డిగ్రీ ఐదో దశ కౌన్సెలింగ్‌లో చేరిన వారికి ‘నో’
సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యా శాఖ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరిన దాదాపు 4 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకుండాపోయే ప్రమాదం నెలకొంది. ఇటీవల నిర్వహించిన ఐదో దశ కౌన్సెలింగ్‌లో డిగ్రీలో సీట్లు పొందిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వబోమని ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. విద్యాశాఖ స్వయంగా నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల కోసం దాదాపు 5,200 మంది కొత్త విద్యార్థులు ఐదో దశలో రిజిస్టర్ చేసుకోగా, అందులో 3,780 మంది కాలేజీల్లో చేరారు.
అంతేకాకుండా ఆన్‌లైన్ ప్రవేశాల్లో ఇంకా సీట్లు రాని విద్యార్థులు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటే సీట్లు కేటాయిస్తామని కళాశాల విద్యాశాఖ ప్రకటించింది. దీంతో మరికొందరు సీట్లు పొందే అవకాశం ఉంది. డిగ్రీలో చేరే వారంతా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువగా ఉంటారని.. అలాంటి తమకు ఫీజు ఇవ్వబోమని ప్రభుత్వ వర్గాలు పేర్కొనడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. పైగా కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపట్టిన 42 ప్రైవేట్ కాలేజీల్లో చేరిన 21 వేల మంది విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేసేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం తమ విషయంలో ఎందుకు వివక్ష చూపుతోందని అంటున్నారు.
4 వేల మంది ‘ఫీజు’కు దూరం!
Published Tue, Sep 27 2016 1:16 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Advertisement