Fee reimbursement scheme
-
ఈనెల 27న కరెంటు ఛార్జీల పెంపుపై నిరసనలు: వైఎస్ జగన్
-
కనీసం వెయ్యి కోట్లయినా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,020 కోట్ల మేర పేరుకు పోయాయని, అందులో కనీసం రూ.1,000 కోట్లయినా విడుదల చేయాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని మంగళవారం జీరో అవర్ సందర్భంగా ఆయన అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. విదేశీ విద్యానిధి పథకం కింద విద్యార్థికి రూ.20 లక్షలు మంజూరు చేసేందుకు రూ.5 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఏపీ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు. ఉస్మానియా తరలింపు ఆపండి: రాజాసింగ్ ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రతిపాదనను రద్దు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. గోషామహల్లో ఆస్పత్రి కడితే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ఉస్మానియా వెనుకవైపు ఉన్న విశాలమైన స్థలంలో కొత్త నిర్మాణం జరపాలని సూచించారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కారి్మకులకు కనీస వేతనాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ కోరారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద హుజూరాబాద్‌లో 5 వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన రెండోవిడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. -
ఫీజు బకాయిలు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు
గుడివాడ టౌన్: ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ వీకేఆర్, వీఎన్‌బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదివే సుమారు 275 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉంది. అందులో కొంతమంది ఏదోవిధంగా ఫీజు బకాయిలు చెల్లించగా.. 30 మందికి పైగా చెల్లించలేకపోయారు. దీంతో వారికి హాల్ టికెట్ ఇచ్చేది లేదని సోమవారం యాజమాన్యం బయటకు పంపేసింది. వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో స్పందించిన ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా నిర్ణీత సమయంలోగా బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులతో హామీ పత్రాలు రాయించుకుని హాల్ టికెట్లు ఇచ్చారు. -
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కార్
-
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లించక పోవడంతో విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక.. పనులకు వెళుతున్న ఓ విద్యార్థి దీనావస్థ నాకు వేదన కలిగించింది.విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. తక్షణమే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంటుతోపాటు వసతి దీవెన డబ్బులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదని, చదువు పూర్తి చేసిన వారు బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని తెలిపారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించక పోవడంతో వారు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు.2 చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యా రంగాన్ని దారుణంగా దెబ్బ తీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు–నేడు.. ఇలా అన్నింటినీ రద్దు చేసి, 1–12 వ తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దెబ్బ తీశారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి.. డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారినీ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.3 వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదు జమ చేసే వాళ్లం. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకు రూ.12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేశాం. తల రాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్సార్సీపీ హయాంలో ఈ రెండు (విద్యా దీవెన, వసతి దీవెన) పథకాలకే రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు చేశాం.4 ఎన్నికల కోడ్ కారణంగా జనవరి–మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పారీ్టల వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ, ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. అప్పటి నుంచి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్–జూన్, జూలై–సెపె్టంబర్ త్రైమాసికాలకు సంబంధించి ఫీజుల చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడటం లేదు. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కూడా సగం గడిచి పోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరు చూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి.. కాళ్లేమో గడప కూడా దాటడం లేదు.5 ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు. చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీ లేని వారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇలా ఉన్నాయి.6 కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టడాలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధ లేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. -
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: YS జగన్ ట్వీట్
-
పరీక్షల వేళ.. ఫీజుల పేచీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ.. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి. పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు. బకాయిలు చెల్లించాలి గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం. – డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోతే!
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల ఉన్నత విద్యకు టీడీపీ కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటనెన్స్ చార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. దీంతో సుమారు ఏటా 12 లక్షల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆరి్థకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏటా పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఫీజు రీయింబర్స్మెంట్) కోసం సుమారు రూ.2,700 కోట్ల నుంచి రూ.2,800 కోట్లు వ్యయమవుతుంది. ఇందులో హాస్టల్ విద్యార్థులకు మెయింటెనెన్స్ చార్జీల కింద సుమారు రూ.1,100 కోట్లు వెచ్చించాలి. కానీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన ఐదునెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులకు తీవ్ర నిరాశను మిగిలి్చంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,766.77 కోట్లు, పోస్టు మెట్రిక్ స్కాలర్íÙప్ (మెయింటెనెన్స్–ఎంటీఎఫ్) కింద రూ.776.18 కోట్లు కలిపి మొత్తం రూ.2,542.95 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటానే 75 శాతంగా ఉంటోంది. దీనితో పాటు ప్రధానమంత్రి యశస్వీ పథకం కింద మరో రూ.356 కోట్లను కూడా పోస్టు మెట్రిక్ స్కాలర్íÙప్స్ కేటాయింపుల్లో కలిపేసింది. ఇక ఆ చెల్లింపులు ప్రశ్నార్థకమే.. ఇక గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలను ప్రభుత్వం నిలిపివేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు ఆపేసింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ చార్జీలు కలుపుకుని రూ.2,500 కోట్లు ఉంటే.. ప్రస్తుత బడ్జెట్ అంతకంటే తక్కువగా ఉండటం గమనార్హం! -
ఫీజు పైసల్... ముందే వసూల్ !
సాయివర్ధన్ (పేరుమార్చాం) పాలీసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లా మీర్పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్నాడు. కాలేజీలో రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన ఆ విద్యార్థికి యాజమాన్యం షాక్ ఇచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, ట్యూషన్ ఫీజు చెల్లించాలని, లేకుంటే అడ్మిషన్ ఇవ్వలేమని తెలియచెప్పింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలైన తర్వాత, ఆ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో రూ.52 వేల రూపాయలు చెల్లించి అడ్మిషన్ పొందాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన టి.మానస (పేరుమార్చాం) డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సు పూర్తి చేసింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, యాజమాన్య ఒత్తిడితో ఫీజు చెల్లించింది. ఏడాది క్రితం కోర్సు పూర్తి కావడంతో ఒరిజినల్ సరి్టఫికెట్ల కోసం కాలేజీకి వెళితే ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పారు. దీంతో మళ్లీ డబ్బు కట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.46 వేలు ఇప్పటికీ అందలేదు.సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఆర్థికభారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. దీని కింద అర్హత సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా కాలేజీలో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేయొచ్చు. కానీ ప్రస్తుతం కాలేజీల్లో పరిస్థితి తారుమారైంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద అర్హత సాధించినా సరే... అడ్మిషన్ సమయంలో ట్యూషన్ ఫీజు పూర్తిగా చెల్లించాల్సిందే.సీనియర్ విద్యార్థులయితే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లించాలి. ప్రభుత్వం రీయింబర్స్ నిధులు కాలేజీకి విడుదల చేసినప్పుడు... సదరు విద్యార్థుల బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయడమో... లేక చెక్కు రూపంలో విద్యారి్థకి అందిస్తామంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యాకాలేజీలు ఇదే తరహా ముందస్తుగా ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. ఉచితంగా ఉన్నత చదువులు చదవాలనుకున్న విద్యార్థులకు తాజా పరిస్థితులు సంకటంగా మారాయి. ఏటా 12లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో 5,539 పోస్టుమెట్రిక్ కాలేజీలున్నాయి. ఇందులో 2,641 జూనియర్ కాలేజీలు, 1,514 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. 235 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు కాగా, 217 పారా మెడికల్ కాలేజీలున్నాయి. ఇతర వృత్తివిద్యా కేటగిరీల్లో మిగిలిన కాలేజీలున్నాయి. వీటి పరిధిలోని 12 లక్షల మంది విద్యార్థులు ఏటా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ముందస్తు వసూళ్లకు దూరంగా ఉంటున్నా, వృత్తి విద్యా కళాశాలలు మాత్రం అడ్మిషన్ల సమయంలోనే ఫీజులు వసూలు చేస్తున్నాయి. ,ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కనీసం కాలేజీలకు వెళ్లి ఫీజులపై తనిఖీలు కూడా చేయడం లేదు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాంఫీజు రీయింబర్స్మెంట్ నిధుల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.1,550 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు చెల్లిపులు చేస్తున్నాం. మా కార్యాలయానికి విద్యార్థులు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి ముందస్తు ఫీజు వసూలపై సంక్షేమ శాఖల అధికారులు సీరియస్‌గా పరిగణించాలి. కాలేజీల వారీగా విచారణ చేపట్టాలి. అలా వసూళ్లకు పాల్పడిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులెవరూ ముందస్తుగా ఫీజులు చెల్లించొద్దు. – ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ పరిస్థితి ఫీజు రీయింబర్స్ నిధులు విడుదల చేయకపోవడంతోనే యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో ఫీజు నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. – కందడి శ్రీరామ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు -
AP: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం.. aకదం తొక్కిన విద్యార్థి లోకం
అనంతపురం అర్బన్/తిరుపతి అర్బన్/పార్వతీపురం టౌన్/సాక్షి, అమరావతి: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున బుధవారం ఉద్యమించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ల మందు ర్యాలీ చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, వర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని..ఇలా సమస్యలను ప్రస్తావిస్తూ...వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.విద్యార్థులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. అనంతపురంలోని కేఎస్ఆర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అ«ధ్యక్షుడు ప్రసన్న ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి నోటీసులిచ్చి పంపించారు. విద్యార్థులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ఫీజుల కోసం విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తిరుపతిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. డిగ్రీలో మేజర్, మైనర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77ను రద్దు చేయా లని డిమాండ్ చేశారు. తల్లికి వందనం కింద రూ.15,000ను ఈ ఏడాది నుంచే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌కు వినతిపత్రాన్ని అందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించాలని కోరుతూ ఆర్టీసీ కాంపెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. సమస్యల పరిష్కారంపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రసన్నకుమార్, కార్యదర్శి ఎ.అశోక్ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
తెలంగాణ: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఇవాళ్లి నుంచి ప్రైవేటు డిగ్రీ , పీజీ కళాశాలలు బంద్ చేసినట్లు యజమానులు తెలిపారు. కళాశాలు నడిపే పరిస్థితి లేక మూసివేస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే కాలేజీల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నలగొండ జిల్లాలో డిగ్రీ, పీజీ కాలేజీలను యజమానులు మూసివేశారు. కళాశాలల యజమానులు నిరవధిక బంద్ నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.120కోట్ల బకాయిలు ఉన్నాయని యజమానులు చెబుతున్నారు.ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కళాశాల అసోసియేషన్ ఇవాళ్టి నుంచి బంద్ పాటిస్తోంది. కాలేజీల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. మూడేళ్లుగా రూ.2400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని యజమానలు తెలిపారు. -
మీ గొంతు మూగబోయిందా లోకేశ్?
నెల్లూరు(టౌన్): ‘ఫీజు రీయింబర్స్మెంట్ గురించి యువగళంలో మాట్లాడిన మీ గొంతు మంత్రి పదవి రాగానే మూగబోయిందా లోకేశ్..’ అని ఏబీవీపీ నాయకులు ప్రశి్నంచారు. ‘యువగళంలో మాట్లాడిన నోరు మంత్రి పదవి రాగానే మూగబోయిందా..’ అనే బ్యానర్ చేతపట్టుకుని ఏబీవీపీ నాయకులు సోమవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనీ్వనర్ రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచి్చన వెంటనే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని లోకేశ్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని చెప్పారు.ఫీజు రీయింబర్స్మెంట్ లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించాలని, లేకపోతే ఎక్కడికక్కడ ఆయన పర్యటనలను అడ్డుకుంటామని, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చి పక్కన పడేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సమీర్, సుమన్, రాబర్ట్, వినోద్, హేమంత్, సుకుమార్, నవీన్ పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
-
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అనుమానం వద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. రకరకాల పరిస్థితుల్లో ప్రాధాన్యతలు మారి.. ఫీజు రీయింర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నాం. ఈ అకాడామిక్ ఇయర్ నుంచి ఆన్‌టైమ్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్రిముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృషించినవే. మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవే. ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి. అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాదు.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజనీరింగ్ సంస్థలు ఉండాలి. ఇంజనీరింగ్‌లో కేవలం కంప్యూటర్ సైన్స్‌పైనే కాదు.. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోంది. ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది. యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోంది. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడింది. కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను తీసుకురాబోతున్నాం. యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానం. మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆర్ధిక భారం, ఇతర సమస్యలు ఉన్నా.. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎసరు
సాక్షి, అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు చూద్దామంటే కుదరదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశ పడొద్దు. అప్పో.. సప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు...’ ఇదీ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి! ‘‘గత ఐదేళ్లు మా పిల్లల చదువులు సాఫీగా సాగిపోయాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద ఫీజులతోపాటు ఏడాదికి హాస్టల్, మెస్ ఖర్చులు వసతి దీవెనతో మా ఖాతాల్లో పడేవి. వెంటనే మేం కళాశాలలకు చెల్లించేవాళ్లం. మా పిల్లలకు సరిగా చదువు చెప్పకున్నా, హాస్టల్ బాగోలేకున్నా గట్టిగా ప్రశ్నించే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన దుస్థితి తప్పదని భయమేస్తోంది’’ తల్లిదండ్రులు ఆవేదన ఇది!పేర్ల మార్చడంలో ఉత్సాహం అమలులో ఏది?రాష్ట్రంలో ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యా రంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు బకాయిలు ఇంతవరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడం, కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆదుర్దా చెందుతున్నారు. ఏ కళాశాలలో చూసినా ఫీజుల గోలే వినిపిస్తోంది. ఇంతకాలం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో(వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు ఊసే విస్మరించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్)గా మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్–మెస్ చార్జీల విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిర్ణీత షెడ్యూళ్ల ప్రకారం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు రూ.1,300 కోట్లు, హాస్టల్–మెస్ చార్జీల కింద ఏడాది చివరిలో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.విద్యార్థుల్లో ‘ఫీజుల’ కలవరంప్రతి పేదింటి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోనే నేరుగా ఫీజుల మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. వారి ద్వారా ఫీజులు చెల్లిస్తుండంతో యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత అనుమతి లభించగా కొంత మంది ఖాతాల్లో నగదు జమైంది. ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేశారు. ఇంకా రూ.605 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విద్యార్థులను కలవరపెడుతోంది. పైగా జూన్‌లో మూడో విడత(జనవరి–మార్చి) కింద సుమారు రూ.700 కోట్లు ఫీజుల కింద విడుదల చేయాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గత సర్కారు తెచ్చిన పథకాలకు కొత్త ప్రభుత్వం మంగళం పాడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.చదువులపై బాధ్యత లేదా?పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉజ్వల బాటలు వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. వీటి చెల్లింపుల్లో నాటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిల మొత్తాన్ని చెల్లించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది.చెల్లింపులపై దుష్ప్రచారం..ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ విద్యార్థులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ హయాంలో 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ట్యూషన్ ఫీజులు చెల్లించారు. 25.17 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద హాస్టల్–మెస్ చార్జీల కోసం మరో రూ.4,275.76 కోట్లు అందచేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా దీవెన, వసతి దీవెనల కింద దాదాపు రూ.18,663 కోట్లకుపైగా (పాత బకాయిలతో కలిపి) వెచ్చించారు. ఎన్నికలకు ముందు షెడ్యూల్ ఇచ్చి మరీ నిధులు విడుదల చేసినా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుట్రలు చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో నిధుల విడుదలకు ఒక రోజు సమయం (పోలింగ్‌కు ముందు) ఇచ్చింది. దీనిపైనా మరోసారి టీడీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణ జరిగేలోపే ఆ ఒక్కరోజు సమయం కాస్తా గడిచిపోయింది. ఫలితంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అనంతరం కొంత మంది ఖాతాల్లో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ జమైంది. మిగిలిన మొత్తంతో పాటు జూన్‌లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన మొత్తాన్ని చెల్లించే విషయంపై కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోగా గత ప్రభుత్వంపై నెపం వేసే యత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,300 కోట్లు, వసతి దీవెనతో రూ.1,100 కోట్లు చెల్లించకుండా దుష్ప్రచారం చేస్తూ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే విద్యార్థుల కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకుపోయి చదువులు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధివసతి ఖర్చులకు సంబంధించి 2014–19 మధ్య రూ.4 వేల నుంచి రూ.10 వేల స్లాబ్ పెట్టి ఇవ్వగా వైఎస్ జగన్ ఆ విధానాన్ని తొలగించి వసతి దీవెన ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సమానంగా ఆర్థిక సాయం అందించారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2 లక్షలు పరిమితి ఉండగా అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. ఉన్నత విద్యకు అడ్డంకి.. తిరుపతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తయ్యింది. రెండేళ్లుగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన టైమ్ టూ టైమ్ మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. దీంతో సకాలంలో కాలేజీ ఫీజులు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నగదు జమ చేయలేదు. సరి్టఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని యాజమాన్యం చెబుతోంది. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి లోకేశ్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. – పి.శేఖర్, తిరుపతి -
నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ
సాక్షి, అమరావతి/పామర్రు : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. నేడు పామర్రుకు సీఎం వైఎస్ జగన్ రాక.. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న సభాస్థలిని గురువారం మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. శుక్రవారం ఉ.10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మ.1.55కు తాడేపల్లి చేరుకుంటారు. -
నేడు జగనన్న విద్యా దీవెన
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ముందెన్నడూ లేనివిధంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
అక్షరానికి అగ్రపీఠం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగాన్ని అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ విద్యా రంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ప్రక్షాళన చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంచలనాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా రంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యా రంగానికి తనదైన శైలిలో ఊపిరిలూది ప్రగతి బాట పట్టించారు. ఇంటాబయటా వెల్లువెత్తుతున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. దాదాపు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో విద్యా సంస్కరణలకే ఏకంగా రూ. 66,722.36 కోట్లు వ్యయం చేశారు. నాడు–నేడుతో పాఠశాలల్లో కొత్త భవనాలు, తరగతి గదులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ, డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ సదుపాయంతో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, తదితరాలను ఏర్పాటు చేశారు. నవశకానికి నాంది.. ♦ 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం. ♦ ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్ కేటాయింపు ♦ టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన ఖర్చు రూ.450 కోట్లు మాత్రమే. ♦ 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి. ♦ ఈ ఏడాది ముగిసిన ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ♦ నాడు నేడులో తొలి విడత కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15,713 పాఠశాలలను రూ.3,669 కోట్లతో సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. రెండో విడత కింద రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ♦ 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల చొప్పున జమ. ♦ పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సత్కారం. ♦ 10 మంది పేద ప్రతిభావంతులైన విద్యార్థులను అమెరికా సందర్శించే అవకాశం. ♦ 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 47 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.15,762 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ. 11,317 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద మరో రూ. 4,267 కోట్లు చెల్లించింది. ♦ ప్రైవేటు వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ కోర్సుల్లో 35 శాతం సీట్లలో రిజర్వేషన్ కోటా అమలు. ♦ గత నాలుగున్నరేళ్లల్లో 1,925 మంది విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థికంగా అండ. ♦ నైపుణ్య వర్సిటీ, ప్రత్యేక శిక్షణ సంస్థల ఏర్పాటుతోపాటు ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు 2021–22 బడ్జెట్లో రూ.774.01 కోట్లు ఖర్చుచేయగా 2022–23 బడ్జెట్లో రూ.969.91 కోట్లు కేటాయించారు. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం.. ఎడ్యుస్కిల్, సేల్స్‌ఫోర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్య కోర్సులు పూర్తి చేశారు. ఒక రాష్ట్రంలో 1.64 లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వం ఏపీనే కావడం విశేషం. దీంతో 2018–19లో క్యాంపస్ ఎంపికల్లో 37 వేల మంది ఉద్యోగాలు పొందితే, 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇక 2022–23లో 1.20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. దేశ సగటు కంటే మెరుగ్గా జీఈఆర్.. ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుండడంతో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో మన రాష్ట్రం దేశ సగటుకంటే చాలా ముందుంది. 2019–20లో ఇండియా సగటు 27.1 శాతం ఉంటే.. రాష్ట్రంలో 35.2 శాతం, 2020–21లో దేశ సగటు 27.3 శాతం ఉంటే రాష్ట్రంలో 37.2 శాతం జీఈఆర్ నమోదు కావడం విశేషం. మరోవైపు కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిబంధనలు కూడా విద్యా అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆడపిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. -
‘దీవెన’తో దిమ్మతిరిగి..
సాక్షి, అమరావతి : ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు దుష్ప్రచారం చేయడంలో గోబెల్‌ను సైతం రాజగురువు రామోజీరావు మించిపోయారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలనే లక్ష్యంగా చేసుకుని తన విషపుత్రిక ఈనాడులో అబద్ధాలను అదేపనిగా అబద్ధాలను ప్రజలపై రుద్దేందుకు ఎల్లో మీడియా గత ఐదేళ్లుగా తెగ ప్రయాసపడుతోంది. ఇప్పుడు ఎంతో సమున్నతంగా ఉన్న ప్రభుత్వ విద్యా రంగంపై నిస్సిగ్గుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా అసత్యాలను వండివారుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ‘దీవెనే శాపమైన వేళ..’ అంటూ విద్యాదీవెన పథకంపై తన అక్కసునంతా రంగరించి ప్రదర్శించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ఉన్నతాశయంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వం జమచేస్తోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే.. అమల్లోగాని, నిధుల విడుదలలో గాని, లబ్ధిపొందుతున్న విద్యార్థుల సంఖ్యలోగాని ఈ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు నూటికి నూరుశాతం విద్యాదీవెన ద్వారా మేలు జరుగుతోంది. అపరిమితంగా ఫీజు రీయింబర్స్మెంట్.. ఇక పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితీలేదు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందినీ చదివించవచ్చు. ఫీజు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3.05 లక్షల వరకూ రీయింబర్స్మెంట్ చేస్తోంది. గత ప్రభుత్వం ఏడాదికి ఇంజినీరింగ్ కోర్సులకు గరిష్టంగా రూ.35 వేలు, ఫార్మాకు రూ.68 వేలు మాత్రమే చెల్లించింది. అలాగే, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనే కాదు, ఎందులోనూ సంతృప్తస్థాయి అన్నమాటే లేదు. ఇక ప్రభుత్వం ఫీజులు ఇచ్చేవరకూ వేచి చూడకుండా పిల్లల తల్లులు కట్టాలంటూ కొన్ని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయంటూ ఈనాడు వక్రీకరణకు దిగింది. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బును జమచేసిన తర్వాత వారంలోగా ఆ మొత్తాన్ని కాలేజీలకు చెల్లించాలి. మూడు వారాల్లోగా చెల్లించకుంటే కాలేజీలు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాయి. దాంతో తదుపరి విడత ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును నేరుగా కాలేజీ ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. దీంతో తల్లితండ్రులపై కాలేజీలు ఒత్తిడి తీసుకువచ్చే ఆస్కారమే లేదు. అలాగే, ఫీజు చెల్లించేంత వరకూ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఈనాడు చెప్పిందీ అబద్ధమే. ఇలా చేయడానికి కాలేజీలకు ఎలాంటి అధికారంలేదు. వివక్ష లేకుండా వసతి దీవెన.. ఇదేకాక.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందిస్తోంది. గత ప్రభుత్వంలో అయితే కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 మాత్రమే ఇచ్చేవారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలకు వార్షికాదాయాన్ని రూ.2 లక్షలు, ఇతర వర్గాలకు రూ.లక్ష పరిమితి పెడితే, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా అర్హులైన అందరికీ వసతి దీవెన అమలుచేస్తోంది. వసతి దీవెన డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే జమచేస్తోంది. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం చెల్లింపు.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు పాలైనా, ఇవ్వాల్సిన అరకొర ఫీజులను ఇవ్వకుండా బకాయి పెట్టినా.. ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఏనాడూ రామోజీ తన ఈనాడులో ఒక్క కథనాన్ని కూడా ప్రచురించలేదు. కానీ, ఈ ప్రభుత్వం ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ఫీజులు చెల్లించడంతో పాటు, 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సైతం చెల్లించింది. అంతేకాక.. సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తూ పేద విద్యార్థులకు అండగా నిలిచింది. పైగా దేశంలో నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఒక్కటే. అయినా, ఇదేమీ పట్టని రామోజీ మాత్రం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. నిజానికి.. టీడీపీ పాలన ఐదేళ్లలో చెల్లించిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు సగటున ఏడాదికి రూ.2,428 కోట్లు అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా చెల్లిస్తున్న సగటు మొత్తం రూ.4,044 కోట్లు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.10,332 కోట్లు వెచ్చిస్తే.. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.15,592.87 కోట్లు ఖర్చుచేసింది. 26.98 లక్షల మందికి విద్యాదీవెన కింద రూ.11,317.11 కోట్లు.. 25.17 లక్షల మందికి వసతి దీవెన కింద మరో రూ.4,275.76 కోట్లు చెల్లించింది. ♦ 2022 అక్టోబరు–డిసెంబరు కాలానికి చెల్లించాల్సిన రూ.698.68 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే చెల్లించింది. ♦ జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి రూ.702.99 కోట్లను ఈ ఏడాది మే 24న చెల్లించింది. ♦ ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికం మొత్తాన్ని ఆగస్టులో చెల్లించింది. ♦ ఇప్పుడు జూలై–సెప్టెంబరు త్రైమాసికం సొమ్ము చెల్లింపు తుపాను కారణంగా వాయిదాపడింది. ఇది ఈనెల 29న భీమవరంలో జరిగే కార్యక్రమంలో 26.98 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన, 25.17 లక్షల మందికి జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఇంత ఠంఛనుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు చెల్లింపులు చేస్తుంటే రామోజీకి దిమ్మతిరిగిపోతోంది. దీంతో విద్యార్థులకు నష్టం జరిగిపోతోందంటూ ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది. -
నత్తనడకన ఉపకార దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియకు స్పందన కరువైంది. ఈ పథకాల కింద దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం పావువంతు మంది విద్యార్థులు కూడా ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలుస్తోంది. కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులు ఏటా క్రమం తప్పకుండా ఈ దరఖాస్తులు సమర్పించడం తప్పనిసరి.. కాలేజీ యాజమాన్యం సైతం చొరవ తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 12.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. కానీ ఇప్పటివరకు 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారిక అంచనాతో పోలిస్తే 20 శాతం మాత్రమే దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. వచ్చే నెలాఖరుతో ముగియనున్న గడువు..: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగియనుంది. దరఖాస్తు ప్రారంభ సమయంలోనే నాలుగు నెలల పాటు గడువు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. ఈమేరకు కాలేజీ యాజమాన్యాలకు సర్క్యులర్లు సైతం జారీ చేసింది. విద్యార్థులు ఈపాస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చొరవ తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో కాలేజీ యాజమాన్యాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఒక విద్యార్థి కోర్సు ముగిసే వరకు ప్రతి సంవత్సరం ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్తగా కోర్సులో చేరే విద్యార్థి ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. ఇప్పటికే కోర్సులో చేరి తదుపరి సంవత్సరం చదివే విద్యార్థి రెన్యువల్ కేటగిరీలో దరఖాస్తు సమర్పించాలి. విద్యార్థి వివరాలు కాలేజీ యాజమాన్యం వద్ద అందుబాటులో ఉండడంతో యాజమాన్యమే ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి దరఖాస్తు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవచ్చు. కానీ యాజమాన్యాలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తు ప్రక్రి య నెమ్మదిగా సాగుతోంది. గతేడాది దరఖాస్తు ప్రక్రియను దాదాపు ఏడు నెలల పాటు కొనసాగించారు. గడువు ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా ల కోరిక మేరకు ప్రభుత్వం గత ఏడాది మూడు సార్లు గడువును పొడిగించింది. కానీ ఈ ఏడాది పొడిగింపు ప్రక్రియ ఉండదని, నిర్దేశించిన సమయానికి దరఖాస్తు సమర్పించాలని సూచించినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మరో నెలన్నరలో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను గడువులోగా పూర్తి చే యాలంటూ తాజాగా జిల్లాస్థాయిలో సంక్షేమ శాఖల అధికారులు కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. -
సీఎం జగన్ కలలు సాకారమవుతున్న వేళ..
అగనంపూడి (గాజువాక): ప్రతీ పేదింటి బిడ్డ ఉన్నత చదువుల్లో రాణించాలని..ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని సీఎం జగన్ తపన..ఆరాటం సఫలీకృతమవుతుండటం సంతోషంగా ఉందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు కృష్ణదేవరాయలు అన్నారు. అమెజాన్ ప్రాంగణ ఎంపిక ప్రక్రియలో ఎంపికైన 13 మందిలో 9 మంది విద్యార్థులు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్నట్లు తెలిపారు. వీరికి వార్షిక వేతనం రూ.26 లక్షలు అని చెప్పారు. వీరితోపాటు మరో 13 మంది కూడా 3 సంస్థల్లో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. ఒకరు రూ.12 లక్షల వార్షిక వేతనం, 12 మందికి రూ.10 లక్షల ప్యాకేజీతో దేవరెవ క్లౌడ్ ఇండియా, ఇన్సిర్క్స్, ఎటర్నల్ రోబోటిక్స్ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు వివరించారు. కళాశాలలో చేరిన తొలి ఏడాది నుంచి విలువలతో కూడిన విద్యతో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్‌తోపాటు విద్యార్థులను మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంచడటంతోపాటు నైతిక విలువలూ పెంపొందిస్తున్నామని చెప్పారు. విజ్ఞాన్ సీఈవో ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు
మేకల కల్యాణ్ చక్రవర్తి : ఎన్నికలు, రాజకీయాలు ఆర్థికాంశాలతోనే ముడిపడి ఉంటాయని.. ప్రజల ఆర్థిక ప్రయోనాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ఎజెండాలు అవుతాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అందె సత్యం స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలన్నీ అనుచితమేమీ కావని.. కొన్ని పైకి ఉచితంగానే కనిపిస్తున్నా ఉత్పత్తిని పెంచే సాధకాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కన్నా.. ప్రజలను కొనుగోలు చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు, ప్రజల ఎజెండా, ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రభావం, రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులపై అందె సత్యం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ఎన్నికలకు, ఆర్థిక ప్రయోజనాలకు అసలు సంబంధమేంటి? ఎన్నికల్లో ఒక భాగం రాజకీయాలైతే, మరోభాగం ఆర్థికఅంశాలు. ఎత్తుగడలు, పొత్తులు, విధానాలు రాజకీయ అంశాలైతే.. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నవి ఆర్థికాంశాలు. ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమం, ఉచితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంక్షేమంతోపాటు ఉత్పత్తిని పెంచే విధానాలూ ఉంటాయి. ఓట్ల కోసం ఉచిత హామీలు ఉంటాయి. ఉచితాలు సరికాదనే చర్చపై మీ అభిప్రాయం? తమిళనాడులో మాదిరిగా మిక్సీలు, టీవీలు ఇస్తే అవి ఉచితాల కిందకు వస్తాయి. మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించడం లేదు. వారి ప్రణాళికల్లో అనుచితాలు లేవు. టీవీ ఇస్తే ప్రజలకు సంక్షేమమేమీ లేదు. ఉత్పత్తి రాదు. కేవలం వినోదం మాత్రమే వస్తుంది. అలాంటివి అనుచితం. అదే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం వారు అప్పుల బారినపడకుండా చూడటమే. వీటిని ఉచితాలుగా చూడొద్దు. ఇవి సాంఘిక సంక్షోభానికి పరిష్కార మార్గాల్లాంటివి. వ్యవసాయానికి ఆర్థిక సాయం మంచి అంశమేనా? ఏ దేశంలోనైనా వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చాలా దేశాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో దశాబ్దకాలంగా రైతులకు అయ్యే ఖర్చులో సగ భాగం సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గిందన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయానికి అన్నివిధాలా సాయం చేసి నిలబెట్టుకోవడం అవసరం. వ్యవసాయ సబ్సిడీలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రుణమాఫీ కచ్చితంగా ఉత్పత్తి కోవలోకే వస్తాయి. ఆ ప్రణాళికల ఫలితం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆరోగ్యశ్రీ పథకాలను విస్తృతం చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్య రంగాల్లో ఖర్చుతో ప్రయోజనమేనా? విద్య, వైద్య రంగాల్లో ఖర్చు సమంజసమైనది. వైద్యంపై ఖర్చు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పార్టీలు మాట్లాడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేదే. ఉన్నత విద్యా రంగంలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. నేటికీ దేశంలో 30శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాబట్టి విద్యపై ఖర్చు అవసరం. కేరళలో ఆరోగ్య, విద్యా వనరుల కారణంగానే పేదరికం 0.7 శాతానికి తగ్గింది. పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడం.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చు కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇది ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన? వ్యవస్థ పూర్తిగా వాణిజ్యపరమైనప్పుడు రాజకీయాలు కూడా వాణిజ్యపరం అవుతాయి. రాజకీయ పార్టీల నాయకులు గతంలో వ్యాపారుల దగ్గర ఆర్థిక సాయం తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే వ్యాపారులయ్యారు. ఈ లక్షణాన్నే ఎన్నికల్లోనూ ఉపయోగిస్తున్నారు. జమిలి ఎన్నికలతో... భారత్‌లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యంతరంగా కూలిపోయినప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన భవిష్యత్‌లో అధ్యక్ష తరహా పాలనకు దారితీయొచ్చు. ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఎదురుచూడాల్సిందేనా? ఎప్పుడూ ప్రభుత్వాల వద్ద అడుక్కుని లబ్ధి పొందడమే ప్రజల పనిగా మారింది. భూపంపిణీతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించని కారణంగానే ఈ దుస్థితి. ప్రజల కొనుగోలు శక్తిని నిరంతరం పెంచే విధంగా కాకుండా ప్రజలను కొను గోలు చేసి రాజకీయ నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. నగదు బదిలీ పథకాలతో నష్టమా.. లాభమా? దేశంలో ఆకలి సూచీలు దిగజారిపోతున్నాయి. అంటే కింది స్థాయి పేదలకు ప్రభుత్వాల సాయం అవసరమే. పేదల కొనుగోలు శక్తి కారణంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. డిమాండ్, ఉత్పత్తి పెరుగుతాయి. ఇక మన దేశంలో ఉద్యోగులు, కార్మి కుల వాటా ఎక్కువ. పాత పింఛన్ ప్రభుత్వాలకు భారమనేది అభివృద్ధి నిరోధక ఆలోచన. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా పాత పింఛన్ విధానాన్నే అమలు చేస్తున్నాయి. -
టోకెన్లతోనే సరి
సాక్షి, హైదరాబాద్: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్‌లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్‌లో జనరేట్ అయ్యి టోకెన్ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి. దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. అవన్నీ రెండేళ్ల కిందటివే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్‌లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్‌లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ ‘సాక్షి’తో అన్నారు. -
ఓట్ల కోసం కేసీఆర్ కపట నాటకం
మధిర: పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను పదిరోజుల్లో చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం ప్రజలను మోగించడమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధితో పనిచేసే సీఎం కావాలా, ఫామ్‌హౌస్‌లో పడుకునే సీఎం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుని, వినతిపత్రాలు స్వీకరించడమే కాక అన్ని పారీ్టల ఎమ్మెల్యేల సమస్యలు వినేవారని, సచివాలయంలో అధికారులతో సమీక్షలు చేసేవారని గుర్తుచేశారు. ఇందులో ఏ ఒక్కటీ చేయలేని కేసీఆర్, ఆరు నెలలకోసారి అసెంబ్లీని మూడు రోజులు తూతూమంత్రంగా నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు సీఎం అయితే ఏంటీ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎవరు సీఎం అయితే ఏంటీ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్లు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతాయా, లేదా అన్నదే ముఖ్యమని భట్టి అన్నారు. కేసీఆర్ అనవసరంగా సీఎం గోల ఎత్తుకున్నారని మండిపడ్డారు. దోపిడీ, కమీషన్లు లేకుండా ప్రతీపైసా ప్రజల కోసం ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధుల సమస్య రాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పారీ్టపరంగానే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. -
పేద బిడ్డల చదువులకు పెన్నిధి
సాక్షి, అమరావతి: ఆర్థికంగా ఉన్నవారికే ఉన్నత విద్య అన్నట్టున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సంక్షేమ చదువుల విప్లవాన్ని సృష్టించారు. దేశ చరిత్రలోనే లేని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి కులమతాలతో సంబంధం లేకుండా ఉన్నత విద్య పేదలందరికీ ఉచితమే అని ప్రకటించారు. 2005–08 మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులైన 26.67 లక్షల మందికి ఈ పథకం కింద రూ.2 వేల కోట్లను ఖర్చుచేశారు. ఇక 2009ని సంక్షేమ నామ సంవత్సరంగా ప్రకటించి.. 7 లక్షల మంది అగ్రవర్ణ పేదలను కూడా ఈ పథకంలో భాగం చేశారు. వారి ఉచిత చదువుల కోసం రూ.350 కోట్లు కేటాయించారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టని ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో 33.67 లక్షల మంది పేద విద్యార్థుల చదువులకు పెన్నిధిలా నిలిచారు. 18 యూనివర్సిటీల స్థాపన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు 2003–04లో కేవలం రూ.4,468 కోట్లు మాత్రమే కేటాయించారు. అదే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008–09లో రూ.11 వేల కోట్లు కేటాయించి దేశంలోనే ఈ రంగానికి అధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని నిర్ణయించి కొత్తగా 18 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. పేద విద్యార్థులకు సైతం ఖరీదైన ఐటీ శిక్షణ అందించాలని నిర్ణయించి నూజివీడు, ఇడుపులపాయ, బాసరలో ట్రిపుల్ ఐటీలను అందుబాటులోకి తెచ్చారు. ఆయన బాటలోనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి ప్రారంభించిన ప్రజా సంక్షేమ పథకాలను, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నూరు శాతం అమలు చేస్తున్నారు. అంపశయ్యపై ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు: మన బడి కింద పది రకాల సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయ పౌరులుగా ఎదగాలని, ప్రపంచ స్థాయిలో పోటీపడాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న ప్రతిభావంతులకు రూ.1.25 కోట్ల ఫీజును సైతం చెల్లించడం ఆయనకే చెల్లింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ విద్యా రంగానికి రూ.69,289 కోట్లు ఖర్చు చేశారు.