ఎంత సక్కగున్నవే.. వీడియో సాంగ్‌ | Rangasthalam Video Song Released | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 27 2018 6:40 PM | Last Updated on Fri, Apr 27 2018 7:18 PM

Rangasthalam Video Song Released - Sakshi

సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘రంగస్థలం’ సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మూవీలోని పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఆ పాటలన్నింటిలో ఎంత సక్కగున్నవే పాటకు అగ్రస్థానం ఇవ్వాల్సిందే. ఆ పాటకు అందించిన బాణీ, సాహిత్యం, చిత్రీకరించిన విధానం ఇలా ప్రతి ఒక్కటి కలిసి ఆ పాటను హిట్ చేశాయి. 

అయితే రంగస్థలం వీడియో సాంగ్స్‌ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా... అని ఎదురుచూసే అభిమానులకు తీపి కబురు. ఎంత సక్కగున్నవే... వీడియో సాంగ్‌ను గురువారం (ఏప్రిల్‌ 26) యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఆ విజువల్‌ వండర్‌ను, గోదావరి అందాలను మీరు ఓసారి వీక్షించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement