KCR Government
-
సీఎం రేవంత్ ఇంటికి ఆర్టీసీ ఉద్యోగులు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవాలని సీఎం రేవంత్‌ను వేడుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో తమను చిన్న కారణాలతో తొలగించారని చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొందరు బుధవారం తెల్లవారుజామునే సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందన్నారు. చిన్న చిన్న కారణాలతో తమను సస్పెండ్ చేసి, మెమో ఇచ్చి, జీతాలు కట్ చేసినట్టు సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని తమ గోడును చెప్పుకున్నారు. ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. -
బీఆర్ఎస్లో మంత్రులకు బిగ్ షాక్.. ఓటమి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. ఇక, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. ఓడిన మంత్రులు వీరే.. పాలకుర్తి.. ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం.. పువ్వాడ అజయ్‌కుమార్ నిర్మల్.. ఇంద్రకరణ్ రెడ్డి ధర్మపురి.. కొప్పుల ఈశ్వర్ మహబూబ్‌నగర్.. శ్రీనివాస్ గౌడ్.. వనపర్తి.. నిరంజన్ రెడ్డి. ఇక, పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఇక్కడ విజయం సాధించారు. మరోవైపు.. ఖమ్మంలో పువ్వాడను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కాంగ్రెస్ నేతలు తుమ్మల, పొంగులేటి చాలా సందర్బాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఛాలెంజ్‌ను గెలిచి చూపించారు తుమ్మల. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ) చేతిలో ఇంద్రకరణ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అలాగే ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌ను కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఓడించారు. మరోవైపు.. తాజాగా ప్రగతి భవన్ వద్ద పరిస్థితి ఇలా ఉంది.. #WATCH | #TelanganaAssemblyElections2023 | CM Camp Office in Hyderabad wears a deserted look as the ruling BRS trails in the state election, as per official EC trends. Chief Minister and party chief K Chandrashekar Rao is currently at the CM residence. Congress is leading in… pic.twitter.com/KidmLpbBD6 — ANI (@ANI) December 3, 2023 -
ఎగ్జిట్‌పోల్స్ ఎఫెక్ట్.. ‘వేల కోట్ల చెల్లింపులకు బీఆర్ఎస్ ప్లాన్!’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్టు ఎక్కువ సంఖ్యలో పోల్స్ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను దీవించారు. డిసెంబర్ మూడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. పదేళ్లుగా బీఆర్ఎస్ నేతలు భూదోపిడీలకు పాల్పడ్డారు. లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు, ప్రభుత్వానికి చెందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ధరణిని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ పరిధిలో వేలాది ఎకరాలు దోచుకున్నారు. అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలు పనులు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు వేల కోట్ల చెల్లింపులు ఈ రెండు, మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ప్రభుత్వం నుండి మరొక ప్రభుత్వం మారుతున్న క్రమంలో ఇష్టరాజ్యoగా వ్యవహరించకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలి. తెలంగాణలో గత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ధర్మపురి, హుజూర్ నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో ఇబ్బందులు నెలకొన్నాయి. ప్రస్తుతం కోర్టులలో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. కమీషన్ల కోసం రైతుబంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోంది. ప్రభుత్వ అన్ని ట్రాన్సాక్షన్స్‌పై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ ట్రాన్సాక్షన్‌పై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్‌లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్.. డిసెంబర్ నాలుగున బీఆర్ఎస్ కేబినెట్ భేటీ -
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్, బండి రియాక్షన్
సాక్షి, కరీంనగర్/కొడంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్ స్పందిస్తూ.. ‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవు. సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు.. రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు యత్నించారు’ అని విమర్శించారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం బండి సంజయ్ నాగార్జున సాగర్ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది?. తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్ తీసుకొచ్చే కేసీఆర్ అండ్ టీం రెచ్చగొట్టే యత్నం చేస్తోంది. నాగార్జునసాగర్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చింది.? తెర వెనుక ఎవరున్నారు?. కేసీఆర్‌వి ఫాల్స్ రాజకీయాలు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్ వ్యూహం ఫలించేనా?
తెలంగాణ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన వివాదం రైతుబంధు నిధుల పంపిణీ. తొలుత రైతులకు ఈ నిధుల పంపిణీకి అనుమతించిన ఎన్నికల సంఘం, మళ్లీ దానిని నిలిపివేయడంతో పార్టీల మధ్య రచ్చరచ్చ అయింది. రైతుబంధు ఆగడం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి ప్రయోజనం అన్నది ఆలోచిస్తే రాజకీయంగా బీఆర్ఎస్కు కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పక తప్పదు. నిజానికి రైతుబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ పేటెంట్. ఆయన కొన్ని సంవత్సరాలుగా దీనిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతీ సీజన్లోనూ ఎకరాకు ఐదువేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలలో పెట్టుబడి సాయం కింద జమ చేస్తున్నారు. ఎన్నికల ముందు ఈ డబ్బు వేస్తే రాజకీయంగా ఉపయోగం ఉంటుందని ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంటుంది. అలా చేయడం రైటా? రాంగా? అన్న చర్చలోకి వెళ్లడం లేదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరడం, దానికి ఈసీ ఓకే చేస్తూ కొన్ని కండీషన్లు పెట్టడం జరిగింది. వాటి ప్రకారం ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోరాదు. కానీ, మంత్రి హరీశ్‌రావు అత్యుత్సాహంతో ఎన్నికల ప్రచార సభలో పోలింగ్‌కు ముందే రైతుబంధు డబ్బులు జమ అవుతాయంటూ చేసిన వ్యాఖ్య ఆ పార్టీకి చికాకు అయింది. తాను కేవలం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించానని, కాంగ్రెస్ ఫిర్యాదువల్లే ఇది ఆగిందని ఆయన అంటున్నారు. ఈ పరిణామంతో నెగిటివ్ రాకుండా చూసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత తదితర బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా రంగంలోకి దూకారు. రైతు బంధు నిలిపివేత అంశం అంతటిని కాంగ్రెస్‌పై నెట్టడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా యత్నించారు. కానీ, ఎన్నికల సంఘం నేరుగా హరీశ్ రావు పేరు ప్రస్తావించడంపై వివరణ ఇవ్వలేని పరిస్థితిలో వారు పడ్డారు. అయితే, ఎటూ తామే పవర్లోకి వస్తామని, డిసెంబర్ ఆరో తేదీన ఈ డబ్బు రైతులకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఇన్నేళ్లుగా ఈ స్కీమును అమలు చేస్తున్నారు కనుక రైతులు విశ్వసించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ కోణంలో బీఆర్ఎస్కు పెద్ద నష్టం ఉండదు. నిజానికి రైతులకు మరో పది రోజుల తర్వాత వారి ఖాతాలలోకి రైతుబంధు నిధులు జమ చేస్తే వచ్చే సమస్య ఏమీ ఉండదు. ఇన్నాళ్లు ఆగిన రైతులు మరో పది రోజులు ఆగలేకపోరు. కానీ, బీఆర్ఎస్ వేసిన వ్యూహానికి ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. సరిగ్గా పోలింగ్ రెండు రోజుల మందు డబ్బులు పడితే రైతులంతా సంతోషిస్తారని, తద్వారా రాజకీయంగా తమకు మేలు కలుగుతుందని అనుకొని ఉండవచ్చు. కానీ, అనూహ్యంగా ప్లాన్ రివర్స్ అవడం వారికి నిరుత్సాహం కలిగించవచ్చు. బీఆర్ఎస్ నేతలంతా జనంలోకి వెళ్లి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదువల్లే రైతుబంధు ఆగిందని చెబుతున్నారు. దీనిని కాంగ్రెస్ తిప్పికొట్టడానికి కృషి చేస్తున్నా, రైతులు ఈ పార్టీ వల్లే రైతుబంధు నిలిచిందని నమ్మితే కొంత నష్టం జరగవచ్చు. ఇప్పటికే రేవంత్, తదితరులపై రైతు వ్యతిరేక ముద్ర వేస్తూ కేసీఆర్ తదితరులు ప్రచారం సాగిస్తున్నారు. మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని రేవంత్ అన్నారని, రైతుబంధు డబ్బులు దండగ అని మరో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారంటూ వీరు ఈ నెల రోజులపాటు విపరీత ప్రచారం చేశారు. దానిని తోసిపుచ్చలేక కాంగ్రెస్ సతమతమైంది. ఇప్పుడు రైతుబంధు నిధులను కాంగ్రెస్ ఆపిందన్న విమర్శను ఎదుర్కోవలసి వస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి తెలివిగా కౌంటర్ ఇస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. దీనికి రైతులు ఆకర్షితులైతే కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్రయోజనం జరగవచ్చు. కాకపోతే అధికారంలోకి వచ్చిన ఎన్నాళ్లకు పదిహేనువేలు ఇస్తారో రేవంత్ చెప్పలేదు. పైగా అది అంత తేలికకాదన్న విషయం అందరికీ తెలుసు. పదివేల రూపాయలనే రెండు విడతలుగా ఇవ్వడానికే వేల కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. అలాంటిది ఒకేసారి ఎకరాకు పదిహేనువేల చొప్పున ఇవ్వడం అంటే దాదాపు అసాధ్యమే కావచ్చు. అయినా రైతులు తమకు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని నమ్మితే అది కాంగ్రెస్‌కు మేలు చేయవచ్చు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ విషయంలో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి ఘట్టాలు జరగకపోలేదు. 1999 ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఆనాటి కాంగ్రెస్ నేత రోశయ్య ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దానిపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేసింది. కాంగ్రెస్ వల్ల పేదలకు నష్టం జరుగుతోందని చంద్రబాబు ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో దీని ప్రభావం ఎంత పడిందన్నది వేరే విషయం. ఎందుకంటే వాజ్ పేయిపై ప్రజలలో ఉన్న సానుభూతి ఉపయోగపడి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయా స్కీములలో ఎన్నికల ముందు డబ్బులు ఇచ్చినంత మాత్రాన పార్టీలు అధికారంలోకి రావాలని లేదు. ఒక్కోసారి ప్రయోజనం ఉంటుంది. ఇంకోసారి ఉండకపోవచ్చు. ఉదాహరణకు 2019లో ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ హడావుడిగా రెండు స్కీములు తెచ్చి వేల కోట్ల పందారం చేసింది. అయినా ఆ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. 2018 ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్కు రైతుబంధు పథకం బాగా ఉపయోగపడింది. దానికి కారణం కేసీఆర్‌ను జనం నమ్మడమే. అయితే, ఎన్నికల సమయంలో ఇలాంటివి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఈ తరహా స్కీముల విషయంలో ఫిర్యాదు చేస్తే ఒకరకంగా, ఫిర్యాదు చేయకపోతే ఇంకో రకంగా రాజకీయం ఉంటుంది. అది ఆ సందర్భాన్ని బట్టి ప్రజల మూడ్‌ను బట్టి ఉంటుంది. రైతుబంధు నిధుల తాత్కాలిక నిలిపివేత వల్ల రాజకీయ పార్టీలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో కానీ, రైతులకు పెద్ద నష్టం ఉండదని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బీఆర్ఎస్కు ఊహించని షాక్.. రైతుబంధుకు ఈసీ బ్రేక్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధుకు ఈసీ బ్రేక్ ఇచ్చింది. అయితే, గత వారం బీఆర్ఎస్ అభ్యర్థన మేరకు రైతుబంధు నిధులను విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా, దీనిపై ఫిర్యాదులు రావడంతో రైతుబంధును నిలిపివేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. -
ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు: మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్ సమీపిస్తున్న వేళ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. కర్ణాటక మాదిరిగా తెలంగాణ ఆగం అవకూడదు అని ప్రజలను కోరారు. కాగా, మంత్రి హరీశ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాహుల్ గాంధీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్. కర్ణాటక మోడల్ అంటే 24 గంటల కరెంట్ బదులు మూడు గంటల కరెంట్ ఇవ్వడమా?. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు ఇస్తున్నాం. రైతుబంధు డబ్బులు జమకాలేదని ఎవరన్నా రోడ్లమీదకు వచ్చారా?. ధరణితో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ధరణితో బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓట్ల కోసం దళిత బంధును బీఆర్ఎస్ తీసుకురాలేదు. అలజడిని సృష్టించి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టాలని చూస్తున్నారు. దళిత వర్గాల అభివృద్ధి కోసమే దశలవారీగా దళితబంధు అమలు చేస్తాం. పేపర్ లీక్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వాన్ని విమర్శించడం చేతగాకే ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వంలో 80వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నీళ్లు, నిధులు, నియామకాలే బీఆర్ఎస్ విధానం. బీఆర్ఎస్ అత్యుత్తమ పారిశ్రామిక విధానాల ద్వారా పదేళ్లలో ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాల కల్పన చేశాం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే గడ్డం తీయనని ఉత్తమ్ కుమార్ అన్నారు. రేవంత్ రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. దేశంలో ప్రతీ ఎమ్మెల్యేకు క్యాంప్ ఆఫీస్ పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ 80కిపైగా సీట్లు గెలుస్తుంది. కేసీఆర్ కచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. తెలంగాణలో అతి తక్కువ ఫీజుతో విద్యార్థులు డాక్టర్ కోర్సు చదవచ్చు. బీజేపీ నాయకుల మాదిరిగా మేము పూటకో మాట మాట్లాడం’ అని కౌంటరిచ్చారు. -
మిమ్మల్ని కట్టుబానిసల కంటే హీనంగా చూశారు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై లేఖలో పేర్కొన్నారు. లేఖలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాగా రేవంత్ లేఖలో..‘జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసు. ఏ ప్రభుత్వ పాలనకైనా మీరే పునాదులు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయి. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారు. ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్లుగా చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీ పాత్ర అత్యంత కీలకం. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. రేపటి నాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక బీఆర్ఎస్, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు మీ వంతు పాత్ర పోషించండి. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుంది. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా.. వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు.. కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కట్టు బానిసల కంటే హీనంగా చూశారు. ఫిరాయింపులతో ఆత్మగౌరవాన్ని, నిధులు ఇవ్వక అప్పులు పాలు చేసి వ్యక్తిగత జీవితాలను చిన్నాభిన్నం చేశారు. ఊరి అభివృద్ధికి తెచ్చిన అప్పులు కట్టలేక చాలా మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలు… pic.twitter.com/sJgoNB5HMS — Revanth Reddy (@revanth_anumula) November 26, 2023 -
‘మూడ్ ఆఫ్ తెలంగాణను బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై అధికార బీఆర్ఎస్ పార్టీ ఎంతో నమ్మకంతో ఉంది. ఎన్నికల బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, ►మూడ్ ఆఫ్ తెలంగాణను బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందా? ►కుటుంబపార్టీ అన్న ఆరోపణలకు అధికారపార్టీ కౌంటరేంటి.? ►నీళ్లు, నిధులు, నియామాకాల ఆశయాన్ని బీఆర్ఎస్ సర్కారు పూర్తి చేసిందా.? ►అవినీతి సర్కార్ అన్న విపక్షాల విమర్శలకు ఆన్సరేంటి.? ►బీజేపీకి బీ-టీం, కాంగ్రెస్‌కు కారు పార్టీ కనెక్ట్ అయిందన్న జాతీయ పార్టీలకిచ్చే జవాబేంటి.? ►సంక్షేమమే తారక మంత్రమా? తాయిలాలు కారును దౌడ్ తీయిస్తుందా? ►తెలంగాణ మంత్రి హరీశ్‌రావుతో స్పెషల్ లైవ్ షో మీ సాక్షి టీవీలో.. -
రేవంత్ కన్నా కేసీఆర్ బెటర్: ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, బీజేపీ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్నా సీఎం కేసీఆర్ బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ అర్వింద్ జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో కార్నార్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ కంటే కేసీఆర్ మేలు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు. కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?. కాంగ్రెస్‌కు ఓటు వేశారో తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం చేతిలో పెట్టినట్టే అని సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను హోల్ సేల్‌గా అమ్మేస్తాడు. చంద్రబాబు కోసం సంచులను మోసుకెళ్లాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. -
ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయా?: ప్రియాంక ఫైర్
సాక్షి, పాలకుర్తి: తెలంగాణలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలువురు ఢిల్లీ నేతలు తెలంగాణకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాకు వచ్చారు. ప్రచారంలో పాల్గొని ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలోని పాలకుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోంది. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడింది. త్యాగాల మీద ఏర్పాటైన రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావించాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలి. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో.. లేదో.. ప్రజలు ఆలోచించాలి. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ పదేళ్లలో ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. ఈ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో అవినీతి జరిగింది. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడింది. ఆ యువతి పరీక్షకు దరఖాస్తు చేసుకోలేదని మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయి. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. పేపర్ లీకేజీలను అరికడతాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల కష్టాలు తొలగిపోతాయి. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 వేస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. వస్తువుల ధరలు తగ్గాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి. కేసీఆర్ సర్కార్‌కు కాలం చెల్లిపోయింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే, హుస్నాబాద్ సభలో ప్రియాంక మాట్లాడుతూ..‘ప్రజలు కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలరా?. ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు ఉద్యోం ఇచ్చారా? ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవి ఇచ్చుకున్నారు. కానీ, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎంతో కష్టపడి మీ పిల్లలను చదివించుకుంటున్నారు. వారి కష్టం వృథా అయిపోతోంది. ఇలాంటి ప్రభుత్వం మరో ఐదేళ్లు కావాలా?. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లు అవినీతితో కురుకుపోయాయి’ ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నాడు. అదానీ ఒక్క రోజ సంపద రూ.1600కోట్లు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీనే. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో 40-50 స్థానాల్లో పోటీచేస్తే తెలంగాణలో మాత్రం ఏడు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఒవైసీ ఎప్పుడూ రాహుల్ గాంధీనే తిడుతుంటారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న దోస్తీని గుర్తించాలి. అని అన్నారు. -
ప్రగతిభవన్‌లో ఎంట్రీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమరవీరుల త్యాగాలను కళ్లారా చూశాను. తెలంగాణలో బాన్చన్ కల్చర్ సజీవంగా ఉందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నన్ను హిందూ వ్యతిరేకి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. కాగా, ఆర్ఎస్పీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రగతి భవన్‌లోకి సీఎస్‌లకు ఎంట్రీ నిరాకరించిన సందర్భాలున్నాయి. అపాయిమెంట్ ఉంటేనే లోపలికి అనుమతించేవారు. చాలా మంది గంటలు గంటలు బయట వేచి చూడటం నాకు తెలుసు. ఏ విధంగా అభివృద్ధి చేయాలో అని అధికారులను ఏనాడూ అడగలేదు. అధికారులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు. తెలంగాణలో అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్చ బ్యూరోక్రాట్స్‌కు లేదు. ఎంతమంది తెలంగాణ బిడ్డలకు కేటీఆర్ ఉద్యోగాలు ఇచ్చారు?. కుట్రలతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాయావతి ఏడు లక్షల ఎకరాల భూమిని పంచారు. బడుగు, బలహీన, వెనుకబడిన అనే పదాలను నిషేధించాలి. మేం బీఫాంలు ఎప్పుడూ అమ్ముకోలేదు. మేము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. అసత్యాన్ని అతికేలా చెప్పడే బీజేపీ సిద్ధాంతం. బీసీలకు అడుగడుగునా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. స్వేరోస్ అంటే ఆకాశమే హద్దుగా అని అర్థం. అంకితభావంతో పనిచేసే వాళ్లను ఎప్పుడూ పార్టీ వదులుకోదు. పేద పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే ఉండాలా?. బీఎస్పీ పార్టీకి డబుల్ డిజిట్లో సీట్లు వస్తాయి. పెద్ద కంపెనీల్లో ఒక్క పేదవాడైనా పెద్ద హోదాలో ఉన్నాడా?. ఈసారి 80 శాతం టికెట్లు మా పార్టీ వారికే ఇచ్చాం. ఏపీలో ఇంగ్లీష్ మీడియం బోధన నిర్ణయాన్ని సమర్థిస్తాను. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ బోధనను ప్రమోట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వం మంచి పనిచేసింది. జీవితంలో ఎదగాలంటే ప్రతీ ఒక్కరికీ చదువు అవసరం. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేసీఆర్ బక్కోడు కాదు.. భూబకాసురుడు: రేవంత్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు దుబ్బాక నిధులను రద్దు చేసి సిద్దిపేటకు తరలిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బక్కోడిని అని చెప్పి కోట్ల రూపాయలు మింగాడు. కేసీఆర్ భూబకాసురుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దుబ్బాకలో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మామ కేసీఆర్, అల్లుడు హరీశ్ రావులకు ఇక్కడి నిధులను సిద్దిపేటకు తరలించడం అలవాటుగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం మనకు నిధులు ఇవ్వడం లేదని ఇక్కడి ప్రజలు ఆ తర్వాత బీజేపీ అభ్యర్థిని గెలిపించారని గుర్తు చేశారు. కేంద్రం నుంచి.. మోదీ వద్ద నుంచి నిధులు తీసుకువచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తానని గత ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావు చెప్పారని, మరి ప్రత్యేకంగా ఏమైనా నిధులు తెచ్చారా? చెప్పాలన్నారు. రఘునందన్ రావుకు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదన్నారు. రేవంత్ ప్రశ్నల వర్షం.. రఘునందన్‌రావు ఎప్పుడూ పార్టీ రాజకీయ కుమ్ములాటలలో బిజీగా ఉన్నారు తప్ప దుబ్బాకకు చేసిందేమీ లేదన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త కాదని, ఆయనది అంతా పాత చింతకాయ పచ్చడే అన్నారు. ఈ పాత చింతకాయపచ్చడిని రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఏం చేశారు? అని నిలదీశారు. ఆయన దొర కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారని, గడీల వద్ద కాపలాగా ఉంటే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు నిధులు ఎందుకు తీసుకురాలేదు? రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయలేదు? దుబ్బాకకు పీజీ కాలేజీ ఎందుకు తేలేదు? చేగుంటలో డిగ్రీ కాలేజీ ఎందుకు తేలేదు? పేదవారికి ఎందుకు డబుల్ బెడ్రూంలు ఇప్పించలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్ల నుంచి ఎంపీగా ఉన్న కొత్త చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ వద్ద బంట్రోతులా ఉన్నాడని విమర్శించారు. ఆయన్ను ఎందుకు మంత్రిని చేయలేదు.. దుబ్బాక నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆనాడు దుబ్బాక నిధులను కేసీఆర్ సిద్దిపేటకు తీసుకువెళ్తే ముత్యంరెడ్డి కొట్లాడి తీసుకువచ్చారన్నారు. హరీశ్ రావు కూడా మీ ప్రాంతానికి రావాల్సిన నిధులను అడ్డుకొని సిద్దిపేటకు తరలించుకుపోయారన్నారు. దుబ్బాకను కేసీఆర్ గౌరవించింది నిజమే అయితే ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న రామలింగారెడ్డిని ఎందుకు మంత్రిగా చేయలేదు? అని ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని చూశారు.. రఘునందన్ రావును చూశారు.. ఇక ఆదర్శ రైతు చెరుకు ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని చూడండని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తే బీఆర్ఎస్కు వచ్చిన నొప్పి ఏమిటి? అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం... కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. కేసీఆర్ లక్ష కోట్లు మింగారని, హైదరాబాద్ నగరం చుట్టూ పదివేల ఎకరాల భూమిని ఆక్రమించాడని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ బక్కవాడు కాదని బకాసురుడు అని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ లో పడుకుంటే కుంభకర్ణుడివి అన్నారు. కేసీఆర్ లేస్తే మింగుతాడు.. మింగితే పడుకుంటాడు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోడన్నారు. దుబ్బాకకు పట్టిన శని కేసీఆర్ కుటుంబం అన్నారు. ఎందుకంటే ఇక్కడకు వచ్చిన సబ్ స్టేషన్లు, నిధులు, కాలేజీలను సిద్దిపేటకు తరలిస్తున్నారని ఆరోపించారు. -
ఇందిరను తిట్టే స్థాయి నీకు లేదు కేసీఆర్: ఖర్గే ఫైర్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందిరా గాంధీని తిట్టే స్థాయి కేసీఆర్‌కు లేదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ‘పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేసీఆర్.. ఇందిరా గాంధీని కూడా తిడుతున్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవు. హరిత విప్లవం వల్లే దేశంలో ఆహార కొరత తీరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకుంటే తెలంగాణ ఎలా ఉండేది?. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరమ్మ. రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం. దళితులు, నిరుపేదలకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం. హరిత, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు?. మోదీతో అంటకాగడమే కేసీఆర్‌కు తెలుసు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయింది. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆలంపూర్ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలే. తెలంగాణ ప్రజలు ఇచ్చే విజయ కానుకను భారతదేశం మొత్తం ప్రతిబింబిస్తుంది. ఆలంపూర్ చాలా పవిత్రమైన ప్రాంతం.. కృష్ణ, తుంగభద్రాల సంగమ ప్రాంతం. దేశంలో ఉన్న మూడు పత్రికల సుమారు 780 కోట్ల ఆస్తులను బీజేపీ ప్రభుత్వం జప్తు చేసింది. ఈ మూడు పత్రికలు నెహ్రూ సొంత ఆస్తి. నెహ్రూ స్థాపించిన ఈ మూడు పత్రికలు స్వతంత్ర పోరాటానికి ముఖ్య భూమికను పోషించాయి’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘నిరుపేదలను ఆదుకోవడంలో బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్షం చేస్తున్నాయి. ఇందిరాగాంధీ నీ విమర్శిస్తున్నావు ఇందిరాగాంధీ ఎక్కడ.. మరి కేసీఆర్ ఎక్కడ.. ఫామ్ హౌస్‌లో కూర్చొని పరిపాలిస్తున్నావు. 2017లో ఇచ్చిన నీ హామీలు ఏమయ్యాయి. ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. తెలంగాణ కోసం అప్పట్లో ఎంపీగా ఉన్న విజయశాంతి ఢిల్లీలో పార్లమెంట్లో సభ జరిగినప్పుడు తెలంగాణ కోసం స్పీకర్ పోడియంలోకి వెళ్లి 4, 5 గంటలు పోట్లాడింది. ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నావ్ కేసీఆర్. నువ్వు, నీ కొడుకు, కూతురు, అల్లుడు తెలంగాణను దోచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం’ అని తెలిపారు. -
తెలంగాణలోనే గ్యాస్ ధరలు ఎక్కువ: చిదంబరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. ఇదే క్రమంలో తెలంగాణతో తనకు 2008 నుంచి మంచి అనుబంధం ఉందని తెలిపారు. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, చిదంబరం తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన నాకు బాగా గుర్తు. తెలంగాణతో నాకు మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగింది. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే. జాతీయ సగటు కన్న ఎక్కువ. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పాల ధరలూ విపరీతంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి. వ్యాట్ ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణే. గ్యాస్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉంది. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికం. రాష్ట్రంలో 15.1 శాతంగా ఉంది. 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. టీఎస్పీఎస్సీలో 22 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు. వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయింది. ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర అప్పులు 3.66 లక్షల కోట్లకు పెరిగింది. ఏటేటా అప్పులు భారీగా పెరిగాయి. ఫలితంగా ఒక్కొక్కరిపై 96 వేల రూపాయల అప్పు భారం పడింది. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారింది. విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయి. పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ మేనిఫెస్టో.. కొన్ని కీలక హామీలు ఇవే.. -
నాంపల్లి ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి.. సర్కార్‌పై ఫైర్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని బజార్‌ఘాట్ అపార్ట్మెంట్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని సంచలన కామెంట్స్ చేశారు. కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్ మాట్లాడుతూ..‘హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. అపార్ట్మెంట్ సెల్లార్లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు.. పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. తనను ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజాగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుల వద్ద ఉన్నాయి. వారిపై దాడులు చేయకుండా.. నాపై, కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. నాపై ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. తనను విమర్శించే వారిని వేధించడం కేసీఆర్‌కు అలవాటే. . బీఆర్ఎస్ లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే తనిఖీలు ఎందుకు చేయడంలేదు. ఐటీ దాడులు ఊహించినవే. కాంగ్రెస్ నేతలే టార్గెట్ ఐటీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలపైనే దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. అర చేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు.. రేవంత్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక, కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడుల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఐటీ దాడులపై రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని… — Revanth Reddy (@revanth_anumula) November 9, 2023 మరోవైపు.. ఖమ్మం, హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. ఎనిమిదికిపైగా వాహనాల్లో ఐటీ అధికారులు ఖమ్మం చేరుకుని పొంగులేటీ ఆఫీస్, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అధికారులకు పొంగులేటి సహకరిస్తున్నట్టు సమాచారం. దీంతో, పొంగలేటి అనుచరులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో, ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు?
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నప్పటికీ, అదే సభలో వక్తగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత ఘాటైన స్పీచ్ చేస్తారో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఎదురు చూశారు. అలాగే బీజేపీ కేడర్ కూడా పవన్ ఏదో ఇరగదీస్తారని ఆశించారు. తీరా చూస్తే ఆయన మొత్తం జావగారిపోయినట్లు మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరచింది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారనుకుంటే ఆ పార్టీల ఊసు కాదు కదా.. పేర్లే ఎత్తలేదు. మామూలుగా సినిమా స్టైల్లో హవభావాలు ప్రదర్శిస్తూ జనాన్ని రెచ్చగొడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం ఆకర్షిస్తారని అనుకుంటే ఆయన అదేమీ చేయకుండానే డల్‌గా తన ప్రసంగం ముగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన విమర్శలు చేయలేదు. కనీసం పేరు కూడా తీయలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆరోపణల వర్షం కురిపిస్తారని ఎదురుచూసిన బీజేపీ, జనసేన వారికి ఆయన గురించి టచ్ చేయలేదు. కేవలం ప్రధాని మోదీని మాత్రం పొగిడి, అదేదో లోక్‌సభ ఎన్నికల ప్రచారం అన్నట్లు వ్యవహరించారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని కానీ, గెలవాలని కానీ కనీసం పిలుపు ఇవ్వలేదు. ఇదంతా చూస్తే ఏపీలో ఆయన ఇంతకాలం చేస్తున్న ఆవేశపూరిత ప్రసంగాలన్నీ ఉత్త బీరాలేనా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ నోటికి వచ్చినట్లు వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దూషిస్తూ చెలరేగిపోతున్నట్లు వ్యవహరించే పవన్ అక్కడ మాత్రం తుస్సుమనిపోవడం గమనించదగిన అంశమే. ప్రధాని మోదీ, బీజేపీ ఇతర ముఖ్యులు కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించారు. పవన్ కళ్యాణ్ మాత్రం అసలు వాటి జోలికే వెళ్లలేదు. కాకపోతే ఏపీలో సమైక్యవాదిగా మాట్లాడే ఆయన తెలంగాణలో మాత్రం ప్రత్యేక తెలంగాణవాదిగా నటించే యత్నం చేశారు. ప్రధాని మోదీ సైతం పవన్‌ను పెద్ద సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపించలేదు. ఏదో మొక్కుబడిగా ఒకసారి ప్రతి నమస్కారం చేయడం, మరోసారి తన ప్రసంగంలో పవన్ అన్న పేరు ప్రస్తావించడం తప్ప ఇంకెక్కడా పట్టించుకున్నట్లు బహిరంగంగా కనిపించలేదు. కేసీఆర్ ప్రభుత్వంపై కొన్ని అవినీతి ఆరోపణలు చేయడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని చెప్పడానికి మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని అన్నారు కానీ, అభ్యర్ధి పేరు ప్రకటించలేదు. అదే టైమ్‌లో బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్‌లకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపించింది. బీసీలకు కేంద్రంలో ఏ విధంగా పథకాలు అమలు చేస్తున్నది, తన మంత్రివర్గంలో బీసీ మంత్రులు ఎంత మంది ఉన్నది తదితర వివరాలు ఇవ్వడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌లోనే 2014 ఎన్నికలకు ముందు తన సభకు టిక్కెట్ పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని తనకు ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. కొన్ని సెంటిమెంట్ డైలాగులు, మరికొన్ని విమర్శలు, ఆరోపణలు చేసిన మోదీ కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన దాని గురించి మర్చిపోయారా? లేక కావాలనే వదిలివేశారో తెలియదు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవినీతిలో ఎవరిని వదలిపెట్టం అని మాత్రం అన్నారు. ఈ సభకు జన సమీకరణ బాగానే జరిగినా, బీసీలు ఎంతమేర బీజేపీకి పట్టం కడతారు? తద్వారా ఆ పార్టీ అధికారంలోకి రాగలుగుతుందా? అన్నది ఇంకా చర్చనీయాంశమే. తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు కాస్త ఊపు వచ్చినట్లు కనిపిస్తున్నా, ఆ తర్వాత అది పాలపొంగు మాదిరి తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. పలువురు బీజేపీ ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ అవుతుంది. మోదీ సభలో పాల్గొనడం తన అదృష్టమని, ఆయన అంటే చాలా గౌరవమని పవన్ కళ్యాణ్ అన్నారు. నిజంగానే మోదీ పట్ల అంత అభిమానం, విశ్వాసం ఉంటే ఆయన 2019 ఎన్నికల సమయంలో మోదీని వ్యతిరేకించి బీఎస్పీ అధినేత్రి మాయావతి వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి, బీఎస్పీతో పాటు, సీపీఐ, సీపీఎంలతో ఎలా పొత్తు పెట్టుకున్నారో తెలియదు. ఏపీ ఎన్నికలలో దారుణ పరాజయం తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడుకుని ఎన్డీయేలో చేరారు. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సలహా కూడా ఉందని అంటారు. మరి ఇప్పుడు కూడా ఆయన సూచన మేరకే కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేయలేదేమో తెలియదు. ఒకప్పుడు కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొడతానంటూ గంభీర ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రసంగ కళను ఆ పార్టీపై ప్రయోగిస్తారని చూస్తే ఒక్క మాట అనకపోవడం అక్కడ ఉన్న బీజేపీ నేతలను ఆశ్చర్యపరచింది. మోదీని పొగడటం వరకు అభ్యంతరం లేదు. కానీ, అసలు లక్ష్యం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం. అందులో జనసేన కూడ భాగస్వామి అవడం. దానికి అనుగుణంగా కనీసం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేన అభ్యర్ధులను గెలిపించాలని కోరకపోవడం గమనించదగ్గ విషయమే. రాసుకు వచ్చిన ప్రసంగంలో ఈ పాయింట్ ఎందుకు పేర్కొనలేదో తెలియదు. ఏపీలో ప్రసంగాలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై అవసరం ఉన్నా, లేకున్నా విరుచుకుపడుతూ, పచ్చి అబద్దపు ఆరోపణలు చేసే పవన్ ఇంత కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్‌పై ఒక్క ఆరోపణ చేయలేదంటే ఆయన పాలన బాగున్నట్లని ఒప్పుకున్నట్లేనా? లేక కేసీఆర్ అన్నా, బీఆర్ఎస్ అన్నా భయపడుతున్నారా?. కొంతకాలం క్రితం కేసీఆర్ పాలనను పొగడుతూ మాట్లాడారు. అలాగే మంత్రి కేటీఆర్‌ను కూడా మెచ్చుకున్నారు. ఇప్పుడేమో ఆ పార్టీపైన పోరాడాల్సిన పరిస్థితి ఎదురవడంతో ఏమీ తోచక వదలివేశారు. పోనీ అలా అని కాంగ్రెస్‌పై మాట్లాడారా అంటే అదీ లేదు. దాని వల్ల తన మిత్రుడు అనండి, వైఎస్సార్సీపీ వారు వ్యాఖ్యానిస్తున్నట్లు దత్తతండ్రి అనండి.. చంద్రబాబుకు శిష్యుడు అయిన రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఆయనకు నష్టం కలుగుతుందని అనుకున్నారేమో తెలియదు. ఒకవైపు బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరినా.. టీడీపీ అధినేత చంద్రబాబుతో తమకు అనుకూలంగా మద్దతు ప్రకటన చేయించలేకపోయిన పవన్, ఈ సభలో ఇలా వ్యవహరించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఏపీలో టీడీపీకి సాయం చేస్తున్న పవన్, తెలంగాణలో తనకు మద్దతు ఇవ్వాలని, కనీసం జనసేన కార్యకర్తల గెలుపునకు ప్రకటన చేయాలని చంద్రబాబును ఎందుకు కోరలేదు?. మరి వీరిద్దరూ హైదరాబాద్‌లో కూర్చుని చర్చించిందేమిటి?ఇలాంటి అనేక ప్రశ్నల మధ్య పవన్.. బీజేపీ సభలో పాల్గొన్నప్పటికీ ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. ఆయన తెలంగాణ జనసేన కార్యకర్తల, అభిమానుల ఉత్సాహంపై నీరుకార్చినట్లు అనిపించింది. పవన్ మరీ ఇంత పిరికివాడా? అన్న సంశయం ఎవరికైనా వస్తే దానికి ఏమి సమాధానం చెబుతాం?. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులకు ప్లాన్ రెడీ: పొంగులేటి వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చే తామే అంటూ కామెంట్స్ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఎన్నికల వేళ తెలంగాణలో ఐడీ, ఈడీ దాడులు జరుగుతాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి. దీంతో, ఆయన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. పొంగులేటి శ్రీనివాస్ బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు జరుగుబోతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై దాడికి సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే దాడులకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత బీఆర్ఎస్ సూచనల మేరకు కేంద్ర సంస్థలు నామీద, నా కుటుంబ సభ్యుల మీద, నాకు మద్దతిచ్చే వారిపై దాడులు చేసేందుకు రెడీ అవుతున్నారు. కాళేశ్వరం ఖేల్ ఖతం.. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. కానీ, కాళేశ్వరం నిజ స్వరూపమేంటో కేంద్రం నివేదికల్లో వెల్లడించింది. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతికి పాల్పడినట్టు అర్థం అవుతోంది. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల ఏదో ఒకరోజు కూలిపోతాయి. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని చెప్పిన బీజేపీ.. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. కేసీఆర్‌ను ఎందుకు విచారించడం లేదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను మాయం చేసే అవకాశం ఉంది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రియాంక, రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారు. తెలంగాణలో దొరల పాలన వద్దు. ప్రజల పాలన కావాలి. ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు. తెలంగాణ పోలీసులు వారి పరిధిలో పార్టీలకు అతీతంగా నడుచుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: తప్పు చేసిన వారిని వదలం.. మోదీ ఫైర్ -
చిన్న పార్టీలు వద్దు.. జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యం: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యంగా ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లో చిన్న(ప్రాంతీయ) పార్టీలే అధికారంలోకి వస్తాయని సీఎం కేసీఆర్ అనడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ చిన్న పార్టీలే అధికారంలోకి వస్తాయని సీఎం కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. చిన్న పార్టీలు గెలిచి ప్రధాని మోదీకి సపోర్ట్ చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతోంది. ప్రధాని మోదీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు వేస్తా అన్నాడు. పది సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎవరి అకౌంట్లోనూ పైసా వేయలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందన్న ఆందోళనతో కేసీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. జాతీయ పార్టీ అని చెప్పి మహారాష్ట్రలో పనికిమాలిన నాయకులను బీఆర్ఎస్లో చేర్చుకున్నాడు. వారిని ప్రగతి భవన్ తీసుకువచ్చి బిర్యానీలు పెట్టాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించడానికి కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రుణమాఫీ చేయడం లేదు. తెలంగాణ కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: దీపావళి ప్రత్యేక రైళ్లు -
కవిత అరెస్ట్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అన్ని సమస్యలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎన్నికల వ్యవస్థను కేసీఆర్ చిధ్రం చేశారని అన్నారు. తెలంగాణలో హుజురాబాద్ ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. కాగా, కిషన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే అవుతుంది. రుణమాఫీతో 30 శాతం మంది రైతులకు కూడా లాభం జరగలేదు. ఉస్మానియా ఆసుపత్రికి తాళాలు వేయాల్సిన దుస్థితి నెలకొంది. కేసీఆర్ సర్కార్ హయాంలో టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైంది. 17 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఒక కుటంబం చేతిలో ప్రజాస్వామ్యం బంధీగా ఉంది. ప్రజా ఆందోళనలను బీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేసింది. సీఎం కేసీఆర్‌తో బహిరంగ చర్చకు నేను సిద్ధం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో నేను చెబుతా.. తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదో చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు ఉందా? ప్రెస్ క్లబ్ అయినా పర్వాలేదు, అమరవీరుల స్థూపం వద్ద అయిన బహిరంగ చర్చకు సిద్ధమని నేను సవాల్ విసురుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చూస్తూ కడుపు తరుక్కుపోతోంది. మేడిగడ్డ బ్యారేజ్‌లో ఉన్న 10 టీఎంసీల నీటిని ఖాళీ చేశారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వెళ్లడం లేదు. తన మనువడిని భద్రాచలం పంపడం ఎంత వరకు కరెక్ట్?. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎటు దారితీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికల వ్యవస్థను కేసీఆర్ చిధ్రం చేశారు. కామారెడ్డి, గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతారు. హుజురాబాద్ ఫలితాలే రిపీట్ అవుతాయి. రెండు పార్టీలు దొందు దొందే.. దేశంలో అన్ని సమస్యలకూ మూల కారణం కాంగ్రెస్ పార్టీనే. గ్యారెంటీలతో కర్ణాటకలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్.. ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు 88 మంది అభ్యర్థులను ప్రకటించాం. మిగతా సీట్లలో అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తాం. కాంగ్రెస్-బీఆర్ఎస్ దొందు దొందే. కేసీఆర్‌కు నేను ఎందుకు ఫేవర్‌గా ఉంటాను. నేను ఎవరికీ లొంగను. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆమె అరెస్ట్‌ను అడ్డుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ ముందుకు వెళ్తాయి. ఇది కూడా చదవండి: రూట్ మార్చిన కేటీఆర్.. గంగవ్వతో నాటుకోడి కూర వండి.. -
‘మేడిగడ్డపై 15-20 పిల్లర్లు కుంగిపోయాయి’
సాక్షి, మధిర: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో హైస్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ సర్కార్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ సేఫ్టీ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని కామెంట్స్ చేశారు. కాగా, ఖమ్మం జిల్లాలోని మధిరలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ మంత్రుల ఆరోపించడం హస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీపై 15-20 పిల్లర్లు కుంగిపోయాయి. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను బయటకు రానివ్వడం లేదు. మేడిగడ్డపై కాంగ్రెస్ నేతలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఎంతో గొప్పగా నిర్మించామంటూ బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది. మున్ముందు ముప్పు తప్పదు.. మున్ముందు కూడా బ్యారేజీతో ముప్పు ఉందని కేంద్ర బృందం చెప్పింది. మొత్తం బ్యారేజీ పనిచేయని స్థితికి వచ్చింది. ఏడో బ్లాక్ రిపేరు చేయడానికి వీలుగా లేదని నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ చెప్పింది. మొత్తం బ్లాక్‌ని పునాదులతో సహా తొలగించి పునర్నిర్మించాలని సూచించింది. సమస్య పరిష్కరించేంత వరకు బ్యారేజీని ఉపయోగించే పరిస్థితి కూడా లేదని కేంద్ర బృందం తెలిపింది. ఒక వేళ ఉపయోగిస్తే మొత్తం బ్యారేజీని మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి రావొచ్చని బృందం చెప్పింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. ఈసారి అధికారంలోకి రామని సీఎం కేసీఆర్‌కి అర్థమైపోయింది. రోజురోజుకి మా గ్రాఫ్ పెరుగుతోంది. మొన్నటి వరకు 80లోపు సీట్లు వస్తాయనుకున్నాం.. ప్రస్తుతం జనం నుంచి వస్తున్న స్పందన చుస్తే 80 సీట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు గంటల కరెంటు ఇస్తారని, రైతుబంధు రాదని కేసీఆర్ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్‌లు జనంలోకి బలంగా వెళ్లాయి. కాంగ్రెస్ వస్తే గ్యారెంటీ స్కీమ్‌లు అమలవుతాయని జనం నమ్ముతున్నారు. సీపీఐ పార్టీతో పొత్తుల విషయంపై కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో కవితపై కేంద్రమంత్రి ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ -
లిక్కర్ స్కాంలో కవిత.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అనురాగ్ ఠాకూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార బీఆర్ఎస్పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం.. హైదరాబాద్‌లోని కత్రియ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో క్రికెట్ వరల్డ్‌కప్ జరుగుతోంది. టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నన్ను బ్యాట్స్‌మెన్‌గా ఇక్కడికి పంపించారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎంతో దోచుకుంది. భారీగా అవినీతిలో కూరుకుపోయింది. రాజస్థాన్ సచివాలయంలో కోట్ల రూపాయలు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులను తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బు.. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరిట రూ.508 కోట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌కు అందాయి. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్క్ అవుట్ అవ్వడం లేదు. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే ఎంతోమంది మరణించారు. పార్లమెంట్లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ తప్పదు.. పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. ప్రతీ ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్లు కూడా జైలుకు పోవాల్సిందే. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్. రాజస్థాన్‌లో గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్. కాళేశ్వరం రూ. 80వేల కోట్ల ప్రాజెక్టు అయితే లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అయితే, కరప్షన్ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను అడిగి చెప్పాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు. కవితను ఎలా విడిచిపెడతాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కోసమే కేఏ పాల్ పోటీచేయడం లేదా? రేవంత్‌రెడ్డి -
రామోజీరావుకు ఎందుకంత వణుకు?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి మేడిగడ్డ లక్ష్మీ బారేజీ పియర్స్ కుంగడం తీవ్ర కలకలం రేపే అంశమే. శాసనసభ ఎన్నికల వేళ ఆ అంశం మరీ ఎక్కువ వివాదం కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జాగ్రత్తపడినట్లు కనిపిస్తోంది. దానికి తోడు సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీ ఎల్అండ్టీ ఈ పియర్స్ మరమ్మత్తులకు లేదంటే పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం అంతా తానే భరిస్తానని చెప్పడం ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశం. విపక్షాలు కొన్ని ఆరోపణలు చేసినా.. అవన్నీ మీడియాలో మరీ ప్రముఖంగా రాకపోవడం కూడా గమనార్హమే. ఏపీలో ఇలాంటిది ఒక చిన్న ఘటన జరిగినా నానా రచ్చ,రచ్చ చేసే ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు మాత్రం తెలంగాణలో కిక్కురుమనడం లేదు. మేడిగడ్డ ప్రాజెక్టు బారేజీ కుంగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సడన్‌గా పెద్ద శబ్దంతో బారేజీ కుంగినట్లు చెబుతున్నారు. దాంతో అధికారులు అప్రమత్తమై ఏమి జాగ్రత్తలు తీసుకోవాలా అనేదానిపై ఆలోచనలు సాగిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం వైఫల్యం ఉందా? లేక అధికారుల తప్పిదాలు ఉన్నాయా? లేక నిర్మాణ సంస్థ లోపాలు ఉన్నాయా? పియర్స్ ఫౌండేషన్‌లో తప్పులు జరిగాయా? మొదలైన విషయాలు తదుపరి విచారణలో తేలనున్నాయి. ✍️తొలుత పోలీసులు నిర్మాణ లోపాలు అని భావించారట. ఆ తర్వాత ఇందులో కుట్ర ఉండవచ్చని ఇంజనీర్లు చేసిన ఫిర్యాదు కొత్త కోణంగా కనిపిస్తోంది. నిజంగా అలాంటి కుట్ర ఏదైనా జరిగితే అది దారుణమైన విషయం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణపై మొదటి నుంచి కొన్ని విమర్శలు లేకపోలేదు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాగా వేగంగా నిర్మాణం చేసింది. ప్రాజెక్టుకు ఇప్పటికి ఎనభైవేల కోట్ల వ్యయం చేసినట్లు అంచనా. ఇది పూర్తి స్థాయిలో వినియోగం రావడానికి మరో ఇరవై,ముప్పై వేల కోట్ల ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇంత వెచ్చించిన ప్రాజెక్టు.. అదే రేషియోలో ప్రజలకు ఉపయోగపడుతోందా? అనే చర్చ కూడా ఉంది. అయినప్పటికీ కేసీఆర్ ఒక సదుద్దేశంతో దీనిని నిర్మించారని అంతా భావించారు. తెలంగాణలో నీటి సదుపాయం లేని ప్రాంతాలకు లిప్ట్ ద్వారా నీరు తెచ్చి సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ ఆలోచనను శంకించనవసరం లేదు. కాని ఇందులో హడావుడి కారణంగా తప్పులు జరిగాయా? అనే సందేహాలు వస్తున్నాయి. గోదావరిపై నిర్మించిన ఈ ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఒక భాగం. ఈ నదికి వరదలు వచ్చినప్పుడు ఒకసారి ప్రాజెక్టు మోటార్లు మునిగిపోయి కొంత నష్టం జరిగింది. ఇప్పుడు బారేజీలోని రెండు పియర్స్ దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ఈ బారేజీ నిర్మాణానికి సుమారు రెండువేల కోట్ల వరకు వ్యయం అయింది. అయితే ఇక్కడ ఒక మాట చెబుతున్నారు. కేవలం పియర్స్ మాత్రమే దెబ్బతిన్నందున ప్రాజెక్టుకు మరీ ప్రమాదం ఉండకపోవచ్చని కొందరి అభిప్రాయం. ✍️దీనిని ఏ రకంగా మరమ్మత్తు చేయవచ్చన్నదానిపై నిపుణులు ఆలోచిస్తారు. అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇలా జరగడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత చికాకే!. అసలే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. దానికి ఈ పరిణామం జత కలిసి ప్రభుత్వానికి తలనొప్పి తెస్తోంది. ఈ ప్రమాదం వల్ల బీఆర్ఎస్కు ఎన్నికలలో ఎంత నష్టం అనేదానిపై కూడా చర్చ జరుగుతోంది. వచ్చే నెల రోజులలో దీనిపై జరిగే పరిణామాలపై అది ఆధారపడి ఉంటుంది. కొంతమంది విద్యాధికులలో ఈ ప్రభావం ఉండవచ్చని, జనసామాన్యం మరీ అంత సీరియస్ గా పట్టించుకునే దశ లేదని అంటున్నారు. ప్రత్యేకించి.. కొన్ని దినపత్రికలు, మరికొన్ని టీవీ చానళ్లు ఈ ఘటనకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఈనాడు పత్రిక అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఎత్తకుండా చాలా జాగ్రత్తగా వార్తలు ఇస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతలకు కుదుపు అని అక్టోబర్ 23వ తేదీన రాసిన కథనంలో ప్రభుత్వ వైఫల్యం అనో, లేదా ఫలానా కారణమనో పేర్కొనలేదు. దీనిని బట్టే కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఈనాడు మీడియా ఎంత విధేయతతో ఉన్నదో అర్థమవుతోంది. ✍️ కొద్దికాలం క్రితం మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో ఆ సంస్థ డైరెక్టర్ ఒకరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు కల్పించుకుని, ఏవో సాంకేతిక కారణాలు చూపించి అరెస్టు కాకుండా వ్యవహరించిన సంగతిని గుర్తు చేసుకుంటే.. ఈనాడు ఇలాగే వ్యవహరిస్తుందిలే అనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ తప్పిదం లేకుంటే ఏదో ఒకటి ఆపాదించాలని అనడం లేదు. కాని ఆంద్రప్రదేశ్ లో ఈనాడు, జ్యోతి తదితర టిడిపి మీడియాలు చేస్తున్న అరాచకాన్ని పోల్చి చూసుకున్నప్పుడు రామోజీరావు వంటివారు తమ పత్రికలను,టీవీలను స్వార్ద ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నది తెలుస్తుంది. ✍️అదే ఆంధ్రప్రదేశ్‌లో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియాలు చేస్తున్న అరాచకాన్ని పోల్చి చూసుకున్నప్పుడు రామోజీరావు వంటివారు తమ పత్రికలను, టీవీలను స్వార్ద ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నది తెలుస్తుంది. చివరికి ఈ ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర బృందం వచ్చి వెళితే కూడా ఏదో మొక్కుబడిగా లోపలి పేజీలో చిన్న వార్త ఇచ్చి ఊరుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వరదలు రావడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. దానికి కారణం చంద్రబాబు టైమ్ లో కాపర్ డామ్ ను పూర్తి చేయకుండా.. డయాఫ్రం వాల్ నిర్మించడం అని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెబుతోంది. అయినా డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ఘటనను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు అంటగట్టి ఎన్ని కథనాలు రాసిందో చెప్పలేం. ✍️చివరికి పోలవరంలో సీపేజీ నీరు చేరినా అందుకు జగనే కారణం అన్నట్లు ప్రచారం చేశారు. ఆ సీపేజీ నీరు బయటకు పోవడానికి వీలుగా చానల్ తీస్తుంటే ఏదో దారుణం జరిగిపోతోందని తప్పుడు ప్రచారం చేశారు. ప్రాజెక్టులో గైడ్ బండ్ కొద్దిగా కుంగితే నానా యాగీ చేశారు. అది మట్టకట్ట.. దాని వల్ల ప్రాజెక్టుకు ప్రమాదం లేదని తెలిసినా, ప్రజలలో ఒకరకమైన ఆందోళన ,భయం క్రియేట్ చేయడానికి శాయశక్తులా కృషి చేశారు.ఈ మధ్య' జగన్ మళ్లీ నీవే ఎందుకు రావాలి" అంటూ ఒక తప్పుడు కథనం రాశారు. అందులో సైతం పోలవరం పుట్టి ముంచేశారని ఒక నీచమైన వ్యాఖ్య చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎలాగైనా ముందుకు వెళ్లకూడదన్న ద్వేష భావంతో నిత్యం అనేక అసత్య వార్తలు రాసిన ఈనాడుకు తెలంగాణలో ఇంత పెద్ద ఘటన జరిగితే కళ్లుమూసుకుపోయాయి. మీడియా ప్రమాణాలను ఇలా దిగజార్చేసిన ఈనాడు, లేదా ఆంధ్రజ్యోతి వంటివి ఏపీలో జగన్ ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్ముతూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నాయి. ఈనాడు తెలంగాణలో ఒకరకంగాను, ఏపీలో మరో రకంగాను వ్యవహరిస్తున్న వైనాన్ని ప్రజలకు తెలియచేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. కేసీఆర్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక వార్త రాయడానికి వణికిపోయే ఈనాడు మీడియా ఏపీలో మాత్రం ఇష్టారీతిన చెలరేగిపోతోంది. దీనిని ప్రజలు గుర్తించకుండా ఉంటారా!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలి: పొంగులేటి ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలని ప్రజలను ఆయన కోరారు. ఇదే సమయంలో తెలంగాణతో గాంధీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. కాగా, పొంగులేటి సోమవారం నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ దీవెనలు ఇవ్వాలి. పది సంవత్సరాలపాటు తుపాకి రాముడు కథలు చెప్పి సీఎం కేసీఆర్ భారీగా ఆస్తులు సంపాదించుకున్నాడు. పదేళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పులు చేశాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బుల సంచులతో వస్తారు. ఎంత అడిగితే అంత ఇస్తారు. మనం పన్నులు కట్టి ప్రభుత్వానికి డబ్బుల ఇస్తే.. వాటిని కొల్లగొట్టి మళ్లీ మన దగ్గరకే తీసుకువస్తున్నారు. తెలంగాణలో యాదవులు గొర్రెల కోసం డీడీలు కడితే ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో, ఇక్కడి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అబద్దాలు చెప్పేటప్పుడు తడుముకోకుండా చెప్పడంతో కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే. ప్రజల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలకు అడియాశలు చేసింది’ అని అన్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు చెక్.. బీఆర్ఎస్లోకి విష్ణువర్ధన్ రెడ్డి -
కాళేశ్వరం ప్రాజెక్ట్ డేటా ఇస్తారా? లేదా?
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్ డేటా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ లేఖ రాసింది. రేపటిలోగా(ఆదివారం) ప్రాజెక్ట్‌కు సంబంధించి సమాచారం ఇవ్వాలని డెడ్‌లైన్ విధించింది. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాచారంలేదని భావిస్తామని లేఖలో పేర్కొంది. వివరాల ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు డేటా కేంద్రానికి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి 20 రకాల సమాచారాన్ని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగింది. కాగా, ఇప్పటివరకు నాలుగు అంశాలపై మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. మిగితా 16 అంశాలపై తెలంగాణ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. అయితే, ప్రాజెక్టు క్వాలిటీ, జియలాజికల్ స్టడీ , కాంట్రాక్టర్ లయబిలిటీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. దీంతో, ఈ విషయాన్ని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సీరియస్‌గా తీసుకుంది. డెడ్‌లైన్ విధింపు.. రేపటిలోగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. అయినప్పటికీ సమాచారం ఇవ్వని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తాము భావిస్తామని తెలిపింది. ఈ క్రమంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బ్యారేజీల్లో సమస్యలు సహజమే.. మరోవైపు.. ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, నిర్మాణంలో సమస్యల్లేవని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్‌లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోనోలిథిక్ డిజైన్‌తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారేజీ తట్టుకుందన్నారు. బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్ నంబర్ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తొలుత కాఫర్ డ్యామ్ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని... ఆ తర్వాత చుట్టూ రింగ్ మెయిన్ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తించాకే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్‌బెడ్‌పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పిలర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మతులకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనుమతించాలని తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో అగ్రవర్ణాలకు పెద్దపీట -
సూర్యాపేట జనగర్జన సభ: సోనియా, కేసీఆర్‌పై అమిత్ షా ఫైర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు స్పీడ్ పెంచారు. తాజాగా సూర్యాపేటలో బీజేపీ జన గర్జన సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట బీజేపీ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ పనిచేస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. కేసీఆర్.. కేటీఆర్‌ను సీఎం చేయాలని అనుకుంటున్నారు. సోనియా గాంధీ రాహుల్‌ను ప్రధాని చేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పేదలు, దళితుల, బీసీల వ్యతిరేక పార్టీలు. కుటంబ పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయలేవు. దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇప్పటికన్నా దళితుడిని సీఎం చేస్తారా? అని ప్రశ్నించారు. మూడెకరాల భూమి ఏమైంది? దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది కేసీఆర్. ఇప్పుడైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా?. బీసీ సంక్షేమం కోసం ఏటా పది వేలకోట్లు కేటాయిస్తామని అన్నారు ఏమయ్యాయి ఆ నిధులు. ఈ రెండు పార్టీలు కుటుంబ సభ్యుల కోసమే పనిచేసే పార్టీలు. తెలంగాణలో పసుపు రైతులు కోసం జాతీయ పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేశాం. సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేశాం. తెలంగాణ అభివృద్ధి అన్ని విధాల కట్టుబడి ఉన్నాం. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు. అయోధ్యకు మీరంతా రండి.. ఐదు వందల యాభై ఏళ్ల పోరాటం అయోధ్య రామాలయ నిర్మాణం. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలా? వద్దా?. జనవరి 22న ప్రధాని మోదీ రామమందిరంలో పూజ చేయబోతున్నారు. జనవరి చివరి వారంలో మీరందరూ అయోధ్యకు రావాలి. ప్రధాని మోదీ అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకు ఎకరాకు ఆరు వేలు ఇస్తున్నాం. మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముప్పై లక్షల మరుగుదొడ్లు నిర్మించాం. ప్రతీ ఒక్కరికీ ఐదు కిలోల బియ్యాన్ని గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్నాం.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి’ అని కోరారు. ఇది కూడా చదవండి: రేవంత్, ఉత్తమ్ కుమార్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ -
పొన్నాలకు రాహుల్ నుంచి ఫోన్!.. స్పందించిన లక్ష్మయ్య..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేతల మరుసటి రోజు ఏ పార్టీలో చేరుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్యకు రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ రావడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి పొన్నాల లక్ష్మయ్యకు గురువారం ఫోన్ కాల్ వెళ్లింది. ఈ సందర్బంగా పొన్నాల తిరిగి కాంగ్రెస్‌లో చేరాలనే ప్రతిపాదనను ఆయన ముందు ఉంచినట్టు సమాచారం. అలాగే, ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని కలవాలని రాహుల్ టీమ్ ఆయనను కోరింది. ఈ నేపథ్యంలో పొన్నాల నిర్ణయంపై ఉత్కంఠ చోటుచేసుకుంది. మరోవైపు.. ఫోన్ కాల్‌పై పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఈ సందర్బంగా పొన్నాల మాట్లాడుతూ.. నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ సేవ చేసిన పార్టీలో అనేక అవమానాలు భరించి.. నేను ఓ రాజకీయ నిర్ణయం తీసుకున్నాను. బీసీలను చీడ పురుగులు చూసినట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంది. ఇలాంటి చిల్లర ప్రచారాలకు ప్రభావితం అయ్యే వ్యక్తిని కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు. జనగామలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పొన్నాలకు కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం, పొన్నాల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉండి అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. 45 ఏళ్లు కష్టపడినా తనకుఫలితం దక్కలేదని అన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేయించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జనగామ ప్రాంతంలో 80 వేల పాల ఉత్పత్తి జరుగుతుందని, వారికి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని కోరారు. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. -
కేసీఆర్ పథకాలు నిలిపేయాలని కాంగ్రెస్ కుట్ర: జగదీష్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు ఆపేయమని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం దుర్మార్గం. సీఎం కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కేసీఆర్ పథకాలు లేవు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి జగదీష్ రెడ్డి గురువారం సూర్యాపేట పట్టణంలో గడపకు గడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చర్యలపై ప్రజలు ఉద్యమించి తిరగబడాలి. గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయండి. ఉచిత విద్యుత్, మిషన్ భగీరథను కూడా కాంగ్రెస్ ఆపేలా ఉంది. కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్‌కి భయం పట్టుకుంది. కర్ణాటకలో ఏకంగా కరెంట్ కోసం సబ్ స్టేషన్లలో మొసలిని వదిలే దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కేసీఆర్ పథకాలు లేవు. ఇక్కడ కేసీఆర్ పథకాలు ఆపేస్తే దేశంలో ఎక్కడా పథకాల గురించి పంచాయితీ ఉండదని కాంగ్రెస్ నేతల ఆలోచన. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను ప్రజలు గమనించాలి. కాంగ్రెస్, బీజేపీలు పోటీచేసే అభ్యర్ధులని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. బీజేపీకి రెండు సార్లు అధికారం ఇస్తే దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చింది. బీజేపీ పాలనలో పెనం నుండి పొయ్యిలో పడ్డ చందంగా దేశ ప్రజల పరిస్థితి తయారైంది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీకి అసలు అభ్యర్థులే లేరు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అందుకే రాజీనామా చేస్తున్నా.. బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల గుడ్‌బై -
తెలంగాణ ప్రీ పోల్ సర్వేలపై విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు స్పీడ్ పెంచారు. మరోవైపు.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఆదిలాబాద్ సభలో కేసీఆర్ సర్కార్ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇక, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ ప్రీ పోల్ సర్వేలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు దూరమవుతున్నట్లు తెలియచేస్తున్నవి. దోపిడీ, దుర్మార్గం, అవినీతి, నియంతృత్వంతో నడుస్తున్న ఈ కేసీఆర్ గారి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం. నేను నా తోటి తెలంగాణ ఉద్యమకారులం సంవత్సరాలుగా చెబుతున్న వాస్తవాలు, మా ప్రజల ఆలోచనకు, అవగాహనకు చేరుతున్నట్లు ఇప్పుడిప్పుడే అన్పిస్తున్నది’ అంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రీ పోల్ సర్వేలు, రానున్న అసెంబ్లీ ఎన్నికలల్ల బీఆర్ఎస్ గెలుపుకు దూరమవుతున్నట్లు తెలియచేస్తున్నవి.. దోపిడీ, దుర్మార్గం, అవినీతి, నియంతృత్వంతో నడుస్తున్న ఈ కేసీఆర్ గారి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం.. నేను నా తోటి తెలంగాణ… pic.twitter.com/t7Fs9MaSJ9 — VIJAYASHANTHI (@vijayashanthi_m) October 10, 2023 మరోవైపు.. అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నందున వీటిని ఉపయోగించుకుని విజయం సాధించాలని స్పష్టం చేశారు. విజయం దిశగా కట్టుదిట్ట మైన కార్యాచరణను, ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలను ఆయన ఆదేశించారు. ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున దానిని బీజేపీకి అనుకూలంగా ఓట్లుగా మార్చేకునే దిశగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పార్టీకి, నేతలకు అవసరమైన సహాయ, సహకారాలు, తోడ్పాటును అందించేందుకు జాతీ య నాయకత్వం సిద్ధం ఉందని హామీ నిచ్చారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్లాన్.. 17 రోజులు.. 41 సభలు -
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం.. కేసీఆర్‌పై ఫైర్
సాక్షి, హైదరాబాద్: ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పనుల కోసం నేను సచివాలయానికి వెళ్తుంటే అనుమతి లేదని ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నట్టు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన పనులపై తాను సచివాలయానికి వచ్చానని, లోపలికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకుని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా చూపిస్తోందని, కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోనికి ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. ఇది చాలా అవమానమని, దీనిపై తాను ఏదైనా చేయవచ్చు కానీ.. అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. నేను ప్రజా సమస్యలపై ఇక్కడకు వచ్చానన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చేది ఉండదని, పైగా వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారన్నారని ఆరోపించారు. సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండి అని చురకలు అంటించారు. హోంమంత్రిగా ఉండి గన్మెన్లను కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులకు పౌరుషం రావాలని, హోంమంత్రి వెంటనే సంబంధిత గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. -
బీఆర్ఎస్కు రేఖా నాయక్ రాజీనామా.. కేటీఆర్‌పై షాకింగ్ కామెంట్స్
సాక్షి, నిర్మల్: ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తాను అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అలాగే, కేసీఆర్ మాట తప్పారు.. కేటీఆర్ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, రేఖా నాయక్ శుక్రవారం ఖానాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఒక మహిళకు అన్యాయం జరిగింది. నన్ను మోసం చేశారు. ప్రజలను మోసం చేస్తున్నారు. కేటీఆర్ స్నేహితుడని జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేనేం తప్పు చేశానో చెప్పాలి. నేను భూములు కబ్జా చేశానా?.. అది నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. ఏం లూటీలు చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై ఫైర్.. ఇదే సమయంలో కేటీఆర్.. తన స్నేహితుడు జాన్సన్ కోసం అభివృద్ధి పనులను ఆపేశారు. సీఎం కేసీఆర్ ఖానాపూర్ సదర్ మట్ నిర్మిస్తామన్నారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ, ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పారు. నా నియోజకవర్గానికి కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మల్, బోథ్‌కు తరలించారు. నా నిధులు ఆపినందుకు నేను పోరాటానికి వెళ్తున్నాను. ఖానాపూర్‌ను అభివృద్ధి చేయలేదని కేటీఆర్ ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ను ఓడించడమే టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో పోటీలోనే ఉంటాను. నేను ప్రజలకు చేసిన మంచిని వారికి చెబుతాను. అన్యాయంగా మా అల్లుడిని బదిలీ చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాను. పాదయాత్రకు నేను రెడీ అవుతున్నాను. గ్రామ గ్రామాన పాదయాత్రతో ప్రజలను కలుస్తాను. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తాను. బీఆర్ఎస్ను ఓడించడమే నా లక్ష్యం. జాన్సన్ ఎస్టీ కాదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఏడుస్తున్నా.. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపిస్తా.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవుల వల.. -
మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు టాపిక్.. రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా.. ‘కేసీఆర్!.. మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా?. అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?. ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్ సంతోష్.. హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్! @TelanganaCMO మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ… — Revanth Reddy (@revanth_anumula) October 5, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. 14 కమిటీలు.. రాజగోపాల్‌రెడ్డి, వివేక్, విజయశాంతిలకు చోటు -
బీఆర్ఎస్కు డీకే అరుణ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున కొద్దీ పొలిటికల్ వాతావరణం రసవత్తరంగా మారుతోంది. ప్రధాని మోదీ నిజామాబాద్ బీజేపీ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత డీకే అరుణ.. బీఆర్ఎస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, డీకే అరుణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వాస్తవాలు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రధానిని అవమానించేలా మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలంటేనే అసహ్యించుకునే పరిస్థితి తెచ్చారు. ప్రధాని మోదీపై ఇస్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రధాని మోదీపై కేసీఆర్ కుటుంబం అహంకారపూరిత మాటలు దుర్మార్గం. తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికే.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణకు ఈ 9 ఏళ్లలో కేంద్రం రూ.9 లక్షల కోట్ల నిధులిచ్చింది. తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్. గెలిచినోళ్లను కాపాడుకోలేని కాంగ్రెస్.. ప్రజలకేమి గ్యారంటీ ఇస్తోంది?. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు రెడీగా ఉండాలన్న హరీష్ రావు -
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. అక్టోబరు వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ఈ వివరాలను వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా వీసీ సజ్జనార్..‘టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది’ అని తెలిపారు. తమ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు #TSRTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన… pic.twitter.com/nqLnQC3IpM — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 4, 2023 ఇది కూడా చదవండి: TS: ఈనెల 13 నుంచి స్కూళ్లకు బతుకమ్మ, దసరా సెలవులు -
కేసీఆర్‌ను గెలిపించడానికే మోదీ పర్యటనలు.. బాంబు పేల్చిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల ఫెలికాల్ బంధాన్ని గురించి నిజామాబాద్ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యమని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, రేవంత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. పదేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అపహాస్యం చేశారు. మోదీనే ఒప్పుకున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ చెప్పాల్సింది. బీఆర్ఎస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ, ఐటీ విచారణ చేయడం లేదు. సీఎం కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపణలు చేసినప్పుడు మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి. అందుకే కేసీఆర్‌పై మోదీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ నిజాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారు. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం పునరాలోచించుకోవాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అవిభక్త కవలలు. మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. అలాంటి వారికి అసదుద్దీన్ ఎలా మద్దతు ఇస్తారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది?. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆర్ఎస్తోనా?. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా?. ఇదంతా నాణేనికి ఒకవైపే.. కేసీఆర్‌కు నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి. నిధులు అంటే దోపిడీ సొమ్ము.. నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు. ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమే. మరి ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంటి?. బీఆర్ఎస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ అధిష్టానం నరేంద్ర మోదీ అని స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే నాకు చెప్పారు. 9 బీఆర్ఎస్, 7 బీజేపీకి, 1 ఎంఐఎంకు అని పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు. మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఇది కూడా చదవండి: ‘బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు రెడీగా ఉండండి’ -
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్..
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. పాలమూరులో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణపై ప్రధానికి ప్రేమ లేదు. మోదీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వచ్చారు?. వడ్లు కొనమంటే నూకలు తినమన్నది కేంద్రమే కదా?. మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు దక్కవు. దేశంలో ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందా? అని ప్రశ్నించారు. మేము ఇచ్చినట్టు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వండి. గుజరాత్ బుద్ధి మాకు నేర్పకండి. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు. తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలి. గుజరాత్‌కు ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?. ప్రధానికి స్పీచ్ ఎవరు రాస్తున్నారో తెలియదు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ మోసం అంటూ మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను మోదీ ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబ సభ్యుడే అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు కౌంటర్.. ఇదే సమయంలో తెలంగాణకు మళ్లీ కేసీఆర్ సీఎం కాబోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందు దొందే. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించండి. పెద్దపల్లిని ఒక జిల్లా కేంద్రంగా మార్చాం. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ రూ.200 దాటి పెన్షన్ ఇవ్వలేదు. తాగునీరు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ రాలేదు. గత ప్రభుత్వ హయాంలో నీళ్ల కోసం ఎప్పుడూ గొడవలే జరిగేవి. కరెంట్ కోసం గతంలో ఎన్నో తిప్పలు ఉండేవి. 24 గంటల కరెంట్‌పై కాంగ్రెస్ నేతలకు నేను సవాల్ చేస్తున్నాను. మేమే బస్సులు పెడతాం.. ఎక్కడికైనా వచ్చి చూసుకోండి. కాంగ్రెస్ నేతలు వచ్చి కరెంట్ తీగలు పట్టుకోమని కోరుతున్నా. ఆరు గ్యారెంటీలు అంటూ కొత్త పాట మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి వారెంటీ ఉందా?. వారెంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారెంటీని నమ్ముదామా?. రైతులను ఏరోజైనా కాంగ్రెస్ పార్టీ పట్టించుకుందా?. కేసీఆర్ అంటే అమ్మకం.. మోదీ అంటే అమ్మకం.. అంతకుముందు కేటీఆర్ రామగుండంలో మాట్లాడుతూ.. మరోసారి ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్‌ను గెలిపిస్తే రామగుండంను నేను దత్తత తీసుకుంటాను. కానీ, భారీ మెజారిటీ రావాలన్నదే నా కండీషన్. తెలంగాణ సాధనలో ఆర్టీసీతో పాటు.. సింగరేణి కార్మికులది కీలకపాత్ర. నవరత్నాలు, మహారత్నాలకు ధీటుగా సింగరేణి రికార్డులను బద్ధలు కొడుతోంది. నాడు 419 కోట్లు లాభాలుంటే... నేడు 2,222 కోట్ల లాభాల్లో ఉంది సింగరేణి. కార్మికులకు ఆ లాభాల్లో వాటా 32 శాతం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ అంటే నమ్మకం, మోదీ అంటే అమ్మకం’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణకు మోదీ వరాలు.. ఫుల్ జోష్‌లో బీజేపీ కేడర్ -
ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు: కేటీఆర్ వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీపై సంచలన విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని మంత్రి కేటీఆర్ అన్నారు. వారెంట్ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చడం తెలియదన్నారు. వారెంట్ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. ఇదే సమయంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ను మంత్రి కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని కారణాల వల్ల రాములు నాయక్‌కు టికెట్ కేటాయించకపోయినప్పటికీ ఆయన పార్టీకి కట్టుబడి పని చేస్తున్నారని ప్రశంసించారు. మరోవైపు.. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు ఎన్టీఆర్. రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ మూడో సారి హ్యాట్రిక్ కొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీకి సోమారపు రాజీనామా! -
నిత్యం కాల్పులతో ములుగు ప్రాంతం వణికిపోయేది: హరీష్ రావు
సాక్షి, ములుగు: తెలంగాణ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. రూ.183 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు నియోజకవర్గంలోనే 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోనే నక్సలైట్ల ఉద్యమం పుట్టింది. నిత్యం కాల్పులతో ములుగు ప్రాంతం వణికిపోయేది అభివృద్ధి ఫలాలను సీఎం కేసీఆర్ ప్రతీ ఒక్కరికీ అందిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కాల్పులు, ఎన్కౌంటర్లు, రైతులకు అప్పులు కరెంట్ బాధలు, ఎరువుల కొరతలు, తాగు నీటి కష్టాలు ఉండేవి. కేసీఆర్ లేకుంటే ములుగు జిల్లా ఏర్పడేదా?. కల్యాణ లక్ష్మి పథకానికి ములుగు జిల్లా స్ఫూర్తినిస్తోంది. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. కేసీఆర్ హయాంలో పోడు భూములకు పట్టాలు, ప్రతి గ్రామానికి రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ప్రతి బిడ్డకు కేసిఆర్ కిట్టు, ప్రతి రైతుకు 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక కల్యాణ లక్ష్మి పథకం. రాజకీయాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గత ప్రభుత్వం మూడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తే కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చింది. ములుగు నియోజకవర్గంలోనే 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. 76.8% ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అవుతున్నాయి. ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత బాగుపడిందో అనడానికి ఇది నిదర్శనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 87% డెలివరీలతో రాష్ట్రంలోనే ములుగు జిల్లా రెండవ స్థానంలో ఉంది. గిరిజనేతరుల పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’ -
కవితకు కేసీఆర్‌పైనే నమ్మకం లేదు: రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందనే భయం కేసీఆర్‌లో మొదలైంది. కేసీఆర్‌పై నమ్మకంలేకనే కవిత కోర్టుకు వెళ్లారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కవిత అరెస్ట్ కోర్ట్ జోక్యం వల్ల ఆగిపోయింది. వాళ్ల పార్టీపై కేటీఆర్‌కే క్లారిటీ లేదు. ఓసారి టీఆర్ఎస్ అని.. మరోసారి బీఆర్ఎస్ అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు సాయంత్రం మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది. వేముల వీరేశం చేరిక తొందరలోనే ఉంటుంది. చట్టంపై కేటీఆర్‌కు అవగాహన ఉందా?. ఎమ్మెల్సీల ఎంపిక చాలా కేటగిరీలలో జరుగుతుంది. కేటగిరీని బట్టి ఎంపిక విధానం ఉంటుంది. గవర్నర్ ఎంపికకు, ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధం లేదని విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి సభ చూసి కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చింది. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను దివాలా తీయించారు. కేసీఆర్ ఆరు లక్షల కోట్ల అప్పులు చేశారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడం విడ్డూరం. రాహుల్ గాంధీ.. కేసీఆర్, కేటీఆర్‌లా బ్లఫ్ మాస్టర్ కాదు.. అన్ని నిజాలే మాట్లాడుతారు. ఎంఐఎం, బీఆర్ఎస్లేని చోట బీజేపీకి ఓటు వేయాలని అసదుద్దీన్ చెప్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి. పార్టీలో చేరడానికి అందరికీ ఆహ్వానమే.. టిక్కెట్ స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని 100 శాతం ప్రయత్నిస్తున్నాం. బీఆర్ఎస్ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాం. అన్ని సామాజికవర్గాల వారు మా పార్టీలో బలమైన వాదన వినిపించారు. వారి తరుఫున సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో నా వాదన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది బీసీలు పార్టీకి పీసీసీ చీఫ్‌గా పని చేసారు. ఒక్కరైనా బీఆర్ఎస్కు బీసీ అధ్యక్షుడు అయ్యాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో విడతల వారిగా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. సీఈసీ మీటింగ్ పెట్టాలని ఏఐసీసీని కోరాం. సీఈసీ మీటింగ్ తర్వాత ఫస్ట్ లిస్ట్ విడుదల అవుతుంది అని తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్ అలర్ట్ -
తెలంగాణలో 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత నేత మధు యాష్కీ స్పందించారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. కాగా, మధు యాష్కీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు పరీక్షలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. కేసీఆర్, కేటీఆర్ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకు అయ్యియి. ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువతను మోసం చేస్తున్నారు. తిరిగి పరీక్షలు పెట్టినప్పుడు.. ఏజ్ రియాక్సేషన్ ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అభ్యర్థులు తిరిగి పరీక్ష రాయాలంటే ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలి. కోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్పీఎస్సీ రూల్స్ పాటించలేదని, పరీక్షను సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడింది. ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని తెలిపింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి? -
బీఆర్ఎస్కు షాక్.. రాజీనామాకు సిద్ధమైన ఎమ్మెల్యే!
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు పార్టీల్లో సీనియర్ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పరిస్థితి బట్టి అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా మరో కీలక నేత బీఆర్ఎస్ను వీడుతున్నట్టు వెల్లడించారు. ఆయన హస్తం గూటిలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టికెట్ ఇవ్వకపోవడంపై గుస్సా.. వివరాల ప్రకారం.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో బాపూరావు సమాలోచనలు, చర్చలు జరిపారు. తాను ఎమ్మెల్యేగా తప్పు చేయలేదని, పార్టీకి నష్టం చేయలేదని ఆయన అన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. మరో నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తాను ఏ పార్టీలో చేరుతున్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే, బాపూరావు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్ నో అపాంట్మెంట్.. మరోవైపు.. మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కావాలని కోరారు రాథోడ్ బాపురావు. దీనికి కేటీఆర్ స్పందించకపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక, బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో రాథోడ్ బాపురావు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలంటూ ఆయన మద్దతుదారులు ఒత్తిడి తేవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, మొదట పార్టీని వీడే అంశంపై రాథోడ్ బాపురావు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సిట్టింగ్‌లకు టికెట్ లభించకపోవడంతో వారు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం -
రాజ్‌భవన్ అడ్డాగా పాలిటిక్స్.. తమిళిసైపై మంత్రి వేముల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కోటాలో పంపిన(దాసోజు శ్రవణ్, సత్యనారాయణ) సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. ఈ క్రమంలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించలేనని, అర్హుల పేర్లను ప్రతిపాదించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో, గవర్నర్‌పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టే.. తాజాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి ప్రశాంత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందరరాజన్‌కి లేదు. ఆమె రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయా నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం. అత్యంత వెనుక బడిన కులాలకు(ఎంబీసీ)చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణ లను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరపర్చినట్టే. అప్రజాస్వామిక నిర్ణయం.. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమించబడబడలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్‌కు నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలి. సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధంలేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. సర్కారియ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్‌గా నియమించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు -
కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య వ్యవహారం నువ్వా-నేనా అన్నట్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. కేసీఆర్ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చారు. రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన సిఫార్సులను తమిళిసై తిరస్కరించారు. ఇక, అంతకుముందు కూడా గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ప్రభుత్వ సిఫార్సులను కొద్దిరోజులు హోల్డ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్ రంగంలో వీరిద్దరూ పెద్దగా కృషి చేయలేదు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అర్హతలు వీళ్లకు లేవు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు అని అన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఇటీవలే బీజేపీలో చేరారు. అనంతరం, కొన్ని పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యా.. సోనియా సమక్షంలో చేరుతున్నా: మైనంపల్లి -
పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కేసీఆర్ సర్కార్: కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు మళ్లీ రద్దు చేయడంపై కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారు. మొదటి సారి గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్ అయ్యి, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. నిన్న హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను మళ్లీ రద్దు చేసింది. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. కేసీఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారింది. కేసీఆర్ సర్కార్ తీరు వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరీక్షలు నిర్వహించలేదని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది అని ఘాటు విమర్శలు చేశారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు! -
‘కాంగ్రెస్ నాయకురాలికి డబుల్ ఇల్లు ఇచ్చాం.. ఇప్పుడేమంటారు’
సాక్షి, దుండిగల్: మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా దుండిగల్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ మాత్రమే. అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజలపక్షమే. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదింమని కోరుతున్నాను. పేదలను ప్రేమించే నాయకుడు కేసీఆర్. కొత్త లింక్ రోడ్డు, బ్రహ్మండమైన నాలాలు నిర్మిస్తున్నాం. గతంలో మంచినీటి కోసం ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మంచినీటి కష్టాలు లేవు. కేసీఆర్ ప్రజల మనిషి.. ఇల్లు కట్టిసూడు-పెళ్లి చేసిచుడు అంటారు పెద్దలు. కానీ కేసీఆర్ మాత్రం ఇళ్ళు నేనే కట్టిస్తా..పెళ్లి నేనే చేయిస్తా అంటున్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇల్లుకు 10లక్షలు ప్రభుత్వానికి ఖర్చు అయితే.. దాని విలువ 30లక్షలు ఉంది. గ్రేటర్ పరిధిలో 50వేల కోట్లు ఖరీదు చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఎంతో పారదర్శకంగా జరుగుతోంది. జగద్గిరి గుట్టలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలికి ఇల్లు వచ్చింది. ఇప్పటి వరకు 30వేల ఇండ్లను పంపిణీ చేశాం. వికలాంగులు, దళితులు, పేదలకు ఇండ్లు పంపిణీ చేస్తున్నాం. గ్రేటర్ పరిధిలో 1లక్ష ఇండ్లను ఎన్నికల లోపు చేస్తాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారా?. దుండిగల్‌కి త్వరలోనే కొత్త పరిశ్రమ రాబోతోంది అభివృద్ధి చెప్పుకోలేక కొత్త మార్గాల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హామీలు ఇస్తే తొందర పడొద్దు. వాళ్ళు ఇచ్చే హామీలకంటే మంచి హామీలు కేసీఆర్ ఇవ్వబోతున్నారు. ఇళ్ల పంపిణీలో ఎవరి జోక్యం లేదు కాబట్టే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు ఇల్లులు వచ్చాయి’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: సెల్‌ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం -
మన డాక్టర్లు.. దేశానికి రక్ష!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏటా పది వేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుందని.. ఇది భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాత్మకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తి ఉండటానికి తెల్లరక్త కణాలు ఏ విధంగా పనిచేస్తయో.. తెలంగాణ ఉత్పత్తి చేసే తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాకుండా దేశానికి రక్షగా నిలుస్తారని చెప్పారు. రాష్ట్ర వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలిచేలా పురోగమించడం మనకు గర్వకారణమన్నారు. శుక్రవారం కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో కలిపి మొత్తం 9 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. రాష్ట్ర వైద్య రంగ చరిత్రలో చారిత్రక ఘట్టం ఇది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యానికి చేరువయ్యాం. తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదని ఎకసెక్కాలు పలికిన వారి సమయంలో తెలంగాణలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 26కు చేరుకున్నాయి. వచ్చే ఏడాది మరో 8 వైద్య కాలేజీలను ప్రారంభించుకోనున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటాయి. వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఒక్క కాలేజీ కూడా లేని ఉమ్మడి నల్గొండలో మూడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి అడవి బిడ్డలు నివసించే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేసి మెడికల్ కాలేజీలను స్థాపించుకున్నాం. హరీశ్‌రావు ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డైనమిక్‌గా పనిచేస్తున్నారు. మంచి విజయాలు సాధించారు. ఏటా పది వేల మంది డాక్టర్లు.. తెలంగాణలో 2014లో 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు 8,515కు చేరుకున్నాయి. ఇందులో 85శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు చేపట్టాం. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా 10వేల మంది డాక్టర్లను తయారుచేసే స్థాయికి ఎదుగుతున్నాం. వారు రాష్ట్రానికే కాకుండా దేశమంతటికీ సేవలు అందిస్తారు. ప్రజలకు మంచి వైద్య సేవలు కూడా.. దేశంలోనే అత్యధికంగా ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లున్న ఏకైక రాష్ట్రం మనదే. 34 వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే 34 పెద్దాస్పత్రులలో వేలాది పడకలతో పేదలకు మంచి వైద్య సేవలు అందుతాయి. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కోర్సులు పెడుతున్నాం. 2014లో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 17వేల పడకలుంటే.. ఇప్పుడు 34 వేలకు పెరిగాయి. మరో 6 ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌లో టిమ్స్ బ్యానర్ కింద నాలుగు ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. నిమ్స్‌ను విస్తరిస్తున్నాం. మొత్తంగా బెడ్ల సంఖ్యను 50వేలకు పెంచుకుంటున్నాం. ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు మొత్తం 50వేల పడకలను ఆక్సిజన్ బెడ్స్‌గా సిద్ధం చేసుకుంటున్నాం. రాష్ట్రంలో మానవీయ పాలన తెలంగాణలో మానవీయ పాలన కొనసాగుతోంది. అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేసి గోండు గూడాలు, ఆదివాసీ, బంజారా తండాలు, మారుమూల ప్రాంతాల్లోని గర్భవతులను ఆస్పత్రులకు తరలిస్తున్నాం. ప్రసవం అయ్యాక తిరిగి ఇంటివద్ద దింపుతున్నాం. తల్లీపిల్లల కోసం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను అమలు చేస్తున్నాం. వైద్య వృత్తి పవిత్రమైనది. తెలంగాణ వైద్యులంటే గొప్ప పేరు రావాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలి..’’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దేశ చరిత్రలోనే తొలిసారి: హరీశ్‌రావు ఒక రాష్ట్రం ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారని.. ఇది సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో సుదినమని చెప్పారు. గత ఏడాది ఒకేసారి 8 కాలేజీలు ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఈసారి మన రికార్డును మనమే అధిగమించామని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో ఒక్క తెలంగాణ వాటానే 43 శాతమని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. కాగా.. సీఎం కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లాల్లో కాలేజీల వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ -
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో, ఆర్టీసీ విలీనం ప్రక్రియకు లైన్‌క్లియర్ అయ్యింది. వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. అయితే, బిల్లులో గవర్నర్ చేసిన 10 సిఫార్సులకు ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో బిల్లుకు తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక, నెల రోజుల తర్వాత బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం విశేషం. ఇది కూడా చదవండి: ప్రగతిభవన్‌కు నేతల క్యూ -
దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి..
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ముగిసింది. బీజేపీ కార్యాలయంలో స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి నిరాహార దీక్షను విరమించారు. కిషన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి ప్రకాశ్ జవదేకర్ దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు కిషన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి. మరోవైపు.. కేసీఆర్ సర్కార్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే చిత్తుకాగితం కాదు. 17పేపర్లు లీక్ చేసి.. తెలంగాణ విద్యార్థులకు విషాదం మిగిల్చారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేలను కూడా రానివ్వడం లేదు. కేసీఆర్ పాలన కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అని తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆరు కమిటీలు -
కిషన్‌రెడ్డి నిరాహార దీక్ష.. కేసీఆర్‌పై సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతలు స్పీడు పెంచారు. కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కార్యచరణను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లయినా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదు. తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేశారు. 1200 మంది విద్యార్తులు బలిదానం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగానే వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా సర్కార్ యువతను మోసం చేస్తోందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకై లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణాలు మీరు చేసి కేసులు తమ మీద పెడతారా? అంటూ మండిపడ్డారు. పేపర్ లీకేజీపై పోరాడితే బండి సంజయ్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు. ఉద్యోగాలపై అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు. నిరుద్యోగులకు పథకం ప్రకరమే సర్కార్ అన్యాయం చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ చేతకాని తనం వల్లే పరీక్షా పేపర్స్ లీక్ అయ్యాయని ఆరోపించారు. హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదని.. అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. వాటాలిస్తే గానీ ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడం లేదన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేశారని.. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మిగులురాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగించే పరిస్థితి లేదు. డిసెంబర్‌లోగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జమిలీ ఎన్నికల పేరుతో ప్రజలను గందరగోళంలో పడేశారు. అన్ని మార్గాలను ఉపయోగించి తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. జమిలీ ఎన్నికలు సాధ్యం కాకపోతే మినీ జమిలీ నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలను గందరగోళపరిచి గట్టెక్కాలని బీజేపీ చూస్తోందన్నారు. అలాగే, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ద్రోహులు ఉన్నారని కొందరు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలకు స్వప్రయోజనాలే ముఖ్యం. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి.. వీరి ముగ్గురివి మూడు దారులు. కోమటిరెడ్డి సగం శరీరం బీజేపీలోనే ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతమే. -
‘జమిలీ ఎన్నికలకు మద్దుతు ఉంటుందని కేసీఆర్ లేఖ రాశారు’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జమిలీ ఎన్నికలపై కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఖయమని జోస్యం చెప్పారు. బీజేపీ పరువు పోకుడదనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే కారణంగా బీజేపీ కుట్ర చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఖాయం. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా గెలిచే అవకాశం లేదు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది. బీజేపీ కుట్రలకు కేసీఆర్ సహకరిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదు.. రెండు ఒక్కటే. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పే కేసీఆర్.. బీజేపీ పాలసీలకు మద్దతు తెలుపుతారు. జమిలీ ఎన్నికలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని 2018లోనే కేసీఆర్ లేఖ రాశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకమని చెప్పే కేసీఆర్ జమిలీ ఎన్నికలపై తన స్టాండ్ ఏంటో చెప్పాలి. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. జమిలీ ఎన్నికలు పెద్ద డ్రామా. బీజేపీలోని ‘బీ’.. టీఆర్ఎస్లోని ‘ఆర్ఎస్’ను కలిపితేనే ‘బీఆర్ఎస్’ అవుతోంది. అధ్యక్ష తరహా ఎన్నికల కుట్రలో భాగమే జమిలి ఎన్నికలు. రాష్ట్రాల అధికారాలు గుంజుకోవడానికే జమిలి ఎన్నికలు. జమిలీ ఎన్నికలు జరిగితే సౌత్ ఇండియాకి తీవ్ర ప్రమాదం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు వస్తే ఎలా..! -
కేసీఆర్ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే.. బండి సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే అంటూ పొలిటికల్ పంచ్‌లు విసిరారు. నటనలో కేసీఆర్‌ను మించినోడు లేడంటూ సెటైర్ వేశారు. కాగా, బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లడుతూ.. కేసీఆర్ మళ్లీ గెలిస్తే చంద్రుడిపై కూడా భూమలిస్తానంటాడు. కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే. ఒకరికి టికెట్ ఇచ్చి.. మరొకరిని ఇంటికి పిలుస్తున్నాడు. యాక్టింగ్‌లో కేసీఆర్‌ను మించిన వ్యక్తి మరోకరు లేరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అది బీజేపీకి మాత్రమే సాధ్యం.. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయింది. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉంది. రూ.6వేల కోట్లు ఇచ్చి నన్ను ఓడించాలని చూశారు. ప్రజలు న్యాయంవైపు ఉండి నన్ను గెలిపించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. నాలుగేళ్లలో ఎక్కడా కూడా కాంగ్రెస్ గెలవలేదు. కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి తప్ప మరో పార్టీకి లేదు. తెలంగాణలో నియంతపాలన పోవాలని ఇక్కడికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాలు వస్తున్నారు. కేవలం మోదీ చేతుల్లోనే ఈ దేశం క్షేమంగా ఉంటుంది. ఈనెల 27వ తేదీన ఖమ్మంలో అమిత్ షా సభ ఉంటుంది. వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ సభకు హాజరు కావాలని ప్రజలను కోరుతున్నాను. కేసీఆర్‌కు పేదా, ధనికా తెలియదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: నాగార్జునసాగర్ బరి నుంచి తప్పుకున్న సీనియర్ నేత జానారెడ్డి -
కాంగ్రెస్ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజల కోసం పనిచేసే అధికారులపై తనకెప్పుడూ గౌరవం ఉంటుందని, అయితే ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్ గా ఎలా ఉంటామని కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసలు అధికారులకు రాజకీయాలతో ఏం సంబంధమని నిలదీస్తున్నారాయన. శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. కోర్టు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదన్నారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా?. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం. అయినా నేను ప్రజల మనిషిని నాకు సెక్యూరిటితో పనిలేదు. నేను సెక్యూరిటీ లేకుండ ఎక్కడికైనా వస్తాను. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా? అని ప్రశ్నించారు. తనని ఓడించడానికే కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. సెక్యూరిటీ విషయంలో భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన సైన్యమని, వాళ్లే తన సెక్యూరిటీ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ అలా చెప్పగలదా? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మైనార్టీ అనే తేడా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్క పర్సెంట్ మైనార్టీలకు కూడా దక్కలేదు. ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరే వరకు అది కమలంగా మారిపోతోంది. బీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. కేసీఆర్ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నారు. మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదు. బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి ఎక్కడికైనా వస్తాం. బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్ళు అలా చెప్పగలరా? అలాంటి వాళ్లనే అనేది.. అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్ లో రాస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం. ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే నేను అనేది. రియల్ బూమ్ నాటకం పది సంవత్సరాల్లో చేయనిది రెండు నెలల్లో ఎలా చేస్తారు? అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ మండిపడ్డారు. ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారు. పేద ప్రజలు మాత్రం పేదలుగానే ఉంటున్నారు. కోకాపేట, బుద్వేల్ లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదు. కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలే. ఆర్టిఫీషియల్ బూమ్ క్రియేట్ చేసెందుకు బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన నాటకం ఆడారు అని విమర్శలు గుప్పించారు రేవంత్. నేనైనా అప్లై చేసుకోవాల్సిందే! ఎన్నికల సమయం వచ్చినప్పుడు పొత్తుల గూర్చి ఏఐసీసీ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాల్సిందే. అది నేనైనా సరే అప్లై చేసుకోవాల్సిందే. ఒకరు ఒకటి కన్నా ఎక్కువ అఫ్లికేషన్లు పెట్టుకోవచ్చు అని రేవంత్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాయదుర్గం మెట్రో భూమి తాకట్టు -
కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి జగ్గారెడ్డి?
సాక్షి, సంగారెడ్డి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా హస్తం నేతలు స్పీడ్ పెంచారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు.. కొంత మంది హస్తం నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీఆర్ఎస్లో చేరునున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ వైపు జగ్గారెడ్డి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించినప్పటి నుంచే జగ్గారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. రేవంత్‌ను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం. ఒకానొక సమయంలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై కూడా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించి.. గులాబీ సర్కార్‌ను అభినందించడం విశేషం. ఇది కూడా చదవండి: కేసీఆర్ సార్ ‘మదిలో’ ఎవరు..? అందరిలోనూ హై టెన్షన్..! -
కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి పోండి: కోమటిరెడ్డి సీరియస్
సాక్షి, యాదాద్రి: పార్టీలో తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని.. బతుకు తెలంగాణే తన అభిమతమని అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. భువనగిరిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరగ్గా.. ఎంపీ కోమటిరెడ్డి హజరయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి.. నాకు ఏ పదవీ అవసరం లేదు.. నాకు బతుకు తెలంగాణ కావాలి. ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు కచ్చితంగా బీసీలకు కేటాయించాలని సోనియా, రాహుల్‌ను కోరాను. బలహీనవర్గాలను అవమానపరిస్తే ఖబడ్దార్. కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోండి. సామాజిక తెలంగాణ ఇంకెప్పడొస్తుంది కేసీఆర్? అని అధికార పక్షాన్ని నిలదీశారాయన. కేసీఆర్ కేబినెట్లో ఎక్కువమంది ఓసీలే. ..నాకు వ్యాపారాలు లేవు, గుట్టలు, కొండలు అమ్ముకోను అంటూ పరోక్ష విమర్శలు చేశారాయన. గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి గందమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించారని, ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్లు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేస్తున్నామంటున్నారని కేసీఆర్ సర్కార్‌పై ఆరోపణలు చేశారాయన. కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ అని విమర్శించారు. పంట నష్టం పది వేల రూపాయలు ఎక్కడని? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి. -
టీకాంగ్రెస్ సరికొత్త నినాదం.. ప్రజాకోర్టులో తగ్గేదేలే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా కర్ణాటకలో విజయంతో తెలంగాణలో కూడా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో అధికార పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా తెలంగాణ కొత్త నినాదంతో ముందుకెళ్లేందుకు సిద్దమైంది. ‘తిరగబడదాం, తరిమికొడతాం’ నినాదంలో ప్రచారంలో దిగేందుకు రెడీ అవుతోంది. అలాగే, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజా కోర్టుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై సోమవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇదే సమయంలో ఈ ప్రజా యుద్ధానికి తెలంగాణ సిద్దం అని చాటి చెప్పడానికి 7661 899 899 నంబరుకి మిస్ట్ కాల్ ఇవ్వాలని సూచించింది. ఇక, బీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలని కరపత్రాలు ముద్రించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 75లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కలలు నెరవేరలేదు. కేసీఆర్ మోసాలను బయటపెడతామన్నారు. తెలంగాణ ఇచ్చి.. సోనియా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని అన్నారు. కేసీఆర్ తన రాజకీయాల కోసం, తన కుటుంబం కోసం తన పార్టీని బలోపేతం చేస్తున్నాడు. రాష్ట్రాన్ని దోచుకొని తన కుటుంబ సంపద పెంచుకుంటున్నారు. ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని ప్రజలకు మాట ఇస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘విద్యార్థి, ఉద్యమకారుల ఆత్మబలిదానాలు గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలకు విలువ ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ చెప్పాడు. తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, ప్రజల హక్కులను కాలరాశాడు.రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై కేసీఆర్ దాడులు చేస్తున్నారు. కేసీఆర్‌ను శిక్షించేందుకే ఇక్కడ ప్రజాకోర్టులో ప్రజా ఛార్జ్ షీట్లు పెడుతున్నాం. ఈ ప్రజాకోర్టులో ప్రొఫెసర్ కంచె ఐలయ్య తీర్పు చెబుతారు.సామాజిక న్యాయం తెలంగాణలో భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదు. అందుకోసమే ఈ ప్రజా కోర్టును ఏర్పాటు చేసాం. గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతాం. తిరగబడదాం.. తరిమికొడదాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిస్తున్నాము’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: గులాబీ గూటిలో కొత్త పొలిటికల్ హీట్.. -
హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్ మెట్రోపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి అవసరం ఉందన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలని కామెంట్స్ చేశారు. కాగా, మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం అని పేర్కొన్నారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గాలంటే మెట్రోను విస్తరించక తప్పదన్నారు. విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా బలోపేతం కావాలన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలన్నారు. 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మరిన్ని కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఫీడర్ సేవలను మెరుగుపరచడంతో పాటు ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలన్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్లకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇక, మెట్రో రైల్ భవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: లోక్‌సభలో బండి సంజయ్ భావోద్వేగ కామెంట్స్ -
TS: వీఆర్ఏల సర్ధుబాటు.. జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వీఆర్ఏల సర్దుబాటుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు గురువారం ఆదేశాలిచ్చింది. ఇక, వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు జీవోను సస్పెండ్ చేసింది. జీవోలకు ముందు యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే వీఆర్ఏల పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: బుద్వేల్ భూముల వేలం.. తొలి సెషన్లో రికార్డులు బ్రేక్ చేసిన ప్లాట్స్ -
బుద్వేల్ భూం భూం.. ముగిసిన వేలం
Updates.. ►బుద్వేల్‌లో భూముల ఈ-వేలం ముగిసింది. మొత్తం 14 ప్లాట్లు 100.1 ఎకరాలను హెచ్ఎండీఏ విక్రయించింది. ఈ-వేలంలో రూ.3625.73 కోట్లు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరింది. ►ఈరోజు జరిగిన వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ.41.75కోట్లు పలికింది. ► అత్యల్పంగా ఎకరం ధర రూ.33.25 కోట్లు పలికింది. ► కాసేపట్లో బుద్వేలు భూముల ఈ-వేలం ముగియనుంది. ► భూముల వేలంంలో సరాసరి రూ.33 నుంచి 35 కోట్లతో బుద్వేల్ భూములు అమ్ముడవుతున్నాయి. ► ఈ క్రమంలో ప్రభుత్వానికి దాదాపు రూ.5వేల కోట్ల భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ► రెండో సెషన్లో రెండు ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ► రెండో సెషన్లో ప్లాట్ నెంబర్-13 కోసం హోరాహోరి బిడ్డింగ్ జరుగుతోంది. ప్లాన్ నెంబర్-13లో అత్యధికంగా ఎకరం ధర రూ.40.25కోట్లు పలుకుతోంది. ► ప్లాట్ నెంబర్-13లో మొత్తంగా 6.96 ఎకరాల ల్యాండ్ ఉంది. ► బుద్వేల్ భూముల ఈ-వేలం తొలి సెషన్ ముగిసింది. తొలిసెషన్లో 1,2,4,5,8,9,10 ప్లాట్లకు వేలం జరిగింది. ► తొలి సెషన్ బుద్వేల్ భూముల వేలంలో 58.19 ఎకరాలకు మెత్తం ఆదాయం రూ.2061 కోట్లు వచ్చింది. ► అత్యధికంగా ప్లాట్ నంబర్-4లో ఎకరం ధర రూ.39.25 కోట్లు. (14.33 ఎకరాలు) ► అత్యల్పంగా ఎకరం ధర ప్లాట్ నంబర్-2,5లో ఎకరం ధర. రూ.33.25 కోట్లు (plot no 2&5 total 18.74 ఎకరాలు) ► ప్లాట్ నెంబర్-1లో ఎకరం రూ.34.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-8లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-9లో ఎకరం రూ. 33.75 కోట్లు. ►ప్లాట్ నెంబర్-10లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► కొనసాగుతున్న బుద్వేల్ భూముల వేలం ► రెండో సెషన్ వేలం ప్రారంభం ► రెండో సెషన్లో 11, 12,13,14,15, 16,17 ప్లాట్ల వేలం జరుగనుంది. ► మొదటి సెషన్లో ఇంకా కొన్ని ప్లాట్లకు కొనసాగుతున్న వేలం. ► మొదటి సెషన్లో సరాసరి ఎకరం 25 కోట్లు దాటి నడుస్తున్న వేలం ► అత్యధికంగా 5వ నెంబరు ప్లాట్లోలో ఎకరం 32 కోట్లు దాటిన ధర. ► ప్లాట్ నంబర్-1.. ఎకరం రూ. 33.25 కోట్లు ► ప్లాట్ నంబర్-4.. ఎకరం రూ. 33.25 కోట్లు. తొలి సెషన్లో ఇలా.. ప్లాట్ నెంబర్-9లో ఎకరం 22.75కోట్లు ప్లాట్ నెంబర్ -10లో ఎకరం 23 కోట్లు. ప్లాట్ నెంబర్-7లో ఎకరం 27కోట్లు. ప్లాట్ నెంబర్-8లో ఎకరాకు 28 కోట్లు పలికింది. ► కోకాపేట తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా అత్యంత విలువైన బుద్వేల్ భూముల వేలానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఈ క్రమంలో వేలం కొనసాగుతోంది. కాగా, అత్యధికంగా 4వ నెంబర్‌కు 31 కోట్లు, 5వ నెంబరు ప్లాట్‌లో ఎకరం రూ.30 కోట్లు దాటి ధర పలికింది. ఇక పదో నెంబర్ ప్లాట్‌కి 23 కోట్లతో వేలం కంటిన్యూ అవుతోంది. ► ఇక, వేలం ప్రారంభం నుంచి ఈ-వేలం మందకోడిగా సాగుతోంది. వేలం ప్రారంభమై రెండు గంటలు దాటినా ధరలు మాత్రం పెద్దగా పలకడం లేదు. కాగా, సెషల్ ముగిసే సమయానికి ధరలు జోరందుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలం జోరందుకుంది. ఈ-వేలంలో ప్లాట్ నెంబర్ 9, 10లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. సరాసరి ఎకరం రూ. 25 కోట్లు దాటి వేలం నడుస్తోంది. కాగా, కనీస నిర్దేశిత ధర ఎకరం రూ.20 కోట్ల రూపాయలతో వేలం ప్రారంభమైన విషయం తెలిసిందే. ► ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 182 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బుద్వేల్ లే అవుట్ ప్లాట్ల అమ్మకంలో భాగంగా గురువారం ఈ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఫస్ట్ సెషన్ వేలంలో ప్లాట్ నెం.1,2,4,5,8,9,10 లకు బిడ్డర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్లను సమర్పిస్తున్నారు. ► మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు రెండో సెషన్‌గా నిర్వహించే వేలంలో మరో ఏడు ప్లాట్లకు వేలం జరగనుంది. ఇక్కడి లే అవుట్ లో ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు, గరిష్టంగా 14.3 ఎకరాలుగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వివరించారు. ఒక్కో ఎకరానికి మినిమమ్ అప్ సేట్ రేటుగా రూ. 20 కోట్లుగా నిర్ణయించి, ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత.. స్లోగన్స్‌తో దద్దరిల్లుతున్న పరిసరాలు -
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌పై తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడకముందే పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేశారు. కాగా, తరుణ్ చుగ్ ఎల్బీనగర్లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం చేతితో కారు స్టీరింగ్ ఉంది. తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల స్కీమ్ ఎందుకు అమలు చేయడం లేదు. కుటుంబ పాలన, దుష్ట పాలన నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేది కేవలం బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు బీ టీమ్. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోని నెట్టారు. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు. మెట్రో నగరమైన హైదరాబాద్‌కు కేంద్రం నిధులు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోంది. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్.. ప్రజలను మోసం చేస్తున్నాడు. దీనిలో కేంద్రం నిధులున్నాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశంలో ప్రతీ గ్రామంలో స్వతంత్ర సమరయోధులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే! -
TS: గృహలక్ష్మి పథకానికి లాస్ట్‌డేట్ లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 10వ తేదీతో గృహలక్ష్మి పథకం గడువు ముగుస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించింది. అలాగే.. దరఖాస్తుల స్వీకరణకు రకరకాల పేపర్లు అడుగుతూ కొర్రీలు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించింది. గృహలక్ష్మి పథకం అనేది తెలంగాణలో కొనసాగే నిరంతర ప్రక్రియ అని, కాబట్టి దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి.. ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించిందని, అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దరఖాస్తు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ‘‘గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత.. రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు అని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం విషయంలో.. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారాయన. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ - దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి… pic.twitter.com/yLp0zgYM0s — BRS Party (@BRSparty) August 9, 2023 మార్గదర్శకాలు ఇవే.. ► ఈ పథకం కింద 100 శాతం రాయితీతో ప్రభుత్వం రూ. 3 లక్షల ఈ ఆర్థిక సాయం అందించనుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మెుత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందిస్తారు. ► మహిళల పేరు మీదే ఆర్థిక సాయం అందిస్తారు. ► లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి (జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దు) . ► కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ► ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ► ఇప్పటికే ఆర్సీసీ (RCC) ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు. ► ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను ప్రకటించారు. -
‘కేటీఆర్.. డ్రగ్స్, రకుల్‌తో సంబంధం లేకపోతే కోర్టుకెందుకెళ్లావ్’
సాక్షి, ఢిల్లీ: సీఎం కేసీఆర్ సర్కార్, కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీని చిల్లర మల్లర వేషాలకు వేదికగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్‌కు అసెంబ్లీలో కేసీఆర్ నివాళులు అర్పించలేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఎందుకు చర్చ జరపలేదని ఫైరయ్యారు. కాగా, రేవంత్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వరదలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ గురించి అసెంబ్లీలో చర్చ జరగలేదు. కాంగ్రెస్‌పై కేసీఆర్ అభ్యంతరకరంగా మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చ జరపలేదు. నేను, కేసీఆర్ టీడీపీ నుంచే వచ్చాము. 1982లో ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్.. చంద్రబాబు చెప్పు చేతల్లో పెరిగారు. చంద్రబాబుకు అనుచరుడిగా కేసీఆర్ రాజకీయాల్లో పనిచేశారు. నేను తెలంగాణ కోసం నిఖార్సుగా కొట్లాడాను. పార్టీలు మారిని తెలంగాణ పక్షానే పనిచేశాను. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పిండం పెడతాం. కేసీఆర్‌కు రాజకీయ సమాధి తప్పదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చేవి 25 సీట్లే. అందుకే కాంగ్రెస్‌పై కేసీఆర్ దాడి చేస్తున్నారు. కేటీఆర్‌కు పరువు లేదు.. బరువు లేదు. తెలంగాణలో డ్రగ్స్ కేసు విచారణపై మేము కోర్టుకు వెళ్లాం. పిల్ వేసి మేం డ్రగ్స్ కేసుపై పోరాడాము. డ్రగ్స్‌తో, రకుల్‌తో సంబంధం లేకుంటే కేటీఆర్ కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారు?. వెయ్యి కోట్ల పరువు నష్టం అంటే వెయ్యి కోట్లు ఇచ్చి ఏమైనా అనొచ్చా?. వెయ్యి కోట్లు ఇస్తే ఇష్టానుసారం తిట్టొచ్చా? అని సెటైర్లు విసిరారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో భూముల అమ్మకంపై ఈటల సంచలన కామెంట్స్ -
రియల్ ఎస్టేట్ కోసమే ఎకరం వంద కోట్లని ప్రచారం: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. దీపం ఆరిపోయే ముందు వెలుగెక్కువ అన్నట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వం తీరు. భూములు అమ్మవద్దని ఆనాడు అసెంబ్లీలో మేమే(బీఆర్ఎస్) ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం భూములు ఎలా అమ్ముతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికే ఎకరం వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చూస్తున్నారు. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఈటల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పేదల కోసం కాదు.. పెద్దల కోసం మాత్రమే. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్స్ పెట్టారు. చట్ట సభలపై కేసీఆర్‌కి నమ్మకం సన్నగిల్లింది. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు మూడు రోజులు. ఈ ఏడాది మొత్తంలో అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు మాత్రమే జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ఉండే వాళ్లుగా.. పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్లుగా మార్చారు. అసెంబ్లీలో నేడు నాలుగు పార్టీలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవి. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం నిర్వహించేవారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీని బీఏసీ సమావేశానికి పిలవలేదు. ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాశ్ నారాయణ కూడా బీఏసీ సమావేశంలో పాల్గొనేవారు. సభ సజావుగా సాగిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. స్పీకర్ కనీసం మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. మూడు రోజులు సభ జరిగితే.. ఒకరోజు హరీష్ రావు, రెండోరోజూ కేటీఆర్, చివరి రోజు కేసీఆర్.. ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికార పార్టీ సభ్యుల కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ ఎంఐఎం పొగడటం జుగుప్సాకరంగా ఉంది. ప్రజల మీద, ప్రజాస్వామం, చట్ట సభల మీద బీఆర్ఎస్ నేతలకు నమ్మకం లేదు. ఈ సభలో బీఆర్ఎస్కి బైబై చెప్పినట్టే. ఇటీవల రాష్ట్రంలో వరదల కారణంగా 41 మంది మృతిచెందారు.. వారికి కనీసం అసెంబ్లీలో సంతాపం చెప్పలేదు. వరదలతో చాలా మంది నష్టపోయారు. వారికి కనీసం ప్రభుత్వం సహాయం చేయలేదు. 109 సీట్లు గెలుస్తామని కేసీఆర్ అహంకారంతో చెబుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాగ్ రిపోర్టుపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో బడ్జెట్ పెరుగుతోంది. కేటాయింపులు తగ్గుతున్నాయి. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు కూడా చేయడం లేదు. రైతులు తీసుకున్న రుణాలకు 13 నుంచి 14వేల కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోయింది. ప్రభుత్వ ఖర్చులతో ప్రతినెలా నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీలకు పోతుంది. నాలుగు కోట్ల రూపాయలు జీతభత్యాలకు పోతుంది అని అన్నారు. ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. -
గులాబీ గూటిలో ముసలం.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్?
ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా? సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎవరు? ఇంట్లో పోరుతోనే సతమతం అవుతున్న గులాబీ ఎమ్మెల్యేకు ఈసారి టిక్కెట్ హుళక్కేనా? గ్రూప్ రాజకీయాలతో అవస్థలు పడుతున్న గులాబీ గూటిలో పుల్లలు పెడుతున్నది ఎవరు? అసలు జనగామ జగడానికి కారణం ఎవరు?.. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి.. మరోవైపు పార్టీలో వ్యతిరేక వర్గం ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ ఇందుకు ఆజ్యం పోస్తున్నట్లు వైరల్‌గా మారిన తాజా ఆడియో స్పష్టం చేస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్థానికేతరుడు కావడంతో.. మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరపడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. జనగామ సీటు కాపాడుకునేందుకు యాదగిరిరెడ్డి ప్రయత్నిస్తుండగా.. ఆయన సీటుకు ఎర్త్ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇదే సమయంలో నర్మెట్ట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్‌తో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. స్థానికుడైన పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటివ్వాలని కోరదామని, పల్లాకు కూడా ఈ విషయం చెప్పాలంటూ ఉన్న ఆడియో వైరల్ కావడంతో నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేగింది. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి తండ్రి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా స్థానిక మున్సిపాలిటీకి ఇచ్చేశారు. టికెట్ నాదంటే నాదే.. ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూ.. సీటు కాపాడుకోవడానికి అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో స్థానికంగా పార్టీలో కూడా కుంపటి రాజుకుంది. ముత్తిరెడ్డి అంటే గిట్టని కొందరు నేతలు ఈసారి ఎన్నికల నుంచి ఎలాగైనా ఆయన్ను తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో సన్నిహితంగా వ్యవహరిస్తూ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానిస్తున్నారు. తన వెనుక చాలా జరుగుతున్నా.. తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి..సిట్టింగ్ గా ఉన్న టికెట్ నాకే, గెలిచేది నేనే అంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడంతో నియోజకవర్గంలో కలకలం రేగింది. గ్రూప్ రాజకీయాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. జనగామ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు పుల్లల రాయుడిగా పిలుచుకునే ఎమ్మెల్సీయే అసలు కారణమని ప్రచారం జరుగుతోంది. పార్టీ అగ్ర నేతలకు దగ్గరగా ఉండే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు ఆయనే కారణమని భావిస్తున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యేలు తమ సీటు కాపాడుకుంటారో.. లేక పుల్లల రాయుడి దెబ్బకు పక్కకు తప్పుకుంటారో చూడాలి. ఇది కూడా చదవండి: ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు: కేసీఆర్ సీరియస్ కామెంట్స్ -
తెలంగాణకు సీఎం కేసీఆరా? లేక కేటీఆరా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు వాస్తవాలు గ్రహిస్తున్నారని అన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాట డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్న చందంలా తయారైంది. ఆర్టీసీ కార్మికులు వాస్తవాలు గ్రహిస్తున్నారు. ప్రభుత్వం 15-20 కోట్ల ఆర్టీసీ డబ్బులు వాడుకున్నారు. ఆర్టీసీ విలీన బిల్లులో వాటి గురించి లేదు. కార్మికుల సీసీఎస్ డబ్బులు 4500 కోట్లు, పీఎఫ్ డబ్బులు 9వేల కోట్లు వాడుకున్నారు.. అవి ఎవరు ఇస్తారు?. కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్, ఆర్మూర్‌లో ఇప్పటికే ఆర్టీసీ ఆస్తులను లీజు పేరుతో కొల్లగొట్టారు. ఆర్టీసీ ఆస్తులను కొట్టేసేందుకు విలీనం పేరుతో డ్రామా ఆడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు బెనిఫిట్ల ప్రస్తావన బిల్లులో లేదు. కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు బయటకు వస్తాయి. ఆర్టీసీ ఉద్యోగుల ఓట్ల కోసమే విలీనం డ్రామా ఆడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు లాభం చేకూరడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కృషి చేస్తున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి. కేటీఆర్ భాష, అహంకారం చూసి ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆరా లేక కేటీఆరా?. ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ను ప్రకటిస్తే బీఆర్ఎస్లో ఎవరూ ఉండరు అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ అధికారుల భేటీ -
కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఆర్డీవో(రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్) వ్యవస్థను రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, తర్వాత వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో త్వరలో ఆర్డీవో వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన రెవెన్యూ డివిజన్ అధికారి పోస్ట్ కాలగర్భంలో కలిసిపోనుంది. ఇప్పటికే VRA, VRO వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా రెవెన్యూ డివిజన్ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇటీవల కొంత మందికి ప్రమోషన్ల కూడా ఇచ్చారు. దాదాపు 90 మంది వరకు ఆర్డీవోలు పనిచేస్తున్నారు. వీరందరికి కొత్త పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. త్వరలో ఆర్డీవో వ్యవస్థను తీసివేసి వీరిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆర్డీవోల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో 300 బెడ్స్ ఉన్నాయి. కాగా, ఆస్పత్రికి వచ్చే రోగికి వైద్య సేవలు ఎక్కడ అందుతున్నాయి?. వైద్య సేవలు అందని పక్షంలో ఎవరిని సంప్రదించాలో తెలియక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికి ఆర్డీవోలను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. కాగా, రాష్ట్రంలో సర్కారు దవాఖానాలకు పట్టిన నిర్లక్ష్యం జబ్బుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త ట్రీట్మెంట్ ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇది కూడా చదవండి: నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా? -
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఛాన్స్ దొరికిన ప్రతీసారీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై హస్తం నేతలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారు. వక్ఫ్ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అలంపూర్ అభివృద్ధి శూన్యం. కేసీఆర్ చేతిలో పాలమూరు జిల్లా మోసపోయింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీనే. మహబూబ్ నగర్ జిల్లాలో 14కి 14 సీట్లు కాంగ్రెస్‌ను గెలిపించండి. ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ‘కవిత లిక్కర్ స్కాంపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు’ -
ముంపు ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటన.. కేసీఆర్ సర్కార్‌పై ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో వరద నీరు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి శుక్రవారం యూసఫ్‌గూడ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం, కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కాదు.. బస్తీలను కూడా బాగుచేయాలి. హైదరాబాద్‌కు 80 శాతం నిధులు వస్తున్నా 8శాతం కూడా వినియోగించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పూడిక తీయకపోవడంతో రోడ్లపై డ్రైనేజీ పారుతోంది. వాటర్ వెళ్లే కాలువలు మూసుకోపోయాయి. హైదరాబాద్‌లో బస్తీల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధుల కొరతతో సీవరేజ్ బోర్డు ఇబ్బందిపడుతోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ఇస్తాంబుల్, డల్లాస్ చేస్తామని కేసీఆర్ చెప్పారు. భారీ వర్షాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు హైటెక్ సిటీ, మాదాపూర్‌కే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నిజమైన హైదరాబాద్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మాటలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు. బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులతో కలిసి స్వచ్చందంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. ఈ క్రమంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వారికి వివరించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీ ముట్టడికి కాంగ్రెస్.. ఆఫీసు వద్ద ఉద్రిక్తత -
తెలంగాణలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు!
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు రేపు(శుక్రవారం, 27 జులై) కూడా సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలపై సమీక్షించ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అయితే కురుస్తున్న వర్షాలు.. మరో రెండు, మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో సెలవును పొడిగించాలని నిర్ణయించింది. ఈ నెల 29న (శనివారం) మొహర్రం సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది. ఆ తర్వాత రోజు ఆదివారం. దీంతో.. తిరిగి సోమవారమే బడులు తెరుచుకోనున్నాయి. -
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో రెండో పీఆర్సీని వేయనుంది ప్రభుత్వం. ఇదే సమయంలో ఇంట్రిం రిలీఫ్(IR)ను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్(EHS)పై కూడా నిర్ణయం తీసుకోనుంది. ఈహెచ్ఎస్ అమలుకు విధి విధానాలను రూపొందించనుంది. అలాగే, గవర్నమెంట్ ఎంప్లాయిస్ హౌజింగ్‌పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు -
సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: భూమి కేటాయింపు విషయంలో కేసీఆర్ సర్కార్‌కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నంబర్ 239, 240లో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేబినెట్ అనుమతి లేకుండానే కేటాయించారా అని ప్రశ్నించింది. కేటాయింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. అయితే, బీఆర్ఎస్కు 11 ఎకరాల భూమి కేటాయింపును సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్జీవో) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎకరం దాదాపు రూ.50 కోట్ల మార్కెట్ విలువైన స్థలాన్ని.. కేవలం రూ.3,41,25,000కే ప్రభుత్వం ముట్టజెప్పిందని.. అలా 11 ఎకరాలకు గానూ దాదాపు రూ.500 కోట్లు ప్రభుత్వానికి నష్టమని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంకా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదన్న ప్రభుత్వం ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కోకాపేట్‌లోని 11 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడంపై కేబినెట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రొసీడింగ్ కాపీని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి టెండర్లు లేకుండానే బీఆర్ఎస్ పార్టీకి అత్యంత విలువైన ప్రాంతంలో భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. భూమి కేటాయించి.. నిర్మాణం చేపట్టినా ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో ఆ వివరాలను ఉంచలేదని సత్యంరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, భూ పరిపాలన చీఫ్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి గుడ్‌న్యూస్ -
గుడ్‌న్యూస్.. తెలంగాణలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల(గెస్ట్ లెక్చరర్లు) నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నియామక మార్గదర్శకాలను విడుదల చేశారు. కాగా, ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఒక్కో పీరియడ్ నిమిత్తం రూ.390 చెల్లిస్తుంది. నెలకు 72 పీరియడ్లకు మాత్రమే అనుమతిస్తుంది. దీంతో వారికి రూ.28,080 చొప్పున వేతనం అందుతుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీని ఏర్పాటుచేస్తారు. జిల్లాల్లో కాలేజీలవారీగా ఖాళీలను ఈ నెల 19న వెల్లడిస్తారు. 24లోగా అన్ని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసు కోవాలి. ఇక, 26వ తేదీన దరఖాస్తులను పరిశీలించి మెరిట్ అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. జిల్లా కలెక్టర్ 28న ఎంపికైన గెస్ట్ లెక్చరర్ల జాబితా వెల్లడిస్తారు. నియమించిన అతిథి అధ్యాపకులు వచ్చే నెల 1న సంబంధిత కాలే జీల ప్రిన్సి పాళ్లకు రిపోర్టు చేయాలి. గతంలో పనిచేసిన అతిథి అధ్యాపకులను తిరిగి కొన సాగించకపోవడంతో వారిలో ఆందోళన నెల కొంది. అయితే కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త నియామక ప్రక్రియ అనివార్యమైందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ఆగస్టు 1న మహారాష్ట్రకు కేసీఆర్ -
ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ పొలిటికల్ వార్‌కు దిగుతోంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆయన మంగళవారం లేఖ రాశారు. 2020లో అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటన చేసినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని మండిప డ్డారు. రూ.లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల్లేక వయోపరి మితి దాటిపోతూ లక్షలాదిమంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయో చెప్పాలని నిలదీశారు. అమరవీరుల త్యాగ ఫలితం ఇదేనా? సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో ఆరు నెలలకు ఒకసారి టెట్, రెండేళ్లకు ఓసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథాచేశారని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ఇక ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు -
ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైంది: భట్టి ఫైర్
సాక్షి, గాంధీ భవన్: తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ భట్టి విక్రమార్క్ సంచలన కామెంట్స్ చేశారు. తొమ్మిదేళ్ల కాలంలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దోచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కాగా, భట్టి విక్రమార్క శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైంది. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అందరూ కోరకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బెల్టు షాపులను మూయించాలని ప్రజలు మమ్మల్ని అడిగారు. చేనేత కార్మికుఉ జీఎస్టీ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్‌కి పట్టం కట్టాలని చూస్తున్నారు. సింగరేణిని బొందపెడుతున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని విద్యార్థులు అనుకుంటున్నారు. ధరణి పోర్టల్ పేరుతో మా భూములు మాకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: హిమాన్షు అన్నా.. మా బడినీ జర దత్తత తీసుకోరాదే..! -
తెలంగాణలో 24 గంటల కరెంట్.. బీఆర్ఎస్కు చెక్ పెట్టిన కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలంగాణలో ఉచిత కరెంట్ అంశంపై పొలిటికల్ హీట్ నడుస్తోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని తేలిందన్నారు. కాగా, రేవంత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ కొనుగోలులో భారీ అవినీతి జరిగింది. కేసీఆర్ అవినీతి బయటపెడతాం.. జైలుకు పంపిస్తాం. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్స్టేషన్ల పర్యటనల్లో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడంలేదని తేలింది. సబ్స్టేషన్ల సవాల్‌ను స్వీకరించే ధైర్యం బీఆర్ఎస్కు ఉందా?. ఏం చేసినా మోటర్లకు మీటర్లు పెట్టం అన్న కేసీఆర్.. ఇప్పుడు మీటర్లు పెడతామని ఒప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారనే భయం కేసీఆర్‌కు పట్టుకుంది. ప్రతిపక్షం ఎలా ఉండాలో బీఆర్ఎస్ నేతలు ట్రయల్ వేస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా మేము ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. నిన్నటి(బుధవారం) నిరసనలతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పోలరైజేషన్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌కు కూడా గజ్వేల్‌లో నెగిటివ్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తామని చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం. 11 గంటల విద్యుత్‌లో కూడా కోతలే ఉన్నాయి. ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితి ఉంది. తెలంగాణలో 11 గంటల కంటే విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన -
కాంగ్రెస్ సీఎం ఎవరు?.. భట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, తిరుపతి: తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా తెలంగాణలో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉచిత కరెంట్‌పై ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఉచిత కరెంట్ అంశంపై తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, భట్టి విక్రమార్క ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. ఇక, తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారిని భట్టి దర్శించుకున్నారు. అనంతరం, భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. దివంగత సీఎం వైఎస్సార్ ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. ఉచిత కరెంట్ పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతకు ముందు టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్, ఫ్యామిలీని టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ‘కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడు రోజులు జోరు వానలే.. -
కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. రేవంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటకలో విజయం సాధించడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో కేసీఆర్ టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. ఇక, తాజాగా తెలంగాణలో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్, ఫ్యామిలీని టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ‘కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు. 🔥కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా… మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. 🔥వచ్చేది కాంగ్రెస్… రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్.#ByeByeKCR pic.twitter.com/KERC60owzn — Revanth Reddy (@revanth_anumula) July 12, 2023 వ్యవసాయానికి 24 గంటల కరెంట్.. ఇక, అంతకుముందు కూడా రేవంత్ తెలంగాణలో ఉచిత కరెంట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘తెలంగాణలో 95% రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకొచ్చిండు. ఉచిత కరెంట్ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతుండు. ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పేసి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నం’ అని అన్నారు. దీంతో, రేవంత్ కామెంట్స్ పొలిటికల్ హీట్‌ను పెంచాయి. కాంగ్రెస్‌కు కవిత కౌంటర్.. మరోవైపు.. రేవంత్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రైతుకు వ్యవసాయం మంచిగా ఉండాలంటే నీళ్లు, కరెంటు ఉండాలి. కేసీఆర్ పెట్టిన రైతుబంధు పధకాన్ని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఓ బోగస్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే తప్పు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే తమకు కళ్ళ మంట ఎందుకంటూ ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి కరెంటు వస్తే అనేక మంది రైతులు చనిపోలేదా అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘నాకు తెలంగాణ సీఎం కావాలనే ఆశ లేదు’ -
ముగిసిన మీటింగ్.. తెలంగాణ బీజేపీ 100 యాక్షన్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బీజేపీ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై నేతలు ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల సహ ఇంఛార్జ్‌గా సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా సునీల్ బనల్స్.. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలి. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ప్రముఖులను కలవడంపై స్పీడ్ పెంచాలి. ఆగస్టు 15వ తేదీలోపు ఇవన్నీ పూర్తి కావాలి. రేపు(మంగళవారం) జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా ఇంఛార్జ్‌లు, మాజీ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్పై ఉద్యమ కార్యచరణకు రేపు ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్టు స్పష్టంచేశారు. ఏయే అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే అంశాలపై రేపు చర్చించనున్నారు. తెలంగాణలో ఎజెండా, కార్యాచరణను బీజేపీ ప్రకటించనుంది. ఇది కూడా చదవండి: రాహుల్ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారు: మల్లు రవి