సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ కానున్నారుు. నూతన రాష్ట్రంలో తొలిసారి వెలువడనున్న నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15వేల పోస్టులను నోటిఫై చేయగా..జిల్లాలో సుమారు 1300 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం దక్కించుకోవడమే లక్ష్యంగా నిరుద్యోగ యువత స్వతహాగా ప్రిపేర్ కావడంతో పాటు రాజధానిలోని కోచింగ్ సెంటర్లకు పయనమయ్యారు.
పథకాలు ఫలించాలంటే..
రెండు, మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వెలువడలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోస్టులను భర్తీ చేయకపోవడంతో జిల్లాలో పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తాయి. కీలకమైన రెవెన్యూ, విద్యాశాఖ, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో ఖాళీలు భారీగా ఉన్నారుు. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో శాఖలవారీగా ఎన్ని ఖాళీలున్నాయో ఇప్పటికే జిల్లా నుంచి సచివాలయానికి నివేదికలు అందాయి. ఉపాధ్యాయ, పోలీస్‌శాఖలో ఖాళీలను మినహాయిస్తే మొత్తంగా పలు ప్రధాన శాఖల్లో 1300 పోస్టులకు పైగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
ఇందులో గ్రూప్ -1 స్థాయి నుంచి గ్రూప్-4 వరకు పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం ఇటీవల వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, డబుల్‌బెడ్‌రూమ్, ఆసరా, షాదీముబారక్‌తోపాటు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల అమలుకు తగిన సిబ్బంది లేకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నారుు. ఈ పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు శీఘ్రమే ప్రజల దరికి చేరుతారుు.
కీలకశాఖల్లో పోస్టులు ఖాళీ...
జిల్లాలోని పలు కీలకశాఖల్లో పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. దళితులకు భూ పంపిణీ, వాటర్‌గ్రిడ్ పథకాల్లో రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఈ శాఖల్లోనే ఎక్కువగా ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. రెవెన్యూ శాఖలో తహశీల్దార్‌లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్, వీఆర్‌వోలు మొత్తంగా 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంతో గ్రామ రెవెన్యూ రికార్డులను సంస్కరించే వీలు కలుగుతుంది. అలాగే ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికి కుళాయి అని ఆర్భాటంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం సంబంధిత శాఖలో సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
పంచాయతీరాజ్ శాఖలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు డబుల్‌రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి వెళ్లే హైవే రోడ్డును కలిపేందుకు నాలుగు లేన్ల రహదారి, ప్రతి పల్లెకు తారు రోడ్డును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ శాఖలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. జేఈలు, జేటీవోలు, ఇతర పోస్టులు మొత్తంగా 34 పోస్టులు భర్తీ చేయాలి. ఇక ట్రాన్స్‌కోలో 360, వ్యవసాయశాఖలో 65, ఇరిగేషన్, ఎన్‌ఎస్‌పీ పరిధిలో 35, విద్యాశాఖలో 104, ఖజానా శాఖలో 47, ఖమ్మం కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల్లో 100కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడంతో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
లక్ష్యం కోసం రాజధాని పయనం..
ఉపాధ్యాయుల భర్తీ ఇప్పట్లో లేకపోవడంతో బీఎడ్, పీజీ, డిగ్రీ పూర్తిచేసిన వారంతా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులను దక్కించుకునేందుకు ఇప్పటికే కుస్తీ ప్రారంభించారు. ఖమ్మంలో ప్రధాన పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు కిక్కిరిశాయి. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను భారీ ఎత్తున భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో గతంలో మిస్ అయిన అభ్యర్థులు, కొత్తవారు పోస్టులు దక్కించుకోవాలని ఉవ్విళూరుతున్నారు.
వీరంతా ఖమ్మంతోపాటు రాజధానిలో ఒక్కో పోటీ పరీక్ష కోసం ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్న సెంటర్లలో రూ.వేలకువేలు ఫీజులు చెల్లించి ఉద్యోగార్జనే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పోటీపరీక్షల కేంద్రాలకు జిల్లా నుంచి ఇప్పటికే వందలాది మంది తరలివెళ్లారు. ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ తర్వాత మళ్లీ ఎప్పుడు ఖాళీలు భర్తీ చేస్తారోనని.. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అంతా ప్రభుత్వం ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
జాబ్స్@ 1319
Published Fri, Jul 31 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement
Advertisement