govt employees
-
ఉద్యోగులు, పెన్షనర్లను దగా చేసిన కూటమి సర్కారు
-
కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోంది
-
ఉద్యోగులకు ఊరికే జీతాలు.. బాబు గారి కొత్త స్కీమ్
-
మర్యాదగా చెబితే అర్థం కాదా? చంద్రబాబు ఓవర్ యాక్షన్
-
Big Question: పసుపు రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల నరకయాతన
-
ఏపీలో ఉద్యోగులపై మంత్రులు, టీడీపీ నేతల దుర్భాషలు
-
అయ్యన్నపాత్రుడి బూతు పురాణం..
-
Lok Sabha Election 2024: ఈసారి యూట్యూబ్ హవా!
సార్వత్రిక ఎన్నికల వేడి సోషల్ మీడియాలోనూ సెగలు పుట్టిస్తోంది. ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్‌స్టా.. ఎక్స్.. యూట్యూబ్.. ఇలా సోషల్ ప్లాట్ఫాముల్లోనే మునిగి తేలుతున్న నెటిజన్లకు చేరువయ్యేందుకు పారీ్టలు కూడా ఆ వేదికలనే అడ్డగా మలచుకుంటున్నాయి. రాజకీయ విశ్లేషకులతో పాటు కంటెంట్ క్రియేటర్లు కూడా జోరు పెంచడంతో రెండు నెలలుగా డిజిటల్ ప్రచారం దుమ్ము రేగిపోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పారీ్టలు ఎక్కువగా ఫేస్‌బుక్‌పై దృష్టి పెట్టగా 2019కు వచ్చేసరికి ప్రధానంగా వాట్సాప్‌ను నమ్ముకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం డిజిటల్ క్యాంపెయినింగ్‌కు యూట్యూబ్ కీలక వేదికగా మారింది... సాధారణంగా యూట్యూబ్‌లో వినోదాత్మక కంటెంట్‌కు మంచి గిరాకీ ఉంటుంది. ఎన్నికల పుణ్యమా అని నెల రోజులుగా సీరియస్ రాజకీయ కంటెంట్‌కు ఒక్కసారిగా వ్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సబ్‌్రస్కయిబర్లు భారీగా ఎగబాకుతున్నారు. సోషల్ మీడియా డేటాను విశ్లేíÙంచే సోషల్ బ్లేడ్ గణాంకాల ప్రకారం రాజకీయ థీమ్‌తో కంటెంట్ క్రియేట్ చేస్తున్న ధృవ్ రాఠీకి ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 25 లక్షల మంది యూజర్లు దక్కడమే ఇందుకు నిదర్శనం! ఇక డిజిటల్ న్యూస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన రవీశ్ కుమార్, అభిసార్ శర్మ వంటి టీవీ జర్నలిస్టుల యూట్యూబ్ ఛానెల్స్ కూడా మూడు లైక్‌లు, ఆరు షేర్లుగా దూసుకెళ్తున్నాయి. వీరిద్దరి ఛానెల్స్ నెలవారీ వ్యూస్ వరుసగా 175 శాతం, 115 శాతం చొప్పున ఎగబాకాయి! షార్ట్ వీడియోలే ట్రెండింగ్... గత ఎన్నికల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా డిజిటల్ మెసేజ్‌లను పార్టీలన్నీ బాగా వాడుకున్నాయి. ఇందుకోసం కొన్ని పారీ్టలైతే ఏకంగా 2 లక్షలకు పైగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసినట్లు రషీద్ చెబుతున్నారు! కానీ ఇప్పుడు నెటిజన్ల అభిరుచులతో పాటు ట్రెండ్ కూడా మారిపోయింది. ముఖ్యంగా 30 సెనక్ల కంటే తక్కువ నిడివిగల చిన్నపాటి వీడియో క్లిప్‌లకు భలే క్రేజ్ ఉంది. వాస్తవానికి ఈ ట్రెండ్ టిక్‌టాక్‌తో మొదలైంది. దాన్ని బ్యాన్ చేయడంతో యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్ ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి. స్మార్ట్ ఫోన్ యూజర్లు భారీగా పెరగడం, డేటా చౌకగా లభించడం, మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం కూడా దీనికి ప్రధాన కారణాలే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చౌక డేటా ప్లాన్లు ఉన్న దేశాల్లో భారత్‌ది ఏడో స్థానం. స్మార్ట్ ఫోన్లోనే ఈజీగా కంటెంట్ క్రియేట్ చేయగల వీడియో ఎడిటింగ్ యాప్‌లు అందుబాటులోకి రావడం షార్ట్ వీడియోలకు బాగా కలిసొస్తోంది. కేవలం ఫొటో, మెసేజ్‌లతో కాకుండా చిన్న వీడియోలతో పారీ్టలు తమ అభిప్రాయాలను మరింత ప్రభావవంతంగా ఓటర్లకు చేరవేసేందుకు వీలవుతుండటం వల్లే యూట్యూబ్ ఈ ఎన్నికల్లో కీలక ప్రచార వేదికగా మారింది. అంతేగాక ప్రధాన టీవీ ఛానెళ్లలో ముఖ్యమైన ప్రజా సమస్యలకు తగిన కవరేజీ దక్కడం లేదని యూట్యూబ్ క్రియేటర్లు అంటున్నారు. దాంతో అలాంటి వార్తలు చూపించే యూట్యూబ్ ఛానెళ్లకు డిమాండ్ బాగా పెరుగుతోందని చెబుతున్నారు.రాజకీయ యాడ్లకూ తగ్గేదేలే... యూట్యూబ్ డిజిటల్ ప్రచార హవా పార్టీల అడ్వర్టయిజింగ్ వ్యయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి మే 4 మధ్య బీజేపీ, కాంగ్రెస్ గూగుల్ యాడ్స్ కోసం కేవలం వీడియోలపైనే అత్యధిక నిధులను వెచి్చంచాయి. వివిధ ఫార్మాట్ల ద్వారా మెటా యాడ్స్‌కు ఖర్చు చేసిన దానికంటే ఇది మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. వీడియో కంటెంట్‌కు సంబంధించి కాషాయ పార్టీ గూగుల్ యాడ్స్‌కు రూ.50.4 కోట్లు ఖర్చు చేయగా, మెటా యాడ్స్‌కు రూ. 15.4 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక కాంగ్రెస్ గూగుల్ యాడ్స్‌కు రూ.24.5 కోట్లు, మెటాకు రూ.8.1 కోట్ల చొప్పున వెచ్చించింది.యూజర్లు రయ్.. రయ్.. ఎన్నికల హడావుడి మొదలైన ఫిబ్రవరి నుంచి చూస్తే... చాలామంది నాయకులు, పారీ్టల యూట్యూబ్ సబ్‌్రస్కయిబర్లు 2 నుంచి ఏకంగా 4 రెట్లు పెరగడం విశేషం. వీరిలో రాఘవ్ చద్దా (ఆప్–4.2 లక్షల యూజర్లు), శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ– 2.7 లక్షలు), రేవంత్ రెడ్డి (కాంగ్రెస్– 2.05 లక్షలు) వంటి నేతలు ప్రధానంగా ఉన్నారు. పారీ్టలపరంగా ప్రస్తుతం యూట్యూబ్‌లో ఆమ్ ఆద్మీ పారీ్టదే హవా! ఏకంగా 63.4 లక్షల సబ్స్రయిబర్లతో ఆప్ దేశంలోనే టాప్‌లో ఉంది. బీజేపీకి 59.1 లక్షల మంది యూజర్లుండగా కాంగ్రెస్ సబ్ర్స్కయిబర్ల సంఖ్య 48 లక్షలు.ఫేస్బుక్ టు యూట్యూబ్.. వయా వాట్సాప్! 2019 ఎన్నికల్లో డిజిటల్ ప్రచారానికి వాట్సాప్ ప్రధాన వేదికైంది. అదే సమయంలో నిజానిజాలతో పనిలేకుండా ఫేక్ న్యూస్ పెరిగిపోవడానికి కూడా ఇది కారణమైంది. వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయ్యే సమాచార ప్రామాణికతను చెక్ చేసే యంత్రాంగం లేకపోవడం ఈ మాధ్యమంపై బాగా ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ప్రతికూలత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వార్డ్‌లను 5 యూజర్లకు పరిమితం చేయడం కూడా ఈ ప్లాట్‌ఫాం వినియోగానికి బ్రేక్ వేసిందనే చెప్పాలి. పైగా వాట్సాప్ ఫార్వార్డ్లు లేనిపోని సమస్యలు తెచి్చపెడుతుండటంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో యూట్యూబ్ కీలక ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించిందని కంటెంట్ రీసెర్చర్ విజేత దహియా చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో యూట్యూబ్‌కు 50 కోట్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లుండటం కూడా దీనికి ఊతమిస్తోంది. రాజకీయ విశ్లేషకులు, ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే విమర్శకులతో పాటు పారీ్టలు కూడా ఏడాదిగా యూట్యూబ్‌లో జోరు పెంచాయి. యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని చెక్ చెసే యంత్రాంగం సమర్థంగా పని చేస్తుండటం కూడా పార్టీలు, నేతలు దీనికి అధిక ప్రాధాన్యమిచ్చేందుకు మరో కారణంగా నిలుస్తోంది. లైవ్ స్ట్రీమ్‌లను, ర్యాలీ వీడియోలను, ఇంటర్వ్యూలను యూజర్లకు చేరువ చేసేందుకు చాలామంది నేతలు తమ సొంత యూట్యూబ్ ఛానెల్స్‌ను ప్రారంభించారు. అంతేగాక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు, పాడ్కాస్టర్ల సహకారంతో నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారని రాజకీయ వ్యూహకర్త, డిస్కోర్స్ కన్సలి్టంగ్ సహ వ్యవస్థాపకుడు తల్హా రషీద్ పేర్కొన్నారు. ‘‘దశాబ్దకాలంగా సార్వత్రిక ఎన్నికల్లో పారీ్టల సోషల్ ట్రెండ్ రకరకాలుగా మారుతోంది. 2014లో ఫేస్బుక్ పేజీలను, ఈవెంట్లను పారీ్టలు బాగా వాడుకున్నాయి. ఆ ఎన్నిలకప్పుడు పోలింగ్ రోజున ఫేస్బుక్ అలర్టులు సైతం అందించింది’’ అని ఆయన గుర్తు చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
26 డీఎల్ డీవో పోస్టుల మంజూరుపై ఉద్యోగుల హర్షం
-
సీఎం రేవంత్ ఎఫెక్ట్.. అధికారుల్లో కొత్త టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో భారీస్థాయిలో మార్పులు చేపట్టేందుకు కొత్త సర్కారు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల వరకు అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీల కోసం కసరత్తు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమీక్షా సమావేశాలు నిర్వహించడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని పేర్కొంటున్నాయి. ప్రాథమికంగా సమీక్షించి, ఆయా శాఖల్లో ఏం జరుగుతోందన్న అంశాలను అవగాహన చేసుకున్నాక.. ప్రక్షాళన మొదలుపెట్టనున్నట్టు వివరిస్తున్నాయి. కొందరు అధికారులపై ఫోకస్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలువురు అధికారులు బీఆర్ఎస్ సర్కారుకు తొత్తులుగా పనిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించింది. హైదరాబాద్ పరిసర ప్రాంత జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఐటీ–పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సింగరేణి సీఎండీ శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్లకు స్థానభ్రంశం తప్పదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు సీసీఎల్ఏగా కూడా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లేదా శశాంక్ గోయల్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని తక్షణమే మార్చే ఉద్దేశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమెను మార్చే పక్షంలో రామకృష్ణారావుకు సీఎస్ బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. రిటైరైనా కొనసాగుతున్నవారికి ఉద్వాసన పదవీ విరమణ చేసిన దేవాదాయ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను గత ప్రభుత్వం అదే పోస్టులో కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని అంటున్నారు. మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రిటైర్డ్ అధికారి సయ్యద్ ఒమర్ జలీల్, పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులైన అదర్‌సిన్హా, కారి్మక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులైన రాణి కుముదిని తదితరులనూ తప్పించనున్నట్టు చెప్తున్నారు. అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న కీలక అధికారులకు.. గత సర్కారు అప్రాధాన్య పోస్టుల్లో కొనసాగించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాలో.. బుర్రా వెంకటేశ్వర్లు (వెనుకబడిన తరగతుల శాఖ కార్యదర్శి), అనితా రామచంద్రన్ (టీఎస్పీఎస్సీ కార్యదర్శి), విజయేంద్ర (ప్రత్యేక కార్యదర్శి ఆర్అండ్బీ), రాహుల్ బొజ్జా (విపత్తుల నిర్వహణ కార్యదర్శి) తదితరులు ఉన్నారు. వీరికి ప్రాధాన్య పోస్టులు లభించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరోవైపు గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఉన్నతాధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్లకూ స్థాన చలనం కలెక్టర్లలో సంగారెడ్డి కలెక్టర్ శరత్, భూపాలపల్లి కలెక్టర్ భవ్యేశ్ మిశ్రా, రాజీవ్‌గాంధీ హన్మంతుతోపాటు పలువురు అధికారులకు స్థానభ్రంశం తప్పదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గతంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా చేసి.. పీఎంవోకు డిప్యూటేషన్‌పై వెళ్లిన కాట ఆమ్రపాలి తిరిగి రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. ఆమె పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఓఎస్డీగా ఉన్న సంజయ్ జాజు తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. వీరు కాకుండా మరో అరడజను మంది వరకు అధికారులు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. వారు ఐదేళ్లపాటు కేంద్ర సరీ్వసుల్లో డెప్యుటేషన్ పూర్తి చేసుకున్నాకే రాష్ట్ర సర్వీసుకు వస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోరితే రిలీవ్ చేసే అవకాశం ఉంటుంది. -
నేడూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ విధుల్లో నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి తమ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదిస్తే, వారికి మంగళవారం కూడా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించలేదని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సదరు ఉద్యోగి పేరుతో ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ జారీ కాలేదని ధ్రువీకరించుకున్న తర్వాత వారికి పోస్టల్ బ్యాలెట్ అందజేసి, ఓట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటేసేందుకు అనుమతించాలని సీఈఓ తెలిపారు. ఒకవేళ ఉద్యోగి పేరుతో అప్పటికే పోస్టల్ బ్యాలెట్ జారీ అయితే మళ్లీ కొత్త పోస్టల్ బ్యాలెట్ జారీ చేయరాదని స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఏ జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారికి చేరిందో తెలియజేయాలని సూచించారు. ఉద్యోగిని ఎన్నికల విధుల కోసం అదే జిల్లాకు కేటాయించినా, ఇతర జిల్లాకు కేటాయించినా ఈ నిబంధనలను పాటించాలని తెలిపారు. ఉద్యోగులు పోస్టల్ ఓటు వేసేందుకు డ్యూటీ ఆర్డర్ కాపీతో తమ ఓటు ఉన్న నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని కలవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయమై ఉద్యోగ సంఘాలు పలుమార్లు సీఈఓకు విన్నవించాయి. బండి సంజయ్ కూడా ఈసీకి లేఖ రాశారు. -
ప్రభుత్వ ఉద్యోగులపై వరాలజల్లు
-
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త..ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచనున్నారా..? కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నారనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రిటైర్మెంట్ వయస్సును మార్చబోమని స్పష్టం చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలుకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం గానీ, తగ్గించడం గానీ ఉండదు' అని కేంద్ర సిబ్బంది వ్వవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే.. లోక్‌సభలో నేడు ఉద్యోగులకు గరిష్ఠంగా 30 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి చేసి రిటైర్మెంట్ ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కేంద్రాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్రం సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీవిరమణ చేశారని లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ వినియోగం, రూల్స్‌ను సరళించడం వంటి మార్పులు చేసినట్లు పేర్కొంది. 730 రోజుల చైల్డ్ కేర్ సెలవులు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు తమ పిల్లల సంరక్షణ కోసం మొత్తం సర్వీసులు గరిష్ఠంగా 730 రోజుల సెలవులు తీసుకోవచ్చని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పిల్లల్లో మొదటి సంతానం 18 ఏళ్లు వచ్చే వరకు ఈ సెలవులకు అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ! -
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో రెండో పీఆర్సీని వేయనుంది ప్రభుత్వం. ఇదే సమయంలో ఇంట్రిం రిలీఫ్(IR)ను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్(EHS)పై కూడా నిర్ణయం తీసుకోనుంది. ఈహెచ్ఎస్ అమలుకు విధి విధానాలను రూపొందించనుంది. అలాగే, గవర్నమెంట్ ఎంప్లాయిస్ హౌజింగ్‌పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు -
ప్రభుత్వం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం సార్
-
TS: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్‌ను పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జీవో 50, జీవో 51లను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే పైన 2.73 శాతం చొప్పున డీఏ/డీఆర్‌ను ప్రభుత్వం పెంచింది. పెంచిన డీఏ/డీఆర్ జనవరి 2022 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి తాజాగా పెరిగిన డీఏ/డీఆర్‌ను జూలై నెల వేతనంతో కలిపి అందిస్తారు. గతేడాది జనవరి 1 నుంచి మే 31 వరకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుంది. డీఏ, డీఆర్ పెంపుదలతో రాష్ట్రవ్యాప్తంగా 7.28 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు సంబంధించిన బకాయిలు రూ.1,380.09 కోట్ల చెల్లింపుపై ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. డీఏ పెరిగిందిలా.. కేటగిరీ ప్రస్తుత డీఏ– పెరిగిన డీఏ - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు: 20.02% నుంచి 22.75%కు పెంపు - యూజీసీ/ఏఐసీటీఈ/ ఎస్ఎన్ జేపీసీ పేస్కేల్స్ (2016): 31% నుంచి 34%కు పెంపు - యూజీసీ/ఏఐసీటీఈ/ ఎఫ్ఎన్ జేపీసీ పేస్కేల్స్ (2006): 196% నుంచి 203%కు పెంపు - ఫుల్ టైమ్/ కంటింజెంట్: 148.068 శాతానికి పెరుగుదల - పార్ట్ టైం/ వీఆర్ఏలు: నెలకు రూ.100 చొప్పున పెరుగుదల (నోట్: డీఆర్ నిబంధన పరిధిలోనికి రాని పెన్షనర్లకు ఎలాంటి సవరణ ఉండదని, డీఆర్ సవరించిన పెన్షనర్లకు తదుపరి రూపాయిని కటాఫ్ గా నిర్ణయించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.) ఇది కూడా చదవండి: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం: పెద్ద శబ్దం.. బోగీలపై వ్యాపించిన మంటలు -
AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. స్పెషల్ పే పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 11వ పీఆర్సీ సిఫార్సులు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా, ప్రభుత్వం నిర్ణయంతో 1,2 కేటగిరీలు మినహా అన్ని కేటగిరి ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. ఇది కూడా చదవండి: టీ షర్ట్ మీద చే గువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను? -
AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, పలువురు ఉద్యోగులు బదిలీ కానున్నారు. కాగా, బదిలీలపై బ్యాన్ ఉపసంహరిస్తూ బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఈనెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న చోట రెండేళ్లకు పైబడి పనిచేసిన ఉద్యోగులు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా చదవండి: భూమా అఖిలప్రియకు బిగ్ షాక్! -
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. హెచ్ఆర్ఏ పెంపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించనుంది. ఇక, హెచ్ఆర్ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు పెంపు వర్తించనుంది. ఇది కూడా చదవండి: వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ -
ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం జగన్ పెద్దపీట వేశారు: వెంకట్రామిరెడ్డి
-
టీడీపీపై ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం !
-
ఉద్యోగుల గురించి ABN రాధాకృష్ణ చంద్రబాబు..దారుణ పదజాలం
-
ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరుజిల్లా: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది? కాగా, ఉద్యోగులపై గతంలో చంద్రబాబు, తోకపత్రిక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎంప్లాయీస్ గుర్తుచేసుకుంటున్నారు. వారి మధ్య సంభాషణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని ఒకసారి చూస్తే.. చంద్రబాబు-రాధాకృష్ణ సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించిన ఉద్యోగుల డిమాండ్ ప్రస్తావనకు రాగానే రాధాకృష్ణ బూతు పురాణం లంకించుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చిద్విలాసంగా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ‘ఆ .. నా కొడుకులు’ అని రాధాకృష్ణ దుర్భాషలాడినా.. అలా అనడం తప్పని చంద్రబాబు అనకపోవడం గమనార్హం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేమని, అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వాలని సీఎం చెప్పుకొచ్చారు. మొదట్లో కొంత ఉదారంగా ఉంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చని అన్నారు. రుణమాఫీ హామీ కూడా అధికారం కోసమే ఇచ్చామంటూ మనసులో మాట చెప్పేశారు. చదవండి: మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని -
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నవారైనా.. వారు కోరుకున్నచోట ప్లాట్ తీసుకోవచ్చు. గతంలో ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల్లో మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుండేది. ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఈ నిబంధనలను సడలించి జీవో నంబరు 38 జారీచేసింది. ఈ కొత్త జీవో ద్వారా ప్లాట్‌ను రాష్ట్రంలో ఎక్కడైనా ఎంపిక చేసుకునే అవకాశం లభించింది. రాష్ట్రంలోని 22 నగరాలు, పట్టణాల్లో అన్ని అనుమతులు, ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసింది. వీటిని మార్కెట్ ధర కంటే తక్కువకే అందుబాటులో ఉంచింది. ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అన్ని లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 ప్లాట్లు రిజర్వ్ చేయడంతోపాటు ధరలో 20 శాతం రిబేట్ సౌకర్యం కూడా కల్పించింది. కొత్త నిబంధనలతో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు మొత్తం 22 జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేఅవుట్స్ వివరాలను https:// migapdtcp. ap. gov. in/ వెబ్సైట్లో చూడవచ్చు. చదవండి: సముద్రంలో ‘పవన విద్యుత్’ -
యూకేలో ఉద్యోగుల భారీ సమ్మె
లండన్: యూకేలో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద సమ్మె బుధవారం జరిగింది. సుమారు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, కాలేజీ లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, రైల్ డ్రైవర్లు విధులను బహిష్కరించారు. ఫలితంగా 85% స్కూళ్లు మూతబడ్డాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. నాలుగు దశాబ్దాల్లోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం 10% మించి పోవడంతో అందుకు తగినట్లుగా వేతనాలు పెంచాలంటూ ఆరోగ్య, రవాణా రంగ సిబ్బంది దగ్గర్నుంచి అమెజాన్ వేర్ హౌస్ ఉద్యోగులు, రాయల్ మెయిల్ పోస్టల్ ఉద్యోగుల వరకు సమ్మెలకు దిగుతున్నారు. వేతనాల పెంపు డిమాండ్‌తో వచ్చే వారంలో విధులు బహిష్కరిస్తామంటూ నర్సులు, అంబులెన్సు సిబ్బంది, పారామెడిక్స్, ఎమర్జెన్సీ, ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే ప్రకటించారు. కాగా, సమ్మెలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని రిషి సునాక్ ఆందోళన వ్యక్తం చేశారు. బదులుగా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు. అయితే, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా..కొన్ని రంగాల్లో సమ్మెలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల సంబంధాలు మరింత దెబ్బతింటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. -
దసరాకైనా ఉద్యోగుల జీతాలు ఇస్తారో లేదో?
హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా సక్రమంగా జీతం ఇవ్వడం లేదని, దసరాకైనా జీతాలిస్తారో.. లేదో? అని ఆందో ళన చెందుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆమె ధ్వజమెత్తారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్, నస్తిపూర్, దౌల్తాబాద్, కాసాలా దేవులపల్లి, హత్నూర, కొన్యాల వరకు నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ అందించిన ఘనత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సుపరిపాలనను తిరిగి అందించేందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించానని తెలిపారు. వైఎస్సార్ టీపీని ఆదరిస్తే రూ.3,000 పింఛన్, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక
-
ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు కోసం 8వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పట్లో ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదని అందుకే కొత్త సంఘం ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. ఉద్యోగుల జీతాల పెంపునుకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీఏ(DA) పెంపు అంచనా ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మరోసారి డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం రేట్లు అలాగే ఉన్నందున, కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ డీఏను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. గత కొంతకాలంగా 7% కంటే ఎక్కువగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏ లెక్కిస్తున్నారు. నివేదికల ప్రకారం, డీఏ 3% నుంచి 4% మధ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులందరికీ 34% డీఏ అందుతోంది. 50 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు డీఏ సవరణ ప్రయోజనాలను పొందుతున్నారు. కాగా ప్రభుత్వం 7వ కేంద్ర వేతన సంఘాన్ని ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది. చదవండి: వారానికి 4 రోజులే పని, త్వరలోనే అమల్లోకి కొత్త లేబర్ చట్టాలు! -
ఉద్యోగుల బాగు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న సేవలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. సజ్జల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏపీ ఎన్జీవో అపార్ట్మెంట్ నిర్మించుకోవడం సంతోషకరం. తక్కువ ధరకే ఉద్యోగులకు ఇలాంటి గృహాలను ఇవ్వడం శుభ పరిణామం. ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. ప్రభుత్వం చేస్తున్న సేవలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఇందుకు ఉద్యోగులను అభినందిచక తప్పదు. పాలకుడు మంచివారైతే అయితే అందులో భాగస్వామ్యం అవుతామని ముందుకు వచ్చిన ఉద్యోగులకు ధన్యవాదాలు. రాష్ట్రంలో సమస్యలు ఉద్యోగులకు తెలియనివి కావు. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు చూశాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు భయపడకుండా సేవలను అందించారు. ఆదాయం తగ్గి భారం పెరిగింది. ఉద్యోగులు ఆశించినంతగా ప్రభుత్వం సహాయం చేయలేకపోయింది. దీన్ని కూడా ఉద్యోగులు స్వాగతించారు. ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌గా ఉన్న ఆర్టీసీ విలీనాన్ని చేసిన ఘనత మన ప్రభుత్వానిది. ఉద్యోగికి ఏ సమస్య ఉన్నా చట్టానికి లోబడి పరిష్కారం చేసే దిశగా ఎల్లపుడూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలను రాజకీయాలకు వాడుకోవాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. అది ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా తెలుసు. ఉద్యోగులకు అన్నీ చేయాలని ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేయలేకపోయాం. సీఎం జగన్ ఆలోచనలు సాధ్యం కావాలంటే ఉద్యోగుల సహకారం తప్పనిసరి. ఉద్యోగుల కలలను సాకారం చేసేందుకు సీఎం జగన్ సర్కార్ ఎల్లప్పుడూ ముందుంటుంది’’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు -
సీఎం సంచలన నిర్ణయం.. వారంలో ఐదు రోజులే పని దినాలు..
ఇంపాల్: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. అంటే వారంలో ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలను ప్రభుత్వం ఐదు రోజులకు కుదించింది. మార్చి 22న సీఎం బీరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మణిపూర్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సునంద తోక్చోమ్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఒక్క వెకేషన్ డిపార్ట్మెంట్ మినహా అన్ని ఆఫీసులకు ఇదే నియవర్తించనుంది. కాగా, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆయా కార్యాలయల టైమింగ్స్‌ను కూడా కుదించారు. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పని చేయనున్నాయి. ఇక శీతాకాలమైన నవంబర్-ఫిబ్రవరిలో అరగంట తగ్గించి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయాలు తెరిచి ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం 1 నుంచి 1.30 గంటల వరకు భోజన విరామం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు కూడా ఐదు రోజుల్లో ఉదయం 8 గంటలకే తెరుచుకోనున్నాయి. అయితే, సెలవు దినాల్లో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఆయా విభాగాలు రోస్టర్ విధానాన్ని రూపొందించనున్నాయి. సీఎం బీరెన్ సింగ్ తన ప్రభుత్వం మొదటి వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రకటించారు. అందులో భాగంగా మొదటగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. -
ఉద్యోగుల మనోభావాలను సీఎం జగన్ గౌరవించారు
-
కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకున్నా ఉద్యోగులకు మేలు చేశాం
-
పరిస్థితులు బాగుంటే మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని
-
అందరిముందు రిబ్బన్లు తీసేసిన ఉద్యోగులు
-
ఉద్యోగులకు 'ఐఆర్' రికవరీపై క్లారిటీ
-
సమ్మే పరిష్కార మార్గమా? ఆలోచించండి!
మొత్తం మీద ఏపీలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య యుద్ధం మొదలైనట్లే తోస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, ఉద్యోగ సంఘాలను విమర్శించలేం లేదా సమర్ధించలేం. తమ నిస్సహాయతను ప్రభుత్వం ఉద్యోగ సంఘాల వారికి తెలియజేసింది. ఉద్యోగ సంఘాలవారు తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు. గతంలో మనం ఇలాంటి యుద్ధాలను ఎన్నో చూశాము. రేపు వాళ్ళు వాళ్ళు ఒకటైపోతారు. ఇవాళ తిట్టిన నోళ్లే రేపు జై కొడతాయి. ఇదేం కొత్త కాదు. మెరుగైన జీతాల కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యవచ్చు. సమ్మె చేసి తమ ఆందోళనా తెలియచేయవచ్చు. కానీ ఇటువంటి సమయాల్లో ప్రభుత్వ సారథులు కఠినంగా వ్యవహరిస్తే... కోర్టులు కూడా వారికే అండగా నిలిచిన ఉదాహరణలు చరిత్రలో కనిపిస్తున్నాయి. తమిళనాడు ఉద్యోగులు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. జయలలిత ఆగ్రహించి లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించారు. దీంతో ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సమ్మె అనేది ఉద్యోగుల హక్కు కాదని, ఉద్యోగులను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, అయితే మానవీయ కోణంలో చూసి... డిస్మిస్ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని జయలలితకు సూచించింది. ఇక్కడ తమిళనాడు పభుత్వానికి కోర్ట్ సూచించిందే తప్ప దాని నిర్ణయాన్ని తప్పు పట్టి ఆదేశించలేదు. కోర్టు తీర్పుతో చేసేది లేక డిస్మిస్ అయిన ఉద్యోగులు అందరూ ప్రభుత్వానికి మళ్ళీ సమ్మె జోలికి వెళ్లబోమని లిఖిత పూర్వకంగా ఎవరికి వారు హామీ పత్రాలు ఇవ్వడంతో తిరిగి ఉద్యోగంలోకి తీసుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లినప్పుడూ వారికి చుక్కెదురైంది. సుమారు యాభైవేలమంది ఆర్టీసీ కార్మికులు రెండు నెలలపాటు సమ్మె చేసినపుడు కేసీఆర్ చాలా దృఢంగా వ్యవహరించారు. ప్రైవేట్ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. బస్సు సర్వీ సులు ఆగకుండా చూశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చెయ్యాలని కూడా ఒకదశలో కేసీఆర్ ప్రకటించినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్న ఘట్టాలను గుర్తుంచుకుని... అంత తీవ్రచర్యకు పూనుకోలేదు. అలాగని మెత్తబడలేదు. ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వెళ్లారు. సమ్మె సమస్య, డిమాండ్ల సమస్య లేబర్ కమిషనర్ చూసుకోవాలి తప్ప హైకోర్టు ఏమీ చెయ్యలేదని, లేబర్ కోర్టుకు వెళ్లండని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో కార్మికులు డీలాపడి పోయి సమ్మె విరమించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల కనికరం చూపి... వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడమే కాకుండా సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లించింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్రెడ్డి ఎంతో ఉదారస్వభావం కలిగిన వ్యక్తి. కరోనా కష్టకాలంలో పేదలు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి ఆర్థికసాయాలు అందించి ఆదుకున్న సంగతి తెలుసు. ఆర్థికంగా రాష్ట్రం బాగా దెబ్బతిని ఉంది. ఇలాంటి పరి స్థితుల్లో తాము సమ్మెబాట పట్టడం సబబేనా అని ఉద్యోగులు ఆలోచించుకోవాలి. (చదవండి: బీఎస్ఎన్ఎల్కు అన్యాయం...ప్రైవేటులో భాగస్వామ్యం!) ప్రభుత్వం కూడా ఉద్యోగుల న్యాయమైన కోరికలను తప్పకుండా పరిశీలిస్తామని, ఆర్థిక వెసులుబాటు కలిగినపుడు వారికి ప్రయోజనాలు అందిస్తామని చెప్పి ఉద్యోగులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో ఒక భాగం. కరోనా మహమ్మారి వంటి కీలక సమయాల్లో సమ్మెకు దిగితే ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా వారు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. (చదవండి: వారూ, వీరూ ఎదుర్కొనే పీడన ఒక్కటే!) - ఇలపావులూరి మురళీ మోహనరావు సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల డీఎలు విడుదల
-
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల డీఎలు విడుదల
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మేరకు 23 శాతం ఫిట్‌మెంట్‌కు అనుగుణంగా కొత్త పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్ డీఏలను విడుదల చేస్తూ ఆర్థికశాఖ సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా సీఎం జగన్ 23 శాతం ఫిట్మెంట్ ఇస్తామని, పెండింగ్ డీఏలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీచేశారు. పే రివిజన్ కమిషన్ నివేదికపై సీఎస్ అధ్యక్షతన వేసిన కమిటీ చేసిన పలు సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడి కన్నా వేతనాలు, జీతభత్యాల వ్యయం ఎక్కువగా ఉందని సీఎస్ కమిటీ పేర్కొనడంతో.. ఐదేళ్లకొకసారి వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయలేమని, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన సీఎస్ కమిటీ సూచించిన మేరకు ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► 50 లక్షలకు పైబడి జనాభా ఉండే నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు బేసిక్ స్కేలుపై 24 శాతం హెచ్ఆర్ఏ, 5–50 లక్షల మధ్య జనాభా ఉండే నగరాలు, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం, 5 లక్షల లోపు జనాభా ఉండే పట్టణాలు, గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులకు 8 శాతం హెచ్ఆర్ఏగా నిర్దారిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► ఐఏఎస్ అధికారులతో పాటు యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజీలలో యూజీసీ వేతనాలతో పనిచేసే వారికి రివైజ్డ్ హెచ్ఆర్ఏ వర్తించదని తెలిపారు. ► కన్సాలిడేటెడ్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌దారులకు కూడా కొత్త పీఆర్సీ అమలు ప్రకారం 23 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. ► 1993 నవంబరు 25వ తేదీకి ముందు ఎన్ఎంఆర్, పార్ట్‌టైం ఉద్యోగులుగా చేరిన వారికి కూడా కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు అమలు చేస్తూ ఇంకో ఉత్తర్వు జారీ చేశారు. ► అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కేటగిరీ–1లో పేర్కొన్న వారికి రూ.21,500 చొప్పున, కేటగిరీ–2 వారికి రూ.18,500, కేటగిరీ–3 వారికి రూ.15,000 చొప్పున కొత్త వేతనాన్ని అమలు చేస్తూ జీవో జారీ చేశారు. -
కశ్మీర్లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం విధుల నుంచి తప్పింది. తాజాగా ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను బుధవారం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశామని అధికారులు చెప్పారు. గత 6 నెలల కాలంలో మొత్తంగా 25 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగింనట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్ మొజాహిదీన్ ఉగ్రసంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ఇద్దరు కుమారులనూ గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగింది. శ్రీనగర్‌లో శాసన మండలి సభ్యుని ఇంట్లో ప్రభుత్వ ఆయుధాలను దొంగిలించిన కానిస్టేబుల్ షౌకత్ ఖాన్‌ను పక్కకు తప్పించారు. చదవండి: రాహుల్, ప్రియాంకలకు అనుభవం లేదు: అమరీందర్ -
ఉద్యోగుల్లారా వ్యాక్సిన్ వేసుకోకుంటే మీకంతే సంగతులు
చండీగఢ్: మహమ్మారి కరోనా వైరస్ మూడో దశ తీవ్రస్థాయిలో దాడి చేస్తుందనే వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నారు. 18 ఏళ్లలోపు వయసు వారందరూ వేసుకోవాలని చెబుతున్నా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా వేసుకోని వారు ఇంకా కోట్లలోనే ఉన్నారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి విషయంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులు సెలవుపై వెళ్లాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా వేసుకోని ఉద్యోగులు ఉంటే వారు సెలవుపై వెళ్లాలని స్పష్టం చేశారు. వారు వ్యాక్సిన్ వేసుకునే దాక సెలవుపై ఉండాల్సిందే. వ్యాక్సిన్ వేసుకునే కార్యాలయంలోకి అడుగుపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై శుక్రవారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు సీఎం అమరీందర్ తెలిపారు. వ్యాక్సిన్ ఉద్యోగులందరికీ చేరాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ పూర్తికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
Telangana:రెండేళ్ల సర్వీసుకే పదోన్నతుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు అవసరమైన కనీస సర్వీసు కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు ఈ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 31తో ముగియనున్న 2020–21 పదోన్నతుల ప్యానెల్ ఈయర్ కోసం మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అయితే తాజా నిర్ణయంతో ప్యానెల్ ఇయర్‌తో సంబంధం లేకుండా తదుపరి ఆదేశాలు జారీ వరకు ఈ వెసులుబాటు అమలు కానుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ స్వాగతించారు. -
అధికారులపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోటి దురుసు
సాక్షి, విశాఖపట్నం: మరోసారి అధికారులపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నోటి దురుసుతో ప్రవర్తించారు. మహిళా తహశీల్ధార్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. అధికారులను కించపరిచేలా దొంగలతో కుమ్మక్కయ్యారంటూ వ్యాఖ్యానించారు. అధికారుల పట్ల హేళనగా మాట్లాడారు. అయ్యన్న వ్యాఖ్యలపై తహశీల్ధార్ కలత చెందారు. గిరిజన మహిళా తహశీల్ధార్‌పై ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై కూడా దురుసుగా మాట్లాడారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఓ సీనియర్ ప్రజా ప్రతినిధిగా చెప్పుకునే అయ్యన్న తీరు మారకపోవడం దారుణం అంటున్నారు. చదవండి: కీచకుడిగా మారిన టీడీపీ వార్డు కౌన్సిలర్.. విశాఖ జిల్లాలో టీడీపీ కార్యకర్తల వీరంగం -
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తితో 2020 మే నుంచి బయోమెట్రిక్ హాజరు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా తగ్గడంతో మళ్లీ బయోమెట్రిక్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్ -
ప్రభుత్వ శాఖల్లో అద్దెకు సొంత వాహనాలు..
ఉన్నతమైన ఉద్యోగం.. రూ.లక్షల్లో వేతనం.. అయినప్పటికీ కాసులకు కక్కుర్తి పడుతున్నారు. గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నా అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన వాహన సౌకర్యాన్ని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. సొంత వాహనాలనే అద్దెకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా పలుశాఖల్లో సాగుతున్న ‘అద్దె’ బాగోతంపై సాక్షి ప్రత్యేక కథనం. సాక్షి,చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి అద్దె వాహనాల దందా సాగుతోంది. ట్రెజరీ, రెవెన్యూ, ఎంపీడీఓలు, విద్యా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, హౌసింగ్, మున్సిపల్ అధికారులు.. ఇతర శాఖల్లో సొంత కార్లను వినియోగిస్తూ ప్రతి నెలా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పలు కార్యాలయాల ఉన్నతాధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రజాసేవ నిమిత్తం క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు అవసరమైతే వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. నిబంధనల ప్రకారం జిల్లాస్థాయి అధికారి వాహనానికి నెలకు రూ.45వేలు, మండలస్థాయి అధికారి అయితే రూ.35వేలు అద్దె చెల్లిస్తోంది. నిరుద్యోగులకు బ్యాంకు రుణాలు, కార్పొరేషన్ల కింద సబ్సిడీపై ఓనర్ కమ్ డ్రైవర్స్కీం ప్రవేశపెట్టి ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి పలువురు ఉన్నతాధికారులు తూట్లు పొడుస్తున్నారు. తమ సొంత వాహనాలను వారు పనిచేస్తున్న శాఖలోనే అద్దెకు వినియోగిస్తున్నారు. మరికొందరు బినామీ పేర్లతో బిల్లులు పెట్టి అద్దెను జేబుల్లోకి వేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు! కొందరు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకుండానే నకిలీ బిల్లులు పెడుతున్నారు. తమకు కేటాయించిన వాహనంలో నెలకు 2,500 కిలోమీటర్లు తిరగాల్సి ఉంది. అన్ని కిలోమీటర్లు తిరగకపోయినా నకిలీ బిల్లులు పెట్టి ప్రతి నెలా అద్దె పేరుతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఏళ్ల తరబడి గుట్టుగా దందా సాగిస్తున్నారు. ఉపాధికి గండి జిల్లా వ్యాప్తంగా దాదాపు 85 ప్రభుత్వ శాఖలున్నాయి. అందులో సగానికి పైగా శాఖల్లోని అధికారులు వైట్‌బోర్డు వాహనాలను వినియోగిస్తుండడం గమనార్హం. అదే ఎల్లోబోర్డు వాహనాలను అద్దెకు తీసుకుంటే పలువురికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఎవరైనా తమ వాహనాన్ని అద్దెకు పెడితే సంబంధిత బిల్లుల మంజూరుకు చుక్కలు చూపిస్తున్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
-
ఏపీలో ఉద్యోగుల పనివేళల్లో మార్పు!
సాక్షి, అమరావతి: కోవిడ్ కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజున ఉత్తర్వులను జారీ చేసింది. కర్ఫ్యూ నేపథ్యంలో ఉద్యోగుల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఉండాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని హెచ్‌డీవో కార్యాలయాలు, సెక్రటెరియట్, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఈ మేరకు అమలులో రానుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలంటే ఉద్యోగులకు కచ్ఛితంగా పాసులు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. కాగా అత్యవసర సర్వీసులకు ఏపీ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాధికి అత్యవసర చికిత్స పొందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి రూ. లక్ష వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ కల్పిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా మెమో జారీ చేశారు. హోంశాఖ వివరణ కోరడంతో ఈ మెమో ఇవ్వడం గమనార్హం. ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందినవారికి గరిష్టంగా రూ.లక్ష వరకు రీయింబర్స్మెంట్ చెల్లింపు సౌకర్యం ఉంటుందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో ఈ వసతి లేకపోవడంతో అనేకమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు 25 లక్షల మంది ఉంటారు. తాజా నిర్ణయం లక్షలాది మందికి ప్రయోజనం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. -
మూడు కాదు.. రెండేళ్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసు వ్యవధిని ప్రభుత్వం మూడేళ్ల నుంచి రెండేళ్లకు తాత్కాలికంగా కుదించింది. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సంతకం చేశారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక కేటగిరీ/ క్లాస్/ గ్రేడ్ నుంచి మరో కేటగిరీ/ క్లాస్/ గ్రేడ్‌కు పదోన్నతి, లేదా పదోన్నతి ద్వారా బదిలీ కోసం కనీసం 2 ఏళ్ల సర్వీసు వ్యవధి ఉండాలనే తాత్కాలిక నిబంధన(అడ్‌హక్ రూల్)ను అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020–21 ప్యానెల్ సంవత్సరం ముగిసే వరకు అనగా.. 2021, ఆగస్టు 31 వరకు ఈ తాత్కాలిక నిబంధన అమల్లో ఉంటుందని తెలిపారు. అర్హులైన వ్యక్తులు లేక చాలా వరకు ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయలేకపోతున్నామని, అందుకే కనీస సర్వీసు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. త్వరగా నివేదిక ఇవ్వండి.. ఉద్యోగుల వేతన సవరణ నివేదిక(పీఆర్సీ)పై అధ్యయనం, ఉద్యోగ సంఘాలతో చర్చల ప్రక్రియలను సత్వరంగా పూర్తి చేసి తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. టీఎన్జీవోల సంఘంఅధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, త్రిసభ్య కమిటీ సమక్షంలో సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో పదోన్నతులకు కనీస సర్వీసు వ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు. ఈ నెల మూడో వారంలో వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ దగ్గర పడిందని, వీటిపై నివేదిక ఇవ్వాలని కోరారు. నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటానని సీఎం పేర్కొన్నారు. -
2021: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత?
న్యూఢిల్లీ: ఈ ఏడాదంతా ఓ శూన్య సంవత్సరంలాగే గడిచింది. విహారాలు లేవు, వినోదాలు లేవు. పెళ్లిళ్లు పేరంటాలు అంటూ తిరగడాలు అసలే లేవు. నెలల తరబడి ఇంట్లోనే బందీలై పని లేక, పొద్దు పొడవక నీరసంగా బతుకు బండిని లాగించారు. కానీ వలస బతుకులు మాత్రం కూడు దొరక్క నరకయాతన అనుభవించారు. అటు ఎందరో ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉన్న జాబ్ ఊడి రోడ్డున పడ్డారు. ఇటు ప్రభుత్వాల దగ్గర కూడా ఖజానా ఖాళీ అయి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని రోజులున్నాయి. మొత్తానికి జనాలను ముప్పు తిప్పలు పెట్టిన కరోనా పీడిత 2020 ఏడాది కథ ముగిసిపోతుంది. ఇప్పుడిప్పుడే అంతా కుదుటపడుతోంది. (చదవండి: అవార్డులు వెనక్కు ఇచ్చిన జవాన్లు: నిజమెంత?) ఇలాంటి సమయంలో ఉద్యోగులను ఠారెత్తిస్తూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "రానున్న ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత ఉండబోతుంది. కార్మిక చట్టాల్లో సవరణల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను గ్రేడుల వారీగా విభజించి దాని ప్రకారం జీతాలు తగ్గించనున్నారు" అన్నది సదరు వార్త సారాంశం. ఇది నిజమేనని నమ్మిన నెటిజన్లు దాన్ని తెగ షేర్ చేస్తున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం దీన్ని తప్పుడు వార్తగా కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) వివరణ ఇచ్చింది. 2021లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో తగ్గింపు ఉంటుందనేది పూర్తిగా అబద్ధమని పేర్కొంది. వేతన కోడ్ బిల్లు-2019 కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు వర్తించదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత పెడుతున్నట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. కాబట్టి ఉద్యోగులు.. ఒకటో తారీఖున జీతం తక్కువ వస్తుందేమోనని ఆందోళన చెందకండి. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి టెన్షన్లు తెచ్చుకోకండి. (చదవండి: దేశ ప్రధానికి జీతం చాలట్లేదట! ) -
వారికి మహీంద్రా స్పెషల్ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: పండుగ సీజన్లో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్రభుత్వ ఉద్యోగులకోసం ప్రత్యేకమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఇప్పటికే ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తున్న సంస్థ తాజాగా కార్ల కొనుగోలుపై వీరికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. సర్కార్ 2.0 ప్రోగ్రాం కింద నగదు తగ్గింపులు, సులభమైన ఈఎంఐ, తక్కువ వడ్డీ రేట్లు లాంటి ఆఫర్లను అందిస్తోంది. మహీంద్రా కారును కొనుగోలు చేసే విధానాన్ని మరింత సులభతరం చేసేలా తాజా స్పెషల్ డీల్స్‌ను కంపెనీ ప్రకటించింది. యుటిలీటీ వెహికల్ కోనుగోలపై లక్ష రూపాయలకు గాను రూ. 799వద్ద సులభ ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఇందుకోసం వివిధ బ్యాంకులతో తాము ఒప్పందాలు కుదుర్చుకున్నామని, మరిన్ని వివరాలకు కొనుగోలుదారులు దగ్గరలోని తమ డీలర్లను సంప్రదించాలని కంపెనీ తెలిపింది. కాంటాక్ట్‌లెస్ చెల్లింపు సౌలభ్యాన్ని కూడా అందబాటులో ఉంచామని ఎం అండ్ ఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్లు ఈ ఆఫర్ కింద ఎం అండ్ ఎం ప్రభుత్వ ఉద్యోగులకు రూ .11,500 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. అంతేకాదు కారు లోనును ముందస్తుగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది. వడ్డీరేట్లు 7.25 శాతం నుంచి ప్రారంభం. -
డీఏ పెంపు 5.24 శాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 5.24 శాతం కరువు భత్యం(డీఏ) పెంచింది. తక్షణమే ఒక డీఏ చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో... ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై కరువు భత్యం 33.536 శాతం నుంచి 38.776 శాతానికి పెరిగింది. 2019 జూలై 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. డిసెంబర్లో చెల్లించనున్న నవంబర్ వేతనం/ పెన్షన్‌తో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. బకాయిల చెల్లింపు ఇలా.. 2019 జూలై 1 నుంచి 2020 అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2021 మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించనుంది. ఈ ఉత్తర్వుల జారీకి ముందే ఎవరైనా ఉద్యోగులు మరణిస్తే వారి చట్టబద్ధ వారసులకు నగదు రూపంలో డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు, 2019 జూలై 1 నుంచి 2020 అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను డిసెంబర్ నుంచి నాలుగు సమవాయిదాల్లో ప్రభుత్వం చెల్లించనుంది. పెన్షనర్లకు సంబంధించిన డీఏ బకాయిలను సైతం నాలుగు సమ వాయిదాల్లో 2020 డిసెంబర్ నుంచి చెల్లించనున్నారు. జీపీఎఫ్‌కు అనర్హులైన ఫుల్‌టైమ్ కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబర్లో చెల్లించనున్న వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది. -
పండుగ బొనాంజా : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ 3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ జారీతో పండుగ సీజన్లో డిమాండ్ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దసరా లోపు బోనస్ ఉద్యోగుల ఖాతాల్లో ఒకే వాయిదాలో జమవుతుందని ఈ నిర్ణయం ప్రకటిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్ ఆఫీసులు, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేసే 17 లక్షల మంది నాన్ గెజిటెట్ ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్‌ను అందుకోనున్నారు. మరోవైపు దుర్గా పూజ లోగా సామర్ధ్యం ఆధారిత బోనస్‌ను విడుదల చేయనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రెండు ప్రధాన రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి. చదవండి : ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్ -
అసమర్థ ఉద్యోగులను పంపేయండి
న్యూఢిల్లీ: ముప్పయ్యేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరి సర్వీసు రికార్డులను మదింపు చేయాలని, అసమర్థ, అవినీతి అధికారులకు ముందస్తు రిటైర్మెంటు ఇచ్చి ఇంటికి పంపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 కింద 56 (జె), 56 (ఐ), 48 (1)(బి) నిబంధనల ప్రకారం... ఉద్యోగి పనితీరును పరిశీలించి ప్రజాప్రయోజనాల దృష్ట్యా అతనికి రిటైర్మెంట్ ఇచ్చి పంపే సంపూర్ణ హక్కు సంబంధిత పై అధికారికి ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తు రిటైర్మెంట్ ‘శిక్ష’కాదని వివరించింది. ఉద్యోగి 50 లేదా 55 ఏళ్లకు చేరుకున్నాక, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నాక... ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా సదరు ఉద్యోగిని ఇంటికి పంపించవచ్చని పేర్కొంది. ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేసి వారిని సర్వీసులో కొనసాగించడంపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ అవుతుంటాయని, ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల విషయంలో మరింత స్పష్టత ఇవ్వడానికి, అమలులో ఏకరూపత తేవడానికి తాజా ఆదేశాలు జారీచేశామని సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. రిటైర్ చేయదలచుకున్న ఉద్యోగికి మూడు నెలల నోటీసు ఇవ్వాలని, అలాకాని పక్షంలో మూడునెలల వేతనం ఇచ్చి పంపాలని తెలిపింది. 50 లేదా 55 ఏళ్లకు చేరుకుంటున్న, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోబోతున్న ఉద్యోగులందరి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను ప్రతిశాఖలో నిర్వహించాలని, ఏడాదికి నాలుగుసార్లు ఈ జాబితాను మదింపు చేయాలని ఆదేశించింది. డిజిటల్ లాకర్లోకి పెన్షన్ ఆర్డర్ రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌కు సంబంధించిన పత్రాల కోసం నిరీక్షించే బాధ తప్పనుంది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఎలక్ట్రానిక్ రూపంలో ఇకపై నేరుగా ఉద్యోగుల డిజిటల్ లాకర్‌కు పంపనున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు. పెన్షన్ ప్రక్రియలో ఇక ఆలస్యానికి తావుండదని, అలాగే పెన్షన్ ఆర్డర్ పత్రాలను పోగొట్టుకునే ప్రమాదం ఉండదని మంత్రి తెలిపారు. పౌరులు తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవడానికి డిజిటల్ లాకర్ ఉపకరిస్తుంది. -
రేపట్నుంచి విధులకు సగం మందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంతోపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రేపట్నుంచి దాదాపు రెండు వారాలపాటు రొటేషన్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. రోజువారీ కార్య కలాపాలను సగం మందితోనే నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అలాగే గర్భిణులు, దీర్ఘ కాలిక వ్యాధులు, వ్యాధి లక్షణాలుగల ప్రభుత్వ ఉద్యోగులు సెలవు తీసుకొని ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఇలాంటి వ్యక్తులు సాధారణ సెలవు (సీఎల్), ఆర్జిత సెలవులు (ఈఎల్), మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా సగం వేతనం చెల్లింపు (హాఫ్ పే) సెలవు తీసుకోవాలని సూచించింది. సెలవు తీసుకున్నా పని ప్రదేశంలో అందుబాటులోనే ఉండాలని, వారి సేవలు అవసరమైనప్పుడు కబురు అందిస్తే కార్యాలయా నికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్యోగులంతా తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించిన ప్రభుత్వం... సందర్శకుల రాక పోకలపైనా ఆంక్షలు విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శని వారం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మార్గదర్శకాలు కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకే వర్తిస్తాయని స్పష్టతనిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. అయితే అత్యవసర సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నిబంధనలు వర్తించవని వెల్లడించారు. కేసులు పెరగడంతో... రాష్ట్రంలో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్, ఒక ఐఏఎస్ అధికారి కరోనా బారినపడగా సచివాలయంలో ఏకంగా 18 మందికి ఈ వైరస్ సోకింది. హజ్‌హౌస్‌లోని తెలంగాణ వక్ఫ్ బోర్డు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కింది స్థాయి ఉద్యోగి శుక్రవారం కరోనాతో మరణించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచడంతో కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల్లో కరోనా కలవరం మొదలైంది. విధులకు హాజరవ్వాలంటేనే సిబ్బంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు ఇవీ... 50 శాతం మంది ఆఫీస్ సబార్డినేట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర 4వ తరగతి ఉద్యోగులు వారం తప్పించి మరో వారం విధులకు హాజరవ్వాలి. 50 శాతం మంది క్లరికల్ స్టాఫ్/సర్కులేటింగ్ ఆఫీసర్లు రోజు తప్పించి రోజు విధులకు రావాలి. ప్రత్యేక చాంబర్లు ఉన్న అధికారులు మాత్రం రోజూ విధులకు హాజరు కావాలి. సెక్షన్ అధికారులు, సహాయ సెక్షన్ అధికారులు, క్లరికల్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర 4వ తరగతి ఉద్యోగులు విధులకు హాజరుకాని రోజుల్లో వారు పనిచేసే ప్రాంతం (హెడ్‌క్వార్టర్)లోనే ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో కూడా పనిచేసే ప్రాంతాన్ని వదిలి వెళ్లడానికి వీల్లేదు. కార్యాలయంలో ఏదైనా పని కోసం వారిని అప్పటికప్పుడు పిలిచే అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో మార్గదర్శకాలు... సంబంధిత అధికారి నుంచి అపాయింట్‌మెంట్‌తోపాటు అనుమతి కలిగి ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాలకు సందర్శకులను రానివ్వాలి. లిఫ్టు ఆపరేటర్‌తోపాటు మరో ముగ్గురిని మాత్రమే ఆఫీసు లిఫ్టుల్లో అనుమతించాలి. క్రమం తప్పకుండా కార్యాలయాలు, వాహనాలను డిస్ఇన్ఫెక్ట్ (రసాయనాలతో పిచికారి చేసి క్రిములను చంపడం) చేయాలి. మధ్యహ్న భోజన విరామ సమయంతోపాటు అన్ని వేళలా సిబ్బంది భౌతికదూరం పాటించాలి. సిబ్బంది ఇంటి నుంచే భోజనాన్ని తీసుకొని రావాలి. మధ్యాహ్న భోజన విరామ సమయంలో అందరూ ఒకేచోట కూర్చోకూడదు. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం/శానిటైజేషన్, మాస్కులను ధరించడం వంటి జాగ్రత్తలను ఉద్యోగులంతా తప్పనిసరిగా పాటించాలి. డ్రైవర్లందరూ సంబంధిత పేషీ వద్ద కూర్చోవాలి. ఒకేచోట గూమికూడరాదు. అధికారులందరూ గదుల్లో ఏసీల వినియోగాన్ని విరమించుకోవాలి. గదుల్లో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కరోనా నివారణపై ఉద్యోగులకు అవగాహన కల్పించడానికి ప్రజారోగ్య విభాగం డైరెక్టరేట్, కాళోజి నారాయణరావు ఆరోగ్య వర్శిటీ ప్రచార కార్యక్రమాలను రూపొందించాలి. -
కరోనా: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నాల్గో తరగతి సిబ్బంది, క్లర్క్స్‌కు రోజు విడిచి రోజు డ్యూటీలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తప్ప మిగతా స్టాఫ్‌లో 50 శాతం మాత్రమే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. మిగతా 50 శాతం వారం తర్వాత పనిచేయాలని నిర్ధేశించింది. (చదవండి : నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్!) ప్రభుత్వం విడుదల చేసిన కొత్త డ్యూటీ గైడ్‌లైన్స్ సోమవారం నుంచి బీఆర్కే ఉద్యోగులకు కరోనా సడలింపులు 4th క్లాస్ ఉద్యోగులకు వారం విడిచి వారం విధులు క్లరికల్ స్టాఫ్-సర్కిల్టింగ్ ఉద్యోగులకు రోజు విడిచి రోజు డ్యూటీ ప్రత్యేక ఛాంబర్స్ కేటాయించిన ఉద్యోగులు రోజు విధులకు హాజరు ముందస్తు అనుమతి తీసుకుంటేనే విజిటర్స్‌కు అనుమతి సెక్షన్ అధికారి-అసిస్టెంట్ సెక్షన్ అధికారులు డ్యూటీకి రాకున్నా అందుబాటులో ఉండాలి లిఫ్ట్‌లో ఒక్కసారి ముగ్గురికి మాత్రమే అనుమతి పార్కింగ్ ప్లేస్‌లో డ్రైవర్లు అందరూ గుమ్మికూడొద్దు అధికారులందరూ ఏసీలు వాడొద్దు (చదవండి : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు) -
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఒక బృందం ఒక వారం కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహిస్తే.. రెండో బృందం తర్వాత వారం విధులకు వచ్చేలా వెసులుబాటు కల్పించింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల్ని నియంత్రించాలని, అత్యవసర పని ఉంటే తప్ప అనుమతించవద్దని చెప్తోంది. చదవండి: కలి‘విడి’గా కరోనాపై యుద్ధం రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ కంటే పైస్థాయి అధికారులు రోజూ విధులకు హాజరవుతారు. అయితే వీరందరికీ ప్రత్యేకంగా ఉంటాయి. వారంలో విధులకు హాజరయ్యే ఉద్యోగులకు వేర్వేరు సమయాల్లో పనివేళలుగా.. ఒక బృందం ఉ.9.30 గంటలకు, రెండో బృందం 10 గంటలకు, మూడో బృందం 10.30 గంటలకు కార్యాలయంలోనికి అనుమతిస్తూ ఏ సెక్షన్‌లోనూ రద్దీ లేకుండా ఉద్యోగుల మధ్య తగినంత దూరం పాటించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కింద స్థాయి ఉద్యోగులకు వంతులవారీ విధానాన్ని ప్రభుత్వం వర్తింపు చేయనుంది. -
చెదరని అవినీతి మరక
సాక్షి, జడ్చర్ల: ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. మొన్నటికి మొన్న ఓ తహసీల్దార్ భారీగా అవినీతికి పాల్పడి కటకటాలపాలైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేఫథ్యంలో ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం అవగాహన కల్పించింది. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫోన్ చేయండి అంటూ జిల్లావ్యాప్తంగా టోల్‌ఫ్రీ నంబర్ ఇస్తూ ప్రజలకు, ఉద్యోగులకు అవగాహన కల్పించినా కొందరు అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురిచేయడమే గాక అవినీతికి పాల్పడుతున్నారు. తాజాగా మిడ్జిల్ మండలంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ పట్టుబడిన విషయం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఇలా.. జడ్చర్ల నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతున్న అధికారులను ఏసీబీ అధికారులు పట్టు కున్న సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనిపిస్తుంది. గత ఐదే ళ్ల కాలంలో పలువురు అధికారులు, సిబ్బంది లంచం పుచ్చుకుంటూ పట్టుబడ్డారు. గతంలో బాలానగర్ మండలం గిర్ధావర్ రవీందర్‌రెడ్డి మల్లెపల్లికి చెందిన రైతు కృష్ణ్ణయ్య నుంచి అతని వ్యవసాయ భూమిని విరాసత్ చేసేందుకు గాను రూ:4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అంతకు ముందు మిడ్జిల్ మండల ఎస్ఐ సాయిచందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మిడ్జిల్ మండలంలో ఊర్కొండ గ్రామ వీఆర్ఓ వెంకటేశ్వర్‌రెడ్డిని జడ్చర్లలో ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అలాగే జడ్చర్ల ఎస్ఐ విఠల్‌రెడ్డిని ఏసీబీ అధికా>రులు పట్టుకున్నారు. అనంతరం జడ్చర్ల విద్యుత్ శాఖ ఏఈ రాజశేఖర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. తర్వాత బాలానగర్ మండలం అంగన్వాడీ సూపర్వైజర్ శశికళ అంగన్వాడీ కార్యకర్త నాగమణి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాలానగర్ తహసీల్దార్ మురళీకృష్ణ, వీఆర్ఓ శివరాములును ఏసీబీ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. జడ్చర్లలో పెద్దఆదిరాల వీఆర్ఓ కాశీనాథ్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇలా లంచాల రూపంలో ప్రజలను జలగల్లా పీడిస్తున్న అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు తమదైన శైలిలో పట్టుకుని అవినీతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. మార్పు వచ్చేనా..? ప్రజల నుంచి లంచాలు తీసుకునే విశ సం స్కృతి నుంచి కొందరు అధికారులు ఇంకా బ యట పడడం లేదు. ఏసీబీ అధికారుల దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నారే తప్ప అవినీతికి చరమగీతం పాడి ప్రజలకు నిజాయితీగా సేవలందించాలన్న ఆలోచన చే యకపోవడం విచారకరమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అవినీతి అధికారులు మైండ్ సెట్ మార్చుకుని నిస్వార్థంగా ప్రజలకు సేవలందించే విధంగా కృషి చేయా లని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి పనికీ లంచమే.. కాగా ప్రభుత్వ ఉద్యోగులు లంచం లేనిదే చేయి కదలని పరిస్థితి దాపురించింది. ఇక్కడ.. అక్కడ అని కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రధానంగా తహసీల్దార్, ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, నీటి పారుదల, ఇంజనీరింగ్ కార్యాలయాలతోపాటు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ తదితర కార్యాలయాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉందని వాపోతున్నారు. మనీ ముట్టజెప్పితే పనులు ఆగమేఘాల మీద పూర్తవుతాయని.. లేదంటే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఫోన్ నంబర్లు ఇవ్వడం, ఫిర్యాదులు చేసేందుకు వీలుగా అందుబాటులో ఉండడం తదితర వాటిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింతగా అవగాహన కల్పిస్తే అవినీతి అధికారుల ఆట కట్టించే పరిస్థితి ఉందని పలువురు పేర్కొంటున్నారు. మాకు సమాచారం ఇవ్వండి వివిధ పనులు నిమిత్తం ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి లంచాలు ఇవ్వవద్దు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులు, ఇతర ఉద్యోగుల సమాచారం మాకు ఇవ్వండి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఆయా సేవలను ఉచితంగా అందజేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలి. – కృష్ణగౌడ్, ఏసీబీ డీఎస్పీ, మహబూబ్‌నగర్ -
గుత్తాధిపత్యం ఇక చెల్లదు!
సాక్షి, హైదరాబాద్ : హెచ్ఎండీఏకు పనిమీద వెళ్లిన ఓ ఎంపీకే అక్కడి ఉద్యోగులు చుక్కలు చూపించారని, లంచాల కోసం అడుగడుగునా వేధించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హెచ్ఎండీఏ కమిషనర్ ఆదేశించినా, సదరు ఎంపీ పనిచేసేందుకు అక్కడి ఉద్యోగులు ఒప్పుకోలేదన్నారు. కమిషనర్లు వస్తారు. పోతారు. తాము ఇక్కడే శాశ్వతం అని ఎంపీకి సదరు ఉద్యోగాలు తేల్చి చెప్పడంతో లంచాలిచ్చి పని చేయించుకోవాల్సిన వచ్చిందన్నారు. చివరకు ఎంపీ ఫైలును పోస్టులో పంపేందుకు అక్కడి అటెండర్ సైతం లంచం తీసుకున్నారని కేసీఆర్ వెల్లడించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, హెచ్ఎండీఏ వంటి పట్టణాభివృద్ధి సంస్థల మధ్య పరస్పర ఉద్యోగుల బదిలీలు జరపడానికి వీలులేని కారణంగా దశాబ్దాలుగా ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేస్తూ విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ జాఢ్యాన్ని నివారించేందుకే మున్సిపాలిటీల్లో ఏకీకృత సర్వీసు రూల్స్ తీసుకొచ్చామన్నారు. ఇకపై ఎవరీ గుత్తాధిపత్యం నడవదని, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉద్యోగుల బదిలీలు ఉంటాయని, ఆ అధికారం పురపాలక శాఖ డైరెక్టర్‌కు అప్పగించామన్నారు. కొత్త మున్సిపల్ బిల్లుపై శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖలను చీల్చి మరీ ఉద్యోగ సంఘాలను పెట్టించారన్నారు. రెవెన్యూశాఖ పరిధిలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగానికి యూనియన్ను అనుమతించడం సరికాదన్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం విభాగాలు పెడుతుంది. ఎవరికి ఎక్కడ పనిచేయాలన్న అక్కడే చేయాలి. మాది ఆ శాఖ మాది ఈ శాఖ అనకూడదు. గుత్తాధిపత్యం నడవదు’అని హెచ్చరించారు. ఇదెక్కడి అరాచకత్వం... ప్రజలకు ఈ వేధింపులేంటి? ‘సీఎం, సీఎస్, రెవెన్యూ సెక్రటరీకి లేని అధికారాలు వీఆర్వోకు ఉన్నాయి. ఒకరి భూమిని మరొకరికి రాయడం, ఎకరాలను తారుమారు చేయడం రోజూవారి తతంగంగా మారింది. ఇదెక్కడి అరాచకత్వం. ప్రజలకు ఈ వేధింపులేంటి? కొంతమంది వారిని ప్రోత్సహిస్తారు. రెవెన్యూ చట్టం మారిస్తే కొత్త చట్టంలో మేము చెప్పినట్టు రాయాలంటారు. మీరు చెప్పినట్టు చట్టం ఉండాలంటే శాసనసభ ఎందుకు? శాసనసభ్యులెందుకు? కుక్క.. తోకను ఊపుతుందా? తోకే.. కుక్కను ఊపుతదా? ఎట్టి పరిస్థితులలోనూ దీన్ని ఉపేక్షించబోం. ఈ భయపడడం, మొహమాటపడడం ఎందుకు? ప్రజలకు మేలుచేసేందుకు ఎక్కడివరకైనా వెళ్లడానికి సిద్ధం. అందుకే మున్సిపల్ ఏకీకృత సర్వీసు తీసుకొచ్చాం. ఇకపై హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల నుంచి ఏ అధికారినైనా ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందరూ చట్టాన్ని చదవండి ‘మున్సిపాలిటీల్లో అనుమతులు టీఎస్–ఐపాస్ తరహాలో అనుమతులుంటాయి, నిర్దేశిత గడువులోగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీచేయని పక్షంలో బాధ్యులైనవారి ఉద్యోగాలు పోతాయి. ఈ చట్టాన్ని మునిసిపల్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా చదవాలి. లేఔట్ అనుమతులు జిల్లా కలెక్టర్లు ఇస్తారు. 1920 టౌన్‌ప్లానింగ్ యాక్టు ఇంకా అమలు చేస్తున్నారని మార్చాం. ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు, ల్యాండ్ మాఫియాలు, అక్రమ లేఔట్లు పోవాలి’అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. లేఔట్లలో రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిబంధనల మేరకు కేటాయించాల్సిన స్థలాలను సైతం రియల్టర్లు అమ్మేస్తున్నారని, ఇకపై ఇలాంటి స్థలాలను మున్సిపాలిటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేశాకే తుది లేఔట్ అనుమతులిస్తామన్నారు. సెంటర్ ఫర్ అర్బన్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు తెలంగాణ శరవేగంగా పురోగమిస్తోందని, 65% పట్టణీకరణ సాధించామని కేసీఆర్ తెలిపారు. అర్బన్ వ్యవహారాల మీద సమగ్ర దృక్పథం కోసం 25ఎకరాల్లో ‘సెంటర్ ఫర్ అర్బన్ ఎక్స్‌లెన్స్’సంస్థను ఏర్పాటు చేసి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తామన్నారు. మేయర్, చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులకు శిక్షణ తప్పనిసరన్నారు. హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాలపై జనాభా ఒత్తిడని తగ్గించడానికి శాటిలైట్ సిటీలు రావాలని, వీటిని ప్రోత్సహించేందుకు త్వరలో రాయితీలు ప్రకటిస్తామన్నారు. ఇక పాలనాసంస్కరణలపై దృష్టి ‘గత టర్మ్‌లో మేము కొద్దిగా సంక్షేమం, కరెంట్ కోతల నివారణ, ఇరిగేషన్, మంచినీళ్లపై ఎక్కువగా దృష్టిపెట్టాం. చాలా విజయవంతమయ్యాం. 55 లక్షల ఇళ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఈ ప్రాజెక్టు 99.9% ప్రాజెక్టు పూర్తిఅయింది. మిగిలిన 3,400 ట్యాంకులు పూర్తయితే అద్భుతం జరగబోతోంది. మిషన్ భగీరథతో మంచినీళ్ల బాధపోయింది. కరెంట్బాధ పోయింది. సంక్షేమంతో ప్రజల్లో నిస్సహాయత పోయింది. చాలా రంగాల్లో మంచి మార్పు జరిగింది. లంచాల వేధింపులు పోవాలి. పరిశుద్ధ పరిపాలన ఉండాలి. సులభంగా పని జరిగే పరిస్థితి ఉండాలి. కాబట్టి ఈ చట్టాలు తెస్తున్నాం. ప్రజలు అవినీతి బారినపడకుండా ఆలోచిస్తున్నాం. ఆ దిశగా రాజీలేకుండా పురోగమిస్తాం’అని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు నిరుపేదలు చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు ఇబ్బందిగా మారింది, పట్టణా లు, గ్రామాల్లో దహన వాటికలు, ఖనన వాటికల కోసం నిబంధనలు సడలించి వీటి కోసం స్థలం కొనేందుకు అవకాశం కల్పించాం. హైదరాబాద్ జనాభా కోటి దాటుతోంది. హైదరాబాద్‌కు వచ్చిపోయే విమానాల సంఖ్య 500కు దాటింది. నగరంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు సరిపడేంతగా లేవు. కనీసం 100 ఉండాల్సినచోట ఆరేడు మాత్రమే ఉన్నాయి. మున్సిపాలిటీల్లోని ఇళ్లకు కొత్త ఇంటి నంబర్లను త్వరలో జారీ చేస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్ ఉంటుందని ఇందులో చాలా విషయాలు పొందుపరుస్తాం. అపరిచితులు, నేరస్తులను పట్టుకోవడం, నేర పరిశోధనకు ఇవి ఉపయోగపడతాయి. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
-
ఉద్యోగులపై కుమార స్వామి ఫైర్
బెంగళూరు/రాయచూరు రూరల్: తమ ఫిర్యాదుల ను ఇచ్చేందుకు రాయ్‌చూర్ జిల్లా యెర్మారస్ థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ఉద్యోగులు సీఎం హెచ్డీ కుమార స్వామి వెళ్తున్న కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగుల తీరుపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ‘గ్రామ వాస్తవ్య’కార్యక్రమంలో భాగంగా కుమారస్వామి రాయ్‌చూర్‌కి వెళ్లారు. ‘మీరు నరేంద్ర మోదీకి ఓటు వేశారు. కానీ మీ పనులను నేను చేయాలనుకుంటున్నారు. నేను మీకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీపై లాఠీ చార్జ్ చేయాలా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి’అని వైటీపీఎస్ ఉద్యోగులపై కుమార స్వామి గట్టిగా అరిచారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అనంతరం కుమార స్వామి ఓ టీవీ చానల్లో మాట్లాడుతూ ‘ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి 15 రోజుల సమయం కావాలని కోరాను. అయినప్పటికీ వారు నేను వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో నేను సహనం కోల్పోయాను’అని తెలిపారు. ఒక వేళ ప్రధాన మంత్రి కాన్వాయ్‌ను ఎవరైనా అడ్డుకుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వం సహనంతో ఉంది. కానీ అసమర్థమైంది మాత్రం కాదు. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు’అని పేర్కొన్నారు. గ్రామ వాస్తవ్య కార్యక్రమంలో భాగంగా సీఎం రాయ్‌చూర్ జిల్లా కరేగుడ్డలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో రాత్రి గడపనున్నారు. -
ఆ దంపతులు ప్రభుత్వ ఉద్యోగులైనా..కాసుల కోసం
సాక్షి, కోదాడ(నల్గొండ) : ఆ..దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.. కాసుల కోసం కక్కుర్తి పడి మరో ఇద్దరి పరీక్షలు రాస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాల సెంటర్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు చెందిన మహ్మద్‌సల్మాన్, తిరపతమ్మలు కోదాడలోని నాగార్జున్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరారు. ప్రస్తుతం ఎంఎస్ కళాశాల సెంటర్లో జరుగుతున్న ఫెనలీయర్ పరీక్షలు రాస్తున్నారు. అయితే మహ్మద్సల్మాన్కు బదులుగా ఏపీలోని మక్కపేటకు చెందిన వత్సవాయి మండలం పోలంపల్లిలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అజ్మీర వెంకటప్పయ్య బీకాం పరీక్షకు హాజరయ్యాడు. ఇదే మాదిరిగా తిరపతమ్మకు బదులుగా పెనుగంచిప్రోలులో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న వెంకటప్పయ్య భార్య బాణోతు కవిత బీఎస్సీ ఫైనలీయర్ పరీక్షకు హాజరైంది. విషయాన్ని పసిగట్టిన కొందరు వ్యక్తులు కోదాడ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పరీక్ష కేంద్రానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న ఇద్దరినీ గుర్తించి అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూనివర్సిటీ నిర్వాహకుల మాయాజాలం... కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్న నాగార్జున్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వాహకులు వారికి ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్షలు రాస్తున్న ఒక్కో విద్యార్థి నుంచి పేపర్‌కు వెయ్యి నుంచి రెండు వెయ్యిలు వసూళు చేస్తున్నారని, డబ్బులు కట్టలేని వారిని పరీక్ష రాయకుండా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డబ్బులు కట్టిన వారందరికీ సపరేటు రూం ఏర్పాటు చేసి అందులో నేరుగా పుస్తకాలు ఇచ్చి పరీక్ష రాయిస్తున్నారని తెలిపారు. ఇక ఒకరికి బదులు మరొకు పరీక్షలకు హాజరైతే దాదాపుగా రూ.10వేలకు పైగానే వసూలు చేస్తున్నారని సమాచారం. ఈ పరీక్షలకు హాజరయ్యే వారందరూ దాదాపుగా ఎదో ఓ ప్రభుత్వ ఉద్యోగం చేసే వారో లేక ప్రైవేట్ ఉద్యోగం చేసే వారే ఎక్కువగా ఉండటంతో వారు ప్రమోషన్ల కోసం సర్టిఫికెట్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీ నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. -
కొత్త జిల్లాలు.. కొత్త ఉద్యోగులు కేటాయింపు!
సాక్షి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో జిల్లా పరిషత్ ఉద్యోగుల పంపకాల కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇటీవలే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటించడం, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక మండళ్లను ఎన్నుకునే ప్రక్రియ సైతం పూర్తి కావడంతో జెడ్పీల ఉద్యోగుల పంపకాలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక మండళ్ల పదవీకాలం వచ్చే నెల 4న పూర్తి కానుండడంతో ఆలోగా ఉద్యోగుల పంపకాల ప్రక్రియ పూర్తికి అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు, మండల పరిషత్ ఉద్యోగులు, వారి స్థానికత, చదివిన బోనాఫైడ్ సర్టిఫికెట్ల ఆధారంగా కొత్త జిల్లాలకు ఉద్యోగులుగా కేటాయించనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే సేకరించి పంచాయతీరాజ్ శాఖకు అందజేశారు. బోనఫైడ్ సర్టిఫికెట్ అందుబాటులో లేకుంటే ఉద్యోగి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను ఆయా జిల్లాలకు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి మెదక్‌లో రెండు కొత్త జిల్లాలు.. పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ (సపరేషన్ ఆఫ్ పవర్స్) ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబరు 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సంగారెడ్డి, సిద్దిపేట కొత్త జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా అమీన్పూర్, గుమ్మడిదల, కంది, మొగుడంపల్లి, సిర్గాపూర్, వట్పల్లి, నాగల్గిద్ద మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో మండలాల సంఖ్య 26కు చేరింది. వీటికి కూడా ఉద్యోగులను కేటాయించనున్నారు. అలాగే, సిద్దిపేట జిల్లా (మొత్తం మండలాలు 23)లో నారాయణరావుపేట, మర్కూక్, సిద్దిపేట అర్బన్, కొమురవెల్లి, అక్కన్నపేట, రాయపోలు మండలాలు ఏర్పాటయ్యాయి. మెదక్ జిల్లా (మొత్తం మండలాలు 20)లో హవేళీఘనాపూర్, మనోహరాబాద్, నార్సింగి, చిలప్‌చెడ్, నిజాంపేట) మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు జిల్లాల్లోని కొత్త మండలాలకూ ఎంపీడీఓ తదితర ముఖ్య అధికారులను కేటాయించాల్సి ఉంది. కాగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ విభజనను మాత్రం చేపట్టలేదు. అప్పటికే ఐదేళ్ల కాలానికి ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు, మండల పరిషత్‌ల అధ్యక్షుల కాల పరిమితి ముగియకపోవడంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో అప్పట్లో వీటి విభజనకు ప్రభుత్వం సాహసించలేదు. అయితే వచ్చే నెల 4తో ప్రస్తుత జెడ్పీ, ఎంపీపీల పదవీ కాలం పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త జెడ్పీ పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉమ్మడి మెదక్ జెడ్పీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వచ్చే నెల నుంచి మూడు జెడ్పీల్లో పాలన ప్రారంభం కానుంది. జెడ్పీ ఉద్యోగుల పోస్టులు–ఖాళీలు ఇలా.. ఇప్పటికిప్పుడు ఉద్యోగుల నియామకం చేపట్టే అవకాశం లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులను మూడు జిల్లాలకు సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముగ్గురు జిల్లా పరిషత్ సీఈఓలను నియమించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిషత్‌లో మొత్తం 46 మంది వివిధ హోదాల్లో అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో సీఈఓ, డిప్యూటీ సీఈఓ, అకౌంట్ ఆఫీసర్, ఐదుగురు సూపరింటెండెంట్లు పోను, ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లకు నలుగురు పని చేస్తున్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఇద్దరు టైపిస్టులు, 20 మంది జూనియర్ అసిస్టెంట్లకు గాను 17 మంది ఉండగా, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవరు ఒకరు, 10 మంది ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్లకు గాను ఏడుగురు పని చేస్తున్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఒకరు టైలరింగ్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ (సేవిక) పని చేస్తున్నారు. మండల పరిషత్‌లలో ఇలా.. జిల్లాలోని మండల పరిషత్‌లలో మొత్తం 562 ఉద్యోగులకు గాను 359 మంది వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. వీటిలో 203 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 46 మంది ఎంపీడీఓలకు 30 మంది పని చేస్తున్నారు. 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ ఏఈలు 46 మందికి 36 మంది మాత్రమే పని చేస్తుండగా, 9 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మండల విద్యాధికారులు 46 మందికి గాను 46 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈఓపీఆర్డీలు 46 మందికి 31 మంది విధులు నిర్వహిస్తుండగా, 15 ఖాళీలు ఉన్నాయి. సూపరింటెండెంట్లు 46 మందికి 45 మంది పనిచేస్తుండగా, 1 పోస్టు మాత్రం ఖాళీగా ఉంది. సీనియర్ అసిస్టెంట్లు 46 మందికి గాను 45 మంది పని చేస్తున్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. జూనియర్ అసిస్టెంట్లు 46 మందికీ అందరూ విధుల్లో ఉన్నారు. టైపిస్టులు 46 మందికి 21 మంది మాత్రమే పని చేస్తుండగా 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్లు 10 పోస్టులకు గాను ముగ్గురు మాత్రమే విధుల్లో ఉన్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫీస్ సబార్డినేట్లు 184 మందికి గాను 101 మంది పని చేస్తుండగా 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర పోస్టులు ఖాళీగా లేవని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగుల విభజనపై నేడు భేటీ జిల్లా పరిషత్‌ల విభజన, ఉద్యోగుల కేటాయింపు, కొత్త జిల్లాలకు భవనాలను సమకూర్చడం తదితర అంశాలపై చర్చించడానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో (జెడ్పీ సీఈఓ) రాజధాని నగరంలో ఈ నెల 13న గురువారం సమావేశం నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏ జిల్లాకు ఎంత మంది ఉద్యోగులను కేటాయించాలో వివరాలు తెలిసే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారం నుంచి కొత్త జిల్లా పరిషత్‌లు కొలువు దీరనున్నాయి. కొత్త జిల్లాలకు పూర్తిస్థాయి సీఈఓలను కేటాయించే అవకాశం ఉంది. – టి.రవి, జెడ్పీ సీఈఓ -
బదిలీల టెన్షన్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఆరునెలలకు పైగా కొనసాగిన ఎన్నికల కోడ్ ఇటీవలే ముగిసింది. కోడ్ నేపథ్యంలో ఎన్నికల ముందు బదిలీలు అయిన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డిలను రెండు రోజుల క్రితమే వారి వారి పూర్వస్థానాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతాయని స్పష్టమవుతోంది. పలు ప్రభుత్వ విభాగాల ప్రక్షాళనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో పై స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్ అధికారుల వరకు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు జిల్లా స్థాయి ముఖ్య అధికారులు పలువురు బదిలీలకు సిద్ధమవుతున్నారు. సెలవులో కలెక్టర్, కమిషనర్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతాయని స్పష్టం కావడంతో అధికారులు అందుకు సిద్ధమయ్యే ఉన్నారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో సాధారణంగా జరిగే బదిలీల్లో భాగంగా వీరికి స్థాన చలనం తప్పనిసరి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీరి బదిలీ జరుగుతుందని ఉన్నత వర్గాల్లో ఇప్పటికే చర్చలు సాగాయి. ఈ మేరకు వారు కూడా అందుకు సిద్ధపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు వ్యక్తిగత పనులపై సెలవుల్లో వెళ్లిపోయారు. కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఈ నెల 16 వరకు సెలవులోనే ఉండడం గమనార్హం. ఈ లోపు బదిలీల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఐజీ, డీఐజీ సైతం.. కరీంనగర్ రేంజ్ ఐజీ వై.నాగిరెడ్డి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఐజీగా వ్యవహరిస్తున్నారు. నార్త్ జోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్ రేంజ్‌లకు ఆయనే ఐజీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జరిగే బదిలీల్లో నాగిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే డీఐజీ ప్రమోద్‌కుమార్‌కు ఇటీవలే ఐజీగా పదోన్నతి లభించింది. ఆయనను ఐజీగా ఏదైనా జోన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా జిల్లాల్లో సైతం... రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా తిరిగి పాత స్థానానికి వచ్చిన కృష్ణ భాస్కర్‌ను కొనసాగిస్తారా? సాధారణ బదిలీల్లో మారుస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. సిద్దిపేట ప్రత్యేక అవసరాల దృష్ట్యా ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు బదిలీ చేసినప్పటికీ, సిరిసిల్లకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే బదిలీ అయి ఏడాది కూడా పూర్తి కానందున అక్కడే కొనసాగవచ్చు. ఇక జగిత్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుంచి కలెక్టర్‌గా కొనసాగుతున్న శరత్‌కు ఈసారి స్థాన చలనం తప్పనిసరి. ఇక్కడ ఎస్పీగా సింధూశర్మ బాధ్యతలు స్వీకరించి కూడా ఏడాది పూర్తి కాలేదు. అయితే సింధూశర్మ భర్త శశాంక జోగులాంబ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున ఆమె హైదరాబాద్ వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ గత సంవత్సరమే బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన బదిలీ ఉండకపోవచ్చని సమాచారం. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, కలెక్టర్ శ్రీదేవసేన సైతం వచ్చి ఏడాది కూడా కానందున వీరిని యథాస్థానాల్లో కొనసాగించే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు అన్ని జిల్లాల్లోని డీఆర్ఓ, ఆర్డీవో, ఇతర శాఖల్లోని కీలకస్థానాల్లో ఉన్న అధికారులకు సైతం బదిలీ వేటు తప్పదని, ఈ మేరకు పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర స్థాయి బదిలీల తరువాతే జోన్లలో.. రాష్ట్ర స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల ప్రక్రియ పూర్తయిన తరువాతే జిల్లా స్థాయిల్లో అధికారుల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐజీ, డీఐజీ నుంచి కమిషనర్ల వరకు బదిలీల జాబితాలో ఉన్నందు వల్ల కొత్త అధికారులు వచ్చిన తరువాత పోలీస్ శాఖలోని ఏసీపీ తరువాత స్థాయి అధికారులను మార్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌లోని జిల్లా కేంద్రాల్లో, కొన్ని మండలాల్లో సీఐ, ఎస్ఐ స్థాయిల్లో బదిలీలన్నీ వీరి నేతృత్వంలోనే జరుగుతాయి. కరీంనగర్లో కోరుకున్న స్థానాలకు బదిలీ కావాలని కొందరు సీఐలు ప్రయత్నిస్తున్నప్పటికీ, కమిషనర్ కమలాసన్‌రెడ్డి వేచిచూసే ధోరణితోనే ఉన్నట్లు సమాచారం. మండలాల్లో తహసీల్ధార్లు, ఎంపీడీవోల బదిలీలకు రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు లింక్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీలపై అధికార యంత్రాంగంలో టెన్షన్ పెరుగుతోంది. -
వేతన జీవులకు అండగా...
శ్రీకాకుళం అర్బన్: సచివాలయంలో అడుగుపెట్టిన తొలి రోజునే.. ఉద్యోగులకు అండగా ఉంటానని నూతన ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో ఎన్జీవోలు ఉబ్బితబ్బి బ్బవుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సెక్రటేరియట్‌లోని తన చాంబర్లో లాంఛనంగా ప్రవేశించారు. కీలకమైన మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడులతోపాటు సంఘ ప్ర తినిధులు ముఖ్యమంత్రిని కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి జగన్ చేసిన ప్రసంగం వారిలో ఉత్సాహం నింపింది. ఆదివారం జరగనున్న కేబినెట్ తొలి భేటీలో 27 శాతం మధ్యంతర భృతి, సీపీఎస్ రద్దులపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో ఉన్న 27 శాతం ఐఆర్‌పై నిర్ణయం తీసుకుంటానని చెప్పడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. సచివాలయంలో అడుగిడిన తొలిరోజే ఈ ప్రకటన చేయడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సీపీఎస్ రద్దు అంశంపై కూడా కేబినెట్ భేటీలో నిర్ణయం వెలువరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో ఆయా వర్గాల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్హతల ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల పెంపుపై కూడా సీఎం సానుకూలత వ్యక్తం చేయడం అభినందనీయమన్నారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా.. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. ఇందుకు ఆయన ప్రకటిం చిన వరాలే నిదర్శనం. ఉద్యోగి సంక్షేమంతోపాటు అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనేది నిజం. ఉద్యోగులుగా సుపరిపాలన సాగించేందుకు మావంతు కృషి చేస్తాం. – చల్లా శ్రీనివాసరావు, సంఘ జిల్లా కార్యదర్శి పరిపూర్ణ సహకారం ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా తీసుకువెళ్లేందుకు ఉద్యోగులుగా తమవంతు బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం అన్నారు. ఉద్యోగి సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఆశావర్కర్ల జీతాల పెంపుపై నిర్ణయం వెలువరించడంతోపాటు తొలి సంతకం చేశారని, ఉద్యోగికి లబ్ది చేకూర్చే మరికొన్ని కీలక నిర్ణయాలు వెలువరించిన తీరు ప్రశంశనీయమన్నారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌పై, సీపీఎస్ రద్దుపై కేబినెట్ తొలి భేటీలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం ఆనందదాయకమన్నారు. – హనుమంతు సాయిరాం విశ్వసనీయతకు సంకేతం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్ రద్దుపై కేబినెట్లో చర్చిస్తామని ప్రకటించడం సీఎం జగన్ విశ్వసనీయతకు నిదర్శనం. సీపీఎస్ రద్దుకు గత ఐదేళ్లుగా ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్నాం. అప్పటి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసింది. –బడగల పూర్ణచంద్రరావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కౌన్సిలర్ -
టీ షర్టు.. లెగ్గింగ్‌లు వద్దు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగులు హుందాగా ఉండే సంప్రదాయ డ్రెస్‌కోడ్ పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సచివాలయ మహిళా ఉద్యోగులు ధరించాల్సిన దుస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ జీవో జారీ చేశారు. మహిళా ఉద్యోగులు ఇకపై చీర, సల్వార్ కమీజ్, చుడీదార్లను మాత్రమే ధరించి విధులకు హాజరు కావాలని కోరింది. చీర మినహా మిగిలిన అన్ని డ్రస్సులను విధిగా దుపట్టాతో ధరించాలని స్పష్టం చేసింది. దుస్తుల రంగులు సైతం సున్నితమైనవిగా ఉండాలని తెలిపింది. అలాగే పురుషులు ప్యాంటు, షర్టు ధరించి రావాలి. అలాగే, రంగు రంగుల టీ షర్టులు ధరించరాదని పేర్కొంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. -
బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవడంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన పొరపాట్లు అభ్యర్థుల తలరాతలు మార్చేశాయి. ఈ పొరపాట్లు కొందరికి వరంగా మారగా, మరికొందరికి శాపంగా పరిణమించాయి. కొన్ని కీలక స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయి. ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా ఉన్న పోస్టల్, సర్వీస్ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఓటమి అంచుల దాకా వెళ్లిన కొందరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉద్యోగులు చేసిన తప్పులతో గండం నుంచి గట్టెక్కారు. ఫలితాలు తారుమారై గెలుపు అంచుల వరకు వచ్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించడంలో పోస్టల్, సర్వీస్ ఓట్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలో 3.05 లక్షల పోస్టల్ బ్యాలెట్లు, 60 వేల సర్వీస్ ఓట్లను అధికారులు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటం, వాటిని నమోదు చేయడం, ఫారం–12 పూర్తి చేయడంలో తలెత్తిన పొరపాట్లతో వేలాది ఓట్లు చెల్లకుండా పోయాయి. కొన్నిచోట్ల నిబంధనల మేరకు వాటిని సంరక్షించకపోవడం వివాదాస్పదమైంది. పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన అధికారులు బ్యాలెట్ పేపర్ మీద వరుస నంబర్ నమోదు చేయకపోవడం, అదే నంబర్‌ను పోస్టల్ బ్యాలెట్‌ను పంపే కవర్ మీద రాయకపోవడంతో వాటిని కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంతో చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఓటమి బారి నుంచి బయటపడగా, గెలవాల్సిన వారు ఓటమి చెందారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలాగే ఓటమి నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళంలో ఇరుపార్టీల మధ్య తీవ్రస్థాయి చర్చ తర్వాత ఎన్నికల నిబంధనల మేరకు చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ప్రకటించారు. దాదాపు 6,653 ఓట్ల తేడాతో రామ్మోహన్ నాయుడు గెలిచారు. ఆ స్థానంలో గెలుపు అంచుల దాకా వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. గుంటూరు స్థానంలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కూడా ఇలాగే బయటపడ్డారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో భారీగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయి. ఫలితంగా 4,205 ఓట్ల తేడాతో గల్లా జయదేవ్ వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై గెలిచారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాలేదు. భవిష్యత్తులో పోస్టల్ బ్యాలెట్లలో పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ప్రస్తుత నిబంధనలను పూర్తిగా మార్చేయడంతో పాటు ఈవీఎంలలోనే ఈ ఓట్లు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ టీచర్ల ఫెడరేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ఇతర నేతలు కోరారు. -
గౌసూ.. ఇదేం తీరు బాసూ!
అప్పజెపుతున్న పని అవుతుందా లేదా.. ఆయనకు అనవసరం. ఎంత కష్టమైనా చేయాల్సిందే. లేకుంటే జీత భత్యాలు, ఇంక్రిమెంట్లు నిర్దాక్షిణ్యంగా నిలిపేస్తామంటారు. సంస్కరణల బాట అంటారు.. నిబంధనలు పక్కాగా అమలు చేస్తామంటారు. కానీ, చేయి తడిపితే చాలు ఎంతటి పనైనా సాఫీగా జరిపించేస్తారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం ఆగ్రహిస్తే.. అవేమీ తనకు కాదన్నట్లు తనిఖీలు నిర్వహిస్తారు.. అడ్డుజెప్పే అధికారుల్ని రాబోయేది మన ప్రభుత్వమే జాగ్రత్త అంటూ బెదిరించేస్తారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో కొన్ని రోజులుగా సాగుతున్న దౌర్జన్యపు తంతు ఇది. చైర్మన్‌పై సంస్థలో పనిచేస్తున్న పలువురి ఉద్యోగుల ఆరోపణలివి. వేధింపులను ఎన్నాళ్లు భరిస్తారు ఉద్యోగులు.. చేసేది లేక రాష్ట్ర ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. వినతిపత్రం రూపంలో ఆయన లీలలనన్నింటినీ వివరించారు. అనంతపురం న్యూటౌన్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా గౌసుమొద్దీన్ వచ్చిన తర్వాత నిరంకుశ విధానాలతో సతమతమవుతున్నామని చెబుతున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. చిన్న విషయానికీ టార్గెట్లు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారని వేదన చెందుతున్నారు. ఈ క్రమంలో వేధిం పులు భరించలేదని కొందరు ఇటీవలే ఆయన అవినీతీ బాగోతాన్ని వివరిస్తూ రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ పార్వతికి లేఖ రాశారు. తొలిసారి జిల్లా వేదికగా ఆర్డీటీ సాయంతో డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేల పుస్తకాలను అప్లోడ్ చేయాలని చైర్మన్ హుకుం జారీ చేశారు. ఉద్యోగులు ఆపసోపాలు పడుతూ 6 నెలలుగా పనిచేస్తున్నా ఇప్పటికీ 40 వేలకు చేరుకోలేదు. దీనిపై ఉద్యోగులను భయపెడుతూ చైర్మన్, కార్యదర్శి ఎంచుకున్న పద్ధతి విచిత్రంగా ఉంది. అప్‌లోడ్‌కు కష్టమైతే రూ.2,300 చెల్లించాలని నియమం విధించారు. ఇక మరొక అంశం మెంబర్షిప్ టార్గెట్. గ్రంథాలయ రాష్ట్ర డైరెక్టర్ 15 వేల మంది సభ్యులను చేర్చుకోవాలని సూచిస్తే.. దాన్ని 17,200కు లాగారు. చేయకపోతే జీత భత్యాలు, ఇంక్రిమెంట్లు నిలిపివేస్తామని చెప్పేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రినే సమీక్షలు చేయొద్దని స్వయంగా ఈసీ చెబుతుంటే అవేవీ తనకు వర్తించవంటూ శాఖా గ్రంథాలయాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోసారి వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఉద్యోగాలను జాగ్రత్తగా చూసుకోవాలని భయపెడుతున్నారు. వేసవి సెలవుల్లో చిన్నారులకు సమ్మర్ క్యాంపులు నడపాలని ఆదేశించారు. అయితే, చాలా ప్రాంతాలలో పిల్లలు క్యాంపులకు రారని ఉద్యోగులు చెప్పినా వినలేదు. క్యాంపుల విషయంలో బలవంతం చేయొద్దని రాష్ట్ర అధికారులు ఆదేశించినా ఇక్కడ మాత్రం బేఖాతరయ్యాయి. విశ్రాంత ఉద్యోగులకు బకాయిలను ఇవ్వకుండా ఆపేశారు. వాటితో బిల్డింగులు కడుతున్నామని చెబుతున్నారు. దీనిపై కడుపుకాలిన కొందరు విషయాలన్నింటినీ ప్రజా ప్రతినిధుల వద్ద ప్రస్తావిస్తే మీరే సెక్రటరీని, చైర్మన్‌ను వేధిస్తున్నారంటుండడం కొసమెరుపు. ముందు నుంచి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న ఒక ఉద్యోగి ఈయన వద్ద చక్రం తిప్పుతున్నాడని సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. చైర్మన్ కూడా ఆయన వలలో పడడంతో ఆ ఉద్యోగి ఇష్టారాజ్యంగా మారిపోయిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. కేంద్ర గ్రంథాలయంలో మూడేళ్లుగా జరుగుతున్న అవినీతి తంతును కొందరు ఉద్యోగులు రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే పనిచేయలేమని చెప్పుకొచ్చారు. వారి ఆరోపణల్లో కొన్ని.. జీఓ ఎంస్ నం.54 ప్రకారం బదిలీకి కనీస అర్హత 3 ఏళ్లు. కానీ పరిగి గ్రంథాలయాధికారిగా పనిచేస్తున్న ఉద్యోగినిని 3 ఏళ్లు దాటకనే వజ్రకరూరుకు బదిలీ చేశారు. అక్కడున్న ఉద్యోగి 3 ఏళ్లు కాకుండానే పెద్దవడుగూరుకు పంపించారు. డిప్యూటేషన్లప్పుడు నిబంధనలు పాటించ లేదు. జయరామ్ అనే ఉద్యోగిని కొత్త చెరువులో పని చేయనీకుండా గతంలో పీఏగా పెట్టుకున్నారని అందులో పేర్కొన్నారు. రికార్డు అసిస్టెంటుగా మల్లికార్జున జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పనిచేస్తుండగా గ్రేడ్ 2 గ్రంథాలయ అధికారి రవికుమార్ నాయుడును ఎందుకు అక్రమంగా కొనసాగిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధీనంలో 9 షాపులు నడుస్తున్నాయి. కావాల్సిన వారికి తక్కువ బాడుగలకు ఇస్తూ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒక్కో షాపు నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేశారు. షాపుల విషయం కోర్టులో ఉన్నా ఖాతరు చేయలేదు. శెట్టూరు గ్రేడు 3 లైబ్రేరియన్ పోస్టులో ఔట్ సోర్సింగ్ హెల్పర్ పూర్తి చార్జి ఎలా తీసుకుందో అర్థం కావడంలేదు. బాష అనే ఉద్యోగిపై సస్పెన్షన్ ఎత్తి వేస్తూ డైరెక్టర్ మరో చోటికి పోస్టింగు ఇచ్చినా ఆయనను అదే స్థానంలో కొనసాగిస్తున్నారు. లంచం పుచ్చుకునే ఇలా చేశారు. దీనిపై చైర్మన్‌ను ప్రశ్నించిన ఇద్దరు ఉద్యోగులలపై అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేశారు. 1987లో 11 మందికి రావాల్సిన అరియర్స్ డైరెక్టర్ ఆర్డర్స్ బిల్లు మంజూరు కోసం చైర్మన్, కార్యదర్శులు ఒక్కొక్కరితో రూ.30 వేలు తీసుకున్నారు. జిల్లాలో పలు గ్రంథాలయాలకు అక్రమ డిప్యూటేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు ఇష్టం వచ్చిన చోటుకు వేయడానికి రూ. 50 వేలు తీసుకున్నారు. కేంద్ర గ్రంథాలయంలో రికార్డు అసిస్టెంటు వెంకటేష్‌ను చైర్మన్ పీఏగా నియమించుకుని అతని ద్వారా డబ్బులు వసూలు చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. పనిచేయమంటే వ్యతిరేకిస్తున్నారు దశాబ్దాలుగా ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే గ్రంథాలయ ఉద్యోగులకు పనిభారం ఉండేది కాదు. 2015 తర్వాత సంస్కరణల బాట పడదామంటే వ్యతిరేకిస్తున్నారు. సభ్యత్వం కానీ, సమ్మర్ క్యాంపులు కానీ చాలా మంది ఉద్యోగులకు ఇష్టం లేదు. ఇతర శాఖల్లో ఇటువంటి వ్యతిరేకత కనపడదు. పని చేయడానికి ఇష్టపడక అవినీతి అంటూ కొత్త రాగమెత్తుకున్నారు. అలాంటిదుంటే ఏ విచారణకైనా సిద్ధమే. – గౌసుమొద్దీన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ -
ఉద్యోగుల పాలి‘ట్రిక్స్’
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఉద్యోగం ఊడినట్టేనని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. కొందరు ఉద్యోగ సంఘ నేతలు వాటిని బేఖాతరు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో సన్నిహితంగా ఉంటూ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ప్రతిసారీ ఎన్నికలను ఎక్కువగా ప్రభావితం చేసే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నికల నియమావళికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. అయితే కొందరు తమ సామాజిక వర్గానికి చెందిన నేతలతోనో.. తమ సంఘానికి అనుకూలమైన రాజకీయ పార్టీతోనో సన్నిహితంగా మెలుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉద్యోగ సంఘ నేతలపై ప్రత్యేక నిఘా పెట్టింది. నేతలకు తెర వెనుక ఉండి మద్దతు తెలుపుతూ రాజకీయాలు చేస్తే సహించేది లేదని జిల్లా ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెర వెనుక మద్దతిస్తూ.. వాస్తవానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నికల నిబంధనలు పాటించాలి. కానీ జిల్లాలో కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులు ముఖ్యంగా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు టీడీపీ అధినేత సామాజికవర్గానికి చెందిన నేతలకు తెర వెనుక మద్దతిస్తూ వస్తున్నారు. ప్రచారంలోనూ సహకారం అందిస్తున్నారు. సంఘ నేతలతో టీడీపీ నాయకుల మంతనాలు.. ఆయా ఉద్యోగ సంఘాల నేతలను ఆకట్టుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్న టీడీపీ నేతలు వారితో రోజూ టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసిన అభ్యర్థులు నిత్యం కొన్ని ఉద్యోగ సంఘాల నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పలువురు సంఘనాయకులు రాత్రివేళల్లో సంఘ భవనాల్లోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో విందులు, వినోదాల్లో మునిగితేలుతూ ఆయా నేతలకు మద్దతివ్వాలని చెబుతూనే అభ్యర్థుల తరఫున ప్రచార వ్యూహాలు రూపొందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉదయం కార్యాలయాల్లో సంతకాలు పెట్టి, ఆ తర్వాత నేతల చెంతకు తుర్రుమంటున్నవారికి లెక్కేలేదు. ఎన్నికల సంఘం పటిష్ట నిఘా.. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆగడాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ఈసీ అధికారులు భావిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టవద్దనీ, ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేశారు. కానీ కొందరు ఉద్యోగ సంఘాల నేతలు పార్టీలవారీగా విడిపోయి పోటీపడి ప్రచారం చేస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. -
సీపీఎస్ రద్దు కోరుతూ భారీ ర్యాలీ
సాక్షి, అనంతపురం: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేఖంగా నల్లదుస్తులతో అనంతపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘం నేతలు రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ... సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగలకు పదవి విరమణ తర్వాత జీవితానికి ఆర్థిక భద్రత, లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, ప్రత్యేక ప్రయోజనాలు, సామాజిక భద్రతగా పింఛన్లు వస్తాయని అనుకున్నాం కానీ చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై విషయంలో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చినందుకు వారు వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. -
ఉద్యోగులకు జూలై ఝలక్!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ(పీఆర్సీ) ఏర్పాటులో తీవ్ర జాప్యం చేశారు. ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన మధ్యంతర భృతినీ ప్రకటించడంలో నాన్చుడు ధోరణి అవలంబించారు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాజేసింది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఈ అసంతృప్తి జ్వాలలు టీడీపీ విజయావకాశాలను మసి చేస్తాయని భయపడిన సర్కారు హడావుడిగా 20 శాతం ఐఆర్ ఇస్తున్నట్లు ప్రకటించేసింది. కానీ.దాన్ని వచ్చే జూలై నుంచి అమలు చేస్తారట!.. తక్షణమే చెల్లించాల్సిన ఐఆర్‌ను ఐదు నెలల తర్వాత నుంచి అమలు చేయడమేమిటని ఉద్యోగులు మండిపడుతున్నారు. జూలైలో అమలు చేసేదాన్ని ఇప్పుడే హడావుడిగా ప్రకటించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. పీఆర్సీ అమలులో జాప్యం కారణంగా రగిలిపోతున్న ఉద్యోగులను మభ్యపెట్టి, మచ్చిక చేసుకోవడం ద్వారా ఎన్నికల్లో వారి ఓట్లు పొందాలన్న రాజకీయ లక్ష్యమే తప్ప సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. ఐఆర్ ప్రకటనతో స్పష్టమవుతోందని ఉద్యోగులు అంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. లేనిగొప్పలు చెబుతూ సమీక్షలు, సమావేశాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో పని చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక గుండెపోటుకు గురై మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. పోనీ ఎంత కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు, గౌరవం దక్కడం లేదు. సకాలంలో పదోన్నతులు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. గద్దెనెక్కగానే పక్కనే ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిందన్న ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించి ఆ మేరకు బాండ్లు ఇచ్చారు. ఇదిగో ఇస్తాం..అదిగో ఇస్తాం అంటూ నాలుగేళ్ల పాటు ఊరించి చివరకు గతేడాది జీపీఎఫ్ ఖాతాలో కాగితాలపై సర్దుబాటు చేశారే చప్ప చేతికిచ్చిన పాపాన పోలేదు. 11వ పేరివిజన్ కమిషన్(పీఆర్సీ) వేతనాలు 2018 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలి. అలా అమలు చేయాలంటే ఈ కమిషన్ 2017లోనే ఏర్పాటు చేయాలి. కానీ పీఆర్సీ కమిషన్ సకాలంలో ఏర్పాటు చేస్తే ఎక్కడ నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సి వస్తోందన్న ఆలోచనతో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటును వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు ఉద్యోగ సంఘాల ఒత్తిడి తట్టుకోలేక గతేడాది మేలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అసితోష్ మిశ్రా చైర్మన్‌గా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రిపోర్టు ఆరు నెలల్లో ఇవ్వాల్సి ఉంది. కానీ దాదాపు పది నెలలు కావస్తున్నా కమిషన్ నివేదిక ఇవ్వలేదు. దీంతో కనీసం మధ్యంతర భృతైనా ఇవ్వండంటూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇవ్వలేమని ప్రభుత్వం తెగేసి చెప్పింది. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకైనా ఓ మాటైనా చెప్పండి చాలు అంటూ ఏపీ ఎన్జీవో సంఘం మాజీ నేత పరుచూరి అశోక్‌బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆ బాధ్యతలు అప్పగించారు. యనమలతో జరిగిన చర్చల్లో 20 శాతం ఐఆర్‌కు పరుచూరి అండ్‌కో అంగీకరించడం.. ఆ వెంటనే చిట్టచివరి కేబినెట్లో ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటిస్తున్నాం. అమలు మాత్రం జూలై నుంచి చేస్తాం అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం మేతో ముగియనుంది. పైగా మరో వారం పది రోజుల్లో ఎన్నికల కోడ్ అమలుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం తమను మభ్య పెట్టేందుకే ప్రభుత్వం ఐఆర్‌ను ప్రకటించిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 31,452 మంది ఉద్యోగులున్నారు. వారిలో 2,708 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 39,297 మంది పని చేస్తుండగా, వారిలో 2956 మంది మహిళలున్నారు. ఇక స్థానిక సంస్థలైన లోకల్ బోర్డుల్లో 11,232 మంది పని చేస్తున్నారు, వీరిలో 2,679 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇక 15 వేల మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. వీరంతా ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. గతంలో ఐఆర్ ఎప్పుడు ప్రకటించిన ఆ మరుసటి నెల నుంచే సర్దుబాటు చేసేవారని, కానీ ఇలా ప్రకటించిన ఆరు నెలలకు ఐఆర్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదంటున్నారు. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉంటుందో? పోతుందో? తెలియదు. అలాంటప్పుడు ఇలా అర్థంపర్థం లేని మధ్యంతర భృతిని ప్రకటించి ఉపయోగమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి గిమ్మిక్కులు ఎన్ని చేసినా చంద్రబాబును మాత్రం ఈసారి నమ్మే ప్రసక్తే లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు తేల్చి చెబుతున్నాయి. -
ఉద్యోగులకు ఊరట
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ చిన్న, సన్నకారు రైతులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, అసంఘటిత రంగ కార్మికులకు మేలు కల్పించింది. ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. అక్రమాలకు తావు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పెట్టుబడి సాయం జమకానుంది. ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచడంతో ఉద్యోగులు, వేతనాలు పెంచడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ కింద రూ. 3 వేలు అందించనున్నారు. కార్మికులు పెన్షన్ కోసం ప్రతి నెల రూ. 100 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. నిజామాబాద్‌నాగారం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట లభించింది. ఎప్పటి నుంచో ఉద్యోగులు ఆదాయ పరిమితి పెంపు, గ్రాడ్యూటీ, ఒకే పెన్షన్ విధానం తదితర వాటిపై ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్లో ప్రభు త్వం ఆదాయ పరిమితిని పెంచడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. నిజామాబాద్ ఉమ్మడి(కామారెడ్డి–నిజామాబాద్)ల్లో సుమారు 42 వేల మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉద్యోగులకు లబ్ధి ఇలా.. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు 42 వేల మంది ఉన్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 24 వేల మంది ఉద్యోగులు, కామారెడ్డి జిల్లాలో 18 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో సీపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులు సుమారుగా రెండు జిల్లాలో కలిపి 9 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 5342 మంది, కామారెడ్డి జిల్లాలో 3,560 మంది ఉన్నారు. అయితే ఉద్యోగుల ఆదాయ పరిమితి పెంపు 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. గ్రాట్యూటీ పరిధి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పెంచారు. ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే ఉద్యోగులకు రూ. 6.5 లక్షలలోపు ఆదాయపన్ను మినహాయింపు, స్టాండెడ్ డిడెక్షన్ ఇప్పటి వరకు రూ. లక్షా 50 వేల వరకు ఉండేది. మరో రూ. 50 వేలు పెంచడం జరిగింది. ఆదాయ పరిమితి పెంపు విషయంలో ఈబీసీ కులాల వారికి మాత్రం రూ. 8 లక్షలలోపు ఆదాయ పరిమితి ఉన్న వారిని పేదలుగా గుర్తించారు. అలాగే ఉద్యోగులకు కూడా రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు అన్యాయం దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెడుతున్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో అన్యాయం చేసింది. ప్రజాప్రతినిధులకు మాత్రం ఐదేళ్లు పరిపాలిస్తే జీవితాంతం పెన్షన్ సౌకర్యం ఉంది. అదే ఏళ్ల తరబడి ఉద్యోగులు నిర్వహిస్తున్న వారికి మాత్రం పెన్షన్ సౌకర్యం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 9 వేల మందికిపైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. 2004 సంవత్సరం తరువాత ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికి సీపీఎస్ విధానం అమలవుతోంది. దీంతో ప్రభుత్వం నుంచి పెన్షన్ లేకుండా పోయింది. ఒకే దేశం ఒకే పెన్షన్ విధానాన్ని ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తే బాగుండేదని కోరుతున్నారు. ఏళ్ల తరబడిగా పోరాటాలు చేస్తున్న సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదు. దీంతో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ విధానం కొనసాగింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వోద్యోగుల మూకుమ్మడి సెలవు
డెహ్రాడూన్ : సకాలంలో ప్రమోషన్లు, అలవెన్సులతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉద్యోగులు గురువారం మూకుమ్మడి సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 4న రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపిస్తామని సెక్రటేరియట్ యూనియన్ కార్యదర్శి వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వోద్యోగులు మూకుమ్మడి సెలవుపై వెళ్లడాన్ని ప్రభుత్వం అనుమతించందని అంతకుముందు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఇచ్చిన మాస్ లీవ్ పిలుపులో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా,ఈనెల 31, ఫిబ్రవరి 4న సెలవు తీసుకునే ఉద్యోగులను సచివాలయ ప్రాంగణంలోకి అనుమతించరని, నిరసనల సీసీటీవీ ఫుటేజ్‌ను ప్రభుత్వం సేకరిస్తుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. -
వెయ్... చిందెయ్...
వారంతా ఉపాధి సిబ్బంది. నాలుగు రోజుల కిందట ఓ విందు కార్యక్రమానికి వెళ్లి అక్కడ మద్యం సేవించి భోజనం ఆరగించారు. తరువాత అక్కడ నుంచి కార్యాలయానికి వచ్చి మద్యం మత్తులో వేయ్...చిందేయ్....అంటూ గంతులేశారు. అక్కడితో ఆగకుండా వాటిని తమ సెల్ఫోన్లలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లోకి అప్లోడ్ చేశారు. అది కాస్త ఆలస్యంగానైనా శుక్రవారం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో చిందులేసిన ఆరుగురు సస్పెండ్‌కు గురయ్యారు. విజయనగరం జిల్లా / గరుగుబిల్లి: విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో ఉండాల్సిన సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాలలో చిందులు వేస్తూ సామాజిక మాధ్యమాలకు చిక్కారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలకు సస్పెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది ఈ నెల 12న మండలంలోని సంతోషపురంలో జరిగిన ఓ విందు కార్యక్రమంలో అధికారులతో పాటు పాల్గొన్నారు. విందు ముగించుకొన్న తరువాత ఉపాధి హామీ కార్యాలయానికి తిరిగి చేరుకొన్నారు. విందులోనే మద్యం సేవించి ఉండటం కారణంగా కార్యాలయానికి వచ్చిన తరువాత కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎవ్వరూ లేకపోవడంతో సిబ్బంది సెల్ఫోన్లో హుషారు అయిన పాటలు వేసుకొని డ్యాన్సులు చేసి చిందులు వేసి తమలో దాగివున్న కళను ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా ఓ అడుగు ముందుకు వేసి ఈ దృశ్యాలను ఉపాధి సిబ్బందిలో ఒకరు సామాజిక మాధ్యమాలలో ఒకటైన ఫేస్బుక్లో పెట్టారు. ఈ వీడియో క్లిప్పింగ్ మీడియా ప్రతినిధులకు చిక్కింది. ఈ మేరకు వీడియోను లీక్ చేయకుండా ఉండాలంటే కొంత మొత్తం ఇవ్వాలని మీడియా ప్రతినిధులు(సాక్షి కాదు) ఉపాధి సిబ్బందికి డిమాండ్ చేశారు. దీనికి ఉపాధి సిబ్బంది అంగీకరించకపోవడంతో విషయం కాస్త ఆలస్యంగా శుక్రవారం బయటకొచ్చింది. ఆరుగురు ఉద్యోగులు సస్పెన్షన్ మండల కేంద్రంలోని స్థానిక ఉపాధి హామీ పథకంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఆరుగురు సిబ్బంది విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు విజయనగరం జిల్లా నీటియాజమాన్య సంస్థ పధక సంచాలకులు ఆర్.రాజగోపాలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో జి.పార్వతి తెలిపారు. ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ విధులను నిర్వహిస్తున్న సమయంలో మద్యంను సేవించి, చిందులు వేసినట్లు వచ్చిన ఆరోపణలు భాగంగా ప్రాథమిక విచారణ ఆధారంగా తొలగించినట్టు పేర్కొన్నారు. సస్పెండ్‌కు గురైన వారిలో ఏపీవో టి.రామకృష్ణనాయుడు, సాంకేతిక సహయకులు పి.పోలారావు, సిహెచ్.వెంకటేష్, ఎం.రమణ, కంప్యూటర్ ఆపరేటర్ ఎ.శంకరరావు, జేఈ వైఆర్‌డీ ప్రసాద్‌లున్నారు. ఇదిలా వుండగా విధులలో బాధ్యతా రహితంగా వ్యవహరించిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు సస్పెండ్ కొనసాగుతుందని ఎంపీడీవో తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్, సాంకేతిక సహాయకులు చిందులు వేసినప్పటికీ, సిబ్బందిని క్రమశిక్షణలో ఉంచలేని ఏపీవో, జేఈలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. -
ఉద్యోగులు ఎటువైపో.!
ఆదిలాబాద్‌అర్బన్: రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులు దృష్టి సారించారు. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రచారంలో హడావిడిగా గడుపుతున్న అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఓ కన్నేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు రేపటి వరకు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు ఉద్యోగులను కూడా తమ దారికి తెచ్చుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు మొదలెట్టారు. మరోవైపు వందశాతం పోలింగ్ లక్ష్యంగా చర్యలు చేపడుతున్న ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగి తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది. కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం గెలుపును ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు వారిని అనుకూలంగా మలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలో ఉద్యోగులకు అనుకూలంగా ఉండే తాయిలాలను ప్రకటిస్తూ మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాయి. 7,250 మంది ఉద్యోగులు.. జిల్లాలోని 18 మండలాల్లో దాదాపు 7,250 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. అయితే వీరంతా ఖజానా శాఖ పరిధిలో వేతనాలు పొందేవారే. వీరు కాకుండా ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్, సింగరేణి ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరందరికీ జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం’ (సీపీఎస్) రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గతకొంత కాలంగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుకూలంగా తమవంతు సహకారం చేస్తామని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అలాగే పీఆర్సీ, మధ్యంతర భృతిపై కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు. దీంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. తమ డిమాండ్లకు అనుకూలంగా ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో ప్రకటించాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. అన్ని పార్టీల నాయకులు సీపీఎస్ విషయమై సానుకూలంగా స్పందిస్తామని సంకేతాలు ఇవ్వడంతో అసలు ఉద్యోగులు ఏ పార్టీని నమ్మి ఓట్లు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కారించే విధంగా ఏ పార్టీ మేనిఫెస్టో ఉంటుందో వారి వైపే ఉద్యోగులు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రేపటితో గడువు పూర్తి.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పిస్తే సమయానికి వారి చేతికి పత్రాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు కలిపి పోస్టల్ బ్యాలెట్ కోసం 3,025 మంది సిబ్బంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఒక నియోజకవర్గంలోని సిబ్బంది అదే అసెంబ్లీ పరిధిలో పోలింగ్ విధులు నిర్వర్తిస్తే పోస్టల్ బ్యాలెట్ అప్పుడే ఇస్తామని, ఇతర నియోజకవర్గంలో పోలింగ్ బాధ్యతలు ఉంటే పోస్ట్ ద్వారా లేదా ఆర్వోకు డ్యూటీ ఆర్డర్ కాపీతో పాటు పోస్టల్ బ్యాలెట్‌ను పంపిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇందుకు ఎన్నికల సిబ్బంది డ్యూటీ ఆర్డర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఈ నెలాఖరులోగా పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోకుంటే ఓటు వినియోగించుకోవడం కష్టంగా ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థుల ఆశలు.. గత ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటున్నందున ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఓటు హక్కు వినియోగానికి అవకాశం దొరకడం లేదని సమాచారం. ఓటు వినియోగించుకున్న సిబ్బంది సైతం పోస్టల్ బ్యాలెట్‌పై అనుమానాస్పదంగా మార్క్ చేయడంతో కొన్ని ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించింది. దీనిపై కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఓటు ఆవశ్యకత గురించి ఉద్యోగులకు, సిబ్బందికి వివరిస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా మారే అవకాశం లేకపోలేదు. అందుకే రాజకీయ పార్టీలు ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ వారిని మచ్చిక చేసుకునే పనిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. -
వెల్నెస్ సెంటర్ సిద్ధం
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛన్‌దారులకు ప్రయోజనం చేకూర్చేలా..ఎంప్లాయిస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా ఖమ్మంలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్‌ను సిద్ధం చేశారు. దీనిని..సోమవారం ఉదయం 11గంటలకు కలెక్టర్ కర్ణన్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 15 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు పలు జిల్లాల్లో 11 ప్రారంభించగా తాజాగా ఖమ్మంలో 12వది సిద్ధమైంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర చికిత్సల కోసం ట్రామా కేర్ భవనాన్ని ఇందుకు కేటాయించారు. దీనిని నూతనంగా నిర్మించి..ఐదు నెలలు పూర్తయినా వినియోగంలోకి తీసుకురాలేదు. రూ. 7 కోట్ల వ్యయంతో కట్టిన ఈ భవనాన్ని ఇటీవల కలెక్టర్ సందర్శనలో పరిశీలించి..ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పుడు వెల్నెస్ సెంటర్ కోసం ఆ నూతన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను కేటాయించారు. ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉత్వర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాట్లు.. కలెక్టర్ కర్ణన్ ఆదేశాలతో ఆరోగ్యశ్రీ జేహెచ్ఎస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి మూడు రోజులుగా తిష్ట వేసి..పనులు చేయించారు. ఆస్పత్రికి చెందిన అధికారులు, ఇంజనీరింగ్ వారితో మాట్లాడి ట్రామా కేర్ భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను స్వాధీనం చేసుకుని..వెల్నెస్ సెంటర్‌కు కావాల్సిన పరికరాలు, సామగ్రిని హైదరాబాద్ నుంచి తెప్పించి..ఇక్కడ ఏర్పాటు చేయించారు. 24 మంది ఉద్యోగులతో సేవలు.. వెల్నెస్ సెంటర్లో 24 మంది ఉద్యోగుల ద్వారా వైద్యసేవలు అందించనున్నారు. అందుకోసం ఇటీవల వారి నియామకం చేపట్టారు. ఎంబీబీఎస్ డాక్టర్లు 4, బీడీఎస్లు 2, ఫిజియోథెరపిస్ట్‌లు 2, ఫార్మాసిస్ట్లు 3, జీఎన్ఎంలు 3, డెంటిస్ట్‌లు 4, డెంటిస్ట్ అసిస్టెంట్లు 2, వార్డుబాయ్‌లు 3, అబ్డామిన్ స్కానర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 1 నియమించారు. వెల్నెస్ సెంటర్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు. ఇక్కడ వైద్యసేవలు పొందాలనుకునేవారు ఎంప్లాయి, జర్నలిస్టు, పెన్షనర్, వారి కుంటుంబ సభ్యులు హెల్త్ కార్డును తీసుకొచ్చి వైద్యసేవలు పొందొచ్చు. ఓపీ మాత్రమే.. నూతనంగా ప్రారంభించనున్న వెల్నెస్ సెంటర్లో ఔట్ పేషంట్ (ఓపీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ప్రాథమిక వైద్యసేవలు నిర్వహించనున్నారు. రోగులకు వైద్య పరీక్ష చేశాక మందులు ఇస్తారు. త్వరలో స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా అందుబాటులోకి తేనున్నారు. మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందించనుండగా, అత్యవసర వైద్య సేవల కోసం ఇతర ఆస్పత్రులకు పంపి స్తారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తం గా 250 ఆస్పత్రులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఠీఠీఠీ.్ఛజిట.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో ఆ దవాఖానాల వివరాలు, అందుకు సంబంధిచిన పూర్తి సమాచారం ఉంటుంది. ఈహెచ్ఎస్ ద్వారా 1800 రకాల వైద్య సేవలు అందించనున్నారు. -
పెన్షన్ టెన్షన్
-
1.572 % డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక విడత కరువుభత్యం (డీఏ) చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 1.572 శాతం డీఏ చెల్లించే ఉత్తర్వులపై సోమవారం సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో జారీ కానున్నాయి. పెంచిన డీఏ బకాయిలను జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)తో కలిపి అక్టోబర్ 1న చెల్లించే సెప్టెంబర్ వేతనంలో నగదుగా చెల్లించనున్నారు. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 27.24 శాతానికి చేరుకుంది. తాజా డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.350 కోట్ల అదనపు భారం పడనుంది. జూలై డీఏ ఎప్పుడో? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏటా జనవరిలో, జూలైలో డీఏలను పెంచుతాయి. కేంద్రం పెంచిన డీఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు రెండుసార్లు డీఏ చెల్లిస్తుంది. జూలై డీఏను పెంచుతూ ఆగస్టు 29న కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో డీఏ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ డీఏ మంజూరులో ఈసారి జాప్యం జరిగింది. 2017 జూలై డీఏ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 17న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు సైతం 1.572 శాతం పెంచింది. 2018 జనవరి డీఏ పెంపుపై తాజాగా సీఎం నిర్ణయం తీసుకున్నారు. 2018 జూలై డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూలై డీఏ పెంపు ఎప్పుడనే దానిపై స్పష్టత రావట్లేదని ఉద్యోగులు చెబుతున్నారు. అసెంబ్లీకి ముందుస్తు ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉంటే రెండు విడతల డీఏలను కలిపి ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. -
ఉధృతంగా ‘పింఛన్’ పోరు
మెదక్ జోన్: సీపీఎస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్‌తో సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన పోరు ఉధృతంగా కొనసాగింది. ఈ మేరకు శనివారం చీకటి దినంగా పాటించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఒకరోజు సామూహిక సెలవుపెట్టి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అయితే టీఎన్జీఓ నాయకులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలో పాల్గొన్నారు. ఆందోళనకారులు ధర్నాలు, నిరసనలతో జిల్లా కేంద్రం దద్దరిల్లింది. మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్కు వద్ద నుండి ఉద్యోగ, ఉపాధ్యాయులు కలెక్టరెట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరెట్‌ను ముట్టడించి, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ ధర్మారెడ్డికి అందజేశారు. జాక్టో, యూఎస్పీసీ, టీటీజేఏసీ, టీఎన్జీఓఎస్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ లోపభూయిష్టమైన సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, జాక్టో నాయకులు శ్రీనివాస్, ప్రణీత్, సత్యనారాయణ, యూఎస్‌టీసీ నాయకులు పద్మారావు, రమేష్, హీరాలాల్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంరావు, నరెందర్, అసోమెట్ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, జానకిరాం, మనోహర్, చిరంజీవి, టీపీజేఏసీ చైర్మన్ రాందాస్, ప్రధాన కార్యదర్శి దత్తత్రేయ కులకర్ణి, టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంలు, ఎస్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.