Megastar Chiranjeevi To Arrange Huge Party For Grand Daughter Birth, Deets Inside - Sakshi
Sakshi News home page

మెగా ప్రిన్సెస్‌ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?

Published Thu, Jun 22 2023 3:41 PM | Last Updated on Thu, Jun 22 2023 4:52 PM

Chiranjeevi Huge Party For Grand Daughter Birth - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌- ఉపాసనల దంపతులకు జూన్‌ 20న పండంటి పాప పుట్టింది. చిరంజీవికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజే చిన్నారి జన్మించడంతో సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన చరణ్‌ దంపతులకు బంధుమిత్రులు, సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్‌?)

మెగా ప్రిన్సెస్‌ రాకతో వారి కుటుంబానికి బాగా కలిసి వస్తుందని పలు జ్యోతిష్యులు చెప్పారని చిరు తెలిపారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని ఇండస్ట్రీలోని తన స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు వారందరికీ  ఒక మెగాపార్టీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.  దీంతో ఈ సెలెబ్రేషన్స్ ఒక రేంజ్‌లో ఉండబోతున్నట్లు సమాచారం. 

మరో వైపు మెగా ప్రిన్సెస్‌కు ఎలాంటి పేరు సెలక్ట్‌ చేస్తారని సోషల్‌మీడియాలో ఆరాతీస్తున్నారు.  మెగాస్టార్‌కు ఇద్దరు కూతుళ్ళకు చెరో ఇద్దరు అమ్మాయిలు ఉండగా ఇప్పుడు రామ్ చరణ్‌కు కూడా కుమార్తె జన్మించింది. ప్రస్తుతం చిరుకి ఐదుగురు మనవరాళ్లు అయ్యారు.

(ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్‌పిక్ మార్చేసిందిగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement