
‘జిల్.. జిల్.. జిగేల్ రాణి’ పాట ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతోంది. రాంచరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాలోని ఈ ప్రత్యేక పాట వీడియో ప్రోమోను.. రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటలో పూజా హెగ్డే చూపించిన సోయగాలు, వేసిన స్టెప్పులు.. డ్యాన్స్‌తో అదరగొట్టిన రాంచరణ్.. అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ప్రస్తుతం (బుధవారం సాయంత్రానికి) య్యూటూబ్‌లో నంబర్ వన్‌గా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 30 లక్షల వ్యూస్ వచ్చాయి.
ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతున్న ఈ పాటకు స్వయంగా పూజాహెగ్డే బామ్మ కూడా స్టెప్పులు వేశారు. 86 ఏళ్ల బామ్మ హుషారుగా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘మా బామ్మ గతకొన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉంది. నా ‘జిగేల్ రాణి’ పాట ప్రోమోను చూసి ఆమె సంతోషంలో మునిగిపోయారు. వెంటనే లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఈ పాట ఆమెకు ఎనర్జి ఇచ్చినట్టు ఉంది. అందుకే నేను చేసి పనిని ఇష్టపడి చేస్తాను’ అని పూజ ట్వీట్ చేశారు. జిగేల్ రాణి పాటకు పూజ బామ్మ స్టెప్పులు వేయడం నెటిజన్లను అలరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment