brahmaji
-
రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు'
'బలగం' లాంటి మరో సినిమా అని ప్రచారం చేసిన సినిమా 'బాపు'. తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ గతవారమే థియేటర్లలోకి రాగా.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బాపు'. ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. తెలంగాణలోని రైతుల ఆత్మహత్య నేపథ్య కథతో ఈ చిత్రం తీశారు. ప్రచారం వరకు ఓకే కానీ థియేటర్లలో అస్సలు జనాలు పట్టించుకోలేదు. దీంతో బిగ్ స్క్రీన్ పై రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు.ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 7న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరీ రెండు వారాలకే ఇలా సినిమాల్ని ఓటీటీలోకి తీసుకొచ్చేస్తే.. చిన్న చిత్రాల్ని చూసేందుకు జనాలు థియేటర్లకు వెళ్లడం గ్యారంటీగా తగ్గించేస్తారు.(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)'బాపు' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ గ్రామంలో మల్లయ్య (బ్రహ్మాజీ) పత్తి రైతు. వరసగా మూడేళ్లు పంట వేసి నష్టపోతాడు. ఈసారి కూడా అలానే జరుగుతుంది. ఆత్మహత్య చేసుకుంటే రూ.5 లక్షలు వస్తాయని అనుకుంటాడు గానీ ప్లాన్ వర్కౌట్ కాదు. 'మీరు చనిపోవడం ఎందుకు.. మీ బాపూ(తండ్రి) చనిపోయినా డబ్బులు వస్తాయి కదా' అని భార్య (ఆమని) సలహా ఇస్తుంది. అప్పుడు మల్లయ్య ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మలయాళం నుంచి మరో థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ) View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu) -
సహజంగా కనిపించే అవకాశం దక్కింది: బ్రహ్మాజీ
‘‘బాపు’ చాలా యునిక్ కాన్సెప్ట్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంటుంది. అప్పుల బాధతో నా పాత్ర ఆత్మహత్యకి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? అనేది ఈ సినిమాలో చూడాలి. ఈ చిత్రం ఫైనల్ కాపీ చూశాను... చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’ అని బ్రహ్మాజీ అన్నారు. దయా దర్శకత్వంలో బ్రహ్మాజీ, ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, ధన్యా బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాపు’.రాజు, సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం దయా ‘బాపు’ కథ చెప్పారు. పాయింట్ చాలా కొత్తగా, నా పాత్ర వైవిధ్యంగా ఉండటంతో పాటు సహజంగా కనిపించే అవకాశం ఉండటంతో ఒప్పుకున్నాను. అయితే బడ్జెట్‌పై చర్చ జరుగుతున్నప్పుడు.. నాకు పారితోషికం వద్దు... విడుదల తర్వాత లాభాలు వస్తే ఇవ్వమని నిర్మాతలకు చెప్పాను. నా తర్వాత ఇతర నటీనటులు కూడా పారితోషికం తగ్గించడం, లొకేషన్లో క్యారవ్యాన్స్ వాడకుండా చిత్రీకరణ జరిపిన ఊర్లో (కరీంనగర్) ఉంటూ సర్దుకుపోవడంతో ఈ మూవీ పూర్తి చేశాం.కథపై ఇష్టం, సినిమాపై నమ్మకంతోనే ఇది సాధ్యపడింది. ఆమనిగారు సహజ నటి. ‘బాపు’ టైటిల్ రోల్లో సుధాకర్ రెడ్డిగారి పాత్రతో ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలోని రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారికి మా సినిమా చాలా నచ్చింది. ఇక ‘సూపర్ డీలక్స్’ సినిమాలో విజయ్ సేతుపతిగారు చేసినటువంటి పాత్ర చేయాలన్నది నా కల. ప్రస్తుతం చిరంజీవిగారి ‘విశ్వంభర’లో ఓ పాత్ర చేశాను. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’తో పాటు తరుణ్ భాస్కర్, రాజ్ తరుణ్ వంటి వారి సినిమాల్లో నటిస్తున్నాను’’ అని తెలిపారు. -
బాపు ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది – నాగ్ అశ్విన్
‘‘బాపు’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంపై క్యూరియాసిటీ కలిగించింది. సినిమా టాక్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్‌ఫుల్ చేస్తారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. బ్రహ్మాజీ లీడ్ రోల్లో దయా దర్శకత్వం వహించిన చిత్రం ‘బాపు’. ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రాజు, సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, చందు మొండేటి, బుచ్చిబాబు సాన, హీరో సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీ ట్రైలర్లో రా ఎమోషన్ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా ఏదైనా పెద్ద చిత్రమే’’ అని చందు మొండేటి చె΄్పారు. ‘‘ఈ సినిమాని దయాగారు చాలా బాగా తీశారు’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని బ్రహ్మాజీ తెలిపారు. ‘‘కిస్మత్’ తర్వాత ‘బాపు’ నా రెండో సినిమా’’ అన్నారు భానుప్రసాద్ రెడ్డి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని పేర్కొన్నారు దయా. -
బ్రహ్మాజీ 'బాపు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
లైలా ఈవెంట్లో పృథ్వీదే వందశాతం తప్పు: బ్రహ్మజీ
టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన లైలా మూవీ ఈవెంట్ వివాదంపై స్పందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన మాటలు వందశాతం తప్పని బ్రహ్మజీ అన్నారు. ఈ విషయంలో పృథ్వీని టార్గెట్ చేయడం సరైందే అని తన అభిప్రాయం వెల్లడించారు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. బ్రహ్మజీ మాట్లాడుతూ..' లైలా ఈవెంట్లో పృథ్వీది తప్పు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడకూడదు. పృథ్వీ మీద రియాక్ట్ అయిన వాళ్లందరూ కరెక్టే. ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్తగా నువ్వు ఇప్పుడు వచ్చి అలా మాట్లాడటం చాలా తప్పు. హీరో మంచి వ్యక్తి. ప్రతి చిన్న సినిమా ఫంక్షన్‌కు విశ్వక్ సేన్ వస్తాడు. పరిచయం లేకపోయినా సరే పిలిస్తే వెళ్లి సపోర్ట్ చేస్తాడు. మా బాపు సినిమా ఈవెంట్‌కు వచ్చి గంటన్నర్ర కారులోనే కూర్చున్నాడు. లైలా ప్రమోషన్లో ఉండి కూడా మాకు మద్దతు తెలిపేందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తి సినిమాకు వచ్చి నువ్వేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు.' అని అన్నారు.(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్.. ఈ బుద్ధి ముందుండాలి!)ప్రస్తుతం బ్రహ్మాజీ బాపు మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే బాపు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. -
బాపు అరుదైన సినిమా: రానా దగ్గుబాటి
రెగ్యులర్‌కి భిన్నంగా ఉండే ‘బాపు’లాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఒక సంస్కృతిని చూపించే ఇలాంటి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకుల్లా నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati ) అన్నారు. బ్రహ్మాజీ(Brahmaji) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘బాపు’(Bapu). దయా దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బాపు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రానా దగ్గుబాటి, నటుడు తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘బాపు’ ట్రైలర్లో మట్టివాసన కనిపించింది. దయాగారు చాలా మంచి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘మన కుటుంబంలోని పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి.ఈ మూవీని అందరం ్రపోత్సహిద్దాం’’ అని దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పేర్కొన్నారు. ‘‘బాపు’ మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి మంచి పేరు రావాలి’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్స్‌లో చూడాలి’’ అని దయా కోరారు. ‘‘నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘బాపు’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్. -
బ్రహ్మాజీ 'బాపు' ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఒక రైతు బాధను కళ్లకు కట్టేలా చూపించే 'బాపు'.. ట్రైలర్ చూశారా?
బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'బాపు'. ‘ఎ ఫాదర్స్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాపు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు.ట్రైలర్ చూస్తే తండ్రి పడే కష్టాలను తెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది. ఒక రైతు తన పిల్లల కోసం పడే తపన, బాధలను కథాంశంగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో బలగం సుధాకర్ రెడ్డి, బ్రహ్మజీ తండ్రీ, కుమారులుగా నటించారు. గతంలో విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతమందించారు. -
నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ
నాగ్ అశ్విన్.. మొన్నటి వరకు ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు తప్పితే..పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మార్మోగిపోతోంది. యావత్ సినీ ప్రపంచం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దానికి కారణంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.(చదవండి: కల్కి దెబ్బకు 'షారుఖ్ ఖాన్' రికార్డ్ బద్దలైంది) నాగ్ అశ్విన్ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడని పొగిడేస్తున్నారు. సామాన్యులు మొదలు..స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ‘కల్కి 2898 ఏడీ’పై రివ్యూ ఇస్తూ.. నాగ్ అశ్విన్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన శైలీలో ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు. (చదవండి: ఆ సంఘటనతో భయమేసింది: నాగ్ అశ్విన్)ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడు. ఆ విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ రిలీజ్ రోజు అరిగిపోయిన చెప్పులను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే డైరెక్టర్ ఎంత సింపుల్ ఉంటాడో చూడండి అంటూ.. ఆయన చెప్పుల ఫోటోలను వైరల్ చేశారు నెటిజన్స్. దానికి సింక్ ఆయ్యేలా బ్రహ్మాజీ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. తెలుగు సినిమా అనుకొంటే వరల్డ్ సినిమా తీశారు . నాగ్ అశ్విన్ గారు.. మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటా. థ్యాంక్యూ ప్రియాంక ,స్వప్న (నిర్మాతలు). మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష’ అని బ్రహ్మాజీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు సినిమా అనుకొంటే world సినిమా తీశారు .@nagashwin7 గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను ❤️..thank యూ ప్రియాంక ..స్వప్న ..మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష 🙏🏼 .#Kalki2808AD 🔥@VyjayanthiFilms 🙏🏼— Brahmaji (@actorbrahmaji) July 1, 2024 -
మరి ఎక్కడ తినమంటారు సార్?: టాలీవుడ్ నటుడు ఆసక్తికర ప్రశ్న
గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పలుచోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. పలు హోటల్ యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడుల్లో ఇంత పెద్దఎత్తున హోటల్ యజమాన్యాలు నిర్లక్ష్యం బయటపడడంతో ఆహార ప్రియుల గుండెల్లో దడ మొదలైంది.తాజాగా ఈ దాడులపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫుడ్ సెఫ్టీ కమిషనర్ ట్వీట్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇలా అయితే మరీ ఎక్కడ తినాలి సార్? ఇంట్లోనేనా? అని రిప్లై ఇచ్చారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లో కుదరని సమయాల్లో ప్రముఖ రెస్టారెంట్స్‌కు వెళ్తుంటారు. ఇలా భాగ్యనగరంలో హోటల్ యజమాన్యాల నిర్లక్ష్యానికి ఆహార ప్రియులు భయపడుతున్నారు. ఇక నుంచి బయట తినాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. Sirr.. Mari ekkada thinamantaru..? Intilonaaa ..? https://t.co/Vs8r0kd83A— Brahmaji (@actorbrahmaji) May 23, 2024 -
బ్రహ్మాజీ కుమారుడు ‘గుట్టు చప్పుడు’ టీజర్
డాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘గుట్టు చప్పుడు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్గా ఆయేషాఖాన్ నటిస్తుంది. రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్, ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని మణీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారథ్యంలో వస్తున్న ఈ సినిమాను డాక్టర్ లివింగ్స్టన్ నిర్మిస్తున్నారు.బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్‌ను సాయి దుర్గాతేజ్ ఆన్లైన్లోను, నేను ఆఫ్‌లైన్‌లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్ కుదిరారు. భారీ బడ్జెట్‌తో తీశారు.ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్ ఇవ్వలేదు' అని నవ్వుతూ అన్నారు.నిర్మాత లివింగ్స్టన్ మాట్లాడుతూ... 'డైరెక్టర్ మణీంద్రన్ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్‌గా ఫీలయ్యా. ఆయనతో నాకు 12 సంవత్సరాల అనుబంధం ఉంది. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌తోనే చేయాలని ముందే డిసైడ్ అయ్యాము. అందుకే పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగీత దర్శకులు హరి గారితో పాటు ఇతర టెక్నీషియన్స్‌ను కూడా మంచి వారిని ఎంచుకున్నాం. ఇదొక ప్రేమ, యాక్షన్, రొమాంటిక్‌తో పాటు మంచి మెసేజ్‌తో కూడిన సినిమా. హీరో సంజయ్ రెండు రకాల షేడ్స్‌ను అద్భుతంగా చేశారు. సినిమాలో ఇంకా మంచి స్టఫ్ ఉంది. క్లైమాక్స్ ఫైట్‌ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్ షుగర్ ఫ్యాక్టరీలో తీశాం.' అని ఆయన అన్నారు. -
అతన్ని చూస్తే భయమేస్తోంది.. రిటైర్ అవుతానంటున్న బ్రహ్మజీ!
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో దాదాపు వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాదిలో విహాన్ తెరకెక్కించిన 'హ్యాంగ్ మాన్' చిత్రంలో ఖైదీలను ఉరి తీసే వైవిధ్యమైన తలారి పాత్రను పోషించారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు మోసాలు చేస్తున్నారంటూ అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రహ్మజీ చేసిన మరో ట్వీట్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'బ్రహ్మజీ గొప్ప మనసు.. డబ్బులు తీసుకోకుండానే చేశాడు') ఇటీవల నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో పిల్లల చదువుల గురించి నవీన్ మాట్లాడే సీన్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. అంతే ఈ సీన్ ట్విట్టర్లో చూసిన బ్రహ్మజీ సైతం ఫిదా అయ్యారు. పోలిశెట్టి నటన చూస్తే నాకు భయమేస్తోంది.. ఇక నేను రిటైర్ అయిపోతా అంటూ ఫన్నీ పోస్ట్ చేశారు. దీనికి నవీన్ సైతం 'మీకు పవర్ ఉంది.. నాకు బ్రెయిన్ ఉంది.. మనిద్దరం కలిస్తే' అంటూ ఫన్నీగానే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ ట్వీట్ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. Ee abbayi talent chusthe naaku bhayamesthundi..ika Nenu retire ayipothe better..🙏🏼🙏🏼🙏🏼 https://t.co/3xQY0hgw1f — Brahmaji (@actorbrahmaji) October 8, 2023 -
వాళ్లే టార్గెట్.. బీ కేర్‌ఫుల్.. వైరలవుతోన్న బ్రహ్మజీ ట్వీట్!
ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రతి రోజు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. చదవుకున్న వాళ్లు సైతం సైబర్ ఉచ్చులో పడి లక్షల్లో మోసపోతున్న సంఘటనలు చూశాం. అయితే సినీ తారలు సైతం వీరి మోసాల పడుతూనే ఉన్నారు. సైబర్ మోసాలు పెరుగుతున్న ఈ రోజుల్లో.. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. సైబర్ తరహాలో సినీ రంగంలో జరుగుతున్న సరికొత్త దోపిడీని తెరపైకి తీసుకొచ్చారు. సినిమా అవకాశాల పేరిట మోసగిస్తున్నారంటూ అలాంటి వారి వివరాలను ట్వీట్లో ప్రస్తావించారు. (ఇది చదవండి: ఆ హీరోతో తొలిసారి జోడీ కడుతున్న నిత్యామీనన్..) బ్రహ్మజీ ట్వీట్లో రాస్తూ..' అందరికీ హెచ్చరిక.. ఈ సెల్ నంబర్(78268 63455 ) డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మేనేజర్ నంబర్లా ఉంటుంది. అతని పేరు నటరాజ్ అన్నాదురై. అతను కాల్ చేసి.. సార్ నేను లోకేశ్ మేనేజర్‌ను. మీ ప్రొఫైల్ ఆయన తదుపరి సినిమా కోసం ఎంపిక చేయబడింది. ఈ సినిమా కోసం కాస్ట్యూమ్‌లు అవసరమవుతాయి. ఆడిషన్ కాస్టూమ్స్ కోసం మీరు డబ్బులు చెల్లించండి. ఆడిషన్స్ అయ్యాక మీరు చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామని అంటారు. ప్రస్తుతం ఇది చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న కొత్త తరహా మోసం.. అబ్బాయిలు జాగ్రత్త..' అంటూ షేర్ చేశారు. అంతేకాకుండా ఆ వ్యక్తిలాగే ఇంకొకరు ఉన్నారంటూ ఫోన్ నెంబర్ వివరాలతో సహా బ్రహ్మజీ ట్వీట్ చేశారు. సత్యానంద్(90877 87999) అనే వ్యక్తి సినిమాల్లోకి రావాలనుకునే వారే లక్ష్యంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారంటూ తెలిపారు. అతన ఓ ప్రముఖ సంస్థ జర్నలిస్ట్‌లా చెప్పుకుంటూ మోసాలకు చేస్తున్నారని.. ఇలాంటి వారి పట్ల బీ కేర్‌ఫుల్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మజీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?) Another fraud guy from Tamilnadu Satydev 90877 87999.. these guys target upcoming actors.. now am getting compliments from new actors.. be careful guys.. — Brahmaji (@actorbrahmaji) October 5, 2023 Alert .. Ph no.. 78268 63455 Name-Natraj Annadurai - Hi everyone, the above number will pose as @Dir_Lokesh sir manager and tell your profile was selected for his next movie.. nd exact costumes will be required for they will bring as rent for which you need to pay and then… — Brahmaji (@actorbrahmaji) October 5, 2023 -
శ్రీలీల డాన్స్ చేస్తుంటే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది
-
Brahmaji Latest Interview: ఫస్ట్ టైమ్ తన గ్లామర్ సీక్రెట్ రివీల్ చేసిన బ్రహ్మాజీ
-
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్‌కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
ఆర్జీవీకి కథ చెబితే ‘కుక్క మొగుడు’ అని టైటిల్ పెట్టాడు : బ్రహ్మాజీ
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ స్టోరీని రామ్ గోపాల్‌వర్మకు వినిపించి టైటిల్ అడిగితే ‘కుక్క మొగుడు’అయితే బాగా సెట్ అవుతుందని చెప్పారు. కానీ మా నిర్మాత మాత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్ అని పెడితేనే బాగుంటుందని ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథ, కథనం రెండూ కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’అని సీనియర్ నటుడు బ్రహ్మాజీ అన్నారు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ టైంలోనే నిర్మాత అప్పి రెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని అప్పుడు చెప్పారు. మరి హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు. ఆ తరువాత ఓ నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు. సంజయ్‌కి స్టోరీ చెబితే నచ్చింది. అలా సినిమా స్టార్ట్ చేశాం. ►సంజయ్ డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మొన్న ఓ సారి పుష్ప పార్ట్ 2 షూటింగ్లో ఉన్నాను. రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది. బన్నీ ఆ ట్రైలర్‌ను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు. ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు. టీం అందరికీ చెప్పి చూపించాడు. ►మామూలుగా నేను కొత్తగా చేసే పాత్రలు రావు. ఎందుకంటే రకరకాల పాత్రలు చేసి ఉన్నాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త కారెక్టర్ దొరికింది. ఓల్డ్ సిటీలో ఉండే లాయర్. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఓ కారెక్టర్. విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను. ► సప్తగిరి నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో మా ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి. సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్‌గా నిలుస్తుంది. ► జూలై 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. అదే టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని జూలై 29న ఫిక్స్ అయ్యాం. ► భీమ్స్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. మా సినిమాకు మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారు. మ్యూజికల్ హిట్ అవుతుంది. ► సుకుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తాను అని అన్నారు. కానీ అర్జెంట్‌గా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. రాలేకపోతోన్నాను.. వీడియో బైట్ పంపిస్తాను అని మెసెజ్ పెట్టారు. ఆయన ఇక్కడ ఉండుంటే.. కచ్చితంగా వచ్చేవారు. ► ప్రస్తుతం మహేశ్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్, బాలయ్య గారి భగవంత్ కేసరి, ఊరి పేరు భైరవకోన, నాగ శౌర్యతో ఓ సినిమా చేస్తున్నాను. ప్రభాస్ సలార్ సినిమాలో కొత్త కారెక్టర్ వేస్తున్నాను. రెండో పార్ట్‌లోనే ఎక్కువగా కనిపిస్తాను. -
Slumdog Husband Movie: ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టని ఇంటర్వ్యూ
-
డైరెక్టర్‌ను కత్తి పట్టుకుని బెదిరించిన బ్రహ్మాజీ, ఎందుకంటే?
నటుడు బ్రహ్మాజీ కత్తిపట్టుకుని డైరెక్టర్‌ను బెదిరించాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు అనిల్ రావిపూడి. మైకు పట్టుకుని బిజీగా ఉన్న అనిల్ రావిపూడి దగ్గరకు వెళ్లి అతడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కత్తితో బెదిరించేంత గొడవ ఏం జరిగిందా? అనుకోకండి.. ఇక్కడుంది బ్రహ్మాజీ కదా.. తన కుమారుడి సినిమా రిలీజ్ డేట్ కాస్త వెరైటీగా అనౌన్స్ చేశాడు. ఫన్ అండ్ ప్రమోషన్ కలిపి అనిల్ రావిపూడితో రిలీజ్ డేట్ చెప్పించాడు. ఈ క్రమంలోనే ఈ సరదా స్కిట్ చేశారు. స్కిట్లో భాగంగా.. సినిమా షూటింగ్లో ఉన్న అనిల్ రావిపూడి దగ్గరకు బ్రహ్మాజీ వెళ్లి డిస్టర్బ్ చేస్తాడు. అన్న, ఒక వీడియో పెట్టవా? స్లమ్‌డాగ్ హస్బెండ్ సినిమా రిలీజ్ డేట్ చెప్పవా? అని అడుగుతాడు. మొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ అన్నావ్, సాంగ్ అన్నావ్.. పదేపదే వస్తానే ఉంటవా? నన్ను వదిలెయ్ అని కసురుకోవడంతో బ్రహ్మాజీ తన దగ్గరున్న కత్తికి పని చెప్పాడు. మెడ దగ్గర కత్తి పెట్టడంతో అనిల్ రావిపూడి.. స్లమ్‌డాగ్ హస్బెండ్ జూలై 29న రిలీజ్ అవుతుందని చెప్పాడు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను నవ్విస్తోంది. ఇకపోతే బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం స్లమ్‌డాగ్ హస్బెండ్. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటించింది. ఇందులో ఓ శునకం ముఖ్యపాత్రలో కనిపించనుండగా.. జూలై 29న గ్రాండ్‌గా రిలీజవుతోంది. Funny Banter Between @actorbrahmaji & Blockbuster director @AnilRavipudi 😅 #SlumDogHusband hits the screens on 29th July@SanjayROfficial @Pranavimanukon2@ar_sreedhar @Appireddya @Mic_Movies @RelianceEnt @kvrajendra @GskMedia_PR @saregamasouth pic.twitter.com/TrKHqyhhvz — BA Raju's Team (@baraju_SuperHit) July 23, 2023 చదవండి: ఇంతదాకా వచ్చెందుకు సిగ్గెందుకో? ముఖం దాచుకున్న లైగర్ బ్యూటీ -
విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మెన్‌టూ (#MenToo). బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీకి రానుంది. (ఇది చదవండి: Mentoo Movie: #మెన్‌టూ మూవీ రివ్యూ) ఈ మూవీ జూన్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా స్టిల్‌ని షేర్ చేస్తూ.. ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్మెంట్ మీ కోసమే అంటూ క్యాప్షన్ పెట్టింది. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం కామెడీతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) Prapancha Purushothhamulaara...!🙋♂️ A Big Announcement for you....👉#MENTOO Antu vachesthunnaru ee frustrated front uu...!😛#MenTooOnAHA Premiers June 9th!@nareshagastya @kaushikghan @PriyankaOffl @IRiyaSuman @MouryaSIddavar1 @SrizTweets @harshachemudu pic.twitter.com/fQHDbnvosK — ahavideoin (@ahavideoIN) June 2, 2023 -
#మెన్‌టూ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: #మెన్‌టూ(MenToo) నటీనటులు : నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి నిర్మాత : మౌర్య సిద్ధవరం సినిమాటోగ్రఫీ : పీసీ మౌళి సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ విడుదల తేదీ: మే 26, 2023 నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం #MenToo. . శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఎలా అలరించిందో చూద్దాం . అసలు కథేంటంటే.. ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్‌లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన కష్టనష్టాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ పబ్ ఓనర్(బ్రహ్మాజి), అందులో పనిచేసే బాయ్(సుదర్శన్) కూడా వారి సాదక, బాధకాలు షేర్ చేసుకుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో ఎక్సీపీరియన్స్. ఒకరు భార్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది షేర్ చేసుకుంటే... ఇంకొకరేమో తనను అనవసరంగా వేధింపులతో తనువు చాలించడం... మరొకరేమో విదేశాలకు వెళ్లడం ఇష్టం లేక ప్రియురాలికి దూరం కావడం... ఒకరేమో ప్రియురాలి ఎక్స్పేక్టేషన్స్ అందుకోలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడే మగాళ్లంతా... చివరకు ఏమి చేశారనేదే మిగతా కథ. కథ ఎలా సాగిందంటే.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌కి మంచి ఆదరణే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్‌గా సినిమా తీస్తే... యూత్ బాగా ఆదరిస్తారని ఇది వరకు చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సినిమానే #MenToo. కేవలం అమ్మాయిలే కాదు... వేధింపులకు గురై బాధపడే అబ్బాయిలు కూడా ఉంటారు అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యం మనం చుట్టూ యువతీ యువకుల్లో జరిగే అంశాల ఆధారంగా కొంత మెసేజ్ ఇస్తూనే... యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా మలిచారు దర్శకుడు. కథ... కథనాలతో ఎక్కడా బోర్ లేకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనలను ఎంతో ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో రాహుల్ కథతో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నిచ్చిన దర్శకుడు... ఆ తరువాత ద్వితీయార్థం అంతా ఎమోషనల్‌గా నడిపించి ఆడియన్స్ ని సినిమాలోని మల్టిపుల్ ట్రాక్స్ కి కనెక్ట్ చేయడంలో విజయం సాధించారు. వర్క్ ప్లేస్‌లో కేవలం అమ్మాయిలకే ప్రాధాన్యం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీలు... అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించాలనే దానిని ఆదిత్య పాత్రతోనూ, అమ్మాయిలు... అబ్బాయిలకు కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం లాంటి వాటిని ఫేస్ చేసే పాత్రలో సంజు పాత్రను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా... తన ప్రియురాలికి తన ప్రేమను చెప్పలేని పాత్రలో మున్నా పాత్రని ఎంతో ఎమోషనల్‌గా తెరమీద చూపించారు దర్శకుడు. అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగే అన్ని విధాలుగా ఇబ్బందులు అన్నిచోట్లా ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి కూడా ఓ వేదిక కావాలి అభిప్రాయాలను పంచుకోవడానికి అనేదానితో తెరకెక్కిన ఈచిత్రం ఆద్యంతం అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే... ఇందులో నరేష్ అగస్త్య పాత్ర చాలా మంది యువతకు మెసేజ్ ఇస్తుంది. అలాగే కౌషిక్ కూడా కాస్త తన నటనతో మెప్పించాడు. మున్నా పాత్రలో చిత్ర నిర్మాత మౌర్య ఆకట్టుకుంటాడు. గీతా పాత్రలో రియా సుమన్... గ్లామరస్‌గా కనిపించి మెప్పించింది. భార్య బాధితునిగా బ్రహ్మాజీ నవ్వించాడు. బార్లో పనిచేసే యువకుని పాత్రలో సుదర్శన్ ఆకట్టుకుంటాడు. వైవా హర్షా చేసిన పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఇక మిగత పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త కత్తెర పడాల్సింది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -
బ్రహ్మాజీ చేయి కోసుకుంటే నేనే ఆస్పత్రికి తీసుకెళ్లా: కమెడియన్ భార్య
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు బ్రహ్మాజీ. రీల్ లైఫ్‌లో తక్కువ ప్రేమకథల్లోనే కనిపించినా రియల్ లైఫ్‌లో మాత్రం అతడికి ఓ ఇంట్రస్టింగ్ ప్రేమకథ ఉంది. ఆల్రెడీ పెళ్లై, కొడుకు ఉన్న బెంగాలీ మహిళ శాశ్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బ్రహ్మాజీ. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న శాశ్వతితో ఏడడుగులు నడవడమే కాకుండా ఆమె కొడుకును తన కొడుకుగా భావించాడు. తనకు పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థపూరిత ఆలోచనలు వస్తాయోనన్న భయంతో అతడి కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు. ఆ అబ్బాయి మరెవరో కాదు సంజయ్ రావు. ఓ పిట్టకథ సినిమాతో అతడు తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు. తన కొడుకుతో కలిసి నటించాలనుకున్న బ్రహ్మాజీ ఓ పిట్టకథలో పోలీసుగా నటించి తన కోరిక నెరవేర్చుకున్నాడు. తాజాగా బ్రహ్మాజీ తన భార్య శాశ్వతితో కలిసి ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'ఓపక్క మూన్ లైట్, మరోపక్క సన్ రైజ్.. హైస్పీడ్‌లో శాశ్వతి దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్పాను. ఆమె బర్త్‌డేకు నా చైన్ తాకట్టు పెట్టాను. తనతో బోలెడంత సేపు ఫోన్లో మాట్లాడేవాడిని. దాదాపు నా లైఫ్ అంతా పబ్లిక్ బూత్‌లోనే గడిచింది. కానీ తను ఒక్కసారి తిట్టిందంటే మూడు రోజులు భోజనం కూడా చేయలేం' అని చెప్పాడు. శాశ్వతి మాట్లాడుతూ.. తమ పెళ్లిలో డైరెక్టర్ కృష్ణవంశీ కన్యాదానం చేశాడని చెప్పింది. ఒకసారి బ్రహ్మాజీ సడన్‌గా చేయి కోసుకోవడంతో తాను ఆస్పత్రికి తీసుకెళ్లాను అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్లాస్టిక్ సర్జరీ వికటించి మోడల్ మృతి జియా ఖాన్ కేసులో సంచలన తీర్పు -
సినిమా ఈవెంట్స్ లో పర్సనల్ క్వశ్చన్స్
-
'బ్రహ్మజీ గొప్ప మనసు.. డబ్బులు తీసుకోకుండానే చేశాడు'
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేక పేరు సంపాదించారు. అలాగే ఆయన ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. అదే విహాన్ తెరకెక్కించిన 'హ్యాంగ్ మాన్' లో తలారి పాత్ర పోషించారు. ఉరిశిక్ష పడిన ఖైదీలను ఉరి తీసే వ్యక్తిని తలారి అంటారు. ఇది ఒక చిన్న సినిమా అయినా ఒక తలారి జీవితం ఎలా ఉంటుంది? అతను ఉరి తీసేటప్పుడు మానసికంగా ఎలా సిద్దమవుతాడు? అనే విషయాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ తన కుమారునికి కొడుక్కి కూడా తలారి పని ఎలా చేస్తారో కూడా వివరిస్తుంటాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఈమధ్య హైదరాబాద్‌లోని ప్రివ్యూ థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సినిమాలో బ్రహ్మజీ నటనకు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తలారి పాత్రను అద్భుతంగా చేసి అందులో ఇమిడిపోయాడు. ఇంకో ఆశ్చర్యకరం ఏంటి అంటే ఈ సినిమా కథ నచ్చి.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే నటించాడు. -
కష్టపడితే ఆదరణ లభిస్తుంది – శర్వానంద్
‘‘మేము (నటీనటులు) ఫ్యా షన్తో, నమ్మకంతో, ఆశతో సినిమా చేస్తాం. కష్టపడి మంచి సినిమా చేస్తే ప్రేక్షకాదరణ లభిస్తుందని నేను నమ్ముతా. మంచి కథతో రూపొందిన ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’ పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో శర్వానంద్ అన్నారు. నరేష్ అగస్త్య, బ్రహ్మజీ , హర్ష, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంకా శర్మ ప్రధాన పా త్రల్లో నటించిన చిత్రం ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’. శ్రీకాంత్ జి. రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను శర్వానంద్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నేను, మౌర్య ‘రణరంగం’ సినిమాలో నటించాం. ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’ కథ నచ్చి, నిర్మించానని మౌర్య చెప్పినప్పుడు హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘‘నన్ను, కథని నమ్మి ఈ సినిమా నిర్మించిన మౌర్యకి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్ జి. రెడ్డి. ‘‘పురుషుల బాధలను చూపించే చిత్రమిది. మహిళలకూ నచ్చు తుంది’’ అన్నారు బ్రహ్మజీ . ‘‘యంగ్ టీమ్‌తో మంచి సినిమా చేశాను’’ అన్నారు మౌర్య సిద్ధవరం. -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
అయి బాబోయ్ బ్రహ్మజీ ది మామూలు వెటకారం కాదు..
-
‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘జాతిరత్నాలు’ తర్వాత అందరూ నన్ను చిట్టీ అని పిలుస్తున్నారు. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చూశాక నేను చేసిన వసుధ పాత్రే గుర్తుంటుంది’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘‘ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు వెంకట్ బోయినపల్లి. నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం పాల్గొన్నారు. -
ఉత్తేజ్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్
ఉత్తేజ్, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, ప్రొఫెసర్ దేవన్న, బేబి ధార్వి కీలక పాత్రల్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఊర శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో దర్శఖుడు వి. సముద్ర, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత బాల బ్రహ్మచారి,మన్నెపల్లి అప్పారావు, శ్రీలక్ష్మి, పి. జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హీరో హీరోయిన్లుగా కొత్తవారు నటిస్తున్నారు అన్నారు నిర్మాతలు. -
నటుడు బ్రహ్మాజీ సటైరికల్ ట్వీట్.. అనసూయను ఉద్ధేశించేనా?
నటుడు బ్రహ్మాజీ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తన ట్వీట్‌పై ఓ నెటిజన్ అంకుల్ అని కామెంట్స్ చేయగా బ్రహ్మాజీ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ట్వీట్ చూస్తుంటే ఇది యాంకర్ అనసూయను ఉద్ధేశించి చేసినదేనంటూ నెటిజన్లతో పాటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ అభిమానులకు టచ్ ఉంటాడు బ్రహ్మాజీ. ఈ క్రమంలో వెరైటీగా సెల్ఫీ తీసుకున్న బ్రహ్మాజీ ఆ ఫొటోను షేర్ చేస్తూ ‘వాట్ హ్యాపెనింగ్’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఎప్పటి లాగే ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ట్వీట్‌పై రకరకాలుగా స్పందిస్తుండగా.. ఓ నెటిజన్ మాత్రం ‘ఏం లేదు అంకుల్’ అని కామెంట్ చేశాడు. చదవండి: యాంకర్ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్ అట ఆ కామెంట్‌ను బ్రహ్మాజీ రీట్వీట్ చేస్తూ... ‘అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. బాడీ షేమింగ్ చేస్తున్నావా?’ అంటూ నవ్వుతున్న ఏమోజీని జత చేశాడు. దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. బ్రహ్మజీ రియాక్షన్‌పై ఫ్యాన్స్ సరదగా స్పందిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. గుడ్ టైమింగ్ అంటూ కొందరు నెటిజ్లను ఆయనను ప్రశంసిస్తుంటే మరికొందరూ అనసూయను ఉద్ధేశిస్తూ ఆయన ట్వీట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ‘అన్న.. ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారు.. స్రీన్ షాట్స్ తీసి సీఎం, పీఎంకి కేసు వేస్తుంది’, ‘ఏంటి అంకుల్ నువ్వు కూడానా’, ‘ఏం లేదు అంకుల్.. ఆంటీ అల్రెడీ వేశారుగా కేసు’ అంటూ మరోసారి అనసూయను టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ అంతేకాదు ‘ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదు’ అని ‘#SayNotToOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్ మర్చిపోయారు అంకుల్’ ఇలా సటైరికల్‌గా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల అనసూయను ఆంటీ అంటూ ట్విటర్లో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. తనని ట్రోల్ చేస్తూ చేసిన ప్రతి కామెంట్‌పై అనసూయ స్పందించడంతో ఆమెపై మరింత నెగిటివిటి పెరిగింది. దీంతో తనని ఆంటీ అంటూ ట్రోల్ చేసిన ట్వీట్స్‌ను స్క్రీన్ షాట్స్ తీసి రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అనసూయ. అయినప్పటికీ తనపై ట్రోల్స్ అగడం లేదు. ఇప్పుడు బ్రహ్మాజీ చేసిన ఈ సటైరికల్ ట్వీట్ అనసూయను ఉద్ధేశించి ఉండటంతో ఇది కాస్తా చర్చనీయాంశమైంది. Uncle entra.. uncle u.. case vestha.. age.. body.. shaming aa.. 😜 https://t.co/9fbRbXirbJ — Brahmaji (@actorbrahmaji) August 30, 2022 -
సామ్‌చై విడాకులు, రూ.250 కోట్ల భరణంపై బ్రహ్మాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
కమెడియన్‌గా, నటుడిగా ఎన్నో పాత్రల్లో అలరించాడు నటుడు బ్రహ్మాజీ. చిన్న, పెద్ద అని తేడా లేకుండా దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నటుడిగా రాణిస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. 'నేను అన్ని విషయాల్లో దూరను. కానీ మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా నోరు మెదుపుతాను. ఎలా అంటే.. సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నాగచైతన్య దగ్గరి నుంచి రూ.250 కోట్లు భరణం తీసుకుని గేమ్ ప్లే చేశావు, నువ్వో సెకండ్ హ్యాండ్ అంటూ చీప్‌గా మాట్లాడాడు. సమంత ఆ కామెంట్‌కు రిప్లై ఇచ్చింది, అది వేరే విషయం. కానీ అతడి మాటలకు కోపమొచ్చి నేనూ స్పందించాను. నీకు సిగ్గు, శరం లేదు. నువ్వు థర్డ్ గ్రేడ్. అమ్మాయి వ్యక్తిగత విషయంతో నీకేంటి సంబంధం? అన్నాను. సమంత ముఖం చూడాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా దాదాపు పదేళ్లు పడుతుంది. కానీ ఈ సోషల్ మీడియా వల్ల కనీసం ఆమెతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంతోషపడు. సరదాగా అమ్మాయిని పొగుడు. యాక్టింగ్ నచ్చకపోతే చెప్పు. అంతేకానీ ఆమె వ్యక్తిగత విషయం గురించి మాట్లాడేందుకు నువ్వెవరు? అన్నాను. సమంత ఫ్రెండ్స్ కూడా దానిపై రియాక్ట్ అవలేదు, కానీ నేను స్పందించాను. దెబ్బతో ఆ కామెంట్ పెట్టిన అతడు మళ్లీ ఎప్పుడూ అలా కామెంట్ చేయలేదు' అని చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. చదవండి: పెళ్లిమండపంలో తల్లికి గాయాలు, అయినా హీరో రెండో పెళ్లి! -
నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ
సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలలో, కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. సోషల్ మీడియాలో కూడా పలు సంఘటనలపై స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. ప్రస్తుతం సహాయ నటుడు, నెగెటివ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సినీ కెరీర్‌తో ఫుల్ బిజీగా ఉన్న బ్రహ్మాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అందరిలా సినిమా కష్టాలు పడలేదని, అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగా. మా తండ్రిగారు తహసీల్దార్. అప్పట్లో సీనియర్ నటుడు సోమయాజులు గారు సైతం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఇదిలా ఉంటే ఆయన నటించిన 'శంకరాభరణం' రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌తో సోమయాజులు గారికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో ఆయనకు భారీగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అది చూసిన నేను.. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా? అని అనిపించింది. ఎలాగైన పరిశ్రమలోకి వెళ్లాలని అనుకుని, చదువు పూర్తయిన వెంటనే చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ నటన శిక్షణ తీసుకుంటున్న ఆ సమయంలోనే కృష్ణవంశీ, రవితేజ, రాజా రవీంద్ర తదితరులతో పరిచయం ఏర్పడింది. గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం వంటి సినిమాలతో కెరీర్ ప్రారంభంలో మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత పదేళ్లపాటు నేను సంతృప్తి చెందే పాత్రలు లభించలేదు. ఇప్పుడు మాత్రం కమెడియన్, సహాయ నటుడు, నెగెటివ్ షేడ్స్ వంటి మంచి పాత్రలు వస్తున్నాయి'' అని తెలిపాడు. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు చదవండి: 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి అలాగే ''నేను ఒక బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. అయితే నేను మ్యారేజ్ చేసుకునే సమయానికే ఆమెకు విడాకులు కాగా, ఒక అబ్బాయి కుడా ఉన్నాడు. ఆమెను ఇష్టపడి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాను. ఇది వరకే బాబు ఉండగా మాకు మళ్లీ పిల్లలు ఎందుకు? అని వద్దనుకున్నాం. ఆ అబ్బాయే ఇప్పడు 'పిట్టకథ' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్డాడు'' అని తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. చదవండి: థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో.. -
గాడ్సే మూవీ పబ్లిక్ టాక్
-
కిరోసిన్ మూవీ పబ్లిక్ టాక్
-
Slumdog Husband: కుక్కకు భర్తగా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు..
Daggubati Rana launched Sanjay Rao Slumdog Husband Motion Poster: పాపులర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు, 'ఓ పిట్టకథ' ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం స్లమ్‌డాగ్ హస్బండ్. ఈ సినిమాతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అక్కిరెడ్డి, వెంకట్ అన్నపు రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా ప్రణవి నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను దగ్గుబాటి రానా ఆవిష్కరించాడు. సంజయ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్ మోస్టర్ ఎంతో హ్యూమరస్‌గా ఉందన్న రానా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'స్లమ్‌డాగ్ హస్బండ్' మూవీ సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. వివాహాల్లో కొంతమంది పాటిస్తున్న కొన్ని మూఢనమ్మకాలను వినోదాత్మకంగా చూపెడుతున్నాడు దర్శకుడు. ఈ పోస్టర్ ఐశ్వర్య రాయ్‌కు చెట్టుతో పెళ్లి చేయడం, కొందరికి జంతువులతో వివాహం చేసిన న్యూస్ క్లిప్పింగ్స్, రాశుల ఫొటోలతో ఆసక్తికరంగా ఉంది. అంతేకాకుండా ఇందులో హీరోకు కుక్కతో పెళ్లి జరిపించే ఫొటోను చూపించారు అర్జున్ రెడ్డి సినిమా తరహాలో 'ఎవడ్రా నా కుక్కపై రంగుపోసింది' అని డైలాగ్ చెప్పడం బాగా నవ్విస్తోంది. 'మిమ్మల్ని ఈ పెళ్లికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం' అంటూ మోషన్ పోస్టర్‌ను ముగించారు. చదవండి: కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ.. We are so happy to announce that our #slumdoghusband movie motion poster has been launched. Special thanks for your sweet gesture @RanaDaggubati garu.#productionno04 #SlumDogHusband #SDH#ranadaggubati #motionposterlaunched Link▶️https://t.co/zuq6Fdc6yo@Mic_Movies pic.twitter.com/nPsGUSmXs5 — Productionno4 (@Productionno04) May 29, 2022 -
దటీజ్ రామ్‌చరణ్, ఆ మాటతో నా గుండె నిండిపోయింది: నటుడు
'ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న' అంటుంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు ఆదుకునే సెలబ్రిటీలు ఎందరో! అందులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఒకరు. ఆపత్కాలంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సాయపడి తన గొప్ప మనసు చాటుకున్నాడు చెర్రీ. తాజాగా ఈ విషయాన్ని కాదంబరి కిరణ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'మనకు తెలిసి రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో. కానీ నాకు తెలిసి ఆయన పెద్ద మనసున్న మనిషి. భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్ అన్న చొరవతో రామ్ చరణ్‌ను సాయం అడిగి రూ.2 లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశాను. అంతేకాకుండా సుక్కన్న, మనం సైతం, విజయ్ అన్న, రాము తదితరుల వద్ద లక్షా ఇరవై వేల రూపాయలు పోగుచేసి చనిపోయినామె నెలల పాప పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని ఇచ్చాం. ఇప్పుడు ఇన్నిరోజుల తర్వాత నేను ఎదురుపడితే రామ్‌చరణ్ ఆ పాప ఎలా ఉంది కాదంబరి గారూ? అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియచరణ్, నీకు భగవదాశీస్సులు' అంటూ వరుస ట్వీట్లు చేశాడు. దీన్ని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తన ఫేస్బుక్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో నేను తెలుసుకున్నా..ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషని భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే pic.twitter.com/tjB9gTv66u — Manam Saitham kadambari kiran (@manamsaitham) April 12, 2022 నేను ఎదురుపడితే రామ్ చరణ్ "ఆపాప ఎలా వుంది కాదంబరి గారూ?" అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు. — Manam Saitham kadambari kiran (@manamsaitham) April 12, 2022 చదవండి: కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ ? నెట్టింట వీడియో వైరల్ యాక్షన్ బాట పట్టిన టాలీవుడ్ హీరోలు, టార్గెట్ అదేనట! -
నటుడు బ్రహ్మాజీ కొడుకు హీరోగా మరో సినిమా..
Actor Brahmaji Son Sanjay Rao New Movie Shooting Launched: నటుడు బ్రహ్మాజీ తనయుడు, 'ఓ పిట్టకథ' ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రంతో ఏఆర్ శ్రీధర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీరామనవమి పండగ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సోహైల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ ఇచ్చారు. రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును యూనిట్‌కి అందించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ జె. రెడ్డి కెమెరా వర్క్ చేయగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. లైన్ ప్రొడ్యూసర్‌గా రమేష్ కైగురి, సహ నిర్మాతలుగా చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం వ్యహరించారు. చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ -
బ్రహ్మాజీ తనయుడు హీరోగా 'గుట్టుచప్పుడు' పోస్టర్ రిలీజ్
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా, కొత్త దర్శకుడు మణింద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుట్టుచప్పుడు. డాన్ ఎంటర్టైన్మెంట్పై లివింగ్ స్టన్ నిర్మిస్తున్నాడు. ఉగాది సందర్భంగా పోస్టర్, మోషన్ పోస్టర్లను హీరో అడవి శేష్ చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అడివి శేషు మాట్లాడుతూ మోషన్ పోస్టర్ కూడా ఇంత హైప్ తెప్పించే విధంగా క్రియేట్ చేయవచ్చు అని తాను ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు. డైరెక్టర్ గారికి ఇది నిజంగా ఫస్ట్ మూవీనా అని చాలా డౌట్‌గా ఉందన్నాడు. ఆయనలో చాలా సీనియారిటీ ఉందా అనిపించేలా టాలెంట్ కనిపిస్తుందని మెచ్చుకున్నాడు. మ్యూజిక్, ఎఫెక్ట్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయని, మూవీకి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. డైరెక్టర్ మణింద్రన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'ముందుగా మా మూవీ సెకండ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు హీరో అడవి శేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రొడక్షన్ పరంగా నాకు అండగా ఉన్న ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ గారికి నేను రుణపడి ఉంటాను' అని అన్నారు. హీరో సంజయ్ రావ్ ముందుగా అడవి శేష్‌కు థ్యాంక్ యు చెబుతూ 'అన్న మీ మేజర్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను, గుట్టు చప్పుడు సినిమాకి సంబంధించి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా సస్పెన్స్ లు ఉన్నాయి, డైరెక్టర్ మేకింగ్ ఏంటో మీరు స్క్రీన్ పై చూస్తారు' అని ముగించారు. కెమెరామెన్ రాము హీరో సంజయ్ రావ్ గారి గురించి చెప్తూ సేమ్ బ్రహ్మాజీ గారిలా సెట్ లో చాలా డిసిప్లిన్ గా ఉంటారని మెచ్చుకున్నాడు. చదవండి: ఆర్ఆర్ఆర్ టీంకు తులం బంగారం, కేజీ స్వీట్ బహుమతి విక్ట్రీనా బాటలోనే అలియా-రణ్‌బీర్?, అక్కడే పెళ్లి వేడుకలు! -
డిఫరెంట్ క్రైం థ్రిల్లర్‌గా 'కిరోసిన్'
కథలో దమ్ము ఉండాలి కానీ.. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ మూవీనైనా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు.అందుకే కొత్త దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా సరికొత్త కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న మరో చిత్రం ‘కిరోసిన్’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ కథ అందిస్తూ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసే బాధ్యతలు తీసుకున్నారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కిరోసిన్ కాన్సెప్ట్ పోస్టర్ లాంచ్ చేశారు. తెలంగాణ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హరికృష్ణ మామిడి చేతుల మీదుగా ఈ పోస్టర్ విడుదల చేశారు.పోస్టర్ చూస్తే పోలీస్ డ్రెస్‌లో కనిపిస్తున్న హీరో, పోలీస్ లైన్ డు నాట్ క్రాస్ అనే ట్యాగ్ కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా ద్వారా ఏదో కొత్త విషయం చెప్పబోతున్నారని స్పష్టమవుతోంది. -
ఆడు మగాడ్రా బుజ్జి..! అమ్మాయి కాదు రా!!
Cyber Crimes Wing Cyberabad: ‘ఏంజెల్ ప్రియా’.. ఈ పేరు గురించి తెలుసు కదా!.. ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ల పుట్టుకకు ఒకరకంగా ఆజ్యం పోసింది ఈ పేరే. అయితే సరదాగా మొదలైన ఈ వ్యవహారం ఆ తర్వాతి కాలంలో మోసాలకు తెర లేపింది. ముఖ్యంగా మగవాళ్లే ఆడవాళ్ల పేర్లతో ఫేస్బుక్ యూజర్లను ముగ్గులోకి దించడం, కట్టుకథలు చెప్పి అందినంత దోచుకోవడం లాంటి నేరాలు బోలెడు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో కొంతకాలం తగ్గాయనుకున్న ఈ తరహా నేరాలు.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయట!!. సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు తాజాగా ట్విటర్లో ఫన్ అండ్ అవేర్నెస్ పోస్ట్ ఒకటి వేశారు. తివిక్రమ్-మహేష్ బాబు ‘అతడు’లోని ఓ ఫేమస్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు. ‘ఒక అమ్మాయి తనకు ఫ్రెండ్‌రిక్వెస్ట్ పంపి తెగ ఛాటింగ్ చేస్తుంద’ని కొడుకు మురిసిపోతుంటే.. ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా’ అంటూ తండ్రి ఆ కొడుక్కి షాక్ ఇస్తాడు. ఆడు మగాడ్రా బుజ్జి..! Beware of #Fake #Facebook profile frauds @TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @RachakondaCop @actorbrahmaji pic.twitter.com/oph4oL7Aoe — Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) October 4, 2021 తద్వారా ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సందేశం ఇచ్చారు పోలీసులు. పనిలో పనిగా నటుడు బ్రహ్మాజీని సైతం ట్యాగ్ చేసి పడేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు. సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రహ్మాజీ.. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కూడా. ఇక సోషల్ మీడియా వాడకంలో పోలీసులది డిఫరెంట్ పంథా. కరెక్ట్ టైమింగ్, రైమింగ్‌తో ప్రజల్ని అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం వాళ్ల విధిగా మారింది. ఈ క్రమంలో నవ్వులు పూయించే మీమ్స్‌ను సైతం వాడేస్తున్నారు. కేరళ, ముంబై పోలీసుల్లాగే.. తెలంగాణ పోలీసుల సోషల్ మీడియా వింగ్ సైతం హ్యూమర్‌ను పంచుతోంది. చదవండి: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!! -
తిమ్మరుసులో ‘తియ్యగుందీ’ డైలాగ్.. నారా లోకేశ్‌పై మరోసారి సెటైర్లు
సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం తిమ్మరసు. థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ అయిన ఈ చిత్రం థియేరట్స్ వద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించిన సత్యదేవ్ ఈ చిత్రంలో లాయర్ అవతారం ఎత్తాడు. ఇంటెలిజెంట్ లాయర్‌గా నటించిన సత్యదేవ్ ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసును రీఓపెన్ చేస్తాడు. హత్యకేసు వెనకాల ఉన్న చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా?లేదా అన్న అంశాలపై ఈ చిత్రం తెరకెక్కించింది. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు. సుధాకర్ పాత్రలో బ్రహ్మాజీ కామెడీ అదిరిపోయింది. ముఖ్యంగా ఓ సందర్భంలో హీరో సత్యదేవ్‌తో కలిసి బొండం తాగుతూ బ్రహ్మాజీ చెప్పిన ‘తియ్యగుందీ’ అనే డైలాగ్‌కి థియేటర్స్‌లో ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళగిరి ప్రచారంలో నారా లోకేశ్.. ఓ మజ్జిగ తాగుతూ.. ‘ఏం వేశావు ఇందులో.. చక్కెరా.. ‘తియ్యగుందీ’ అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఎంతగా ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భం లేకుండా ప్రతీసారి తన అఙ్ఞానాన్ని బయటపెట్టే లోకేశ్ మజ్జిగ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే డైలాగ్‌ను తిమ్మరసు సినిమాలో రిపీట్ చేయడంతో థియేటర్లో లోకేశ్‌ను గుర్తు చేసుకున్నారు ప్రేక్షకులు. మరోసారి లోకేశ్‌పై జోకులు పేలుస్తూ నెట్టింట ట్రోల్స్, మీమ్స్‌లు క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు. -
తిమ్మరుసు మూవీ రివ్యూ
టైటిల్ : తిమ్మరుసు జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్ నిర్మాతలు : మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి సంగీతం : శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ : అప్పు ప్రభాకర్ ఎడిటర్ : తమ్మి రాజు విడుదల తేది : జూలై 30, 2021 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'తో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు సత్యదేవ్. డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు లాయర్ అవతారమెత్తాడు. కానీ కేసు పేరుతో డబ్బులు గుంజే లాయర్‌గా కాదు, కేసును గెలిపించడం కోసం జేబులోని డబ్బును కూడా నీళ్లలా ఖర్చుపెట్టే న్యాయవాదిగా! ఈ మధ్య వచ్చిన 'నాంది', 'వకీల్ సాబ్' వంటి కోర్టు రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడటంతో తను నటించిన 'తిమ్మరుసు' సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని కొండంత ధీమా పెట్టుకున్నాడు సత్యదేవ్. మరి అతడి నమ్మకం నిజమైందా? అసలు తిమ్మరుసు అన్న టైటిల్ ఈ చిత్రానికి సెట్టయ్యిందా? అసలే బాలీవుడ్‌లోనూ కాలు మోపబోతున్న అతడికి ఈ సినిమా ప్లస్‌గా మారనుందా? మైనస్ అవనుందా? అనే విషయాలన్నీ కింది రివ్యూలో ఓ రౌండేద్దాం.. కథ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అతడి పేరును టైటిల్‌గా పెట్టుకున్నారంటేనే తెలిసిపోతోంది హీరో చాలా తెలివైనవాడని. ఈ సినిమాలో సత్యదేవ్ ఇంటెలిజెంట్ లాయర్‌గా నటించాడు. అతడు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసును రీఓపెన్ చేస్తాడు. అతడి హత్య వెనకాల ఉన్న మిస్టరీని చేధించే పనిలో పడతాడు. ఈ క్రమంలో ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుర్రాడికి ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకుంటాడు. మరి ఇందులో ఆ అబ్బాయిని ఎవరు? ఎందుకు ఇరికించారు? ఇందులో పోలీసుల ప్రమేయం ఎంతమేరకు ఉంది? అసలు ఆ క్యాబ్ డ్రైవర్‌ను ఎందుకు హత్య చేస్తారు? ఈ చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా? అతడు ఇంతలా ఇన్వాల్వ్ కావడానికి ఆ కేసుతో ఇతడికేమైనా సంబంధం ఉందా? ఆ కేసు స్టడీ చేసే రామచంద్రకు పోలీసులు ఎందుకు సహకరించరు? అన్న వివరాలు తెలియాలంటే బాక్సాఫీస్‌కు వెళ్లి బొమ్మ చూడాల్సిందే! విశ్లేషణ 'బీర్బర్' సినిమాకు రీమేక్‌గా వచ్చిందే తిమ్మరుసు. ఈ సినిమా ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ సెకండాఫ్ మాత్రం బాగుంది. ప్రియాంక జవాల్కర్ తన అందంతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ను బుట్టలో వేసుకోవడం ఖాయం. బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలం. బీజీఎమ్ మరొక హైలైట్ అని చెప్పవచ్చు. మర్డర్ కేసును చేధించే పనిలో పడ్డ హీరో ఒక్కో క్లూను కనుక్కోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, ట్విస్టులు ప్రేక్షకుడిని సీటులో అతుక్కుపోయేలా చేస్తాయి. సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ కథనం కొంత వీక్‌గా ఉన్నట్లు అనిపించక మానదు. ఫస్టాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టుంటే సినిమా ఇంకో రేంజ్లో ఉండేది! నటీనటులు యాక్టింగ్ అంటే పిచ్చి అని చెప్పుకునే సత్యదేవ్ ఈ సినిమాలో ఎలా నటించాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు సాఫ్ట్‌గా కనిపిస్తూనే మరోవైపు ఫైట్ సీన్లలోనూ ఇరగదీశాడు. లాయర్ పాత్రకు ఆయన పర్ఫెక్ట్గా సూటయ్యాడు. ఇక టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ బాగానే నటించింది. బ్రహ్మాజీ ఎప్పటిలాగే ప్రేక్షకులను వీలైనంత నవ్వించేందుకు ట్రై చేశాడు. మిగతా నటీనటులు కూడా సినిమాను సక్సెస్ దిశగా నడిపించేందుకు తెగ కష్టపడ్డట్లు తెలుస్తోంది. ప్లస్ సత్యదేవ్ నటన ట్విస్టులు ఇంటర్వెల్, క్లైమాక్స్ మైనస్ ఫస్టాఫ్ వీక్‌గా ఉండటం -
తిమ్మరుసు ట్రైలర్ రిలీజ్ చేసిన తారక్
Thimmarusu Movie Trailer: 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో ఆకట్టుకున్న సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం తిమ్మరుసు. అసైన్మెంట్ వాలి అనేది ఉపశీర్షిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని తిమ్మరుసు లాంటి తెలివితేటలున్న లాయర్ రామచంద్ర పాత్రలో సత్యదేవ్ నటించాడు. 'ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుంచి కారుకు వెళ్తారు కానీ రామ్ కారు నుంచి బైక్‌కు వచ్చాడు' అన్న డైలాగ్ సత్యదేవ్ వ్యక్తిత్వాన్ని చెప్తోంది. 'నీ ముందున్నది వాలి అని మర్చిపోకు, ఎదురుగా ఉంటే సగం బలం లాగుతా లాయర్ రామచంద్ర.. నువ్వు సగం బలం లాక్కునే వాలివైతే నేను దండేసి దండించే రాముడిలాంటోడిని' అన్న డైలాగ్ హైలైట్‌గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఒక క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసు చుట్టూ కథ అల్లుకున్నట్లు తెలుస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. ఈనెల 30న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. Wishing Satya garu @ActorSatyaDev , Mahesh @smkoneru and team #Thimmarusu the very best. Here's the trailer https://t.co/Wfd5VRZ33t Enjoy the movie in theaters — Jr NTR (@tarak9999) July 26, 2021 -
తమ్ముడు బ్రహ్మాజీకి సపోర్ట్ కావాలి.. నాగశౌర్య ట్వీట్ వైరల్
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన వరుడు కావాలి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక, నారీనారీనడుమ మురారీతో పాటు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాతో షెర్లీ సెటియా హీరోయిన్గా పరిచయమవుతోంది. ఒక ముఖ్యమైన పాత్రలో బ్రహ్మాజీ నటిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి హైదరాబాదులో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. నాగశౌర్య .. బ్రహ్మాజీ తది తరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా షూటింగ్ సెట్లో బ్రహ్మాజీతో దిగిన ఓ ఫోటోని నాగశౌర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో నాగశౌర్య నుదుటున కుంకుమరేఖను ధరించి కనిపిస్తూ ఉండగా, బ్రహ్మాజీ నుదుటున నామాలు ధరించి ఉన్నాడు. అయితే ఈ ఫొటోను పోస్ట్ చేసిన నాగశౌర్య ఫన్నీగా ఒక కామెంట్ పెట్టాడు. ‘నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు .. మీ అందరి సపోర్టు కావాలి .. దయచేసి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించండి’అంటూ సరదాగా రాసుకొచ్చాడు. బ్రహ్మాజీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. అయినా ఆయన ఇప్పటికీ కుర్రాడిలా చాలా ఫిట్ నెస్ తో ఉంటాడు. ఈ విషయంపై సన్నిహితులు ఆయనను ఆటపట్టిస్తూనే ఉంటారు. అలాగే నాగశౌర్య కూడా, ఆయనను తమ్ముడు అంటూ అలా ఆటపట్టించాడు. ప్రస్తుతం నాగశౌర్య ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. Na thammudu @actorbrahmaji kothaga industry ki vachadu. Mi andari support thanaki undali. Please support young talent 💪😜#NS22#IRA4 pic.twitter.com/OIgx5UFkSK — Naga Shaurya (@IamNagashaurya) July 23, 2021 -
ఒకే కులం, చాన్స్ ఇప్పించవూ? దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన బ్రహ్మాజీ
Brahmaji: నేటి సమాజంలో కులం ఎంతగా వేళ్లూనుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి రంగంలోనూ ఈ కులరక్కసి నాటుకుపోయింది. మా కులపు హీరో, మా కులపు సర్పంచ్, మా కులప్ సీఎం అంటూ అభిమానాన్ని పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కులపిచ్చితో సినిమా అవకాశం ఇవ్వమని అడిగిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు నటుడు బ్రహ్మాజీ. 'అన్నా.. నేను మన కమ్యూనిటీకి చెందినవాడిని. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మీ తరుపున ఏ చిన్న అవకాశం ఉన్నా నాకు ఏదో పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించగలరు అని మిక్కిలి కోరుకుంటున్నాను' అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బ్రహ్మాజీని అభ్యర్థించాడు. అవకాశం ఇవ్వమని అడగడంలో తప్పు లేదు కానీ ఇలా ఒకే కులం కాబట్టి తనను పట్టించుకోమని చెప్పడం బ్రహ్మాజీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో బ్రహ్మాజీ తనదైన స్టైల్లో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. 'నేను ఇండియన్ని.. తెలుగోడిని.. అదే నా కమ్యూనిటీ' అని పేర్కొన్నాడు. 'అయినా అవకాశం కావాలంటే ఏదో రిక్వెస్ట్ చేయాలి కానీ, మధ్యలో ఈ కులం, గిలం ఏంట్రా?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీ రిప్లైతో అతడు మరోసారి కులం మాటెత్తడంటూ బ్రహ్మాజీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. -
సెటైర్: మా ఎన్నికల కోసం చైనా అధ్యక్షుడు!!
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. ఈ తరుణంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ మా ఎన్నికల కోసం రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? ఎవరికీ అందని ఈ ఊహను తన కామెడీ టైమింగ్‌తో తెర మీదకు తెచ్చాడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ నటుడు బ్రహ్మాజీకి ఏకంగా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, కరోనా జాగ్రత్తతో మన నటుడు మర్యాదపూర్వకంగా ఆ షేక్‌హ్యాండ్‌ను తిరస్కరించి.. నమస్తే పెట్టాడు. పైగా ఆ ఫొటోలో జింగ్ పిన్ కనీసం మాస్క్ లేకుండా ఉన్నాడు. అఫ్కోర్స్.. అది జింగ్ పిన్ పాత ఫొటోనే అయినా ఎడిటింగ్ గమ్మత్తుతో భలేగా దానిని ప్రజెంట్ చేశాడు బ్రహ్మాజీ. ‘‘క్యాజువల్ మీట్.. ఎలాంటి రాజకీయాలు లేవు. కాకపోతే మా ఎన్నికల గురించి చర్చించాం. జింగ్ పిన్ కొన్ని సలహాలు ఇచ్చాడు. అలాగే..’’ అంటూ ఫన్నీ ఎమోజీతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బ్రహ్మాజీ. ఇక తన తోటి నటులతో పాటు సమకాలీన విషయాలపై సెటైర్లు వేసే బ్రహ్మాజీ.. ఈమధ్యే తనకు భారీగా బంఫర్లాటరీ తగిలిందంటూ ‘ఫేక్ స్కాంకు సంబంధించిన ఒక అలర్ట్ మెసేజ్‌ను నెటిజన్స్ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) చదవండి: మా ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బరిలో ఆయన! -
రూ. 4.65 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న బ్రహ్మాజీ!.. ట్వీట్ వైరల్
నటుడు బ్రహ్మాజీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలలో, కార్యక్రమాలలో ఆయన వేసే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక బ్రహ్మాజీ సోషల్ మీడియాలో సైతం పలు సంఘటనలపై తనదైన స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. తాజాగా ఆయన ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు వచ్చిన మెసెజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ ప్రైజ్‌మనీని తీసుకురావాల్సింది హైదరాబాద్ సిటీ పోలీసులను, సైబరాబాద్ పోలీసులను కోరుతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా మనలో చాలా మంది మీరు ఇంత డబ్బును గెలుచుకున్నారంటూ మీ పేరు, చిరునామా ఇవ్వాల్సిందిగా గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి తరచూ మనకు మెసెజ్‌లు వస్తూనే ఉంటాయి. అయితే గురువారం బ్రహ్మజీకి ఈ మెసెజ్ రావడంతో వెంటనే దానిని స్క్రీన్ షాట్ తీసి ట్వీటర్లో షేర్ చేశాడు. ఆ ఫోన్ నెంబర్ ట్వీట్లో పేర్కొంటూ ‘సార్ నాకు ఈ నెంబర్ నుంచి రూ.4.65 కోట్లు లాటరీ తగిలిందని యూకేకు చెందిన ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి మెసెజ్ వచ్చింది. దయ చేసి మీరు ఈ డబ్బులను తీసుకురాగలరు’ అంటూ సిటీ పోలీసులు, సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. ఇక బ్రహ్మజీ చమత్కారంగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చూసి నెటిజనలు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయన తీరుపై ప్రశంసలు కురిపిస్తూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. +91 80996 68183 Sirr..got a msg from above number..pl collect money @hydcitypolice @cyberabadpolice pic.twitter.com/GLLsiSgKkP — Brahmaji (@actorbrahmaji) June 17, 2021 చదవండి: పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్ -
పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టుకున్నది మొదలు ప్రతీ దశలో సాయం చేసేందుకు ముందు వరసలో నిలుస్తూ రియల్ హీరోగా ప్రశంసంలందుకుంటున్న నటుడు సోనూసూద్‌కు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. సామాన్యులనుంచి సెలబ్రిటీల దాకా ఆయన సేవలను కొనియాడుతున్నవారే. ఇటీవల తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కూడా రియల్ హీరో అంటేనే సోనూ సూదే అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ మరో అడుగు ముందుకేశారు. సోనూ సూద్‌కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇవ్వాలంటూ తను గట్టిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు తన ప్రతిపాదనను సమర్ధించే వారంతా తన ట్వీటను రీట్వీట్ చేయమని బ్రహ్మాజీ కోరారు. దీంతో ట్విటర్లో రీట్వీట్ల సందడి నెలకింది. మరోవైపు ఈ ట్వీట్‌కు సోనూసూద్ స్పందించిన తీరు విశేషంగా నిలిచింది. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా? 135 కోట్ల మంది భారతీయుల ప్రేమ, అభిమానమే పెద్ద అవార్డు. దానిని ఇప్పటికే పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు“ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో దటీజ్ సోనూ సూద్ అంటూ ట్వీపుల్ కొనియాడుతున్నారు. పద్మ అవార్డులకు పేర్లను సిఫార్స్ చేయమంటూ కేంద్రం కోరుతోందనే వార్తను పీటీఐ వెల్లడించింది. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ నామినేష్లన స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీని చివరి తేదీగా తెలిపింది. దీంతో కరోనా మొదటి వేవ్‌నుంచి ఇప్పటికే తనదైన రీతిలో బాధితులను ఆదుకుంటున్న సోనూ సూద్‌కు పద్మ అవార్డు లభించాలంటూ కోరుకుంటున్నారు. కాగా కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవ చేసినవారికి ఈ అత్యున్నత పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం మే 1, సెప్టెంబరు 15 తేదీలలో పద్మ పురస్కారానికి సంబంధించిన సిఫారసులను భారత ప్రధాని ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న రాష్ట్రపతి చేతులమీదుగాఎంపిక చేసిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. చదవండి : Hanuma vihari: అందరమూ ఒకరికి సాయం చేయొచ్చు! The love of 135 crore Indians is my biggest award brother, which I have already received.🇮🇳 Humbled 🙏 https://t.co/VpAZ8AqxDw — sonu sood (@SonuSood) June 11, 2021 #padmavibhushan for @SonuSood ..if u agree with me..pl retweet.. #padmavibhushsnforsonusood #respectsonu https://t.co/cqV4We9uX3 — BRAHMAJI (@actorbrahmaji) June 11, 2021 -
యువత 'గుట్టు చప్పుడు'
నటుడు బ్రహ్మాజీ తనయుడు, ‘ఓ పిట్ట కథ’ ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. మణీంద్రన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని లివింగ్ స్టన్ నిర్మిస్తున్నారు. నేడు సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్ని సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. సంజయ్ రావ్ మాట్లాడుతూ– ‘‘పక్కా మాస్ అండ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘గుట్టు చప్పుడు’ సినిమా నాకు చాలా మంచి ఇమేజ్ తెస్తుంది’’ అన్నారు. లివింగ్ స్టన్ మాట్లాడుతూ– ‘‘నేను, మణీంద్రన్ చాలా కాలంగా ఫ్రెండ్స్. మా కాంబినేషన్లో సినిమా చేయాలను కున్నప్పుడు ‘గుట్టు చప్పుడు’ కథ బాగా నచ్చింది. రెండు షెడ్యూల్స్ చిత్రీకరించాల్సి ఉంది’’ అన్నారు. మణీంద్రన్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా, ముఖ్యంగా యూత్‌ని బేస్ చేసుకుని చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు. కెమెరామ్యాన్ రాము, మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి, మాటల రచయిత సురేష్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రాము సీఎం, సంగీతం: గౌర హరి. -
‘ఏక్ మినీ కథ’ మూవీపై హీరో శర్వానంద్ కామెంట్స్..
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఏక్ మినీ కథా’. స్టార్ హీరోలు ప్రభాస్, రాంచరణ్‌లు ఈ మూవీని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ(మే 27) డిజిటల్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైంలో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. తాజాగా ‘ఏక్ మినీ కథ’పై మరో హీరో శర్వానంద్ ప్రశంసలు కురిపించాడు. కామెడీ ట్రాక్‌తో నవ్వులు పూయిస్తుందంటు చెప్పుకొచ్చాడు. ‘ఏక్ మినీ కథ చూశాను. మేకర్స్ సరికొత్త సబ్జెక్ట్‌ను విభిన్నమైన కథను తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్రెష్ ఫీల్‌ను కలిగించింది’ అంటు శర్వానంద్ ట్వీట్ చేశాడు. కాగా మేర్లపాక గాంధీ కథ అందించగా.. కార్తీక్ రాపోల్ దర్శకత్వం వహించాడు. ఇందులో సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించాడు. అడల్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ , యూవీ క్రియేషన్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. Watched #EkMiniKatha. It has a fresh feel with a unique concept. Kudos to the makers for picking an unusual subject. It's a perfect laugh riot 😂 Watch #EkMiniKathaOnPrime here : https://t.co/5Ivb14jgXU — Sharwanand (@ImSharwanand) May 27, 2021 -
బ్రహ్మాజీపై హీరోయిన్ ప్రియాంక కామెంట్స్, పోస్ట్ షేర్ చేసిన నటుడు
టాక్సీవాలా మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. గ్లామర్ పరంగా, నటనా పరంగా ప్రియాంకకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఆమెకు పెద్దగా సినిమా అవకాశలు లభించలేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. కాగా తాజాగా ప్రియాంక ఏక్ మినీ కథ మూవీ చూస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అంతేగాక ఈ మూవీని బ్రహ్మాజీ కోసమే చూస్తున్నట్లు స్టోరీ పెట్టడంతో దానిని ఆయన తన షేర్ చేస్తూ మురిసిపోయారు. సంతోష్ శోభన్, కావ్యా థాపర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఈ రోజు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. తాజాగా ఈ మూవీని చూస్తున్న ప్రియాంక.. కేవలం బ్రహ్మాజీ కోసమే తాను ఈ చిత్రాన్ని చూస్తున్నానంటు చెప్పుకొచ్చింది. అది చూసిన బ్రహ్మాజీ థ్యాంక్యూ అంటు ఆమె పోస్టుపై కామెంట్ చేశాడు. ఇక ఈ మూవీలో బ్రహ్మాజీ నటన, ఆయన కామెడీకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. కామెడీ పండించడంలో బ్రహ్మాజీ స్టైలే వేరంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ప్రియాంక ‘తిమ్మరుసు’ అనే సినిమాతో బిజీగా ఉంది. సత్యదేవ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా బ్రహ్మాజీ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీ సెట్స్‌లో బ్రహ్మజీ, హీరో సత్యదేవ్‌తో ఆమె అల్లరి చేస్తున్న ఫొటోలను కూడా ఆమె షేర్ చేస్తుండేది. అలా ఆ మూవీతోనే ప్రియాంకకు, బ్రహ్మాజీతో మంచి బంధం ఏర్పడింది. -
ఈ టైంలో లవ్ అంటోన్న నటి, నెక్స్ట్ ఏంటన్న బ్రహ్మాజీ
► క్యూట్ ఫొటో షేర్ చేసిన చార్మీ కౌర్ ► రిజెక్ట్ చేసేముందు ఆలోచించుకోండి అంటూ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను షేర్ చేసిన నటి సిమ్రత్ కౌర్ ► సండేను సూపర్‌గా ఎంజాయ్ చేసిన యాంకర్ విష్ణుప్రియ ► కరోనా టైంలో లవ్ అంటోన్న శిల్పా శెట్టి ► ఊయలూగుతున్న నందినీ రాయ్ ► ఆహార పొట్లాలు పంచుతోన్న మంచు లక్ష్మీ టీమ్ ► తన కన్నా తన పిల్లి క్లారా బాగా రీల్స చేస్తుందంటోన్న శృతీ హాసన్ ► నెక్స్ట్ ఏంటి అని అడుగుతోన్న బ్రహ్మాజీ ► త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
ట్రోలింగ్: ట్విటర్ నుంచి తప్పుకున్న బ్రహ్మాజీ
హైదరాబాద్: జోరుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగి జలసంద్రాన్ని తలపిస్తున్నాయి. కొందరి ఇళ్లల్లోకి అయితే నేరుగా చేపలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో తన ఇల్లు నీట మునిగిందని హాస్య నటుడు బ్రహ్మాజీ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. వరద నీటిలో సగం వరకు మునకేసిన ఇంటి ఫొటోలను సైతం పంచుకున్నారు. దీనిపై చమత్కారంగా స్పందిస్తూ.. ‘ఇది మా ఇంటి పరిస్థితి.. ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్నా... దయచేసి మీకు తెలిసిన మంచి పడవ గురించి చెప్పండి’ అని ట్వీట్ చేశారు. (చదవండి: వరదలు : ప్రభాస్ భారీ విరాళం) అయితే అందరూ దాన్ని సరదాగా తీసుకోలేకపోయారు. హైదరాబాద్ వరదల వల్ల కోట్లాది నష్టం వాటిల్లింది. ఎంతోమంది నిలువనీడకు దూరమయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో విపత్తు మీద జోకులెలా వేస్తాడని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఆయన ట్వీట్‌ను తప్పుబడుతూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. "మీకంత కష్టంగా ఉంటే హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోండి, ఆంధ్రాలో బెంజ్ కారు కొనుక్కుని తిరగండి" అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై కలత చెందిన బ్రహ్మాజీ తన ట్విటర్ అకౌంట్ డిలీట్ చేశారు. అయితే ఈ వివాదం సద్దుమణిగాక మళ్లీ ట్విటర్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. (చదవండి: మంచి పడవ గురించి తెలపండి: బ్రహ్మాజీ) -
మోటరు బోటు కొనాలనుకుంటున్నా: బ్రహ్మాజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం జలమయమైంది. మహానగరంలోని రోడ్లు, వీధులు, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాల్లో నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియోట్ చేసి వైరల్ చేస్తున్నారు. అదే విధంగా సినీ నటుడు బ్రహ్మాజీ కూడా హైదరాబాద్ వరదలపై తనదైన శైలిలో స్పందించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయన ఇంటిలోకి నీరు చేరిన ఫొటోలను సోమవారం ట్విటర్లో షేర్ చేశాడు. ‘ఇది మా ఇంటి పరిస్థితి.. ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్న... దయచేసి మీకు తెలిసిన మంచి పడవ గురించి తెలపండి’ అంటూ చమత్కరించాడు. (చదవండి: భారీ వరదలు : ఇంటికి లక్ష సాయం) This is my house .. pic.twitter.com/VL98DH8DQD — BRAHMAJI (@actorbrahmaji) October 19, 2020 ప్రస్తుతం హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో వందలాది కాలనీలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. దీంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. నీటిలో చిక్కుకున్న వారికి పడవల ద్వారా సహాయక చర్యలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. (చదవండి: మూసీ వరద: కుంగిన 400 ఏళ్ల నాటి వంతెన) -
ఏడు పాత్రల అనుబంధం
మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు క్రిష్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి’’ అన్నారు అనిల్ పంగులూరి. ఈ చిత్రానికి సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
సోనూ సూద్‌ని సాయం కోరిన బ్రహ్మాజీ
సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ పోషించినప్పటికి దాతృత్వంతో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సోనూ సూద్. లాక్డౌన్లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చడంతో ప్రారంభించిన సోనూ సూద్ సహాయక సేవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కష్టం అంటూ తన దృష్టికి వచ్చిన వారందరికి సాయం చేస్తున్నారు సోనూ సూద్. అయితే అప్పుడప్పుడు కొందరు తనని ఆటపట్టించడం కోసం వింత వింత కోరికలు కోరుతున్న సంఘటనలు కొన్ని చూశాం. తాజాగా అలాంటి ఫన్ని రిక్వెస్ట్ ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఈ విన్నపం చేసిన వ్యక్తి కూడా ఓ ప్రముఖ నటుడు కావడంతో ఈ ట్వీట్ వైరలవుతోంది. (సోనూ సూద్ సేవ: కొత్త దేశం.. కొత్త మిషన్) వివరాలు.. బ్రహ్మాజీ ట్విట్టర్ వేదికగా సోనూ సూద్‌ని ఓ కోరిక కోరారు. ఇంట్లో ఉండి డిప్రెషన్‌కు గురయ్యాను. నన్ను క్రొయేషియా పంపించు సోనూ భాయ్ అంటూ రిక్వెస్ట్ చేశారు బ్రహ్మాజీ. ‘డియర్ సూపర్‌మ్యాన్ సోనూ భాయ్.. నేను డిప్రెషన్లో ఉన్నాను. మెంటల్‌గా లాక్డౌన్ అయ్యాను. హైదరాబాద్‌లో చిక్కుకుపోయాను. ప్లీజ్ నన్ను ఇక్కడకు తీసుకెళ్లు. క్రొయేషియా’ అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక సోనూ సూద్ ఎలా స్పందిస్తారో చూడాలి. Dear superman Sonu bhai.. am depressed.. mentally locked down ..am struck in Hyd.. pl take me there.. 🙏🏼 #croatia @SonuSood pic.twitter.com/ad6aVpZKRU — BRAHMAJI (@actorbrahmaji) August 21, 2020 -
‘సోనూ సూద్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’
సినిమాల్లో విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించే సోనూసూద్ నిజజీవితంలో మాత్రం మంచి పనులు చేస్తూ అందరిచేత హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనా సంక్షోభంతో ఉద్యోగం పోయి కూరగాయలు అమ్ముకుంటున్న సాఫ్ట్వేర్ శారదకు అండగా నిలుస్తూ ఒక కంపెనీలో ఆఫర్ లెటర్ ఇప్పించాడు. లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ల ఊర్లకు చేర్చాడు. ఆ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఎవరు సాయం అడిగిన లేదనకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు సోనూసూద్. ప్రాంతం, భాష, కులం, మతంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నాడు.(భావోద్వేగం, సోనూ సూద్ కంటతడి!) అలాంటి సోనూసూద్ గురువారం 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ సోనూసూద్‌కు ఫేస్బుక్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'హ్యాప్పీ బర్త్‌డే మై డియర్ సోనూసూద్.. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తూ నిజమైన హీరోలా నిలిచావు. నీ సేవలను ప్రభుత్వం గుర్తించి పద్మ భూషణ్‌కు సిఫార్సు చేయాలని కోరుకుంటున్నా.. నువ్వు నిజంగా మహాత్ముడివి సోనూ ' అంటూ తెలిపాడు. ఈ సందర్భంగా సోసూసూద్తో కలసి దిగిన పాత ఫోటోను షేర్ చేశాడు. దీంతో పాటు ఏక్ నిరంజన్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని మీమ్స్‌గా చిత్రీకరించి షేర్ చేశాడు. ఆ ఫోటోలో.. 'బ్రహ్మాజీ.. ఈరోజు నా బర్త్‌డే.. ఏం ప్లాన్ చేద్దాం చెప్పు.. అని సోనూ అంటాడు. ఇంకేముంది.. పార్టీ చేసుకుందాం.. అని బ్రహ్మాజీ అంటాడు. దానికి సోనూ సీరియస్‌గా అక్కడ జనాలు.. అంత కష్టాల్లో ఉంటే నీకు పార్టీ కావాలా.. పార్టీ లేదు ఏం లేదు.. పోయి కొంతమందికి సహాయం చేద్దాం..' అంటూ పేర్కొన్నాడు. -
‘బాగా దగ్గరిగా బతికిన రోజుల్లో..’
లాక్‌డౌన్‌తో దాదాపు 50 రోజులుగా సినీపరిశ్రమకు చెందిన వారు ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఒకవేళ లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసినా, కరోనా ప్రభావం తగ్గకపోవడంతో ఒకప్పటిలా కలివిడిగా ఉండే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది. ఇంకా లాక్డౌన్ సడలింపు నిబంధనలు సినీ ఇండస్ట్రీకి వర్తించకపోవడంతో సినీ నటులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే బాగా దగ్గరిగా బతికిన రోజుల్లో అంటూ సినీ పరిశ్రమకిచెందిన వారితో దిగిన ఫోటోలను సీనియర్ నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు.హీరో రవితేజ, నటుడు సుబ్బరాజు, డైరెక్టర్లు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, బీవీఎస్ రవిలతో సరదాగా గడిపిన క్షణాలను నెమరువేసుకున్నాడు. అతికిన రోజుల్లో అంటూ నటులు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అలీ, నర్రా శ్రీనివాస్, నిర్మాత శరత్ మరార్‌లతో కలిసి దిగిన ఫోటోను బ్రహ్మాజీ పోస్ట్ చేశాడు. Athikina Rojullo.. pic.twitter.com/BchHndR9Uf — BRAHMAJI (@actorbrahmaji) May 10, 2020 -
‘ఓ.. పిట్ట కథ’ మూవీ రివ్యూ
టైటిల్: ఓ.. పిట్ట కథ జానర్: రొమాంటిక్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ, తదితరులు సంగీతం: ప్రవీణ్ లక్కరాజు దర్శకత్వం: చెందు ముద్దు నిర్మాత: ఆనంద్ ప్రసాద్ నిడివి: 127.32 నిమిషాలు డిఫరెంట్ టైటిల్‌తోనే టాలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకున్న చిత్రం ‘ఓ.. పిట్ట కథ’. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అనేది క్యాప్షన్. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చెందు ముద్దు దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటీవ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు, తదితర స్టార్ నటీనటులుతో పాటు దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడిలు మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది?సీనియర్ నటుడు బ్రహ్మాజీ తన కొడుకును గ్రాండ్‌గా లాంచ్ చేశాడా? భారీ ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని ఏ మేరకు నిలబెట్టాయి? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ: అరకులో పి.వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి) కిడ్నాప్‌కు గురవడంతో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. కాకినాడలోని వెంకటలక్ష్మి థియేటర్ యజమాని వీర్రాజు కూతురే వెంకటలక్ష్మి. తల్లి లేని బిడ్డ అని చిన్నప్పట్నుంచి గారాబంగా పెంచుతాడు వీర్రాజు. అయితే అదే థియేటర్లో పనిచేసే ప్రభు (సంజయ్ రావ్)కు థియేటర్ అన్న వెంకటలక్ష్మి అన్న ఎంతో ఇష్టం. అయితే చైనా నుంచి వచ్చిన వీర్రాజు మేనల్లుడు క్రిష్ (విశ్వంత్) కూడా వెంకటలక్ష్మిని ప్రేమిస్తాడు. అయితే ఫ్రెండ్స్‌తో కలిసి అరకు వెళ్లిన వెంకటలక్ష్మి కిడ్నాప్‌కు గురవుతుంది. దీంతో ఈ కేసును కాకినాడ ఎస్సై అజయ్ కుమార్ (బ్రహ్మాజీ) ఇన్వెస్టిగేట్ చేస్తాడు. చివరికి వెంకటలక్ష్మి ఆచూకి లభించిందా? ఇంతకి ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? ప్రభు, క్రిష్‌లలో వెంకటలక్ష్మి ఎవరిని ప్రేమిస్తుంది? చైనాకు క్రిష్‌కు ఉన్నరిలేషన్ ఏంటి? వీటన్నింటిని తెలుసుకోవాలంటే ‘ఓ పిట్ట కథ’ చూడాల్సిందే. నటీనటులు: ఈ సినిమాలో అందరి పాత్రలు ప్రధానమైనవి. దీంతో ఎవరికి వారు పోటీపడి నటించారనే చెప్పాలి. ముఖ్యంగా సంజయ్, విశ్వంత్ల నటనకు వావ్ అనాల్సిందే. వెంకటలక్ష్మిపై ప్రేమ, దక్కదనే ఆందోళన, జీవితంలో సెటిల్ అవ్వాలనే భయం ఇలా అన్ని కోణాలను తమ నటనలో చూపించారు. విశ్వంత్‌కు కాస్త అనుభవం ఉండటంతో తన పాత్రను అవలీలగా చేశాడు. అయితే తొలి సినిమాలోనే డిఫరెంట్ షేడ్స్ గల పాత్ర లభించడం సంజయ్‌కు దక్కిన గొప్ప అవకాశమనే చెప్పాలి. అయితే వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కానీ ఎమోషన్స్ పలికించడంలో ఇంకాస్త మెరుగుపడాలి. ‘దేవుళ్లు’ సినిమాతో అందరి ఆశీర్వాదాలు పొందిన నటి నిత్యాశెట్టి. ఈ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. తెలుగమ్మాయి కావడం, తొలి సినిమా కావడంతో ఈ సినిమాలో నిత్యాశెట్టి చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా నిత్యాశెట్టి వచ్చిన ప్రతీ సీన్ కలర్ఫుల్గా, కామెడీగా, రొమాంటిక్‌గా సాగిపోతూ ఉంటుంది. ఇక కాకినాడ ఎస్సై పాత్ర పోషించిన బ్రహ్మాజీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఎందుకంటే తన అనుభవంతో ఆ పాత్రను అవలీలగా చేశాడు. మిగతా తారగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: హీరోహీరోయిన్ల ఎంట్రీ, లవ్ సీన్స్, అక్కడక్కడా నవ్వించే కామెడీతో ఫస్టాఫ్ అంతా సాదా సీదాగా సాగిపోతుంది. దీంతో సినిమా యావరేజ్ అనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. అయితే అసలు సినిమా అంతా సెకండాఫ్‌లోనే ఉంది. ఫస్టాఫ్‌లో ప్రేక్షకుడికి తెలియకుండా కథలో భాగంగా వేసిన అనేక ముడులను దర్శకుడు ఒక్కొక్కొటి విప్పుకుంటూ వస్తాడు. దీంతో ద్వితీయార్థం అద్యంతం ఆసక్తిగా, ఆశ్చర్యంగా, అసలేం ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ కలగక మానదు. సెకండాఫ్‌లో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఎవరి ఊహకు అందవు. ఇలా సెకండాఫ్‌లో ప్రేక్షకుడు సీట్లలో నుంచి కనీసం పక్కకు కూడా జరగకుండా కూర్చున్నాడంటే క్రెడిట్ మొత్తం స్క్రీన్ ప్లేకే దక్కుతుంది. యువ డైరెక్టర్ చెందు ముద్దు తన పక్కా స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఎక్కడా సస్పెన్స్ రివీల్ చేయకుండా క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడికి డిఫరెంట్ థ్రిల్‌ను కలిగించాడు దర్శకుడు. ఈ విషయంలో చెందుకు డైరెక్టర్‌గా మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఇక లవ్ సీన్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అయితే ఓ కిడ్నాప్ కేసును ఛేదించే క్రమంలో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్లలో నాటకీయత లోపిస్తుంది. అంతేకాకుండా ఆ సీన్లు అతికించినట్టు అనిపిస్తాయి. పోలీస్ స్టేషన్ సీన్లను ఇంకాస్త బెటర్‌గా తీర్చిదిద్ది ఉంటే సినిమాకు మరింత బలం చేకూర్చేది. ఇక కామెడీ సీన్లు అక్కడక్కడా నవ్వులు తెప్పిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సస్పెన్స్‌ను రివీల్ చేస్తున్న సమయంలో వచ్చే కామెడీ బాగుంటుంది. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ బలం. హీరోహీరోయిన్ల లవ్ సీన్స్, కాకినాడ, అరకును సినిమాటోగ్రఫర్ చాలా అందంగా, రియలస్టిక్‌గా చూపించాడు. పాటలు సినిమా అవసరానికి తగ్గట్టు ఉంటాయి, ఆకట్టుకుంటాయి. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాను చాలా రిచ్‌గా చూపించాడు. ఫైనల్‌గా స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కన్ఫ్యూజన్ చేసినా.. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ‘ఓ.. పిట్ట కథ’ చిత్రానికి వెళ్లి చూడొచ్చు. ప్లస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే సంజయ్, విశ్వాంత్ల నటన నిత్యాశెట్టి అందం, అభినయం మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ పలు సీన్లలో లోపించిన నాటకీయత - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
మా అబ్బాయి వస్తానంటే యస్ అన్నాను
‘‘తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటే తమ పిల్లల్ని కూడా ఆ రంగంలో పైకి తీసుకురావాలనుకుంటారు.. నేను కూడా అలాగే అనుకున్నాను. మా అబ్బాయి సంజయ్ సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ‘ప్రయత్నించు.. వర్కౌట్ అయితే ఉండు.. లేకపోతే నీకు నచ్చింది చేసుకో’ అన్నాను. ఒక తండ్రిగా ఎంత సహకారం అందించాలో అంత చేశా. తనని సోలో హీరోగా పరిచయం చేయొచ్చు. కానీ, ఒక మంచి పాత్ర ద్వారానే తెలుగు ప్రేక్షుకులకు దగ్గరవ్వాలని ‘ఓ పిట్టకథ’ సినిమా చేశాడు’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’లో అమలాపురంలో ఉండే ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ పాత్రలో నటించాను. నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఒక అమ్మాయి అదృశ్యం అవుతుంది.. ఎలా అదృశ్యం అయింది? అనే కోణంలో నా పాత్ర సాగుతుంది. ఈ సినిమాలో మంచి స్క్రీన్‌ప్లే ఉంది. తెలుగులో ఇంతవరకూ ఇలాంటి స్క్రీన్‌ప్లే రాలేదు. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. నేను యంగ్‌గా కనిపించడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు.. జీ¯Œ ్స ప్రభావం అంతే. ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి బంధాల్ని కొనసాగిస్తున్నాను. హీరోలందరూ ఫ్రెండ్సే. కలిసి పార్టీలు చేసుకుంటాం.. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటారు. ‘ఓ పిట్టకథ’ సినిమాని దర్శకులు కృషవంశీ, అనిల్ రావిపూడి, మేర్లపాక గాంధీ, హను రాఘవపూడి.. వంటి వారు చూశారు.. వాళ్లకి బాగా నచ్చింది.. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
‘ఆయన రావడం మా అదృష్టం’
విశ్వంత్, సంజయ్రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చందు ముద్దు దర్శకత్వం వహించారు. భవ్యక్రియేషన్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అంతేకాకుండా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రావడంతో టాలీవుడ్ ప్రధాన దృష్టి ఈ చిత్రంపై పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. మార్చి 6న ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్బంగా బ్రహ్మాజీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓ పిట్టకథ ఎలా స్టార్ట్ అయ్యింది ? ఓ పిట్టకథ సినిమా కథ ముందు నాకు దర్శకుడు సాగర్ చంద్ర నాకు రెఫర్ చేశాడు, తాను డైరెక్టర్ చెందును పరిచయం చేశాడు, చెందు కథ చెప్పగానే బాగా నచ్చి ప్రొసీడ్ అయ్యాం. తెలుగులో ఇంతవరకు రాని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రానుంది. మీ పాత్ర గురించి ? ఇది ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్, అమలాపురం లో ఉండే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటించాను. రెగ్యులర్ సినిమాతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చెయ్యకుండా ఒక మంచి పాత్రలో మా అబ్బాయిని చూడాలని అనుకున్నాను, ఓ పిట్టకథ సినిమా కథలో మా అబ్బాయి పాత్ర నచ్చి ఈ సినిమా చెయ్యమని చెప్పాను. మా అబ్బాయి ఆర్టిస్ట్ కంటే ముందు డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. అక్కక కొన్ని విషయాలు నేర్చుకున్నారు. మీరు వర్క్ చేసిన హీరోల గురించి ? ప్రస్తుతం ఉన్న మన తెలుగు హీరోలందరు కలసిమెలిసి ఉంటారు. కొందరు వారిని వేరుగా చూస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు, నాకు అందరూ హీరోలతో ఉన్న అనుబంధంతో అందరితో కలిసి నటించాను. ముఖ్యంగా చిరంజీవి గారు బిజీ షెడ్యూల్ లో మా పిట్టకథ సినిమా ఫంక్షన్ కు రావడం మా అదృష్టం. అలాగే మా టీజర్ ను విడుదల చేసిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓ పిట్టకథ ఎలా ఉండబోతొంది ? కొత్తవారు చేసిన సినిమాలు చూడడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడరు. ఇలాంటి సందర్భంలో ఆడియన్స్ ను అలరించాలి అంటే సినిమాలో కొత్తదనం ఉండాలి, ఓ పిట్టకథ సినిమా కంటెంట్ ఫ్రెష్ గా ఉండబోతొంది. ఇదివరకు విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కొంతమంది దర్శకులు ఓ పిట్టకథ సినిమా చూసి బాగుందని చెప్పారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు కొన్ని మార్పులు చెప్పడం జరిగింది, ఆయన సూచనలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. సినిమా పూర్తి అయ్యాక చంద్రశేఖర్ యేలేటి గారు సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. డైరెక్టర్ చందు ముద్దు గురించి ? సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. చాలా ఆసక్తికరంగా, గ్రిప్పింగ్ గా దర్శకుడు చందు ముద్దు సినిమాను తెరకెక్కించాడు. చాలా క్లారీటి ఉన్న దర్శకుడు తను, నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను మంచి నిర్మాణ విలువలతో నిర్మించారు. తదుపరి చిత్రాలు ? అల్లు అర్జున్ & సుకుమార్ సినిమా, చిరంజీవి కొరటాల శివ సినిమాల్లో నటిస్తున్నాను. -
‘కథ వినకుండా సినిమా ఒప్పుకున్నా’
‘‘చంద్రశేఖర్ యేలేటిగారి దర్శకత్వంలో ‘మనమంతా’ సినిమా చేశాను. ఆ తర్వాత నాకు సరైన కథ రాలేదు.. దీంతో యేలేటిగారితో ప్రయాణం మొదలుపెట్టాను. ఆ సమయంలో ‘ఓ పిట్టకథ’ సినిమా గురించి చెప్పి, కథ చాలా బాగుంది.. చేస్తావా? అని అడిగారు. ఆయన మీద నమ్మకంతో కథ వినకుండా ఈ సినిమా ఒప్పుకున్నా’’ అన్నారు విశ్వంత్. ‘మనమంతా’, ‘తోలుబొమ్మలాట’ ఫేమ్ విశ్వంత్, సంజయ్ రావు హీరోలుగా, నిత్యా శెట్టి హీరోయిన్గా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశ్వంత్ మాట్లాడుతూ– ‘‘పిట్టకథ’ చిత్రంలో మూడు పాత్రలు ముఖ్యమైనవి. ముగ్గురికీ ఒక్కో పిట్టకథ ఉంటుంది. ఏ పాత్ర ఎలా చెబుతుందనేది వెండితెరపై చూడాల్సిందే. నేను ఇంతవరకు చేసిన పాత్రలు వేరు. ‘పిట్టకథ’లో చేసిన క్రిష్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి.. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశాను. ‘ఓ పిట్టకథ’ స్క్రీన్‌ప్లే నేపథ్యంలో సాగుతుంది. ఆ స్క్రీన్‌ప్లే గేమ్ కొరటాల శివగారికి, మా గురువు చంద్రశేఖర్‌గారికి నచ్చింది. ‘తెలుగులో ఇటువంటి స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా రావడం కొత్త. ‘పిట్టకథ’ అంటే చిన్నదికాదు.. పెద్ద కథ’ అన్నారు కొరటాల శివగారు. గ్రామీణ నేపథ్యంలో చేశాం కాబట్టి సింపుల్‌గా ‘పిట్టకథ’ అని టైటిల్ పెట్టాం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ నాకు మంచి పేరు తీసుకువచ్చాయి.. కానీ, వాణిజ్య పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు. అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇటీవల ‘కాదల్’ అని ఒక సినిమా చేశా.. అది నాకు కమర్షియల్ హిట్ ఇస్తుందనుకుంటున్నాను. ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
బుట్ట బొమ్మ చేతుల మీదుగా ‘ఏమైపోతానే’
విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేయగా.. క్యారెక్టర్స్ పోస్టర్‌ను క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఇక వినూత్నంగా రూపొందించిన టీజర్‌ను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌ను బుట్ట బొమ్మ పూజా హెగ్డే చేతుల మీదుగా విడుదల చేయించారు. ‘ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే ఆశల అంచులపై చిలిపిగా నువ్వడుగేస్తుంటే అరెరె నా జగమంటు నీ సగమంటు వేరుగా లేదంటే అదిరే గుండెల చుట్టు కావలి కాస్తూ ఊపిరి నివ్వాలే.. ఏమైపోతానే’ అంటూ సాగే ఈ లవ్ సాంగ్ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ పాటకు శ్రీజో సాహిత్యం అందించగా ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచి ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
పిట్టకథే కానీ పెద్ద కథ
‘‘పిట్టకథ టైటిల్ చాలా బాగుంది. ఇండస్ట్రీలో ఈ మధ్య పిట్టకథ గురించే చర్చ జరుగుతోంది. ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. ‘ఓ పిట్టకథ’ ఈ వేసవిలో ప్రేక్షకులకు చల్లటి ఉపశమనం ఇస్తుంది’’ అని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేష¯Œ ్స పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్స్ పోస్టర్‌ను కొరటాల శివ ఆవిష్కరించారు. చెందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ఒక పల్లెటూరులో జరిగే కథ ఇది. వినోదం, ఉత్కంఠను రేకెత్తిస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు వి.ఆనందప్రసాద్. ‘‘మార్చిలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్ య¯Œ , సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
‘టీజర్, ట్రైలర్ కమింగ్ సూన్’
చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థపై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర ప్రీ టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. విభిన్నంగా రూపొందించిన ‘ఓ పిట్ట కథ’ ప్రీ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 47 సెకన్ల నిడివి గల ఈ ప్రీ టీజర్ ఆరంభంలో ఫుల్ యాక్షన్ సీన్స్ చూపించారు. దీంతో ఈ సినిమాలో టైటిల్‌కు భిన్నంగా, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా హై వోల్టేజీ యాక్షన్ సీన్స్ రూపొందించరని భావిస్తారు. కానీ ‘ఇది మన సినిమా ట్రైలర్ కాదు. ఈ థియేటర్లో నెక్ట్స్ వచ్చే ట్రైలర్. మన సినిమా టీజర్, ట్రైలర్ కమింగ్ సూన్’ అంటూ చివర్లో చిత్ర బృందం ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. అయితే ఈ సినిమాలో అలాంటి యాక్షన్ సీన్స్ ఉన్నాయా అనే విషయం తెలియాలంటే ఫిబ్రవరి 7వరకు వేచిచూడాలి. ఆ రోజు విడుదలయ్యే టీజర్‌తో ఈ సినిమాపై ఓ అభిప్రాయానికి రావచ్చు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
పిట్ట కథకూ నాకూ లింక్ ఉంది
‘ఈ సినిమాతో నాకు ఓ చిన్న లింక్ ఉంది. అదేంటంటే నాకు ఈ చిత్రకథ తెలియటమే. కథ విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దర్శకుడికి రెండు, మూడు పేర్లు వచ్చాయి. వాటిలో ‘ఓ పిట్టకథ’ టైటిల్ నాకు బాగా నచ్చింది. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అని క్యాప్షన్ పెట్టమని సలహా ఇచ్చాను. అదే ఈ సినిమాకు నా కంట్రిబ్యూషన్’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థపై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్రివిక్రమ్ విడుదల చేశారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘స్టార్ హీరోలతో చాలా కమర్షియల్ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు చేస్తున్నాను. అలాగే మళ్లీ కొత్తవాళ్లతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దర్శకుడు చందు చెప్పిన చిన్న కథకు ఎగ్జయిట్ అయ్యాను. వెంటనే ఈ కథను సెట్స్ మీదకు తీసుకెళ్లాను. ఈ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన త్రివిక్రమ్‌కు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే సినిమా ఇది. షూటింగ్ పూర్తయింది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి అన్నారు. ‘‘ఒక పల్లెటూరిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకిత్తించే సినిమా’’ అన్నారు చందు ముద్దు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి తదితరులు నటించారు. -
ట్రాప్‌లో పడతారు
మహేందర్ ఇప్పలపల్లి హీరోగా, షాలు, కాత్యాయనీ శర్మ హీరోయిన్లుగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ట్రాప్’. ఆళ్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వీఎస్ ఫణింద్ర మాట్లాడుతూ–‘‘లవ్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఈ చిత్ర కథ చెప్పగానే నాతో సినిమా తీయడానికి ఒప్పుకున్న ఆళ్ల స్వర్ణలతగారికి థ్యాంక్స్. ‘సింధూరం’ సినిమా బ్రహ్మాజీగారికి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో ‘ట్రాప్’ చిత్రం నాకు అంత మంచిపేరు తీసుకువస్తుందని నమ్ముతున్నాను’’అన్నారు. ‘‘నిర్మాణ రంగంలోకి రావాలంటే తొలుత చాలా భయం వేసింది. కానీ, హీరో, హీరోయిన్, సాంకేతిక నిపుణులందరూ మంచి సహకారం అందించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. మా చిత్రం అన్ని కార్యక్రమాలను ఫణీంద్ర దగ్గరుండి చూసుకున్నారు’’ అన్నారు ఆళ్ల స్వర్ణలత. రచ్చరవి, విట్టల్, పరమేశ్వర శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె, శివ, సంగీతం: ఈశ్వర్ పెరావలి, నేపథ్య సంగీతం: హర్ష ప్రవీణ్. -
సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్!
తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రానికి కలెక్షన్లు కురుస్తున్నాయి. అభిమానులే కాదు సినీ తారలు సైతం ‘సైరా నరసింహారెడ్డి’ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ చిత్ర మేకింగ్ కష్టాల్ని మరిచిపోయేలా చేసింది. ఈ సినిమా కోసం నటీనటులు అందరూ ప్రాణం పెట్టి చేశారనడంలో అతిశయోక్తి లేదు. సైరాలో నటించిన బ్రహ్మాజీ కూడా ఆ కోవకే చెందుతాడు. పాత్ర కోసం తనని తాను మలుచుకోడానికి సిద్ధపడిపోయాడు. అందుకోసం హార్స్ రైడింగ్ నేర్చుకోవడమే కాక గుండు కొట్టించుకున్నాడు. సైరా చిత్రీకరణ సమయంలో గుండు కొట్టించుకున్న చిత్రాలను బ్రహ్మాజీ ట్విటర్లో పోస్ట్ చేశారు. సైరాలో ఏదైనా పాత్ర ఇవ్వమని రామ్‌చరణ్‌ను అడిగాను. కానీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇస్తాడనుకోలేదంటూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇందుకు సినిమా యూనిట్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ ఫొటోను షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలో గుండు కొట్టిన తర్వాత పూర్తిగా పాత్రలో లీనమైపోయిన బ్రహ్మాజీని చూడవచ్చు. పైగా రామ్‌చరణ్ దగ్గరుండి మరీ గుండు కొట్టిస్తున్నాడు. కాగా పోరాట ఘట్టాల్లో బ్రహ్మజీ నటన అద్భుతమని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. Requested Ram Charan garu to give me an opportunity to work with mega star in #SyeRaa .. never imagined it to be a full length role.. ever greatful 🙏🏼🙏🏼.. Nd can’t thank enough @DirSurender @RathnaveluDop for ur support 🙏🏼.@KonidelaPro 🙏🏼 pic.twitter.com/jKqRYCZdj3 — BRAHMAJI (@actorbrahmaji) October 4, 2019 -
‘అభిమానితో తను.. అభిమానంతో నేను’
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఏఏ 19’గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా దిగిన ఓ ఫోటోను సీనియర్ నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన బ్రహ్మాజీ ఆ ఫోటోకు ‘అభిమానితో తను.. అభిమానంతో నేను’ అనే కామెంట్‌ను జోడించారు. అంతేకాదు. ఆ కామెంట్ విషయంలో కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు అంటూ మరో ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో టబు, నవదీప్, సుశాంత్, మలయాళ నటుడు జయరామ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Caption help chesindi Trivikram garu..😀 — BRAHMAJI (@actorbrahmaji) 2 July 2019 -
అబ్బా ఏం అందం.. ఏమీ లేదు ఏమీ లేదు
సినిమాల్లోనే కాదు సామాజిక మాధ్యమాల్లో కూడా తన అభిమానులను ఎప్పుడూ నవ్విస్తుంటాడు టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్. నటుడు బ్రహ్మాజీతో కలిసి వెన్నెల కిశోర్ సరదాగా తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. కృష్ణ, కాంచన నటించిన ‘అవే కళ్లు’ చిత్రంలో హీరో హీరోయిన్లు ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు అబ్బా ఏం అందం .. ఏమీ లేదు ఏమీ లేదు అంటూ డైలాగ్ ఉంటుంది. అదే సన్నివేశంలో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీలు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి సంభాషణలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. -
మంచి చేసే మాస్టర్
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. మా సంస్థ ఈ సినిమాని సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ, చాలా మార్పులు చేసి, గోపి బాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆయన ఏరికోరి ఎంపిక చేసుకున్నారు’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్యకృష్ణ, ‘టెంపర్’ వంశీ, ‘దిల్’ రమేశ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రమేష్.పి.పిళ్లై నిర్మించారు. శ్రీదేవి మూవీస్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘బ్లఫ్ మాస్టర్’ కథకు సత్యదేవ్ పక్కాగా న్యాయం చేశారు. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. డిసెంబర్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మన సినిమా ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. సమాజంలో బ్లఫ్ మాస్టర్లు చాలా ఎక్కువయ్యారు. మా సినిమా చూశాక సమాజంలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను’’ అని గోపీ గణేష్ పట్టాభి అన్నారు. ‘‘ఈ సినిమాకి ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాను. నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ చిత్రంతో లభించింది’’ అన్నారు సత్యదేవ్. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, సినిమాటోగ్రాఫర్ దాశరది శివేంద్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కృష్ణకుమార్ (కిట్టు). ∙ -
వెన్నెల కిషోర్ పాటకు.. నవదీప్ రియాక్షన్!
టాలీవుడ్ కమెడియన్స్‌లో బిజీగా ఉండే వెన్నెల కిషోర్.. సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటాడు. సినిమాల్లో మాదిరిగానే సోషల్ మీడియాలో కూడా హాస్యాన్ని పండిస్తాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ పాడిన పాట, మొదలు పెట్టిన సీజన్ 1 ట్విట్టర్లో వైరల్ అవుతోంది. తిన్నది అరక్క.. అనే కాన్సెప్ట్‌తో చచ్చారు పో అంటూ మొదలు పెట్టిన ఈ మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను సింగర్ చిన్నయికి అంకితం చేశాడు. పాట పాడిన వీడియోను కూడా షేర్ చేశాడు. దీనికి నవదీప్ వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. ఇక వెన్నెల కిషోర్ పాడిన పాటపై బ్రహ్మాజీ కామెంట్ చేస్తూ.. కాకా.. పాట పాడొచ్చు కదా.. లిరిక్స్ చదివావ్ అని అంటే.. నీ దృష్టిని నావైపు మళ్లించడానికే అంటూ రిప్లై ఇచ్చాడు.. వెంటనే బ్రహ్మాజీ స్పందిస్తూ.. నేను సరే అన్నా.. పాపం చిన్నయి ఎలా ఉందో ఒక సారి కనుక్కో అనగానే.. అవునన్నో.. అటునుంచి (చిన్మయి) రెస్పాన్సే లేదంటూ జవాబిచ్చాడు. మళ్లీ వెంటనే చిన్మయి స్పందిస్తూ.. ఇప్పుడే స్పృహ వచ్చిందంటూ రిప్లై ఇచ్చింది. ఇలా ఈ వీడియో కామెంట్లతో వైరల్‌గా మారుతోంది. pic.twitter.com/SrZk7DuoMp — Navdeep (@pnavdeep26) 27 September 2018 -
సంసారం.. సేమియా ఉప్మా
‘‘యామిరిక్క భయమేన్’ తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని రెండేళ్ల క్రితం నా మనసులో అనుకున్నా. రీమేక్ హక్కులు ‘బన్నీ’ వాసుగారి వద్ద ఉన్నాయని తెలిసి, నేను కామ్ అయిపోయా. అయితే, ఆ సినిమా చివరకు నా దగ్గరకే వచ్చింది’’ అని హీరో ఆది అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆది పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► గతేడాది ప్రభాకర్గారిని కలిస్తే ఇరవై నిమిషాలు ‘నెక్ట్స్ నువ్వే’ కథ చెప్పారు. ‘యామిరిక్క భయమేన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడంతో బాగా నచ్చింది. ప్రభాకర్‌గారు ఏంటో నాకు తెలుసు. బాగా డైరెక్ట్ చేస్తారని సినిమా చేయడానికి అంగీకరించా. ► గీతా ఆర్ట్స్ బేనర్ ఈ సినిమా నిర్మిస్తుందని ప్రభాకర్‌గారు చెప్పగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అంతా ఓకే అని ‘బన్నీ’ వాసుగారితో మాట్లాడిన తర్వాత జ్ఞానవేల్‌రాజాగారు, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. క్యారెక్టరైజేషన్స్, కథ, మంచి నిర్మాతలు ఉండటంతో మరో ఆలోచనకు అవకాశం కూడా ఇవ్వలేదు. సింగిల్ షెడ్యూల్లో.. 36 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ► సినిమాలో నా పాత్ర పేరు కిరణ్. సీరియల్స్ తీస్తుంటాను. రాజమౌళి అంత పేరు తెచ్చుకోవాలనే కోరిక. ‘సంసారం.. సేమియా ఉప్మా’ అనే సీరియల్ తీస్తుంటాడు. నిర్మాతగా ఓ సీరియల్ తీసి, అప్పుల పాలవుతాడు. ఆ అప్పుల నుంచి తప్పించుకోవడానికి రిసార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ హాస్యంతో సాగే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. ► ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో బ్రహ్మాజీగారి పాత్ర చూసి, నేనూ ఈయనతో ఓ సినిమా చేస్తే బావుంటుందనుకున్నా. ‘నెక్ట్స్ నువ్వే’తో లక్కీగా ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది. ► జ్ఞానవేల్ రాజాగారి స్టూడియో గ్రీన్ బ్యానర్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న మూడు సినిమాలు చేయబోతున్నా. అలాగే, జ్ఞానవేల్ రాజాగారు తెలుగులో చేసే స్ట్రయిట్ మూవీలో కూడా నటిస్తున్నా. -
బెజవాడ హవాలా.. ఎందుకు.. ఎలా?
-
విజయవాడలో హవాలా.. డాక్టర్లపై కేసులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హవాలా వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో హవాలా వ్యవహారం వెలుగుచూసి పలువురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఇంకా మరువక ముందే విజయవాడలో హవాలా వ్యవహారం కలకలం సృష్టించింది. విదేశాల నుంచి నిధులు తెప్పించుకోడానికి కొంతమంది కార్పొరేట్ వైద్యులు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇందుకోసం ఏజెంట్ బ్రహ్మాజీకి వాళ్లు భారీ మొత్తంలో కమీషన్లు ముట్టజెప్పారు. అయితే కొన్ని నెలలు గడుస్తున్నా రావాల్సిన నిధులు రాకపోవడంతో బ్రహ్మాజీని ఒక కారులో కిడ్నాప్ చేసి, నగరానికి సమీపంలో ఉన్న ఒక మామిడితోటలో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకాలు కూడా చేయించుకున్నారు. బ్రహ్మాజీ ఆచూకీ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, తొలుత దీన్ని కేవలం కిడ్నాప్, చిత్రహింసల కేసుగానే భావించారు. విషయం తెలిసినా కూడా కొంతమంది పోలీసు అధికారులు డాక్టర్లకు సహకరించారని తెలిసింది. దాంతో ఒక ఏసీపీ, మరో సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం హవాలా వ్యవహారంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. తీగ లాగితే డొంక మొత్తం కదలడంతో నగరంలోని హెల్ప్ ఆస్పత్రి చైర్మన్, ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, అదే ఆస్పత్రి ఎండీ సీహెచ్ రవికుమార్, మరో ఆస్పత్రి ఎండీ మైనేని హేమంత్‌లతో సహా మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది. కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి జోక్యం.. రాజీకి యత్నం రంగురాళ్ల వ్యాపారి, హవాలా ఏజెంటు అయిన బ్రహ్మాజీకి కొంతమంది టీడీపీ నేతలతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసును రాజీ చేయడానికి టీడీపీ నేతలు రంగప్రవేశం చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన ఒక మంత్రి వద్ద పీఏగా వ్యవహరిస్తూ, నామినేటెడ్ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇప్పటికే ఒక వైద్యుడి ఇంటి వద్దకు వెళ్లి, బ్రహ్మాజీ కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ కేసులో ఉన్న ఒక వైద్యుడికి విజయవాడకు చెందిన ఓ పత్రికా ప్రతినిధి కూడా బంధువు కావడంతో ఆయన సైతం ఇందులో జోక్యం చేసుకుని వైద్యుల మీద కేసులు రాకుండా చూసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆ మార్గంలో వెళ్తే కుదరదని భావించి.. నేరుగా బ్రహ్మాజీ కుటుంబ సభ్యులతోనే డీల్ చేస్తున్నారు. కేసు నమోదైన ముగ్గురిలో ఒక వైద్యుడు అనంతపురం జిల్లాలోని ఒక టీడీపీ ఎమ్మెల్యే ఆశ్రయం పొందినట్లు తెలిసింది. బ్రహ్మాజీ లాంటి చాలామంది విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
విజయవాడలో హవాలా.. డాక్టర్లపై కేసులు!
-
పాతికేళ్ల క్రితం కథతో...
‘‘ఓ వాస్తవ సంఘటన నేపథ్యంలో మా చిత్రం సాగుతుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. కొంత నక్సలిజాన్ని కూడా టచ్ చేశాం. ప్రేమ, వినోదం, యాక్షన్ అన్నీ ఉంటాయి. నారా రోహిత్ సపోర్ట్‌తోనే సినిమాని అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం’’ అని దర్శకుడు సాగర్ కె.చంద్ర తెలిపారు. నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో సాగర్ దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తా. కొత్త తరహా కథతో తెరకెక్కిన చిత్రమిది. నా కెరీర్లో ఒక మంచి చిత్రంగా నిలుస్తుంది. సాయికార్తీక్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంటాయి’’ అన్నారు. ‘‘ఈ తరహా చిత్రంలో నేను నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం విజయం సాధిస్తే మరికొన్ని కొత్త చిత్రాలు వస్తాయి’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. శ్రీవిష్ణు, తాన్యా హోప్, నటులు సత్య, అజయ్, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నవీన్ యాదవ్. -
సినీ మాయలో మహిళలు
సాధారణంగా సినిమా పిచ్చి పురుషులకు ఉంటుంది. అదే పిచ్చి మహిళలకు కూడా ఉంటే ఎలా ఉంటుంది? వాళ్లు ఎలా ట్రాప్‌లో పడ్డారు? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ట్రాప్’. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ పతాకంపై ఆళ్ల స్వర్ణలత నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను దర్శకరత్న దాసరి నారాయణరావు రిలీజ్ చేశారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘వినోదాత్మకంగా సాగే చిత్రమిది. బ్రహ్మాజీ పాత్ర సినిమాకే హైలెట్. దాసరిగారు మా చిత్రం లోగో, పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. త్వరలో టీజర్ లాంచ్ చేసి, డిసెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మహేంద్ర ఈఎంఎస్, కాత్యాయని శర్మ, షా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ షెరావలి, కెమెరా: ప్రవీణ్. కె. -
పండగ వచ్చేసింది!
జనరల్‌గా హీరోలు బైక్ మీద వెళితే.. కమెడియన్లు వెనకాల కూర్చుంటారు. కమెడియన్ బైక్ నడిపితే, హీరో అతని భుజాల మీద కూర్చునే తరహా సీన్స్ దాదాపు కనిపించవు. అందుకే, బైక్ నడుపుతున్న అలీ భుజాల మీద పవన్ కల్యాణ్ కూర్చోవడం, పక్కనే బ్రహ్మాజీ, నర్రా శ్రీను నిలబడి చిరునవ్వులు చిందిస్తూ పోజివ్వడం చూస్తుంటే వింతగానే ఉంటుంది. సినిమాలో కొత్త కొత్త కామెడీ ట్విస్టులు చాలా ఉంటాయనడానికి ఈ స్టిల్‌ని శాంపుల్‌గా చిత్రనిర్మాత శరత్ మరార్ బయటపెట్టి ఉంటారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’కి సంబంధించిన ఈ స్టిల్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ స్టిల్ అభిమానులను అలరిస్తుందని ఊహించవచ్చు. మరో రెండు రోజుల్లో రానున్న సంక్రాంతి పండగ ఇప్పుడే వచ్చేసినట్లుగా ఫ్యాన్స్ భావించినా ఆశ్చర్యపోవడానికి లేదు. హైదరాబాద్‌లోని సుమారు 5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందించిన సెట్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి పవన్‌కల్యాణ్ కథ-స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. -
సారే మహాన్ సే ఇచ్ఛ
సినిమాల్లో బ్రహ్మాజీ ఓ ఆవేశపరుడు.. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. సిద్ధాంతాల కోసం పోరాడే జర్నలిస్ట్.. నమ్మిన బంటు.. హాస్యాన్ని కూడా పండించగల నటుడు. మేకప్ తీసేస్తే.. బ్రహ్మాజీ ఒక కామన్ సిటిజన్ మాత్రమే కాదు.. బుద్ధిజంతో తనను తాను మరింత ఉన్నతంగా మలుచుకుంటున్నాడు. ఈ ప్రయత్నంలోనే బ్రహ్మాజీకి ఇచ్ఛతో దోస్తీ కుదిరింది. అక్కడి పసిమనసులతో ఆప్యాయత పెరిగింది. ఇంతకీ బ్రహ్మాజీ తన ఇచ్ఛ ఎలా నెరవేర్చుకుంటున్నాడో ఆయన మాటల్లోనే.. ప్రజెంటేషన్: భువనేశ్వరి స్పందించే గుణముంటే.. సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడతామని మధు టుగ్నైడ్ని చూస్తే అనిపిస్తుంటుంది. ఎంచక్కా భర్త భారత నేవీలో కమాండర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. కొడుకు ఎమ్ టీవీలో ఉద్యోగి. ఏ బాధలు, బాధ్యతలూ లేవు. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో అనాథపిల్లలు.. అదీ ఆరోగ్యంగా లేని పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుంది. నా భార్య శాశ్వత బెస్ట్ ఫ్రెండ్ మధు. ఓసారి శాశ్వతతో కలసి మధు స్థాపించిన ఇచ్ఛా ఆశ్రమానికి వెళ్లాను. జస్ట్ విజిటింగ్ కోసం వెళ్లినవాణ్ని.. రోజు గడిచినా అక్కడ నుంచి కదల్లేకపోయాను. బుద్ధిజంలో చేరాక.. ‘ఇచ్ఛ' అంటే కోరికని అర్థం. తన కోరిక మేరకు మధు స్థాపించిన ఆశ్రమం వెనుకున్న ఆశయం.. సాయపడాలన్న కోరిక తీర్చుకోవడమే. మధుకి సేవ చేయాలన్నది చిన్ననాటి నుంచి ఉన్న కోరిక. భర్త ఉద్యోగం మేరకు వైజాగ్‌లో స్థిరపడ్డారు. ఇక మా శాశ్వత, మధులది పదిహేనేళ్ల స్నేహం. మేం బుద్ధిస్టుల అసోసియేషన్ సోకా గక్కాయ్ ఇంటర్నేషనల్‌లో సభ్యులం. ఈ అసోసియేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందిని కలిసే అవకాశం దొరికింది. ఇదే క్రమంలో సేవాభావం ఉన్న వ్యక్తులను కలిశాను. బుద్ధిజంలో చేరాక నా జీవితంలో చాలా మార్పు చూశాను. మధుతో స్నేహం కూడా సోకా గక్కాయ్ పుణ్యమే. కొడుక్కి ఉద్యోగం వచ్చి ఢిల్లీకి వెళ్లిపోయిన తర్వాత మధు మనసు సేవపైకి మళ్లింది. వైజాగ్‌లోని అనాథపిల్లలుండే శిశువిహార్‌కి వెళ్లినపుడు అక్కడ ఇద్దరు పిల్లలు ఆమె చెయ్యిపట్టుకుని వదల్లేదట. అంతే.. తన ‘ఇచ్ఛ' తీర్చుకునే సమయం వచ్చిందనుకుంది. వైజాగ్‌కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామం దగ్గర ‘ఇచ్ఛ’ ఆశ్రమం నెలకొల్పింది. ఆ పిల్లల ప్రత్యేకత... గత ఏడాది నేను, నా భార్య మొదటిసారి ‘ఇచ్ఛ' ఆశ్రమానికి వెళ్లాము. పచ్చని చెట్ల మధ్య చెక్కతో నిర్మించిన ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా తోచింది. ఆశ్రమంలో కనిపించిన అమాయక పసి హృదయాలు మరింత ప్రశాంతతను పంచాయి. నేను వెళ్లినపుడు ఓ పదిమంది పిల్లలున్నారు. అందరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నవారే. కొందరు మానసిక వికలాంగులు, ఇంకొందరు శారీరక వికలాంగులు. ఒకమ్మాయి అయితే తలను నిలబెట్టలేదు, నిలబడలేదు, నడవలేదు, కూర్చోలేదు. ఏడాది వయసుంది. కానీ చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో! ఆ అమ్మాయిని ఎత్తుకున్నంతసేపు నా మనసు ఎంత తేలికగా అనిపించిందో. నాకు ఆ భగవంతుడ్ని పూజించిన భావన కలిగింది. నా చుట్టూ చేరిన పిల్లల్లో.. అమాయకంగా కొందరు, ఆయోమయంగా ఇంకొందరు నవ్వుతుంటే.. అర్థంకానట్టు నన్ను చూస్తుంటే నా మనసు తరుక్కుపోయింది. ఎందుకంటే వారికి అన్నం పెట్టగలం, వైద్యం చేయించగలం కానీ మనలాంటి జీవితాన్ని మాత్రం ఇవ్వలేం కదా అనిపించింది. నేనే బ్రాండ్ అంబాసిడర్‌ని... ఏదో ఫ్రెండ్ సేవను చూడ్డానికి వెళ్లాం. కానీ అక్కడికి వెళ్లాక నా మనసులో బోలెడన్నీ ఆశయాలు పుట్టేశాయి. నేను ఊహించినదానికంటే నా మనసు ఎక్కువగానే స్పందించింది. ‘ఇచ్ఛ’కి నాలుగు రూపాయల ఆర్థికసాయం చేసి ఊరుకుంటే సరిపోదు. ఇంకా ఏదో చేయాలనిపిచింది. నా భార్య శాశ్వత మాత్రం ఏడాదిలో వీలైనన్నిసార్లు ఆ ఆశ్రమానికి వెళ్లి ఆ పిల్లలకు సేవ చేయాలనుకుంది. మరి నేను.. అని అలోచించుకుంటే ‘ఇచ్ఛ’కి కావాల్సిన ప్రచారం చేయాలనుకున్నాను. సేవాప్రచారం కూడా సేవే కదా అనుకున్నాను. ఇండస్ట్రీలో నాకున్న స్నేహితులందరికీ మధు చేస్తున్న సేవ గురించి చెప్పి వీలైనంత ఎక్కువ మొత్తంలో ఆర్థికసాయం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఐ లవ్ మధు మధు ఆశ్రమంలో ఉన్న పిల్లలంతా రకరకాల వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారు. వారికి ఆమె ఇంతన్నం పెట్టి ఊరుకోవట్లేదు. అవసరమైన వైద్యం నుంచి ఫిజియోథెరపీ వరకూ ఏదీ కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తోంది. మేం ఒకరోజంతా ఉన్నామక్కడ. మధు చేస్తున్న సేవ నన్ను, బ్రహ్మాజీని బాగా కదిలించింది. మాకు వీలైనంత సాయం చేయడానికి ముందుకొచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్. - శాశ్వత వారి రాకతో.. బ్రహ్మాజీ, శాశ్వత వాళ్లిద్దరూ నా ఆశ్రమానికి రావడం మొదలుపెట్టాక మా చట్టుపక్కల ప్రజల నుంచి మంచి స్పందన రావడం మొద లైంది. నటుడిగా బ్రహ్మాజీకున్న పేరు నా ఆశ్రమం మనుగడకు చాలా ఉపయోగపడుతోంది. - మధు -
ఫైర్ ఫైటర్స్
-
నటుడు బ్రహ్మాజీ కుమారుడిపై దాడి
-
సినీ పరిశ్రమకు విశాఖ వేదిక : బ్రహ్మాజీ
అచ్యుతాపురం : భవిష్యత్తులో సినీ పరిశ్రమకు విశాఖ వేదిక కానుందని ప్రముఖ సినీనటుడు బ్రహ్మాజీ అన్నారు. కొండకర్లలో ‘ఇచ్చా’ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడి విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పలువురు విశాఖలో షూటింగ్ చేపడుతున్నారన్నారు. అరకుకు విమాన సౌకర్యాలు మెరుగుపరచగలిగితే పర్యాటకం, సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. తన కెరీర్లో 25 చిత్రాల్లో గుర్తింపు తెచ్చిన పాత్రలు పోషించినట్టు చెప్పారు. ప్రస్తుతం ‘పండుగ చేసుకో’, యూవీ క్రియేషన్స్ చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. వర్ధమాన నటులు ఓపికతో శ్రమపడాల్సి ఉందన్నారు. పైరసీ కారణంగా పరిశ్రమ దెబ్బతింటుందని వాపోయారు. హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. విశాఖను పునర్నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఆయన అనాథ ఆశ్రమంలోని పిల్లల్ని దగ్గరకు తీసుకుని కాసేపు వారితో సరదాగా గడిపారు. అనాథలు, వికలాంగులకు మరింత సేవలందేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి మథూ టుక్నైట్‌ను అభినందించారు. -
సమంతా.. చెప్పులు చూపించొద్దు!!
క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీ సెట్లో ఉన్నారంటే.. అక్కడ నవ్వులు విరబూయాల్సిందే. ఎప్పుడూ బ్రహ్మాండమైన టైమింగుతో పంచ్ డైలాగులు వేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటారు. ఎంతవాళ్లమీదైనా కూడా చాలా సున్నితంగా జోకులు వేస్తూ.. వాళ్లతో సహా ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకునేలా చేయడం బ్రహ్మాజీకి తెలిసిన విద్య. ఇటీవల హీరోయిన్ సమంత మీద కూడా బ్రహ్మాజీ మంచి జోకు ఒకటి పేల్చాడు. ఇటీవల బ్రహ్మాజీ ఓ షూటింగుకు వెళ్తుండగా దారిలో ఓ సిటీబస్సు కనిపించింది. దానిమీద చెప్పులకు సంబంధించిన ఓ ప్రకటనలో సమంత ఉంది. వెంటనే దాన్ని ఓ ఫొటో తీసుకుని.. ట్విట్టర్లో పోస్టు చేశారు. 'నేను నిన్ను ఫాలో అవుతున్నాను.. దయచేసి చెప్పులు చూపించకు' అని అందులో రాశారు. దానికి సమంత ఏం సమాధానం ఇచ్చి ఉంటుందో తెలుసా.. 'హ హ.. హగ్స్'!! @Samanthaprabhu2 Am following U... Pl don't show Cheppulu.;) pic.twitter.com/XIONjvI5x5 — BRAHMAJI (@actorbrahmaji) November 5, 2014 -
భయపెడుతూ వినోదం
‘‘హారర్ కామెడీతో పాటు సందేశం ఉన్న సినిమా ఇది’’ అని దర్శకుడు భానుకిరణ్ చల్లా చెప్పారు. బ్రహ్మాజీ, మనోజ్ నందం, హరిణి, మాదాల రవి, ఉత్తేజ్ ముఖ్యతారలుగా జె. రామారావు నిర్మిస్తున్న ‘అలౌకిక’ చిత్రం పూజా కార్యక్రమాలు మంగళవారం హైదరాబాద్‌లో జరిగాయి. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, డిసెంబరులో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు మాదాల రవి, మనోజ్‌నందం, సంగీత దర్శకుడు ప్రమోద్, కెమెరామేన్ సూర్యప్రకాశ్‌రావు మాట్లాడారు. న్యాయం ప్రకారం పోరాడుతున్నా... - మాదాల రవి లైంగిక వేధింపుల ఆరోపణలను ఇటీవల ఎదుర్కొన్న నటుడు, నిర్మాత మాదాల రవి తొలిసారిగా ఆ వ్యవహారంపై ఈ ప్రెస్మీట్లో పెదవి విప్పారు. ‘‘నాపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలే. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. న్యాయం ప్రకారం పోరాడుతున్నా. నాకు న్యాయవ్యవస్థపై నూటికి నూరుశాతం నమ్మకం ఉంది. ఆ సంఘటన జరిగిన రాత్రే నేను బెయిల్ తీసుకున్నాను. అంతే తప్ప నేను జైలుకు వెళ్లలేదు’’ అని మాదాల రవి తెలిపారు. -
పవర్ స్టార్ సిటీలో లేకపోతే..పవర్ కట్ చేస్తారా..?
మొబైల్ ఫోన్లలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోవడం చాలా సులభం, సర్వసాధారణమైపోయింది. తమ అభిప్ర్రాయలను ఇతరులతో పంచుకోవడం ఫ్యాషనైపోయింది కూడా.. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా చేరిపోవడం.. వాళ్లు పోస్ట్ చేసే సందేశాలకు కూడా మంచి క్రేజ్ లభిస్తోంది. ఇటీవల సినీనటుడు బ్రహ్మాజీ ఓ ఆసక్తికరమైన.. హాస్యంతో కూడిన ట్వీట్ చేశారు. బ్రహ్మాజీ చేసిన ట్వీట్ చాలా మందిని ఆకట్టుకుంది. గత కొద్ది రోజులుగా నగరంలో ఎక్కువైపోయిన పవర్ కట్ లను ఉద్దేశించి బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. పవర్ స్టార్ సిటీలో లేకపోతే పవర్ కట్ చేస్తారా..? అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ పై చాలా రకాలుగానే చర్చ మొదలైంది. పవర్ కట్ ల బాధను తట్టుకోలేకనే ట్వీట్ చేశారా లేక.. జనాల అటెన్షన్ ను సొంత చేసుకోవడానికే పవర్ స్టార్ పేరును ట్వీట్ లో ఉపయోగించుకున్నారా ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే తనకు ఎవర్ని ఆకట్టుకోవాల్సిన అవసరం లేదని.. జస్ట్ ఫర్ ఫన్ కోసమే ట్వీట్ చేశాను అని బ్రహ్మజీ వివరణ ఇచ్చారు. ట్వీట్ లు.. ఫేస్ బుక్ లో సందేశాలు పోస్ట్ చేసే నెటిజన్లు కాస్తా జాగ్రత్తగా ఉండాల్సిందే మరి.. Power Star city lo lekapothe Power Cut chesesthara..? — BRAHMAJI (@actorbrahmaji) June 3, 2014 -
సంక్రాంతి పాత రోజులను గుర్తుచేసింది
సంక్రాంతి పండుగ పాత రోజులను గుర్తుచేసిందని సినీ నటుడు బ్రహ్మాజీ అన్నారు. ఆదివారం రాత్రి తాడేపల్లిగూడెం వచ్చిన ఆయనను ‘న్యూస్‌లైన్’ పలకరించింది. స్థానిక సుబ్బారావుపేటలోని సింహాల బొమ్మవీధిలో ఉన్న సమయంలో ఎక్కువగా స్నేహితులతో గడిపేవాడినని చెప్పారు. నటనపై ఆసక్తి ఉండటంతో 1987లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరానని, అప్పటి నుంచి సినీ రంగంతో పరిచయం ఏర్పడిందన్నారు. 150కు పైగా చిత్రాల్లో నటించి నట్లు చెప్పారు. సింధూరం, గులాబీ మంచి బ్రేక్ నిచ్చాయని, అన్నిరకాల పాత్ర లు చేయడం ఇష్టమని తెలిపారు. నటనలో ఆకళింపు, పాత్రలపై అవగాహన ఉంటే నటుడిగా రాణించడానికి గాడ్ ఫాదర్లు అక్కర్లేద ని చెప్పారు. ఎవరో కొంతమంది సినీ పరిశ్రమను శాసిస్తున్నారనేది వాస్తవం కాదన్నారు. ప్రకాష్‌రాజ్‌కు గాడ్ ఫాదర్ లేరని, నితిన్ లాంటి వ్యక్తి పది చిత్రాలు పరాజయం పొందినా ఇటీవల వచ్చిన ఒక చిత్రంతో మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు తెలి పారు. గూడెం 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చాలా మారిందన్నారు. షూటింగ్ రద్దు కావడంతో మిత్రులను కలవాలని ఇక్కడికి వ చ్చాన న్నారు. పాత స్నేహితులను చూడగానే ఎంతో సంతోషం కలిగిందన్నారు. మహేష్‌బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ, రవి తేజ చిత్రాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. ప్రకాష్‌రాజ్ నిర్మాతగా, దర్శకుడిగా చేయబోతున్న చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. బస్టాప్ చిత్ర దర్శకుడు మారుతీ తీయబోయే చిత్రంలో నటిస్తున్నానన్నారు. బ్రహ్మాజీని ఆయన మిత్రు లు ైవె సీపీ నాయకులు నత్తి శివ, మారిశెట్టి సుబ్బారావు, ఉడిపి హోటల్ సురేష్ కలిశారు. -
‘సిందూరం’ హిట్ అయి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో: బ్రహ్మాజీ
హ్యూమరిజం, హీరోయిజం, విలనిజం.. ఈ మూడింటినీ సమర్థవంతంగా పోషించగల నటుడు బ్రహ్మాజీ. విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, అటుపై హీరోగా మారి, ప్రస్తుతం కేరక్టర్ నటునిగా బిజీ బిజీగా ఉన్న బ్రహ్మాజీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక సంభాషణ... **** కెరీర్ ఎలా ఉందండీ? రకరకాల పాత్రలు చేస్తూ హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతమైతే క్షణం తీరిక లేదు. లేటెస్ట్గా రిలీజైన ‘కమీనా’లో నా పాత్రకు మంచి పేరొచ్చింది. **** హీరో అవుదామని వచ్చినట్టున్నారు? నిజమే... తాడేపల్లిగూడెంలో చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాలంటే పిచ్చి. అందునా చిరంజీవిగారి అభిమానిని. ఆయన ఏ నేపథ్యం లేకుండా మెగాస్టార్ అయ్యారు. ఆయనలా మనమెందుకు కాకూడద నే భావన మనసులో ఉండేది. అదే నన్ను మద్రాసు వైపు నడిపించింది. **** అంటే చెన్నపట్నం అనుభవాలు మీకూ ఉన్నాయన్నమాట? ప్రైవేట్‌గా ఇంజినీరింగ్ చేస్తానని ఇంట్లో వాళ్లతో నమ్మబలికి తొలిసారి మద్రాసు వెళ్లాను. అక్కడ అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లోకి ప్రవే శించి వాతావరణం ఎలా ఉంటుందో పరిశీలించాను. తర్వాత హైదరాబాద్‌లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. అక్కడే కృష్ణవంశీ, రవితేజ, జేడీ చక్రవర్తి, పూరీ జగన్నాథ్... పరిచయం అయ్యారు. **** మరి తొలి అవకాశం? రామ్‌గోపాల్‌వర్మ ‘శివ’ కోసం ఆడిషన్స్‌కి పిలిస్తే వెళ్లాను. అందులో మంచి పాత్ర ఇచ్చారు వర్మ. వెన్నుపోటుదారుని పాత్ర. ఆ సినిమా తర్వాత నాకు అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి. **** ‘గులాబీ’లో కూడా దాదాపు అలాంటి పాత్రేగా? నా మిత్రుడు కృష్ణవంశీ తొలి సినిమా అది. అందులో నాది ఫలానా టైప్ పాత్ర అని చెప్పకుండా ముందు కొన్ని సన్నివేశాలు తీశాడు వంశీ. తర్వాత నాపై ఆ మిత్రద్రోహానికి సంబంధించిన సీన్స్ తీస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నా తత్వం అలాంటి వాటికి పూర్తి విరుద్ధం. కష్టం మీద ఆ పాత్ర చేశాను. ఇప్పటికీ ఆ పాత్ర గుర్తొస్తే నాకు ఏదోలా ఉంటుంది. కానీ నాకు మంచి పేరు తెచ్చిన పాత్ర అది. **** ‘సిందూరం’ లాంటి సినిమాలో హీరోగా చేసిన మీరు హీరోగా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? ‘సిందూరం’ మంచి సినిమా. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. గులాబీ, నిన్నేపెళ్లాడతా చిత్రాల తర్వాత కృష్ణవంశీ చేసిన సినిమా అది. దాంతో ‘సిందూరం’ కూడా లవ్‌స్టోరీ అనుకున్నారు జనాలు. కానీ అది పూర్తి భిన్నమైన గొప్ప కాన్సెప్ట్. అందుకే తేలిగ్గా జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు రిలీజైతే ఆ సినిమా పెద్ద హిట్. ‘సిందూరం’ హిట్ అయి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో. ఏదిఏమైనా ‘సిందూరం’ లాంటి మంచి సినిమాలో హీరోగా చేశాననే తృప్తి మాత్రం మిగిలింది. **** ఆ సినిమాలో సెకండ్‌హీరోగా చేసిన రవితేజ ఇప్పుడు అగ్రహీరో. రేస్‌లో వెనుకబడిపోయానని ఎప్పుడైనా అనిపించిందా? నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అదే దక్కుతుంది. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా రకరకాల పాత్రలు చేస్తూ సంతృప్తిగా ఉన్నాను. హీరోలకు ఇన్ని వైరైటీ పాత్రలు చేసే అవకాశం ఉండదు కదా. అయినా రవితేజ నా ప్రాణమిత్రుడు. తను ఆ స్థాయికి రావడం ఫ్రెండ్‌గా నాకు ఆనందమే. **** మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? తను సహాయ దర్శకునిగా ఉన్నప్పట్నుంచే నాకు ఫ్రెండ్. అప్పుడు తన పలకరింత ఎలా ఉండేదో, ఇప్పటికీ అలానే ఉంటుంది. కించిత్ గర్వం కూడా తలకెక్కించుకోని వ్యక్తిత్వం రవితేజది. తను ఏ సినిమాలో నటించినా సాధ్యమైనంతవరకూ నన్ను కూడా ఆ సినిమాలో నటింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అలా నాకు లభించిన పాత్రలు కోకొల్లలు. ఓ విధంగా నా ఫ్రెండ్స్ వల్లే ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది. కృష్ణవంశీ, జేడీ, పూరీ, త్రివిక్రమ్, శ్రీనువైట్ల.. వీళ్లందరూ కెరీర్ తొలినాళ్లలో నాకు మంచి మిత్రులు కావడం వల్లే ఈ రోజు నేనింత బిజీగా ఉన్నాను. **** మీకు డ్రీమ్ కేరక్టర్ ఏదైనా ఉందా? అవన్నీ ఒట్టి మాటలండీ. అసలు డ్రీమ్ కేరక్టర్లు ఎవరికీ ఉండవు. మంచి పాత్రలు ఉంటాయి. ప్రకాష్‌రాజ్‌లా వైరైటీ పాత్రలు చేయాలని ఉంది. **** ఇండస్ట్రీలో పరభాషా నటులను ప్రోత్సహించడం ఎక్కువైనట్లుంది? అవును. దీనివల్లే తెలుగు నటులకు మంచి పాత్రలు దక్కడం లేదు. హిందీ, మలయాళం చిత్రాలతో పోలిస్తే క్వాలిటీ పరంగా కూడా తెలుగు సినిమా వెనుకబడిందనే చెప్పాలి. మన లోటుపాట్ల గురించి అత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. **** నటుడిగానే కొనసాగుతారా? లేక డెరైక్షన్ చేస్తారా? డెరైక్షన్‌పై ఇంట్రస్ట్ ఉంది. ఆ శక్తి దేవుడు ఇస్తే తప్పకుండా చేస్తా.