celabrations
-
చిత్రకూట్ దీపావళి వేడుకల్లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!
అయోధ్య తర్వాత అంతటి ఘన చరిత్ర కలిగిన మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో దీపావళి మేళా ప్రారంభమయ్యింది. ఇది ఐదు రోజుల పాటు జరగనుంది. దీపావళి సందర్భంగా లక్షలాది మంది భక్తులు చిత్రకూట్‌కు చేరుకున్నారు. భక్తులు మందాకినీ నదిలో స్నానం చేసి, మాతగజేంద్ర నాథ్ ఆలయంలో జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే కామతానాథ్ స్వామిని దర్శించుకుని, పంచకోసి పర్వతం కమదగిరికి ప్రదక్షిణలు చేస్తున్నారు. లంకా విజయం తర్వాత శ్రీరాముడు చిత్రకూట్‌లో దీపాలను దానం చేశాడని స్థానికులు చెబుతారు. ఈ నేపధ్యాన్ని పురస్కరించుకుని చిత్రకూట్‌లో దీపావళి మేళా నిర్వహిస్తుంటారు. ఈసారి చిత్రకూట్ దీపావళి మేళాకు అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. 25 కిలోమీటర్ల పరిధిలో ఈ మేళాను ఏర్పాటు చేశారు. కామదగిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో తోపులాట చోటుచేసుకుని పలువురు గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడిన భక్తులకు వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు చిత్రకూట్‌లో దీపదానాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసింది. మేళా ప్రాంతంలో పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు! -
దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు!
దేశవ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పిల్లాపెద్దా అంతా ఉత్సాహంగా వేడుకల్లో మునిగితేలారు. పటాకుల మోతతో దేశంలోని వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఆకాశం అద్భుత కాంతులతో వెలిగిపోయింది. ఇదిలావుండగా దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం పలు ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన దీపావళినాడు ప్రతి ఇంటా తప్పనిసరిగా లక్ష్మీ పూజలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి చెందిన ఒక రొబోటిక్ కంపెనీ విచిత్ర రీతిలో దీపావళి వేడుకలు నిర్వహించింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి రోబో చేతులు మీదుగా హారతులిప్పించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా’ సోషల్‌మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియోను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి! Delhi based robotics company Orangewood's unique Diwali celebration. pic.twitter.com/eW6vafKOqH — Indian Tech & Infra (@IndianTechGuide) November 12, 2023 -
మెగా ప్రిన్సెస్ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసనల దంపతులకు జూన్ 20న పండంటి పాప పుట్టింది. చిరంజీవికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజే చిన్నారి జన్మించడంతో సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన చరణ్ దంపతులకు బంధుమిత్రులు, సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్?) మెగా ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబానికి బాగా కలిసి వస్తుందని పలు జ్యోతిష్యులు చెప్పారని చిరు తెలిపారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని ఇండస్ట్రీలోని తన స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు వారందరికీ ఒక మెగాపార్టీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సెలెబ్రేషన్స్ ఒక రేంజ్లో ఉండబోతున్నట్లు సమాచారం. మరో వైపు మెగా ప్రిన్సెస్‌కు ఎలాంటి పేరు సెలక్ట్ చేస్తారని సోషల్‌మీడియాలో ఆరాతీస్తున్నారు. మెగాస్టార్‌కు ఇద్దరు కూతుళ్ళకు చెరో ఇద్దరు అమ్మాయిలు ఉండగా ఇప్పుడు రామ్ చరణ్‌కు కూడా కుమార్తె జన్మించింది. ప్రస్తుతం చిరుకి ఐదుగురు మనవరాళ్లు అయ్యారు. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్పిక్ మార్చేసిందిగా!) -
విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల మైదానం కల్చరల్ ఫెస్ట్ (ఫొటోలు)
-
విజయనగరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
వైజాగ్ లో ఘనంగా ముగిసిన నేవీ డే వేడుకలు
-
ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు
-
యానాం లో ఘనంగా మత్స్యకార దినోత్సవ వేడుకలు
-
జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో మంత్రి రోజా సందడి
-
రష్యాను పూర్తిగా తరిమేస్తాం: జెలెన్స్కీ
మైకోలైవ్ (ఉక్రెయిన్): ఖెర్సన్ నుంచి రష్యా వైదొలగడాన్ని ఉక్రెయిన్ పండుగ చేసుకుంటోంది. ఆ ప్రాంత వాసులంతా తమ సైనికులను హర్షాతిరేకాల నడుమ స్వాగతిస్తూ వారిని ఆలింగనం చేసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటున్నారు. ఖెర్సన్‌లో నగరమంతా కలియదిరుగుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ విజయోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ‘‘రష్యా సేనలను దేశమంతటి నుంచీ తరిమేసి తీరతాం. అనేక ప్రాంతాల్లో మా సేనలకు సొంత పౌరుల నుంచి త్వరలో ఇలాంటి మరెన్నో స్వాగతాలు లభించనున్నాయి’’ అన్నారు. పడిపోయిన కరెంటు స్తంభాలు, ధ్వంసమైన తాగునీరు తదితర మౌలిక వసతులు. ఎక్కడ పడితే అక్కడ మృత్యుఘంటికలు విన్పిస్తున్న మందుపాతరలు. ఇవీ... ఖెర్సన్‌కు వెళ్లే ప్రాంతాల్లో దారి పొడవునా కన్పిస్తున్న దృశ్యాలు. రష్యా సేనల విధ్వంసకాండకు ఇవి అద్దం పడుతున్నాయి. నగరవాసులు తిండి, నీరు, మందులకు అల్లాడుతున్నారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉక్రెయిన్ అధికార వర్గాలు శాయశక్తులా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఖెర్సన్ బాటలోనే ఖఖోవా జిల్లా నుంచి కూడా రష్యా తప్పుకుంటోంది. అక్కడి నుంచి తమ అధికారులు తదితరులను మొత్తంగా వెనక్కు పిలిపిస్తున్నట్టు స్థానిక రష్యా పాలక వర్గం పేర్కొంది. ఉక్రెయిన్ దాడులకు లక్ష్యం కారాదనే ఈ చర్య తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. -
మునుగోడు లో టీఆర్ఎస్ విజయం.. కార్యకర్తల సంబరాలు
-
జర్మనీలో అంగ రంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం
-
థియేటర్లో బాణాసంచా పేల్చిన ప్రభాస్ అభిమానులు
-
వైఎస్ఆర్ జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
-
హైదరాబాద్ : ఈనెల 11 నుంచి 15 వ తేదీ వరకు శ్రీవారి వైభవోత్సవాలు
-
అట్టహాసంగా 90వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు
-
అమెరికాలో " గాడ్ ఫాదర్ " సక్సెస్ సెలబ్రేషన్స్
-
దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగిన దేవి నవరాత్రి ఉత్సవాలు
-
ఇంటింటా దసరా...
-
విజయాలనిచ్చే విజయదశమి...
-
విజయవాడ : రేపు ఇంద్రకీలాద్రికి సీఎం వైఎస్ జగన్
-
పండగ వేళ : మూడవ రోజు గాయత్రీ అలంకారంలో అమ్మవారు
-
ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శరన్నవరాత్రులు
-
పది రోజులపాటు పది అవతారాల్లో దుర్గాదేవి
-
" వరల్డ్ టూరిజం డే " వేడుకలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సంబరాలు
-
గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా బాలయ్య భార్య వసుంధరతో కలిసి తన సోదరి పూరందేశ్వరి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ప్రకాశంలో జిల్లాలోని కారంచేడులో భోగి సంబరాలు జరుపుకున్న బాలయ్య ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాలయ్య గుర్రం ఎక్కి హంగామా చేశారు. అంతేగాక గుర్రంతో కలిసి ఆయన స్టెప్పులు వేయించారు. కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ ఏడాది భోగి పండగను తన అక్క ఇంట్లో జరుపుకోవడం కోసం బాలకృష్ణ తన భార్య తో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. ఇక బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన బంధువులు గురువారం కారంచేడుకు చేరుకున్నారు. బాలకృష్ణను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు. -
నాన్న.. ప్రతీ బిడ్డను వెంటాడే ఓ ఎమోషన్
కని పెంచేది అమ్మ. అవసరాలను తీర్చేది నాన్న. నడకలో ప్రతీ అడుగు ముందుండే వ్యక్తి నాన్నే. నాన్నంటే ప్రతీ బిడ్డకు తప్పు చేస్తే దండిస్తాడనే ఒక భయం. కానీ, ఎలాంటి ఆపదలోనైనా అండగా ఉండే ధైర్యం కూడా. స్వార్థం లేని తల్లిదండ్రుల ప్రేమకు.. ప్రతీరోజూ రుణం తీర్చుకున్నా తప్పులేదు. కానీ, ప్రత్యేకంగా ఒకరోజు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో జూన్ మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా జరుపుతున్నారు. అలా ఈ జూన్ 20 ‘నాన్నకు ప్రేమతో..’ అంకితమైంది. యూరప్ నుంచి యూరోపియన్, అమెరికన్ చర్చి సంస్కృతుల్లో పూర్వీకులకు గౌరవించుకోవడమనే సంప్రదాయం ఉండేది. ఇందుకోసం మధ్యయుగకాలంలో సెయింట్ జోసెఫ్స్ డే(మార్చి 19న) నిర్వహించేవాళ్లు. ప్రపంచంలో మదర్స్ డే సంబురాలు మొదలయ్యాక. తండ్రులకు అలాంటి ఒకరోజు ఉండాలనే ఆలోచన నుంచి ఫాదర్స్‌డే పుట్టింది. దీనివెనకాల ఓ కథ ప్రచారంలో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫాదర్స్ డే కథ.. అమెరికా నుంచి పుట్టిందనే కథనం ఒకటి వినిపిస్తుంటుంది. సేవలకు గుర్తింపుగా సొనోరా స్మార్ట్ డొడ్డ్ అనే యువతి తన తండ్రి సేవలకు గుర్తింపుగా.. ఆయన పుట్టినరోజును ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంది. ఆ అమ్మాయి టీనేజీలో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. సోనొరా తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ మిలిటరీలో పని చేస్తాడు. తల్లిని పొగొట్టుకున్న సొనోరా, తండ్రి జాక్సన్‌తో కలిసి ఐదుగురు తమ్ముళ్లను పెంచి పెద్ద చేస్తుంది. తమ కోసం సుఖాలు త్యాగం చేసిన ఆ తండ్రిని సొనోరా సన్మానించి గౌరవిస్తుంది. తండ్రి పడ్డ శ్రమకు గుర్తుగా ఆమె.. ఆయన పుట్టినరోజు జూన్5ను ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంది. అలా ఒక తండ్రి త్యాగానికి బిడ్డ ఇచ్చిన గౌరవాన్ని ప్రపంచం మెచ్చుకుంది. తండ్రికి గౌరవంగా ఒకరోజు ఉంటే తప్పులేదని అంగీకరించింది. మూడో ఆదివారం అప్పటికే అమెరికాలో అమలులో ఉన్న జులై 5వ తేదీని.. ముందుకు జరిపింది. అలా జూన్ 5న ఫాదర్స్ డే మొదలైంది. చివరకు 1972లో ప్రెసిడెంట్ నిక్సన్.. ఏటా జూన్ మాసంలో మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా ప్రకటిస్తూ అధికార పత్రంపై సంతకం చేశాడు. 111 దేశాలు పాటిస్తున్న ఈ రోజును అనధికారికంగానే ఫాదర్స్ డేగా నిర్వహించుకుంటున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం సంవత్సరంలో.. వేర్వేరు రోజుల్లో ఫాదర్స్ డేను జరుపుతున్నాయి. రష్యా, బెలారుస్లు ఫిబ్రవరి 23న ఫాదర్స్ డే గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాయి. అక్కడ మాత్రం ఇక ఒక సంవత్సరం చివర్లో ఫాదర్స్ డేను నిర్వహించేది బల్గేరియా(డిసెంబర్ 26). మనతో సహా చాలావరకు దేశాలు మాత్రం జూన్ మూడో ఆదివారంరోజునే ఫాదర్స్ డేగా స్వీకరించాయి. కొన్ని దేశాల్లో ఫాదర్స్ డే సెలవు రోజుకాగా.. మరికొన్ని దేశాల్లో అప్రకటిత సెలవుగా కొనసాగుతోంది. ఏమివ్వగలం ? నిరంతర శ్రామికుడిగా పేరున్న తండ్రికి.. ఆయన్ని గౌరవించుకునే రోజున ఏం ఇవ్వగలం? వాట్సాప్‌లో స్టేటస్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫొటో, ఫేస్బుక్లో పోస్ట్తోనో, కాస్ట్లీ గిఫ్ట్‌లతో సంతోషపెట్టగలమేమో. కానీ, ఆ నిస్వార్థమైన ప్రేమను మాత్రం వెలకట్టలేం. అందుకే ఆ తండ్రి స్పర్శను.. అపారమైన ప్రేమను గుర్తు చేసుకుని సంతోషంగా గడుపుదాం. -
ప్రజా భాగస్వామ్యమే కేంద్రంగా ‘75 ఏళ్ల ఉత్సవాలు’
న్యూఢిల్లీ: స్వాతం త్య్రం సిద్ధించి వచ్చే ఏడాదికి 75 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో అసాధ్యమనుకున్న కొన్ని లక్ష్యాలను సు సాధ్యం చేసేందుకు దేశం కొన్ని సాహ సోపేత నిర్ణయాలు తీసుకోనుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యమే కేంద్రంగా 75 ఏళ్ల ఉత్సవాలు సాగాలని ఆయన నొక్కి చెప్పారు. ‘75 ఏళ్ల స్వతంత్ర భారతావని’ని పురస్కరించుకుని జరిపే ఉత్సవాలకోసం ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన 259 మంది సభ్యుల ఉన్నతస్థాయి జాతీయ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, 1947 నుంచి దేశం సాధించిన ఘనతను ఈ ఉత్సవాలు ప్రతిబింబించాలన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు నివాళులర్పించాలని కోరారు. ఈ కార్యక్రమాలను ‘స్వాతంత్య్ర పోరాటం, 75 ఏళ్ల ఆదర్శాలు, 75 ఏళ్ల విజయాలు, 75 ఏళ్ల కార్యాచరణ, 75 ఏళ్ల సంకల్పం’అనే ఐదు ఉప శీర్షికల కింద విభజించాలని సూచించారు. ఈ ఉత్సవాలకు ప్రజా భాగస్వామ్యంతో జరిపే ఏర్పాట్లు 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆలోచనలు, భావనలు, సూచనలు, కలలే కేంద్రంగా సాగాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి సూచనలు, సలహాలు ఇచ్చిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని దేవెగౌడ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ నేత ఖర్గే, బీజేపీ చీఫ్ నడ్డా తదితరులున్నారు. ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో వారానికొక ప్రత్యేక కార్యక్రమం చొప్పున 75 కార్యక్రమాలను చేపడతారు. దేశ వ్యాప్తంగా ఉన్న 75 చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలను, నిర్మాణాలను ఎంపిక చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 12న గుజరాత్ నుంచి ప్రధాని మోదీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రారంభించనున్నట్లు గుజరాత్ సీఎం రూపానీ వెల్లడించారు. నారీశక్తికి ఇవే నిదర్శనాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రధాని మోదీ వినూత్నంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మహిళల వ్యాపారదక్షత, సృజనాత్మకత, భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పలు ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ‘నారీశక్తి’ హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్లో ఆయా ఉత్పత్తుల విశిష్టతను వివరించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు మహిళలు ముందు వరుసలో నిలిచారని ట్విట్టర్లో కొనియాడారు. మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
గిరి సీమల్లో భోగి సందడి
సాక్షి, ఆసిఫాబాద్: కనుల విందు చేసే గుస్సాడీల కోలాహలం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో అనేక ఆదివాసీ గ్రామాల్లో భోగి పండుగలను నిర్వహించుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని గిరి సీమలు దండారీలకు ముస్తాబయ్యాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న దండారీ ఉత్సవాలకు గుస్సాడీలకు కావాల్సిన పరికరాలకు పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవంలో ఊరుఊరంతా పాల్గొంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1386 గిరిజన గ్రామాలుండగా.. 1208 గ్రామాల్లో దండారీ ఉత్సవాలు కొనసాగుతాయి. కెరమెరి మండంలోని సాకడ(బి)లో ఏత్మాసార్ పేన్కు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆ నైవేద్యాన్ని ఆరగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటి నుంచి దండారీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చదవండి: విజయశాంతి ప్రకటన.. కాంగ్రెస్‌లో కలకలం -
సింగపూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు
సింగపూర్: సింగపూర్‌లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్, టాస్-మనం తెలుగు వారి సహకారంతో అంగరంగ వైభవంగా శనివారం బతకమ్మ సంబరాలు జరిగాయి. ఈ పండుగను సింగపూర్ తెలుగు సమాజం వారు సుమారు 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా ప్రతీ ఏడాది నిర్వహిస్తోంది. కరోనా కోరల్లో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు వారందరి క్షేమం మేరకు ప్రత్యేక ఉద్దేశంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలను సాంఘిక మాధ్యమాల ద్వారా జరిపారు. కోవిడ్-19 నిబంధనలు కారణంగా, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఐదుగురు-ఐదుగురు సమూహంగా జూం యాప్ ద్వారా, అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు సింగపూర్ నలువైపులా నుంచి ఆటపాటలతో, కోలాటాల విన్యాసాలతో సద్దుల బతుకమ్మ సంబరాలలో ఆనందంగా పాల్గొని వేడుక జరుపుకున్నారు. క్లిష్ట సమయంలో సైతం పండుగ శోభ ఏమాత్రం తగ్గకుండా రకరకాల పువ్వులతో అనేక రంగురంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు అందరినీ అలరించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జూమ్ యాప్ ద్వారా ఈ వేడుకను ఉద్ధేశించి మాట్లాడారు. కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా సింగపూర్‌లోని తెలుగు వారు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె బతుకమ్మ పండుగ విశిష్టతను ఆంతర్యాన్ని వివరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ... మనిషి ప్రకృతితో మమేకమయ్యే పండుగలలో అతి పెద్దదైన ఈ బతుకమ్మ పూల పండుగ ఘనమైన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. వెయ్యి సంత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ పండుగను సింగపూర్‌లో సాంప్రదాయబద్ధంగా పెద్దఎత్తున నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారందికీ ఈ సందర్భంగా తెలుగు సమాజం తరుపున ఆయన బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ తెలంగాణా ఫ్రెండ్స్ తరుపున కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున పండగ చేసుకొనే మనం ప్రత్యేక పరిస్ధితులలో జూమ్ ద్వారా కూడా అట్టహాసంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. టాస్- మనం తెలుగు తరుపున అనితా రెడ్డి మాట్లాడుతూ... ప్రాంతాలు, మాండలికాలు వేరైనా అందరం కలసికట్టుగా, సంసృతి సాంప్రదాయాలతో పాటు బంధాలు తెలిపే పండుగ ఈ బతుకమ్మ అని తెలియజేశారు. చివరగా ఈ కార్యక్రమం నిర్వహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్న మాట్లాడుతూ... ఆన్ లైన్ ద్వారా ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా పాల్గొన్నారని చెప్పారు. అదే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేశామన్నారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు, సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్ సభ్యులు, టాస్ - మనం తెలుగు వారికి , స్పాన్సర్లకు కార్యదర్శి సత్యచిర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా గురు పూజా మహోత్సవాలు
-
ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా!
మన జీవితం ఎలా ఉండాలో కలలు కంటూ.. ఆ జీవితాన్ని మనకు ఇవ్వడానికి కష్టపడే వ్యక్తి తండ్రి ఒక్కరే. మనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నిత్యం పరితపించే తండ్రికి మనం తిరిగి ఎదైనా ఇచ్చే రోజు ఉందంటే అది ఫాదర్స్ డే మాత్రమే. ఈ రోజు ఎలా వచ్చింది. మొదట ఏ దేశంలో దీన్ని సెలబ్రేట్ చేశారో తెలుసుకుందాం. అయితే ఫాదర్స్ డేకు కచ్చితమైన తేదీ లేదు. ప్రతి ఏడాది జూన్ మూడవ ఆదివారం జరుపుకుంటారు. అయితే అన్ని దేశాలు ఒకేరోజున ఫాదర్స్ డేను జరుపుకోవు. ఒక్కొదేశంలో ఒక్కోరోజు, ఒక్కోనెలన జరుపుకుంటాయి. అమెరికన్ సివిల్ వార్ అనుభవజ్ఞుడైన విలియం జాక్సన్ స్మార్ట్ కుమార్తె సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డేను 1910 జూన్ మూడవ ఆదివారం రోజున సెలబ్రేట్ చేసినట్లుగా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ఫాదర్స్ డే వేడుకను ప్రతి ఏడాది జరుపుకోవడం ఆనవాయితిగా మారింది. 111 దేశాలు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాలు మాత్రం సెప్టెంబర్ నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. బ్రెజిల్లో ఆగస్టు రెండవ ఆదివారం నాడు తండ్రులను ఘనంగా సత్కరిస్తారు. కావునా ఈ ఏడాది జూన్ మూడవ అదివారం (జూన్ 21)న ఫాదర్స్ డేను భారతదేశంతో పాటు మరిన్ని దేశాలు కూడా జరుపుకొనున్నాయి. నీస్వార్థంగా మీ భవిష్యత్తు కోసం పరితపించే మీ తండ్రికి ఈ ఫాదర్స్ డే ఎప్పటికీ గుర్తుండిపోయాలే మంచి బహుమతి ఇచ్చి సత్కరించండి. -
సిటీ థ్రిల్స్.. పార్టీ స్టైల్స్..
సాక్షి, సిటీబ్యూరో(రంగారెడ్డి): ఇది వింటర్ సీజన్. వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీలోని పార్టీ లవర్స్‌కి బాగా ఇష్టం. దీనికి తోడు క్రిస్మస్ మొదలుకుని సంక్రాంతి దాకా వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పార్టీల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో సిటీలో క్రేజీగా మారిన కొన్ని పార్టీల విశేషాలు... నగరంలో పార్టీలకు థీమ్‌ని జత చేయడం అనేది ఎప్పటికప్పుడు మరింత కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. నలుగురం కలిశామా తిన్నామా తాగామా తెల్లారిందా అన్నట్టు కాకుండా తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని మోడ్రన్ సిటీ ఆశిస్తోంది. అందుకని వెరైటీ స్టైల్స్ కోసం అన్వేషిస్తోంది. సిటీలో ఇప్పుడు బాగా క్రేజీగా మారిన పార్టీ స్టైల్స్‌లో... కూల్.. పూల్.. సిటీలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్న స్టార్ హోటల్స్ ఉన్నాయి. అలాగే సొంత భవనాలూ కొందరికి ఉన్నాయి. దీంతో పూల్ పార్టీ కూడా క్రేజీగా మారింది. ఈ వేడుక మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. దీనిలో భాగంగా వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ వంటివి ఉంటాయి. పూల్ పార్టీలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల థగథగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి డెస్టినేషన్.. పేషన్ ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా... ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమేటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పార్టీలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే . ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ చెప్పారు. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచ్చిన, వచ్చిన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ట్రెడిషనల్.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పార్టీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకుని రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడతాయనే ఆలోచన దీనికి కారణమన్నారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్ ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు బాగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పార్టీస్‌కి కూడా వచ్చేసింది. ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. సిటీలో చాలా మందికి పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలు, నృత్యాలు వచ్చీరాని సేద్యం కూడా చేసేసి, సహజమైన పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తన్నారు. -
సుబ్బారాయుడి షష్ఠి చూసొద్దాం రండి!
సాక్షి, బిక్కవోలు (అనపర్తి): రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్టు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జంగా వీర వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకటో తేదీ రాత్రి తెల్లవారితే రెండో తేదీ సోమవారం 1:10 గంటలకు స్వామి వారి తీర్థపు బిందె సేవతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. షష్ఠి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సోమవారం ఉదయం నుంచి సన్నాయి, బ్యాండ్ మేళాలతో సందడిగా ఉంటుంది. రాత్రికి భక్తిరంజని కార్యక్రమం, 3న స్వామివారి రథోత్సవం, 8న అన్నదానం కార్యక్రమంతో షష్ఠి ఉత్సవాలు పూర్తవుతాయి. దేదీప్యమానంగా విద్యుత్తు కాంతులు షష్టి ఉత్సవాలకు ఆలయ పరిసరాలు విద్యుత్తు దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ప్రధాన రహదారిలో సినిమా సెంటర్ నుంచి వంతెన వరకు రోడ్డుకు ఇరువైపులా ఎల్ఈడీ దీపకాంతులను ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన కూడళ్లలో దేవతామూర్తులు, వివిధ అంశాలతో కూడిన ఎల్ఈడీ బోర్డులు ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే చలువ పందిళ్లను రంగురంగుల వస్త్రాలతో అలంకరించారు. ఆలయ చరిత్ర దాదాపు 1100 ఏళ్ల చర్రిత కలిగిన బిక్కవోలులో వేంచేసిన గోలింగేశ్వరస్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ప్రాచీన శివక్షేత్రాల్లో ఒకటి. తూర్పు చాళుక్యుల శిల్పాకళా వైభవంతో నిర్మించిన అనేక పురాతన ఆలయాల్లో ఇది ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రమాదిత్యుడి పేరిట విక్రమపురంగా, మూడో విజయాదిత్యుడిగా పిలవబడిన గుణగవిజయాదిత్యుని కాలం క్రీస్తు శకం 849–892లో బిరుధాంకినవోలుగా పిలుస్తారు. కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. తూర్పు చాళుక్య రాజుల్లో గుణగవిజయాదిత్యుడు, చాళుక్యభీముడు (క్రీ.శ.892–921) సుప్రసిద్ధులు, గొప్పశివ భక్తులు. వీరిలో గుణగవిజయాదిత్యుడు పశ్చిమ గంగులు, రాష్ట్రకూటులు, కళింగులతో యుద్ధాలు చేసి విజయం సాధించి, శత్రు సంహార పాప పరిహారం కోసం 108 శివాలయాలు నిర్మించగా చాళుక్య భీముడు తన పరిపాలనా కాలంలో 360 శివాలయాలు నిర్మించారు. వీటిలో 101 శివాలయాలు బిక్కవోలు నిర్మించారని పూర్వీకులు చెబుతారు. ఈ గ్రామం దండుపుంత మార్గంలో ఉండుట వల్ల కాలగమనంలో తురుషు్కలు దండయాత్రలు, మురాఠి యుద్ధాల వల్ల చాలా దేవాలయాలు, విగ్రహాలు ధ్వంసమయ్యాయి. నేడు బిక్కవోలు గ్రామాన ఆరు దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్పాకళా వైభవానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. ఈ గోలింగేశ్వరస్వామి ఆలయంలో పార్వతి అమ్మవారు, కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారు దక్షిణ ముఖంగా విజయ గణపతి స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వరస్వామి వారు ఉత్తర ముఖంగా కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం ఇరుపక్కలా చంద్ర శేఖరస్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాలు ఒకే ప్రాకారంలో ఉంటాయి. ఆలయ ముఖ ద్వారం కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బ్రహ్మచారిగా కొలుస్తున్నారు. ఈ స్వామి అత్యంత తేజస్సు కలిగి చతుర్బుజుడై అభయ ముద్రలో దర్శనం ఇవ్వడం విశేషం. స్వామికి కుడి వైపున సహజ సిద్ధమైన పుట్ట ఉంది. ప్రతిరోజూ రాత్రి పళ్లెంలో పాలు పోసి ఇక్కడ ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం. కుమార స్వామి పళనిలో మాదిరిగానే దక్షిణ ముఖంగా కొలువై ఉన్నందున ఈ స్వామిని దర్శించి అభిషేకాలు జరిపిస్తే స్వామి అనుగ్రహం కలిగి, బాధలు తీరతాయని భక్తుల నమ్మకం. అంగారక క్షేత్రంగా పిలవబడే ఈ దేవాలయంలో దోషనివారణ పూజలు చేయడం వల్ల వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం లభిస్తుందని ప్రజల నమ్మకం. సంతాన ప్రాప్తి కోసం నాగుల చీర మార్గశిర శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామి వారి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిద్రిస్తే స్వామి సంతాన ప్రాప్తి కలుగ చేస్తాడని పూర్వం నుంచి భక్తుల నమ్మకం. ఈ విశ్వాసంతోనే రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. సంతానం కోసం ఆలయం నిద్రహిస్తున్న మహిళలు ఏర్పాట్లు పూర్తి చేశాం షష్టి ఉత్సవాలకు ఏర్పాటు పూర్తిచేశాం. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశాం. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల రక్షణకు 200కిపైగా పోలీసు సిబ్బందితో భక్తులకు సేవలందించడానికి సేవాసమితి వలంటీర్లు ఏర్పాటు చేశాం. జంగా వీరవెంకట సుబ్బారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్, బిక్కవోలు -
అలరించిన ఆవిష్కరణలు
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో విద్యార్థులు నిర్వహిస్తున్న సాంకేతిక సంబురం టెక్నోజియాన్–19 నోవస్లో శనివారం రెండో రోజూ ఆవిష్కరణ లు ఆకట్టుకున్నాయి. 14 వర్క్‌షాప్‌లు, 7 గెస్ట్ లెక్చర్లు, 55 ఈవెంట్లు, 6 అట్రాక్షన్లు, 6 స్పాట్‌లైట్స్ నిర్వహించారు. జహాజ్, త్రష్ట్, బాక్సింగ్ రోబోస్, అల్యూర్ లో భాగంగా విద్యార్థుల ర్యాంప్ వాక్, బాలీవుడ్ సింగర్ షెర్టీ సేటియా గీతామృతం అలరించాయి. రైతే రాజు అనే నానుడి నుంచి రైతే శాస్త్రవేత్త అనే స్థాయికి ఎదిగిన రైతన్న సంబంధిత ఆవిష్కరణలు అబ్బురపరిచా యి. చివరి రోజు ఆదివారం గెస్ట్లెక్చర్కు హీరో కార్తికేయ హాజరుకానున్నారు. ఆసు యంత్రం ఆలేరుకు చెందిన చింత కింది మల్లేశం రూపొందించిన ఆసు యంత్రాన్ని ఆలేరుకు చెందిన దామోదర్ ప్రదర్శించారు. మల్లేశం మగ్గంతో కులవృత్తి కొనసాగిస్తున్న సమయంలో ఆటంకాలను అధిగమించేందుకు ఈ యంత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఒక గంటలో 8 చీరలను నేసేందుకు వీలుగా ఆసు యంత్రం తోడ్పడుతుందని చెప్పారు. స్క్రాప్ రిమూవర్ విజయవాడకు చెందిన అబ్దుల్ జలీల్ రూ.22 వేల ఖర్చుతో ఈ యంత్రం రూపొందించారు. స్క్రాప్‌ను వేరు చేసి అల్యూమినియం, కాపర్ వైర్లను తిరిగి ఉపయోగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒక గంటలో 30 నుంచి 40 కిలోల వైర్‌ను తొలగిస్తూ గాలి కాలుష్యం లేకుండా ఉపయోగపడుతుంది. వైల్డ్ బోర్ అలారమ్ జగిత్యాల జిల్లా కిషన్‌రావుపేటకు చెందిన ఇంజపూరి అంజయ్య రూ.1,500 ఖర్చుతో దీన్ని రూపొందించారు. 5వ తరగతి వరకు చదువుకున్న ఆయన తన భూమిలో పంటలను అడవి పందులు నాశనం చేస్తుండగా, వాటిని తరిమికొట్టేందుకు యంత్రాన్ని కనుగొన్నాడు. యాంప్లీఫయర్ సాయం తో రూపొం దించిన సర్క్యూట్‌కు ఒక స్పీకర్‌ను ఏర్పాటు చేసి బోర్‌కు అనుసంధానం చేస్తే చాలు అడవి పందులను భయపెట్టే శబ్దం చేస్తుంది. ఏటీవీ బైక్ నిట్ వరంగల్‌కు చెందిన విద్యార్థులు ఎనిమిది నెలల కాలంలో రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు వెచ్చించి ఏటీవీ (ఆల్ టెరెయిన్ వెహికల్) రూపొందించారు. ఇది కొండలు, ఘాట్ రోడ్లపై సునాయాసంగా ప్రయాణం చేస్తుంది. 3 లీటర్ల పెట్రోల్ సామర్థ్యంతో రూపొందించిన ఈ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
పొర్ట్‌లాండ్ బతుకమ్మ, దసరా వేడుకలు
వాషింగ్టన్: అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో బతుకమ్మ, దసరా వేడుకలను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బివర్టన్ సిటీ మేయర్ డెన్నీడోయల్ హజరయ్యారు. పోర్ట్లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రోసిటీలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఈ బతుకమ్మ, దసరా వేడుకలకు దాదాపు 700 మంది పాల్గొన్నారు. ఈ వేడుకలో చిన్నారులు, మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మల నిమర్జనం తర్వాత మహిళలు గౌరీ దేవీకి మొక్కుకుని, ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తర్వాత బతుకమ్మ విన్నర్స్కి టీడీఎఫ్ టీం బహుమతులు అందజేశారు. అలాగే దసరా పండుగ రోజు పూజారి జమ్మీచెట్టుకు పూజ చేసి వేదమంత్రాలను అందరి చేత పఠించారు. అనంతరం జమ్మిఆకును ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకుంటూ అలయ్ బలయ్ చేసుకున్నారు. ఈ వేడుకలో చిన్నారుల రావణ సంహారం స్కిట్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బివర్టన్ మేయర్ డెన్నీడోయల్ మాట్లాడాతూ.. ఈ వేడుకలో పాల్గోనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బతుకమ్మ,దసరా వేడుకలను, మహిళల ఆటపాటలు, చిన్నారుల వేసిన స్కిట్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీఏఫ్ టీంని ఆయన ప్రశంసించారు. టీడీఏఫ్ ప్రెసిడెంట్ శీని అనుమాండ్ల వేడుకలలో పాల్గొన్న వారందరికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన మహిళలను అభినందించారు. వేడుకలను వైభోవోపేతంగా నిర్వహించి, విజయవంతం కావటానికి కృషి చేసిన టీడీఏఫ్ టీంకు నిరంజన్ కూర, శివ ఆకుతో, రఘుశ్యామ, కొండల్‌రెడ్డి పూర్మ, వీరేష్ బుక్క, ప్రవీణ్ అన్నవజ్జల అజయ్ అన్నమనేని, రాజ్ అందోల్ తదితరులను పేరుపేరునా ప్రశంసించారు. అనంతరం వేడుకలో పాల్గోన్నవారందరికి రుచికరమైన భోజనం వడ్డించారు. చివరగా కార్యక్రమంలో పాల్గొన్న పోర్ట్లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, సహకారం చేసిన మిత్రులకు, టీడీఏఫ్ టీంకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆనందాల వెలుగులు నిండాలి
దీపావళి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటా సందడే...చిన్నా,పెద్ద తేడా లేకుండా టపాసులు కాల్చేందుకు ఉత్సాహం చూపుతారు. రంగుల వెలుగుల్లో బాణసంచా పేల్చే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా, ఏమరు పాటుగా ఉన్నా ప్రమాదమే. దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కాంతులు వెదజల్లాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఆనంద వెలుగులతో దీపావళిపండుగ చేసుకుందాం. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు దగ్గరే ఉంటూ.. జాగ్రత్తలు పాటించాలి ఈ జాగ్రత్తలు పాటించాలి ⇔ టపాసులు కాల్చేటప్పుడు బకెట్నీరు దగ్గర పెట్టుకోవాలి. ⇔ రాకెట్లను పెట్రోల్ బంక్‌లు, గడ్డివాములకు దూరంగా కాల్చాలి. ⇔ అనుమతి పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. ⇔ బిగుతుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ⇔ దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తకుండా నేలపైపడుకుని అటు ఇటు పొర్లాడాలి. ⇔ విషవాయువులను పీల్చకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ⇔ నేరుగా అగ్గిపుల్లలు వాడకుండా కొవ్వుత్తులు, ⇔ అగరవత్తుల సాయంతో టపాకాయలు కాల్చాలి. ⇔ ఇంట్లో కిరోసిన్, గ్యాస్పక్కన బాణసంచా ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇔ ఆస్పత్రులు, న్యాయస్థానం సమీపంలో టపాకాయలు కాల్చకూడదు. ⇔ పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చాలి, చురుగ్గాలేని పిల్లలను దూరంగా ఉంచాలి. ⇔ చేతితో పట్టుకుని కాల్చకూడదు, సగం కాలిన టపాకాయలు తిరిగి వెలిగించేందుకు ప్రయత్నం చేయకూడదు. ⇔ రాకెట్లు వంటి వాటిని విద్యుత్‌తీగలు, చెట్లు, తలుపులు తెరిచి ఉంచిన చోట కాల్చ కూడదు. ⇔ శ్వాససంబంధిత వ్యాధి బాధితులు బాణ సంచాకు దూరంగా ఉండాలి. వ్యాపారుల నిబంధనలు ఇవి దుకాణాల ఏర్పాటుకు అనుమతి పత్రం రెండువారాల వరకే వర్తిస్తుంది. గడువు ముగిసిన తర్వాత మిగిలిన బాణసంచాను టోకు వ్యాపారులకు అప్పగించాలి. ⇔ నిల్వ చేసే గోదాములు, ఊరి చివరి ప్రదేశాల్లో ఉండాలి. ⇔ కాగితం తక్కువగా ఉంటే వాటిని విక్రయించకూడదు. ⇔ డ్రమ్ములు, ఇసుకతో నింపిన బకెట్లు, అగ్నినిరోధక పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ⇔ దుకాణాలను అధికారులు సూచించిన బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఒక అనుమతి దారుడు 25 కేజీ ల నుంచి 50 కేజీలుమాత్రమే పొటా షియం, నైట్రేట్‌తో కూడిన బాణసంచాను మాత్రమే విక్రయించాలి. ⇔ దుకాణాల ఏర్పాటులో విద్యుత్‌తీగలకు అతుకులు లేకుండా ఉండాలి. విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి అనుమతి ఇవ్వాలి. ⇔ జనసామర్థ్యం, గృహ సముదాయాలు, పెట్రోల్‌బంక్‌ల సమీపంలో టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు. ⇔ వినియోగదారులకు వాటిని కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కరపత్రాలు అందించాలి. ⇔ దుకాణానికి, దుకాణానికి మధ్య 3 మీటర్లు దూరం ఉండాలి. ⇔ 18 ఏళ్లలోపు పిల్లలను దుకాణంలో పనిలో పెట్టుకోకూడదు. ⇔ దుకాణాల వద్ద అత్యవసర శాఖల 100, 101, 108 నెంబర్ల బోర్డును ఏర్పాటు చేయాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలే వ్యాపారులు, పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల సూచనలు, నిబంధనలు కచ్చితంగా పా టించాలి. ఆర్డీఓ ఎం పిక చేసిన ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. అక్రమ నిల్వ ఉంచుకోవడం, అనుమతిలేని ప్రదేశాల్లో విక్రయించడం నేరం. ఎప్పటిలాగా అందరికీ తాత్కాలిక అనుమతి మాత్రమే ఇస్తున్నాం. దుకాణాలు వెదు రు తడికతో కాకుండా ఇనుము, ఆస్బస్టాస్ రేకులతో నిర్మించుకోవాలి. నకిలీ బాణసంచాపై నిఘా ఉంచాం. అధి కారులు సూచించిన ప్రదేశాల్లోనే ప్రజ లు కొనుగోలు చేయాలి. –గజరావు భూపాల్, అర్బన్ జిల్లా ఎస్పీ కళ్లు జాగ్రత్త టపాసులు కాల్చే సమయంలో కళ్లకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసమయంలో కళ్లజోడు ధరిం చడం మంచిది. కం టిలో ఏదైనాపడితే వెంటనే చల్లని నీటితో శుభ్రం చేసుకుని డాక్టర్‌ను సంప్రదించాలి. బాణసంచా బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక ప్రాంతాల్లోనే కాల్చడం వల్ల ప్రమాదాలు అరికట్టవచ్చు. – డాక్టర్ సిద్దానాయక్, రుయా హాస్పిటల్ పెద్ద శబ్దాలతో చెవికి ప్రమాదం అధిక శబ్దాలు వచ్చే టపాకాయలు కాల్చడం వల్ల చెవికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. పెద్ద శబ్దం వచ్చే టపాకాయలను కాల్చడం వల్ల పలు అనర్థాలు వాటిల్లుతాయి. వృద్ధులు, చిన్నపిల్లలు వినికిడి సామర్థ్యం కోల్పోయే అవకాశం ఉంది. –డాక్టర్ అశోక్, ఈఎన్టీ స్పెషలిస్ట్ పర్యావరణాన్ని కాపాడాలి బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. సంప్రదాయం కోసం దీపారాధన ఇతరత్రా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పర్యావరణం దెబ్బతినకుండా ఉండేలా బాణసంచా వాడకం తగ్గించడం మంచిది. అదేవిధంగా పండుగకు అయ్యే ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. గతంలో కన్నా తక్కువ ఖర్చు చేసి పొదుపు పటించాలి. – చంద్రమోహన్, తహసీల్దార్,చంద్రగిరి -
సైరా సెలబ్రేషన్స్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాను సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించారు. ఈ నెల 2న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేయడానికి అల్లు అరవింద్ ‘సైరా’ టీమ్‌కి పార్టీ ఏర్పాటు చేశారు. దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. -
బతుకమ్మ ఉత్సవాలు
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు కొనసాగుతాయని, జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వ సంస్థలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అక్టోబర్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో, 4న మున్సిపాల్టీల్లో, 6న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో మోడల్ బతుకమ్మలను ప్రదర్శించాలని సూచించారు. బతుకమ్మల నిమజ్జనానికి చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది బతుకమ్మ పాట ల పోటీలు, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో అంజయ్య, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, గోపిరాం, శ్రీనివాసులు, జిల్లా సమాచారశాఖ డీడీ ముర్తూజా, రమేశ్ రాథోడ్, సుదర్శనం, గోవింద్, జయసుధ, స్రవంతి, శశికళ, సంధ్యారాణి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
‘జల’ సంబురం
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో కేక్ కట్ చేయడంతోపాటు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం.. పార్టీ జెండాలు చేబూని ర్యాలీలు నిర్వహిస్తూ.. బాణసంచా కాలుస్తూ వేడుకలు జరుపుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ.. ఇందుకోసం ప్రభుత్వం చేసిన కృషిని వివిధ రూపాల్లో ప్రజలకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పండగలా చేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించడంతో ఆ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ.. పలు మండల కేంద్రాల్లోనూ టీఆర్ఎస్ శ్రేణులు, పలుచోట్ల వ్యవసాయాధికారులు పలు కార్యక్రమాలు చేపట్టడంతోపాటు రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. బాణసంచా కాల్చారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించి.. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్‌ను కట్ చేశారు. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పాపాలాల్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా కార్యకర్తలకు పార్టీ కార్యాలయంలో చూపించారు. తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం వరప్రదాయని అని, దీనికోసం సీఎం కేసీఆర్ చేసిన కృషి, పడిన శ్రమ అపారమైందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అన్నారు. అలాగే దివంగత ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం టీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి.. స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతను వివరించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును అపర భగీరథుడిగా అభివర్ణించారు. మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబరాల్లో పాల్గొన్నారు. వైరాలో నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే రాములునాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని స్వీట్లు పంపిణీ చేశారు. సత్తుపల్లిలో జరిగిన సంబరాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. వైరా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ సంబరాల్లో పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. -
నిష్కల్మష ప్రజాబంధు ప్రకాశం
దాదాపు అర్ధశతాబ్ది పాటు దక్షిణాది చరిత్రను ప్రభావితం చేసిన ప్రజానేత టంగుటూరి ప్రకాశం పంతులుగారు దక్షిణాన యావత్ ప్రజానీకంతో ప్రకాశానికున్న చొరవ, చనువు, వాత్సల్యం మరె వరికీ లేదు. పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా, కొన్ని సందర్భాలలో పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టినా ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవిం చాడు. తిరుగుబాటుతనం, అన్యాయాన్ని ఎదిరిం చడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడం, మనసా క్షిగా వ్యవహరించడం ఆయనకు బాల్యంనుంచే అబ్బిన సహజ లక్షణాలు.లండన్‌లో బారిష్టరు చదువు తున్న రోజులలో సిగార్ తాగి చిన్న ఉపన్యాసం ఇవ్వమని చెప్తే తల్లికిచ్చిన వాగ్దానం కోసం ‘నేను పొగత్రాగి ఈ ఉపన్యాసం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పి ఆ దేశంలోనే చరిత్ర సృష్టిం చాడు. రాజమండ్రిలో ఉద్దండులను ఓడించి ఛైర్మన్ కావడం, మద్రాస్‌లో జడ్జిలను సైతం అప సవ్యంగా వ్యవహరిస్తుంటే ఎదురుతిరిగి సవ్యమా ర్గాన తేవడం, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2,000 మంది ఖైదీలను రాష్ట్ర అవతరణ సంద ర్భంగా అందరినీ విడుదల చేయడం లాంటివి తన సాహసోపేతమైన పనులు. 1907 నుంచి 1921 వరకూ మద్రాస్ న్యాయస్థానంలో తొలి తెలుగు బారిష్టర్‌గా, అయ్యర్ల, అయ్యంగార్ల సామ్రాజ్యాన్ని ఛేదించి వారికి ధీటుగా నిలబడి ‘లాడమ్’ మ్యాగజైన్ కొని న్యాయస్థానంలో జరిగే వక్రమార్గాలను నిర్దాక్షిణ్యంగా విమర్శించి, ప్రచు రించి ప్రిన్స్ ఆఫ్ మద్రాస్‌గా ఖ్యాతి చెందాడు. 1921లో మద్రాస్‌లో లక్షలు సంపాదించే లాయరు వృత్తిని వదిలేసి స్వాతంత్య్రోద్యమంలో దూకిన మొట్టమొదటి ప్రఖ్యాత తెలుగు బారిష్టర్ ప్రకాశం కావడం గమనార్హం. జమీందారీ రద్దుకు ఆయన ఆద్యుడైనారు. తన సంపాదనను తృణప్రాయంగా వదులుకుని స్వరాజ్య పత్రికను నిర్వహించారు. ఆ పత్రిక ఆ రోజుల్లో ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చింది. కాంగ్రెస్ సంస్థ అవినీతికి నెలవుగా మారిం దని భావించి దాన్నుంచి వైదొలిగి ప్రజా పార్టీ స్థాపించారు. 1952 ఎన్నికల్లో ఆంధ్ర దేశ మంతటా తిరిగి ప్రముఖులంద రినీ ఓడించారు. కర్నూలు రాజధా నిగా ఎంచుకోవడంలో పంతులు గారి దూరదృష్టి తొలుత అందరికీ అర్థం కాలేదు. కేవలం 13 నెలల కాలంలో అద్భుత నిర్ణయాలు అనేకం తీసుకు న్నారు. అందులో ముఖ్యమైనవి వెంకటేశ్వర విశ్వ విద్యాలయ స్థాపన, ప్రకాశం బ్యారేజీ, గుంటూ రులో హైకోర్టు స్థాపన, ఖైదీల విముక్తి, రైతులు, చేనేత కార్మికులపై పన్నుల ఎత్తివేత వీటిలో కొన్ని ఉదాహరణలు మాత్రమే. 1957 మే 20న ప్రకాశం కాలధర్మం చేసిన ప్పుడు ఆయన బద్ద విరోధిగా పేరుపడ్డ కళా వెంకట్రావు ‘నా తండ్రి ఈరోజు గతించాడు’ అనడం ఆ మహనీయుడి కరుణకు తార్కాణం. (నేడు టంగుటూరి ప్రకాశం 147వ జయంతి) టంగుటూరి శ్రీరాం, ప్రధానకార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ మొబైల్ : 99514 17344 -
మహనీయా..మళ్లీరావా!
సాక్షి, కడప : పులివెందులలో తాజా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి సమక్షంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో 69 కిలోల కేకును కట్ చేసి పంచి పెట్టారు. అంతకుముందు పులివెందుల పట్టణానికి చెందిన ఆటో కార్మికులు జూనియర్ కళాశాల సమీపంలోని మహాత్మాగాంధీ సర్కిల్ నుంచి పూల అంగళ్ల మీదుగా ఆర్టీసీ బస్టాండు వరకు ఆటోలకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి కార్మికులతో కలిసి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డిలు పాలాభిషేకం చేశారు. అనంతరం అవినాష్‌రెడ్డి ఖాకీ యూనిఫాం ధరించి పార్టీ కార్యాలయం వరకు ఆటో నడిపారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సుమారు 400 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతలు చొప్పున ఖాకీ యూనిఫాం దుస్తులను అందజేశారు. అలాగే పులివెందులలోని రాజారెడ్డి భవన్లో జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కడపలో భారీగా కార్యక్రమం కడపలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పార్టీ కార్యకర్తల కేరింతల మధ్య కట్ చేసి పంచిపెట్టారు. నగర మాజీ అధ్యక్షుడు బండి నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సురేష్‌బాబు, అంజద్‌బాష, అమర్నాథరెడ్డిలు ప్రారంభించారు. జువైనల్ హోంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రాజశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లాల ఆధ్వర్యంలో జువైనల్ హోంలో కేక్ కట్ చేయడంతోపాటు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అంతేకాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ప్రొద్దుటూరు, రాయచోటిలోఎమ్మెల్యేల ఆధ్వర్యంలో.. ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరురోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలాభిషేకం చేయడంతోపాటు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. రాయచోటి పట్టణంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం రామాపురం, సంబేపల్లె మండలాల్లో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.చిన్నమండెం మండలం చాకిబండలో ఎంపీటీసీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ దేవనాథ్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డిలు కూడా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజంపేట పాతబస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వద్ద బీసీ నాయకులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంటిమిట్టలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బద్వేలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేయడంతోపాటు అన్నదానం చేశారు. జమ్మలమడుగులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం క్యాంబెల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కొండాపురంలో పార్టీ శ్రేణులు రక్తదాన కార్యక్రమం చేపట్టాయి. ఎర్రగుంట్లలో మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్దన్‌రెడ్డి కేక్ కట్ చేశారు. కమలాపురం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పార్టీ శ్రేణులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించాయి. అన్నిచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. మైదుకూరులో వైఎస్సార్ సీపీ నేత రాచమల్లు రవిశంకర్‌రెడ్డి నేతృత్వంలో బద్వేలు రోడ్డులోని సీఎస్ఐ చర్చి వద్ద వృద్ధులు, వికలాంగులు, పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. -
ఆవిర్భావ వేడుకలు అదిరిపోవాలి
నాగర్‌కర్నూల్ : రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జూన్ 2న అదిరిపోయేలా నిర్వహించడానికి జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ ఆదేశించారు. రాష్ట్ర అవతర వేడుకలపై శుక్రవారం వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసీలు, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడారు. గతంలో నిర్వహించిన మాదిరిగానే జిల్లా స్థాయిలో పలు రంగాల్లో విశిష్ట సేవలు ఆందించిన ప్రముఖులకు రూ. 51,116లు నగదు పురస్కారాలు అందించాలని, అమరవీరులకు నివాళులు అర్పించాలని, పెద్ద ఎత్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చేపాట్టాలని, జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉత్సవాలకు జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనాథ శరణాలయాల్లో విద్యార్థులకు పండ్లు, మిటాయిలు పంపిణీ చేయాలని తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ఇదివరకే ప్రతిపాధనలు పంపిన 686 మంది వృద్ధ కళాకారులకు 1500 చొప్పున పింఛన్ మంజూరు చేశామని, జిల్లా నుంచి 20 దరఖస్తులు పంపించాలన్నారు. ఈ సందర్భంగా జేసి సురేందర్ కరణ్ జిల్లాకు సంబంధించిన సమాచారం అందించారు. వీసీలో డీఆర్వో మధుసూదన్ నాయక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పట్టర పట్టు కుస్తీ
టేక్మాల్(మెదక్) : మండలంలోని బొడ్మట్‌పల్లి గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుస్తీపోటీలునిర్వహించారు. చివరి కుస్తీలో ఇద్దరిపై నెగ్గిన మహరాష్ట్ర ఉద్దిర్ గ్రామానికి చెందిన నూరత్‌బిడివికి టీఆర్ఎస్ జిల్లా నాయకులు బేగరి మొగులయ్య సౌజన్యంతో 5తులాల వెండి కడియాన్ని బహుకరించారు. విజేతను దేవాలయం వరకు ఊరేగిస్తూ పూజలు నిర్వహించారు. కుస్తీ పోటీలలో పాల్గొనేందుకు కర్ణాటక, మహరాష్ట్రాలతో పాటూ తెలంగాణలోని పలు జిల్లాలోని మల్లయోధులు వచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉత్సవాలకు హాజరైన మాజీ డిప్యూటీ సీఎం.. వీరభద్ర ఉత్సవాల్లో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ హజరయి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ బీరప్ప, ఆలయ కమిటీ చైర్మణ్ బస్వరాజ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రాందాస్, పీఎసీఎస్ డైరెక్టర్ రవిశంకర్‌లు దామోదరను పూలమాల వేసి, శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందించారు. ఇందులో ఎంపీపీ ఉపాద్యాక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మరమేశ్ నాయకులు భరత్, విఠల్, వీరన్న, శ్రీనివాస్, కిషోర్, విద్యాసాగర్, యాదయ్య, గోవిందాచారి, శంకర్, సేవ్యానాయక్ పాల్గొన్నారు. -
నమో వేంకటేశా..
కామారెడ్డి రూరల్ : మండలంలోని లింగాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వరకు సుబ్రహ్మణ్య శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవతామూర్తులప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 30న ఉదయం 7:30కు ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 1న శిఖర ప్రతిష్ఠ, ధాన్యాది, శయ్యాది, పుష్పాది, ఫలాధివాసముులు, హోమం, 2న అవాహిత దేవతా పూజలు, బలిప్రదానం, గర్త సంస్కారము కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. అనుగ్రహ భాషణం ప్రతిష్ఠాపనోత్సవాల్లో తోగుట రామాపూరం శ్రీ మధనానంద పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ మధవానంద సరస్వతీతో యంత్ర ప్రాణ ప్రతిష్ఠా కళాన్యాసము, మహాభిషేకం, కుంభాభిషేకం, స్వామీజీ అనుగ్రహాభాషనం ఉంటాయ తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు అన్నదానం, సాయంత్రం సాయంత్రం భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు పూలు, పండ్లు, పూజ సామగ్రి నవధాన్యాలు, పగడాలు, ముత్యాలు, నవరత్నాలు, యంత్రం కింద వేయడానికి తీసుకురావచ్చన్నారు. 2న దేవదాయశాఖ మంత్రి రాక విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగం గా ఏప్రిల్ 2న నిర్వహించనున్న కార్యక్రమాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు హాజరవుతారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ విశిష్టత లింగాపూర్ గ్రామంలోగల శ్రీవేంకటేశ్వర పురాతన ఆలయం భక్తులకు కొంగు బంగారంగా, కోరికలు తీర్చే వెంకన్నగా పేరుంది. కాల క్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలతిరుపతి దేవస్థానం నిత్య ధూపదీప నైవెద్య పథకం కింద సహాయం అందించింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ సర్వశ్రేయో నిధి (సీజీఎఫ్) కింద రూ.30 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేసింది. టీటీడీ దేవతామూర్తుల విగ్రహాలను అందించింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఐక్యంగా ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చి సుమారు రూ.కోటి వ్యయంతో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. -
గులాబీ పార్టీలో.. పండుగ వాతావరణం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గులాబీ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరగనున్న టీఆర్ఎస్ 17వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తోంది. ఏటా ఏప్రిల్ 27వ తేదీన జరిగే ప్లీనరీలోనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికలు ఏడాది లోపే ఉండడంతో ఈ ప్లీనరీకి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ప్రతినిధుల సభకు హాజరయ్యేందుకు పార్టీ నాయకులు ఉత్సాహ పడుతున్నారు. నాలుగేళ్లు పాటు సాగిన టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు, వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన కార్యక్రమాలపై ప్రగతి నివేదికలను పార్టీ కార్యకర్తలకు అందివ్వనున్నారు. పార్టీ, ప్రభుత్వం జోడెడ్ల మాదిరిగా కలిసి సాగాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పదే పదే చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు, ప్రజల్లో ప్రచారం చేసేందుకు పార్టీ యంత్రాంగాన్ని వినియోగించుకోనున్నారని చెబుతున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పార్టీ ప్లీనరీ ఉండదని, దీంతో ఈ ప్లీనరీ పా ర్టీకి ప్రత్యేకమైనదని అంటున్నారు. ఈ కారణంగానే కీలకమైన ఈ ప్లీనరీలో పాల్గొనేం దుకు నల్లగొండ ఉమ్మడి జిల్లా నాయకులు, ద్వితీయ శ్రేణి, పార్టీ తరఫున వివిధ పదవుల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల, పార్టీ పదవుల్లో ఉన్నవారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గానికి నూరు మందికి ఆహ్వానం టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో మొత్తంగా 15వేల మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొంటారని, ఆ మేరకే ఆహ్వానాలు ఉన్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు. దీంతో జిల్లాల వారీగా ఇచ్చిన కోటాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈసారి ప్రతి నియోజకవర్గానికి వంద మందికే ఆహ్వానాలు పంపారని, ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తంగా 1200 మందికి ఆహ్వానాలు అందాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రతిసారి నిర్ధిష్టంగా కొంత మందికే ఆహ్వానాలు ఇస్తున్నా, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలోనే ప్లీనరీకి హాజరవుతున్నారని చెబుతున్నారు. ఈసారి కూడా ఆహ్వానాలకు రెండింతల మంది ప్లీనరీకి తరలిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 12 స్థానాల్లో టీఆర్ఎస్ చేతిలో ఎనిమిది మంది (చేరికల ఎమ్మెల్యేలు సహా) ఎమ్మెల్యేలు ఉన్నారు. కోదాడ, హుజూర్నగర్, నల్లగొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జులు ఉన్నారు. ప్లీనరీకి హాజరయ్యేందుకు తమకు పాసులు ఇప్పించాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇన్చార్జులపై ఒత్తిడి పెరిగిందని పేర్కొంటున్నారు. వీరే కాకుండా జిల్లానుంచి మరికొందరు కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండలి చైర్మన్, సభ్యులు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరే కాకుండా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ప్రాతిని ధ్యం వహిస్తున్నవారు. పార్టీ అనుంబంధ సంఘాల్లో ఉన్న వారు ఇలా.. వివిధ పదవుల్లో ఉన్న నేతలంతా ప్లీనరీకి హాజరుకావడానికి సిద్ధమవుతున్నారు. ప్లీనరీలో పాల్గొనడం ప్రత్యేకతగా భావిస్తున్న కేడర్ ఈ మేరకు తమ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా ప్లీనరీలో పా ల్గొనే వారి జాబితాల తయారీ, ఇతర ఏర్పాట్లతో జిల్లా టీఆర్ఎస్లో సందడి నెలకొంది. -
అన్ని దానాల్లో.. అన్నదానం మిన్న
భద్రాచలంటౌన్: అన్ని దానాల్లో.. అన్నదానం గొప్పదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, మజ్జిగ, మంచినీరు, పులిహోర, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌సెంటర్ నందు సెంట్రింగ్ అండ్రాడ్ బెండింగ్ వర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్‌కో సిమెంట్ ఆధ్వర్యంలో స్థానిక మాధవి ఎంటర్‌ప్రైజస్‌ద్వారా భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైవీ రామారావు, వెంకటరెడ్డి, గడ్డం స్వామి, ఎంబీ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాయతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో.. భక్తులకు 5వేల లీటర్ల పానకం, వడపప్పు, 2క్టింటాళ్ల పులిహోర పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్, కోవూరు సంతోష్‌కుమార్, తిరుమలరావు, కృష్ణమోహన్, మూర్తి, పీ గౌతమ్, మహిళా అధ్యక్షురాలు సాగరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో.. భక్తులకు పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, బద్ది శ్రీనివాసరావు, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు. ఇండియన్‌రెడ్‌క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో.. భక్తులకు 5వేల మంచినీటి ప్యాకెట్లను 5వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మారుతి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, జీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురగిరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో.. భద్రాచలం విచ్చేసిన భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కార్యక్రమంలో బుడగం శ్రీనివాసరావు, కుంచాల రాజారాం, సాగర్, శ్రీను, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మథ«ర్ థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. స్థానిక బస్టాండులో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపకుడు కొప్పుట మురళీ, జీ నాగరాజు, అజిత్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ చెడిందా!
సాక్షి, చెన్నై: రెండాకుల చిహ్నం తమకు దక్కడంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మదురైలో శనివారం నిర్వహించిన విజయోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంను సీఎం పళనిస్వామి శిబిరం ఆహ్వానించకపోవడం చర్చకు దారితీసింది. తామిద్దరం ఒక్కటేనని చెప్పుకుంటూ వచ్చిన సీఎం, ఈ వేడుకలో పన్నీరు ఊసెత్తకుండా ప్రసగించడం గమనార్హం. పన్నీరు శిబిరానికి సీఎం ప్రాధాన్యం ఇవ్వడంలేదని వారం రోజులుగా తమిళనాట ప్రచారం జరుగుతోంది. పన్నీరు మద్దతు ఎంపీ మైత్రేయన్ ట్విట్టర్లో అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రెండాకుల చిహ్నం విజయోత్సవ వేడుక పళని, పన్నీరు మధ్య విభేదాల్ని బయటపెట్టింది. శనివారం రామనాథపురంలో ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మదురై నుంచి 120 కి.మీ దూరంలో ఉన్న రామనాథపురం వరకు రోడ్డు మార్గమంతా రెండాకులు, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితతో పాటు సీఎం పళనిస్వామి చిత్ర పటాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు హోరెత్తాయి. అయితే, ఎక్కడా పన్నీరుకు చోటు కల్పించలేదు. అలాగే మదురై తిరుప్పర గుండ్రం వద్ద వంద అడుగులతో కూడిన భారీ జెండా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవ స్తూపం శిలాఫలకంలో ఆ జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి, మంత్రి ఆర్బీ ఉదయకుమార్, సీఎం పళనిస్వామి పేరును మాత్రం పొందుపరిచారు. అలాగే, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంను ఆహ్వానించకుండా ఈ వేడుక జరిగింది. తమ శిబిరానికి చెందిన ఏ ఒక్కరినీ ఈ వేడుకకు పిలవకపోవడంపై పన్నీరు మద్దతు నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక, సాయంత్రం రామనాథపురంలో జరిగిన ఎంజీఆర్ శత జయంతి వేడుకలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఎడమొహం పెడమొహం అన్నట్టుగా కూర్చోవడం తమిళనాట చర్చకు దారితీసింది. -
వీహెచ్‌పీ ఆవిర్భావ వేడుకలు
మక్తల్ : విశ్వహిందూ పరిషత్ అవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతకు పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. వాసవీమాత దేవాలయం లో ఓంకార ధ్వజ ఆవిష్కరణ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీకష్ణ జన్మాష్టమి రోజున వీహెచ్‌పీ దినోత్సవం ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు భీంరెడ్డి, కె.సత్యనారాయణ, హన్మంతు, రాంమోహన్, బాబు, ఈసరినాగప్ప, భాస్కర్‌రెడ్డి, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వేద పాఠశాల వార్షికోత్సవం
కరీంనగర్‌కల్చరల్ : నగరంలోని వేదభవన్‌లో ఆదివారం జెట్ వికాసతరంగిణి ఆధ్వర్యంలో పెద్దజీయర్ స్వామి తిరునక్షత్రం, వేద పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవన్నారు. ప్రపంచానికి వేదాన్ని నేర్పింది మనమేనన్నారు. వికాస తరంగిణి బాధ్యులు సీహెచ్ అయోధ్యరామారావు, గౌతంరావు , తదితరులు పాల్గొన్నారు. -
సర్వాయి పాపన్న జయంత్యుత్సవాలు
షాద్‌నగర్: సర్దార్ సర్వాయి పాపన్న జయంత్యుత్సవాలను పట్టణంలోని యూనివర్సల్ మినీ ఫంక్షన్ çహాల్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి పాపన్న అన్నారు. 12మంది అనుచరులతో 12వేల సైన్యాన్ని తయారు చేసుకొని గోల్కొండ కోటపై దండయాత్ర చేసి కోటను స్వాధీనం చేసుకున్నాడన్నారు. పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. దేశంలో అధునికీకరణకు నోచని ఏకైక వత్తి గీత వత్తి అన్నారు. గీతకార్మికులు రాజకీయంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్‌గౌడ్, మణికొండ రంగయ్యగౌడ్, గోవర్ధన్‌గౌడ్, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, రాములుగౌడ్, కట్టవెంకటేష్, రాఘవేందర్‌గౌడ్, దర్శన్‌గౌడ్, మహేష్‌గౌడ్, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బహుజనులను ఏకంచేసిన మహనీయుడు పాపన్నగౌడ్
మాడ్గుల: నవాబులు, జమీందారుల అరాచకాలతో నలిగిపోతున్న బహుజనులను ఏకం చేసి వారి శ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయులు సర్ధార్ సర్వాయి పాపన్నౖగౌడ్ అని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మెన్ కె. స్వామిగౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అవురుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని గురువారం మమబూబ్‌నగర్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, వంశీచంద్‌రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. పాపన్నగౌడ్ 366వ జయంతిని పురస్కరించుకుని సర్పంచ్ నారాయణగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ పాపన్నగౌడ్ ఔరంగజేబు పాలనలో కింది స్థాయి జమీందారులు గ్రామాల్లో చేసిన అరాచకాలకు ఎదురుతిరిగాడని, బహుజనులను ఐక్యం చేసి గోల్కొండకోటకు నవాబుగా రాజ్యాధికారం సాగించిన గొప్ప వీరుడు అని కొనియాడారు. మాడ్గుల, ఆమనగల్లు మండల గ్రామాలకు చెందిన గౌడగీత కార్మికులు ప్రభుత్వానికి పన్ను బకాయిలను రదుద చేసి, కొత్త లైసెన్స్‌లను మంజూరు చేస్తామని స్వామిగౌడ్ గీతకార్మికులకు హమీ ఇచ్చారు.lకార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్రగౌడకల్లు గీతవృత్తిదారుల సంఘం అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్, గౌడసంక్షేమసంఘం తాలూకా అధ్యక్షుడు అయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు పగడాల రవితేజ, ఎంపీపీ జైపాల్‌నాయక్, ఎంపీటీసీ, సభ్యులు, గౌడనాయకులు పాల్గొన్నారు. -
జయహో
-
సినీనటుడు మహేష్‌బాబు జన్మదిన వేడుకలు
షాద్‌నగర్‌రూరల్ : సినీనటుడు ప్రిన్స్ మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా ఆల్ఇండియా కష్ణమహేష్ ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌ఘోరీ ఆధ్వర్యంలో మంగళవారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఖాదర్‌ఘోరీ మాట్లాడుతూ తెలుగు అభిమానుల గుండెల్లో మహేష్ బాబు చెరగని ముద్ర వేసుకున్నారని భవిష్యత్‌లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాహంగీర్, కిరణ్, మల్లికార్జున్, ప్రవీన్, హర్షద్, తయ్యబ్ తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వర థియేటర్లో.. మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా పట్టణంలోని పరమేశ్వరి థియేటర్లో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి.కష్ణారెడ్డి హాజరై కేక్ కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో అభిమానులు ప్రవీణ్, అంజి, అక్బర్, నాగేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. సిద్ధాపూర్(కొత్తూరు): మండలంలోని సిద్ధాపూర్లో మంగళవారం శివాజీయూత్ ఆధ్వర్యంలో మహేష్‌బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ దత్తత గ్రామంలో అభిమానులు, యువజన సంఘం సభ్యులు కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. త్వరలో రక్తదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం మణివర్ధన్‌రెడ్డి, నర్సింహ, నరేందర్‌రెడ్డి, మహేందర్, గోపాల్, ప్రశాంత్, కిరన్, ప్రభాకర్‌రెడ్డి, అయోధ్యరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
డైలాగ్ కింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
'చిరంజీవి150వ చిత్రానికి ఘనంగా ఏర్పాట్లు'
పశ్చిమగోదావరి: చిరంజీవి150 వ చిత్ర ప్రారంభోత్సవానికి ఘనం ఏర్పాట్లు చేయానున్నట్లు చిరంజీవి జాతీయ అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు తెలిపారు. అగస్టు 15 నుంచి 22 వరకు చిరు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరపానున్నామని ఏలూరులో జరిగిన చిరంజీవి రాష్ట్ర యువత సమావేశం అనంతరం చెప్పారు. టెన్త్, ఇంటర్, వివిధ పోటీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి చిరంజీవి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. నకీలీ ఆహార ఉత్పత్తులపై పోరాటం కొనసాగిస్తామని స్వామినాయుడు చెప్పారు.