
తెలుగునాట నాన్ బాహుబలి రికార్డులన్నింటిని చెరిపేసిన భారీ చిత్రం రంగస్థలం. రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామా సంచలన విజయం సాధించటం మాత్రమే కాదు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
తమిళ, మళయాల భాషలతో పాటు కన్నడ నాట కూడా ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కానుంది. కొన్ని దశాబ్దాలుగా కన్నడ ఇండస్ట్రీ డబ్బింగ్ సినిమాలను కర్ణాటకలో రిలీజ్ చేసేందుకు అనుమతించటం లేదు. కానీ కేజీయఫ్ రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. ఆ సినిమా అన్ని భాషల్లో విడుదల కావటంతో ఇతర భాషా చిత్రాలనుకూడా కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు అనుమతిస్తున్నారు.
దీంతో దశాబ్దాల తరువాత కన్నడలో డబ్ అవుతున్న తెలుగు సినిమా రంగస్థలం రికార్డ్ సృష్టించనుంది. తెలుగు నాట సంచలనాలు నమోదు చేసిన రంగస్థలం తమిళ, మళయాల, కన్నడ భాషల్లో కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా.. అన్ని భాషల్లో రామ్ చరణ్‌కు మార్కెట్ ఓపెనవుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment