dewali
-
#NoBindiNoBusiness: మరో వివాదంలో ఫ్యాబ్ఇండియా
సాక్షి, ముంబై: పండుగలు అంటే సాంప్రదాయబద్దంగా జరుపుకుంటాం. ఎవరి మతాచారాలకు తగ్గట్టు వాళ్లు పండగలు చేసుకుంటారు. ఇక హిందూ పర్వదినాల విషయానికి వస్తే.. ముఖ్యంగా మహిళలు.. సాప్రదాయబద్దంగా తయారవడానికి ఇష్టపడతారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండుగనాడు మాత్రం పట్టుబట్టలు, బొట్టు, పూలు, గాజులతో అందంగా ముస్తాబవుతారు. ఆధునికంగా కనిపిస్తూనే సాంప్రదాయంగా తయారవుతారు. ఇక హిందూ సమాజంలో బొట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్న పండుగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా బొట్టు పెట్టుకుంటారు. అలాంటిది దీపావళి వంటి పర్వదినం నాడు ఏ భారతీయ మహిళ కూడా ఇలా తయారవదు అంటూ ఫ్యాబ్ఇండియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. కారణం ఏంటంటే దీపావళి సందర్భంగా ఫ్యాబ్ఇండియా తీసుకువచ్చిన దుస్తుల కలెక్షన్ యాడ్ ఇప్పటికే వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా సద్దుమణగముందే మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఈ ఫ్యాబ్ఇండియా యాడ్‌లో మోడల్స్ ఎవరూ కూడా బొట్టు పెట్టుకోలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో నుదుటన బొట్టు ధరించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ.. నోబిందినోబిజినెస్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. (చదవండి: ఫ్యాబ్ ఇండియా యాడ్‌పై దుమారం, తొలగించిన సంస్థ) Speaking for myself. Not buying anything for #Deepawali from ANY brand that shows models without a bindi. #NoBindiNoBusiness — Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) October 20, 2021 ఈ యాడ్ చూసిన నెటిజనులు ఫ్యాబ్ ఇండియా యాడ్‌లో మోడల్స్ బొట్టు పెట్టుకోలేదని.. భారతీయ మహిళలు ఎవరూ పండగకి ఇలా తయారవ్వరని మండిపడుతున్నారు. అంతేకాక బిందీ, బొట్టుబిళ్లలు ధరించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నోబిందినోబిజినెస్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో #Bindi, #NoBindiNoBusiness అనే హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. (చదవండి: ఫార్చ్యూన్ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’) Proudly flaunting my Bindi#NoBindiNoBusiness#BindiTwitter pic.twitter.com/xcrBLG40co — Adv Pragya Bhushan🌐 (@pragya_bhushan) October 21, 2021 రానున్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన యాడ్‌పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసిన తన కలెక్షన్‌ను జష్న్-ఈ-రివాజ్ పేరిట బ్రాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజాన్ని, ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందింస్తోందంటూ మండి పడ్డారు. దీంతో బాయ్‌కాట్ ఫ్యాబ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: కేవలం 'యాడ్స్'తో స్నేహ దంపతులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? My bindi (Tilak) is my identity. #BindiTwitter #NoBindiNoBusiness #NOFILTER pic.twitter.com/6jK3kozweD — Raghuram (@Raghura75818432) October 21, 2021 మరికొందరు ఈ హ్యాష్‌ట్యాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొట్టు పెట్టుకోకపోవడం పెద్ద నేరమేమి కాదు.. పుట్టుకతోనే ఎవరూ బొట్టుతో జన్మించలేదు. బొట్టు పెట్టుకోవాలో.. లేదో మేం నిర్ణయించుకుంటాం. దీనిలో పురుషుల జోక్యం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Most of the time I don't wear a bindi, and when I do, I wear it because I like it so all those preaching on Twitter that there should be bindi on a woman's forehead as it's mandatory in our religion can go to hell. Not wearing bindi won't make me any less hindu or Indian! — Pooja Kopargaonkar (@thekopargaonkar) October 19, 2021 -
బ్రో.. అతడో తాగుబోతు.. వదిలెయ్!
చెన్నై: తమిళ స్టార్ దళపతి విజయ్, విజయ్ సేతుపతిల తాజా చిత్రం మాస్టర్ టీజర్ దీపావళి కానుకగా విడుదలైంది. దళపతి విజయ్ను జేడిగా పరిచయం చేస్తూ ఈ టీజర్ మొదలైంది. ఇందులో విజయ్ ఎలాంటి నియమ నిబంధనలు లేని ఓ కాలేజీ ప్రొఫెసర్‌గా, మద్యానికి బానిసైన తనకు తానే రాజు అనేవిధంగా కాలేజీ క్యాంపస్ నేపథ్యంలో సాగింది. చెప్పాలంటే కొంతమేర అర్జున్ రెడ్డిని తలపించింది. అయితే ఇద్దరూ పెద్ద స్టార్ హీరోలు కావడంతో విజయ్, విజయ్ సేతుపతిల మార్క్ ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు లోకేష్ కనకరాజు జాగ్రత్త పడినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక టీజర్ గురించి స్థూలంగా చెప్పాలంటే... కాలేజ్ ప్రొఫెసర్ జేడి, విపరీతంగా మద్యం తాగుతూ మిగతా టీచర్లకు తలనొప్పిగా మారుతాడు. అంతేగాక క్యాంపస్ లోపలే విద్యార్థులకు, జేడికి మధ్య నెలకొన్న కొన్ని మనస్పర్థల కారణంగా చిన్నగా మొదలైన గొడవలు, వీధీ రౌడీలు కూడా కలుగజేసుకునేంత పెద్దగా మారుతాయి. అలా క్యాంపస్‌లో విజయ్ సేతుపతి ఆధ్వర్యంలో రౌడీ మూకతో విజయ్ ఫైట్ చేస్తుంటాడు. టీజర్ చివరలో విజయ్, విజయ్ సేతుపతిలు ఫైట్ చేస్తున్న కట్ సీన్స్ పెట్టి దర్శకుడు టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మలుపు తిప్పాడు. వీరిద్దరి మధ్య సాగే ఫైట్ సన్నివేశాలు టీజర్లో హైలైట్. ఇక కాలేజ్ ప్రొఫెసర్ జేడి పాత్రలో విజయ్ మద్యానికి బానిసైన వ్యక్తిగా కనిపిస్తూనే స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టాడు. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్న నటిస్తోంది. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు మేజర్ హైలైట్ కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా 11 కోట్లకు అమ్ముడైనట్లు సినీ వర్గాల సమాచారం. ఇక థియేటర్స్ తిరిగి తెరుచుకోగానే మాస్టర్ సినిమా విడుదల చేయడాలనే ఆలోచనలో చిత్ర బృందం భావిస్తోంది. -
అభిమానులకు అక్షయ్ దీపావళి కానుక
ఈ మహమ్మారి వారి వల్ల సామాన్య ప్రజల నుంచి బడా వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖలకు గడ్డుకాలమనే చెప్పుకోవాలి. అలాగే ఈ కరోనా కారణంగా చాలా మంది స్టార్ నటీనటులకు కూడా అంతగా సినిమాలు లేకపోవడంతో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ వారందరికి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భిన్నం. ఈ గడ్డుకాలంలో కూడా చేతి నిండా సినిమాలతో అక్కి బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ‘లక్ష్మి’, ‘బెల్‌బాటమ్’లు విడుదల కాగా.. ‘సూర్వవంశీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అక్షయ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులకు దీపావళి కానుక ఇచ్చాడు. (చదవండి: ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?!) This Deepawali,let us endeavor to keep alive the ideals of Ram in the consciousness of all Bharatiyas by building a bridge(setu) that will connect generations to come. Taking this mammoth task ahead,here is our humble attempt - #RamSetu Wishing you & yours a very Happy Deepawali! pic.twitter.com/ZQ2VKWJ1xU — Akshay Kumar (@akshaykumar) November 14, 2020 తను నటించబోయే ‘రామ్ సేతు’ సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ను శనివారం దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ పోస్టలో అక్షయ్ మెడలో ఎరుపు కండువాతో కార్గ్ ప్యాంట్, షర్ట్ ధరించి ఉన్నాడు. అంతేగాక స్లింగ్ బ్యాగు ధరించి నెలవైపు చూస్తుండగా.. వెనకాల హిందువుల దైవమైన శ్రీరాముడి రాముడి షాడో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. పొస్టర్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ఈ దీపావళి, రాబోయే తరాలను కలిపేందుకు ఒక వంతెనను(సేతు) నిర్మించి.. భారతీయుల ఆదర్శ దైవం శ్రీరాముడి ఆదర్శాలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం’ అంటూ రాసుకొచ్చాడు. అదే విధంగా త్వరలోనే ‘రామ్‌సేతు’తో మీ ముందుకు వస్తున్నానంటూ.. ఈ దీపావళి మీ అందరి ఇళ్లలో కాంతి నింపాలని ఆశిస్తూ హ్యాపీ దీపావళి అని అక్షయ్ శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: లక్ష్మి నుంచి మరో ప్రోమో) -
గిరి సీమల్లో భోగి సందడి
సాక్షి, ఆసిఫాబాద్: కనుల విందు చేసే గుస్సాడీల కోలాహలం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో అనేక ఆదివాసీ గ్రామాల్లో భోగి పండుగలను నిర్వహించుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని గిరి సీమలు దండారీలకు ముస్తాబయ్యాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న దండారీ ఉత్సవాలకు గుస్సాడీలకు కావాల్సిన పరికరాలకు పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవంలో ఊరుఊరంతా పాల్గొంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1386 గిరిజన గ్రామాలుండగా.. 1208 గ్రామాల్లో దండారీ ఉత్సవాలు కొనసాగుతాయి. కెరమెరి మండంలోని సాకడ(బి)లో ఏత్మాసార్ పేన్కు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆ నైవేద్యాన్ని ఆరగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటి నుంచి దండారీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చదవండి: విజయశాంతి ప్రకటన.. కాంగ్రెస్‌లో కలకలం -
దీపావళి కానుకగా వన్‌గ్రామ్ గోల్డ్, బట్టలు ఇచ్చిన హీరో
తమిళ హీరో శింబు ‘ఈశ్వరన్’ మూవీ టీంకు దీపావళికి కానుక వన్ గ్రామ్ గోల్డ్, ధుస్తులు ఇచ్చాడు. ప్రస్తుతం శింబు నటిస్తున్న ఈశ్వరన్ చిత్రం పూరైన సందర్భంగా షూటింగ్ చివరి రోజున పని చేసిన దాదాపు 400 మందికి వన్ గ్రామ్ గోల్డ్, కొత్త బట్టలను బహుమతిగా ఇచ్చాడు. అంతేగాక దాదాపు 200 మంది జునీయర్ ఆర్టిస్టులకు కూడా పండగ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేశాడు. దీంతో శింబు ఉదారతకు చిత్ర యూనిట్ సభ్యలతో పాటు జునీయర్ ఆర్టీస్టులంతా ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్క్షతలు తెలుపుతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో శింబు నాగుపామును పట్టుకుని ఉన్న ఫస్ట్ పోస్టుర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. (చదవండి: పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?) #ShootCompleted 😊#EeswaranTeaserForDiwali I heart fully thank each and everyone of my team #Eeswaran for this beautiful journey! & Special thanks to all my fans for all the love and support #SilambarasanTR #Atman #STR pic.twitter.com/7lAXOnjZyP — Silambarasan TR (@SilambarasanTR_) November 6, 2020 ఇక సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా శింబు ట్వీట్ చేస్తూ ఈ దీపావళి టీజర్ విడుద చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘ఈశ్వరన్ షూటింగ్ పూరైంది. ఈ దీపావళికి టీజర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వరన్ మూవీ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్క్షతలు తెలుపుతున్న’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
కాకరకాయ, పచ్చిమిర్చితో రసగుల్లా
రాంచి: కరోనా వైరస్ నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు తీపి అంటే ఇష్టమైన వాళ్లంతా నోళ్లు కట్టేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం రాంచిలోని ఓ స్వీట్ షాపు నిర్వాకుడు కమల్ అగర్వాల్ తీపి కబురు అందించాడు. తీపి తినేవారికి రోగనిరోధక శక్తని అందించే రసగుల్లాను ఈ దీపావళి పండుగ కోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాడు. అయితే స్వీట్స్‌తో రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా. ఇందులో వాడే పదార్థాలు ఏంటో మీరే చదవండి మరి. ఈ రసగుల్లా తయారికి అగర్వాల్ ఇమ్యూనిటీని పెంచే పదార్థాలు... కాకరకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు పదార్థాలను వాడుతున్నాడు. ఈ పదార్థాల్లో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయని జార్ఖండ్ ప్రభుత్వ ఆయుష్ వైద్యుడు భరత్ కుమార్ కూడా స్పష్టం చేశారు. (చదవండి: మరో లాక్డౌన్ వల్ల అన్నీ అనర్థాలే!) స్వీట్స్ షాపు నిర్వాహకుడు కమల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో నా మిఠాయిల వ్యాపారం నిలిచిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. జనాలు కూడా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తినిచ్చే ఉత్పత్తులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి పదార్థాలనే ప్రజలంతా కొనుగోలు చేయడం గమనించాను. అందువల్లే ఇమ్యూనిటీ ఇచ్చే ఈ రసగుల్లాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పాడు. అయితే ఇవి తయారు చేసిన మొదల్లో చాలా తక్కువమంది ఈ రసగుల్లాలను కోనుగొలు చేసేవారని, అయితే దుర్గా పూజ తర్వాత వీటి డిమాండ్ బాగా పెరిగిందన్నాడు. అంతేగాక ఈ స్వీట్స్‌కు ప్రజల నుంచి విశేష స్పందని వస్తుందని, ఈ దీపావళికి రసగుల్లాలకు చాలా ఆర్డర్లు వచ్చాయని అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశాడు. (చదవండి: జ్వరమొస్తే కరోనా, డెంగీ టెస్టులు తప్పనిసరి) -
వచ్చే నెల తిరుమలలో పలు విశేష ఉత్సవాలు
సాక్షి, తిరుమల: వచ్చే నెలలో తిరుమలలో పలు విశేష పూజలు, ఉత్సవాలు జరగనున్నట్లు దేవస్థానం అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తిరుమల అధికారులు మంగళవారం తెలిపారు. అవి: నవంబర్ 14న దీపావళి ఆస్థానం; నవంబర్ 18న నాగుల చవితి; నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ; నవంబర్ 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం; నవంబర్ 25న స్మార్త ఏకాదశి; నవంబర్ 26న మధ్య ఏకాదశి, క్షిరాబ్ది ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి, చక్రతీర్థ ముక్కోటి; నవంబర్ 27న కైశిక ద్వాదశి ఆస్థానం; నవంబర్ 29న కార్తిక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర. -
పలుచోట్ల దీపావళి వేడుకల్లో అపశృతి
-
దీపావళి పండుగలో తీవ్ర విషాదం
సాక్షి, విజయనగరం : దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుందామనుకున్న వారికి అవే టపాసులు తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి. టపాసులు పేలడంతో పలు చోట్ల ఇళ్లు దగ్ధమవ్వగా, మరికొన్ని చోట్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లాలోని జొన్న పలసలో దీపావళి సందర్భంగా టపాసులు పడి నిప్పంటుకుని నాలుగు తాటాకు ఇళ్లు మంటలకు ఆహూతి అయ్యాయి. మంటలు తీవ్రంగా వ్యాప్తిచే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఎగసిపడుతున్న భారీ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 15మందికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ నగరంలో దీపావళి పండుగ వేడుకలో పలుచోట్ల అపశృతి చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తూ ప్రమాదానికి గురైనవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నగరంలోని సరోజినిదేవి ఆసుపత్రికి ఇప్పటివరకు 15మంది బాధితులు చేరుకున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి మరింత విషమంగా ఉండగా.. ఇద్దరికి కంటిచూపు పూర్తిగా పోయే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఆటోలో వెళ్తున్న 65 ఏళ్ల మైసమ్మకు రాకెట్ తగలడంతో కంటి వద్ద తీవ్ర గాయమైంది. మరికొన్ని చోట్ల టపాసులు పేలడంతో షాపులు కూడా పూర్తిగా కాలిపోయ్యాయి. -
తాజా గోల్డ్ బాండ్ స్కీమ్ ఆవిష్కరణ!
న్యూఢిల్లీ: దీపావళి సీజన్ ‘ఇన్వెస్ట్మెంట్’ను ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్రం సోమవారం తాజా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (ఎస్జీబీ) ను ప్రకటించింది. బాండ్లకోసం తుది గడువు డిసెంబర్ 27. గ్రాము విలువను రూ.2956గా నిర్ణయించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తుదారులకు రూ.50 రాయితీ లభిస్తుంది. బాండ్‌పై 2.5 శాతం వడ్డీ అమలవుతుంది. గ్రాము నుంచి వార్షికంగా 500 గ్రాముల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది జారీ అయిన మూడవ విడత గోల్డ్ బాండ్ స్కీమ్ ఇది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కొన్ని నిర్ధారిత పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో ఈ బాండ్ల అమ్మకం జరుగుతుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పసిడి భౌతిక వినియోగం తగ్గింపు ద్వారా పసిడి దిగుమతులను కట్టడి చేయడానికి తద్వారా కరెంట్ అకౌంట్ లోటును అదుపుచేయడానికి 2015 నవంబర్‌లో ప్రభుత్వం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. అప్పటినుంచీ 9 సార్లు బాండ్ల జారీ జరిగింది. -
అతడు సంవత్సరంలో రెండుసార్లే స్నానం చేస్తాడు!
లక్నోః తన భర్త ప్రతిరోజూ స్నానం చేయడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత ఘటన లక్నోలో వెలుగు చూసింది. సంవత్సరంలో వచ్చే హోలీ, దీపావళి సందర్భాల్లో మాత్రమే అతడు స్నానం చేస్తాడని అతడిని భరించలేక పోతున్నానని కంప్లైంట్ చేసింది. మానసిక, శారీరక వేధింపులను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసే ఎన్నోరకాల గృహ హింస కేసులను చూసిన వారికి ఈ కేసు వింతగానే అనిపించొచ్చు. కానీ దీన్ని కూడ హింసగానే భావించిన ఆమె సదరు భర్తపై ఫిర్యాదు చేసింది. ఉత్తర ప్రదేశ్ లక్నో భాగ్‌పత్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ తనను భర్త వేధింపులనుంచి కాపాడమంటూ ఎస్పీ రవి శంకర్ కు ఫిర్యాదు చేసింది. తన భర్తవల్ల తన ప్రాణానికి ప్రమాదముందని తెలిపింది. ఇంతకూ భర్త ఆమెను ఎటువంటి వేధింపులకు గురి చేస్తున్నాడో ఆరా తీసిన పోలీసులు.. అసలు విషయం తెలియడంతో అవాక్కయ్యారు. తన భర్త సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాడని, అదీ హోలీ, దీపావళి పండుగ రోజుల్లో మాత్రమే స్నానం చేస్తాడని, మిగిలిన రోజుల్లో స్నానం చేయమని ఎంత చెప్పినా వినిపించుకోడని సదరు మహిళ పోలీసులతో వాపోయింది. స్నానం విషయంలో భర్త మొండితనాన్ని భరించలేని ఆమె... అతడిపైనా, అతడి కుటుంబ సభ్యులపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడే కాక, అతడి ఇంట్లోనివారంతా ఇలాగే ప్రవర్తిస్తారని, ఏమాత్రం శుభ్రత పాటించరని ఆందోళన వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులంతా గతేడాది దీపావళికి స్నానం చేశారని అప్పటినుంచీ తిరిగి స్నానం చేయమంటే చేయడం లేదని, పైగా శుభ్రత గురించి తమకు చెప్పాల్సిన పని లేదంటారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ బాధితురాలి బాధను విన్న పోలీసులు... కేసును మహిళా పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఎప్పీ రవిశంకర్ తెలిపారు. -
20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : అక్టోబర్ 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాగా దీపావళి పండగ దృష్ట్యా మధ్యలో అసెంబ్లీకి సమావేశాలకు మూడు రోజుల విరామం ఉంటుంది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల్లో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. తాగునీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగమని ఆయన అన్నారు. వచ్చే ఏడాది జూన్‌లో చెరువుల పూడికతీత పనులు, జూలైలో హరితవనం ఉద్యమం చేపడతామని కేసీఆర్ తెలిపారు. 500 మంది కళాకారులతో ప్రచారం నిర్వహిస్తామన్నారు. మరోవైపు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం కావటంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.