Ramcharan
-
పెళ్ళిలో మహేష్ ఫ్యామిలీ.. రామ్ చరణ్ దంపతులు కూడా(ఫోటోలు)
-
అత్త-మామ పెళ్లిరోజు వేడుకల్లో చరణ్-ఉపాసన (ఫొటోలు)
-
మురారి వినోదం
శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 37వ సినిమా ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి శుభాకాంక్షలతో హీరోలు బాలకృష్ణ, రామ్‌చరణ్ కలిసి విడుదల చేశారు. ‘‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రీకరణ జరుగుతోంది. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియన్స్ ను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సహ–నిర్మాత: అజయ్ సుంకర. -
Game Changer Pre Release Event : హీరో రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నాగార్జునకు, రామ్‌చరణ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ముక్కు అవినాష్ (ఫోటోలు)
-
ఓటీటీలోకి వచ్చేసిన 'ఆర్ఆర్ఆర్' డాక్యుమెంటరీ
ఆర్ఆర్ఆర్.. టాలీవుడ్ కీర్తిని ఆస్కార్ రేంజ్‌కు ఈ చిత్రం తీసుకెళ్లింది. ఈ సినిమాకు సంబంధించి తెరవెనుక జరిగిన ఆసక్తికర విషయాలను 'ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మూడు గంటల పాటు చూసి అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా వెనక దాగి ఉన్న మూడేళ్ల కష్టాన్ని చూపించాలని మేకర్స్ అనుకున్నారు.ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, అలీసన్ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్ సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేశారు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి 'ఆస్కార్' అందుకునే వరకూ జరిగిన ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. డిసెంబరు 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మాత్రమే దీనిని విడుదల చేశారు. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ జక్కన్నకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. డిసెంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతన్న 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీని మీరూ చూసేయండి. దీని రన్‌టైమ్ 1 గంట 38 నిమిషాలు ఉంది. ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర విషయాలను ఇందులో పంచుకున్నారు. -
ఆర్ఆర్ఆర్కు అరుదైన గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ సినిమా హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్ ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు.కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
మెగాస్టార్‌కు ఏఎన్నార్ జాతీయ అవార్డ్.. హాజరైన టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
రామ్‌చరణ్‌కు జోడీగా..?
‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమాను ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.అంతేకాదు... ‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్గా నటించిన సమంత ఈ సినిమాలోనూ హీరోయిన్గా చేస్తారని, ఆల్రెడీ సంప్రదింపులు జరిగాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి... ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్, సమంత మళ్లీ జోడీగా నటిస్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది. -
పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్.. డిసెంబర్ లో మెగా వార్
-
హీరో గ్లామర్.. ప్రముఖ టూవీలర్ ‘హీరో’ బ్రాండ్స్..
సాక్షి, సిటీబ్యూరో: వ్యక్తిగానో, వ్యవస్థగానో నమ్మకాన్ని పొందాలంటే సంవత్సరాల తరబడి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలని, ఆ నమ్మకమే విజయానికి గీటురాయి అని గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ అన్నారు. 40 ఏళ్లకు పైగా హీరోగా ప్రజాదరణ పొందుతున్న తన తండ్రి చిరంజీవి, ప్రముఖ టూవీలర్ ‘హీరో’ బ్రాండ్స్ ఈ నమ్మకానికి నిదర్శనమన్నారు. హీరో మోటోకార్ప్ ఆధ్వర్యంలో నగరంలోని హోటల్ నోవోటెల్ వేదికగా గురువారం న్యూ ఒరిజినల్ గ్లామర్ బైక్ ఆవిష్కరించారు.సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్ జీత్ సింగ్‌తో పాటు హీరో బ్రాండ్ అంబాసిడర్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా గ్లామర్ బైక్‌ను ఆవిష్కరించారు. 1984లో ప్రారంభమైన హీరో సంస్థ 40 ఏళ్ల పాటు కస్టమర్ల మన్ననలు పొందుతుందని, ఆ కస్టమర్లే తమ సంస్థకు హీరోలని రంజీవ్ జీత్ సింగ్ అన్నారు. ముఖ్యంగా 19 ఏళ్ల పాటుగా గ్లామర్ బైక్ అందరికీ ఫేవరెట్ బైక్‌గా 80 లక్షల కస్టమర్ల మనసులను చూరగొందని అన్నారు. అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఆమె అభిమానం నా బాధ్యతను పెంచింది..ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా జపాన్ వెళ్లిన సమయంలో దాదాపు 70 ఏళ్ల మహిళ 180 పేజీల ఆర్ట్ వర్క్ బుక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అది తెరచి చూస్తే నా గత సినిమాల్లోని కొన్ని స్టిల్స్‌ని ఆర్ట్‌గా వేశారు. ఇలాంటి అభిమానం నా బాధ్యతను మరింతగా పెంచింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడం అందులో ఒకటి. నాటు నాటు పాటలోని కొన్ని నిమిషాల స్టెప్ కోసం తారక్, నేను దాదాపు 30 రోజులకు పైగా కష్టపడ్డాం. ఈ కష్టం ఆస్కార్‌తో పాటు ప్రపంచ వ్యాప్త అభిమానులను అందించింది.బైక్స్ అంటే ఇష్టం.. చిన్నప్పటి నుంచీ బైక్ అంటే ఇష్టం. కానీ నాన్న బైక్‌లకు అంతగా ప్రోత్సహించేవారు కాదు. అందుకే నాన్నకు తెలియకుండా ఫ్రెండ్స్ హీరో బైక్స్ నడిపేవాడిని. ఇప్పుడు అదే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం గొప్ప అనుభూతినిస్తుంది. ప్రస్తుతం గుర్రాలన్నా, హార్స్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం. ఎంతలా అంటే మగధీర సినిమాలో షూట్ చేసిన గుర్రం విపరీతంగా నచి్చ, షూట్ తరువాత దర్శకులు రాజమౌళితో మాట్లాడి ఆ గుర్రాన్ని నేనే తీసుకున్నా. ఈ మధ్యనే ఆ గుర్రం మరో గుర్రానికి జన్మనిచి్చంది. దానిని నా కూతురు క్లీంకారాకు గిఫ్ట్‌గా ఇచ్చాను. ప్రస్తుతం నా దగ్గర 15 గుర్రాలు ఉన్నాయి. తన కోసమే పక్షులు కొన్నా.. జంతువులంటే నాకు చాలా ఇష్టం. నా కూతరు ఇష్టంగా ఆహారం తినడం కోసమే కొన్ని రకాల పక్షులను కొన్నాను. వాటిని చూపిస్తూ రోజూ ఆహారం తినిపిస్తాం. క్లీంకారా అనే నా కూతురు పేరును సంస్కృత భాషలోని లలిత సహస్ర నామం నుంచి ఎంచుకున్నాం. ఇక సినిమాలు ఎన్నో మరచిపోలేని అనుభూతులతో పాటు బాధ్యతను పెంచాయి. నేనో నిత్య విద్యార్థిని..నా సినిమాల్లో రంగస్థలం, ఆరెంజ్, మగ«దీర సినిమాలు చాలా ఇష్టం. యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం, త్వరలో బుచి్చబాబు దర్శకత్వంలో మంచి కామెడీ సినిమాను చేస్తున్నాను. ఆర్ఆర్ఆర్ ప్రయాణంలో రాజమౌళి కీలకం. తనతో షూటింగ్ అంటే స్కూల్‌కు వెళ్లే విద్యారి్థలా నేర్చుకోవడానికి వెళతాను. నాన్న నుంచి నేర్చుకున్న జీవిత సూత్రాలు తప్పకుండా పాటిస్తాను. మన ప్రయాణంలో భాగమైన ఆతీ్మయులను, సిబ్బందినీ మర్చిపోవద్దని చెప్పేవారు. అందుకే 15 ఏళ్లకు పైగా నా సిబ్బందిని మార్చకుండా నా దగ్గరే ఉండేలా చూసుకుంటున్నా.. మోస్ట్ మెమొరబుల్ మూమెంట్.. స్పోర్ట్స్‌తో ఎంగేజ్ అవ్వడం కన్నా పుస్తకాలు చదవడం ఇష్టం. నటన పరంగా తమిళహీరో సూర్య, సమంతాలను బాగా ఇష్టపడతాను. క్లీంకారా జన్మించిన సందర్భం జీవితంలో అత్యంత అనుభూతికి లోనయ్యాను. మోస్ట్ మెమొరబుల్ మూమెంట్..!! నార్త్ ఇండియా అన్నా.. ముఖ్యంగా రాజస్థాన్, హిమాలయాలు ఫేవరెట్ స్పాట్స్. నా గురించి సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పాలంటే.. రామ్ చరణ్ అంటే మిత భాషికుడు, స్నేహితులకు దగ్గరగా ఉండేవాడు, ముఖ్యంగా హోమ్ బాయ్. -
Klin Kaara Photos: గ్రాండ్‌గా క్లీంకార ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
చలో రాజమహేంద్రవరం
‘గేమ్‌చేంజర్’ కోసం రాజమహేంద్రవరం వెళ్లనున్నారట రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తు్తన్న పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్‌చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, ప్రియదర్శి, జయరాం, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో జరగనుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. రామ్‌చరణ్‌తో పాటు ముఖ్యతారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులోప్రారంభం కానుందని తెలిసింది. కథరీత్యా సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట శంకర్. రాజమహేంద్రవరం షెడ్యూల్ పూర్తయిన తర్వాత వైజాగ్‌కు వెళ్తారట యూనిట్. తమన్ ఈ సినిమాకు స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.. రిలీజ్ డేట్‌పై త్వరలోనే స్పష్టత రానుంది. -
శ్రీవారి సేవలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు..
-
హిట్ కాంబినేషన్ రిపీట్
హిట్ మూవీ ‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టి, వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలన్నది చిత్రబృందం ప్లాన్ అని సమాచారం. -
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని భోగట్టా. చరణ్ సినిమాలో సంజయ్ దత్? రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక హిందీలో రామ్‌చరణ్ చేసిన తొలి చిత్రం ‘తుఫాన్’లో సంజయ్ దత్ ఓ రోల్ చేశారు. మరి.. రామ్‌చరణ్, సంజయ్ దత్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
పుట్టినరోజుకి 'గేమ్ ఛేంజర్' నుంచి సర్ ప్రైజ్!
వైజాగ్ వెళ్లాడు గేమ్‌చేంజర్. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘గేమ్‌చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ వైజాగ్‌లో ప్రారంభం కానుంది. ఈ వారంలో ఆరంభం కానున్న ఈ షెడ్యూల్లో రామ్చరణ్పాల్గొంటారు. రామ్చరణ్పాల్గొనగా కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట మేకర్స్. అలాగే ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘గేమ్‌చేంజర్’ సినిమాలోని ‘జరగండి..’పాట లిరికల్ వీడియో విడుదల కానుంది. అంజలి, నవీన్‌చంద్ర, శ్రీకాంత్, సునీల్, జయరాం, ఎస్జే సూర్య కీలకపాత్రల్లో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వర్తకర్త. -
వార్ 2 కోసం ఎన్టీఆర్ వందకోట్ల పారితోషికం ?
-
Viral Video: అక్షయ్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సచిన్ టెండూల్కర్
లోకల్ టాలెంట్‌ను వెలికి తీసి సాన పెట్టడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ (ఐఎస్పీఎల్) ఇవాళ (మార్చి 6) ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. ఈ జట్లను టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. Sachin & Raina in the frame in ISPL. - The iconic duo of 2011 World Cup. pic.twitter.com/bArjQcB0a4 — Johns. (@CricCrazyJohns) March 6, 2024 మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. .@sachin_rt x @AlwaysRamCharan ft. Naatu Naatu.pic.twitter.com/2OeKsz0HcN — CricTracker (@Cricketracker) March 6, 2024 ఐఎస్పీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్, సూర్య, అక్షయ్ కుమార్‌లతో కలిసి హైదరాబాద్ జట్టు ఓనర్ రామ్‌చరణ్ సందడి చేశారు.చెర్రీ వీరందరితో ట్రిపుల్ ఆర్ ఫేమ్ నాటు నాటు పాటకు స్టెప్పులేయించాడు. Sachin Tendulkar in action. 😍pic.twitter.com/a4cZsm2qof — Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024 Suriya in action! 🔥 pic.twitter.com/OB9kj4IiZ6 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024 అనంతరం సచిన్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో సచిన్.. అమిర్ హుసేన్ అనే దివ్యాంగ క్రికెటర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అక్షయ్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే సచిన్ భారీ సిక్సర్ బాదాడు. Kareena Kapoor and Saif Ali Khan at the ISPL inauguration. pic.twitter.com/BuH2koP5zo — Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024 దీనికి సంబంధించిన వీడయో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, ఈ ప్రాకీస్ మ్యాచ్ అనంతరం లీగ్ తొలి మ్యాచ్ మొదలైంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో అమితాబ్ జట్టు మఝీ ముంబై.. అక్షయ్ కుమార్ జట్టైన శ్రీనగర్ వీర్‌తో తలపడుతుంది. Suriya hugging Sachin Tendulkar. - A beautiful moment in ISPL. pic.twitter.com/U5b8ThihXb — Johns. (@CricCrazyJohns) March 6, 2024 SACHIN TENDULKAR LEAD TEAM WON THE ISPL FRIENDLY MATCH.....!!! 👌 pic.twitter.com/JZLtOHfIyr — Johns. (@CricCrazyJohns) March 6, 2024 -
మెగా సంక్రాంతి వేడుకలు.. చిరు ఫామ్‌హౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. కానీ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతుంది. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒక్కచోటకు చేరి గ్రాండ్‌గా ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో వారందరూ సంక్రాంతిని ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ప్రేదేశం ప్రత్యేకత ఏంటని చాలామంది ఆరాదీస్తున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ 2024 సంక్రాంతి సంబరాలను బెంగళూరులోని చిరంజీవికి ఎంతో ఇష్టమైన తన సొంత ఫామ్‌హౌజ్‌లో జరుపుకున్నారు. ఈ సంబరాల్లో చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో సహా వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. దీంతో వారందరూ ఉన్న ఫోటోపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మెగాఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు చేసుకున్న ఆ ఫామ్‌హౌజ్ గురించి నెటిజన్లు తెగ ఆరాతీస్తున్నారు. ఇంతకు ఆ ఫామ్‌హౌజ్ ఎక్కడ ఉంది..? ఎవరిది..? దాని ఖరీదు ఎంత..? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ఆ ఫామ్‌హజ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినదే... అది బెంగళూరుకు దాదాపు 30 కీమీ దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉంది. వారి ఫామ్‌హౌజ్‌కు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా దగ్గర్లోనే ఉంటుంది. అయితే ఈ ఫామ్‌హౌజ్ ధర దాదాపు రూ.30 కోట్లకు పైమాటే ఉండవచ్చని తెలుస్తోంది. అక్కడ ఆచార్య సినిమా షూట్ కూడా జరిగింది. మెగా కుటుంబానికి సంబంధించి చాలా వేడుకలు ఇక్కడే జరిగాయి. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతి వేడుకలు కూడా అక్కడ వారందరూ ఘనంగా జరుపుకున్నారు. ఆ సమయంలో వారు గ్రూప్‌గా తీసుకున్న ఫోటోను చిరంజీవి తన అభిమానుల కోసం షేర్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఇదే సమయంలో చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర' అని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ విజువల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకుంటుంది. అల్లు అర్జున్ పుష్ప-2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
శంకర్ కు షాక్..బుచ్చిబాబు సినిమాపై చరణ్ ఫుల్ ఫోకస్..
-
నల్గొండ 'నాగిరెడ్డిపల్లి' లో ‘గేమ్ ఛేంజర్’ గా కనిపించిన హీరో రాంచరణ్..
నల్గొండ: భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల శ్రీ భీమరావ్ రైస్ గోదాములో హీరో రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా గోదాములోని కల్తీ బియ్యం పట్టుకునే సన్నివేశాలు చిత్రీకరించారు. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజ్ నిర్మాతగా ఎస్వీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలోని గోదాముకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శనివారం కూడా ఇక్కడే కొనసాగనుంది. -
రామ్ చరణ్.. చిన్న బ్రేక్!
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘గేమ్‌చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఈ షెడ్యూల్లో చిన్న విరామం ఇచ్చిన యూనిట్ తిరిగి షూటింగ్‌ని ప్రారంభించినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రామ్‌చరణ్‌తో పాటు కీలక తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట శంకర్. జయరాం, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఆత్మాభిమానం.. అహంభావం కాదు
‘‘2012 డిసెంబరు 21.. ప్రపంచం అంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు. కానీ ఎక్కడా ఏం జరగలా.. ఒక్క మా ఊర్లో తప్ప... (అజయ్ ఘోష్)’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘బెదురులంక 2012’ ట్రైలర్. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా రూపొందిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కొత్త కాన్సెప్ట్‌లను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తుంటారు కార్తికేయ. ‘బెదురులంక 2012’ ట్రైలర్, ఇందులో చెప్పిన కథ బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘నేను నమ్మనిది నేను చేయను.. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్.. ఈగో కాదు’ (ఆత్మాభిమానం.. అహంభావం కాదు) అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్స్ కూడా ట్రైలర్లో ఉన్నాయి ‘‘చిరంజీవిగారికి వీరాభిమాని అయిన కార్తికేయ ఈ సినిమాలో తన అభిమాన హీరో అసలు పేరు.. శివశంకర వరప్రసాద్ పాత్రలో నటించారు. యుగాంతం వస్తుందని ఆంధ్రప్రదేశ్‌లోని బెదురులంక గ్రామంలో కొందరు కేటుగాళ్లు ప్రజల్లో ఉన్న భక్తిని ఆసరాగా చేసుకుని దేవుడి పేరుతో ఎలా దోపిడీ చేశారు? వారికి శివశంకర వరప్రసాద్ ఏ విధంగా బుద్ధి చెప్పాడు? అన్నదే ఈ సినిమా కథ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
దుమారం రేపిన నాని వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ఫైర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కోతా' పాన్ ఇండియా రేంజ్లో ఆగష్టు 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో తాజాగ జరిపారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. (ఇదీ చదవండి: వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి) ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో గురించి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్లో పాన్ ఇండియా గురించి నాని ఇలా చెప్పుకొచ్చాడు. 'మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజమైన నిర్వచనం ఇదే' అని అన్నారు నాని. దీంతో టాలీవుడ్లో ఉండే పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్ అందరూ నానిపై ఫైర్ అవుతున్నారు. దుల్కర్ మంచి నటుడే... పాన్ ఇండియా రేంజ్‌ను అందుకునే అర్హత ఆయనకు ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలుపుతూనే నాని వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. దుల్కర్ మాత్రమే పాన్ ఇండియా హీరో అని ఎలా చెబుతావ్ నాని అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కి ఎప్పటికీ చేరుకోలేడు కాబట్టే నానికి ఆ పదం పెద్దగా నచ్చదని అంటున్నారు. (ఇదీ చదవండి: మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత) సౌత్ ఇండియా ప్రస్తుత టాప్ హీరోల్లో అందరికంటే ముందుగా బాలీవుడ్లో జెండా పాతిన ప్రభాస్.. ఆ తర్వాత రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్లందరూ గల్లీ హీరోలు అనుకుంటున్నావా..? అంటూ నానిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'అసలు నాని ఎవడు.. ? ఒకరికి పాన్ ఇండియా హీరో అని గుర్తింపు ఇవ్వడానికి.. సినిమాలు చూసేది మేము. గుర్తింపు ఇవ్వాల్సింది మేము. ఇలాంటి ఆటిట్యూడ్ వ్యాఖ్యలతో పాటు కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిది.' అని వారు సలహా ఇస్తున్నారు. -
Klin Kaara Konidela First Photos: మెగా ప్రిన్సెస్ మొదటి వీడియో షేర్ చేసిన రామ్‌చరణ్ (ఫొటోలు)
-
Klin Kaara Konidela First Video: ఉపాసన డెలీవరీ వీడియో రిలీజ్ చేసిన రామ్‌చరణ్
-
మెగా ప్రిన్సెస్ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసనల దంపతులకు జూన్ 20న పండంటి పాప పుట్టింది. చిరంజీవికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజే చిన్నారి జన్మించడంతో సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన చరణ్ దంపతులకు బంధుమిత్రులు, సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్?) మెగా ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబానికి బాగా కలిసి వస్తుందని పలు జ్యోతిష్యులు చెప్పారని చిరు తెలిపారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని ఇండస్ట్రీలోని తన స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు వారందరికీ ఒక మెగాపార్టీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సెలెబ్రేషన్స్ ఒక రేంజ్లో ఉండబోతున్నట్లు సమాచారం. మరో వైపు మెగా ప్రిన్సెస్‌కు ఎలాంటి పేరు సెలక్ట్ చేస్తారని సోషల్‌మీడియాలో ఆరాతీస్తున్నారు. మెగాస్టార్‌కు ఇద్దరు కూతుళ్ళకు చెరో ఇద్దరు అమ్మాయిలు ఉండగా ఇప్పుడు రామ్ చరణ్‌కు కూడా కుమార్తె జన్మించింది. ప్రస్తుతం చిరుకి ఐదుగురు మనవరాళ్లు అయ్యారు. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్పిక్ మార్చేసిందిగా!) -
పండంటి పాపకు జన్మనిచ్చిన ఉపాసన మెగా ఫ్యామ్లీయ్ లో సంబరాలు
-
మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్
ప్రముఖ నటుడు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. నేడు (జూన్ 20)న పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ అందుకు వేదిక అయింది. ఇప్పటికే అక్కడకు చిరంజీవి చేరుకున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు మొదలుబెట్టారు. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు. ఇంకేముంది మెగా వారసురాలు వచ్చేసింది అంటూ.. ట్వీట్స్‌తో తమ ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్ పంచుకుంటున్నారు. కొణిదెల ఇంట మూడో తరం రావడంతో ఆ బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలని పలు దేవాలయాల్లో వారు పూజలు చేయడం ప్రారంభించారు. పండంటి బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ రెండు నెలలు షూటింగ్‌కు కూడా బ్రేక్ ఇచ్చేశాడు. తన కూతురితో ఆయన ఆనందంగా గడపనున్నారు. (ఇదీ చదవండి: మహేష్ బాబుతో గొడవలు.. థమన్ రియాక్షన్ ఇదే) కంగ్రాట్స్ అన్న వదిన అంటూ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఒక వీడియోను అభిమానులు షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా అపోలో ఆస్పత్రి వద్ద హార్ట్ సింబల్లో ఉండే బెలూన్స్ ఎగురవేశారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్ యూనిట్) Biggest Mega Festival of #MegaPrincess Kick starting 🥁🥁#RamCharanUpasanaBabyGirl@AlwaysRamCharan @upasanakonidela ✨️💕 pic.twitter.com/h7ZX5JXPTG — Trends RamCharan™ (@TweetRamCharan) June 20, 2023 మెగా వారసురాలు 👧❤️ Congratulations @AlwaysRamCharan & @upasanakonidela garu ❤️#RamCharanUpasanaBabyGirl pic.twitter.com/SpK2q0LZKJ — RC CELEBRATIONS™ (@RC_celebrations) June 20, 2023 Congratulations @AlwaysRamCharan & @upasanakonidela anna and Vadina ❤️... #MegaPrincess pic.twitter.com/qfKm3l6Ty4 — Thodagottina TELUGODU ⚡ (@jashwanthvamsi) June 20, 2023 -
రామ్‌చరణ్, ఉపాసనల బిడ్డ కోసం ఉయ్యల రెడీ
-
సమ్మర్ బాక్స్ ఆఫీస్ బరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్
-
వైరల్ అవుతున్న శర్వా మ్యారేజ్ వీడియోలు..!
-
మెగా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్
-
ఎన్ని ప్లాప్ వచ్చిన టాలీవుడ్ ని వదిలేదే లే ....
-
జీ20 సమ్మిట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (ఫొటోలు)
-
1200 మంది ఫైటర్స్‌తో గేమ్ చేంజర్...
-
ఘనంగా ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్, శ్రీమతితో రామ్‌చరణ్ క్యూట్ ఫోటోలు
ఘనంగా ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్, శ్రీమతితో రామ్‌చరణ్ క్యూట్ ఫోటోలు -
ఆస్కార్ వీడియోతో రికార్డ్ క్రియేట్ చేసిన రామ్‌చరణ్, ఉపాసన దంపతులు (ఫొటోలు)
ఆస్కార్ వీడియోతో రికార్డ్ క్రియేట్ చేసిన రామ్‌చరణ్, ఉపాసన దంపతులు (ఫొటోలు) -
మంత్రి హరీశ్ చొరవతో ప్రభుత్వ పాఠశాలలో హలో.. బోంజో.. ఓలా..
సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల.. లోపలికి అడుగుపెట్టగానే.. 9వ తరగతి చదువుతున్న మనోజ్ కనిపించాడు బోంజో అని పలకరించాడు.. అలా రెండడుగులు వేశామో లేదో.. ఓలా అన్నాడు రాంచరణ్.. ఏంటిది.. ఏమంటున్నారు అన్నదేగా మీ డౌట్.. వీళ్లిద్దరూ మనల్ని గుడ్ మార్నింగ్, హలో అని పలకరించారు. కాకపోతే.. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో.. ఒక్క మనోజ్, రాంచరణే కాదు.. ఆ బడిలో చాలా మంది ఫ్రెంచ్, స్పానిష్ భాషలను నేర్చుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్‌లో పట్టు సాధిస్తున్నారు.. పోటీ ప్రపంచంలో రాణించేందుకు తమను తాము సంసిద్ధం చేసుకుంటున్నారు. సాక్షి, సిద్దిపేట: ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్‌కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. మంత్రి హరీశ్‌రావు చొరవతో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నే ర్పి స్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 9వ తరగతిలో 160 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిలో 100మందికి ఇంగ్లిష్ , 30 మందికి ఫ్రెంచ్, 30 మందికి స్పానిష్ నే ర్పిస్తున్నారు. ఓ యూనివర్సిటీ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని విద్యాబోధన చేయడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 27న తరగతులను ప్రారంభించారు. ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నే ర్పి ంచారు. వారంలో రెండు రోజులు (గురు, శుక్రవారాలు) ఆన్లైన్, ఒకరోజు ( శనివారం) ప్రత్యక్షంగా ప్రొఫెసర్లు బోధన చేశారు. ఇలా నాలుగు వారాలపాటు బోధించారు. ఇంగ్లిష్ లో భాగంగా ఉచ్ఛారణ, సంభాషణ, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్‌పై అవగాహన కల్పించారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో పలకరించడం, సెల్ఫ్ ఇంట్రడక్షన్, సింపుల్ కన్వర్జేషన్ నే ర్పించారు. మార్చి 28న హైదరాబాద్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీకి 160 మంది విద్యార్థులను తీసుకెళ్లారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, విద్యాబోధన తీరు ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులతో ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ముచ్చటించారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ఈ నెల 16న మంత్రి హరీశ్‌రావు, యూనివర్సిటీ వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఆయా భాషల బోధనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి ఏడాదంతా బోధించనున్నారు. ఒక అడ్వంచర్‌లా అనిపించింది.. నేను స్పానిష్ నేర్చుకుంటున్నా. నాకు ఒక అడ్వంచర్‌లా అనిపిస్తుంది. యూనివర్సిటీకి వెళ్లినప్పుడు అక్కడి స్టూడెంట్‌తో నేను స్వయంగా స్పానిష్‌లో మాట్లాడాను. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే రెండో భాష స్పానిష్ నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేర్చుకోవాలని ఉంది. పూర్తిగా గలగలా స్పానిష్‌లో మాట్లాడాలి. ఉన్నత విద్య కోసం స్పెయిన్‌కు వెళ్లినా నాకు అక్కడి భాషతో ఇక ఇబ్బంది ఉండదు. –రాంచరణ్, 9వ తరగతి ఇన్ఫార్మల్ టు ఫార్మల్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం ఇంగ్లిష్ లో ఇన్ఫార్మల్ టు ఫార్మల్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకున్నాం. ఇఫ్లూ వర్సిటీ వారు మాకు ఇంగ్లిష్ నే ర్పి ంచడం చాలా లక్కీగా ఫీలవుతున్నాం. ఇతర విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో డబ్బులు పెట్టినా విదేశీ భాషలు నేర్చుకోలేరు అదే మా హరీశ్‌రావు సార్ కృషితో మా స్కూల్లోనే వాటిని నేర్చుకుంటున్నాం. –అప్ష, ఐమన్, తనీమ్, 9వ తరగతి విద్యార్థులు ఫ్రెంచ్నేర్చుకుంటున్నా.. –మనోజ్,9వ తరగతి ఫ్రెంచ్ భాషను ఇంట్రస్ట్‌గా నేర్చుకుంటున్నా.ఇఫ్లూ క్యాంపస్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఫ్రెంచ్ విద్యార్థులతో మాట్లాడాను. ఫ్రెంచ్ మాట్లాడటంతోపాటు అర్థం చేసుకోగలుగుతున్నా. పదో తరగతిలోనూ ఇంకొంచెం ఫ్రెంచ్ భాషను నేర్చుకోవాలని ఉంది. -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన డీఓపీ సెంథిల్ కుమార్ (ఫొటోలు)
-
చరణ్,తారక్‌ల స్నేహానికి ఏమైంది? దూరంగా ఉండటానికి కారణం అదేనా?
-
ఉపాసన బరువు పెరగకపోవడానికి కారణం..?
-
ట్రెండ్ సెట్ చేసిన రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్..
-
వాల్తేరు చిట్టిబాబు
-
ఎన్టీఆర్ -బన్నీ రిలేషన్ అదుర్స్ మరి చరణ్- బన్నీ మధ్య..?
-
రామ్ చరణ్ - అల్లు అర్జున్ మధ్య స్టార్ వార్
-
గ్రాండ్‌గా రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రామ్ చరణ్‌కు ఆర్సీ15 టీం సర్ప్రైజ్.. సెట్లో ఘనంగా బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
విరాట్ కోహ్లి బయోపిక్‌లో రామ్‌చరణ్..? పోలికలు కూడా దగ్గరగా ఉన్నాయి..!
తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన చెర్రీ.. స్పోర్ట్స్ బయోపిక్‌లో నటించాలని తనకు చాలకాలంగా కోరిక ఉందని అన్నాడు. అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించేందుకు ఇష్టపడతానని తెలిపాడు. క్రీడా జగత్తులో విరాట్ కోహ్లి ఓ అద్భుతమని, అతనిదో స్ఫూర్తిదాయకమైన క్యారెక్టరని పొగడ్తలతో ముంచెత్తిన చరణ్.. కోహ్లి రోల్ ప్లే చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకునేది లేదని తన మనసులోని మాటను బయటపెట్టాడు. లుక్స్ పరంగా కూడా తాను కోహ్లికి దగ్గరగా ఉంటానని, ఇది తనకు అదనపు అడ్వాంటేజ్ అని తెలిపాడు. వెండితెరపై ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలను పోషించి సక్సెస్ సాధించిన చరణ్.. స్పోర్ట్స్ బయోపిక్ చేయాలన్న సాహసోపేతమైన కోరిక కలిగి ఉండటం సినీ జనాలకు ఆకట్టుకుంటుంది. కాంక్లేవ్ సందర్భంగా చరణ్.. ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాటకు స్టెప్పులేసి అలరించాడు. #ViratKohli this is crazy 🕺🕺🕺 He is doing #NaatuNaatu #rrr #RamCharan #jrntr #INDvAUS @imVkohli @ImRo45 @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/2bm6FL6iAT — Telugu Box office (@TCinemaFun) March 17, 2023 ఓ పక్క చరణ్.. కోహ్లి బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టగా, మరో పక్క కోహ్లి.. ఆసీస్‌తో తొలి వన్డే సందర్భంగా మైదానంలో నాటు నాటు పాటకు స్టెప్పులేసి పరోక్షంగా చరణ్ ప్రపోజల్‌కు అంగీకారం తెలిపాడు. కాగా, నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న తర్వాత అమెరికా నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన రామ్ చరణ్.. తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశాడు. చరణ్ పాల్గొన్న కాంక్లేవ్‌లోనే పాల్గొన్న అమిత్ షా.. సదస్సు అనంతరం అదే హోటల్లో బస చేస్తున్న చరణ్ రూమ్ కి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు గానూ అమిత్‌షా అభినందించి చరణ్‌ను శాలువాతో సత్కరించారు. భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు @KChiruTweets మరియు @AlwaysRamCharan లను కలవడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది. నాటు-నాటు పాటకు ఆస్కార్ మరియు RRR చిత్రం అద్భుత విజయం సాధించినందుకు రాంచరణ్ ను అభినందించారు. pic.twitter.com/eyLWuq3xmM — Amit Shah (@AmitShah) March 17, 2023 అనంతరం ట్వీట్ చేసిన కేంద్రమంత్రి అమిత్ షా భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ.. భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. -
ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ..
‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా...’ పాటలో దమ్ముంటే లోకం పాడుతుంది.. ఆడుతుంది.. ఆ పాట విశ్వ విజేత అవుతుంది. ‘నాటు నాటు...’ అందుకో ఉదాహరణ. క్లాస్, మాస్ తేడా లేకుండా నాటు బీటు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగు పరిశ్రమ తొలి ఆస్కార్ ఆనందాన్ని చవి చూసేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, డాల్బీ థియేటర్లో ఇతరుల కరతాళ ధ్వనుల మధ్య చిత్రసంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్‌ని అందుకున్నారు. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ 95వ ఆస్కార్ అవార్డు విశేషాలు తెలుసుకుందాం... అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్‌తో ‘నాటు నాటు..’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్ నామినేషన్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు..’కు చోటు దక్కింది. ‘ నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘అప్లాజ్’, ‘బ్లాక్‌పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’లోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్ ఆస్కార్ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్ చిత్రం (ఆర్ఆర్ఆర్) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే నాన్–ఇంగ్లిష్ పాటల్లో ఆస్కార్ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంగ్లిష్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఏఆర్ రెహమాన్, రచయిత గుల్జార్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే... ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ ఒరిజినల్‌సాంగ్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్) ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్) ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్) ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2) బెస్ట్ సౌండ్: టాప్‌గన్: మ్యావరిక్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిస్ గుడ్ బై యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్) బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) హోస్ట్ జిమ్మిపై నెటిజన్ల ఆగ్రహం ఆస్కార్ వేడుక ప్రారంభంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన వచ్చినప్పుడు హోస్ట్ జిమ్మి ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ మూవీ అన్నట్లుగా చెప్పారు. దీంతో నెటిజన్లు జిమ్మి కిమ్మెల్ను తప్పుపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా అని గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆస్కార్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు హోస్ట్ అయిన జిమ్మీ బాలీవుడ్ మూవీ అనడం సరికాదని çపలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శించారు. డు యూ నో నాటు? ‘నాటు నాటు’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్కక్కర్లేదు. కానీ ఆస్కార్ వేదికపై ‘డు యూ నో నాటు?.. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు’.. అంటూ దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కి ఓ ప్రెజెంటర్‌గా వెళ్లిన దీపికా పదుకోన్ ‘నాటు నాటు’ పాటను పరిచయం చేశారు. వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను పాడగా, వెస్ట్రన్ డ్యాన్సర్స్ కాలు కదిపారు. ఈ వేడుకలో వీక్షకుల్లో ‘నాటు నాటు..’ పాట ఎంత జోష్ నింపిందంటే.. పాట పూర్తయ్యాక అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
దీపికా పదుకోన్‌కు అరుదైన గౌరవం
బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకోన్‌కు ఆస్కార్ అవార్డు కమిటీ నుంచి ఆహ్వానం అందింది. మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ వేదికపై మెరవనున్నారామె. జిమ్మి కెమ్మల్ హోస్ట్‌గా జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు దీపికా పదుకోన్. ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవ తొలి దశ ప్రెజెంటర్స్ 16 మంది జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, మైఖేల్ బి జోర్డాన్, గ్లెన్ క్లోజ్, శ్యాముల్ ఎల్. జాక్సన్, డ్వేన్ జాన్సన్, జోయ్ సాల్డానా, జెన్నిఫర్ కొన్నెల్లీ తదితర హాలీవుడ్ తారలు ఉన్న ఈ జాబితాలో దీపికా పదుకోన్ ఉన్నారు. ఇక 2017లో జరిగిన ఆస్కార్ ఆఫ్టర్ పార్టీ (అవార్డుల ప్రదానోత్సవం తర్వాత జరిగే పార్టీ)లో పాల్గొన్న దీపికా ఈసారి ఓ ప్రెజెంటర్‌గా ఈవెంట్‌కు వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రెజెంటర్స్ మలి జాబితా లోనూ ఇండియన్ స్టార్స్ ఉంటారా? అనే విషయం తెలియాలంటే కొంత సమయం వేచి ఉండాలి. ఇక ‘బెస్ట్ ఒరిజి నల్ సాంగ్’ విభాగంలో అవార్డు కోసం ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై లైవ్‌లో ఈ పాట పాడనున్నారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ గత ఏడాది మార్చిలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదలైన ఓటింగ్ ఆస్కార్ అవార్డు విజేతలకు సంబంధించిన ఆన్లైన్ ఓటింగ్ గురువారం ఆరంభమైంది. ఈ ఓటింగ్ మార్చి 7 వరకు జరుగుతుంది. ఆస్కార్ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరందరూ ఆన్లైన్లో ఓటింగ్ వేస్తారు. ఓటర్స్‌లో ఉన్న యాక్టర్స్ ‘యాక్టింగ్’ విభాగానికి, ఎడిటర్స్ ‘ఎడిటింగ్’ విభాగానికి.. ఇలా ఇతర విభాగాలకు చెందినవారు ఆ విభాగానికి ఓట్లు వేస్తారు. కానీ ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’, ‘యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ విభాగాల ఓటింగ్‌కు మాత్రం ప్రత్యేక నియమ నిబంధనలున్నాయి. అలాగే బెస్ట్ పిక్చర్స్ విభాగానికి ఆస్కార్ ఓటర్స్ అందరూ ఓటు వేయొచ్చు. ఓటింగ్ పూర్తయ్యాక ఆ ఫలితాలు ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ సంస్థ వద్ద ఉంటాయి. అవార్డులను అధికారికంగా ప్రకటించడానికి ముందు ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (ఆస్కార్ ఆన్లైన్ ఓటింగ్ రిజల్ట్స్ సెక్యూరిటీని చూసేవారు)కు చెందిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే విజేతలు ఎవరో తెలుస్తుందని అవార్డు కమిటీ పేర్కొంది. బెస్ట్ పిక్చర్ ఓటింగ్ ఇలా.. బెస్ట్ పిక్చర్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న చిత్రాలకు ఆస్కార్ ఓటర్లు 1, 2, 3.. అంటూ ర్యాంకింగ్‌లు ఇస్తారు. ఓటర్లందరూ ర్యాంకింగ్‌లు ఇచ్చిన తర్వాత ఏ చిత్రం యాభైశాతం ఓటర్ల ఫేవరెట్‌గా నిలుస్తుందో అదే బెస్ట్ పిక్చర్‌గా నిలుస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో హీరో రామ్‌చరణ్ (మరో హీరో ఎన్టీఆర్ సోమవారం అమెరికా వెళ్తారని తెలిసింది), దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ను ఈ నెల 3న రీ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ ఏస్ హోటల్ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ను ప్రదర్శించారు. షో పూర్తయ్యాక ‘ఆర్ఆర్ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఓ నటుడిగా ఈ క్షణాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. ఎంత కష్టపడైనా సరే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలన్నదే నా లక్ష్యం. రాజమౌళిగారితో పని చేస్తే సినిమాల పట్ల నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. ఆయన నాకు ప్రిన్సిపాల్, గురువులాంటివారు. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్ (ఎన్టీఆర్) నాకు ఇంకా ఇంకా దగ్గరయ్యాడు’’ అన్నారు. -
మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా.. ఉపాసన ట్వీట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మెగా ఫ్యామిలీ. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంతోషం నెలకొంది. ఇటీవలే స్నేహితులు ఆమెకు సీమంతం వేడుక కూడా నిర్వహించారు. ఆ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఉపాసన. తన ప్రసవానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. అయితే ఇటీవల ఉపాసన డెలివరీ ఎక్కడనే విషయంపై నెటిజన్లు కొన్నిరోజులుగా ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశాల్లో డెలివరీకి ప్లాన్ చేస్తున్నారంటూ రూమర్స్ సృష్టించారు. తాజాగా ట్వీట్‌తో వాటన్నింటికీ చెక్ పెట్టారు ఉపాసన. ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపారు. ఇటీవలే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్‌చరణ్ అమెరికా వెళ్లారు. ప్రముఖ అమెరికన్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లోనూ ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. ఆ సమయంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది. అప్పుడు మీరు అందుబాటులో ఉండాలి’ అని అన్నారు. దీనికి ఆస్టన్ స్పందిస్తూ.. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడమంటే తనకు అదో గౌరవమని.. ఎక్కడ అందుబాటులో ఉండమన్నా సిద్ధం’’ అని తెలిపారు. దాంతో, ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం సాగింది. తాజాగా ఉపాసన ట్విటర్లో రాస్తూ..' డాక్టర్ జెన్ ఆస్టన్ మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా. దయచేసి ఇండియాలోని మా అపోలో ఆస్పత్రుల ఫ్యామిలీలో చేరండి. డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హాతో కలిసి మా బిడ్డ ప్రసవంలో భాగం కావాలని కోరుకుంటున్నా.' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ టేక్ కేర్ సిస్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కాగా.. 2012లో ఉపాసన- రామ్ చరణ్ వివాహం జరిగింది. ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి కావడం విశేషం. అందుకే అపోలో ఆస్పత్రిలోనే బిడ్డను ప్రసవించనున్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dr Jen Ashton, ur too sweet. Waiting to meet you. Pls join our @HospitalsApollo family in India along with Dr Sumana Manohar & Dr Rooma Sinha to deliver our baby 🤗❤️ A big shout out to all the viewers of @ABCGMA3 & @AlwaysRamCharan ‘s fans & well wishers. U are much loved https://t.co/byeGqOllsK — Upasana Konidela (@upasanakonidela) February 25, 2023 -
ఎన్టీఆర్ కథతోనే రామ్ చరణ్ సినిమా..!
-
కోట్లాది మంది ప్రేక్షకుల ఆకాంక్షలు ఫలించాలి: మెగాస్టార్
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. టాలీవుడ్ సినిమా వైభవాన్ని చాటేందుకు ఇక ఒక అడుగు దూరమే ఉన్నామని అన్నారు. కోట్లాది మంది ప్రేక్షకుల ఆకాంక్ష, ప్రార్థనలు మార్చి 12న ఫలించాలని మెగాస్టా చిరంజీవి ఆకాంక్షించారు. ONE STEP AWAY FROM THE PINNACLE OF CINEMATIC GLORY !!! 🎉🔥🎉👏👏 Heartiest Congrats on THE Oscar Nomination for Best Original Song @mmkeeravaani garu & the visionary @ssrajamouli and the Entire Team behind #NaatuNaatu & @RRRMovie — Chiranjeevi Konidela (@KChiruTweets) January 24, 2023 గర్వంగా ఉంది: ఎన్టీఆర్ అంతే కాకుండా చిత్రబృంద సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. నాటు నాటు పాట మరో ఘనత సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకులు కీరవాణి, రచయిత చంద్రబోస్ లకు నా అభినందనలు తెలిపారు. Congratulations @MMKeeravaani Garu and @boselyricist Garu on achieving another well-deserved and monumental feat... This song will forever hold a special place in my heart.@ssrajamouli @alwaysramcharan #RRRMovie #NaatuNaatu #Oscars95 pic.twitter.com/YYmtD0kVou — Jr NTR (@tarak9999) January 24, 2023 గౌరవంగా భావిస్తున్నా: రామ్ చరణ్ నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడం పట్ల నిజంగా గౌరవంగా భావిస్తున్నానని మెగా హీరో రామ్ చరణ్ అన్నారు. మన దేశానికి ఇది గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి, ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. What brilliant news! Truly an honour to see “Naatu Naatu” nominated for the Oscars. Another very proud moment for us & India. Well deserved @MMKeeravaani Garu, @SSRajamouli Garu, my brother @tarak9999 and the entire team of #RRR🙏 All love ❤️ — Ram Charan (@AlwaysRamCharan) January 24, 2023 చిత్ర బృందానికి అభినందనలు: కీరవాణి నాటునాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై సంగీత దర్శకుడు కీరవాణి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. Congratulations to my team !! Big hugs to all 🤗 pic.twitter.com/S8g6v1Ubyv — mmkeeravaani (@mmkeeravaani) January 24, 2023 ఆనందంగా ఉంది: ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నాటు నాటు పాట ఆస్కార అర్హత సాధించడం ఆనందంగా ఉందని ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్లే నా పాట ఆస్కార్ వరకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. దర్శకులు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలబైరవకు కృతజ్ఞతలు తెలిపారు. నాటు నాటును ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటునాటు పాటకు డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. ఇదొక అద్భుతం: వెంకటేశ్ నాటునాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం అద్భుతమని హీరో వెంకటేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా సిగలో మరో కలికితురాయి చేరిందన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా అభినందనలు తెలిపారు. చిత్రబృందానికి అభినందనలు: బాలకృష్ణ నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్‌కు ఎంపిక కావడం పట్ల ఆర్ఆర్ఆర్, ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర బృందాలకు కూడా అభినందనలు తెలిపారు. భారతీయ సినిమా ప్రకాశిస్తోంది: రక్షిత్ శెట్టి భారతీయ సినిమా గర్వించదగిన క్షణామని బాలీవుడ్ నటుడు రక్షిత్ శెట్టి అన్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా ప్రకాశిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలిపారు. నాటు దెబ్బ డైరెక్ట్‌గా ఆస్కార్కేః రవితేజ కీరవాణి గారు స్క్రీన్ మీద తారక్, చరణ్‌తోపాటు ప్రపంచం మొత్తాన్ని నాటునాటు డ్యాన్స్ వేసేలా చేశారని రవితేజ వేపించారు. నాటునాటు పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. -
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన రామ్ చరణ్
-
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ ..
-
గరం గరం ముచ్చట్లు 24 March 2022
-
ఆర్ఆర్ఆర్ రిలీజ్.. వసూళ్ల జాతరకు టీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డెరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓ జీవో విడుదల చేసింది. తాజా జీవో ప్రకారం.. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50 పెంపు, తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక, మల్టీప్లెక్స్, ఐమాక్స్‌లో మొదటి మూడు రోజులకు రూ. 100 పెంపు, తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మార్చి 25 నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు తెలంగాణ సర్కార్ అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హై బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు ఈ పెంపునకు అనుమతి ఇచ్చింది. కాగా, రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్లు ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత టికెట్ రేట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
టాలీవుడ్లో కొత్త వేరియంట్...!
ఇదేంటండీ బాబూ... వేరియంట్ వెరీ గుడ్డా? వేరియంట్ ఎలా అవుతుంది గుడ్డు.. వెరీ బ్యాడు అనే కదా మీ సందేహం. కరోనా వేరియేషన్స్‌లో డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్... ఈ వేరియంట్లు బ్యాడే. కానీ... హీరోలు రకరకాల వేరియేషన్లలో కనిపిస్తే ఆ వేరియంట్ గుడ్డే కదా. అభిమానులకు పండగే కదా. ఇక ఒకే సినిమాలో పలు వేరియేషన్లలో కనిపించనున్న హీరోలెవరో చూసేద్దాం... కెరీర్లో ఎన్నోసార్లు డిఫరెంట్ గెటప్స్ ఉన్న పాత్రలు చేశారు చిరంజీవి. ఇప్పుడు ఒకటి కాదు రెండు మూడు సినిమాల్లో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నారు. విడుదలకు రెడీ అయిన ‘ఆచార్య’లో కామన్ మేన్‌గా, నక్సలైట్‌గా రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తారు చిరంజీవి. ‘ఆచార్య’ ట్రైలర్లో దీన్ని మనం గమనించవచ్చు. అలాగే ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్) లోనూ చిరంజీవి డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలిసింది. ఇక ‘ఆచార్య’లో కీలక పాత్ర చేసిన రామ్‌చరణ్ ఈ చిత్రంలో తండ్రిలా రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. రామ్‌చరణ్ చేసిన మరో చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ హీరోగా నటించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో ప్రధానంగా ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలోఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో తాను మూడు గెటప్స్‌లో కనిపించనున్నట్లు ఇటీవల ఓ సందర్భంలో రామ్‌చరణే స్వయంగా చెప్పారు. పోలీసాఫీసర్, అల్లూరి సీతారామరాజు గెటప్స్‌తో పాటు మరో లుక్‌లో చరణ్ కనిపించనున్నారు. ఇదే చిత్రంలో ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలిసింది. అందులో ఒకటి యంగ్ భీమ్ కాగా, అదే పాత్ర ఓల్డ్ వేరియేషన్ ఒకటి అని సమాచారం. కీలక సన్నివేశాల్లో టోపీ ధరించిన వేరియేషన్ ఒకటి. ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో మాత్రమే కాదు... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా చరణ్ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారే పాత్రలో చరణ్ కనిపిస్తారని తెలిసింది. ఇక ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రవితేజ. అయితే సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రావణాసుర’లో పది గెటప్స్‌లో కనిపిస్తారు. అలాగే ‘ఖిలాడి’ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’, సెప్టెంబరు 30న ‘రావణాసుర’ చిత్రాలు థియేటర్స్‌కు రానున్నాయి. ప్రస్తుతం ‘రావణాసుర’కి సంబంధించిన నైట్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. యంగ్ హీరో నాగచైతన్య లేటెస్ట్ ఫిల్మ్ ‘థాంక్యూ’. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కుమార్‌తో నాగచైతన్య చేస్తున్న చిత్రం ఇది. ఇందులో తాను మూడు గెటప్స్‌లో కనిపించనున్నట్లు నాగచైతన్య ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఓ వ్యక్తి జర్నీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అటు అమిర్ ఖాన్ హీరోగా చేసిన ‘లాల్‌సింగ్ చద్దా’లో కీ రోల్ చేసిన నాగచైతన్యను ఆ సినిమాలో రెండు గెటప్స్‌లో చూడొచ్చు. ఒకటి ఆర్మీ ఆఫీసర్ కాగా, మరొకటి జనరల్ గెటప్. ఇక కొన్ని నెలల క్రితం నితిన్ హీరోగా ‘పవర్ పేట’ అనే సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తానని నితిన్ ఓ సందర్భంలో తెలిపారు. ఇంకోవైపు డిఫరెంట్ సినిమాలతో దూసుకెళ్తోన్న సత్యదేవ్ చేసిన తాజా చిత్రం ‘గుర్తుందా... శీతాకాలం’. ఇందులో స్టూడెంట్‌గా, ఉద్యోగిగా, ఇంకో వేరియేషన్... ఇలా మూడు డిఫరెంట్ గెటప్స్‌లో సత్యదేవ్ కనిపిస్తారు. నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక ‘దసరా’ చిత్రంలో నాని, ‘ది వారియర్’లో రామ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు కొందరు సీనియర్ అండ్ యంగ్ హీరోలు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి మేకోవర్ అవుతున్నారు. ఇలా పలు వేరియంట్స్ (రూపాంతరాలు) ఉన్న పాత్రల్లో హీరోలు కనబడితే... ఆడియన్స్ ‘వేరియంట్ వెరీ గుడ్డు’ అనకుండా ఉండగలరా! -
మా అమ్మ కర్ణాటకకు చెందినవారే : జూ. ఎన్టీఆర్
‘‘కర్ణాటక చిత్రసీమలో పునీత్ రాజ్‌కుమార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన లేకపోవడం శూన్యంగా అనిపిస్తోంది’’ అన్నారు ఎన్టీఆర్. శుక్రవారం బెంగళూరులో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కన్నడ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, హీరోయిన్ ఆలియా భట్ పాల్గొన్నారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ కన్నడంలో మాట్లాడుతూ– ‘‘ఇల్లి జనగలను నోడదరె తుంబ ఖుషీ ఆక్తాయిదె.. ఎల్లారు జత కన్నడ మాత్తాడన్ అవకాశ బందిదె. థ్యాంక్స్ టూ కర్ణాటక, నమ్మ తాయి కర్ణాటక మూలద. ఈగ నాను నటిసిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర.. ఇల్లి కన్నడదల్లి డబ్ ఆగిదె. బహుళ సంతోష. కన్నడదల్లి నన్న వాయిస్ ఇరుత్తె (కన్నడ ప్రజలను చూస్తే ఆనందం వేస్తోంది. అందరి మధ్యలో కన్నడ భాష మాట్లాడటం ఆనందంగా ఉంది. మా అమ్మ కర్ణాటకకు చెందిన వారే. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కన్నడ డబ్‌లో కావడం చాలా సంతోషంగా ఉంది. నా సొంత వాయిస్ వినిపిస్తాను)’’ అన్నారు. అంతేకాదు... కర్ణాటకకు వచ్చిన ప్రతిసారీ పునీత్‌ను కలిసి వెళ్లేవాడినని చెప్పారు. ఇదిలా ఉంటే పునీత్ రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ’ (2016)లోని ‘గెలయా.. గెలయా’ పాటను ఎన్టీఆర్ పాడారు. ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై ఈ పాట పాడి, భావోద్వేగానికి గురయ్యారు ఎన్టీఆర్. ‘‘ఎల్లరిగూ నమస్కార’ (అందరికీ నమస్కారం). ‘ముఠా మేస్త్రి’ సినిమా నుంచి చిరంజీవి కుటుంబ సభ్యులకు కర్ణాటకలో ఆదరణ లభిస్తోంది. కన్నడ సినిమాలో నటించేందుకు వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు రామ్‌చరణ్. ‘‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కన్నడ నటులతో పూర్తి స్థాయిలో సినిమా చేసే ప్లాన్ ఉంది’’ అన్నారు రాజమౌళి. -
ఆర్ఆర్ఆర్ మూవీ: ఇంట్రస్టింగ్ అప్డేట్స్, ట్రైలర్ గూస్ బంప్స్ అంతే!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ స్టార్స్, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. బిగ్ స్క్రీన్‌పై తొలిసారి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్ సాంగ్స్, మేకింగ్ వీడియోలు ఫ్యాన్స్‌కు మంచి కిక్కు ఇవ్వగా, థియేటర్లలో రిలీజైన ట్రైలర్ మరింత హంగామా సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్ (రౌద్రం, రణం, రుధిరం) ట్రైలర్‌తో జక్కన్న సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్ ఫిదా. గూస్ బంప్స్ అంతే తెగ సంబర పడిపోతున్నారు. ‘‘పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పనిచేయగలిగింది ఒక్కడే సార్’’ ‘‘పానం కన్నా నీ సోపతి నా సొంతం..’’ తొంగి..తొంగి నక్కి నక్కి గాదే... తొక్కుకుంటూ పోవాలే.. ఎదురు వచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే..’’ ‘‘కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పద..’’ ఇలా పవర్ఫుల్ డైలాగ్స్‌తో మరో సెన్సేషన్‌కు రాజమౌళి బాటలు వేసేసాడు. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివితో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రాబోతోంది. దాదాపు రూ. 400 కోట్లతో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. #RRR (UA 187) already Cleared Censors Uncut according to the CBFC Portal!. #RRRMovie pic.twitter.com/fo2Qszuf4H — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 8, 2021 BIG DAY !! Theatres will erupt in few hours…. 🌋🌋💥💥#RRRTrailerDay #RRRTrailer #RRRMovie pic.twitter.com/TEb5BPCgaL — RRR Movie (@RRRMovie) December 9, 2021 Hyderabad &Nizam RRR Theatre List @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/fYoLIeuMlb — Nandipati MuRRRali🌊 (@NtrMurali9999) December 7, 2021 -
జనని పాట ఆర్ఆర్ఆర్ ఆత్మ
‘‘జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆత్మలాంటిది. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). అజయ్ దేవగణ్ కీలక పాత్రలో ఆలియా భట్, ఒలీవియా మోరీస్ కథానాయికలుగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నేడు ‘జనని..’ అనే పాటను విడుదల చేయనుంది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ– ‘‘డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అన్నారు. నిర్మాత డీవీవీ దానయ్య పాల్గొన్నారు. -
చెర్రీతో మరోసారి రోమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ
-
RRR Movie: ఫైట్ సీన్‌కి కన్నీళ్లొస్తాయి!
‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలోని పోరాట సన్నివేశా లను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని అంటున్నారు ఈ చిత్రరచయిత కె.వి.విజయేంద్రప్రసాద్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఈ చిత్రవిశేషాల గురించి ఇటీవల ఓ సందర్భంలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన సినిమా గురించి మనమే గొప్పగా చెప్పుకోవడం సభ్యత కాదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది. సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సీన్స్‌ను చూస్తున్నప్పుడు కొందరు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ సందడి చేస్తుంటారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో ఒక రకమైన బాధ దాగి ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది. ఫస్ట్ టైమ్ ఫైట్ సీక్వెన్సెస్‌కి ఎమోషన్ అవుతారు ప్రేక్షకులు’’ అన్నారు. -
వైరల్: రామ్‌చరణ్ నయా లుక్.. ఆ ఫిట్నెస్ ఏంటి సామీ !
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సినిమా సినిమాకు తన గ్రాఫ్‌ని పెంచుకుంటున్నాడు. కేవలం నటన పరంగానే కాకుండా కథల ఎంపికలోనూ కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. రొటీన్ సినిమాలు చేయకుండా.. కొత్త ప్రయోగాలు చేస్తూ స్టార్‌గా ఎదిగాడు. అయితే స్టార్ హోదా రావడం ఎంత ముఖ్యమో ఆ హోదాను కాపాడుకోవడం అంతే ముఖ్యం. ఈ విషయం రామ్‌చరణ్‌కు బాగా తెలుసు. కథతో పాటు తన గెటప్ కూడా కొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు హీరో రామ్‌చరణ్. దానికోసం ఆయన పడే కష్టం అంతాఇంత కాదు. ఫిట్నెస్ ఈ మెగాపవర్ స్టార్ చాలా కష్టపడతాడు. తాజాగా వైరల్ అయిన ఫోటోనే అందుకు నిదర్శనం. స్ట్రాంగ్ మార్నింగ్ అంటూ మంగళవారం రామ్‌చరణ్ ఓ ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో కండలు తిరిగినే శరీరంతో నయా లుక్‌లో రామ్‌చరణ్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామ్ చరణ్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తోంది. ఆ ఫిట్నెస్ ఏంటి సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు, కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’లోనూ నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
చెర్రీ బర్త్‌డే: మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీఇండస్ట్రీ నుంచి విషెస్ వెల్లువెత్తుతుండడంతో పాటు తన సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రామరాజ్ పోస్టర్ .. ‘ఆచార్య’ నుంచి సిద్ధ పోస్టర్ లాంటి సాలిడ్ అప్డేట్స్ వచ్చాయి. ఇదిలాఉండగా.. చరణ్ చేసిన సినిమాల్లో నటనపరంగా మరో మెట్టు ఎక్కించిన సినిమా ‘రంగస్థలం’ అని తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలుగా తెరకెక్కిందీ చిత్రం. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన రంగస్థలం చరణ్‌కు నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ అద్భుత నటనా పటిమ కనబరిచాడు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి నాన్ బాహుబలి రికార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా రామ్ చరణ్ ‘రంగస్థలం’ తమిళ డబ్ వెర్షన్ విడుదల ఎప్పుడన్నది కూడా తెలిసిపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీనిస్తూ ట్విటర్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాను తమిళ వెర్షన్లో విడుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో వచ్చే మే నెలలో ముహూర్త ఖరారు చేసినట్టు నిర్మాతలు కన్ఫార్మ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి చెర్రీ సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ వింటేజ్ వండర్ తమిళంలో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి. ( చదవండి: సైరాకుఏడాది పూర్తి, రామ్‌చరణ్ ట్వీట్ ) Wishing our Mega Power Star a great day! #HappyBirthdayRamcharan Due to Popular demand by all #RamCharan Tamil Fans.. We are releasing Blockbuster Rangasthalam (Tamil) in Theatres this MAY 2021.. Release thru @7GfilmsSiva@AlwaysRamCharan @Samanthaprabhu2 @ThisIsDSP @aryasukku pic.twitter.com/TIaYiZtgH5 — Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2021 -
ఈ హిట్‌తో తెలుగు సినిమాకి ప్రాణం పోశారు
‘‘కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఈ సమయంలో ‘ఉప్పెన’ సినిమాని హిట్ చేయడం ద్వారా తెలుగు సినిమాకు ప్రేక్షకులు ప్రాణం పోశారు’’ అన్నారు రామ్‌చరణ్. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజైంది. రాజమహేంద్రవరంలో బుధవారం ఉప్పెన విజయోత్సవం జరిగింది. ఈ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు ఇతర భాషల్లోని సినిమాలకు కూడా ‘ఉప్పెన’ హిట్ ఓ ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వైష్ణవ్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గురువును (సుకుమార్) మించిన శిష్యుడు అని బుచ్చిబాబు నిరూపించుకున్నాడు’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు వైష్ణవ్ తేజ్. ఈ వేడుకలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. -
వెల్కమ్ టు పుణె
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ పుణె ప్రయాణం అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ కోసమే ఈ ప్రయాణం అని అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ పుణెలో జరగనుందని సమాచారం. సుమారు వారం పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాల్గొంటారని తెలిసింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ కెమెరామేన్. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలకానుంది. -
సైరాకుఏడాది పూర్తి, రామ్‌చరణ్ ట్వీట్
బ్లాక్ బాస్టర్ హిట్ సైరా నరసింహారెడ్డి చిత్రం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ చరణ్ ట్విటర్ వేదికగా స్పందించారు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి గా కృతజ్ఙతలు తెలిపారు. ‘బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ క్రూ, ఏ బ్రిలియంట్ టీం, థ్యాంక్యూ వన్ అండ్ ఆల్’ అని రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాను రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేశారు. Best EXPERIENCE !! Best CAST!! & A BRILLIANT team!! A year since #SyeRaa released. Thank you one and all.@SrBachchan @KChiruTweets @DirSurender #Nayanthara @KicchaSudeep @VijaySethuOffl @IamJagguBhai @ravikishann @tamannaahspeaks @KonidelaPro #MahatmaGandhi pic.twitter.com/dQJcR5rVRA — Ram Charan (@AlwaysRamCharan) October 2, 2020 స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించారు. ఇక బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సురేందర్ రెడ్డి కూడా తనని నమ్మి సినిమా చేసిన చిరంజీవికి, రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఆ సినిమా కోసమే ఆ లుక్! -
నవిష్కతో చెర్రీ డాన్స్..
-
లాక్డౌన్ ఎఫెక్ట్.. శరీరం సహకరించడం లేదు
లాక్డౌన్ కారణంగా జనాలు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు అందరి జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆఫీస్‌కు వెళ్లే పని లేదు.. షూటింగ్‌లు లేవు. దాంతో ఫిట్నెస్ ప్రేమికులు కూడా కొన్ని రోజుల పాటు శరీరానికి రెస్ట్ ఇచ్చారు. పాపం రామ్ చరణ్ కూడా అలానే చేశారంట. ఇన్ని రోజులు గ్యాప్ రావడంతో ప్రస్తుతం జిమ్ చేయాలంటే శరీరం సహకరించడం లేదు. బద్దకం ఎక్కువయ్యింది అంటున్నారు చెర్రి. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు రామ్ చరణ్. ‘బుర్ర జిమ్ చేయమంటోంది.. మనసు మాత్రం వద్దంటోంది’ అంటూ చెర్రి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపసనా, మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి క్వారంటైన్లో ఉన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో వంట చేయడంతో పాటు ఇతర ఇంటి పనులను చేస్తూ తనను తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు చెర్రి. (ఒకేసారి ఆ మార్క్‌ను అందుకున్న చిరు, చరణ్) Head say gym💪 & Heart says 🤔hmmmm... pic.twitter.com/zoNNHz6Sxt — Ram Charan (@AlwaysRamCharan) July 10, 2020 ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చెర్రి కీల పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ఛాలెంజ్ పూర్తిచేసిన చెర్రీ.. తర్వాత వారే
దర్శకధీరుడు రాజమౌళి విసిరిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఇళ్లు శుభ్రపరచడం, చెట్లకు నీళ్లు పోయడం వంటి పనులను చేసిన చెర్రీ.. చివరగా రెండు కప్స్‌లో కాఫీని కలిపి తన సతీమణి ఉపాసనకు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు రామ్‌చరణ్. ఇంటి పనులు చేయడంలో మహిళలకు సహాయం చేద్దాం అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో మెగాభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా తన ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ దర్శకుడు త్రివిక్రమ్, రానా, శర్వానంద్, బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ లకు సవాల్ విసిరారు. ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్.. సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా ఇంటి పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక క్వారంటైన్లో ఖాళీగా ఉండకుండా కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలంటూ మిగతా సెలబ్రిటీలకు సైతం సవాలు విసురుతున్నారు. ఇప్పటికే పలువరు సినీ ప్రముఖలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి ఇంటి పనులు చేస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. -
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు జక్కన్న ఛాలెంజ్
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా ఇంటి పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక క్వారంటైన్లో ఖాళీగా ఉండకుండా కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలంటూ మిగతా సెలబ్రిటీలకు సైతం సవాలు విసురుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ రామ్‌చరణ్‌లకు సవాలు విసిరారు. అంతేగాక బాహుబలి నిర్మాతలకు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కిరవాణిలకు కూడా ఛాలెంజ్ ఇచ్చారు. ‘నా వంతు అయ్యింది సందీప్.. ఇప్పడు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల వంతు వచ్చింది. ఇక చూడండి ముందుంది అసలైన సరదా.. అలాగే శోభు సుక్కు, ఆర్య సుక్కు, పెద్దన్న ఎమ్ఎమ్ కీరవాణి కూడా ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. (సందీప్ ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి) కాగా దర్శకుడు సందీప్ వంగ.. రాజమౌళి తన భార్యకు పనుల్లో సాయం చేయాలని కోరుతూ.. సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి తన భార్యకు సాయంగా ఇంటి పనులు చేస్తున్న వీడియోను ట్విటర్లో సోమవారం షేర్ చేశారు. కాగా ప్రస్తుతం రాజమౌళి స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కిస్తున్నారు. ఇటివల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది కానుకగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల అభిమానుల కోసం విడుదలు చేశారు. ప్రత్యేక టీజర్‌ను రామ్‌చరణ్ పుట్టిన రోజు మార్చి 27న విడుదల చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్‌చరణ్ అల్లు సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. -
నా రామ్‌చరణ్ తెలుసా?: కేటీఆర్
-
గరిటతో చరణ్.. పైపు పట్టిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : సినిమాల్లో హీరో అవ్వడం కాదు భార్య మనసు దోచుకుని సూపర్ హీరో అనిపించుకున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్‌కు లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీ సమయం దొరకడంతో తన సతీమణి ఉపాసన కోసం ప్రత్యేకంగా వంటవండారు. దీనికి సంబంధించి వీడియోను ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వంట వండటమే కాదు, తర్వాత పాత్రలను కూడా ఆయనే శుభ్రం చేశారు. ఇందుకే చరణ్ నా దృష్టిలో హీరో అయ్యారు అంటూ ఉపాసన పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న భర్తలు ఇది గమనించాలని సూచించారు. మరో వైపు రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి పైపు పట్టి ఇంటి ముందున్న ప్రాంతాన్ని శుభ్రం చేశారు. మనం నడిచే దారులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటూ, ఇంట్లోనే ఉండండి అంటూ తన లాక్డౌన్ అనుభవాలను ట్విటర్లో వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. -
అజయ్ ఆగయా
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామచరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిరి్మస్తున్నారు. అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి అజయ్ ఆగయా (వచ్చారు). ‘‘రాజమౌళిగారిని వివిధ సందర్భాల్లో కలుసుకున్నప్పుడు ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళిగారితో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు అజయ్ దేవగన్. ఈ షెడ్యూల్ చిత్రీకరణ ఇంకా 25 రోజుల పాటు సాగుతుందని తెలిసింది. 1920 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయింది. ఈ సినిమాను పది భాషల్లో ఈ ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే విడుదల తేదీ మారుతుందనే ప్రచారం జరుగుతోంది. -
పార్టీ మూడ్
న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి తారలందరూ తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లేందుకు అంతా సెట్ చేసుకున్నారు. ఫుల్ జోష్‌తో దిల్ ఖుష్ అయ్యేలా రెగ్యులర్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. టాలీవుడ్లో ఎక్కువమంది తారలు గోవా తీరంలో సేద తీరడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. స్టార్ హీరో మహేశ్‌బాబు కుటుంబ సమేతంగా ముంబైలో ఉన్నారు. రామ్‌చరణ్ గోవాలో ల్యాండ్ అయ్యారు. అల్లు అర్జున్ బ్యాంకాంక్‌లో వాలిపోయారు. తన శ్రీమతి సమంతతో కలిసి రెండు రోజులు ముందుగానే గోవా వెళ్లారు నాగచైతన్య. ఇంకా సాయిధరమ్‌తేజ్, వరుణ్ తేజ్, లక్ష్మీమంచు కూడా 2020 సెలబ్రేషన్స్‌కు గోవానే ఎంచుకున్నారని తెలిసింది. ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఆ్రస్టియాలో అడుగుపెట్టారు. తన బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ వాణీకపూర్‌తో కలిసి లండన్‌లో మస్తీ చేస్తున్నారు రాశీఖన్నా. ఆకాంక్షాసింగ్ న్యూయార్క్ వీధుల్లో విహరిస్తున్నారు. మేఘా ఆకాష్ స్పెయిన్ తీరంలోని చల్లగాలులను ఆస్వాదిస్తున్నారు. బ్యాగ్ సర్దుకుని శ్రీలంకకు వెళ్లారు ఐశ్వర్యారాజేష్. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నారు పాయల్ రాజ్‌పుత్. ఇక ఏడాదిలో తొలిరోజును షూటింగ్ లొకేషన్లో గడపనున్నారు నిధీ అగర్వాల్. అంతేకాదు.. ఈ ఏడాది రెండు స్వచ్ఛంద సేవా సంస్థలకు తన వంతు సాయం అందించాలనుకుంటున్నారు నిధి. ఆ్రస్టియాలో పరిణీతిచోప్రా, స్విట్జర్లాండ్‌లో అనుష్కాశర్మలతో పాటు మరికొందరు తమ తమ ఫేవరెట్ లొకేషన్స్‌కు వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను జరుపుకోనున్నారు. -
ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనేది రేపు( నవంబర్ 20) రివీల్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ప్రతినాయక పాత్రల గురించి కూడా రేపే చెబుతామని వెల్లడించింది. సినిమా షూటింగ్ దాదాపుగా 70శాతం పూర్తిచేసినట్టుగా యూనిట్ పేర్కొంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది. రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీంగా నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్గా నటిస్తుంది. ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనుంది. దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారనే సందేహం అభిమానుల్లో మొదలైంది. అమెరికన్ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఎన్టీఆర్ సరసన నటిస్తారని పుకార్లు వచ్చాయి.. కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎవరి పేరును ప్రకటించలేదు. ఎన్టీఆర్‌కు జోడీగా జక్కన్న ఎవరిని తీసుకొస్తారనేది రేపు తెలియనుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కోర్టులో అల్లూరి
కోర్టు బోనులో నిలబడి వాదిస్తున్నారు రామ్‌చరణ్. ఈ వాడివేడి వాదనను వచ్చే ఏడాది జూలైలో విడుదల కానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చూడొచ్చు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్, కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోర్టులో అల్లూరి తన వాదన వినిపించే సీన్స్ తీయడం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. -
శివను కలిసి వచ్చాను: రాంచరణ్
హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ అనుకోకుండా దర్శకుడు కొరటాల శివను కలిశారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన 152వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శివ కార్యాలయానికి అలా వెళ్లివచ్చానని రాంచరణ్ శుక్రవారం ఫేస్బుక్లో వెల్లడించారు. ‘శివగారి ఆఫీస్‌కు వెళ్లి వచ్చాను. ఆయన ఎనర్జీ ఎంతగానో నచ్చింది. చిరంజీవి 152వ సినిమాకు ఆల్‌ది బెస్ట్’ అని రాంచరణ్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చార్లీ చాప్లిన్ ఫొటో ఎదుట తాను, శివతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసుకున్నారు. చారిత్రక నేపథ్యంతో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాంచరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’. సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. రాంచరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిరంజీవి 152వ సినిమా ప్రారంభం
-
అప్పుడలా.. ఇప్పుడిలా..
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ తీస్తున్నప్పుడు రాజమౌళి–ఎన్టీఆర్ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు. 18 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 27న రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ రిలీజ్ అయింది. దర్శకుడిగా రాజమౌళికి అది మొదటి సినిమా. హీరోగా ఎన్టీఆర్‌కి ఫస్ట్ బ్లాక్‌బస్టర్. ‘స్టూడెంట్ నెం.1’ చిత్రీకరించిన స్టూడియోలోనే ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ జరుగుతోంది. ‘స్టూడెంట్ నెం.1’ లొకేషన్లో... 18 ఏళ్ల క్రితం షూటింగ్ జ్ఞాపకాల్ని మరోసారి గుర్తుచేసుకున్నారు ఎన్టీఆర్, రాజమౌళి. గుర్తు చేసుకోవడమే కాదు.. పాత ఫోటోల స్టిల్స్లాగానే మరోసారి పోజులిచ్చారు కూడా. ‘‘18 ఏళ్లవుతోంది ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం రిలీజ్ అయి. అదే లొకేషన్లో ఇవాళ మళ్లీ షూట్ చేస్తున్నాం. ఈ 18 ఏళ్లలో చాలా మారాయి. కానీ రాజమౌళితో పని చేయడంలో ఉండే ఫన్ మాత్రం మారలేదు’’ అని ఒక ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేశారు. ‘‘ఈ 18 ఏళ్లలో ఎన్నో మారాయి. తను (ఎన్టీఆర్) సన్నగా అయ్యాడు, నేను పెద్ద అయ్యాను. మేమిద్దరం ఇంకాస్త తెలివిగలవాళ్లమయ్యాం’’ అని రాజమౌళి ఓ ఫోటోను షేర్ చేశారు. -
‘సైరా’ ట్రైలర్ విడుదల
-
హీరో రాంచరణ్ ఇంటి ముందు ఆందోళన
-
‘కొణిదెల’ కార్యాలయం ఎదుట ఆందోళన
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడక్షన్స్ కార్యాలయం ఎదుట ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను కథగా మలుచుకొని కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీస్తున్న సంగతి తెలిసి ందే. ఈ నేపథ్యంలోనే ఉయ్యాలవాడకు చెందిన దాదాపు ఏడు కుటుంబాలు లక్ష్మి నేతృత్వంలో ఇక్కడికి చేరుకున్నాయి. తమ కుటుంబసభ్యులకు కొణిదెల ప్రొడక్షన్స్ సభ్యులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, ఒప్పందం కూడా చేసుకున్నారన్నారు. అయితే శనివారం రాత్రి హీరో రామ్‌చరణ్ మేనేజర్ అభిలాశ్ ఫోన్ చేసి, ఇక్కడికి రావద్దని కథపై తమకెలాంటి హక్కులు లేవని చెప్పడంతో తాము అవాక్కయ్యామన్నారు. తమ నిరసన వ్యక్తం చేసేందుకే ఇక్కడికి వచ్చామన్నారు. తమ కథను వాడుకోవడమే కాకుండా తమ ఆస్తులను కూడా వాడుకున్నారన్నారు. కథ విషయంలో తమ ఇళ్ల వద్దకు వచ్చి ఇంటి ముందున్న సామగ్రిని నాశనం చేశారని ఆరోపించారు. మార్చి 11న చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఏడు కుటుంబాలకు చెందిన 22 మందిని పిలిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రామ్‌చరణ్ న్యాయం చేస్తానని మాటిచ్చారని, అయితే మధ్యవర్తులు కొందరు అందుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కొణిదెల ప్రొడక్షన్స్ సిబ్బంది వారితో మాట్లాడి తమకు కొంత సమయం కావాలని కోరడంతో ఆ కుటుంబాలు అక్కడి నుంచి వెనుదిరిగాయి. ఇదిలా ఉండగా ఈ విషయంలో ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఇప్పటికే రెండుసార్లు కోర్టును ఆశ్రయించాయని, కోర్టు ఆదేశాల ప్రకారం తాము నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సైరా నిర్మాణ వర్గాలు స్పష్టం చేశాయి. -
చైనాలో నైరా
‘సైరా’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టే సమయం వచ్చేసిందట. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని సమాచారం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తమన్నా, అనుష్క కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, ఏప్రిల్ మొదటి వారంతో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి అయిపోతుందని తెలిసింది. ఈ చిత్రం చైనాలో చిత్రీకరణ జరగుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదట. చైనాలో ‘నైరా’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉందని టాక్. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
గురూ... యాక్షన్ షురూ
మళ్లీ ఫైటింగ్ షురూ చేశారట ఎన్టీఆర్ అండ్ రామ్‌చరణ్. ‘బాహుబలి’ వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్)’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌పై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మళ్లీ ఇప్పుడు షూటింగ్ షురూ చేసింది. ఈ సెట్లోకి గురువారం ఎన్టీఆర్ ఎంటరయ్యారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటుగా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఫస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ను తీశారు. తాజా షెడ్యూల్లో కూడా వీరి కాంబినేషన్లో ఓ భారీ ఫైట్ తీయబోతున్నారట. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా బాలీవుడ్ భామలు ఆలియా భట్, పరిణీతీ చోప్రాల పేర్లు తెరపైకి వచ్చాయి. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
వెయ్యి మందినీ ఒకేసారి రమ్మను
‘ఒక్కొక్కడినీ కాదు షేర్‌ఖాన్ వందమందినీ ఒకేసారి రమ్మను’ అని ‘మగధీర’లో రామ్‌చరణ్‌ను వంద మందితో ఫైట్ చేయించారు రాజమౌళి. వీళ్ల కాంబినేషన్లో పదేళ్ల తర్వాత వస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఈ సంఖ్యను పదింతలు చేశారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’(వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో సుమారు 1000 మందికి పైగా ఆర్టిస్టులు పాల్గొంటున్నారట. ఈ సినిమాలో ఇదే పెద్ద యాక్షన్ సీన్ అనుకుంటే పొరపాటే. దీనికంటే భారీ యాక్షన్ సీన్స్‌ను కూడా ప్లాన్ చేశారట దర్శకుడు రాజమౌళి. సెకండ్ షెడ్యూల్లో బ్రేక్ తీసుకుంటున్న ఎన్టీఆర్ తర్వాతి షెడ్యూల్లో జాయిన్ అవుతారట. 1920ల నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ పోలీస్ అధికారిగా కనిపిస్తారట. ఎన్టీఆర్ సరసన పరిణీతీ చోప్రా, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్లను హీరోయిన్లుగా తీసుకోవాలి అనుకుంటున్నారట చిత్రబృందం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్. -
అంతరిక్షానికి చిట్టిబాబు
స్టార్ హీరోలు తోటి హీరోల ఈవెంట్లలో పాల్గొనడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. పరిశ్రమలో హీరోల మధ్య, వారి అభిమానుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉందనడానికి ఆడియో ఆవిష్కరణ వేడుకలు, ప్రీ రిలీజ్, సినిమా సక్సెస్మీట్లు వేదికలుగా మారుతున్నాయి. తాజాగా తమ్ముడు వరుణ్ తేజ్ సినిమా ఫంక్షన్‌కు అన్న రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం అంతరిక్షం 9000 kmph. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. డిసెంబర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించారు సంకల్ప్ రెడ్డి. తాజాగా విడుదలైన ఆడియో.. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ఆర్ఆర్ఆర్ : ప్రచారంలో ఉన్న కథలేంటి?
త్రీ ఆర్స్.. ఎన్టీ రామారావు, రామ్‌చరణ్, రాజమౌళి... కాంబినేషన్ అదుర్స్..టూ ఆర్స్... యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసేస్తారు.మరి.. టేకింగో.. రాకింగ్ మౌళి అక్కడ. కథ? డౌటే లేదబ్బా... విజయేంద్రప్రసాద్ కలం పదునైనది.సినిమా టైటిల్.. ఇంకా పెట్టలేదు. ఫిల్మ్‌నగర్ గాసిప్పురాయుళ్లు ‘రామరావణ రాజ్యం’ అని పెట్టేశారు.మరి.. యూనిట్ ఇదే కన్ఫార్మ్ చేసేస్తారా?వెయిట్ అండ్ సీ.అన్నట్లు... ఆర్ అండ్ ఆర్ (ఎన్టీ రామారావు, రామ్‌చరణ్) సరసన కే అండ్ కే (కీర్తీ సురేశ్, కియారా అద్వానీ) కథానాయికలుగా కుదిరారట. ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. ఇంకా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఏయే విషయాలు ప్రచారం అవుతున్నాయంటే... మ్యాటర్‌లోకి రండి. ప్రచారంలో ఉన్న కథలేంటి? ‘ఈగ’ సినిమా ప్రారంభోత్సవం రోజున రాజమౌళి ఆ సినిమా కథంతా చెప్పేశారు. ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రం కూడా ఫలానా అంటూ కొంచెం ఐడియా చెప్పారు. కానీ ఈ సినిమా గురించి మొత్తం టీమ్ అంతా సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది.. అంతా సిల్వర్ స్క్రీన్ మీదే అన్నట్టుగా. కానీ ఈలోపు ఖాళీగా ఉన్న ఊహారాయుళ్లంతా విజయేంద్రప్రసాద్ ఏం కథ రాసి ఉండొచ్చో అని ఊహించి కొన్ని కథలు అల్లేస్తున్నారు. ఒక కథాంశం ప్రకారం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ అన్నదమ్ములు. అందులో ఒకరు దొంగ, మరొకరు పోలీస్. ఈ దొంగా పోలీస్ గేమ్‌తో సినిమా సాగబోతోందని టాక్.ఇంకో కథాంశం ప్రకారం... 1920 ప్రాంతంలో జరిగే కథతో ఈ సినిమా సాగుతుందట. మరోవైపు ఎన్టీఆర్ అండ్ రామ్‌చరణ్‌లను బాక్సింగ్ చాంపియన్స్‌గా చూపించబోతున్నారన్నది ఊహల్లో ఉన్న మరో కథ. ఇలా రోజుకొకటి ‘ఇదే సినిమా కథ’ అని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ అసలు కథేంటో విజయేంద్రప్రసాద్‌కే ఎరుక.తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన కథలతోనే రాజమౌళి దాదాపు అన్ని సినిమాలూ తెరకెక్కించారు. కేవలం ‘మర్యాద రామన్న’ సినిమాకు మాత్రమే ఆయన కజిన్ కంచి కథ అందించారు. ఇప్పటి వరకూ విజయేంద్రప్రసాద్ మాస్ మసాలా, స్పోర్ట్స్ డ్రామా, పీరియాడికల్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ.. ఇలా అన్ని జానర్స్‌ని టచ్ చేస్తూ వస్తున్నారు. రాజమౌళి తీయబోయే నెక్ట్స్ సినిమాకి ఎటువంటి గ్రాఫిక్స్ అవసరం లేని కథను ఇస్తున్నట్లు విజయేంద్రప్రసాద్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఆయన ప్రస్తావించింది ‘ఆర్ఆర్ఆర్’ గురించేనా? అనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు చేస్తోన్న చిత్రకథాంశం ఎలా ఉండబోతోంది అని అటు ఇండస్ట్రీ ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. షూటింగ్ వివరాలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి గతేడాది నవంబర్ 18న హింట్ ఇచ్చారు రాజమౌళి. ఆ తర్వాత సినిమా అధికారిక అనౌన్స్మెంట్ రావడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. ఈ నెల 11న సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. షూటింగ్ ఈ నెల 19న స్టార్ట్ కానుంది. తొలుత ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య ఫైట్సీన్స్ను షూట్ చేస్తారు. ఆల్రెడీ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కొత్తలుక్‌లోకి వచ్చేశారు. కొన్ని నెలల క్రితం ఈ ఇద్దరూ లుక్ టెస్ట్ కోసం విదేశాలు వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించని కొత్త లుక్‌లో ఈ ఇద్దర్నీ చూడొచ్చని ఆశించవచ్చు.రాజమౌళి షూటింగ్‌ని తపస్సులా చేస్తాడంటారు. అందులో నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడరట. అందుకే తాజాగా ఈ చిత్రం జరిగే షూటింగ్ స్పాట్లోనే తన ఆఫీస్‌ని కూడా ఏర్పాటు చేయించుకున్నారు. ఆఫీస్ మాత్రమే కాదు.. అది ఇల్లు కూడా. ఈ షూటింగ్ జరిగే అన్ని రోజులు అక్కడే ఎక్కువ శాతం ఉండొచ్చని టాక్. షూటింగ్ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ చివర గండిపేట్ వద్ద కొన్ని ఎకరాల్లో ఈ సినిమాకు సంబంధించిన సెట్‌ని డిజైన్ చేశారని సమాచారం. మరి ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే చేస్తారా? అవుట్ డోర్ లొకేషన్స్‌కు వెళ్తారో? లేదో వేచి చూడాలి.రాజమౌళి సినిమాలో కథానాయిక అవకాశం అంటే ఏ హీరోయిన్ అయినా నో చెప్పాలనుకోదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులు అలాంటివి. తాజాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో హీరోయిన్గా చాలా మంది పేర్లు వినిపించాయి. ఆర్ ఆర్ ఆర్కు మరో ఆర్ కలిసేలా ప్రస్తుతం రైజింగ్‌లో ఉన్న రష్మికా మండన్నాను కథానాయికగా తీసుకుంటారని కొందరు గాసిప్‌రాయుళ్లు ఊహించారు. ‘మహానటి’ సినిమాలో సూపర్బ్‌గా నటించిన కీర్తీ సురేశ్‌ను తీసుకుంటారని కొందరు అన్నారు. అంతలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో వచ్చిన కథానాయిక చాన్స్‌కు సమంత నో అన్నారని వార్తలు వచ్చాయి. ‘రాజమౌళి సినిమాకు మీరు నో చెప్పారట’ అని ఆమెను అడిగితే.. రాజమౌళిగారి సినిమాకు నేనెందుకు నో చెబుతాను అని సమంత ఓ విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఈ ఊహలు ఇలా ఉండగానే ఈ సినిమాను ఈ నెల 11న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు ఈ చిత్రనిర్మాత డీవీవీ దానయ్య. సో.. మూవీ లాంచింగ్ రోజున ఆ లక్కీ హీరోయిన్స్ ఎవరో అందరికీ తెలిసిపోతుందని సంబరపడిన మూవీ లవర్స్‌కు నిరాశే ఎదురైంది. మూవీ ఓపెనింగ్ రోజు హీరోయిన్ల పేర్లను కాకుండా మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులతో సహా అందరి పేర్లను చెప్పారు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఇందులో హీరోయిన్లు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం కోసం సినీ ప్రియులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ, రామ్‌చరణ్‌కు జోడీగా కీర్తీ సురేశ్ నటించనున్నారని విశ్వసనీయవర్గాల తాజా సమాచారం. త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. రాకింగ్ మౌళి సినిమా సక్సెస్ అవ్వడానికి సరైన సూత్రం లేదంటారు. ప్రేక్షకుడికి సినిమా ఎందుకు నచ్చుతుందో, ఎలాంటి చిత్రం ఆడుతుందో అంచనా వేయడం కష్టం. కానీ రాజమౌళి దగ్గర ఉన్న ఆ సూత్రమేంటి? ప్రతి సినిమాతో ప్రేక్షకుల మీద ఏదో మ్యాజిక్ జల్లుతారు. ఇప్పటివరకూ ఆయన ‘బాహుబలి’ 2 భాగాలతో కలిపి పదకొండు సినిమాలు తీస్తే అన్నీ హిట్. ఆ హిట్ సీక్రెట్ ఏంటి? రాజమౌళిని అడిగితే ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అంటారేమో. ఎన్టీఆర్ ఆయన్ను ‘జక్కన్న’ అని పిలుస్తారు. సినిమాని శిల్పం చెక్కినట్లు చెక్కుతారు. ఇప్పుడు జక్కన్న శిల్పం చెక్కే పనిలో ఫుల్ బిజీ. ఆ శిల్పాన్ని 2020లో సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించబోతున్నారు. సాంకేతిక నిపుణలు స్క్రీన్ ప్లే–దర్శకత్వం: రాజమౌళి నిర్మాత: డీవీవీ దానయ్య కథ: విజయేంద్ర ప్రసాద్ కెమెరా: సెంథిల్ కుమార్ సంగీతం: కీరవాణి ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ స్టైలింగ్: రమా రాజమౌళి ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, మదన్ కార్కీ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్: వి. శ్రీనివాస మోహన్ -
కేకో కేక...
రామ్‌చరణ్ అండ్ టీమ్ లొకేషన్లో కేక్ కట్ చేశారు. ఏంటీ? అప్పుడే షూటింగ్ పూర్తయ్యిందా? అని ఆశ్చర్యపోకండి. అందుకు టైమ్ ఉంది. నటి స్నేహ బర్త్‌డే సెలబ్రేషన్ కోసం సెట్లో కేక్ కట్ చేశారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్నేహ, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ‘విజయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందనీ, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. శుక్రవారంతో 37వ వసంతంలోకి అడుగుపెట్టారు స్నేహ. ఈ సందర్భంగా సెట్లోనే ఆమె బర్త్‌డే వేడుకలు జరిగాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షెడ్యూల్ కంప్లీటైన తర్వాత వైజాగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. -
సౌత్ నుంచి నార్త్‌కు పాకిన రీమిక్స్ నషా ఇది..!
పల్లవీ చరణాలే కలెక్షన్ల రణరంగంలో కీలకం.పాట పాతదైనా పర్వాలేదు కొత్తగా కొడదాం అనుకుంటున్నారు.రీమిక్స్ చేసి రిపీటెడ్‌గా ఆడియన్స్‌ను రప్పించొచ్చు అని భావిస్తున్నారు.నాటి ఘంటసాల ఇప్పటి హేమచంద్ర అవుతున్నాడు.నాటి హెలెన్ నేటి సోనాక్షి అవుతున్నది.హాల్లో కూర్చున్న ప్రేక్షకుడు కొత్తగా థ్రిల్లయితే క్లాప్స్ కొడుతున్నాడు.అతణ్ణి మెప్పించడానికి పాడిందే పాడుతున్నారు. సౌత్ నుంచి నార్త్‌కు పాకిన రీమిక్స్ నషా ఇది. పాటలో పైసా ఉంది. మంచి పాట తెర మీద కాకతో పాటు కలెక్షన్లను కూడా పుట్టిస్తుంది. అందుకే సినిమా వాళ్లు పాట దగ్గర మాట రాకుండా చూసుకుంటారు. ఒక మాట ఎక్కువేసైనా సరే మంచి పాట రాబట్టుకోవాలని చూస్తారు. అంతేకాదు... హిట్టయిన పాటల్లో రసం ఎక్కువగా ఉంటుందని భావించి మళ్లీ ఒకసారి వాటిని రీమిక్స్ పేరుతో పిండడానికి రెడీ అయిపోతారు. తెలుగులో సూపర్ హిట్ పాటలు ఉన్నాయి. అయితే ఆ సూపర్‌హిట్ పాటల్లో నటించిన హీరోల వారసులే ఆ పాటలకు కూడా వారసులుగా ఉంటే అభిమానులు ఆనందపడతారనే భావన సినిమా వాళ్లకు కలిగింది. కలిగిన వెంటనే ఆచరణ కూడా మొదలయ్యింది. నీ తొలిచూపులోనే... ఎన్టీఆర్ నటించిన ‘జస్టిస్ చౌదరి’ సినిమాలోని ‘నీ తొలిచూపులోనే’ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. శారదతో పాటు పూల గుచ్ఛం పట్టుకుని ఎన్టీఆర్ నటించిన ఆ పాట అభిమానులను బాగా ఆకట్టుకుంది. బాలకృష్ణ హీరోగా రంగప్రవేశం చేసిన రోజులలో ఆయనకు ఎన్టీఆర్ పాట ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో ‘నిప్పులాంటి మనిషి’ సినిమాలో ‘నీ తొలిచూపులోనే’ పాటను పెట్టారు. అయితే అప్పటికి రీమిక్స్ చేయడం మొదలుకాలేదు కనుక ఒరిజినల్ ట్రాక్నే రిపీట్ చేశారు. బాలకృష్ణ, రాధ కలిసి ఆ పాటలో నటించారు. అయితే ఒరిజినల్ పాట కంటే బాగా ఆ పాటను తీయకపోవడంతో పెద్దగా ప్రశంసలు రాలేదు. ఆ తర్వాత కొంతకాలం ఈ రిపీట్/రీమిక్స్‌ల జోలికి ఎవరూ వెళ్లలేదు. ఇళయరాజా ‘ప్రేమ యాత్రలకు బృందావనము’... వంశీ తీసిన ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’లో పాత పాటలకు కథానుసారం రీమిక్స్ పాటలు అవసరమయ్యాయి. ఇళయరాజా వంటి సంగీత దర్శకుడు పాత పాటలకు కొత్త రూపం ఎలా ఇస్తారా అని అందరూ కుతూహలంగా చూశారు. అయితే ఎంతో ప్రతిభాశాలి కనుక పాతపాటలను ఆయన గౌరవం చెడకుండా రీమిక్స్ చేశారు. ‘నిన్నలా చూస్తుంటే’, ‘సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా’, ‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే’ పాటలు హిట్ అయ్యాయి. వాటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ డూపులు నటించినా ప్రేక్షకులు ఆనందించారు. ఇది ఓ మంచి ప్రయోగంగా మిగిలింది. చినుకు చినుక అందెలలో... ‘మాయలోడు’ సినిమాలోని ‘చినుకు చినుకు అందెలలో’ పాట సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. కమెడియన్ బాబూమోహన్ ఆ సమయంలో పీక్‌లో ఉన్నారు. ఆయనకు సరసన సాక్షాత్తు సౌందర్య ఈ పాటలో నటించడంతో క్రేజ్ వచ్చింది. ‘మాయలోడు’ హిట్ కావడంలో ఈ పాట ముఖ్యపాత్ర పోషించింది. అందుకే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ పాటను రీమిక్స్ చేయకుండా ‘శుభలగ్నం’లో రిపీట్ చేశారు. అలీతో కలిసి సౌందర్య అదే పాటకు డాన్స్ చేయడం.. తిరిగి అంతే ప్రజాదరణ పొందడం చెప్పుకోదగ్గ అంశం. ఈ రేయి తీయనిది.... దర్శకుడుగా మారిన పవన్ కల్యాణ్ తన తొలి సినిమా ‘జాని’లో ‘ఈ రేయి తీయనిది’ పాటను రీమిక్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ‘చిట్టిచెల్లెలు’లో సాలూరి రాజేశ్వరరావు చేసిన ఈ పాట మనోహరంగా ఉంటుంది. దానిని చెడగొట్టకుండా అంతే అందంగా దర్శకుడు రమణ గోగుల రీమిక్స్ చేశారు. చిత్రీకరణ కూడా అందంగా చేయడం వల్ల పాట రాణించింది. కాని సినిమా పరాజయం వల్ల పొందవలసినంత గుర్తింపు పొందలేదు. కాని అదే పవన్ కల్యాణ్ ‘ఖుషి’ సినిమాలో చేసిన ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ పాట హిట్టయ్యి పేరు తెచ్చింది. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ... ఆ తర్వాతి రోజులలో మంచి పాటలు కరువైనప్పుడల్లా లేదా సినిమాకు ఏదైనా క్రేజ్ తేవాలనుకున్నప్పుడల్లా పాత పాటల రీమిక్స్ ఆనవాయితీగా మారింది. ఎన్టీఆర్ పాటలు ‘ఆకుచాటు పిందె తడిసె’, ‘ఓలమ్మి తిక్క రేగిందా’ పాటలను జూ.ఎన్టీఆర్ తన సినిమాలు ‘అందాల రాముడు’, ‘యమదొంగ’ కోసం రీమిక్స్ చేశారు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట ప్రభాస్ ‘అడవి రాముడు’లో రీమిక్స్ అయ్యింది. ‘రావోయి చందమామ’ పాట మంచు విష్ణు తొలి సినిమా ‘విష్ణు’లో రీమిక్స్ అయ్యింది. అక్కినేని ‘పల్లెకు పోదాం పారును చూదాం’ పాటను ఆయన మనమడు సుశాంత్ ‘ఆటాడుకుందాం రా’లో రీమిక్స్ చేశాడు. నాగార్జున ‘నేనున్నాను’ కోసం ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లో’ రీమిక్స్ చేశారు. నాగార్జునాయే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా కోసం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పాటను రీమిక్స్ చేశారు. ‘మనం’ కోసం ‘నేను పుట్టాను’ పాటను రీమిక్స్ చేస్తే ఆ పాట మంచి ఆదరణ పొందింది. తాత పాటలో నటించిన నాగ చైతన్య ఇప్పుడు తండ్రి పాట ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు’ పాటను రీమిక్స్ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ పాట ‘సవ్యసాచి’ సినిమాలో రానుంది. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమా కోసం ఏఎన్ఆర్ హిట్ ‘ఒక లైలా కోసం తిరిగాను దేశం’ పాటను రీమిక్స్ చేయడం తెలిసిందే. ఇక కృష్ణ పాట ‘గలగలపారుతున్న గోదారిలా’ను పోకిరి కోసం మహేశ్‌బాబు రీమిక్స్ చేశారు. కృష్ణ ‘ఆకాశంలో ఒక తార’ను అల్లరి నరేశ్ ‘సీమటపాకాయ’ కోసం రీమిక్స్ చేశారు. చిరంజీవి పాటల పెన్నిధి చిరంజీవి పాటలు మెగా కాంపౌండ్ హీరోలకు పెన్నిధిగా మారాయి. ఆయన పాటలకు తొలి వారసుడిగా రామ్‌చరణ్ ‘మగధీర’ కోసం ‘బంగారు కోడిపెట్ట’ పాటను, ‘నాయక్’ కోసం ‘శుభలేఖ రాసుకున్న’ పాటను, ‘రచ్చ’ కోసం ‘వాన వాన వెల్లువాయె’ పాటను రీమిక్స్ చేశారు. చిరంజీవి పాటలను వరుసపెట్టి రీమేక్ చేసిన మరో హీరో సాయిధరమ్ తేజ్. ఇతను చిరంజీవి పాటలు ‘గువ్వా గోరింకతో’, ‘అందం హిందోళం’, ‘చమకు చమకు చామ్’ పాటలను తన ‘సుప్రీం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘ఇంటెలిజెంట్’ సినిమాల కోసం రీమిక్స్ చేశారు. ‘అల్లరి’ నరేశ్ ‘సీమశాస్త్రి’ కోసం చిరంజీవి ‘మంచమేసి దుప్పటేసి’ పాటను రీమిక్స్ చేశారు.ఇంకా ఈ వరుసలో చాలాపాటలు రీమిక్స్ అయ్యేలా ఉన్నాయి. ఎన్.టి.ఆర్ బయోపిక్ కోసం కొన్ని పాటలు రీమిక్స్ చేయక తప్పదు. అలాగే చిన్న హీరోలు కూడా తమ సినిమాల బలం కోసం రీమిక్స్లవైపు చూస్తున్నారు. హిందీలో ఇదే వరుస కాగా రీమిక్స్‌లకు దూరంగా ఉండే హిందీ పరిశ్రమ ఈ మధ్య రీమిక్స్‌ల వైపు దృష్టి పెట్టింది. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన పాటలను ఈ తరం హీరో హీరోయిన్ల పై పిక్చరైజ్ చేసి సినిమాకు కొత్త హంగు తీసుకురావడానికి, ఆ తరం ప్రేక్షకులతో కనెక్ట్ చేయడానికి ఈ రీమిక్స్‌లను దర్శక నిర్మాతలు ఉపయోగించుకుంటున్నారు. ‘తేజాబ్’లో ‘ఏక్ దో తీన్’ పాట ఎంత హిట్టయ్యిందో అందరికీ తెలుసు. ఈ పాట దేశంలోని అన్ని మూలలకు పాకిపోయి మాధురి దీక్షిత్‌ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. ఈ పాటను టైజర్ ష్రాఫ్ నటించిన ‘భాగీ 2’ కోసం రీమిక్స్ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ పాటకు స్టెప్పులేసింది. అయితే మాధురి మాధురే అని ప్రేక్షకులు కొంచెం నిరాశ చెందారు. దిల్ బర్ దిల్ బర్... ‘సిర్ఫ్ తుమ్’ సినిమాలో సుష్మితా సేన్, సంజయ్ కపూర్ పాడుకున్న ‘దిల్బర్ దిల్బర్...’ తొంభైల్లో చాలా క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ సాంగ్‌ను జాన్ అబ్రహామ్ నటించిన ‘సత్యమేవ జయతే’ కోసం రీమిక్స్ చేశారు. నోరా ఫతేహి బెల్లీ డ్యాన్స్ జోడించి స్క్రీన్‌ని హాట్‌గా మార్చారు. ఒరిజినల్ పాటకు కొన్ని కొత్త వాక్యాలు జోడించి నేహా కక్కర్, ధ్వనీ బనుసలీ ఈ కొత్త వెర్షన్‌ను పాడారు. ఒరిజినల్ సాంగ్ లాగే ఈ సాంగ్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ కొత్త పాట యుట్యూబ్ టాప్ లేపేసింది అని చెప్పొచ్చు. హెలెన్‌ని తలచెన్ ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయే’ సినిమా కథ అంతా చైనాలో జరగడంతో అందులో 1950నాటి ‘హౌరాబ్రిడ్జ్’ పాట ‘మేరా నామ్ చిన్ చిన్ చు’ను రీమిక్స్ చేశారు. ఈ పాట చైనీస్ స్టైల్లో ఉండటమే దీనికి కారణం. అప్పట్లో హెలెన్ వేసిన స్టెప్పులను ఇందులో సోనాక్షీ సిన్హాతో వేయించారు. ఈ పాటకు కాలు కదపడమే కాకుండా జెస్సీ గిల్‌తో కలసి గొంతు కూడా పలిపారు సోనాక్షీ. పాత పాటంత ప్రశంసలు రాకపోయినా ఫర్వాలేదనిపించుకుంది. 1978లో ‘ఇన్కార్’ సినిమాలో హెలెన్ చేసిన ‘ఓ ముంగడా..’ పాట కూడా చాలా హిట్. దానిని ‘ధమాల్’ సిరీస్‌లో వస్తున్న మూడో భాగం ‘టోటల్ ధమాల్’లో రీమిక్స్ చేశారు. ఈ సాంగ్‌ను అజయ్ దేవగణ్, సోనాక్షి మీద చిత్రీకరించారు. రుక్ రుక్ రుక్ ‘రుక్ రుక్ రుక్.. అరె బాబా రుక్..’ పాట ‘విజయ్‌పథ్’ సినిమాలో పెద్ద హిట్. దేవగన్ వెంటపడతూ టబు పాడే ఈ పాటను తాజాగా కాజోల్ యాక్ట్ చేసిన ‘హెలీకాఫ్టర్ ఈల’ అనే సినిమా కోసం రీమిక్స్ చేశారు. భర్త అజయ్ దేవగన్ పాట రీమిక్స్‌లో కాజోల్ చేయడం ఒక విశేషం. ఈ పాత ట్యూన్‌కి తనదైన స్టైల్లో స్టెప్స్ వేశారట కాజోల్. ‘1942: ఎ లవ్ స్టోరీ’లోని ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా..’ సాంగ్ కూడా రీమిక్స్ కానుంది.సౌత్ అయినా నార్త్ అయినా పాట కోసం తిప్పలు పడితేనే సినిమా హిట్ అవుతుందనే ట్రెండ్ ఉంది. కాకపోతే ఒకసారి తెర మీద చూసిన పాట ఒక ముద్ర వేస్తుంది. రీమిక్స్ దానికి మించిందిగా ఉంటే పాస్ అవుతుంది. లేకపోతే పాత పాటతో పోల్చి పెదవి విరుస్తారు ప్రేక్షకులు. కాని పాత పాటను కొత్తగా కనెక్ట్ చేశారో కాసులు రాలుతాయి. ప్రస్తుతం పాత పాటలను విసిరి కొత్త కాసులను ఏరుకునే ప్రయత్నంలో ఉన్నారు సినీబేహారులు... వెండితెర మాయావీలు. వాళ్లకు జయం సిద్ధించాలని కోరుకుందాం. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
కేరళకు మెగా ఫ్యామిలీ మెగా విరాళం!
సాక్షి, హైదరాబాద్ : భారీ వరదలతో అల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ ముందుకొచ్చింది. కేరళ వరద బాధితుల సహాయార్థం చిరంజీవి తల్లి అంజనాదేవి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని కేరళకు ప్రకటించగా.. ఆయన తనయుడు రాంచరణ్ రూ. 25 లక్షలు విరాళాన్ని ప్రకటించగా.. రాంచరణ్ సతీమణి ఉపాసన రూ. పదిలక్షల విరాళాన్ని అందజేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు రూ. 10 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు టాలీవుడ్‌కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రకటించింది. ‘మన భూతల స్వర్గం 80 శాతం మునిగిపోయింది. దీన్ని టీవీలో చూస్తుంటే బాధగా ఉంది. ‘మా’ రూ.10 లక్షలు విరాళం ఇస్తుంది. అలాగే ఆర్టిస్టులు కూడా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా’ అని మా ప్రెసిడెంట్ శివాజీ రాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అప్పుడు బాబాయ్...మరి ఇప్పుడు ?
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో శ్రీకాంత్ రామ్‌చరణ్‌కు బాబాయ్‌గా నటించాడు. మళ్లీ ఇప్పుడు బోయపాటి శ్రీను, రామ్‌చరణ్ సినిమాలో కూడా శ్రీకాంత్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని ముఖ్య పాత్రకు ఎవరైతే బాగుంటుందని డైరెక్టర్ ఆలోచిస్తుండగా... చెర్రీనే శ్రీకాంత్ పేరును సూచించాడట. మరి ఆ కీలక పాత్రలో శ్రీకాంత్, చరణ్‌కు ఏం అవుతాడో...గతంలో బాబాయ్‌గా నటించాడు. ఇప్పుడు ఏ పాత్రలో నటిస్తున్నాడో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌కు సంబంధించి రెండు షెడ్యుల్స్ను కంప్లీట్ చేశాడు బోయపాటి. చరణ్ కూడా రెండో షెడ్యుల్ షూటింగ్లో పాల్గొన్నాడు. ప్రతినాయకుడు వివిక్ ఒబేరాయ్, చరణ్‌లపై వచ్చే యాక్షన్సీన్స్ను చిత్రీకరించారు. ఫ్యామిలీ, యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా కైరా అద్వానీ నటిస్తోంది. -
భరత్‌కు రాంచరణ్ సూపర్ రివ్యూ
మహేశ్‌బాబు తాజా సినిమా ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రాజకీయ నేపథ్యంతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ మౌత్‌టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాను ఇటు ప్రేక్షకులే కాదు.. అటు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను ప్రశంసించారు. సామాజిక సందేశాన్ని కమర్షియల్ అంశాలతో జోడించి కొరటాల శివ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడని, మహేశ్‌బాబు అద్భుతంగా నటించాడని ఎన్టీఆర్ కొనియాడారు. తాజాగా మెగా హీరో రాంచరణ్ కూడా ‘భరత్ అనే నేను’ సినిమాకు చక్కటి రివ్యూ ఇచ్చారు. ‘క్లాసిక్ సినిమా అని చెప్పడానికి ఒక పరిపూర్ణ ఉదాహరణ ఈ సినిమా. ఇందులో మహేశ్‌బాబు సటిల్‌గా కనిపిస్తూనే.. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబర్చారు. అందంగా రాసి.. అద్భుతంగా తెరకెక్కించారు శివగారు. దేవీ నువ్వు సూపర్.. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరును బాగా ఎంజాయ్ చేశాను. అద్భుతమైన అరంగేట్రం చేసిన కియారాకు, మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు’ అంటూ రాంచరణ్ తన అభిప్రాయాన్ని ఫేస్బుక్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తాజాగా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్!
తెలుగు సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతోంది. తెలుగు టాప్ హీరోల సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లోనూ పెద్ద మొత్తాలను రాబడుతున్నాయి. టాలీవుడ్లో స్టార్ వారసులదే హవా అని చెప్పాలి. ప్రస్తుతం అగ్రనటులుగా కొనసాగుతున్నవారిలో ఎక్కువమంది వారసులే. ఇక, తమిళ సినిమాతో పోల్చుకుంటే టాలీవుడ్లో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. తమిళ సినిమాలు గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నా.. నిర్మాతలకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇందుకు కారణం తమిళ హీరోల రెమ్యూనరేషనేనని సినీ విమర్శకులు అంటున్నారు. హీరోలు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుండటంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పడం లేదని అంటున్నారు. ఈ విషయమై స్టూడియో గ్రీన్ ఫేమ్ అధినేత, నిర్మాత జ్ఞానవేల్ రాజ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలుగు పెద్ద హీరోలు వందకోట్ల బిజినెస్ చేస్తున్నప్పటికీ వేతనంగా రూ. 15 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. సహేతుకమైన రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నారు. అదే కోలీవుడ్‌లో అయితే, టాలీవుడ్ హీరోల స్టేటస్ ఉన్న నటులు రూ. 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మన హీరోలకు స్వప్రయోజనాలపైనే ధ్యాస ఎక్కువ. టాలీవుడ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’ అని జ్ఞానవేల్ రాజా అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తాను తమిళంలో సినిమాలు తీయబోనని, తెలుగులోనే సినిమాలు నిర్మిస్తానని ఆయన హెచ్చరించారు. ఇటీవల జరిగిన కోలీవుడ్ సమ్మె.. మొదట డిజిటల్ సర్వీస్ ప్రోవైడర్లకు వ్యతిరేకంగా ప్రారంభమవ్వగా.. ఆ తర్వాత ఇండస్ట్రీలోని అనేక అంతర్గత విషయాలు తెరమీదకు వచ్చాయి. ఇందులో హీరోలు భారీగా రెమ్యూనరేషన్లు పెంచడంపైనా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్నది చర్చనీయాంశమైంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తెలుగు హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలివి.. మహేశ్‌బాబు బాలనటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయి.. తండ్రి బాటలోనే హీరో అయ్యాడు మహేశ్‌బాబు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తన రెండు సినిమాలు (బ్రహ్మోత్సవం, స్పైడర్) పరాజయం పాలవ్వడం నిరాశ కలిగించిందని ఆయన ఓపెన్‌గానే చెప్పారు. ఆయన తాజా సినిమా ‘భరత్ అనే నేను’ మొదటిరోజు నుంచి సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో మహేశ్‌బాబు ఒకరు. ఆయన సినిమాకు రూ. 18 కోట్ల వరకు తీసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గడిచిన కొన్నాళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వరుసగా సూపర్‌హిట్ అవుతున్నాయి. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాలు ఆయనకు విజయాలు అందించాయి. ఇవి కమర్షియల్ సినిమాలు అయినప్పటికీ సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారాయన. గడిచిన కొన్నాళ్లుగా రూ. 18 నుంచి 20 కోట్ల వరకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ఎస్ రాజమౌళితో సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచే అవకాశముందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వచ్చి దాదాపు 22 ఏళ్లు అవుతోంది. 23 సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 2017లో ఆయన సినిమా ఒక్కటే విడుదలైంది. ఈ సినిమాకు రూ. 18 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి బాక్సాఫీస్‌ను ముంచేసింది. ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్.. టాలీవుడ్లో డార్లింగ్ అని ముద్దుగా పిల్చుకునే ప్రభాస్ ఇమేజ్ బాహుబలి సిరీస్‌తో అమాంతం ఆకాశానికి ఎగబాకింది. బాహుబలి-2కు ప్రభాస్ రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమాతోపాటు ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. మహేశ్, పవన్‌ను మించి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఉంటుందని భావిస్తున్నారు. అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాతో సూపర్హిట్తోపాటు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. ఈ సినిమా హిందీ డబ్బింగ్ యూట్యూబ్‌లో మోస్ట్ వాచెడ్ మూవీగా నిలిచింది. తాజాగా వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ కూడా భారీ వసూళ్లతో సూపర్‌హిట్ అయింది. వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్న బన్నీ.. ఒక్కో సినిమాకు రూ. 14 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బన్నీ తాజా మూవీ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ వచ్చే నెల 4న విడుదల కానుంది. రాంచరణ్ చెర్రీ ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం అవుతోంది. ఇప్పటివరకు పది సినిమాలు చేశాడు. ఇందులో తొమ్మిది సినిమాలు హిట్టు. ఇటీవల తండ్రి చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ని చెర్రీ స్వయంగా నిర్మించాడు. సినిమాకు రూ. 10 నుంచి 14 కోట్ల వరకు చెర్రీ వసూలు చేస్తున్నాడు. తాజా సినిమా ‘రంగస్థలం’ సూపర్‌హిట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తుండటంతో రెమ్యూనరేషన్ మరింత పెంచే అవకాశముంది. రవితేజ టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజకు మంచి కమర్షియల్ ఇమేజ్ ఉంది. కొన్ని పరాజయాల అనంతరం ‘రాజా, దీ గ్రేట్’ సినిమాతో రవితేజ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘టచ్ చేసి చూడు’ నిరాశ పరిచింది. ఒక్కో సినిమాకు రవితేజ రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. -
శ్రీరెడ్డి: ఫేస్బుక్లో స్పందించిన రాంచరణ్!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి అనూహ్యంగా జనసేనే అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి.. అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. శ్రీరెడ్డి విషయమై పవన్ స్పందిస్తూ.. ఆమె టీవీ చానెళ్లకు వెళ్లడం కంటే, పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నించి ఉంటే బాగుండేదని అన్నారు. దీనిపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందిస్తూ.. పవన్‌ను అన్నా అని పిలిచినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. అంతేకాకుండా పవన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య చేశారు. పవన్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ పరోక్షంగా స్పందించారు. తాజాగా మరో మెగా హీరో రాంచరణ్ కూడా పరోక్షంగా మౌనాన్ని వీడారు. ఈ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతం గా పరిష్కరించుకోవాలి’ అని ఫేస్బుక్లో సూచించారు. కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనమంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియోను ఈ పోస్టుతోపాటు పెట్టారు. ‘నన్ను తిడుతుంటే మీకు ఇబ్బంది కలుగవచ్చు. కానీ వాటిని నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు. నేను భరిస్తాను. మనం భరిద్దాం. ఎదురుదాడి చేయకుండా భరిద్దాం’ అంటూ వీడియోలో పవన్ పేర్కొన్నారు. -
రంగస్థలం విజయం.. ఉపాసన కాలినడక
సాక్షి, హైదరాబాద్ : రంగస్థలం సినిమా విజయం సాధించడంతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ భార్య ఉపాసన తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకను ప్రారంభిస్తున్న ఫొటోలను ఆమె ట్విటర్లో పంచుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన రంగస్థలం సినిమా భారీ వసూళ్లను రాబడుతోన్న విషయం తెలిసిందే. చిత్రంలో చెవిటి వ్యక్తి పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. #RamCharan #Rangasthalam 🙏🏼 pic.twitter.com/TRK1hmtchp — Upasana Kamineni (@upasanakonidela) 12 April 2018 -
గ్రామస్థులకు రంగమ్మత్త విందు భోజనం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. గత వారం విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. రాంచరణ్, సమంతతో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. మరోవైపు ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులను అలరించిన యాంకర్ అనసూయ భరద్వాజ్ మంచి మార్కులు కొట్టేసింది. దీంతో అనసూయ ఆనందం పట్టలేకపోతోంది. సినిమాకు ఊపిరిలాంటి అంత గొప్ప క్యారెక్టర్ని తనకిచ్చినందుకు సుకుమార్‌కి ఆమె కృతజ్ఞలు తెలిపారు కూడా. చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అనసూయ తాజాగా.. రంగస్థలం టీంకు విందు భోజనం ఇచ్చింది. రంగస్థలం అసిస్టెంట్ డిజైనర్ గౌరీ నాయుడు ‘రంగమ్మత్త విందు భోజనం’ అంటూ అందరూ కలిసి ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘రంగమ్మత్త విందు భోజనం.. మా రంగస్థలం గ్రామస్థులు మరియు మా ప్రెసిడెంట్ గారి సన్నిహితులు’ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఈ ట్వీట్‌కు అనసూయ ‘సచ్ లవ్లీ టైమ్’ అని సమాధానమిస్తూ రీట్వీట్ చేసింది. రంగస్థలం జ్ఞాపకాలను గుర్తుచేస్తున్న ఈ ఫొటో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంతో రంగస్థలం తెరకెక్కిన విషయం తెలిసిందే. Rangammatta Vindhu Bhojanam ❤️ @anusuyakhasba 😘 Ma Rangasthalam gramasthulu mariyu ma president gari sannihithulu 😛 #Rangasthalam #RangasthalamMemories 😎 pic.twitter.com/DfMKngaLjB — Gauri Naidu (@Gauri_Naidu) April 5, 2018 Hahaha❤️❤️ Such lovely time!!! https://t.co/duOPz2WwmD — Anasuya Bharadwaj (@anusuyakhasba) April 6, 2018 -
చరణ్ నువ్వు తప్ప ఎవరూ చేయలేరు : తారక్
సాక్షి, హైదారాబాద్ : రంగస్థలం బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో సినిమాపై ప్రసంశల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చేరారు. తాను ఇప్పుడే రంగస్థలం చూశానని చెప్పిన తారక్, రామ్ చరణ్‌పై పొగడ్తలు గుప్పించారు. సినిమాలో చరణ్ చేసిన నటనకు అభినందనలు, ప్రశంసలు అందుకునే అర్హత ఉందని వ్యాఖ్యానించారు. తన తరపునుంచి కూడా అభినందనలు తెలిపారు. చిట్టిబాబు పాత్రను చరణ్ కంటే ఎవరూ బాగా చేయలేరంటూ ఆకాశానికెత్తేశారు. దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని, దర్శకత్వం అద్భుతంగా ఉందన్నారు. ఆకాలం నాటి పరిస్థితులను కళ్లలకు కట్టినట్లు చూపించారని అన్నారు. హీరోయిన్ సమంతకు అభినందనలు తెలిపారు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్.. ఇలా రంగస్థలం బృందంలోని ప్రతిఒక్కరు ఉండటానికి అద్భుతంగా చేశారని పొగడ్తల వర్షం కురిపించారు. -
దుమ్మురేపుతున్న ‘రంగస్థలం’ వసూళ్లు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని టాక్ రావడం, రాంచరణ్, సమంతతోపాటు ప్రధాన తారాగణం యాక్టింగ్ బాగుండటం ఈ సినిమాకు కలిసివచ్చినట్టు కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘రంగస్థలం’ అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ దుమ్మురేపుతోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘రంగస్థలం’ అప్పుడే మన మిలియన్ మార్క్‌ను అధిగమించింది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు వసూళ్లు బాగుండటంతో ఈ సినిమా ఈ మార్క్‌ను అధిగమించింది. సినిమా టాక్ బాగుండటంతో వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా దూసుకుపోవచ్చునని భావిస్తున్నారు. -
చిట్టిబాబు
-
‘జిగేల్ రాణి’ సాంగ్‌కి స్టెప్పులేసిన హీరోయిన్ బామ్మ
-
హీరోయిన్ బామ్మ ‘జిగేల్ రాణి’ స్టెప్పులు!
‘జిల్.. జిల్.. జిగేల్ రాణి’ పాట ఇప్పుడు ఇంటర్నెట్లో దుమ్మురేపుతోంది. రాంచరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాలోని ఈ ప్రత్యేక పాట వీడియో ప్రోమోను.. రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటలో పూజా హెగ్డే చూపించిన సోయగాలు, వేసిన స్టెప్పులు.. డ్యాన్స్‌తో అదరగొట్టిన రాంచరణ్.. అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ప్రస్తుతం (బుధవారం సాయంత్రానికి) య్యూటూబ్‌లో నంబర్ వన్‌గా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 30 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆన్లైన్లో దుమ్మురేపుతున్న ఈ పాటకు స్వయంగా పూజాహెగ్డే బామ్మ కూడా స్టెప్పులు వేశారు. 86 ఏళ్ల బామ్మ హుషారుగా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘మా బామ్మ గతకొన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉంది. నా ‘జిగేల్ రాణి’ పాట ప్రోమోను చూసి ఆమె సంతోషంలో మునిగిపోయారు. వెంటనే లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఈ పాట ఆమెకు ఎనర్జి ఇచ్చినట్టు ఉంది. అందుకే నేను చేసి పనిని ఇష్టపడి చేస్తాను’ అని పూజ ట్వీట్ చేశారు. జిగేల్ రాణి పాటకు పూజ బామ్మ స్టెప్పులు వేయడం నెటిజన్లను అలరిస్తోంది. -
కొణిదెల ఫ్యామిలీ లంచ్: హాజరైన పవన్!
మెగాపవర్‌స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం అత్యంత అట్టహాసంగా జరిగాయి. చరణ్ బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యామిలీ కలిసి లంచ్ చేసింది. చిరంజీవి సతీమణి సురేఖ ఇచ్చిన ఈ విందుకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ హాజరుకావడం గమనార్హం. చరణ్ పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మ అమేజింగ్ లంచ్ ఏర్పాటుచేసిందని, ఈ వేడుకల్లో కొణిదెల కుటుంబమంతా కలిసిపోయిందని సురేఖతో చిరంజీవి, చరణ్, పవన్ కలిసి దిగిన ఫొటోను ఉపాసన ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే మిస్టర్ సీ అంటూ పూలతో రాసి.. భర్త చరణ్‌కు ఆమె వినూత్నంగా విషెస్ తెలిపారు. కొణిదెల ఫ్యామిలీ బాండింగ్ ఫొటోతో ఈ ఫొటోను కూడా ట్వీట్ చేసింది. ‘రంగస్థలం’ సినిమాతో ఈ నెల 30వతేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న రాంచరణ్ పుట్టినరోజు సందర్భంటా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా హీరోలు సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్‌తోపాటు పలువురు నటీనటులు రాంచరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇవ్వాలని ఆకాంక్షించారు. Konidala #familybonding over Athamas amazing lunch. happy birthday MR C 😘❤️ @PawanKalyan #RamCharan #MegaStarChiranjeevi pic.twitter.com/RkLspF9MGj — Upasana Kamineni (@upasanakonidela) March 27, 2018 #happybirthdayMrC ❤️ pic.twitter.com/vHAYf0IZRj — Upasana Kamineni (@upasanakonidela) March 26, 2018 Happy birthday Charan anna!!! Lucky to have a brother like you.. Your the best! Love you anna!😘😘😘#HBDDearestRamCharan pic.twitter.com/YvJDMhOVWT — Varun Tej (@IAmVarunTej) March 27, 2018 Happy birthday to my favourite cousin, my well wisher, one of the most kind hearted and intelligent person I know. Have a great year RC bro. #HBDDearestRamCharan pic.twitter.com/v37D6VOVaB — Allu Sirish (@AlluSirish) March 27, 2018 Happy Birthday To the MegaPowerstar #HBDDearestRamCharan pic.twitter.com/Jbv98teXhe — Sampoornesh Babu (@sampoornesh) March 27, 2018 Happy birthday charan anna ❤️❤️#HBDDearestRamCharan pic.twitter.com/TPw3G4fWj7 — Niharika Konidela (@IamNiharikaK) March 27, 2018 RANGASTHALAM Working Still! #HBDDearestRamCharan pic.twitter.com/iK9w2F019L — Team RamCharan (@AlwayzRamCharan) March 27, 2018 -
సుకుమార్‌కు రంగమ్మత్త గురోపదేశం!
పాపులర్ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇది రోటిన్‌కు భిన్నమైన పాత్ర అనే చెప్పాలి. ‘జబర్దస్త్’యాంకర్‌గా ఒకవైపు టీవీపై రాణిస్తున్న అనసూయ.. అడపదడపా సినిమాల్లోనూ మెపిస్తున్నారు. ‘క్షణం’ సినిమాలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇటీవల మోహన్‌బాబు ‘గాయత్రి’ సినిమాలోనూ కనిపించింది. ఇప్పుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా పలుకరించబోతుంది. మెగా హీరో రాంచరణ్, సమంత జోడీగా తెరకెక్కిన ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయది కీలకపాత్రేనని అంటున్నారు. ఈ సినిమాలో రంగమ్మత్త ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ నెల 30 వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా.. ‘రంగస్థలం’ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటోను అనసూయ ట్విట్టర్లో షేర్ చేసింది. అనసూయ ఒక పుస్తకాన్ని చదువుతూ.. దర్శకుడు సుకుమార్‌తో మాట్లాడుతున్న ఈ ఫొటోకు ‘గురువుగారికి రంగమ్మత్త గురోపదేశం’ అంటు కామెంట్ చేసింది. అనసూయ సుకుమార్‌కు చేసిన గురోపదేశం ఏమిటో కానీ, ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Guruvu gariki Rangammatta guropadesam.. 🤪🤩😍#Throwback #WhileShootInProgress#RangasthalamOn30thMarch #Rangammatta pic.twitter.com/YX489t2GO6 — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 24, 2018 -
ఆర్.. ఆర్.. ఆర్... ఈజ్ ఆన్
కొంతకాలంగా ఆర్ ఆర్ ఆర్లు ముగ్గురూ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. సినిమాలో లుక్ టెస్ట్ కోసం లాస్ ఏంజెల్స్ కుడా వెళ్లారు. కానీ అఫీషియల్‌గా చెప్పట్లేదు. ఫైనల్లీ ఈ సినిమా గురించి ఓ అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ ఈ ముగ్గురు ‘ఆర్’లు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి, రామారావు (ఎన్టీఆర్), రామ్‌చరణ్. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటా? అని తెలుగు అభిమానులతో పాటు మొత్తం ఇండియన్ సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో క్రేజీ మల్టీస్టారర్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఇంతకీ ‘ఆర్ ఆర్ ఆర్’ అన్నది సినిమా టైటిలా లేక వర్కింగ్ టైటిలా తెలియాల్సి ఉంది.‘ ‘ఏ అనౌన్స్మెంట్ కోసమైతే నవంబర్ 2017 నుంచి మీరంతా ఎదురు చూస్తున్నారో అది అఫీషియల్‌గా ప్రకటిస్తున్నాం. మాసీవ్ మల్టీస్టారర్ ఈజ్ ఆన్’’ ‘ఆర్ ఆర్ ఆర్ ఇది టైటిల్ మాత్రమే కాదు ది టైటాన్స్ కమింగ్ టుగెదర్’’ అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్.. ఇద్దరూ బాక్సర్స్‌గా, అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తార ని సమాచారం. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్ అవుతుందని సమాచారం. -
ద మాసివ్ మల్టీస్టారర్.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్.. ఈ ముగ్గురు ఎవరికి వారు సూపర్స్టార్లు. వీరి సినిమాలు సోలోగానే బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించాయి. మరి ఈ ముగ్గురు ఒకే గొడుగు కిందకు వచ్చి.. ఒకే సినిమాతో ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్ధమైతే.. అదే ద మాసివ్ మల్టీస్టారర్.. ట్రిపుల్ ఆర్.. టాలీవుడ్ టైటన్స్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి అఫీషియల్‌గా ప్రకటిస్తూ.. ఆర్ త్రయం హ్యాష్‌ట్యాగ్‌ను విడుదల చేసింది రాజమౌళి టీం. ప్రస్తుత తరానికి టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ.. యావత్ భారతదేశంలోనూ అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా ఇదేనేమో అంటూ.. ఈ చిత్రం గురించి ఇలా అధికారిక ప్రకటన వెలువడగానే.. అలా సోషల్ మీడియా పోటెత్తింది. ట్విట్టర్ ఊగిపోతోంది. ట్రిపుల్ ఆర్ యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారతదేశమే కాదు యావత్ ప్రపంచం టాలీవుడ్ వైపు తలతిప్పి చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’... భారతీయ చిత్రసీమ గర్వపడేలా చేసింది. యావత్ ప్రపంచం అబ్బురపడింది. సినీ జనాలు కొన్నాళ్లపాటు ‘బాహుబలి’ మానియాతో ఊగిపోయారు. ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని టాలీవుడ్ నుంచి వచ్చిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టింది. దేశంలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల జాబితాలో ముందువరుసలో నిలిచింది. ఒక అద్భుతమైన సినిమాగా, ఒక దృశ్యకావ్యంగా నిలిచిపోయిన ‘బాహుబలి’ తర్వాత.. దర్శకుడు రాజమౌళి ఏ సినిమా తీస్తాడన్నది సర్వత్రా ఆసక్తి రేపింది. అటు జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో మంచి ఊపు మీదు ఉన్నాడు. టెంపర్ సినిమా నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జైలవకుశ.. అన్ని విభిన్నమైన సినిమాలే. జైలవకుశలో త్రిపాత్రాభినయంతో తారక్ అదరగొట్టాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటు మెగాపవర్‌స్టార్ రాంచరణ్ కూడా మంచి ఊపుమీద ఉన్నాడు. చరణ్ నటించిన ‘ధ్రువ’ సినిమా సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాలో చరణ్ తన యాక్టింగ్‌తో మెప్పించాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్, పాటలు విశేష ఆదరణను పొందాయి. ఇలా ముగ్గురికి ముగ్గురు హై సక్సెస్ఫుల్ ట్రాక్‌లో ఉన్న సమయంలో రాజమౌళి.. తారక్, చరణ్‌తో భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడన్న వార్త బయటకు వచ్చింది. దీని గురించి అధికారిక ప్రకటనలేవీ లేకపోయినా.. టాలీవుడ్లో క్రమంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు.. ఈ సినిమా కోసం తారక్, చరణ్ అమెరికా వెళ్లి ఫొటోషూట్‌లో పాల్గొనడం.. అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఈ కథనాలు నిజం చేస్తూ.. ఆర్ త్రయం కాంబినేషన్లో మాసివ్ మల్టీస్టారర్ మూవీ రానుందని, డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. అటు నందమూరి, మెగా అభిమానులు.. ఇటు రాజమౌళి ఫ్యాన్స్‌లో ఈ అనౌన్స్‌మెంట్‌తో ఉత్సాహం పెల్లుబుక్కుతోంది. సినిమా ఎలా ఉండబోతోంది? రాజమౌళి ఏ మాయాజాలాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాడు? ఈ మల్టీ స్టారర్లో మా హీరోకు తగినంత ప్రాధాన్యం ఉంటుందా? తరహాలో మెగా, నందమూరి అభిమానుల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ట్రిపుల్ ఆర్ యాష్‌ట్యాగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. The mother of all announcements is here .. Young Tiger @tarak9999, Mega Powerstar Ram Charan and the one and only S S R A J A M O U L I @ssrajamouli come together for @RRRMovie .. officially announced #RRR https://t.co/CBREhs2qJj — Mahesh S Koneru (@smkoneru) March 22, 2018 Can't wait 😍😍😍 arey oo box office get ready to get blast🤩🤩🤩💪💪💪 @ssrajamouli @tarak9999 #ramcharan 🔥🔥🔥💃💃💃💃💃💃💃💃💃 #RRR https://t.co/valPAr5o4p — #NoLeapInKKB 🙏 (@pavani171) March 22, 2018 Records badhalu avvalsinde 💪 #RRR pic.twitter.com/sGNRpb88mA — SamosaTimes (@samosa_times) March 22, 2018 #RRR 1st multistarer in current top heroes#RamaRao #RamCharan Curious to see how it gonna be.. After #Baahubali from #Rajamouli N another kickass role for @tarak9999 😘😍 — BhaviK GouD G (@bhavikgoud28) March 22, 2018 Well, I thought my story would have become the first one which will have these stars.. but here we are, @ssrajamouli making it possible way ahead of me... All the best @ssrajamouli , @tarak9999 and Ramcharan..#ramarao #RRR — Fairoz (@Fairoz2573) March 22, 2018 #RRR mass feast😍 pic.twitter.com/HuIrvf74HV — Dis Page Vll Entertain U (@dpveuu) March 22, 2018 #RRR #RamCharan @tarak9999 @ssrajamouli pic.twitter.com/sXM9jPeDtF — So Called Cinema (@vrsocc) March 22, 2018 -
న్యూ లుక్‌లో చెర్రీ
-
‘లాంతరు’ గుర్తుకే మీ ఓటేయండి
టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే చర్చ. అది రంగస్థలం సినిమాపైనే. విలక్షణ దర్శకుడు సుకుమార్ సినిమాను తెరకెక్కిస్తుండమే ప్రధాన కారణం. పైగా అందులో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ విభిన్నపాత్రలో నటించడం ఇంకాస్త ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటికే విడుదలైన రంగస్థలం పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నాయి. ఇంతవరకు హీరో హీరోయిన్లకు సంబంధించిన లుక్స్, పోస్టర్స్ మాత్రమే బయటకు విడుదల చేసింది చిత్రబృందం. కానీ తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదలైంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. పొలిటికల్ పోస్టర్ని సినిమా పోస్టర్‌గా ఆసక్తిగా చూపించడం సుక్కుకే సాధ్యమైంది. ఊర్లో జరిగే పంచాయితీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో భాగంగా ముద్రించే పోస్టర్లనే సినిమా పోస్టర్‌గా బయటకు వదిలారు. ఈ పోస్టర్లో ‘ రంగస్థలం గ్రామపంచాయితీ ఎన్నికలలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా గ్రామ ప్రజలు బలపరిచిన కె.కుమార్ బాబు లాంతరు గుర్తుకే మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి’ అని ఉంది. ఎంతైనా సుక్కు బ్రెయిన్ అంటే బ్రెయినే. -
మా రామలక్ష్మిని రేపు కలువండి...
..అంటున్నారు రంగస్థలం మేకర్లు.. ఇంతకూ రామలక్ష్మి ఎవరంటే చిట్టిబాబు మనస్సు దోచిన అమ్మాయి. చెవిటివాడైన చిట్టిబాబుకు-రామలక్ష్మి మధ్య స్టోరీ ఏమిటంటే ‘రంగస్థలం’ సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాలి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా రాబోతున్న సినిమా ‘రంగస్థలం’.. ఇప్పటికే ఈ సినిమాలో రాంచరణ్ క్యారెక్టర్‌ను మేకర్లు రివీల్ చేశారు. చెవిటివాడైన చిట్టిబాబుగా.. అందరికీ సౌండ్ వినిపిస్తే.. తనకు కనిపిస్తుందంటూ చెర్రీ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇక రేపు ఉదయం 11 గంటలకు రామలక్ష్మిని పరిచయం చేయబోతున్నారు. రామలక్ష్మిగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సమంతతోపాటు రాంచరణ్, మైత్రీ మూవిస్ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. సమంత తన పాత్ర గురించి వివరిస్తూ.. రామలక్ష్మిగా నన్ను నేను ఎంత ఇష్టపడ్డానో.. మీరు కూడా అంతే ప్రేమిస్తారని ఆశిస్తున్నా.. భయం ఎరుగని శక్తిమంతురాలైన రామలక్ష్మి పాత్రను నాకు ఇచ్చినందుకు సుకుమార్‌కు కృతజ్ఞతలు.. రంగస్థలంలో ఈ పాత్ర లభించినందుకు గర్వపడుతున్నా’తెలిపారు. -
ఆ ఇద్దర్నీ కోలీవుడ్‌కు..
తమిళసినిమా : కోలీవుడ్ స్టార్ నటులు టాలీవుడ్లో రాణించడానికి తహ తహలాడుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్, కమలహాసన్ లాంటి నట దిగ్గజాల చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. వారిని పక్కన పెడితే సూర్య, కార్తీ, విశాల్, ఆర్య, భరత్ లాంటి యువ స్టార్స్ టాలీవుడ్లో సుపరిచితులుగా మారారు. వీరి చిత్రాలకు అక్కడ వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల దృష్టి ఇటీవల కోలీవుడ్‌పై పడింది. ఇప్పటికే నాగార్జున లాంటి కొద్దిమంది తమిళ చిత్రాల్లోనూ నటించి పేరు తెచుకున్నారు. అదే విధంగా మహేశ్, ప్రభాష్, రానా లాంటి నటులు తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలితో ప్రభాస్ కోలీవుడ్‌లోనూ విజయం అందుకున్నారు. మహేశ్‌బాబు నటించిన స్పైడర్ ఆయన్ని నిరాశపరచింది. అల్లుఅర్జున్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కోలావుడ్‌లో మార్కెట్ పెంచుకోవాలని ఆరాటపడుతున్నారు. ప్రభాస్‌ను కోలీవుడ్‌కు స్ట్రెయిట్ చిత్రం ద్వారా పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను కోలీవుడ్‌కు తీసుకొస్తున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న మల్లీస్టారర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ రూపొందించనున్నట్టు తాజా సమాచారం. దీన్ని ఆయన ఇద్దరు బాక్సర్ల కథా చిత్రంగా తీర్చిదిద్దనున్నారు. కథను విజయేంద్రప్రసాద్ అందిస్తున్నారు. ఇతర వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
చిట్టిబాబుతో చిందులు
ఆ రోజు చిట్టిబాబు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఓ పాట పాడాలనుకున్నాడు. రెచ్చిపోయి స్టెప్పులు వేయాలనుకున్నాడు. చిట్టిబాబుకి ‘సై’ చెప్పింది అందాల భామ. ఈ ఇద్దరూ చిందులేస్తుంటే ఊరుకోలేక మరికొంతమంది కాలు కదిపారు. ‘రంగస్థలం’ సినిమాకి ఈ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్. ఇంతకీ చిట్టిబాబు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో రామ్‌చరణ్ క్యారెక్టర్ పేరిది. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్, పూజా హెగ్డే పాల్గొనగా ఓ ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేశారు. సోమవారం మొదలైన ఈ పాట చిత్రీకరణకు మొత్తం ఐదు రోజులు పడుతుంది. రామ్‌చరణ్, పూజా హెగ్డేలతో పాటు 200 మంది డ్యాన్సర్లు ఈ పాటకు స్టెప్స్ వేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ జానీ స్టెప్స్ సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కోసం రాజమండ్రిలో రెండు పాటలు చిత్రీకరించారు. ఒక్కో పాటకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. ఇప్పుడు తీస్తున్న స్పెషల్ సాంగ్‌కి కూడా అంతే అవుతుందని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ పాటతో సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. 1985 నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్‌చరణ్ లుక్, టీజర్‌కి మంచి స్పందన లభించింది. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
రంగస్థలం.. ఇక వెయిట్ చేయలేను: సమంత
విభిన్నమైన సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ సుకుమార్ తాజాగా రూపొందించిన చిత్రం 'రంగస్థలం'. మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ట్విటర్లో సమంత అక్కినేని వెల్లడించారు. 'చిట్టిబాబు' రాంచరణ్ సరసన సమంత నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 'రంగస్థలం సినిమా షూటింగ్ పూర్తయింది. రాంచరణ్, సుకుమార్, మైత్రీ నిర్మాణ సంస్థ వంటి స్పెషల్ టీంతో చేసిన స్పెషల్ జర్నీ ఇది. తమ స్టార్ హోదాకు తగ్గట్టు మనస్సు లోతుల్లోంచి వెలుగు పంచగల వ్యక్తులు వీరు. ఈ బిగ్‌బ్యాంగ్ కోసం ఇక వెయిట్ చేయలేకపోతున్నా' అంటూ సమంత ట్వీట్ చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన 'రంగస్థలం' టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చెవిటివాడైన చిట్టిబాబుగా రాంచరణ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇంక సమంత ఫస్ట్‌లుక్‌ను ఈ వారంలోనే విడుదల చేయబోతున్నారు. ఇందులో లచ్చిమి పాత్రలో సమంత నటించినట్టు తెలుస్తోంది. -
ఇక్కడ స్టెప్ అవుట్.. అక్కడ స్టెప్ ఇన్
స్టెప్ అవుట్ అయితే స్టెప్ ఇన్ అవ్వాలి. అవును... ‘రంగస్థలం’ నుంచి స్టెప్ అవుట్ అయ్యి కొత్త సినిమాలోకి స్టెప్ ఇన్ అవ్వబోతున్నారు రామ్‌చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా అంగీకరించిన విషయం తెలిసిందే. త్వరలో ‘రంగస్థలం’ పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం స్టెప్పులేస్తున్నారు చరణ్. ఓ పాట చిత్రీకరణ జరగుతోంది. ఆ తర్వాత బోయపాటి సినిమాతో బిజీ అయిపోతారు. మరి.. బోయపాటి సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది కదా అంటే... ఫస్ట్ షెడ్యూల్లో నటి స్నేహ మరియు ఇతర తారాగణం పై కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఇవి ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్. పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. ఫిబ్రవరి మూడో వారంలో తర్వాతి షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట. ఆ షెడ్యూల్‌తో షూటింగ్‌లోకి స్టెప్ ఇన్ అవుతారు రామ్‌చరణ్. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఆ షెడ్యూల్లో పాల్గొంటారు. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా కొత్తగా ఉండబోతోందని, ఎక్కువ శాతం షూటింగ్ రాజస్థాన్‌లో జరగనుందని సమాచారం. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ఇక్కడ రామ్‌చరణ్... అక్కడ లారెన్స్!
కాలభైరవ అంటే తెలుగులో అయితే వెంటనే హీరో రామ్‌చరణ్ గుర్తొస్తారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సినిమా సెకండాఫ్‌లో రామ్‌చరణ్ క్యారెక్టర్ నేమ్ అదే. తమిళంలో మాత్రం కాలభైరవ అంటే ఇకపై రాఘవ లారెన్స్ గుర్తొస్తారేమో. ఎందుకంటే ఆయన నెక్ట్స్ చిత్రం టైటిల్ అదే. ‘‘మై డియర్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. నా నెక్ట్స్ సినిమా టైటిల్ ‘కాల భైరవ’. ప్రస్తుతం ‘కాంచన 3’ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ‘కాలభైరవ’ షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నాం. బహుశా ఏప్రిల్‌లో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మరో రెండు సినిమాల గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్నీ కుదరితే మార్చిలోపు ఆ సినిమాల వివరాలు కూడా చెబుతాను’’ అని పేర్కొన్నారు లారెన్స్. ప్రస్తుతం లారెన్స్, ఓవియా, వేదిక నటిస్తున్న ‘కాంచన 3’ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఈ సినిమాలోని లేటెస్ట్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీరు చూస్తొన్న ఫోటో అదే. -
ఇద్దరూ ఇద్దరే
...ఈ టైటిల్ వినగానే శోభన్‌బాబు–కృష్ణంరాజు (1976), అక్కినేని నాగేశ్వరరావు–నాగార్జున(1990) నటించిన సినిమాలు గుర్తుకు రాకమానవు. ఇప్పుడు మరోసారి ఈ టైటిల్ తెరపైకి వచ్చింది. ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ తర్వాత రాజమౌళి నెక్ట్స్ రామ్‌చరణ్–ఎన్టీఆర్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ చేసే ప్లాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఫిల్మ్‌నగర్‌లో ప్రచారమవుతున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి ‘ఇద్దరూ ఇద్దరే’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్–చరణ్‌లకు ఈ చిత్రంలో సమ ప్రాధాన్యత ఉంటుందట. అందుకే ఏ టైటిల్ అయితే బాగుంటుందా? అని ఇద్దరు హీరోలకు సరిపడేలా ‘ఇద్దరూ ఇద్దరే’ అనుకుంటున్నారట. ప్రస్తుతం ‘రంగస్థలం’ షూటింగ్లో ఉన్న రామ్‌చరణ్ తర్వాతి సినిమాని బోయపాటి శ్రీనుతో చేయనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ హీరోలిద్దరూ ఈ చిత్రాలు చేసేలోపు రాజమౌళి ప్లానింగ్‌లో ఉంటారట. ఆ తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందట. -
రారండోయ్‌పండగచేద్దాం!
చిన్నా పెద్దా తేడా లేదు. అక్కడ, ఇక్కడ అన్న బేధాలు లేవు. కామన్ మేన్ అయినా సెలబ్రిటీ అయినా.. ఎవరైనా ఒకటే. అందరి ఆలోచనా ఒకటే. పండగ చేసుకోవాలి. ‘రారండోయ్ సంక్రాంతి పండగ చేద్దాం’ అంటూ, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు చెబుతూసోషల్ మీడియాలో వారి ఫొటోలు పోస్ట్ చేశారు కొందరు నటీనటులు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఛలో’. ‘‘ఈ నెల 25న జరగనున్న ‘ఛలో’ ప్రీ–రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావడానికి చిరంజీవిగారు ఒప్పుకున్నారు. థ్యాంక్స్ సర్. భోగి రోజున నా ఆనందానికి అవధులు లేవు’’ అన్నారు నాగశౌర్య. ఈ చిత్రాన్ని వచ్చే నెల 2న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ రోజు మా నాన్నగారితో టైమ్ స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు మంజుల. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సెలబ్రేషన్లో భాగంగా రామ్‌చరణ్, నిహారిక, వైష్ణవ్ తేజ్‌లతో తాము ఉన్న గ్రూప్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. నివేథా థామస్, అనుపమా పరమేశ్వరన్, రీతూ వర్మ తమ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. భోగి మంట సంబరాల్లో సంపూర్ణేష్ బాబు, హృదయ కాలేయం దర్శకుడు–కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాజేష్. ఆదివారం ఉదయం జై సల్మీర్‌లో హిందీ చిత్రం ‘అయ్యారీ’ టీమ్‌తో కలిసి భోగి పండగ వేడుకల్లో పాల్గొన్నారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. -
ఆన్ సెట్ ఎమోషన్.. ఆఫ్ సెట్ సెలబ్రేషన్
అది ‘రంగస్థలం’ సినిమా సెట్! హీరో రామ్‌చరణ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్ అక్కడే ఉన్నారు. వీరందిరినీ డైరెక్టర్ సుకుమార్ చూస్తూనే ఉన్నారు. ఆయన స్టార్ట్ చెప్పారు. కానీ సీన్ అయినా కట్ చెప్పకుండా చెమర్చిన కళ్లతో చూస్తూ ఉండిపోయారు. యూనిట్ అందరి కళ్లల్లో కన్నీరు. చిట్టిబాబు (‘రంగస్థలం’లో రామ్‌చరణ్ పేరు) అయితే పట్టరాని దుఃఖంలో ఉన్నాడు. ఏమైంది? ఎందుకలా? అంటే.. ఈ సినిమాలో ఓ కీలకమైన సెంటిమెంట్ సీన్స్‌ను ఇటీవల తెరకెక్కించారు. ఈ హై ఎమోషన్ సీన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ పాట వస్తుంది. ఆ పాట, వీళ్ల వేదన చూస్తే ఎవరైనా ఇట్టే కరిగిపోవాల్సిందే. ఆ రేంజ్లో ఉందట. సీన్ నిజం కాదని తెలిసినా.. లొకేషన్లో అందరూ ఎమోషనల్ అయ్యారంటే.. రేపు థియేటర్లో ప్రేక్షకుల కళ్లు చెమర్చకుండా ఉండవు. ఆన్ సెట్ ఎమోషన్ అయినా ఆఫ్ సెట్ మాత్రం ఈ యూనిట్ సెలబ్రేషన్ మూడ్‌లోనే ఉంటున్నారు. నవీన్, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సుకుమార్ ఒడిలో రాంచరణ్..!
విలక్షణ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్.. సినిమాల మీద అభిమానంతో లెక్కల మాస్టర్‌గా ఉద్యోగాన్ని వదులుకొని దర్శకత్వం వైపు అడుగులు వేసిన సుక్కు.. ఆర్య, ఆర్య-2, 100% లవ్, వన్, నాన్నకు ప్రేమతో.. సినిమాలతో తన మ్యాజిక్ ఏమిటో చూపించాడు. మొదటినుంచీ విభ్నిన్నమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ.. మంచి అభిరుచి ఉన్న ఫిల్మ్ మేకర్‌గా నిరూపించుకున్న సుకుమార్ జన్మదినం ఈరోజు (జనవరి 11).. ఈ సందర్భంగా సుక్కుకు రామ్‌చరణ్ వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. సుకుమార్ ఒడిలో కూర్చుని బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఫొటోను చెర్రీ సతీమణి ఉపాసన ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. త్వరలోనే 'రంగస్థలం' మ్యాజిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదంటూ ఆమె పేర్కొన్నారు. రాంచరణ్ హీరోగా 'రంగస్థలం'ని సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1985 నాటి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులను, వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ప్రస్తుతం సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు. -
బర్త్‌డే మంత్‌లో స్టార్ట్!
ఇక్కడ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్... ముగ్గురి ఫొటోలున్నాయి. ఎవరి బర్త్‌డే మంత్‌లో ఏం స్టార్ట్ కాబోతోంది అనుకుంటున్నారా? పుట్టినరోజు నెల రాజమౌళిది. స్టార్ట్ కాబోతున్నది సినిమా. ఎన్టీఆర్, రామ్‌చరణ్ క్రేజీ కాంబినేషన్లో రాజమౌళి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారు? అనే విషయంలో చిన్నపాటి క్లారిటీ వచ్చింది. అక్టోబర్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. రాజమౌళి పుట్టింది ఆ నెలలోనే. పదో నెల పదో తేదీన పుట్టారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్‌తో సినిమా మొదలుపెట్టనున్నారు. అక్టోబర్‌కల్లా ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఇక రామ్‌చరణ్ ఆల్రెడీ ‘రంగస్థలం’తో బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే ఈ సినిమా పూర్తవుతుంది. ఇదే నెలలోనే బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేయనున్న సినిమా మొదలవుతుంది. ఇది కూడా అక్టోబర్‌కల్లా పూర్తయిపోతుంది. సో.. రాజమౌళి సినిమా చేయడానికి ఎన్టీఆర్, రామ్‌చరణ్ పదో నెలకి ఫ్రీ అయిపోతారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. -
సంక్రాంతికి బ్రేక్!
రెడీ అవుతున్నారు. షూట్లో జాయిన్ అయ్యేందుకు చిట్టిబాబు రెడీ అవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా ‘రంగస్థలం’. ఇందులో సమంత కథానాయిక. సినిమాలో రామ్‌చరణ్ చిట్టిబాబు పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12 వరకూ హైదరాబాద్‌లో జరగనుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. సంక్రాంతికి బ్రేక్ తీసుకుంటారట ‘రంగస్థలం’ టీమ్. ఆ తర్వాత రాజమండ్రిలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్లో రామ్‌చరణ్ పాల్గొంటారట. ఆల్రెడీ డబ్బింగ్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేశారని సమాచారం. ఫైనల్‌గా ఈ నెల ఎండింగ్ కల్లా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట చిత్రబృందం. ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే రామ్‌చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో తారక రత్నను విలన్‌గా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుందని ఫిల్మ్‌నగర్‌లో నయా గుసగుసలు వినిపిస్తున్నాయి. -
అమేజింగ్ సీన్.. అదిరిపోయే సెల్ఫీ..!
సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం' షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 1985 నాటి ప్రేమకథగా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన లభించింది. సినిమాపైనా అంచనాలు హైలెవల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ అనసూయ సెట్లో రామ్‌చరణ్‌తో ఓ అదిరిపోయే సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. ఓ అమేజింగ్ సీన్‌ను తెరకెక్కించిన తర్వాత ఈ సెల్ఫీని దిగామని, తన నటనతో రామ్‌చరణ్ మనందరూ గర్వపడేలా చేస్తారని, సినిమా విడుదలయ్యేవరకు ఆగండంటూ అనసూయ ట్వీట్ చేసింది. 'రంగస్థలం' అనసూయ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఏమన్నదంటే.. 'రంగస్థలం సెట్స్‌లో నిజంగా చాలామంచి వ్యక్తి అయిన రామ్‌చరణ్‌తో దిగిన సెల్ఫీ మీతో పంచుకుంటున్నాను. అమేజింగ్ సీన్‌ను తెరకెక్కించిన తర్వాత ఈ సెల్ఫీ దిగాం. సినిమా వచ్చేవరకు ఆగండి. చరణ్ మనందరూ గర్వపడేలా చేస్తారు' అని అనసూయ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో అనసూయ కొడుకు కూడా ఉన్నాడు. And let me make your day by sharing this much anticipated selfie of mine with this truly immensely good of a person #RamCharan from the sets of #Rangasthalam after an ammaazzzing scene’s shoot!!Just wait till the film’s out!! He will make us all so so proud!!❤️#withMyboy ❤️ pic.twitter.com/dDDURXIYLy — Anasuya Bharadwaj (@anusuyakhasba) 24 December 2017 -
తప్పెట మోత.. చిట్టిబాబు ఆట
ఊరు హోరేత్తేలా తప్పెట మోత మోగుతుంది. గుండెలు ఝల్లుమనేలా గజ్జెలు గల్లు గల్లుమంటున్నాయి. అక్కడికి చిట్టిబాబు ఎంట్రీ ఇచ్చాడు. ఆ నెక్ట్స్ ఏంటి?... అంటే ప్రస్తుతానికి ఇంతే. బ్యాలెన్స్ వెండితెరపై చూస్తే ఫ్యాన్స్ ఈల కొట్టి గోల పెట్టడం ఖాయం అంటున్నారు ‘రంగస్థలం’ చిత్రబృందం. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ షెడ్యూల్ మంగళవారం మొదలైంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌లో తప్పెట డ్యానర్స్ పాల్గొంటున్నారు. ‘‘రంగస్థలం’ సెట్లో మళ్లీ ఫోక్ ఆర్ట్స్ గురించి తెలుసుకుంటున్నాను. మా సినిమాలోని తప్పెట డ్యాన్సర్స్‌ను మీట్ అవ్వండి’’ అని మీరు చూస్తున్న ఫొటోను రామ్‌చరణ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘సినిమాలోని కీలకమైన సన్నివేశాల కోసం తప్పెట ఆటగాళ్లను వెస్ట్ గోదావరి నుంచి పిలిపించాం. కథలో కీలకమైన ఎపిసోడ్లో ఈ సీన్స్ ఉంటాయి. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు సాగుతుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అని తెలిసిందే. మార్చి 30న చిత్రం విడుదల కానుంది. -
నెక్ట్స్ టార్గెట్!
ఆల్ సెట్ అయితే హీరో రామ్‌చరణ్ నెక్ట్స్ టార్గెట్ చేసే విలన్ నేమ్ ప్రతాప్ రవినే అని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఎవరీ ప్రతాప్ రవి? అంటే... రక్తచరిత్రను బయటికి తీయాల్సిందే. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పేస్తాం. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తచరిత్ర’ సినిమాలో ప్రతాప్ రవి క్యారెక్టర్‌ను బీ టౌన్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు అజిత్ హీరోగా చేసిన తమిళ చిత్రం ‘వివేగం’ లో వివేక్ ఒబెరాయ్‌నే విలన్. మళ్లీ తెలుగు తెరపై వివేక్ కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వివేక్‌ను ప్రతినాయకుడి పాత్రకు సెలక్ట్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందని ఫిల్మ్‌నగర్ టాక్. అంతే కాదండోయ్.. ఓ కీలక పాత్రకు శివగామిని.. అదేనండి.. రమ్యకృష్ణను సంప్రదించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
భలే భలే పల్లె పడుచు
హీరోయిన్ సమంత గేదెలకు మేత వేయడం ఎప్పుడైనా చూశారా? పోనీ కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తూ ఎక్కడైనా కనిపించారా? సాదాసీదా పరికిణీ, ఓణీలో ఆమెను చూశారా? చూసి ఉండరు కదా. జస్ట్ మూడే నెలలు ఆగండి. మనం సమంతను అలా చూడొచ్చు. ‘రంగస్థలం’లో మనకు ఇలానే కనిపించనున్నారామె. 1985 నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అచ్చ తెలుగు పల్లెటూరి పడుచు పాత్ర చేస్తున్నారు సమంత. ఈ సినిమాలో హీరో రామ్‌చరణ్ చిట్టిబాబు పాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సమంత గేదెలను తీసుకెళ్తున్న ఫొటో ఒకటి, కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న ఫొటో ఒకటి ఆన్లైన్లో దర్శనం ఇచ్చాయి. అవి చూసి, ‘భలే భలే పల్లె పడుచు’ అని సమంత ఫ్యాన్స్ అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 30న ‘రంగస్థలం’ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. లీక్స్ తగదు ఈ నెల 9, 10 తేదీల్లో తమ సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్ కావడం పట్ల మైత్రీ మూవీస్ సంస్థ షాక్ అయింది. ఇలా చేయడంవల్ల తమ సినిమా ప్రచారా నికి ఇబ్బంది అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఇప్పటికే ఫొటోలు బయటపెట్టిన వాళ్ల దగ్గర సినిమాకి సంబంధించిన ఇతర మెటీరియల్ ఏమైనా ఉందేమోనని అనుమానంగా ఉందన్నారు. ఈ లీకుల విషయమై నిర్మాతలు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని సంప్రదించగా, కేసు నమోదు చేశారు. -
చిట్టిబాబు.. జజ్జనకరి జనారే
మాస్ అమ్మా.. మాస్.. మనం ఊర మాస్. గళ్ల లుంగీ, కట్ బనియన్, డిజైన్ చొక్కా, గళ్ల తువ్వాలు... పక్కా విలేజ్ మాస్ కుర్రాడు ఎలా ఉండాలో చిట్టిబాబు అలానే ఉన్నాడు. ఇతగాడికి పట్టరాని ఆనందం వస్తే జజ్జనకరి జనారే అంటూ చిందేయాల్సిందే. చూశారుగా.. చిట్టిబాబు ఎంత తన్మయత్వంతో ఒళ్లు మైమరచి చిందేస్తున్నాడో? ఇక్కడ కనిపిస్తున్నది రామ్‌చరణ్ కదా.. చిట్టిబాబు అంటున్నారేంటి అనుకుంటున్నారా? చిట్టిబాబంటే రామ్‌చరణే. ‘రంగస్థలం’లో చరణ్ పేరు చిట్టిబాబు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ లుక్‌ని శనివారం విడుదల చేశారు. ‘‘ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తనదైన స్టైల్లో సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఐదు రోజుల టాకీ, రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జనవరిలో షూట్ చేయనున్న రెండు సాంగ్స్‌లో ఒకటి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ‘శ్రీమంతుడు, జనతాగ్యారేజ్’ వంటి హిట్ సినిమాలు ఇచ్చిన మా బ్యానర్లో ‘రంగస్థలం’ హ్యాట్రిక్ మూవీగా నిలుస్తు్తంది’’ అన్నారు నిర్మాతలు. -
మోగింది సైరా శంఖారావం
స్వాతంత్య్రం, స్వేచ్ఛ, సమానత్వం పదాలు చిన్నవే. కానీ వీటి కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు గొప్పవి. ఆ మహాను భావుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మొదటి వరుసలో ఉంటుంది. స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లపై పోరాడిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధునిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు ఉయ్యాలవాడ. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో ఆయన తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం మొదలైంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ నెల 22 వరకు షూటింగ్ జరుగుతుంది. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ లీ విట్టేకర్ ఆధ్వర్యంలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తు న్నారు. రీల్ లైఫ్‌లో బ్రిటీషర్లపై చిరంజీవి తొలి సమర శంఖారావం మోగిందన్నమాట. ‘‘ ‘సైరా’ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మాకిది మెమొరబుల్ జర్నీ’’ అని చరణ్ పేర్కొన్నారు. ‘‘వెరీ ఎగై్జటెడ్ అబౌట్ ద జర్నీ ఆఫ్ అమేజింగ్ టీమ్’’ అన్నారు సురేందర్‌రెడ్డి. ఇదిలా ఉంటే.. ఫస్ట్ డే చిరంజీవి ఫొటోలు ఏవీ బయటకు రాలేదు. అయితే ఆయనది లేటెస్ట్ ఫొటో ఒకటి హల్చల్ చేసింది. పైన ఫొటో అదే. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: రత్నవేలు, ఆర్ట్: రాజీవ్. -
శ్రీవారి సేవలో రామ్‌చరణ్ దంపతులు
-
తిరుమలలో రాంచరణ్ దంపతులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నటుడు రాంచరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో వెంకన్న సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద రామ్‌చరణ్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, నడక దారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. -
కొట్టేద్దామా పోస్టర్!
ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి... ఇదేదో వేలం పాటలా ఉందే! ఇంతకీ, వేలం పాట దేని కోసం? అనేగా మీ డౌట్. ఇక్కడ వేలం పాట లేదు... మీరు పోటీలో పాడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అసలు విషయం ఏంటంటే... రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్‌లది హిట్ కాంబినేషన్. ‘బ్రూస్లీ, ధృవ’ సినిమాలతో హిట్ పెయిర్ అని పేరు తెచ్చుకున్నారు. ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ జోడీ కట్టనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించనున్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. అందులో చరణ్ సరసన రకుల్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. చిత్రవర్గాలు కూడా ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పైగా, ‘సరైనోడు, జయ జానకి నాయక’ చిత్రాల్లో రకుల్ ప్రతిభ, అంకితభావం చూసిన బోయపాటి తన తర్వాతి సినిమాకి రకుల్‌ని తీసుకోనున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. దీనిబట్టి చూసినా చరణ్ సరసన రకుల్‌కి మరో ఛాన్స్ ఫిక్స్ అయినట్లే అని ఊహించవచ్చు. ఆ సంగతలా ఉంచితే ‘బ్రూస్లీ’లో ‘మెగా మెగా మెగా మీటర్.. కొట్టేద్దామా పోస్టర్’ అని రామ్‌చరణ్, రకుల్ పాడతారు. మరోసారి నటిస్తే.. మళ్లీ పోస్టర్ కొట్టేస్తారు. అదేనండీ.. కొత్త సినిమాకి పోస్టర్లు వేస్తారు కదా! ప్రస్తుతం సుకుమార్ ‘రంగస్థలం’లో నటిస్తున్న చరణ్, అది పూర్తయిన తర్వాత బోయపాటి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట. -
చెర్రీ నహీ... బన్నీ!?
మహేశ్‌బాబు హీరోగా తీస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ తీయబోయే సినిమాలో హీరో ఎవరు? మొన్నటివరకూ అయితే చెర్రీనే! అదేనండీ... రామ్‌చరణ్. కానీ, ఇప్పుడు కథ మారుతోందనీ, కథానాయకుడు మారుతున్నాడని ఫిల్మ్‌నగర్ గుసగుస! ఎందుకంటే... దర్శకుడు రాజమౌళి పేరు ప్రస్తావనలోకి వస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందట! రాజమౌళి సిన్మా సోదిలోకి రాకముందు సేమ్ టైమ్‌కి చరణ్–కొరటాల సినిమా స్టార్ట్ అవుతుందని గతంలోనే ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు రాజమౌళి సినిమాకి రామ్‌చరణ్ ‘యస్’ చెప్పడంతో కొరటాల ప్లాన్ మారిందని టాక్. అందువల్ల మధ్యలో మరో కథతో అల్లు అర్జున్ హీరోగా సినిమా తీయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట! ప్రస్తుతం హీరో, దర్శకుడు మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్! ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తారని మరో టాక్!! -
కుదిరింది... కప్పు కాఫీ!
తండ్రిలానే కొడుకు కూడా. అవును.. తండ్రి చిరంజీవిలా కొడుకు రామ్‌చరణ్ కూడా గెడ్డం పెంచారు. డాడ్ ఏమో ‘సైరా’ కోసం సన్ ఏమో ‘రంగస్థలం’ కోసం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో ఆరంభం కానున్న ‘సైరా’ కోసం చిరంజీవి కసరత్తులు చేస్తోంటే ‘రంగస్థలం’తో చరణ్ బిజీ బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత స్టార్స్ అయినా తండ్రి తండ్రే.. కొడుకు కొడుకే. అందుకే తండ్రితో కప్పు కాఫీ తాగుతూ, కాసేపు కబుర్లు చెప్పాలనుకున్నారు చరణ్. ‘‘నాన్నను కన్విన్స్ చేసి, కాఫీకి తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది’’ అని చరణ్ అన్నారు. ‘‘పేరెంట్స్‌తో పిల్లలు టైమ్ స్పెండ్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్‌కి అది వెలకట్టలేని బహుమతి. తండ్రిలా కొడుకు.. కొడుకులా తండ్రి’’ అని చరణ్ సతీమణి ఉపాసన పేర్కొన్నారు. అంతేకదా.. పెద్దయ్యాక కొందరు మగపిల్లలు తండ్రితో ఏదో పొడిపొడిగా మాట్లాడతారు. దూరం దూరంగా ఉంటారు. కానీ, చరణ్ తన తండ్రికి చాలా క్లోజ్. ‘హీ ఈజ్ మై ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్’ అని పలు సందర్భాల్లో చెప్పారు. -
సన్నాఫ్ సైరా డైరెక్టర్ అండ్ సన్నాఫ్ సైరా!
‘సైరా’ ఎవరు? అదేనండీ... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో సినిమా (‘సైరా నరసింహారెడ్డి’) చేయబోతున్నది ఎవరు? చిరంజీవి. ఇప్పుడు చిరు తనయుడు రామ్‌చరణ్‌ని ఏమనొచ్చు? సన్నాఫ్ సైరా. లెక్క కుదిరింది కదా! ‘సైరా’ దర్శకుడు ఎవరు? సురేందర్‌రెడ్డి. గుర్రం మీద రామ్‌చరణ్‌తో సరదాగా షికారు చేసిన చిన్నోడు.. సురేందర్‌రెడ్డి తనయుడే. ఈ సన్నాఫ్ సైరా డైరెక్టర్ అండ్ సన్నాఫ్ సైరా కలిసి మొన్న హార్స్ రైడ్ చేసినప్పుడు తీసిన ఫొటో ఇది!! రామ్‌చరణ్‌కి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టమట. సురేందర్‌రెడ్డి కుమారుడు ముచ్చట పడినట్టున్నాడు... ‘చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం’ అంటూ రైడ్‌కి తీసుకువెళ్లారు. -
అటు యమదొంగ... ఇటు మగధీర... దర్శకధీరుడి మల్టీస్టారర్!
దర్శకధీరుడు రాజమౌళి సరదాగా కన్ను కొట్టారు... ఓ పక్క ఎన్టీఆర్, మరోపక్క రామ్‌చరణ్‌ను పెట్టుకుని మధ్యలో ఆయన కూర్చున్న ఫొటోను ట్వీట్ చేస్తూ! కన్ను కొట్టడానికి ముందు కొంత ఖాళీ స్పేస్ (డాష్)ను వదిలారు... ‘ఫిల్ ఇన్ ద బ్లాంక్స్’ (మీ ఊహకు వదిలేస్తున్నా) అన్నట్టు! ఇంతకీ, ఈ ముగ్గురూ ఎప్పుడు కలిశారు? అంటే... శనివారం రాత్రి! బహుశా... వీకెండ్ పార్టీ ఏమో! ఎన్టీఆర్, రామ్‌చరణ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. మొన్న ‘జై లవకుశ’ హిటై్టనప్పుడు ఎన్టీఆర్‌ని ఇంటికి పిలిచిన చరణ్ స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ ఇద్దరితోనూ రాజమౌళి సినిమాలు తీశారు. ఎన్టీఆర్–రాజమౌళి కలయికలో ‘స్టూడెంట్ నెం1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ వంటి హిట్స్ వస్తే... చరణ్–రాజమౌళి కలయికలో ‘మగధీర’ వచ్చింది. ఇప్పుడీ ముగ్గురూ కలిసిన ఈ ఫొటోను రాజమౌళి ట్వీట్ చేయడానికి కారణం ఏంటి? అని ఆరా తీయగా... ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట! రాజమౌళి కన్ను కొట్టడానికి కారణమదేనని ఫిల్మ్‌నగర్ టాక్! మొన్నామధ్య రాజమౌళి ‘రంగస్థలం’ సెట్స్‌కి వెళ్లడానికి కారణం కూడా కొత్త సినిమా కథా చర్చలేనట! ‘బాహుబలి–2’ తర్వాత ఏ సినిమా చేసేదీ ఇప్పటివరకూ రాజమౌళి వెల్లడించలేదు. కానీ, కథపై కసరత్తులు చేస్తున్నారట. అదో మల్టీస్టారర్ కథనీ, అందులో ఎన్టీఆర్–చరణ్ హీరోలుగా నటించడానికి అంగీకరించారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్! డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ‘రంగస్థలం’లో నటిస్తున్న చరణ్, ఆ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమా, చరణ్–బోయపాటి సినిమా ఇంచుమించు ఒకేసారి పూర్తవుతాయి. అప్పుడు ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్!! -
చెర్రీ చేతుల మీదుగా ‘సప్తగిరి ఎల్ఎల్బి’ ట్రైలర్
కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరి తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో మంచి విజయం అందుకున్నారు. ఆ సినిమా నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ అధినేత డా. రవికిరణ్ ప్రస్తుతం సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్ఎల్బి’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కాశిష్ వోరా కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు. డా. రవికిరణ్ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ని మించిన విజయం ‘సప్తగిరి ఎల్ఎల్బి’ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘సప్తగిరి ఎల్ఎల్బి’ ట్రైలర్‌ను రామ్‌చరణ్‌గారు విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు సప్తగిరి. -
డిసెంబర్లో డ్యాన్స్.. డ్యాన్స్!
హెడ్డింగ్ చదవగానే రామ్‌చరణ్ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారా? ఆ సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియడానికి ఇంకాస్త టైమ్ ఉంది. ఇప్పుడు చెప్పబోతున్నది సినిమా డ్యాన్స్ గురించి. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత జంటగా ‘రంగస్థలం’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తునారు. కొంత టాకీ, సాంగ్స్ మినహా సినిమా పూర్తయింది. ఈ నెలాఖరుకల్లా టాకీ పార్ట్‌ని పూర్తి చేయాలనుకుంటున్నారు. డిసెంబర్లో డ్యాన్సులు... అదేనండీ సాంగ్ షూట్ మొదలుపెడతారు. జస్ట్ టూ వీక్స్‌లో పాటల చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నారు. సో.. ఇయర్ ఎండింగ్‌కి చరణ్ ఫ్రీ అయిపోతారన్న మాట. మరి.. న్యూ ఇయర్‌ని ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారో? అవుటాఫ్ కంట్రీ వెళతారో చూడాలి. ఎందుకంటే 2016కి గుడ్‌బై చెప్పి, 2017కి వెల్కమ్ చెప్పేటప్పుడు రామ్‌చరణ్ తన వైఫ్ ఉపాసనతో కలసి స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. అక్కడే న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయానికి మహేశ్‌బాబు తన భార్యాపిల్లలు నమ్రత, గౌతమ్, సితారలతో స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. వీళ్లందరూ కలసి పార్టీ చేసుకున్నారు. అన్నట్లు.. ‘రంగస్థలం’లో కొన్ని సీన్స్‌కి సంబంధించిన రష్‌ని చిరంజీవి, రాజమౌళి చూశారట. అవుట్‌పుట్ బ్రహ్మాండంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారట. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. -
మగధీరుడి గుర్రపుస్వారీ
మగధీర... సినిమా వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. అయినా... అందులో రామ్‌చరణ్ (చెర్రీ) గుర్రపుస్వారీ చేస్తూ చేసిన ఫైట్స్ ప్రేక్షకులకు ఇంకా గుర్తే! అంత త్వరగా మర్చిపోలేరులెండి! చెర్రీ కూడా మర్చిపోలేదు... హార్స్ రైడింగ్నీ, ‘మగధీర’లో హార్స్నీ! వీలున్నప్పుడు ఆ గుర్రంపై సరదాగా కాసేపు షికారుకు వెళ్తున్నారు. ‘మగధీర’లో రామ్‌చరణ్ రైడ్ చేసిన గుర్రం పేరు బాద్షా. సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుర్రాన్ని ఇంటికి తెచ్చుకుని ‘కాజల్’ అని పేరు పెట్టుకున్నారు. నిన్న (ఆదివారం) కాజల్‌పై కాసేపు షికారు చేశారు. ఆ ఫొటోలను చెర్రీ సతీమణి ఉపాసన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘‘రామ్‌చరణ్ ఈ వీకెండ్‌ని ‘మగధీర’లోని ఓల్డ్ ఫ్రెండ్‌తో స్పెండ్ చేస్తున్నాడు’’ అని ఉపాసన పేర్కొన్నారు. చిన్నప్పట్నుంచి చెర్రీకి హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన దగ్గర కాజల్‌తో పాటు మరికొన్ని గుర్రాలున్నాయి. ఇక, సినిమాల సంగతికొస్తే... ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రంగస్థలం’లో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఉందండీ బాబూ...
ఉందా? లేదా? రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వచ్చిన వార్త నిజమా? కాదా? అసలు ఆ సినిమా ఉందా? లేదా? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో సాగుతోంది. ఇక, ఆ చర్చ అవసరంలేదు. ఎందుకంటే ఈ సినిమా ఉందండి బాబూ. త్వరలో ఆరంభం కానుంది. ముహూర్తం కూడా పక్కాగా ఫైనలైజ్ చేసేశారు. డిసెంబర్లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాలను కుంటున్నారు. అది కూడా 15వ తేదీ తర్వాత. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. రామ్‌చరణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే... 1985 నేపథ్యంలో ‘రంగస్థలం’ రూపొందుతోంది. ఆ కాలాన్ని తలపించేలా హైదరాబాద్‌లో విలేజ్ సెట్ వేసిన విషయం తెలిసిందే. ఇక్కడ మీరు చూస్తోన్న ఫొటో ఆ సెట్‌కి సంబంధించినదే. ప్రస్తుతం ఆ సెట్లో ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో తీస్తున్న ఈ రిస్కీ ఫైట్‌ను రామ్‌చరణ్ అద్భుతంగా చేస్తున్నారని చిత్రబృందం అంటోంది. ఈ ఫైట్ ఎపిసోడ్లో సమంత కూడా కనిపిస్తారు. మరి.. తన వంతుగా విలన్లకు కోటింగ్ కూడా ఇస్తారా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. గురువారం ఈ చిత్రానికి సంబంధిచిన ఓ పోస్టర్ హల్చల్ చేసింది. చిత్రబృందం అఫీషియల్‌గా విడుదల చేసిన పోస్టర్ కాకపోవడంతో.. ఇది ‘ఫ్యాన్ మేడ్ పోస్టర్’ అయ్యుంటుందేమో. అన్నట్లు... నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక.. ‘రంగస్థలం’ సెట్లోకి సమంత ఎంటర్ కావడం ఇదే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
రైడ్ విత్ మిస్టర్ సి!
హూ ఈజ్ మిస్టర్ సి? మిస్టర్ సి ఎవరు? రామ్‌చరణ్! ఆయన సతీమణి ఉపాసన ముద్దుగా పిలుచుకునే పేరు అది. ఇద్దరూ కలసి రైడ్‌కి వెళ్లారు. ఎక్కడ? ఓ హిల్ స్టేషన్లో (పేరు వద్దు. మళ్లీ అభిమానులందరూ అక్కడికి క్యూ కట్టేస్తారు!). రైడ్ అంటే ఏదో రేసింగ్ కార్స్ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఫొటోలో చూస్తున్నారుగా... ఆ యాక్ (జడల బర్రె) పైన చరణ్ రైడ్‌కి వెళ్లారు. ఉపాసన యాక్ని తాడుతో తీసుకెళ్లారు. ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన ‘టేకింగ్ మిస్టర్ సి ఫర్ ఏ రైడ్’ అని పేర్కొన్నారు. నెట్టింట్లో ఈ ఫొటోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎందుకు రాదు? అంత పెద్ద స్టార్ హీరో ఇటువంటి రైడ్‌కి వెళ్లడం సో స్పెషల్ కదా!! -
కొంచెం టర్నింగ్ ఇచ్చుకోమ్మా!
చూశారా..! అదేనండి ‘రంగస్థలం’ సినిమాలో సమంత లుక్‌ని చుశారా? అని ఎవర్నైనా అడిగితే.. చూడలేదనే చెప్తారు. అఫ్కోర్స్ యూనిట్ సభ్యులకు ఆమె లుక్ తెలుసనుకోండి. ఈ సినిమాలో సమంత పల్లెటూరి పిల్లలా కనిపిస్తారని తెలుసు. ఆ లుక్‌లో ఆమె ఎంత అందంగా ఉంటారో కూడా ఊహించవచ్చు. కానీ, ఊహల్లో చూడ్డంకన్నా అసలైన లుక్ ఏంటో బయటపెడితే చూడాలని ఉంటుంది కదా. అందుకే జూలై నెలలో రాజమండ్రిలో ‘రంగస్థలం’ సినిమా షూట్ జరిగినప్పుడు సమంత ఓ లుక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పుడు ‘కొంచెం టర్నింగ్ ఇచ్చుకోమ్మా’ అని చాలామంది అన్నారు. అందులో సమంత ఫేస్ కనిపించలేదు. ఇప్పుడు కూడా సమంత బ్యాక్ లుక్ బయటికొచ్చింది. సాగర తీరాన దీర్ఘాలోచనలో నిలబడ్డారు. కొందరు నెటిజన్లు ఇది సమంత లుక్ అని అంటుంటే.. మరికొందరు కాదేమో అంటున్నారు. ఏదేమైనా సమంత లుక్‌ని చూసేందుకు ఇంకా టైమ్ ఉంది. మరి.. చిత్రదర్శకుడు సుకుమార్ లుక్ రిలీజ్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారో? రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ ‘రంగస్థలం’ కోసం ఇటీవల ఓ పాట చిత్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్‌ని స్టార్ట్ చేయనున్నారు. -
రంగస్థలంలో పండగొచ్చింది!
పండగ అంటే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి పండగల్లా కాదండోయ్! అచ్చ తెలుగు పండగ... అందరూ కలసి చేసుకునే పండగ! చేతుల్లో సెల్లులు లేవ్. మనసుల్లో ముసుగులు లేవ్. మనుషులంతా మంచిగా చేసుకున్న ఆ పండగ ఎలా ఉందో... చూడాలంటే రామ్‌చరణ్ ‘రంగస్థలం’ విడుదల కావాల్సిందే. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నెనీ నవీన్, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘రంగస్థలం’. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్లో పండగ నేపథ్యంలో వచ్చే పాటను చిత్రీకరిస్తున్నారు. 1985వ సంవత్సరం నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. అప్పట్లో జాతరలు ఎలా జరిగేవో... ఇందులో చూడొచ్చన్న మాట! ఈ పాట చిత్రీకరణ పూర్తయ్యాక, వారం రోజుల విరామం తీసుకుని, మళ్లీ ఫ్రెష్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట! సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. -
ఎయిటీస్ రంగస్థలంలో రెట్రో రామ్‌చరణ్
పెంకుటిల్లు.. గుమ్మంలో మట్టికుండలు.. గోల్డ్‌స్పాట్ కూల్ డ్రింకులు.. గోడలపై సినిమా పోస్టర్లు.. గోడలో అటకలు.. గోలీసోడాలు... బ్యాక్ టు ఎయిటీస్‌కి వెళితే ఎలాగుంటుందో? ఓసారి ఊహించుకోండి! వెళితే? ఎయిటీస్లోకి వెళ్లగలిగితే? బాగుంటుంది. కానీ, ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయని అనుకుంటున్నారా? రామ్‌చరణ్ ‘రంగస్థలం’లో! సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా 1980 నేపథ్యంలోని కథతో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎయిటీస్‌లో కథ అయితే సరిపోతుందా? ప్రతి సన్నివేశంలోనూ అప్పటి వాతావారణం ప్రతిబింబించాలి కదా! అందుకే, 5 కోట్లతో హైదరాబాద్‌లో 80లలో గోదావరి జిల్లాల్లో పల్లెలు ఎలా ఉండేవో? అలాంటి సెట్ వేశారు. అదెలా ఉందో చెప్పడానికి జస్ట్ సాంపిల్... ఇన్సెట్లో ఫొటోలు! ‘‘విలేజ్ సెట్స్ చిన్ననాటి జ్ఞా³కాలను గుర్తు చేశాయి. ‘రంగస్థలం’ కు థాంక్యూ’’ అని రామ్‌చరణ్ ఫేస్బుక్లో పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీయమ్) నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. డిసెంబర్‌కి చిత్రీకరణ అంతా పూర్తి చేయాలని అనుకుంటున్నారట! హీరోయిన్గా సమంత, స్పెషల్ సాంగులో పూజా హెగ్డే కనిపించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
డిసెంబర్లో ముహూర్తం... దసరాకు వచ్చేస్తాం!
మాస్... రామ్‌చరణ్ మాంచి మాస్ హీరో! మాస్... బోయపాటి శ్రీను ఊర మాస్ దర్శకుడు! వీళ్లిద్దరూ కలసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహల్లో బొమ్మేసుకోండి! ఎందుకంటే... ఈ బొమ్మ వచ్చే ఏడాది దసరాకు థియేటర్లలోకి వచ్చేస్తుందట! థియేటర్లలోకి బొమ్మ రావాలంటే... ముందు రామ్‌చరణ్, బోయపాటి కాంబినేషన్ ఓకే కావాలి, సినిమాకి కథ కుదరాలి, తర్వాత కొబ్బరికాయ కొట్టాలి, సెట్స్‌పైకి వెళ్లాలి కదా. బోలెడు తతంగం ఉందిలే అనుకుంటున్నారా? చెర్రీ (రామ్‌చరణ్), బోయపాటిలు ఆల్రెడీ ఆ ప్లానింగులోనే ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్! డిసెంబర్లో సిన్మాను ప్రారంభించాలనుకుంటున్నారట. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తారట! ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ షూటింగ్ డిసెంబర్‌కి పూర్తవుతుంది. వెంటనే... బోయపాటి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది విజయదశమికి విడుదల చేయాలనుకుంటున్నారు. బోయపాటి శ్రీను సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా చేయనున్నారు. -
రంగస్థలంలో రసమలై
రోటీ, పన్నీర్ కర్రీ, మాంచి మటన్ బిర్యానీ, చికెన్ పకోడీ.... మెనూలో నోరూరించే ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నా, చివర్లో చిన్న స్వీట్ (ఫర్ ఎగ్జాంపుల్.. రసమలై) తింటే వచ్చే కిక్కు కొంచెం స్పెషల్! ఎందుకంటే... అదంతే! సినిమాల్లోనూ అందమైన ప్రేమకథ, అనుబంధాలు, యాక్షన్–సెంటిమెంట్ సీన్స్, మెలోడీలు ఎన్ని ఉన్నా, స్పెషల్ సాంగులు ఆడియన్స్‌కి కొంచెం ఎక్స్ట్రా కిక్ ఇస్తాయి. ‘రంగస్థలం’లో అటువంటి కిక్ ఇచ్చేందుకు పూజా హెగ్డే రెడీ అవుతున్నారు. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీయమ్) నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగులో చరణ్‌తో స్టెప్పులేయనున్నారు. ఈ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ మాంచి మాసీ ట్యూన్ రెడీ చేశారట. సుకుమార్–దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఐటమ్ సాంగులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ! దాంతో ప్రేక్షకుల్లో ఈ పాటపై ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి. చరణ్ మంచి డ్యాన్సర్. ‘దువ్వాడ జగన్నాథమ్’లో పూజా కూడా డ్యాన్స్ బాగా చేశారు. సో, ‘రంగస్థలం’లో ఇద్దరూ ఎంతలా ఇరగదీస్తారో!! -
బతుకుమ్మ పాటకు డ్యాన్స్ చేసిన చెర్రీ
-
రంగస్థలంపై చిరు!
నిజమే! రామ్‌చరణ్ ‘రంగస్థలం’పైకి చిరంజీవి వచ్చారు. అయితే... ఆయనొచ్చింది ‘రంగస్థలం’పైకి మాత్రమే, సిన్మాలోకి కాదు. అదేంటి? అందులో తేడా ఏంటి? అనుకుంటు న్నారా! నిన్న (బుధవారం) హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రంగస్థలం’ షూటింగ్‌కి చిరంజీవి వెళ్లారు. సెట్స్‌పై కాసేపు సందడి చేశారు. అంటే... ‘రంగస్థలం’పై చిరు కాసేపు ఉన్నట్టే కదా! చిరూతో పాటు దర్శకుడు రాజమౌళీ సేమ్ టైమ్‌లో ‘రంగస్థలం’ సెట్స్‌కి వెళ్లారు. ఇటీవలే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తండ్రీకొడుకులు చిరు, చరణ్‌లకు ఓ కథ రాయాలనుందనీ, ఆ కథను రాజమౌళే డైరెక్ట్ చేయాలనుందనీ ఆయన మనసులో మాటను చెప్పారు. బహుశా... ఆ సినిమా విషయం ఏమైనా చర్చకు వచ్చిందంటారా? వెయిట్ అండ్ సీ!! -
పంచాయితీ తప్పలేదు!
‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌కు పంచాయితీకి వెళ్లక తప్పలేదు! ఇప్పుడంటే పోలీసులు, కోర్టులు, హ్యూమన్ రైట్స్ కమీషన్లు... ఇలా న్యాయం కోసం ప్రజలు ఎక్కే మెట్లు బోలెడు. అప్పట్లో చాలా సమస్యలు, గొడవలను పంచాయితీల్లోనే పెద్దలు పరిష్కరించేవారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో! అప్పట్లో అంటే 20, 30 ఏళ్ల క్రితం! సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రకథా నేపథ్యమంతా 1985వ సంవత్సరమే. అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా ప్రేమ, ద్వేషం, స్వార్థం అంశాలను మేళవించి కమర్షియల్ పంథాలో సుకుమార్ కథను రాసుకున్నారు. కథ ప్రకారం పల్లెటూరి పంచాయితీ, అందులో సన్నివేశాలు సినిమాకు కీలకమట! ఓ రకంగా చెప్పాలంటే... కథలో కొంత భాగం పంచాయితీ చుట్టూ నడుస్తుందట! మరి, చరణ్ పంచాయితీకి ఎందుకు వెళ్లారో, ఎవరితో గొడవపడ్డారో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీయమ్) నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట!