
'బలగం' లాంటి మరో సినిమా అని ప్రచారం చేసిన సినిమా 'బాపు'. తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ గతవారమే థియేటర్లలోకి రాగా.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బాపు'. ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. తెలంగాణలోని రైతుల ఆత్మహత్య నేపథ్య కథతో ఈ చిత్రం తీశారు. ప్రచారం వరకు ఓకే కానీ థియేటర్లలో అస్సలు జనాలు పట్టించుకోలేదు. దీంతో బిగ్ స్క్రీన్ పై రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు.
ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 7న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరీ రెండు వారాలకే ఇలా సినిమాల్ని ఓటీటీలోకి తీసుకొచ్చేస్తే.. చిన్న చిత్రాల్ని చూసేందుకు జనాలు థియేటర్లకు వెళ్లడం గ్యారంటీగా తగ్గించేస్తారు.
(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)
'బాపు' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ గ్రామంలో మల్లయ్య (బ్రహ్మాజీ) పత్తి రైతు. వరసగా మూడేళ్లు పంట వేసి నష్టపోతాడు. ఈసారి కూడా అలానే జరుగుతుంది. ఆత్మహత్య చేసుకుంటే రూ.5 లక్షలు వస్తాయని అనుకుంటాడు గానీ ప్లాన్ వర్కౌట్ కాదు.
'మీరు చనిపోవడం ఎందుకు.. మీ బాపూ(తండ్రి) చనిపోయినా డబ్బులు వస్తాయి కదా' అని భార్య (ఆమని) సలహా ఇస్తుంది. అప్పుడు మల్లయ్య ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: మలయాళం నుంచి మరో థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ)
Comments
Please login to add a commentAdd a comment