీవల డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, గ్రూప్–1 నియామకాలపై ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. రాతపరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఇంటర్వ్యూల్లో అతి తక్కువ మార్కులు రావటంతో అభ్యర్ధుల తలరాతలు తారుమారయ్యాయి. ఇంటర్వ్యూల్లో గరిష్ఠ మార్కులను నిర్దిష్ట శాతానికి పరిమితం చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని విధివిధానాలను పాటిస్తోంది. ఏపీపీఎస్సీ అలా చేయడం లేదు. కొందరికి 15 శాతం మార్కులే వస్తే మరికొందరికి 80 – 95 శాతం వరకు మార్కులు కేటాయిస్తున్నారు. ఫలితంగా రాతపరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులు ఇంటర్వ్యూల తరువాత అట్టడుగుకు పడిపోయి పోస్టులు కోల్పోతున్నారు. కేసులు, ఆందోళనకు దిగితే మార్కులకు కత్తెర! ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలు, తప్పులను సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టుల్లో వ్యాజ్యాలు వేసినా, ఆందోళనకు దిగినా అలాంటి వారికి రాతపరీక్షల మూల్యాంకనం, ఇంటర్వ్యూలలో కత్తెర వేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2016 గ్రూప్–2 పరీక్షల్లో గందరగోళం చెలరేగిందని ఆందోళనకు దిగిన తమకు అన్యాయం చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఇటీవల గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి కేసులు వేసిన ఏడుగురిని ఇంటర్వ్యూల్లో ఫెయిల్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బోర్డు కూర్పుపైనా విమర్శలు గతంలో ఇంటర్వ్యూ బోర్డులో కమిషన్‌లోని అందరు సభ్యులతోపాటు ప్రభుత్వం సూచించిన ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఒకరు, సబ్జెక్టు నిపుణులు కొందరు ఉండేవారు. రోజుకొకరు ఇంటర్వ్యూ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించేవారు. అభ్యర్థులకు తుది మార్కులు ఖరారు చేసేది బోర్డు ఛైర్మనే. కానీ ప్రస్తుత కమిషన్‌లో దీన్ని పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఇంటర్వ్యూలన్నిటిలో బోర్డు ఛైర్మన్ ప్రతిరోజూ తప్పకుండా ఉండడమే కాకుండా ఇంటర్వ్యూ బోర్డులన్నిటికీ ఆయనే ఛైర్మన్‌గా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. ఇతర సభ్యుల్లో రోజుకొకరికి మాత్రమే అవకాశమిస్తున్నారు. బయటకు చెప్పకపోయినా ఇది కమిషన్ బోర్డు సభ్యుల్లో అసంతృప్తిని రాజేస్తోంది. ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు వేసే మార్కుల మధ్య వ్యత్యాసం 5 మార్కులకు మించి ఉండరాదన్న నియమం గతంలో ఉండేది. కానీ ప్రస్తుత బోర్డులో ఇది లేదన్న విమర్శ ఉంది. పైగా ఏ సభ్యుడు ఎన్ని మార్కులు వేసినా చివరకు బోర్డు ఛైర్మన్‌గా ఉన్న వారే ఫైనల్ మార్కులను నిర్ణయిస్తుండడంతో అభ్యర్థుల తలరాతలు మారిపోతున్నాయి. పోస్టుల విలీనానికి ఏపీపీఎస్సీ చెబుతున్న కారణాలు ఇవీ – ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సరైన అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు అవసరం. – గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారు గ్రూప్–1 పోస్టులకు కూడా ఎంపికవుతున్నందున ఆ పోస్టులు చివరకు ఖాళీగా మిగిలిపోతున్నాయి. దీన్ని నివారించేందుకే కొత్త పద్ధతి తెస్తున్నామని ఏపీపీఎస్సీ చెబుతోంది. ఎంపికను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే! – ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోస్టుల విలీనం ప్రయత్నాల వెనుక కారణాలు వేరే ఉన్నాయని విద్యావేత్తలు, విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. – గ్రూప్–1లో పోస్టుల సంఖ్య పరిమితంగా ఉంటాయి. గ్రూప్–2లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీటిని కలిపి గ్రూప్–1ఏ, 1బీగా చేయడం ద్వారా తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. -
రుణ పంపిణీ వేగవంతం చేయండి: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చే రాయితీ పథకాల అమలును వేగవంతం చేయాలని శాసనసభ స్పీకర్ మధుసుదనాచారి బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం అసెంబ్లీ హాలులో బీసీ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్‌తో సమావేశం నిర్వహించారు. ఫెడరేషన్ల ద్వారా అమలు చేసే పథకాల లబ్ధిదారులను వేగవంతంగా పూర్తి చేస్తే రాయితీ పంపిణీకి మార్గం సుగమమవుతుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్ పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కుచ్చుటోపీ
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ.2,000 చొప్పున భృతి ఇస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగేళ్లుగా ఆ సంగతే మర్చిపోయారు. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో నిరుద్యోగులను మచ్చిక చేసుకునేందుకు భృతి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగ భృతిపై కేబినెట్లో చర్చించామని, ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేశ్ గురువారం తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు ఈ భృతిని అరకొరగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రుణ మాఫీ పేరిట రైతులను, డ్వాక్రా సంఘాలను దగా చేసిన తరహాలోనే నిరుద్యోగులకు వంచించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. బకాయి రూ.96 వేలు: రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హామీ ప్రకారం ఒక్కో కుటుంబంలో ఒక్కరికి నెలకు రూ.2,000 చొప్పున భృతి ఇవ్వాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చి 48 నెలలవుతోంది. భృతి కిందా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 48 నెలలకు గాను ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.96,000 చొప్పున బకాయి పడింది. ఈ సొమ్ము చెల్లిస్తారని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.1,000 మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. అది కూడా కేవలం 10 లక్షల మందికే ఈ భృతిని పరిమితం చేయాలని నిర్ణయానికొచ్చింది. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. నిరుద్యోగులందరికీ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. అర్హుల సంఖ్య కుదింపు: నిరుద్యోగులకు ఆర్థిక సాయం పేరుతో గత ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. భృతి ఇచ్చే విషయంలో విధివిధానాలు రూపొందించాలంటూ కాలయాపన చేసింది. బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లలో పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం స్పందించింది. అర్హుల సంఖ్యను వీలైనంత మేర కుదించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 22 –35 ఏళ్లలోపు వయసున్న వారే భృతికి అర్హులు. డిగ్రీ చదివిన వారికి మాత్రమే నెలకు రూ.1,000 చొప్పున భృతి అందజేస్తారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు చదివిన నిరుద్యోగులకు భృతి రాదు. వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి పొందాలంటే రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరిగా ఉండాలి. స్థానికుడై ఉండాలి. 2.50 ఎకరాలలోపు మాగాణి, 5 ఎకరాలలోపు మెట్ట భూమి కలిగి, దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుద్యోగులకు మాత్రమే భృతి అందుతుంది.4 చక్రాల సొంత వాహనం ఉంటే అనర్హులే. ఒక్కో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే నిరుద్యోగ భృతి వర్తింపజేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల కింద స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం లేదా రుణం పొంది ఉంటే భృతికి అనర్హులు. పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వరు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించిన వారు భృతికి అనర్హులని ప్రభుత్వం తేల్చేసింది. రైతులు, డ్వాక్రా సంఘాలకు మొండిచేయి రైతుల రుణాలు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక షరతులు విధిస్తూ వ్యవసాయ రుణ మాఫీని భారీగా కుదించేశారు. వాస్తవానికి రాష్ట్రంలో రైతుల పేరిట బ్యాంకుల్లో రూ.87,612 కోట్ల అప్పులు ఉండగా, ఇది రూ.24,000 కోట్లేనని ప్రభుత్వం పేర్కొంది. నాలుగేళ్లయినా రూ.24,000 కోట్ల రుణాలను మాఫీ చేయలేదు. రుణమాఫీ పేరిట విడతవారీగా ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వడ్డీలకూ సరిపోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు ఉన్నాయి. మాఫీ కాదు, పెట్టుబడి రాయితీ అంటూ డ్వాక్రా సంఘాలను బాబు నిలువునా మోసం చేశారు. రుణాలు మాఫీ కాక, వాటిని తీర్చే దారిలేక డ్వాక్రా సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. -
జింకులో కావాలా..బంకులో కావాలా..?
సాక్షి, సిటీబ్యూరో: ‘ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా? షిప్‌యార్డా? ఏషియార్డా? జింకా? బంకా....? వీటిలో ఎందులో ఉద్యోగం కావాలి?’ ‘వెంకీ’ సినిమాలో హీరో రవితేజతో పాటు అతడి స్నేహితులను మోసం చేసేందుకు కమెడియన్ కృష్ణభగవాన్ వాడిన డైలాగ్ ఇది. ‘జీహెచ్ఎంసీనా? జలమండలా? ఫారెస్ట్ డిపార్ట్‌మెంటా? స్త్రీశిశు సంక్షేమ శాఖా? వీటిలో ఏ ఉద్యోగం కావాలి?’ వాస్తవంగా ఆజంపురకు చెందిన ‘బల్దియా సూడో ఉద్యోగి’ బద్దం యల్లేష్ దాదాపు 75 మంది నిరుద్యోగులకు టోకరా వేసేందుకు కొట్టిన డైలాగ్ ఇది. ఈ పంథాలో తనకున్న పరిచయాలను వినియోగించి దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ హైదరాబాద్, కరీంనగర్‌లకు చెందిన ఉద్యోగార్థుల నుంచి దాదాపు రూ.1.6 కోట్లు వసూలు చేసి నిండా ముంచిన ఆరోపణలపై యల్లేష్ను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.4.07 లక్షల నగదు, బోగస్ గుర్తింపుకార్డు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు వెల్లడించారు. మోసపోయి అదే బాట... ఆజంపురలోని రాజనర్సింహ్మనగర్కు చెందిన యల్లేష్ బీకాం పూర్తి చేశాడు. 2010లో అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ఓ బార్లో రోజు రూ.600 వేతనానికి పని చేశాడు. రోడ్డు విస్తరణలో భాగంగా 2013లో బార్ మూతపడటంతో రోడ్డునపడ్డాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఇతడికి కరీంనగర్‌కు చెందిన రవీంద్రస్వామితో పరిచయం ఏర్పడింది. సచివాలయంలో అధికారిగా పని చేస్తున్నట్లు చెప్పుకున్న రవీంద్ర తన పలుకుబడి వినియోగించి హైదరాబాద్ జలమండలిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ యల్లేష్కు చెప్పాడు. ఇందుకుగాను రూ.2 లక్షలు వసూలు చేశాడు. అయితే మరికొందరు ఉద్యోగార్థులనూ వెతికితే అందరికీ కలిపి ఒకే ఆర్డర్‌తో ఉద్యోగాలు ఇప్పించేస్తానని, వారిచ్చే నగదులో కమీషన్ ఇస్తానంటూ రవీంద్ర చెప్పడంతో యల్లేష్ అందుకు అంగీకరించాడు. దాదాపు 37 మంది నుంచి రూ.1.24 కోట్లు వసూలు చేసి రూ.90 లక్షలు రవీంద్రకు ఇచ్చి, మిగిలింది తాను తీసుకున్నాడు. అయితే అతను ఉద్యోగాలు ఇప్పించడంలో విఫలం కావడంతో భీమ్ రాహుల్ అనే యువకుడి ఫిర్యాదు మేరకు గత జనవరిలో కరీంనగర్ రెండో టౌన్ పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. దీంతో మోసపోయిన యల్లేష్ నష్టాన్ని పూడ్చుకునేందుకు అదే బాట అనుసరించారు. మరికొందరి నుంచిరూ.36 లక్షలు... నగరం కేంద్రంగా దందా ప్రారంభించిన యల్లేష్ జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ వెటర్నరీ విభాగంలో సూపర్వైజర్గా పని చేస్తున్నట్లు ఓ బోగస్ గుర్తింపుకార్డు సైతం తయారు చేసుకున్నాడు. ప్రతి ఆదివారం చర్చిలకు వెళ్లే ఇతను అక్కడి పాస్టర్లతో పరిచయం పెంచుకున్నాడు. తన బోగస్ గుర్తింపుకార్డు చూపడంతో పాటు తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకున్నాడు. పాస్టర్ల ద్వారా కొందరు, నేరుగా మరికొందరు నిరుద్యోగులకు దొడ్డిదారిన ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. అటెండర్, సూపర్వైజర్, జూనియర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల పేరు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.10 లక్షల వరకు, దాదాపు 28 మంది నుంచి రూ.36 లక్షలు వసూలు చేశాడు. వీరిలో కొందరికి ఉద్యోగం ఖరారైందంటూ జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు తీసుకువెళ్ళాడు. వారిని రిసెప్షన్లో కూర్చోబెట్టి తన బోగస్ గుర్తింపుకార్డు సాయంతో కార్యాలయం మొత్తం తిరిగి వచ్చేవాడు. ఆపై నియామకం వాయిదా పడిందని చెప్పి పంపేవాడు. జల్సాలకు భారీగా ఖర్చు.. ఇలా వసూలు చేసిన డబ్బుతో యల్లేష్ జల్సాలు చేసేవాడు. తన వివాహాన్ని అట్టహాసంగా చేసుకున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన యువకులు ఇచ్చిన ఫిర్యాదులతో ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి ఠాణాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. నిందితుడి కదలికలపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు జి.తిమ్మప్ప, బి.కాంతరెడ్డి తమ బృందాలతో వలపన్ని సోమవారం పట్టుకున్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో బాధితులు డబ్బు నేరుగా ఇవ్వడంతో వారి వద్ద ఎలాంటి ఆధారాలు ఉండవు. ఫలితంగా నిందితులు అరెస్టైనా కోర్టులో కేసులు వీగిపోతుంటాయి. అందుకు భిన్నంగా యల్లేష్ పక్కా ఆధారాలను ‘అందించాడు’. డబ్బు తిరిగి ఇవ్వమంటూ ఒత్తిడి చేసిన వారికి రూ.20, రూ.100 స్టాంప్ పేపర్లపై ఉద్యోగం పేరుతో నగదు తీసుకున్నానని, త్వరలో తిరిగి చెల్లిస్తానంటూ రాసి సంతకాలు చేసి ఇచ్చాడు. వీటిని సైతం టాస్క్‌ఫోర్స్ అధికారులు సేకరించారు. ఇవి కోర్టులో బలమైన ఆధారాలుగా పని చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. -
పాక్ కుట్రను తిప్పికొట్టిన భారత్!
సాక్షి, అమృత్సర్: పాకిస్తాన్ కుటిల బుద్ధి మరోసారి బయటపడింది. డబ్బు ఆశ చూపి భారత యువతను గూఢచారులుగా నియమించుకుంటుంది. భారత నిఘా వ్యవస్థను అస్థిర పరచడానికి పాక్ చేస్తోన్న ఈ ప్రయత్నాలను భారత అధికారులు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పాక్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐకి గూఢచారిగా వ్యవహరిస్తున్న అమృత్‌సర్‌కి చెందిన రవి కుమార్‌ని మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో పంజాబ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడు నెలల క్రితమే అతన్ని ఫేస్బుక్ ద్వారా ఐఎస్ఐ రిక్రూట్ చేసుకున్నట్లు సమాచారం. పంజాబ్‌లోని ముఖ్యమైన సంస్థలు, నిషేధిత ప్రాంతాలు, దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ కదలికలు, కొత్త బంకర్లకు సంబంధించిన సమాచారాన్ని అతడు పాక్‌కి చేరవేస్తున్నాడు. ఇంటర్నెట్ ద్వారా ఫొటోలు, ఎస్ఎంఎస్లు పంపుతూ నిరంతరం పాక్ ఐఎస్ఐతో టచ్‌లో ఉంటున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా ఐఎస్ఐ ఎజెంట్లు దుబాయ్ నుంచి రవి అకౌంట్‌కి డబ్బును పంపిస్తున్నారు. ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు రవి దుబాయ్‌లో గడిపాడని అక్కడే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలను అతడికి వివరించినట్టు తెలుస్తోంది. రవి కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇంకా అతడికి ఏయే గ్రూపులతో, ఎవరితో సంబంధాలున్నాయో తెలుసుకోవడానికి దర్యాప్తు తీవ్రతరం చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలు అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాల ద్వారా ఉగ్రవాదంపై ప్రేరేపిస్తున్నాయని, చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు యువతను హెచ్చరించారు. -
నిరుద్యోగులకు మళ్లీ మొండిచేయి..
సాక్షి, అమరావతి: ఇంటికో ఉద్యోగం – ఉపాధి కల్పిస్తామని, ఇవ్వలేకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు నాలుగేళ్ళుగా వంచిస్తూనే ఉన్నారు. రెండేళ్లపాటు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. గత సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇంతవరకు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు కోటిన్నర కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన నెలకు రూ. 3వేల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయి ఉంది. సంవత్సరానికి రూ. 36వేల కోట్లు.. నాలుగేళ్ళలో రూ. 1.44 లక్షల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయిపడింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా కలుపుకుంటే రూ. 1.80 లక్షల కోట్లు. మరి రూ. 1,000 కోట్లు ఏమూలకు? 2016లో ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో 35 సంవత్సరాల లోపు నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతరుల వివరాలు ప్రభుత్వం నమోదు చేసింది. పదో తరగతి నుంచి పీజీ వరకు ఏ తరగతిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఒక లెక్క తయారు చేసింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 24 లక్షల మంది ఉన్నట్లు చెబుతున్నది. పదో తరగతి చదివిన వారు 6.25 లక్షల మంది, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి సాంకేతిక అర్హతలు కలిగిన వారు 2.89 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతున్నది. పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర అర్హతలు కలిగిన వారు 2.07 లక్షల మంది ఉన్నట్లు ఆరు నెలల క్రితం ప్రభుత్వం అధికారిక లెక్కలు తయారు చేసింది. ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే చూసినా అన్ని తరగతులకు సంబంధించి 33,70,315 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎస్సీ నిరుద్యోగులు 6,11,309, ఎస్టీ నిరుద్యోగులు 1,38,328, బీసీ నిరుద్యోగులు 16,20,823, దివ్యాంగ నిరుద్యోగులు 11,683, ఇతరులు 9,88,172 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తయారు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఈ 33,70,315 మందికి నెలకు రూ.2వేల చొప్పున ఎంత ఇవ్వాలి? ఇపుడు కేటాయించిన రూ.1,000 కోట్లు ఏ మూలకు..? -
మోదీజీ.. పకోడా బిజినెస్‌కు లోన్ ఇవ్వండి
సాక్షి, లక్నో : పకోడా వ్యాపారం చేసుకునేందుకు తనకు సహకరించాలని అమేథికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు అశ్విన్ మిశ్రా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. తాను పకోడా బిజినెస్‌ను చేపట్టేందుకు ముద్రా రుణం మంజూరయ్యేలా తన తరపున ప్రధానిని కోరాలని ఆ యువకుడు కోరారు. పకోడా యూనిట్ ఏర్పాటు గురించి ప్రధాని ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పినప్పటి నుంచి తాను ఉద్యోగ ప్రయత్నాలు విరమించానని పకోడా జాయింట్ ప్రారంభించాలని నిర్ణయించకున్నానని అశ్విన్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. పకోడీలు అమ్ముకోవడంపై ప్రధాని సూచన తనను అమితంగా ఆకట్టుకుందని.. ఇది తాను బతకడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడుతుందని భావించానన్నారు. అయితే పకోడీ వ్యాపారాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించగా నిధుల కొరతతో ముందుకెళ్లలేకపోయానన్నారు. దీంతో లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయించగా...తనకు రుణం లభించలేదన్నారు. ముద్రా యోజన ద్వారా పది కోట్ల మంది లబ్ధిపొందారని ప్రధాని చెబుతున్నా తనకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరించాయని అమేథి బీజేపీ సోషల్ మీడియా మాజీ చీఫ్‌గా వ్యవహరించిన అశ్విన్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మాటలు అవాస్తవాలని తాను భావించడంలేదని, బ్యాంకుల తీరుతోనే తాను ఈ లేఖ రాస్తున్నానని తన తరపున ప్రధానికి విజ్ఞప్తి చేసి పకోడా వ్యాపారం ప్రారంభించేలా తనకు రుణం మంజూరయ్యేలా చూడాలని మంత్రిని కోరారు. మరోవైపు ఈ లేఖ బీజేపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేందుకు విపక్షానికి అవకాశం ఇచ్చినట్టైంది. బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయని.. ఇది కేవలం వాటికి ఓ ఉదాహరణేనని స్ధానిక కాంగ్రెస్ నేత అచ్ఛే లాల్ వ్యాఖ్యానించారు. -
ఉద్యోగాల పేరుతో ముంచేశారు
-
టీజేఏసీ ఆధ్వర్యంలో కొలువుల కొట్లాట సభ
-
ఉపాధి వేదిక
సీతంపేట: నిరుద్యోగులు ఎంప్లాయీమెంట్ ఎక్ఛ్సేంజ్‌ల చుట్టూ ఇక తిరగాల్సిన పనిలేదు. కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఉపాధి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు ఆన్లైన్ దరఖాస్తు విధానంతో ఇక తప్పాయి. ప్రస్తుతం ఏపీ ఎంప్లాయీమెంట్ ఎక్ఛ్సేంజ్ కూడా నిరుద్యోగులకు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. కొత్త వెబ్సైట్ గతంలో నిరుద్యోగులు ఎంప్లాయీమెంట్ ఎక్ఛ్సేంజ్‌లలో పేర్లు నమోదు చేసుకునే వారు. అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా పలు సంస్థల నుంచి ఇంటర్వూ్య కాల్‌లెటర్లు వచ్చేవి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు ‘ఎంప్లాయీమెంట్ ఎక్ఛ్సేంజ్ డాట్ కమ్’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇప్పటికే పలురకాల పోర్టళ్లలో రెజ్యూమ్ అప్లోడ్ చేసి నెలలు గడచినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందేవారు అనేక మంది ఉంటారు. అలాంటి వారికోసం ఈ వెబ్‌ౖసైట్ మంచి అవకాశం కల్పిస్తుంది. ఏపీలో ఉద్యోగ సమాచార వేదికగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్‌పోర్టల్‌లో ఒక్కసారి పేరు రిజిస్టర్ చేసుకుని తమ రెజ్యూమ్‌ను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అభ్యర్థి అర్హతలను బట్టి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ♦ ఆయా జిల్లాలు, నియోజకవర్గం, మండలాల వారీగా ఉండే ఉద్యోగాల సమాచారం తెలుస్తుంది. ♦ ప్రైవేట్ ఉద్యోగాల సమాచారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్ల సమాచారమంతా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ♦ ఈ వెబ్సైట్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలు ఉచితంగా పొందవచ్చు. ♦ ఉద్యోగులు అవసరమైన కంపెనీ/సంస్థలు/రిక్రూటర్లు కూడా అవసరమైన ఖాళీలు గురించి ఈ వెబ్సైట్లో పొందుపరిచే అవకాశం కల్పించారు. ♦ దీంతో ఆయా అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఇలా... ♦ అభ్యర్థులు ముందుగా ఏపీ ఎంప్లాయీమెంట్ ఎక్ఛ్సేంజ్ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ♦ డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఏపీఎంప్లాయీమెంట్ఎక్ఛ్సేంజ్.కామ్‌లో లాగిన్ అయ్యాక వెబ్సైట్ ముఖచిత్రం కనిపిస్తుంది. ♦ న్యూ జాబ్ రిజిస్ట్రేషన్ హియర్ వద్ద క్లిక్ చేయాలి. ♦ జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు కనిపిస్తుంది. ♦ అక్కడ పేరు, ఈ మెయిల్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ♦ తర్వాత కాలమ్ వద్ద పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని నమోదు చేయాలి. పక్క కాలమ్‌లో రీటైప్ పాస్వర్డ్ వద్ద క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మళ్లీ ఎంటర్ చేయాలి. ♦ జిల్లా, చిరునామా, పిన్‌కోడ్ నమోదు చేయాలి. ♦ తర్వాత మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సిన కాలమ్ కనిపిస్తుంది. అక్కడ స్కాన్ చేసిన సర్టిఫికెట్స్ 5 కేబీలోపు అప్లోడ్ చేయాలి. ♦ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ♦ తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా ఇక్కడ నమోదు చేసిన ఈ మెయిల్ ఐడీ, క్రియేట్ చేసుకున్న పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వవచ్చు. ఏపీ ఎంప్లాయిమెంట్ వెబ్సైట్ -
ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం
హైదరాబాద్: సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్లోని యన్టీఆర్నగర్ చెందిన జి.సంతోష్‌కుమార్‌కు ఏడాది క్రితం వరంగల్ జిల్లా సీతరాంపురం గ్రామానికి చెందిన పొలకుర్తి సురేందర్‌తో పరిచయం ఏర్పడింది. సింగపూర్‌లో ఉద్యోగం ఉందని నెలకు రూ.లక్ష జీతం ఉంటుందని నమ్మించిన సురేందర్‌కు 2016లో సంతోష్ రూ.20 వేలు ఇచ్చాడు. డబ్బు తీసుకుని ఏడాది గడుస్తున్నా ఉద్యోగం రాలేదు. ఫోన్ చేసినా అతను స్పందించకపోవడంతో సంతోష్కూమర్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. -
ఎంపీ కవితకు నారీ ప్రతిభా పురస్కారం
యువత, మహిళా సాధికారతకు చేస్తున్న కృషికి గుర్తింపుగానే... సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నారీ ప్రతిభా పురస్కారాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అందుకున్నారు. యువత, మహిళా సాధికారత కోసం కృషి చేసినందుకుగాను ఆమెను కేంద్ర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ) మంత్రిత్వశాఖ, విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి. కవితకు విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అసోసియేషన్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ టి.వసంతలక్ష్మి గురువారం హైదరాబాద్‌లో అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె హాజరుకాలేకపోవడంతో ఎంఎస్ఎంఈ మంత్రి కల్రాజ్ మిశ్రా ఆదేశాలతో వసంత లక్ష్మి హైదరాబాద్‌కు వచ్చి ఈ అవార్డును అందజేశారు. మొదటిసారి ప్రవేశపెట్టిన నారీ ప్రతిభా పురస్కార్–2017ను ఎంపీ కవితతోపాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కల్పకం ఏచూరి, ఆషా ప్రకాశ, స్మృతి నాగపాల్, ప్రియా భార్గవ, షిర్లే అబ్రహం అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ ‘షీ’టీమ్స్ బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా కూడా అవార్డు అందుకున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని వసంత లక్ష్మి ఎంపీ కవితను ప్రశంసించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉద్యోగ, ఉపాధి కల్పనకు తోడ్పడుతున్నారన్నారు. సమాజాన్ని చైతన్యపరుస్తూనే యువత స్వశక్తితో ఎదిగేలా చేసి సమాజాన్ని చైతన్యపర్చడంలో ఐకాన్‌గా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ సీఏవో డాక్టర్ జగన్మోహన్రావు, సీఈవో అబ్దుల్ బాసిత్, జాగృతి రాష్ట్ర ప్రధానకార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు. -
ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి
మల్లు రవి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కార్పొరేషన్ వరుసగా మూడేళ్లుగా రుణాలు ఇవ్వడంలేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పా రు. గురువారం ఆయన మాట్లాడుతూ 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎలాంటి రుణాలు ఇవ్వలేదని, ఎస్సీ నిరుద్యోగులను ఆదుకోవడానికి తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు. బడ్జెట్లో పెట్టినా, నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంవల్ల బ్యాంకులు రుణాలను ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో, సీఎం ఇచ్చిన హామీలేమిటో ప్రజలకు వెల్లడించాలని కోరారు. -
డ్రైవింగ్‌లో శిక్షణ.. ఉపాధి..
- డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీం తీసుకురానున్న ప్రభుత్వం - నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు రాయితీపై రుణం - అనంతరం ఉబెర్ సంస్థలో కొనసాగేలా అవకాశం సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకాన్ని గతేడాది అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అది దరఖాస్తులతోనే ముగిసింది. తాజాగా 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్థిక సహకార సంస్థలకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఈ క్రమంలో డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జూలై ఒకటి నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శిక్షణ తర్వాత రుణం.. డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం కింద లబ్ధి పొందిన వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఉండాలని ప్రభుత్వం సూచించింది. దీంతో మార్గదర్శకాల రూపకల్పనలో అధికారులు నిబంధనలు కఠినతరం చేయనున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసి డ్రైవింగ్‌లో వారి ప్రావిణ్యాన్ని తెలుసుకుంటారు. తర్వాత శిక్షణ ఇచ్చి.. రాయితీ రుణంతో కారు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పిస్తారు. క్యాబ్‌లో నిర్వహించేలా ఉబెర్ సంస్థతో ప్రభుత్వం ఒప్పం దం కుదుర్చుకోనుంది. 2016–17 వార్షిక సంవత్సరం చివర్లో ఈ పథకం కింద ఆర్థిక సహకార సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా 21,106 దరఖాస్తులు స్వీకరించాయి. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతోపాటు రాయితీ రుణాలకు సంబంధించి నిధులు విడుదల చేయలేదు. ఆయా శాఖల అధికారులు వాటి పరిశీలన చేపట్టలేదు. తాజాగా సరికొత్త నిబంధనలు రూపొందిస్తు న్న నేపథ్యంలో యంత్రాంగం కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. -
ఔరా అభిమన్యూ.. ఎంత పని చేశావురా!
► నిరుద్యోగులకు టోకరా! ► మాయగాడిని చుట్టుముట్టిన బాధితులు ► రూ. కోటికిపైగా కుచ్చుటోపీ.. రాజాం : అతడిది ఈ ఊరు కాదు.. కనీసం ఇక్కడేదో ఉద్యోగం, వ్యాపారం వెలగబెడుతున్నాడంటే అదీ లేదు. అలా అని పెద్ద వ్యక్తి కూడా కాదు.. అయినప్పటికీ ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది వరకు నిరుద్యోగులు అతని మాయలో పడ్డారు. రూ. కోటికిపైగా ముడుపులు చెల్లించారు. తీరా ఉద్యోగం రాకపోవడంతో అతడి ఇంటికి చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం బయటకు రావడంతో నిందితుని బంధువులు రాజాం చేరుకొని బాధితులతో మంతనాలు జరుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాజాంలోని నాగావళి ఐటీఐ సమీపంలో నివాసం ఉంటున్న అభిమన్యు అనే యువకుడు షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తుంటాడు. ఇతని సొంత ఊరు కూడా ఎక్కడనేది తెలియదు. షార్ట్‌ఫిల్మ్‌లతో యువతకు దగ్గరయ్యాడు. తనకు పెద్దలతో పరిచయం ఉందని నమ్మబలికాడు. ఉద్యోగాలు కూడా వేయిస్తుంటానని చెప్పాడు. ఫలితంగా రాజాం, పాలకొండ, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల నిరుద్యోగులతోపాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన పలువురు ఈయన మాయలో పడ్డారు. ప్రధానంగా రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటించడంతో.. రైల్వే పరీక్షలు రాసిన నిరుద్యోగులు కూడా అతని వద్దకు క్యూ కట్టారు. ఒకరికి తెలియకుండా ఒకరు రూ.లక్షల్లో ముడుపులు చెల్లించారు. 50 మందికిపైగా బాధితులు రూ. కోటికిపైగా చెల్లింపులు జరిపినట్లు సమాచారం. అయితే గడువు దాటినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం, మరోవైపు వీరితోపాటు పరీక్షలు రాసిన కొంతమందికి ఉద్యోగాలు రావడంతో ముడుపులు చెల్లించిన వారికి అనుమానాలు అధికమయ్యాయి. ఈ నిరుద్యోగులకు చెందిన కొంతమంది తల్లిదండ్రులు పొలం పుట్రా తాకట్టుపెట్టి రూ.లక్షల్లో చెల్లింపులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వీరంతా ఉద్యోగాలు రాకపోవడంతో తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇమ్మని అభిమన్యుపై ఒత్తిడి తీసుకువచ్చారు. తాను తీసుకున్న డబ్బు వేరే వ్యక్తికి ఇచ్చే వాడినని, తనకు కూడా ఏమీ తెలియదని, రెండు రోజులు గడువు కావాలని చెప్పుకుంటూ రోజులు నెట్టుకొచ్చాడు. చివరికి విసుగు చెందిన నిరుద్యోగ బాధితులతోపాటు వారి బంధువులు కొంతమంది బుధవారం రాజాం చేరుకొని అభిమన్యు నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది పెద్ద మనుషులు అభిమన్యుతో మాట్లాడినప్పటికీ.. తన వద్ద పైసా కూడా లేదని, ఏమీ చేయలేనని చేతులెత్తేశాడు. ఆందోళనలో బాధితులు..: ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు వచ్చి.. మీడియాకు చేరింది. రాజాంకు చెందిన పలువురు మీడియా ప్రతినిధులు అభిమన్యు నివాసం వద్దకు చేరుకోగా.. బాధితులు కాస్తంత ఆందోళనకు గురయ్యారు. మీడియా దృష్టిలో పెట్టినప్పటికీ తమకు ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగం ఎలాగూ ఇప్పించలేడని, కనీసం నష్టపోయిన మొత్తాన్ని అయినా తిరిగి చెల్లించే వరకు మీడియా సహకరించాలని కోరారు. నట్టేట ముంచాడు..: ఉద్యోగాలు ఇస్తామన్న అభిమన్యు వలలో చాలా మంది నిరుపేదలు పడ్డారు. ఉద్యోగం ఇవ్వలేకుంటే తాము ఇచ్చిన డబ్బుకు వడ్డీ ఇస్తామని, డబ్బులకు బాండ్లు కూడా ఇస్తామని అభిమన్యు నమ్మబలకడమే కాకుండా.. బాండ్లు రాసివ్వడంతో అధికంగా నిరుద్యోగులు ఈయన మాయలో చిక్కుకున్నారు. చివరకు ఆ బాండ్లు కూడా పట్టించుకోకుండా బాధితులను నట్టేట ముంచాడు. తనకేమీ తెలియదని అభిమన్యు తప్పించుకోవడంతో ప్రస్తుతం బాధితులతోపాటు వారి బంధువులు కూడా దిగాలు చెందుతున్నారు. ఇంత చదువు చదివి ఇలాంటి మాయలో పడ్డామేమిటని నిరుద్యోగులు వాపోతున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులకు బుధవారం సాయంత్రం వరకు ఎటువంటి సమాచారమూ లేకపోవడం విశేషం. -
నిరుద్యోగ యువతను మోసం చేసిన బాబు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గుంతకల్లు టౌన్: ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి పేరుతో యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.80 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ నోటిఫికేషన్, మెరిట్, కలెక్టర్ సెలెక్షన్)విధానాన్ని అమలు చేసి వీటిని భర్తీ చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ తెచ్చి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలన్నారు. అధికార పీఠం కోసం అడ్డమైన హామీలిచ్చి చంద్రబాబు అన్నివర్గాల ప్రజల్ని మోసం చేశారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టో నియంత్రణ కమిటీ వేసి ప్రాసిక్యూట్ చేయాలన్నారు. గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని గోపాల్‌రెడ్డి ప్రకటించారు. వై వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డిను గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార కరపత్రాలను వారు విడుదల చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్, కౌన్సిలర్లు గోపి, రంగన్న, నగేష్, మాజీ కౌన్సిలర్ సుంకప్ప, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతతో ఆటలాడుకోవద్దు
ఆరోగ్యమిత్రలను కొనసాగించాల్సిందే - రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన ధర్మాసనం - ఉన్నత అర్హతల జీవో-71 రద్దు - రెండువేల మందికి హైకోర్టు ఊరట సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యసేవా ట్రస్ట్ కింద వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న రెండువేల మంది ఆరోగ్యమిత్రలకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్న వారి తొలగింపునకు దారి తీసేలా ఉన్నత విద్యార్హతలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 20న జారీ చేసిన జీవో 28ని రద్దు చేసింది. నిరుద్యోగ యువతతో ఆటలాడుకోవడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. గతంలో కొనసాగుతున్న విధంగానే యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఆరోగ్యమిత్రలను తొలగించి, తమకు కావాల్సిన వారిని నియమించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్యమిత్రలకు ఉన్నత విద్యార్హతలను నిర్దేశించింది. ఇవి ఉన్న వారినే కొనసాగిస్తామంటూ జీవో జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆరోగ్యమిత్రలు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, వైద్య సేవా ట్రస్ట్-ఆరోగ్యమిత్రల మధ్య యజమాని-ఉద్యోగి సంబంధం లేదని, అందువల్ల వారు తమ వివాదాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాలని తీర్పునిచ్చారు. అరుుతే రెండు నెలలపాటు కొనసాగవచ్చునంటూ ఈ ఏడాది మార్చి 31న సింగిల్ జడ్జి తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆరోగ్యమిత్రలు ధర్మాసనం ముందు అపీళ్లు దాఖలు చేశారు. అలాగే ప్రభుత్వం కూడా అప్పీళ్లు దాఖలు చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు, వేదుల శ్రీనివాస్‌లు వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి శుక్రవారం తీర్పు వెలువరించింది. తీర్పు వివరాలిలా ఉన్నారుు.. వారిది యజమాని ఉద్యోగి సంబంధమే ఆరోగ్య మిత్రలను ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తీసుకునే నిమిత్తం ప్రభుత్వం 2009 ఫిబ్రవరి 27న జీవో 71 జారీ చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు, సమాఖ్యలే ఆరోగ్యమిత్రల అర్హతలను నిర్దేశించారుు. రాతపరీక్ష, వైవా నిర్వహించి ఎంపిక చేసి ఆయా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు కేటారుుంచారుు. వారి వేతనం, నియమ నిబంధనలన్నింటినీ ప్రభుత్వమే నిర్ణరుుంచింది. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మధ్య యజమాని, ఉద్యోగి సంబంధం లేదని చెప్పగలమా.? వారి మధ్య యజమాని, ఉద్యోగి సంబంధం ఉందన్నదే మా ధృడమైన సమాధానం. రాజ్యాంగ, చట్టప్రకారం పాటించాల్సిన విధి విధానాల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ముసుగు ధరించి తెరవెనుక దాక్కుంది. రెండువేల మందిని రోడ్డు పాలు చేసింది అర్హత నిర్ణయం ఎప్పుడూ యజమాని పరిధిలోనిదే. యజమాని ప్రస్తుతం తన వద్ద తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల ఏరివేతకు ఉన్నత విద్యార్హతలను నిర్దేశించవచ్చా? అన్నదే ప్రధాన ప్రశ్న. తగిన ఆర్హతలు లేకపోవడం వల్ల తగిన సేవలు, మార్గదర్శకత్వం చేయపోతున్నారని, దీని వల్ల రోగులకు సకాలంలో వైద్యసాయం అందడం లేదని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. ఆధారాలు చూపలేకపోయారు.పౌరుల తప్పేమీ లేకపోరుునా వారి న్యాయబద్ధ ఆకాంక్షలను కాలరాసేలా వ్యవహరించరాదు. వైద్యసేవా ట్రస్ట్ సీఈవో తీసుకొచ్చిన ఉన్నత విద్యార్హత ఆలోచన రెండువేల మందిని వీధుల పాలు చేసింది. సామాజిక, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నప్పుడు, పేదల పక్షాన నిలిచి ఆ అసమానతలను తొలగించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది. ఆరోగ్యమిత్రలు యజమాని, ఉద్యోగి బంధం లేదన్న ప్రభుత్వ వైఖరితో, తమను తొలగించి మరికొందరిని ఔట్సోర్సింగ్ పద్ధతిన తీసుకోవాలన్న నిర్ణయంపైనే హైకోర్టును ఆశ్రరుుంచారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మార్గదర్శకత్వం చేసేవారికి ఉన్నత విద్యార్హతలను నిర్దేశించడం ఎందుకో మాకు అర్థం కావడంలేదు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారిని మూకుమ్మడిగా తొలగించేందుకే ప్రభుత్వం ఈ ఎత్తు వేసిందన్న పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చలేకున్నాం. యజమాని, ఉద్యోగి సంబంధం కొనసాగుతున్నప్పుడు ఆరోగ్యమిత్రల దురవస్థను పట్టించుకోకుండా వారిని ఏకపక్షంగా తొలగించడానికి వీల్లేదు. అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. తెలంగాణలో పరిస్థితి ఇదీ... ఆరోగ్యమిత్రల విషయంలో తెలంగాణలో పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన ఆరోగ్యశ్రీ బోర్డు సమావేశంలో ఆరోగ్యమిత్రలతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను రూ.12వేలకు పెంచాలని నిర్ణరుుంచారు. రెండు పొరుగు రాష్ట్రాల మధ్య కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను చూసే విధానంలో ఎంత తేడా ఉందో దీనిని బట్టి తెలుసుకోవచ్చు. శాశ్వత ప్రాతిపదిక పోస్టులను భర్తీ చేయనంతవరకు వారు తమ తమ పోస్టుల్లోనే కొనసాగుతారు. విధి నిర్వహణలో సక్రమంగా లేకుంటే వారిపై న్యాయసూత్రాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవచ్చు. అరుుతే ఉన్నత విద్యార్హతలు ఉన్నవారితో అదనపు పోస్టుల భర్తీకి ఈ తీర్పు ఎంత మాత్రం అడ్డంకి కాదు. అందువల్ల ఆరోగ్యమిత్రల తొలగింపునకు జారీ చేసిన జీవో 28ని రద్దు చేస్తున్నాం. -
ఉపాధికి దారి ఇది..
