Sunil Starrer 'Bhuvana Vijayam' Release Date Out - Sakshi
Sakshi News home page

సునీల్‌ 'భువన విజయమ్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Sat, Apr 29 2023 3:00 PM | Last Updated on Sat, Apr 29 2023 4:12 PM

Bhuvana Vijayam Release Date Out - Sakshi

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘భువన విజయమ్‌’. ఈ చిత్రంతో యలమంద చరణ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ బర్త్ అఫ్  ‘భువన విజయమ్’ సినిమా పై ఆసక్తిని పెంచాయి.

(చదవండి: బాక్సాఫీస్‌ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్‌ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..)

తాజాగా మేకర్స్ విడుదల తేదిని అనౌన్స్ చేశారు. మే12న ‘భువన విజయమ్’  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement