జీతం+ఎరియర్స్= ఆగస్టు | 7th Pay Commission: Govt employees to get arrears in one installment along with August salaries | Sakshi
Sakshi News home page

జీతం+ఎరియర్స్= ఆగస్టు

Published Sat, Jul 30 2016 9:18 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

జీతం+ఎరియర్స్= ఆగస్టు

జీతం+ఎరియర్స్= ఆగస్టు

న్యూఢిల్లీ: 7 వవేతన సంఘం కమిషన్ సిఫారసుల అమలుకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు మరో తీపి కబురు అందించింది. సవరించి వేతనాల ప్రకారం వేతన  బకాయిలలో మొదటి విడత  ఆగస్టు నెలలో చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. సవరించిన వేతనంతో పాటుమొదటి ఎరియర్స్ ను  అందుకోనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ బలగాల సిబ్బంది, పెన్షనర్లలో ఉత్సాహం  నెలకోనుంది.  జనవరి 1, 2016 నుంచి అమలవుతున్న 7వ వేతన సంఘం  సిఫారసుల మేరకు .... పెరిగిన జీత భత్యాల బకాయిలలోచెల్లింపుల ఆదేశాలు జారీ చేసినట్టుఆర్థిక  మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది.  ఆగష్టు, 2016 నెల జీతం చెల్లింపు తో పాటు  మొదటి  విడత నగదు చెల్లించడానికి  నిర్ణయించినట్టు  శుక్రవారం ట్విట్ చేసింది.  జీపీఎఫ్, ఎన్ పీఎస్ తదితర సర్దుబాట్ల తరువాత  ఈ చెల్లింపులు చేస్తున్నట్టు పేర్కొంది. ముందు ప్రకటించినట్టుగా 125శాతం డీఎలో  ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎపుడు ఉంటుందనేది త్వరలోనే పకటిస్తామని తెలిపింది.

జనవరి 1,  2016 నుంచి  అమలు చేస్తున్న సిసిఎస్ (ఆర్పీ) రూల్స్, 2016  ప్రకారం సవరించిన వేతనంతోపాటుబ మొదటి విడత ఎరియర్స్ నగదు రూపంలో చెల్లించనున్నట్టు  ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేసింది.జీతం , పెన్షన్ పెంపునకు  సంబంధించిన  నోటిఫికేషన్ ప్రకారం 33 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 14 లక్షల సాయుధ బలగాలు, 52 లక్షల పెన్షనర్లు  భారీ వేతనాలు పొందనున్నారు. కాగా  ఈ ఏడాది జనవరి నుంచి జీతాల పెంపు వర్తిస్తుంది..దీనికి సంబంధించిన  వేతన బకాయిలను  వాయిదాల పద్దతిలో ఉద్యోగులకు చెల్లించనున్నట్టు ప్రభుత్వం గెజిట్ లో వెల్లడించిన ంగతి తెలిసిందే.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement