Kannada
-
కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' హంటింగ్ ట్రైలర్ విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' నుంచి ట్రైలర్ విడుదలైంది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న సుదీప్ ఆపై బాహుబలిలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. అలా ఆయన పాన్ ఇండియా రేంజ్లో పరిచయం అయ్యాడు. అయితే, ఇప్పుడు మ్యాక్స్ సినిమాతో థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా విలన్‌గా సునీల్ కన్నడలో ఎంట్రీ ఇచ్చాడు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానున్నడంతో మ్యాక్స్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా డేట్ అనౌన్స్ మెంట్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం పోస్టర్స్ ఉన్నాయి. దీంతో తెలుగులో కూడా మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. క్రిస్మస్ రేసులో ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉంది. -
తెలుగు సినిమా స్థాయి మారిపోయింది: ఉపేంద్ర
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఈ సినిమా డిసెంబర్ 20న తెలుగులో కూడా విడుదల కానుంది. దీంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత ఎస్కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వేదికపై టాలీవుడ్ పరిశ్రమను ఉపేంద్ర మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.1995లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని నేను ఏడాదిపాటు స్క్రిప్టుతో తిరిగాను. ఇక్కడి నటులు సినిమాలోని కథ, డైలాగ్స్ చాలా లోతుగా ఆలోచించి ఓకే చేస్తారని ఆ సమయంలో నాకు అర్థం అయింది. అందుకే ఆయన మేగాస్టార్ అయ్యారు. ఆ సమయం నుంచి నేను రెడీ చేసే స్క్రిప్టు విషయంలో చాలా మార్పులు చేసుకున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు దేశం దాటి ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. రూ. 1000 కోట్లు, రూ. 2000 కోట్లు సులువుగా కలెక్షన్స్ సాధించే దిశగా తెలుగు పరిశ్రమ వెళ్తుంది. టాలెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా తెలుగు వాళ్లు అభిమానిస్తారు. మీరు ఆదరించే వారిలో నేను కూడా ఒకరిని. 'ఉప్పెన' సినిమా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మొదటి సినిమానే ఇలా టేకింగ్ చేశారు అంటే నమ్మలేకపోయాను. అందుకే దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్ అవకాశం ఇచ్చారు.' అని అన్నారు. -
'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి
కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి అనుకోని పరిస్థితుల్లో హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఎలిమేనేషన్ ప్రక్రియలో తాను సేవ్ అయినప్పటికీ హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ భరించలేకున్నానంటూ తనను బిగ్ బాస్ నుంచి బయటకు పంపాలని హౌస్ట్ కిచ్చా సుదీప్‌ను కోరింది. అయితే, తాను బయటకు రావడానికి గల కారణాలు తెలిపి హౌస్ నుంచి వచ్చేసింది.తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో తనదైన గేమ్‌తో ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన శోభా శెట్టి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి టాలీవుడ్ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇక్కడి బిగ్‌బాస్‌లో శివంగిలా సత్తా చాటిన ఆమె ఎందుకు బయటకొచ్చిందో ఇలా పేర్కొంది. కేవలం రెండు వారాల పాటు మాత్రమే ఉన్న శోభ.. తన అనారోగ్య కారణాల వల్ల షో నుంచి బయటకు వచ్చేసింది. బిగ్‌బాస్‌లో గేమ్ ఆడాలని ఉంది కానీ ఆరోగ్యం సహకరించడం లేదని ఆమె పేర్కొంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన షోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది.'నా బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. ఆటపై దృష్టి పెట్టేందుకు ఆరోగ్యం సహకరించడం లేదు. ముందుకు వెళ్లాలనే సంకల్పం ఉన్నప్పటికీ, శరీరం దానిని ముందుకు సాగనివ్వడం లేదు. నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, జీవిత బాధ్యతలతో ముందుకు సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నాపై చూపిన మీ ప్రేమ, మద్దతుకు నేను ఎప్పటికీ కృతతో ఉంటాను. నేను తెలిసి లేదా తెలియక ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నా అభిమానులకు, కలర్స్ కన్నడ టీమ్‌తో పాటు మన ప్రియమైన కిచ్చా సుదీప్ సర్కి ధన్యవాదాలు' అని శోభా శెట్టి పోస్ట్ చేసింది. -
బిగ్ ఫైట్.. కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' కూడా ఆ రోజే విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. మ్యాక్స్ చిత్రం తెలుగులో డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది.'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. క్రిస్మస్ రేసులు ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉండనుంది. -
లేత రంగు చీర.. లేలేత నవ్వులు, బిగ్‌బాస్ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
'కాంతార' యూనిట్ ప్రయాణిస్తున్న బస్సు బోల్తా
'కాంతార' సినిమా యూనిట్ సభ్యలకు ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా షూటింగ్‌ను మేకర్స్ ఆపేశారు. కన్నడ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతుంది. అయితే, చిత్ర యూనిట్‌కు ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.నవంబర్ 24న రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని సుమారు 20 మంది సభ్యులతో ప్రయాణిస్తున్న మినీ బస్సుకు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని జడ్కల్లో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు ఆరుగురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జడ్క్ల్లోని మూడూరు నుంచి కొల్లూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా కాంతార షూటింగ్‌ను ఆపేశారు.డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ చూస్తూ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బస్సులో ఉన్న ఒక ఆర్టిస్ట్ ఆరోపించాడు. ఘటన జరగగానే కొందరు డ్రైవర్‌పై చేయి చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా రిషభ్ స్వీయ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ దీనిని నిర్మిస్తున్నారు. 2025 అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
‘నేనేమైనా ఉర్ధు మాట్లాడుతున్నానా?’ విద్యార్థిపై కర్ణాటక మంత్రి ఆగ్రహం
బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖమంత్రి మధు బంగారప్ప తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రికి కన్నడ రాదని ఓ విద్యార్ధి వ్యాఖ్యానించడంతో ఆయన సీరియస్ అయ్యారు. విద్యార్ధి మాటలను మూర్ఖత్వంగా పేర్కొంటూ.. అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.. అసలేం జరిగిందంటేకర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహిక విద్యార్ధులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే ప్రభుత్వ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో సుమారు 25,000 మంది విద్యార్థులకు ఈ ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మధు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్ధులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. విద్యామంత్రికి కన్నడ రాదు అని అన్నారు. దీనిపై మంత్రి వెంటనే స్పందిస్తూ.. ‘ఏంటి నేను ఏమైనా ఉర్ధూలో మాట్లాడుతున్నానా? టీవీ ఆన్ చేసి చూడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సదరు విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Hadn't Madhu Bangarappa publicly admitted that he doesn't know Kannada?? Why is the @INCKarnataka punishing the student who reminded him of this?? What are they trying to achieve here ?? What else can be expected of hopeless Congress??ತನಗೆ ಕನ್ನಡ ಸರಿಯಾಗಿ ಬರುವುದಿಲ್ಲ ಎಂದು ಈ ಹಿಂದೆ… pic.twitter.com/FPXnFGExqy— Pralhad Joshi (@JoshiPralhad) November 21, 2024 ఇక మంత్రి ప్రవర్తనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కర్నాటక బీజేపీ అధికారిక ఎక్స్‌లో మంత్రిని ఓ విద్యార్థి ప్రశ్న అడిగే కార్టూన్‌ను పోస్ట్ చేసింది. మంత్రి విద్యార్థులను బోల్డ్ ప్రశ్నలు అడగమని చెబుతున్న ఫోటోకు ‘ప్రశ్నించేవారిని తెలివితక్కువవాడిగా పిలుస్తుంది మీరే’ అని సూచించే క్యాప్షన్‌ను పేర్కొంది. ಅವಿದ್ಯಾಮಂತ್ರಿ @Madhu_Bangarapp ಅವರೆ, ಜ್ಞಾನ ದೇಗುಲವಿದು ಧೈರ್ಯವಾಗಿ ಪ್ರಶ್ನಿಸು ಅಂತ ಹೇಳೋರು ನೀವೇ..!! ಪ್ರಶ್ನಿಸಿದವರನ್ನು ಸ್ಟುಪಿಡ್ ಅಂತ ಕರೆಯುವವರು ನೀವೇ..!!#DictatorCongress #UneducatedMinister pic.twitter.com/3ZY5kp3QB2— BJP Karnataka (@BJP4Karnataka) November 21, 2024 కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి, ఎంపీ ప్రహ్లాద్ జోషి ఎక్స్‌లో స్పందిస్తూ.. మధు బంగారప్ప తనకు కన్నడ రాదని బహిరంగంగా ఒప్పుకోలేదా? ఈ విషయాన్ని గుర్తు చేసిన విద్యార్థిని కర్ణాటక కాంగ్రెస్ ఎందుకు శిక్షిస్తోంది? వారు ఇక్కడ ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారు ? ఆశలేని కాంగ్రెస్ నుంచి ఇంకా ఏమి ఆశించవచ్చని ప్రశ్నించారు. -
హోంబలే ఫిల్మ్స్ బిగ్ ప్రాజెక్ట్ 'మహావతార్' ప్రకటన
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్ పరిచయం అవసరం లేని నిర్మాణ సంస్థ. ఈ సంస్థ నుంచి ఇప్పటికే కేజీఎఫ్,సలార్,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించింది. ఆపై ప్రభాస్‌తో మరో మూడు చిత్రాలను నిర్మిస్తున్నట్లు కూడ తెలిపింది. అయితే, తాజాగా ఈ సంస్థ ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌తో పాటు ఒక వీడియోను కూడా ప్రేక్షకులతో పంచుకుంది.'మహావతార్: నరసింహ' అనే హిస్టారికల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ మూవీలో నటించనున్న నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్‌లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్‌గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్ హిట్ ఇచ్చారు.హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నుంచి కాంతార ప్రీక్వెల్ చిత్రీకరణ జరపుకుంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషభ్‌శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు సలార్ పార్ట్2 శౌర్యంగ పర్వం కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంతో కలిపి ప్రభాస్‌తో మూడు భారీ చిత్రాలు ప్లాన్ చేసినట్లు ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. -
నేను ఉన్నంత కాలం వాడు నా కుమారుడే: సుమలత
కన్నడ హీరో దర్శన్ గురించి సినీ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన రాజకీయ మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో దర్శన్ గురించి పలు కీలవ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి తాను కృషి చేస్తానని, జనవరి తర్వాత సంపూర్ణంగా రాజకీయాల్లో పాల్గొంటానని మండ్య మాజీ ఎంపీ సుమలత అంబరీష్ పేర్కొన్నారు.గత ఎన్నికల్లో ప్రధాని మోదీ మాటకు విలువనిచ్చి మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం కాలి నొప్పి సమస్యకు చికిత్స పొంది కొంత విరామం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. బీజేపీ తనను నిర్లక్ష్యం చేస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొన్నారు. మండ్యలో బీజేపీని బలోపేతం చేస్తానని పార్టీ హైకమాండ్‌కు తాను చెప్పినట్లు తెలిపారు. నటుడు దర్శన్ గురించి సుమలత ఇలా మాట్లాడారు. 'గతంలో దర్శన్‌తో తన సంబంధం ఎలా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది. దర్శన్ సతీమణి నాతో రోజూ టచ్‌లో ఉన్నారు. దర్శన్ ఆరోగ్యం ప్రస్తుతం అంత మెరుగ్గాలేదు. ముందు అతని ఆరోగ్యం మెరుగు పడాలి. ఇప్పటికే వాడి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. తనపై వచ్చిన అన్ని ఆరోపణల నుంచి బయట పడతాడనే నమ్మకం ఉంది. నేను జీవించి ఉన్నంత వరకు దర్శన్ నా కుమారుడి లాంటివాడే, అతనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. రేణుకస్వామి హత్య కేసులో నిజం బయటపడి దర్శన్ నిరపరాధిగా నిలవాలని దేవుడిని ఆశిస్తున్నా' అని ఆమె చెప్పారు. వైద్యచికిత్సల కోసం ఆరు వారాల పాటు దర్శన్‌కు కోర్టు బెయిల్ ఇచ్చింది. -
అనుష్క పెళ్లిపై రూమర్స్.. తొలిసారి స్పందించిన స్వీటి
నాలుగు పదుల వయసు దాటినా సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని హీరోయిన్ల శాతం చాలానే ఉంది. అలాంటి వారిలో త్రిష, అనుష్క పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. దీంతో సోషల్‌మీడియాలో వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున పలు కథనాలు వస్తూనే ఉంటాయి. పెళ్లి వార్తలపై అనుష్క తాజాగా స్పందించారు. తెలుగులో కథానాయకిగా రంగప్రవేశం చేసిన బెంగళూరు బ్యూటీ ఈమె. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలతో జతకట్టి పాపులర్ అయ్యారు. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారారు. అలాంటిది సడన్‌గా సైజ్ జీరో చిత్రంలోని పాత్ర కోసం బరువు పెరిగి ఆ తరువాత బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక కెరీర్ గాడి తప్పింది. చిన్న గ్యాప్ తరువాత తాజాగా ఘాడీ అనే వైవిధ్యభరిత కథా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తొలిసారిగా ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇకపోతే వ్యక్తిగతంగా అనుష్క చాలా వదంతులను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా పెళ్లి విషయంలో పలు అసత్య ప్రచారానికి గురవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరితో ప్రేమను అంటగట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తాజాగా ఓ దుబామ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడానికి అనుష్క సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆపై ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్‌తో ఆమె పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. వీటిలో ఏ ఒక్క విషయాన్ని ఆమె ధ్రువపరచలేదన్నది గమనార్హం. ఈ వదంతులపై స్పందించిన అనుష్క తనకు పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంతో తాను ఎప్పుడూ బాధపడిందిలేదన్నారు. అయినా పెళ్లి పెళ్లి అంటున్న వారు.. ఎక్కడ, ఎవరితో జరిగిందో చెప్పడం లేదన్నారు. వివాహ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదన్నారు. అది నేరం కాదని.. భావోద్వేగంతో కూడిన విషయం అని, ఇకనైనా అసత్య ప్రచా రం చేయొద్దని అన్నారు. ఆ టైం వస్తే అందరికీ తెలియజేస్తానని అనుష్క పేర్కొన్నారు. -
అప్పుల బాధలు, భార్యకు దూరం కావడంతో సినీ దర్శకుడు మృతి
కన్నడ ప్రముఖ దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్యకు కారణాలు వెలుగులోకి వచ్చాయి. సినిమా రంగంలో నటీనటులు, దర్శకులు బాగా డబ్బుతో ఏ కష్టం లేకుండా జీవిస్తుంటారని అనుకుంటారు. కానీ, ఆయన మరణం వెనుక ఆర్థిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. బెంగళూరు రూరల్ నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లిలోని అపార్ట్మెంట్లో నివసిస్తున్న గురుప్రసాద్ (52) మూడు రోజుల క్రితం ఉరివేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన పూర్తిపేరు గురుప్రసాద్ రాఘవేంద్ర శర్మ, కనకపుర స్వస్థలం. సినిమాలపై మోజుతో ఆ రంగంలోకి వచ్చి దర్శకుడయ్యారు. సామాజిక అంశాలను బాగా చిత్రీకరించేవారు.రెండవ పెళ్లీ విఫలం..మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గురుప్రసాద్ ఇటీవలే రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. మరోవైపు అవకాశాలు లేని గురుప్రసాద్ అప్పులపాలయ్యారు. తాగుడుకి బానిసైన ఆయన అప్పులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేను ఆత్మహత్య చేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పేవాడని తెలిసింది. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన రంగనాయక సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. షూటింగ్ ముగిసినా ఓ సినిమా విడుదల కాలేదు. కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లోనూ నటించారు.అప్పుల బాధల వల్ల తరచూ ఇళ్లు మారుస్తూ.. సినిమాల కోసం గురుప్రసాద్ రూ.3 కోట్ల వరకూ అప్పులు చేశారు. అప్పులు ఇచ్చిన ఫైనాన్షియర్లు తరచూ ఒత్తిడి చేసేవారు. ఆ బాధ పడలేక ఆయన తరచూ ఇళ్లు మారుస్తూ వచ్చాడు. కొందరు రుణదాతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో ఒకసారి అరెస్టయ్యారు. అయితే ఆయన తీసిన మఠ, ఎద్దేళు మంజునాథ్, డైరెక్టర్ స్పెషల్ తదితర చిత్రాలు విజయం సాధించడంతోపాటు మంచి పేరు, అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆదివారం అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నుండి దుర్గంధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా గురుప్రసాద్ శవం కుళ్లిపోయి ఫ్యాన్‌కు వేలాడుతోంది. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.ముగిసిన అంత్యక్రియలుచిత్ర దర్శకుడు గురుప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం జరిగాయి. బ్రాహ్మణ విధివిధానాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. గురుప్రసాద్ సోదరుడు హరిప్రసాద్, మొదటి భార్య ఆరతి, రెండో భార్య సుమిత్ర, ఇతర కుటుంబ సభ్యులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు యోగరాజ్‌భట్, నటుడు దునియా విజయ్, డాలి ధనంజయ, తబలా నాణి, సతీశ్ నీనాసం తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కాగా, తన భర్త మృతి పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవని, అప్పుల బాధ ఎక్కువై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భార్య సుమిత్ర పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనుమానస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు అనుమానాస్పద మృతి
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. తన కెరీర్లో 'మఠం' సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. దీంతో ఆయన పేరు మఠం గురు ప్రసాద్‌గా గుర్తింపు పొందారు. తను ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.గురుప్రసాద్ మూడు రోజుల క్రితమే మరణించారని తెలుస్తోంది. ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ఆయన మరణ వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. జిగర్తాండ, బాడీగార్డ్, కుష్క, విజిల్, మైలారీ వంటి సినిమాలతో ఆయన ఆకట్టుకున్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. -
ఆసుపత్రిలో చేరిన నటుడు దర్శన్
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం కొద్దిరోజులుగా మెరుగ్గాలేదు. దీంతో తనకు అత్యవసర చికిత్స అవసరం అంటూ కోర్టుకు వెళ్లడంతో ఆయనకు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన సుమారు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్‌కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న దర్శన్ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఆయన లాయర్ నాగేశ్ తెలిపారు. దర్శన్‌కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్‌లలో సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మైసూరులో ఒక ప్రముఖ ఆసుపత్రిలో దర్శన్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ ఇలా చెప్పారు.చికిత్స చేస్తున్న డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ.. దర్శన్ కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని తెలిపారు. ఆయన వెన్ను భాగంలో తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల కాలిలో కూడా ఆ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దర్శన్‌కు ఇప్పటికే ప్రాథమిక చికిత్సలు ప్రారంభించామని తెలిపారు. పూర్తి రిపోర్ట్లు వచ్చిన తర్వాత అవసరం అయితే ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చని చెప్పారు. బళ్లారి కేంద్ర కారాగారంలోని వైద్యులు పంపిన మెడికల్ రిపోర్టులను కూడా తాము పరిశీలించామని పేర్కొన్నారు. -
కన్నడ సినిమా రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్.. ఫస్ట్ మూవీ ఇదేనా..?
కన్నడ హీరో శ్రీ మురళి నటించిన తాజా చిత్రం బఘీర. దీపావళీ కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదలైంది. అయితే, మొదటిసారి ఏ కన్నడ సినిమాకు దక్కిన క్రేజ్ ఈ చిత్రానికి దక్కిందని తెలుస్తుంది. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో నిర్మించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు కథ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.'బఘీర' కథను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించడంతో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రీచ్ అయింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కూడా డిజిటల్ రైట్స్ తీసుకునేందుకు ఆసక్తి కనపరిచిందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇంతవరకు ఏ కన్నడ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీ రైట్స్‌ను దక్కించుకోలేదు. అక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ ఆసక్తి కనపరచలేదని సమాచారం. అయితే, ఇప్పుడు బఘీర హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు కన్నడ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.కన్నడ ఇండస్ట్రీకి చెందిన కాంతార సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర భాషలకు సంబంధించిన వర్షన్స్ అమెజాన్ ప్రైమ్‌లో రన్ అవుతున్నాయి. కన్నడ సినిమాలు ఒకప్పుడు ఇతర భాషలలో విడుదల కాకపోవడంతో ఓటీటీ సంస్థలు పెద్దగా ఆ ఇండస్ట్రీపై ఆసక్తి చూపలేదు. అయితే, కేజీఎఫ్ తర్వాత వారి సినిమాల మార్కెట్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా రేంజ్లో కన్నడ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే బఘీర సినిమా డిజిటల్ రైట్స్ తొలిసారి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని కన్నడలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. -
అయోధ్య దీపోత్సవం.. కన్నడ స్టార్ కు బిగ్ రిలీఫ్
-
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా?
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ ఓ మహిళ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది.బెంగళూరు కేంద్రంగా నివసిస్తున్న ఓ మహిళ తాను ఫుడ్ ఆర్డర్ పెట్టానని, డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్‌కి కన్నడ రాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘బెంగళూరు కర్ణాటకలో ఉందా లేదా పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ మీ డెలివరీ ఉద్యోగికి కన్నడ,ఇంగ్లీష్ కూడా మాట్లాడలేకపోతున్నారు. కనీసం అర్థం చేసుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. హింది మేం కూడా నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారా? భాషని మాపై రుద్దడం ఆపండి. మీ డెలివరీ పార్ట్నర్లు కన్నడ నేర్చుకునేలా చూడండి’ అని సదరు మహిళ ట్వీట్ చేశారు.Bengaluru is in Karnataka or Pakistan @Swiggy ?Your delivery guy is neither speaking nor understanding #kannada ,not even #English. Do you expect us to learn his state language #Hindi in our land? Stop imposing things on us and make sure your delivery persons know #Kannada. pic.twitter.com/smzQ6Mp7SV— Rekha 🌸 (@detached_98) September 12, 2024అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వినియోగ దారుడు భారత్‌లో ప్రతి 50 కిలోమీటర్లకు భాష మారుతుంది. కానీ భాష విషయంలో తమిళ, కన్నడిగులు అంత కఠినంగా ఉండరు. అలా ఉండకూడదు. భారతదేశం వైవిధ్యం, అనేక భాషలతో కూడిన దేశం, అన్ని భాషలను గౌరవించాలి.మరొకరు మీరు డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తుంటే.. డెలివరీ సకాలంలో జరిగినంత కాలం డెలివరీ బాయ్ భాషా నైపుణ్యాల గురించి ఎవరు పట్టించుకుంటారు? అని మరోకరు అండగా నిలుస్తున్నారు. మీరు నిజంగా డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? మీ ఆహారాన్ని తీసుకోండి. రేటింగ్ ఇవ్వండి అది చాలు’ అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి : ప్రధానిగా నాకు అవకాశం వచ్చింది -
ఈ చెత్త పనేంటి దర్శన్.. ఇంకా మార్పు రాకుంటే ఎలా..?
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మీడియా పట్ల అసభ్య రీతిలో ప్రవర్తించాడు. బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న దర్శన్‌ను కలుసుకునేందుకే ఆయన కుటుంబ సభ్యులు తాజాగా వచ్చారు. భార్య విజయలక్ష్మి, సోదరుడు దినకర్, లాయర్ సునీల్ జైలుకు చేరుకొని ములాఖత్ అయ్యారు, అర్ధగంటకు పైగా విడివిడిగా మాట్లాడారు. ఈ క్రమంలో దర్శన్‌కు డ్రైఫ్రూడ్స్, బిస్కెట్లు, దేవుని ప్రసాదం ఆమె అందజేశారు.జైలు ఆవరణలో లాయర్‌తో మాట్లాడేందుకు దర్శన్ వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న కన్నడ మీడియా ఆయన్ను కవరేజ్ చేసింది. అదేదో నేరం అయినట్లుగా మీడియా సిబ్బందికి మిడిల్ ఫింగర్‌ను చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సుమారు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నప్పటికీ దర్శన్‌కు ఏమాత్రం అహం తగ్గలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదో గొప్పగా సాధించి జైలుకు ఏమైనా పోయావా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే దర్శన్ ట్రాక్ రికార్డ్ అంతా వివాదస్పందంగానే ఉంటుందని చెబుతున్నారు. తన భార్యతో గొడవపడి గతంలో కూడా జైలుకెళ్లాడు.. ఆపై ఓ రెస్టారెంట్లో దాడికి పాల్పడి పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాడు.. తన మేనేజర్ మిస్సింగ్ కేసులో దర్శన్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఆయన చుట్టూ వివాదాలే ఉన్నాయంటూ కొందరు గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్య సంజ్ఞలే చేస్తారంటూ పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ, రాధిక శరత్‌కుమార్ సెల్ఫీ.. ఎక్కడో తెలుసా..?ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లతో ఇబ్బందిపెడుతున్నాడని అభిమాని రేణుకాస్వామిని దర్శన్ చంపించారని ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అనంతరం 3,991 పేజీలతో ఛార్జిషీట్ రెడీ చేసి కోర్టుకు అందించారు. రేణుకాస్వామిని దర్శన్ కాలితో తన్నాడమే కాకుండా పవిత్ర గౌడకు చెప్పులు ఇచ్చి కొట్టిపించాడని ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. Darshan can be seen showing Middle finger to media. .Media atleast stop the witch hunt and leave him alone. Let the law take it's course pic.twitter.com/XaXgRSJgxV— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) September 12, 2024 -
నటుడు దర్శన్ కస్టడీ ముగింపు.. బెయిల్ కోసం దరఖాస్తు
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. వారిద్దరితో పాటు మరో 15 మంది పాత్ర కూడా ఉన్నట్లు 3,991 పేజీలతో చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నిందితుల జ్యుడీషియల్ కస్టడీ గడువు సెప్టెంబర్ 9న సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నటుడు దర్శన్ సహా నిందితులంతా రేపు జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుకానున్నారు. ఇతర నిందితులను మైసూరు, తుమకూరు, షిమోగా, ధార్వాడ్, బెల్గాం, విజయపుర, కలబురగి జైలుకు తరలించారు. నిందితుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుండడంతో నిందితులను తమ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ మొత్తం 17 మంది నిందితులకు అందజేయనున్నారు. చార్జిషీటు అందిన తర్వాత చాలా మంది నిందితులు రేపు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును సమర్పించినందున ప్రధాన నిందితులైన దర్శన్, పవిత్రగౌడ్ సహా సోమవారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత
హీరోయిన్ ప్రణీత రెండోసారి తల్లయ్యారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆమెకు ఆర్నా అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ప్రణీత 2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కాస్త ఆమె బ్రేక్ ఇచ్చారు.ప్రణీత కూతురు ఆర్నా తన తమ్ముడిని చూసి 'బేబి' అని పిలుస్తూ తెగ సంబరపడితోంది. మొదటిసారి డెలివరీ సమయంలో ఉన్న కంగారు ప్రస్తుతం తనకు లేదని ప్రణీత తెలిపింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రణితకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రణీత అమ్మగారు గైనకాలజిస్టు అని తెలిసిందే. మొదటి కాన్పు ఆమె ఆసుపత్రిలోనే జరిగింది. ఇప్పుడు కూడా అక్కడే తను రెండో బిడ్డకు జన్మనిచ్చారు. గైనకాలజిస్టుగా ఎంతో అపార అనుభవం ఉన్నా డాక్టర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. నటి ప్రణీత కన్నడ, హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. 2010లో పోక్రీ కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. -
బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. భర్త ఎమోషనల్ పోస్ట్!
యంగ్ హీరో డార్లింగ్ కృష్ణ తండ్రయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమకు కూతురు పుట్టిందని ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ప్రయాణంలో తన భార్యను చూసి గర్వపడుతున్నానని హీరో ఎమోషనల్ అయ్యారు. ప్రపంచంలో ఇలాంటి బాధను భరిస్తోన్న తల్లులందరికీ నమస్కారం అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. లవ్ మాక్‌టైల్ అనే కన్నడ సినిమాతో డార్లింగ్ కృష్ణ, నటి మిలానా నాగరాజ్ జంటగా నటించారు. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా నమ్మ దునియా నమ్మ స్టైల్, చాల్తి అనే సినిమాలలో నటించారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుకలో కన్నడ చిత్రసీమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) -
దర్శన్‌పై చార్జిషీట్.. రిక్వెస్ట్ మేరకు సర్జికల్ కుర్చీ
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి ప్రముఖ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడతో పాటు 17 మంది నిందితులపై పోలీసులు 4,500 పేజీల చార్జిషీట్ దాఖలుకు సిద్ధమయ్యారు. కేసు నమోదు అయ్యి మూడు నెలలు అయినా ఇప్పటికీ పూర్తి నివేదికను పోలీసులు సమర్పించలేదు. తాజాగా అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేసిన పోలీసులు ఇక చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. 200కు పైగా సాక్ష్యాధారాలతో వారు కోర్టు ముందుకు వెళ్లనున్నారు.సినీ నటుడు దర్శన్ వినతి మేరకు జైలు శాఖ సర్జికల్ టాయిలెట్ కుర్చీని అందజేశారు. వెన్నుముక సమస్యతో దర్శన్ బాధపడుతున్నట్లు ఆయన సతీమణి విజయలక్ష్మీ, న్యాయవాదితో జైలు అధికారులను ఆశ్రయించారు. ఆ సమయంలో దర్శన్ మెడికల్ రిపోర్ట్‌లను అందించారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో సర్జికల్ కుర్చీని జైలులో ఉన్న దర్శన్‌కు అందించారు. ఆపై వెన్నెముక సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను దర్శన్‌కు వైద్యులు సూచించారు. -
'ఆ డైరెక్టర్ నా పర్సనల్ ఫోటోలు నటి రేవతికి పంపాడు'
మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి తెలుపుతూ జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదిక వెళ్లడించింది. దీంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై కోజికోడ్‌లోని మంకావ్కు చెందిన సజీర్ (33) సంచలన ఆరోపణలు చేశాడు. 2012లో తనపై దర్శకుడు రంజిత్ లైంగికదాడికి పాల్పడ్డారని కేరళ డీజీపీకి లేఖ రాశాడు. ప్రస్తుతం కోజికోడ్‌లోని ఓ స్టార్ హోటల్లో ఉద్యోగం చేస్తున్న సజీర్.. సీనియర్ హీరోయిన్ రేవతి పేరును తెరపైకి తీసుకొచ్చి పెద్ద దుమారమే రేపాడు.2012లో కోజికోడ్‌లో బవుత్తియుడే నమతిల్ సినిమా షూటింగ్ సమయంలో రంజిత్‌ను తొలిసారి కలిశానని సజీర్ ఇలా తెలిపాడు. 'ఆ సమయంలో నేను డిప్లొమా చదువుతున్నాను. ఆ సినిమా సెట్ వద్దకు నేనూ వెళ్లాను. ఏదైనా సినిమాలో ఛాన్స్ కావాలని నేను అడగ్గానే వెంటనే ఒక టిష్యూ పేపర్‌పై తన ఫోన్ నంబర్ రాసి ఇచ్చాడు. ఆపై బెంగళూరులోని తాజ్ హోటల్‌కు నన్ను ఆహ్వానించాడు. అయితే, రాత్రి 10 గంటల సమయంలో హోటల్‌కు నేను వెళ్లాను. వారు నన్ను లోపలికి అనుమతించలేదు. అయితే, రంజిత్ సూచనమేరకు వెనుక గేటు ద్వారా లోపలికి వెళ్లాను. గదిలోకి నేను వెళ్లిన సమయంలో దర్శకుడు రంజిత్ మద్యం మత్తులో ఉన్నాడు. అప్పుడు నన్నూ మద్యం తీసుకోమని చెప్పడంతో జీవితంలో మొదటిసారి సేవించాను. కళ్లు బాగున్నాయంటూ దగ్గరికొచ్చి నా దుస్తులు తొలగించి రాత్రంతా లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ సమయంలో నా ఫోటోలను కూడా రంజిత్ తీశాడు. అని సజీర్ ఫిర్యాదు చేశాడు.'దర్శకుడు రంజిత్ గదిలోకి వెళ్లినప్పుడు ఆయన ఒక నటితో మాట్లాడుతున్నాడు. ఆ నటి రేవతి అని రంజిత్ నాకు చెప్పాడు. రేవతి, రంజిత్‌కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. రంజిత్ నా ఫోటో తీసి వారికి పంపాడు. ఎవరికి పంపారు అని నేను అడిగాను. అప్పుడు రేవతికి పంపించానని దర్శకుడు రంజిత్ సమాధానమిచ్చాడు. ఫోటో చూసి రేవతికి నచ్చిందని కూడా నాతో చెప్పాడు. కానీ, అటువైపు నిజంగానే రేవతినే అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. రంజిత్ నాతో చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాను.రంజిత్ బాలకృష్ణన్‌పై బెంగాలీ నటి శ్రీలేఖ కూడా కొద్దిరోజుల క్రితమే కీలక ఆరోపణలు చేసింది. రంజిత్ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని బహిరంగంగానే ఆమె చెప్పుకొచ్చింది. 2009లో ఒక సినిమా ఆడిషన్ కోసం సంప్రదిస్తే.. ఆ సమయంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. నటి ఆరోపణలపై రంజిత్ స్పందించాడు. అవన్నీ ఆరోపణలు మాత్రమేనని ఆయన అన్నాడు. తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలకు పాల్పడుతున్నారని వెళ్లడించాడు. అయితే, తాజాగా ఆరోపణలు చేసిన సజీర్ గురించి ఇంకా ఆయన రియాక్ట్ కాలేదు. -
హై సెక్యూరిటీ మధ్య మరో జైలుకు దర్శన్ తరలింపు
కన్నడ నటుడు దర్శన్‌ను బెంగుళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు నేడు (ఆగష్టు 29) తరలించారు. బెంగుళూరు జైలు అధికారులు దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు అందుకు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ అంశంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.కన్నడ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్‌ను గురువారం ఉదయం బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. బెంగళూరు పోలీసుల ఎస్కార్ట్‌తో సహా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆయనను తీసుకెళ్లారు. బల్లారిల సెంట్రల్ జైలులో కూడా ప్రత్యేకంగా నియమించబడిన హై-సెక్యూరిటీ సెల్లో దర్శన్‌ను ఉంచారు. బెంగళూరు పరప్పన అగ్రహార నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసు వాహనం బయలుదేరి ఉదయం 9.45 గంటలకు బళ్లారి సెంట్రల్ జైలుకు చేరుకుంది. నల్లటి టీషర్ట్ ధరించి కనిపించిన దర్శన్.. కుడి చేతికి బ్యాండేజీతో ఉన్నాడు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఎంట్రీ బుక్‌పై సంతకం చేసిన తర్వాత జైలు వైద్యులు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, ఆపై హై-సెక్యూరిటీ సెల్‌కు పంపారు.ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మీదుగా వెళ్లిన దర్శన్ వాహనానికి స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, జైలు సూపరింటెండెంట్ లత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, దర్శన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఆయన అభిమానులను జైలు దగ్గరకు వెళ్లకుండా అన్నీ మార్గాలను బారికేడ్లతో మూసేశారు.దర్శన్‌పై మరో రెండు కేసులు దర్శన్‌కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్‌స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు. -
ఆయన అడిగిన ప్రశ్న ఎంతో బాధించింది: నటి అంజలి అమీర్
మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారిన హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మాలివుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ నుంచి పలు సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు హీరోయిన్లు, ఇతర నటులు గతంలో తమ చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా మలయాళ తొలి ట్రాన్స్‌జెండర్ నటి అంజలి అమీర్ తన అనుభవాలను పంచుకున్నారు.మలయాళ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అంజలి అమీర్ ఇలా పంచుకున్నారు. ' 2018లో మమ్ముట్టి నటించిన పెరున్బు అనే తమిళ సినిమాలో నేను కీలక పాత్ర పోషించాను. ఆ సినిమాలో సూరజ్ వెంజరమూడ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నుంచి నాకు ఒక ప్రశ్న ఎదురైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలాగా ఎలా సుఖం పొందుతారని సూరజ్ వెంజరమూడ్ నన్ను ప్రశ్నంచారు. అప్పుడు నేను చాలా కలత చెందాను. ఆయన అడిగేంత వరకు, నేను అలాంటి బాధాకరమైన అనుభవాలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను బలంగా ఉన్నాను, కానీ ఈ ప్రశ్న నాకు చాలా కోపం తెప్పించింది. అతడిని హెచ్చరించి మమ్ముట్టికి, దర్శకుడికి తెలియజేశాను. ఆపై వెంటనే సూరజ్ వెంజరమూడ్ క్షమాపణలు చెప్పాడు. మరలా నాతో అలా మాట్లాడలేదు. నేను ఆయన్ను అభినందిస్తున్నాను.' అని అంజలి అమీర్ అన్నారు. సూరజ్ వెంజరమూడ్ టాలీవుడ్‌కు పరిచయమే.. డ్రైవింగ్ లైసెన్స్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, జనగణమన చిత్రాలతో పాటు నాగేంద్రన్స్ హానీమూన్స్ వెబ్ సిరీస్‌తో ఆయన తెలుగు వారికి దగ్గరయ్యాడు.ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారని అంజలి పేర్కొంది. అన్ని విభాగాల్లో మాదిరి ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడువాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ కొందరు మాత్రమే కాంప్రమైజ్‌లు, ఫేవర్లు అడిగేవాళ్లు ఉన్నారని అంజలి పేర్కొంది. -
సినీ నటిపై సీనియర్ నటుడి ఫిర్యాదు
మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం పెద్ద దుమారమే రేగుతుంది. మలయాళ ప్రముఖ నటుడు సిద్ధిఖీపై నటి రేవతి సంపత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనపై సిద్ధిఖీ అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అయితే, తాజాగా నటి రేవతి సంపత్‌పై డీజీపీకి సిద్ధిఖీ ఫిర్యాదు చేశారు. చాలా ఏళ్లుగా ఆమె తన గురించి తప్పుగా మాట్లాడుతుందని, తన పరువును బజారుకు లాగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సిద్ధిఖీ గురించి రేవతి చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయి.. సుమారు ఎనిమిదేళ్ల క్రితం సోషల్‌మీడియా ద్వారా సిద్ధిఖీ పరిచయం అయ్యాడని రేవతి సంపత్ తెలిపింది. సనిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మించి తనను ఒక హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. 'ప్రస్తుతం అందరూ సిద్దిఖీ మంచివాడు అంటున్నారు. ఆయన నిజస్వరూపం చాలామందికి తెలియదు. ఆయనలోని మరో కోణాన్ని నేను చూశా. తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌కు నన్ను తీసుకెళ్లి అక్కడ నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాపై అత్యాచారం చేశాడు. ఆయనొక క్రిమినల్. ఆయన వల్ల నా కెరియర్ మొత్తం నాశనం అయింది.' అని తెలిపింది.మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. అందులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మాలీవుడ్ పరిశ్రమలో ఉండే మహిళలు కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేసింది.