Sunil
-
పుష్ప వల్లే విదేశాల్లో కూడా గుర్తు పడుతున్నారు: సునీల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.పుష్ప-2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన వారికోసం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు పుష్ప-2 టీమ్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన టాలీవుడ్ నటుడు సునీల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా వల్లే తనను ఎక్కడికెళ్లినా గుర్తు పడుతున్నారని తెలిపారు. స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతుండగా కొందరు పాకిస్తాన్ అభిమానులు తనను గుర్తు పట్టారని వెల్లడించారు. అంతేకాదు తమకు భోజనాలు వండి పెట్టారని సునీల్ వివరించారు.సునీల్ మాట్లాడుతూ.. 'మూవీ షూట్ కోసం ఇటీవల స్పెయిన్ వెళ్లా. రాత్రి 10 గంటలకు అక్కడ రెస్టారెంట్లు క్లోజ్ చేస్తారు. నేను 9.45 గంటల సమయంలో ఒక పెట్రోల్ బంక్‌కు వెళ్లి స్నాక్స్ కోసం అక్కడే ఉన్న స్టోర్‌కి వెళ్లి అడిగా. కానీ అది అప్పటికే క్లోజ్ చేశారని అక్కడే ఉన్న ఓ మహిళ చెప్పింది. ఆ తర్వాత దగ్గర్లో హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని వెతికా. కబాబ్ పాయింట్ అనే ఓ చిన్న హోటల్ కనిపించింది. ఇండియన్ ఫుడ్‌కు సంబంధించిన హోటల్ అయి ఉండొచ్చని అక్కడి వెళ్లా. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండున్నర అయింది. మేము కారు దిగగానే ఓ వ్యక్తి నన్నే అలాగే చూస్తూ ఉన్నాడు. వెంటనే తన ఫోన్లో పుష్ప ఇంటర్వెల్ సీన్ చూపించి మీరే కదా అని అడిగాడు. ఆ తర్వాత తెలిసింది అది పాకిస్థానీయుల రెస్టారెంట్ అని. నాతోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరికీ వారు వంట చేసి పెట్టారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడా' అని పంచుకున్నారు. పుష్ప తర్వాత తమిళం, కన్నడ, మలయాళంలో మంచి పాత్రలు వస్తున్నాయని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. నన్ను చూస్తే అందరికీ పుష్ప సినిమానే గుర్తుకు వస్తోందని అన్నారు. True global sensation @alluarjun 🙏🔥#Pushpa2TheRule #AlluArjun pic.twitter.com/B7phDjPLBh— Mad Max (@madmaxtweetz) February 8, 2025 -
ప్రధాని ఫొటో పెడితేనే నిధులు..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్ స్మార్ట్‌సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్‌కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్లో నగర మేయర్ సునీల్‌రావు, పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డికి గురువు కేసీఆరేనని, అందుకే.. ఆయన బాటలోనే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ‘సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలను తొలుత కేసులతో భయపెట్టి, ఆపై కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వగానే.. వాటిని పక్కనబెడుతున్నారు. గతంలో పెట్టిన కేసులన్నీ ఇలాగే నీరుగార్చారు’అని ధ్వజమెత్తారు. కంపెనీలు, నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలి‘పార్టీలకు చందాలిచ్చిన గ్రీన్కో లాంటి సంస్థపై ఏసీబీ దాడులు చేయడం రాష్ట్రానికి నష్టం. ఫలితంగా పలు కంపెనీలు రాష్ట్రం నుంచి తరలివెళ్తున్నాయి. అసలు 2014 నుంచి రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, నిధులు, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చినా.. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ఇచి్చనా, ఏ కార్యక్రమానికీ నన్ను పిలవలేదు. బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతిమయం. సునీల్‌రావు చేరికతో రాబోయే బల్దియా ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ విజయబావుటా ఎగరేస్తుంది’అని సంజయ్ అన్నారు. అనంతరం సునీల్‌రావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌పై పలు ఆరోపణలు చేశారు. -
కరీంనగర్లో హీట్ పాలిటిక్స్.. మేయర్‌కు గంగుల సవాల్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లను తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేయర్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘మేయర్ సునీల్ రావు అత్యంత అవినీతిపరుడు. ఈ ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయలు సంపాదించాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలో వివరాలు వెల్లడిస్తాను. అవినీతిని బయటపెడతాను అంటున్న సునీల్ రావే ఈ ఐదేళ్లు దోపిడీ చేశాడు. అతడికి పార్టీలు మారడం అలవాటు. ఆయనతో ఒక్క కార్పొరేటర్ కూడా వెళ్లడం లేదు. నాపై అవినీతి ఆరోపణలు చేశారు కదా.. ఏ విచారణకైనా సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు. దీంతో, జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.ఇదిలా ఉండగా.. పార్టీ మార్పుపై మేయర్ సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను. బండి సంజయ్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో బీజేపీలోకి వెళ్తున్నాను. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌పై కాషాయ జెండా ఎగురేస్తాం. నా వెంట రెండు వేల మంది కార్యకర్తలు ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో జాయిన్ అవుతున్నారు. నేను మొదట ఏబీవీపీ కార్యకర్తనే. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే నాకు మేయర్ పీఠం దక్కింది. కాంగ్రెస్‌లో చేరాలని కూడా చాలా మంది కోరారు. నన్ను మేయర్ పీఠంపై కూర్చోకుండా చాలామంది స్థానిక నాయకులు అడ్డుపడ్డారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' హంటింగ్ ట్రైలర్ విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' నుంచి ట్రైలర్ విడుదలైంది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న సుదీప్ ఆపై బాహుబలిలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. అలా ఆయన పాన్ ఇండియా రేంజ్లో పరిచయం అయ్యాడు. అయితే, ఇప్పుడు మ్యాక్స్ సినిమాతో థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా విలన్‌గా సునీల్ కన్నడలో ఎంట్రీ ఇచ్చాడు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానున్నడంతో మ్యాక్స్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా డేట్ అనౌన్స్ మెంట్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం పోస్టర్స్ ఉన్నాయి. దీంతో తెలుగులో కూడా మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. క్రిస్మస్ రేసులో ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉంది. -
'కళ్లకు గంతలు కట్టి, కారులో తోసి.. రూ.20 లక్షలు డిమాండ్ చేశారు'
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ సునీల్ పాల్ కిడ్నాప్‌కు గురయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కిడ్నాప్ అయిన కొద్ది గంటలకే అతడిని విడుదల చేయడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడని అతడి భార్య తెలిపింది. ఈ విషయంలో పోలీసులను కూడా సంప్రదించినట్లు పేర్కొంది.నిజంగానే కిడ్నాప్..అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. ఇది ప్రాంకో, పబ్లిసిటీ స్టంటో కాదని, తనను నిజంగానే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో సునీల్ పాల్ మాట్లాడుతూ.. అమిత్ అనే వ్యక్తి హరిద్వార్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపాడు. ఇందుకోసం కాస్త అడ్వాన్స్ కూడా పంపాడు. దీంతో డిసెంబర్ 2న ఢిల్లీకి వెళ్లాను. బర్త్‌డే పార్టీకి వెళ్తుండగా మార్గమధ్యలో స్నాక్స్ తిందామని ఆగారు. రూ.20 లక్షలు డిమాండ్సరిగ్గా అప్పుడే నా అభిమాని అంటూ ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఓ కారులోకి తోశాడు. బలవంతంగా నన్ను కారులో తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టి ఓ బంగ్లాకు తీసుకెళ్లారు. అక్కడ నన్ను చాలారకాలుగా భయపెట్టారు. రూ.20 లక్షలు కావాలని డబ్బు డిమాండ్ చేశారు, నా ఫోన్ కూడా లాక్కున్నారు. నా దగ్గర ఏటీఎమ్ కార్డు లేదని చెప్పడంతో వారు బేరాలు మొదలుపెట్టారు. నా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసుకోవచ్చని చెప్పారు.ఖర్చుల కోసం రూ.20 వేలిచ్చారుఅలా రూ.7.5 లక్షలు సమకూర్చాను. దీంతో వాళ్లు మరుసటి రోజు విమాన ప్రయాణ ఖర్చుల కోసం రూ.20 వేలు చేతిలో పెట్టి ఇంటికి పంపించారు. ఈ సంఘటన గురించి ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాను. కానీ నా భార్య అప్పటికే పోలీసులను సంప్రదించడంతో నేనూ నోరు విప్పాను. కానీ ఆ కిడ్నాపర్లు నా వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకున్నారు. వణికిపోయా..నా పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు? నా తల్లి ఎక్కడ నివసిస్తుంది? ఇలా ప్రతీది అడిగారు. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనేది భయంగా ఉంది. ఈ సంఘటనతో నేను వణికిపోయాను. పబ్లిసిటీ కోసం ఇదంతా చేశానంటున్నారు... అదే నిజమైతే మధ్యలో పోలీసులను ఎందుకు లాగుతాను. పైగా నా స్నేహితుల దగ్గర డబ్బు పంపినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా నేను ఇంకా బతికే ఉన్నందుకు సంతోషం అని సునీల్ చెప్పుకొచ్చాడు.చదవండి: కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్‌కు యాక్సిడెంట్ -
కమెడియన్ కిడ్నాప్?.. కొద్ది గంటల్లోనే!
నటుడు, కమెడియన్ సునీల్ పాల్ మంగళవారం కొన్ని గంటల పాటు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని సునీల్ భార్య సరిత ధృవీకరించింది. ఆమె మాట్లాడుతూ.. నా భర్త ఉన్నట్లుండి టచ్‌లో లేకపోయేసరికి కంగారుపడిపోయాను. అతడిని ఎవరో కిడ్నాప్ చేశారు. నేను పోలీసులను సంప్రదించగా వారు చాలా సహాయం చేశారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తనను కిడ్నాప్ చేసినవారి గురించి కూడా పోలీసులకు తెలియజేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాను అని పేర్కొన్నారు.మిస్సింగ్..ఏదో షోలో పొల్గొనేందుకు వేరే నగరానికి వెళ్లిన సునీల్ మంగళవారం తిరిగి ఇంటికొస్తానన్నాడు. అయితే ఆరోజు ఎంతసేపు ఎదురుచూసినా ఆయన ఇంటికి చేరుకోలేదు. పైగా ఫోన్‌కాల్స్ కూడా కనెక్ట్ కాకపోవడంతో కంగారుపడిపోయిన సరిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేసిన కొన్ని గంటల్లోనే సునీల్ తన కుటుంబంతో టచ్‌లోకి వచ్చాడు. మంగళవారం రాత్రికల్లా తిరిగి ఇంటికి చేరుకున్నాడు.కాగా సునీల్ పాల్ 2005లో ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో విజేతగా నిలిచాడు. హమ్ తుమ్, ఫిర్ హేరీ ఫెరి, ఆప్నా సప్నా మనీ మనీ, బాంబే టు గోవా వంటి చిత్రాల్లోనూ నటించాడు.చదవండి: హత్య కేసులో హీరోయిన్ సోదరి అరెస్ట్.. 20 ఏళ్లుగా మాటల్లేవ్! -
క్రిస్మస్ బరిలో పాన్ ఇండియా చిత్రం.. రాబిన్‌హుడ్‌కు పోటీ తప్పదా?
రాజమౌళి ఈగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోణ తర్వాత సుదీప్ చేస్తోన్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేశారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. డిసెంబర్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుదీప్ తన ట్వీట్లో రాస్తూ..' నిరీక్షణ ఇంకా ఉంది. ఫైనల్‌గా రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మీ ప్రోత్సాహానికి, సహనానికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. అయితే అదే రోజున టాలీవుడ్ మూవీ రాబిన్‌హుడ్ కూడా రిలీజవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నితిన్‌తో పోటీ పడనున్నాడు కిచ్చా సుదీప్.కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు.It's been quite a wait. Finally happy to announce the release date.Thanks for the unlimited patience shown by all you friends out there and the consistent encouragement.🤗❤️#MaxTheMovie hits the theaters this Dec 25th.https://t.co/car6H2hmEb— Kichcha Sudeepa (@KicchaSudeep) November 27, 2024 -
ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా?
మొదటి అవకాశంతోనే స్టార్ అయినవారు కొందరైతే, అవకాశాలు మెండుగా ఉన్నా సరైన గుర్తింపు లభించని యాక్టర్స్ ఇంకొందరు. అలాంటి వారిలో మియా జార్జ్ ఒకరు. దశాబ్దంగా వెండితెర, బుల్లితెర మీద కనిపిస్తూనే ఉంది. కానీ, వావ్ అనుకునే భూమిక ఎక్కడా దక్కలేదు. ఆ అసంతృప్తితోనే వెబ్ దునియాలోకి అడుగుపెట్టింది. ఆ వేళావిశేషమేమో మరి.. మంచి పాత్రలతో తను కోరుకున్న గుర్తింపు పొందుతోంది!మియా జార్జ్ స్వస్థలం కేరళలోని కోచ్చి. ఇంగ్లిష్ లిటరేచర్‌లో పోస్ట్ గ్యాడ్యుయేషన్ చేసింది. టీచర్ అవుదామనుకుంది. కాని విధి ఆమెను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వైపు నడిపించింది.టెలివిజన్ నటిగా ప్రయాణం ప్రారంభించింది. ఆమె తొలి సీరియల్ ‘ఒరు స్మాల్ ఫ్యామిలీ’. తర్వాత ‘డాక్టర్ లవ్’, ‘కళాత్తు’, ‘ద గ్రేట్ ఫాదర్’ వంటి చిన్న చిన్న టీవీ షోలు, సీరియల్స్‌లో నటించింది. మోడలింగ్లోకీ అడుగుపెట్టింది. అందాలపోటీల్లోనూ పాల్గొని ‘మిస్ కేరళ ఫిట్నెస్ (2012 )’ అవార్డ్‌నూ గెలుచుకుంది.టీవీ సీరియల్స్ మియాకు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీనిచ్చాయి.. ‘అమర కావ్యం’ అనే చిత్రంతో! అయితే, ఆ చిత్రం అనుకున్నంత సక్సెస్ అవక ఆమెను నిరాశపరచింది. తర్వాత తెలుగులో సునీల్ సరసన ‘ఉంగరాల రాంబాబు’లో నటించింది. అదీ అంతే, ఆశించిన ఫలితం సాధించలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకొని, ‘ఇండ్రు నేట్రు నాళై’ అనే తమిళ మూవీతో తిరిగొచ్చింది. అది కమర్షియల్‌గా సక్సెస్ అయింది. వెంట వెంటనే ‘రెడ్ వైన్’, ‘మెమరీస్’, ‘కోబ్రా’, ‘ పెళ్లి రోజు’, ‘యమన్’ లాంటి పలు మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది మియా.ఆమె టాలెంట్‌కి వెబ్ దునియా వెల్కమ్ చెప్పింది. టీవీ, సినిమా రంగాల్లో రాని గుర్తింపును వెబ్ సిరీస్ ద్వారా అందుకుంటోంది. ఆమె నటించిన ‘జై మహేంద్రన్’ అనే సిరీస్ సోనీ లైవ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మధ్యనే వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌ను వివాహం చేసుకొని, ఫ్యామిలీ లైఫ్‌నీ స్టార్ట్ చేసింది మియా జార్జ్. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లవుతున్నా చెప్పుకోదగ్గ రోల్ ఒక్కటీ రాలేదు. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రేదైనా ఒక్కటొస్తే చాలు అనుకుంటున్నా, అందుకే, ఫ్లాట్‌ఫామ్ గురించి ఆలోచించట్లేదు. టీవీ, సినిమా, ఓటీటీ.. ఏదైనా సరే, చేయబోయే పాత్రే ముఖ్యమని.. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.– మియా జార్జ్ View this post on Instagram A post shared by Miya (@meet_miya) -
రాఘవ లారెన్స్ బర్త్ డే.. గ్లింప్స్ అదిరిపోయింది!
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో బుల్లెట్ బండి మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.గ్లింప్స్ చూస్తుంటే ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ సీన్స్, ఫైట్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎల్విన్, వైశాలి, సింగంపులి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
మేయర్ విదేశీ యాత్ర దుమారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగర మేయర్ సునీల్‌రావు అమెరికా పర్యటన వివాదం చివరికి కలెక్టర్ వద్దకు చేరింది. ఇటీవల మేయర్ 14 రోజులపాటు తాను అమెరికా వెళ్తున్నానని కమిషనర్, కార్పొరేటర్లకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్లతో పాటు, డిప్యూటీ మేయర్ కూడా తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఆయన వెళ్తూవెళ్తూ.. డిప్యూటీ మేయర్‌కు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వకుండా వెళ్లారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, తాను బీసీ మహిళ అయినందునే మేయర్ చిన్నచూపు చూస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, బీసీ సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. ఆయన పర్యటన నిబంధనలకు విరుద్ధమని ఆరోపించాయి. ఆయన 33 రోజులపాటు పర్యటించేలా టికెట్లు బుక్ చేశారని, వాస్తవానికి 14 రోజులకు మించి విదేశాలకు వెళ్లినట్లయితే.. నిబంధనలకు ప్రకారం డిప్యూటీ మేయర్‌కు ఇన్చార్జి అప్పగించాలన్న వాదన తెరమీదకు తీసుకొచ్చారు.వెలుగుచూసిందిలా..వాస్తవానికి మేయర్ సునీల్‌రావు వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. ఈనెల 23న వెళ్లి.. సెప్టెంబర్ 25న (33 రోజులు) వచ్చేలా ఆయన బుక్ చేసుకున్న టికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివాదం రాజుకుంది. ఆయన తీరుపై సొంత పార్టీ, విపక్ష కార్పొరేటర్లు కూడా విమర్శించారు. నిబంధనల ప్రకారం.. 14 రోజులు దాటితే తనకు బాధ్యతలు ఇవ్వాలని, కానీ.. తాను బీసీ మహిళను అనే వివక్షతోనే మేయర్ సునీల్‌రావు తనకు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఆరోపించారు. అసలు మేయర్ పర్యటనకు అధికారిక అనుమతే లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టం 2009 34(2) ప్రకారం తనకు ఇన్చార్జి మేయర్‌గా అవకాశం కల్పించాలని ఫిర్యాదులో విన్నవించారు. కాగా, ఈ విషయంపై బల్దియాలోని ప్రతి విభాగం, ప్రతి ఉద్యోగి చర్చించుకోవడం ప్రారంభించారు. మేయర్ వివరణ కోరిన కలెక్టరేట్మేయర్పై వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి మేయర్‌ను వివరణ కోరింది. దానికి ఆయన సమాధానమిస్తూ.. తాను మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం ఇచ్చాకే విదేశీ పర్యటనకు వచ్చానని, నిబంధనల మేరకు తాను అనుమతి తీసుకున్నానని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు.6న ఇండియాకు: మేయర్తాను నిబంధనల ప్రకారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయికి సమాచారం ఇచ్చానని, తనది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని మేయర్ సునీల్‌రావు తెలిపారు. తాను కేవలం 14 రోజుల వరకే అందుబాటులో ఉండనని కార్పొరేటర్లకు ముందస్తుగానే సమాచారమిచ్చానని పేర్కొన్నారు. తాను బుక్ చేసిన టికెట్లను సాకుగా చూపి తనపై దాడికి దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఆ టికెట్లను ఎప్పుడైనా రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, వచ్చే నెల 6వ తేదీన కరీంనగర్లో ఉంటానని వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం మేయర్ 14 రోజుల పర్యటన ముగుస్తుంది. కాగా, ఈ వ్యవహారమంతా టీ కప్పులో తుపానులా సమసిపోనుందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. -
విలన్‌గా సునీల్ ఎంట్రీ.. టీజర్ అదిరిపోయింది!
రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోనా తర్వాత సుదీప్ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్లో సుదీప్ డిఫరెంట్ లుట్లో కనిపించారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో వస్తోన్న మ్యాక్స్ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో కనిపించడంతో.. సుదీప్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.MAX Takes Charge! 💥👿🔗https://t.co/GbhvhNzPAl#MAXManiaBegins with the explosive #MaxTeaser 🔥 #boloMAXii@Max_themovie @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shivakumarart @shekarchandra71 @ganeshbaabu21 @dhilipaction @ChethanDsouza @saregamasouth…— Kichcha Sudeepa (@KicchaSudeep) July 16, 2024 -
బాధపడుతున్న వీహెచ్
-
స్టార్ హీరో సినిమాలో సునీల్‌కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
టాలీవుడ్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో గిలిగింతలు పెట్టించే నటుడు సునీల్. తెలుగులో హీరోగాను పలు సినిమాల్లో మెప్పించిన ఆయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పుష్పతో మళ్లీ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సౌత్ ఇండియాలో బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ 'జైలర్', కార్తి 'జపాన్', విశాల్ 'మార్క్ అంథోని' చిత్రాల్లో విభిన్న పాత్రల్లో ఆయన మెప్పించాడు.తాజాగా సునీల్ మలయాళ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అయితే, హాస్యనటుడిగా కాకుండా విలన్‌గా అతడు మాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. 'భ్రమయుగం' తర్వాత మమ్ముట్టి లేటెస్ట్ మూవీ టర్బోలో సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.సీరియస్ లుక్‌లో ఉన్న సునీల్.. టర్బో సినిమాలో ఆటో బిల్లా అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే కోలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సునీల్.. మాలీవుడ్‌లో కూడా తన సత్తా ఎంటో చూపించబోతున్నాడు. మే 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మమ్ముట్టినే నిర్మించాడు. తన సొంత బ్యానర్లో టర్బో సినిమా రానున్నడంతో అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.Sunil as Auto Billa#Turbo in Cinemas Worldwide on May 23 , 2024 pic.twitter.com/DA4tjNUQbI— Mammootty (@mammukka) May 17, 2024 -
Paarijatha Parvam Review: ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: పారిజాత పర్వంనటీనటులు: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , గడ్డం నవీన్, జబర్దస్త్ రోహిణి తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటిసంగీతం: రీఎడిటర్: శశాంక్ వుప్పుటూరివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘పారిజాత పర్వం’ కథేంటంటే?చైతన్య(చైతన్య రావు) దర్శకుడు కావాలని హైదరాబాద్ వస్తాడు. తన స్నేహితుడు(వైవా హర్ష)ని హీరోగా పెట్టి ఓ సినిమాను తెరకెక్కించాలనేది అతని కల. దాని కోసం కథతో నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది హీరోగా అతని స్నేహితుడిని పెట్టడం ఇష్టంలేక రిజెక్ట్ చేస్తుంటారు. చివరకు చైతన్యనే నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటాడు. డబ్బు కోసం ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) భార్య(సురేఖ వాణి)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరోవైపు బారు శ్రీను -పారు(శ్రద్ధాదాస్) గ్యాంగ్ కూడా శెట్టి భార్యనే కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యను కిడ్నాప్ చేసిందెవరు? అసలు బారు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చైతన్య, బార్ శ్రీను ఎలా కలిశారు? శెట్టి భార్యను కిడ్నాప్ చేయమని బార్ శ్రీను గ్యాంగ్‌కి చెప్పిందెవరు? వాళ్ల ప్లాన్ ఏంటి? చివరకు చైతన్య సినిమా తీశాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా తీయడం ఓ కళ. ప్రేక్షకుడిని నవ్వించో, భయపెట్టో.. ఏదో ఒకటి చేసి రెండున్నర గంటల పాటు థియేటర్స్‌లో కూర్చోబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. రొటీన్ కథనే మరింత రొటీన్‌గా చూపిస్తానంటే ఎందుకు వస్తాడు? ఈ విషయం తెలిసి కూడా పారిజాత పర్వం తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ కంభంపాటి.క్రైమ్ కామెడీ జోనర్లో సెఫెస్ట్ కాన్సెప్ట్ అయిన కిడ్నాప్ డ్రామానే కథగా మలుచుకొని.. రొటీన్ ట్విస్టులతో సాదాసీదాగా కథనాన్ని నడిపించాడు. ఫన్, సస్పెన్స్, థ్రిల్..వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడికి పూర్తిగా అందించలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చైతన్య సినిమా కష్టాలను చూపిస్తూనే బారు శ్రీను నేపథ్యాన్ని పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చెప్పిన కథనే మళ్లీ చెప్పడం..వచ్చిన సీన్లే మళ్లీ రావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. వైవా హర్ష పంచులతో పాటు హీరోయిన్ కారు డ్రైవింగ్ సీన్లు కాస్త నవ్విస్తాయి.అసలు కథంతా(కిడ్నాప్) సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే కిడ్నాప్ కోసం రెండు టీమ్‌లు చేసే ప్లాన్ మొదలుకొని..చివరి సీన్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యారు. కన్ఫ్యూజన్ డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. కిడ్నాప్ తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంది. పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులతో కథను సాగదీశాడు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని ప్రకటించడమే ప్రేక్షకుడికి పెద్ద ట్విస్ట్.ఎవరెలా చేశారంటే.. నటన పరంగా చైతన్యకు వంక పెట్టలేం కానీ ఆయన ఎంచుకుంటున్న కథలే రొటీన్ ఉంటున్నాయి. ఇందులోనూ ఆయన రొటీన్ పాత్రే పోషించాడు. సునీల్‌కి మంచి పాత్రే లభించింది. కానీ అటు విలన్‌గాను, ఇటు కమెడియన్‌గానూ పూర్తిగా మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం తనదైన కామెడీతో నవ్విస్తాడు. పార్వతిగా శ్రద్ధాదాస్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగాను కనిపించింది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష పండించే కామెడీ బాగుంది. ఇక చైతన్య లవర్‌గా మాళవికా సతీశన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. వైవా హర్షకు, ఆమె మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, సురేఖ వాణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సిన నటనను దర్శకుడు సరిగా రాబట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
Paarijatha Parvam: కిడ్నాప్ చేయడం ఓ కళ.. నవ్వులు పూయిస్తోన్న ట్రైలర్
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్యా రావు, మాళవికా సతీశన్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్’ (కిడ్నాప్ చేయడం ఓ కళ) అన్నది ట్యాగ్ లైన్. మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని యాంకర్ సుమ కనకాల రిలీజ్ చేశారు. కేక్ కట్ చేసే సమయంలో లైట్స్ ఆర్పుతారట.. మళ్లీ లైట్స్ వెలిగేలోపు కేక్‌తో పాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి’ అంటూ సునీల్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా చివర్లో వైవా హర్ష చెప్పే సినిమా రివ్యూ అయితే హైలెట్. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ‘‘పారిజాత పర్వం’క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్’’ అని యూనిట్ పేర్కొంది. -
ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోతారనడం బాధాకరం
కిర్లంపూడి: ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోతారనేలా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించడం బాధాకరంగా ఉందని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి తరలివచ్చి ఆయనను, యువ నాయకుడు ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ముద్రగడను కలిశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గంలోని ఒక్కో ఓటరుకు సీఎం జగన్ లక్ష ఇస్తున్నారంటూ ప్రజలను అవమానించేలా మాట్లాడడం పవన్‌కు తగదన్నారు. పవన్‌కు డబ్బు తీసుకునే జబ్బు ఉందని, ఆ జబ్బు అందరికీ ఉంటుందనుకోవడం బాధాకరమన్నారు. నియోజకవర్గ ఓటర్లు డబ్బు తీసుకునేవారా? అమ్ముడుపోయేవారమా? అని ముద్రగడ ప్రశ్నించారు. పిఠాపురం ప్రజలంతా డబ్బుకు అమ్ముడుపోతారనుకోవడం సరికాదన్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి.. ఇక రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ముద్రగడ విజ్ఞప్తి చేశారు. ఆరునెలలకోసారి వచ్చి రాజకీయాలుచేసే పవన్ కన్నా నిత్యం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ విజయానికి శ్రమించిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలని సునీల్, గీతకు సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి ప్రజలంతా ఆర్థికంగా బలపడేలా కృషిచేయాలని ముద్రగడ చెప్పారు. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, కొద్దిమంది కాపులవల్లే గతంలో తాను అధికారంలోకి వచ్చానన్నారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలను ఎప్పుడూ మరచిపోనన్నారు. -
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఆనందపురం (విశాఖ జిల్లా): కంటెయినర్లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్ పార్టుల లోడుతో హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్ పోస్టు వద్ద కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని, డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్ పోస్టులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద కంటెయినర్‌ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్‌ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్ బైక్‌ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్‌ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు. అందులో స్పేర్ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్‌లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్‌ను ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ, ఏసీపీ(నార్త్) సునీల్‌లు కంటెయినర్‌ను పరిశీలించి 13 బ్యాగ్‌లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజాయి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్ మణికంఠ చెప్పారు. -
కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
పుణె: మహారాష్ట్రకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సునిల్ కాంబ్లే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. శుక్రవారం పుణె కంటోన్మెంట్‌లోని సస్సూన్ జనరల్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎమ్మెల్యే సునిల్ కాంబ్లే హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మెట్లు దిగి వస్తున్న ఎమ్మెల్యే కాంబ్లేకి కానిస్టేబుల్ ఎదురయ్యారు. దీంతో, ఎమ్మెల్యే ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. శనివారం బాధిత కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే కాంబ్లే ఘటనపై స్పందిస్తూ.. నేను ఎవరిపైనా దాడి చేయలేదు. మెట్లుదిగి వస్తుండగా అడ్డుగా వచ్చిన ఒక వ్యక్తిని పక్కకు తోసేసి, ముందుకు వెళ్లానంతే’అని చెప్పారు. -
జగిత్యాలలో యువకుడి వీరంగం! మత్తుమందు చల్లి..
కరీంనగర్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తనవద్ద బస్‌చార్జీలు లేవని, తనను మల్యాల వద్ద దింపాలని అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడిని కోరాడు. అతను నిరాకరించడంతో తన వద్దనున్న మత్తుమందు చల్లాడు. దీంతో సదరు ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన సునీల్ కొద్దిరోజులుగా మతిస్థిమితం లేక తిరుగుతున్నాడు. మంగళవారం రాత్రి జగిత్యాలకు చేరుకున్న అతడు.. అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడిపై మత్తుమందు చల్లాడు. అస్వస్థతకు గురైన సదరు ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సునిల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతడి వద్ద చిన్నచిన్ని మారణాయుధాలు కూడా లభించాయి. బుధవారం అతని కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. యువకుడిని ఇలా వదిలిపెట్టవద్దని సూచించారు. ఇవి చదవండి: బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం! -
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా! : మేయర్ వై.సునీల్‌రావు
కరీంనగర్: ఎంపీ బండి సంజయ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, అసహనంతో కేసీఆర్, బీఆర్ఎస్లపై మతిభ్రమించి మాట్లాడుతున్నారని మేయర్ వై.సునీల్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడం, యువతను రెచ్చగొట్టడం ఎంపీ నైజమని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు చేయడం కాదని.. వాటిని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకుటే క్షమాపణ చెప్పి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రూపాయి లేదని చెప్పి, గెలిచి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రూ.50 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. మున్సిపల్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు. ఎంపీగా గెలిచాక బండి సంజయ్ ఈ ఐదేళ్లలో ఏనాడూ ప్రజల మధ్యలో లేరన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రలోభాలకు లొంగనివారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ల నాయకత్వంలో కరీంనగర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఎంపీ చేసిందేమిటో చెప్పాలన్నారు. కార్పొరేటర్లు గంట కల్యాణి, ఐలేందర్ యాదవ్, గందె మాధవి, సల్ల శారద, కోల మాలతి, కుర్ర తిరుపతి, వంగల శ్రీదేవి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజలే ‘బండి’ని సీజ్ చేశారు! ఎంపీ బండి సంజయ్ అర్థం లేని మాటలు మానుకోవాలని, ఎమ్మెల్యేగా ఓటమి చెందాననే నిరాశలో కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులు సీజ్ చేయాలని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందు నిలిపారన్నారు. ఐదేళ్లలో ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం తెచ్చిన నిధుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు సీజ్ చేయాలని మాట్లాడుతున్న బండి సంజయ్‌ని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే సీజ్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేయకుండా బీఆర్ఎస్ను టార్గెట్ చేసి, మాట్లాడటం దేనికి నిదర్శమని ప్రశ్నించారు. ఇవి చదవండి: 'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్ శంకర్‌నాయక్ -
కాంగ్రెస్ ఓటమికి వారే కారణం.. అక్కడ స్వేచ్ఛ ఇవ్వలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలకంగా వ్యవహరించారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి.. కాంగ్రెస్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఆదివారం విడుదలైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ... కేవలం తెలంగాణలోనే విజయం సాధించి మిగిలిన మూడు రాష్ట్రాల్లో పరాజయం పాలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించిన సునీల్ అక్కడ కాంగ్రెస్‌ను విజయతీరాలకు తీసుకెళ్లడంలో విఫలమాయ్యారు. అయితే దానికి రాజస్తాన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలే కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో వ్యూహకర్త పనిచేసినా.. ఆయా రాష్ట్రాల అగ్రనేతలైన అశోక్ గహ్లోత్, కమల్నాథన్లు సహకరించనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజస్థాన్‌లో పలు చోట్ల సర్వేలు చేసి కొంత మంది అభ్యుర్థుల మార్పును సూచించినా అశోక్ గహ్లోత్ అంగీకరించలేదంట. అదీకాక నరేష్ అరోరా ఎన్నికల వ్యూహాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సహరించినట్లుగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వ్యూహాల అమలు, అంతర్గత సర్వేల వంటి విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏఐసీసీ ఎన్నికల వ్యూహ కమిటీ ఛైర్మన్‌గా కూడా నియమితులైన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో కూడా తన మార్క్ వ్యూహాలతో కాంగ్రెస్ గెలుపును సునాయాసం చేశారు. గతంలో బీజేపీకి కూడా సునీల్ పలు ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014లో నరేంద్రమోదీకి ఎన్నికల ప్రచారంలో సేవలందించారు. ఉత్తరప్రదేశ్, గుజరాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పని చేశారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు ఆయాన వ్యూహకర్తగా సేవలందించారు. కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుపొందారు. అయితే.. ఆయన గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలకసభ్యుడిగా పనిచేశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం సునీల్‌కు.. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించిన విషయం తెలిసిందే. -
కిడ్నాప్ చేయడం ఓ కళ
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్ (కిడ్నాప్ చేయడం అనేది ఓ కళ). సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పోస్టర్లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగార్లు చేతిలో గన్‌తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్లో శ్రద్ధా దాస్ చేతిలో గన్‌తో స్టయిలిష్‌గా కనిపించారు. -
మాట్లాడితే పంచ్ పడాలంతే..!
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్ ఉండాలంతే.. పంచ్ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్ చేసిన హడావుడి బాగా పేలింది. ఇప్పుడు ప్రచారంలో పంచ్ డైలాగ్‌లు లేకుంటే పస ఉండదని భావిస్తున్న పార్టీల అభ్యర్థ్ధులు మంచి మంచి కొటేషన్లతో పంచ్‌లు విసురుతున్నారు. సోషల్ మీడీయాలో వాటిని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట :ఈ నెల 30న అందరి వేళ్లకు ఇంక్.. రాష్ట్రమంతా పింక్ అంటూ, అప్పుడు ఎట్లుండే తెలంగాణ..ఇప్పుడు ఎట్లయ్యింది తెలంగాణ అని బీఆర్ఎస్ అభ్యర్థుల కొటేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాకముందు 2014లో ఎలా ఉండే.. 2023లో ఎలా ఉందని బీఆర్ఎస్ అభ్యర్థులు డైలాగ్ కొటేషన్‌తో ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు కాంగ్రెస్, బీజేపీ కొటేషన్లు కూడా సోషల్ మీడియాలో ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకున్న కొటేషన్లు కొన్ని.. అన్నా... జిల్లాజిల్లాకూ ఐటీ టవర్.. మా గుండెల్లో ఉంటాడు కేటీఆర్ ఫరెవర్ మా అన్నను ప్రేమిస్తారు మహబూబ్‌నగర్ క్రౌడ్.. డెవలప్మెంట్ ఆగొద్దంటే రావాలి మా అన్న శ్రీనివాస్ గౌడ్ మర్చిపోతామా సాయన్న చేసిన సాయమూ.. కంటోన్మెంట్లో లాస్యమ్మ గెలుపు ఖాయమూ.. బాల్కొండలో ఎగురబోతుంది గులాబీ జెండా... ప్రశాంత్ అన్న మన అందరికీ అండా దండా.. ఎవరికి పడితే వాడికి కొట్టం జిందాబాద్... మా గోవర్న రూరల్ నిజాంబాద్ కాంగ్రెస్ బీజేపీ అందరు పక్కకు జరగాలి... మెదక్‌లో భారీ మెజారిటీ రాబోతుంది మా పద్మక్క కాంగ్రెస్ మారుస్తుంది తెలంగాణ భవిష్యత్ ఇప్పుడు ఇస్తుంది 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ బాగుండాలి ఐదేళ్ల జీవితం.... రావాలి ఐదు వేళ్ల హస్తం కాంగ్రెస్ మనకు అండ దండ... ఇస్తుంది రూ. 500కే గ్యాస్ బండ కాంగ్రెస్ వస్తే ఎన్నో ఉపయోగాలు.... యువతకు దొరుకుతాయి లక్షల్లో ఉద్యోగాలు తెలంగాణలో కమలం జెండా ఎగరాలి.. బీజేపీ గెలవాలి... బీసీ సీఎం కావాలి బద్దలు కొడదాం దొరల గడీ సాలు దొర... సెలవు దొర. -
స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్!
టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తున్నాడు. పుష్ప సినిమాలో శీనప్పగా మెప్పించిన సునీల్.. వరుస ఆఫర్లు వస్తున్నాయి. రజినీకాంత్ జైలర్‌లోనూ కీలక పాత్ర పోషించారు. తాజాగా శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమయ్యారు. పుష్ప తరహాలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. స్టార్ హీరో కిచ్చా సుదీప్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!) ఇప్పటికే పుష్ప సినిమాతో సునీల్ రేంజ్ మారిపోయింది. కమెడియన్ నుంచి పూర్తిస్థాయిలో విలన్ పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నారు. అదే క్రేజ్‌తో శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు. కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహాబలిపురంలో జరుగుతోంది. ఇటీవలే సునీల్ ఈ మూవీలో నటిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సునీల్ శాండల్‌వుడ్ ఎంట్రీపై ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుదీప్ ఆ తర్వాత కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టితో మరో సినిమా చేయనున్నారు. అంతకుముందే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లోనూ ఆయన పాల్గొననున్నారు. మిశ్రమ స్పందన అయితే సునీల్ ను మ్యాక్స్ లోకి తీసుకోవడంపై కన్నడ సినీ అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సినిమాకు సునీల్ అదనపు బలం అవుతాడని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం స్థానికంగా ఉన్న నటులను కాదని.. పక్క ఇండస్ట్రీలో నుంచి నటీనటులను తీసుకొని రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. (ఇది చదవండి: ఎలిమినేట్ చేయండన్న గౌతమ్, చెప్పుతో కొట్టుకుంటానన్న అమర్దీప్) Telugu actor Sunil, who impressed pan-India audience with a negative role in Pushpa, has been roped in to play antagonist in @KicchaSudeep #Max#Kichcha #Sudeep #Kichcha46 #Sudeepfans #Kichchafans #Sunil #Pushpa pic.twitter.com/hIgFMMkGWL — Bangalore Times (@BangaloreTimes1) November 3, 2023 -
'గేమ్ చేంజర్' షూటింగ్లో రామ్‌చరణ్‌కు గాయాలు!
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సునీల్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘గేమ్‌చేంజర్’ తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ రద్దు అయ్యింది. ‘‘గేమ్‌చేంజర్’లోని కొందరు ఆర్టిస్టులు షూటింగ్‌కు అందుబాటులో లేని కారణంగానే ఈ నెలలో జరగాల్సిన షూటింగ్ రద్దు అయింది. అక్టోబర్ రెండోవారంలో తిరిగి షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే రెండు రోజుల క్రితం రామ్‌చరణ్‌కు షూటింగ్లో చిన్న గాయమైందని ఓ వార్త వైరలవుతోంది. గాయం కారణంగా డాక్టర్ పది రోజుల వరకు విశ్రాంతి తీసుకోమన్నారని తెలుస్తోంది. ఈ కారణం వల్ల కూడా షూటింగ్ రద్దైనట్లు సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
హీరోయిన్గా ప్రముఖ డైరెక్టర్ కూతురు.. కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు!!
దర్శకుడు సెల్వరాఘవన్ నటుడిగా బిజీ అవుతున్నారు. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆయన నట జీవితం ఇప్పుడు హీరో స్థాయికి చేరుకుంది. తాజాగా పాన్ ఇండియా చిత్రంలో ప్రధానపాత్రను పోషిస్తున్నారు. మూమెంట్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై జీఎం.హరికృష్ణన్, దుర్గాదేవి హరికృష్ణన్ నిర్మిస్తన్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, టాలీవుడ్ నటుడు సునీల్, జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!) ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు రాజీవ్ మీనన్ వారసురాలు సరస్వతి మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రంగనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 1990 ప్రాంతంలో దర్శకుడు కే.భాగ్యరాజ్ రూపొందించిన చిత్రాలు తమిళంలో విజయవంతమవడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రీమేక్ అయి హిట్ అయ్యాయని, అలాంటి కథతో రూపొందించనున్న చిత్రమని దర్శకుడు తెలిపారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర కథను విన్న సెల్వరాఘవన్‌కు నచ్చడంతో ఇందులో ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకరించారని అన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం దిండుగళ్ ప్రాంతంలో 1000 మంది సహాయ నటీనటులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలిపారు. (ఇది చదవండి: సమంతలాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి) View this post on Instagram A post shared by Saraswathi Menon (@sarasmenon) -
మార్క్ ఆంటోని ట్విటర్ రివ్యూ.. విశాల్ సినిమాకు హిట్ టాక్!
హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని సినిమా ఎన్నో అడ్డంకులను దాటి నేడు(సెప్టెంబర్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభినయ, రీతూ వర్మ కథానాయికలుగా నటించగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఎస్జే సూర్య, సెల్వరాఘవన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎస్. వినోద్ కుమార్ నిర్మించాడు. ఈ మధ్యే జైలర్ సినిమాలో కామెడీ రోల్‌తో మెప్పించిన సునీల్ ఈ చిత్రంలోనూ కీ రోల్లో యాక్ట్ చేశాడు. చాలా చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షోలు పడటంతో సినీప్రియులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్రలన్నీ కార్తీ వాయిస్‌తో ఇంట్రడ్యూస్ అయ్యాయట. ఈ చిత్రంలో ఎస్జే సూర్య కామెడీ, యాక్టింగ్ అదిరిపోయిందని టాక్. ఒంటిచేత్తో సినిమాను నడిపించేశాడని ట్విటర్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ప్రారంభంలో, ముగింపులో.. దళపతి విజయ్‌కు, తలా అజిత్‌కు థ్యాంక్స్ కార్డ్ వేశారట.. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ అదిరిపోయిందని.. ఈ సినిమాతో విశాల్ సూపర్ హిట్ కొట్టాడని ట్వీట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, క్లబ్ సీక్వెన్స్, సిల్కు సీన్, క్లైమాక్స్‌లో ఫన్.. నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటున్నారు. సునీల్‌కు మరోవైపు కొందరు మాత్రం సినిమా మరీ ఓ రేంజ్లో ఏమీ లేదని ఒకసారి మాత్రం చూడవచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సునీల్ ఈ మధ్యే కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మావీరన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. జైలర్‌తో మరోసారి ప్రేక్షకులకు టచ్‌లోకి వచ్చాడు. తమిళ సినిమాల్లో అలా ఎంట్రీ ఇచ్చాడో, లేదో అప్పుడే అక్కడి నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సునీల్ చేతిలో ఈగై, బుల్లెట్, జపాన్ సహా పలు తమిళ సినిమాలున్నాయి. తెలుగులో గుంటూరు కారం, పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు చేస్తున్నాడు. #MarkAntony - Villain for the Win! Some Logic issues aside, gets a good play with time travel concept & fun working with mad performances & ideas! Sumaar 1st half but 2nd makes it up to a good extent... Nadippu Arakkan SJ Surya 💯🔥 Vishal scores well 💥 Loud music DECENT-GOOD https://t.co/OGrZqjGFDN pic.twitter.com/Uagb6JWt8U — Shreyas Srinivasan (@ShreyasS_) September 15, 2023 #MarkAntony World First review First half Good👌Second half Vera level 💥Screenplay🔥Music💥Vishal 💥SJ.Suryah the show stealer💥Mark Antony 🤜🤛 Jackie/Madhan Pandiyan💥Lot of fun theatrical moments😂Sure Shot Blockbuster 🔥Overall worth watch movie My rating 4.3/5⭐ pic.twitter.com/n9XMUceycD— MR.Reviewer (@review0813) September 14, 2023 first half taking slow start and fun ride .. bang with the interval block till now it’s Good . #MarkAntony #MarkAntonyFromSep15 #markantonyreview#markantonyusa@VishalKOfficial @iam_SJSuryah— Thileep Solaiyan (@thileep16) September 15, 2023 #MarkAntony Rating - 3/5 - Fun GuaranteedReview - #Vishal is good, #SJSuryah rocking performance as Jackie Pandian & Madan Pandian. New time travel concept. Wow Factors - Interval Block, club sequence, Silukku scene, climax fun.Many theater moments. Good 1st half and superb… pic.twitter.com/mKQy92m7qs— Cinema Bugz (@news_bugz) September 15, 2023 #MarkAntony Rating - 3/5 - Fun Guaranteed Review - #Vishal is good, #SJSuryah rocking performance as Jackie Pandian & Madan Pandian. New time travel concept. Wow Factors - Interval Block, club sequence, Silukku scene, climax fun. Many theater moments. Good 1st half and superb… pic.twitter.com/mKQy92m7qs — Cinema Bugz (@news_bugz) September 15, 2023 #markantonyreview ⭐️⭐️⭐️⭐️/ 5 wow we all enjoyed the movie thoroughly Have no words to express the gunshot forthcoming block buster victory .Its a great entertainer from 6 to 60 .. Awesome @VishalKOfficial and team . @iam_SJSuryah sir at his best 🎊🎊🎊#MarkAntony #vishal pic.twitter.com/tl3vyfxjgJ — Raja_cinemaholic (@raja_nagamuthu) September 15, 2023 Had a chance to watch #MarkAntony At Kerala , Kochi Savitha 5 Am show Mind blowing film perfect in each aspect @VishalKOfficial na comeback 🔥🔥 what a perfomer you are 🔥🔥. @iam_SJSuryah you nailed the role man 🫡🔥🔥🔥 @Adhikravi comeback 🔥 overall 4.5/5 💥💥💥💥💥💥💥💥 — jd_The master (@iam_groot_22) September 15, 2023 #MarkAntony Rating - 3.5 /5 - Fun Guaranteed Review - #Vishal is good, #SJSuryah rocking performance as Jackie Pandian & Madan Pandian. New time travel concept. Wow Factors - Interval Block, club sequence, Silukku scene, climax fun.#Vishal #sjsurya pic.twitter.com/XwI4O6KsQZ — REVIEW BUZZ (@Kumar02708212) September 15, 2023 #MarkAntony is totally waste of time to watch it in theatres , here is some positive and negative points Positives of this movie 1) Sj Surya acting next level 🔥 2) direction is good 4) comedy excellent Negatives points 1) Vishal acting is totally bad No proper story#Vishal https://t.co/dPxqk9xVE1 — Vikram Rathoreᴶᵃʷᵃⁿ ᴰᵘⁿᵏⁱ (@KingKhanSRK__) September 15, 2023 చదవండి: రతిక శాడిజం వల్ల సీరియల్ బ్యాచ్ అవుట్.. పచ్చిబూతులు మాట్లాడిన అమర్ -
సునీల్ రోడ్డు మధ్యలో కారుని ఆపి డాన్సులు చేసేవాడు
-
నిర్మాతకు డబ్బులొస్తే చాలు: డైరెక్టర్
‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా ‘’తో తొలి చాన్స్ వచ్చింది. సినిమా బ్లాక్‌బస్టర్ అయిందా లేదా అన్నది కాదు.. నిర్మాతకు డబ్బులొస్తే అదే పెద్ద సక్సెస్’’ అని సాయి సునీల్ నిమ్మల అన్నారు. యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రేవ్రి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథులుగా హాజరైన నటులు అరవింద్ కృష్ణ, శివారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్,పాటలు చాలా బాగున్నాయి. సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, డ్రామా ఉన్నాయి’’ అన్నారు యామిన్ రాజ్. -
Congress Party: కచ్చితంగా గెలిచేవి..41.. కష్టపడితే గెలిచేవి.. 42
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు కోసం స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్న టీ కాంగ్రెస్... అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వస్తోంది. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కసరత్తు నివేదిక ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్‌కు అందినట్లు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు ముందే సునీల్ కనుగోలు ఈ నివేదికను వేణుగోపాల్‌కు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగానే ఏఐసీసీ నియమించిన పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో వేణుగోపాల్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. సునీల్ కనుగోలు మూడు రకాలుగా విభజన... వాస్తవానికి గత నెల 24న జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సునీల్ కనుగోలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాల పరిధిలో పార్టీ అంతంత మాత్రంగానే ఉందని, మిగిలిన చోట్ల ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నామని వివరించారు. అయితే ఏ అసెంబ్లీ స్థానంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన ఆ సమావేశంలో వెల్లడించలేదు. తాజాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకుగాను 41 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశముందని, మరో 42 చోట్ల గెలుపు కోసం కష్టపడాల్సి ఉంటుందని, 36 స్థానాల్లో గెలుపు అంత సులభం కాదని, ఆ స్థానాలపై ప్రస్తుత పరిస్థితుల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని కె.సి.వేణుగోపాల్‌కు ఇచ్చిన నివేదికలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నివేదిక ప్రకా రం గెలుపు అవకాశాలున్న చోట్ల ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని, గెలుపు కోసం కష్టపడాల్సిన స్థానాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కె.సి.వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం. ఇక, పరిస్థితి ఏమాత్రం బాగాలేని 36 స్థానాల్లో ఏం చేస్తే మెరుగుపడతామన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని వేణుగోపాల్ మార్గనిర్దేశం చేసినట్టు తెలు స్తోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యురాలు దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్‌బాబు, విష్ణునాథ్, మన్సూర్‌అలీఖాన్, రోహిత్‌చౌదరి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన మీటింగ్.. తెలంగాణ బీజేపీ 100 యాక్షన్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బీజేపీ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై నేతలు ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల సహ ఇంఛార్జ్‌గా సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా సునీల్ బనల్స్.. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలి. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ప్రముఖులను కలవడంపై స్పీడ్ పెంచాలి. ఆగస్టు 15వ తేదీలోపు ఇవన్నీ పూర్తి కావాలి. రేపు(మంగళవారం) జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా ఇంఛార్జ్‌లు, మాజీ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్పై ఉద్యమ కార్యచరణకు రేపు ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్టు స్పష్టంచేశారు. ఏయే అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే అంశాలపై రేపు చర్చించనున్నారు. తెలంగాణలో ఎజెండా, కార్యాచరణను బీజేపీ ప్రకటించనుంది. ఇది కూడా చదవండి: రాహుల్ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారు: మల్లు రవి -
‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అంతేస్థాయిలో విమర్శల పాలైంది. రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతోంది. తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి ఆదిపురుష్ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని విమర్శించారు. (ఇది చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా? ) సునీల్ లహరి మాట్లాడుతూ.. 'వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్క్లెయిమర్లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.. అందుకు భిన్నంగా తీశారు. పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు. మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు. డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు. దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు. ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి. హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో.. ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు. ' అని అన్నారు. సినిమాలోని పాత్రలపై గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఆదిపురుష్‌లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయా. రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు. అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు. సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్‌గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి. వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు. ఇది నటీనటుల తప్పు కాదు. వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది. ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా. ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది.' అని అన్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) -
రిపోర్టులో ఏముంది?.. టీకాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్!
అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. టీకాంగ్రెస్ అడ్వైజర్ సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్‌లో ఏముందనే విషయంపై గాంధీభవన్‌లో మల్లగుల్లాలు పడుతున్నారు. 150 డేస్ యాక్షన్ ప్లాన్‌లో ఏముంది? తెలంగాణలో అధికారం సాధించడానికి కాంగ్రెస్ వేస్తున్న ప్లాన్ ఏంటి?.. కర్నాటకలో సాధించిన విజయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎలాగైనా ఈసారి గెలిచి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న ఢిల్లీలో రాష్ట్ర పార్టీ నేతలతో అగ్రనేతలు రాహుల్, ప్రియాంక సమావేశం కాబోతున్నారు. అంతకంటే ముందుగా రాష్ట్రంలో పార్టీకి వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఒక నివేదిక అందించారు. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, ఇంకా బలం పెంచుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి సునీల్ తన నివేదికలో పలు సూచనలు చేసినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల వారిగా పార్టీ బలాలు, బలహీనతలతో స్పష్టమైన నివేదికను కనుగోలు టీం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితా, బీజేపీలో నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్న నేతల జాబితా కూడా సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలోని వారిలో కాంగ్రెస్‌లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నవారి పేర్లు, ఎవరిని తీసుకుంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందో అనే వివరాలు కూడా పొందుపరిచినట్లు సమాచారం. టిక్కెట్ హామీ ఇస్తే కాంగ్రెస్ గూటికి చేరే ముఖ్యుల జాబితా కూడా ప్రత్యేకంగా తయారు చేశారట. పార్టీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న నాయకులు మాత్రమే కాదు.. ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా మరింత మందిని ఆకర్షించాలని సూచించినట్లు చెబుతున్నారు. 150 రోజుల యాక్షన్ ప్లాన్.. పార్టీ మైలేజ్ పెంచడం కోసం పార్టీ పెద్దలకు 150 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందట కనుగోలు టీమ్. 150 రోజుల్లో ఏ కార్యక్రమం చేస్తే ఏ మేరకు లాభం కలుగుతుంది అనేదానిపై వివరణాత్మక రిపోర్ట్ ఇచ్చారట. నేతలంతా ఐక్యంగా ఉన్నారనే ఇమేజ్ పార్టీకి ఇప్పుడు అవసరం అని అందుకోసం పీసీసీ, సీఎల్పీ, సీనియర్లతో బస్సు యాత్ర చేయించాలనే ప్రతిపాదనను సునీల్ టీం ఏఐసీసీ ముందు ఉంచిందట. ఇక దీనికి తోడు కేసీఆర్‌ను ముగ్గులోకి దింపడంలో కాంగ్రెస్ కొంతమేర సఫలీకృతం అయిందని, మరింతగా ఫోకస్ పెట్టాలని సూచించిందని టాక్. ధరణి వెబ్సైట్ విసయంలో సీఎం కేసీఆర్‌ను బయటకు లాగగలిగామని.. సీఎం నోటి నుంచే ధరణి సమస్యలను చెప్పించగలుగుతున్నామనే అంచనాలతో కనుగోలు టీం ఉందట. తెలంగాణ సెంటిమెంట్‌తోనే కాకుండా.. ప్రజా సమస్యల చుట్టూ ప్రచారం జరిగితే కాంగ్రెస్‌కే లాభం అని డిక్లరేషన్ల ద్వారా బీఆర్ఎస్ను మరింత ఇరకాటంలో పెట్టేందుకు గ్రామ స్థాయి నుండి కార్యాచరణ చేపట్టాలని సునీల్ టీం సూచించిందట. దీంతో పాటు అనుబంధ విభాగాలతో ఆయా రంగ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని, ఇలా ఎవరికి వారు కార్యక్షేత్రంలో ఉంటేనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలదనే రిపోర్ట్ సునీల్ ఇచ్చారట. ఈ రిపోర్ట్‌లోని అంశాల ఆధారంగానే తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ ఉండనుందని, ఇక ఇదే ఎన్నికల శంఖారావంగా భావించొచ్చని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. సునీల్ టీమ్ ఇచ్చిన నివేదిక బాగానే ఉందని టీకాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కాని ఆ రిపోర్ట్‌ను అమలు చేయడం సాధ్యం అవుతుందా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందనే టాక్ నడుస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు: జితేందర్ రెడ్డి -
Bhuvana Vijayam: ఓడి గెలిచినవాడి కథ ‘భువన విజయమ్’
‘‘ప్రతి మనిషి గెలుపు కోసమే పరిగెడతాడు. అయితే మా ‘భువన విజయమ్’ ఓడి గెలిచినవాడి కథ. గెలిచినవాళ్లు ఓడిపోయినవాళ్లని గెలిపించిన కథ. కామెడీ, ఫ్యాంటసీ, థ్రిల్.. ఇలా అన్నీ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు యలమంద చరణ్. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భువన విజయమ్’. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎక్కడంటే? ) కిరణ్, వీఎస్కే నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు ధనరాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకుడి పాత్ర చేశాను. ఈ చిత్రంలోని పాత్రలని నేను ఎలా చూస్తానో ఆడియన్స్ కూడా అలానే చూస్తారని డైరెక్టర్ చెప్పడం సవాల్‌గా అనిపించింది’’ అన్నారు. ‘‘యూనిట్ సహకారంతో అనుకున్న టైమ్‌కి పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్, వీఎస్కే. ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మి, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: సాయి. -
ఆసక్తికరంగా 'భువన విజయమ్'.. ట్రైలర్ విడుదల
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు యలమంద చరణ్ తెరకెక్కించిన చిత్రం ‘భువన విజయమ్’. కిరణ్, వీఎస్కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నువ్వు చనిపోతే తీసుకెళ్లడానికి వచ్చిన యమ భటులం.. అట్లాంటప్పుడు మనం నరకానికి పోవాలి కానీ ఈ సినిమా ఆఫీసుకు వచ్చుడేంది సర్’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘ఫన్, ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: సాయి. -
సునీల్ 'భువన విజయమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘భువన విజయమ్’. ఈ చిత్రంతో యలమంద చరణ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ సినిమా పై ఆసక్తిని పెంచాయి. (చదవండి: బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..) తాజాగా మేకర్స్ విడుదల తేదిని అనౌన్స్ చేశారు. మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
Birth Of Bhuvana Vijayam: ఫోస్టర్ చూస్తే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కి పోవాలి
సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భువన విజయమ్’. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్; టైటిల్ పడటం ఆసక్తికరంగా ఉంది. ఇక చివర్లో ‘నా ఫోస్టర్ చూస్తే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కి పోవాలి’అని సునీల్ అంటుంటే.. వెన్నెల కిశోర్ స్కెచ్‌తో సునీల్ పోస్టర్ని మార్చడం నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పారిజాత పర్వం.. అమ్మాయికి ముసుగు వేసి కుర్చీలో బంధించి..
సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘పారిజాత పర్వం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్. ఓ అమ్మాయికి ముసుగు వేసి కుర్చీలో బంధించినట్లు టైటిల్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న చిత్రం ‘పారిజాత పర్వం’. టైటిల్‌కి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: అనంత సాయి, కెమెరా: బాల సరస్వతి, సంగీతం: రీ. -
రజతం నెగ్గిన భారత రెజ్లర్ రూపిన్.. తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు
కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో రూపిన్ (55 కేజీలు) రజతం... నీరజ్ (63 కేజీలు), సునీల్ (87 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్లో రూపిన్ 1–3తో సౌలత్ (ఇరాన్) చేతిలో ఓడిపోగా... నీరజ్ 5–2తో జిన్‌సెయుబ్ సాంగ్ (దక్షిణ కొరియా)పై, సునీల్ 4–1తో మసాటో సుమి (జపాన్)పై గెలిచారు. చదవండి: #KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా! రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాలేదు! వీడియో వైరల్ -
ఆసక్తిని పెంచుతున్న సునీల్ కొత్త సినిమా టీజర్
కొన్ని సినిమాలు టైటిల్‌తోనే ఆసక్తిని పెంచేస్తాయి. అలాంటివాటిలో సునీల్ నటిస్తున్న తాజా చిత్రం ‘భువన విజయమ్’ ఒకటి. శ్రీకృష్ణ దేవరాయులు ఆస్థానానికి ‘భువన విజయమ్’ అని పేరు. ఇప్పుడు అదే టైటిల్ తో సునీల్ సినిమా రావడం క్యురియాసిటీని పెంచింది. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ మారుతిని విడుదల చేశారు. టైటిల్ లానే టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ‘ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు.. ఒక ప్రొడ్యూసర్.. తనకి జాతకాల పిచ్చి.. ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. అనుకోకుండా రైటర్ గా మారిన ఓ దొంగ.. సచ్చికూడా ఇంకా మనసుల మధ్య తిరుగుతున్న ఓ ఆత్మ.. పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు, నాలుగు గోడల మధ్య.. మూడు గంటల కాలంలో ఇద్దరు చావాలి, ఒక కథ తేలాలి’అంటూ ఆసక్తిని రేపే వాయిస్ ఓవర్ తో టీజర్ కట్ చేశారు. టీజర్ చాలా ఎంగేజింగ్ ఉంది. కామెడీ, సస్పెన్స్, థ్రిల్, డ్రామా అన్ని ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ తమదైన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సీరియస్ లుక్‌లో కమెడియన్స్.. భువన విజయమ్ ఫస్ట్ లుక్
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ డ్రామా భువన విజయమ్. యలమంద చరణ్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ వేణు ఉడుగుల లాంచ్ చేశారు. వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్‌లో కనిపించారు. శ్రీమతి లక్ష్మీ సమర్పిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. -
దేశ ‘కనెక్టింగ్ ఫ్యాక్టర్’ హిందుత్వం
పేరు ప్రఖ్యాతులు కావాలని ఆరెస్సెస్ పాటుపడదనీ, సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడానికి కావాల్సిన శక్తియుక్తులను అందించడానికి వీలుగా వ్యక్తులను కలిపి పనిచేయించడమే ఆరెస్సెస్ లక్ష్యమనీ ఆ సంస్థ ప్రచార్ ప్రముఖ్ (మీడియా రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్) సునీల్ అంబేకర్ అన్నారు. ఆయన ఇంగ్లీషులో రాసిన ‘ద ఆరెస్సెస్: రోడ్‌మ్యాప్స్ ఫర్ ద 21 సెంచరీ’ పుస్తకానికి తెలుగు అనువాదం ‘అరెస్సెస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం’ ఆవిష్కరణకు ఇటీవల విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ. ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని దేశంలో చాలామంది ఆకాంక్ష. యువతలో అది ఇంకా బలీయంగా ఉంది. నేను విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తున్న సమ యంలో దేశాభివృద్ధి గురించి యువత ప్రశ్నించేది. కాలక్రమంలో ప్రశ్న అడిగే తీరులో మార్పును గమనించాను. దేశ ప్రగతికి సంబం ధించి యువత నుంచి ప్రతికూల ప్రశ్నలు కాకుండా సానుకూల ప్రశ్నలు రావడం మొదలైంది. దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలి? అని విభిన్న కోణాల నుంచి వస్తున్న ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడిని. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సమాజంలో అందరి భాగస్వామ్యం ఉండాలి. ఈ యజ్ఞంలో భాగమైన సంఘ కార్యంలో(ఆరెస్సెస్ కార్యక్రమాల్లో) అందరికీ భాగస్వామ్యం ఉండాలని ఆరెస్సెస్ భావిస్తోంది. ఆరెస్సెస్‌ను మరింత బాగా అర్థం చేసుకోవడానికీ, సంఘ పరిచయం లేని వ్యక్తులు కూడా ఆరెస్సెస్ తీరును అవగతం చేసుకోవడానికీ పుస్తకం రాయాలన్న ప్రతిపాదన నా వద్దకు వచ్చింది. దానికి అంగీకరించాను. ఈ పుస్తకంలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏమిటి? 1. దేశం అభివృద్ధి చెందాలని సామాన్యులు కూడా బలంగా ఆకాంక్షిస్తున్నారు. బాధ్యత తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సంఘం(ఆరెస్సెస్) విస్తరణకు సామాన్యుల త్యాగాలు, వారి విజయ గాథలే మూలాధారం. ఈ విషయాన్ని ప్రధానంగా చెప్ప దలుచుకున్నాను. సంఘ కార్యంలో అందరి భాగస్వా మ్యాన్ని అభిలషిస్తున్నాం. 2. ఈ దేశ సంస్కృతి, వారసత్వం, హిందుత్వం... మనం గర్వించాల్సిన అంశాలే తప్ప, న్యూనత చెందాల్సిన అంశాలు కాదు. సర్వమానవ హితానికి అవి అత్యంత రమణీయమైన అంశాలు. అయితే ఈ విషయాల పట్ల కొంత మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వాటిని దూరం చెయ్యాలి. 3. ప్రజలంతా దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. వర్త మానంలో దేశానికి ఉన్న శక్తి ఆధారంగా భవిష్యత్‌ను నిర్మించుకోవాలి. 4. హిందుత్వం అంటే అందరినీ కలి పేది. అందరి బాగు కోరుకోవడమే హిందుత్వం. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలిపి ఉంచే ‘కనెక్టింగ్ ఫ్యాక్టర్’ హిందుత్వం. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు, సవాళ్లకు సమాధానం బయటి నుంచి లభించదు. మనకు మనమే పరిష్కారాలను అన్వేషించాలి. స్వాతంత్య్ర పోరాటం కూడా కేవలం ఆంగ్లేయులను వెళ్లగొట్టడం కోసమే కాకుండా, స్వపాలన, స్వదేశీ, స్వభాష.. ఇలా ‘స్వ’(సొంత) సాధన లక్ష్యంగా సాగింది. ఇప్పుడు కూడా ‘స్వ’ ఆధారంగా మన ప్రణాళికలు ఉండాలి. ప్రతి నిర్ణయం స్వావలంబన సాధించే దిశగా ఉండాలి. సమాజంలోని ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములను చేయాలి. సంఘం (ఆరెస్సెస్) చెప్పేది ఇదే. ఈ పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారు? స్వయం సేవకులకా, స్వయం సేవకులు కావాలనుకుంటున్న వారికా? అందరికీనా? అందరికీ ఉద్దేశించింది. ఆరెస్సెస్‌ను అర్థం చేసుకోవాలనుకొనే వారికి ఉపయుక్తం. స్వయం సేవక్‌లే కాదు, అందరూ చదవాలి. పుస్తకం చదివిన తర్వాత ఎలాంటి ఫీల్ కలిగినా ఫర్వాలేదు. ఆరెస్సెస్‌ను వ్యతిరేకించేవారైనా పుస్తకం చదవాలి. 2025 నాటికి ఆరెస్సెస్ ఏర్పాటై వందేళ్లు పూర్తవుతుంది. ఇప్పటికీ ఆరెస్సెస్ పనితీరు, అంతర్గత వ్యవహారాల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. వందేళ్ల తర్వాత అయినా ఆరెస్సెస్ అంతర్గత వ్యవహారాలు సామాన్యులకు తెలిసేలా పారదర్శకంగా పనిచేస్తుందా? ఆరెస్సెస్ ఏర్పాటయిన తొలి రోజు నుంచి తెరిచిన పుస్తకమే. సంఘం యాజమాన్య హక్కులు ఎవరి(వ్యక్తుల) సొంతం కాదు. ఆరెస్సెస్ యాజమాన్యం ప్రజలదే. ప్రజల భాషలో చెప్పాలంటే పబ్లిక్ కంపెనీ. భారతమాత కోసం పనిచేస్తున్నామనే భావనతో ప్రతి స్వయం సేవక్ పనిచేస్తారు. సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడమే ‘సంఘ’ లక్ష్యం. ఆరెస్సెస్‌ను బలోపేతం చేయడం కాదు... సమాజాన్ని, దేశాన్ని సాధికారత దిశగా నడిపించడమే లక్ష్యంగా ఆరెస్సెస్ పనిచేస్తుంది. అందుకే ఎవరైనా ఆరెస్సెస్‌లో పనిచేయడానికి ‘ఫిట్’ అవుతారు. మంచి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తాడు స్వయం సేవక్. సమాజానికి ఉప యోగపడే ఏ పని చేద్దామన్న ఆసక్తి ఉన్నా, ఏ రంగంలో చేయాలనుకున్నా ఆరెస్సెస్ తోడుగా నిలుస్తుంది. అరెస్సెస్ ప్రయాణం తెరిచిన పుస్త కమే... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ! ఇక మీద ఆరెస్సెస్ విస్తరణ మీద దృష్టి పెడతారా? సిద్ధాంతాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెడతారా? పేరు, ప్రఖ్యాతుల కోసం ‘ఆరెస్సెస్’ పని చేయడం లేదు. సిద్ధాంతం ఆధారంగా పనిచేసుకుంటూ ముందడుగు వేస్తుంటుంది. వ్యక్తులు, వ్యవస్థలను ‘నెట్ వర్కింగ్’ చేయడమే సంఘం పని. సామాన్యులను సాధికారత దిశగా నడిపించడానికి నెట్వర్కింగ్ చేస్తుంది. మరింత ఎక్కువ మందిని కలిపి పనిచేయించడం ద్వారా సాధికారత సాధించడమే తప్ప... అది ఆరెస్సెస్ విస్తరణ కాదు. రెండో అంశం, సిద్ధాంతం గురించి అడి గారు... అరెస్సెస్ సిద్ధాంతం చాలా సింపుల్. అందరూ గర్వపడే విధంగా దేశాన్ని తయారు చేయడం, హిందుత్వాన్ని చూసి గర్వ పడటం, ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కోరుకోవడం... ఇది కేవలం ఆరెస్సెస్ లైన్ మాత్రమే కాదు... వేల సంవత్సరాలుగా ఈ దేశ అంతరాత్మ ఇదే. దేశానికి సేవ సేయడమే ఆరెస్సెస్ సిద్ధాంతం. యాంటీ–నేషనల్స్ అని పదాన్ని ఆరెస్సెస్ ఈ మధ్య ఎక్కువగా ఉప యోగిస్తోంది. మీ దృష్టిలో దీని నిర్వచనం ఏమిటి? స్వయం సేవక్‌లు నడిపే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారు ‘యాంటీ–నేషనల్స్’ అనా? ఎంతమాత్రం కాదు. ప్రభుత్వాలను విమర్శించడం, వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగం. పార్లమెంట్‌లోనే విమర్శిస్తున్నారు కదా! వారిని యాంటీ–నేషనల్స్ అని ఎవరూ అనడం లేదు. ఆ పదంలోనే దాని అర్థం ఉంది, దేశానికి వ్యతిరేకం అని. దేశ హితాన్ని కాంక్షించని వారంతా యాంటీ–నేషనల్స్. ఇది ఆరెస్సెస్ సృష్టించిన పదం కాదు. చరిత్రను చూసే దృష్టికోణం మారాలంటున్నారు కదా! ఎందుకు మారాలి? దేశాన్ని చాలా శతాబ్దాల పాటు విదేశీయులు పాలించారు. వారి ఆలోచనలకు అనుగుణంగా చరిత్ర తయారయింది. వారి ప్రయో జనాల పరిరక్షణకు వీలుగా చరిత్రను రూపొందించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మహాపురుషులు, రుషులు, సమర్థ పాల కుల చరిత్ర మరుగున పడిపోయింది. మన వారసత్వాన్ని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి లేకుండా చేశారు. ఒక కుటుంబ చరిత్ర, ఒక వంశ పాలన చరిత్ర కాదు. ఈ దేశ నిర్మాణంలో గ్రామీణులు, కొండకోనల్లో నివసించేవారు, పేదలు, ధనికులు, పాలకులు... అందరి పాత్రా ఉంది. దాన్ని విస్మరించారు. ఆర్యులు వెలుపలి నుంచి వచ్చారనే సిద్ధాంతం తప్పని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా చెప్పారు. విదేశీ దృష్టి కోణం మారాలి. మన దేశం దృష్టి కోణం నుంచి చరిత్రను చూడాలి. సరికొత్త కోణంలో చరిత్రను ఆవిష్కరించి ప్రజల ముందు ఉంచాలి. – ఎం. విశ్వనాథ రెడ్డి -
అందాల రాముడు చేయనని చెప్పాను: సునీల్
కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ మెప్పించాడు సునీల్. అయితే హీరో పాత్రలోనూ కామెడీ చొప్పించి నవ్వించగల ఘనుడు సునీల్. మర్యాద రామన్న సినిమాలో ఆయన పాత్ర, నటన, కామెడీ అద్భుతంగా పండాయి. 'విలన్ అవుదామని వచ్చి కమెడియన్ అయ్యాను. చాలారకాల పాత్రలు చేసేశానని నాకు పుష్పలో కొత్త గెటప్ వేశారు. నాపైన కోట శ్రీనివాసరావు ప్రభావం గట్టిగా ఉంది. అప్పుడే సీరియస్‌గా చెప్పి వెంటనే నవ్వించగలడు. ఆ చెప్పే విధానం బాగుంటుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా నాకు ఇన్స్పిరేషన్. అందాల రాముడు సినిమా చేయనని చెప్పా. రెండేళ్లపాటు అదే మాట చెప్పుకుంటూ వచ్చా. కానీ నేనే ఆ సినిమా చేయాలని డైరెక్టర్ లక్ష్మీనారాయణ పట్టు పట్టడంతో చేశాను. మర్యాద రామన్న అనేది భగవంతుడు ఇచ్చిన వరం. పూలరంగడు కోసం బాగా కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాను. నేను ఏ క్యారెక్టర్‌కైనా రెడీగా ఉన్నాను. ఏ పాత్ర వచ్చినా చేస్తాను. తెలుగులో రామ్‌చరణ్- శంకర్ మూవీ, పుష్ప 2, విరూపాక్ష సహా మరో రెండు చిత్రాలు చేస్తున్నాను. అలాగే తమిళ్లో మహావీరన్, జైలర్, మార్క్ ఆంటోని, జపాన్ చేస్తున్నా. హిందీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ డేట్స్ కుదరక కొన్నింటికి న్యాయం చేయలేకపోతున్నా' అని చెప్పుకొచ్చాడు సునీల్. తన కుటుంబం గురించి చెప్తూ.. తన భార్య పేరు శృతి అని కావ్య, దుశ్యంత్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. తల్లితో కలిసి అంతా ఒకేచోట ఉంటామని పేర్కొన్నాడు. చదవండి: చీటింగ్ ఆరోపణలపై స్పందించిన సింగర్ యశస్వి -
రాజమౌళితో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..!
సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం చాలా కష్టమే. కొందరు తక్కువకాలంలోనే స్టార్డమ్ సొంతం చేసుకుంటే మరికొందరేమో మరిన్ని అవకాశాల కోసం వెయిట్ చేస్తారు. ఇండస్ట్రీలోకి అలా వచ్చి ఇలా వెళ్లేవారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో ముందువరుసలో ఉంటుంది ఆ నటి. దర్శకధీరుడు రాజమౌళితో హిట్ కొట్టిన హీరోయిన్ ఆ తర్వాత కనుమరుగైనపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? మర్యాద రామన్నలో మెప్పించిన సలోని. తాజాగా హైదరాబాద్‌లోని ఓ జువెలరీ ర్యాంప్ షోలో కనిపించింది భామ. ఆమెను చూసిన చాలామంది అభిమానులు మొదట గుర్తు పట్టలేకపోయారు. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా అంత ఈజీగా మరిచిపోయే గ్లామర్ కాదు. సునీల్‌తో మర్యాద రామన్నలో కనిపించిన నటి ఇప్పుడు చూస్తే షాకవ్వడం ఖాయం. అప్పుడు సన్నగా ఉన్న సలోని ఇప్పుడేమో కాస్త బొద్దుగా కనిపించే సరికి గుర్తుపట్టడం కష్టమైంది. ఈ సినిమాకు ముందు సలోని గురించి ఎవరికీ తెలియదు. అంతుకుముందు ఆమె చేసిన కొన్ని సినిమాలు కూడా ఎప్పుడొచ్చి వెళ్లాయనేది కూడా తెలీదు. సునీల్ హీరోగా నటించిన ఈ సినిమాతో రాజమౌళి హిట్ కొట్టారు. View this post on Instagram A post shared by salloniasvwani🧚♀️😇 (@saloniaswani_official) -
ధరణిపై దండుగా కదలాలి
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అన్ని రాజకీయపార్టీలు, రైతులు దండుగా కదిలి పోరాడాలని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు భూమి సునీల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో భూములు రీ సర్వే చేస్తేనే ధరణి, భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాగా చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో శనివారం లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్), గ్రామీణ న్యాయపీఠం సంస్థ, తెలంగాణ సోషల్‌మీడియా ఫోరం, తెలంగాణ రెవెన్యూ మాసపత్రిక ఆధ్వర్యంలో భూ న్యాయ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి గ్రామస్థాయిలో పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని కలెక్టరేట్ వరకు తీసుకుపోయిందని ఆరోపించారు. ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో గవర్నర్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నివేదికను సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ మాసపత్రిక సంపాదకులు వి.లచ్చిరెడ్డి, సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, కిసాన్‌సెల్ నాయకులు కోదండరెడ్డి, బీజేపీ నేత కొండావిశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సునీల్ కనుగోలుకు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన మీమ్స్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41 (ఏ) కింద ఇచ్చిన నోటీసుల్లో శుక్రవారం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. ఈ నోటీసులను సునీల్ తరఫున కాంగ్రెస్ నేత మల్లు రవి అందుకుని సంతకం చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎం.శ్రీప్రతాప్, టి.శశాంక్, ఇషాంత్ శర్మ ఆదివారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా పది రోజుల సమయం కోరడంతో పోలీసులు అనుమతించారు. తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఆర్.సామ్రాట్ ఫిర్యాదుతో గత నవంబర్ 24న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీని దర్యాప్తులో లభించిన క్లూ ఆధారంగా పోలీసులు ఈ నెల 13న రాత్రి మాదాపూర్‌లోని మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. అప్పుడే ఇది కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌గా తెలిసింది. అక్కడ పట్టుబడిన ముగ్గురి విచారణలో సునీల్ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. విచారణకు రాకపోతే అరెస్టు సçహా ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. -
‘వార్ రూమ్’ కేసులో ప్రధాన నిందితుడికి నోటీసులు.. కానీ ఇక్కడో ట్విస్ట్!
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్ రూమ్ సోదాల కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలుకి నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అయితే, సునీల్ కనుగోలు నోటీసీ కాపీని అందుకున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి సంతకం చేయడం గమనార్హం. తెలంగాణ గళం, భారత యువకుడు పేర్లతో సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న మీమ్స్ వీడియోలు అసభ్యకరంగా ఉండటంతో నగరంలో 5 కేసులు నమోదయ్యాయని గతంలోనే పోలీసులు వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లను కించపరుస్తూ పోస్టులులు పెట్టారని ఆరోపణ వచ్చాయి. దానిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ కనుగోలు టీంలోని ముగ్గురు సభ్యులు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఐపీసి సెక్షన్ 469, 505 కింద సునీల్ కనుగోలు టీం మీద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ‘ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇలా చేస్తారా.. నేను కూడా అదే పోస్ట్ చేస్తా’ పరారీలో సునీల్ కనుగోలు.. ‘మీమ్స్ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు -
కాంగ్రెస్ హ్యూహకర్త సునీల్ కనుగోలుకు నోటీసులు
-
ఇవాళ సునీల్ కనుగోలు టీమ్ సభ్యుల విచారణ
-
ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు : రేవంత్ రెడ్డి
-
పరారీలో సునీల్ కనుగోలు.. ‘మీమ్స్ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గళం, భారత యువకుడు పేర్లతో సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న మీమ్స్ వీడియోలు అసభ్యకరంగా ఉండటంతో నగరంలో 5 కేసులు నమోదయ్యాయని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సంయుక్త పోలీస్ కమిషనర్ డాక్టర్ గజరావ్ భూపాల్ తెలిపా రు. సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో మంగళవారం రాత్రి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సునీల్ కనుగోలు గతంలో పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ ఐ-ప్యాక్ లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేశారు. 2014లో బీజేపీ కోసం పని చేసిన బృందంలో ఒకరు. 2014 ఎన్నికల తర్వాత ఐ- ప్యాక్ తో విడిపోయి స్వంతంగా ఎస్.కె పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసుకున్నారు సునీల్. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ లో చేరిన సునీల్ కనుగోలు ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ కు ఎస్.కె టీమ్ సేవలు అందిస్తున్నారు సునీల్ కనుగోలు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలి. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా మీమ్స్ వీడియోలు చేయడం చట్ట ప్రకారం నేరమే. ఈ వీడియోలు, మీమ్స్ తదితరాలకు సంబంధించి సైబర్ క్రైమ్ ఠాణాతో పాటు మార్కెట్, చంద్రాయణగుట్ట, రామ్‌గోపాల్‌పేట్, అంబర్పేట్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు తమ ఠాణాలో నమోదైన కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక టూల్స్ వినియోగించారు. ఫలితంగా ఆ వీడియోలు మాదా పూర్లోని మైండ్షేర్ యునై టెడ్ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయం నుంచి అప్లోడ్ అవుతున్నట్లు గుర్తించారు. మంగళవారం అక్కడ దాడి చేసి 10 ల్యాప్‌టాప్‌లు, సీపీ యూలు, సెల్ఫోన్లు సీజ్ చేశాం. ఎం.శ్రీప్రతాప్, టి.శశాంక్, ఇషాంత్‌ను అదుపులోకి తీసుకున్నాం. వీరికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విడిచిపెట్టాం. వీరి విచారణలోనే సునీల్ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. అతడు చెప్పడంతోనే తాము ఆ పోస్టులు పెడుతున్నామన్నారు. దీంతో సునీల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చాం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు’అని వివరించారు. అక్కడ బోర్డు కానీ, కాంగ్రెస్ పార్టీ పేరు కానీ లేదు ‘మేం దాడి చేసిన కార్యాలయం కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందినది అంటున్నారు. వాళ్లు తమ వార్‌రూమ్‌ను రహస్యంగా పెట్టుకుంటారని తెలీ దు. అక్కడ బోర్డు కానీ, కాంగ్రెస్ పార్టీ పేరు కానీ లేదు. అసభ్యకరమైన మీమ్స్ ఎవరు రూపొందించినా.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం’ అని జాయింట్ సీపీ గజరావ్ భూ పాల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తెలంగాణ గళం యూట్యూబ్ ఛానల్లో ఉన్న నాలుగు మీమ్స్‌తో కూడిన వీడియోలను ప్రదర్శించారు. వీటిలో టీఆర్ఎస్, బీజేపీలతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ప్రధాని మోదీలపై రూపొందించిన మీమ్స్ ఉన్నాయి. చదవండి: టీపీసీసీలో చల్లారని సెగ! -
క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాదు.. మనది కేడర్ బేస్డ్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: ‘మనది క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాకుండా కేడర్ బేస్డ్ పార్టీ. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే ముఖ్యం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉంటే ఎలాంటి స వాళ్లు అయినా ఎదుర్కోవచ్చు. అడుగడుగునా టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు ఎండగట్టాలి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధించి ఐకమత్యంతో ఒక్కటిగా ముందుకెళ్లాలి’అని బీజేపీ రాష్ట్ర నాయకుల ప్రశిక్షణ్ శిబిరంలో జాతీయ నేతలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాశ్ దిశానిర్దేశం చేశారు. రెండోరోజు శిక్షణలో భాగంగా సోమవారం ప్రధానంగా సంస్థాగత అంశాలు, పార్టీ చరిత్ర, ఆరెస్సెస్‌తో సంబంధాలు, మోదీ హయాంలో వివిధ రంగాల విజయాలు, విదేశాంగ విధానం, దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం తదితర అంశాలపై తరగతులు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, అనుకూల భావజాల సంస్థలతో పార్టీకున్న సంబంధాలు, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొట్టడం, కొత్తగా చేరిన పార్టీ నేతలకు పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నేతలు కలిసికట్టుగా పోరాడితే కలిగే ప్రయోజనాలు, రాష్ట్రంలో అధికారం సాధించాలంటే కార్యక్షేత్రంలో పనివిధానంపై జాతీయనేతలు పలు సూచనలు చేశారు. ప్రభారీ బాధ్యతల నుంచి తప్పించండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పోలింగ్ బూత్ కమిటీలను నియమించే బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ(ప్రభారీ)లదేనని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ప్రతి బూత్‌లో 22 మందితో కమిటీ వేయాలని, లేనియెడల ఆ బాధ్యతల నుంచి తప్పిస్తామన్నారు. అసెంబ్లీ ఇన్చార్జీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని పలువురు నేతలు మరోసారి తరుణ్ చుగ్, బండి సంజయ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌చార్జీలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆ బాధ్యతలపట్ల కొందరు విముఖత వ్యకం చేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ భేటీ మూడ్రోజుల శిక్షణ తరగతుల్లో భాగంగా తాజా రాజకీయాలు, బీజేపీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం తదితర 14 అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. చివరిరోజున ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలపై తీర్మానం చేయనున్నారు. రెండోరోజు దేశనిర్మాణంలో బీజేపీ పాత్ర, మోదీ ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్ ఫలితాలపై నేతలు చర్చించారు. బలహీనవర్గాల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై చర్చ చేపట్టారు. రెండోరోజు శిక్షణ తరగతులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇదీ చదవండి: ఈసారీ సేమ్ సీన్!.. గవర్నర్ ఉభయ సభల ప్రసంగానికి అవకాశం లేనట్టే! -
ధరణితోనే సమస్యలు
తుక్కుగూడ: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి యాప్‌తో రైతులకు భూ సమస్యలు ఎదురవుతున్నాయని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు ‘భూమి’ సునీల్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏర్పాటు చేసిన భూ న్యాయ శిబిరంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు న్యాయవాదులు, రెవెన్యూ నిపుణులు న్యాయ సలహాలు అందించారు. భూ సమస్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామని సునీల్ పేర్కొన్నారు. తెలంగాణలో రీసర్వే చేస్తేనే భూసమస్యలు పరిష్కారమవుతాయని, దీనికోసం ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమగ్ర సర్వే చేస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు. రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించడం కోసమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) ఉపాధ్యక్షుడు జీవన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి.నిరూప్ రెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రైతు నాయకులు కోదండరెడ్డి, భూదా న్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కామెడీ పేటిక
పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సునీల్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, శ్రీనివాస రెడ్డి, హిమజ, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు రమేష్ రాపార్తి దర్శకుడు. శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన నటి అనసూయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను.. చాలా బాగుంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ఈ తరహా సినిమాలు చేయాలంటే చాలా పరిశోధన చేయాలి’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘సెల్‌ఫోన్ ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రాశాను. మంచి కామెడీతో ఫుల్ఫ్యాక్డ్గా ఉన్న సినిమా ఇది’’ అన్నారు దర్శకుడు రమేష్. ‘‘ఈ చిత్రంలో నక్కిలిసు గొలుసు నారాయణ అనే వాచ్మెన్ పాత్ర చేశాను. కొత్తదనానికే కొత్తగా ఉంటుందీ చిత్రం’’ అన్నారు సునీల్. ‘‘మా బ్యానర్ నుంచి కరోనా సమయంలో వచ్చిన ‘థ్యాంక్యూ.. బ్రదర్’ సినిమాను వీక్షకులు ఆదరించారు. ఆ ధైర్యం, నమ్మకంతోనే ఇప్పుడు ‘మాయా పేటిక’ చిత్రంతో వస్తున్నాం’’ అన్నారు నిర్మాత శరత్. శ్రీనివాస్‌రెడ్డి, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అసెంబ్లీ’ ఇన్‌చార్జీ్జలు పోటీ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ్జలుగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీ్జ సునీల్ బన్సల్ శనివారం ముఖ్యనేతల సమావేశంలో బాంబుపేల్చారు. దీంతో ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాగైతే తాము ఇన్‌చార్జీలుగా తప్పుకుంటామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలగజేసుకుని ఇక్కడున్న పరిస్థితిని, పలువురు ఇన్‌చార్జీ్జలు ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్న తీరును వివరించారు. దీంతో అసెంబ్లీ ఇన్చార్జీల పనితీరు, సాధించిన ఫలితాలను ఆరునెలలు పరిశీలించి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని సునీల్ బన్సల్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు, జిల్లాల అధ్యక్షులు ఇతర ముఖ్యనేతలతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీ్జలు వారి పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి ఫలితాలపై బన్సల్ ఆరాతీశారు. బన్సల్‌తోపాటు తరుణ్‌ఛుగ్, అర్వింద్ మీనన్, బండి సంజయ్, డాక్టర్ కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. పార్టీ పటిష్టానికి పాటుపడండి.. మునుగోడు ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంలో భాగంగా పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని సునీల్ బన్సల్ ఆదేశించారు. ప్రధానంగా మునుగోడులోని అన్ని పోలింగ్‌బూత్‌ల స్థాయిలో ప్రతీ నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శక్తి కేంద్రాలకు (3,4 పోలింగ్ బూత్‌లు కలిపి ఒక కేంద్రం) ఇన్చార్జిలను నియమించి పూర్తిస్థాయిలో పార్టీపటిష్టతకు కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. మండలాల వారీగా ఇన్చార్జీలు లేనిచోట్ల వెంటనే నియామకాలు చేయాలని ఆదేశించారు. వచ్చేనెల 9,10 తేదీల్లో ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’రెండోవిడత బైక్‌ర్యాలీలు ప్రారంభించాలన్నారు. 14 లోక్‌సభ నియోజకవర్గాల్లోని (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా) రెండేసి అసెంబ్లీ స్థానాల్లో ఈ బైక్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ఫిబ్రవరిలోగా రాష్ట్రమంతా కవర్ చేస్తూ బైక్‌ర్యాలీలు పూర్తిచేయాలన్నారు. -
జిన్నాలో సునీల్ పాత్ర ఇదే.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీం
మంచు విష్ణు హీరోగా తెరెకెక్కుతున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడులైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. అలాగే దసరా సందర్భంగా విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సునీల్‌కు సంబంధించిన లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సునీల్ ‘పెంచలయ్య’ పాత్రలో కనిపించనున్నాడట. పెళ్లి కోడుకు గేటప్‌లో సునీల్ భయపడుతూ కనిపించాడు. ఆయన లుక్ చూస్తుంటే సునీల్ ఈ చిత్రంలో కమెడియన్‌గా అలరించబోతున్నాడు తెలుస్తోంది. లుక్ చూస్తుంటే ఇందులో ఆయన కమెడియన్‌గా అలరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. జి. నాగేశ్వర రెడ్డి కథను అందించిన ఈ సినిమాకి, కోన వెంకట్ స్క్రీన్ ప్లే సమకూర్చాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. -
ఓటీటీలో అనసూయ 'దర్జా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అటు యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘దర్జా’. సునీల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. అసలు కథేంటంటే: బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మీ(అనసూయ) ఓ సారా వ్యాపారి. బందరులోని కోరుకల్లు, వైవాహ గ్రామ ప్రజలకు ఆమె అంటే హడల్. ఆమె వ్యాపారానికి అడ్డొచ్చిన ఎంతో మంది పోలీసులను హతమార్చింది. తనకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేను సైతం మట్టుబెట్టేంత ధైర్యం ఆమెది. తమ్ముడు బళ్లారి(సమీర్), అనుచరుడు సర్కార్ సపోర్ట్‌తో ఆమె చేపల వ్యాపారంలోకి కూడా దిగింది. కట్ చేస్తే.. కోరుకల్లు గ్రామానికి చెందిన మూగబ్బాయి గణేష్(అరుణ్ వర్మ) తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఓ కొత్త ఎస్సై వస్తాడు. అతనే శివ శంకర్ పైడిపాటి (సునీల్). వచ్చీ రావడంతోనే కనకం ప్రధాన అనుచరుడు సర్కార్‌ని అరెస్ట్ చేస్తాడు. అంతేకాదు గణేష్ ఆత్మహత్య కేసును కూడా బయటకు తీసి.. అది ఆత్మహత్య కాదని, కనకం మనుషులు చేసిన హత్య అని నిరూపిస్తాడు. అసలు గణేష్‌ని కనకం మనుషులు ఎందుకు చంపారు? పుష్పకి కనకంతో ఉన్న సంబంధం ఏంటి? ఎమ్మెల్యేనే చంపేంత ధైర్యం ఉన్న కనకంతో ఎస్సై శివ శంకర్ ఎందుకు వైర్యం పెట్టుకున్నాడు? కనకం చీకటి వ్యాపారాన్ని ఎదురించి, ఆమె చేతిలో బలైన ఎస్సై రవి(రవి పైడిపాటి) నేపథ్యం ఏంటి? చివరకు కనకం మరియు ఆమె సోదరుడు బళ్లారి ఆగడాలకు ఎస్సై శంకర్ ఎలా చెక్ పెట్టాడు అనేదే మిగతా కథ. -
తెలంగాణలో భారీ మార్పులొస్తాయి: సునీల్‌బన్సల్
మునుగోడు: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో భారీ మార్పులు జరగనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కుటుంబ పాలనను అంతమొందించి బీజేపీ పాలన తీసుకొస్తామన్నారు. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అనుచిత నిర్ణయాల వల్ల అప్పులపాలైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ఉపఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తామన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ధర్మయుద్ధం వైపు ఎలా నడిచారో మునుగోడులో కూడా అదే తరహాలో నడుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ జాతీయ నాయకుడు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. -
‘బుజ్జి.. ఇలారా’ మూవీ రివ్యూ
టైటిల్ : బుజ్జి.. ఇలారా నటీనటులు :సునీల్, ధన్‌రాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, పోసాని కృష్ణమురళీ, సత్యకృష్ణ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ఎన్ఎస్ క్రియేషన్ నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి దర్శకత్వం:‘గరుడ వేగ’ అంజి సంగీతం : సాయి కార్తిక్ సినిమాటోగ్రఫీ: ‘గరుడ వేగ’ అంజి ఎడిటర్: చోటా కే ప్రసాద్ కథేంటంటే.. వరంగల్ నగరంలో చిన్న పిల్లలు వరసగా కిడ్నాప్‌కి గురవుతుంటారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మట్వాడ పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చిన సీఐ కేశవ నాయుడు(ధన్‌రాజ్)కు సవాల్‌గా మారుతుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో రెండు వేరు వేరు ముఠాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని గుర్తిస్తారు. అయితే వారిలో ఓ ముఠా పిల్లలను ముంబైకి సరఫరా చేస్తే.. మరో ముఠా మాత్రం ఎనిమిదేళ్ల పిల్లల శరీరం నుంచి గుండెని తీసి, వారి మృతదేహాలను అక్కడక్కడ పడేస్తుంటారు. రెండో ముఠా సభ్యులను పట్టుకునే క్రమంలో కేశవ్‌కు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. పిల్లల కిడ్నాప్ వ్యవహరం వెనుక తన మామ(శ్రీకాంత్ అయ్యంగార్) హస్తం ఉందని గుర్తిస్తాడు. అతన్ని పట్టుకునే క్రమంలో కేశవ్‌ని ప్రమాదానికి గురవుతాడు. పోలీసు అధికారి మహ్మద్ ఖయ్యూం(సునీల్) కావాలనే వ్యాన్‌తో కేశవ్‌పై దాడి చేస్తాడు. అసలు ఈ ఖయ్యూం ఎవరు? సీఐ కేశవ్‌పై ఎందుకు దాడి చేశాడు? ప్రమాదం తర్వాత కేశవ్‌కు తెలిసిన భయంకరమైన నిజాలేంటి? అసలు పిల్లలను కిడ్నాప్ చేస్తుందెవరు? ఎందుకు చిన్నారుల గుండెలను అపహరిస్తున్నారు? ఈ మిస్టరీని మహ్మద్ ఖయ్యూం, కేశవ్ కలిసి ఎలా ఛేదించారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘బుజ్జి.. ఇలారా’.. ఓ సైకలాజికల్ థ్రిల్లర్. టైటిల్, కాస్టింగ్‌ని చూసి ఇదేదో సాఫ్ట్ సబ్జెక్ట్ అనుకొని థియేటర్స్‌కు వెళ్లే ఆడియన్స్‌కి ఢిపరెంట్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. కథలో ఊహించని ట్విస్టులు, మలుపులు ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగిస్తాయి. భార్య అను(చాందిని తమిళరాసన్)తో కలిసి కేశవ్ వరంగల్‌కి రావడం.. అక్కడ పిల్లలు కిడ్నాఫ్ అవడం.. దానిని ఛేదించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. వినడానికి ఇది సింపుల్‌గా ఉన్నా.. ఊహించిన ట్విస్ట్‌లతో ప్రేక్షకుడికి సీటుకే పరిమితమయ్యేలా చేస్తుంది. కిడ్నాప్ వ్యవహారం వెనుక తన మామ ఉన్నాడని కేశవ్ అనుమానించడం, అతన్ని పట్టుకునే క్రమంలో మహ్మద్ ఖయ్యూమ్‌గా సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో సెకడాఫ్పై ఆసక్తి కలుగుతుంది. ఇక సెకండాఫ్ కూడా అంచనా వేయలేని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. అదే క్రమంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. క్లైమాక్స్ అన్ని వర్గాల ప్రేక్షకులు హర్షిస్తారని చెప్పలేం. చివరి 10 నిమిషాలు హింసను అతిగా చూపించడం సినిమాకు ప్రతికూలంగా మారినట్టు అనిపిస్తుంది. థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారికి ‘బుజ్జి ఇలా రా’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే... కమెడియన్ ధన్‌రాజ్ ఇలాంటి పాత్రలో నటించి పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. ఇన్నాళ్లు కామెడీ పాత్రల్లో కనిపించిన ధన్‌రాజ్.. ఇందులో సీరియస్ పోలీసు అధికారి రోల్ చేసి మెప్పించాడు. సీఐ కేశవ్ పాత్రలో ధన్‌రాజ్ ఒదిగిపోయాడు. తెరపై కొత్త ధన్‌రాజ్‌ని చూస్తారు. ఇక సీఐ మహ్మద్ ఖయ్యూంగా సునీల్ ఆకట్టుకున్నాడు. గతంలో కూడా సునీల్ ఇలాంటి పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఇక్కడ హీరోయిన్ చాందినీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీఐ కేశవ్ భార్య అను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా అంత ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్‌తో ఆమె నటన మరో ఎత్తు. శ్రీకాంత్ అయ్యంగార్, భూపాల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సినిమాకు ప్రధాన బలం సాయి కార్తిక్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇటీవల వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను గుర్తు చేస్తుంది. ‘గరుడ వేగ’ అంజి దర్శకుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గాను మంచి పనితీరును కనబరిచాడు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాను చకచక పరుగులు పెట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఈ సినిమా కథ విని షాకయ్యాను: సునీల్
‘‘హాస్యం పండించే హాస్యనటులు ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం ఓ డేరింగ్ స్టెప్. ఇక్కడే మొదటి విజయం సాధించింది ఈ చిత్రం. సునీల్, ధన్ రాజ్ లాంటి మంచి నటులతో జి. నాగేశ్వరరెడ్డిగారు ఇలాంటి థ్రిల్లర్‌తో రావడం ఆసక్తికరంగా ఉంది’’ అన్నారు దర్శకుడు మారుతి. సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో కెమెరామేన్ ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బుజ్జి.. ఇలారా’. రూపా జగదీష్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జి. నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు మారుతి హాజరయ్యారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు అసలైన స్టార్స్ నిర్మాతలే. నాపై నమ్మకంతో నాలుగు కోట్లు ఖర్చుపెట్టారు. ఈ కథకు నేనే కరెక్ట్ అని నమ్మి, నాతో సినిమా చేసి అండగా నిలబడ్డారు నాగేశ్వరరెడ్డిగారు’’ అన్నారు.‘‘ఈ సినిమా కథ విని షాకయ్యాను. మంచి సందేశం ఉంది’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమాతో దర్శకత్వం ఎంత కష్టమో తెలిసింది’’ అన్నారు అంజి. ‘‘ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు నిర్మాతలు. -
గ్రాండ్‌గా సునీల్-హెబ్బా పటేల్‌ల' గీతా' విష్కరణ
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ‘గీత’ విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు’ అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... ‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... ‘గీత’ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’అన్నారు. హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్ ‘గీత’ వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడుగా విశ్వ, నిర్మాతగా రాచయ్యలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. ‘గీత’ చిత్రంలో పని చేసే అవకాశం లభించడం పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు. -
'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ
టైటిల్: వాంటెడ్ పండుగాడ్ నటీనటులు: సునీల్, సుడిగాలి సుధీర్, అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కథ, స్క్రీన్‌ప్లే: జనార్ధన మహర్షి ఎడిటర్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల సమర్పణ: కె. రాఘవేంద్ర రావు నిర్మాతలు: సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి దర్శకత్వం: శ్రీధర్ సీపాన విడుదల తేది: ఆగస్టు 19, 2022 బుల్లితెర నటీనటులు సుడిగాలి సుధీర్, సునీల్, యాంకర్ అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, హాస్య నటులు వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించిన తాజా చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెల మూడి నిర్మించారు. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్స్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేర కామెడీని పంచిందో రివ్యూలో చూద్దాం. కథ: పాండు ఉరఫ్ పండు (సునీల్) పోలీసులను కొట్టి చంచల్ గూడా జైలు నుంచి తప్పించుకుంటాడు. అలా జైలు నుంచి పారిపోయిన పండు నర్సాపురం అడవిలో దాక్కున్నాడని మీడియాలో కథనాలు వస్తాయి. పండును పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ విషయం తెలిసి పండును పట్టుకునేందుకు అఖిల్ చుక్కనేని (వెన్నెల కిశోర్), విక్రమ్ రాథోడ్ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) తదితరులు అడవిలోకి వెళ్తారు. అసలు వారికి డబ్బు ఎందుకు అవసరమైంది? ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నారు? ఆ అడవిలో గంజాయి ఎవరు పెంచారు? కోయజాతి అమ్మాయిగా ఝాన్సీ (అనసూయ) అడవిలో ఎందుకు తిరుగుతుంది? అనే తదితర విషయాలు తెలియాలంటే వాంటెడ్ పండుగాడ్ చూడాల్సిందే. విశ్లేషణ: 'వాంటెడ్ పండుగాడ్' సినిమాకు 'పట్టుకుంటే కోటి' అనే క్యాప్షన్‌తోనే కథేంటో చెప్పేశారు. ఇక సునీల్ జైలు నుంచి తప్పించుకోవడం, అతన్ని పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ప్రకటించడం, తర్వాత విభిన్న నేపథ్యాలతో పాత్రలను పరిచయం చేయడంతో సినిమా కథ అర్థమైపోతుంది. బుల్లితెరతో పాపులారిటీ సంపాందించుకున్న సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ, దీపికా పిల్లి కనిపించడంతో అది కూడా ఒక టీవీషోలా తోస్తుంది. కొద్దిసేపు సినిమాల ఫీల్ అవ్వడానికి సమయం పడుతుంది. కొంచెం అతికించిపెట్టినట్లుగా ఉన్న కామెడీ ట్రాక్‌తో పట్టాలు ఎక్కిన సినిమా అకడక్కడ బాగానే నవ్విస్తుంది. వివిధ హిట్ సినిమాల్లోని డైలాగ్‌లను స్ఫూఫ్ చేసి బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక పాటలు, అందులో హీరోహీరోయిన్స్‌ను చూపించిన విధానం దర్శకేంద్రుడి రాఘవేంద్ర రావు శైలి కనిపిస్తుంది. అయితే సినిమా కామెడీ జోనర్ కావడమో, మాములు ఆర్టిస్ట్‌లు కావడంచేతనో ఆ శైలి బాగా ఎక్కకపోయిన హీరోయిన్ల అభినయం, అందచందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'అబ్బ అబ్బ' అనే పాట అలరించేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అతిథిపాత్రలో బ్రహ్మానందం మెరిసారు. ఆయన తరహా హాస్యంతో కామెడీ పండించారు. ఎవరెలా చేశారంటే? ఖైది పండుగా సునీల్ నటన బాగానే ఉంది. కానీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే నడిచినా, నటనకు అంతా ప్రాధాన్యత ఇచ్చేలా లేదు. రెండు చోట్ల ఉండే యాక్షన్ సీన్లలో సునీల్ అదరగొట్టేశాడనే చెప్పవచ్చు. ఇక సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, అనసూయ, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వాసంతి క్రిష్ణన్ తనికెళ్ల భరణి, ఆమని పాత్రలు పరిధిమేర నటించి పర్వాలేదనిపించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వీరాజ్ తమ కామెడీ టైమింగ్‌తో ఆద్యంత ఆకట్టుకున్నారు. నిజానికి సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవాలంటే వారి కామెడి గురించే చెప్పుకోవచ్చు. స్క్రిప్టుకు తగినట్లుగా వచ్చే డైలాగ్‌లు నవ్వు తెప్పించేలా బాగున్నాయి. శ్రీధర్ సీపాన దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే కొంత గ్లామర్, కొంత కామెడీతో ఆకట్టుకుంటాడు ఈ 'వాంటెడ్ పండుగాడ్' -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
‘తీస్మార్ ఖాన్’ మూవీ రివ్యూ
టైటిల్ : తీస్మార్ ఖాన్ నటీనటులు : ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పూర్ణ తదితరులు నిర్మాణ సంస్థ :విజన్ సినిమాస్ బ్యానర్ నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి దర్శకత్వం: కళ్యాణ్ జి గోగణ సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ:బాల్ రెడ్డి ఎడిటర్: మణికాంత్ విడుదల తేది: ఆగస్ట్ 19, 2022 ‘ప్రేమ కావాలి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ‘లవ్లీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘తీస్మార్ఖాన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 19) విడుదలైన ‘తీస్మార్ ఖాన్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తీస్మార్ ఖాన్(ఆది సాయికుమార్) ఓ అనాధ. తనకు ఒక్కపూట అన్నం పెట్టిందని మరో అనాధ అమ్మాయి వసూధ అలియాస్ వసు(పూర్ణ)ని అమ్మలా చూసుకుంటాడు. వీరిని ఓ పోలీసు కానిస్టేబుల్ దత్తత తీసుకొని పెంచుతాడు. అతను చనిపోయిన తర్వాత వసు భర్త చక్రి(సునీల్), తీస్మార్ ఖాన్ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ జిమ్ సెంటర్ నడుపుకుంటున్న తీస్మార్ ఖాన్ జీవితంలోకి అనుకోకుండా జీజా (అనూప్ సింగ్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తాడు. జీజా రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్. అతని అరాచకాలను ఆడ్డుకునేందుకు నేరుగా హోంమంత్రి శ్రీరంగ రాజన్(శ్రీకాంత్ అయ్యంగార్)నే రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో వసు హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు? జీజాకు ఈ హత్యతో ఏదైనా సంబంధం ఉందా? హోమంత్రి రంగ రాజన్‌కు తీస్మార్ ఖాన్ మధ్య ఉన్న అనుబంధం ఏంటి? తల్లిలా భావించే వసు మరణం తర్వాత తీస్మార్ ఖాన్‌కు హోంమంత్రి ఎలాంటి సహాయం చేశాడు. అవారాగా తిరిగే తీస్మార్ ఖాన్ ఎస్సై ఎలా అయ్యాడు? తీస్మార్ ఖాన్‌పై ముంబై మాఫీయా డాన్ తల్వార్(కబీర్ ఖాన్) ఎందుకు పగ పెంచుకున్నాడు? చివరకు వసుని హత్య చేసిన వారిని తీస్మార్ ఖాన్ ఎలా చంపాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పోలీసు కథా నేపథ్యంలో యాక్షన్, లవ్, థ్రిల్లర్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రమిది. కొత్త కొత్త ట్విస్ట్‌లతో దర్శకుడు కథను బాగా రాసుకున్నప్పటికీ..తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడపడ్డాడు. హీరో ఎలివేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. తీస్మార్ ఖాన్, వసు బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలతో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే బాల్యం ఎపిసోడ్ కాస్త సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. తీస్మార్ ఖాన్, అనగ కలిసిన తర్వాత సినిమాలో వేగం పుంజుకుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటి సీన్స్, లవ్ ట్రాక్ సరదాగా సాగుతుంది. వసు మృతి... కథను మలుపు తిప్పుతుంది. ఇంటర్వెల్ ముందు తీస్మార్ ఖాన్ ఎస్సైగా ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తాయి. మొదట్లో కాస్త సాగదీసినట్లు అనిపించినా.. జీజా మరణం తర్వాత కథలో మరింత వేగం పెరుగుతుంది. అయితే కథలో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. కథ, కథనంలో మరింత జాగ్రత్త పడితే ‘తీస్మార్ ఖాన్’ ఫలితం మరోలా ఉండేది. కమర్షియల్, థ్రిల్లర్ సినిమాను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తీస్మార్ ఖాన్ పాత్రలో ఆది సాయికుమార్ ఒదిగిపోయాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ మూడు పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. అనగ పాత్రకు రాజ్‌పుత్ పాయల్ న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించిది. పాయల్ రాజ్‌పుత్‌తో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు గుర్తిండిపోతాయి. ఇక పూర్ణ తన పాత్రకు న్యాయం చేసింది. చక్రిగా సునీల్ మెప్పించాడు. ఆయన పాత్రలోని వేరియషన్ ఆడియన్స్‌ని థ్రిల్‌కు గురి చేస్తుంది. ఇక ఈ చిత్ర నిర్మాత నాగం తిరుపతి రెడ్డి కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. హోమంత్రిగా శ్రీకాంత్ అయ్యంగార్, విలన్స్‌గా కబీర్ సింగ్, అనూప్ సింగ్ తమ తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. ఒక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్. రొమాంటిక్ సాంగ్ తెరపై మరింత రొమాంటిగ్ ఉంటుంది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మణికాంత్ తన కత్తెరకు ఇంకాస్తా పనిచెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సునీల్-హెబ్బా పటేల్‌ల ‘గీత’ వచ్చేస్తుంది
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... ‘గీత’చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈనెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం. సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు. -
మరో విభిన్నపాత్రలో సునీల్.. పోస్టర్ రిలీజ్..
Sunil First Look Poster From Tees Maar Khan Movie: కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లవ్లీ హీరో ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా 'తీస్ మార్ ఖాన్' అనే చిత్రం రానున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి. వాటికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్ వచ్చింది. సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. సునీల్ ఈ చిత్రంలో 'చక్రి' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో సునీల్ సీరియస్‌గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్ సింగ్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కపూర్ ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. -
ఒకప్పుడు సునీల్ నచ్చాడు, కానీ ఇప్పుడు కాదు: వేణు
దమ్ము సినిమా తర్వాత కనిపించకుండా పోయాడు నటుడు వేణు తొట్టెంపూడి. ఈ సినిమా తర్వాత వ్యాపారాలతో బిజీ అయిన అతడు సినిమాలను పట్టించుకోవమే మానేశాడు. కానీ కరోనా టైంలో మళ్లీ సినిమాలపై ఇంట్రస్ట్ రావడం, అదే సమయంలో దర్శకుడు శరత్ మండవ చెప్పిన రామారావు ఆన్ డ్యూటీ కథ నచ్చడంతో సినిమా ఓకే చేశాడు వేణు. అప్పటివరకు తన పాత్రకు డబ్బింగ్ చెప్పని వేణు రామారావు ఆన్ డ్యూటీలో మాత్రం తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు కమెడియన్ సునీల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'చెప్పవే చిరుగాలి సినిమాలో నేను- సునీల్ కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు చించి ఆరేశాం. సునీల్ ఇప్పుడు విలన్‌గా కూడా చేస్తున్నాడు. ఒక ఆర్టిస్ట్‌గా అన్ని అవకాశాలు రావడం గొప్ప విషయం. తను చాలా బాగా చేస్తున్నాడు. కానీ నాకు మాత్రం పాత సునీలే ఇష్టం. సరదాగా భలే ఉండేవాడు. కానీ హీరోగా, విలన్‌గా అయితే నటించాల్సి వస్తుంది. కాబట్టి అతడి పాత సినిమాలే ఇష్టం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: కమెడియన్ వెంట పరిగెత్తి మరీ కొట్టాను, సినిమాలో కూడా లేకుండా చేశా సుహాస్ హీరో అనగానే అవసరమా? అంటూ చీప్ లుక్కిచ్చారు -
‘దర్జా’లో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి : నిర్మాతలు
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కాస్త ఓపెనింగ్స్ తగ్గినప్పటికీ.. సినిమాకి వస్తున్న టాక్‌తో కలెక్షన్స్ పెరుగుతున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, రవి పైడిపాటి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాలోని పాటలు, ఫైట్స్, సెంటిమెంట్.. చాలా బాగున్నాయంటూ పలువురు సినీ ప్రముఖులు ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఇది యాక్షన్ సినిమా అనుకుని వచ్చాము.. కానీ సినిమాలో అక్కాచెల్లెళ్ల అనుబంధం, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారని, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లు చాలా బాగున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమాని మరింతగా సక్సెస్ చేయాలని కోరుతున్నాం’అన్నారు. పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించారు. -
అనసూయ ‘దర్జా’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘దర్జా’ నటీనటులు :సునీల్, అనసూయ నిర్మాణ సంస్థలు : ఆమని, పృథ్వీ, అక్సాఖాన్,షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు నిర్మాత: శివశంకర్ పైడిపాటి దర్శకత్వం: సలీమ్ మాలిక్ సంగీతం : రాప్ రాక్ షకీల్ సినిమాటోగ్రఫీ: దర్శన్ ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ విడుదల తేది: జులై 22, 2022 అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘దర్జా’. సునీల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకి, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘దర్జా’పై ఆసక్తి పెరిగింది. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22)ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్జా మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మీ(అనసూయ) ఓ సారా వ్యాపారి. బందరులోని కోరుకల్లు, వైవాహ గ్రామ ప్రజలకు ఆమె అంటే హడల్. ఆమె వ్యాపారానికి అడ్డొచ్చిన ఎంతో మంది పోలీసులను హతమార్చింది. తనకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేను సైతం మట్టుబెట్టేంత ధైర్యం ఆమెది. తమ్ముడు బళ్లారి(సమీర్), అనుచరుడు సర్కార్ సపోర్ట్‌తో ఆమె చేపల వ్యాపారంలోకి కూడా దిగుతోంది. కట్ చేస్తే.. కోరుకల్లు గ్రామానికి చెందిన మూగబ్బాయి గణేష్(అరుణ్ వర్మ) తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఓ కొత్త ఎస్సై వస్తాడు. అతనే శివ శంకర్ పైడిపాటి (సునీల్). వచ్చీ రావడంతోనే కనకం ప్రధాన అనుచరుడు సర్కార్‌ని అరెస్ట్ చేస్తాడు. అంతేకాదు గణేష్ ఆత్మహత్య కేసును కూడా బయటకు తీసి..అది ఆత్మహత్య కాదని, కనకం మనుషులు చేసిన హత్య అని నిరూపిస్తాడు. అసలు గణేష్‌ని కనకం మనుషులు ఎందుకు చంపారు? పుష్పకి కనకంతో ఉన్న సంబంధం ఏంటి? ఎమ్మెల్యేనే చంపేంత ధైర్యం ఉన్న కనకంతో ఎస్సై శివ శంకర్ ఎందుకు వైర్యం పెట్టుకున్నాడు? కనకం చీకటి వ్యాపారాన్ని ఎదురించి, ఆమె చేతిలో బలైన ఎస్సై రవి(రవి పైడిపాటి) నేపథ్యం ఏంటి? చివరకు కనకం మరియు ఆమె సోదరుడు బళ్లారి ఆగడాలకు ఎస్సై శంకర్ ఎలా చెక్ పెట్టాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. అన్నదమ్ములు, తల్లి కొడుకులు, అక్కా చెల్లెల సెంటిమెంట్‌తో పాటు కావాల్సిన యాక్షన్, కమర్షియల్ వ్యాల్యూస్ ఈ చిత్రంలో ఉన్నాయి. దర్శకుడు ఈ కథనంతా బందరుకు కొత్తగా వచ్చిన ఎస్సై, కానిస్టేబుల్ మధ్యన చర్చగా నడిపించిన తీరు బాగుంది. ఎస్సై రవి పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్‌తో కథ మొదలవుతుంది.ఇక బందరు కనకంగా అనసూయ ఎంట్రీతో కథ పరుగులు తీస్తుంది. అనసూయ ఉన్నంత సేపు ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది. అదే ఉత్కంఠను మిగిలిన పాత్రలకు కొనసాగించలేకపోయాడు. ఒకవైపు కనకం అరాచకాలను క్రూరంగా చూపిస్తూనే.. మరోవైపు గణేష్, పుష్పల ప్రేమ కథను చెప్పుకొచ్చిన తీరు బాగుంది. మధ్య మధ్యలో రంగ(షమ్ము), గీత(అక్సాఖాన్) కామెడీ సీన్స్ నవ్వులు పూయించినప్పటికీ..కథంత నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో సునీల్, అనసూయల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీసు స్టేషన్లో సునీల్‌కు అనసూయ వార్నింగ్, ప్రీక్లైమాక్స్‌లో సునీల్ చేసే ఫైట్ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అయితే సినిమా చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం, చాలా పాత్రల్లో కొత్త ముఖాలు కనిపించడం కాస్త మైనస్. కానీ కొత్త నటులు అయినప్పటికీ.. వారి నుంచి తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరెలా చేశారంటే.. రంగస్థలంలో రంగమ్మత్తగా, 'పుష్ప’లో దాక్షాయణిగా తనదైన నటనతో ఆకట్టుకున్న అనసూయ.. చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి పాత్ర పోషించి మెప్పించింది. బందరు కనకంగా అనసూయ అదరగొట్టేసింది. ఆమె డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఇక పవర్ఫుల్ ఎస్సై శంకర్ పాత్రలో సునీల్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. మూగబ్బాయి గణేశ్‌గా అరుణ్ వర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సర్కార్ పాత్రలో ఎన్. రామ్ బాగా క్రూరత్వం చూపించి మెప్పించారు. కనకం తమ్ముడు బళ్లారిగా సమీర్, డ్రైవర్ జట్కాగా వీరబాబు, ఎస్సై రవిగా రవి పైడిపాటితో పాటు ఆమని, షేకింగ్ శేషు, షకలక శంకర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే... ఈ సినిమాకు ప్రధాన బలం రాప్ రాక్ షకీల్ సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అక్సాఖాన్ స్పెషల్ సాంగ్ తెరపై అదిరిపోయింది. దర్శన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఎమ్.ఆర్. వర్మ పనితీరు మెచ్చుకోవాల్సిందే. కథలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా కథను పరుగులు పెట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ.. కథనం ఆకట్టుకుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా, అనసూయ, సునీల్‌ల కోసం అయితే ‘దర్జా’గా థియేటర్స్ వెళ్లి చూడొచ్చు. -
Telangana: కాంగ్రెస్ పార్టీ నేతలకు సునీల్ ఫీవర్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు వ్యూహకర్త సునీల్ కనుగోలు ఫీవర్ పట్టుకుంది. గతంలో మాదిరిగా కాకుండా సర్వే ఆధారంగా అసెంబ్లీ టికెట్ల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఆశావహులు అప్రమత్తమయ్యారు. సునీల్ బృందాలు ప్రతీ నియోజకవర్గంలో సర్వేతోపాటు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాయి. ఆశావహుల బ్యాక్‌గ్రౌండ్, వారికి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు, ప్రజల్లో ఉన్న అభిమానం, పార్టీ శ్రేణుల అభిప్రాయం.. ఇలా ఓ పది అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు, ప్రజాపోరాటాలను ఆశావహులు తమ నియోజకవర్గాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారు, వాటి ద్వారా పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందా లేదా అన్న అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకొని అధిష్టానానికి నివేదిక పంపిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆశావహులు నిత్యం తమ నియోజకవర్గలకే పరిమితమై స్థానం పదిలం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. సునీల్ బృందాలు ఇప్పటికే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై మొదటి దఫా సర్వే రిపోర్ట్ అందించినట్టు తెలిసింది. వారంక్రితం రెండోదఫా సర్వే కూడా ఈ నియోజకవర్గాల్లో ప్రారంభమైనట్టు తెలిసింది. గ్రూపు రాజకీయాలపై నజర్ పలు నియోజకవర్గాల్లో ఆశావహులు చేస్తున్న గ్రూపు రాజకీయాలపైనా సునీల్ బృందం ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసి అధిష్ఠానానికి పంపినట్టు తెలిసింది. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని గ్రూప్ రాజకీయాలు, వాటిని వెనుకుండి నడిపిస్తున్న నేతలపై ప్రత్యేకంగా నివేదిక రూపొందించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు అందించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నివేదిక ఆధారంగానే గ్రూప్ రాజకీయాలకు చెక్‌పెట్టే పనిలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అసంతృప్త నేతలకు బుజ్జగింపులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్న కీలకనేతలను బుజ్జగించే అంశంలోనూ సునీల్ వ్యూహరచన వర్క్అవుట్ అయినట్టు తెలిసింది. అందులో భాగంగానే మాణిక్యం ఠాగూర్ నేరుగా అసంతృప్త నేతల ఇంటికి వెళ్లి బుజ్జగిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఓ ఎమ్మెల్యేతో సైతం మాణిక్యం చర్చించి అసంతృప్తి సద్దుమణిగేలాగా చేస్తున్నారు. పార్టీలైన్ దాటి వ్యవహరిస్తున్న నేతలను గుర్తించి అధిష్టానం దగ్గరకే పిలిచి హెచ్చరిక, బుజ్జగింపులు చేసి పంపడంలోనూ సునీల్ పాత్ర కీలకమైందనే చర్చ కూడా నడుస్తోంది. చేరికలపై సునీల్ స్పెషల్ ఫోకస్ పార్టీలో చేరికల అంశాన్ని అధిష్టానం సునీల్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతలు, నియోజకవర్గాల్లో వారికున్న పరిచయాలు, గత ఎన్నికల్లో వారి పరిస్థితి తదితరాలను పరిగణనలోకి తీసుకొని చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల లక్ష్మీ చేరికను సునీల్ దగ్గరుండి పర్యవేక్షించారని తెలిసింది. -
భయపెట్టడానికి ట్రై చేశా.. ఇదో అద్భుతమైన సినిమా: అనసూయ
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో అనసూయ మాట్లాడుతూ– ‘‘దర్జా’లో కనకం పాత్రలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ఇది అద్భుతమైన సినిమా’’ అన్నారు. ‘‘ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది.. స్క్రీన్‌ప్లే బేస్డ్ స్టోరీ’’ అన్నారు సలీమ్ మాలిక్. ‘‘దర్జా’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కామినేని శ్రీనివాస్. ‘‘మా అన్నయ్య శివశంకర్‌గారు సినిమా నిర్మించాలనుకున్నప్పుడు భయపడ్డాం. కానీ ఆయన క్రమశిక్షణ, పట్టుదల చూసి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి. ఈ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని, కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ, సంగీత దర్శకుడు ర్యాప్ రాప్ షకీల్, హీరో సందీప్ మాధవ్, దర్శకులు వీర శంకర్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెపల్లెకు వెళ్తేనే పరిష్కారం.. చేతిరాత పహాణీలతో ధరణిని ఆధునీకరించాలి
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినా భూ సమస్యలు తీరకపోవడంతో సర్కారు సహా అన్ని రాజకీయ పక్షాలు మళ్లీ భూసర్వే రికార్డులు, సమస్యలపై దృష్టి సారించాయి. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 15 నుంచి ప్రభుత్వం మండల స్థాయి రెవెన్యూ సదస్సులకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యాయ శిబిరాలతో భూ సమస్యలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి గ్రామీణ న్యాయ పీఠం ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్న భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్ర: మళ్లీ రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారమవుతాయా? జ: భూ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించాలి. ఈ సదస్సులు జరగడానికంటే ముందే ఆ ఊరిలోని భూ సమస్యలను గుర్తించాలి. ఇందుకోసం ఆ గ్రామ యువతకు తర్ఫీదు ఇచ్చి వారిని ఇందులో భాగస్వాములను చేయాలి. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి. చేతిరాతతో పహాణి రాసి ఆ తరువాత ధరణి రికార్డును సవరించాలి. ప్రతి గ్రామానికి ఒక బృందం ఏర్పాటు చేసి వారికి కనీసం 3–6 నెలల గడువు ఇవ్వాలి. ప్ర: కొత్త రెవెన్యూ చట్టం భూ యాజమాన్య హక్కులకు పూర్తి హామీ ఇస్తుందా? జ: భూ రికార్డుల్లోని వివరాలకు ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉంటుంది. రికార్డుల్లో పేరు ఉన్నా భూ యజమాని హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే జరిమానా కడుతుంది. అలాంటి వ్యవస్థను తెస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. కానీ ఇంకా అలాంటి చట్టమేదీరాలేదు. భూ హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ వ్యవస్థను తెచ్చే ప్రయత్నాలు ఈ దేశంలో మూడు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఒకప్పటి ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ, ఇప్పటి డీఐఎల్‌ఆర్‌ఎం పథకం అందుకు ఉద్దేశించిందే. టైటిల్ గ్యారెంటీ చట్టం ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీని ఆధారంగా ఇప్పటికే రాజస్తాన్, ఏపీ చట్టాలు రూపొందించుకున్నాయి. టైటిల్ గ్యారెంటీ చట్టం అమల్లోకి వస్తే భూములన్నింటికీ ఒకే రికార్డు ఉంటుంది. ఆ రికార్డులోని వివరాలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది. యజమానికి నష్టం జరిగితే నష్టపరిహారం అందుతుంది. తెలంగాణ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఆ భరోసా ఇవ్వదు. ప్ర: భూ సమస్యలను ‘ధరణి’ ఏ మేరకు పరిష్కరించగలిగింది? జ: భూమి రికార్డులన్నీ కంప్యూటర్లలోకి నిక్షిప్తమయ్యాయి. అందరికీ అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగవంతం, సులభతరం అయ్యాయి. కానీ భూ సమస్యల పరిష్కారం క్లిష్టతరంగా మారింది. ధరణిలో తప్పులను సరి చేయించుకోవడం రైతులకు చాలా కష్టంగా ఉంది. ధరణిలో వివరాలను సరిచేయడానికి పెట్టుకున్న వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే రికార్డు (ధరణి)లో తప్పుల సవరణ కోసం రూ. వెయ్యి ఫీజు తీసుకోవడం పేద రైతులకు భారంగా మారింది. అనేక సమస్యలకు ఆప్షన్లు ఇవ్వనేలేదు. ప్ర: రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుతో ఏ మేరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయి? జ: భూ సమస్యల పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో తాత్కాలిక జిల్లా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసి పాత కేసులను పరిష్కరించింది. కొత్త కేసులన్నీ సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ఓఆర్ చట్టం కింద భూ రికార్డులను సవరించే అధికారం మాత్రమే రెవెన్యూ కోర్టుల నుంచి తీసివేశారు. కానీ అసైన్డ్ భూముల అన్యాక్రాంతం, ఇనాం, పీటీ భూముల సమస్యలు, ఇతర భూ వివాదాలు ఇంకా రెవెన్యూ కోర్టుల పరిధిలోనే ఉన్నాయి. అయినా ఈ అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల రెవెన్యూ యంత్రాంగం భూమి సమస్యలను పరిష్కరించకుండా కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ధరణిలోని సమస్యలను పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కొత్త వ్యవస్థ భూ సమస్యల పరిష్కారాన్ని రైతులకు భారంగా మార్చింది. సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. భూ వివాదాలు పరిష్కారం కావాలంటే జిల్లాకొక ట్రిబునల్ను ఏర్పాటు చెయ్యాలి. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలు పరిష్కారమయ్యేలా భూ వివాద పరిష్కర చట్టాన్ని రూపొందించాలి. ప్ర: భూమి హక్కులకు చిక్కులు లేకుండా చూడాలంటే ఏం చేయాలి? జ: భూమి హద్దులకు, హక్కులకు స్పష్టత, భద్రత ఇచ్చే వ్యవస్థ కావాలి. భూ చట్టాలన్నీ కలిపి ఒక రెవెన్యూ కోడ్‌ను రూపొందించాలి. సమస్యల పరిష్కారానికి జిలాకొక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ఒక్కసారన్నా చేతిరాత పహాణీ రాసి దాని ఆధారంగా ధరణిని సవరించాలి. గ్రామ రెవెన్యూ కోర్టులను నిర్వహించి భూ వివాదాలు పరిష్కరించాలి. పారాలీగల్ వ్యవస్థను మళ్లీ తేవాలి. భూముల సర్వే జరగాలి. మొత్తంగా తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో అమలు జరగాలి. ప్రజల భూమి ఆకాంక్షలు నెరవేరకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదు. భూ హక్కుల చిక్కులు లేని తెలంగాణ సాకారం కావాలంటే భూమి ఎజెండా అందరి ఎజెండా కావాలి. -
బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా ?.. 'చోర్ బజార్' రివ్యూ
టైటిల్: చోర్ బజార్ నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు తదితరులు దర్శకుడు: జీవన్ రెడ్డి నిర్మాత: వీఎస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి విడదల తేది: జూన్ 24, 2022 ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 'రొమాంటిక్' మూవీతో నటనపరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు 'చోర్ బజార్' సినిమాతో మరోసారి సందడి చేశాడు. గెహనా సిప్పీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి 'జార్జ్ రెడ్డి'ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) అమితాబ్ బచ్చన్ అభిమానిగా నటించింది. శుక్రవారం (జూన్ 24)న విడుదైలన 'చోర్ బజార్' ప్రేక్షకుల మనసును చోరీ చేసిందో తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే. కథ: హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ. 200 కోట్లు విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రం అపహరణకు గురవుతుంది. దొంగలను పట్టుకునే క్రమంలో ఆ వజ్రం చోర్ బజార్ అనే ఏరియాలో పడుతుంది. మరోవైపు చోర్ బజార్‌ను అన్ని తానై నడిపిస్తుంటాడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి). దీంతో ఎలాగైన ఆ వజ్రాన్ని పట్టుకునేందుకు చోర్ బజార్లో కాపు కాస్తారు పోలీసులు. మరి ఆ వజ్రాన్ని పోలీసులు పట్టుకున్నారా ? చివరిగా అది ఎక్కడికి చేరింది ? బచ్చన్ సాబ్ ప్రేమించిన మూగ అమ్మాయి సిమ్రాన్ (గెహనా సిప్పీ)ని దక్కించుకున్నాడా? చోర్ బజార్‌ను శాశ్వతంగా మూయించాలనుకున్నా గబ్బర్ సింగ్ (సుబ్బరాజు) ఏం చేశాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే 'చోర్ బజార్' చూడాల్సిందే. విశ్లేషణ: డైరెక్టర్ జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి'తో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతకుముందు ఆయన 'దళం' సినిమాకు ఒక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాల అనుభవం 'చోర్ బజార్' మూవీని తెరకెక్కించడంలో కనిపించలేదనే చెప్పవచ్చు. వజ్రాన్ని దొంగతనం చేసే సన్నివేశంతో ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు తర్వాత పూర్తిగా తడబడ్డారు. డైమండ్ చోరి తర్వాత వచ్చే సీన్లన్ని చప్పగా సాగుతాయి. డైమండ్ చోరీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో లవ్, చోర్ బజార్ మనుషుల కథ, ఉమెన్ ట్రాఫికింగ్, అమితాబ్ బచ్చన్ మీద అభిమానంతో ఇళ్లు వదిలేసి వచ్చిన యువతి కథ వంటి పలు ఉప కథలు గందరగోళానికి గురిచేస్తాయి. మరీ స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, గజిబిజి సీన్లతో నిండిన ఎడిటింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. రెండు పాటలు, సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించింది. నటీనటులు మాట్లాడే తెలంగాణ యాస కొంత ఇబ్బందిపెడుతుంది. ఎవరెలా చేశారంటే? ఆకాష్ పూరి నటన ఇంతకుముందు చిత్రాల్లానే ఇందులో ఉంది. అలాగే పూరీ స్టైల్ హీరోగా కనిపిస్తాడు. ప్రతి సినిమాలో అలాగే కనిపించేసరికి రొటీన్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తుంది. ఇక మూగ అమ్మాయిగా గెహనా సిప్పీ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. మూగ అమ్మాయిగా హీరోయిన్ ఎలివేట్ అయ్యే సన్నివేశాలు అంతగా లేకున్నా ఉన్నంతలో బాగానే నెట్టుకొచ్చింది. సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) బాగుంది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ అంతగా వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 'చోర్ బజార్'ను వీక్షించాలంటే మాత్రం ఎంతో ఓపిక కావాలి. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
వెంకటేశ్ చేతుల మీదుగా అనసూయ, సునీల్ ‘దర్జా’ మూవీ ట్రైలర్
Venkatesh Released Darja Movie Trailer: సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివ శంకర్ పైడిపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ట్రైలర్ రిచ్‌గా, చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. చదవండి: మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో సినిమా చేయను: ప్రముఖ నిర్మాత ‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో ‘దర్జా’ రిలీజ్ ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నాం. సినిమా రిలీజ్ డేట్‌పై త్వరలో స్పష్టత ఇస్తాం’ అన్నారు నిర్మాతలు. ‘దర్జా’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సలీం మాలిక్, మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్రాక్ షకీల్‌తో పాటు చిత్రయూనిట్ పాల్గొంది. -
మంచు విష్ణు మూవీకి సరికొత్త టైటిల్, ప్రకటించిన టీం
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమాకి ‘జిన్నా’ అనే టైటిల్ ఖరారు చేశారు. విష్ణు కెరీర్లో ఇది 19వ చిత్రం. డా. మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత టైటిల్‌ని కూడా వెరైటీగా రివీల్ చేశారు. సునీల్, కోన వెంకట్, ఛోటా కె.నాయుడు, అనూప్ రూబెన్స్, ఈషాన్ సూర్యతో కలిసి విష్ణు సరదాగా చిట్ చాట్ చేస్తూ, ఫైనల్‌గా ‘జిన్నా’ అనే టైటిల్‌ని ప్రకటించారు. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ పాత్ర చేస్తున్నారు విష్ణు. ఈ సినిమాకి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తుండగా సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. -
Darja:వెళ్లిపోవే..వెళ్లిపోవే.. ప్రేమా..నీకు సెలవిక
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘వెళ్లిపోకే..’ పాటను ‘భీమ్లానాయక్’ చిత్ర దర్శకుడు సాగర్ కె.చంద్ర విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘వెళ్లిపోకే..’ పాట చాలా బాగుంది.. గ్రాండ్‌గా చిత్రీకరించారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్’’ అన్నారు. ‘దర్జా’ కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ–‘‘ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘వెళ్లిపోకే’ పాటని విడుదల చేసిన సాగర్ కె.చంద్రగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేనిగారికి ధన్యవాదాలు. ఈ నెలాఖరులో ‘దర్జా’ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
అందుకే నాకు వయసు గుర్తుకు రాదు: కె. రాఘవేంద్ర రావు
K Raghavendra Rao About Age In Wanted Pandu God Press Meet: ‘‘డైరెక్టర్ శ్రీధర్ సీపాన, సంగీత దర్శకుడు పీ.ఆర్, కెమెరామేన్ మహీరెడ్డి వంటి వాళ్లతో పనిచేయడం వల్ల నాకు వయసు గుర్తుకు రాదు’’అని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండు గాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అన్నది ట్యాగ్‌లైన్. కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘తనికెళ్ల భరణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నారు. ‘పెళ్లి సందడి’కి మంచి డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేస్తే బావుంటుందనిపించింది. జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాకు నేను ఓ అసిస్టెంట్ డైరెక్టర్లా వర్క్ చేశాను’’ అన్నారు శ్రీధర్ సీపాన. చదవండి: పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్ -
బిగ్‌బాస్ నుంచి బయటకు అరియానా.. ఎంత గెలుచుకుందంటే ?
Bigg Boss Non Stop Telugu Grand Finale: Ariyana Came Out With 10 Lakhs: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే నుంచి అనిల్, బాబా భాస్కర్, మిత్రా శర్మ బయటకు వచ్చాక డబ్బుల ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. డబ్బుల బ్రీఫ్‌కేసుతో హౌజ్‌లోకి వెళ్లిన అనిల్ రావిపూడి, సునీల్ డబ్బులతో బేరం చేశారు. అఖిల్ కప్ కోసం వచ్చానని చెప్పగా, బిందు మాధవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడానికే వచ్చానని తెలిపింది. అరియానా అయితే డబ్బు కోసమే వచ్చానని, ఒక ప్లాట్ కొనాలనే కోరికతోనే వచ్చానని వెల్లడించింది. తన ఆర్థిక కష్టాలని తీర్చుకునేందుకు, కప్పు కూడా కొట్టాలని ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు శివ చెప్పుకొచ్చాడు. దీంతో డబ్బుల బేరం మొదలైంది. ఈ బేరంలో అందరు సైలెంట్‌గా ఉంటే అరియానా మాత్రం ఎంత డబ్బు ఉండొచ్చని, డబ్బు తీసుకునేందుకే ఉత్సాహాన్ని చూపించింది. కానీ అందులో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అందులో లక్షల్లో డబ్బు ఉందని నాగార్జున మాటిచ్చిన తర్వాత అరియానా ఈ సూట్‌కేస్‌ను తీసుకుంది. సూట్‌కేస్‌తో స్టేజ్‌పైకి వచ్చిన అరియానాతో నాగార్జున, అనిల్, సునీల్ ఆట ఆడుకున్నారు. అందులో డబ్బు ఉందంటే ఎలా నమ్మావ్ అని బాంబు పేల్చారు. దీంతో అనిల్, సునీల్‌లను దొంగసచ్చినోళ్లను నమ్మి వ్చచానని అరియానా తిట్టేసింది. కొద్దిసేపు అరియానా అనిల్, సునీల్, నాగార్జున, బాబా భాస్కర్ ఆడుకున్నారు. చివరికి అందులో రూ. 10 లక్షలు ఉన్నాయని నాగార్జున చెప్పడంతో అరియానా ఊపిరి పీల్చుకుంది. -
హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సునీల్!
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన సునీల్ తన కామెడీ టైమింగ్స్‌తో స్టార్ కమెడియన్‌గా పేరు పొందిన సంగతి తెలిసిందే. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే సునీల్ హీరోగా రూటు మార్చారు. 'అందాల రాముడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మర్యాద రామన్న వంటి హిట్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత అనుకున్నంతగా గుర్తింపు రాకపోవడంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి కలర్ ఫొటో, పుష్ప సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ పాత్రలతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. త్వరలోనే ఎప్-3 సినిమాతో మరోసారి నవ్వించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలోనే తాను హీరోగా రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. ఓ మంచి ప్రాజెక్టుతో హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం సునీల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
అదే అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్: సునీల్
అనిల్ రావిపూడి గ్రేట్ ఆల్ రౌండర్. అతనిలో గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు. ప్రతి సీన్ అతనే చేసి చూపిస్తాడు. నా టైమింగ్ నా కంటే అనిల్ కే బాగా తెలుసు.ఇంతమంది స్టార్ కాస్ట్‌తో ఈ మధ్య కాలంలో ఎవరూ సినిమా తీయలేదు. తీసినా ఇంతమంది ఆర్టిస్ట్ లకి వేరే సినిమాలకి సర్దుబాటు చేస్తూ తీయలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నవ్వుతూ ఉంటాడు. ఆయనను చూసిన వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ, స్మెల్ వస్తుంది. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. ఆయన ఎంత ఎనర్జిటిక్, పాజిటివ్‌గా ఉంటారో ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి’అన్నారు నటుడు సునీల్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సునీల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. ఎఫ్ 3 లోకి ఎలా వచ్చారు ? 'కామెడీ రాసే వాళ్ళు తగ్గిపోయారు. మనం కలసి చేస్తే బావుంటుంది కదా'' అని 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడితో చెప్పా. 'తప్పకుండ చేద్దాం అన్నగారు.. మీ 'సొంతం' సినిమా పదేపదే చూస్తుంటా. మీ టైమింగ్ లోనే మాట్లాడుతుంటాం. మనం కలసి చేద్దాం' అన్నారు అనిల్. చెప్పినట్లే ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చారు. ఎఫ్ 3లో వింటేజ్ సునీల్ ని చూస్తారు. ఎఫ్3లో మీ పాత్ర సినిమా అంతటా ఉంటుందా? సినిమా అంతా వుంటుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం వుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది. నేను వరుణ్ తేజ్ ఒక బ్యాచ్, వెంకటేష్ గారు , రఘుబాబు ఒక బ్యాచ్, తమన్నా ఫ్యామిలీ ఒక బ్యాచ్, పృద్వీగారు, స్టంట్ శివ ఒక బ్యాచ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఒక బ్యాచ్, వెన్నల కిషోర్, రాజేంద్రప్రసాద్ గారు ఒక బ్యాచ్.. మళ్ళీ అందరం కలసి ఒక బ్యాచ్.. అందరం కలసి తర్వాత కామెడీ మాములుగా వుండదు. నాన్ స్టాప్ నవ్వులే. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో ఉంటుంది. ఎఫ్2 - అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్.. మరి ఎఫ్3 అంటే మీరేం చెప్తారు ? ఫన్ & ఫ్రస్ట్రేషన్..మూడు రెట్లు (నవ్వుతూ). ఐతే ఫ్రస్ట్రేషన్ లో కూడా ఫన్ వుంటుంది. ఫ్యామిలీ అంతా థియేటర్ కి వెళ్లి గట్టిగా నవ్వుకొని, మళ్ళీ వెళ్దాం అనుకునే సినిమా ఎఫ్ 3. వరుణ్ తేజ్‌లో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? వరుణ్ తేజ్ అప్పియరెన్స్ చుస్తే రష్యా సినిమాలో కూడా హీరోగా పెట్టేయొచ్చు. హాలీవుడ్ కటౌట్ ఆయనది. ఆలాంటి అప్పియరెన్స్ వున్న వరుణ్ గారు.. ఒక మిడిల్ క్లాస్ రోల్ చేయడం సర్ప్రైజింగా అనిపిస్తుంది. చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి తెలుసు. హీరో అయిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. 'అన్నా' అని పిలుస్తారు. వరుణ్ గారిలో చాలా ఫన్ వుంది. ఈ సినిమాతో అది బయటికి వచ్చింది. దీని తర్వాత ఆయన నుండి ఫన్ ఓరియంటడ్ సినిమాలు కూడా వస్తాయి. ఎఫ్3 లో మీరు ఫేస్ చేసిన చాలెంజ్ ఏంటి ? ఎఫ్ 3, పుష్ప .. ఒకే సమయంలో షూట్స్ లో పాల్గొన్న. రెండూ డిఫరెంట్ రోల్స్. ఒక కామెడీ , రెండు విలనీ. పొద్దున్న కామెడీ చేసి రాత్రికి విలనీ చేయడం కాస్త చాలెజింగ్ అనిపించింది. ఇప్పుడు కామెడీ సినిమాలు చేసే దర్శకులు తగ్గిపోయారు కదా.. ఆర్టిస్ట్ గా మీ మీద ఎలాంటి ప్రభావం వుంటుంది? నామీద కంటే ప్రేక్షకుల మీద ఆ ప్రభావం ఎక్కువ వుంటుంది. నవ్వించే సినిమాలు చేయడం అంత తేలిక కాదు. నవ్వించడం కూడా అంత తేలిక కాదు. సరదాగా నవ్వుకొని వుంటే ఇమ్యునిటీ పెరుగుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా.. సో.. కామెడీ సినిమాలు ఎక్కువ రావాలి. ప్రేక్షకులని నవ్వించాలి. సీరియస్ పాత్రలతో పోల్చుకుంటే కామెడీ చేయడమే కష్టం. అన్ని జోనర్ సినిమాలూ రావాలి. కానీ కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను. సీరియస్ రోల్స్ ఈజీ అంటున్నారు. కలర్ ఫోటోలో చాల సెటిల్ గా చేశారు.. దీనికి కూడా క్రాఫ్ట్ మీద కంట్రోల్ కావాలి కదా ? నిజమే. అయితే ఆ క్రెడిట్ ఇప్పుడు వస్తున్న యంగ్ దర్శకులకు దక్కుతుంది. నా సినిమాలు స్కూల్ , కాలేజీ డేస్ లో చూశారు. ఇప్పుడు వాళ్ళు అప్డేటడ్ వర్షన్. నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చిందే కలర్ ఫోటో. ఎక్కువ కామెడీ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు కదా .. మీ వరకూ ఏం ప్లాన్స్ చేస్తున్నారు ? నిజానికి నేను ప్లాన్ చేయడం మానేశాను. నా కోసం నేచర్ ఏం ప్లాన్ చేస్తుందో గుర్తిస్తున్నాను. కామెడీ చేయమన్నా ఓకే, పదహారేళ్ళ అమ్మాయికి ఫాదర్ గా చేయమన్నా ఓకే. అయితే వచ్చిన అవకాశానికి న్యాయం చేయడానికి వంద శాతం కష్టపడతాను. ఐతే నా వరకూ కామెడీ చేసి నవ్వించడమే ఇష్టం. ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయా ? తమిళ్, కన్నడ, బాలీవుడ్ నుంచి విలన్ పాత్ర సంప్రదించారు. బాలీవుడ్ నుంచి కొన్ని కామెడీ రోల్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి. రెండు ఓకే చేశాం. త్వరలోనే వివరాలు చెప్తాం. మీ స్నేహితుడు త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు ? తన కొత్త సినిమాలో నేను వుంటాను. అవకాశం వున్న ప్రతి చోట నన్ను పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆఖరికి 'భీమ్లా నాయక్' సాంగ్ లో కూడా పెట్టారు ( నవ్వుతూ) ఎఫ్ 3లో వెంకటేష్ , వరుణ్ తేజ్ ఫెర్ఫార్మేన్స్ ఎలా ఉండబోతుంది ? వెంకటేష్ గారి టైమింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎఫ్ 3లో ఆయన స్టీల్ ది షో. వరుణ్ తేజ్ గారిని ఇప్పటివరకూ ఇంత కామెడీ చేసిన రోల్ లో చూసి వుండరు. ఎఫ్ 3 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు. ఈ సినిమాకి ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వుంటారు. కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ -శంకర్ గారి సినిమా చేస్తున్నా. మరో 13 చిన్న , మీడియం సినిమాలు కూడా వున్నాయి. అందరికీ అందుబాటులో వుండాలని నిర్ణయించుకున్నా. ఒక నాలుగు పెద్ద సినిమాలు చేస్తే మరో పది చిన్న సినిమాలు చేయాలని భావిస్తున్నాను. -
‘నెల్సన్’ మొదలైంది
యంగ్ డైరెక్టర్ సునీల్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘నెల్సన్’. ‘జయంత్’అనే కొత్త కుర్రాడు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. జె.కె.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1 గా తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ తెరకెక్కబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు మొదలయ్యాయి. ఉత్కంఠభరిత కథాంశంతో స్టైలిష్ మేకింగ్ తో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లు. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ లలోనూ చిత్రీకరణ జరుపుకోనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, 'పుష్ప' ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. -
ఆ పాట చాలా బాగుంది: అల్లు అరవింద్
Darja Movie Second Song Released By Allu Aravind In Hyderabad: సునీల్, అనసూయ ప్రధాన తారాగణంగా సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పైడిపాటి శివశంకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘దర్జా’లోని రెండో పాటను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘పాట చాలా బాగుంది. పాటను చూస్తుంటే సినిమా విజువల్‌గా గ్రాండ్ ఉంటుందనిపిస్తోంది. ఈ చిత్రం సక్సెస్ సాధించాలి’’ అన్నారు. చదవండి: అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది ‘భీమవరం చిన్నదాన్ని రామలింగో..’ అని మొదలై ‘లింగో లింగో’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ ఇది. వై. విష్ణు లిరిక్స్ అందించిన ఈ పాటను నేహా పాడారు. ఇటీవల విడుదలైన దర్జా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ర్యాప్ రాక్ షకీల్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి పని చేస్తున్నారు. -
అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది
Anasuya Darja Movie Teaser Launch By Producer Suresh Babu: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ యాంకర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకున్న అనసూయ. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'దర్జా'. సునీల్, అనసూయ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. చదవండి: యాంకర్ అనసూయకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి! ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు విడుదల చేశారు. ‘‘దర్జా’ టీజర్ బాగుంది. ఆడియన్స్‌ను ఈ సినిమా ఎంటర్టైన్ చేసేలా ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. ‘ఈ బండి కనకమహాలక్ష్మిది. సరకు మీద చేయి పడితే చావు చూపిస్తది’, ‘ఎవరైనా ఈ కనకాన్ని టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ లాంచ్ వేడుకలో ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ అక్వా అసోసియేషన్ చైర్మన్ భూమాల శ్రీరామ్ మూర్తితో పాటు చిత్రయూనిట్ పాల్గొంది. ఈ సినిమాను కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. చదవండి: అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్ చంద్రల ట్రాక్ హైలెట్! -
డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియాకు సునీల్ రాయన్ రాజీనామా!
డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియా అధ్యక్షుడు సునీల్ రాయన్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. గూగుల్ క్లౌడ్ ఫర్ గేమ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన తర్వాత 2020 జూన్ నెలలో ఆయన కంపెనీ ఆయన కంపెనీలో చేరారు. వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా అండ్ స్టార్ ఇండియా అధ్యక్షుడు కె మాధవన్ జారీ చేసిన అంతర్గత మెమోలో రేయాన్ రాజీనామా గురించి సిబ్బందికి తెలియజేశారు. "సునీల్ రాయన్ వ్యక్తిగత కారణాల వల్ల కంపెనీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్'కు నాయకత్వం వహించడానికి అమెరికా నుంచి భారతదేశానికి రావలనే ఉద్దేశ్యంతో సునీల్ 2020 ప్రారంభంలో మాతో చేరారు. కరోనా మహమ్మారి వల్ల ఆ ప్రణాళికలను నిలిచిపోయాయి. అతను జట్టును రిమోట్‌గా నడిపించారు" అని మెమోలో పేర్కొన్నారు. ఏదేమైనా, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో సునీల్, తన కుటుంబం అమెరికాలో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాయన్ నాయకత్వంలో హాట్‌స్టార్ బృందం గత రెండేళ్లలో "అద్భుతమైన విజయాలు" సాధించిందని మాధవన్ అన్నారు. సునీల్ రాయన్ మే వరకు కంపెనీలో పనిచేస్తారు. సునీల్ రాయన్ ఇంతక ముందు మెకిన్సే అండ్ కంపెనీ, ఐబీఎం, ఐగేట్ మాస్టెక్, ఇన్ఫోసిస్ సంస్థలలో కూడా పనిచేశారు. (చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి ఏథర్ గుడ్‌న్యూస్.. సీబిల్ స్కోర్ లేకున్నా రుణాలు!) -
అనసూయ సినిమాకు అర్జున్ సాయం
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’.కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని సునీల్ పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్ని యాక్షన్ కింగ్ అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దర్జా’ మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుందనిపిస్తుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’అని తెలిపారు. ‘ఇంతకుముందు విడుదలైన అనసూయగారి మోషన్ పోస్టర్‌లానే.. ఇప్పుడు విడుదలైన సునీల్ మోషన్ పోస్టర్ కూడా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది’అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ రాప్ రాక్ షకీల్. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ ‘యాక్షన్ కింగ్ అర్జున్‌గారి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌కి షకీల్ అద్భుతమైన ఆర్ఆర్ అందించాడు. మోషన్ పోస్టర్ లాగే సినిమాను కూడా అంతా ఎంజాయ్ చేస్తారు’అని అన్నారు. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హీరోగా మళ్లీ బిజీ కానున్న సునీల్ !.. రెండు చిత్రాల ప్రకటన
Sunil Shared Two Upcoming Movies Posters As Hero: ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా పేరు పొందాడు సునీల్. అనంతరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. పూల రంగడు మినహా భీమవరం బుల్లోడు, జక్కన్న, ఉంగరాల రాంబాబు, మిస్టర్ పెళ్లికొడుకు, కృష్ణాష్టమి, కనుబడుటలేదు వంటి తదితర సినిమాల్లో కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో పేరు గడించలేదు. ఇటీవల వచ్చిన 'పుష్ప', అప్పట్లో రవితేజ 'డిస్కోరాజా' సినిమాల్లో విలన్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం 'పుష్ప' రెండో పార్ట్‌లోనూ కంటిన్యూ అవుతున్నా సునీల్ హీరో ప్రాధాన్యత పాత్రలు చేయడం మానలేదు. ఫిబ్రవరి 28 సోమవారం సునీల్ పుట్టినరోజు సందర్భంగా తాను హీరోగా నటిస్తున్న సినిమాలను ప్రకటించాడు. తన ట్విటర్ అకౌంట్లో ఈ రెండు సినిమా పోస్టర్లను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి కామెడీ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'బుజ్జీ ఇలారా' అయితే రెండోది అభిరామ్ డైరెక్షన్లో 'కుంభకర్ణ'. 'బుజ్జీ ఇలారా' చిత్రంలో సునీల్ ఫోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా 'కుంభకర్ణ'లో సూరజ్ దేవ్ పాత్రలో అలరించనున్నాడు. అయితే ఈ సినిమాలతో సునీల్ మళ్లీ హీరోగా బిజీ అవుతాడేమో చూడాలి. Thanks to the Team #BujjiIlaRaa#GarudavegaAnji #GNageswarReddy #RupaJagadeesh #SNSCreations pic.twitter.com/Kc51HpProC — Sunil (@Mee_Sunil) February 28, 2022 Thanks To The Team #kumbakarna 😍#AbhiramPilla #SaiKartheek #soorajdev pic.twitter.com/F6CZ1vnxzO — Sunil (@Mee_Sunil) February 28, 2022 -
'తండ్రి చనిపోయిన బాధలోనూ అనసూయ షూటింగ్‌కు వచ్చింది'
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పీఎస్ఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ఈ ఫస్ట్ లుక్ దర్జాగా ఉంది. సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సునీల్‌గారు, అనసూయగారు, ఇతర నటీనటులు ఎంతగానో సహకరిస్తున్నారు. ముఖ్యంగా అనసూయగారు తన తండ్రి చనిపోయిన బాధలోనూ షూటింగ్‌కి వచ్చి, మాకు సహకరించారు. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలో షూటింగ్ చేశాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
‘అతడు ఆమె ప్రియుడు’ రివ్యూ
టైటిల్ : అతడు ఆమె ప్రియుడు నటీనటులు: సునీల్, బెనర్జీ, కౌషల్, భూషణ్, మహేశ్వరి, దియా, జెన్నీ తదితరులు... సంగీతం : ప్రద్యోతన్ కెమెరా-ఎడిటర్ : మీర్ నిర్మాణ సారథ్యం: అమర్, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్ విడుదల తేది: ఫిబ్రవరి4, 2022 ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలలు ఎంతలా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాసిన చాలా నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. ఓ వైపు మాటల రచయితగా మరోవైపు వ్యక్తిత్వ వికాస రచనలు చేస్తూ అనేక నవలలతో పాటు నాటికలు రాసారాయన. అగ్నిప్రవేశం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాల ద్వారా డైరెక్టర్ గానూ తనను తాను ప్రూవ్ చేసుకున్న యండమూరి తాజాగా తన నవల “అతడు ఆమె ప్రియుడు” ద్వారా మళ్లీ దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. యండమూరి రచనా శైలి, దర్శకత్వంతో పాటు ఆకట్టుకునే టైటిల్ కావడంతో భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అతడు ఆమె ప్రియుడు’కథేంటంటే..? బెనర్జీ, సునీల్, కౌషల్ పాత్రల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని ప్రళయం రాబోతున్నట్లు వార్తలు వస్తాయి. ఉరుములు మెరుపులతో భయంకరమైన గాలి వాన మొదలౌతుంది. ఆ సమయంలో కౌషల్, సునీల్ బెనర్జీ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. మరికొన్ని గంటల్లో యుగాంతం కాబోతోందని ఆ ఇంట్లో ఉన్న తమ ముగ్గురికే బతికే అవకాశం ఉందని చెబుతాడు. అయితే తమలో ఒకరు ప్రాణ త్యాగం చేసి వారి స్ధానంలో ఒక స్త్రీకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో మానవజాతి అంతం కాకుండా ఉంటుందని బెనర్జీ చెబుతాడు. దాంతో కౌషల్, సునీల్ ఆలోచనలో పడతారు. అసలు ప్రకృతి విపత్తు రావడానికి కారణం ఏంటి? బెనర్జీకి మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏంటి? సునీల్, కౌశల్ లో ఎవరు ప్రాణ త్యాగం చేస్తారు? ఆ ఇంట్లో అడుగుపెట్టిన స్త్రీ ఎవరు? బెనర్జీ చెప్పినట్లు యుగాంతం అవుతుందా?అన్నదే సినిమా కథ. ఎవరెలా చేశారంటే? ప్రొఫెసర్ పాత్రలో బెనర్జీ నటన ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రవర పాత్రలో సునీల్ నవ్వులు పూయించారు. ఓ వైపు ప్రళయం వస్తోందని తెలిసి భయపడుతూనే మరోవైపు కామెడీని పండించారు. స్త్రీమూర్తి ఔన్నత్యం గురించి కౌషల్ ఏకధాటిగా చెప్పిన డైలాగ్ సినిమాలో హైలైట్ అని చెప్పాలి. ధారాళంగా ఆయన చెప్పిన డైలాగ్ కి ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కౌషల్ ప్రతీకారం తీర్చుకునే పాత్రలో నటించిన భూషణ్ (ప్రముఖ నటుడు నాగభూషణం మనవడు) ద్విపాత్రాభినయంతో అలరించాడు. ఎలా ఉందంటే..? సినిమాలోని సంభాషణలు కొన్నిచోట్ల ఆలోపించే చేసేలా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మనసుని హత్తుకుంది. కథని రక్తి కట్టించేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయినప్పటికీ సీన్ బై సీన్ ప్రేక్షకుల్లో మరికొంత ఉత్కంఠ కలిగించేలా చూపించి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా ప్రేమంటే సెక్స్, స్నేహమనే భావనలో ఉంటున్న యూత్ కి ఈ సినిమా ద్వారా రచయిత మంచి మెసేజ్ ఇచ్చాడని చెప్పవచ్చు. -
సింగిల్ టేక్‌లో రెండు పేజీల డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచిన బిగ్‌బాస్ కౌశల్
సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కౌశల్ ఈ సినిమాలో చెప్పిన సింగిల్ టేక్ డైలాగ్ టీజర్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. కౌశల్ చెప్పిన అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగు టీజర్‌ను ఈ రోజు మధ్యహ్నం చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్‌ను కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్‌లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే... ఈ డైలాగ్ ట్రైలర్‌ను చిత్ర రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఈసందర్భంగా యండమూరి పేర్కొన్నారు. -
‘అతడు ఆమె ప్రియుడు’కు విజయం తధ్యం
సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ చిత్ర ప్రిరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకులు దశరథ్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో... చిత్ర దర్శకుడు యండమూరి, నిర్మాతలు రవి కనగాల,-రామ్ తుమ్మలపల్లి, హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి వడ్డి, ఈ చిత్రానికి ఛాయాగ్రహణంతోపాటు ఎడిటింగ్ చేసిన మీర్ పాలుపంచుకున్నారు. రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి.... దర్శకుడిగాను "అతడు ఆమె ప్రియుడు" చిత్రంతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని అతిధులు ఆకాంక్షించారు. ‘అతడు ఆమె ప్రియుడు’చిత్రం కోసం యండమూరి ఎంతో శ్రమించారని, సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు. యండమూరితో మరికొన్ని చిత్రాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. "అతడు ఆమె ప్రియుడు" చిత్రాన్ని ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తున్నామని అన్నారు. -
‘అతడు ఆమె ప్రియుడు’ ట్రైలర్ వచ్చేసింది
సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉందని... సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ కు నిర్మాతలు రవి కనగాల- రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన యండమూరి దర్శకత్వంలో రూపొందిన "అతడు ఆమె ప్రియుడు" అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. -
రామ్ గోపాల్ వర్మ లాంటి మేధావి బాబాగా మారితే?
The Boss- Never Dies Movies: బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో యువ నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్న సంచలన చిత్రం "ది బాస్". నెవర్ డైస్ అన్నది ఉపశీర్షిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా... బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత వివాదాస్పద చిత్రం 'ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగోను ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు. "ది బాస్-నెవర్ డైస్" సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని.... రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం "ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ఈశ్వర్ బాబు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. -
'గీత' ఫస్ట్ లుక్ విడుదల.. గురువుకు తగ్గ శిష్యుడని ప్రశంస
Geetha Movie First Look Poster Released By VV Vinayak: ‘‘గీత’ సినిమా ఫస్ట్ లుక్ బాగుంది. నా శిష్యుడు విశ్వ దర్శకుడిగా, నా మిత్రుడు రాచయ్య నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా విజయం సాధించాలి. యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. కుమారి 21F ఫేమ్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్, సునీల్ ముఖ్యపాత్ర చేసిన చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ (మూగ సాక్ష్యం) అన్నది ఉప శీర్షిక. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ సినిమాల ఫేమ్ సాయికిరణ్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు. డైరెక్టర్ వీవీ వినాయక్ శిష్యుడు విశ్వని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వినాయక్ విడుదల చేశారు. రాచయ్య మాట్లాడుతూ ‘‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా విశ్వ ‘గీత’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయి’’ అన్నారు. ‘‘గీత’ సినిమా అవకాశం మా గురువు వినాయక్‌గారే ఇప్పించారు. రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు విశ్వ. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్ అందించగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్. చిన్నా, కెమెరా: క్రాంతికుమార్.కె. -
పుష్పరాజ్ కోసం వాళ్లని సెట్ చేసిన సుకుమార్
Villains In Allu Arjun Pushpa Movie:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఊరమాస్ లుక్‌లో పుష్పరాజ్‌గా అవతారం ఎత్తాడు. బన్నీ కెరీర్లోనే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్‌ను సెట్ చేశాడు సుకుమార్. హీరో పాత్రను పాన్ ఇండియా లెవల్లో ఎలివేట్ చేయాలంటే విలన్లు అంతకుమించిన స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే పుష్పరాజ్‌కు ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్‌ను సెట్ చేశాడు సుకుమార్. విలన్ పాత్రల్లో హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఉండటం విశేషం. ఈ లిస్ట్‌లో మొదటగా చెప్పుకోవాల్సింది ఫాహద్ ఫాజిల్. అప్పటివరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్ కరోనా సమయంలో వరుస హిట్లతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటివరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ స్టార్ హీరో పుష్ప సినిమా కోసం తొలిసారిగా పవర్ఫుల్ ప్రతినాయకుడిగా మారారు. ఇక 'భైరవగీత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుంజయ్ ఆ తర్వాత శాండల్‌వుడ్‌లో బిజీ అయ్యాడు. ఇప్పుడు ఈ హీరో కూడా పుష్పరాజ్‌తో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక ఒకప్పటి టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా విలన్‌గా మారోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సర్ప్రైజ్ చేస్తానంటూ ఊరిస్తున్నాడు. అలాగే యాంకర్ అనసూయ,అజయ్ ఘోష్, శత్రు వంటి విలన్లు కూడా పుష్పరాజ్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. -
నా శిష్యుడు 'విశ్వ' విజేత కావాలి: వి.వి.వినాయక్
మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ దర్శకత్వంతో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘గీత’.‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ నటుడు సనీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న "గీత' ఘన విజయం సాధించాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని అభిలాషించాడు. . ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు. ఈ సినిమా అవకాశం తన గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారని, నిర్మాత రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందీ "ఛత్రపతి" పనులతో తలమునకలుగా ఉన్నప్పటికీ... తమ మీద ప్రత్యేకమైన అభిమానంతో "గీత" చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నిర్మాత ఆర్.రాచయ్య కృతజ్ఞతలు తెలిపారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని అత్యద్భుత ప్రణాళికతో రూపొందించారని పేర్కొన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా. -
అతడు ఆమె ప్రియుడు..టీజర్ చాలా బాగుంది
‘‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్‌కు కథలు అందించిన నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. రవి కనగాల–తుమ్మలపల్లి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘అతి త్వరలో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి. -
‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ
టైటిల్ : పుష్పక విమానం నటీనటులు : ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేశ్, హర్థవర్దన్ తదితరులు నిర్మాణ సంస్థ : కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ నిర్మాతలు : గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ని దర్శకత్వం : దామోదర సంగీతం : రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్ విడుదల తేది : నవంబర్ 12, 2021 దొరసాని, మిడిల్ క్లాస్‌మెలోడీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ.ఇక ఇప్పుడు ఇక ‘పుష్ఫక విమానం’తో నటుడిగా ఆనంద్ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎంనో అంచనాల మధ్య ఈ శుక్రవారం (నవంబర్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్పక విమానం’మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పుష్పక విమానం కథేటంటే..? చిట్టిలంక సుందర్(ఆనంద్ దేవరకొండ) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియని అమాయకపు చక్రవర్తి. అతనికి మీనాక్షి(గీత్ సైని)తో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లైయిన కొద్ది రోజులకే మీనాక్షి వేరొకరితో పారిపోతుంది. ఊహించని ఈ విచిత్ర పరిస్థితిని సుందర్ ఎలా ఎదుర్కొంటాడు? అసలు మీనాక్షి ఎందుకు పారిపోయింది? భార్య పారిపోయిందనే విషయాన్ని సమాజానికి తెలియనీకుండా సుందర్ ఎలాంటి పనులకు ఒడిగట్టాడు? వాటి వల్ల సుందర్‌కు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? వెబ్ సీరీస్, షార్ట్‌ఫిలిం హీరోయిన్ రేఖకు సుందర్‌కు మధ్య సంబంధం ఏంటి? ఈ కథలోకి పోలీసాఫీసర్ రంగా(సునీల్) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? చివరకు మీనాక్షి దొరికిందా లేదా? అనేదే ‘పుష్పక విమానం’ కథ ఎలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండకు మూడో సినిమా ఇది. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్ నటన కాస్త మెరుగుపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. అమాయకపు చేష్టలతో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. భార్య పారిపోయిందనే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, దానికి కప్పిపుచ్చడానికి సుందర్ చేసే పనులు అందరిని నవ్విస్తాయి. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆనంద్ అద్భుత నటనను కనబరిచాడు. ఇక మీనాక్షిగా గీత్ సైని మెప్పించింది. కథ మొత్తం తన పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ తెరపై ఆమె చాలా తక్కువ సమయమే కనిపిస్తుంది. అయినప్పటికీ ఉన్నంతతో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సుందర్ నకిలీ భార్య రేఖ పాత్రలో శాన్వీ మేఘన ఒదిగిపోయింది. వెబ్‌సీరీస్, షార్ట్ ఫిల్మ్‌లు తీసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేఖ పాత్ర తనది. తెరపై మాస్ లుక్‌లో కనిపిస్తుంది.ఇక పోలీసాఫీసర్ రంగగా సునీల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీరియస్ లుక్‌లో కనిపిస్తూనే తనదైన పంచ్‌లతో నవ్వించాడు. స్కూల్ హెడ్మాస్టర్గా నరేశ్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పుష్పక విమానం ఎలా ఉందంటే.. ? పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు దామోదర. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై మాత్రం అంత ఆస్తక్తికరంగా చూపించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఏమీ ఉండదు. భార్య మిస్సయిందనే పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇస్తే పరువు పోతుందని.. తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అదే సమయంలో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపించి ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెడతాయి. కానీ ఇంటర్వెల్ ముందు ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుకుంది. మీనాక్షిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని చివరివరకు చెప్పకుండా, సెకండాఫ్‌లో కథను ఆసక్తికరంగా నడిపించాడు. అయితే పోలీసు విచారణ మాత్రం నాటకీయంగా సాగడం సినిమాకు మైనస్. దానికి తోడు కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’అనే సాంగ్ మినహా మిగతా పాటలన్ని అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం చక్కగా అందించారు. కథలో భాగంగానే పాటలు వస్తాయి తప్ప తెచ్చిపెట్టినట్లు ఎక్కడా అనిపించదు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
విలన్ గా దూసుకుపోతున్న సునీల్
-
ఇప్పటివరకు సునీల్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు...
Sunil First Look as Mangalam Srinu in Pushpa Movie: ఇప్పటివరకు హాస్యనటుడిగా, హీరోగా అలరించిన సునీల్ తొలిసారిగా 'పుష్ప' కోసం విలన్‌గా మారాడు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సునీల్.. మంగళం శ్రీను అనే పాత్రలో కనిపించనునున్నాడు. దీనికి సంబంధించి సునీల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో మునుపెన్నడూ లేని విధంగా బట్టతలతో, భయంకరమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చాడు.భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ రానున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. Presenting the face of evil 😈 Introducing @Mee_Sunil as #MangalamSrinu from #PushpaTheRise 🔥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/zRSNH9tFnw — Pushpa (@PushpaMovie) November 7, 2021 -
ఆర్యన్ డ్రగ్స్ కేసు సూత్రధారి సునీల్: బీజేపీ
న్యూఢిల్లీ: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో బీజేపీ సరికొత్త ఆరోపణలకు తెర తీసింది. డ్రగ్స్ క్రూయిజ్ కేసు వెనుక సూత్రధారి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో సన్నిహిత సంబంధాలున్న, ధూలెకి చెందిన సునీల్ పాటిల్ అనే వ్యక్తి అని ఆరోపించింది. మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని మహారాష్ట్ర బీజేపీ నాయకుడు మోహిత్ భారతీయ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నిజం బయటపడకుండా ఉండడం కోసమే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే మీద ఆరోపణ చేస్తున్నారని అన్నారు. ఆర్యన్ విడుదల కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్ నుంచి డబ్బులు దండుకోవడానికి సునీల్ స్కెచ్ వేశారని ఆరోపించారు. ఈ కేసులో ఎన్సీబీ సాక్షి అయిన ప్రైవేటు డిటెక్టివ్ కిరణ్ గోసావితో సునీల్‌కి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. క్రూయిజ్ నౌకపై ఎన్సీబీ దాడి చేయడానికి ముందు నుంచే గోసావి, శామ్ డిసౌజాతో సునీల్ పాటిల్ టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. కాగా, ఆర్యన్‌కేసు విచారించడానికి ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం న్యూఢిల్లీ నుంచి శనివారం ముంబైకి చేరుకుంది. ఐపీఎస్ అధికారి సంజయ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. -
పుష్పక విమానం: పెళ్లైన 10 రోజులకే భార్య లేచిపోయిందా?
దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. తాజాగా పుష్పక విమానం సినిమాతో ప్రయోగం చేయబోతున్నాడీ హీరో. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను అల్లు అర్జున్ రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్లో ఆనంద్‌ను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చూపించారు. అతడికి ఓ అందమైన అమ్మాయితో పెళ్లి జరిపించారు. పెళ్లైన 8 రోజులకే సిటీలో కొత్త జీవితం ప్రారంభించిందీ జంట. అయితే అతడు తన భార్యను ఎవరికీ చూపించకపోగా ఆమె ఇంట్లోనే ఉన్నట్లు నమ్మిస్తాడు. తనే ఇంటి ముందు ముగ్గులేస్తూ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తన భార్యే చేసిందని స్కూల్లో స్టాఫ్‌కు వడ్డిస్తాడు. ఆనంద్ తన భార్యను ఎవరికీ చూపించకపోవడానికి కారణం ఆమె పెళ్లైన పది రోజులకే లేచిపోతుంది. ఈ విషయంలో పోలీసులు అతడినే అనుమానిస్తారు. నీ భార్య లేచిపోయిందని చెప్పడానికి ఒక్క సాక్ష్యం చూపించు అని పోలీస్ పాత్రలో ఉన్న సునీల్ ఆనంద్‌ను అడుగుతాడు. దీనికి హీరో ఆమె రాసిన లెటర్ ఉందంటూనే దాన్ని మింగేసానని చెప్తాడు. అలా వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నవంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవబోతోంది. ఇదిలా వుంటే అతడు ‘మధురా’ శ్రీధర్ రెడ్డి, బలరామ్ వర్మ నంబూరి, బాల సోమినేని నిర్మాతలుగా రూపొందనున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే కేదారం సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌లో ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. -
‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన రాఘవేంద్రరావు
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నటుడు సునీల్, బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఝాన్సీ కూనం (యూఎస్ఏ) సమర్పణలో రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్నఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే. ఆయన నా దర్శకత్వంలో రూపొంది మంచి విజయాలందుకున్న ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు-అతిలోక సుందర’ చిత్రాలకు రచయితగా పని చేశారు. యండమూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలని’ అన్నారు. యండమూరి మాట్లాడుతూ... ‘రాఘవేంద్రరావు నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గురువులాంటివారు కూడా. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి, మా చిత్రాన్ని ప్రమోట్ చేయడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. చదవండి: హీరోగా రాబోతున్న దర్శకేంద్రుడు.. నలుగురు హీరోయిన్లతో సందడి! -
నువ్వే హీరో అనగానే షాకయ్యాను: ధన్‌రాజ్
సునీల్, ధన్‌రాజ్ హీరోలుగా అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో వందశాతం ఆక్యుపెన్సీ రావడం ఓ శుభసూచకం. ‘బుజ్జీ ఇలారా..’ సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘నాగేశ్వరరెడ్డిగారు కథ చెప్పి, నువ్వే∙హీరో అనగానే షాకయ్యాను’’ అన్నారు ధన్‌రాజ్. ‘‘దర్శకుడిగా ‘సీమశాస్త్రి’, ‘దేనికైనా రెడీ’ చిత్రాలను నమ్మి చేస్తే, హిట్టయ్యాయి. కథ–స్క్రీన్‌ప్లే రచయి తగా నమ్మి తీసిన ఈ సినిమా హిట్టవుతుంది’’ అన్నారు నాగేశ్వర రెడ్డి. ‘‘అంజి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు అంజి. -
అనాధల రాత మారుస్తానంటున్న ‘గీత’
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంచలన దర్శకులు వి.వి.వినాయక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం. సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు. -
రిమాండ్‌కు ‘ఈబిడ్’ సూత్రధారి సునీల్
అనంతపురం క్రైం: అనంతపురం జిల్లాలో సంచలనం రేకెత్తించిన ఈబీఐడీడీ (ఈబిడ్) స్కామ్ సూత్రధారి కడియాల సునీల్ అలియాస్ మాథ్యూ అలియాస్ తినువత్తా సునీల్ కడియాల కటకటాలపాలయ్యాడు. ఇతన్ని మంగళవారం సీఐడీ డీఎస్పీ పూజిత ఆధ్వర్యంలో పోలీసులు కర్నూలు నుంచి అనంతపురం తీసుకువచ్చారు. రూరల్ పోలీసుస్టేషన్ నుంచి బ్లూజీన్ యాప్ ద్వారా వర్చువల్ విధానంలో జిల్లా జడ్జి అరుణ సారిక ముందు హాజరుపరిచారు. ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అంతకుముందు సునీల్‌కు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదీ నేపథ్యం.. ఈబిడ్ నిర్వాహకులు అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపి రూ.28 లక్షలు కట్టించుకుని మోసం చేశారని ధర్మవరం మండలం వసంతపురానికి చెందిన ఎం. బాబుల్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 14న ధర్మవరం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడియాల సునీల్, జాస్తి సుధాకర్, మహేంద్ర చౌదరిలపై పోలీసులు ఐపీసీ సెక్షన్–420, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే, ఈ ఏడాది మహారాష్ట్రలోని నాగ్‌పూర్ బజాజ్‌నగర్ పీఎస్‌లో నమోదైన ఓ చీటింగ్ కేసులో అక్కడి కోర్టు సునీల్‌కు రిమాండ్ విధించింది. ఈబిడ్ కేసు సీఐడీకి బదిలీ కావడంతో పోలీసులు గత నెల 27న జిల్లా కోర్టులో పీటీ వారెంట్ తీసుకుని ఈ నెల 6న నాగ్‌పూర్ జైలు నుంచి సునీల్‌ను కర్నూలుకు తీసుకువచ్చి మంగళవారం అనంతపురం జిల్లా జడ్జి ముందు హాజరుపర్చారు. ఇదే కేసులో మహేంద్ర చౌదరి ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నాడు. కడియాలపై మరో 15 కేసులు? కడియాల సునీల్‌పై జిల్లాలో మరో 15 కేసులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక కేసులో మాత్రమే కోర్టు రిమాండ్ విధించింది. మిగిలిన కేసులకు సంబంధించి కూడా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. అలాగే, రిమాండ్‌లో ఉన్న కడియాల సునీల్‌ను విచారణ నిమిత్తం సీఐడీ పోలీసులు బుధవారం కస్టడీకి కోరనున్నట్లు తెలిసింది. ఈ విచారణలో ఈబిడ్ అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంది. ఈ స్కామ్‌లో సునీల్ వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
'మహమ్మద్ ఖయ్యుమ్'గా సునీల్..
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. కెమెరామ్యాన్ ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. చాందినీ అయ్యంగార్ హీరోయిన్. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జి. నాగేశ్వర రెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సునీల్ పాత్ర లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సునీల్‌గారు మహమ్మద్ ఖయ్యుమ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు, కెమెరా–దర్శకత్వం ‘గరుడవేగ’ అంజి. చదవండి : సిస్టర్‌కు ట్రీట్ ఇచ్చిన రామ్‌చరణ్ అనాథ చిన్నారులకు విశాల్ గోరుముద్దలు -
ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్ వచ్చింది : వైశాలీ రాజ్
‘‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘కనబడుట లేదు’. ఇప్పుడొస్తున్న సినిమాల్లో మాది బెస్ట్ అని చెప్పగలను. సునీల్‌గారితో నటించడం హ్యాపీ. మా చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని వైశాలీ రాజ్ అన్నారు. సునీల్, సుక్రాంత్ వీరెల్ల హీరోలుగా వైశాలీ రాజ్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కనబడుట లేదు’. బాలరాజు ఎం దర్శకత్వం వహించారు. సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా. శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీప్రసాద్ బలివాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. (చదవండి: అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోంది? అలనాటి హీరోయిన్ ఆందోళన) ఈ సందర్భంగా వైశాలీ రాజ్ మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు కవిత. స్క్రీన్ నేమ్ వైశాలీ రాజ్. నాది వైజాగ్. రెండేళ్ల క్రితం మా నాన్నగారు చనిపోవడంతో ఉద్యోగం మానేసి, షార్ట్ ఫిలింస్‌లో నటించడం మొదలుపెట్టాను. రెండేళ్ల ముందు ఓ షార్ట్ ఫిల్మ్‌లో నా ఫొటో చూసిన బాలరాజుగారు ‘కనబడుట లేదు’లో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. హీరోయిన్ పాత్రలే కాదు.. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను. డైరెక్షన్ చేయాలని కూడా ఉంది.. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి’’ అన్నారు. (చదవండి: విశ్వక్ సేన్ అసలు పేరు ఏంటో తెలుసా?) -
మా కుటుంబానికి బెదిరింపులు.. వైఎస్ షర్మిల దీక్షలో వెల్లడిస్తా
సాక్షి, హైదరాబాద్/ మహబూబాబాద్/ గూడూరు: పోడు భూముల కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల పోరు చేయనున్నారు. ఈ నెల 18న ములుగు జిల్లాలో ‘పోడు భూములకై పోరు’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ములుగు లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం పస్రాలోని కు మురం భీం విగ్రహానికి నివాళి అర్పించి, లింగాల వరకు భారీ ర్యాలీ చేపట్టి పోడు భూములకై పోరును నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ రాజగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, షర్మిల మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగిలో నిరుద్యోగ దీక్ష చేపట్టన్నారు. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న సో మ్లాతండావాసి బోడ సునీల్ నాయక్ కుటుంబ సభ్యులను ముందుగా పరామర్శిస్తారు. సునీల్ కుటుంబానికి బెదిరింపులు! వైఎస్ షర్మిల పరామర్శించనున్న బోడ సునీల్ కుటుంబసభ్యులకు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, పోలీసుల నుంచి బెదిరింపులు వచ్చాయని సునీల్ సోదరుడు శ్రీనివాస్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు, పోలీసుల సాయంతో తమను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని.. తామంతా వేర్వేరు చోట్ల బంధువుల ఇళ్లలో తలదాచుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని షర్మిల దీక్షలో వెల్లడిస్తానని చెప్పారు. -
‘కనబడుటలేదు’ రిలీజ్‌కు సిద్ధం
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): హీరో సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కనబడుటలేదు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సిరిపురంలోని వీఎంఆర్డీఏ చి్రల్డన్ ఎరీనాలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్టార్ మేకర్ సత్యానంద్ పాల్గొని.. సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో నటించిన నటుల్లో ఎక్కువ మంది నగరానికి చెందిన వారు కావడం సంతోషకరమన్నారు. నిర్మాత సతీష్‌రాజు మాట్లాడుతూ కనబడుటలేదు చిత్రాన్ని ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వర్ధమాన గాయకుడు యశస్వి పలు సినీగీతాలను ఆలపించి.. ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో దర్శకుడు బాలరాజు, హీరోయిన్ వైశాలి రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త లుక్‌లో ఆది సాయికుమార్
డిఫరెంట్ జోనర్ మూవీస్‌లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరో ఆది సాయికుమార్. ఇప్పుడు ఆది కథానాయకుడిగా నాటకం ఫేమ్ కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. విజన్ సినిమా బ్యానర్ ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం(ఆగస్ట్ 15) రోజున టి.ఎం.కె(TMK) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమై పూజా కార్యక్రమాలను జరుపుకుంది. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. -
‘బుజ్జి ఇలా రా’ అంటున్న సునీల్
కమెడియన్స్‌గా కలిసి మెప్పించిన సునీల్, ధనరాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రానికి `బుజ్జి ఇలా రా` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. `ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్` అనేది ట్యాగ్‌లైన్. అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోన్న ఈ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ మూవీ అని అర్థమవుతుంది. సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
‘పుష్ప’లో బిగ్ ట్విస్ట్: సునీల్‌కి పాన్ ఇండియా పాపులారిటీ ఖాయం!
పుష్ప మూవీలో విలన్ ఎవరు? ఇంకెవరు మాలీవుడ్ యాక్టర్,ఫహాద్ ఫాజిల్ అంటారు కదా? కానీకాని సుకుమార్ అక్కడ.. ఆడియెన్స్ కు అంత ఈజీగా తన సినిమా అర్ధమైతే ఎలా... అందుకే పుష్ప లో బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో ఫుష్ప షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సింగిల్ షెడ్యూల్లో సినిమాను కంప్లీట్ చేసి,సాధ్యమైతే దసరా సీజన్‌కు తొలి భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడు. బన్నీకి సవాల్ విసిరే పాత్రను మళయాల నటుడు ఫాహద్ ఫాజిల్ చేయబోతున్నాడు. అయితే ఇక్కడే ఒక్క ట్విస్ట్ ఉంది అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు విలన్ రోల్ చేసి సర్ ప్రైజ్ చేయనున్నాడట. టాలీవుడ్ టాప్ కమెడియన్ సునీల్ కూడా పుష్పలో కీరోల్ చేస్తున్నాడు. సునీల్ అనగానే ఒకప్పుడు కామెడీ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసేవారు. తర్వాత హీరోయిజం చూపిస్తే ఆశ్చర్యపోయారు. డిస్కో రాజా, కలర్ ఫోటో మూవీతో విలన్‌గా కూడా మారాడు. పుష్ప రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మెయిన్ విలన్ ఫాహద్ ఫాజిల్ ఎంట్రీ మాత్రం, సెకండ్ పార్ట్‌లో ఉంటుందనీ, ఫస్ట్‌పార్ట్‌లో మెయిన్ విలన్‌గా సునీల్ కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అదే నిజమైతే పుష్ప తో సునీల్ పాన్ ఇండియా రేంజ్ లో విలన్ కావడం ఖాయం. -
Kanabadutaledu: డిటెక్టివ్‌గా సునీల్.. ఆసక్తి రేపుతున్న టీజర్
సునీల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం `కనబడుటలేదు`. ఓ మిస్సింగ్ కేసు, మర్డర్, ఇన్విస్టిగేషన్ నేపథ్యంలో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్. బాలరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. . 'పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కానీ డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి'.. అంటూ కీలకమైన కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్న సునీల్‌ను పరిచయం చేశారు. పోలీసులకు అంతుపట్టని ఈ కేసు.. డిటెక్టీవ్ ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమా కథ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో షాట్లూ, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… అన్నీ బాగున్నాయి. సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే స్పార్క్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఫైటర్ శివ' ఫస్ట్ లుక్ విడుదల
కౌండిన్య ప్రొడక్షన్ బ్యానర్ పై జి.నరసింహ గౌడ్ ప్రొడ్యూసర్ గా ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ చిత్రం 'ఫైటర్ శివ'. మణికాంత్, శీతల్ భట్ హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ చిత్రం లో హీరో సునీల్ సిబీఐ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నారు.. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కరోనా కారణం గా ఇబ్బందులు పడుతున్న కళాకారులకి నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. ‘రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాం.. చివరి షెడ్యూల్ ప్లాన్ చేశాం. సినిమా ఇప్పటివరకు బాగా వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ లాక్ డౌన్ వల్ల అది కుదరలేదు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు పది రోజులకు సరిపడా రేషన్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించింది. వెంటనే కో ఆర్డినేటర్ కృష్ణ ను సంప్రదించి, కళాకారులను పిలిపించి, వారి సమక్షంలోనే ఈ సినిమా పోస్టర్ లాంచ్ జరిపించి 200 మంది కళాకారులకు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్&ఫైనాన్సర్ చింతపల్లి రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. నిర్మాత జి.నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ తర్వాత సినిమా మూడో షెడ్యూల్ చేస్తాం. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.. హీరో హీరోయిన్ లు చక్కగా నటించారు.. దర్శకుడు ఎంతో బాగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. అన్నారు. -
మహేశ్ సినిమాలో సునీల్.. త్రివిక్రమ్ మూడో ప్రయత్నం ఫలించేనా?
సునీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత మంది స్నేహితులలో అందరికి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. ఇద్దరు కూడా ఒకే రూంలో ఉండి సినిమా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు త్రివిక్రమ్. సునీల్ కమెడియన్‌గా స్టార్డమ్ ఉన్న సమయంలోనే హీరోగా అవకాశాలు రావడంతో కామెడీ పాత్రలు మానేశాడు. ఇటీవల ఆయనకు హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తన స్నేహితుడిని మరోసారి హిట్‌ట్రాక్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్. హీరో నుండీ మళ్ళీ కమెడియన్ గా మారాలి అని సునీల్ డిసైడ్ అయినప్పుడు.. త్రివిక్రమ్ తన ‘అరవింద సమేత’ లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో సునీల్ పాత్ర పండలేదు. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కూడా సునీల్ కు త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడు కానీ ఆ సినిమాలో అతను ఉన్నట్టు కూడా జనాలు గుర్తు పెట్టుకోలేదు. దీంతో త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి సునీల్‌కి అవకాశం ఇస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్‌తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో హీరోకి కూడా అవకాశం ఉందట. ఆ పాత్రకు సునీల్‌ని ఎంపిక చేసుకున్నాడట త్రివిక్రమ్. గత చిత్రాల మాదిరి కాకుండా ఇందులో సునీల్ పాత్రని చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట. మరి మహేశ్ సినిమాతో అయినా సునీల్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో చూడాలి. చదవండి : మహేశ్ బాబు SSMB28 సినిమాలో శిల్పాశెట్టి ? -
మండేలా తెలుగు రీమేక్: హీరోగా సునీల్?
ఓ భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం తెలిసిందే. తాజాగా తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మండేలా’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. యోగిబాబు హీరోగా మడోన్నే అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, మంచి హిట్ అయింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను అనిల్ సుంకర దక్కించుకున్నారు. తమిళంలో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కింది. తెలుగు రీమేక్‌లో హీరోగా సునీల్ నటించనున్నారని టాక్. మరి.. మండేలాగా సునీల్ కనిపిస్తారా? ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది త్వరలోనే తెలుస్తుంది. -
నెగటీవ్ రోల్: కమెడియన్ భార్యగా అనసూయ!
బుల్లితెరతోపాటు వెండితెరపైన కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది అనసూయ భరద్వాజ్.. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ పలు సినిమాల్లోనూ కీలకపాత్రలో నటించింది. ఇక రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరును తీసుకొచ్చింది. మరోవైపు ‘క్షణం’, ‘కథనం’ వంటి సినిమాల్లో ఫుల్లెంత్ రోల్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. టెలివిజన్ షోలలో వ్యాఖ్యతగా, న్యాయనిర్ణేతగానూ కొనసాగుతున్న ఈ భామ అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్యాంక్ యూ బ్రదర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మే 7న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీనితోపాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో కీలకపాత్ర ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో అనసూయ కోసం స్పెషల్ గా ఓ పాత్రను క్రియేట్ చేసి.. ఆ రోల్ కోసం ఆమెను సెలెక్ట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. తాజాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర ఢిఫరెంట్‌గా నెగటీవ్ టచ్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో సునీల్ భార్యగా కనిపించనుందని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్లో రంగమ్మత్తగా చేసిన అనసూయకు రెండో సినిమా పుష్ప ఎలాంటి హిట్‌ను అందించనుందో వేచిచూడాలి. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చదవండి: థాంక్ యూ బ్రదర్: ఆ డేట్ నుంచి ఆహాలో ప్రసారం.. పుష్పలో అనసూయ: మంచిరోజులున్నాయి అంటూ.. -
స్టార్ స్టార్ సూపర్ - సునీల్
-
మా సినిమాలో బూతు లేదు: జగపతి బాబు
‘‘ఎఫ్‌సీయూకే’ టైటిల్‌ను చూసి కొంతమంది వేరేగా అనుకుంటున్నారు. మా సినిమాలో బూతు లేదు. జనాలకు రీచ్ కావాలనే ఆ టైటిల్ పెట్టాం’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్–చిట్టి–ఉమా–కార్తీక్)’. జగపతిబాబు ప్రధానపాత్రలో, రామ్ కార్తీక్ – అమ్ము అభిరామి జంటగా, బేబీ సహస్రిత కీలక పాత్రలో నటించారు. కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎఫ్‌సీయూకే బారసాల(ప్రీ రిలీజ్) వేడుక జరిగింది. ఈ చిత్రంలోని ఆడియో సాంగ్స్‌ను ఇప్పటికే కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేతుల మీదుగా విడుదల చేయగా, వాటి వీడియో సాంగ్స్‌ను పాపులర్ యూట్యూబర్స్‌తో రిలీజ్ చేయించారు. జగపతిబాబు మాట్లాడుతూ – ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైనర్ ఈ సంవత్సరం ఇంకా రాలేదు. మా చిత్రం ఆ లోటు తీరుస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై 46 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నా. ఒక్క మాటలో ప్రతి విషయంలోనూ ‘ఎఫ్‌సీయూకే’ ది బెస్ట్’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు డైరెక్టర్. ‘‘సినిమాకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి’’ అన్నారు రామ్ కార్తీక్. ‘‘సాల్ట్, పెప్పర్ తినే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి’’అన్నారు నటుడు సునీల్. లైన్ ప్రొడ్యూసర్ వాసు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, నటుడు–రచయిత బాలాదిత్య, రైటర్ కరుణాకర్, నటుడు భరత్ పాల్గొన్నారు. (చదవండి: ఒక సినిమా నూటనలభై మంది స్టార్స్!) (చదవండి: పవన్ సినిమాలో మెరవనున్న స్టార్ డైరెక్టర్!) -
రైతుల కోసమే ‘జైసేన’ : సునీల్
శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీశ్ గౌతమ్ హీరోలు గా రూపొందిన చిత్రం ‘జైసేన’. వి. సముద్ర దర్శకత్వంలో వి. విజయలక్ష్మీ, వి. సాయి అరుణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. సునీల్ మాట్లాడుతూ– ‘‘ఒక రైతుకు మన అవసరం లేకున్నా మనందరికీ రైతు అవసరం ఉంది. అందుకని వారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఐపీయస్ పాత్రలో నటించాను. రైతు సమస్యలను పదిమందికీ చెబుతూ వారికి పరిష్కారాన్ని చూపించటం మంచి విషయం’’ అన్నారు. వి. సముద్ర మాట్లాడుతూ– ‘‘రైతులకు న్యాయం జరిగే విధంగా ఓ పరిష్కారాన్ని సినిమాలో చర్చించాం. రైతుల గురించి తీసిన సినిమా కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ప్రవీణ్, అభిరామ్, రైటర్ చందు, కో ప్రొడ్యూసర్స్ శిరీషా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
సునీల్ సినిమాలో అనసూయ హీరోయిన్!
జబర్దస్త్ కామెడీ షోలో అందాల ఆరబోతతో పాటు నవ్వులు విరజల్లులు చిలకరించే యాంకర్ అనసూయ భరద్వాజ్. బుల్లితెర, వెండితెర.. మధ్యలో ఓటీటీ తెర.. కాదేదీ ఎంటర్టైన్మెంట్కు అనర్హమన్నట్లుగా కుదిరిన అన్ని చోట్లా కాలు మోపుతూ సక్సెస్‌ను అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఆమెకు కమెడియన్ పక్కన హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చింది. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న 'వేదాంతం రాఘవయ్య' సినిమాలో అతడికి జోడీగా నటించేందుకు అనసూయను సంప్రదించారని సమాచారం. అయితే కథ నచ్చడంతో పాటు, హీరోహీరోయిన్లు ఇద్దరికీ సమప్రాధాన్యత ఉండటంతో సదరు సినిమాలో నటించేందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. (చదవండి: కరోనా లక్షణాలు కనిపించాయి.. జాగ్రత్త : అనసూయ) మరి ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాన్ని అనసూయ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.ఇదిలా వుంటే అనసూయ ఇప్పటికే ఆమె 'థాంక్యూ బ్రదర్' సినిమాలో నటిస్తోంది. అది కూడా గర్భిణిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. మరోవైపు మెగా డాటర్ నిహారికతో కలిసి ఓ వెబ్‌సిరీస్ కూడా చేస్తోంది. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ఆదివారం ఓ పోస్టు పెట్టి అభిమానులను ఆందోళనకు గురిచేసిన ఈ నటి దాని గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. (చదవండి: మహేశ్ చేతుల మీదుగా ‘థ్యాంక్ యు బ్రదర్’ మోషన్ పోస్టర్) -
వేదాంతం ఆరంభం
సునీల్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘వేదాంతం రాఘవయ్య’. సి. చంద్రమోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇదే బేనర్లో ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ ‘వేదాంతం రాఘవయ్య’కు కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. తొలి సీన్‌కి గోపీ ఆచంట కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కరుణాకరన్ క్లాప్ కొట్టి , గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట స్క్రిప్ట్‌ను దర్శకుడు సి. చంద్రమోహన్‌కు అందజేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: దాము నర్రావుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లైన్ ప్రొడ్యూసర్: కె.ఆర్.కె. రాజు. -
మళ్లీ మర్యాద రామన్న జోడీ
హీరోగా సునీల్ కెరీర్లో మంచి విజయం అందించిన చిత్రం ‘మర్యాద రామన్న’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో సునీల్, సలోని జంటగా నటించారు. ఈ సినిమా 2010లో విడుదలైంది. పదేళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ స్క్రీన్ మీద జంటగా కనిపించబోతోందట. సునీల్, సలోని హీరోహీరోయిన్లుగా దర్శకుడు వీఎన్ ఆదిత్య ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం చేయాలనుకుంటున్నారని తెలిసింది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. -
కలర్ ఫొటో రివ్యూ
టైటిల్: కలర్ ఫొటో నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, తదితరులు రచనా, దర్శకత్వం: సందీప్ రాజ్ సంగీతం: కాళ భైరవ బ్యానర్: అమృత ప్రొడక్షన్&లౌఖ్య ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని విడుదల: 23 అక్టోబర్ (ఆహా) దసరా పండగకు కళకళలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలవెలబోయాయి. నువ్వానేనా అంటూ పోటీలో దిగే పెద్ద సినిమాలు ఈసారి పత్తా లేకుండా పోయాయి. కానీ ఓ చిన్న సినిమా మాత్రం దసరా బరిలో నిలిచింది. పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లో హీరో స్నేహితుడిగా కమెడియన్‌గా నటించిన సుహాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమా కలర్ ఫొటో. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సందీప్‌రాజ్ తొలిసారిగా దర్శకుడి బాధ్యతలు ఎత్తుకున్నాడు. కానీ కథ మాత్రం సాయి రాజేష్ నీలం అందించారు. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో అక్టోబర్ 23న రిలీజైన ఈ చిత్రం వీక్షకుల మదిని క్లిక్మనిపించిందో లేదో చూసేద్దాం.... కథ 1997లో జరిగే కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ (సుహాస్) అనే కుర్రాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాళ్లు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మ(చాందినీ చౌదరి)ని తొలిచూపులోనే ప్రేమించేశాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మథనపడ్డాడు. కారణం.. నల్లగా ఉన్నాడని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరిముందు చితక్కొట్టడంతో దీపుకు పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామరాజు(సునీల్)కు ఈ ప్రేమాదోమా నచ్చదు. పైగా చెల్లెలిని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ల ప్రేమకు శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతడిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జయకృష్ణ, దీప్తి పెళ్లి చేసుకున్నారా? లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..! (పెంగ్విన్ మూవీ రివ్యూ) విశ్లేషణ ప్రేమ ఒక సముద్రం. దానిపై వచ్చిన సినిమాలు అలలవంటివి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకుని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షను ఆధారంగా చేసుకొని మాత్రం సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. దర్శకుడు సందీప్ రాజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యభరితమైన కథను ఎంచుకున్నారు. కామెడీ పండించే సుహాన్‌తో ఎమోషన్స్ పండించారు. కానీ ప్రేమకావ్యాన్ని రక్తికట్టించడంలో తడబడ్డారు. కథను సూటిగా సుత్తి లేకుండా చెప్పలేకపోయాడు. ఫస్టాఫ్ మొత్తం హీరో వన్‌సైడ్ లవ్, సెకండాఫ్‌లో ప్రేమ పట్టాలెక్కడం, ఓ రెండు పాటలేసుకోవడం, వీరి ప్రేమకు హీరో అన్నయ్య అడ్డు చెప్పడం, దాడి చేయడం మళ్లీ పాత వాసనలే కనిపిస్తాయి. అయితే అమ్మాయిలు అందంగా ఉన్న అబ్బాయిలను మాత్రమే ప్రేమిస్తారు అనే అపోహను ఈ సినిమా పోగొట్టే ప్రయత్నం చేసింది. కుల మత ప్రాంతాలే కాదు వర్ణం కూడా ప్రేమ సాగరానికి ఆనకట్ట వేయలేదనే సందేశాన్ని అందించారు. (నా కలర్‌ఫొటోకు విలన్ సునీల్) నటన సుహాస్ తొలిసారి హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవమున్న నటుడిగానే కనిపిస్తారు. దీప్తి పాత్రలో చాందినీ చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయారు. కానీ ప్రేక్షకుడికి మాత్రం అతడిని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. కీరవాణి తనయుడు కాళ భైరవ అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. (‘హిట్’ మూవీ రివ్యూ) ప్లస్ పాయింట్స్: సుహాస్ పరిపక్వత నటన కథ సంగీతం మైనస్ పాయింట్స్ కథను సాగదీయడం ప్రేమకథను మరింత లోతుగా, గాఢంగా చూపించలేకపోవడం చివరి మాట: ప్రేమకు కలర్ కూడా అడ్డు కాదన్న మంచి సందేశాన్ని అందించారు. అందుకని దీన్ని అందమైన అనకుండా రమ్యమైన ప్రేమకథ అనేద్దాం.. -
ఇదే టీమ్‌తో మరో సినిమా ఉంటుంది
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహించారు. తమన్నా వ్యాస్, జ్ఞాన ప్రియ కథానాయికలుగా నటించారు. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మించారు. విజయ్ రాజా పుట్టినరోజు (శుక్రవారం) సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను నటుడు సునీల్ విడుదల చేసి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ‘వేయి శుభములు కలుగు నీకు’ టీమ్‌తోనే మరో సినిమా త్వరలోనే స్టార్ట్ చేస్తాం’’ అన్నారు విజయ్ రాజా. ‘‘మా సినిమాకి మంచి టైటిల్ దొరికింది. నాకు మంచి నిర్మాత కుదిరారు’’ అన్నారు రామ్స్ రాథోడ్. ‘‘మా సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు తూము నరసింహ పటేల్. తమన్నా వ్యాస్, జ్ఞాన ప్రియ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యాని సింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
వేదాంతం రాఘవయ్య
హీరోగా పలు సినిమాలు చేశారు సునీల్. ఇటీవలే మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించారు. మరోసారి హీరోగా ఓ సినిమా కమిటయ్యారు. ‘వేదాంతం రాఘవయ్య’ అనే చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రాన్ని ఈ బ్యానరే నిర్మించింది. ఆ అనుబంధంతో ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు హరీష్. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా ప్రకటించలేదు. -
ఓ క్రిమినల్ కథ
మణికంఠ, సునీల్, పోసాని కృష్ణమురళి, అవి, భారత్, ఇంతియాజ్ ఉద్దీన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘క్రియేటివ్ క్రిమినల్’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో నర్సింగ్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి నర్సింగ్ గౌడ్ కెమెరా స్విచ్చా¯Œ చేయగా, సునీల్ క్లాప్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళి తొలి సన్నివేశానికి దర్శకత్వం చేశారు. ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ– ‘‘సస్పె¯Œ ్స క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. క్రిమినల్ నేపథ్యంలో ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని మొదట చిన్న బడ్జెట్ సినిమాగా చెయ్యాలి అనుకున్నా కథను బట్టి భారీగా నిర్మించబోతున్నాం’’ అన్నారు నర్సింగ్ గౌడ్. ‘‘ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అన్నారు సునీల్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలీమ్ మాలిక్, కెమెరా: గణేష్ రాజు. -
‘302’ గదిలో దయ్యం ఉంది
భవికా దేశాయ్ ప్రధాన పాత్రలోను, వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘302’. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఉపశీర్షిక. కార్తికేయ మిరియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ ఆవిష్కరించారు. ఆదివారం విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్సే వస్తోంది. అయితే సినిమాలో శృతిమించిన సన్నివేశాలున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ‘హలో.. రూమ్ నెంబర్. 302కి ఒక కండోమ్ ప్యాకెట్ కావాలి’ అన్న అమ్మాయి మాటలతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇక చివర్లో అదే అమ్మాయి దయ్యంగా మారినట్లు కనిపించడంతో టీజర్ ముగుస్తుంది. ఆమె ఎందుకు ఆ గదిలోకి వచ్చింది? నిజంగానే ఆమె చనిపోయిందా? చనిపోయాక దయ్యంగా మారిందా? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. క్రైమ్, సస్పెన్స్, కామెడీ అంశాలతో పాటు కాస్త హారర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ‘ఒకరోజులో అంటే.. 24 గంటల్లో జరిగే కథ’ అని తెలిపారు. ఈ సినిమాను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత అవినాష్ సుందరపల్లి వెల్లడించారు. ఈ చిత్రంలో వేణు టిల్లు, జబర్దస్త్ రాకేష్, నవీన్, దేవీచరణ్ తదితరులు నటించారు. (302 సినిమా టీజర్ లాంచ్ చేసిన సునీల్) -
ఒక రోజులో జరిగే కథ
భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో ‘వెన్నెల’ కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘302’. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఉపశీర్షిక. కార్తికేయ మిరియాల దర్శకత్వంలో డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు సునీల్ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘302’ ట్రైలర్ బావుంది.. సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు అవినాష్ సుందరపల్లి. కార్తికేయ మిరియాల మాట్లాడుతూ–‘‘క్రైమ్, సస్పె¯Œ ్స, కామెడీతో పాటు హారర్ అంశాలతో ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. ఒక రోజులో జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమీ, రామరాజు, సంగీతం: రఘురాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ రాజా, సహనిర్మాత: టి..వైకుంఠరావు. -
‘ఓ పిట్టకథ’ ఆడియో వేడుక
-
ఈసారి కొత్తగా: విలన్‌గా మారిన సునీల్
కమెడియన్‌గానే కాదు, హీరోగానూ పలు చిత్రాల్లో మెప్పించాడు సునీల్. ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ తలపెట్టని సునీల్‌ను పట్టుకుని విలన్ అంటున్నాడు ఓ దర్శకుడు. తన కలర్ ఫొటోకు సునీలే అసలైన విలన్ అని పేర్కొంటున్నాడు. మరేమీ లేదు, నేడు సునిల్ పుట్టినరోజు సందర్భంగా ‘కలర్ ఫోటో’ సినిమాలో సునీల్ లుక్‌ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనిపై సునీల్ మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటోలో రామరాజుగా కనిపిస్తున్నాను. నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే నా పాత్రలో వున్న కొత్తదనమే అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి పాత్రలతో నా ఫ్యాన్స్‌ను అలరిస్తాన’ని పేర్కొన్నారు. ('కలర్ ఫోటో'తో విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సునీల్) ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ లాంటి స్పూఫ్ కామెడీలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్.. లౌఖ్య ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కలర్ ఫొటో’. మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ప్రతిరోజు పండగ చిత్రాల్లో హస్య నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సుహాస్ తొలిసారి హీరో అవతారం ఎత్తాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సందీప్‌రాజ్ తొలిసారిగా దర్శకుడి బాధ్యతలు ఎత్తుకున్నాడు(కానీ కథ మాత్రం ఇతనిది కాదు). ‘మత్తు వదలరా’ చిత్రంతో విజయాన్ని అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి అబ్బాయి కాల భైరవ స్వరాలు సమకూర్చాడు.(దళపతితో రొమాన్స్ చేయనున్న పూజాహెగ్డే !) కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా అమరావతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. 1995 సంవత్సరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ప్రేమకథను సీరియస్‌గా తీయటానికి సాయి రాజేస్ నీలం, బెన్నీ ముప్పానేనిలు నడుం బిగించారు. బ్యానర్: అమృత ప్రొడక్షన్&లౌఖ్య ఎంటర్టైన్మెంట్, సమర్పణ: శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్, నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు, నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని (నార్త్‌లో సౌత్ నవ్వులు) -
కరీంనగర్ కార్పొరేషన్: తడబడ్డ కార్పొరేటర్లు...
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా 33వ డివిజన్ కార్పొరేటర్ యాదగిరి సునిల్‌రావును, డెప్యూటీ మేయర్‌గా 37వ డివిజన్ కార్పొరేటర్ చల్లా స్వరూపరాణిని ఎన్నుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో గెలిచిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ డెప్యూటీ మేయర్ ఎన్నికకు కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండురోజులక్రితం క్యాంపునకు వెళ్లిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు బుధవారం ఉదయమే కరీంనగర్ చేరుకుని శ్వేత హోటల్లో పార్టీ సమావేశం నిర్వహించారు. మేయర్ , డెప్యూటీ మేయర్ ఎన్నికపై అవగాహన కల్పించారు. ఉదయం 11 గంటల సమయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి తరలివచ్చారు. అనంతరం బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు సమావేశం మందిరానికి చేరుకున్నారు. కరీంనగర్ జేసీ శ్యాంప్రసాద్‌లాల్ తెలుగు అక్షరమాల ప్రకారం వరుస క్రమంలో కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం 11.55 గంటలకు ముగిసింది. అనంతరం జేసీ 12.30 గంటలకు మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికను ప్రకటించారు. బీజేపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్, ఇటీవల పార్టీలో చేరిన ఇండిపెండెంట్లు, ఏఐఎఫ్బీ, ఎంఐఎం కార్పొరేటర్లు హాల్లో ఉండిపోయారు. ఏకగ్రీవ ఎన్నిక... కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ 12.30 గంటలకు ఎన్నిక ప్రారంభించారు. ఎన్నికకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాశాఖ మంత్రి గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. మేయర్ ఎన్నికకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు 33 మంది, ఇండింపెండెట్లు, ఏఐఎఫ్బీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఏడుగురు, ఆరుగురు ఎంఐఎం కార్పొరేటర్లతో కలిపి 46 మందితోపాటు ఇద్దరు ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయి హాజరు కావడంతో సంఖ్య 48కు చేరింది. కోరం సరిపోవడంతో మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్ స్థానానికి యాదగిరి సునిల్‌రావును 3వ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ప్రతిపాదించగా 23వ డివిజన్ కార్పొరేటర్ ఆర్ష కిరణ్మయి బలపరిచారు. టీఆర్ఎస్ అధిష్టానం సునిల్రావుకు బీ–ఫాం ఇవ్వడంతోపాటు విప్ జారీ చేసింది. ఎవరూ కూడా పోటీలో లేకపోవడంతో సునిల్‌రావును మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకైనట్లు జేసీ శ్యాంప్రసాద్‌లాల్ ప్రకటించారు. అనంతరం డెప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపరాణిని 9వ డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్‌యాదవ్ ప్రతిపాదించగా,18వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవం అయినట్లు జేసీ ప్రకటించారు. అనంతరం మేయర్, డెప్యూటీ మేయర్లను జేసీ, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా అభినందించారు. నీతివంతమైన పాలన అందించాలి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లు, ప్రజలు ఎంతో నమ్మకంతో టీఆర్ఎస్కు పట్టంకట్టారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మేయర్, డెప్యూటీ మేయర్‌కు మంత్రి సూచించారు. నీతివంతమైన పాలన అందించాలని కోరారు. మేయర్, డెప్యూటీ మేయర్, 60 మంది కార్పొరేటర్ల వేర్వేరుకాదని అంతా ఒకటేనని సమన్వయంతో కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఇంటింటింకీ మంచినీటిని అందించడానికి చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలిపారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు కార్పొరేటర్లు తడబడ్డారు. ఆకుల పద్మ, కొలిపాక అంజయ్య ఇబ్బందిపడ్డారు. మూడుసార్లు ప్రమాణస్వీకారం చేసిన ఎడ్ల సరిత కూడా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రమాణపత్రం చదువుతూ తడబడ్డారు. ఐదుసార్లు గెలిచిన నేతికుంట యాదయ్య, జయలక్ష్మి, రాపర్తి విజయ కూడా తడబడుతూ ప్రమాణపత్రాన్ని చదివారు. 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జై భారత్‌మాతా అంటూ, 49వ డివిజన్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ప్రజలు ఎంతో నమ్మకంతో పట్టం కట్టారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మేయర్ సునిల్‌రావు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని మేయర్‌గా తన ఎన్నికకు కృషి చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, సహకరించిన కార్పొరేటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ : ప్రథమ పౌరుడి ఎంపికలో టీఆర్ఎస్ అధిష్టానం సీనియారిటీకే ప్రాధాన్యత ఇచ్చింది. కరీంనగర్ మేయర్‌గా యాదగిరి సునీల్‌రావును పార్టీ నిర్ణయించింది. కౌన్సిలర్, కార్పొరేటర్‌గా నాలుగుసార్లు ఎన్నికైన 33వ వార్డు కార్పొరేటర్ సునీల్రావుకే ప్రథమ పౌరుడి హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మేయర్ స్థానం కోసం పోటీ పడ్డ 56వ వార్డు కార్పొరేటర్ వంగపెల్లి రాజేందర్రావును అధిష్టానం బుజ్జగించింది. హైదరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం సాయంత్రం సునీల్‌రావు, రాజేందర్రావులతో సమావేశమై సీఎం కేసీఆర్ మేయర్‌గా సునీల్‌రావును ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడించారు. రాజేందర్రావుకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పించే హామీ ఇచ్చినట్లు చెప్పారని సమాచారం. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజేందర్రావుతో ఫోన్లో మాట్లాడారు -
అందుకే ఆస్పత్రిలో చేరా: సునీల్
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ వార్తలపై స్పందించిన సునీల్... తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. కాగా... సునీల్ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హిట్టు కొట్టారు. తొలుత హీరోగా మంచి విజయాల్ని అందుకున్న సునీల్.. తరువాత ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. దీంతో పంథా మార్చుకుని.. మళ్లీ హాస్య నటుడిగా అవతారమెత్తారు. కాగా హీరోగా, కమెడియన్‌గా ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ప్రతినాయకుడిగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. 'కలర్ ఫోటో' అనే సినిమాలో సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. -
కష్టాన్నంతా మరచిపోయాం – తమన్
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లు కథానాయికలుగా నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘కాలం ఆగాలి నా కాలి వేగం చూసి .. లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి.. రమ్ పమ్ బమ్’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బప్పి లహరి, రవితేజ ఈ పాటను పాడారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. చిత్రదర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘సినిమాలో రవితేజగారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం తమన్ సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చారు. ‘రమ్ పమ్ బమ్’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ‘డిస్కోరాజా’ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఆల్రెడీ విడుదలైన ‘ఢిల్లీవాలా...’, ‘నువ్వు నాతో...’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ‘రమ్ పమ్ బమ్’ పాటను చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం. ఇప్పుడు ఈ పాటను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తోన్న తీరు మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘రవితేజగారితో నేను కొంత గ్యాప్ తర్వాత చేసిన చిత్రం ఇది. మా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవి్వస్తాయి. డైరెక్టర్ ఆనంద్‌గారు ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తీశారు. ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంది’’ అన్నారు సునీల్. ‘‘రవితేజగారితో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ ‘రమ్ పమ్ బమ్’ పాటలో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి’’ అన్నారు హీరోయిన్ నభా నటేష్. -
'కలర్ ఫోటో'తో విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సునీల్
హాస్య నటుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సునీల్ ఆ మధ్య హీరోగా మారారు. ఇటీవలి కాలంలో మరి కొంచెం ఎక్కువగా.. కమెడియన్లు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం తరుచూ కనిపిస్తోంది. సునీల్ విషయానికొస్తే.. హీరోగా మంచి విజయాల్ని అందుకున్నా తర్వాతి కాలంలో సినిమాలు అనుకున్న రీతిలో విజయవంతం కాకపోవడంతో మళ్లీ హాస్య నటుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన ఈసారి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్ళు హాస్యనటుడిగా, కథానాయకుడిగా అలరించిన ఆయన ఇప్పుడు విలన్‌గా కొత్త అవతారం ఎత్తనున్నారు. చదవండి: 'ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి' చదవండి: (సిద్ధార్థ్ రాజకీయ ఎంట్రీపై సస్పెన్ష్ వీడినట్టే..!) విజేత, పేపర్ బాయ్, మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కమెడియన్ సుహాస్ హీరోగా, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో 'కలర్ ఫోటో' అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో దర్శకుడిగా సందీప్ రాజ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ప్రేమకథలో సునీల్ విలన్ పాత్రలో కనిపిస్తారని చిత్ర యూనిట్ ప్రకటించింది. కొబ్బరిమట్ట నిర్మించిన సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే నాని తన సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేశారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. Very happy to announce this charming film #ColourPhoto . With this extremely talented gang working on it am so looking forward to this one . I know the boys will rock already 😊@MasalaSundeep @ActorSuhas @kaalabhairava7 @iChandiniC @Mee_Sunil @sairazesh, @benny_muppaneni pic.twitter.com/lqEDXHHUpa — Nani (@NameisNani) December 29, 2019 -
కేఏ పాల్ బయోపిక్.. హీరోగా కామెడీ స్టార్!
ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. అద్భుత విజయాలు సాధించిన ఎంతో మంది జీవితాలతో పాటు విచిత్ర వ్యక్తితాలు వింత ప్రవర్తనలు కలిగిన వ్యక్తుల కథలను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరికీ నవ్వులు పంచిన కేఏ పాల్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుందట. ఓ కొత్త దర్శకుడు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పాల్ పాత్రలో హాస్య నటుడు సునీల్‌ను నటింపచేయాలని ప్రయత్నిస్తున్నారట. అయితే ఈ విషయంపై సునీల్ గానీ, ఇతర యూనిట్ సభ్యులు గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
సూపర్ హిట్ రీమేక్‌లో సునీల్!
ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో రీమేక్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్ సూపర్‌హిట్ చేరనుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా హిందీలో ఘనవిజయం సాధించిన సినిమా అంధాధున్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రీమేక్‌లో.. హీరోగా మారి సక్సెస్ కాలేక తిరిగి కమెడియన్‌గా నటిస్తున్న సునీల్ లీడ్ రోల్లో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. హిందీలో హీరోది అంధుడి పాత్ర, మరి సునీల్ ఆ పాత్రకు ఎంత వరకు సూట్ అవుతాడు అన్నది చూడాలి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తమిళ రీమేక్‌లో నటించేందుకు ధనుష్, సిద్ధార్థ్ లాంటి హీరోలు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
నార్త్‌లో సౌత్ నవ్వులు
బ్రహ్మానందం, సునీల్ తెలుగు ప్రేక్షకులను కొన్నేళ్లుగా నవ్విస్తున్నారు. ఈ ఇద్దరూ సీన్లో ఉంటే పంచ్‌లు, సెటైర్లు పేలుతూనే ఉంటాయి. లేటెస్ట్గా వీళ్లిద్దరూ బాలీవుడ్ ఆడియన్స్‌నూ నవ్వించడానికి ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతున్నారని తెలిసింది. సన్నీ లియోన్, మందాన కరిమి ముఖ్య పాత్రల్లో ప్రసాద్ తాటికేని దర్శకత్వంలో ఓ హారర్–కామెడీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మహేంద్ర దరివాల్, పరమదీప్ సాందు నిర్మాతలు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో బ్రహ్మానందం, సునీల్ నటిస్తే బావుంటుందని భావించిన చిత్రబృందం వీళ్లను ఎంపిక చేసిందట. వచ్చే నెలలో బ్రహ్మానందం షూట్లో జాయిన్ కాబోతున్నారు. సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తిచేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. సో.. వీరిద్దరూ నార్త్ ఆడియన్స్‌నూ నవ్వుల్లో ముంచేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. -
పదికాలాల పాటు నిలిచిపోయేలా...
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ముఖ్యతారలుగా వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన’. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సాయి అరుణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను నటుడు సునీల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘పదికాలాల పాటు నిలిచిపోయేలా మంచి సినిమాలు తీయాలనే శివ మహాతేజ ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించాం. ఇందులో తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా ‘జై సేన’. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందు లోనూ ఉన్నాయి. సహ నిర్మాత శిరీష్ రెడ్డిగారు అన్ని విషయాల్లో నాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. జూలైలో సినిమా విడుదల చేయాలనుకుంటు న్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు కథే సూపర్‌స్టార్. నేను పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మారకుండా అలాగే ఉన్న వ్యక్తుల్లో సముద్ర ఒకరు’’ అన్నారు సునీల్. ‘‘సముద్రతోనే నా జర్నీ స్టార్ట్ అయింది’’ అన్నారు సంగీత దర్శకుడు రవిశంకర్. శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్, శిరీష్ రెడ్డి, గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సహ నిర్మాతలు: పి.శిరీష్ రెడ్డి, దేవినేని శ్రీనివాస్. -
రైతుని కాపాడండి
‘‘సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత వంటి పలు హిట్ చిత్రాలు తీసిన వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన... ది పవర్ అఫ్ యూత్’. శ్రీకాంత్, సునీల్, శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్‌లు హీరోలుగా పరిచయమవుతున్నారు. శివ మహాతేజ ఫిలిమ్స్‌పై సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. సముద్ర మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక అయిన రైతుని కాపాడండి అంటూ ప్రభుత్వంతో, రాజకీయ నాయకులతో విద్యార్థులు చేసే యుద్ధమే ఈ సినిమా. మంచి సందేశం ఉన్న ఈ చిత్రం నాకు మరో హిట్ అవుతుంది. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: వాసు, మ్యూజిక్: ఎస్ఆర్ రవిశంకర్, సహ నిర్మాతలు: శిరీష్ రెడ్డి, శ్రీనివాస్. -
రజతాలు నెగ్గిన గుర్ప్రీత్, సునీల్
జియాన్ (చైనా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల పతకాల వేట కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు) రజత పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్లో గుర్ప్రీత్ 0–8తో హైనోవూ కిమ్ (కొరియా) చేతిలో... సునీల్ 0–2తో హుస్సేన్ అహ్మద్ నూరీ (ఇరాన్) చేతిలో ఓడిపోయారు. అంతకుముందు సెమీఫైనల్స్‌లో గుర్ప్రీత్ 6–5తో షదుకయెవ్ (కజకిస్తాన్)పై, అజామత్ (కజకిస్తాన్)పై సునీల్ గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్స్‌లో గుర్ప్రీత్ 10–0తో షరీఫ్ బాదర్ (ఖతర్)పై, సునీల్ 14–7తో ఒఖోనోవ్ (తజికిస్తాన్)పై నెగ్గారు. మరోవైపు 130 కేజీల విభాగం కాంస్య పతక పోరులో ప్రేమ్ కుమార్ 0–5తో దామిర్ కుజుమ్బయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 55 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మంజీత్ 3–5తో సులైమనోవ్ (కిర్గిస్తాన్) చేతిలో... 63 కేజీల క్వార్టర్ ఫైనల్లో విక్రమ్ 0–8తో జిన్వూంగ్ జంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
చిరు చాన్సిచ్చాడు..!
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ తరువాత హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఒకటి రెండు సినిమాలు పరవాలేదనిపించినా తరువాత హీరోగా కెరీర్ ముందుకు సాగలేదు. దీంతో తిరిగి కమెడియన్ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవల అరవింద సమేత, చిత్రలహరి లాంటి సినిమాలతో హాస్యనటుడిగా తిరిగి ఫాంలోకి వచ్చాడు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో సునీల్‌కు చాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లోనే సునీల్‌కు చాన్స్ ఇచ్చాడు చిరు. కానీ అప్పట్లో సునీల్ హీరోగా బిజీగా ఉండటంతో ఆ సినిమాలో నటించలేకపోయాడు. అందుకే కొరటాల శివ సినిమాలో ఆఫర్ రాగానే వెంటనే ఒప్పేసుకున్నాడట. దీంతో పాటు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ సునీల్ నటించనున్నాడు. -
వాళ్లలా నొప్పించి సంపాదించడం లేదు
‘‘గెలుపు, ఓటమి అనేది దేవుడు సృష్టించింది కాదు. మనం పెట్టుకున్న గేమ్ అది. ఇందులో ఫస్ట్ వస్తే సక్సెస్. అది త్వరగా సాధిస్తే సక్సెస్. ఇలా అన్నీ మనం ఆడుకుంటున్న ఆటలు. ఇలా ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్లు పరిగెడుతున్నాం. గెలిచిన వాడిని అభినందించకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినవాడిని తక్కువ చేయడానికి ప్రయత్నించకుండా ఉండాలి’’ అని సునీల్ అన్నారు. సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియ దర్శన్, నివేథా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో కమెడియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించిన సునీల్ పంచుకున్న విశేషాలు... ► మనోజ్, విష్ణులతో సినిమాలు చేసే సమయం నుంచి తేజు నాకు తెలుసు. మాతో చాలా బాగా కలసిపోయేవాడు. అప్పట్లో తేజుని హీరోగా పెట్టి నేను ఓ సినిమా దర్శకత్వం చేద్దామనుకున్నాను. ఇప్పటికి కలసి యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. ► నా గ్లాస్‌మేట్స్ చాలా మంది ఉన్నారు. చెబితే లిస్ట్ సరిపోదు. ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో త్రివిక్రమ్ ఒకరు. ఆనందం అయినా, బాధ అయినా తనతో పంచుకోవాలనుకుంటాను. కష్టం దాటగలిగే కాన్ఫిడెన్స్ మాలో నింపేవాడు త్రివిక్రమ్. ► ఇప్పుడు టెక్నాలజీని(ఫేస్బుక్, ట్వీటర్) ఉపయోగాల కంటే అనవసరమైన వాటికే వాడుతున్నాం. ఇటీవల ఏదో యూట్యూబ్ వీడియోలో నేను చనిపోయాను అని ఓ వీడియో పోస్ట్ చేసేశారు. అంటే వ్యూస్ కోసం వేరే వాళ్లను హర్ట్ చేసేస్తారా? లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్లు సారీ చెప్పేశారు. వాళ్లను మళ్లీ ఇబ్బంది పెడితే నాకేం వస్తుంది? అని వదిలేశాను. వాళ్లలా ఎదుటి వ్యక్తిని నొప్పించి నేను సంపాదించడం లేదు. అందర్నీ నవ్వించి సంపాదిస్తున్నాను. ► సోషల్ మీడియా రావడం వల్ల ప్రతిదీ వార్త అయిపోయింది. ఆ వార్త చదువుతూ మీ టైమ్‌ను వేస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇంకో మంచి ఆలోచన చేయొచ్చు కదా? ► కమెడియన్ నుంచి హీరోగా మారినప్పుడు యాక్షన్ కామెడీ చేద్దాం అనుకున్నాను. హాలీవుడ్ సినిమాల్లో హీరో పక్కన ఉండే క్యారెక్టర్లు కూడా ఫిట్‌గా సిక్స్ ప్యాక్స్తోనే కనిపిస్తారు. యాక్షన్ కామెడీ హీరోగా చేయాలని సిన్సియర్‌గా ట్రై చేశా. హీరోగా సినిమాలు చేస్తున్నానని కామెడీ పాత్రలు చేయమని అడగడం తగ్గించారు దర్శక–నిర్మాతలు. హీరోగా నాకు నచ్చినవి కొన్ని ఉంటే నిర్మాతల వల్ల ఒప్పుకున్న సినిమాలు మరికొన్ని. అప్పుడు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా నాతో చాలా మంది నిలబడ్డారు. నాకు ఇండస్ట్రీలో ఎవరితో గొడవలు లేవు. అందరితో బావుంటాను. నా అదృష్టం అదే. ► మన సినిమాలు ఎక్కువ శాతం హాలీవుడ్ కాపీయే. మనవి వాళ్ల దగ్గరకు వెళ్లడం ఉండదు. ► హీరోగా కాకుండా కమెడియన్‌గా కొనసాగాలనుకుంటున్నాను. అప్పుడు నెలకు 2సార్లు తప్పకుండా ప్రేక్షకులను పలకరించవచ్చు. హీరోగా సంపాదిస్తున్న దానికంటే తక్కువ వస్తుంది కదా? అని మీరు అడిగితే ఒకేసారి పది రూపాయిలు తీసుకున్నా, పదిసార్లు రూపాయి తీసుకున్నా అంతే కదా అంటాను. ► కామెడీ సినిమాలకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. మనం కథ రాయకుండా కామెడీ సినిమాలు లేవు అనడం కరెక్ట్ కాదు. ‘మొన్న’ ఎఫ్ 2’ సక్సెసే ఇందుకు నిదర్శనం. ► ప్రస్తుతం అల్లు అర్జున్– త్రివిక్రమ్, రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో చేస్తున్నాను. నా అభిమాన హీరోతో ఓ పెద్ద సినిమాలో చేస్తున్నాను (చిరంజీవి–కొరటాల శివ సినిమాను ఉద్దేశిస్తూ). -
‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ వేడుక
-
దేశాన్ని గెలిపించాడు.. జీవితంలో భంగపడ్డాడు
గుంటూరు: పేద కుటుంబంలో జన్మించాడు.. క్రీడలపై మక్కువతో త్రోబాల్‌పై ప్రత్యేక దృష్టి సారించాడు. ప్రతిభ కనబరచడంతో 2012లో ఇండియా త్రోబాల్ టీమ్ సభ్యునిగా ఎంపికయ్యాడు. దేశం తరఫున పాల్గొన్న ప్రతి పోటీలోనూ విశేషంగా రాణించాడు. వరుసగా ఏడు బంగారు పతకాలు సాధించాడు. తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, ప్రభుత్వం తరఫున సాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరకు దళితులకు క్రీడలు ఎందుకంటూ అవమానపరచినా పట్టువదలకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ సీఎం చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేశాడు. అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో ఆత్మహత్యకు యత్నించాడు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల కేంద్రానికి చెందిన సునీల్ ఇండియా త్రోబాల్ టీంకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పేదరికంతో ఇబ్బందులకు గురవుతున్న సునీల్ తనకు ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ తెనాలి ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను కొద్ది నెలల క్రితం కలిసి విజ్ఞప్తి చేశాడు. కనీసం సీఎంని కలిసే అవకాశమైనా ఇప్పించాల్సిందిగా అభ్యర్థించాడు. దళితులకు డబ్బు లేనప్పుడు క్రీడలు ఎందుకంటూ ఆలపాటి అవమానకరంగా మాట్లాడారు. ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఖాళీగా ఉందని గుర్తించి దానికోసం పదిసార్లకు పైగా మంత్రి నక్కాను కలిసి వినతిపత్రమిచ్చాడు. ఆయన కూడా అవమానకరంగా మాట్లాడారు. మనోవేదనకు గురైన సునీల్ శుక్రవారం రాత్రి తన ఫేస్బుక్ ఖాతాలో 80 నిమిషాల నిడివి కలిగిన వీడియోను పెట్టాడు.అందులో చివరగా తాను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. బంధుమిత్రులు సునీల్‌ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ సునీల్‌ను కలిసింది. దళితులంటే చులకనగా చూశారు! సహాయం కోరగా దళితుడిననే కారణంతో టీడీపీ నేతలు తనను చులకనగా చూశారని సునీల్ చెప్పాడు. ఆలపాటి తన సొంత ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు రాడని ఆరోపించాడు. నక్కా ఆనందబాబును తాను సంప్రదించినా స్పందించలేదన్నాడు. దళితులంటే టీడీపీ ప్రజాప్రతినిధులకు తీవ్ర చులకన భావమన్నాడు. సునీల్ గుంటూరులోని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసి వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నాడు. -
‘చిత్రలహరి’ టీజర్ రిలీజ్
-
‘ఆయన కారణంగా చంద్రబాబు గెలిచారు’
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ ధియోధర్ విమర్శలు గుప్పించారు. 2014 లో మోదీ మానియాతోనే టీడీపీ గెలిచిందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగు చెందారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరభావం తప్పదని హెచ్చరించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఆంద్రుల ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపిస్తే.. చంద్రబాబు దానిని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు. 2014 ఎన్నికల సందర్భంగా రాహుల్ సోనియాలు ఆంద్ర ద్రోహులుగా అభివర్ణించిన బాబు ..నేడు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను మోదీపై వేస్తున్నారు. ఆంద్రుల అసలైన ద్రోహి మోదీ కాదు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తున్నాం’ అని ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6న ఏపీలో పర్యటించనున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను చూస్తుంటే చంద్రబాబుకు నిద్రపట్టడంలేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామని వెల్లడించారు. దొంగల ముఠాలు.. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో దొంగల ముఠాలను ఏర్పాటు చేశారని సునీల్ ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ర్టాన్ని నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా మంచి నిటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందిచండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు దండుకోవడానికి బోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. -
మరో సినీ వారసుడు పరిచయం..
సినిమా: కోలీవుడ్‌కు మరో సినీ వారసుడు పరిచయం అవతున్నారు. నటుడు వైభవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ తెలుగు దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడైన వైభవ్ కోలీవుడ్‌లో యువ హీరోగా తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన అన్నయ్య సునిల్ నటుడిగా పరిచయం అవుతుండడం అదీ విలన్‌గా రంగప్రవేశం చేయడం విశేషం. నటుడు విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం సీతకాది. «బాలాజి ధరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సీతకాది డిసెంబర్ 20న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రముఖ నటీనటులను పరిచయం చేసే కార్యక్రమానికి చిత్ర వర్గాలు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చిత్ర విలన్ గురించిన వివరాలను దర్శకుడు తెలుపుతూ వినోదంతో పాటు, భావోద్రేకాలతో కూడిన ఈ చిత్ర హీరో విజయ్‌సేతుపతి గురించి ఇప్పటికే పలు విషయాలను తెలియజేశామన్నారు. ఆయన ఇందులో పలుగెటప్ల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నారని చెప్పారు. మరో ముఖ్యపాత్ర విలన్ అని. ఈ పాత్రకు ఇప్పటి వరకూ పరిచయం కాని నటుడి నటన కొత్తగా ఉంటుందన్నారు. నటుడు వైభవ్ అన్నయ్య సునిల్‌ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయన పాత్ర చాలా వినూత్నంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ పాత్రకు నటుడిని ఎంపిక చేయడం సవాల్‌గా మారిందన్నారు. చిత్ర కథకు కథనాన్ని తయారు చేసుకున్నప్పుడే మామూలుగా ఉండరాదని విభిన్నంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇందులో నటించడానికి చాలా మంది ప్రముఖ నటులను సంప్రదించామని, వారికి పాత్ర నచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా నటించలేకపోయారని అన్నారు. అలా ఒక పుట్టినరోజు వేడుకలో సునీల్‌ను చూసి తన చిత్రానికి విలన్ తనేనని నిర్ణయించుకున్నానన్నారు. ఆయన నటించడానికి ముందు సంకోచించినా, చివరికి అంగీకరించినట్లు తెలిపారు. అందుకు సునీల్ చాలా శిక్షణ తీసుకున్నాడని చెప్పారు. ఇందులో హీరో విజయ్‌సేతపతి పాత్రకు తగ్గని విధంగా విలన్ పాత్రకు మంచి పేరు వస్తుందని దర్శకుడు బాలాజి ధరణీధరన్ అన్నారు. -
ఫ్యాషన్ హొయలు
-
‘అరవింద సమేత వీర రాఘవ’ సక్సెస్ మీట్