
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బీజేపీ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై నేతలు ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల సహ ఇంఛార్జ్‌గా సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఈ సమావేశం సందర్భంగా సునీల్ బనల్స్.. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలి. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ప్రముఖులను కలవడంపై స్పీడ్ పెంచాలి. ఆగస్టు 15వ తేదీలోపు ఇవన్నీ పూర్తి కావాలి. రేపు(మంగళవారం) జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా ఇంఛార్జ్‌లు, మాజీ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో బీఆర్‌ఎస్‌పై ఉద్యమ కార్యచరణకు రేపు ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్టు స్పష్టంచేశారు. ఏయే అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే అంశాలపై రేపు చర్చించనున్నారు. తెలంగాణలో ఎజెండా, కార్యాచరణను బీజేపీ ప్రకటించనుంది.
ఇది కూడా చదవండి: రాహుల్ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారు: మల్లు రవి
Comments
Please login to add a commentAdd a comment