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని వృతి నైపుణ్యతా శిక్షణా కేంద్రం నిరుద్యోగులకు వరంలా మారింది. రాజధాని పేరుతో పంట భూములన్నీ లాక్కున్న ప్రభుత్వం.. నిరుద్యోగులకు శిక్షణ.. ఆపై ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసగించింది. ఈ నేపథ్యంలో జీవిత గమ్యం తెలియక అయోమయంలో ఉన్న రాజధాని నిరుద్యోగులకు ఈ కేంద్రం పూలబాట వేస్తోంది. ఉచితంగా శిక్షణతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దుతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని కోసం పంట భూములను ఇచ్చిన రైతు కుటుంబాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. వృత్తి నైపుణ్యతా కేంద్రాల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాట మరిచిపోయింది. ఈ నేపథ్యంలో ఉపాధి లేక వలసపోతున్న నిరుద్యోగులకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండగా నిలుస్తోంది. వృత్తి నైపుణ్యతా కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. రాజధాని ప్రాంత నిరుద్యోగ యువతకు పలు కంపెనీల సహకారంతో శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. రాజధాని ప్రాంత నిరుద్యోగుల కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత ఏడాది స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రారంభించారు. వర్సిటీలోని వాణిజ్య భవనంలో గదులను ఈ కోర్సులకు కేటాయించారు. బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులతో పాటు పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు వారి చదువును బట్టి వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు విజయవాడలోని ఎఫ్రా్టనిక్స్ కొలబోరేషన్ కంపెనీతో ఒప్పందం చేసుకుని వారికి శిక్షణ ఇచ్చేలా చేశారు. ఆ కంపెనీకి అవసరమైన టెక్నికల్ కోర్సులు సిగ్నలింగ్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ, పీసీబీ డిసెగ్నేషన్, ఎల్ఈడీ లైట్ టెస్టింగ్, ఇంటర్నెట్ థింగ్స్, సిగ్నలింగ్ టెలికామ్ సెంటర్స్, ఇన్స్టాలేషన్–సర్వీసింగ్ స్కిల్స్, త్రీడీ డెషన్, డిజిటల్ మార్కెటింగ్, యాప్ డెవలప్మెంట్ వంటి కోర్సుల్లో ఆరు నెలలు శిక్షణ ఇచ్చి ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. గత ఏడాది 32 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, అందులో 20 మందికి ఉద్యోగం ఇచ్చారు. మిగిలిన వారు సర్టిఫికెట్ తీసుకుని ఇతర కంపెనీల్లో మెరుగైన జీతం కోసం వెళ్లారు. అలాగే, పదో తరగతి, ఇంటర్ చదివిన 10 మందికి అపోలో ఆస్పత్రిలో ఉద్యోగాలు కల్పించారు. లైఫ్ సైన్స్‌లో డిగ్రీ చదివిన 10మంది విద్యార్థులకు ఆక్వా కల్చర్ టెక్నీషియన్స్‌గా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించారు. డాన్‌బాస్కో టెక్నికల్ స్కూల్‌తో ఒప్పందం చేసుకుని మహిళలకు కుట్టు మిషన్లు, డీటీపీ, గార్మెంట్ మేకింగ్ కోర్సుల్లో తర్ఫీదు ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ఇంజన్ మెకానిక్, హౌస్ వైరింగ్, మోటర్ వైండింగ్ కోర్సుల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రోత్సాహం కరువు.. రాజధాని ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో విఫలమైన చంద్రబాబు సర్కార్... నాగార్జున యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రోత్సహించడంలోనూ విఫలమైంది. ప్రభుత్వ తోడ్పాటు లేకుండానే సొంతంగా నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులు ప్రారంభించిన వర్సిటీతో ఇటీవలే ప్రభుత్వ పెద్దలు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. యువతకు ఉపాధి ప్రోత్సాహం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. రెండో ఏడాది శిక్షణకు సిద్ధమవుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చొరవ చూపలేదు. -
ఎస్సీ యువత కోసం ‘యువస్ఫూర్తి’
ఏలూరు (మెట్రో) : ఎస్సీ యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం ‘యువస్ఫూర్తి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఆర్కేఆర్ విజయకుమార్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘యువస్ఫూర్తి’ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగుల కోసం ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని 15 వందల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. వీరందరూ గ్రామాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే సేవల గురించి అవగాహన కల్పించాలని విజయకుమార్ కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. -
27న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా కేంద్రమైన కడప పాత రిమ్స్‌లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈనెల 27వ తేదిన నిరుదోయగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వి.సుస్మితప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంపికైన వారికి వేతనం కింద నెలకు రూ. 8–10 వేల వరకు ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులు కడప, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మాధవరం, సుండుపల్లె, ఖాజీపేట, ప్రొద్దుటూరు, బద్వేలు ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఇతర వివరాలకు 98663 04624 నెంబరులో సంప్రదించాలన్నారు. -
27, 28 తేదీల్లో ఏలూరులో జాబ్‌మేళా
ఏలూరు సిటీ : జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధిలో బాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామని జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎ.చంద్రమౌళీశ్వరి సోమవారం తెలిపారు. ఎటువంటి విద్యార్హత లేని యువతకు ఇంటర్వూ్యలు నిర్వహించి ఏలూరు కృష్ణా జూట్ మిల్లులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అభ్యర్థుల వయసు 19 సంవత్సరాలు కలిగి, 163 సెం.మీ ఎత్తు ఉండాలని కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యువతకు శిక్షణ కాలంలో ఉచిత వసతి, రూ.50 భోజన సదుపాయం కల్పిస్తారని తెలిపారు. డోర్నియర్ వీవర్, స్పిన్నర్ వీవర్, కాప్ వైండింగ్, స్లైౖ ఫీడర్, జనరల్, ఐటీఐ మెకానికల్ కేటగిరీల్లో ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. ఈ కేటగిరీల్లో యువతకు శిక్షణ ఇస్తూ రోజువారీ సై్టఫండ్ ఇస్తారని, సై్టఫండ్ రూ.180 నుంచి గరిష్టంగా రూ.270 వరకు ఉంటుందన్నారు. నైపుణ్యం సాధించిన యువతకు ఉద్యోగావకాశం లభిస్తుందని, రెండు, మూడు సంవత్సరాలు పనిచేస్తే రెగ్యులర్ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర అలవెన్సులు ఇస్తారని తెలిపారు. వివరాలకు 93904 91308 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
సాగు సాగేనా?
♦ రుణం కోసం రైతుల ఎదురుచూపులు ♦ వార్షిక రుణ ప్రణాళిక మొక్కుబడేనా? ♦ రూ.6,142 కోట్లతో ప్రణాళిక ఖరారు ♦ రూ.2,750 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం ♦ గత ఏడాది 71.71 శాతం మాత్రమే పంపిణీ ♦ పంట రుణాల పంపిణీలో బ్యాంకర్ల అలసత్వం రుణాల మంజూరు కోసం అటు రైతులు, ఇటు నిరుద్యోగ యువత బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొట్టడం ఏటా చూస్తూనే ఉన్నాం. రుణాలందడం లేదంటూ రైతులు తరచూ ఆందోళనలు చేపడుతున్న విషయం తెల్సిందే. ఏటా రుణ మంజూరులో మొండిచేయి చూపుతున్నారని, బ్యాంకు రుణాలందక ప్రైవేట్ అప్పులు చేసి వడ్డీల భారం మోయలేక సతమతమవుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వార్షిక రుణ ప్రణాళికలో మాత్రం రూ.వేల కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుంటున్న బ్యాంకర్లు తీరా మంజూరు దశలో మోకాలడ్డుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారైనా బ్యాంకర్లు అనుకున్న లక్ష్యం మేరకు రుణాలివ్వాలని రైతులు కోరుతున్నారు. సాక్షి, సంగారెడ్డి: జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. ఇటీవల కలెక్టర్ రోనాల్డ్ రోస్ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.6,142 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఆమోదం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రూ.513 కోట్ల మేర వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం పెరిగింది. ఈ ప్రణాళికకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు పంపిణీ చేస్తారా? లేదా అన్న సందేహం అన్ని వర్గాల్లో నెలకొంది. గత ఏడాది రుణ ప్రణాళికలో అన్ని రంగాల్లో కలిపి రూ.5,629 కోట్ల రుణాలు పంపిణీ చేయాలనే లక్ష్యం కాగా బ్యాంకర్లు రూ.4,037 కోట్ల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. రుణాల పంపిణీలో 71.71 శాతం లక్ష్యాన్ని మాత్రమే బ్యాంకర్లు చేరుకోగలిగారు. ముఖ్యంగా రుణాల పంపిణీలో బ్యాంకర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది రూ.2,750 కోట్ల పంట రుణాలు.. 2016-17 వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి ఈ ఏడాది ఖరీఫ్, రబీలో మొత్తం రూ.2,750 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా రైతులకు ఏ మేరకు రుణాలు అందజేస్తారో వేచి చూడాల్సి ఉంది. గత ఏడాది పంట రుణాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.2,666 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా బ్యాంకర్లు రూ.2,069 కోట్ల మేర పంపిణీ చేశారు. కరువు కాలంలో లక్ష్యం మేరకు పంపిణీ చేయకపోవడంతో బ్యాంకర్ల తీరు విమర్శలకు దారితీసింది. ఇదిలావుంటే గత వార్షిక రుణ ప్రణాళికకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు ఇవ్వడంలోనూ బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. వ్యవసాయరంగానికి రూ.3,720 కోట్లు .. రూ.6,142 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కాగా ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ.5,546 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.595 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి మొత్తం రూ.3,720 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో రూ.2,750 కోట్ల పంట రుణాలు అందజేయాలని బ్యాంకర్లు నిర్ణయించారు. మహిళా సంఘాలు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.1,195 కోట్లు, చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు రూ.630 కోట్లు పంపిణీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. వార్షిక రుణ ప్రణాళికలో మొత్తంగా 44.78 శాతం పంట రుణాలు... అగ్రికల్చర్ టర్మ్‌లోన్, వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలకల్పన 15.80 శాతం, చిన్నమధ్యతరహా పరిశ్రమలకు 10.26 శాతం, మహిళా గ్రూపులు, ఇతర రంగాల వారికి 19.46 శాతం, అనుత్పాదక రంగాలకు 9.70 శాతం రుణాలు అందజేయాలని బ్యాంకర్లు నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళికకు అనుగుణంగా ఏ మేరకు రుణాలు పంపిణీ చేస్తారో చూడాలి. పంట రుణాలపైనే అందరి దృష్టి... పంట రుణాల పంపిణీకి బ్యాంకర్లు భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నా అందుకనుగుణంగా మంజూరు చేయడం లేదన్న విమర్శలున్నాయి. గత ఖరీఫ్, రబీలోనూ పంటలు పండక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. కరువుతో అల్లాడుతున్న రైతులు ప్రస్తుతం ఖరీఫ్‌పై ఆశలు పెట్టుకున్నారు. బ్యాంకర్లు రుణాలు అందజేస్తే గట్టెక్కవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి ఈ ఏడాది రూ.2,750 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్‌లో రూ.1,770 కోట్లు, రబీలో రూ.980 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఖరీఫ్, రబీలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ.1,561 కోట్లు, ప్రైవేటు బ్యాంకులు 92.46 కోట్లు, కోఆపరేటివ్ బ్యాంకులు రూ.349 కోట్లు. గ్రామీణ బ్యాంకులు రూ.747 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఏడాది బ్యాంకర్లు ఏ మేరకు పంట రుణాలు పంపిణీ చేస్తారో చూడాలి మరి. -
మొగ్గలోనే తుంచేద్దాం
- విద్యార్థులను అదుపులో పెట్టుకోండి - యూనివర్సిటీలు, కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు - ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక యువతలో పెల్లుబుకుతున్న అశాంతి - నిరసనలను అడ్డుకోవటం.. ‘ప్రత్యేక హోదా’ ఉద్యమాల అణచివేతకు సర్కారు వ్యూహం - వర్సిటీల్లో ఎన్నడూలేని విధంగా నియంత్రణ - ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువకులు, విద్యార్థుల్లో పెల్లుబుకుతున్న నిరసనలు, ప్రత్యేక హోదా సాధన కోసం వేడెక్కుతున్న ఉద్యమాలను మొగ్గలోనే తుంచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా సమస్యలపై జరిగే ఆందోళనలు, నిరసన దీక్షల్లో విద్యార్థులు భాగస్వామ్యం కాకుండా కట్టడి చేయడానికి సిద్ధమైంది. విద్యా ప్రమాణాల్లో నాణ్యత పేరుతో విశ్వవిద్యాలయాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను ఎక్కడికక్కడ నియంత్రించాలని నిర్ణయించింది. తాజాగా ఉన్నత విద్యా మండలి ఆయా యూనివర్సిటీలకు, కాలేజీలకు జారీ చేసిన లేఖల్లో (డీవో లెటర్ నంబర్-ఏపీఎస్సీహెచ్ఈ/యూనివర్సిటీ/అఫిలియేటెట్ కాలేజెస్/2015) పేరుతో ఈ నెల 25న జారీ చేసిన సర్క్యులర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులో విద్యార్థులు-క్రమశిక్షణను ఒక ఎజెండాగా చేసింది. యూనివర్సిటీల స్థాయిలో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడంపై తీసుకోవలసిన చర్యలను ఎజెండాగా చేర్చి దానిపై అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్లు మానవ వనరుల శాఖ మంత్రికి నివేదికలు ఇవ్వాలని, చర్యా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విద్యార్థులు రోడ్డెక్కకుండా కట్టడి చేయాలన్న సుదూర లక్ష్యంతోనే ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టమవుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడానికి కీలకమైన ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం అవుతుండటం, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో తిరుపతి, విశాఖల్లో నిర్వహించిన యువభేరి సదస్సులో పాల్గొని ప్రత్యేకహోదా సాధించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించడం, అక్టోబర్ 7 నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతున్న తరుణంలో విద్యార్థులను ఈ రకంగా నియంత్రించబోతున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఉత్తర్వులపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. నియంత్రించడమే లక్ష్యంగా.. ఇటీవల తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, విశాఖలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన సదస్సులో ప్రతిపక్ష నేత జగన్ పాల్గొని ప్రసంగించడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం క్రమశిక్షణ పేరుతో ఈ కొత్త ఎత్తుగడ వేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువభేరి సదస్సులు నిర్వహిస్తున్నారని తెలియగానే వర్సిటీల్లో ఇలాంటి సమావేశాలేంటంటూ అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. తద్వారా విద్యార్థులు పాల్గొనకుండా చేయాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. పైగా ఆ సదస్సులకు అనూహ్యంగా వేలాది మంది విద్యార్థులు హాజరుకావడంతో విజయవంతమయ్యాయి. ఇదే క్రమంలో విశాఖ సదస్సుకు హాజరైన వర్సిటీ అధ్యాపకులపైన ప్రభుత్వం క్రమశిక్షణ పేరుతో చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించగానే అనుమతించకుండా రకరకాల అడ్డంకులు సృష్టించింది. మరోవైపు ప్రత్యేకహోదా సాధిస్తే తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని విద్యార్థి లోకం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో జరిగే ప్రతి పోరాటంలోనూ భాగస్వామ్యం కావడానికి విద్యార్థులు, యువకులు ఉద్యుక్తులవుతున్న తరుణంలో రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీల పరిస్థితులపై మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో సమీక్షించారు. ఆయా వర్సిటీలు, కాలేజీల్లోని సమస్యలు, విద్యార్థులకు సంబంధించిన అంశాలను ఆరా తీసి పలు సూచనలు జారీచేశారు. మంత్రి సమీక్ష అనంతరం ఆయన చేసిన సూచనల మేరకు వర్సిటీలు, కాలేజీలు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి లేఖ పంపింది. నివారణ చర్యలకు సూచనలు చేసింది. వర్సిటీలు తమ పరిధిలోని అఫ్లియేటెడ్ కాలేజీల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలతో వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాల్సిన అంశాలను ఆ లేఖలో సూచించింది. దీనిలో మొదటి అంశంగా విద్యార్థుల క్రమశిక్షణను ఉంచడం విశేషం. తదుపరి అంశాలుగా ర్యాగింగ్ వ్యతిరేక నిరోధక చర్యలు, కొత్త సిలబస్ తదనంతర పరిస్థితులు, మాల్‌ప్రాక్టీసు లేకుండా పరీక్షల నిర్వహణ, బకాయిల వసూళ్లపై చర్చించాలని సూచించింది. బోధన, బోధనేతర సిబ్బంది పనితీరును సమీక్షించడంతోపాటు వీటన్నింటిపైనా చర్యా నివేదికలను సమర్పించాలని ఉన్నత విద్యామండలి లేఖల్లో ఆదేశించింది. ఏడాదిన్నర గడుస్తున్నా.. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్నా ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. ఉద్యోగం కల్పించకుంటే నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం పలు నిబంధనలు విధించడంతో ఫీజు రీయింబర్స్మెంట్ వేలాదిమందికి అందకుండా పోతోంది. ఇప్పటికే చదువుతున్న వారికి ఫీజుల బకాయిలు నిలిచిపోగా వాటిని చెల్లించాలంటూ విద్యార్థులపై కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. మరోవైపు ర్యాగింగ్ వేధింపులు, ప్రైవేటు సంస్థల్లో చదువుల ఒత్తిళ్లతో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వీటన్నిటితో విద్యార్థుల్లో అశాంతి, ఆందోళన రోజురోజుకూ ఎక్కువవుతోంది. వీటిని ఎక్కడికక్కడ కట్టడి చే యకపోతే భవిష్యత్తులో ఆందోళనలు, ఉద్యమాలు తీవ్రమవుతాయని ప్రభుత్వం అంచనాకొచ్చింది. అందుకే వాటిని అదుపుచేసేలా, అన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని వర్సిటీలకు ఆదేశాలు జారీచేసింది. -
ఉద్యమం తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లే
-
ఉద్యమం తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లే
* విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి * ఈ పరీక్షలు ఆఖరు మజిలీగా భావించొద్దు * జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం * మహబూబ్‌నగర్‌లో ‘సాక్షి’ భవిత గ్రూప్ అవగాహన సదస్సు విజయవంతం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ఉద్యమం గురించి తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లేనని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉజ్వల భవిష్యత్ ఆశిస్తున్న నిరుద్యోగ యువకులు అందుకు తగినట్లుగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమం-చరిత్రపై పూర్తిస్థాయి పట్టుసాధిస్తేనే ఇది సాధ్యమన్నారు. మహబూబ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన ‘సాక్షి’ భవిత గ్రూప్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యమం గురించి అవగాహన ఉన్నవారికి వచ్చే టీఎస్పీఎస్సీ పరీక్షల్లో తిరుగులేదని, గ్రూప్స్‌లో 150 మార్కులు వచ్చినట్లేనని చెప్పారు. గతంలో గ్రూప్స్ పరీక్షల్లో తప్పినవారు ఒత్తిడికి లోనై ఎంతో ఆవేదన చెందేవారని, ప్రయత్నలోపం లేకుండా కష్టపడాలే తప్ప ఈ పరీక్షలను ఆఖరి మజిలీగా భావించొద్దని హితవు పలికారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్ కూడా ఏ విషయమైనా చదవిన తర్వాతే దాని గురించి క్లుప్తంగా వివరించేవారని గుర్తుచేశారు. ఉద్యమాన్ని విభాగాలుగా విభజించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. తొలి, మలిదశ ఉద్యమ పరిణామాలను లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టం, శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు, ప్రముఖ కవులు, రచయిత లు రాసిన తెలంగాణ చరిత్ర పుస్తకాలను చదవాలన్నారు. సంస్కృతిలోనే పౌరుషం ఉంది.. తెలంగాణ సంస్కృతిలోనే పౌరుషం దాగి ఉంది. ఆ పౌరుషమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. సిలబస్‌లో మన సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. మీ సొంత ప్రణాళికలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ప్రతిదానికీ ఇతరులను అనుకరిం చడం ఉద్యోగార్థులకు సరికాదు. తెలంగాణ స్ఫూర్తితో యువత కష్టపడి గ్రూప్స్ ఉద్యోగాలు సాధిం చాలి. తెలంగాణ చరిత్రను పూర్తిగా ఆకళింపు చేసుకొని చదివితే విజయం మీదే. - నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి కారుచీకటిలో కాంతిరేఖ గ్రూప్స్ అభ్యర్థులకు కారుచీకటిలో కాంతిరేఖగా ‘సాక్షి’ భవిత అవగాహన సదస్సులు నిలుస్తున్నాయి. దేశ, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై పట్టు సాధించాలి. గ్రూప్స్‌లో ర్యాంక్‌ను ఎకనామిక్స్ సబ్జెక్టు నిర్ధారిస్తుంది. ఆర్థికవ్యవస్థను విభాగాలుగా విభజించి చదవాలి. ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయం, జీడీపీ, పేదరికం తదితర అంశాలను క్షుణ్ణంగా చదవాలి. అభ్యర్థులు లక్ష్యం నిర్ధేశిం చుకొని చదివితే విజయం సాధించవచ్చు. - డాక్టర్ ఎస్. భూమన్నయాదవ్, ఆర్థిక శాస్త్ర నిపుణులు సమాజంపై అవగాహనే.. సమాజంపై పరిపూర్ణంగా అవగాహన ఉన్న వారే గ్రూప్స్‌లో ఉద్యో గం సంపాదించుకోవడంతోపా టు చేసే ఉద్యోగంలో కూడా సేవాదృక్పథంతో రాణిస్తారు. ఇక్కడ షార్ట్‌కట్స్ ఏమీ ఉండవు. పద్ధతి ప్రకారం చదివితేనే విజయం సాధించవచ్చు. నేను గ్రూప్-1కు శ్రద్ధపెట్టి చదివితే గ్రూప్-2లో 1986లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. చాలా కాలం తర్వాత నోటిఫికేషన్ వచ్చినందున లక్ష్యం నిర్దేశించుకొని చదవాలి. - రాంకిషన్, జాయింట్ కలెక్టర్ ప్రణాళికాబద్ధంగా చదవాలి గ్రూప్స్‌లో ప్రణాళికబద్ధంగా చదివితే విజయం సాధించవచ్చు. నోటిఫికేషన్లో ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా ఉద్యోగాల భర్తీ జరుగుతాయి. హోం, గ్రౌండ్‌వర్క్‌ను ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడ్డాక ప్రతిక్షణం విలువైనదే అన్న విషయాన్ని వారు ఎప్పటికప్పుడు గుర్తుంచుకొని పరీక్షలకు సిద్ధం కావాలి. అప్పుడే విజయం వరిస్తుంది. - పి.విశ్వప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ -
జాబ్స్@ 1319
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ కానున్నారుు. నూతన రాష్ట్రంలో తొలిసారి వెలువడనున్న నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15వేల పోస్టులను నోటిఫై చేయగా..జిల్లాలో సుమారు 1300 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం దక్కించుకోవడమే లక్ష్యంగా నిరుద్యోగ యువత స్వతహాగా ప్రిపేర్ కావడంతో పాటు రాజధానిలోని కోచింగ్ సెంటర్లకు పయనమయ్యారు. పథకాలు ఫలించాలంటే.. రెండు, మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వెలువడలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోస్టులను భర్తీ చేయకపోవడంతో జిల్లాలో పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తాయి. కీలకమైన రెవెన్యూ, విద్యాశాఖ, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో ఖాళీలు భారీగా ఉన్నారుు. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో శాఖలవారీగా ఎన్ని ఖాళీలున్నాయో ఇప్పటికే జిల్లా నుంచి సచివాలయానికి నివేదికలు అందాయి. ఉపాధ్యాయ, పోలీస్‌శాఖలో ఖాళీలను మినహాయిస్తే మొత్తంగా పలు ప్రధాన శాఖల్లో 1300 పోస్టులకు పైగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో గ్రూప్ -1 స్థాయి నుంచి గ్రూప్-4 వరకు పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం ఇటీవల వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, డబుల్బెడ్రూమ్, ఆసరా, షాదీముబారక్‌తోపాటు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల అమలుకు తగిన సిబ్బంది లేకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నారుు. ఈ పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు శీఘ్రమే ప్రజల దరికి చేరుతారుు. కీలకశాఖల్లో పోస్టులు ఖాళీ... జిల్లాలోని పలు కీలకశాఖల్లో పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. దళితులకు భూ పంపిణీ, వాటర్‌గ్రిడ్ పథకాల్లో రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఈ శాఖల్లోనే ఎక్కువగా ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. రెవెన్యూ శాఖలో తహశీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్, వీఆర్వోలు మొత్తంగా 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంతో గ్రామ రెవెన్యూ రికార్డులను సంస్కరించే వీలు కలుగుతుంది. అలాగే ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికి కుళాయి అని ఆర్భాటంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం సంబంధిత శాఖలో సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోంది. పంచాయతీరాజ్ శాఖలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు డబుల్‌రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి వెళ్లే హైవే రోడ్డును కలిపేందుకు నాలుగు లేన్ల రహదారి, ప్రతి పల్లెకు తారు రోడ్డును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ శాఖలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. జేఈలు, జేటీవోలు, ఇతర పోస్టులు మొత్తంగా 34 పోస్టులు భర్తీ చేయాలి. ఇక ట్రాన్స్‌కోలో 360, వ్యవసాయశాఖలో 65, ఇరిగేషన్, ఎన్ఎస్పీ పరిధిలో 35, విద్యాశాఖలో 104, ఖజానా శాఖలో 47, ఖమ్మం కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల్లో 100కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడంతో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. లక్ష్యం కోసం రాజధాని పయనం.. ఉపాధ్యాయుల భర్తీ ఇప్పట్లో లేకపోవడంతో బీఎడ్, పీజీ, డిగ్రీ పూర్తిచేసిన వారంతా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులను దక్కించుకునేందుకు ఇప్పటికే కుస్తీ ప్రారంభించారు. ఖమ్మంలో ప్రధాన పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు కిక్కిరిశాయి. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను భారీ ఎత్తున భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో గతంలో మిస్ అయిన అభ్యర్థులు, కొత్తవారు పోస్టులు దక్కించుకోవాలని ఉవ్విళూరుతున్నారు. వీరంతా ఖమ్మంతోపాటు రాజధానిలో ఒక్కో పోటీ పరీక్ష కోసం ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్న సెంటర్లలో రూ.వేలకువేలు ఫీజులు చెల్లించి ఉద్యోగార్జనే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నారు. దిల్సుఖ్నగర్, అమీర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పోటీపరీక్షల కేంద్రాలకు జిల్లా నుంచి ఇప్పటికే వందలాది మంది తరలివెళ్లారు. ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ తర్వాత మళ్లీ ఎప్పుడు ఖాళీలు భర్తీ చేస్తారోనని.. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అంతా ప్రభుత్వం ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
హైదరాబాద్ : నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నట్లు టెక్ మహీంద్రా ఫౌండేషన్ నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్‌మహీంద్రా ఫౌండేషన్ వారి సహకారంతో యుగాంతర్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన 18 నుంచి 27 సంవత్సరాలలోపు వయస్సు గల యువతి, యువకులకు మూడు నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి కోర్సులలో శిక్షణ అందించి శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూన్ 4వ తేదీ లోపు కూకట్పల్లి బస్టాప్ వద్ద గల శ్రీనివాస కాంప్లెక్స్‌లోని బాటాషోరూం పైన గల శిక్షణ శిబిరంలో గానీ, 8106630644 నెంబర్‌ను గానీ సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. -
మా అవకాశాలపై దెబ్బకొట్టారు: నిరుద్యోగులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం పలువురు నిరుద్యోగ యువతీ, యువకులు కలిశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడలేదని వారు ఈ సందర్భంగా ఆయనకు తెలిపారు. నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది వేచి చూస్తున్నా, ప్రభుత్వం నుంచి స్పందన లేదని వాపోయారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచి, తమ అవకాశాల మీద తీరని దెబ్బ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో వడివడిగా అడుగులు వేస్తున్నా, ఏపీ ప్రభుత్వంలో కనీస స్పందన లేదని నిరుద్యోగ యువతీ యువకులు చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని, ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పటికి తొమ్మిది నెలలైనా ఇప్పటికి కనీసం ఒక్క జాబు కూడా రాలేదని తెలిపారు. తమ సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిందిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరామని, నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ తమకు భరోసా ఇచ్చారని నిరుద్యోగులు చెప్పారు. -
ప్రి‘పరేషాన్’..
‘సిలబస్ మార్పు’ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల ‘సిలబస్ మార్పు’ అంశం అలజడి సృష్టిస్తోంది.. విద్యార్థులు, నిరుద్యోగుల్లో నిరాశను నింపుతోంది.. ఇప్పట్లో ఎలాంటి నోటిఫికేషన్లు ఉండవన్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటనతో లక్షలాది మంది నిరుద్యోగులు అయోమయంలో పడిపోయారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు అనుగుణంగా గ్రూప్ పరీక్షల సిలబస్ మార్చిన తరువాతే కొత్త నోటిఫికేషన్లు ఉంటాయనడంతో.. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులు, నిరుద్యోగులు గందరగోళంలో పడిపోయారు.. వేలకు వేలు చెల్లించి తీసుకుంటున్న కోచింగ్ వృథా అయిపోతుందేమోనని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ప్రస్తుతమున్న సిలబస్‌ల ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో అభ్యర్ధులు ఇటీవల భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. రాష్ట్రం వచ్చినా ఉద్యోగాలేవి..? అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతామని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడి, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించినా... ఇప్పుడు ఉద్యోగ నియామకాలపై మీనమేషాలు లెక్కిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వయోపరిమితి దాటేందుకు దగ్గరలో ఉన్న అభ్యర్థులు ఈ జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లోని కోచింగ్ కేంద్రాలు, ఉస్మానియా, కాకతీయ సహా విశ్వ విద్యాలయాల లైబ్రరీల్లో... ఇలా ఎక్కడ చూసినా వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం చదువుతూనే కనిపిస్తారు. ఇప్పటివరకు తాము కష్టపడి చదువుకున్న సిలబస్ అంతా పనికిరాకుండా పోతుందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. వేలకు వేలు పెట్టి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయన్న ఉద్దేశంతో లక్షలాది మంది కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు. వేల రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా నిరుద్యోగుల నుంచి డిమాండ్ వెల్లువెత్తడంతో.. కోచింగ్ సెంటర్లు నిండిపోయాయి. ఇది ఎంతగా పెరిగిపోయిందంటే.. తరగతి గదుల కొరత ఏర్పడి, ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాల్లో కోచింగ్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, వీఎస్టీ, రాంనగర్, దోమల్‌గూడ తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్‌హాళ్లు, ఆడిటోరియాలు అద్దెకు తీసుకొని శిక్షణ ఇస్తున్నారు. కోచింగ్‌కు ఫీజులు కూడా భారీగా పెంచారు. రూ. 10 వేలలోపు ఉన్న కోచింగ్ ఫీజులు.. రూ. 20 వేల వరకు పెరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ప్రారంభమైన గ్రూప్-1, 2, ఇతర పోటీ పరీక్షల కోచింగ్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. ఇలా వేలకు వేలు చెల్లించి లక్షలాది మంది అభ్యర్థులు కోచింగ్ పొందారు.. కానీ కొత్త నోటిఫికేషన్ల కోసం మరో ఆరు నెలలదాకా ఆగాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడడం, సిలబస్‌ను మార్చుతామని పేర్కొనడం.. ఇటు విద్యార్థులను, అటు కోచింగ్ కేంద్రాలను గందరగోళంలోకి నెట్టింది. భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు.. నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం పట్ల విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. లక్షలాది మంది యువత కొత్త రాష్ట్రంలో బంగారు భవితవ్యంపై కలలుగన్నారని... కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలు దాటిపోయినా ఉద్యోగాల భర్తీ ఊసెత్తకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఉన్నపళంగా మార్చితే ఎలా..? ‘చాలా కాలంగా గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాం.. ఉన్నపళంగా సిలబస్ మార్చితే ఎలా? ఇప్పటివరకు పడిన మా శ్రమ అంతా వృథా అయినట్లేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని సహించబోం. ఒక్క నోటిఫికేషన్ అయినా పాత సిలబస్ ప్రకారంగా ఇవ్వాలి.’ - వెంకట్, గ్రూప్స్ అభ్యర్థి వేలకు వేలు ఖర్చు చేశాం.. ‘గ్రూప్స్ పరీక్షల ప్రిపరేషన్ కోసం వేలకు వేలు ఖర్చు చేశాం. పుస్తకాలు, వివిధ మెటీరియల్‌ను కొనుగోలు చేసి.. రాత్రీపగలూ కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నాం. ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి కొత్తవి కొనుక్కోవాల్సిందేనా? మళ్లీ కొత్తగా కోచింగ్ తీసుకోవాలన్నా par కష్టమే.’ - శాంతి, గ్రూప్స్ అభ్యర్థిని వర్సిటీలకు అప్పగించండి.. ‘ఉద్యోగ పరీక్షల కోసం లక్షలాది మంది ఐదేళ్లుగా కష్టపడి చదువుతున్నారు. ఉద్యోగాల భర్తీ పరీక్షలను టీఎస్పీఎస్సీసీ ద్వారా కాకుండా వర్సిటీలకు అప్పగించాలి. కేసీఆర్ వైఖరిపై ఆందోళనలు చేపడతాం.’ - మానవతారాయ్, తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సిలబస్ మార్పు ఓ డ్రామా.. ‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వ చ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు కాలయాపన చేయడం సరికాదు. సిలబస్ మార్పు అనేది డ్రామా. ఎక్కడైనా సరే సిలబస్ మార్చాలంటే మూడేళ్ల ముందుగా కసరత్తు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం..’’ - ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
సింగపూర్ లో ఉద్యోగాల పేరిట మోసం
విశాఖపట్నం: సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ విశాఖపట్నంలో ఓ వ్యక్తి నిరుద్యోగులకు మోసం చేశాడు. శంకర్ దాస్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేసి అతడు పరారయ్యాడు. బాధితులు గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కొరి దగ్గర రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు బాధితులు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
యువశక్తికి భరోసా ఏది?
ఏలూరు :జిల్లాలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ఉద్దేశించిన సీఎంఈవై (చీఫ్ మినిస్టర్ ఎంపవర్మెంట్ ఇన్ యూత్) పథకం ఆచరణకు నోచుకునే పరిస్థితి కానరావడం లేదు. ఇప్పటికే ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయాయి. మిగిలిన ఐదు నెలల్లో పథకాన్ని యువత ముంగిటకు తీసుకువెళ్లే అవకాశాలు కానరావడం లేదు. దీంతో వారికి శిక్షణ ఇచ్చి చేతులు దులుపునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు యూనిట్ల స్థాపన లక్ష్యానికే ఆమోదముద్ర పడలేదు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఎన్నికల్లో యువతను నమ్మించిన చంద్రబాబు ప్రభుత్వం యువశక్తికి జీవితంపై భరోసా కల్పించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2013-14 వరకు రాజీవ్ యువ శక్తి పథకంగా ఉన్న దాన్ని సీఎంఈవైగా టీడీపీ సర్కారు మార్పు చేసింది. అయితే సెట్వెల్ అధికారులు మాత్రం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 520 యూనిట్లను స్థాపించేందుకు లక్ష్యంగా నిర్ణయించి రూ.5.20 కోట్ల రుణ లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. దీంతో సెట్వెల్ అధికారులు గోళ్లు గిల్లుకుంటున్నారు. యూనిట్లు, గైడ్‌లైన్స్ మార్పు జరిగేనా? వస్తు స్థాపనకు అనుగుణంగా ఉన్న పరిశ్రమలు, సేవారంగానికి చెందిన యూనిట్లకు మాత్రమే ఆర్థిక సహాయం ఇవ్వడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఇందులో సిమెంట్, ఇటుకల తయారీ, వెల్డింగ్ వర్క్స్, లేస్ తయారీ, బెల్లం, టెంట్ హౌస్, కంప్యూటర్ సెంటర్, ఆటోజిరాక్సు, సెల్పాయింట్లను పెట్టాలే తప్ప మిగతావి నస్థాపించడానికి వీల్లేదు. దీంతో నిరుద్యోగులకు ఈ యూనిట్లు అందని ద్రాక్షగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాగా టీడీపీ సర్కార్ గైడ్లెన్స్ మార్చాలని యోచిస్తున్నట్టు సమాచారం. అది జరిగితే యూనిట్ వ్యయం పెరుగుతుందా? సబ్సిడీ మొత్తం పెరుగుతుందా? అనేది ఇప్పడేమీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. గత ఏడాది లక్ష్యంలోను ఇంకా 100 మందికి రుణం అందించాల్సి ఉన్నట్టు సమాచారం. అప్పట్లో ఎన్నికల హడావుడిలో 404 యూనిట్లు లక్ష్యం కాగా 467 యూనిట్లును అధికారులు గ్రౌండింగ్ చేశారు. ఇందులో 367 యూనిట్లకే రూ.3.17 కోట్ల రుణం ఇచ్చారు. మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానించాం జిల్లాలో యువతీ యువకులకు 45 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానించాం. డిసెంబర్ 8వ తేదీ వరకు గడువు ఉంది. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలకు టైలరింగ్, బ్యూటీషీయన్ కోర్సుల్లోను, పురుషులకు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విభాగాల్లో శిక్షణను హైదరాబాద్‌లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. శిక్షణకు ఎంతమందినైనా అక్కడకు పంపించే వీలుంది. దరఖాస్తు గడువును నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. సీఎంఈవై పథకం అమలుకు మార్గదర్శకాలు రాగానే వాటిని స్థాపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. - పి.సుబ్బారావు, సెట్వెల్ సీఈవో -
ఘరానా మోసగాడికి రెడ్ కార్నర్ నోటీసులు!
అనంతపురం:యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన అంజాద్ పర్వేద్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ఘరానా మోసగాడు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నిరుద్యోగుల నుంచి రూ.30 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంజాద్ పర్వేద్ అనే ఉద్యోగి కొంతమంది యువతకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు.