Adivi Sesh Comments On Prabhas And Anushka Marriage - Sakshi
Sakshi News home page

Adivi Sesh: పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన అడివి శేష్‌

Published Fri, May 20 2022 7:50 PM | Last Updated on Fri, May 20 2022 8:09 PM

Adivi Sesh Comments On Prabhas And Anushka Marraige Goes Viral - Sakshi

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా మూవీ మేజర్‌. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్‌3న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ను జోరు పెంచింది చిత్ర బృందం. అయితే ఈ ప్రమోషన్స్‌లో అడివి శేష్‌ పెళ్లి టాపిక్‌ హైలైట్‌గా మారింది.



మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్‌ అంతా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీ పెళ్లెప్పుడు అని శేష్‌ను ప్రశ్నించగా ఆయన ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌​ చేశారు. ఇండస్ట్రీలో నాకన్నా మ్యారేజ్‌ కావాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్‌ అనుష్క, ప్రభాస్‌ల పెళ్లి ఇంకా కాలేదు. వారి పెళ్లిళ్లు అయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిద్దాం అంటూ ఫన్నీ ఆన్సర్‌ ఇచ్చారు. శేష్‌ కామెంట్స్‌తో మరోసారి ప్రభాస్‌-అనుష్కల పెళ్లి తెరపైకి వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement