Watch: Birth Of Bhuvana Vijayam Movie Video Out - Sakshi
Sakshi News home page

Birth Of Bhuvana Vijayam: ఫోస్టర్‌ చూస్తే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కి పోవాలి

Published Wed, Apr 12 2023 3:15 PM | Last Updated on Wed, Apr 12 2023 3:55 PM

Birth Of Bhuvana Vijayam Video Out - Sakshi

సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భువన విజయమ్’. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని  హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి.

తాజాగా బర్త్ అఫ్  ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్;  టైటిల్ పడటం ఆసక్తికరంగా ఉంది. ఇక చివర్లో ‘నా ఫోస్టర్‌ చూస్తే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కి పోవాలి’అని సునీల్‌ అంటుంటే.. వెన్నెల కిశోర్‌ స్కెచ్‌తో సునీల్‌ పోస్టర్‌ని మార్చడం నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement