Vennela Kishore
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది. కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ రచన, దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది.తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. కామెడీ, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఓటీటీలో ఓ లుక్కేయండి. షెర్లాక్ హోమ్స్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారంటే.. ఈ సినిమాలో డిటెక్టివ్ తల్లి పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, హీరో పేరు ఓం ప్రకాశ్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ అన్నీ కలిపి షెర్లాక్ హోమ్స్ అని పెట్టారు.(చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)కథేంటంటే?రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు (1991 మే 21న) శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీఐ భాస్కర్ (అనీష్ కురివెళ్ల) వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటానని, లేదంటే ఉద్యోగానికే రాజీనామా చేస్తానని శపథం చేస్తాడు. కానీ రాజీవ్ గాంధీ హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. కేసు పరిష్కరించకపోతే పరువు పోతుందని దాన్ని ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిషోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనక మేరీ స్నేహితులు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నాడు. వీరిలో మేరీని చంపిందెవరు? దానిక గల కారణమేంటి? షెర్లాక్ హంతకుడిని తనకిచ్చిన గడువులో పట్టుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి -
భ్రమరం వినోదం
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu). సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో డాక్టర్ భ్రమరం పాత్రలో ‘వెన్నెల’ కిశోర్(Vennela Kishore) నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.‘‘ఒక కాంటెంపరరీ ఇష్యూను వినోదాత్మకంగా చూపిస్తూ, ‘సంతానప్రాప్తిరస్తు’ మూవీని రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో గర్భగుడి వెల్నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం తన దగ్గరకు సంతాన లేమి సమస్యలతో వచ్చే వారిని ఆయుర్వేద వైద్యాన్ని, మోడ్రన్ మందులతో కలిపి ఎలా ట్రీట్ చేశాడు? అనే అంశాలు హిలేరియస్‌గా ఉంటాయి. భ్రమరం పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్విస్తాయి’’ అని యూనిట్ తెలిపింది. -
అవకాశాలు లేక కాదు, రాక కాదు.. అందుకే సినిమాలు తగ్గించా!
తెలుగు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేశాడు. ఒకప్పుడు జెట్ స్పీడ్‌లో చిత్రాలు చేసిన ఆయన ఈ మధ్య మాత్రం మూవీస్‌పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏదో అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు గౌతమ్‌తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశాడు.సినిమాలు ఎందుకు తగ్గించేశానంటే?గురువారం జరిగిన బ్రహ్మ ఆనందం టీజర్ లాంచ్ ఈవెంట్ (Brahma Anandam Teaser Launch Event)లో సినిమాలు తగ్గించడానికి గల కారణాన్ని హాస్య బ్రహ్మ బయటపెట్టాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నాకు మంచి ఇమేజ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈయన కామెడీ అప్పట్లో బాగుండేది.. ఈ మధ్య కామెడీ చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లేదు అన్న మాట కొందరు కమెడియన్ల దగ్గర విన్నాను. అది నాకొద్దు. ఎంత చేసినా ఇంకా ఏదో వెతుకుతూ ఉంటారు.నాకు తెలుసుఅలాగే నా వయసేంటో నాకు తెలుసు. వయసు పెరుగుతోందని అర్థం చేసుకోకుండా నేనింకా యంగ్ అంటే కుదరదు. ఇంతకుముందు చేసినంత యాక్టివ్‌గా నేను చేయలేకపోతున్నాను. నేను చేసిన పాత్రలే మళ్లీ ఆఫర్ చేస్తున్నారు, చేసిన కామెడీనే మళ్లీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.. నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అందుకే సినిమాలు తగ్గించేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. సినిమాల్లో వేషాలు లేక కాదు, నాకు ఇవ్వక కాదు, నేను చేయలేకా కాదు! ఎంతజాగ్రత్తగా చేసినా దొరికిపోతాం. చేసిన కామెడీ చేస్తున్నాడన్న ఇమేజ్ వద్దనే సినిమాలు తగ్గించాను. ఇండస్ట్రీలో నా వారసత్వాన్ని వెన్నెల కిషోర్ కొనసాగిస్తాడు అని చెప్పాడు.ఆనందో బ్రహ్మ ఎలా ఒప్పుకున్నానంటే?డైరెక్టర్ నిఖిల్.. నా పేరుపైనే ఒక సినిమా రాసుకున్నానని, మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తానన్నాడు. నాతో ఒక్క షాట్ అయినా డైరెక్ట్ చేయాలని తన కోరిక అని లేదంటే ఈ సినిమా పక్కనపెట్టేస్తానన్నాడు. అప్పటివరకు పోజు కొడదామనుకున్నాను కానీ నేను ఒప్పుకుంటేనే సినిమా అనేసరికి సరే అని అంగీకరించాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. హీరో ఎవరు? అని అడిగితే మా అబ్బాయి గౌతమ్ పేరు చెప్పారు. సినిమా కోసం వాడికి నేను తాతనయ్యాను అని చెప్పాడు. బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చదవండి: సంక్రాంతి రభస: మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు -
థ్రిల్ ఇస్తోంది: అనన్య నాగళ్ల
‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమాకి, నా పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటం హ్యాపీగా ఉంది. మా మూవీ ఆడియన్స్‌కి మంచి థ్రిల్ ఇస్తోంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేశారు.ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘సినిమా స్క్రీన్‌ప్లే చాలా అద్భుతంగా ఉంది, చివరి 40 నిమిషాలు కట్టిపడేస్తోంది, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనే ప్రశంసలు వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’తో సక్సెస్ సాధించాననుకుంటున్నాను’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. -
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రివ్యూ
టైటిల్: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: శ్రీగణపతి సినిమాస్నిర్మాత: వెన్నపూస రమణారెడ్డిదర్శకత్వం: రైటర్ మోహన్సంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ ఎన్ఎడిటర్: అవినాష్ గుర్లింక్విడుదల తేది: డిసెంబర్ 25, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్(అనీష్ కురివెళ్ల) సీరియస్‌గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తోంది. వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్(వెన్నెల కిశోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్ షెర్లాక్ అనుమానిస్తాడు. వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు. వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్ షెర్లాక్ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..డిటెక్టివ్ కథలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. చిరంజీవి ‘చంటబ్బాయ్’ మొదలు నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వరకు చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్‌తో వచ్చాయి. కొన్ని కథలు సీరియస్‌గా సాగితే..మరికొన్ని కామెడీగా సాగుతూనే థ్రిల్లింగ్ గురి చేస్తాయి. కానీ అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన వచ్చిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం మాత్రం అటు కామెడీ పండించలేదు..ఇటు థ్రిల్లింగ్‌కు గురి చేయలేదు. హాలీవుడ్ రేంజ్ టైటిల్..దానికి జస్టిఫికేషన్ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలం అయ్యాడు. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలు.. హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్లు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు. సీఐ భాస్కర్ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్‌కి ఇచ్చినట్లుగా మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సీఐ భాస్కర్ ఇంత ఖాలీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా లేకపోయినా.. కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఉప కథలు కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసి శ్రీకాకుళం సీఐ అలర్ట్ అవ్వడంతో సినిమా ప్రారంభం అవుతుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అర్థరాత్రంతా పోలీసులు పెట్రోలింగ్ చేయడం, ఘర్షనకు దిగిన ఇద్దరిని అరెస్ట్ చేయడం.. పోలీసులను చూసి ఓ కారు వెనక్కి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక హత్య జరగడం.. విచారణ కోసం డిటెక్టివ్ షేర్లక్ రంగంలోకి దిగడం వరకు కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత విచారణ భాగంగా వచ్చే ఉప కథలు బోరింగ్‌గా సాగుతాయి. ఒక్కోక్కరు చెప్పే స్టోరీ.. తెరపై చూడడం భారంగా ఉంటుంది. అలాగే ఝాన్సీ అనే పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే హంతకులు ఎవరనే విషయం చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. మేరిని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. షెర్లాక్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఆ ఎమోషనల్ సీన్‌కి కూడా అంతగా కనెక్ట్ కాలేకపోతాడు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ పాత్రకు వెన్నెల కిశోర్ కొంతవరకు న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలలో సహజత్వం కలిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయాడు. అనన్య నాగళ్లకు ఓ మంచి పాత్ర లభించింది. భ్రమరాంభ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టునే తిరుగుతుంది. అనీష్ కురివెళ్ల పాత్రకి వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఆ క్యారెక్టర్ స్థాయిని తగ్గించింది. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, నాగ్ మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అవినాష్ గుర్లింక్ తన కత్తెరకు ఇకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కథ చాలా కొత్తగా ఉంది: బాబీ కొల్లి
‘‘నేను, మోహన్ కలిసి రైటర్స్‌గా పని చేశాం. తను ఈ సినిమాని వినోదంతో పాటు సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తీశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ బాబీ కొల్లి, కల్యాణ్ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. ‘‘ఈ సినిమా కంటెంట్‌ని బలంగా నమ్మాను. ఆ కథే నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘నా కెరీర్లో చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది’’ అని అనన్య నాగళ్ల పేర్కొన్నారు. ‘‘నటుడిగా ఈ చిత్రం నాకు చాలా కీలకం’’ అన్నారు రవితేజ మహాదాస్యం. ‘‘ఈ మూవీతో కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. -
‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ప్రమోషన్స్‌కు దూరంగా వెన్నెల కిశోర్.. 'ఇక మీరెందుకు పాకులాడటం?'
సినిమా తీయడమే కాదు దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. పుష్ప 2 రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్ క్షణం ఖాళీ లేకుండా నార్త్ టు సౌత్ మొత్తం చుట్టేశాడు. ప్రమోషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా నెక్స్ట్ లెవల్లో వచ్చాయి. సినిమా ప్రమోషన్స్‌కు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు. జనాల్లో తమ సినిమా గురించి మాట్లాడుకునేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు.వరుసగా డుమ్మాఅయితే వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా ఈవెంట్స్‌కు వరుసగా డుమ్మా కొడుతున్నాడు. గురువారం నాడు ట్రైలర్ సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అనన్య నాగళ్లతో పాటు దర్శకనిర్మాతలు వచ్చారు. దీంతో ఓ జర్నలిస్ట్.. వెన్నెల కిశోర్ ఈ సినిమాకు పబ్లిసిటీ అక్కర్లేదనుకుంటున్నాడు. ఆయన సినిమాకు ఆయనే రావట్లేదు. ఆయన రానప్పుడు మీరెందుకు పాకులాడటం? అని ప్రశ్నించాడు.కథే హీరోఅందుకు డిస్ట్రిబ్యూటర్ వంశీ ఈ సినిమాలో కథే హీరో. మేము కథనే నమ్మాం. కథలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు అని చెప్పాడు. అప్పటికీ సదరు జర్నలిస్ట్.. హీరో మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించాడు. అందుకు నిర్మాత.. మరి ముందుకువెళ్లాలి కదా.. డబ్బులు పెడుతోంది మేము.. ఆయన కాదు కదా! అని బదులిచ్చాడు.ప్రమోషన్స్‌కు ఎందుకు రావట్లేదంటే?ఇంతలో మరొకరు వెన్నెల కిశోర్ ఎందుకు ప్రమోషన్స్‌కు రారు? అని ప్రశ్నించాడు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నారు. పలుమార్లు ప్రమోషన్స్‌కు రమ్మని బతిమాలాం.. కానీ రాలేకపోయారు. ఆయన ఇంట్రోవర్ట్.. ఇలాంటివాటికి నేను రాలేనని సున్నితంగా తిరస్కరించాడు అని నిర్మాత వివరించాడు. కాగా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.చదవండి: 'ప్రియాంక.. నీ భర్తను అదుపులో పెట్టుకో!' నిక్‌పై ట్రోలింగ్ -
'మేరీని ఎవరు హత్య చేశారో డిసెంబర్ 25న తెలుస్తుంది'
‘పులిదండి మేరి... మే 22వ తారీఖున పన్నెండు... ఒంటిగంట మధ్య హత్యకు గురైంది’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా ట్రైలర్. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ సినిమాలో సీయా గౌతమ్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. రైటర్ మోహన్ దర్శకత్వంలో శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు.‘మూడు నెలల మధ్యలో మూడు చావులు... ఇంకెన్ని చావులు చూడాలయ్యా ఈ బీచ్‌లో’, ‘ఇంద్ర ధనస్సులో కలర్లు ఏడు... ఈ క్రైమ్ సస్పెక్ట్‌లు కూడా ఏడే’, ‘నా కాడ ఇన్ఫర్మేషన్ ఉన్నాది... కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను... ఇక తీగ లాగడమే...’, అనే డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్‌కు వెన్నెల కిశోర్ జీవం పోశారు. షెర్లాక్ ప్రవర్తనలో హ్యుమర్ ఉన్నప్పటికీ, కేసును పరిష్కరించడంలో అతని తెలివితేటలు ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Osey Arundhathi Teaser: ఆసక్తికరంగా ‘ఒసేయ్ అరుంధతి! ’ టీజర్
‘వెన్నెల’ కిశోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. పద్మ నారాయణ ప్రొడక్షన్స్‌పై ప్రణయ్ రెడ్డి గూడూరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఒసేయ్ అరుంధతి’ టీజర్‌ను విడుదల చేశారు. ప్రణయ్ రెడ్డి గూడూరు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ నిర్మించాం. త్వరలో మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలనుకుంటుంది. అయితే అనుకోకుండా ఆమెకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంది? అనేదే ‘ఒసేయ్ అరుంధతి’ చిత్రకథ. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. -
చంటబ్బాయిగారి తాలుకా..!
‘వెన్నెల’ కిశోర్ ప్రధానపాత్రలో చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. చంటబ్బాయిగారి తాలూకా’ క్యాప్షన్. ఈ చిత్రంలో అనన్యా నాగళ్ల, సీయా గౌతమ్ హీరోయిన్లుగా, రవితేజ మహాదాస్యం కీలకపాత్రలో నటించారు. రైటర్ మోహన్ దర్శకత్వంలో లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానుంది. నిర్మాత వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మోహన్ మాట్లాడుతూ–‘‘ఫస్ట్ కాపీ చూసిన తర్వాత వంశీగారు చెప్పిన మార్పులు, ఆయన ఈ సినిమా తీసుకోవడం మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి’’ అన్నారు.‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు ఫుల్‌మీల్స్ లాంటిది’’ అన్నారు అనన్యా నాగళ్ల. ‘‘కంటెంట్‌ని నమ్మి తీసిన చిన్న సినిమాలు ‘2018, కమిటీ కుర్రాళ్ళు, ఇటీవల రిలీజ్ అయిన ‘క’.., ఇవన్నీ ప్రేక్షకులను అలరించాయి. నిర్మాత వంశీగారిది గోల్డెన్ హ్యాండ్. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ విజయం సాధించి, మోహన్‌గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు ‘కమిటీ కుర్రాళ్ళు’ ఫేమ్ దర్శకుడు యదు వంశీ. -
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. డిటెక్టివ్ టీజర్ చూశారా?
టాలీవుడ్ నటుడు వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చంటబ్బాయ్ తాలుకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు ప్రముఖ రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెల కిశోర్ యాక్టింగ్ ఫర్మామెన్స్తో తెగ ఆకట్టుకుంటోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. -
చంటబ్బాయ్ తాలూకా అంటోన్న వెన్నెల కిశోర్.. ఆసక్తిగా పోస్టర్
టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. చంటబ్బాయ్ తాలూకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వెన్నపూస రమణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వచ్చే నెల క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన పోస్టర్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. పోస్టర్ చూస్తుంటే డిటెక్టివ్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. Agent with entertainment is coming ❤️🔥#SreekakulamSherlockHolmes In Theatres on December 25th#VennelaKishore pic.twitter.com/EhXaLFX3DK— Adnan369 (@Adnan3693) November 25, 2024 -
‘ధూమ్ ధామ్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
మత్తువదలరా 2 : ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న.. రియా ఎక్కడ? (ఫొటోలు)
-
ఓటీటీలోకి దెయ్యం కామెడీ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
హారర్ కామెడీ కథలతో తెలుగులో ఎప్పటికప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనాలకు బోర్ కొట్టేస్తున్నాయ్ గానీ దర్శకులు మాత్రం ఈ తరహా చిత్రాల్ని వదలడం లేదు. అలా దెయ్యంతో కామెడీ అనే కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు మూవీ 'ఓ మంచి ఘోస్ట్'. జూన్ 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత నాకు గిఫ్ట్ కావాలి: వేణుస్వామి భార్య)వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓ మంచి ఘోస్ట్'. రెగ్యులర్ రొటీన్ హారర్ కథ కావడంతో జనాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఓటీటీలో కాబట్టి టైమ్ పాస్ చేయొచ్చు. ఆహాలో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు.'ఓ మంచి ఘోస్ట్' విషయానికొస్తే.. డబ్బు కావాల్సిన నలుగురు కుర్రాళ్లు.. ఎమ్మెల్యే కూతురిని కిడ్నాప్ చేస్తారు. ఊరి చివరి బంగ్లాలో తీసుకొచ్చి పెడతారు. ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ చేసేవాళ్లు అంటే దానికి అస్సలు పడదు. చివరకు ఏమైంది బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా? అనేది స్టోరీ.(ఇదీ చదవండి: ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్) -
OMG Review: ‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: OMG (ఓ మంచి ఘోస్ట్)నటీనటులు: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు.నిర్మాత: డా.అబినికా ఇనాబతునిదర్శకుడు: శంకర్ మార్తాండ్సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూఎడిటర్: ఎం.ఆర్.వర్మవిడుదల తేది: జూన్ 21, 2024కథేంటంటే.. చైతన్య (రజత్), రజియా (నవమి గాయక్), లక్ష్మణ్ (నవీన్), పావురం (షకలక శంకర్).. ఈ నలుగురికి డబ్బు సమస్య ఉంటుంది. మనీ కోసం తన తన మేన మరదలు, స్థానిక ఎమ్మెల్యే సదాశివరావు(నాగినీడు) కూతురు కీర్తి (నందిత శ్వేత)ను కిడ్నాప్ చేయాలని చైతన్య ప్లాన్ వేస్తాడు. అనుకున్నట్లే ఈ నలుగురు కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఊరి చివర ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్తారు. ఈ బంగ్లాలో ఓ దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ చేసేవాళ్లు అంటే దానికి అస్సలు పడదు. అలాగే కిర్తీకి కూడా ఓ సమస్య ఉంటుంది? అటు దెయ్యం, ఇటు కీర్తికి ఉన్న సమస్య కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? బంగ్లాలో ఉన్న దెయ్యం కిడ్నాప్ చేసినవాళ్లను మాత్రమే ఎందుకు చంపుతుంది? చైతన్యకు తన మేనమామ, ఎమ్మెల్యే సదాశివరావుపై ఎందుకు కోపం? కీర్తికి ఉన్న సమస్య ఏంటి? చివరకు ఆ బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ జానర్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఓ మంచి ఘోస్ట్ కూడా ఆ జానర్లో తెరకెక్కిన చిత్రమే. ఒకవైపు ప్రేక్షకులను నవ్విస్తూనే.. భయపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే కథ విషయంలో మాత్రం కొత్తదనం లేదు. దెయ్యం, కిడ్నాప్ డ్రామా..ప్రతీది పాత సినిమాలను గుర్తు చేస్తుంది. అనుభవం ఉన్న నటీనటులు కావడంతో.. రొటీన్ సన్నివేశాలే అయినా తమదైన నటనతో బోర్ కొట్టకుండా చేశారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. కిడ్నాప్ డ్రామ అంతగా ఆకట్టుకోదు. నలుగురి గ్యాంగ్ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఆత్మ పాత్రలో వెన్నెల కిశోర్ ఎంట్రీ.. అతన్ని దెయ్యం అనుకొని ఆ నలుగు భయపడే సన్నివేశాలు.. ఎవరు దెయ్యం అనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నాలు.. ఈ క్రమంలో శకలక శంకర్ చేసే పనులు అన్నీ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో దెయ్యాలు చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక దెయ్యాల ప్లాష్‌బ్యాక్ స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సీక్వెల్ ఉంటుందని తెలియజేసేలా క్లైమాక్స్ ఉంటుంది. మొత్తంగా ఓ మంచి దెయ్యం కొన్ని చోట్ల నవ్విస్తూనే.. మరికొన్ని చోట్ల భయపెడుతుంది. హారర్ కామెడీ చిత్రాలను ఇష్ట పడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్ థియేటర్లో ప్రేక్షకుల్ని పగలబడేలా నవ్విస్తుంటారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలేమీ కొత్త కాదు. మరోసారి ఈ చిత్రంతో ఆడియెన్స్‌ను విరగబడేలా నవ్విస్తారు. నందిత ఆల్రెడీ ఘోస్ట్‌గా ఇది వరకు భయపెట్టేసింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో అదరగొట్టేసింది. నవమి గాయక్ గ్లామరస్‌గా అనిపిస్తుంది. రఘుబాబు కనిపించినంత సేపు నవ్విస్తాడు. రజత్ చక్కగా నటించాడు. నవీన్ నేని మధ్య మధ్యలో నవ్విస్తాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. -
మంచి కామెడీ దెయ్యం
నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, నవమీ గాయక్, ‘షకలక’ శంకర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘ఓఎమ్‌జీ (ఓ మంచి ఘోస్ట్). శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందితా శ్వేత మాట్లాడుతూ–‘‘శంకర్‌గారు స్టోరీ నరేట్ చేస్తుంటే నవ్వుతూనే ఉన్నాను. హారర్, కామెడీ జానర్స్ మిళితమై వస్తున్న ఈ సినిమాను కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రాపారంభం కావడానికి కారణమైన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మూవీ స్క్రిప్ట్, డైలాగ్స్‌లో సాయం చేసిన దర్శకుడు రితేష్ రానా, మాపై నమ్మకం ఉంచిన అబినికా, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న ఏషియన్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్‌లకు ధన్యవాదాలు’’ అన్నారు శంకర్ మార్తాండ్. ‘‘కథను ఎంత బాగా చె΄్పారో, అంత బాగా సినిమా తీశారు శంకర్’’ అన్నారు అబినికా ఇనాబతుని. -
నవ్విస్తూ భయపెట్టేస్తున్న 'ఓ మై గాడ్' ట్రైలర్
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ మంచి ఘోస్ట్'. ఇందులో నందితా శ్వేత, షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. హారర్, కామెడీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకుడు. జూన్ 21న మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఇది ఎలా ఉందో తెలుసా?(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)ఓ గ్యాంగ్, పిశాచీపురం అనే ఊరిలోకి ఎంటర్ కావడం, అక్కడ ఓ బంగ్లా, అందులోని దెయ్యంతో కామెడీ.. ఇలా ట్రైలర్ చూస్తే ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు భయపెడుతోంది. నందితా శ్వేత దెయ్యం పాత్రలో భయపెడుతుంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు వంటి వారు నవ్వించేశారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.(ఇదీ చదవండి: 12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్) -
‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేస్తోంది
వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ హారర్ చిత్రాన్ని మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మిస్తున్నారు. షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ ‘ఓ మంచి ఘోస్ట్’కు మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ ప్లస్ కానుంది. ప్రేక్షకులు నవ్వుతూనే భయపడతారు? అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఓఎమ్‌జీ టీజర్: 'అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖికి చెల్లివైనా..'
‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్‌తో ‘ఓఎమ్‌జీ’ (ఓ మంచి ఘోస్ట్) చిత్రం టీజర్ ఆరంభమవుతుంది. ‘ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా, కాంచన కజిన్‌వైనా..’ అంటూ వెన్నెల కిశోర్ చేసే కామెడీ, ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా.. కామిని పిశాచి కామం తీర్చా’ అంటూ షకలక శంకర్ చేసే కామెడీతో ఈ టీజర్ సాగుతుంది. ఘోస్ట్ క్యారెక్టర్లో నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా కనిపించారు. హారర్, కామెడీ ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రం ‘ఓఎమ్‌జీ’. వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమీ గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు కీలక పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. డా. అబినికా ఇనాబతుని నిర్మించారు. శనివారం ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ‘‘త్వరలో ‘ఓఎమ్‌జీ’ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఓటీటీలో దూసుకెళ్తున్న వెన్నెల కిశోర్ సినిమా
కొన్ని సినిమాలు థియేటర్స్‌లో సరిగా ఆడకపోయినా.. ఓటీటీల్లో మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ఇది బాగా జరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఓటీటీల్లో మాత్రం ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చారి 111 సినిమా విషయంలోనూ అదే జరిగింది. కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్స్‌లో విడుదలై పర్వాలేదనిపించుకుంది. సంయుక్త విశ్వనాథన్ గ్లామర్‌తో పాటు మురళీ శర్మ, సత్య, తాగుబోతు రమేశ్‌ల కామెడీకి మంచి మార్కులే పడినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేపోయింది. దీంతో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చి నెల రోజులైనా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. కామెడీ జోనర్లో ఈ చిత్రం టాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ద హీరోల సినిమాలను మించి ‘చారి 111’ సుమారు 70 మిలియన్స్ కి పైగా వ్యూస్ మినిట్స్ సాధించడం గమనార్హం. ఓటీటీలో వస్తున్న ఆదరణ పట్ల నిర్మాత అదితి సోని ఆనందం వ్యక్తం చేశారు. ‘చారి 111’ కథేంటి?హైదరాబాద్‌లోని ఓ మాల్లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు లభించవు. కానీ అతనే బ్లాస్ట్ అవుతాడు. ఇది ఉగ్రవాదుల పని.. వారి ప్లాన్ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి(రాహుల్ రవీంద్రన్). రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీ మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నడిపిస్తుంటాడు. అతని టీమ్‌లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్)కి బాంబ్ బ్లాస్ట్ కేసుని అప్పగిస్తాడు. ఈ మిషన్‌ని చారి ఎలా పరిష్కరించాడు? ఈ మిషన్‌లో ఏజెంట్ ఈషా(సంయుక్త విశ్వనాథన్) పాత్రేంటి? అసలు ఆత్మాహుతి దాడుల వెనుకున్నదెవరు? వారి లక్ష్యమేంటి? మహి, రావణ్‌లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ మూవీ
కొన్ని సినిమాలు అనుకున్న రీతిలో ఆడవు. అయితే థియేటర్లో నష్టపోయినా ఓటీటీ బిజినెస్ ద్వారా చాలా చిత్రాలు గట్టెక్కుతున్నాయి. పైగా కొన్ని బాక్సాఫీస్ ప్రియులకు నచ్చకపోయినా డిజిటల్ ప్లాట్ఫామ్లో క్లిక్ అవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ముందస్తు ప్రకటనలతో ఓటీటీలోకి వచ్చేస్తుండగా మరికొన్ని చడీచప్పుడు లేకుండా డైరెక్ట్‌గా రిలీజవుతున్నాయి. అలా వెన్నెల కిశోర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ కామెడీ మూవీ చారి 111 మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మురళీ శర్మ కీలక పాత్రలో నటించాడు. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించగా అదితి సోని నిర్మించారు. సైమన్ కె.కింగ్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సీక్వెల్ కూడా చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం సీక్వెల్ ప్లాన్‌ను అటకెక్కించినట్లు తెలుస్తోంది. కథేంటంటే.. హైదరాబాద్‌లోని ఓ మాల్లో మానవ బాంబు పేలుడు జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎటువంటి పేలుడు పదార్థాలు లభించవు. ఇది ఉగ్రవాదుల పని అని.. వారి ప్లానేంటో కనుక్కోవాలని ముఖ్యమంత్రి రాహుల్ రవీంద్రన్ సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు. రుద్రనేత్ర ఏజెన్సీలో చారి (వెన్నెల కిశోర్)కి బాంబు పేలుడు కేసు అప్పగిస్తాడు. ఈ ఆత్మాహుతి దాడిని చారి పరిష్కరించాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! Get ready for a hilarious rollercoaster ride with #CHAARI111, now streaming on @PrimeVideoIN! 🕵️♂️💼 Don't miss out on the fun-filled espionage adventure! 🔗 https://t.co/OAcSJasE2u#Vennelakishore @samyukthavv@barkatstudios @aditisoni1111 @tgkeerthikumar pic.twitter.com/BpStl2jB6B — Divo (@divomovies) April 5, 2024 చదవండి: నేషనల్ క్రష్ ఏం చేసినా ట్రోలింగ్.. చేతలతో జవాబు! -
‘చారి 111’ మూవీ రివ్యూ
టైటిల్ : చారి 111 నటీనటులు: వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, సత్య తదితరులు నిర్మాత: అదితి సోనీ దర్శకత్వం: టీజీ కీర్తీ కుమార్ సంగీతం: సైమన్ కె కింగ్ విడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. హైదరాబాద్‌లోని ఓ మాల్లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు లభించవు. కానీ అతనే బ్లాస్ట్ అవుతాడు. ఇది ఉగ్రవాదుల పని.. వారి ప్లాన్ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి(రాహుల్ రవీంద్రన్). రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీ మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నడిపిస్తుంటాడు. అతని టీమ్‌లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్)కి బాంబ్ బ్లాస్ట్ కేసుని అప్పగిస్తాడు. ఈ మిషన్‌ని చారి ఎలా పరిష్కరించాడు? ఈ మిషన్‌లో ఏజెంట్ ఈషా(సంయుక్త విశ్వనాథన్) పాత్రేంటి? అసలు ఆత్మాహుతి దాడుల వెనుకున్నదెవరు? వారి లక్ష్యమేంటి? మహి, రావణ్‌లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. చారి 111లో వెన్నెల కిశోర్ హీరో అనగానే..అందరి దృష్టి సినిమాపై పడింది.టీజర్, ట్రైలర్ చూడగానే ఇదొక కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమైపోయింది. సినిమా మొత్తం కామెడీగానే సాగుతుంది. సీరియస్ అంశానికి కామెడీ జోడించి.. హిలేరియస్‌గా సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ఎంత కామెడీ సినిమా అయినా... కొంచెం అయినా లాజిక్ ఉండాలి. అది చారి 111లో మిస్ అయింది. సీక్రెట్ ఏజెన్సీ ఎలా పనిచేస్తుంది? పై అధికారులు ఎలా వ్యవహరిస్తారు. ఓ సీఎంతో అధికారి ఎలా మాట్లాడుతాడు? రియాల్టీకి పూర్తి విరుద్ధంగా కథనం సాగుతుంది. ఫస్టాఫ్ అంతా సోసోగా సాగినప్పటికీ..కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ చేసే యాక్షన్ సీన్ ఫస్టాఫ్కి హైలెట్. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే సాగుతుంది. మహి, రావణ్‌లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ చేసే కామెడి మరింత బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. చారి 111 ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. చారి పాత్రకి వెన్నెల కిశోర్ తగిన న్యాయం చేశాడు. ఆయన నుంచి ప్రేక్షకులు ఎలాంటి కామెడీ ఆశిస్తారో అది ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఈషా పాత్రలో సంయుక్త విశ్వనాథన్ ఒదిగిపోయింది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. తెరపై చాలా గ్లామరస్‌గా కనిపించింది. మేజర్ ప్రసాద్ రావు గా మురళీ శర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సత్య, తాగుబోతు రమేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Chaari 111 First Review: హీరోగా వెన్నెల కిశోర్ హిట్ కొట్టాడా?
కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్గా, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్‌ని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘చారి 111’పై హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మరికొద్ది గంటల్లో(మార్చి 1) చారి 111 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి మ్యాజిక్ డైరెక్టర్ సైమన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. సినిమా మొత్తం చూసి..తన ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చేశాడు. `లాక్ అయ్యింది, లోడ్ అయ్యింది, ఫైర్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇది కచ్చితంగా అదిరిపోయే వినోదాన్ని పంచే మూవీగా ఆడియెన్స్ ముందుకొస్తుంది. వెన్నెల కిషోర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా బీజీఎం, మ్యూజిక్ ఉంది`అని సైమన్ ట్వీట్ చేశాడు. #Chaari111 - locked , loaded and ready to fireeee ! Had a blast scoring music for this one !! A sureshot entertainer on its way !!! #Vennelakishore fans Podra BGM uh !! 🔥🔥🔥💥💥💥💯💯💯 — Simon K.King (@simonkking) February 28, 2024 వెన్నెల కిశోర్ హిట్ కొట్టేనా? టాలీవుడ్ కమెడియన్స్ అంతా హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కమెడియన్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న సునీల్ హీరోగా మారి తొలి సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు యావరేజ్‌గా ఆడాయి. కానీ హీరోగా మాత్రం సునీల్ నిలదొక్కుకోలేదనే చెప్పాలి. కొన్నాళ్ల పాటు వెండితెరకు దూరమై.. మళ్లీ ఇప్పుడు కమెడియన్‌గాను.. విలన్‌గాను రాణిస్తున్నాడు. కమెడియన్ ధన్‌రాజ్ కూడా హీరోగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇటీవల వైవా హర్ష, అభినవ్ గోమఠం కూడా హీరో అవతారమెత్తారు. ‘సుందరం మాస్టర్’తో హర్ష, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాతో అభినవ్ గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఈ వారం మరో కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిశోర్ అయినా హీరోగా హిట్ కొడతాడో లేదో చూడాలి. ప్రచార చిత్రాలు అయితే ఆకట్టుకున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉంటే మాత్రం హిట్ పడినట్లే. -
‘చారి 111’ వినోదాన్ని పంచుతాడు: నిర్మాత అదితి సోనీ
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలవుతోంది. అదితీ సోనీ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ‘చారి 111’ నా తొలి సినిమా. వైవిధ్యమైన కథతో తీసిన మంచి వినోదాత్మక చిత్రమిది. వెన్నెల కిశోర్ కామెడీని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ‘‘మళ్ళీ మొదలైంది’ సినిమా తర్వాత నేను చేసిన ద్వితీయ చిత్రం ‘చారి 111’. ఇదొక స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్’’ అన్నారు టీజీ కీర్తీకుమార్. ‘‘ఈ సినిమాలో ఒక్కటే పాట ఉంది. ఈ పాటని అద్భుతంగా రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. ‘‘తెలుగులో నాకు తొలి చాన్స్ ఇచ్చిన యూనిట్‌కి థ్యాంక్స్’’ అన్నారు సంయుక్తా విశ్వనాథన్. ‘‘ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సైమన్ కె. కింగ్. -
సీక్వెల్ ప్లాన్ ఉంది
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్ర చేశారు. ‘మళ్లీ మొదలైంది’ ఫేమ్ టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితి సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘సుమంత్‌గారితో తీసిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా సమయంలో ‘వెన్నెల’ కిశోర్‌గారికి ‘చారి 111’ స్టోరీలైన్ చెప్పాను. ఓకే చెప్పారు. ఆయన్ను దష్టిలో పెట్టుకునే ఈ సినిమా కథ రాశాను. స్పై కామెడీ ఫిల్మ్ ‘జానీ ఇంగ్లిష్’ తరహాలో ‘చారి 111’ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఆలోచన ఉంది’’ అని చెప్పుకొచ్చారు. -
Chaari 111: గూఢచారిగా 'వెన్నెల' కిశోర్..నవ్వులు పూయిస్తున్న ట్రైలర్
'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111'. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. సుమంత్ హీరోగా 'మళ్ళీ మొదలైంది' వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని మురళీ శర్మ చెప్పే మాటలతో 'చారి 111' ట్రైలర్ ప్రారంభమైంది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఆయన హెడ్. ఆయన ఏజెన్సీలోనే చారి పని చేసేది. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించారు. మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎలా అడ్డుకుంది? చారి ఏం చేశాడు? మ్యాడ్ సైకో సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని మురళీ శర్మ ఎందుకు తిట్టారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సీరియస్‌గా కనిపిస్తూ నవ్వించే గూఢచారిగా 'వెన్నెల' కిశోర్ నవ్వించనున్నారు. ఈ 'చారి 111' ట్రైలర్ చివరలో 'వయలెన్స్... వయలెన్స్... వయలెన్స్... ఐ లైక్ ఇట్! ఐ డోంట్ అవాయిడ్. బట్, వయలెన్స్ డజెంట్ లైక్ మి. అందుకే అవాయిడ్ చేస్తున్నా' అంటూ 'కెజియఫ్'లో రాకీ భాయ్ టైపులో 'వెన్నెల' కిశోర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. సంయుక్తా విశ్వనాథన్ అందంగా కనిపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టారు. 'నువ్వు ఎప్పటికీ కమెడియనే. హీరో కాదు' అంటూ 'వెన్నెల' కిశోర్ మీద పంచ్ కూడా వేశారు. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి ఇతర పాత్రల్లో కనిపించిన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. -
గూఢచారిగా మారిన ‘వెన్నెల’ కిశోర్
కన్ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా చారి పాత్రలో నటించారు ‘వెన్నెల’ కిశోర్. ఆయన హీరోగా నటించిన ‘చారి 111’ స్పై థ్రిల్లర్ మూవీకి టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్గా నటించగా, మురళీ శర్మ ఓ ప్రధాన పాత్రలో నటించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితీ సోనీ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 1న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ గురువారం వెల్లడించింది. ‘‘ఇదొక స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్. సిల్లీ మిస్టేక్స్ చేసే ఓ స్పై ఒక పెద్ద కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ చిత్రకథ. ‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా స్పై రోల్స్ చేయగా, వీరి బాస్ పాత్రలో మురళీ శర్మ నటించారు’’ అన్నారు టీజీ కీర్తీ కుమార్. ‘‘చారి 111’ చిత్రం కొత్తగా ఉంటుంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
కామెడీ స్పై
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ కామెడీ ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ ఓ కీలక పాత్రధారి. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితి సోనీ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఓ కన్ ఫ్యూజ్డ్ స్పై ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమా కథనం’’ అన్నారు టీజీ కీర్తీకుమార్, అదితి సోనీ. -
గూఢచారి 111
‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ హీరో హీరోయిన్లుగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘చారి 111’. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రకటించడంతో పాటు, కాన్సెప్ట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ కనిపిస్తారు. అలాగే ఆయన పాత్రలో ఓ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘స్పై జానర్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. కథలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
సత్తిగాని రెండెకరాలు మూవీ రివ్యూ
టైటిల్: సత్తిగాని రెండెకరాలు నటీనటులు: జగదీష్ ప్రతాప్ బండారి, వెన్నెల కిశోర్, మోహన శ్రీ, రాజ్ తిరందాసు, అనీషా దామా, బిత్తిరి సత్తి, మురళీదర్ గౌడ్, రియాజ్ తదితరులు రచన, దర్శకత్వం: అభినవ్ రెడ్డి దండ సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ సంగీతం: జై క్రిష్ నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ విడుదల తేదీ: మే 26, 2023 ఓటీటీ వేదిక: ఆహా పుష్ప సినిమాలో చిత్తూరు కుర్రాడిగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారికి మంచి మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా కామెడీ పండించిన ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సత్తిగాని రెండెకరాలు చిత్రంతో హీరోగా మారాడు జగదీష్. పుష్ప సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో రిలీజైన సత్తిగాని రెండెకరాలు సినిమా ఎలా ఉందో చూద్దాం.. కథ కొల్లూరు అనే గ్రామంలో నివసించే సత్తి(జగదీష్ ప్రతాప్ బండారి)కి భార్య, ఇద్దరు పిల్లలు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. ఎంత కష్టం వచ్చినా సరే ఉన్న రెండు ఎకరాలు అమ్మవద్దని సత్తికి చిన్నప్పుడే అతడి తాత చెప్తాడు. మీ నాన్న ఉన్నదంతా అమ్మేసి చివరకు రెండు ఎకారలు మాత్రమే మిగిల్చాడని దాన్ని కాపాడుకోమని సెలవిస్తాడు. ఆ మాటలను బుర్రకు ఎక్కించుకుంటాడు సత్తి. పెద్దయ్యాక అతడికో పెద్ద కష్టం వస్తుంది. తన కుమార్తె గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయడానికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్తారు. అప్పటికే సమయం కోసం వేచి చూస్తున్న సత్తి బంధువు, ఊరి సర్పంచ్ తన స్వలాభం కోసం సత్తితో రెండెకరాలు అమ్మించేయాలని కుట్ర పన్నుతాడు. ఓ రోజు సత్తి సైకిల్ మీద వెళ్తుండగా అక్కడ ఓ కారు చెట్టును ఢీ కొడుతుంది. అందులో వ్యక్తికి తీవ్ర గాయాలైనా పట్టించుకోని సత్తి ఆ కారులో ఉన్న సూట్‌కేసును మాత్రం ఇంటికి తీసుకొస్తాడు. అందులో డబ్బులుంటే కూతురికి ఆపరేషన్ చేయించవచ్చని అతడి ఐడియా. కానీ ఆ సూట్‌కేస్ ఎలా తెరవాలో తెలియక స్నేహితుడు అంజి(రాజ్ తిరందాసు) సాయం కోరుతాడు. వీళ్లు అప్పటికే ఊర్లో చిన్నచిన్న దొంగతనాలు చేయడంతో దాన్ని ఎలాగైనా ఓపెన్ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారు. మరోవైపు సూట్‌కేస్ ఓనర్ లలిత్(రియాజ్) తన అనుచరుడు వెన్నెల కిశోర్‌ను యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి పంపిస్తాడు. అతడు కారుతో పాటు అందులో ఉన్న వ్యక్తిని కూడా కాల్చేసి సూట్‌కేసు కోసం గాలిస్తాడు. మరోపక్క కారు ప్రమాదం గురించి ఎస్సై(బిత్తిరి సత్తి) విచారణ చేస్తూ ఉంటాడు. తీరా ఒక రోజు సూట్‌కేస్ తెరుచుకుంటుంది. అందులో ఏముంది? వెన్నెల కిశోర్ ఆ సూట్‌కేస్ సొంతం చేసుకున్నాడా? ఎస్సై విచారణ ఎలా సాగింది? సత్తి తన కూతురికి ఆపరేషన్ చేయించాడా? అన్నది మిగతా కథ. విశ్లేషణ ఈ మధ్యకాలంలో ప్రాంతీయ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇదే కోవలో సత్తిగాని రెండెకరాలు కూడా వచ్చింది. ఈ సినిమాను కామెడీగా లేదంటే క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తీయవచ్చు. కానీ దర్శకుడు అభినవ్ రెడ్డి దండ కామెడీకే జై కొట్టారు. అయితే సత్తిగాని రెండెకరాలు కథలో కొత్తదనం లేదు. కాకపోతే అల్లుకున్న క్యారెక్టర్లు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. సూట్‌కేసు వచ్చిన తర్వాత సినిమాలో వేగం, బలం పుంజుకుంటుంది. క్లైమాక్స్ బాగుంది. ఎంత మంచివాడైనా కొన్ని సందర్భాల్లో చెడువైపు అడుగులు వేసేందుకు ఆస్కారం ఉంది. అవసరం మనతో ఏ పనయినా చేయిస్తుందని జగదీశ్ పాత్రతో తెరపై చూపించాడు డైరెక్టర్. కామెడీ బాగా పండింది కానీ కొంత సాగదీత ఉంది. కొన్ని సన్నివేశాలను ముందుగానే ఊహించే ఆస్కారం ఉండటం మైనస్. ఎవరెలా చేశారంటే? జగదీష్ ప్రతాప్ బండారి నటనకు వంక పెట్టే పని లేదు. అంత బాగా నటించాడు. ప్రతి సన్నివేశంలో లీనమైపోయాడు. అతడి స్నేహితుడు అంజిగా నటించిన రాజ్ తిరందాస్ యాక్టింగ్ కూడా బాగుంది. వెన్నెల కిశోర్‌కు మంచి పాత్ర పడితే ఎలా విజృంభిస్తాడో చూపించాడు. బిత్తిరి సత్తి నిడివి ఇంకాస్త పెంచితే బాగుండేది. నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు. తెలంగాణ పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి చాలా సహజంగా, అద్భుతంగా ఆవిష్కరించారు. జై క్రిష్ నేపథ్య సంగీతం, పాటలు కథలో భాగంగానే ముందుకు సాగుతూ ప్రేక్షకులను లీనం చేసేందుకు దోహదపడ్డాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. కథ పక్కన పెడితే కామెడీ ఎంజాయ్ చేయవచ్చు -
ఆ విషయం అందరికీ తెలుసు.. అర్థం కాకపోతే అంతే: మంచు విష్ణు
మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు ఇటీవల చేసిన ట్వీట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కమెడియన్ వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలు కుప్పలుగా రెండు వేల నోట్లు ఉన్నాయంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ నిజమా అంటూ ఆరా తీశారు. దీంతో ఇదంతా ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిపోయింది. వెన్నెల కిశోర్ ఇంత డబ్బు సంపాదించాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మీడియాలో వచ్చిన కథనాలపై మంచు విష్ణు ట్వీట్ చేశారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చాడు. (ఇది చదవండి: వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా రెండువేల నోట్ల కట్టలు.. ఫోటో వైరల్) మంచు విష్ణు తాజాగా ఓ ట్వీట్‌తో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా నేను చేసిన జోక్ అని అందరికీ తెలుసు అంటూ పోస్ట్ చేశారు. ఇది అర్థం చేసుకోలేని వారిని ఆ దేవుడే రక్షించాలి అంటూ రాసుకొచ్చారు. కానీ కొంత మంది మీడియా వ్యక్తులు వెన్నెల కిషోర్ మీద వేసిన జోక్‌ను సీరియస్‌గా తీసుకన్నారని ట్వీట్లో తెలిపారు. మంచు విష్ణు ట్వీట్లో రాస్తూ..'అది జోక్ అని అందరికీ తెలుసు. కాసింత కళాపోషణ ఉన్న వారెవ్వరికైనా అది జోక్ అని అర్థమవుతుంది. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకోని వాళ్లని ఆ దేవుడే కాపాడాలి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరూ జిన్నా సినిమాలో చివరగా కలిసి నటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్) My joke on Kishore @vennelakishore is taking different turns by some genius new portals ( not the legit and genuine news networks). Almost everyone knows that Kishore and I always have funny banter fights. And everyone with a little bit of humor also understands that it s a joke.… — Vishnu Manchu (@iVishnuManchu) May 22, 2023 -
వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా రెండువేల నోట్ల కట్టలు.. ఫోటో వైరల్
కొంతకాలంగా రెండు వేల నోటు కనిపించకుండా పోయింది. ఎక్కడో ఒక చోట తప్పితే పెద్దగా చలామణీ అవడం లేదు. ఈ క్రమంలో రూ.2000 నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కాకపోతే మన దగ్గర ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. ఇకపోతే కమెడియన్ వెన్నెల కిశోర్ ఇంట్లో రెండు వేల నోట్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయట. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. రెండు వేల నోట్ల కట్టలు గుట్టగా పేరుకుని ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. 'వెన్నెల కిశోర్ ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఫోటో తీసుకున్నాను. ఈ నోట్లతో అతడేం చేస్తాడోనని నాకు ఆశ్చర్యంగా ఉంది' అని రాసుకొచ్చాడు. దీనికి వెన్నెల కిశోర్ స్పందిస్తూ.. 'సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్‌ను చంపేసినట్లు.. నామీద పడతారేంటి?' అని డైలాగ్ ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు 'మాకు ఓ రూ.30 లక్షలు ఇవ్వొచ్చుగా', 'అర్జంట్‌గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు చెప్పేయాలి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే విష్ణు సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు 'ఇది నిజమా సర్..', 'ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా సాయం చేస్తారా బ్రో', 'అన్నా.. పేదలకు పంచవచ్చు కదా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పెద్ద నోట్ల రద్దుతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోటును లీగల్‌గా చలామణి చేసుకునే అవకాశం ఉన్నా ఎవరు కూడా దాన్ని తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. షాపింగ్, మాల్స్, వైన్ షాప్స్, పెట్రోల్ బంకుల్లో కూడా నోటును తీసుకునేందుకు సిబ్బంది వెనుకడుగు వేస్తున్నారు. Photo was taken when I visited Sri. @vennelakishore garu home. I wonder what he will do with these 2000₹ notes. 🤔 pic.twitter.com/bLApojXxyA — Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2023 చదవండి: మరో వ్యాపార రంగంలోకి నయనతార -
నటి గౌతమి తో సాక్షి ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
నా లైఫ్ లో ఇంత పెద్ద సినిమా చేయలేదు
-
హీరోయిన్ ని పొగడ్తలతో ముంచెత్తిన నాని
-
అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్
-
ఆసక్తికరంగా 'భువన విజయమ్'.. ట్రైలర్ విడుదల
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు యలమంద చరణ్ తెరకెక్కించిన చిత్రం ‘భువన విజయమ్’. కిరణ్, వీఎస్కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నువ్వు చనిపోతే తీసుకెళ్లడానికి వచ్చిన యమ భటులం.. అట్లాంటప్పుడు మనం నరకానికి పోవాలి కానీ ఈ సినిమా ఆఫీసుకు వచ్చుడేంది సర్’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘ఫన్, ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: సాయి. -
యాంకర్ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్‌బాబు సపోర్ట్
సంగీత్ శోభన్, శాన్వి జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమ విమానం'. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గూఢచారి','రావణాసుర'వంటి హిట్ సినిమాలు నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ జీ5తో సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. ఓ పల్లెటూరిలో ఇద్దరు పిల్లలు కొండనెక్కి విమానం చూస్తుంటారు. అసలు విమానం ఎలా పైకి ఎగిరింది? విమానంలోకి ఎక్కాలన్న కోరికతో పలు సందేహాలతో టీజర్ మొదలవుతుంది. సంతోష్ కట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. Presenting the teaser of #PremaVimanam! Wishing the team all the very best! ♥️https://t.co/PKys0pqm6m@AbhishekPicture @saanvemegghana@santoshkata @dopjagadeeshch @anusuyakhasba @vennelakishore @anuprubens @vasupotini @mohitrawlyani @ZEE5Telugu — Mahesh Babu (@urstrulyMahesh) April 27, 2023 -
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ‘ప్రేమ విమానం’
సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా, అనసూయ భరద్వాజ్, ‘వెన్నెల’ కిశోర్ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’. బాల నటులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా కీలక పాత్రలు చేశారు. సంతోష్ కటా దర్శకత్వంలో దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్, జీ5లపై అభిషేక్ నామా నిర్మిస్తున్న వెబ్ ఫిల్మ్ ఇది. బుధవారం (ఏప్రిల్ 19) అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ‘ప్రేమ విమానం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఫ్లైట్ ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ఓ ప్రేమ జంట, ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయతి్నంచే ఇద్దరు పిల్లలు.. ఇలా వివిధ వ్యక్తుల ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు.. వంటి ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
Birth Of Bhuvana Vijayam: ఫోస్టర్ చూస్తే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కి పోవాలి
సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భువన విజయమ్’. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్; టైటిల్ పడటం ఆసక్తికరంగా ఉంది. ఇక చివర్లో ‘నా ఫోస్టర్ చూస్తే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కి పోవాలి’అని సునీల్ అంటుంటే.. వెన్నెల కిశోర్ స్కెచ్‌తో సునీల్ పోస్టర్ని మార్చడం నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు, దటీజ్ మనోజ్: వెన్నెల కిశోర్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. భూమా మౌనికను పెళ్లాడాడు. మార్చి 3న జరిగిన వీరి వివాహానికి అతి దగ్గరి బంధుమిత్రులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన మనోజ్, మౌనికల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మనోజ్ పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి కమెడియన్ వెన్నెల కిశోర్ వాయిస్ అందించడం విశేషం. 'పెళ్లి.. మ్యారేజ్.. మూడు ముళ్ల బంధం, ఆరడుగుల అనుబంధం.. సారీ, మావాడు ఆరడుగులు కదా, సో సెంటిమెంటల్‌గా ఉంటుందని బ్రేకింగ్ ద రూల్స్! M, M ఫ్రెండ్స్ కదా.. అలాగే ఉంటాయి మరి!' అంటూ మనోజ్, మౌనికల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు వెన్నెల కిశోర్. 'వయసుతో సంబంధం లేకుండా, రేంజును చూడకుండా నచ్చితే నావాడు, మెచ్చితే మనోడు.. అదే మంచు మనోజ్ లైఫ్ స్టైల్. డిగ్రీ సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మాత్రం 14 ఉన్నాయి. మనోడికి ఫారిన్ వెళ్లి మరీ చదివిన సీమబిడ్డ భూమా మౌనికతో ఆ దేవుడు ముడి వేశాడు. వీళ్లిద్దరిదీ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. నేను నీకెలా సాయపడగలను? అని వాట్సాప్ స్టేటస్ కాకుండా ఏకంగా ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. నమ్మితేనే చేయందిస్తాడు.. అలాంటిది నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు. దటీజ్ మనోజ్. ఏడడుగులు.. ఏడేడు జన్మల వరకు అలాగే ఉండాలని కోరుకుంటున్నా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని ముగించాడు వెన్నెల కిశోర్. -
ఇండియన్ 2లో విలన్‌గా వెన్నెల కిశోర్, ఇదిగో క్లారిటీ!
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ తొలిసారి నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడంటూ ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారతీయుడు 2లో వెన్నెల కిశోర్ విలన్ రోల్ చేస్తున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ఓ అభిమాని 'ఏంటి కాకా.. ఇది నిజమా?' అని అడిగాడు. దీనికి సదరు కమెడియన్ స్పందిస్తూ.. 'ఇండియన్ 2లో లేను, పాకిస్తాన్ 3లో లేను' అని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఈ రూమర్స్‌కు తెర దించినందుకు థ్యాంక్స్ భయ్యా అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇండియన్ 2 విషయానికి వస్తే.. కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనప్పటికీ వివాదాలు, ప్రమాదాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం నాన్‌స్టాప్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. Indian 2 lo lenu Pakistan 3 lo lenu pic.twitter.com/gJUmmoO9GG — vennela kishore (@vennelakishore) February 28, 2023 -
టొరెంటోలో ఘనంగా ప్రారంభమైన తెలుగు చిత్రం
6 సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో సూర్య బెజవాడ నిర్మాతగా తెరకెక్కుతున్న ఓ సినిమా రీసెంట్గా టొరెంటో తెలుగు ప్రేక్షకల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరెంటో అపూర్వ శ్రీవాస్థవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించిన వరుణ్ కోరుకొండ తొలిసారి ఫీచర్ ఫిలింను డైరెక్ట్ చేయబోతున్నారు. తన చిత్రాల తరహాలోనే థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతొంది. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిషోర్‌లో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలో కనిపంచనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ కొరుకొండ మాట్లాడుతూ.. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను, టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేస్తామని చెప్పారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర నిర్మాత సూర్య బెజవాడ పేర్కొన్నారు. -
ఆ ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను: శ్రీకార్తీక్
‘‘మనం ఏదైనా పనిని నిజాయితీగా చేస్తుంటే ఈ విశ్వమే తోడై మనల్ని ముందుకు నడిపిస్తుంటుందని నా నమ్మకం. ‘ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్ సమయంలో ఈ విషయం నాకు చాలా సందర్భాల్లో అనుభవంలోకి వచ్చింది. అలాగే అన్ని వేళలా సహనంతో ఉండాలని ఈ సినిమాతో నేర్చుకున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీ కార్తీక్. శర్వానంద్, రీతూ వర్మ జంటగా అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది (చదవండి: ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది) ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు శ్రీకార్తీక్ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ట్రై చేసి, అవకాశాలు రాకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో నేనే రాయాలి, నేనే తీయాలనుకుని కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫల్మ్స్ చేశాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మా అమ్మగారు అపస్మారక స్థితిలో ఉన్నారు. నేను ఫిల్మ్‌మేకర్‌ను అవుతానని కూడా ఆమెకు తెలియదు. ఈ విషయంలో నాకు పశ్చాత్తాపం ఉండేది. దాంతో కాలాన్ని వెనక్కి తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని టైమ్ మిషన్ బ్యాక్‌డ్రాప్ పెట్టాను. ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. శర్వానంద్ లాంటి హీరో ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయడమే పెద్ద సక్సెస్. కథ విన్న వెంటనే అమలగారు ఒప్పుకున్నారు. ఇక అల్లు అర్జున్ గారి కోసం నా దగ్గర ఓ రియల్ ఫ్యాంటసీ కథ ఉంది’’ అన్నారు. -
అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు. ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘మా బ్యానర్ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ. -
'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ
టైటిల్: వాంటెడ్ పండుగాడ్ నటీనటులు: సునీల్, సుడిగాలి సుధీర్, అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కథ, స్క్రీన్‌ప్లే: జనార్ధన మహర్షి ఎడిటర్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల సమర్పణ: కె. రాఘవేంద్ర రావు నిర్మాతలు: సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి దర్శకత్వం: శ్రీధర్ సీపాన విడుదల తేది: ఆగస్టు 19, 2022 బుల్లితెర నటీనటులు సుడిగాలి సుధీర్, సునీల్, యాంకర్ అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, హాస్య నటులు వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించిన తాజా చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెల మూడి నిర్మించారు. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్స్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేర కామెడీని పంచిందో రివ్యూలో చూద్దాం. కథ: పాండు ఉరఫ్ పండు (సునీల్) పోలీసులను కొట్టి చంచల్ గూడా జైలు నుంచి తప్పించుకుంటాడు. అలా జైలు నుంచి పారిపోయిన పండు నర్సాపురం అడవిలో దాక్కున్నాడని మీడియాలో కథనాలు వస్తాయి. పండును పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ విషయం తెలిసి పండును పట్టుకునేందుకు అఖిల్ చుక్కనేని (వెన్నెల కిశోర్), విక్రమ్ రాథోడ్ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) తదితరులు అడవిలోకి వెళ్తారు. అసలు వారికి డబ్బు ఎందుకు అవసరమైంది? ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నారు? ఆ అడవిలో గంజాయి ఎవరు పెంచారు? కోయజాతి అమ్మాయిగా ఝాన్సీ (అనసూయ) అడవిలో ఎందుకు తిరుగుతుంది? అనే తదితర విషయాలు తెలియాలంటే వాంటెడ్ పండుగాడ్ చూడాల్సిందే. విశ్లేషణ: 'వాంటెడ్ పండుగాడ్' సినిమాకు 'పట్టుకుంటే కోటి' అనే క్యాప్షన్‌తోనే కథేంటో చెప్పేశారు. ఇక సునీల్ జైలు నుంచి తప్పించుకోవడం, అతన్ని పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ప్రకటించడం, తర్వాత విభిన్న నేపథ్యాలతో పాత్రలను పరిచయం చేయడంతో సినిమా కథ అర్థమైపోతుంది. బుల్లితెరతో పాపులారిటీ సంపాందించుకున్న సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ, దీపికా పిల్లి కనిపించడంతో అది కూడా ఒక టీవీషోలా తోస్తుంది. కొద్దిసేపు సినిమాల ఫీల్ అవ్వడానికి సమయం పడుతుంది. కొంచెం అతికించిపెట్టినట్లుగా ఉన్న కామెడీ ట్రాక్‌తో పట్టాలు ఎక్కిన సినిమా అకడక్కడ బాగానే నవ్విస్తుంది. వివిధ హిట్ సినిమాల్లోని డైలాగ్‌లను స్ఫూఫ్ చేసి బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక పాటలు, అందులో హీరోహీరోయిన్స్‌ను చూపించిన విధానం దర్శకేంద్రుడి రాఘవేంద్ర రావు శైలి కనిపిస్తుంది. అయితే సినిమా కామెడీ జోనర్ కావడమో, మాములు ఆర్టిస్ట్‌లు కావడంచేతనో ఆ శైలి బాగా ఎక్కకపోయిన హీరోయిన్ల అభినయం, అందచందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'అబ్బ అబ్బ' అనే పాట అలరించేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అతిథిపాత్రలో బ్రహ్మానందం మెరిసారు. ఆయన తరహా హాస్యంతో కామెడీ పండించారు. ఎవరెలా చేశారంటే? ఖైది పండుగా సునీల్ నటన బాగానే ఉంది. కానీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే నడిచినా, నటనకు అంతా ప్రాధాన్యత ఇచ్చేలా లేదు. రెండు చోట్ల ఉండే యాక్షన్ సీన్లలో సునీల్ అదరగొట్టేశాడనే చెప్పవచ్చు. ఇక సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, అనసూయ, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వాసంతి క్రిష్ణన్ తనికెళ్ల భరణి, ఆమని పాత్రలు పరిధిమేర నటించి పర్వాలేదనిపించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వీరాజ్ తమ కామెడీ టైమింగ్‌తో ఆద్యంత ఆకట్టుకున్నారు. నిజానికి సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవాలంటే వారి కామెడి గురించే చెప్పుకోవచ్చు. స్క్రిప్టుకు తగినట్లుగా వచ్చే డైలాగ్‌లు నవ్వు తెప్పించేలా బాగున్నాయి. శ్రీధర్ సీపాన దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే కొంత గ్లామర్, కొంత కామెడీతో ఆకట్టుకుంటాడు ఈ 'వాంటెడ్ పండుగాడ్' -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ రివ్యూ
-
ఒకే ఫ్రేమ్‌లో మన తెలుగు కమెడియన్స్, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్
వెండితెరపై మనల్ని కడపుబ్బా నవ్వించే మన తెలుగు కమెడియన్స్ అంతా ఒకచోటే చేరితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటూనే వారు చేసే రచ్చ ఎలా ఉంటుందో కళ్ల ముందు కదలాడుతుంది కదా. మరి నిజంగానే వారంత ఒక్కచోట చేరితే. ఇక ఫ్యాన్స్, ప్రేక్షకులకు కనులవిందె. వేణు(టిల్లు), సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్ పలువురు కమెడియన్స్ ఒకప్పుడు మనల్ని తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అయితే కొంతకాలంగా వారిలో కొంతమంది వెండితెరపై తక్కువగా కనిపిస్తున్నారు. చదవండి: షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్ దీంతో దీంతో వారి కామెడీని, నటనను మన తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అలాంటి వారికి మరోసారి కనువిందు చేసే ఓ ఫొటతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన ఒకప్పటి కమెడియన్స్‌తో పాటు ఇప్పుటి కమెడియన్స్ అంతా ఒక్కచోట చేరారు. వేణు, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! View this post on Instagram A post shared by Dhanraj (@yoursdhanraj) ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు. తాజాగా సండే వీకెండ్ సందర్భంగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, ప్యాంటుతో మెరిపించారు. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు(టిల్లు) వారందరి గ్రూప్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ నిన్న మా కలర్స్‌తో హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. అలాగే ధన్‌రాజ్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ షేర్ చేశాడు. చదవండి: రియల్ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ View this post on Instagram A post shared by Venu Tillu (@venu_tilloo) -
వెన్నెల కిషోర్ బర్త్‌డే స్పెషల్: ‘కాకా నువ్వు కేక!
-
సరికొత్తగా శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్‌లుక్
నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ 30వ చిత్రంగా ‘ఒకే ఒక జీవితం’ తెరకెక్కతుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ఫ్రభులు నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీకి ఒకే ఒక లోకం అనే టైటిల్‌ను మేకర్స్ చేశారు. శర్వానంద్ గిటార్‌తో దర్శనం ఇచ్చాడు. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతుంది. ఇక సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్‌లో పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరోవైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్స్‌తో ఉన్న ఈ పోస్టర్‌ను చూస్తుంటే ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఈ మూవీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఇందులో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి సహానటులుగా కాగా అక్కినేని అమల ఒక కీలక పాత్ర పోషించనుండటం విశేషం. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీకి జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. -
Raj Tarun: రాహుల్.. కూర్చుంది చాలు!
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ఉపశీర్షిక. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్. సిద్ధు ముద్ద సమర్పణలో నంద్ కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 11) రాజ్ తరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘వెన్నెల’ కిశోర్, ఇంద్రజ, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్ ఆగస్తి సంగీతం అందిస్తున్నారు. చదవండి : TNR 'ప్లే బ్యాక్', ఆహాలో ఎప్పటినుంచంటే? మా ఇంట్లో ఆరుగురికి కరోనా: నటుడు -
నా లైఫ్‌లైన్ రా నువ్వు..
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ‘వెన్నెల’ కిషోర్ పుట్టినరోజు నేడు. నేటితో ఆయన 40వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలతో పాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లకాలం ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని సూపర్ స్టార్ మహేష్ బాబు విష్ చేయగా.. ‘‘హ్యాపీ బర్త్‌డే కాకా’’ అంటూ సుధీర్ బాబు ఓ పాత వీడియోను షేర్ చేశారు. సముద్రంలో పడవప్రయాణం చేస్తున్న దృశ్యాలను షేర్ చేస్తూ, ‘‘ఇలాంటి సాహసాలు మరెన్నో చేద్దాం, నీ భయాలన్నింటినీ పటాపంచలు చేద్దాం’’ అంటూ ఆట పట్టించాడు. ఇక సుశాంత్.. ‘‘హ్యాపీ బర్త్‌డే బోస్’’ అంటూ కిషోర్‌తో కలిసి ఉన్న పాత ఫొటోను చేశాడు. (చదవండి: అలియాస్ వెన్నెల కిషోర్ కూడా ఆ కోవలోని వాడే!) అదే విధంగా అడవి శేష్.. ‘‘ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి రా. నాకు మంచి స్నేహితుడిగా, ఓ సోదరుడిగా, సలహాదారుగా ఎంతో ప్రియమైన వాడివి. నేను ప్రతిరోజూ నవ్వుతున్నానంటే అందుకు నీ జోకులే కారణం. లైఫ్‌లైన్ రా నువ్వు’’అంటూ మస్కటీర్స్ షో(పాపులర్ అమెరికన్ షో)ను గుర్తుచేస్తూ కిషోర్‌తో తన అనుబంధం గురించి రాసుకొచ్చాడు. వీళ్లతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, అనసూయ భరద్వాజ్, మంచు మనోజ్, లావణ్య త్రిపాఠి, శ్రీనివాస్‌రెడ్డి, గోపీచంద్ మలినేని, రవితేజ, అనిల్ రావిపూడి తదితర సెలబ్రిటీలు వెన్నెల కిషోర్‌ను విష్ చేశారు. కాగా 2005లో వెన్నెల సినిమాతో వెండితెరకు పరిచయైన కిషోర్ కుమార్ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు. దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న కిషోర్, తనదైన శైలిలో హాస్యం పండిస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. Happy birthday @vennelakishore!! Be as cheerful as you always are... Have a great one 🤗🤗🤗 — Mahesh Babu (@urstrulyMahesh) September 19, 2020 Happy Birthday Kaka @vennelakishore ... A throwback to your daredevil adventure 😀 If there are any left, I wish you keep your all other fears at bay from this birthday 😉 You can do this 💪 pic.twitter.com/Hqf1J0jRBX — Sudheer Babu (@isudheerbabu) September 19, 2020 -
అలియాస్ వెన్నెల కిషోర్ కూడా ఆ కోవకే
అవకాశం రావాలే గానీ ‘హీరోయిజం’ ప్రదర్శిచేందుకు నటులు ఎల్లప్పుడూ ముందే ఉంటారు. కానీ కామెడీ చేయమంటే మాత్రం కాస్త వెనకడుగు వేస్తారు. ఎందుకంటే నవ్వడం ఓ భోగమైతే.. ఇతరులను కడపుబ్బా నవ్వించడం ఓ యోగం. అవును మరి.. నవరసాల్లో చిన్నాపెద్దా అందరికీ ఇష్టమైన హాస్యరసం పండించడం అంటే మాటలు కాదు. అలాంటి వరం కొందరికే లభిస్తుంది. తెలుగు చిత్రసీమలో రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్య వంటి పాతతరం నటులు నవ్వుల రారాజులుగా ఓ వెలుగు వెలిగారు. ఇక వాళ్ల వారసులుగా బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ వేణు మాధవ్, సునీల్ వంటి కమెడియన్లు తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. తొలిసినిమా పేరునే ఇంటిపేరులా మార్చేసుకున్న బొక్కల కిషోర్ కుమార్ అలియాస్ వెన్నెల కిషోర్ కూడా ఈ కోవకే చెందుతాడు. తనదైన డైలాగ్ డెలివరీ, హావభావాలు పాటు పర్ఫెక్ట్ కామెడీతో నవ్వులు పూయించే ఈ కామెడీ కింగ్ నేడు 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా కిషోర్ టాప్ 5 పెర్ఫామెన్స్‌పై ఓ లుక్కేద్దాం. పొట్టచెక్కలయ్యేలా.. కామారెడ్డికి చెందిన బొక్కల కిషోర్ కుమార్ హైదరాబాద్‌లో చదువుకున్నాడు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన అతడు దేవ కట్టా ‘వెన్నెల’సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఖాదర్ భాషాగా కిషోర్ పండించిన కామెడీని ఎవరూ అంతతేలికగ్గా మరచిపోలేరు. ఇలా మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు ‘వెన్నెల’ కిషోర్. ఇంకోసారితో తొలి అవార్డు ఈ సినిమాలో‘బాలా బొక్కల’ పాత్రలో జీవించి నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. రాజా, రిచా, మంజరి, రవి, సాందీప్ల స్నేహ బృందంలో ఒకడిగా ఉంటూ కామెడీతో పాటు అవసరమైన చోట ఎమోషన్స్‌ను కూడా చక్కగా పండించి తనలోని విభిన్న కోణాన్ని బయటపెట్టాడు. (చదవండి: విదేశీయులను పెళ్లాడిన నటీమణులు) దూకుడు వెన్నెల కిషోర్‌కు కమర్షియల్‌గా బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా దూకుడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వంటి హాస్య నట దిగ్గజాలు ఉన్నప్పటికీ, శాస్త్రిగా తన ఉనికిని చాటుకుంటూ ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాడు. బామ్మ విషయంలో మహేష్- వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్స్‌ను ఆడియన్స్ అంత తేలికగ్గా మరిచిపోలేరు. భలే భలే మగాడివోయ్ వెన్నెల కిషోర్‌కు మరో నంది అవార్డును తెచ్చిపెట్టిన సినిమా ఇది. లక్కీ ఫ్రెండ్‌గా ప్రతిసారీ ఎవరో ఒకరి చేతిలో బుక్కయ్యే పాత్రలో, పర్ఫెక్ట్ టైంతో కామెడీని పండించాడు. బాద్ షా ఈ సినిమాలో దాసుగా నటించాడు వెన్నెల కిషోర్. హీరోయిన్ జానకి(కాజల్) మంచితనాన్ని ఆసరాగా తీసుకుని, ఆమె ముందు వినయంగా ఉంటూనే, తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకునే ‘కన్నింగ్’ క్యారెక్టర్లో జీవించేశాడు. ఆ తర్వాత హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో కుడితిలో పడ్డ ఎలుకలా, కక్కలేక మింగలేక అతడి జట్టులో చేరే దాసు పంచిన వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక వీటితో పాటు బిందాస్, పిల్ల జమిందార్, లవ్లీ, జులాయి, దూసుకెళ్తా, ఎవడు, రన్ రాజా రన్, ఆగడు, సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, చి.ల.సౌ., గీత గోవిందం, అర్జున్ సురవరం, భీష్మ వంటి సినిమాల్లో తనదైన శైలిలో ఆకట్టుకున్న వెన్నెల కిషోర్.. ఇలాగే కలకాలం మనల్ని నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ ఆయనకు హ్యాపీ బర్త్‌డే చెప్పేద్దాం!! -
డాక్టర్ బాబుకి వంటలక్క అంటే కోపమెందుకమ్మా?
బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచుతున్న ఈ సీరియల్ ఇప్పటికే వందల ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ ఈ సీరియల్‌కి సంబంధించి ట్విటర్లో ఓ పోస్ట్ చేశాడు. ‘ఎందుకమ్మా అంత మంచి డాక్టర్ బాబుకి ఇంత మంచి వంటలక్క అంటే కోపం’ అని ఓ డైలాగ్‌ను ప్రస్తావించాడు. దీంతో ఆ ట్వీట్ కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. కిషోర్ ట్వీట్‌పై ‘స్టార్ మా’ చానల్ కూడా స్పందించింది. (నెపోటిజమ్‌కు కేరాఫ్‌గా సడక్-2 ) ‘త్వరలోనే డాక్టర్ బాబు వంటలక్క మంచితనాన్ని అర్ధం చేసుకుంటారని కోరుకుందాం కిషోర్ గారు’ అంటూ ట్వీట్ చేసింది. కాగా, 'స్టార్ మా'లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్‌కు చాలా మంది ప్రముఖులు సైతం అభిమానులున్న సంగతి తెలిసిందే. (ఈ రెండింటిలో.. ఏ ఫొటోలో కంగన బాగుంది!? ) త్వరలోనే డాక్టర్ బాబు వంటలక్క మంచితనాన్ని అర్ధం చేసుకుంటారని కోరుకుందాం కిషోర్ గారు 😀😀#KarthikaDeepam #StarMaaSerials https://t.co/SL31NmTdM8 — starmaa (@StarMaa) July 2, 2020 -
ఒక రోజులో జరిగే కథ
భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో ‘వెన్నెల’ కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘302’. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఉపశీర్షిక. కార్తికేయ మిరియాల దర్శకత్వంలో డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు సునీల్ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘302’ ట్రైలర్ బావుంది.. సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు అవినాష్ సుందరపల్లి. కార్తికేయ మిరియాల మాట్లాడుతూ–‘‘క్రైమ్, సస్పె¯Œ ్స, కామెడీతో పాటు హారర్ అంశాలతో ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. ఒక రోజులో జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమీ, రామరాజు, సంగీతం: రఘురాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ రాజా, సహనిర్మాత: టి..వైకుంఠరావు. -
అర్జున్ సురవరం : మూవీ రివ్యూ
టైటిల్: అర్జున్ సురవరం నటీనటులు: నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, సత్య, తరుణ్ అరోరా, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ దర్శకత్వం: టీఎన్ సంతోష్ సంగీతం: సామ్ సీ.ఎస్ సమర్పణ: ‘ఠాగూర్’ మధు నిర్మాత: రాజ్‌కుమార్ ఆకెళ్ల బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పీ మొదటినుంచీ డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ్. హ్యాపీడేస్ నుంచి మంచి కథలతో ఎంచుకుంటూ ప్రతి సినిమాకీ తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం అర్జున్ సురవరం. తమిళ సూపర్‌హిట్ ‘కణితన్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ జర్నలిస్ట్‌గా నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తోపాటు ఇప్పటివరకు రిలీజైన పాటలు మంచి క్రేజ్తెచ్చాయి. ఇంతకు రిపోర్టర్ అర్జున్ సురవరం ఎలా రిపోర్ట్ చేశాడు? ఏ స్కామ్‌ను బయటపెట్టాడు? తెలుసుకుందాం పదండి. కథ: అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్).. తండ్రికి కూడా చెప్పకుండా సాప్ట్వేర్ ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసి జర్నలిజంపై మక్కువతో ఓ టీవీ చానెల్లో రిపోర్టర్‌గా చేరుతాడు. బీబీసీలో పనిచేయాలన్నది అతని కల. ఈ విషయమై కావ్య (లావణ్య త్రిపాఠి)కు అబద్ధం చెప్తాడు. కానీ, కావ్య అర్జున్ పనిచేస్తున్న టీవీ చానెల్ సీఈవో కూతురు కావడంతో నిజం వెంటనే బయటపడుతుంది. మొదట అబద్ధం చెప్పాడని అర్జున్ గురించి నెగిటివ్‌గా థింక్ చేసినా.. బాధ్యతాయుతమైన రిపోర్టర్‌గా అతను పనిచేస్తున్న తీరును గుర్తించి.. బీబీసీలో ఉద్యోగం కోసం కావ్యనే అర్జున్ అప్లికేషన్ పంపుతుంది. అర్జున్‌కు బీబీసీలో ఉద్యోగం వస్తుంది. ఈ క్రమంలో అర్జున్, కావ్య మధ్య ప్రేమ చిగురిస్తుంది. కావ్యకు అర్జున్ ప్రేమ వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు హఠాత్తుగా వచ్చి అర్జున్ను అరెస్టు చేస్తారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి అర్జున్‌తో పాటు మరికొందరు ఎడ్యుకేషన్ లోన్స్ పేరిట బ్యాంకులకు పెద్దమొత్తంలో టోకరా వేసినట్టు పోలీసులు అభియోగాలు మోపుతారు. అర్జున్‌తోపాటు ఇతర నిందితులకు కోర్టు శిక్ష కూడా విధిస్తుంది. కానీ ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో బెయిల్‌పైన బయటకు వచ్చిన అర్జున్ సురవరం ఫేక్ సర్టిఫికెట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ రాకెట్‌ను ఎలా వెంటాడుతాడా? నకిలీ సర్టిఫికెట్లతో సమాజానికి ఎంతో చేటు చేస్తున్న ఎంతోమందిని బయటపెట్టి.. అతి పెద్ద స్కాంను, దాని సూత్రధారిని ఎలా పట్టించడాన్నది మిగతా కథ. విశ్లేషణ: ఫేక్ సర్టిఫికెట్స్‌తో సమాజానికి పెనుసవాలుగా నిలిచిన ఓ భారీ నెట్‌వర్క్‌ను, వ్యవస్థతో మమైకమై అతిపెద్ద స్కాంను ఓ రిపోర్టర్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చడన్నది అర్జున్ సురవరం కథ. తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ సినిమా పవర్ఫుల్ కథతో తెరకెక్కింది. ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల చదువుకున్న నిరుద్యోగులు మోసపోవడమే కాదు.. తప్పుడు పత్రాలతో డాక్టర్లు, ఇంజినీర్లు అయిన వాళ్లు సమాజానికి ఎలా ముప్పుగా మారుతున్నారన్నది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. తమిళ రీమేక్ అయిన ఆ భావన రాకుండా పూర్తి తెలుగు నేటివిటీతో అర్జున్ సురవరంను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి అర్ధభాగం ఇంట్రస్టింగ్ కథనంతో వరుస ట్విస్టులతో దర్శకుడు వేగంగా నడిపాడు. సెకండాఫ్‌లోనే కథ కొంచెం నెమ్మదించింది. ఫేక్ సర్టిఫికెట్స్ నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు హీరో ప్రయత్నించడం.. తన లోగుట్టును బయటకు లాగుతున్న హీరోను తెలుసుకునేందుకు విలన్ వెంటాడటం సెంకడాఫ్‌లో ప్రధానంగా కనిపిస్తుంది. ఫైట్లు, ఛేజింగ్‌లతో అక్కడక్కడ ఓవర్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాను నిలబెట్టేలా బావున్నాయి. ఎమోషనల్ సీన్లను దర్శకుడు బాగా చిత్రీకరించాడు. కానిస్టేబుల్ సుబ్బారావు (పోసాని కృష్ణమురళీ) చనిపోయిన సీన్లో అతని కొడుకు (వెన్నెల కిషోర్) భావోద్వేగాలు.. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ నిజాయితీ గురించి చెప్పే సీన్లు బాగా పండాయి. డైలాగులు బావున్నాయి. పాటలు అంతంతమాత్రం ఉండగా.. నేపథ్య సంగీతం చాలావరకు రణగొణ ధ్వనులతో సీన్లకు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువులు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. నిఖిల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి చివరివరకు సినిమాను తన భుజాలపై మోశాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర హీరో వెంట క్లైమాక్స్ వరకు ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం లేదు. ఫస్టాప్‌లో లవ్‌ట్రాక్ కూడా ఒకటిరెండు సీన్లకే పరిమితమైంది. హీరో స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్ మరోసారి హాస్యాన్ని పంచాడు. విలన్ పాత్రలో తరుణ్ అరోరా ఆకట్టుకోగా, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటులు తమ పరిధమేరకు ఆకట్టుకున్నారు. బలాలు పవర్ఫుల్ కథ ప్రీక్లైమాక్స్‌కు ముందు వచ్చే ట్విస్టులు ఏమోషనల్ సీన్స్ బలహీనతలు సెకండాఫ్‌లో నెమ్మదించిన కథనం అక్కడక్కడ ఓవర్ సినిమాటిక్‌గా ఉండటం నేపథ్య సంగీతం అంత ఆప్ట్‌గా లేకపోవడం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘తోలుబొమ్మలాట’ మూవీ రివ్యూ
మూవీ: తోలుబొమ్మలాట జానర్: ఫ్యామిలీ డ్రామా నటీనటులు: రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిశోర్, హర్షిత, నారాయణరావు, దేవీప్రసాద్ సంగీతం: సురేష్ బొబ్బిలి దర్శకత్వం: విశ్వనాథ్ మాగంటి మనుషులలోని మంచి చెడులను, వాటి వలన కుటుంబంలో ఏర్పడే సమస్యల ఇతివృత్తంగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘తోలుబొమ్మలాట’. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో విశ్వంత్ హీరోగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పల్లెటూరు నేపథ్యంలో నడిచే ఆహ్లాదకరమైన ఈ చిత్రం ఆడియన్స్‌కు ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందా? కొత్త దర్శకుడు ఏదైనా మ్యాజిక్ చేశాడా? రాజేంద్రప్రసాద్ మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడా? కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ఎమోషనల్ అనే యూనివర్సల్ పాయింట్‌ను ప్రధానంగా తీసుకుని వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందా? చూద్దాం. కథ: ‘ఆఖరికి నేరం చేసి ఉరిశిక్ష పడ్డ ఖైదీలను కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు.. దానిని నెరవేరుస్తారు. కానీ వయసు పైబడి ఇంట్లో ఉన్న ముసలివాళ్ల చివరి కోరిక ఏంటని అడగరు, దానిని తీర్చే ప్రయత్నం చేయరు’ నలుగురు వయసుపైబడ్డ వాళ్లు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఇవి. ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభవుతుంది. అనేక ట్విస్టులు, ప్రేమలు, గొడవలు, ఆప్యాయతలు, విలువలు, మంచి మాటలు, కన్నీళ్లు ఇలా అన్నింటి కలబోతే ఈ చిత్రం. సోమరాజు అలియాస్ సోడాలరాజు(రాజేంద్రప్రసాద్) అచ్యుతాపురం అనే గ్రామంలో చాలా గౌరవంగా బతుకుతాడు. ఉద్యోగం, వ్యాపార రీత్యా తన ఇద్దరి పిల్లలు పట్నానికి వెళ్లినా తాను మాత్రం ఒంటరిగా అదే గ్రామంలో ఉంటాడు. రిషి(విశ్వoత్), వర్ష(హర్షిత) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నతనం నుండే ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ప్రేమగా మారుతుంది. తల్లిదండ్రులకు తమ ప్రేమ చెప్పలేక.. తమ పెళ్లి చేయమని తాత సోమరాజు సహాయం కోరతారు. అందరినీ ఒప్పించి ఘనంగా పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. అయితే అనుకోకుండా వచ్చిన ఉపద్రవంతో సోమరాజుతో పాటు అతడి కుటంబం విచ్ఛినమవుతుంది. ఈ సమయంలో సోమరాజుకు కేవలం సంతోష్(వెన్నెల కిశోర్) మాత్రమే సహాయం చేయగలడు. మరి సోమరాజుకు సంతోష్ సహాయం చేస్తాడా? సోమరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? విచ్ఛినమైన తన కుటుంబాన్ని సోమరాజు ఏకం చేశాడా? సోమరాజు కుటుంబానికి వచ్చిన ఆపద ఏంటి? అనేదే మిగతా కథ. నటీనటులు: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, కమెడీయన్‌గా ఫుల్ జోష్‌లో ఉన్న వెన్నెల కిశోర్ సినిమా భారాన్ని పూర్తిగా తమ భుజాలపై వేసుకున్నారు. రాజేంద్రప్రసాద్ తన అనుభవంతో కొన్ని సీన్లలో అవలీలగా నటిస్తాడు. కాదు జీవిస్తాడు. అచ్చం మన ఇంట్లో తాతయ్యలా అనిపించేలా నటకిరీటి నటన ఉంది. ఇక వెన్నెల కిశోర్ తన మార్క్ కామెడీతో నవ్వులు పూయించారు. ఇక యంగ్ హీరో విశ్వంత్‌కు నటన పరంగా అంత స్కోప్ లేప్పటికీ ఉన్నంతలో మెప్పించాడు. అంతేకాకుండా నటుడిగా ఇంప్రూ అయినట్లు కనిపిస్తుంది. అయితే రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల ముందు అతడు తేలిపోతాడు. ఇక హీరోయిన్ హర్షిత తన నటన, అందాలతో ఆకట్టుకుంది. ఇక పూజారామచంద్రన్ తన అందచందాలతో కుర్రకారును హీటెక్కించింది. ధన్‌రాజ్ రెండు మూడు చోట్ల కంటతడిపెట్టిస్తాడు. దర్శకుడి నుంచి నటుడిగా మారిన దేవీప్రసాద్ ఈ సినిమాలో ఫర్వాలేదనిపించాడు. చలపతిరావు, నారాయణరావు, తాగుబోతు రమేశ్, రాజు, దొరబాబు తదితరులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు. విశ్లేషణ ఆ నలుగురు, మీ శ్రీయోభిలాషి, ఓ బేబీ వంటి డిఫరెంట్ కథలతో ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించేలా, అందరినీ ఆలోచింప చేసేలా చేసిన రాజేంద్రప్రసాద్ మరోసారి అలాంటి జానర్‌తోనే ప్రేక్షకుల తలుపు తట్టాడు. ఇలాంటి చిత్రాలు ఆడియన్స్‌కు కనెక్ట్ కావాలంటే కథా బలం ముఖ్యం. లేదంటే మామూలు కథైనా చాలా బలంగా చెప్పాలి. ఎమోషనల్‌గా అందరినీ టచ్ చేయాలి. ఈ సినిమాకు కథే హీరో. అయితే దర్శకుడు మంచి స్టోర్ లైన్ ఎంచుకున్నప్పుటికీ.. పూర్తి స్టోరీగా మల్చడంలో తడబడ్డాడు. ఏం చేయాలో తెలియక ‘ఆ నలుగురు’ ఫార్మట్‌ను ప్రయోగించాడు. దీంతో ఒకసారి చూసిన సినిమాను మరోసారి రిపీట్ చేసి చూసినట్టుంది. కుటుంబ కథా చిత్రాలకు ఎమోషన్స్ ముఖ్యం. ఈ విషయంలో కొత్త దర్శకుడి అనుభవలేమి సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్లు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. కథను ముందుకు తీసుకెళ్లడానికి దర్శకుడు అనేక ఇబ్బందులు పడ్డాడు. పలుమార్లు అనవసర, అసందర్బ సీన్లు తెరపై కనిపించడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. ఇక కుటుంబ కథా చిత్రాలకు మాటలు ముఖ్యం. ఎందుకంటే ‘శతమానంభవతి’ సినిమాలో వచ్చే ప్రతీ డైలాగ్‌ను ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేశారో తెలిసిందే. కానీ ఈ సినిమాలో అలాంటి పవర్ఫుల్ డైలాగ్‌లు వేళ్లపై లెక్కపెట్టోచ్చు. పాటలు పర్వాలేదనిపించినా.. సాహిత్య విలువలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ రాజేంద్రప్రసాద్ నటన వెన్నెల కిశోర్ కామెడీ ప్రెష్ లవ్ సీన్స్ సాహిత్యం మైనస్ పాయింట్స్ బోర్ కొట్టించే కథనం సాగదీత సీన్స్ దర్శకుడి అనుభవరాహిత్యం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు: రాజేంద్రప్రసాద్
‘‘ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓ బేబీ’ వంటి మంచి సినిమాల తర్వాత నేను చేసిన మరో మంచి చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఇలాంటి కథలకు హీరో ఎవరు? అనే దానిపై చర్చలు అనవసరం. ఈ సినిమా చూశాక హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు డా. రాజేంద్రప్రసాద్. విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి జంటగా రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, దేవీప్రసాద్, నర్రా శ్రీనివాస్ ప్రధాన తారాగణంగా విశ్వనాథ్ మాగంటి తెరకెక్కించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కథకి ఎవరైతే నాయకుడు అవుతారో వారే హీరో. ఈ సినిమాలో విశ్వంత్ హీరో’’ అన్నారు. ‘‘ప్రస్తుత కాలంలో ఇలాంటి సినిమాలు రావడం అరుదు. ఇది ప్రతి ఒక్కరి కథ’’ అన్నారు విశ్వంత్. ‘‘నా కుటుంబంతో కూర్చుని చూసే సినిమా చేయాలనుకుని ఈ కథ రాసుకున్నా’’ అన్నారు విశ్వనాథ్ మాగంటి. ‘‘మా యూనిట్‌కి ఈ సినిమా మంచి గుర్తింపు అందించాలి’’ అన్నారు దుర్గా ప్రసాద్. -
తెల్ల కాగితంలా వెళ్లాలి
‘‘నేను డైరెక్టర్ అయినా ఇతర దర్శకుల చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వారికి సలహాలు ఇవ్వను. మనం డైరెక్టర్ అయినా ఒక నటుడిగా నటిస్తున్నప్పుడు ఆ దర్శకుడి వద్దకు తెల్ల కాగితంలా వెళ్లాలి. అప్పుడే దానిపై తనకు నచ్చింది రాసుకుంటాడు’’ అని దేవీ ప్రసాద్ అన్నారు. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్య పాత్రల్లో విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన దేవీ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ► ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లాదకరమైన కథ. మనుషుల్లోని మంచీ చెడులు, వాటి వల్ల ఏర్పడే సమస్యల ఇతివృత్తంగా తెరకెక్కింది. ► సాధారణంగా కొత్త దర్శకుడు లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్ లేదా యాక్షన్ చిత్రాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ విశ్వనాథ్ దానికి భిన్నంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నాడు. ► ఓ గ్రామంలోని పెద్దాయన కొడుకు పాత్ర నాది. కెరీర్ కోసం పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిన వ్యక్తిలా కనిపిస్తాను. మనం, మన సంపాదన, భవిష్యత్తు అనే ఆలోచనా ధోరణి ఉంటుంది. ► రాజేంద్రప్రసాద్‌గారితో చేయాలనే నా కోరిక ‘తోలుబొమ్మలాట’ తో నెరవేరింది. ఆయనతో పాటు ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటులందరి నుంచి నాకు తెలియని చాలా విషయాలు ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. -
ఐదుపైసల సోడా గుర్తొచ్చింది
‘‘నా 42 ఏళ్ల నటజీవితంలో మొదటి ఐదు సినిమాల వరుసలో నిలిచే చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఇందులో సోడాల రాజు పాత్రలో నటించా. ఐదు పైసలతో సోడాలు తాగిన రోజులను ఈ సినిమా గుర్తు చేసింది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏమేం చేశాం? మన మూలాలు ఏంటి? అని తెలియజెప్పడానికైనా ఓ మంచి సినిమా ఉండాలి. ఆ లోటును తీర్చే సినిమా ‘తోలుబొమ్మలాట’. సాధారణంగా ఇలాంటి కథని 50 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు చేయాలి. కానీ, విశ్వనాథ్ వంటి కుర్ర దర్శకుడు ఈ కథ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ‘ఆ నలుగురు’ సినిమా చేశాక ఇంతకంటే ఇంకేముంటుందిలే అనుకున్నా. ఒళ్లు దగ్గర పెట్టుకో అని నన్ను మళ్లీ హెచ్చరించిన కథ ఇది. నా నటజీవితంలో మరుపురాని సినిమా ఈ ‘తోలుబొమ్మలాట’ అన్నారు. ‘‘ఈ కథను రాసుకుని రాజేంద్రప్రసాద్‌గారి దగ్గరకు వెళ్లినపుడు ఓ గురువులా నన్ను ప్రోత్సహించారు’’ అన్నారు విశ్వనాథ్ మాగంటి. ‘‘కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కింది’’ అన్నారు విశ్వంత్. ‘‘ఈ చిత్రంలో సోడాలరాజు స్నేహితుని పాత్ర చేశా’’ అన్నారు సీనియర్ నటుడు నారాయణరావు. నటుడు దేవీప్రసాద్, పాటల రచయిత చైతన్యప్రసాద్, హీరోయిన్ హర్షితాచౌదరి, నర్రా శ్రీనివాస్, కల్పన, సంగీతదర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామన్ సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ నూకవల్లి, ఆర్ట్‌డైరెక్టర్ మోహన్ కె.తాళ్లూరి తదితరులు పాల్లొన్నారు. -
హ్యాప్పీ బర్త్‌డే సంతూర్: పెన్సిల్ పార్థసారథి
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్నారు వెన్నెల కిషోర్. 2005లో విడుదలైన వెన్నెల చిత్రంతో వెండితెరకు పరిచమయ్యి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాక సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని వెన్నెల కిషోర్‌గా మారారు.. దాదాపు దశాబ్ద కాలంగా తన కామెడీతో తెలుగు ప్రేక్షకులు అలరిస్తున్న వెన్నెల కిషోర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ‘హాపి బర్త్‌డే సంతూర్ ఫ్రమ్ యువర్ వన్ అండ్ ఓన్లీ పెన్సిల్గాడా’ అంటూ హీరో నాని, వెన్నెల కిషోర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరు వీ చిత్రంలో నటిస్తున్నారు. Happy birthday santoor @vennelakishore From your one and only pencilgaada 😘 *Picture caught under the table during his birthday celebrations in Phuket V at #V going steady 😉 pic.twitter.com/sMr8Tbp7RP — Nani (@NameisNani) September 19, 2019 ప్రస్తుతం వీ చిత్ర షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సెట్లోనే వెన్నెల కిషోర్‌తో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీ చిత్రంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా వెన్నెల కిషోర్ తన కామెడీతో కడుపుబ్బ నవ్వించున్నాడట. Sweet of u sirjeee🤗🤗🤗...Your heart is isopure..thank youuuuu https://t.co/wJr6XcRX2X — vennela kishore (@vennelakishore) September 19, 2019 -
రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా
‘‘నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. 25 తమిళ్, 2 మలయాళం, ఒక హిందీ సినిమా చేశా. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారని చాలామంది అడుగుతుంటారు. మా నాన్న రాజేష్‌గారు ‘మల్లె మొగ్గలు, రెండు జళ్ల సీత, ‘అలజడి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. మా అత్త శ్రీలక్ష్మిగారు కమెడియన్‌గా అందరికీ సుపరిచితురాలు. మా తాత అమర్‌నాథ్‌గారు కూడా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. మేం తెలుగువాళ్లమే’’ అని ఐశ్వర్యా రాజేష్ అన్నారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’. కె.యస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్ చెప్పిన విశేషాలు. ► తమిళ్లో నా పాత్రలన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. తెలుగులో కూడా మంచి సినిమాతో పరిచయం అవ్వాలని తాపత్రయపడేదాన్ని. ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఓ మంచి సినిమాతో పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో నేను లీడ్ రోల్ చేసిన ‘కణ’కి ఇది రీమేక్. తమిళ ప్రేక్షకుల్లా తెలుగు ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకం ఉంది. ► రాజేంద్రప్రసాద్‌గారు మా నాన్నగారికి మంచి ఫ్రెండ్. ఆయనతో నటిస్తున్నప్పుడు మా నాన్నగారి గురించి చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. కె.యస్. రామారావుగారు పట్టుబట్టి ఈ సినిమా బాగా రావడానికి తోడ్పాటునందించారు. ఈ సినిమా మా అందరికీ ఒక మంచి తీపిగుర్తుగా నిలుస్తుంది. ► క్రికెట్‌కి మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ఆ ఫీల్ పోకూడదని ఫీమేల్ కోచ్‌ని పెట్టుకొని ప్రాక్టీస్ చేశాను. అలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నేర్చుకున్నాను. తమిళ్లో ఎలాగైతే రోజుకి ఎనిమిది గంటలు ఎండలో కష్టపడ్డానో.. తెలుగుకి కూడా రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డాను. ఇంత కష్టపడ్డాను కాబట్టి తెలుగులో మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ప్రస్తుతం ‘కౌసల్య కృష్ణమూర్తి’ కోసం ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లోనే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నాను. అలాగే నేను నటించిన మరో చిత్రం ‘మిస్ మ్యాచ్’ త్వరలో విడుదలవుతుంది. -
సైబర్ క్రైమ్ గురించి చెప్పాం
ధృవ కరుణాకర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అశ్వమేథం’. జి.నితిన్ దర్శకత్వం వహించారు. ప్రియా నాయర్, వందనాయాదవ్, శుభా మల్హోత్రా, రూపేష్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో ‘అశ్వమేథం’ నా తొలి చిత్రం. ఈ సినిమాకు ముందు రెండు మరాఠీ సినిమాలకు దర్శకత్వం వహించాను. ఒకటి విడుదలైంది. దానికి ‘దాదాసాహెబ్ ఫాల్కే జన్మభూమి’ అవార్డు వచ్చింది. మరో సినిమా ఈ ఆగస్టులో విడుదల కానుంది. నాకు హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలు వచ్చు. ఈ సినిమా నిర్మాత ద్వారా తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసే అవకాశం వచ్చింది. నాకు తెలుగు భాష రాదు. మాట్లాడగలను. ఇక ‘అశ్వమేథం’ చిత్రం విషయానికి వస్తే.. డిజిటల్ ఎకానమీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సైబర్ క్రైమ్ అంశాలను ప్రస్తావించాం. హీరో ధృవ చాలా కష్టపడ్డాడు. డూప్ లేకుండా చేశాడు. రెండు చేజ్ సీక్వెన్స్‌లను కలుపుకుని సినిమాలో మొత్తం ఎనిమిది యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. చిత్రీకరణలో భాగంగా ధృవ దాదాపు 14సార్లు గాయపడ్డారు. అందుకే సినిమా కాస్త ఆలస్యమైంది.’’ అని అన్నారు ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ప్రభావం బాగా ఉంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోల సినిమాలను మొబైల్స్‌లో ఎక్కువగా చూస్తున్నారు. సౌత్‌కు చెందిన సినిమాలు బాలీవుడ్లో మంచి హిట్ సాధిస్తున్నాయి. రాజమౌళిగారు తెలుగు సినిమా గొప్పదనాన్ని పెంచారు’’ అని చెప్పుకొచ్చారు. -
ఆటకి డేట్ ఫిక్స్
ఐశ్వర్యా రాజేష్, డా. రాజేంద్రప్రసాద్, కార్తీక్‌రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్యపాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్’. నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, భీమనేని శ్రీనివాసరావు కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న మరో గొప్ప సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఎటువంటి సినిమానైనా ఎదుర్కోగలుగుతుందని 200 శాతం విశ్వాసంతో, నమ్మకంతో విడుదల చేస్తున్నాం. క్రియేటివ్ కమర్షియల్స్ ద్వారా మరో మంచి సినిమాను సమర్పిస్తున్నాను. తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా పాటలకు, ట్రైలర్స్‌కి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ‘యు’ సర్టిఫికెట్ పొందింది’’ అన్నారు భీమనేని శ్రీనివాసరావు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.సునీల్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: వి.మోహన్‌రావు. -
ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’
అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’. ఈ సినిమాను ది గాయత్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ మూవీ ఆగస్టులో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ... ‘అనసూయగారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆవిడ కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది. సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9న సినిమా విడుదల చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ‘ఇది నా మొదటి చిత్రం.. క్షణం, రంగస్థలం తర్వాత అనసూయ చేస్తున్న ఈ కథనం సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసిన హిట్. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
సోడాల్రాజు
రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. శుక్రవారం రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. ‘‘మా కథకు ప్రధానంగా నిలిచే సోమరాజు పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించారు. సినిమాలో సోమరాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబట్టి అందరూ ఆయన్ని సోడాల్రాజు అని పిలుస్తారు. కుటుంబంలోని సమస్యను ఓ తండ్రి స్థానంలో రాజేంద్రప్రసాద్ ఎలా పరిష్కరించానేది కథ’’ అన్నారు విశ్వనాథ్. ‘‘జీవితమంటేనే ఒక తోలుబొమ్మలాట. ఎవరి ఆట వారు ఆడాల్సిందే. కాకపోతే కొన్నిసార్లు ఆ ఆటలో చిక్కుముడులు ఉంటాయి. ఆ చిక్కుముడులను రాజేంద్రప్రసాద్ ఎలా విప్పారనేదే ముఖ్య కథాంశం. ఇదొక విభిన్న కుటుంబ కథా చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అన్నారు దుర్గా ప్రసాద్. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. -
తండ్రీకూతుళ్ల మధ్య ఆప్యాయత
రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. క్రికెటర్’. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమా రాజమండ్రిలో ప్రారంభమైంది. కార్తీక్‌రాజు, ఐశ్వర్యా రాజేష్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు, ఎం.పి. మురళీమోహన్ క్లాప్ ఇవ్వగా, ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సత్యనా రాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది? అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం’’ అన్నారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ– ‘‘విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ ఓ హీరోయిన్గా నటిస్తోంది. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఐశ్వర్య ఒక టీజర్ చూపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్రికెటర్‌గా బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతంగా చేసింది. తర్వాత ఆ కథ చెప్పి, ఆ రైట్స్ కొనిపించి తెలుగులో నన్నే తియ్యమని చెప్పింది. అలా ఈ సినిమా మొదలవడానికి తనే కారణం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ధిబునినన్ థామస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.సునీల్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: వి.మోహన్‌రావు. -
ఆ అదృష్టం కలిసివస్తుందని ఆశిస్తున్న హీరో!
స్వామిరారా.. కార్తీకేయ.. ఎక్కడికి పోతావు చిన్నవాడ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ.. సక్సెస్ సాధించాడు యంగ్ హీరో నిఖిల్. రీసెంట్గా కన్నడ రీమేక్ కిరాక్ పార్టీతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచాడు. అయితే తాజాగా ‘ముద్ర’ తమిళ రీమేక్ (కనితన్)తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్, డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్న నిఖిల్.. ఈ చిత్రం గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో వెన్నెల కిషోర్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ‘వీరిద్దరు కలిసి చేసిన భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్హిట్స్ అయ్యాయి. మళ్లీ ‘ముద్ర’లో కూడా వీరిద్దరు నటిస్తున్నారు. అదే అదృష్టం మళ్లీ కలిసివస్తుందని ఆశిస్తున్నా’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. Todays shoot #Mudra with these two... their last two combos Bhale Bhale nd Soggade Rocked, hope the luck repeats for #Mudra... Note-9 S pen Remote snap 🤗😝😃 @Itslavanya @vennelakishore pic.twitter.com/CYTSzskWyQ — Nikhil Siddhartha (@actor_Nikhil) November 29, 2018 -
అబ్బా ఏం అందం.. ఏమీ లేదు ఏమీ లేదు
సినిమాల్లోనే కాదు సామాజిక మాధ్యమాల్లో కూడా తన అభిమానులను ఎప్పుడూ నవ్విస్తుంటాడు టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్. నటుడు బ్రహ్మాజీతో కలిసి వెన్నెల కిశోర్ సరదాగా తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. కృష్ణ, కాంచన నటించిన ‘అవే కళ్లు’ చిత్రంలో హీరో హీరోయిన్లు ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు అబ్బా ఏం అందం .. ఏమీ లేదు ఏమీ లేదు అంటూ డైలాగ్ ఉంటుంది. అదే సన్నివేశంలో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీలు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి సంభాషణలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. -
అవాయ్ సువాయ్ ఆంటొని
-
వెన్నెల కిషోర్ పాటకు.. నవదీప్ రియాక్షన్!
టాలీవుడ్ కమెడియన్స్‌లో బిజీగా ఉండే వెన్నెల కిషోర్.. సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటాడు. సినిమాల్లో మాదిరిగానే సోషల్ మీడియాలో కూడా హాస్యాన్ని పండిస్తాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ పాడిన పాట, మొదలు పెట్టిన సీజన్ 1 ట్విట్టర్లో వైరల్ అవుతోంది. తిన్నది అరక్క.. అనే కాన్సెప్ట్‌తో చచ్చారు పో అంటూ మొదలు పెట్టిన ఈ మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను సింగర్ చిన్నయికి అంకితం చేశాడు. పాట పాడిన వీడియోను కూడా షేర్ చేశాడు. దీనికి నవదీప్ వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. ఇక వెన్నెల కిషోర్ పాడిన పాటపై బ్రహ్మాజీ కామెంట్ చేస్తూ.. కాకా.. పాట పాడొచ్చు కదా.. లిరిక్స్ చదివావ్ అని అంటే.. నీ దృష్టిని నావైపు మళ్లించడానికే అంటూ రిప్లై ఇచ్చాడు.. వెంటనే బ్రహ్మాజీ స్పందిస్తూ.. నేను సరే అన్నా.. పాపం చిన్నయి ఎలా ఉందో ఒక సారి కనుక్కో అనగానే.. అవునన్నో.. అటునుంచి (చిన్మయి) రెస్పాన్సే లేదంటూ జవాబిచ్చాడు. మళ్లీ వెంటనే చిన్మయి స్పందిస్తూ.. ఇప్పుడే స్పృహ వచ్చిందంటూ రిప్లై ఇచ్చింది. ఇలా ఈ వీడియో కామెంట్లతో వైరల్‌గా మారుతోంది. pic.twitter.com/SrZk7DuoMp — Navdeep (@pnavdeep26) 27 September 2018 -
క్రేజీ ఫీలింగ్
‘కేరింత, మనమంతా’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. పల్లక్ లల్వాని కథానాయికగా నటించారు. సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నూతలపాటి మధు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, ఫీల్, వినోదం... ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సంజయ్ కార్తీక్ ఈ చిత్రం తెరకెక్కించారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. విడుదలయ్యే వరకే మాది చిన్న సినిమా.. రిలీజ్ తర్వాత మంచి విజయం సాధించి పెద్ద సినిమా అవుతుందనే ఆశాభావంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ప్రేమికుల మధ్య ఉండే ఫీలింగ్స్‌ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం. ‘వెన్నెల’ కిశోర్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు సంజయ్ కార్తీక్. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సుభాష్ దొంతి. -
స్కూల్‌కు వెళ్తున్న కమెడియన్లు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హాస్యనటుడు వెన్నెల కిషోర్. సినిమాల్లో ఏవిదంగా ఉంటాడో.. ట్విటర్లో కూడా అలాంటి పంచ్‌లే వేస్తూ.. సమాధానాలు ఇస్తు ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ట్వీట్ ఫన్ క్రియేట్ చేస్తోంది. వెన్నెల కిషోర్ పోస్ట్ చేసిన ఆ ఫోటో వైరల్ అవుతోంది. నిన్న సాయంత్రం సరదాగా కమెడియన్స్ అందరూ స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని దిగిన ఫోటోను షేర్ చేశాడు. బ్యాక్2స్కూల్ థీమ్ పార్టీ అంటూ.. పోస్ట్ చేసిన వెన్నెల కిషోర్.. ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్ వచ్చిందంటూ.. ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో సప్తగిరి, ధన్‌రాజ్, రోలర్ రఘు, చిత్రం శ్రీను, వేణు వండర్లతో పాటు మరికొంతమంది ఉన్నారు. మరి వీరందరూ కలిసి ఆదివారం బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. ‘Back2School’ theme party this time and yep was lil cranky🤣 coz my shorts were way too short🙈..#FlyingColors #MonthlyMeet pic.twitter.com/70H1QuevmU — vennela kishore (@vennelakishore) August 12, 2018 -
‘వెన్నెల’కిశోర్ షూటింగ్ కష్టాలు.. వైరల్!
హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు వచ్చిన ఆఫర్లు వెనక్కి తీసుకోవడం, లేక షూటింగ్స్ వాయిదా పడటం గురించి తరచుగా వింటుంటాం. అయితే కొన్నిసార్లు షూటింగ్ వాయిదాకు బదులుగా షెడ్యూల్ అనుకోకుండా ముందుకు జరిగిపితే (ప్రీ పోన్ చేస్తే) ఎలా ఉంటుందో తెలియాలంటే హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ పోస్ట్ చేసిన వీడియో చూడాలి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ కమెడియన్ పోస్ట్ చేసిన వెంటనే వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’,. మాస్ మహారాజా రవితేజ, ఇలియానా జోడీగా కనిపించనున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్ షెడ్యూలు 15 నిమిషాలు ముందుకు ప్లాన్ చేయగా మేకప్ టైమ్ చాలా టైట్‌గా ఉంటుందని’ ట్రిమ్మింగ్ ఓ వీడియోను వెన్నెల కిశోర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. One of those days where ur shoot call time has been preponed by 15 mins and u hav planned the makeup time xtremely tight🙈😂 #AmarAkbarAnthony pic.twitter.com/5a75N6I4Id — vennela kishore (@vennelakishore) 9 July 2018 -
అనుకోకుండా షూటింగ్ ముందుకు జరిపారని..
-
బిగ్‌బాస్ హౌజ్.. ఇంకొంచెం మసాలా
తెలుగులో టాప్ షోగా దూసుకుపోతోంది బిగ్‌బాస్ రెండో సీజన్. ఏదైనా జరగవచ్చు, ఇంకొంచెం మసాలా అంటూ మొదలైన ఈ షో బాగానే ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే మొదటి ఎలిమినేటర్‌గా బయటకు వచ్చిన సంజన, మిగతా పార్టిసిపెంట్స్‌పై విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రతిరోజు జరిగే పరిణామాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగే బిగ్‌బాస్ కార్యక్రమంలో ‘జంబలకిడిపంబ’ టీమ్ కూడా పాల్గొనబోతోంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరో శ్రీనివాస్ రెడ్డి, హాస్య నటుడు వెన్నెల కిషోర్ ఈ రోజు షోలో కనిపించనున్నారు. వీరిద్దరు బిగ్‌బాస్ హౌజ్‌లో చేసే సందడి చూడాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే. ‘జంబలకిడిపంబ’ సినిమా రేపు (జూన్ 22) విడుదల కానుంది. #JambalakidiPamba stars @Actorysr & @vennelakishore makes crazy surprise entry to Bigg house 😂#BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/FmTmuAVtxa — STAR MAA (@StarMaa) June 21, 2018 -
వాడ్ని కాపాడలేం : యంగ్ టైగర్
సినీ స్టార్స్, వారి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ముఖ్యంగా వారి అభిమానులకు ఇలాంటి విషయాలపై ఆసక్తి మరీ ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టే టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా హీరోలంతా వారికి సంబంధించిన విషయాలను అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఎన్టీఆర్‌కు తన కుమారుడు అభయ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అభయ్ ఫొటోలను, ఇతర విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు ఎన్టీఆర్. తాజాగా ఆయన అభయ్కుసంబంధించిన ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వాడు రోజు తాగాల్సిన పాల కోటాకు సంబంధించిన విషయంలో అభయ్‌ని వాళ్ల అమ్మ నుంచి కాపాడలేం’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. అభయ్ పాలు తాగుతున్న ఫొటోను కూడా షేర్ చేశారు ఎన్టీఆర్. దీనికి ప్రతిగా హాస్య నటుడు వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అంటూ ట్వీట్ చేశారు. Can’t save Abhay from the strict gaze of his mother, when it comes to his daily quota of milk!🤐🤐 pic.twitter.com/2sfS1J78Cr — Jr NTR (@tarak9999) June 9, 2018 🤣🤣🤣cuteness overloaded https://t.co/OxFKehza1r — vennela kishore (@vennelakishore) June 9, 2018 -
నిఖిల్‌తో అందాల రాక్షసి
‘కిర్రాక్ పార్టీ’ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత నిఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టీ.యన్. సంతోష్ దర్శకత్వంలో ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్యా త్రిపాఠిని కథానాయికగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటరై్టనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. నిఖిల్–లావణ్య జంట ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ కలిగిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నాం. ‘విక్రమ్ వేద’ ఫేమ్ శ్యాం సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సమర్పణ: ‘ఠాగూర్’ మధు.