bhuvana vijayam
-
Bhuvana Vijayam: ఓడి గెలిచినవాడి కథ ‘భువన విజయమ్’
‘‘ప్రతి మనిషి గెలుపు కోసమే పరిగెడతాడు. అయితే మా ‘భువన విజయమ్’ ఓడి గెలిచినవాడి కథ. గెలిచినవాళ్లు ఓడిపోయినవాళ్లని గెలిపించిన కథ. కామెడీ, ఫ్యాంటసీ, థ్రిల్.. ఇలా అన్నీ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు యలమంద చరణ్. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భువన విజయమ్’. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎక్కడంటే? ) కిరణ్, వీఎస్కే నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు ధనరాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకుడి పాత్ర చేశాను. ఈ చిత్రంలోని పాత్రలని నేను ఎలా చూస్తానో ఆడియన్స్ కూడా అలానే చూస్తారని డైరెక్టర్ చెప్పడం సవాల్‌గా అనిపించింది’’ అన్నారు. ‘‘యూనిట్ సహకారంతో అనుకున్న టైమ్‌కి పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్, వీఎస్కే. ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మి, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: సాయి. -
సునీల్ 'భువన విజయమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘భువన విజయమ్’. ఈ చిత్రంతో యలమంద చరణ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ సినిమా పై ఆసక్తిని పెంచాయి. (చదవండి: బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..) తాజాగా మేకర్స్ విడుదల తేదిని అనౌన్స్ చేశారు. మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
Birth Of Bhuvana Vijayam: ఫోస్టర్ చూస్తే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కి పోవాలి
సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భువన విజయమ్’. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్; టైటిల్ పడటం ఆసక్తికరంగా ఉంది. ఇక చివర్లో ‘నా ఫోస్టర్ చూస్తే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కి పోవాలి’అని సునీల్ అంటుంటే.. వెన్నెల కిశోర్ స్కెచ్‌తో సునీల్ పోస్టర్ని మార్చడం నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఆసక్తిని పెంచుతున్న సునీల్ కొత్త సినిమా టీజర్
కొన్ని సినిమాలు టైటిల్‌తోనే ఆసక్తిని పెంచేస్తాయి. అలాంటివాటిలో సునీల్ నటిస్తున్న తాజా చిత్రం ‘భువన విజయమ్’ ఒకటి. శ్రీకృష్ణ దేవరాయులు ఆస్థానానికి ‘భువన విజయమ్’ అని పేరు. ఇప్పుడు అదే టైటిల్ తో సునీల్ సినిమా రావడం క్యురియాసిటీని పెంచింది. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ మారుతిని విడుదల చేశారు. టైటిల్ లానే టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ‘ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు.. ఒక ప్రొడ్యూసర్.. తనకి జాతకాల పిచ్చి.. ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. అనుకోకుండా రైటర్ గా మారిన ఓ దొంగ.. సచ్చికూడా ఇంకా మనసుల మధ్య తిరుగుతున్న ఓ ఆత్మ.. పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు, నాలుగు గోడల మధ్య.. మూడు గంటల కాలంలో ఇద్దరు చావాలి, ఒక కథ తేలాలి’అంటూ ఆసక్తిని రేపే వాయిస్ ఓవర్ తో టీజర్ కట్ చేశారు. టీజర్ చాలా ఎంగేజింగ్ ఉంది. కామెడీ, సస్పెన్స్, థ్రిల్, డ్రామా అన్ని ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ తమదైన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సీరియస్ లుక్‌లో కమెడియన్స్.. భువన విజయమ్ ఫస్ట్ లుక్
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ డ్రామా భువన విజయమ్. యలమంద చరణ్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ వేణు ఉడుగుల లాంచ్ చేశారు. వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్‌లో కనిపించారు. శ్రీమతి లక్ష్మీ సమర్పిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. -
గోదారి తీరాన అష్టదిగ్గజ కవనలహరి
అలరించిన భువన విజయం రాజమహేంద్రవరం కల్చరల్ : సురలోకంలో ఉన్న సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు మదిలో చిన్న కోరిక ఉదయించింది. నన్నపార్యుడు నడయాడిన గౌతమీతీరాన అష్టదిగ్గజాలతో భువన విజయ సభ నిర్వహించాని భావించాడు. సురరాజు అనుమతితో ఆదివారం రాత్రి పావన గోదావరీతీరాన ఉన్న కోళ్ళ వీరాస్వామి కల్యాణమండపంలో కొలువు తీరాడు. కవిరాజుల ఆనందం మిన్నుముట్టింది. కళాగౌతమి వారికి ఆతిథ్యమిచ్చింది. శ్రీకృష్ణదేవరాయల పరాక్రమపాటవాన్ని, కవితాభినివేశాన్ని, దానగుణాలను కవులు పద్యరూపంలో ప్రస్తుతించారు. ‘భూపాలాగ్రణీ! సత్యసంధా!..సాహిత్యగోష్ఠీ పాండిత్య ధురీణ! దానవిద్యాపారీణ’ అని అయ్యలరాజు రామభద్రుడు కొనియాడాడు. రాయలు అర్థి బృందానికి ‘ధనం’, ప్రత్యర్థి బృందానికి ‘నిధనం’(మరణం) కలగచేస్తాడని పింగళి సూరన వర్ణించాడు. ‘కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చె¯ŒS’ పద్యపూరణంతో రామకృష్ణుడు ఆలస్యంగా సభలోకి ప్రవేశిస్తాడు. భువనవిజయ కార్యక్రమంలో అల్లసాని పెద్దనగా కందుకూరి లక్షీ్మనరసింహశాస్త్రి, నంది తిమ్మనగా ఓలేటి బంగారేశ్వర శర్మ, భట్టుమూర్తిగా శిష్టుమధుసూదనరావు, పింగళి సూరనగా పూజ్యం షిరిడీ సాయి, మాదయగారి మల్లనగా మల్లాది శ్రీరామ్, అయ్యలరాజు రామభద్రకవిగా తాతా సందీప్, ధూర్జటిగా రాంభొట్ల పార్వతీశ్వర శర్మ, తెనాలి రామకృష్ణునిగా చేమకూరి సూర్యనారాయణ శర్మ, శ్రీకృష్ణదేవరాయలుగా కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి పరకాయప్రవేశం చేశారు. నూతన భవనం సాహితీవేదికల కొరత తీరుస్తుంది: గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో ఎంపీ నిధులతో నిర్మాణంలో ఉన్న నూతన భవనం సాహితీకార్యక్రమాలు జరుపుకునే సంస్థలకు ఉపయోగిస్తుందని ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. భువన విజయం ప్రారంభౠనికి ముందు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మాతృభాషలో పట్టు లేకపోతే అన్యభాషలలో పట్టు రాదన్నారు. కళాగౌతమి ప్రతినిధులు ఫణి నాగేశ్వరరావు, వరాహగిరి కృష్ణమోహన్, శుభోదయమ్ ఇ¯ŒSఫ్రా అధినేత కె.లక్షీ్మప్రసాద్, సాహిత్యాభిమానులు హాజరయ్యారు. -
థార్మిక భావనల సంకలనం రామాభ్యుదయం
ఆచార సంప్రదాయాలకు పెద్ద పీట సంస్కృతాంధ్రపండితుడు కందుకూరి ముగిసిన భువన విజయం సాహితీ ప్రసంగాలు రాజమహేంద్రవరం కల్చరల్ : అయ్యలరాజు రామభద్రుడు రాసిన ‘రామాభ్యుద యం’ లోకానికి థార్మిక భావనలు అందించిన మహాకావ్యమని సంస్కృతాంధ్రపండితుడు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ తెలిపారు. తెలుగు భాషలో లెక్కలేనన్ని రామాయణాలు వచ్చినప్పటికీ వీటిలో ప్రామాణికంగా చెప్పుకోదగ్గది విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షమొక్కటేనని చెప్పారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన భువన విజయం సాహితీ ప్రసంగాల ముగింపు సభలో ‘రామాభ్యుదయము–వత్సలత’ అంశంపై ఆయన ప్రసంగించారు. రా మాయణం కరుణ రస ప్రధానమైన కావ్యమన్నారు. మొల్ల రామాయణం, అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయము శృంగార రస ప్రధానమైనవన్నారు. ఆదర్శవంత మైన పరిపాలనను అందించిన ఏకైక చక్రవర్తి శ్రీరామచంద్రు డు, ఆయనలో కించిత్తు దోషం లేదు, రామాయణాన్ని అర్థం చేసుకోకపోతే అది మనలోని లోపమేనని ఆయన తెలిపారు. కావ్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి ఆడపెళ్లివారు తక్కువ, మగ పెళ్లివారు ఎక్కువ అనే భావన తప్పని రామాయణం చదివినవారికి అర్థమవుతుందని చెప్పారు. బాలకాండలో దశరథుడు జనకునితో ‘కన్యాదానం స్వీకరించే నా చేయి కిందనే, కన్యాదానం చేసే మీ చేయిపైనే’ అంటాడని తెలిపారు. ఏదైనా కావ్యం చదివితే చాలదు, కవి లోతయిన భావ బలాన్ని మనం అందుకోగలగాలని సూచించారు. సాహిత్యాన్ని గురించి ఆలోచనలు చేస్తుంటే, లోతయిన అర్థాలు గోచరిస్తాయన్నారు. వసుచరిత్ర, మనుచర్రితల్లో తెలుగువారి సంప్రదాయాలను అం తగా ఆయా కవులు వివరించలేదు, కానీ రామాభ్యుదయం లో తెలుగువారి ఆచార సంప్రదాయాలను అయ్యలరాజు రామభద్రుడు చక్కగా వర్ణించాడని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరా వు మాట్లాడుతూ మన ప్రాచీన కావ్యాలు, పురాణాలు అన్నీ మన చరిత్రలేనని తెలిపారు. తెలుగు పండితుడు ఓలేటి బంగారేశ్వర శర్మ స్వాగత వచనాలు పలికారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, పద్యసారస్వత పరి షత్ జిల్లా శాఖ గౌరవాధ్యక్షుడు చింతలపాటి శర్మ మాట్లాడుతూ భువన విజయం సాహితీ ప్రసంగాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో సాహితీ అభిమానులు హాజరయ్యారు. -
వైష్ణవ ప్రతిపాదిత తొలి గ్రంథం ఆముక్తమాల్యద
ఘనంగా ప్రారంభమైన భువనవిజయ సాహితీప్రసంగాలు రాజమహేంద్రవరం కల్చరల్ : శ్రీవైష్ణవ ప్రతిపాదితమైన తొలి గ్రంథం ఆముక్తమాల్యదగా భావించాలని రాష్ట్రపతి అవార్డుగ్రహీత చింతలపాటి శర్మ పేర్కొన్నారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో భువనవిజయ సాహితీ ప్రసంగాలు శుక్రవారం ఆదిత్య డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యవక్తగా పాల్గొన్న చింతలపాటి శర్మ మాట్లాడుతూ విష్ణుపరమైన భక్తికథలు ఆముక్తమాల్యదలో ప్రధానంగా చూడవచ్చన్నారు. తిరుపతి వేంకన్నకు అంకితమిచ్చిన ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుని కథ ప్రధానమైనదని అన్నారు. నేటి ప్రజాస్వామ్యలక్షణాలకు రాయలకాలంలోనే బీజాలు పడ్డాయి‡, వైష్ణవ మతస్తుడైన రాయలు కొలువులోని మాదయగారి మల్లన, ధూర్జటి వంటి పరమశివభక్తులు సత్కారాలను అందుకున్నారని శర్మ అన్నారు. క్లిష్టాన్వయాలతో కూడిన పద్యాలను రాయలు రచించారని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలుకు తెలుగు, కన్నడం, తులు, తమిళం, కొంకణి, ఒరియా, ద్రావిడ భాషలతో విస్తృతమైన పరిచయం ఉన్నా తెలుగుభాషలోనే ఆముక్తమాల్యద రచించారన్నారు.ఆముక్తమాల్యదలో రాయలు ఉపయోగించిన పదాలు కొన్ని నేడు లేవు, పాతనీరు కొట్టుకుపోయి, కొత్తనీరు రావడం ఎంతసహజమో, కాలప్రవాహంలో పాతమాటలు పోయి, కొత్తమాటలు రావడం అంతే సహజమని ఆయన అన్నారు. మరుగున పడుతున్న ప్రాచీన గ్రంథాలను నేటి తరానికి గుర్తుచేయడానికి, వాటి మాధుర్యాన్ని నేటి తరానికి అందించడానికి చేస్తున్న చిరుప్రయోగం భువన విజయసాహితీ ప్రసంగాలని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఎంఆర్వీ శర్మ మాట్లాడుతూ కృష్ణదేవరాయల కాలంనాటి మహాకవుల వాగమృతం పదిరోజులపాటు వర్షిస్తూనే ఉంటుందన్నారు. నగరమేయర్ పంతం రజనీశేషసాయి జ్యోతిప్రజ్వలన చేశారు. డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు అతిథులను, ముఖ్యవక్తను పద్యరూపకంలో వేదికపైకి ఆశీర్వదించడం విశేషం. నన్నయ వాజ్ఞ్మయ వేదిక ఉపాధ్యక్షుడు ఎస్.పి గంగిరెడ్డి సభను ప్రారంభించారు. నిత్యవిద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి , మహామహోపాధ్యాయ డాక్టర్ కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి ప్రసంగించారు. జోస్యులరామచంద్ర శర్మ వందన సమర్పణ చేసారు. సాహిత్యాభిమానులు హాజరయ్యారు. నేడు వసుచరిత్రపై అబ్బిరెడ్డి ప్రసంగం భువన విజయ సాహితీప్రసంగాలలో భాగంగా, శనివారం ఉదయం 10 గంటలకు ఎస్.కె.వి.టి. డిగ్రీ కళాశాల ఆంధ్రోపన్యాసకుడు డాక్టర్ అబ్బిరెడ్డి పేర్యనాయుడు ’వసుచరిత్ర–వాగ్దేవీహృదయాలు’ అనే అంశంపై ప్రసంగిస్తారు.