Rangasthalam
-
సెట్స్ పైకి రంగస్థలం సీక్వెల్
-
సమంతను మేనేజ్ చేయడం కష్టం.. ఆ సినిమాలో వద్దనుకున్నా కానీ.. : సుకుమార్
సమంత నటన గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఎలాంటి పాత్రలోనైనా ఆమె ఒదిగిపోతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ పాత్ర ఏదైనా..వన్స్ సామ్ చేతికి వచ్చిదంటే..ఇక అందులో వేరే హీరోయిన్ని ఊహించుకోలేం. సామ్‌లోని మరో కోణాన్ని బయటకు తీసిన సినిమా ఏదైనా ఉంటే అది రంగస్థలం అనే చెప్పాలి. అంతకు ముందు సమంత అలాంటి పాత్రను పోషించలేదు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. రామ్ చరణ్ పాత్రతో పాటు సామ్ పాత్ర కూడా అందరికి గుర్తిండిపోతుంది. అయితే ఆ పాత్రకు మొదట సమంతను అనుకోలేదట దర్శకుడు సుకుమార్. చివరి నిమిషంలో ఆమెను తీసుకున్నాడట. కానీ షూటింగ్ సమయంలో సామ్ నటన చూసి సుక్కు ఆశ్చర్యపోయాడట. ఆ పాత్రకు సమంత తప్ప ఇంకెవరు న్యాయం చేయలేకపోయేవారని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్యూలో ఆ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఆ పాత్రను ఆయనను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు. కానీ సమంత పోషించిన లక్ష్మీ పాత్రను మాత్రం ఆమె కోసం రాయలేదు. ఒక కొత్త అమ్మాయిని పెట్టుకోవాలనుకున్నాం. సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు స్టార్స్ అయితే నేను సెట్లో మేనేజ్ చేయలేనేమో అనుకున్నా. కానీ సినిమా స్క్రిప్ట్ ప్రకారం మంచి ఆర్టిస్ట్, తెలుగు వచ్చిన హీరోయిన్ కావాలి. సమంత అయితే పల్లెటూరి అమ్మాయి పాత్రకు సరిపోతుందని భావించి ఆమెను తీసుకున్నాం. షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రతి సీన్లోనూ ఆమె పలికించిన హావభావాలు అద్భుతం. నేను సినిమాలు తీసినంత కాలం సమంతతో చేస్తూనే ఉంటా’ అని సుకుమార్ సమంతను పొగడ్తలో ముంచేశాడు. -
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని భోగట్టా. చరణ్ సినిమాలో సంజయ్ దత్? రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక హిందీలో రామ్‌చరణ్ చేసిన తొలి చిత్రం ‘తుఫాన్’లో సంజయ్ దత్ ఓ రోల్ చేశారు. మరి.. రామ్‌చరణ్, సంజయ్ దత్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్
జబర్దస్త్ కమెడియన్ మహేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం సినిమాతో ఓ రేంజ్లో గుర్తింపు వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఫుల్ ఎమోషనల్ సీన్స్‌లో మహేశ్ అద్భుతమైన నటనతో మెప్పించారు. అతనికి యాస, లుక్ మహేశ్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం మహేశ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్‌పై మహేశ్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: 'పుష్ప రాజ్' తగ్గేదేలే.. భారీ ధరకు ఆడియో రైట్స్!) మహేశ్ మాట్లాడుతూ.. 'చైతన్యతో నేను ఓసారి ట్రావెల్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నాకు డ్యాన్స్ నేర్పించారు. చైతన్య మంచి టాలెంటెడ్. ఆయన అలా చేసుకున్నాడంటే ఎంత స్ట్రగుల్ అయ్యాడో. ఆరోజు చాలా బాధపడ్డా. అంత క్రేజ్ ఉన్న ఆయనే అలా చేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి?' అని అన్నారు. రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడుతూ..'కానీ నాకు అయితే రెమ్యూనరేషన్స్ బాగానే వస్తున్నాయి. నాకు ప్రారంభంలో తక్కువగానే ఉండేది. ఎందుకంటే మనకు అవకాశం రావాలి కదా. క్రేజ్‌ను బట్టి అమౌంట్ డిసైడ్ చేస్తారు. ఫస్ట్ తక్కువ డబ్బులు వచ్చినా మనం కష్టపడాలి. ఆ తర్వాతే నాకు బాగా డబ్బులొచ్చాయి. కామెడీలో నాకు రవితేజ టైమింగ్ అంటే చాలా ఇష్టం. సీన్ వందశాతం నిలబెట్టడంలో ఆయన బెస్ట్. ఎలాంటి సీన్ అయినా పండించగలరు. నా ఫేవరేట్ హీరోయిన్ అంటే అనుష్క. నా చిన్నప్పుడు అయితే రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. అయితే ఆమెను ఎప్పుడు కలవలేదు.' అని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్) -
రంగస్థలం
లక్నో సాంస్కృతిక వైభవ మణిపూసలలో రంగస్థలం ఒకటి. ఆ వెలుగు మరింత ప్రజ్వరిల్లేలా ఔత్సాహికులు నాటకరంగంలో భాగం అవుతున్నారు. అయితే రంగస్థలం అంటే యువతరం మాత్రమేనా? ‘కానే కాదు’ అంటోంది ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ. రచనల నుంచి నటన వరకు పెద్దలలోని సృజనాత్మక శక్తులను రంగస్థలంపైకి సాదరంగా తీసుకురావడానికి ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ పేరుతో నాటకరంగ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది... థియేటర్ గ్రూప్ ‘మంచ్కీర్తి సమితి’ లక్నో (ఉత్తరప్రదేశ్)లో నిర్వహించిన ‘30 డేస్ 30 ప్లేస్’ కు అనూహ్యమైన స్పందన లభించింది. విశేషం ఏమిటంటే ఆ జామ్ ప్యాక్డ్ థియేటర్లలో ఎక్కువమంది వృద్ధులు కనిపించారు. నాటకాలు చూస్తున్నప్పుడు వారిలో వయసు భారం మాయమైపోయింది. ప్రదర్శన పూర్తయిన తరువాత టీ తాగుతూ వారు ఆ నాటకాన్ని లోతుగా విశ్లేషించుకునే దృశ్యాలు ఎన్నో కనిపించాయి... దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్నోకు చెందిన ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో సీనియర్ సిటీజన్లతో నలభైరోజుల పాటు థియేటర్ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ‘వారి కోసం వారి చేత’ ట్యాగ్‌లైన్‌తో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌లలో రచన, నటన, దర్శకత్వం, సంగీతం... మొదలైన అంశాలలో శిక్షణ ఉంటుంది. దీంతో పాటు తమ ఏరియాలో తమ వయసు ఉన్న వ్యక్తులను సమీకరించి ‘స్టోరీ టెల్లింగ్’లాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో చెబుతారు. ‘సీనియర్ సిటిజన్స్ కోసం థియేటర్ అనేది మంచి కాన్సెప్ట్. అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. కొత్త శక్తిని ఇస్తుంది’ అంటున్నాడు థియేటర్ డైరెక్టర్ సలీమ్ ఆరీఫ్. ‘నాటకరంగం అనేది అత్యంత ప్రభావశీలమైనది. ఈ బలమైన మాధ్యమం పెద్దల నీడలో మరింత బలం పుంజుకుంటుంది. వయసు ఎన్నో అనుభవాలను ఇస్తుంది. ఆ అనుభవ జ్ఞానం నాటకాల్లో ప్రతిఫలిస్తుంది. వృద్ధులు అనగానే ప్రేక్షకుల్లో కూర్చుని నాటకం వీక్షించడానికే పరిమితం కానవసరం లేదు. ఇప్పుడు వారిని రంగస్థలం ప్రేమగా, అభిమానంగా ఆహ్వానిస్తోంది’’ అంటున్నాడు రంగస్థల ప్రముఖుడు సంగమ్ బహుగుణ. పెద్దల చేత రూపుదిద్దుకుంటున్న నాటకాలు, పెద్దలు నటించే నాటకాలు ఎలా ఉండబోతున్నాయి? కేవలం.. ఒంటరి ఏకాంతాలు, వయసు సమస్యలు, కుటుంబ సమస్యలు... ఇలా ఏవోవో సమస్యలు ఉండబోతున్నాయా? ‘కానే కాదు’ అంటుంది పీపుల్స్ ఇన్షియేటివ్. వారు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. తాము నడిచొచ్చిన బాటను గుర్తు చేస్తూ ఈ తరానికి సానుకూలశక్తిని పంచుతారు. ఇంతకంటే కావాల్సినదేముంది! నాటకాల పాఠశాల వయసు పైబడినంత మాత్రాన అది నటనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని నిరూపిస్తున్న ప్రతిభావంతులలో సోహైలా కపూర్ ఒకరు. ఘనమైన ఖాన్దాన్ నుంచి వచ్చిన కపూర్ నటి, రచయిత్రి, మోడ్రన్ థియేటర్ వ్యవస్థాపకురాలు. ఈ తరం నటులతో కలిసి రంగస్థలం, జీ థియేటర్లలో నటిస్తోంది కపూర్. ఆమెతో నటించడం అంటే ఔత్సాహిక నటులకు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్నంత అదృష్టం. దిల్లీలో పుట్టిన కపూర్ హైస్కూల్ రోజుల్లోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ‘వయసు పైబడగానే విషాదం మూర్తీభవించే పాత్రలకు మాత్రమే మహిళా నటులు పరిమితం అవుతున్నారు. ఇది సరికాదు. వృద్ధాప్యం అంటే విషాదం మాత్రమే కాదు. ఎన్నో బలమైన పాత్రలు మన కోసం ఎదురుచూస్తున్నాయి. వోటీటీ పుణ్యమా అని సీనియర్ నటీమణులకు మూస పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రలలో నటించే అవకాశం దొరుకుతుంది’ అంటోంది కపూర్. -
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్
-
క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. ఈ సినిమాలు సూపర్ హిట్
ఫస్ట్ సీన్ అదిరిపోవాలి. హీరో ఇంట్రడక్షన్ కేక పుట్టించాలి. ఇంటర్వెల్ బ్యాంక్ మెస్మరైజ్ చేసేలా ఉండాలి. సినిమా అంతా బాగా రావాలనే తీస్తారు కానీ… ఇలా కొన్ని సీన్స్ మీద డైరెక్టర్స్ ప్రత్యే క శ్రద్ధ పెడతారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేస్తూ కథలో లీనం అయ్యేలా చేయాల న్నదే మూవీ మేకర్స్ లక్ష్యం. మరి క్లైమాక్స్ సంగతేంటి ? అత్యంత కీలకం ఇదే. సినిమా అంతా బావుండి చివర్లో చెడిందనుకోండి…ఆడియన్స్ పెదవి విరిచేస్తారు. మూవీ యావరేజ్‌గా ఉన్నా…ఎండింగ్ అదిరిదంటే రిజల్ట్ హిట్టే. మరి అలాంటి క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సినిమాలపై లుక్కేద్దాం. ఉప్పెన సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో తమ ప్రేమకి అడ్డుపడుతున్న వాళ్లని ఎదిరించి ప్రేమికులు ఒకటవుతారు లేకపోతే పెద్దల పంతాలకు బలైపోతారు. అదీ కాకుంటే హీరో, హీరోయిన్లలో ఒకరు చనిపోతారు. మరొకరు జీవచ్ఛావంలా మిగిలిపోతారు. ఎన్ని ప్రేమకథాచిత్రాలొచ్చినా క్లైమాక్స్‌లు మాత్రం ఇవే. కానీ…ఉప్పెన మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ముగింపు తీసు కుంది. మగాడు అన్న పదానికి సరికొత్త అర్థం ఇస్తూ…ఎవరూ ఊహించని క్లైమాక్స్‌ని ఫిక్స్ చేసేశాడు దర్శకుడు బుచ్చిబాబు. తొలి రోజు క్లైమాక్స్ కేంద్రంగా నెగిటివ్ టాక్ నడిచినా…ఆ తరహా ముగింపుకి ప్రేక్షకులు మద్దుతు ప్రకటించారు. ఉప్పెనని వంద కోట్ల క్లబ్లో కూర్చోపెట్టేశారు. రంగస్థలం రామ్ చరణ్ ‘రంగస్థలం’ క్లైమాక్స్ కూడా ఊహించని ట్విస్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. మొదటి నుంచి జగపతిబాబునే విలన్‌గా చూపిస్తూ వస్తారు. నిజానికి ప్రెసిడెంట్‌గారు విలనే. కానీ…మూవీలో అసలు విలన్ మాత్రం కాదు. ఆ విషయం చివరి వరకు ప్రేక్షకులు గమనించకుండా స్క్రీన్‌ప్లే ని చక్కగా రెడీ చేసుకున్నాడు సుకుమార్. చివర్లో ప్రకాష్‌రాజ్ విలన్ అని తెలిసే సరికి సగటు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్‌తో పాటుగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో థియేటర్ నుంచి బయటకుకొచ్చారు. ఆర్ఎక్స్ 100 క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని దర్శకుడు డిసైడ్ అయినప్పుడు… ఊహించని మలుపులు. ముసుగులేసుకున్న పాత్రలు లాంటి వాటితోనే కథని అల్లుకుంటాడు. అలాంటి ఒక కథతో యూత్ అటెన్షన్‌ని గెయిన్ చేసిన చిత్రం ఆర్ఎక్స్ 100. పిల్లారా పాటలో సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసింది ఆర్ఎక్స్ 100. ఫస్ట్ మూవీతోనే కార్తికేయ హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. పాయల్ రాజ్పుట్ కి గ్లామర్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అన్నింటికీ మించి క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ ఊహాలకు అందలేదు. యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్‌లైన్‌తో మొదటి నుంచి ఆసక్తి రేపిన ఆర్ఎక్స్ 100…క్లైమాక్స్ కోణంలో మాత్రం అలజడి రేపింది. హీరోయిన్ తండ్రి విలన్ అన్నట్టుగా సినిమా ని ముందుకు తీసుకువెళ్లి…మరొకరిని విలన్‌గా చూపించడం చాలా సినిమాల్లో చూసిందే. కానీ దర్శకుడు అజయ్ భూపతి ఏకంగా హీరోయిన్నే విలన్‌గా చూపించేసి ఆడియన్స్‌ని షాక్‌కి గురిచేశాడు. అలానే…చివరకు హీరోని చంపేసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పూర్తి స్థాయి లో పెంచేసి థియేటర్ నుంచి బయటకు పంపాడు. కేరాఫ్ ‘కంచరపాలెం’ చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కేరాఫ్ ‘కంచరపాలెం’ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు వీళ్లందరినీ దర్శకుడు ఎలా కలుపుతాడు ? కలపడా ? ఎవరి కథ వారిదేనా ? ఇలా రకరకాల సందేహాలు సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులని వేధిస్తూనే ఉంటాయి. చివర్లో ఇవి నాలుగు కథలు కాదు. ఒక కథే. ఆ నలుగురు…ఈ రాజే అంటూ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్‌కి థియేటర్లు ఈలలతో మార్మో గాయి. ఎలాంటి సినిమా అయినా సరే…మూవీ స్టార్టింగ్‌లో ఈలలు వినిపిస్తాయి. లేకపోతే పవర్ఫుల్ డైలాగో, అదిరిపోయే పాటో వచ్చినప్పుడు విజిల్స్ కామన్. కానీ క్లైమాక్స్‌తో ప్రేక్షకు లు చప్పట్లు, విజిల్స్‌తో సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. ఆ అరుదైన అనుభ వాన్ని కేరాఫ్ కంచరపాలెం సినిమా సొంతం చేసుకుంది. ఎవరు డిఫరెంట్ క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ని షాక్ ఇచ్చిన చిత్రాల్లో ఎవరు ఒకటి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు గురించి చెబుతూ ఉండటంతో సినిమా మొదలవుతుంది. హఠాత్తుగా ఆ కేసు నుంచి ఆడియన్స్‌కి ఫోకస్‌ని తప్పించి, ఇంటర్వెల్ పాయింట్‌కి అసలు కథతో లింక్ చేయడం. అసలు ఈ స్క్రీన్‌ప్లే నే భలే ట్విస్ట్‌గా అనిపిస్తే…ఇక బాధితురాలే నేరస్తురాలు. హీరోయినే విలన్ అన్న ట్విస్ట్ మరింతగా ప్రేక్షకులకి మజాని ఇస్తుంది. మత్తువదలరా సింపుల్ క్రైమ్ కథని కాంటెంపరరీ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా వెండితెర పై ప్రజెంట్ చేసిన చిత్రం మత్తువదలరా. సీరియస్ సీన్స్‌లోనూ కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడటంతో తొలి రోజు నుంచే సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలో జరిగే చోటా స్కామ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కథ మొదలవుతుంది. ఒక 5 వందల రూపాయల కోసం చేసిన చిన్న తప్పు కథానాయకుడి జీవితాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. విలన్ ఎవరన్నది రివీల్ అయిపోయా క ఇక క్లైమాక్స్ రెగ్యులర్ ఫార్మెట్‌లోనే ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ… క్లైమాక్స్‌లో ఊహించని విధంగా నోట్ల రద్దు అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. హిట్ హీరో నాని నిర్మాత అనగానే…హిట్ మూవీ చుట్టూ ఒక అటెన్షన్ ఏర్పడింది. అనుకున్నట్టుగా నే డిఫరెంట్ క్లైమాక్స్‌తో…ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లో కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయి, ఆ కేస్కి లింక్ అవుతూ మిస్ అయిన మరో యువతి. ఆడి యన్స్ని ఇన్‌స్టంట్‌గా ఎంగేజ్ చేయడానికి దర్శకుడు శైలేష్ కొలను చేసిన ఈ సెటప్ బానే వర్కౌట్ అయింది. హీరోతో పాటుగా ఉంటూ కేసుని పరిశోధన చేస్తున్న అతని మిత్రుడే విలన్ అంటూ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్…థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మిస్టరీ చేధించే డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కానీ ఎక్కువుగా రావు. ఎందుకంటే…మిస్టరీ జానర్లో సస్పెన్స్‌ని హోల్డ్ చేసి ఉంచడం చాలా కీలకం. అలాంటి కీలక మైన అంశాన్ని వెండితెర మీద చక్కగా పెర్ఫామ్ చేయడంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. బాధితురాలు అన్నకున్న క్యారెక్టరే…అస్సలు ఈ భూమ్మీదే లేదనుకున్న క్యారెక్టరే…విలన్ అన్న ట్విస్ట్…మిస్టరీ జానర్ ని మజా చేస్తాయి. ఆ! సినిమాకి క్లైమాక్స్ బలం కావాలి. సినిమాకి క్లైమాక్స్ మరింత మైలేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ …క్లైమాక్స్ ట్విస్ట్ మీదే ఆధారపడి కథని రాసేసుకుని, సినిమా తీసేస్తే…అది ఆ! మూవీ నే అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. క్లైమాక్స్‌కి వచ్చిన తర్వాత కానీ దర్శకుడి ప్రతిభ అర్థం కాదు. అయితే…అప్పటి దాకా నడిచిన సినిమా మొత్తం ఆడియ న్స్‌కి అయోమయంగానే అనిపిస్తుంది. దీంతో…ఆ ! చిత్రం హిట్ మూవీస్ జాబితా లోకి అయితే ఎక్కలేదు. - దినేష్ రెడ్డి వెన్నపూస, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ -
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ ..
-
రంగస్థలం - 2 షూటింగ్ ఎప్పుడంటే ..!
-
వైరల్: చదరంగ స్థలం
చదరంగం చదరపు బల్ల రంగస్థలం అయితే... రాజు, రాణి, సిపాయిలకు ప్రాణం వస్తే... ‘అహో!’ అనిపించే దృశ్యం కనువిందు చేస్తే... ‘అద్భుతం’ అనిపిస్తుంది. ‘చతురంగం’ వీడియో ద్వారా ఆ అద్భుతాన్ని ప్రపంచానికి చేరువ చేశారు కలెక్టర్ కవితారాము... ప్రపంచంలోని చదరంగ ప్రేమికుల దృష్టి ఇప్పుడు చెన్నైపై ఉంది. అక్కడ జరుగుతున్న ఆటల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సాంస్కృతిక కళారూపాలు మరో ఎత్తు. ‘చెస్ ఒలింపియాడ్–2022’ ప్రమోషన్లో భాగంగా వచ్చిన ‘చతురంగం’ అనే వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘దృష్టి మరల్చనివ్వని అద్భుతదృశ్యాలు’ అని వేనోళ్లా పొగుడుతున్నారు నెటిజనులు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వీడియో గురించి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. పుదుకొటై్ట కలెక్టర్ కవితారాము ఈ ‘చతురంగం’ నృత్యరూప కాన్సెప్ట్‌ను డిజైన్ చేయడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. కవితారాము స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి. ఎన్నో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ‘నృత్యంతో పాతికసంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. చెస్ ఒలింపియాడ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియో రూపొందించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి, దృశ్యపరంగా అద్భుతం అనిపించాలి అనుకున్నాను. అందులో భాగంగానే ఆటకు, నృత్యాన్ని జత చేసి చతురంగంకు రూపకల్పన చేశాము’ అంటుంది కలెక్టర్ కవితారాము. ఈ వీడియోలో క్లాసిక్, ఫోక్, మార్షల్ ఆర్ట్స్ ఫామ్స్‌ను ఉపయోగించారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సందర్భాన్ని బట్టి పసుపు, నీలిరంగు లైటింగ్‌ను వాడుకోవడం బాగుంది. పుదుకొటై్ట సంగీత కళాశాలకు చెందిన ప్రియదర్శిని నలుపువర్ణ రాణి, చెన్నై అడయార్ మ్యూజిక్ కాలేజికి చెందిన సహన శ్వేతవర్ణ రాణి వేషాలలో వెలిగిపోయారు. ‘మహిళాదినోత్సవం సందర్భంగా ప్రియదర్శిని నృత్యాన్ని చూశాను. చతురంగం వీడియో గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె గుర్తుకువచ్చింది. ఇక సహన నృత్యం గురించి నాకు తెలుసు. ఎప్పటి నుంచో ఆమెతో పరిచయం ఉంది. ఇద్దరూ తమదైన నృత్యప్రతిభతో చతురంగంకు వన్నె తెచ్చారు’ అంటోంది కవితారాము. చదరంగంపై పావుల సహజ కదలికలను దృష్టిలో పెట్టుకొని మొదట్లో నృత్యాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే దీని గురించి చర్చ జరిగింది. క్రియేటివ్ లిబర్టీ తీసుకుంటూనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఎక్కువమంది కళాకారులు. దీంతో నృత్యరీతులకు సృజనాత్మకతను జోడించారు. నలుపువర్ణ రాణి, శ్వేతవర్ణ రాజును ఓడించడంతో వీడియో ముగుస్తుంది. ఇది యాదృచ్ఛిక దృశ్యమా? ప్రతీకాత్మక దృశ్యమా? అనే సందేహానికి కలెక్టర్ కవితారాము జవాబు... ‘కావాలనే అలా డిజైన్ చేశాం. అంతర్లీనంగా ఈ దృశ్యంలో ఒక సందేశం వినిపిస్తుంది. తెలుపు మాత్రమే ఆకర్షణీయం, అందం అనే భావనను ఖండించడానికి ఉపకరించే ప్రతీకాత్మక దృశ్యం ఇది. దీనిలో జెండర్ కోణం కూడా దాగి ఉంది.’ -
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
ఆ డైరెక్టర్ నేను మంచి స్నేహితులం: అనసూయ
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెర యాంకర్‌గా రాణిస్తునే ఇటూ వెండితెరపై అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ రంగస్థలం మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పెంచెసుకుంది. అందులో రంగమ్మత్తగా అనసూయకు ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన అనసూయను మోకాళ్లపైకి చీరకట్టుతో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయిన ఆమెను చూసి అందరూ షాకయ్యారు. అయితే రంగస్థలం షూటింగ్ సమయంలో తనని అందరూ రంగమ్మత్త అని పిలిచేవారని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో మరోసారి ఈ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా గురించి ఓ అసక్తికర విషయం చెప్పింది. అయితే బుచ్చిబాబు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగస్థలం సెట్లో డైరెక్టర్ సుకుమార్‌తో సహా అందరూ తనని రంగమమ్మత్తానే పిలిచేవారని, బుచ్చిబాబు కూడా అత్త అనే పిలిచేవాడని చెప్పింది. మూవీ సెట్లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవారమని, రంగస్థలం సమయంలో బుచ్చితో మంచి స్నేహం ఏర్పడిందని చెప్పింది. ‘రంగస్థలం షూటింగ్ నుంచి బుచ్చి, నేను మంచి స్నేహితులమయ్యాం, నా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంటాను. చెప్పాలంటే ఇండస్ట్రీలో నాకంత క్లోజ్ అయిన వ్యక్తి కూడా ఆయనే. ఈ క్రమంలో ఉప్పెన షూటింగ్ ఓ సారి మా ఇంటి సమీపంలోనే జరిగింది. అప్పుడు అత్త నేను మీ ఇంటి దగ్గర్లోనే ఉన్నా షూటింగ్ జరుగుతోంది. విజయ్ సేతుపతి కూడా ఉన్నారు ఆయనను కలవోచ్చని రమ్మని పిలిచాడు. వెంటనే నేను షూటింగ్ స్పాట్‌కు వెళ్లాను. అక్కడే విజయ్ సేతుపతిని కలిశాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక విజయ్ సేతుపతి అంటే పిజ్జా సినిమా నుంచే ఇష్టమని, ఆ తర్వాత 96 చూశాకా.. రామ్ పాత్రలో ఆయన ఇంకా నచ్చేశాడని చెప్పింది. అలా జరిగిన పరిచయంతోనే చెన్నైకి వెళ్లినప్పుడు కూడా ఆయనను కలిశానని అనసూయ పేర్కొంది. చదవండి: రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా.. -
రామ్‌చరణ్‌తో ఆ సీన్ చెప్పడానికి భయపడ్డా: సుకుమార్
క్రియేటీవ్ దర్శకుడు సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలుకొట్టింది. రామ్‌చరణ్ కెరియర్లోనే ఈ చిత్రం ఓ మైలురాలుగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పల్లెటూరి యువతి రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు సంబంధించి సుకుమార్ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. రంగస్థలం స్ర్కిప్ట్ రామ్‌చరణ్‌కు ఎంతగానో నచ్చిందని, కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశాడని తెలిపాడు. అయితే ఇందులో ఓ సన్నివేశం గురించి వివరించడానికి చాలా భయపడ్డానని చెప్పారు. అదేంటంటే..'ప్రకాశ్ రాజ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అన్ని సపర్యలు చేయాల్సి ఉంటుంది. గడ్డం గీయడం దగ్గర్నుంచి, బట్టలు మారచడం ఆఖరికి టాయిలెట్ బ్యాగ్ కూడా తీయాల్సి ఉంటుంది. ఈ లైన్ గురించి చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ రామ్‌చరణ్ మాత్రం చేసేద్దాం అంటూ కూల్‌గా ఆన్సర్ ఇచ్చారు. ఆయన వద్ద నుంచి ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. టెన్షన్ పడుతూనే ఈ సీన్‌ను వివరించా. కానీ చరణ్ దాన్ని అర్థం చేసుకున్నారు. ఒక నటుడిగా ఉండాల్సిన లక్షణం అది. ఏ పాత్రనైనా చేయగలగాలి. రామ్‌చరణ్ వందకు వంద శాతం తన పాత్రకు జస్టిస్ చేశారు' అని సుకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ఆచార్య మూవీతో పాటు, ఆర్ఆర్ఆర్లో నటిస్తుండగా, సుకుమార్ పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. చదవండి : యాంకర్ అనసూయ భర్త జాబ్ ఏంటో తెలుసా? రామ్ చరణ్‌ను ఢీ కొట్టే విలన్‌గా కన్నడ స్టార్! -
నా కోసం రామ్‌చరణ్ అలా చేయడం సంతోషాన్నిచ్చింది :అనసూయ
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇంతవరకు తెరపై చూడని కొత్త చెర్రీని ప్రేక్షకులకు పరిచయం చేశాడు సుక్కు. చిట్టిబాబుగా చెర్రీ లుక్స్, నటన అందరిని ఆకట్టుకుందే. ఒక్క హీరోదే కాదు, ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రత్యేకమే. ముఖ్యంగా రంగమ్మత్త పాత్ర అయితే సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రలో యాంకర్ అనసూయ పరకాయ ప్రవేశం చేసింది. తనదైన నటనతో అందరికి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అందరూ అనసూయను ‘రంగమ్మత్త’అని పిలవడం మొదలు పెట్టారు. అంతలా ఆ పాత్రలో జీవించేసింది హాట్ బ్యూటీ అనసూయ. ఈ సినిమా తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ అటు షోలు, ఇటు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను పంచుకుంది. రంగస్థలం షూటింగ్ సమయంలో తన కోసం రామ్‌చరణ్ ప్రత్యేకంగా చెఫ్‌ని పిలిపించి వంట చేయించేవాడని చెప్పుకొచ్చింది. ‘సెట్లో భోజన సమయంలో చేపల కూర ఉండేది. కానీ నాకు చేపలు తినే అలవాటు లేదు. ఈ విషయం గ్రహించి రామ్‌చరణ్ నా కోసం ప్రత్యేకంగా చెఫ్‌ని పిలిపించి పన్నీర్‌ను పెద్ద ముక్కలుగా కట్ చేసి కూర వండించేవాడు. అది అచ్చం ఫిష్ కర్రీలా చాలా టేస్టీగా ఉండేది. స్టార్ హీరో స్థాయిలో ఉన్న రామ్ చరణ్ నాకోసం అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నా కోసం అలా చెఫ్‌తో ప్రత్యేక వంటలు చేయించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది’అని షూటింగ్ జ్ఞాపకాలను మరోసారి గుర్తిచేసుకొని మురిసిపోయింది హాట్ బ్యూటీ అనసూయ. కాగా, ప్రస్తుతం అనసూయ ‘థాంక్యూ బ్రదర్’సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మే7 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రీక్ మూవీ ‘పుష్ప’లోనూ నటిస్తుంది. -
‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు చింపేశాడుగా
క్రియేటీవ్ దర్శకుడు సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలుకొట్టింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్.. చిట్టిబాబు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. పల్లెటూరి యువతి రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి ఆకట్టుకున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు తమిళ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమవుతుంది. ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి పురస్కరించుకొని తాజాగా ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. చెర్రీ పవర్ఫుల్ డైలాగ్స్, దేవీశ్రీ ప్రసాద్ అద్భుత నేపథ్య సంగీతంతో ట్రైలర్ అదిరిపోయింది. తమిళనాడులో 300లకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోలీవుడ్‌లోనూ ‘రంగస్థలం’ పేరుతోనే ఈ సినిమా విడుదల కానుంది. -
చెర్రీ బర్త్‌డే: మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీఇండస్ట్రీ నుంచి విషెస్ వెల్లువెత్తుతుండడంతో పాటు తన సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రామరాజ్ పోస్టర్ .. ‘ఆచార్య’ నుంచి సిద్ధ పోస్టర్ లాంటి సాలిడ్ అప్డేట్స్ వచ్చాయి. ఇదిలాఉండగా.. చరణ్ చేసిన సినిమాల్లో నటనపరంగా మరో మెట్టు ఎక్కించిన సినిమా ‘రంగస్థలం’ అని తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలుగా తెరకెక్కిందీ చిత్రం. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన రంగస్థలం చరణ్‌కు నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ అద్భుత నటనా పటిమ కనబరిచాడు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి నాన్ బాహుబలి రికార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా రామ్ చరణ్ ‘రంగస్థలం’ తమిళ డబ్ వెర్షన్ విడుదల ఎప్పుడన్నది కూడా తెలిసిపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీనిస్తూ ట్విటర్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాను తమిళ వెర్షన్లో విడుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో వచ్చే మే నెలలో ముహూర్త ఖరారు చేసినట్టు నిర్మాతలు కన్ఫార్మ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి చెర్రీ సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ వింటేజ్ వండర్ తమిళంలో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి. ( చదవండి: సైరాకుఏడాది పూర్తి, రామ్‌చరణ్ ట్వీట్ ) Wishing our Mega Power Star a great day! #HappyBirthdayRamcharan Due to Popular demand by all #RamCharan Tamil Fans.. We are releasing Blockbuster Rangasthalam (Tamil) in Theatres this MAY 2021.. Release thru @7GfilmsSiva@AlwaysRamCharan @Samanthaprabhu2 @ThisIsDSP @aryasukku pic.twitter.com/TIaYiZtgH5 — Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2021 -
రంగస్థలం ఫేమ్ 'పూజిత పొన్నాడ' ఫోటోలు
-
ఆడపిల్లను ఊరూరూ తిప్పడమేంటి అనడంతో...
మనకు మహానటి సావిత్రి తెలుసు. ఈమె కర్ణాటక రంగస్థలంలో రాణిస్తున్న మంచినటి. చిన్నప్పుడు సాధ్యం కాని తన అభీష్టాన్ని అరవై దాటిన తరవాత నెరవేర్చుకుంది. పదేళ్ల వయసులో ఇంటినే యుద్ధరంగం చేసేది. కర్ర పుల్లనే కరవాలంగా చూసుకునేది. భీకర యుద్ధం చేస్తున్నట్లు నోటితో శబ్దాలు చేస్తూ యుద్ధఘట్టాన్ని రంజింపచేసేది. ముగియగానే ఓ పాట అందుకునేది. పాటకు తగ్గట్టు అభినయించేది. ఆ సన్నివేశాలన్నీ సావిత్రి అనే అమ్మాయి యక్షగానం మీద పెంచుకున్న ప్రేమకు చిహ్నాలు. ఆమె ఇష్టానికి తగ్గట్టు పెద్దవాళ్లు ఆమెకు యక్షగానంలో శిక్షణ ఇప్పించారు. పన్నెండు– పదమూడేళ్లు వచ్చేసరికి చిన్న చిన్న పాత్రలతో రంగస్థలం మీద అడుగుపెట్టడానికి సిద్ధమైన సావిత్రిని ‘పెద్దయిన ఆడపిల్లను యక్షగాన ప్రదర్శన కోసం ఊరూరూ తిప్పడమేంటి?’ అని ఆపేశారు. అలా తెరపడిన ఆమె నటకౌశలానికి అరవై ఆరేళ్ల వయసులో తనకు తానే తెర తీసుకుందామె. ఇప్పుడామె వయసు 77. ఈ పదకొండేళ్లలో వందకు పైగా నాటకాలు ప్రదర్శించింది రంగస్థల, యక్షగాన కళాకారిణి సావిత్రి. అరవై... అయితేనేం? ఈ సావిత్రిది కర్ణాటకలోని మంగుళూరు. తనకు ఇష్టమైన యక్షగాన ప్రదర్శనకు చిన్నప్పుడే అడ్డుకట్ట పడడంతో ఆమె ఆ తర్వాత చదువు మీదనే దృష్టి కేంద్రీకరించింది. స్కూల్ టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కళారంగానికి దూరం కాలేదు. భర్త శ్రీనివాసరావు నడిపిస్తున్న ‘మక్కల్ సాహిత్య సంగమ’కు సహకారం అందించేది. తన విద్యార్థులకు చిన్న నాటకాలు సాధన చేయించి పాఠశాల వార్షికోత్సవాల్లో ప్రదర్శిస్తుండేవారు. ఆ రకంగా తెర వెనుకే ఉంటూ తన కళాభిరుచిని నెరవేర్చుకునేది. రిటైర్ అయిన తర్వాత ఆమెకు ఆ వ్యాపకం కూడా లేకుండా పోయింది. అప్పుడు తీసుకుందామె ఓ నిర్ణయం. మంగుళూరులోని యక్షారాధన కళాకేంద్ర నిర్వహకులు సుమంగళ రత్నాకర్‌ను సంప్రదించి నాలుగైదు గంటల నిడివితో సాగే నాటకాలను కూడా అవలీలగా సాధన చే సింది. పదేళ్లు గడిచేప్పటికి ఆమె వందవ నాటకాన్ని ప్రదర్శించారు. వాల్మీకి, దుర్యోధన, సుగ్రీవ, భీష్మ, ధర్మరాయ వంటి పౌరాణిక పాత్రల్లో చక్కగా ఇమిడిపోతారామె. ‘కరోనా కారణంగా నాటక ప్రదర్శనలు తగ్గాయి. లేకపోతే ఇప్పటికి మరో పాతిక ప్రదర్శనలిచ్చేదాన్ని. లాక్డౌన్ పోయి, అన్‌లాక్ మొదలైన తర్వాత కొద్దిపాటి నిడివితో ప్రదర్శనలు ఇస్తూ వాటిని డిజిటల్లో ప్రదర్శనలు ప్రసారం చేస్తున్నాం’ అన్నారు. అలాగే ‘‘మనం మహిళలం కాబట్టి అలా చేయడం బాగుండదని... ఇలా చేస్తే ఎవరైనా నవ్వుతారేమోనని, మన వయసు ఇంత అని గుర్తు తెచ్చుకుంటూ పరిధులు గీసుకుంటూ పోతే మన కల ఎప్పటికీ నెరవేరదు. మన కలను మనమే సాకారం చేసుకోవాలి’’ అంటూ మహిళలకు మంచి సందేశమిచ్చారు. -
అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి
సాక్షి, హైదరాబాద్: బాలనటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశి ఆ తర్వాత హీరోయిన్గా రాణించారు. తెలుగుదనం ఉట్టిపడేలా ముద్ద మొహంతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాశి. అయితే కొన్నాళ్లకు సినిమా అవకాశాలు తగ్గడంతో ‘వెంకి’ లాంటి సినిమాలో ఐటెం సాంగ్స్ చేశారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తున్న తరుణంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రాశికి మళ్లీ సినిమా ఆఫర్లు వస్తుండటంతో నటిగా తన సెకండ్ ఇన్నింగ్‌ను ప్రారంబించారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మత్త పాత్రకోసం మొదట తననే సంప్రదించినట్లు వెల్లడించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని రంగమ్మత్త పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ పాత్రను పోషించిన అనసూయ భరద్వాజ్‌కు ఆ తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. అయితే రంగమ్మత్త కోసం మొదట ‘రంగస్థలం’ యూనిట్ రాశిని సంప్రదించారంట. అయితే ఆ పాత్రలో మోకాళ్ల వరకు చీర కట్టుకోవాలనే కారణంతో తిరస్కరించానని రాశి చెప్పారు. (చదవండి: ‘ఆచార్య’లో అనసూయ.. చరణ్‌తో?) దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘రంగస్థలం సూపర్ హిట్ సాధించింది. ఇందులోని రంగమ్మత్త క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దర్శకుడు నాకు ఈ పాత్ర గురించి వివరించినప్పుడు నాకు కూడా రంగమ్మత్త నచ్చింది. కానీ ఇందులో ఆమె మోకాళ్లపై వరకు చీర కట్టుకోవాలి. ఆ లుక్ నాకు నప్పదని భావించి రంగమ్మత్త పాత్రను తిరస్కరించాను’ అని ఆమె స్పష్టం చేశారు. అయితే మహేశ్ బాబు ‘నిజం’ సినిమాలో రాశి నెగిటివ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రను గుర్తుచేసుకుంటూ... ఇందులో నెగిటివ్ రోల్ చేసి తప్పు చేశానన్నారు. ఇందులో గోపీచంద్‌కు తను లవర్‌గా నటించాలని దర్శకుడు తేజ కథ వివరించారని చెప్పారు. అయితే షూటింగ్ తొలి రోజే ఆ పాత్ర ఎలాంటిదో తనకు అర్థమైందని, దీంతో సినిమా నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నానన్నారు. ఇదే విషయాన్ని తన పీఆర్వో బాబూరావుకు చెప్పగా... సడన్‌గా సినిమా మధ్యలో ఇలా చేస్తే ఇండస్ట్రీలో తప్పుగా ప్రచారం అవుతుందని ఆయన చెప్పారు. అందుకే ‘నిజం’లో నటించానని రాశి చెప్పుకొచ్చారు. (చదవండి: లుక్ బాగుందంటే ఆనందంగా ఉంది) -
సవాల్‌కి రెడీ
సరికొత్త సవాళ్లను స్వీకరిస్తేనే మనలోని ప్రతిభ బయటపడుతుంది అంటున్నారు సమంత. ఇటీవల ఓ సందర్భంలో ‘‘నటిగా నాకు ఎలాంటి భయాలు లేవు.. ఎంతటి క్లిష్టమైన పాత్ర అయినా సరే చేయాలనుకుంటాను’’ అన్నారామె. ‘మహానటి, రంగస్థలం, ఓ బేబీ’ తదితర చిత్రాల్లో చాలెంజింగ్ రోల్స్ చేశారు సమంత. తాజాగా మరో చాలెంజింగ్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘మయూరి, గేమ్ ఓవర్’ చిత్రాలను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంలో బధిర యువతిగా నటించనున్నారట సమంత. సైకలాజికల్, హారర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ‘మహానటి’లో నత్తి ఉన్న అమ్మాయిగా నటించారు సమంత. ఆ పాత్రను అద్భుతంగా చేశారు. ఇప్పుడు మూగ, చెవిటి అమ్మాయిగా నటించడానికి తగిన కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
సౌండ్ ఇంజనీర్ కాబోతున్నారు
సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా ‘రంగస్థలం’ సినిమాతో మోత మోగించారు. ఇప్పుడు ఆ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సౌండ్ ఇంజనీర్ (వినికిడి లోపం ఉన్న వ్యక్తిని సరదాగా ఇలా అంటారు) చిట్టిబాబు పాత్రలో చరణ్ కనిపించారు. ఇప్పుడు సౌండ్ ఇంజనీర్‌గా మారబోతున్నారు లారెన్స్. ‘రంగస్థలం’ తమిళ రీమేక్‌లో రామ్‌చరణ్ పాత్రను రాఘవ లారెన్స్ చేయనున్నారట. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని సమాచారం. -
రంగస్థలం రీమేక్‌లో లారెన్స్?
రంగస్థలం చిత్రాన్ని రీమేక్ చేయడానికి నటుడు, నృత్యదర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సన్నాహాలు చేస్తున్నారా?.. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. తెలుగులో రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. చిత్రంలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా నటి సమంతకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులను రాఘవ లారెన్స్ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన నటించిన కాంచన–3 మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ చేస్తానని రాఘవ లారెన్స్ ప్రకటించారు. ప్రస్తుతం కాంచన చిత్రాన్ని అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో చేసే పనిలో బిజీగా ఉన్నారు. నటి కియారాఅద్వాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీబాంబ్ అనే పేరును నిర్ణయించారు. మరో విషయం ఏమిటంటే ఇంతకు ముందు తెలుగులో హిట్ అయిన పటాస్ చిత్ర తమిళ రీమేక్‌లో లారెన్స్ నటించారన్నది గమనార్హం. మొట్టశివ కెట్టశివ పేరుతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. తాజాగా రంగస్థలం చిత్ర రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారక ప్రకటన ఏదీ లేదన్నది గమనార్హం. ప్రస్తుతం హిందీ చిత్రం లక్ష్మీబాంబ్‌ను పూర్తిచేసే పనిలో లారెన్స్ బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాతే రంగస్థలం రీమేక్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. -
రంగస్థలం సెట్ దగ్ధం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఎంసీఆర్హెచ్ఆర్డీని ఆనుకొని ఉన్న బూత్‌బంగ్లాలో రెండేళ్ల క్రితం వేసిన రంగస్థలం సినిమా సెట్ అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. బుధవారం ఉదయం సెట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ గ్రామీణ వాతావరణం కోసం వేసిన గుడిసెలన్నీ కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే 25 గుడిసెలు అంటుకున్నాయి. -
సైమా 2019 : టాలీవుడ్ విజేతలు వీరే!
దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్‌లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్‌లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది. సైమా అవార్డ్స్ 2019 విజేతలు ఉత్తమ చిత్రం : మహానటి ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం) ఉత్తమ నటుడు : రామ్‌చరణ్ (రంగస్థలం) ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం) ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి) ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం) ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో) ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం) ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం) ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్ఎక్స్ 100) ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం) ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత) ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్‌పుత్ (ఆర్ఎక్స్ 100) ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్ఎక్స్ 100) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం) ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం) సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్ : విజయ్ దేవరకొండ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రామ్ చరణ్ యాక్టింగ్‌పై మంచు విష్ణు ట్వీట్
66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా 7 విభాగాల్లో అవార్డులు సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో మరో అవార్డు కూడా రావాల్సింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. రంగస్థలం సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని అంతా భావించారు. తాజాగా హీరో మంచు విష్ణు జాతీయ అవార్డులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘అవార్డులు సాధించిన వారి విషయంలో ఎలాంటి కంప్లయింట్ లేకపోయినా.. రంగస్థలంలో సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రామ్ చరణ్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకునే అర్హత ఉంది. ఇటీవల కాలంలో ఇదే అత్యుత్తమ నటన. ఏది ఏమైన అభిమానుల ప్రేమే అన్నింటికన్నా పెద్ద అవార్డ్’ అంటూ ట్వీట్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా రంగస్థలంలో చిట్టి బాబు పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు రామ్‌చరణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించారు. No offense to the other winners, but in my honest opinion my bruh Ram Charan deserved to win the National award for best actor in Rangasthalam. By far it was one of the best performances by any actor in the recent times. Anyways the audience love is the biggest award. — Vishnu Manchu (@iVishnuManchu) August 10, 2019 -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు ప్రధానోత్సవం
-
‘రంగస్థలం’ చిత్రానికి అవార్డుల పంట
సాక్షి, హైదరాబాద్ : వివిద రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న, అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న, నిస్వార్థమైన నిరతితో సేవలందిస్తున్న వారిని గత నాలుగేళ్లుగా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’లతో ఘనంగా సత్కరిస్తోంది ‘సాక్షి’. 2018కి సంబంధించిన ఈ అవార్డులను ప్రకటించారు. సమాజాభివృద్దిలో భాగంగా.. మల్లికాంబ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థకు సాక్షి ఎక్స్లెన్స్అవార్డును ప్రకటించారు. యంగ్ అఛీవర్ ఆఫ్ ద ఇయర్‌గా డాక్టర్ ఐవీ నివాస్ రెడ్డి, ఎక్సలెన్స్ ఇన్ ఫామింగ్‌లో చెరుకురి రామారావు, ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో పి. గాయత్రి, భగవాన్ మహవీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ప్రకటించారు. ఇక సినీ రంగం విషయానికొస్తే.. మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా మహానటి, మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా రామ్ చరణ్ ఎంపికయ్యారు. అవార్డుల వివరాలు.. లైఫ్‌టైం అఛీవ్మెంట్ అవార్డు : రెబల్‌స్టార్ కృష్ణంరాజు మోస్ట్ పాపులర్ డైరెక్టర్ : సుకుమార్ మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ : దేవీ శ్రీ ప్రసాద్ మోస్ట్ పాపులర్ సినిమాటోగ్రఫర్ : రత్నవేలు మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : నరేష్ మోస్ట్ పాపులర్ యాక్టర్ (నెగెటివ్ రోల్) : పాయల్ రాజ్‌పుత్ మోస్ట్ పాపులర్ యాక్టర్ : పూజా హెగ్డే మోస్ట్ పాపులర్ డెబ్యూ హీరోయిన్ : నిధి అగర్వాల్ మోస్ట్ పాపులర్ కమెడియన్ : సునీల్ మోస్ట్ పాపులర్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ : గూఢాచారి మోస్ట్ సక్సెస్ఫుల్ బాక్సాఫీస్ హిట్ : ఆర్ఎక్స్ 100 డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ : రాహుల్ రవీంద్రన్ మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (మేల్) : అనురాగ్ కులకర్ణి మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్) : చిన్మయి శ్రీపాద మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్ : అనంత శ్రీరామ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ : డాక్టర్ రమేష్ కంచర్ల తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్ : మిథాలీ రాజ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ : డాక్టర్ బిందుమీనన్ ఫౌండేషన్ జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : మహ్మద్ హుస్సాముద్దీన్ జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : గరికపాటి అనన్య జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : డాక్టర్ యాదయ్య యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ : షేక్ మహ్మద్ ఆరీఫుద్దీన్ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ : సబీనా జేవియర్ -
‘మహానటి’.. కీర్తి సురేష్
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాను భారీ పురస్కారాలు వరించాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు అవార్డునుఆయుష్మాన్ ఖురానా(అంధాధూన్), విక్కీ కౌశల్(ఉడి)కు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా ఆధిర్ ధర్ (ఉడి) ఎంపికయ్యారు. ఇక బెస్ట్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే , ఉత్తమ ఆడియోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ‘తెలుగు వెలిగింది’. తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఈ దారిలో మరింత విస్తృతంగా నడవడానికి కావాల్సింది అవార్డులు, రివార్డులు. తెలుగులో వస్తున్న కొత్తతరం సినిమాలకు ప్రేక్షకులు అభినందనలతో ప్రేమను అందిస్తుంటే, జాతీయ అవార్డులు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు వెలిగింది. చిన్నూ.. అవార్డ్ వచ్చిందని అరిచాను – రాహుల్ రవీంద్రన్ (‘చిలసౌ’ దర్శకుడు) పదేళ్ల క్రితం మా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘చిలసౌ’ కథ తయారు చేసుకున్నాను. కెరీర్లో ఇలాంటి అవార్డ్ వస్తుందని ఊహించలేదు. ఇవాళ చాలా స్పెషల్ రోజు. నా మొదటి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం, రెండో సినిమా రిలీజ్ కావడం, డెబ్యూ డైరెక్టర్‌గా ‘సాక్షి’ నాకు అవార్డ్ ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని మెచ్చుకున్నా, మన పని నచ్చినా సరే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల ఆశీర్వాదం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. ‘మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది’ అని చాలా ఫోన్లు వచ్చాయి. నాకు అర్థం కాలేదు. వెంటనే చిన్ను (రాహుల్ భార్య చిన్మయి)కి ఫోన్ చేసి గట్టిగా ‘చిన్నూ...నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది..’ అని అరిచాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవార్డ్ కోసం ‘చిలసౌ’ ఎప్పుడో పంపించి మర్చిపోయాం. ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. కథను నమ్మిన హీరో, నిర్మాతలకు, నాగార్జున సార్‌కి అందరికీ థ్యాంక్స్. క్రెడిట్ ముగ్గురికి దక్కుతుంది – ప్రశాంత్ వర్మ, (’అ!’ దర్శకుడు) చాéలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. దర్శకుడిగా ఫస్ట్ సినిమాకే అవార్డ్స్ రావడం ప్రోత్సాహంలా ఉంటుంది. విభిన్నమైన సినిమాలు తీయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కమర్షియల్ సినిమాలా? డిఫరెంట్ సినిమాలా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ అవార్డ్స్ ఇంట్రెస్ట్ పెంచుతాయి. నేషనల్ అవార్డ్స్‌కు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ‘అ!’ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు ఎందుకో ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకొని చూస్తూ ఉన్నా. అర్ధగంట అవగానే నేషనల్ అవార్డ్ వచ్చిందంటూ కాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్‌గా నిలబడినందుకు నానీగారికి స్పెషల్ థ్యాంక్స్. మేకప్ చీఫ్ రంజిత్‌తో పాటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శాంతి, అదితీ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ల ముగ్గురికీ ఈ క్రెడిట్ వెళ్లాలనుకుంటున్నాను. అస్సలు ఊహించలేదు – రాజాకృష్ణన్ (‘రంగస్థలం’ ఆడియోగ్రాఫర్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు సాధించినందుకు సంతోషంగా ఉంది. అది కూడా నేను చేసిన తెలుగు సినిమాకు రావడం హ్యాపీ. జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ సగం చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్రలో బాగా నటించారు. హీరోకు వినికిడి సమస్య ఉండటంతో సౌండింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. సౌండింగ్‌కు మంచి స్కోప్ దొరికింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా చేశాను. సుకుమార్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు థ్యాంక్స్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మా బాధ్యత పెరిగింది – నాని మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ‘అ’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని, ప్రశాంతి తిపిరనేని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల హీరో, నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘అ’ మంచి విజయాన్ని సాధించి, ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ‘మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్నవారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో అవార్డులు గెలుచుకున్నవారికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఈ సినిమాల రిలీజ్‌కు ముందే చిరంజీవి ఊహించి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మహానటి’ సినిమా విడుదల తరవాత కూడా ఓ సందర్భంలో యూనిట్ సభ్యులను చిరంజీవి అభినందించిన సంగతి విదితమే. మరాఠీలో మెరిసిన తెలుగు తేజం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. మరాఠీ చిత్రం ‘నాల్’ (బొడ్డుతాడు) చిత్రానికి సుధాకర్ రెడ్డి ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ వంటి టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల్యంతో పెనవేసుకున్న అనుభవాలను, తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో సుధాకర్ ఉద్వేగభరితంగా చూపారు. అదే విధంగా ‘నాల్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలనటుడు శ్రీనివాస్ పోకలేకు మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించడం విశేషం. కేజీఎఫ్‌కు డబుల్ ధమాకా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు యష్, ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేజీఎఫ్ చాప్టర్2’ను త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పాటకు తొలి అవార్డు ‘పద్మావత్’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఆయనే సంగీత దర్శకుడు కూడా. భన్సాలీ మాట్లాడుతూ– ‘‘క్రియేటివ్ ఫిల్డ్‌లో ఆర్టిస్టులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. కానీ ‘పద్మావత్’ సినిమా విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువగానే సమస్యలను ఫేస్ చేశాను. నేను చేసిన సినిమాల్లో కల్లా ‘పద్మావత్’ చాలా కష్టతరమైనది. చిత్రీకరణ సమయంలో మాపై దాడులు జరిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు, మార్చ్‌లు చేశారు. బ్యాన్ చేయమన్నారు. ఇలా ఈ సినిమాకి ప్రతి విషయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ కారణాల చేత నేను ఫీలైన ప్రతిసారీ ఓ పాట తీసేవాడిని. కొంచెం రిలీఫ్‌గా అనిపించేది. అన్ని సమస్యల మధ్య కూడా నేను ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే ఆలోచించా. ఈ సినిమా విజయం సాధించడానికి అదొక కారణం అనిపించింది. ఇప్పుడు మా సినిమాకు అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. ఇదొక ఎమోషనల్ మూమెంట్ మాకు. నా ప్రతి సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుంది. సంగీతమే నా ప్రపంచం’’ అని అన్నారు. అయితే.. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్‌కు అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. బుల్బుల్ పాడగలదు! అస్సామీ సినిమాకు ‘జాతీయ ఉత్తమ చిత్రం’ అవార్డు అందని ద్రాక్ష. అది 2018 వరకే. రీమా దాస్ తన మొదటి సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో ఆ డ్రీమ్‌ను డెబ్యూ (తొలి) సినిమాతోనే తీర్చేశారు. అస్సామీ రాక్‌స్టార్‌గా నిలిచారు. తొలి సినిమాయే అవార్డు అందుకునే స్థాయిలో ఉన్నప్పుడు తదుపరి సినిమా మీద అంచనాలు మామూలే. ఆ అంచనాలను రెండో సినిమాతోనూ సునాయాసంగా అందుకొని అందర్నీ మరొక్కసారి రీమా దాస్ ఆశ్చర్యపరిచారు. రీమా రెండో చిత్రం ‘బుల్బుల్ కెన్ సింగ్’ ఉత్తమ అస్సామీ చిత్రం అవార్డు గెలుచుకుంది. బుల్బుల్, బోణీ, సుము అనే ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమ సమాజం కోరుకున్నట్టు ఉండలేక, తాను అనుకున్నట్టు ఉండాలనే పోరాటం చేస్తూ తన గొంతుని వినిపించాలనుకుంటుంది బుల్బుల్. తన గొంతుని వినిపిస్తుంది. ఇది విన్న జ్యూరీ కూడా అవార్డు ఇవ్వకుండా ఉండగలదా? ‘బుల్ బుల్..’ లో ఓ దృశ్యం 66వ జాతీయఅవార్డుల ఎంపికలో ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్’ చిత్రానికి నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్) అవార్డులు వచ్చాయి. కానీ 2019, జనవరి 11న విడుదలైన ఈ చిత్రం 2018 జాతీయ అవార్డులకు ఎలా అర్హత సాధించిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. ఒక ఏడాదిలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వరకు సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబీఎఫ్సీ ) చేయించుకున్న సినిమాలను జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా 31, 2018న ‘ఉరి’ సిబీఎఫ్సీ వద్ద సర్టిఫికేట్ పొందింది. ఆ విధంగా ‘ఉరి’ చిత్రం జాతీయ అవార్డుల రేస్‌లో నిలిచి అవార్డులను సొంతం చేసుకుంది. – ముసిమి శివాంజనేయులు, డేరంగుల జగన్ -
అవార్డు విన్నర్లకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు పలు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. ఈ నేపథ్యంలో పురస్కారాలకు ఎంపికైన తెలుగు సినిమా నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని సీఎం ఆకాక్షించారు. (చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట) -
మెగాస్టార్ చెప్పినట్టే జరిగింది!
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా, ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. (చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట) ఇక నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `రంగస్థలం` బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి అవార్డుకు ఎంపికైంది. బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే నుంచి చిలసౌ కు, ఉత్తమ మేకప్, విభాగంలో, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అ..!` చిత్రానికి అవార్డులు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. `మహానటి`, `రంగస్థలం` చిత్రాలకు జాతీయ అవార్డలు వస్తాయని ఆయన రిలీజ్ కు ముందుగానే చెప్పిన సంగతి తెలిసిందే. మహానటి రిలీజ్ అనంతరం చిరంజీవి యూనిట్ సభ్యులను ఇంటికి పిలిపించి ఘనంగా సన్మానించిన సంగతి విదితమే. ఆయన చెప్పినట్టు ఆయా చిత్రాలకు అవార్డులు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన `రంగస్థలం`కు జాతీయ అవార్డు రావడం. అలాగే ఇతర భాషల నుంచి అవార్డులకు ఎంపికైన వారందరికీ మెగాస్టార్ అభినందనలు తెలిపారు. -
సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా!
రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత కూడా సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు చాలా టైం తీసుకుంటున్నాడు. రంగస్థలం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు సుకుమార్. కానీ కథా కథనాలపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో మహేష్ ఆ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేశాడు. వెంటనే సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పట్లో సెట్స్‌మీదకు వచ్చేలా కనిపించటం లేదు. ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ సినిమా అంటుందన్న టాక్ వినిపించింది. కానీ తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాను ఎనౌన్స్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉంది. దీంతో సుకుమార్ సినిమా కన్నా ఐకాన్ నే ముందుగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. దీంతో సుకుమార్‌కు మరికొంత కాలం వెయిటింగ్ తప్పేలా లేదు. మరి ఈ గ్యాప్‌లో సుక్కు వేరే హీరోతో సినిమా చేస్తాడా..?లేక బన్నీ డేట్స్కోసమే వెయిట్ చేస్తాడా చూడాలి. -
సుకుమార్ మరో సినిమా కూడా ఆగిపోయిందా!
రంగస్థలం లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సుకుమార్ ఫుల్ బిజీ అవుతాడని అంతా ఊహించారు. సుకుమార్ కూడా అదే జోరులో సూపర్‌స్టార్ మహేష్‌తో సినిమా ఓకె చేయించుకొని ఫుల్ ఫాంలో కనిపించాడు. కానీ ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయినట్టుగా అనిపిస్తోంది. సుకుమార్‌తో సినిమా లేదని మహేష్ స్వయంగా ప్రకటించాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న ఎనౌన్స్మెంట్ వచ్చినా ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. దర్శకుడిగా ఇలా ఉంటే నిర్మాతగానూ సుకుమార్ కెరీర్ అంతా ఆశాజనకంగా కనిపించటం లేదు. ఇప్పటికే కుమారి 21ఎఫ్, దర్శకుడు లాంటి సినిమాలను నిర్మించిన సుక్కు తరువాత కూడా వరుససినిమాలకు ప్లాన్ చేశాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. నాగశౌర్య హీరోగా కాశీ విశాల్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి బ్యాడ్ ఫేజ్ నుంచి సుకుమార్ ఎప్పుడు బయటికి వస్తాడో చూడాలి. -
చేయి కడుక్కుని వస్తానని అక్కడి నుండి జంప్..
శ్రీనగర్‌కాలనీ: ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. పట్నంలో చదువుకునేటప్పుడు దొరబాబును ప్రేమించింది. దొరబాబు అంటే తమ్ముడు చిట్టిబాబుకు అమితమైన ప్రేమ. అనుకోకుండా దొరబాబు వాళ్ల ఊరి ప్రెసిడెంట్‌ను ఎదిరించాడు. ఎన్నికల్లో కూడా అతనికి పోటీగా నిలబడ్డాడు. ఇంత బిజీగా ఉన్నాసరే ఆదివారం వచ్చిందంటే మాత్రం దొరబాబు ఆమెను చూడ్డానికి పట్నం వెళుతుంటాడు. ఈ కథ ఎక్కడో విన్నట్టో.. చూసినట్టో ఉంది కదూ..! అదేనండి ‘రంగస్థలం’ చిత్రంలోని సన్నివేశం. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కథలో కీలకమైనదే. ఇందులో దొరబాబు(ఆది పినిశెట్టి) ప్రేమించిన ఎమ్మెల్యే కూతురు పేరు గుర్తుందా.. ‘పద్మ’. ఆమె అసలు పేరు ‘పూజిత పొన్నాడ’. అంతకుముందే యూట్యూబ్‌లో ఎంతోమందికి పరిచమైన పూజిత.. పద్మగా మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’లో మరో కీలక పాత్ర చేసి మెప్పించింది. ఈ సందర్భంగా పూజిత తన వెండి తెర ఎంట్రీని ‘సాక్షి’తో పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... మాది వైజాగ్. నాన్న బిజినెస్మెన్, అమ్మ గృహిణి. పుట్టింది వైజాగ్‌లోనే కానీ ఢిల్లీలో చదువుకున్నా. చెన్నైలో ఇంజినీరింగ్ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్‌లో చేరాను. స్కూలింగ్, కాలేజీ రోజుల్లో చాలా రిజర్వ్డ్గా ఉండేదాన్ని. చదువు తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు. నా హాబీస్ బుక్స్ చదవడం, ఆర్ట్స్ వేయడం. జాబ్ చేస్తున్న సమయంలో ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ ద్వారా ‘ఉప్మా తినేసింది’ షార్ట్‌ఫిలిం యూనిట్ అప్రోచ్ అయ్యారు. అలా షార్ట్‌ఫిలింస్‌లో అనుకోకుండా నటించాను. ఫస్ట్‌టైం కెమెరా ముందు ధైర్యం తెచ్చుకొని నటించాను. సింగిల్ టేక్‌లో షాట్స్ ఓకే అవుతుంటే నాపై నమ్మకం పెరిగింది. అలా ‘పరిచయం, బూచి, అను నేను తను’ లాంటి 10 షార్ట్ ఫిలింస్‌లో నటించాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసా.. నేను నటించడం ఇంట్లో వారికి అసలు ఇష్టం లేదు. జాబ్ పైనే దృష్టిపెట్టమన్నారు. అయితే, నా షార్ట్ఫిలింస్ చూసిన అమ్మ ఫ్రెండ్స్ అభినందిస్తూ మెజేస్‌లు చేయడంతో అమ్మ కూడా ఆనందించింది. జాబ్‌తో పాటు అప్పుడప్పుడు షార్ట్ ఫిలింస్ చేస్తుండటంతో ఇంట్లో వాళ్లు కూడా ప్రోత్సహించారు. ఓ షార్ట్‌ఫిలింలో నన్ను చూసిన దర్శకుడు సుకుమార్ ‘దర్శకుడు’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో డేట్స్ కుదరక యాక్టింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకొని జాబ్ మానేశాను. ఈ విషయం ఇంట్లో తెలిసి పేరెంట్స్ చాలా కోప్పడ్డారు. తర్వాత నా డెడికేషన్ నచ్చి సినీ రంగంలోకి వెళ్లమని, నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని మనసారా ఆశీర్వదించారు. ‘రంగస్థలం’తో గుర్తింపు రంగస్థలం చిత్రంలో ప్రకాష్‌రాజ్ కుమార్తె పద్మగా ఆది పినిశెట్టికి జోడిగా నటించాను. సినిమా ఘన విజయం సాధించడంతో మంచి గుర్తింపు వచ్చింది. సుకుమార్‌తో పాటు చిత్రంలోని అందరూ చాలా ప్రోత్సహించారు. తర్వాత దర్శకుడు మారుతి నిర్మాణంలోని ‘బ్యాండ్ బాబు’, దర్శకురాలు సంజనారెడ్డి చిత్రం ‘రాజుగాడు’లో నటించాను. రీసెంట్గా ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’లో మంచి ప్రాతలో నటించాను. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంకా రాజశేఖర్ ‘కల్కి, సెవెన్’తో పాటు మరో పెద్ద ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాను. దర్శకులు సుకుమార్, మారుతి నన్ను ప్రోత్సహించారు. రిజర్వ్డ్ పర్సన్‌ని.. స్కూలింగ్ నుండి కాలేజీ డేస్‌తో పాటు జాబ్‌లో కూడా చాలా రిజర్వ్డ్గా ఉండేదాన్ని. ఎవరితోనూ అంత క్లోజ్ అయ్యేదాన్ని కాదు. చదువే ఫస్ట్ అన్నట్లుగా నా ప్రయాణం సాగింది. తొమ్మిదో తరగతిలో లంచ్ టైమ్‌లో ఓ అబ్బాయి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. ఒక్క నిమిషం చేయి వాష్ చేసుకొని వస్తానని చెప్పి అక్కడి నుండి నేను జంప్. టెన్త్‌లో నా ఫ్రెండ్ స్కూల్ ఫంక్షన్లో నా ఫస్ట్ లవ్ పూజితకి ఈ పాట అంకితం అని స్టేజీ మీద అందరి మందు చెప్పేసాడు. నేను వెంటనే ఫంక్షన్ నుండి వెళ్లిపోయాను. ఆ వయసులో భయంతో పాటు సిగ్గు, బిడియం ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా కంఫర్ట్‌గా ధైర్యంతో ఉన్నాను. తెలుగమ్మాయిలు‘ది బెస్ట్’ అనిపించుకోవాలి అందరూ బాగా నటిస్తారు. కానీ తెలుగమ్మాయిలు ‘ద బెస్ట్’ అనిపించుకొనేలా చేయాలని ఉంది. నా వరకూ నేను కష్టపడతాను. హావభావాలను పలికిస్తూ ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి కృషి చేస్తాను. ‘సమ్మోహనం’ తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో చేయాలని ఉంది. కథాబలమున్న పాత్రలు రావాలని కోరుకుంటున్నాను. పెద్ద బ్యానర్లో పనిచేయాలని ఉంది. నటిగా నన్ను నేను పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ చిత్రంలో అన్ని షేడ్స్ ఉన్న రోల్లో నటించాను. గ్లామెరెస్ రోల్స్‌తో పాటు అన్ని పాత్రలు చేయగలను. రూమర్స్‌ని నేను పట్టించుకోను. నా వ్యక్తిత్వంతో ముందుకు సాగుతాను’ అంటూ ముగించింది పద్మ. -
‘రంగస్థలం’ రికార్డు.. దశాబ్దాల తరువాత అక్కడ!
తెలుగునాట నాన్ బాహుబలి రికార్డులన్నింటిని చెరిపేసిన భారీ చిత్రం రంగస్థలం. రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామా సంచలన విజయం సాధించటం మాత్రమే కాదు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రామ్ చరణ్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. తమిళ, మళయాల భాషలతో పాటు కన్నడ నాట కూడా ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కానుంది. కొన్ని దశాబ్దాలుగా కన్నడ ఇండస్ట్రీ డబ్బింగ్ సినిమాలను కర్ణాటకలో రిలీజ్ చేసేందుకు అనుమతించటం లేదు. కానీ కేజీయఫ్ రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. ఆ సినిమా అన్ని భాషల్లో విడుదల కావటంతో ఇతర భాషా చిత్రాలనుకూడా కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు అనుమతిస్తున్నారు. దీంతో దశాబ్దాల తరువాత కన్నడలో డబ్ అవుతున్న తెలుగు సినిమా రంగస్థలం రికార్డ్ సృష్టించనుంది. తెలుగు నాట సంచలనాలు నమోదు చేసిన రంగస్థలం తమిళ, మళయాల, కన్నడ భాషల్లో కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా.. అన్ని భాషల్లో రామ్ చరణ్‌కు మార్కెట్ ఓపెనవుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
మహేష్ కోసం.. మరో డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్
రంగస్థలం సినిమాతో రికార్డ్లను తిరగరాసిన దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సూపర్ స్టార్.. నెక్ట్స్ సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. రంగస్థలం సినిమాను పిరియాడిక్ జానర్లో తెరకెక్కించిన సుక్కు.. మహేష్ కోసం మరో డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌ను రెడీ చేస్తున్నాడట. సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుందట. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్‌ను డిఫరెంట్ లుక్‌లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్‌ను, రంగస్థలంలో రామ్ చరణ్‌ను గడ్డంతో చూపించిన సుక్కు మహేష్‌తో కూడా అదే లుక్ ట్రై చేయిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. -
వీరి గాత్రం.. వేసింది మంత్రం..
రంగమ్మ మంగమ్మ అంటూ మానసి.. శ్రోతలను ఫిదా చేశారు. దారి చూడు అంటూ పెంచల్ దాస్ దుమ్ము లేపారు. చూసి చూడంగానే నచ్చేశావే అని అనురాగ్ కులకర్ణి అంటే... వినీ వినంగానే ఎక్కేసిందే అంటూ శ్రోతలు వంతపాడారు. ఇంకేం ఇంకేం కావాలే అని సిద్‌శ్రీరామ్ అంటే.. ఇకపై ఈ పాటనే వింటామే అంటూ సంగీత ప్రియులు బదులిచ్చారు. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని మోహన భోగరాజు చెప్పగా.. అంతే శ్రద్దగా చెవులురిక్కించి విన్నారు ఆడియెన్స్. ఈ ఏడాది గాయనీగాయకులు తమ గాత్రాలతో చేసిన మ్యాజిక్‌ను ఓసారి చూద్దాం. రంగమ్మ మంగమ్మ.. అంటూ మానసి రంగస్థలం సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాష్టారే పరీక్ష రాస్తే నూటికి నూరు మార్కులు వచ్చినట్టు.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా.. మాస్ సూత్రాలను సరిగ్గా పాటిస్తూ.. సుకుమార్ తీసిన రంగస్థలం అంతా ఒక ఎత్తైతే.. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఈ చిత్రంలోని ప్రతీపాట ప్రేక్షకులను కట్టిపడేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రంగమ్మ మంగమ్మ పాట గురించే. ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. ఈ పాటలో సమంత అభినయం, డ్యాన్సులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఈ పాటపై సోషల్ మీడియాలో లెక్కలేని వీడియోలను రీక్రియేట్ చేసేశారు అభిమానులు. ఈ పాట జనాల్లోకి వెళ్లడానికి దేవీ అందించిన ట్యూన్ ఒక కారణమైతే.. మానసి గాత్రం మరో కారణం. ఈ పాటతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్‌ను సంపాదించేశారు గాయని మానసి. ఈ వీడియోసాంగ్‌ను ఇప్పటివరకు 129మిలియన్ల మంది వీక్షించారు. దారి చూపి దుమ్ము లేపిన దాస్.. ఈ ఏడాదిలో వచ్చిన పాటలన్నింటిలో మాస్‌ను ఊపేసిన పాట ఇది. నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా మిశ్రమ ఫలితాన్నిచ్చినా.. ఈ చిత్రంలోని ఈ పాట మాత్రం పాపులర్అయింది. ఎక్కడ ఎలాంటి ప్రొగ్రామ్స్ అయినా ఈ పాట ప్లే అవ్వాల్సిందే. చిందులు వేయాల్సిందే. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా.. రాయలసీమ రచయిత పెంచల్ దాస్ అందించిన గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ అయింది. ఆ గాత్రంలో ఉన్న మ్యాజిక్కే.. ఈ పాటను ఇంతలా వైరల్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో 38మిలియన్ల మంది వీక్షించారు. వినీ వినంగానే నచ్చేసిందే... ఈ ఏడాది యూత్‌ను ఊపేసిన పాటల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉండేది ఛలో సాంగ్. చూసి చూడంగానే అంటూ నాగశౌర్య రష్మిక మాయలో పడిపోతే.. ఈ పాటను వినీ వినంగానే నచ్చేసిందే అనేలా చేసేశారు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి. ఎక్కడ చూసిన ఈ పాటే కాలర్‌ట్యూన్.. రింగ్‌టోన్‌గా మారిపోయింది. ఈ పాటను 94మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఏడాదిలో అనురాగ్ అందరికీ గుర్తుండియో పాటలు పాడి శ్రోతలకు మరింత దగ్గరయ్యారు. మహానటి టైటిల్ సాంగ్.. ఆర్ఎక్స్ 100 పిల్లా రా వంటి సాంగ్‌లను పాడి అనురాగ్ కులకర్ణి ఫుల్ ఫేమస్ అయ్యారు. వీటిలో పిల్లా రా సాంగ్‌ను యూత్‌ను కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను 140మిలియన్ల మంది చూశారు. ఇంకేం ఇంకేం కావాలే.. ఇంకేం ఇంకేం కావాలే.. అని సిద్ శ్రీరామ్ అంటే ఈ ఏడాదికి ఇదే చాలే అని ప్రేక్షకుల బదులిచ్చారు. గీతగోవిందంలోని ఈ పాటే సినిమాపై హైప్‌ను క్రియేట్ చేసింది. ఒక్కపాట సినిమాపై అంత ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఈ పాటే ఓ ఉదహరణ. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు బలాన్నిచ్చింది. గోపి సుందర్ అందించిన బాణీకి, సిద్‌శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోయగా.. సంగీత ప్రియులను ఈ పాట ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భాషలతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులకు అందరికీ ఈ పాట ఎక్కేసింది. రికార్డు వ్యూస్లతో యూట్యూబ్‌లో ఈ పాట దూసుకెళ్తోంది. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని గంభీరంగా చెప్పిన మోహన.. అరవింద సమేత.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో సంగీతం ప్రధాన ప్రాత పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని రెడ్డమ్మ సాంగ్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా ముగింపులో వచ్చే ఈ పాట.. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని వివరించగా.. ఆ గాత్రంలోని తెలియని ఆకర్షణకు అందరూ ముగ్దులయ్యారు. మోహన భోగరాజు ఈ పాటతో అందరికీ సుపరిచితురాలయ్యారు. పెంచల్ దాస్ తన రాయలసీమ యాసలో అందించిన సాహిత్యం ఈ పాటపై మరింత ప్రభావాన్ని చూపింది. ఇలా ఈ ఏడాది తమ గాత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువతరంగాలు.. వచ్చే ఏడాది కూడా తమ హవాను కొనసాగించాలని మరిన్ని మంచి పాటలను ఆలపించాలని ఆశిద్దాం. -
‘రంగస్థలం’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘సర్కార్’
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతూ వస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించి రికార్డ్ సృష్టించిన సర్కార్ ప్రస్తుతం ఈ ఏడాది సౌత్‌లోనే హైయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకుంది. రెండు వారాల్లో సర్కార్ 225 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2018లో సౌత్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ రంగస్థలం పేరిట ఉంది. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం 218 కోట్లతో సర్కార్ రిలీజ్ కు ముందు వరకు టాప్ ప్లేస్‌లో ఉంది. విజయ్ సర్కార్ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఫుల్ రన్ మరిన్ని రికార్డ్‌లు సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
చిరంజీవి నాకు ఇన్స్పిరేషన్ : యంగ్ విలన్
శ్రీనగర్‌కాలనీ: సినిమాలో విలన్ అంటే ఎలా ఉండాలి! భయంకరమైన రూపం.. ఎరుపెక్కిన కళ్లు.. మొహంపై గాట్లు.. చూడగానే ఎవరికైనా భయం పుట్టాల్సిందే.. అలా ఉండాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సినిమా విలన్లు స్మార్ట్‌గా మారిపోయారు. సిక్స్‌ప్యాక్ బాడీతో అందంలో హీరోనే తలదన్నుతున్నారు. మాస్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు. కేవలం వారు చేసే పనుల్లోనే విలనిజం కనిపిస్తుంది తప్ప.. బాడీ లాంగ్వేజ్‌లో ఏ కోశానా ఆ ఛాయలు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో ఈ ట్రెండ్ రాజ్యమేలుతోంది. అసలు ‘విలన్’ అంటే ఎవరు..? హీరోకు శత్రువు. అందుకేనేమో ‘‘శత్రు’’ అని పేరు పెట్టుకున్న అతడు తెలుగు తెరపై ఇప్పుడు ట్రెండ్ సెట్టింగ్ విలన్‌గా ఎదుగుతున్నాడు. చూడ్డానికి 6 అడుగుల 3 అంగుళాల పొడవుతో ‘300’ హాలీవుడ్ మూవీ హీరో ‘జెరార్డ్ బట్లర్’ను తలపించేట్టు ఉండే ఈ విలన్‌కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ‘‘రంగస్థలం, శైలజారెడ్డి అల్లుడు, అరవింద సమేత వీరరాఘవ’’ చిత్రాల్లో మంచి పాత్రలుపోషించిన శత్రు తన సినీ ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు మన విలన్ మాటల్లోనే.. ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్లో రామ్‌చరణ్‌తో శత్రు మాది ఒరిస్సా.. కానీ తెలుగబ్బాయినే. మా పూర్వికులది రాజమండ్రి. అయితే ఒరిస్సాలో సెటిలయ్యారు. నాన్న వ్యవసాయం చేస్తారు. నాకు ఇద్దరు అన్నలు. ఇంటర్ వరకూ కటక్‌లో చదువుకున్నాను. పస్ట్ క్లాస్ స్టూడెంట్‌ని. ఇంట్లో వారు బైపీసీ చేసి డాక్టర్ అవ్వమన్నారు. కానీ చిన్నతనం నుంచి నటన మీద చాలా ఇంట్రస్ట్ ఉండేది. స్కూల్ కల్చరల్ పోటీల్లో చురుగ్గా ఉండేవాడిని ఉండేది ఒరిస్సా అయినా ఇంట్లో అంతా తెలుగు వాతావరణమే. చిరంజీవిగారు నాకు ఇన్స్పిరేషన్. ఇంటర్ అయ్యాక మనసంతా యాక్టింగ్ వైపే లాగింది. ఇక డాక్టర్ మనకు సెట్ కాదనిపించింది. ఎలాగైనా ఇండస్ట్రీకి వచ్చేయాలని.. డిగ్రీ హైదరాబాద్‌లో చేస్తానని మా నాన్నతో చెబితే.. ‘ఇక్కడే చదువుకోవచ్చుగా’ అన్నారు. కానీ నేను హైదరాబాద్‌లో చదువుకుంటా అని గట్టిగా చెప్పేసరికి ఒప్పుకున్నారు. వెంటనే సిటీకి వచ్చేశా. డిగ్రీ మైక్రోబయాలజీ అవంతి కాలేజీలో చేరాను. అక్కడ పరిమళ మేడం నాకు సపోర్ట్ చేసింది. నా ఆసక్తిని గమనించి ప్రోత్సహించింది. అనుకోకుండా టీవీలో ఛాన్స్.. జెమిని టీవీలో వీజేగా అవకాశాలు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్లి నా ఫొటోలు ఇచ్చి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేసి నువ్వు టీవీలో వస్తున్నావు అంటే కంగారుపడ్డాను. నేను అసలు ఎక్కడా నటించనే లేదు. ఎక్కడ వస్తున్నానబ్బా.. అని అడిగాను.. వాడు చెప్పిన సమాధానం ఏంటంటే...ఒక క్రైమ్ సీరియల్లో పోలీస్‌స్టేషన్‌లో మోస్ట్ వాంటెడ్ ఫొటోల్లో నీ ఫొటో ఉంది అన్నాడు. ఆ మాట విని నవ్వుతో పాటు కొద్దిగా కాన్ఫిడెంట్ కూడా వచ్చింది. కనీసం ఇలాగైనా ఎవరైనా చూసి అవకాశాలు ఇస్తారని (నవ్వుతూ) అనుకున్నా. లీడర్‌తో అవకాశం అవకాశాల కోసం తిరుగుతూ అసిస్టెంట్ డైరెక్టర్స్‌తో పరిచయాలు పెంచుకొన్నాను. అలా నా మొదటి సినిమా అవకాశం రానా హీరోగా తీసిన ‘లీడర్’తో వచ్చింది. అందులో చిన్న పాత్రే వేశాను. ఈ తర్వాత ‘అలియాస్ జానకి’ చిత్రంలో మెయిన్ విలన్‌గా చేశాను. కానీ సినిమా సరిగా ఆడకపోవడంతో గుర్తింపు రాలేదు. కానీ నిర్మాత రామ్ ఆచంట నా ఫొటోలు చూసి బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’లోను, ‘ఆగడు’ చిత్రంలో సోనూసూద్ బ్రదర్‌గా అవకాశం ఇచ్చారు. వాటిలో ఓ మాదిరి గుర్తింపు వచ్చింది. అంతకు మించి నాకు చిత్ర పరిశ్రమలో ఓ గాడ్‌ఫాదర్‌లా ఆయన నాకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చారు. తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో హీరోయిన్ అన్నగా ఫుల్ రోల్ చేశాను. ఈ చిత్రం ప్రేక్షకుల్లో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఇజం, అత్తారింటికి దారేది, మిస్టర్, గరుడవేగ చిత్రాల్లో నటించారు. రెండేళ్ల క్రితం ‘మిస్టర్’ చిత్రం షూటింగ్లో ఊటీలో ఉన్నా. జీవితంలో మరువలేని ఘటన అప్పుడు జరిగింది.. మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. 2018లో అదృష్టం పండింది ఈ ఏడాది నాకు పండగను తెచ్చింది. ముగ్గురు సూపర్‌స్టార్స్ చిత్రాల్లో నటించారు. ఆ మూడూ ఈ ఏడాది బ్లాక్ బ్లస్టర్స్గా నిలిచాయి. ‘‘రామ్‌చరణ్ రంగస్థలం, మహేష్‌బాబు భరత్ అనే నేను, ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ’’ చిత్రాల్లో నేను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నా. అరవింద సమేత వీరరాఘవలో ‘ఒంటిచెయ్యి సుబ్బడు’ పాత్ర చిన్నదే అయినా చివరగా సినిమా కంక్లూజన్ ఇచ్చే పాత్ర నాది. అంతేకాకుండా రంగస్థలంలో కాశీ పాత్ర కూడా మంచి పేరు తెచ్చింది. తమిళంతో కార్తి హీరోగా నటించిన ‘చినబాబు’లో విలన్‌గా ఫుల్‌రోల్ చేశాను. ప్రేమ..పెళ్లి.. వినూత్న.. నా జీవితంలో దొరికిన అదృష్టం వినూత్న. ‘అలియాస్ జానకి’ చిత్రం సమయంలో ఫ్యాషన్ డిజైనర్‌గా వినూత్న పరిచయమైంది. రెండేళ్ల ప్రేమ తర్వాత వివాహం చేసుకున్నాం. తనిప్పుడు ఫాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్‌గా పనిచేస్తోంది. నేను మంచి భోజనప్రియుణ్ని. నా కోసం చాలా వంటకాలు చేసి పెడుతుంది. ఖాళీగా ఉంటే ఇంట్లో సినిమాలు చూస్తాను. ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తాను. కావాలనే డిగ్రీ పూర్తి చేయలేదు నా లక్ష్యం ఒక్కటే.. నటుడిని కావాలి. కానీ డిగ్రీ పూర్తి చేస్తే నా కెరీర్ మరోదారిలో వెళుతుందని భయమేసింది. అందుకే ఓ సబ్జెక్ట్‌ను పాస్ అవకుండా అలాగే ఉంచాను. సినిమాల్లో అవకాశాలు రాకపోతే డిగ్రీతో జాబ్ చేసే ఆలోచన వస్తుందని డిగ్రీని పూర్తి చేయలేదు. సినిమానే ప్రపంచంగా ఉండాలని అలా చేశాను. ఇప్పటికీ డిగ్రీ సబ్జెక్ట్ అలాగే ఉండిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు పూర్తి చేయాలి. చిరకాలం గుర్తుండిపోవాలి హైదరాబాద్ నాకు సినిమా లైఫ్ ఇచ్చింది. హను రాఘవపూడి, జీవన్‌రెడ్డితో పాటు నా తోటి విలన్ స్నేహితులు, ఆర్టిస్ట్స్ చాలా మంది ఉన్నారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. జగపతిబాబుగారి విలనిజం బాగా ఇష్టం. ఇప్పటికి 20 చిత్రాలు చేశాను. ప్రస్తుతం ‘పడిపడి లేచె మనసు, కల్కి, జార్జిరెడ్డి, కన్నడ శివరాజ్‌కుమార్ రుస్తుం’ చిత్రాల్లో నటిస్తున్నాను. సినీ ప్రేక్షకులకు ఆర్టిస్ట్‌గా గుర్తుడిపోయే పాత్రలు చేయాలి. అందుకు ఎంతటి శ్రమకైనా సిద్ధంగా ఉన్నాను.. అంటూ ముగించారు ఈ అందమైన విలన్ శత్రు. -
చరణ్ సినిమా నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్
రంగస్థలం సక్సెస్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సాంకేతిక విభాగంలో మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రిషీ పంజాబీ తప్పుకోవటంతో కొత్త కెమెరామేన్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా రిషీ పంజాబీ తప్పుకోవటంతో ఆ స్థానంలో ఆర్థర్ విల్సన్‌ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారట. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగిలి ఉన్న టాకీ పార్ట్‌తో పాటు పాటలకు విల్సన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. -
పిరియాడిక్ డ్రామాలో సూపర్ స్టార్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు సూపర్ స్టార్. రంగస్థలం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సుక్కు, మహేష్ కోసం మరో వెరైటీ కథను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సుకుమార్ మహేష్ తో చేయబోయే సినిమా కూడా పిరియాడిక్ సినిమానే అన్న ప్రచారం జరుగుతోంది. రంగస్థలంతో 1980ల కాలాన్ని పరిచయం చేస్తే మహేష్ సినిమా కోసం మరింత ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లనున్నారట. మహేష్, సుకుమార్‌ల సినిమా స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లో జరిగే కథగా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. -
ఆ ఇల్లే ..రంగస్థలం
దేవీ...! కష్టములెట్లున్నను పుణ్య క్షేత్రమైన వారణాసిని దర్శించితిమి చూడు..,రాజే కింకరుడగున్–కింకరుడే రాజగున్ కాలానుకూలంబుగా.., ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే..,మహాకవి గుఱజాషువా,బలిజేపల్లి లక్ష్మీకాంతం కవుల కలాల నుంచి జాలువారిన మహాకావ్యంసత్య హరిశ్చంద్ర నాటకంలోని జనాదరణ పొందిన పద్యాలివి. ప్రకాశం : సత్యహరిశ్చంద్ర వేషంలో ఆయన స్టేజి ఎక్కి పద్యం అందుకుంటే చాలు ప్రేక్షకులు ఒళ్లంతా చెవులు చేసుకుని వినేవారు. వన్స్‌మోర్ అంటూ మళ్లీ మళ్లీ పాడించుకునే వారు. సత్యహరిశ్చంద్ర పాత్రలో అంతగా ఒదిగిపోయినఆ రంగస్థల దిగ్గజమే వేటపాలేనికి చెందిన దుబ్బు వెంకట సుబ్బారావు. ఈయనను ప్రేక్షకులు ముద్దుగా డీవీ అని పిలుస్తుంటారు. తన గాత్రం, అభినయంతో ఎందరో కళాభిమానుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. జీవితాంతం హరిశ్చంద్ర వేషం వేస్తూ హరిశ్చంద్ర అంటే డీవీ అన్న పేరు పొందారు. ఆయన తదనంతరం కుమారుడు, ఆ తర్వాత మనవడు కూడా ఇదే పాత్రను పోషిస్తూ కళా రంగంలో రాణిస్తున్నారు. జూనియర్ డీవీగా (డీవీ మనుమడు) పేరొందిన దుబ్బు వెంకట సుబ్బారావు తన రెండు దశాబ్దాల నట ప్రస్థానంలోదేశ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ప్రదర్శనలిచ్చి ప్రేక్షకులను అలరించారు. వేటపాలెం మండలం ఆణుమల్లిపేటకు చెందిన డీవీ సుబ్బారావు(సీనియర్) పాడిన హరిశ్చంద్ర పద్యాలు, పాటలు అప్పట్లోనే గ్రామ్‌ఫోన్ రికార్డులుగా వచ్చాయి. 1970 దశకంలో అభిమానులు ఆయన చేతికి స్వర్ణ కంకణం తొడిగారు. ఆంధ్రా తాన్సేన్, కలియుగ హరిశ్చంద్ర, మధురగాన విశారద బిరుదులు, సన్మానాలు పొందారు సీనియర్ డీవీ. ఆయన మరణానంతరం అదే బాటలో కుమారుడు సుబ్బయ్య సత్యహరిశ్చంద్ర పాత్రను పోషించి మెప్పించారు. సుబ్బయ్య కుమారుడు డీవీ సుబ్బారావు(జూనియర్) తన పదకొండో ఏటనే తాతను స్ఫూర్తిగా తీసుకుని రంగస్థలంపై వేషం వేశారు. వేలాది ప్రదర్శనలతో కళాభిమానులను అలరిస్తూ.. కళాకారులు, పెద్దలతో ప్రశంసలు అందుకుంటున్నారు. డీవీ సుబ్బారావు(జూనియర్) దాదాపుగా పదిహేడేళ్లుగా సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడిగా నటిస్తున్నారు. ఇంత వరకు 5 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అర్జునుడు, కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రలతోపాటు చింతామణిలో భవానిగా నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతోపాటు బరంపురం, విజయవాడ, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లోనూ నాటకాలు వేశారు. పలువురి ప్రశంసలు ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాదు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, దివంగత మంగళంపల్లి బాలమురళీకష్ణ ఇంకా ఎందరో రాజకీయ నాయకులు, పెద్దల నుంచి జూనియర్ డీవీ ప్రశంసలు అందుకున్నారు. సినీ గాయకులు మనో జూనియర్ డీవీ, తండ్రి సుబ్బయ్యలతో కలిసి పలుమార్లు పద్యాలు పాడటం విశేషం. జూనియర్ డీవీ తన విశేష నటనా ప్రతిభకు గుర్తింపుగా బాల గంధర్వ నాటక కళానిధి, యువ నాటక గాన సుధానిధి బిరుదులు పొందారు. ఫిరంగిపురం, జంగారెడ్డిగూడెం, ఏటుకూరు ప్రాంతాల్లో హరిశ్చంద్ర నాటకంలో ఆయన నటనకు ముగ్ధులైన కళాభిమానులు సువర్ణ కంకణాలు బహూకరించారు. తాతపై తనకున్న అపార ప్రేమకు చిహ్నంగా వేటపాలెం మండలం రామన్నపేటలోని తన నివాసంలో ఇటీవల సీనియర్ డీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటించాలని తనకున్నా చూసేవారు కరువవుతున్నారని జూనియర్ డీవీ ఆవేదన వెలిబుచ్చారు. వెండితెర, బుల్లితెర ప్రభావంతో నాటకాల ప్రాభవం తగ్గిందని, ప్రభుత్వం నాటకరంగాన్ని, కళామతల్లిని నమ్మకున్న రంగస్థల నటులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. వేటపాలెం: తొలిజాము నుంచి సంధ్యవేళ వరకు పంట చేలో పనిచేసి అలసిన అన్నదాతలకు.. కుల వృత్తులు, కుటీర పరిశ్రమల్లో చెమటోడ్చిన దేహాలకు.. సాంత్వన చేకూర్చేందుకు, కాలక్షేపానికి దివ్యౌషధం నాటకం. పదిహేనేళ్ల క్రితం వరకు రంగస్థలం, రంగస్థల కళాకారుల క్రేజ్ మాటల్లో వర్ణించలేం! అలాంటి కళాకారుల్లో డీవీ సుబ్బారావు(సీనియర్) ముందు వరుసలో ఉంటారు. ఆయన తనయుడు డీవీ సుబ్బయ్య, సుబ్బయ్య కుమారుడు డీవీ సుబ్బారావు(డీవీ సుబ్బారావు) తమ గాత్రంతో పద్యాలాపన చేసి ప్రేక్షకలోకాన్ని మెప్పించారు. డీవీ కుటుంబంలో మూడు తరాలు రంగ స్థలంపై చెరగని ముద్ర వేశారు. -
రికార్డుల రంగమ్మ.. మంగమ్మ..
‘రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు...’ పాట వినగానే మనకు టక్కున ‘రంగస్థలం’ సినిమా గుర్తుకు రాక మానదు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాదు.. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని ‘రంగమ్మ మంగమ్మ’ పాట బాగా పాపులర్ అయింది. ఇప్పుడీ పాట యూ ట్యూబ్‌లో ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఈ పాటను 100 మిలియన్లు (10 కోట్లు) మందికి పైగా వీక్షించారు. ఈ ఏడాది తక్కువ టైమ్‌లో 10 కోట్ల మార్క్‌ను దాటిన తొలి దక్షిణాది పాటగా ‘రంగమ్మ మంగమ్మ’ పాట రికార్డు సృష్టించడం విశేషం. చంద్రబోస్ రాసిన ఈ పాటను మానసి పాడగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
అన్న కాదు విలన్..!
రంగస్థలం సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వివేక్‌తో పాటు మరో విలన్ కూడా కనిపించనున్నాడట. హాయ్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన ఆర్యన్ రాజేష్, చెర్రీ సినిమాలో స్టైలిష్ విలన్‌గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగపతి బాబు, ఆది పినిశెట్టి లాంటి వాళ్లను విలన్లుగా చూపించి మెప్పించిన బోయపాటి, రామ్‌చరణ్ సినిమాతో ఆర్యన్ రాజేష్‌ను ప్రతినాయక పాత్రలో పరిచయం చేయనున్నాడు. ముందుగా ఈ సినిమాలో ఆర్యన్, చెర్రీకి అన్నగా కనిపించనున్నారన్న ప్రచారం జరిగింది. కానీ తాజా సమచారం ప్రకారం ఈ సీనియర్ హీరో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆర్యన్ రాజేష్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ రాజేష్ కూడా జగపతి బాబు, ఆదిల్లా స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి. -
‘రంగస్థలం’లో నకిలీలు
రంగస్థల కళాకారుల గుర్తింపు కార్డుల జారీలో నకిలీ బాగోతం బయట పడింది. నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్న 34 మందికి అధికారులు గుడ్డిగా కార్డులు జారీ చేసేశారు. నిడమర్రు తహసీల్దారు సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ తతంగాన్ని నడిపించారని తేలింది. పశ్చిమ గోదావరి, నిడమర్రు : నాటక రంగాన్ని వృత్తిగా మార్చుకున్న పేద కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలు అందించేందుకు తెలుగుభాషా సాంస్కృతిక వ్యవహారాలశాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కార్డుల జారీలో సంబంధిత శాఖ జిల్లాస్థాయి ఉద్యోగులు కొంతమంది ముఠాగా ఏర్పడి అనర్హులకు వందల కొద్దీ నకిలీ గుర్తింపు కార్డులను జారీ చేసినట్టు తెలుస్తోంది. నాటక రంగానికి ఏమాత్రం పరిచయం లేని అనేకమందికి తహసీల్దారు డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసి రంగస్థల వృత్తి కళాకారులుగా గుర్తింపు కార్డులు జారీ చేశారు. నకిలీ గుర్తింపు కార్డుల వ్యవహారంపై తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు తెలిసింది. నకిలీ కార్డులు వెలుగులోకి ఇలా.. ఈనెల 22న నిడమర్రు మండల వృత్తి కళాకారుల సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక పెదనిండ్రకొలను గ్రామంలో జరిగింది. సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం చేసే విషయంలో కళాకారుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఒక కార్యవర్గం జాబితా, ఉంగుటూరు నియోజకవర్గం కన్వీనర్ చల్లా సూర్యారావు ఒక కార్యవర్గ జాబితాఎవరికి వారే ప్రకటించుకుని ప్రమాణ స్వీకారం చేసి ముగించారు. అయితే ఈఎన్నికకు కళాకారులుగా గుర్తింపు కార్డులతో హాజరైన సభ్యులపై బొడ్డేపల్లి అప్పారావు వర్గానికి అనుమానం కలిగి జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా నిడమర్రు తహసీల్దారు డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసిన నకిలీ ధ్రువీకరణ పత్రాలతో 34 వరకూ తెలుగుభాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖకు దరఖాస్తు చేసినట్టు తెలిసింది. అప్పటి వరకూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు స్వీకరించినట్లు జిల్లా అధికారులు సైతం గమనించకపోవడం గమనార్హం. డిజిటల్ సైన్‌తో నకిలీ ధ్రువీకరణలు ఈ– ఆఫీస్ ద్వారా జారీ చేసే డిజిటల్ సైన్ ముద్ర, ఫైల్ నంబర్‌తో ఈ నకిలీ దందా బహిర్గతమైంది. నిడమర్రు మండలంలోని పలువురు తమని వృత్తి కళాకారులుగా గుర్తించాలని నిడమర్రు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా గ్రామాల పెద్దలను రెవెన్యూ సిబ్బందితో విచారించి అడవికొలను, చానమిల్లి, నిడమర్రు గ్రామాలకు చెందిన 9 మందిని వృత్తి కళాకారులుగా గుర్తించి ఈనెల 9న ఈ– ఆఫీస్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసారు. అయితే ఈ ధ్రువీకరణ పత్రాలపై ఉన్న డిజిటల్ సంతకం ముద్రను స్కానింగ్ చేసి ఫొటోషాప్ ద్వారా మరి కొంతమందికి నిడమర్రు తహసీల్దారు జారీ చేసినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు రూపొందించారు. అయితే తయారు చేసిన నకిలీ ధ్రువీకరణ పత్రాలపై ఒకే ఫైల్ నంబర్ 397 ఉంది. అలాగే స్కానింగ్ చేసిన ముద్ర కావడంతో తేదీ, సమయం మారలేదు. దీంతో ఒక సెకనులో 34 వరకూ ధ్రువీకరణ పత్రాలు ప్రింట్ చేసినట్లు అయ్యింది. ఆగమేఘాల మీద కార్డుల జారీ దరఖాస్తు చేసుకున్న రోజే గుర్తింపు కార్డులను అ«ధికారులు జారీ చేశారు. అలాగే ప్రతి విషయం డిజిటలైజేషన్ జరుగుతన్న తరుణంలో ఇంకా అధికారులు చేతిరాతతో రాసిన గుర్తింపుకార్డులు జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ నకిలీ దరఖాస్తులపై ఈనెల 19న దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా పౌరసంబంధాలశాఖ కార్యాలయం ముద్ర ఉంది. అదే రోజు వారందరికి చేతిరాతతో గుర్తింపు కార్డులను సహాయ సంచాలకులు తరఫున కిందిస్థాయి ఉద్యోగి ఇ.రామలింగేశ్వరరావు జారీ చేసినట్లు కార్డుల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇ. రామలింగేశ్వరరావును వివరణ కోరగా ఉన్నత అధికారులు బిజీగా ఉంటే, వారి తరఫున కళాకారుల గుర్తింపు కార్డులు తను జారీ చేసే అధికారం ఉందని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలించకుండానే ఒక మండలం నుంచి ఒకేసారి కొత్త దరఖాస్తులు 34 వచ్చినప్పుడు సదరు జిల్లా అధికారులకు అనుమానం రాకపోవడాన్ని కళాకారులు తప్పపడుతున్నారు. దరఖాస్తులు సమగ్రంగా పరిశీలిస్తే ఈ పొరపాటు జరగదని వారు చెబుతున్నారు. ఒక్కో కార్డుకు రూ.10 వేల వరకూ వసూలుచేసినట్టు తెలుస్తోంది. ఈ నకిలీ ముఠాలోకొంతమంది కళాకారులు, జిల్లా ఉద్యోగులతోపాటు, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హస్తం ఉన్నట్లు కళా కారుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంగళవారం సహాయ సంచాలకురాలు సుభాషిణికి పిర్యాదు చేసినట్లు సమాచారం. సంతంకం ఫోర్జరీ జరిగితే చర్యలు మండలంలో కళాకారులుగా గుర్తించాలని అందిన దరఖాస్తులపై పూర్తి విచారణ చేసి ఈనెల 9న తొమ్మిది మంది కళాకారులకు గుర్తింపు కార్డుల కోసం ధ్రువీకరణ పత్రాలు ఈ–ఆఫీస్ ద్వారా జారీ చేశాము. అయితే మరి కొంత మంది నా డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసి కొత్తగా కార్డులు పొందినట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు సంబంధిత శాఖ సహాయక సంచాలకులకు విచారణ చేయాలని రాతపూర్వకంగా తెలియజేశా. అలాగే మీ–సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లపై నిఘా పెట్టాలని గణపవరం సీఐ, నిడమర్రు ఎస్సైలను కోరాను. సంతకం «ఫోర్జరీ జరినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎం.సుందర్రాజు, తహసీల్దారు, నిడమర్రు పేద కళాకారులకు అన్యాయం అనర్హులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం వల్ల నిజమైన వృత్తి కళాకారులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే కళాకారులకు ప్రభుత్వం నుంచి లబ్ధి అరకొరగానే అందుతోంది. ఈ నకిలీలను అరికట్టకపోతే భవిష్యత్‌లో కళాకారులపై ప్రజల్లో చులకన భావం పెరుగుతుంది.– బొడ్డేపల్లి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు, రంగస్థల వృత్తి కళాకారుల సంఘం -
‘మహానటి’కి మరో గౌరవం..!
సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ వసూళ్లతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్లో జరుగునున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో మూడు ప్రధాన విభాగాల్లో మహానటి పోటి పడనుంది. ఈ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటి కేటగిరిలో కీర్తీ సురేష్ బాలీవుడ్ స్టార్స్ రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్, విద్యాబాలన్‌లతో.. సహాయ నటి కేటగిరిలో సమంత.. రిచా చడ్డా, ఫ్రిదా పింటో, మెహర్ విజ్‌లతో పోటి పడుతున్నారు. ఇక ఉత్తమ చిత్రం కేటగిరిలో తెలుగు సినిమా రంగస్థలంతో పాటు ప్యాడ్‌మ్యాన్, హిచ్కీ, సంజు, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి భారీ చిత్రాలతో మహానటి పోడిపడనుంది. -
అరుదైన ఘనత
వంద రోజుల క్లబ్లో చేరి ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరో ఘనతను సాధించింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2018’ (ఐఎఫ్ఎఫ్ఎమ్) స్క్రీనింగ్‌కి ఎంపిౖకై, బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఐఎఫ్ఎఫ్ఎమ్ వేడుకలు ఆగస్టు 10 నుంచి 22వరకు జరగనున్నాయి. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించారు. ‘రంగస్థలం’ స్క్రీనింగ్ సమయానికి రామ్‌చరణ్ మెల్బోర్న్ వెళ్లనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ సినిమా కూడా ఐఎఫ్ఎఫ్ఎమ్ స్క్రీనింగ్‌కు సెలక్ట్ అయిందని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. ఇలా ఈ ఏడాది వేసవిలో రిలీజైన ‘మహానటి, రంగస్థలం’ సినిమాలు అరుదైన ఘనతను సాధించాయి. -
‘రంగస్థలం’ 100 రోజుల వేడుక
-
‘రంగస్థలం’ జరగడానికి మూలకారకుడివి నువ్వే
‘‘ఈ సినిమా సక్సెస్ ఒక వ్యక్తి ఆలోచన. సుకుమార్ ఆలోచన నుంచే మొదలైంది. మంచి కథను తయారు చేసి మాతో యాక్ట్ చేయించింది. ఇది సుకుమార్‌గారి డ్రీమ్. ఆయన ఆలోచన స్థాయి వంద రోజుల వరకు తీసుకువచ్చింది. సుకుమార్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్యూ సుకుమార్‌గారు’’ అని రామ్‌చరణ్ అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగస్థలం’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 100 రోజుల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు, వంద రోజులు కంప్లీట్ చేసుకున్న థియేటర్స్ ఓనర్స్ అందరికీ 100 డేస్ షీల్డ్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ – ‘‘సినిమా 100 రోజులు ఆడిందంటే దాని వెనక ఎంతో మంది కృషి, శ్రమ, ప్రయత్నం ఉన్నాయి. నేను వర్క్ చేసిన నిర్మాతల్లో మైత్రీ వాళ్లు మోస్ట్ లవబుల్. రత్నవేలు గారితో నా అనుబంధం ‘ఖైదీ నంబర్ 150’ నుంచి స్టార్ట్ అయింది. ‘సైరా’ కూడా ఆయనే చేస్తున్నారు. దేవి గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. రాక్‌స్టార్. నీ (దేవిని ఉద్దేశించి) పాటలతో మా కొరియోగ్రాఫర్స్‌ని నేను కష్టపెడుతూనే ఉంటాను. నేను చేయను అని చిన్నపిల్లాడిలా వెళ్ళిపోతాను. రంగమ్మ అత్తలా చేసిన అనసూయకు కూడా థ్యాంక్స్. ఆది, సమంత, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ అందరికీ థ్యాంక్స్. మనం నేర్చుకునే పెద్ద విషయం అయినా చిన్న విషయం అయినా గురువుల నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం. వాళ్లని గుర్తు చేసుకోకుండా ఉండలేం. నాన్నగారిని గుర్తు చేసుకోవాలని అనుకోలేదు కానీ నాన్నగారిని అబ్జర్వ్ చేస్తుండగా ఒక మనిషికి ఎందుకు ఇంత ఆదరణ, ప్రేమ లభిస్తాయి అని గమనించాను. కేవలం మంచి సినిమాల వల్ల, గొప్ప పాత్రల వల్లే కాదు. ఆయన ఒకటే చెప్పారు. ‘మనం ఎదిగేటప్పుడు మనతో పాటు ఓ పది మందిని పైకి తీసుకురావాలని. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే ఆ పది మందే మనల్ని కాపాడతారు’. మా ఇండస్ట్రీని, మమల్ని కాపాడేవాళ్లు మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. వాళ్లు సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం. మా సినిమానే కాదు రేపు వచ్చే అన్ని సినిమాలు ఇలానే మంచి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సుక్కూకి థ్యాంక్స్’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ – ‘‘రంగస్థలం’ చిట్టిబాబు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏమీ ఉండదు. మళ్లీ మళ్లీ చెబుతున్నాను అని కాదు కానీ.. ‘నువ్వు (రామ్ చరణ్‌ని ఉద్దేశించి) ఓకే అనకపోతే ఈ కథ ఉండేది కాదు. నేను ఇంకో కథతో రెడీగా ఉన్నా. ఆ కథ చేసేవాడిని. సో ‘రంగస్థలం’ జరగడానికి మూలకారకుడివి నువ్వే. థ్యాంక్స్ డార్లింగ్’. నవీన్‌గారు, రవిగారు, మోహన్‌గారు చాలా మంచి నిర్మాతలు. ఈ సినిమా సక్సెస్ గురించి నాకు చెబుతూనే ఉన్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెర్రీగారు చాలా కష్టపడ్డారు. యుగంధర్, సతీష్‌గారికి థ్యాంక్స్. రత్నవేలు మంచి విజువల్స్ తీశారు. మై సోల్ దేవికి థ్యాంక్స్. రామ్‌చరణ్‌గారితో మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఉంది. లేకపోతే మళ్లీ నీకు, నాకు చాలా దూరం వస్తుందేమో.(ఎప్పుడెప్పుడూ ఏంటీ... తొందరగా చెప్పు.. మైక్ అందుకున్న చరణ్ సరదాగా నవ్వులు)’’ అన్నారు. నవీన్ యర్నేని మాట్లాడుతూ– ‘‘వంద అనేది ఈ రోజుల్లో ఉందా? అలాంటి వంద రోజుల చిత్రాన్ని మాకు ఇచ్చిన చరణ్‌గారికి, సుకుమార్‌గారికి, మా సినిమాకు పని చేసిన సభ్యులందరికీ థ్యాంక్స్. మా లైఫ్‌లో గుర్తుండిపోయే మూమెంట్ ఇది. ‘రంగస్థలం’ ఈజ్ మిరాకిల్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్, అనసూయ, బ్రహ్మాజీ, కొరియోగ్రాఫర్స్ జానీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వంద రోజుల ‘రంగస్థలం’
ప్రస్తుతం వంద రోజుల మూవీ అనే ఫీట్‌ను ఇప్పటి సినిమాలు సాధించడం కష్టం అవుతోంది. కానీ సరైన కథనం, తమ నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే నటీనటులు, చక్కని సంగీతం, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో సినిమాను తెరకెక్కిస్తే.. ఇప్పటి సినిమాలు సైతం మంచి కలెక్షన్లతో వంద రోజులు ఆడతాయని నిరూపించిన మరో మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ టేకింగ్.. ఈ సినిమాకు హైలెట్. ఈ లెక్కల మాష్టారు బ్రెయిన్‌కి టాలీవుడ్ లెక్కలన్నీ మారాయి. ఏ సినిమాలోనైనా హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగా చేసింది, విలన్ బాగా చేశాడనో మాట్లాడుకుంటాం. కానీ, రంగస్థలం గురించి మాత్రం అలా చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరు వారి పాత్రల్లో జీవించేలా చేశారు సుకుమార్. చిట్టిబాబు పాత్రలో చెర్రీ, కుమార్‌బాబు పాత్రలో ఆది, రామలక్ష్మి పాత్రలో సమంత, రంగమ్మత్తగా అనసూయ, తండ్రి పాత్రలో నరేష్, ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు, అజయ్ ఘోష్, జబర్దస్త్ కమెడియన్ మహేష్, శత్రు ఇలా ఏ ఒక్కరి పాత్రను తక్కువ చేయలేం. అందరూ తమ నటనతో అంతలా మెప్పించారు. 1980 నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపెట్టిన రత్నవేలు పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. నాటి పల్లెలు ఎలా ఉండేవో పరిశోధించి అచ్చం గ్రామాల్ని గుర్తుచేసేలా వేసిన ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణను కూడా అభినందించాల్సిందే. దాదాపు మూడు దశాబ్దాల కిందటి తరహాలో ఉన్న పాటలను ఉర్రూతలూగించేలా అందించి సినిమాకు పూర్తి న్యాయం చేశారు దేవీశ్రీ ప్రసాద్. బాణీలే కాకుండా సాహిత్యాన్ని కూడా ఆస్వాదించేలా రాసిన పాటల రచయిత చంద్రబోస్.. మరోసారి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాటలను అందించారు. నేటి డిజిటల్ యుగంలో పైరసీలు, అమెజాన్ ప్రైమ్‌లో క్వాలిటీ సినిమాలు వస్తున్నా... ఇంకా థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోన్న సినిమాల్లో రంగస్థలం ఒకటి. నేటికి రంగస్థలం సినిమా కొన్ని థియేటర్లలో వంద రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆర్టీసి క్రాస్ రోడ్‌లోని ఓ థియేటర్లో ఈ సినిమా దాదాపు కోటి 70లక్షలు వసూళ్లు చేసినట్టు సమాచారం. మరికొన్ని థియేటర్లలో కోటి రూపాయల కలెక్షన్లు సాధించి రికార్డు నెలకొల్పింది. 100DAYS OF IH RANGASTHALAM ⚡ pic.twitter.com/K5FSZX3qwu — Mythri Movie Makers (@MythriOfficial) July 6, 2018 -
షాకింగ్ : పైరసీలో భాగమతి, రంగస్థలం టాప్
సినీ పరిశ్రమను పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బయటికొచ్చేస్తుంది. కొన్ని సినిమాలైతే విడుదలకు ముందే పైరసీ భారినపడుతున్నాయి. దీనిపై పరిశ్రమ వర్గాలు ఎన్నిరకాలు చర్యలు చేపట్టిన పైరసీకి అడ్డుకట్ట పడటం లేదు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని కొన్ని ముఠాలు చిత్ర పరిశ్రమను హడలెత్తిస్తున్నాయి. జర్మన్ కేంద్రంగా పనిచేస్తున్న టెక్సిపియో సంస్థ గత ఆరేళ్ల నుంచి పైరసీ వెబ్సైట్లపై అధ్యయనం చేస్తోంది. ఆ డేటా ఆధారంగా 2018లో ప్రథమార్ధంలో విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధికంగా పైరసీకి గరయిన టాప్-10 సినిమాల జాబితాను ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది. పైరసీ జాబితాలో అనుష్క నటించిన భాగమతి 19లక్షల డౌన్లోడ్లతో అగ్రభాగాన నిలువగా, రామ్ చరణ్ , సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం 16 లక్షలతో రెండో స్థానంలోనిలిచింది.టెక్సిపియో ప్రతినిధి మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు సంబంధించిన పైరసీ షేరింగ్ భారత్‌లోనే కాకుండా యూఎస్, శ్రీలంక, సౌదీ అరేబియా, యూఏఈ, పశ్చిమాసియా దేశాల్లో అధికంగా ఉన్నట్టు తమ పరిశీలనలో బయటపడిందన్నారు. అదే విధంగా భారత్‌లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, ముంబై నగరాల్లో పైరసీ ఎక్కువగా చూస్తున్నారని తెలిపారు. పైరసీ టాప్-10లో నిలిచిన ఇతర సినిమాలు 3. భరత్ అనే నేను 4. మహానటి 5. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 6. తొలిప్రేమ 7. ఛలో 8. అజ్ఞాతవాసి 9. జై సింహా 10. టచ్ చేసి చూడు -
ఫస్టాఫ్ హిట్టే
మొదటి ఆరు నెలలు బాగా ఆడాయి.సినిమాల్లాగే బ్యాంక్ బ్యాలెన్సులు బాగానే నిండాయి.సినిమాలు ఇలాగే ఆడుతూ పాడుతూ భాగమతులను చేస్తూ, రంగస్థలంలో కదం తొక్కుతూ, భరత్ అనే నేనులా ప్రతిజ్ఞ చేస్తూ, తొలి ప్రేమలో మళ్లీ మళ్లీ పడుతూ, మహానటీనటులను ఆవిష్కరిస్తూ మనందర్నీ సమ్మోహనం చేస్తుండాలి. 6 నెలలు...సుమారు 60కి పైగా సినిమాలు..విజయాలెన్ని? వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని.కొన్ని సినిమాలు కనకవర్షం కురిపించాయి. కొన్ని వచ్చినంత వేగంగా వెళ్లిపోయాయి. అయితే ఈ ఏడాది హిట్‌గా నిలిచిన సినిమాలను లెక్కలోకి తీసుకుంటే.. 6 నెలల్లో ముఖ్యంగా 6 జానర్లు హిట్. ‘థ్రిల్, లవ్, రివెంజ్ డ్రామా, పొలిటికల్ డ్రామా, కామెడీ, బయోపిక్’ జానర్స్‌లో వచ్చిన మూవీస్‌లో పెద్ద హిట్టయిన సినిమాలున్నాయి. సిక్స్ మంథ్స్, సిక్స్ జానర్స్.. ఆ విశేషాలు తెలుసుకుందాం. లెక్క తేల్చింది ‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా. లెక్కలు తేలాలి’. గడచిన ఆరు నెలల్లో ఫేమస్ అయిన డైలాగ్స్‌లో ఇదొకటి. నిజంగానే బాక్సాఫీస్ వద్ద ‘భాగమతి’ లెక్కలు భేష్. లేడీ ఓరియంటెడ్ మూవీస్ మంచి వసూళ్లు రాబడతాయనడానికి అప్పటి అనుష్క ‘అరుంధతి’, ఇప్పుడు అదే అనుష్క సినిమా ‘భాగమతి’ మరోసారి నిరూపించాయి. ఈ ఏడాది తొలి నెలలో రిలీజైన తొలి థ్రిల్లర్ ఇది. థ్రిల్లర్ మూవీస్‌కి ట్రెండ్‌తో పని లేదు. స్టోరీ–స్క్రీన్‌ప్లే–లీడ్ క్యారెక్టర్ కుదిరి, డైరెక్టర్ బాగా తీయగలిగితే బొమ్మ హిట్. అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ థ్రిల్లర్ బాక్సాఫీస్ లెక్కలు తేల్చింది. థ్రిల్లర్ జానర్లో చిన్న బడ్జెట్‌తో రూపొందిన మరో మూవీ ‘అ!’ ఫిబ్రవరి 16న రిలీజై, మంచి ప్రయోగం అనిపించుకుంది. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సాగిన ఈ థ్రిల్లర్ ద్వారా హీరో నాని నిర్మాతగా మారారు. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి మార్కులు పడ్డాయి. అన్నట్లు జనవరిలో సంక్రాంతికి రిలీజైన పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ అంచనాలను అందుకోలేదు. బాలకృష్ణ ‘జై సింహా’ వసూళ్లు రాబట్టిన సినిమా అనిపించుకుంది. రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ బాక్సాఫీస్ చక్రాన్ని తిప్పలేకపోయింది. నెల మొదట్లో విడుదలైన అల్లాణి శ్రీధర్ ‘చిలుకూరి బాలాజీ’ మంచి డివోషనల్ మూవీ అనిపించుకుంది. ఇంకా ఈ నెలలో చోటా మోటా సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. థ్రిల్లర్ వెంటనే కామెడీ ఓ థ్రిల్లర్ మూవీ చూసిన వారానికి ఓ కామెడీ సినిమా చూసే అవకాశం వస్తే పండగే పండగ. ఒకవైపు ‘భాగమతి’ (జనవరి 26) థ్రిల్‌కి గురి చేస్తూ దూసుకెళుతోంది. అది విడుదలైన వారానికి ‘ఛలో’ (ఫిబ్రవరి 2) వచ్చింది. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్ స్టోరీ. ఈ మధ్య కాలంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమా అంటే ఇదే. కొత్త దర్శకుడు వెంకీ కుడుముల తీసిన ఈ సినిమాలో నాగశౌర్య హీరో. ఒక్కసారిగా నాగశౌర్య కెరీర్ గ్రాఫ్‌ని పెంచింది. ఐరా క్రియేషన్స్‌లో నాగశౌర్య తల్లిదండ్రులు శంకర్‌ప్రసాద్ మూల్పూరి, ఉషా మూల్పూరి తొలి ప్రయత్నంలోనే తమ బేనర్‌కి గుర్తింపు తెచ్చే సినిమా నిర్మించారు. ‘ఛలో’లా ఈ 6 నెలల్లో ‘కిర్రాక్ పార్టీ’ (ఫిబ్రవరి 16), ‘ఛల్ మోహన్ రంగ’ (ఏప్రిల్ 5) వంటి లవ్ బేస్డ్ కామెడీ మూవీస్ వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సో.. కామెడీ జానర్లో ప్రస్తుతానికి ‘ఛలో’నే బాగా కితకితలు పెట్టిందనొచ్చు. తొలి ప్రేమదే తొలి స్థానం కామెడీ బాగుంది ఛలో అంటూ నవ్వుకోవడానికి థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులను ఆ తర్వాతి వారం లవ్ జర్నీ చేయించింది. ఫస్ట్ లవ్ ఓ మధురాను భూతి. ‘తొలి ప్రేమ’ (ఫిబ్రవరి 10) సినిమా కూడా ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. ‘ఫిధా’ వంటి లవ్‌స్టోరీతో హిట్ ట్రాక్‌లో ఉన్న వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుణ్, రాశీ ఖన్నా కెమిస్ట్రీ, కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్.. మొత్తంగా ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ఫస్టాఫ్‌లో తెరకొచ్చిన లవ్‌స్టోరీస్‌లో ‘తొలి ప్రేమ’దే తొలి స్థానం. ఆ తర్వాత ప్రేక్షకులను సమ్మోహనపరిచిన మరో లవ్‌స్టోరీ ‘సమ్మోహనం’. ఫస్టాఫ్ ఎండింగ్లో ఈ చిత్రం మంచి ఫీల్‌ని కలగజేసింది. జూన్ 15న విడుదలైన ఈ లవ్‌స్టోరీ యాక్టింగ్‌వైజ్‌గా సుధీర్‌బాబు, అదితీ రావులకు మంచి పేరు తెచ్చింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ల కాంబినేషన్లో ‘జెంటిల్మన్’ తర్వాత మరో హిట్ నమోదైంది. ఈ ఏడాది లవ్ జానర్లో వచ్చిన మరో మూవీ ‘మెహబూబా’. వార్ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తనయుడు ఆకాశ్ హీరోగా పూరి జగన్నాథ్ తీశారు. మే 11న విడుదలైన ఈ లవ్‌స్టోరీ భారీ అంచనాల నడుమ విడుదలై, పూరి నుంచి వచ్చిన ఓ ప్రయోగం అనిపించుకుంది. ఇక ఫిబ్రవరిలో విడుదలైన వేరే సినిమాలు రవితేజ ‘టచ్ చేసి చూడు’, మోహన్‌బాబు ‘గాయత్రి’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటెలిజెంట్’ వంటి వాటి నుంచి ప్రేక్షకులు ఇంకా ఏదో ఆశించారు. విన్నారా.. 200 కోట్లకు పైనే! మార్చి, ఏప్రిల్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి పరీక్షే. పరీక్షలకు ప్రిపేరయ్యే పిల్లలు థియేటర్లకు రారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివించడంతో బిజీ అవుతారు. సినిమా ఎంతో బాగుంటే తప్ప రారు. ‘రంగస్థలం’ అలాంటి మూవీ. ఇప్పుడు వెళుతోన్న ట్రెండ్‌కి ఫుల్ డిఫరెంట్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామా. గళ్ల లుంగీ, పూల చొక్కా, గడ్డం, కేర్లెస్ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ ఒక ఎత్తయితే చెవిటివాడిగా రామ్‌చరణ్ కనిపించడం మరో ఎత్తు. అర్బన్ మూవీస్ చేస్తున్న రామ్‌చరణ్‌తో రూరల్ బ్యాక్‌డ్రాప్ ఓ సాహసం. వినిపించని క్యారెక్టర్లో అంటే ఇంకా సాహసం. దర్శకుడు సుకుమార్ ఈ సాహసంలో సక్సెస్ అయ్యారు. నటుడిగా రామ్‌చరణ్ మంచి అంటే సరిపోదు.. అంతకు మించి అనాలి. అంత బాగా చేశారు. మార్చి 30న రిలీజైన ‘రంగస్థలం’ ఫస్ట్ డేనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 200 కోట్లకు పైగా వసూలు చేసి, ‘వింటున్నారా.. మా సినిమా కలెక్షన్స్’ అని వినపడనట్లు వ్యవహరించిన వాళ్లకూ గట్టిగా సౌండ్ చేసి మరీ చెప్పింది. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’.. ఇలా వరుస హిట్లతో ఉన్న మైత్రీ మైవీ మేకర్స్ నిర్మాతలు మోహన్ చెరుకూరి, నవీన్ యర్నేని, వై. రవిశంకర్ హ్యాట్రిక్ సాధించారు. మార్చిలో వచ్చిన ఇతర చిత్రాలు ‘దండుపాళ్యం 3’, కల్యాణ్ రామ్ ‘ఎంఎల్ఎ’ ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయాయి. ఇదే నెలలో వచ్చిన శ్రీవిష్ణు ‘నీదీ నాదీ ఒకే కథ’ బాగుందనిపించుకుంది. ఈ చిత్రంతో దర్శకుడు వేణు ఊడుగుల సీరియస్ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. సక్సెస్‌కు హామీ మార్చిలో ‘రంగస్థలం’ రూపంలో ఓ బంపర్ హిట్ తగిలితే ఏప్రిల్ మరో బంపర్ హిట్ ఇచ్చింది. ‘భరత్ అనే నేను’ హామీ ఇస్తున్నాను.. అని సినిమాలో మహేశ్‌బాబు అంటారు. ట్రైలర్లో ఈ డైలాగ్ విని, సూపర్ డూపర్ హిట్ ఇస్తామని చిత్రనిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు కొరటాల శివ హామీ ఇచ్చినట్లుగా ఫ్యాన్స్ అనుకున్నారు. అదే జరిగింది. ఈ స్టైలిష్ పొలిటికల్ డ్రామాలో మేడమ్ స్పీకర్ అంటూ స్టైలిష్ ఇంగ్లిష్తో, సీఎంగా గంభీరమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నారు మహేశ్‌బాబు. ఈ పొలిటికల్ జానర్‌ని కొరటాల శివ ఎంతో ఇంటెలిజెంట్‌గా తీసినట్లుగా అనిపిస్తుంది. వసూళ్లు 200 కోట్లు దాటాయి. ఈ సినిమా తర్వాత ఏప్రిల్‌లో మిగతా సినిమాలు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వంటివి వచ్చాయి. మంచు విష్ణు–జి. నాగేశ్వరరెడ్డిలది సూపర్ హిట్ కాంబినేషన్. అందుకే ఇంకా ఇంకా ఏదో కావాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. వరుస విజయాలతో దూసుకెళుతోన్న నాని విషయంలోనూ ఇదే జరిగింది. మహాద్భుతం మే ఆశాజనకంగా మొదలైంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ (మే 4) అంటూ దేశభక్తి సినిమాతో అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చారు. ఇప్పటివరకూ బన్నీ చేయని బ్యాక్‌డ్రాప్. రియల్ సోల్జర్ ఎలా ఉంటారో అలా ఫిజిక్‌ని మార్చుకున్నారు. లుక్ పర్ఫెక్ట్. యాక్టింగ్ సూపర్. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ నిర్మాత. నాగబాబు సమర్పకులు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఇందులో ‘సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటి నిండుగా నిదర పోదురా..’ అనే పాట మనసుకి హత్తుకుంటుంది. సినిమాలో ఆ డెప్త్ లోపించిందన్నది కొందరి వాదన. ఏదైతేనేం దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. ఇదే నెలలో (మే 9) వచ్చిన ‘మహానటి’ ఓ అద్భుతం. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం సినిమాలు చూడటం మానేసిన ప్రేక్షకులను కూడా థియేటర్‌కి రప్పించింది. సావిత్రి మీద ఉన్న అభిమానం అలాంటిది. అఫ్కోర్స్ సినిమా బాగా లేకపోతే కష్టమే. సావిత్రిగా కీర్తీ సురేష్ అభినయం భేష్. రిలీజయ్యాక జెమినీ గణేశన్ పాత్ర, కొన్ని విషయాలపరంగా విమర్శలు వచ్చినా అవేవీ సినిమా చూడనివ్వకుండా ఆపలేకపోయాయి. బయోపిక్ జానర్లో ఈ ఏడాది వచ్చిన ఈ తొలి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నా దత్‌లు తండ్రి అశ్వనీదత్‌లా మంచి నిర్మాతలు అనిపించుకున్నారు. మేలో వచ్చిన రవితేజ ‘నేల టిక్కెట్టు’ అనుకున్నంతగా టిక్కెట్లు తెంచలేకపోయింది. నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ అతని ‘ఛలో’ స్పీడ్‌ని అందుకోలేకపోయింది. సమ్మోహనపరిచింది జూన్ 1 నిరాశగా మొదలైంది. ‘శివ’తో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న నాగార్జున–రామ్‌గోపాల్‌వర్మల నుంచి ‘ఆఫీసర్’ వస్తోందంటే ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇద్దరి ఫ్యాన్స్. నెల మొదటి రోజున రిలీజైన నాగార్జున ‘ఆఫీసర్’, ఆ తర్వాత కల్యాణ్ రామ్ ‘నా నువ్వే’, రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ వంటి పెద్దా చిన్నా సినిమాలు రిలీజయ్యాయి. వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. ‘సమ్మోహనం’ ఓ రిలీఫ్. కామెడీ జానర్ ‘జంబలకిడి పంబ’ నాటి ‘జంబ లకిడి పంబ’ అంతగా నవ్వించలేకపోయింది. కమెడియన్ ‘షకలక’ శంకర్ హీరోగా నటించిన ‘శంభో శంకర’ గత శుక్రవారం రిలీజైంది. అదే రోజున ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు. ఆల్మోస్ట్ కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ‘పెళ్ళి చూపులు’తో మంచి దర్శకుడని నిరూపించుకున్న తరుణ్ భాస్కర్ ఈ చిత్రంతో ఆ ఇమేజ్‌ని ఇంకా పెంచుకోగలిగారు. ఫస్టాఫ్ క్లోజింగ్ ఈ హిట్‌తో ముగిసిందనాలి. ఇక వచ్చే ఆరు నెలలు ఎలా ఉంటుందో చూద్దాం. గతించిన కాలం కంటే రాబోవు కాలము మేలు అనే సామెతను గుర్తు చేసుకుందాం. – డి.జి. భవాని -
నంబర్‌ఒన్ స్థానానికి..
తమిళసినిమా: ఏ రంగంలోనైనా ఎవరైనా కోరుకునేది నంబర్‌ఒన్ స్థానాన్నే. ఇందులో మార్చు ఉండదు. సినిమా రంగం దీనికి అతీతం కాదు. అయితే ఈ రంగంలోని వారి గోల్ అదే అయినా పైకి మాత్రం నంబర్‌ఒన్ ఆశ లేదని, అది నిరంతరం కాదని, ప్రతి శుక్రవారం ఆ స్థానం మారుతుంతుందని అంటుంటారు. ముఖ్యంగా ఈ మాటలను కథానాయికల నుంచి వింటుంటాం. అయితే దేనికైనా విజయాలే కొలమానం కాబట్టి, దాన్ని బట్టే ఇక్కడ స్థానాలు నిర్ణయించబడతాయన్నది నిజం. కాగా ప్రస్తుతం కోలీవుడ్‌లో నంబర్‌వన్ కథానాయకి స్థానంలో నయనతార, టాలీవుడ్లో అనుష్క పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరు నటించిన చిత్రాలు సక్సెస్ అవుతున్నా, నటిస్తున్న చిత్రాల విడుదల్లో జాప్యం జరుగుతోంది. చేతిలో పలుచిత్రాలు ఉన్నా, అరమ్ చిత్రం తరువాత నయనతార నటించిన మరో చిత్రం తెరపైకి రాలేదు. అదే విధంగా నటి అనుష్క భాగమతి చిత్రం మరో చిత్రాన్ని అంగీకరించిన దాఖలాలు లేవు. ఇంతకు ముందు చెప్పినట్లు విజయాలే కొలమానం కాబట్టి 2018లో నంబర్‌వన్ స్థానాన్ని సమంత ఆక్రమించుకున్నారనే ప్రచారం మొదలైంది. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం రంగస్థలం, ద్విభాషా చిత్రం మహానటి, తమిళ చిత్రం ఇరుంబుతిరై చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి. ఇలా ఒకే ఏడాది వరుసగా విజయాలను అందుకున్న నటి సమంతనే అని చెప్పాలి. అంతే కాదు ఇరుంబుతిరై తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదంమై వసూళ్లను సాధిస్తోంది. ఈ విజయంలోనూ సమంత భాగం పంచుకున్నారు. తాజాగా సమంత తమిళంలో మరో 3 చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో విజయ్‌సేతుపతితో సూపర్ డీలక్స్, శివకార్తికేయన్‌కు జంటగా సీమరాజా, ద్విభాషా చిత్రం యూ టర్న్. ఈ మూడు చిత్రాలపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. అదేవిధంగా ఇవి కూడా ఈ ఏడాదే తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. వీటి రిజల్ట్ కూడా పాజిటివ్‌గా వస్తే కచ్చితంగా నంబర్‌వన్ స్థానం సమంతదే అవుతుంది. ఇరుంబుతిరై చిత్ర సక్సెస్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సూపర్ డీలక్స్ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. -
ఆ బుడ్డోడిని కిడ్నాప్ చేస్తా : సమంత
రంగస్థలం సినిమా ఎంత హిట్టయిందో అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘రంగమ్మ మంగమ్మ’ సాంగ్ అయితే జనాల్లోకి బాగా దూసుకెళ్లింది. ఈ పాటపై ఎన్నో స్ఫూప్‌లు వచ్చాయి. నటుడు ఉత్తేజ్ కూతురు కూడా మెగా హీరో రామ్‌చరణ్ నటనను పొగుడుతూ రంగమ్మ మంగమ్మ పాటను పేరడీ చేశారు. తాజాగా ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. గతంలో ఓ తాత, రంగమ్మ మంగమ్మ పాటను పాడాడు. అది సమంతకు నచ్చడంతో.. ఆమె ‘మేడ్ మై డే’ అంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఓ బుడతడు రంగమ్మ పాటకు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను సమంత అభిమాని ఒకరు ఆమెకు ట్యాగ్ చేయగా.. సమంత సరదాగా స్పందించారు. ‘ఆ చిన్నారి బాలుడిని కిడ్నాప్ చేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. Okay I am kidnapping this cutie ❤️❤️❤️ https://t.co/Z3GH0jsA3A — Samantha Akkineni (@Samanthaprabhu2) June 7, 2018 -
బుడతడి డ్యాన్స్‌కు సమంత ఫిదా..
-
‘రంగస్థలం’ క్లైమాక్స్ వివాదం..సుకుమార్ క్లారిటీ
రంగస్థలం సినిమాను ఇటు మెగా అభిమానులే కాదు...అటు తెలుగు ప్రేక్షకులు కూడా మర్చిపోలేరు. సుకుమార్ సృజనాత్మకతకు రంగస్థలం నిదర్శనం. కథను చెప్పిన విధానం, ప్రేక్షకులు మెచ్చేలా తీసిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. చరణ్ అద్భుత నటన, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ డైరెక్షన్ ఈ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. రంగస్థలం కాన్సెప్ట్ తనదేనంటూ,తన కథను కాపీ కొట్టారంటూ గాంధీ అనే వ్యక్తి రచయితల సంఘంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సుకుమార్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా రచయితలగా సంఘం కోరగా... తాను గానీ , తన బృందంలోని సభ్యులు గానీ గాంధీ అనే వ్యక్తిని అసలు కలుసుకోలేదనీ చెప్పాడు. ఉరిశిక్ష పడ్డ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉరి తీస్తారనీ, ఆ లైన్‌తోనే తాను క్లైమాక్స్‌ను రాసుకున్నానని తెలిపారు. తాను చిన్నప్పుడు ధర్మ యుద్దం సినిమా చూసినప్పటి నుంచీ తనలో ఆ పాయింట్ గుర్తుండిపోయిందనీ, అంతేకాకుండా సిడ్నీ షెల్డన్ రాసిన ఎ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్, బాలీవుడ్ మూవీ అంజామ్‌లో కూడా ఇదే లైన్ ఉంటుందనీ వివరించారు. అయితే తాను ఎంచుకున్న ఈ లైన్‌కు తనదైన పద్దతిలో కథ, కథనాన్ని రచించానంటూ వివరణ ఇచ్చాడు. ఓ సినిమా వివాదాలు లేకుండా ఈ మధ్య కాలంలో గట్టెక్కితే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటలో ఓ పదం ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందనడంతో ఆ పదాన్నితొలిగించేశారు. భరత్ అనే నేను సినిమా కథను కొరటాల శివ ఓ రచయిత దగ్గరి నుంచి కొన్నాడని, అది వేరే ఓ హీరో కోసం రెడీ చేసిన కథ అంటూ వివాదాలు వచ్చాయి. తర్వాత కొరటాల వీటిపై క్లారిటీ ఇచ్చేశాడు. మహానటిపై ఎలాంటి వివాదాలు లేవు అనుకునే సమయానికి.. జెమినీ గణేశన్ పాత్రను తక్కువ చేసి చూపారనీ, నెగిటివ్‌గా చూపారనీ విమర్శలు వచ్చాయి. -
సమంత సిస్టర్.. మీ పాట ఎంతో పాపులర్
-
సమంతను ఇంప్రెస్ చేసిన తాతయ్య
స్టార్ హీరోయిన్ సమంత షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. తన సినిమాల అప్డేట్స్ తో పాటు సరదా సంగతలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటారు. తాజాగా సామ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ట్విటర్లో ఓ వ్యక్తి తన తాతయ్య రంగస్థలం సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాట పాడిన వీడియోను సమంతను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘సమంత సిస్టర్.. మీ పాట ఎంతో పాపులర్. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ మీ పాట పాడుకుంటున్నారు. తాతయ్య రాకింగ్. అద్భుతమైన పాట ఇచ్చినందకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన సమంత ‘మేడ్ మై డే’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం యూటర్న్ షూటింగ్లో బిజీగా ఉన్న సామ్, త్వరలో నాగచైతన్యతో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. 😂😂😂made my day https://t.co/QMhN4UHhWj — Samantha Akkineni (@Samanthaprabhu2) 26 May 2018 -
ఈ సిట్టిబాబు సెవిలోకి మాటెల్లడం కష్టం గానీ...
అరసవల్లి : ‘ఈ సిట్టిబాబు సెవిలోకి మాటెల్లడం కష్టం గానీ...’ అంటూ చరణ్ పలికిన డైలాగులు ఇంకా ఎవరి చెవినీ దాటిపోలేదు. ఇలాంటి డైలాగుల వెనుక ఉన్న జట్టులో రొంగలి శ్రీనివాస్ కూడా ఒకరు. యాభై రోజుల కిందట విడుదలై సూపర్ హిట్ కొట్టిన రంగస్థలం సినిమాకు ఆయన రచయితగా పనిచేశారు. సహాయ స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. ఆయన శుక్రవారం కుటుంబ సమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇలా ముచ్చటించారు. సాక్షి: రంగస్థలం రచయితగా అవకాశం ఎలా వచ్చింది..? రొంగళి: సినిమాల్లో రచయితగా అరంగ్రేటం చేసి సుమారు పదేళ్లు అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ వద్ద చాలా కాలంగా పనిచేస్తూ ఉండడంతో రంగస్థలంకూ పనిచేశాను. ఈ సినిమాకు సహాయ స్క్రీన్‌ప్లే కూడా అందించాను. ఇప్పటి వరకు ఏడు సినిమాలకు రచయితగా పనిచేశాను. దాదాపుగా అన్నీ సూపర్ హిట్లే కావడంతో అవకాశాలు వస్తూ ఉన్నాయి. సాక్షి: రంగస్థలంలో డైలాగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. దాని గురించి.. రొంగళి: థాంక్యూ.. నిజంగా డైలాగులు నాకు కూడా పేరుతెచ్చాయి. ఈ డైలాగ్స్‌ను 80ల్లో వా డుక భాషకు తగ్గట్టుగా రాసి ప్రేక్షకులకు మెప్పించడంలో సఫలమయ్యాననే ఆనందంగా ఉంది. అత్త అనసూయతో హాస్యం, ప్రేయసి సమంతతో ప్రే మ, అన్న ఆది పినిశెట్టితో ఆప్యాయత, ప్రకాష్ రాజ్‌పై కసి ఇలా అన్ని రంగాల్లో డైలాగ్స్ అద్భుతంగా రావడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో వినిపించని వ్యక్తిగా చరణ్ నటనకు తగ్గట్టుగా డైలాగ్స్ రాశాను. సాక్షి: మీరు ఉపాధ్యాయుడిగా పనిచేశారని తెలిసింది. నిజమేనా? రొంగళి: అవును. విశాఖ జిల్లా చోడవరం నా సొంత ఊరు. కృష్ణా జిల్లాలో డైట్ చేసి తొలి ప్రయత్నంలోనే డీఎస్సీలో ఎంపికై చోడవరంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేశాను. అయితే చిన్నప్పటి నుం చి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వది లిపెట్టి సినీరంగంలోకి అడుగుపెట్టాను. ప్రేక్షకుల ఆదరణతో ఈరోజు ఈ స్థాయికి చేరాను. సాక్షి: ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి ఏంటి? రొంగళి: నాకు ఈ రంగంలో లైఫ్ ఇచ్చింది డైరెక్టర్ సుకుమార్. ఆయన దర్శకత్వ టీమ్‌లో నేను కూ డా కీలక సభ్యుడినే. నేను రచయితగా కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, వన్ తదితర చిత్రాల్లో పనిచేశాను. ఇప్పుడు రంగస్థలం వీటిలో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టింది. నాన్నకు ప్రేమతో సినిమాలో నాన్నపై సెంటిమెంట్ డైలాగ్స్ కూడా మంచి పేరు తెచ్చాయి. సాక్షి: శ్రీకాకుళం జిల్లాకు రావడం వెనుకఏమైనా ప్రత్యేకత ఉందా? రొంగళి: ఉంది. రంగస్థలం సినిమా హిట్ అవ్వాలని, మా అక్క సుధ ఈ జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయానికి వచ్చి అక్కడ పవిత్ర గోలెంలో కోరిక చెప్పిందట. అందుకే ఇలా వచ్చి మొక్కు తీర్చుకున్నాను. అలాగే ఎప్పటి నుంచో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని కూడా దర్శించుకోవాలనే కోరిక తీరింది. అరసవల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కోడూరు సురేష్‌కుమార్ సహాయంతో ఆదిత్యున్ని దర్శించుకున్నాను. అలాగే శుక్రవారంతో రంగస్థలం సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అందుకే నా స్నేహితుడు సురేష్ కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాను. సాక్షి: భవిష్యత్ ప్రణాళికలేమైనా..! రొంగళి: రచయితగా సక్సెస్ అయిన వారంతా దర్శకులుగా మారినట్లే.. నేను కూడా వచ్చే ఏడాది దర్శకత్వం చేసేందుకు సిద్ధమయ్యాను. కథను సిద్ధం చేసుకున్నాను. అయితే ప్రస్తుతం మహేష్‌బాబుతో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు సహాయ దర్శకత్వం, రచయితగా పనిచేస్తున్నాను. ఇది పూర్తయితే పూర్తి స్థాయిలో మెగా ఫోన్ పడతాను. -
మహేశ్‌బాబు.. నేను మంచి స్నేహితులం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించటంతోపాటు నటుడిగా కూడా రామ్ చరణ్ స్థాయిని పెంచింది. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సుమారు ఇరవై రోజుల తర్వాత మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్‌లతో రామ్‌చరణ్, మహేష్ బాబులు ఇద్దరు ఖుషీగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ చరణ్, మహేశ్ అభిమానుల మధ్య మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ విషయంపై స్పందించిన రామ్ చరణ్.. తాను, మహేష్ బాబు మంచి స్నేహితులమని తెలిపాడు. తమ మధ్య ఎలాంటి పోటీలేదని, ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందంటూ తాము లెక్కలేసుకోమని ఓ జాతీయ మీడియాతో చెప్పాడు. మహేష్ సినిమాలు విడుదలైన సమయంలోనే.. ఆయనకు పోటీగా తన సినిమాలు విడుదల చేస్తున్నారంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెర్రీ మండిపడ్డాడు. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ఘనవిజయం సాధించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్న మెగా పవర్‌స్టార్.. వ్యక్తిగత విజయాల కన్నా తెలుగు చిత్ర పరిశ్రమ శ్రేయస్సే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా రామ్‌చరణ్ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. -
రంగస్థలం
ఆ ఊరి పేరు ‘రణస్థలం’. కానీ, కాదు. ‘‘ఇది పెన్ను అనుకుంటున్నావా? కాదు గన్ను’’ అని అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు... అది రణస్థలం అనుకుంటున్నారా? కానే కాదు రంగస్థలం. మరి ‘రంగస్థలం’ కాస్తా ‘రణస్థలం’ ఎలా అయిందంటే...తమ ఊరి పేరులోనే కళ ఉంది. ఆ కళను కళకళలాడించడానికి ‘రంగస్థలం’ పేరుతో ఒక నాటక సమాజాన్ని స్థాపించుకున్నారు ఊరి ప్రజలు. తమ ‘రంగస్థలం’ పృ«థ్వీరాజ్కపూర్ ‘పృ««థ్వీ «థియేటర్స్’లా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు.నటుల ఎంపిక పూర్తయింది.కొద్ది రోజుల తరువాత ‘రంగస్థలం’ వారి తొలి ప్రదర్శన మొదలైంది. ఇప్పుడు మనం ప్రేక్షకుల్లో కూర్చొని ‘రంగస్థలం’ కళాకారుల నట, గాన విన్యాసాలను ఆసక్తిగా చూద్దాం...అదిగో రావణ పాత్రధారి రంగస్థలం మీదికి వస్తున్నట్లుగా ఉంది. వచ్చేలోపు అతడి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. అతని పేరు రాజేషం. ఈ రాజేషానికి మతిమరుపు ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి రాజేషానికి రావణుడి వేషం ఎలా దక్కింది? ‘రంగస్థలం’ స్పెషాలిటేమిటంటే నటుల ఎంపిక టాలెంట్ మీద ఆధారపడి ఉండదు. వేలంపాట మీద ఆధారపడి ఉంటుంది. అంటే... ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఇష్టమైన వేషం దక్కుతుంది. మతిమరుపు ఉన్నా సరే... రాజేషానికి రావణుడి వేషం దక్కడానికి కారణం వేలంలో ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చి ఆ వేషాన్ని సొంతం చేసుకోవడమే. అలాగని తన పాత్రను లైట్‌గా తీసుకోలేదు రాజేషం.చాలా వెయిట్ పెరిగాడు. తన డైలాగులను రాత్రి పగలు అనే తేడా లేకుండా బట్టీ పట్టాడు.‘రంగస్థలం’ వేదిక దగ్గరకు బయలు దేరేముందు...తన భార్య ముందు నిల్చొని...‘‘ఇవ్వాళ మన పొగ్రాం ఉంది. అదరగొడతాను... నా డైలాగు విను’’ అన్నాడో లేదో ఆమెకు కోపం వచ్చింది.‘‘ కొత్తగా వినేదేమిటి నా బొంద? మీరు ఇల్లంతా అదిరిపోయేలా ప్రాక్టీస్ చేస్తుంటే రోజూ ఇనలేక ఛస్తున్నాను. అవి నా నోటికి కూడా వచ్చాయి’’ అంటూ ఆమె నోరు పెంచి డైలాగ్ అందుకుంది...‘హా హా హాహా హా హాటెక్కుల మారి టక్కులాడితంటాలతో తైతక్కలతోమా తాతలను మైమరిపించిఅమృతకలశం హరించారుకదూకామధేనువును,కల్పతరువును ఆకట్టుకొనిమాకు సున్నా చుట్టారు కదూహా హా హా’‘శబ్బాష్’ అని భార్యని మెచ్చుకుంటూ అక్కడి నుంచి ‘రంగస్థలం’ వేదిక దగ్గరకు వెళ్లాడు రాజేషం.‘‘వుప్పుడు మేకతోకల రాజేషం ప్రదర్శించు రావణుడి ఏకపాత్రాభినయం’’ అని ఎనౌన్స్మెంట్ వినిపించింది. రావణ పాత్రధారి రాజేషం స్టేజీ మీదకు వచ్చాడు. రావణుడి వేషంలో ఉన్న రాజేషాన్ని చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు వేస్తున్నారు. దీంతో రాజేషానికి మరింత హుషారు వచ్చింది.మీసం తిప్పాడు.గద పైకెత్తి ఠీవిగా భుజాల మీద పెట్టుకున్నాడు.గొంతు సవరించాడు.గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్లయింది. డైలాగ్ గుర్తుకు రావడం లేదు. డైలాగు గుర్తు లేదుగానీ... డైలాగుకు ముందు వచ్చే పెద్ద నవ్వు మాత్రం గుర్తుంది.డైలాగ్ గుర్తు వచ్చేవరకు నవ్వుతో మానేజ్ చేద్దామనుకొని ‘హా హా హా’ అని పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. అలా పదినిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా నవ్వుతూనే ఉన్నాడు.‘‘నవ్వింది చాలుగాని.... డైలాగ్ కొట్టు బే’’ అని ప్రేక్షకుల నుంచి ఒక గొంతు వినిపించింది. ఈలోపే పాత చెప్పొక్కటి వచ్చి రాజేషం మూతిని తాకింది. తాకితే తాకిందిగానీ... అది రాజేషం పెట్టుడు మీసాన్ని తాకింది. దాంతో అది ఊడి కిందపడిపోయింది.ఈసారి నవ్వడం ప్రేక్షకుల వంతయింది! దీంతో రెండు వర్గాల మధ్య(రాజేషం మిత్రవర్గం, శత్రువర్గం) ఘర్షణ మొదలైంది.‘‘వుప్పుడు పీకల వెంకటేషం ఇంద్రధనస్సు సినిమాలోని పాటను తన మధురకంఠంతో వినిపించి మిమ్మల్ని మైమరపింపజేస్తాడు’’ అని ఎనౌన్స్మెంట్ వినిపించడంతో గొడవ సద్దుమణిగి అందరూ సైలెంటైపోయారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి... రాజేషంలా వెంకటేషం మతిమరుపు మైండ్ కాదు. మాంచి గాయకుడు. కానీ అప్పుడప్పుడూ మందుకొడుతుంటాడు. అతను స్టేజీ ఎక్కే ముందు ఎవడో అభిమాని క్వార్టర్ సీసా చేతిలో పెట్టాడు. మనవాడికి ఆత్రం ఎక్కువ. అదేదో పాట పూర్తయినాక తాగవచ్చుకదా... స్టేజీ ఎక్కే ముందు చాటుకు వెళ్లి సగం లాగించాడు. ఆ తరువాత...మైక్ ముందుకు వెళ్లి గొంతెత్తాడు.‘నేనొక ప్రేమ పిశాచిని.నువ్వుక ఆస్థమవాసివి.నా దాహం తీరనిది’ అని పాడుతూ జేబులో మిగిలి ఉన్న క్వార్టర్ సీసాను స్టేజీ మీదనే ఖాళీ చేశాడు వెంకటేషం. జనంలో హాహాకారాలు. కారాలు మిరియాలు. లొల్లి లొల్లి.... ఎవరు ఎవర్ని తిడుతున్నారో తెలియడం లేదు. ఎవరు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు. ఒకడు ఇంకొకడి కాలరు పట్టుకున్నాడు... ఎందుకో తెలియదు. ఒకడు ఇంకొకడి జుట్టు పట్టుకున్నాడు... ఎందుకో తెలియదు. రంగస్థలం కాస్త రణస్థలం అయింది. పట్నం నుంచి పోలిసు వ్యాన్ దిగింది. దొరికినవాడిని దొరికినట్లు చావబాదారు పోలీసులు. ఇక అప్పటి నుంచి కళ అనే మాట వినబడితే కలరా సోకినట్లుగా గజగజా వణికిపోతారు రణస్థలం గ్రామస్తులు! – యాకుబ్ పాషా -
చరణ్ సినిమాకు భారీ ఆఫర్
రంగస్థలం సినిమాతో ఘనవిజయం అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బోయపాటి రామ్ చరణ్ హీరోగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఉత్తరాది నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు హిందీ డబ్బింగ్ వర్షన్‌ను ఆన్లైన్లో 16 కోట్ల మందికి పైగా వీక్షించారు. దీంతో బోయపాటి సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్లకు భారీ క్రేజ్ ఏర్పడింది. చరణ్ కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు కావటంతో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఓ ఉత్తరాది సంస్థ ఈ సినిమా అనువాద హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. -
మహేష్ సినిమా పనులు మొదలెట్టిన సుకుమార్
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన వన్ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించటంతో సుకుమార్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. రంగస్థలం తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సుకుమార్.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించబోయే సినిమా పనులు ప్రారంభించాడు. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసిన చిత్రయూనిట్ ఇతర సాంకేతిక నిపుణులను నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. -
కథల ఎంపికలో వారినే ఫాలో అవుతా: రామ్ చరణ్
సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురుపించిన సంగతి తెలిసిందే. వినికిడి లోపం గల పల్లెటూరి యువకుడి పాత్రలో రామ్ చరణ్ ప్రేక్షకులను మెప్పించాడు. రంగస్థలంలో అలాంటి పాత్ర చేయడానికి సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లు ఆదర్శం అంటున్నారు రామ్ చరణ్. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘వాణిజ్య విలువలతో పాటు.. కథాబలం ఉన్న చిత్రాల్లో నటించాలనుకునే వారికి బాలీవుడ్ స్టార్స్ ఆమిర్, సల్మాన్‌లు ఆదర్శంగా నిలుస్తారు. నేను కథల ఎంపికలో వారినే ఫాలో అవుతాను. దంగల్, బజరంగీ భాయ్‌జాన్ చిత్రాలు ఎంతోమంది నటులకు, దర్శకులకు, నిర్మాతలకు స్ఫూర్తిదాయకం. ఈ తరం నటులకు ఆమిర్, సల్మాన్ ఐకాన్‌గా నిలుస్తారు’ అని చెప్పారు. తన రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమా బిజినెస్ మీద అసలు దృష్టి సారించలేదు. 1980ల నాటి ఆ పాత్రకు ఎలా న్యాయం చేయగలనని మాత్రమే ఆలోచించాను. మేము చేస్తున్న ఓ పీరియాడిక్ డ్రామాని, ముఖ్యంగా అందులోని క్యారెక్టర్ని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారనే ఒత్తిడి అయితే ఉండేది. కానీ ఈ చిత్ర విజయం మాలో ఉత్తేజాన్ని నింపింది. ఒక నటుడిగా నేను ఎంతో సంతృప్తి చెందిన చిత్రమిది. ఈ చిత్రంలో నిర్మించిన విలేజ్ సెట్ అభిమానులను ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది’ అని తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై చరణ్ స్పందిస్తూ.. చాలా రోజుల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది ఒక చాలెజింగ్ రోల్ అని అనుకుంటున్నాను.. ఇంకా రాజమౌళి స్కిప్ట్ వర్క్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. -
సినీరంగంలో వంచకులు ఉన్నమాట నిజమే !
సినీరంగంలో వంచకులు ఉన్నమాట నిజమేనని.. అయితే అలాంటి వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారని హీరోయిన్ సమంత పేర్కొన్నారు. ఇటీవల కలకలం సృష్టిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత మాట్లాడుతూ.. ఈ సంస్కృతి ఒక సినిమా రంగంలోనే కాక అన్ని రంగాల్లోనూ ఉందని సమంత అన్నారు. దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నాను. ఇక్కడ మంచి వాళ్లు ఉన్నారు.. అయితే కొందరు నయవంచకులు కూడా ఉన్నారు. అలాంటి వారిని తరిమేస్తే చిత్ర పరిశ్రమ అంత మంచిది మరొకటి ఉండదన్నారు. అయితే అలాంటి దుర్మార్గులను శిక్షించడానికి కొన్ని చట్టాలు రూపొందించారు.. ఇకపై అత్యాచారాలు జరగవని భావిస్తున్నాని సమంత పేర్కొన్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ బిజీగా ఉందని చెప్పవచ్చు. సమంత నటించిన రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రానున్నాయి. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన నడిగైయార్ తిలగం ఈ నెల 9న విడుదలకు సిద్ధం అవుతుంది. మరొకటి విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై ఈ నెల 11న తెరపైకి వస్తోంది. ఈ సందర్భంగా సమంత శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త డైరెక్టర్ల చిత్రాల్లో పనిచేయడానికి కాస్త సంకోచిస్తానన్నారు. ‘కానీ దర్శకుడు మిత్రన్‌తో ఇరుంబుతిరై చిత్రం చేస్తున్నప్పుడు ఆ విధమైన భావన కలగలేదు. కథ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మన జీవితాల్లో మనకు తెలియకుండానే ఇన్ని సమస్యలు ఇంటర్నెట్ మీడియా ద్వారా జరుగుతున్నాయా అని కంగు తిన్నాను. కథ విన్న తర్వాత సెల్‌ఫోన్ టచ్ చేయడానికే భయమేసింది. ఈ చిత్రంలోని సంఘటనలు నీ జీవితంలో జరగకపోయినా, నా స్నేహితురాళ్లకు ఎదురయ్యాయి. ఇరుంబుతిరై చిత్రానికి డబ్బంగ్ చేప్పడానికి నిరాకరించినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదు. చిత్ర పరిశ్రమ సమ్మె ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.. ఆ సమయంలో నడిగైయార్ తిలగం చిత్ర షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల డబ్బింగ్ చెప్పలేకపోయాను’ అని సమంత తెలిపారు. ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం సమంతకు మంచి పేరు తెచ్చిన పెట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో సమంత తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. కానీ, ఆ చిత్రంలో ముద్దు సన్నివేశంలో నటించడం చర్చనీయాంశంగా మారిందని ఆమె అన్నారు. అయితే తన కుటుంబ సభ్యులు ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచారని ఈ బ్యూటీ పేర్కొన్నారు. నటులు రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.. వారిలో మీరు ఎవరికి ఓటు వేస్తారు? అని అడుగుతున్నారు. అయితే తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని సమంత చెప్పారు. -
‘రంగమ్మ మంగమ్మ’ పేరడీ సాంగ్
-
‘ఇంతలోనే ఎంత ఎదిగే రామ్ చరణూ’
రంగస్థలం సినిమా రిలీజై ఐదు వారాలు గడుస్తున్నా సినిమా హవా మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ పాటకు చిన్నారులు డ్యాన్స్ చేసిన వీడియోలో పదుల సంఖ్యలో యూట్యూబ్‌లో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ పాటకు పేరడీగా రూపొందించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. రంగమ్మ మంగమ్మ పాటను రామ్ చరణ్ నటనకు తగ్గట్టుగా‘ఓరయ్యో ఓలమ్మో ఏం పిల్లడూ.. ఇన్ని నాళ్లు యాడదాగే ఇంత నటుడు’ అంటూ పేరడీ చేశారు. ఈ పాటను ప్రముఖ నటుడు రచయిత ఉత్తేజ్ చిన్న కూతురు పాట ఉత్తేజ్ స్వయంగా ఆలపించి, నటించారు. -
వైరల్ : కుమార్ బాబు డబ్బింగ్ వీడియో
విడుదలై నెల రోజులైనా.. రంగస్థలం మేనియా ఇంకా తగ్గడం లేదు. రంగస్థలం కథ కొత్తది కాకపోయినా... నటీనటులు తమ నటనతో, సుకుమార్ తన టేకింగ్‌తో సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టారు. ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్‌కు రప్పించేలా చేశారు ఈ లెక్కల మాష్టారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లకే కాక... ప్రతీ ఆర్టిస్ట్‌కు మంచి పేరు వచ్చింది. అనసూయ, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్, ఆది పినిశెట్టి... ఇలా ఎవరి పాత్రకు వారు ప్రాణం పోశారు. ఇదంతా ఓకే. కెమెరా ముందు నటించడం మనకు తెలిసిన విషయమే. కెమెరా ముందు ఎంత బాగా నటించినా... డబ్బింగ్ సరిగా లేకపోతే...అది తేలిపోతుంది. అందుకే సినిమాకు డబ్బింగ్ ప్రాణం. డబ్బింగ్ చెప్పేటప్పుడు... మళ్లీ ఆ పాత్రలోకి, సన్నివేశంలోకి పరకాయ ప్రవేశం చేసి అదే ఫీలింగ్‌ను క్యారీ చేస్తూ... సీన్‌ను రక్తికట్టించాల్సి ఉంటుంది. రంగస్థలంలో ఆది చనిపోయే సీన్లో తన నటన ఆమోఘం. ఆ సన్నివేశానికి ఆది డబ్బింగ్ చెబుతున్న వీడియోను ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తను డబ్బింగ్ చెబుతున్న తీరు అందర్ని విస్మయపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన రంగస్థలం ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. -
విస్మయపరుస్తున్న ఆది ’రంగస్థలం’ డబ్బింగ్ వీడియో
-
స్క్రీన్ ప్లే 1st May 2018
-
మరో మైల్స్టోన్ దాటిన ‘రంగస్థలం’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన రంగస్థలం ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్లో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. ఇప్పటికే అమెరికాలో చాలా ప్రాంతాల్లో ప్రదర్శితమవుతున్న రంగస్థలం 3.5 మిలియన్ డాలర్ల (23 కోట్ల)కు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్లను చెరిపేస్తూ దూసుకుపోతున్న రంగస్థలం ముందు ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 3.5 Million Dollars and Counting 😎#Rangasthalam https://t.co/UkSNRBb52G — Mythri Movie Makers (@MythriOfficial) 2 May 2018 -
అఫీషియల్: 200 కోట్ల క్లబ్లో రంగస్థలం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం రూ. 200 కోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరిపోయింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చి 30న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. నెల రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా రాబట్టి టాలీవుడ్లో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా(నాన్-బాహుబలి) నిలిచింది. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రామ్ చరణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆది పినిశెట్టి, సమంత, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ విలేజ్ డ్రామాను దర్శకుడు సుకుమార్ మలిచిన తీరు.. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, పాటలకు సాహిత్యం, ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటిదాకా ఇది హయ్యెస్ట్ గ్రాసర్ కావటం విశేషం. #200CrGrossRangasthalam pic.twitter.com/1KuT5yazto — Mythri Movie Makers (@MythriOfficial) 30 April 2018 -
చరణ్ సినిమాలో ‘ఈగ’ విలన్
రంగస్థలం సినిమాతో ఘనవిజయం అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. రంగస్థలం రిలీజ్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న చరణ్, ఇటీవలే బోయపాటి టీంతో జాయిన్ అయ్యారు. చరణ్ సరసన భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర లు నటిస్తున్నారు. తాజాగా మరో విలక్షణ నటుడు ఈ సినిమాలో నటించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సాండల్‌వుడ్ స్టార్ సుధీప్.. చరణ్, బోయపాటి సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. అయితే సుధీప్ విలన్‌గా నటిస్తున్నాడా లేక మరేదైన పాత్రలోనా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
సెక్యూరిటీ లేదని భయపడ్డా : సమంత
తమిళసినిమా: సినిమా రంగంలోకి ప్రవేశించిన కొత్తలో ఇక్కడ రక్షణ లేదని భయపడ్డానన్నారు నటి సమంత. తొలుత కోలీవుడ్‌లో నటనకు శ్రీకారం చుట్టి ఆపై టాలీవుడ్లో జయకేతనం ఎగరేసిన నటి ఈ చెన్నై చిన్నది. అనంతరం తమిళం, తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడడంతో సమంత కెరీర్ కుంటుపడుతుందని కొందరు భావించారు. సమంత పెళ్లికి సిద్ధం అవుతుండడంతో అక్కినేని అంత పెద్ద కుటుంబంలో చేరబోతున్నారు. ఇక నటనకు గుడ్‌బై చెప్పడం ఖాయం అని అనుకున్నారు. సమంత మాత్రం తాను వివాహానంతరం నటిస్తానని వెల్లడించారు. దీంతో కొందరు కథానాయకిగా అవకాశాలు రావు అని అనుకున్నారు. అయితే ఇలాంటి ఊహాగానాలేవీ సమంత విషయంలో జరగలేదు. తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. ముందుగా చెప్పినట్లుగానే వివాహానంతరం నటనను కొనసాగిస్తున్నారు. కథానాయకిగానే అవకాశాలు వరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సమంతకు పెళ్లి తరువాతే నటనకు అవకాశం ఉన్న పాత్రలు తలుపుతడుతున్నాయి. ఈ మధ్య విడుదలైన తెలుగు చిత్రం రంగస్థలంలో సమంత నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు చేతినిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన యూటర్న్ చిత్ర రీమేక్‌లో నటిస్తున్నారు. ఇది హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంగా ఉంటుంది. ఇటీవల నటి సమంత ఒక భేటీలో పేర్కొంటూ వివాహానంతరం తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. మొదట్లో ఈ రంగంలో రక్షణ లేదనే భావన కలిగిందన్నారు. అదృష్టవశాత్తు తాను నటించిన చిత్రాలన్నీ విజయాలు సాధించి తనలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు నూతన పయనానికి దోహదపడ్డాయన్నారు. తానిప్పుడు వృత్తిపరంగానూ, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నానని చెప్పారు. వివాహానంతరం తన భర్త కుటుంబం స్వేచ్ఛగా జీవించడానికి అనుమతించారని అన్నారు. వారి ఆదరణతో తాను సినిమాల్లో మరింత సాధించగలనని సమంత ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
రంగస్థలం ఎంత సక్కగున్నవే... వీడియో సాంగ్
-
ఎంత సక్కగున్నవే.. వీడియో సాంగ్
సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘రంగస్థలం’ సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మూవీలోని పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఆ పాటలన్నింటిలో ఎంత సక్కగున్నవే పాటకు అగ్రస్థానం ఇవ్వాల్సిందే. ఆ పాటకు అందించిన బాణీ, సాహిత్యం, చిత్రీకరించిన విధానం ఇలా ప్రతి ఒక్కటి కలిసి ఆ పాటను హిట్ చేశాయి. అయితే రంగస్థలం వీడియో సాంగ్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా... అని ఎదురుచూసే అభిమానులకు తీపి కబురు. ఎంత సక్కగున్నవే... వీడియో సాంగ్‌ను గురువారం (ఏప్రిల్ 26) యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఆ విజువల్ వండర్‌ను, గోదావరి అందాలను మీరు ఓసారి వీక్షించండి. -
రంగమ్మత్త.. ఇలా రంగస్థలంలోకి..!
-
రంగస్థలంలో పల్లెటూరి మహిళగా...
-
రంగమ్మత్త.. ఇలా రంగస్థలంలోకి..!
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా నటులుగా రామ్‌చరణ్, సమంతలకు ఎంత పేరు తీసుకువచ్చిందో.. సహాయ పాత్రలో నటించిన అనసూయ కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. బుల్లితెర మీద ట్రెండీగా కనిపించే అనసూయ రంగస్థలంలో పల్లెటూరి మహిళగా కనిపించటంతో అభిమానులు ఫిదా అయ్యారు. అయితే తనదైన నటనతో రంగమ్మత్త పాత్రకు ప్రాణం పోసింది అనసూయ. అందుకే రంగస్థలం సినిమా చూసిన ప్రముఖులు రామ్ చరణ్, సమంతలతో పాటు అనసూయ పాత్రను కూడా ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. తాజాగా అనసూయను ఈ సినిమా కోసం ఆడిషన్ చేసిన సందర్భంలోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం ఇప్పటికే 180 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. -
సుకుమార్‌తో సూపర్ స్టార్
భరత్ అనే నేను సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సినిమాను కన్ఫామ్ చేశాడు. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న మహేష్ ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తన 26వ సినిమా చేసేందుకు అంగీకరించాడు మహేష్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన వన్ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా టెక్నికల్‌గా ఆకట్టుకోవటంతో మరోసారి సుకుమార్‌తో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేష్, సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాను నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. Superstar Mahesh Babu + Mythri Movie Makers + Sukumar#Mahesh26 - 2019 Worldwide pic.twitter.com/RveUzTVpIM — Mythri Movie Makers (@MythriOfficial) 22 April 2018 -
రంగస్థలం రికార్డ్ బ్రేక్ చేసిన భరత్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా భరత్ అనే నేను. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. పూర్తి లెక్కలు రాకపోయినా ఫస్ట్‌డే కలెక్షన్స్ 60 కోట్ల వరకు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమిళనాట మాత్రం ఈ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజు రూ. 78 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్క చెన్నై సిటీలోనే రూ. 27 లక్షలకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. ఇటీవల విడుదలైన రంగస్థలం రూ. 25 లక్షల రికార్డ్‌ను భరత్ అనే నేను 20 రోజులు తిరగకుండానే చెరిపేయటం విశేషం. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, బ్రహ్మాజీ, రావు రమేష్‌లు ఇతర కీలక పాత్రలో నటించారు. #BharatAneNenu Chennai City 1st day gross - 27 Lakhs New day 1 record for a Telugu film — BARaju (@baraju_SuperHit) 21 April 2018 భరత్ అనే నేను మూవీ రివ్యూ