Adivi sesh
-
సాహసంలో భాగస్వామికి స్వాగతం
అడివి శేష్ స్పై మిషన్‌లో చేరారు వామికా గబ్బి. అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘జీ2’. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా, ‘జీ2’ రూపొందుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్గా వామికా గబ్బి నటిస్తున్నట్లు వెల్లడించారు. ‘వెల్కమ్ టు ది మిషన్. మైపార్ట్నర్ ఇన్ అడ్వెంచర్ (మిషన్కి స్వాగతం... సాహసంలో నా భాగస్వామి)’’ అని వామికా గబ్బిని ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు అడివి శేష్. ‘‘జీ2’ ప్రయాణంలో భాగం కావడం హ్యాపీగా ఉంది’’ అని వామికా పేర్కొన్నారు. ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు షాలిని తదితరులు నటిస్తున్న ‘జీ2’ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది విడుదల కానుంది. -
టాలీవుడ్ హీరో అడివిశేష్ ఇంట్లో చండీ హోమం (ఫోటోలు)
-
డకాయిట్ మిస్టరీ.. శృతి పోయి మృణాల్ ఎలా వచ్చింది?
-
శృతి హాసన్ కాదు.. 'డెకాయిట్'లో మృణాల్
అంతా ఫిక్స్ అయిన తర్వాత సినిమాల విషయంలో కొన్నిసార్లు చేర్పులు మార్పులు జరుగుతుంటాయి. అయితే హీరో లేదా హీరోయిన్ని మాత్రం ఎప్పడో ఓసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా నుంచి హీరోయిన్గా శృతి హాసన్‌ని తీసేసి మృణాల్ ఠాకుర్‌ని ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్)2022లో 'మేజర్' సినిమా వచ్చింది. దీని తర్వాత అడివి శేష్ ఏ సినిమాలు చేస్తున్నాడో కనీసం చిన్న అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మధ్యలో 'గూఢచారి 2' గురించి చెప్పారు గానీ. అది ఏ స్టేజీలో ఉందనేది క్లారిటీ లేదు. మరోవైపు కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' అనే సినిమాను ప్రకటించిన శేష్.. శృతి హాసన్‌తో కనిపించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు.కట్ చేస్తే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ మారిపోయింది. శృతి ప్లేసులోకి మృణాల్ వచ్చి చేరింది. మరి కావాలనే తప్పించారా? లేదా శృతి హాసన్ తప్పుకొందా అనేది తెలియాల్సి ఉంది. మూవీ పోస్టర్‌తో పాటు 'అవును వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అని మృణాల్ క్యాప్షన్ పెట్టింది. మరోవైపు శేష్ కూడా ఈ పోస్టర్స్ షేర్ చేస్తూ.. 'అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు..! ఇడిచిపెట్టను...తేల్చాల్సిందే' అని క్యాప్షన్ పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అవును వదిలేసాను..కానీ మనస్పూర్తిగా ప్రేమించానుHappy Birthday, @AdiviSesh ✨Let's kill it - #DACOIT pic.twitter.com/tH4trCr0Fe— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024 -
టాలీవుడ్ మూవీ నుంచి తప్పుకున్న శృతి హాసన్!
కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గతేడాది సలార్ మూవీ అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం రజినీకాంత్ చిత్రం కూలీలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.అయితే శృతిహాసన్ ఇప్పటికే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. అందులో టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న డెకాయిట్:ఎ లవ్ స్టోరీ ఒకటి. అంతే కాకుండా చెన్నై స్టోరీ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాల నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే కొన్ని విభేదాల కారణంగానే ఆమె గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితుల్లో ఒకరు మీడియాకు వెల్లడించారు. డెకాయిట్‌తో పాటు చెన్నై స్టోరీ కూడా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్ .. వీడియో వైరల్)కాగా.. గతేడాది డిసెంబర్లో అడివి శేష్, శృతి హాసన్ జంటగా డెకాయిట్ మూవీని ప్రకటించారు. అదే రోజున అనౌన్స్మెంట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు చెన్నై స్టోరీలో శ్రుతి హాసన్ డిటెక్టివ్ పాత్రను పోషించాల్సి ఉంది. అంతకు ముందు సమంత రూత్ ప్రభుని ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్నారు. ఆ తర్వాత శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. తాజాగా శృతి కూడా సినిమా నుంచి తప్పుకుంది. -
క్యాన్సర్‌తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
క్యాన్సర్‌తో పోరాటం.. చిన్నారిని ఆడించిన అడివి శేష్
టాలీవుడ్ హీరో అడివి శేష్ మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి కీర్తిని కలిసి తనతో సరదాగా కాలక్షేపం చేశాడు. ఆ చిన్నారిని ఎత్తుకుని ఆటలాడాడు. ఈ సందర్భంగా తనకు బొమ్మలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్సలో భాగం కీమోథెరపీ చేసినప్పుడు తలపై వెంట్రుకలు తీసేస్తారు. అలా వెంట్రుకలు పోగొట్టుకున్న కీర్తి.. తను వేసిన డ్రాయింగ్‌లోనూ పాపకు జుట్టు తీసేసింది.వీడియో వైరల్అడివి శేష్.. ఆ చిన్నారిని ఆడిస్తూ, నవ్విస్తూ చాలాసేపు కబుర్లు చెప్పాడు. కాసేపు తన బాధనంతా మర్చిపోయి సంతోషంగా నవ్వేలా చేశాడు. పాపకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు మిగిల్చి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శేష్ మంచితనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. బిజీ టైంలోనూ పాప కోసం సమయం కేటాయించడాన్ని కొనియాడుతున్నారు.డెకాయిట్ఇక సినిమాల విషయానికి వస్తే అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. క్షణం, గూఢచారి వంటి పలు చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానీల్ డియో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీలో ఈ మూవీ చిత్రీకరిస్తున్నారు. #AdiviSesh's Heartwarming Act of Kindness ❤️In an inspiring and touching gesture, Hit Machine @AdiviSesh recently reached out to surprise a little girl battling cancer, bringing joy to her.His genuinly loving heart has left a lasting impact in both the little girl and her… pic.twitter.com/g8K5KTsyIu— Shreyas Sriniwaas (@shreyasmedia) July 20, 2024చదవండి: ఆ హీరోయిన్‌కు యాక్టింగ్ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్ -
సన్నీ చంద్ర నుంచి అడివి శేష్ గా పేరు మార్చుకోవడానికి కారణం తెలిస్తే
-
అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్
గూఢచారి, హిట్ 2, ఎవరు? మేజర్ సినిమాలతో అడివి శేష్ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ హీరో గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు చేస్తున్నాడు. అందులో హీరోగా నటించడమే కాకుండా ఈ రెండు చిత్రాలకు రచయితగానూ వ్యవహరిస్తున్నాడు. డెకాయిట్‌లో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలోని ప్రతి సీన్, డైలాగ్‌ను హిందీతోపాటు తెలుగులోనూ చిత్రీకరిస్తున్నారు.అసలు పేరు ఇదీ!ఈ సినిమాలతో బిజీగా ఉన్న అడివి శేష్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన అసలు పేరును బయటపెట్టాడు. తన ఒరిజినల్ నేమ్ సన్నీ చంద్ర అని చెప్పాడు. అమెరికాలో ఉన్నప్పుడు నా పేరు చూసి అందరూ ఏడిపించేవారు. అక్కడ ఆరెంజ్ ఫ్లేవర్‌లో సన్నీ డిలైట్ అని ఓ జ్యూస్ ఉండేది. అలాగే అప్పట్లో సన్నీలియోన్ చాలా పాపులర్.ఏడిపించారునా పేరులో సన్నీ ఉండటంతో అందరూ టీజ్ చేసేవారు. ఇదే విషయం నాన్నకు చెప్పాను. అయితే శేష్ అనే పేరు వాడుకో అని సూచించాడు. నాకర్థం కాలేదు. సునీల్ గవాస్కర్ అభిమానిని కాబట్టి సన్నీ అని పెట్టాను. పూజారి శ అక్షరంతో పేరుండాలని చెప్పారు. అలా నీకు శేషు అనే పేరు కూడా ఉందన్నాడు. అప్పటి నుంచి నా పేరు అడివి శేష్‌గా మారింది.చదవండి: ఆఫీస్‌లో చోరీ.. వీడియో రిలీజ్ చేసిన నటుడు -
మాజీ ప్రేమికుల కథ
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్నపాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ‘డెకాయిట్’తో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్‌కి జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఈ విషయాన్ని తెలియజేస్తూ... శేష్, శ్రుతి సరదాగా దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారు
‘‘హరోం హర’ ట్రైలర్ చాలా నచ్చింది. సుధీర్‌బాబు మంచి సినిమా చేశాడని తెలిసి, ఈ వేడుకకి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్స్‌ని పిలిచి షో వేశారంటే సినిమాపై యూనిట్‌కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌పై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ (టీజర్, ట్రైలర్, ΄ాటలు...) ్ర΄ామిసింగ్గా ఉంది. సుబ్రహ్మణ్యం, సుమంత్ లాంటి ΄్యాషన్ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ‘హరోం హర’ లాంటి నేపథ్యంలో సినిమా రాలేదు. నాతో ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్కి థ్యాంక్స్. ఈ సినిమా చూశాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం’’ అన్నారు నిర్మాత సుమంత్. ‘‘హరోం హర’లోని తండ్రీ కొడుకుల ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగో΄ాల్, డైరెక్టర్ మారుతి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. -
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
‘‘నా తొలి సినిమా ఆడియో లాంచ్‌కి నరేశ్‌గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నేను రావడం హ్యాపీగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని మనమంతా థియేటర్లో చూసి హాయిగా నవ్వుకుందాం’’ అని హీరో అడివి శేష్ అన్నారు.‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చిలకప్రోడక్షన్స్పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘నేను ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో ఉండటానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ డైరెక్టర్ మల్లి అంకంతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 30 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను.ఈ మండు వేసవిలో మీ బాధలు మర్చిపోయి రెండు గంటలు హాయిగా మా సినిమాతో ఎంజాయ్ చేయండి’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి మంచి మూవీ చేయడం మా అదృష్టం’’ అన్నారు రాజీవ్ చిలక. ఈ వేడుకలో సహ నిర్మాత భరత్, దర్శకులు విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవా కట్టా, రచయితలు బీవీఎస్ రవి, అబ్బూరి రవి, నటి జామి లివర్ మాట్లాడారు. -
నెక్స్ట్ 100 కోట్ల స్టార్ హీరో అతడే!
కంటెంట్ ఉంటే హీరో కటౌట్‌తో పనిలేకుండా సెంచరీలు కొట్టేస్తున్న రోజులివి. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్లో కొత్త ఆటగాళ్లు ఎలా దంచికొడుతున్నారో.. సినిమాల్లోకి కొత్తగా వచ్చిన హీరోలు కూడా అలాగే వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ చిత్రం విజయం సాధించడంతో సిద్దు జొన్నలగడ్డ 100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. సిద్దు సెంచరీ కొట్టడంతో టిల్లు క్యూబ్ అంటూ తన తదుపరి చిత్రంపై కూడా మరింత అంచనాలను పెంచగలిగాడు. ఆ రకంగా సిద్దు ఇండస్ట్రీలో తనని తానే సెంచరీ స్టార్‌గా తీర్చిదిద్దుకున్నాడు. టిల్లుతో తనలో ఉన్న రైటింగ్ స్కిల్స్ అతన్ని 100 కోట్ల హీరోగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాయి అన్నది వాస్తవం. అయితే ఇతడి కంటే ముందు తేజ సజ్జ హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు. అలాగే హీరో నాని దసరా చిత్రంతో 100 కోట్ల క్లబ్లో చేరాడు.గీతగోవిందంతో విజయ్ దేవరకొండ, ఎఫ్-2 తో వరుణ్ తేజ్, 100 కోట్ల క్లబ్లో చేరగా.. కార్తికేయ-2 తో నిఖల్ వంద కోట్లు సాధించడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇక తన తొలి సినిమా ఉప్పెన చిత్రంతోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా వందకోట్ల క్లబ్లో చేరిన వాడే. మరి ఈ రేసులో తదుపరి సెంచరీ కొట్టే స్టార్ ఎవరు? అంటే ఆ ఛాన్స్ అడివి శేష్‌కు ఉందని చెప్పొచ్చు. గతంలో శేష్ నటించిన గుఢచారి, హిట్-2, ఎవరు, మేజర్ లాంటి సినిమాలతో అడవి శేష్ పేరు సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు 50-60 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మేజర్ పాన్ ఇండియా స్థాయిలో హిట్‌గా నిలిచి 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం శేష్ గుఢచారి-2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాలతో నటనతో పాటు రైటింగ్‌లో కూడా శేష్‌కు అపార అనుభవం ఉంది. తనని స్టార్‌గా మార్చుకోవడంలో రైటింగ్ స్కిల్ అతడికి ఎంతో ఉపయోగపడుతోందని చెప్పాలి. గుఢచారి-2 తో అడివి శేష్ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడతాడు అనే అంచనాలున్నాయి. ట్రేడ్ సైతం ఈ సినిమాతో సాధ్యమని భావిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. -
Banita Sandhu: ‘గూఢచారి’తో యాక్షన్‌కి సిద్ధమైన బనితా సంధు!
‘అక్టోబర్, సర్దార్ ఉదమ్’ వంటి హిందీ చిత్రాలతో, తమిళ చిత్రం ‘ఆదిత్య వర్మ’తో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బనితా సంధు. ఈ బ్యూటీ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అడివి శేష్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ ఫిల్మ్ (2018) ‘గూఢచారి’కి సీక్వెల్‌గా పాన్ ఇండియా స్థాయిలో ‘జీ 2’ తెరకెక్కుతోంది. గూఢచారిగా హీరో అడివి శేష్ నటిస్తున్నారు. ఈ స్పై సరసన బనితా సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గుజరాత్‌లోని భుజ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో బనితా జాయిన్ అయిన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘శేష్, బనితాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. తెరపై ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. హై ఆక్టేన్ యాక్షన్ మూవీగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘‘ఈ చిత్రంలో నటించడం క్రియేటివ్‌గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకూ చేయని పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను’’ అని బనితా సంధు అన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేస్తున్నారు. View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) -
రేపు బ్యాండు మోగించాలి : హీరో అడివి శేష్
‘‘చాయ్ బిస్కట్ సంస్థలో సుహాస్ వీడియోలు చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి ప్రతిభ ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారు. తను ఏ స్థాయికి వెళతాడో ఊహించలేను. ఏదో ఒక రోజు తను నా వేడుకకి అతిథిగా రావాలి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ట్రైలర్ నచ్చడంతో పది సార్లు చూశా. రేపు (శుక్రవారం) మనమంతా ఈ సినిమా బ్యాండ్ మోగించాలి’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుహాస్, శివానీ నాగరం జంటగా దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుష్యంత్ కటికనేని మాట్లాడుతూ– ‘‘సుహాస్ లేకుంటే డైరెక్టర్‌గా ఈ వేదికపైకి వచ్చేందుకు ఇంకా ఎన్నేళ్లు పట్టేదో తెలియదు’’ అన్నారు. ‘‘నేను నిర్మాతగా ఈ వేదికపై నిలబడటానికి అల్లు అరవింద్, అల్లు శిరీష్, ‘బన్నీ’ వాసుగార్లే కారణం. సుహాస్ లేకుంటే ఈ చిత్రం లేదు’’ అన్నారు ధీరజ్ మొగలినేని. -
చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు: మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్‌ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్‌కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్‌ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్‌కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్ ట్విటర్ ద్వారా మెగాస్టార్‌కు కంగ్రాట్స్ తెలియజేశారు. Congratulations to #Megastar @KChiruTweets on being honoured with the #PadmaVibhushan , a great honour bringing great pride to #TeluguCinema and to his people who love him. Hard work never fails🙏 pic.twitter.com/2l4SEPFIII — Radikaa Sarathkumar (@realradikaa) January 25, 2024 Hearty congratulations, Dear Chiru Bhai, for being conferred with the Padma Vibhushan.@KChiruTweets — Mammootty (@mammukka) January 25, 2024 Congratulations sir ❤️❤️ You are always an Inspiration 😊#PadmaVibhushanChiranjeevi #Megastar https://t.co/41qCnAkw2K — Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2024 Many congratulations to you, Sir @KChiruTweets Gaaru, on the honor bestowed upon you. You rightly deserve it. Your contribution to cinema, the world of art, your philanthropic lifestyle, your good work for the public and the blessings of your elders brings you this. As a friend,… https://t.co/DXKj4RgZw7 — KhushbuSundar (@khushsundar) January 26, 2024 Good morning Padma Vibhushan Chiranjeevi gaaru :) ♥️@KChiruTweets 🙏🏼 — Hi Nani (@NameisNani) January 26, 2024 Telugu vadi Garva Karanam Mega 🌟 Padma Vibhushan@KChiruTweets garu #MegastarChiranjeevi Garu — Teja Sajja (@tejasajja123) January 25, 2024 Congratulations Annaya @KChiruTweets on being recipient to the second highest civilian award #PadmaVibhushan Much Deserving Honour for your inspiring legacy & contribution. Thank you for holding cinema high at every instance. ❤️ pic.twitter.com/SvqDpnCBfI — Satya Dev (@ActorSatyaDev) January 25, 2024 My favorite picture I have of us sir @KChiruTweets ❤️ Thank you for always being kind and warm to me. Thank you for the amazing films. Thank you for the brilliant performances. Thank you for being our MEGASTAR. You are now a #PadmaVibhushan Sir. A proud moment for us, for TFI… pic.twitter.com/Wa7Q9x6V4P — Adivi Sesh (@AdiviSesh) January 26, 2024 Congratulations to our BOSS @KChiruTweets Garu on being felicitated with the honorary award #PadmaVibhushan ❤️ Thank you for making us all proud yet again and again. pic.twitter.com/pW5LEbVtuo — Vassishta (@DirVassishta) January 25, 2024 -
చిరంజీవితో పోటీకి సిద్ధమైన అడివి శేష్
-
అడివిశేష్‌తో జోడీ కట్టనున్న శృతి హాసన్
అడివి శేష్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రధారులుగా ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే షార్ట్ ఫిల్మ్‌కు షాన్ దర్శకత్వం వహించారు. శేష్, శ్రుతి కాంబినేషన్లో ఆయన దర్శకత్వం వహించనున్న తాజా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి సీన్, డైలాగ్‌లను హిందీతో పాటు తెలుగులో కూడా చిత్రీకరించనున్నాం. ప్రతి భాషకు ఉన్న ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ సినిమాను విభిన్నంగా చేస్తున్నాం. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
గూఢచారితో జోడీ
అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి 2’ (జీ 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరో యిన్‌గా బనితా సంధుని ఫిక్స్ చేసినట్లు యూనిట్ పేర్కొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అక్టోబర్, సర్దార్ ఉదమ్’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న బనితా. ‘జీ 2’లో సరికొత్త పాత్రలో కనిపిస్తారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘నా తొలి పాన్ ఇండియా చిత్రమిది’’ అన్నారు బనితా సంధు. -
అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!
యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన అనసూయ.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ మారిపోయింది. ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనసూయ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను అనుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు చాలా ఉద్యోగాలు కూడా చేసినట్లు వెల్లడించింది. ఎంబీఏ చదివిన అనసూయ హెచ్ఆర్గా పనిచేశానని పేర్కొంది. అయితే ఇండస్ట్రీలో హీరోలపై చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. అనసూయ మాట్లాడుతూ.. ' నేను యాక్సిడెంటల్‌గానే ఇండస్ట్రీలోకి వచ్చా. క్షణం సినిమాలో నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా. కానీ సోగ్గాడే మూవీ ముందే రిలీజైంది. కేవలం రెండు వారాల గ్యాప్‌లోనే రెండు ఛాన్సులు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఛానెల్ షోలో పనిచేసేదాన్ని. ఆ సమయంలో అక్కడే సడన్‌గా షూట్లోనే నన్ను అడిగారు. నాగార్జున సార్ సినిమా అనగానే ఒప్పేసుకున్నా. నాకు హలో బ్రదర్ అంటే చాలా ఇష్టం.' అంటూ చెప్పుకొచ్చింది. క్షణం సినిమాలో ఛాన్స్ రావడం పట్ల మాట్లాడుతూ..'నేను దేవిశ్రీ ప్రసాద్‌తో 2013లో పనిచేశా. ఆ టైంలో అడివి శేష్ కలిశాడు. అప్పుడు నేను అనుకునేదాన్ని. ఈ హీరోలంతా లైన్ వేయడానికే అప్రోచ్ అవుతారని అనిపించింది. అందుకే అప్పుడు అడివి శేష్‌ను బాగా అవాయిడ్ చేశా. ఓ మూడు నెలల తర్వాత ఒక కాఫీ షాప్‌లో అనుకోకుండా మేం కలిశాం. అక్కడ కూర్చోబెట్టి మీరు దొరకట్లేదని నేరేషన్ ఇచ్చారు. అప్పుడే నాకు అర్థమైంది. వాళ్ల సినిమాకు నా అవసరం ఉందనే విషయం. జబర్దస్త్‌లో నేను సీరియస్‌గా కనిపించడం అడివి శేష్ చూశారట. అందుకే ఆ పాత్రకు నేనే సెట్ అవుతారని అనుకున్నారు.' అని అన్నారు. కాగా.. అనసూయ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పుష్ప-2లో నటిస్తోంది. రవికాంత్‌లో దర్శకత్వంలో తెరకెక్కించిన క్షణం మూవీలో అడివి శేష్, అదా శర్మ జంటగా నటించగా.. అనసూయ కీలక పాత్రలో కనిపించింది. హీరో లు అందరు లైన్ వెయ్యడానికి అప్రోచ్ అవుతారు అనుకోని నేను తెగ avoid చేసేదాన్ని : — #AnasuyaBharadwaj Video Credit @rajeshmanne1 pic.twitter.com/ManFtpwRii — Milagro Movies (@MilagroMovies) November 5, 2023 -
క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో అడివి శేష్ (ఫొటోలు)
-
మా ఊరి పొలిమేర 2 నా సినిమా లాంటిది
‘‘నా ‘క్షణం’ సినిమాకి పని చేసిన టీమ్ అంతా ‘‘మా ఊరి పొలిమేర 2’ టీమ్‌లో ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ నాకు మంచి స్నేహితుడు. ‘మా ఊరి పొలిమేర ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసి, దానికి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ తీయడం ఆనందంగా ఉంది. ఇది నా సొంత సినిమా లాంటింది. తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. ‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర–2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథులుగా అడివి శేష్, నిర్మాత ఎస్కేఎన్ హాజరయ్యారు. ఎస్కేఎన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏదైనా అదే కష్టమే. ప్రేక్షకులకు మంచి సినిమా కావాలి.. అంతే. ‘మా ఊరి పొలిమేర–2’కి హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ఇంత గ్రాండ్‌గా విడుదల కావడానికి కారణం వంశీ నందిపాటిగారు. మా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్ విశ్వనాథ్. ఈ వేడుకలో కామాక్షీ భాస్కర్ల, గాయకుడు పెంచల్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాకు అహంకారం ఉంది అనుకుంటారు..!
-
నా గర్ల్ ఫ్రెండ్స్ గురించి ? : అడివి శేష్
-
నా లైఫ్ ను నేనే రాసుకుంటున్న: అడివి శేష్
-
నా ఒరిజినల్ పేరు శేష్ కాదు..!
-
నేడు సైమా అవార్డ్స్ ప్రకటన.. పోటీ పడుతున్న తెలుగు స్టార్స్ వీళ్లే
సినిమా ఇండస్ట్రీలో సైమా పండుగ మొదలైపోయింది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 పండుగకు సర్వం సిద్ధమైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డుగా సైమాకు గుర్తింపు ఉంది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుక మరికొన్న గంటల్లో దుబాయ్‌లో జరగనుంది. ఇప్పటికే అక్కడకు జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరుకున్నారు. గతేడాది రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాలను.. అందులో మంచి నటనను కనపరిచిన నటీనటులకు, ప్రేక్షకులు మెచ్చిన సినిమాలను వెలికి తీసి వారిని అవార్డులతో గౌరవించడం అనేది పరిపాటి అని తెలిసిందే. ఈ పోటీలో ఎవరెవరున్నారో ఆ లిస్ట్‌ను సైమా ఇప్పటికే విడుదల చేసింది. ఉత్తమ నటుడు, చిత్రం – తెలుగు (2023) ♦ అడవి శేష్ (మేజర్) ♦ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ (RRR) ♦ దుల్కర్ సల్మాన్ (సీతారామం) ♦ నిఖిల్ సిద్దార్ద్ (కార్తికేయ) ♦ సిద్దు జొన్నలగడ్డ (DJ టిల్లు) ఉత్తమ దర్శకుడు – తెలుగు (2023) ♦ రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ♦ హను రాఘవపూడి (సీతారామం) ♦ చందూ మొండేటి (కార్తికేయ 2) ♦ శశికిరణ్ తిక్కా (మేజర్) ♦ విమల్ కృష్ణ (డీజే టిల్లు) ఉత్తమ గేయ రచయిత ♦ RRR సినిమా నుంచి నాటు నాటు (చంద్రబోస్) ♦ సీతారామం నుంచి 'ఇంతందం' సాంగ్ (కృష్ణకాంత్) ♦ ఆచార్య సినిమా నుంచి 'లాహె.. లాహె' సాంగ్ (రామజోగయ్య) ♦ RRR నుంచి 'కొమురం భీముడో' సాంగ్ (సుద్దాల అశోక్ తేజ) ఉత్తమ సహాయ నటి ♦ అక్కినేని అమల (ఒకే ఒక జీవితం) ♦ ప్రియమణి (విరాట పర్వం) ♦ సంయుక్త మీనన్ (భీమ్లా నాయక్) ♦ సంగీత (మాసూద) ♦ శోభిత ధూళిపాళ (మేజర్) ఉత్తమ విలన్ ♦ సత్యదేవ్ (గాడ్ ఫాదర్) ♦ జయరామ్ (ధమాకా) ♦ సముద్రఖని (సర్కారు వారి పాట) ♦ సుహాస్ (హిట్-2) ► పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు గెలుచున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..సైమా 2023లో కనీసం నామినేషన్ కాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. A glimpse of the star-studded moments. SIIMA 2023 pre-event press meet highlights!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek #LotMobiles #SouthIndiaShoppingMall #TruckersUAE #SIIMA2023 #A23SIIMAWeekend #SouthIndianAwards #Docile… pic.twitter.com/hlVL9fI050 — SIIMA (@siima) September 14, 2023 (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) -
'మహావీరుడు'ని తెలుగువారు ఇష్టపడతారు: అడివి శేష్
'మహావీరుడు’ సినిమా ట్రైలర్, విజువల్స్ గొప్పగా ఉన్నాయి. ఈ మూవీలో గ్రేట్ వైబ్ కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. శివ కార్తికేయన్ హీరోగా ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మహావీరన్’. అదితీ శంకర్ హీరోయిన్. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ ఈ నెల 14న తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరో అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడివి శేష్ మాట్లాడుతూ–'నా గురువు శేఖర్ కమ్ముల ముందు మాట్లాడటం గౌరవంగా ఉంది. శివ కార్తికేయన్‌తో పని చేయాలని ఉంది' అన్నారు. 'రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్’ సినిమాల్లా ‘మహావీరుడు’ ని తెలుగువారు ఇష్టపడతారు' అన్నారు శివ కార్తికేయన్. ‘‘మహావీరుడు’ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మడోన్ అశ్విన్. ‘‘మా అమ్మగారి పేరుతో ఈ సంస్థ మొదలుపెట్టి, శివ కార్తికేయన్‌తో తొలి మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు అరుణ్ విశ్వ. -
అడివి శేష్‌కు ఛాలెంజ్ విసిరిన హైదరాబాద్ సీపీ
జూన్ 23న ఒలింపిక్‌డే సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పలువురి సెలబ్రిటీలకు ఇలా ఛాలెంజ్ విసిరారు. 'మన జీవితాలు ఎప్పుడూ ఆందోళనకరమైనవిగానే కొనసాగుతాయి. మునుపెన్నడూ లేనంత వేగంగా కదులుతున్న ఈ ప్రపంచంలో, ప్రజలు మాత్రం శారిరక వ్యాయామం లేకుండా ఉండటం చూస్తుంటే కలవరపెడుతుంది. అంతేకాకుండా చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పిల్లలు, యువకులు తమ సెల్ ఫోన్లతో పాటు ఇతర డిజిటల్ గాడ్జెట్లకు అంకితమవుతున్నారు. అవి వారిని కట్టిపడేశాయి. దాంతో వారు అస్సలు కదలరు.' అని తెలిపారు. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) ఈ ఒలింపిక్‌డే నుంచి అయినా వారిని మేలుకొల్పాలని తను వ్యాయామం చేసిన వీడియోను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్,పీవీ సింధు, యాక్టర్ అడివి శేష్, నిఖల్‌కు ట్యాగ్ చేసి, ఇలాంటి వర్కౌట్స్ చేయాలని వారికి ఛాలెంజ్ విసిరారు. తాజాగా సినీ నటుడు అడివి శేష్ చేసిన వ్యాయామం వీడియోను సీపీ ఆనంద్‌కు షేర్ చేశాడు. త్వరలో మరింత ఫిట్నెస్తో తమను రీచ్ అవుతానని ఆయన అన్నాడు. (ఇదీ చదవండి: రానా నాయుడులో దుమ్ములేపిన భామ గురించి ఈ విషయాలు తెలుసా?) అందుకు తిరిగి సీపీ ఆనంద్ ఇలా అన్నారు. 'ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు ధన్యవాదాలు అడివి శేష్ ! మీ నిమాల్లో స్మార్ట్ లుక్‌తో ఉంటారు. నేను పోటీ పడలేను, అంతే కాదు కష్టం కూడా' అని సీపీ ఆనంద్ అన్నారు. Hi @VVSLaxman281 @pvsindhu1 @AdiviSesh @actor_Nikhil Pl do share your workout videos as it’ll inspire everyone to do some physical activity. https://t.co/4GhSD3mvaT— CV Anand IPS (@CVAnandIPS) June 24, 2023 Taking up your offer @CVAnandIPS sir🫡 Heres one of my home workout videos 🙏🏼I believe in natural training and a healthy lifestyle, just like you. Hopefully, I can match your fitness soon! ❤️ https://t.co/Jcui8Vv5Ig pic.twitter.com/7wLZ4vSIc2— Adivi Sesh (@AdiviSesh) June 24, 2023 -
సీక్వెల్.. మార్పుల్...
కథ పెద్దదైతే సినిమా రెండు భాగాలవుతుంది.. ఒక్కోసారి మూడు కూడా అవుతుంది. ఇప్పుడలాంటి కథలతో రూపొం దుతున్న సీక్వెల్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకటో భాగంలో నటించిన నటీనటులు, తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో కంటిన్యూ కావడంలేదు. ఒకటీ హీరో మారుతున్నారు.. లేదా డైరెక్టర్ మారుతున్నారు... లేదా హీరోయిన్ మారుతున్నారు... ఇక మార్పుల్తో రూపొందుతున్న సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. హిట్: ది థర్డ్ కేస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హిట్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. కాగా తొలి రెండు భాగాలు నిర్మించిన నాని థర్డ్పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించనుండటం విశేషం. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ చిత్రంలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌ను (హిట్) లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ రుద్రరాజుపాత్రలో నటుడిగా విశ్వక్ సేన్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. కాగా హిట్ ఫ్రాంచైజీలో రెండో భాగం ‘హిట్: ది సెకండ్ కేస్’లో హీరోగా అడివి శేష్‌ని తీసుకున్నారు శైలేష్. ఎస్పీ కృష్ణదేవ్పాత్రలో అడివి శేష్ తనదైన శైలిలో నటించి, మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్. ఇక మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరో నాని నటించనున్నట్లు ‘హిట్: ది సెకండ్ కేస్’ చివర్లో రివీల్ చేశారు. పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నాని నటిస్తారు. కాగా హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలుంటాయని శైలేష్ కొలను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చంద్రముఖి–2 ‘చంద్రముఖి’ (2005)లో ‘లక లక లక..’ అంటూ హీరో రజనీకాంత్ రాజు గెటప్‌లో విలనిజమ్ పండించి, డాక్టర్ ఈశ్వర్‌గా మంచితనం కనబరిస్తే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు చేశారు. ‘చంద్రముఖి’ విడుదలైన 18 ఏళ్లకు సీక్వెల్‌కి శ్రీకారం చుట్టారు పి. వాసు. ‘చంద్రముఖి 2’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ ప్లేస్‌లోకి లారెన్స్ వచ్చారు. అలాగే కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక తదితరులు నటించారు. ఇటీవల మైసూర్లో జరిగిన షెడ్యూల్‌తో ఈ మూవీ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త. యుగానికి ఒక్కడు–2 వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో యుగానికి ఒక్కడు –2010) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. కార్తీ హీరోగా, ఆండ్రియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ (యుగానికి ఒక్కడు 2) తెరకెక్కించనున్నారు సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో తన సోదరుడు, హీరో ధనుష్‌ని లీడ్ రోల్‌కి తీసుకున్నారాయన. కార్తీ స్థానంలో ధనుష్ కనిపిస్తారని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు.. కార్తీ కూడా ఉంటారు.. సీక్వెల్లో ధనుష్పాత్ర యాడ్ అయిందని మరికొందరు అంటున్నారు. మరి ‘యుగానికి ఒక్కడు 2’లో కార్తీపాత్ర ఉంటుందా? లేదా? అనేది చూడాలి. జెంటిల్మన్–2 అర్జున్, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్‌మేన్’ (1993) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు ముప్పైఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ‘జెంటిల్మన్ 2’ని నిర్మిస్తున్నారు కుంజుమోన్. అయితే రెండో భాగంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ముగ్గురూ మారడం విశేషం. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో ‘మంత్ర–2, రాజుగారి గది, పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్ చీను హీరోగా నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దనున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ కానుంది. టిల్లు స్క్వేర్ ‘డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు..’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పెప్పులేస్తే ప్రేక్షకులు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే సీక్వెల్‌కి అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ ఇద్దరూ మారడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించి గ్లామర్‌తో మెప్పించారు. అయితే సీక్వెల్లో మాత్రం అనుపమా పరమేశ్వరన్‌ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. జిగర్తండా–2 సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కీలకపాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగర్తండా’ (2014) తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా ‘జిగర్తండా’ విడుదలైన దాదాపు తొమ్మిదేళ్లకు ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ పేరుతో కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ తీశారు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్‌లో నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం యంగ్ హీరోకు సంబంధించి సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అడివి శేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అయితే ఇంతకీ అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు. సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (ఇది చదవండి: మంచి జోడీ కోసం వెతుకుతున్నా: సమంత) కాగా.. అడివి శేష్, సుప్రియ గతంలో కూడా రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరీ ఈ రూమర్స్‌పై అడివి శేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ) కాగా.. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటున్న సుప్రియ హీరోయిన్‌గానూ నటించింది. అడివి శేష్, సుప్రియ గూఢచారి చిత్రంలో నటించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్గా నటించింది. -
బిచ్చగాడు-2 కోసం ప్రాణం పెట్టారు : అడివి శేష్
‘‘సినిమా కోసం ప్రాణం పెట్టి చేశామని అందరూ చెబుతుంటారు. కానీ, ‘బిచ్చగాడు 2’ కోసం విజయ్, ఫాతిమాగార్లు నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు. వారికోసమైనా ‘బిచ్చగాడు 2’ హిట్టవ్వాలి’’ అన్నారు హీరో అడివి శేష్. విజయ్ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించడంతో పాటు సంగీతమందింన త్రం ‘బిచ్చగాడు 2’. కావ్యా థాపర్ హీరోయిన్. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మింన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. కాగా తెలుగులో ఈ చిత్రాన్ని ఉషా పిక్చర్స్‌పై విజయ్ కుమార్, వీరనాయుడు రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు అడివి శేష్, ఆకాశ్ పూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ– ‘‘విజయ్ ఆంటోనిగారిని ఇంతవరకు ప్రేమిస్తూ వచ్చాను.. కానీ ఆయన్ను కలిశాక గౌరవం మొదలైంది. ‘బిచ్చగాడు 2’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ తొలి భాగం నచ్చినవారికి రెండో భాగం కూడా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ సినిమాకు కేవలం నిర్మాతను మాత్రమే. అన్నీ మా ఆయన (విజయ్ ఆంటోని) చూసుకున్నారు. ఆయన ప్రమాదానికి గురైనా.. అభిమానుల ప్రేమ వల్లే కోలుకున్నారు’’ అన్నారు ఫాతిమా విజయ్ ఆంటోని. -
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
గుడ్ స్కూల్ యాప్‌ను ప్రారంభించిన అడివి శేషు
సైన్స్ అంటే ఎంత ఇష్టమో... గణితం అంటే అంతా భయమని సినీ నటుడు ఆడివి శేషు అన్నారు. చదవడం ఎంత ముఖ్యమో... చదివి దాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. పరీక్షల సయమంలో ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకుని గుర్తు పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్లో గుడ్ స్కూల్ యాప్‌ను అడివి శేషు ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లంలో యాప్‌ను రూపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆడివి శేషు అన్నారు. ప్రస్తుతం గుఢచారి-2 చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని... తర్వాత హాలీవుడ్ తరహా చిత్రంలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు నాణ్యత గల దృశ్యమాన కంటెంట్‌ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త-ఏజ్డ్-టెక్కో సిస్టమ్, గుడ్ స్కూల్ యాప్ అని ఛైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. శిక్షణతో పాటు, ఇది విశిష్టమైన విద్యా అనుభవాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సహకారం, సృజనాత్మకత, ఆట నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్ భాస్కర్, విద్యారంగ ప్రముఖులు పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వెనక్కి తగ్గిన స్టార్స్.. దూసుకెళ్తున్న యంగ్ హీరోలు
స్టార్ హీరోలే పాన్ ఇండియా సినిమాలు చేయటానికి వెనకడుగు వేస్తుంటే.. కుర్ర హీరోలు మాత్రం టాలీవుడ్ హద్దులు దాటుతున్నారు. పాన్ ఇండియా హీరోలం అనిపించుకోటానికి తహ తహ లాడిపోతున్నారు. ప్రయత్నిస్తే పోయేది ఏముంది చెప్పు..మహా అయితే మరో సారి ట్రై చేస్తాం అనుకుంటు..పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి తెలుగుతో పాటు..ఇతర భాషల్లో విజయం సాధించాలి అనుకుంటున్న ఈ హీరోలపై ఓ లుక్కేయండి మేజర్ మూవీతో పాన్ ఇండియా సినిమా చేసాడు అడివి శేష్. ఇక కార్తికేయా 2 తో నిఖిల్ కూడా పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. ఇప్పుడు మరికొందరు యువ హీరోలు కూడా ..పాన్ ఇండియా సినిమాలతో లక్ పరిక్షించుకోబోతున్నారు. సందీప్ కిషన్ మైఖేల్ సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీ తెలుగు,తమిళ్,హిందీ,కన్నడ,మలయాళ భాషలలో రిలీజ్ కాబోతుంది. నాని శ్యామ్ సింగరాయ్ సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఈ సారి ‘దసరా’తో మాత్రం పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా డెవిల్ సినిమా రాబోతుంది. విశ్వక్ సేన్ రెండో సారి మెగాఫోన్ పట్టుకొని దాస్ క ధమ్కీ మూవీ రూపొందించాడు. ఈ సారి తనను తాను దర్శకుడిగా,హీరోగా పాన్ ఇండియా రేంజ్లో ప్రమోట్ చేసుకుంటున్నాడు. కుర్ర హీరో తేజా సజ్జా,దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న హనుమాన్ కూడా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఇక్కడ సత్తా చాటుతున్నా.. పాన్ ఇండియాపై మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు..ఇప్పటి వరకు పాన్ ఇండియా హిట్ కోసం ట్రై చేయలేదు. త్రివిక్రమ్ కాంబో సినిమా కూడా..తెలుగులో మాత్రమే రిలీజ్ కాబోతుందట. అలాగే పలువురు సీనియర్ హీరోల సినిమాలు కూడా స్వచ్చంగా తెలుగులోనే విడుదల అవుతున్నాయి. అయితే యువ హీరోలు మాత్రం పాన్ ఇండియా రిలీజులపై జోరు చూపిస్తున్నారు. -
Pudami Sakshiga: వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ
Pudami Sakshiga 2023: రెడ్యూస్.. రీయూస్.. రీసైకిల్! వాడకం తగ్గించుకోవడం... వాడేసినవే మళ్లీ వాడటం... పడేసిన వాటితో కొత్తవి తయారు చేసుకుని వాడుకోవడం..! ఏమిటీ కర్మ! అవును కర్మే. మనిషి వల్ల పుడమికి పట్టిన కర్మ! అవసరం ఉన్నవీ లేనివి కొని, అవసరం తీరీ తీరకుండానే పడేస్తున్నాం. కొత్తవి కొంటున్నాం. కుండెడన్నం కోసం బండెడన్నం వండేస్తున్నాం. ఫ్రిజ్‌ని రైతుబజార్‌ని చేస్తున్నాం. వార్డ్రోబ్ పొట్ట పగిలేలా బట్టల్ని కుక్కేస్తున్నాం. భారీ ఫర్నీచర్‌తో ఇంటినంతా నింపేస్తున్నాం. బకెట్ల కొద్దీ నీళ్ల ట్యాంకుల్ని ఖాళీ చేస్తున్నాం! ఇ.ఎం.ఐ.ల కొద్దీ మన దగ్గర డబ్బుంటే ఉండొచ్చు. పుడమి దగ్గర ఇప్పుడు.. దాదాపుగా నో స్టాక్! పంచభూతాల షార్టేజ్!! తక్షణం మన వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ! ఈ కఠోర వాస్తవంపై ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్తో గత మూడేళ్లుగా సమాజానికి అవగాహన కల్పిస్తూ వస్తున్న.. ‘సాక్షి మీడియా గ్రూప్’ ఈ ఏడాది ‘రెడ్యూస్..రీయూజ్.. రీసైకిల్..’ అనే థీమ్‌తో ఈవెంట్‌ని నిర్వహించింది. వాడకం తగ్గించి, వృథాను నివారించి, వ్యర్థాలను తగ్గిస్తేనే పుడమి తిరిగి జవసత్వాలు పుంజుకుంటుందని ఈ టాకథాన్ ద్వారా పర్యావరణ వేత్తలు, రాజకీయ నేతలు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు, కళాకారులు, సినీ హీరోల చేత చెప్పించింది. హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది. ∙∙ మూడో ఎడిషన్‌లో ధరిత్రిని కాపాడుకోవాలి, భూమిని కాలుష్య కాసారం కానీయకుండా భవిష్యత్తరాలకు అందించాలి అనే లక్ష్యంతో సాక్షి మీడియా గ్రూపు చేపట్టిన ప్రచారోద్యమమే ‘పుడమి సాక్షిగా..’ ఇప్పటివరకు రెండు ఎడిషన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మొదటి ఎడిషన్‌లో... ప్రమాదం అంచుకు ఎలా చేరాం? పుడమికి మనం ఏం తిరిగి ఇవ్వాలి? పర్యావరణానికి ఏం అవసరం? అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెండో ఎడిషన్‌లో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సకల ప్రాణులకూ ఆవాసంగా నేల, తక్కువ కాలుష్యంతో విద్యుత్ ఉత్పాదన అనే అంశాలను ప్రధానంగా చర్చించింది. ఈ మూడో ఎడిషన్‌లో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. ప్రముఖుల సూచనలను, సలహాలను స్వీకరించింది. సాక్షి ‘ఫన్ డే’ ద్వారా వాటిని పాఠకులకు అందించింది. సాక్షి టీవీ ద్వారా గురువారం వీక్షకులకు అందిస్తోంది. నాకు నచ్చిన ప్రోగ్రాం సామాజిక బాధ్యతను కర్తవ్యంగా తీసుకుని సాక్షి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది, అందులో నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్.. పుడమి సాక్షిగా. భగవంతుడు మనకిచ్చిన వరం పర్యావరణం. ఈ వరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళి అందరిదీ. నేటి తరాలు బాధ్యతగా జీవిస్తేనే భావితరాలకూ ఈ వరం అందుతుంది. – రోజా, పర్యాటక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది సాక్షి తీసుకున్న ‘పుడమి సాక్షిగా..’ అనే ఈ గొప్ప ఇనీషియేటివ్‌లో అందరం భాగస్వాములం కావాలి. పుడమి అంటే తల్లి. తల్లిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మనిషిదీ. ఏపీ ప్రభుత్వం ఇటీవలే ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ అనే అమెరికన్ ఎన్జీవోతో ఎం.ఓ.యు. కుదుర్చుకుని విశాఖ బీచ్‌లో పోగయ్యే ప్లాస్టిక్‌ని రీయూజ్ చేయిస్తూ గొప్ప సంస్కరణకు నాంది పలికింది. పుడమి సంరక్షణకు ప్రజల్ని చైతన్యం చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీ రైతు.. భూమి.. పుడమి సాక్షి మీడియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తుచేస్తోంది. వ్యవసాయం విషయానికి వస్తే.. ప్రకృతి సాగు విధానాల వల్ల పుడమి కి ఎంతో మేలు జరుగుతోంది. ఏపీలో రైతు భరోసా కేంద్రాలు, రైతు సాధికార సంస్థల ఏర్పాటుతో రైతుకు, భూమికి, పుడమికి ప్రయోజనకరమైన ఫలితాలను సాధిస్తున్నాం. – కాకాని గోవర్ధన్, వ్యవసాయశాఖ మంత్రి, ఏపీ గ్రీన్ వెజిటేషన్కు ప్రాధాన్యం సాక్షి చేపట్టిన ‘పుడమి సాక్షిగా..’ ఒక మంచి ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా నేడు కలవరం కలిగిస్తున్న ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం. అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రత్యేకమైన పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. కోటీ యాభై ఎకరాల వ్యవసాయ భూమి సాగు అయ్యేలా నీటి అందించి, గ్రీన్ వెజిటేషన్ని సాధిస్తోంది. – నిరంజన్ రెడ్డి, సహకార శాఖ మంత్రి, తెలంగాణ పాఠశాల స్థాయి నుంచే కలెక్టివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యం అయ్యేది కాదు. అందరూ బాధ్యత తీసుకుని సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. పాఠశాల నుంచే పిల్లల్లో పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇన్సెంటివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది. ఉదా.. క్లాస్ రూమ్‌ని శుభ్రంగా ఉంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి. ఇప్పుడు మనం ప్రకృతి పట్ల శ్రద్ధ వహిస్తేనే భవిష్యత్ తరాలు పచ్చగా ఉంటాయి. – అడివి శేష్, సినీ హీరో ఎకో–ఫ్రెండ్లీ స్కూల్ క్యాంపస్ ‘పుడమిసాక్షిగా..’ టాకథాన్కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. వాతావరణ మార్పులు భూతాపానికి కారణం అవుతున్నాయనే అంశంపై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున ఈజిప్ట్‌లో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరై అధ్యయన పత్రం సమర్పించాను. మా స్కూల్ క్యాంపస్ లో కూడా ఎన్విరాన్మెంట్ పిట్స్, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గించుకున్నాం. – అంకిత్ సుహాస్, కాప్–27 డెలిగేట్ వస్తు వినియమం బాగా తగ్గాలి గత దశాబ్దంగా మన దగ్గర ఉన్న గణాంకాలని బట్టి చూస్తే అర్బన్‌కి, రూరల్‌కు మధ్య వస్తు వినియోగ సంస్కృతిలో ఏ విధమైన తేడా కనిపించని పరిస్థితి. గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు రెండిటినీ స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ హ్యాండిల్ చేస్తోంది. వీటిని కంపేర్ చేసినప్పుడు.. కొనే రాశిలో తేడా ఉందేమో కానీ, ఇంటింటి నుంచీ వచ్చే రోజువారీ వ్యర్థాలు దాదాపు ఒకే మొత్తంలో ఉంటున్నాయి. వ్యర్థాలు ఎక్కువైతే పుడమికి ముప్పు కనుక రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ మన తక్షణ అవసరం. – సంపత్ కుమార్, ఐ.ఎ.ఎస్. స్వచ్ఛాంధ్ర ఎండీ పిల్లలకు క్లీన్లీనెస్ నేర్పాలి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. ఇదే తెలుసు మనోళ్లకి. కానీ, రాబోయే తరానికి మనం ఏం ఇస్తున్నాం అనేది ఒక్కసారి మన మనస్సాక్షిని అడగాలి. పుడమిసాక్షిగా.. నేను ప్రతి మనిషికీ చెప్పేది ఒకటే.. మనం ఇవ్వాల్సింది మన పిల్లలకి విద్య. నేర్పాల్సింది క్లీన్లీనెస్. పర్యావరణాన్ని మనం శుభ్రంగా ఉంచితే మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. మన దేశం శుభ్రంగా ఉంటుంది. మనం అందరికీ ఇన్సిపిరేషన్ అవుతాం. – అలీ, మీడియా అడ్వైజర్, ఏపీ మెటీరియలిజం వల్లే ఇదంతా..! మన జీవన విధానం ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. పుడమికి హితంగా మన అలవాట్లు మార్చుకోవాలి. ఆర్టీసీలో మేము రీయూజ్ అనే కాన్సెప్ట్‌ని అవలంబిస్తున్నాం. మెటీరియలిజంకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం కోసం సాక్షి మీడియా గత మూడేళ్లుగా ‘పుడమి సాక్షిగా..’ అనే ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తూ, టాకథా¯Œ ని నిర్వహించడం అభినందనీయం. – వి.సి.సజ్జనార్, ఐపీఎస్, టి.ఎస్.ఆర్టీసీ ఎండీ త్రిబుల్ ‘ఆర్’ ప్రస్తుతావసరం ఇటువంటి ముఖ్య అంశంపై డిబేట్ ఏర్పాటు చేసిన సాక్షికి ధన్యవాదాలు. 25 ఏళ్ల క్రితం గూంజ్ సంస్థ ప్రారంభమైంది. తిండి, బట్ట, నివాసం అనే కనీస అవసరాలలో మేము దుస్తులపై దృష్టి పెట్టాం. దుస్తులను విరాళంగా సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు అందిస్తున్నాం. ఆ విధంగా సంపన్నుల దగ్గరి వేస్టేజ్‌ని రీయూజ్‌కు అందిస్తున్నాం. సంపన్నులను పరోక్షంగా రెడ్యూస్కు ప్రేరేపిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఆర్ ఆర్‌తోనే పుడమిని సంరక్షించుకోగలం. – మీనాక్షీ గుప్తా, ‘గూంజ్’ సంస్థ చదవండి: ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
కలర్ఫుల్గా అవార్డుల ఫంక్షన్.. తళుక్కున మెరిసిన తారలు (ఫోటోలు)
-
చెల్లి హల్దీ ఫంక్షన్లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. ఫోటోలు వైరల్
-
చెల్లి హల్దీ ఫంక్షన్లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల హిట్-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి -2’లో అడివి శేష్ కనిపించనున్నారు. (ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా చెల్లి హల్దీ వేడుకలో సందడి చేశారు యంగ్ హీరో. తన చెల్లెలు షిర్లీ అడివి హల్దీ వేడుకలో పాల్గొన్న అడివి శేష్ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. తన బేబీ చెల్లి హల్దీ ఫంక్షన్ ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌గా మారాయి. అడివి శేష్ తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ..'అమ్మ, నేను, సోదరి హల్దీ ఫంక్షన్లో సరదాగా కలిసి సందడి చేశాం. ఈ రోజు బావ డేవిన్‌ను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో అడివి శేష్‌ను చూసిన అభిమానులు అన్నా.. నీ పెళ్లేప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హీరో చెల్లెలికి శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
గురిపెట్టిన అడివి శేష్.. గూఢచారి-2 ప్రీ వెర్షన్ లుక్ వీడియో వచ్చేసింది
ఓ మిషన్ మీద ఒక గూఢచారి ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు వెళతాడు. ఆ మిషన్ ఏంటి? ఎలా విజయం సాధించాడు? అనేవి తెలియడానికి ఇంకా సమయం ఉంది. గూఢచారి పాత్రలో అడివి శేష్ హీరోగా రపొందనున్న చిత్రం ‘గఢచారి 2’. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ప్రీ విజన్ వీడియోను రిలీజ్ చేశారు. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ రూపొందనుంది. కాగా తొలి భాగం భారతదేశంలో జరిగితే రెండో భాగం కథ ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు ప్రయాణిస్తుంది. అడివి శేష్ కథ అందించిన ఈ చిత్రం ద్వారా ఎడిటర్ వినయ్ కువర్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. -
అప్పుడు కొట్టుకునేవాళ్లం.. ఇప్పుడేకంగా.. : అడివిశేష్ ఎమోషనల్
'మేజర్', 'హిట్ 2' సినిమాలతో గతేడాది రెండు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. తను ఎంచుకున్న సినిమాలకు, యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా మేజర్ సినిమాకు గానూ సంతోషం సినీ అవార్డు అందుకున్నాడీ హీరో. అయితే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో సంతోషంతో గాల్లో తేలుతున్నాడు శేష్. 'నా చిన్నతనంలో మీ సినిమా టికెట్ల కోసం కొట్టుకునేవాళ్లం. అలాంటిది మేజర్ సినిమా కోసం ఒకరోజు మధ్యాహ్నం అంతా మీతో గడపడం గౌరవంగా భావిస్తున్నా. ఏకంగా మీ చేతుల మీదుగా మేజర్ చిత్రానికి గానూ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు శేష్. దీనికి చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు నీ కష్టానికి గుర్తింపు లభించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) చదవండి: సీమంతం వేడుకలో లాస్య డ్యాన్స్ మాట్లాడినా, ఏడ్చినా అది తప్పదు: సమంత -
ఓటీటీలోకి వచ్చేసిన అడివి శేష్ హిట్-2.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'హిట్-2'. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్నా రూ. 129 చెల్లించాల్సి ఉంది. కానీ జనవరి 6 తర్వాత నుంచి మాత్రం ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత హిట్-2 స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, ఇందులో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సుహాస్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించారు. in the mood for some thrilling investigation!#HIT2onPrime, Jan 6@AdiviSesh @NameisNani @Kolanusailesh @Meenakshiioffl @tprashantii @walpostercinema pic.twitter.com/KRm2Va0gHk — prime video IN (@PrimeVideoIN) January 5, 2023 -
'గూఢచారి' మళ్లీ వస్తున్నాడు.. సీక్వెల్ అనౌన్స్ చేసిన అడివి శేష్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది 'మేజర్', 'హిట్'-2లతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న శేష్ తాజాగా తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు. శేష్ కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన గూఢచారి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌తో రాబోతున్నట్లు ప్రకటించాడు. వినయ్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి శేష్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు. జీ2 టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జనవరి 9న ముంబై అండ్ ఢిల్లీలో మూవీ గ్రాండ్ లాంఛ్ ఉండనున్నట్లు శేష్ తెలిపాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనుంది. #G2 it is! Just a little taste for the New Year ❤️ An Epic Action Film visualized by our Brilliant Director @vinaykumar7121 You will know what I mean when you see our “Pre Vision” Video. We will Launch MASSIVE on Jan 9 in Mumbai & Delhi. #HappyNewYear guys 🔥#Goodachari2 pic.twitter.com/WkZ46elqJ2 — Adivi Sesh (@AdiviSesh) December 29, 2022 -
అక్కినేని ఫ్యామిలీలో అడివి శేష్.. వైరల్‌గా మారిన ఫోటో
క్రిస్మస్ పండగను సెలబ్రిటీలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఒకచోట చేరి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఆ ఫోటోలని అఖిల్ అక్కినేని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో కూడా క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహించారు. అఖిల్, సుమంత్‌లతో పాటు మరికొంత మంది కజిన్స్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. కానీ నాగచైతన్య మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. ఇక తమ సెలబ్రేషన్స్ ఫోటోలను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కాసేపట్లోనే ఆ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. హీరో అడివి శేష్ అక్కడ కనిపించడం హాట్‌టిపిక్‌గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీలో శేష్ ఎందుకు ఉన్నాడంటూ పలు రూమర్స్ తెరమీదకి వస్తున్నాయి. ఇక పార్టీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు 'థ్యాంక్స్ అఖిల్ బ్రో' అంటూ శేష్ కామెంట్ చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
ఆ సమయంలో కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేశా: అడివి శేష్
ఈ ఏడాది టాలీవుడ్ చిత్రాల్లో భారీ హిట్ చిత్రాల్లో యంగ్ హీరో అడివి శేష్ మూవీ 'మేజర్' ఒకటి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అడివి శేష్ మేజర్ సినిమాలోని క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం 'మేజర్' సెట్ తొలగించాలని చెప్పగానే చాలా బాధపడ్డానని చెప్పారు. అడివి శేష్ మాట్లాడుతూ.. 'మా సినిమా షూటింగ్ జరుగుతున్న స్టూడియోను ఓ బాలీవుడ్ చిత్రయూనిట్ బుక్ చేసుకుంది. మేజర్ సినిమాలో అగ్నిప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించడంతో నేను అస్వస్థతకు గురయ్యా. అందువల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైంది. స్టూడియో వాళ్లు మా సెట్‌ను కూల్చేయడానికి రెడీ అయ్యారు. వాళ్లని కాస్త టైం ఇవ్వాలని అడిగినా ఒప్పుకోలేదు. క్లైమాక్స్‌లో దాదాపు ఎనిమిది సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. కేవలం 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఏడ్చేశా.' అని అన్నారు. ఆ సమయంలో దర్శకుడు శశికిరణ్ నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు ఏ భావోద్వేగానికి లోనవుతున్నారో అదే కెమెరా ముందు చూపించమని సూచించారని తెలిపారు. రెండు కెమెరాలతో సన్నివేశాలను అనుకున్న సమయానికే పూర్తిచేశామని వెల్లడించారు. ఈ ఏడాది అడివి శేష్ నటించిన హిట్-2 సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించింది. -
హిట్ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
హిట్ యూనివర్స్‌లో వచ్చిన హిట్ 2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. కోమలీ ప్రసాద్, ఆదర్శ్, రావు రమేశ్, సుహాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 2న విడుదలైంది. పెట్టిన టైటిల్‌కు పూర్తి న్యాయం చేసి బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్‌గా నిలిచిందీ సినిమా. ఇక క్లైమాక్స్‌లోనే హిట్ 3 ఉంటుందని, అందులో నాని హీరోగా నటించనున్నాడని ప్రకటించిన విషయం తెలిసిందే! తాజాగా హిట్ 2 మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! సరిగ్గా నెల రోజుల తర్వాత ప్రైమ్ దీన్ని ఓటీటీ ఆడియన్స్‌కు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందట. అదే కనుక జరిగితే హిట్ 2 జనవరి 2 నుంచి అందుబాటులోకి రానుంది. చదవండి: ఒకే ఫ్రేమ్‌లో అల్లు అర్జున్, చరణ్ ఫ్యామిలీ -
బాలీవుడ్ రమ్మంది...
మామూలుగా ఉత్తరాది తారలు దక్షిణాదికి ఎక్కువగా వస్తుంటారు. ఈసారి కూడా నార్త్ నుంచి చాలామంది వచ్చారు. అలాగే సౌత్ నుంచి కూడా నార్త్‌కి వెళ్లారు. మన స్టార్స్‌ని బాలీవుడ్ రమ్మంది. ఈ ఏడాది హిందీ తెరపై కనిపించిన కొందరు సౌత్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. కెరీర్లో ఇరవైకి పైగా సినిమాలు చేసిన నాగచైతన్య నటించిన తొలి హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నాగచైతన్యది కీ రోల్. ఈ హిందీ చిత్రంలో గుంటూరుకు చెందిన తెలుగు కుర్రాడు బాలరాజు పాత్రను చేశారు నాగచైతన్య. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలైంది. ఇక విజయ్ దేవరకొండ హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలైంది. మరో హీరో అడివి శేష్ ‘మేజర్’తో హిందీ తెరకు పరిచయం అయ్యారు. ‘గూఢచారి’ చిత్రం తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘మేజర్’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన అమరవీరుడు ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూర్టీ గార్డు) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. అలాగే ఏపీ (ఆంజనేయ పుష్పక్ కుమార్)గా హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పారు సత్యదేవ్. అక్టోబరు 25న రిలీజైన ‘రామసేతు’లోనే ఏపీగా సత్యదేవ్ కీ రోల్ చేశారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకుడు. అయితే బాలీవుడ్‌కు కీలక పాత్ర ద్వారా కాకుండా సత్యదేవ్ హీరోగా పరిచయం కావాల్సింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో జెన్నిఫర్ డైరెక్షన్లో ఆరంభమైన ఓ హిందీ చిత్రంలో సత్యదేవ్ హీరోగా కమిట్ అయ్యారు. కొంత షూటింగ్ జరిగాక ఈ సినిమా ఆగిపోయింది. దీంతో ‘రామసేతు’ సత్యదేవ్‌కి తొలి హిందీ చిత్రంగా నమోదైంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... రష్మికామందన్నా బాలీవుడ్ ఎంట్రీ ‘గుడ్ బై’ చిత్రంతో కుదిరింది. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబరు 7న విడుదలైంది. ఆసక్తికర విషయం ఏంటంటే... రష్మిక కెరీర్లో రిలీజైన తొలి హిందీ చిత్రం ‘గుడ్ బై’ అయినప్పటికీ ఆమె సైన్ చేసిన తొలి హిందీ చిత్రం మాత్రం ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక హీరో హీరోయిన్లుగా శాంతను భాగ్చీ తెరకెక్కించిన ‘మిషన్ మజ్ను’ డైరెక్టర్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే ఓ లీడ్ యాక్ట్రస్‌గా హిందీ తెరకు పరిచయమైంది కూడా ఈ ఏడాదే. రణ్వీర్ సింగ్ హీరోగా దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో ఈ ఏడాది మేలో రిలీజైన ‘జాయేష్ భాయ్ జోర్ధార్’లో నటించారు షాలిని. 2023లో... ఇక కొందరు తారల బాలీవుడ్ జర్నీ కూడా ఈ ఏడాది ఆరంభమైంది. కానీ వచ్చే ఏడాదే వారు హిందీ తెరపై కనిపించనున్నారు. కెరీర్లో డెబ్బై చిత్రాలు చేశాక బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు నయనతార. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జవాన్’ హిందీలో నయనతారకు తొలి చిత్రం. ఇటు అట్లీ చేస్తున్న తొలి హిందీ ఫిల్మ్ కూడా ‘జవాన్’ కావడం విశేషం. ఈ సినిమా వచ్చే జూన్ 2న రిలీజ్ కానుంది. ఇక 2005లో వచ్చిన తెలుగు ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరోవైపు హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ ప్రయాణం ఈ ఏడాది నవంబరులో మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు వరుణ్‌తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడు. మరికొందరు స్టార్స్ కూడా వచ్చే ఏడాది హిందీ తెరపై కనిపించనున్నారు. -
ఇదేందయ్యా.. నా నరాలు కట్ అయిపోయాయి.. అడివి శేష్ అభిమాని షాక్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘హిట్ 2’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకులను పలకరించింది.నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ పార్ట్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. (ఇది చదవండి: HIT 2 Review: ‘హిట్ 2’ రివ్యూ) అయితే తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అడివి శేష్ రెమ్యునరేషన్‌పై నెటిజన్ ఆశ్చర్యానికి గురయ్యారు. గూగుల్‌లో అడివి శేష్ రెమ్యునరేషన్ అని సెర్చ్ చేస్తే 450 మిలియన్ డాలర్లు చూపిస్తోందని నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి హీరో అడివి శేష్ సైతం రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి చూద్దాం. నెటిజన్ ట్వీట్ చేస్తూ..' అన్నా ఎందన్నా ఇది? గూగుల్‌లో తప్పుడు సమాచారం వస్తోందని నాకు తెలుసు. అయినా ఉత్సాహంతో అడివి శేష్ రెమ్యునరేషన్ అని సెర్చ్ చేశా. అందులో 450 మిలియన్ డాలర్లు అని వచ్చింది. ఒక్కసారిగా నా నరాలు కట్ అయిపోయాయి అన్నా.' అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన హీరో అడివి శేష్ అభిమానికి రిప్లై ఇచ్చారు. మాకు కూడా ఆ 450 మిలియన్ డాలర్లు ఎక్కడుందో చెప్తే సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా.' అంటూ ట్వీట్ చేశారు. Maaku kooda aa $450M ekkadundho chepthe break ivvadaaniki ready ga unnaam. 🐶 https://t.co/27YvTzR1yx — Adivi Sesh (@AdiviSesh) December 7, 2022 -
అడివి శేష్ సక్సెస్ కు కారణం అదే ..!
-
అర్జున్ సర్కార్ సైనింగ్ ఆఫ్..మళ్లీ కలుద్దాం: నాని
‘‘కష్టపడి ప్రిపేర్ అయ్యే బ్యాచ్‌లో శేష్ ఉంటాడు. నేను కాపీ కొట్టి పాస్ అయ్యే బ్యాచ్‌లో ఉంటాను. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను. శేష్ లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా హిట్స్ సాధిస్తున్నాడు. మంచి చిత్రాలు తీస్తే చూస్తాం అని ప్రేక్షకులు మరోసారి నిరూపించినందుకు థ్యాంక్స్. అర్జున్ సర్కార్ సైనింగ్ ఆఫ్ (హిట్ 3ని ఉద్దేశించి).. మళ్లీ కలుద్దాం.. గట్టిగా కలుద్దాం’’ అని హీరో నాని అన్నారు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న రిలీజైంది. ఈ సందర్భంగా విజయోత్సవంలో అడివి శేష్ మాట్లాడుతూ – ‘‘హిట్ 2’ రిలీజ్ తర్వాత మహేశ్‌బాబుగారు ఫోన్ చేసి, ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను.. అన్నలా అండగా ఉంటాను’ అంటే కంట్లో నీళ్లు తిరిగాయి’’ అన్నారు. ‘‘మల్టీప్లెక్స్‌ల్లోనే కాదు.. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లోనూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు శైలేష్ కొలను. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ, నటి కోమలీ ప్రసాద్ మాట్లాడారు. -
డేట్‌కు ఎప్పుడు వెళదాం? యంగ్ హీరోకు ఫ్యాన్ ప్రపోజల్
యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం హిట్-2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. శైలేస్ కొలను దర్శకత్వంలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజు నుంచే మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం శేష్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.సీక్వెల్‌పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం, పెద్ద సినిమాలు లేకుండా సోలోగా రిలీజ్ కావడంతో హిట్-2 కలెక్షన్ల పరంగానూ సూపర్ హిట్టయ్యింది. ఇక ఈ సక్సెస్‌లో భాగంగా శేష్ అభిమానులతో ట్విట్టర్లో చిట్‌చాట్ సెషన్ నిర్వహించారు. ఆస్క్‌మి ఎనీథింగ్ అంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అయితే ఓ లేడీ ఫ్యాన్ మాత్రం డైరెక్ట్‌గా డేటింగ్ ప్రపోజల్ చేసింది. మనం ఎప్పుడు డేట్‌కు వెళదాం అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేయగా అడివి శేష్ స్పందించాడు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా.. మనం ఇద్దరం కలిసి హిట్ 2 సినిమా చూద్దామా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. డేట్‌కి అడగ్గానే ఏమాత్రం తడబాటులేకుండా శేష్ ఇచ్చిన రిప్లై ఆసక్తిగా మారింది. Idhigo occhestunna. Do you want to watch #HIT2 ? 🙃#AskSesh https://t.co/2LCxbtlIAa — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 -
యంగ్ హీరో అడవి శేష్ చేతుల మీదుగా ‘ఎంతవారుగాని’ టీజర్
సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ‘ఎంతవారు గాని’. ఈ మూవీతో ఎన్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను బయటకు వచ్చింది. యంగ్ అడవి శేష్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. అనంతరం అడవి శేష్ మాట్లాడుతూ.. ఈ టీజర్ తనకు నచ్చిందని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా మంచి విజయం సాధించాలని సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు అభినందనలు తెలిపాడు. కాగా ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది మూవీ టీం. తమ సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉంటుందని ఈ సందర్భంగా చిత్ర బృందం పేర్కొంది. -
ఫైమా ఎలిమినేట్, ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున
Bigg Boss Telugu 6, Episode 92: బిగ్‌బాస్ ఆరో సీజన్లో మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఫన్ అండ్ గేమ్ రెండూ కలిపి కొట్టే ఫైమా ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. ఈరోజు హౌస్‌లో హిట్ 2 చిత్రయూనిట్ స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసి ఎంటర్టైన్ చేశారు. మరి నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. జీవితాంతం ఎవరు ఫ్రెండ్‌గా ఉంలనుకుంటున్నారు? ఎవరిని జీవితంలో అసలు ఫ్రెండ్‌గా వద్దనుకుంటున్నారో చెప్పాలంటూ చిన్న టాస్క్ ఇచ్చాడు నాగార్జున. దీనికి ఆది.. ఫైమాను ఫ్రెండ్ అని, ఇనయతో అంత ఫ్రెండ్షిప్ ఉండదంటూ ఆమె ఫోటోను డస్ట్‌బిన్‌లో వేశాడు. ఇనయ.. కీర్తిని ఫ్రెండ్‌గా, శ్రీహాన్‌తో ఫ్రెండ్షిప్ డౌటేనంటూ అతడి ఫోటోను చించేసింది. శ్రీహాన్ వంతు రాగా రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆదిరెడ్డి నెల్లూరులో ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలిసే ఛాన్స్ ఉండదని అతడి ఫోటోను చించేశాడు. రోహిత్.. రేవంత్ ఫ్రెండ్ అని, ఫైమాతో స్నేహం కట్ అవుతుందేమోనన్నాడు. ఫైమా.. ఆదిరెడ్డి తన జీవితాంతం ఫ్రెండ్ అని రోహిత్‌తో ఎక్కువ కనెక్షన్ లేదని చెప్పింది. కీర్తి.. ఇనయ ఫ్రెండ్ అంటూ శ్రీహాన్‌కు కటీఫ్ చెప్పింది. రేవంత్.. శ్రీసత్యతో దోస్తానా చేస్తానని, కీర్తి తనను తక్కువ అర్థం చేసుకుంటుందంటూ సైడ్ చేశాడు. శ్రీసత్య.. ఎక్కువ గొడవపడేది, ఎక్కువ క్లోజ్ అయింది రేవంత్‌తోనే అంటూ అతడే లైఫ్‌టైమ్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇంట్లో అందరికన్నా రోహిత్‌తో తక్కువ కనెక్షన్ ఉందని తన ఫొటోను చెత్తబుట్టలో పడేసింది. తర్వాత హిట్ 2 హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. ఇక అడివిశేష్‌కు ఓ కేసు అప్పజెప్పాడు నాగ్. బిగ్‌బాస్ హౌస్‌లో అద్దంపై కోడిబుర్ర అని రాసిందెవరో కనిపెట్టమన్నాడు. శేష్ ఎంతో ఈజీగా ఆ బొమ్మ గీసింది రేవంతేనని కనిపెట్టాడు. తర్వాత ఇంటిసభ్యులతో మూవీ డంబ్ షేర్ ఆర్ట్స్ ఆడిస్తూ వారికోసం కొన్ని సినిమా పోస్టర్లను అంకితమిచ్చాడు. అనంతరం ఫైమా ఎలిమినేట్ కావడంతో ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. స్టేజీమీదకు వచ్చిన ఫైమాతో ఎవరితో ఫన్? ఎవరితో ఫ్రస్టేషన్? చెప్పాలన్నాడు నాగ్. దీనికి ఫైమా ఫన్ కేటగిరీలో ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయ, రోహిత్‌లను చేర్చింది. రేవంత్‌ను ఫ్రస్టేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంది. ఇక ఫైమాకు చేతిని ముద్దుపెట్టుకుంటే చక్కిలిగిలి పుడుతుందని తెలియడంతో నాగార్జున ఆమె చేతిని ముద్దాడాడు. ఆమెకు వీడ్కోలు పలికిన అనంతరం నాగ్ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్ విన్నర్ రూ.25 లక్షల విలువైన 605 గజాల ప్లాట్ కూడా సొంతం చేసుకుంటారని చెప్పాడు. చదవండి: సెలూన్ అమ్మేసి పాత ఇల్లు కొన్న జబర్దస్త్ కమెడియన్ తండ్రి మాట వినకపోతే బన్నీలా తయారవుతారు: బండ్ల గణేశ్ -
హీరో అడివి శేష్‌కు ఆదిరెడ్డి కౌంటర్.. పగలబడి నవ్విన నాగ్
బిగ్‌బాస్ స్టేజీపైకి హిట్ 2 హీరో అడివి శేష్ వచ్చాడు. వచ్చీరాగానే అతడికో కేస్ అప్పజెప్పాడు నాగార్జున. అతడు వచ్చేముందే ఇంటిసభ్యుల్లో ఎవరైనా అద్దంపై కోడి బుర్ర అని రాసి దానిపై హారర్ బొమ్మ వేయమని సూచించాడు. తర్వాత అడివి శేష్‌ను పిలిచి ఆ బొమ్మ గీసిన నేరస్తుడిని పట్టుకోమని సవాలు విసిరాడు. ఆ బొమ్మ చూసిన అడివి శేష్ నన్ను కోడిబుర్ర అంటున్నారా? అని అడగడంతో అందరూ ఫక్కుమని నవ్వేశారు. ఇక శేష్ తనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి బొమ్మ గీసిందెవరో కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, నువ్వే గీశావా? అని అడగ్గా కనుక్కోవాల్సింది మీరు కదా సర్ అంటూ కౌంటరిచ్చాడు ఉడాల్ మామ. దీంతో నాగార్జున పగలబడి నవ్వాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఫన్ గేమ్స్ ఆడించాడు. మరి అడివి శేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఈ వారం ఆమె ఎలిమినేట్, సీజన్ బెస్ట్ కెప్టెన్ ఎవరంటే? కాబోయే భర్తను పరిచయం చేసిన బాహుబలి సింగర్ -
మహేశ్‌బాబుతో మాట్లాడా.. అలా అనగానే కన్నీళ్లొచ్చాయి
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో హిట్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అడివి శేష్ ట్విటర్లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అమ్మాయి మనం డేట్కెప్పుడు వెళ్దాం అని అడగ్గా ఇదిగో వచ్చేస్తున్నా. కలిసి హిట్ 2 చూసేద్దామా? అని సరదాగా బదులిచ్చాడు. 'హిట్ యూనివర్స్‌లోకి మహేశ్‌బాబులాంటి పెద్ద స్టార్‌ను ఇన్వాల్వ్ చేయండి అన్న.. నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోద్ది. ఎప్పటినుంచో నువ్వు ఎంచుకునే థ్రిల్లింగ్ స్టోరీలలో మహేశ్‌బాబుని చూడాలని కోరిక.. సస్పెన్స్ థ్రిల్లర్ లైన్ రాసి మహేశ్ అన్నతో చేయండి అన్న..' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీనికి శేష్ స్పందిస్తూ.. 'ఈరోజు ఉదయమే ఆయన ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. నా విషయంలో గర్వంగా ఉన్నట్లు చెప్పారు. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సోదరుడిగా తన వెన్నంటే ఉంటానని మాటిచ్చాను. ఆయనకు హిట్ 2 ఎప్పుడెప్పుడు చూపించాలా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను' అని ట్వీట్ చేశాడు. Don’t know. Suit avuthundho ledho Aalochinchaali. But Mahesh sir called me this morning and spoke for a long time about how PROUD he is of me. I got tears in my eyes. And l promised I will always be there as his brother. Can’t wait to show him #HIT2 #AskSesh https://t.co/9KWUUPs0S8 — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 Don’t know but us Telugu Heroes have love from Kashmir to Kanyakumari all the way to Kansas. So what’s the problem? #HIT2 #AskSesh https://t.co/fj77zCaKQE — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 Idhigo occhestunna. Do you want to watch #HIT2 ? 🙃#AskSesh https://t.co/2LCxbtlIAa — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 చదవండి: బాలయ్య వీరసింహారెడ్డి వచ్చేది ఆరోజే! ఆ అమ్మాయి భార్యగా రావాలనుకుంటాడు, చివరికి -
Hit 2: అప్పుడే ఓటీటీలోకి హిట్-2.. భారీ ధరకు స్ట్రీమింగ్ రైట్స్
అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం హిట్-2 శుక్రవారం(నిన్న)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శైలేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. హిట్‌కి సీక్వెల్‌గా వస్తుండటంతో ముందుగానే ఈ సినిమాపై మాంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ట్రైలర్, పాటలు సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. దీనికి తగ్గట్లే తొలిరోజే వసూల్ల పరంగా దూసుకెళ్తుందీ చిత్రం. ఓటీటీలో హిట్ 2 చిత్రానికి భారీగా బిజెనెస్ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా తీవ్రంగా పోటీ పడగా.. చివరకు ప్రైమ్ వీడియోకే భారీ ధరకు స్ట్రీమింగ్ రైట్స్ దక్కాయట. వచ్చే నెలలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. -
హిట్ యూనివర్స్‌లో సమంత.. వైరల్ అవుతున్న ట్వీట్
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్ 2. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 2న) థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే హిట్ సిరీస్‌ను మొత్తం ఎనిమిది భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హిట్ 2లోనే మూడో పార్ట్ గురించి చెప్పేశారు. మూడో భాగంలో నాని హీరోగా అడివి శేష్ కీలక పాత్రలో నటిస్తాడని వెల్లడించారు. ఇకపోతే హిట్ సిరీస్‌లో సమంతను మెయిన్ లీడ్‌గా తీసుకుంటే ఎలా ఉంటుంది? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దీనికి అడివి శేష్ స్పందిస్తూ.. ఐడియా అదిరిపోయింది, మరి ఏమంటావ్ సామ్ అంటూ సమంతను ట్యాగ్ చేశాడు. దీనికి సామ్ స్పందిస్తూ.. ఓ రౌడీ పోలీస్.. ఆలోచన బాగుంది. ముందుగా సూపర్ హిట్ అందుకున్నందుకు అడివి శేష్‌కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆలోచన బాగుందన్న సామ్ మరి హిట్ యూనివర్స్‌లో భాగమవుతుందా? లేదా? చూడాలి! A badass cop … sounds like fun 😈 Congratulations on your super HIT🫶🏻 @AdiviSesh .. always cheering for you 🤗 https://t.co/qugCUzPGrb — Samantha (@Samanthaprabhu2) December 2, 2022 చదవండి: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాలు? టికెట్ టు ఫినాలే విజేత అతడే -
HIT 2 Review: ‘హిట్ 2’ రివ్యూ
టైటిల్: హిట్ 2: ద సెకండ్ కేసు నటీనటులు: అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి తదితరులు నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపిర్నేని దర్శకత్వం: శైలేష్ కొలను నేపథ్య సంగీతం: జాన్ స్టీవార్ట్ ఏడూరి స్వరాలు : ఎం.ఎం. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్ ఎడిటర్: . గ్యారీ బి.హెచ్ విడుదల తేది: డిసెంబర్ 2, 2022 నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఆ ఫ్రాంచైజీలో వరుస సినిమాలు తీయాలని నాని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ పార్ట్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘హిట్ 2’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. హిట్-2 కథేంటంటే.. కేడీ అలియాస్ కృష్ణదేవ్ వైజాగ్ ఎస్పీ. మర్డర్ కేసులను ఈజీగా సాల్వ్ చేస్తుంటాడు. ఆర్య(మీనాక్షి చౌదరి) అతని ప్రియురాలు. వీరిద్దరు సహజీవనం కొనసాగిస్తుంటారు. ఓ రోజు నగరంలో సంజన అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. తల, మొండెం, కాళ్లు, చేతులు వేరు వేరుగా చేసి అతి కిరాతంగా చంపేస్తాడు ఓ సీరియల్ కిల్లర్. అయితే అక్కడ ఉన్న వాటిలో తల మాత్రమే సంజనాది అని, మిగతా భాగాలన్ని మరో ముగ్గురు అమ్మాయిలవి అని ఫోరెన్సిక్ టెస్ట్‌లో తెలుస్తుంది. ఈ కేసును కేడీ ఎలా చేధించాడు? ఆయనకు ఎదురైన సమస్యలేంటి? సీరియల్ కిల్లర్ ఆర్యని కూడా చంపేందుకు ఎందుకు ప్రయత్నించాడు? వరుసగా యువతులనే చంపడానికి కారణమేంటి? విచారణ క్రమంలో రామ్‌దాస్ (హర్షవర్థన్) గురించి తెలుసుకున్నది ఏంటి? చివరకు ఆ సిరియల్ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం కత్తిమీద సాము లాంటింది. ఒక్కసారి ట్విస్ట్ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్ చెప్పకుండా ఉంటే ఎంగేజ్ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉండాలి. అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. హిట్ విషయంలో దర్శకుడు కైలాష్ అదే పని చేశాడు. హత్య చేసింది ఎవరనేది చివరివరకు చెప్పకుండా సస్పెన్స్ కొనసాగించాడు. కానీ హిట్ 2లో హత్య చేసింది సీరియల్ కిల్లర్ అనే ముందే చెప్పారు. అతను ఎవరు? ఎందుకు అమ్మాయిలనే చంపుతున్నారనేది సస్పెన్స్‌గా పెట్టారు. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా కొనసాగుతుంది. కేడీ, ఆర్యల రొమాన్స్.. మధ్యలో కేసు విచారణ.. ఈక్రమంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్ నుంచి కథ పరుగులు తీస్తుంది. సీరియల్ కిల్లర్ గురించి ఆరా తీయడం.. ఈ క్రమంలో అతని ఫ్లాష్‌బ్యాక్ తెలియడం.. చివరకు మంచి వాడు అనుకున్న వ్యక్తే కిల్లర్ అని తెలియడం..ఇలా సెకండాఫ్ సాగుతుంది. ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు వెబ్ సీరీస్లు కూడా ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లోనే తెరకెక్కుతున్నాయి. అందుకే హిట్-2 ప్రేక్షకులను పెద్దగా సస్పెన్స్‌కు గురి చేయదు. కేడీ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడు. ఆయనకు థ్రిల్లర్ జానర్స్ కొట్టిన పిండి కాబట్టి.. ఈజీగా నటించేశాడు. రొమాన్స్ సీన్లలో కూడా బాగా నటించాడు. ఇక ఆర్య పాత్రకి మీనాక్షి చౌదరి న్యాయం చేసింది. మిగితా పాత్రల విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనాథ్ మాగంటి మరో మంచి పాత్రలో ఆకట్టుకొన్నాడు. పాత్ర నిడివి తక్కువైనా కీలక సన్నివేశాల్లో తన ప్రజెన్స్‌ను చూపించుకొన్నాడు. వర్షగా కోమలి ప్రసాద్ సినిమా చివరి వరకు మెప్పిస్తుంది. ప్రత్యేక పాత్రలో కలర్ ఫోటో హీరో సుహాన్ సర్ప్రైజ్ చేశాడు., శ్రీకాంత్ అయ్యంగార్, తణికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. నేపథ్య సంగీతం బాగుంది. కెమెరామెన్, ఎడిటర్ల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
అప్పుడు నేను బోల్తా పడలేదు
‘‘నువ్వు అలాంటి పాత్రలు చేయొద్దు, ఇలాంటి కథలు ఎంచుకోవద్దు.. అంటూ కొందరు చెప్పిన సలహాలు పాటించి బోల్తా పడ్డాను (ఫ్లాప్ సినిమాలను ఉద్దేశిస్తూ). కానీ, నన్ను నేను నమ్ముకుని స్వతహాగా కథలు ఎంచుకుని చేస్తున్నప్పుడు బోల్తా పడలేదు (హిట్ సినిమాలను ఉద్దేశిస్తూ)’’ అని హీరో అడివి శేష్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అడివి శేష్ చెప్పిన విశేషాలు. ► నేను కథ వినేటప్పుడు ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తాను. ఎక్కడైనా బోర్ కొడుతుంటే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ‘హిట్ ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ నటించాడు. ‘హిట్ ది సెకండ్ కేస్’లో నన్ను చేయమని శైలేష్ అడిగినప్పుడు.. ‘నేనే ఎందుకు చేయాలి’ అన్నాను. కృష్ణదాస్ అనే పోలీసాఫీసర్ పాత్రకి మీరు కరెక్టుగా సరిపోతారని చెప్పాడు. ‘ఈ విషయం విశ్వక్ సేన్‌కి తెలుసా?’ అని శైలేష్‌ని అడిగితే.. ‘తెలుసు’ అన్నాడు. అప్పుడు ‘హిట్ 2’ కథ వినేందుకు ఒప్పుకున్నాను. పైగా నానీగారు కూడా ఫోన్ చేసి కథ వినమన్నారు. స్క్రిప్ట్ వినగానే నచ్చింది. నా గత ఐదు చిత్రాల్లో నాలుగింటి స్క్రిప్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యాను. కానీ, ‘హిట్ ది సెకండ్ కేస్’ స్క్రిప్ట్‌లో మాత్రం ఇన్వాల్వ్ కాలేదు. శైలేష్ బాగా రాశాడు. నేను ఒక నటుడిగా మాత్రమే పని చేశాను. ► సమాజంలోని చాలా ముఖ్యమైన అంశాలను, కొందరు కిల్లర్స్‌గా ఎందుకు మారుతున్నారు? అనే విషయాలను ఈ సినిమాలో చర్చించాం. ‘మేజర్’ సినిమా బయోపిక్ కావడం, పైగా ఆర్మీ నేపథ్యంలో ఉండటంతో చాలా ఒత్తిడి ఉండేది. కానీ, ‘హిట్ 2’కి ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రీమియర్ చూసినవారందరూ చాలా బాగుందని చెప్పడం హ్యాపీ. ఈ చిత్రాన్ని హిందీ, కన్నడలో డబ్ చేస్తున్నాం. ఈ నెల 13న హిందీలో విడుదలవుతుంది. ► థ్రిల్లర్ నేపథ్యంలో నేను నటించిన ‘క్షణం’ చిత్రంతో నాకు మంచి పేరు వచ్చింది. అలాగే ‘గూఢచారి’ కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. నా ఫేవరెట్ టాప్ టెన్ చిత్రాల్లో చిరంజీవిగారి ‘ఖైదీ’, కార్తీగారి ‘ఖైదీ’ ఉన్నాయి. ‘హిట్ 2’ చిత్రం కమల్‌హాసన్‌గారి ‘విక్రమ్’లా హిట్ కావాలనుంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో లాస్ట్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. నేను ముద్దు సన్నివేశాల్లో నటించినప్పుడు అమ్మ తిట్టింది. ఫైట్స్, డ్యాన్స్‌లా అది కూడా నటనలో భాగమని అమ్మకి చెప్పాను. నాకు ఓ మంచి కామెడీ సినిమా చేయాలనుంది. ‘హిట్ 3’లో నేను కూడా ఉంటాను. ఆస్కార్ అవార్డు పొందిన ఓ హాలీవుడ్ మూవీని రీమేక్ చేయనున్నాం. అందులో నా పాత్ర రఫ్‌గా ఉంటుంది. ► నేను అమెరికాలో ఉన్నప్పుడు గంటన్నర ప్రయాణం చేసి మరీ వెళ్లి మహేశ్‌బాబుగారి ‘మురారి’ సినిమా చూశాను. నేను అభిమానించిన హీరోలు మహేశ్‌బాబు (‘మేజర్’ సినిమా నిర్మాత), నానీ (హిట్ 2) గార్లతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నాలోని నిజాయతీ, నా ప్యాషన్‌ని మహేశ్, నానీగార్లు నమ్మారు కాబట్టే నాతో సినిమాలు నిర్మించారు. -
అలా అయితే ఏడాదికో హిట్ సినిమానే తీయాలి!
‘‘హిట్ 2’ చిత్రం థ్రిల్లర్ జానర్ అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా కథ రెడీ చేశాను. ఇందులో ప్రేమకథ కూడా కావాలని పెట్టింది కాదు. ఓ కేసును పోలీసాఫీసర్ టేకప్ చేస్తే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అనేది చూపించాం’’ అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పిన విశేషాలు. ► నేను సిడ్నీ నుంచి వచ్చినప్పుడు నానీగారితో సినిమా తీయాలనుకున్నాను. ఆయనకు ‘హిట్’ కథ చెబితే, ‘నేను నటించను కానీ నిర్మిస్తా’ అన్నారు. అలా విశ్వక్ సేన్‌తో ‘హిట్ ది ఫస్ట్ కేస్’ తీశాం. ‘హిట్ ది సెకండ్ కేస్’కి అడివి శేష్ అయితే బాగుంటుందనుకున్నాను. నానీగారికి చెప్పగానే ఓకే అన్నారు. సినిమా గురించి మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. అడివి శేష్‌కి ‘హిట్ ది సెకండ్ కేస్’ కథ చెప్పినప్పుడు స్వతహాగా తను కూడా రైటర్ కావడంతో ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఐదారు సిట్టింగ్స్ తర్వాతే ఓకే చెప్పారు. ∙‘హిట్’ ఫ్రాంచైజీని కొత్తగా ప్లాన్ చేశాం. ఒక్కో భాగంలో ఒక ఆఫీసర్‌ను పరిచయం చేస్తూ.. చివరకు అందరు ఆఫీసర్లను కలిపి ఓ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ► నా సినిమాలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఇందుకు ఎంతో పరిశోధన చేస్తాను. ‘హిట్ ఫస్ట్ కేస్’ సమయంలో దిశ ఘటన జరిగింది. సెకండ్ కేస్ సమయంలో మళ్లీ ఇలాంటి (శ్రద్ధా వాకర్) ఘటన జరిగింది. అలాంటి క్రిమినల్స్ సమాజంలో ఉన్నారు. క్రిమినల్స్ ఎందుకు ఇలా మారతారు? అనే చర్చ మా సినిమాలో ఉంటుంది. ‘హిట్’ సీజన్ క్రియేట్ చేయమని రాజమౌళిగారు ఇచ్చిన సలహా మాకు నచ్చింది. ఇందుకు నానీగారు, ప్రశాంతిగారు ఓకే అంటే నేను ప్రతి ఏడాది ఇక హిట్ సినిమానే తీయాల్సి వస్తుంది(నవ్వుతూ). ► ‘హిట్ సెకండ్ కేస్’ తెలుగులో రిలీజయ్యాక హిందీలో డబ్ చేస్తాం. హిట్ ఫ్రాంచైజీ కాకుండా నా దగ్గర మూడు బౌండ్ స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి. -
‘హిట్ 2’ ప్రీ రిలీజ్ వేడుక: ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘హిట్ 2’ ట్రైలర్ బాగా నచ్చింది. అందులోని నేపథ్య సంగీతం ఇంకా బాగుంది.. మంచి ఎనర్జీ ఇచ్చింది. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనే ఉత్సుకత కలిగింది’’ అని ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ–‘‘హిట్’ అనే అద్భుతమైన ఫ్రాంచైజీని సృష్టించిన నాని, ప్రశాంతి, శైలేష్‌లను అభినందిస్తున్నాను. థ్రిల్లర్ జానర్లో శైలేష్ బాగా తీశాడు.. ఈ చిత్రం హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ‘హిట్ 3, 4, 5’ సినిమాలు వస్తాయి.. అయితే ప్రతి ఏడాది ఒక సీజన్లో ‘హిట్’ ఫ్రాంచైజీ రావాలి.. ఈ సీజన్ ‘హిట్’ది అని జనాలకు అర్థం కావాలి. ప్రతి ఏడాది ఒకే నెల ఒకే తేదీన ఈ చిత్రాలు విడుదలవుతుండాలి. సాంకేతిక విలువలు బాగున్నాయి. నటీనటులు ఫెంటాస్టిక్‌గా చేశారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న మంచి ప్రొడక్ట్ ఇది.. మేమంతా గర్వపడుతున్నాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ–‘‘హిట్’ ఫ్రాంచైజీలో 3,4,5,6,7 సినిమాలు ఉంటాయి. 7వ పార్ట్‌లో యూనివర్సల్‌గా అందరి హీరోలను కలుపుతానని, ఓ పెద్ద సమస్య పరిష్కారం కోసం వాళ్లని తీసుకొస్తానని శైలేష్ చెప్పాడు. ఓ నిర్మాతగా కంటే ప్రేక్షకునిగా ఆ మూవీ చూసేందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నాను’’ అన్నారు. ఈ వేడుకలో హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్, నిర్మాత శోభు యార్లగడ్డ, మీనాక్షి చౌదరి, సంగీత దర్శకులు ఎంఎం శ్రీలేఖ, సురేశ్ బొబ్బిలి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తదితరులు మాట్లాడారు. -
హిట్ 2 మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్
-
పాన్ ఇండియా సినిమాలపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
పాన్ ఇండియా సినిమాలపై యంగ్ హీరో అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా సినిమా అనేది కథలో ఉండాలి కానీ.. ఇమేజ్ ఉంది కదా అని పాన్ ఇండియా మూవీ చేయకూడదన్నారు. తాను ఎప్పటికీ ఇక్కడే (తెలుగు) నుంచే ఇండియన్ సినిమా చేస్తానని చెప్పారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్’కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘హిట్’ సిరీస్‌లో రెండో పార్ట్ చాలా కీలకం. ‘హిట్ 3’లోనూ నేను ఉన్నాను. ‘హిట్ 2’ని పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయాలని ఉత్తరాది ప్రేక్షకులు అడుగుతున్నారు.. నానీగారితో మాట్లాడి పాన్ ఇండియన్ రేంజ్లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. అన్నపూర్ణ బ్యానర్లో నేను చేయబోతున్న రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఉంటాయి. ‘హిట్ 2’ హిందీ వెర్షన్ కాస్త ఆలస్యంగా రిలీజవుతుంది’’ అన్నారు. ‘‘చెడు మీద మంచి ఎలా గెలుస్తుందనేది ఈ సినిమాలో చూపించాం. ‘హిట్ 3’ని భారీగా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. నటీనటులు మీనాక్షి చౌదరి, పావని, శ్రీనాథ్ మాగంటి తదితరులు మాట్లాడారు. -
థ్రిల్లింగ్ ఎలిమేంట్స్‌తో ఉత్కంఠభరితంగా హిట్-2 ట్రైలర్
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్-2. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి ఇందులో అడివి శేష్ జోడీగా నటించింది. డిసెంబర్2న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘సాధారణంగా ఈ క్రిమినల్స్ తెలివి తక్కువ వాళ్లు. కోడి బుర్రలు. ఐదు నిమిషాలు చాలు వీళ్లని పట్టుకోవడానికి’’ అంటూ శేష్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సంజన అనే ఒక యువతి హత్య కేసు పోలీస్ ఆఫీసర్ రోల్లో శేష్ ఎలా పరిష్కరించాడన్నది ట్రైలర్‌లోని ప్రతి సీన్ ఉత్కంఠకు గురి చేసేలా ఉంది. రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
హిట్ పార్ట్ 2లో విశ్వక్ సేన్ ఎందుకు లేడంటే..?
-
హీరోయిన్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేసి నానికి దొరికిపోయిన హీరో
నేచురల్ స్టార్ నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ దొరికేశాడు హీరో అడివి శేష్. నానికి తెలియకుండా ఆయన ఆఫీస్‌లో షూట్ చేసిన ఈ వీడియోను శేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నాని ట్విట్టర్ వేదికగా.. నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడుకుంటారా అంటూ అడివిశేష్‌ను ప్రశ్నించాడు. ఇంతకీ ఆ డ్యాన్స్ వీడియో ఎందుకంటే.. అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా హిట్-2 అనే చిత్రంలో నటించారు. నాని ప్రారంభించిన ‘వాల్ పోస్టర్ సినిమాస్’ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో,హీరోయిన్లు ‘ఉరికే’ అనే పాటకు నాని ఆఫీస్‌లో డ్యాన్స్ చేశారు. 'ఇలా డ్యాన్స్ చేయడం సిగ్గుగానే ఉంది. కానీ మీకోసం ఏదైనా చేస్తా' అంటూ శేష్ వీడియోను షేర్ చేశాడు. ఈ డ్యాన్స్‌లో వారి కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది. అందుకే నాని.. 'నా ఆఫీస్‌ని ఇలా కూడా వాడొచ్చా' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. Naa office ni ila kooda vaadocha 🧐@AdiviSesh @Meenakshiioffl https://t.co/PVdIc5UrXn — Nani (@NameisNani) November 12, 2022 -
యూట్యూబ్ నుంచి ‘హిట్ 2’ టీజర్ డిలీట్.. వివరణ ఇచ్చిన అడివి శేష్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్ 2’. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల టీజర్‌ని విడుదల చేయగా.. ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. అతి తక్కువ వ్యవధిలోనే యూ ట్యూబ్ సహా అన్నీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ‘హిట్ 2’ టీజర్ హల్ చల్ చేస్తూ ట్రెండ్ అయ్యింది. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే యూ ట్యూబ్ ‘హిట్ 2’ టీజర్‌ను తొలగించి అందరికీ షాకిచ్చింది. ట్రెండింగ్ లిస్టు నుంచి తొలగించింది. టీజర్ చూడటానికి వయోపరిమితి ఉండాలంటూ ఆంక్షలు విధించింది. టీజర్‌పై యూ ట్యూబ్ యాక్షన్ తీసుకునే లోపు 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనిపై హీరో అడివి శేష్ వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అసలేం జరిగిందనే విషయాన్ని వివరిస్తూనే టీజర్‌ను చూడాలనుకుంటే ఏం చేయాలో కూడా చెప్పారు. ఇలాంటిది ముందే జరుగుతుందని టీమ్ ముందుగానే ఊహించింది. అయితే అంతా సవ్యంగానే జరుగుతుందని యూనిట్ భావిస్తోంది. యూ ట్యూబ్ నిర్ణయాన్ని చిత్ర యూనిట్ స్వాగతించింది. అదే సమయంలో అడివి శేష్ తన వీడియోలో రేపు విడుదలవుతున్న ఉరికే ఉరికే సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. #HIT2 Teaser got REMOVED from YouTube Trending 😑 But no worries #UrikeUrike Song out tomorrow ❤️ 😡@KolanuSailesh pic.twitter.com/vCYRu3HIHu — Adivi Sesh (@AdiviSesh) November 9, 2022 -
Hit 2: 'ఉరికే ఉరికే' ప్రోమో సాంగ్ .. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్
అడివి శేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ఈ చిత్రంలో ఆయన కూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శైలేష్ కొలను ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈయన డైరెక్షన్లో ఇంతకు ముందు రూపొంది ఘన విజయాన్ని సాధించిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ చిత్రానికి ఇది ఫ్రాంచైజీగా రూపొందింది. అడివి శేష్ ఇందులో కె.డి అనే పాత్రలో కనిపిస్తుంటే ఆయనకు జోడీగా ఆర్య అనే పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ భారీ రేంజ్లో విడుదలవుతుంది. గత వారం విడుదలైన ‘హిట్ 2’ టీజర్‌కి టెరిఫిక్ రెస్పాన్ష్ వచ్చింది. ఇప్పుడు ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ సాంగ్‌తో ఆడియెన్స్‌ని అలరించబోతున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కచ్చితంగా ఫుల్ సాంగ్ ట్రీట్‌లా ఉండబోతుందని తెలుస్తుంది. బ్యూటీఫుల్ విజుల్స్, దానికి తగ్గ ట్యూన్ మ్యాజిక్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించారు. ఇప్పుడు సిద్ శ్రీరామ్ శ్రావ్యమైన గొంతు వినటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి సాంగ్ ఈ నెల న 10న విడుదల కానుంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యారీ బి.హెచ్ ఎడిటర్, ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. -
ముంబై హీరోయిన్స్‌పై కామెంట్స్ చేసిన అడివి శేష్
-
ముంబై హీరోయిన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్
విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. మేజర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన హిట్-2 అనే స్పై థ్రిల్లర్ తరహా కాన్సెప్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్ ముంబై హీరోయిన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హిట్-2లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేసింది. సాధారణంగా ముంబై వాళ్లు ఉంటారు కదా.. ప్రెట్టి గర్ల్స్.. వస్తారు హాయ్ అని చెప్పి వన్ టూ త్రీ అంటారు. తర్వాత క్యారవాన్ ఎక్కి వెళ్లిపోతారు. అందరికీ నమస్కారం అంటారు. కానీ మీనాక్షి అలా కాదు. అందరికీ నమస్కారం చెప్పిన తర్వాత కూడా తెలుగులోనే మాట్లాడింది. టీజర్ లాంచ్‌లోనే ఇంత ప్రిపేర్ అయ్యిందంటే సినిమాలో ఎంత కష్టపడి ఉండొచ్చో మీరే అర్థం చేసుకోండి అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు. అయితే ఈ సందర్భంగా ముంబై హీరోయిన్స్‌పై శేష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
ఆ తపన ఎప్పుడూ ఉంటుంది
‘‘మంచి సినిమా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్ సమయంలో ‘హిట్ 2’ చేయటానికి టీమ్ ఎంతో కష్టపడింది. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని అడివి శేష్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మించారు. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని గురువారం విడుదల చేశారు. అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారు ‘మేజర్’, నాని ‘హిట్ 2’ సినిమాలు నాతో నిర్మించడం హ్యాపీ. ‘హిట్ 2’ రిలీజ్ కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘హిట్’తో హిట్ సాధించాం. ‘హిట్ 2’ని స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ప్రశాంతి త్రిపిరనేని. ‘‘క్రైౖమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్ 2’. అడివి శేష్ పర్ఫెక్ట్ జెంటిల్‌మేన్.. సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. నేను ఇక్కడ ఉండటానికి కారణం నానీగారే.. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు శైలేష్ కొలను. సినిమాటోగ్రాఫర్ మణికందన్ .ఎస్, ఎడిటర్ గ్యారీ బి.హెచ్, హీరోయి¯Œ కోమలీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ∙మీనాక్షీ చౌదరి, అడివి శేష్, ప్రశాంతి, శైలేష్ -
అడివిశేష్ ‘హిట్-2’ మూవీ టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
Hit 2 Teaser: అంచనాలు పెంచేస్తున్న హిట్-2 మూవీ టీజర్
విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో అడివి శేష్. మేజర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన మరో స్పై థ్రిల్లర్ తరహా కాన్సెప్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం హిట్-2. ది సెకండ్ కేస్ అనేది ట్యాగ్ లైన్.శైలేష్ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా మూవీ టీజర్‌ను విడుదల చేశారు. పోలీస్ ఆఫీసర్ లుక్‌లో అడివి శేష్ ఆకట్టుకుంటుంది. ఇందులో మీనాక్షి చౌదరి అడివి శేష్‌కు జోడీగా నటించింది. ఈ సినిమా డిసెంబర్2న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) What do YOU know about FEAR? You. will. find. out. The #HIT2 Teaser is Here. 🔥 HIT 2 Teaser | Adivi Sesh | Nani | Sailesh Kolanu | https://t.co/1SmX9m46EB via @YouTube ⚠️ WARNING : Not for Children #HIT2onDec2 @NameisNani @KolanuSailesh @tprashantii @Meenakshiioffl pic.twitter.com/ZPSErSbFNT — Adivi Sesh (@AdiviSesh) November 3, 2022 -
సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టిన హీరో ఎవరు?..బాలయ్య ప్రశ్నకు శేష్, శర్వా షాక్!
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో కొత్త ప్రోమో తాజాగా విడుదలైంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్‌ని విజయవంతంగా ముగించుకున్న ‘అన్ స్టాపబుల్-2’ మూడో ఎపిసోడ్‌కు యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ హాజయ్యారు. బాలయ్య పంచులు.. శర్వా, శేష్‌లు జోకులతో ప్రోమో నవ్వులు పూయిస్తోంది. శర్వా వచ్చి రావడంతోనే బాలయ్యను పొగడ్తలతో ముంచేశాడు. ‘ఆయన పేరు బాలయ్య.. ఆయన ఎప్పటికే బాలుడే’అంటూ బాలకృష్ణను ఇంప్రెస్ చేశాడు. అలాగే తనకు క్రష్ అని చెప్పిన రష్మికతో వీడియో కాల్ మాట్లాడించాడు. ఇక షోకి వచ్చిన అడవి శేష్‌ని పెళ్లి ఎప్పుడు? అని బాలకృష్ణ ప్రశ్నించగా..ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని చాలా ప్రెజర్.. నాకేమో ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోలేని పెద్దలు చాలా మంది ఉన్నారు. ప్రభాస్, శర్వానంద్ లాంటి వాళ్లు ఇంకా పెళ్లి చేసుకోలేదని చెబుతూ తప్పించుకుంటున్నాను అన్నారు. అప్పుడు శర్వా.. ‘నేను ఆయన(ప్రభాస్) పేరు చెప్పుకొని తిరుగుతున్నా.. నువ్వేమో నా పేరు చెప్పుకొని తిరుగుతున్నావా? అని అనడంతో బాలకృష్ణతో సహా అందరూ గట్టిగా నవ్వారు. షోలో భాగంగా చివర్లో చిన్న గేమ్ ఆడదాం బ్రదర్స్ అంటూ.. ట్రూత్ అయితే దుస్తులు విప్పేయాలని కండీషన్ పెట్టాడు. మొదటి ప్రశ్నగా ‘సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టిన హీరో? ’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పేందుకు ఇద్దరు హీరోలు భయపడ్డారు. ఆ హీరో బాలయ్యనే అని చెప్పే సాహసం చేయలేకపోయారు. చివరకు శర్వా.. మీ ఆన్సర్ అయినా కూడా మేమే విప్పాలా సర్? అని ప్రశ్నించగా.. ‘స్టూడియో దాటి బయటికి వెళ్లగలరా?’అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ఈ యంగ్ హీరోలతో బాలయ్య ఎలా ఆడుకున్నారో శుక్రవారం(నవంబర్ 4) ప్రసారం అయ్యే ఫుల్ ఎపిసోడ్లో చూడాలి. -
'హసీనా' టీజర్‌ను విడుదల చేసిన అడివి శేష్
‘‘హీరోయిన్ ఓరియంటెడ్‌గా రూపొందిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రంలో 84 మంది కొత్తవారు నటించడం విశేషం. టీజర్ చాలా బాగుంది.. సినిమా ఘనవిజయం సాధించాలి’’ అని హీరో అడివి శేష్ అన్నారు. ప్రియాంక డే టైటిల్ రోల్లో సాయి తేజ గంజి, తన్నీవర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హసీనా’. నవీన్ ఇరగాని దర్శకత్వం వహించారు. ఎస్. రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం టీజర్‌ని అడివి శేష్ విడుదల చేశారు. ‘ఎవడైనా బాగుపడాలన్నా సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్ అయి ఉంటారు’ అనే డైలాగ్‌తో ఆరంభమై, ‘నా పేరు హసీనా.. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తాగి ఉండాలి.. లేక మేధావి అయినా అయ్యుండాలి’ డైలాగ్‌తో ముగుస్తుంది. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ కందా, సంగీతం: షారుక్ షేక్, నేపథ్య సంగీతం: నవనీత్ చారి, లైన్ ప్రొడ్యూసర్: సాయితేజ గంజి. -
నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్
మూడు విభిన్న పాత్రలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ జోడిగా నటించిన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. 'నాటకం' వంటి సినిమాను తెరకెక్కించిన కల్యాణ్ జి గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ.. ''అడగ్గానే వచ్చిన మా మేజర్ (అడివి శేష్)కు సెల్యూట్. మా డీజే (సిద్దు జొన్నలగడ్డ) ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రీ కొడుకుల్లా నటించబోతోన్నాం. మా అబ్బాయి నటించిన ప్రేమ కావాలి అంటూ వచ్చాడు. ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ ముందుకు రాబోతోన్నాడు. ఈ టీం అందరికీ థాంక్స్. ఇంత మంది మంచి మనుషులు కలిసి ఈ సినిమాను తీశారు. ఈ ఏడాదితో నాకు నటుడిగా 50 ఏళ్లు వస్తాయి. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మన సినిమా కూడా ఉండాలి. మీ ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా విజయం సాధించాలి'' అని తెలిపారు. ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థాంక్స్. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కల్యాణ్‌కు థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మా సినిమాను నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థాంక్స్. సాయి కార్తిక్ మంచి బీజీఎం ఇచ్చారు. మా కెమెరామెన్ బాలిరెడ్డి, ఫైట్ మాస్టర్ ఇలా పని చేసిన అందరికీ థాంక్స్. సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’ అని పేర్కొన్నాడు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు ! ''నన్ను ఇక్కడకు పిలిచిన సాయి కుమార్ గారికి థాంక్స్. ఇది వరకు ఆది చేసిన సినిమాలు అన్నింట్లో కెల్లా ఈ చిత్రంలో కొత్తగా అనిపిస్తున్నాడు. కారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ కల్యాణ్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. స్క్రీన్ మీద ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తుంది'' అని సిద్ధు జొన్నల గడ్డ తెలిపాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ‘తీస్ మార్ ఖాన్ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా అమ్మ బర్త్ డే ఆగస్ట్ 19. ఈ చిత్రం సక్సెస్‌తో మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్లో ఆది కుమ్మేశాడు. సినిమాలోనూ కుమ్మేస్తాడు. పాయల్‌ను ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు. చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''తీస్ మార్ ఖాన్ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. పర్ఫెక్ట్ కమర్షియల్ టైటిల్. నేను ఆది కలిసి శమంతకమణి సినిమాను చేశాం. ఆయన అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఆదికి పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. సాయి కుమార్ గారితో నేను భలే మంచిరోజు చిత్రాన్ని చేశాను. నాకు ఆయన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో తండ్రిలాంటి వారు'' అని తెలిపాడు. ‘నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో కాస్త నెర్వస్‌గా ఉంటాను. అది అందరికీ సహజంగానే ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికి విశేషమైన స్పందన వచ్చింది. మా సినిమాకు మీ ప్రేమ దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది. నేనేం స్టార్ కిడ్‌ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ సినిమా నాకెంతో స్పెషల్. మూడేళ్ల తరువాత నా సినిమా థియేటర్లోకి వస్తోంది. ఈ చిత్రంలో ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి’ అని హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. -
బాక్సాఫీస్ కళ కళ.. సంతోషంలో స్టార్ హీరోలు..ట్వీట్స్ వైరల్
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కలకళలాడుతోంది. ఈ శుక్రవారం(ఆగస్ట్ 5) విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలు తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకున్నాయి. దీంతో ఈ విజయాన్ని టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్ వచ్చేలా చేసిన సీతారామం, బింబిసార చిత్ర బృందానికి తెలుగు హీరోలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఈ రెండు చిత్రాల మేకర్స్‌కి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ‘సీతారామం’ మరియు ‘బింబిసార’ చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనఃపూర్వక శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశాడు. ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు హిట్ టాక్ని సంపాదించుకోవడం సంతోషంగా ఉందని విజయదేవరకొండ ట్వీట్ చేశాడు. Extremely happy to hear that 2 films on the same day have turned into hits :)) What a good day! Congratulations to @VyjayanthiFilms @dulQuer @mrunal0801 @iamRashmika, @iSumanth anna, @hanurpudi and team on #SitaRamam. Hearing the most amazing beautiful things about the film ❤️ — Vijay Deverakonda (@TheDeverakonda) August 6, 2022 సీతారామం, బింబిసార చిత్రాల విజయంపై యంగ్ హీరో అడివి శేష్ కూడా స్పందించాడు. తనకు కొవిడ్ రావడంతో ఐసొలేషన్‌లో ఉన్నానని... తన కోసం ఉదయం ఒక సినిమా, తర్వాత మరో సినిమా చూడమని అడివి శేష్ ట్వీట్ చేశాడు. Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳 — Adivi Sesh (@AdiviSesh) August 5, 2022 -
అడివి శేష్‌కు కరోనా.. తనకోసం ఆ పని చేయాలంటూ పోస్ట్
కల్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. నేడు(శుక్రవారం)విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం పట్ల హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'ఈ రెండు సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుండటం సంతోషంగా ఉంది. ఇది కదా కావల్సింది. ప్రస్తుతం తనకు కరోనా రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నా. అందుకే థియేటర్స్‌కి వెళ్లలేకపోతున్నా. నా కోసం ఓ మార్నింగ్ షో, మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి' అంటూ అడివి శేష్ ట్వీట్ చేశారు. అయితే ఆయనకు కరోనా అని తెలియడంతో పలువురు అభిమానులు గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳 — Adivi Sesh (@AdiviSesh) August 5, 2022 -
'మేజర్' అరుదైన రికార్డు.. పాక్‌తో సహా 14 దేశాల్లో ట్రెండింగ్
Major Trends At Top 10 On Netflix Across 14 Countries: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా సత్తా చాటుతోంది. అడవి శేష్ నటన, యాక్షన్ సీక్వెన్స్, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వివిధ దేశాల్లోని ప్రజలను ఆకట్టుకుంటోంది. 'మేజర్' చిత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 14 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు, హిందీ భాషలతోపాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉండగా.. బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, మలేషియా, ఒమన్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, ఖతార్, సింగపూర్ సహా 14 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్ టాప్-10లో నిలిచింది. ఇండియా, మారిషస్, నైజీరియాలో టాప్-1లో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ విషయంపై హీరో అడవి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాపై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే' అని తెలిపాడు. India's hero is being celebrated worldwide 💥💥#MajorTheFilm is trending in Top 10 films on @NetflixIndia across 14 countries ❤️🔥❤️🔥@AdiviSesh #SobhitaDhulipala @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @sonypicsindia pic.twitter.com/sKv0jQ3IGr — Major (@MajorTheFilm) July 14, 2022 -
పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన ‘మేజర్’
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. (చదవండి: మేజర్ మూవీ రివ్యూ) తాజాగా ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులను సృష్టిస్తోంది. జులై 3 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ టాప్ 1, 2 పొజిషన్లలో మేజర్ కొనసాగుతుంది. ‘మేజర్’ హిందీ వెర్షన్ టాప్ 1లో ట్రెండ్ అవుతుండగా, తెలుగు వెర్షన్ రెండో స్థానంలో ఉంది. (చదవండి: చిరంజీవి కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా రికార్డులు బద్దలే!) ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్లో కూడా ‘మేజర్’ చరిత్ర సృష్టిస్తున్నాడు. అక్కడ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో మేజర్ మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా ఈ చిత్రం టాప్ 1లో ఉండడం గమనార్షం. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. #India #Pakistan #Bangladesh #SriLanka NUMBER 1 #MAJOR 🇮🇳❤️ pic.twitter.com/R1G6tIWPTG — Adivi Sesh (@AdiviSesh) July 8, 2022