టాలీవుడ్ కమెడియన్స్‌లో బిజీగా ఉండే వెన్నెల కిషోర్.. సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటాడు. సినిమాల్లో మాదిరిగానే సోషల్ మీడియాలో కూడా హాస్యాన్ని పండిస్తాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ పాడిన పాట, మొదలు పెట్టిన సీజన్ 1 ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.
తిన్నది అరక్క.. అనే కాన్సెప్ట్‌తో చచ్చారు పో అంటూ మొదలు పెట్టిన ఈ మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను సింగర్ చిన్నయికి అంకితం చేశాడు. పాట పాడిన వీడియోను కూడా షేర్ చేశాడు. దీనికి నవదీప్ వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. ఇక వెన్నెల కిషోర్ పాడిన పాటపై బ్రహ్మాజీ కామెంట్ చేస్తూ.. కాకా.. పాట పాడొచ్చు కదా.. లిరిక్స్ చదివావ్ అని అంటే.. నీ దృష్టిని నావైపు మళ్లించడానికే అంటూ రిప్లై ఇచ్చాడు.. వెంటనే బ్రహ్మాజీ స్పందిస్తూ.. నేను సరే అన్నా.. పాపం చిన్నయి ఎలా ఉందో ఒక సారి కనుక్కో అనగానే.. అవునన్నో.. అటునుంచి (చిన్మయి) రెస్పాన్సే లేదంటూ జవాబిచ్చాడు. మళ్లీ వెంటనే చిన్మయి స్పందిస్తూ.. ఇప్పుడే స్పృహ వచ్చిందంటూ రిప్లై ఇచ్చింది. ఇలా ఈ వీడియో కామెంట్లతో వైరల్‌గా మారుతోంది.
— Navdeep (@pnavdeep26) 27 September 2018
Comments
Please login to add a commentAdd a comment