
హూ ఈజ్ మిస్టర్ సి? మిస్టర్ సి ఎవరు? రామ్‌చరణ్! ఆయన సతీమణి ఉపాసన ముద్దుగా పిలుచుకునే పేరు అది. ఇద్దరూ కలసి రైడ్‌కి వెళ్లారు. ఎక్కడ? ఓ హిల్ స్టేషన్‌లో (పేరు వద్దు. మళ్లీ అభిమానులందరూ అక్కడికి క్యూ కట్టేస్తారు!). రైడ్ అంటే ఏదో రేసింగ్ కార్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. ఫొటోలో చూస్తున్నారుగా... ఆ యాక్ (జడల బర్రె) పైన చరణ్ రైడ్‌కి వెళ్లారు. ఉపాసన యాక్‌ని తాడుతో తీసుకెళ్లారు. ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన ‘టేకింగ్ మిస్టర్ సి ఫర్ ఏ రైడ్’ అని పేర్కొన్నారు. నెట్టింట్లో ఈ ఫొటోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎందుకు రాదు? అంత పెద్ద స్టార్ హీరో ఇటువంటి రైడ్‌కి వెళ్లడం సో స్పెషల్ కదా!!
Comments
Please login to add a commentAdd a comment