
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా, కొత్త దర్శకుడు మణింద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుట్టుచప్పుడు. డాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై లివింగ్ స్టన్ నిర్మిస్తున్నాడు. ఉగాది సందర్భంగా పోస్టర్, మోషన్ పోస్టర్‌లను హీరో అడవి శేష్ చేతులు మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో అడివి శేషు మాట్లాడుతూ మోషన్ పోస్టర్ కూడా ఇంత హైప్ తెప్పించే విధంగా క్రియేట్ చేయవచ్చు అని తాను ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు. డైరెక్టర్ గారికి ఇది నిజంగా ఫస్ట్ మూవీనా అని చాలా డౌట్‌గా ఉందన్నాడు. ఆయనలో చాలా సీనియారిటీ ఉందా అనిపించేలా టాలెంట్ కనిపిస్తుందని మెచ్చుకున్నాడు. మ్యూజిక్, ఎఫెక్ట్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయని, మూవీకి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
డైరెక్టర్ మణింద్రన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'ముందుగా మా మూవీ సెకండ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు హీరో అడవి శేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రొడక్షన్ పరంగా నాకు అండగా ఉన్న ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ గారికి నేను రుణపడి ఉంటాను' అని అన్నారు. హీరో సంజయ్ రావ్ ముందుగా అడవి శేష్‌కు థ్యాంక్ యు చెబుతూ 'అన్న మీ మేజర్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను, గుట్టు చప్పుడు సినిమాకి సంబంధించి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా సస్పెన్స్ లు ఉన్నాయి, డైరెక్టర్ మేకింగ్ ఏంటో మీరు స్క్రీన్ పై చూస్తారు' అని ముగించారు. కెమెరామెన్ రాము హీరో సంజయ్ రావ్ గారి గురించి చెప్తూ సేమ్ బ్రహ్మాజీ గారిలా సెట్ లో చాలా డిసిప్లిన్ గా ఉంటారని మెచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment