సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో రెండో పీఆర్సీని వేయనుంది ప్రభుత్వం. ఇదే సమయంలో ఇంట్రిం రిలీఫ్(IR)ను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది.
అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్‌ఎస్(EHS)పై కూడా నిర్ణయం తీసుకోనుంది. ఈహెచ్‌ఎస్ అమలుకు విధి విధానాలను రూపొందించనుంది. అలాగే, గవర్నమెంట్ ఎంప్లాయిస్ హౌజింగ్‌పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు
Comments
Please login to add a commentAdd a comment