
సాకడి(బి) లో ఏత్మాసూర్ పేన్‌కు మొక్కుతున్న భక్తులు
సాక్షి, ఆసిఫాబాద్: కనుల విందు చేసే గుస్సాడీల కోలాహలం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో అనేక ఆదివాసీ గ్రామాల్లో భోగి పండుగలను నిర్వహించుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని గిరి సీమలు దండారీలకు ముస్తాబయ్యాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న దండారీ ఉత్సవాలకు గుస్సాడీలకు కావాల్సిన పరికరాలకు పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవంలో ఊరుఊరంతా పాల్గొంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1386 గిరిజన గ్రామాలుండగా.. 1208 గ్రామాల్లో దండారీ ఉత్సవాలు కొనసాగుతాయి. కెరమెరి మండంలోని సాకడ(బి)లో ఏత్మాసార్ పేన్‌కు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆ నైవేద్యాన్ని ఆరగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటి నుంచి దండారీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
చదవండి: విజయశాంతి ప్రకటన.. కాంగ్రెస్‌లో కలకలం
Comments
Please login to add a commentAdd a comment