అనుష్క పెళ్లిపై రూమర్స్‌.. తొలిసారి స్పందించిన స్వీటి | Anushka Shetty First Time Comment His Marriage Rumours | Sakshi
Sakshi News home page

అనుష్క పెళ్లిపై రూమర్స్‌.. తొలిసారి స్పందించిన స్వీటి

Nov 10 2024 12:51 PM | Updated on Nov 10 2024 1:48 PM

Anushka Shetty First Time Comment His Marriage Rumours

నాలుగు పదుల వయసు దాటినా  సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని హీరోయిన్ల శాతం చాలానే ఉంది. అలాంటి వారిలో త్రిష, అనుష్క పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. దీంతో సోషల్‌మీడియాలో వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున పలు కథనాలు వస్తూనే ఉంటాయి. పెళ్లి వార్తలపై అనుష్క తాజాగా స్పందించారు. తెలుగులో కథానాయకిగా రంగప్రవేశం చేసిన బెంగళూరు బ్యూటీ ఈమె. ఆ తరువాత తమిళంలో విజయ్‌, సూర్య, అజిత్‌ వంటి హీరోలతో జతకట్టి పాపులర్‌ అయ్యారు. లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారారు. అలాంటిది సడన్‌గా సైజ్‌ జీరో చిత్రంలోని పాత్ర కోసం బరువు పెరిగి ఆ తరువాత బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక కెరీర్‌ గాడి తప్పింది. 

చిన్న గ్యాప్‌ తరువాత తాజాగా ఘాడీ అనే వైవిధ్యభరిత కథా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తొలిసారిగా ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇకపోతే వ్యక్తిగతంగా అనుష్క చాలా వదంతులను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా పెళ్లి విషయంలో పలు అసత్య ప్రచారానికి గురవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరితో ప్రేమను అంటగట్టి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. తాజాగా ఓ దుబామ్‌ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడానికి అనుష్క సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.  ఆపై ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్‌తో ఆమె పెళ్లి అంటూ రూమర్స్‌ వచ్చాయి. 

వీటిలో ఏ ఒక్క విషయాన్ని ఆమె ధ్రువపరచలేదన్నది గమనార్హం. ఈ వదంతులపై స్పందించిన అనుష్క తనకు పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంతో తాను ఎప్పుడూ బాధపడిందిలేదన్నారు. అయినా పెళ్లి పెళ్లి అంటున్న వారు.. ఎక్కడ, ఎవరితో జరిగిందో చెప్పడం లేదన్నారు. వివాహ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదన్నారు. అది నేరం కాదని.. భావోద్వేగంతో కూడిన విషయం అని, ఇకనైనా అసత్య ప్రచా రం చేయొద్దని అన్నారు. ఆ టైం వస్తే అందరికీ తెలియజేస్తానని అనుష్క పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement