సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాధికి అత్యవసర చికిత్స పొందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి రూ. లక్ష వరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ కల్పిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా మెమో జారీ చేశారు. హోంశాఖ వివరణ కోరడంతో ఈ మెమో ఇవ్వడం గమనార్హం. ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందినవారికి గరిష్టంగా రూ.లక్ష వరకు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు సౌకర్యం ఉంటుందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)లో ఈ వసతి లేకపోవడంతో అనేకమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు 25 లక్షల మంది ఉంటారు. తాజా నిర్ణయం లక్షలాది మందికి ప్రయోజనం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment